హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం! | Gujarat Titans Rejects Hardik Pandya Captaincy Demand To Rejoin Team Ahead Of IPL 2027, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం!

Aug 12 2026 10:58 AM | Updated on Aug 12 2026 11:55 AM

Gujarat Titans Rejects Hardik Pandya Captaincy-Demand-Entering-Team

Photo Credit: BCCI Twitter

ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్‌కు వేరే ఫ్రాంచైజీకి ఆడుతాడనే వదంతులు వస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే త‌న‌ను తీసుకునేందుకు సీఎస్‌కే, ఇత‌ర జ‌ట్లు పోటీ ప‌డుతున్న వేళ గుజ‌రాత్ టైటాన్స్  మాత్రం అత‌డి ప్రతిపాదన (కెప్టెన్సీ)ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. దీంతో కెప్టెన్‌గా గతంలో చాంపియన్‌గా నిలిపిన జట్టు నుంచి అతడికి చేదు అనుభవం ఎదురైనట్లయింది. 2022 సీజన్‌ ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ మొదటి సీజ‌న్‌లోనే చాంపియ‌న్‌గా నిలిచింది.

ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్య‌వ‌హ‌రించిన సంగతి తెలిసిందే. అలా గుజ‌రాత్‌ను ఒక‌సారి చాంపియ‌న్‌, మ‌రోసారి ర‌న్న‌ర‌ప్‌గా నిలిపిన పాండ్యాకు మ‌ళ్లీ ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆడే అవ‌కాశం ల‌భిస్తే రెడ్ కార్పెట్ వేయాల్సిన చోట అవ‌మానం చేసిన‌ట్లు స‌మాచారం. అయితే హార్దిక్ పాండ్యా గుజ‌రాత్ టైటాన్స్‌లోకి తిరిగి రావ‌డానికి కెప్టెన్సీని అప్ప‌గించాల‌నే మెలిక పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దీనికి గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం ఒప్పుకోలేదని వార్త‌లు వ‌స్తున్నాయి. 

అయితే పాండ్యాను ట్రేడింగ్‌లో త‌మ జ‌ట్టులోకి తీసుకోవాల‌ని గుజ‌రాత్ టైటాన్స్ భావించింది. ఇదే విష‌య‌మై కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌కు చెప్పగా, పాండ్యాను తీసుకోవ‌డంలో త‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం. కానీ పాండ్యా జ‌ట్టులోకి రావాలంటే త‌న‌కు కెప్టెన్సీ తిరిగి ఇప్పించాల‌ని యాజ‌మాన్యం ఎదుట ష‌ర‌తు పెట్టాడట‌. పాండ్యా ష‌ర‌తుల‌కు గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం అంగీక‌రించలేద‌ట‌. 

ఇక ఐపీఎల్ 2027 సీజ‌న్‌లో కొత్త జ‌ట్టుకు ఆడాల‌నుకుంటున్న పాండ్యా కోసం చెన్నై సూప‌ర్ కింగ్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ పోటీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రిలో ఒక‌రు పాండ్యాను ట్రేడింగ్ చేసుకోనున్నార‌ట‌. కానీ పాండ్యాను వదులుకోవ‌డంపై ముంబై ఇండియ‌న్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. 

ఒక‌వేళ కేకేఆర్ లేదా సీఎస్‌కేకు పాండ్యా వెళితే మాత్రం కెప్టెన్సీ ఆఫ‌ర్ కూడా ఇచ్చే చాన్స్ ఉంది. 2022, 2023 సీజ‌న్ల‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు ఆడిన పాండ్యాను 2024లో ముంబై ఇండియ‌న్స్ ట్రేడింగ్ చేసుకొని రోహిత్ శ‌ర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రోహిత్‌ను తొల‌గించి పాండ్యాకు కెప్టెన్సీ అప్ప‌గించ‌డంపై అప్ప‌ట్లో అభిమానుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. 

దీనికి తోడు జ‌ట్టు చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో ముంబై ఇండియ‌న్స్ ప‌ట్టిక‌లో అట్ట‌డుగు స్థానంలో నిలిచింది. అయితే 2025 సీజ‌న్‌లో క్వాలిఫ‌య‌ర్‌-2 చేరిన‌ప్ప‌టికీ పంజాబ్ చేతిలో ఓట‌మి చ‌విచూసింది. ఇక 2026 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచింది. కెప్టెన్‌గా, ఆల్‌రౌండ‌ర్‌గా పాండ్యా పూర్తిగా విఫ‌ల‌మ‌వ్వ‌డంతో అత‌డిని జ‌ట్టు నుంచి తీసేయాల‌నే డిమాండ్లు కూడా పెరిగిపోయాయి. ఈలోగా అత‌డు గాయ‌ప‌డ‌డంతో ముంబై సీజ‌న్‌ను 9వ స్థానంతో ముగించింది.

గిల్‌ సారథ్యంలో..
ఇక పాండ్యా ముంబై ఇండియన్స్‌కు వెళ్లిపోయిన తర్వాత శుబ్‌మన్‌ గిల్‌కు గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ 2025 సీజన్‌లో ఎలిమినేటర్‌లో ఓటమి పాలైంది. ఇక 2026 సీజన్‌లో మంచి ప్రదర్శన చేసింది. మూడోసారి ఫైనల్‌ ఆడిన గుజరాత్‌.. ఆర్సీబీ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. గుజరాత్‌ కెప్టెన్‌గా గిల్‌కు మంచి రికార్డు ఉండడంతో అతడిని మార్చే యోచనలో లేదన్న విషయం పాండ్యా విషయంతో రుజువైంది.

చదవండి: టెస్టుల్లో ఎవ‌రికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ స‌రికొత్త ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement