హండ్రెడ్‌లో విధ్వంసం.. కివీస్ బ్యాట‌ర్‌ సిక్స‌ర్ల వ‌ర్షం | Tim Seifert-7-Sixes-Guide-Super-Gaints Victory Vs Sunrisers-Hundred Mens | Sakshi
Sakshi News home page

హండ్రెడ్‌లో విధ్వంసం.. కివీస్ బ్యాట‌ర్‌ సిక్స‌ర్ల వ‌ర్షం

Aug 12 2026 7:10 AM | Updated on Aug 12 2026 7:13 AM

Tim Seifert-7-Sixes-Guide-Super-Gaints Victory Vs Sunrisers-Hundred Mens

Photo Credit: Hundred Twitter

హండ్రెడ్ మెన్స్ కాంపిటీష‌న్‌లో మాంచెస్ట‌ర్ సూప‌ర్‌జెయింట్స్ ఐదో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మంగ‌ళ‌వారం రాత్రి స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని అందుకుంది. సూప‌ర్ జెయింట్స్ ఓపెన‌ర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్‌; 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు), పాల్ వాల్ట‌ర్ (28 బంతుల్లో 44 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) ఆకాశమే హ‌ద్దుగా చెల‌రేగారు. 

దీంతో 128 ప‌రుగుల టార్గెట్‌ను మ‌రో 33 బంతులు మిగిలి ఉండ‌గానే ఛేదించిన సూప‌ర్‌జెయింట్స్ ప‌ట్టిక‌లో రెండో స్థానానికి చేరింది. అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 ప‌రుగుల‌కు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించ‌గా, రికెల్‌ట‌న్ (17) ప‌ర్వాలేద‌నిపించాడు. 

సూప‌ర్‌జెయింట్స్ బౌల‌ర్ల‌లో గ‌స్ అకిన్‌స‌న్ మూడు వికెట్లు తీయ‌గా, సొన్ని బేక‌ర్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్స‌ర్లు బాదిన టిమ్ సీఫ‌ర్ట్ బ్రైడ‌న్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాద‌డం విశేషం. అత‌డు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతుల‌ను సీఫ‌ర్ట్ వ‌రుస‌గా సిక్స‌ర్లు సంధించాడు. 

ఇప్ప‌టికే ట్రెంట్ రాకెట్స్ ఫైన‌ల్లో అడుగుపెట్ట‌గా, ఎలిమినేట‌ర్ పోరు కోసం నాలుగు జ‌ట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూప‌ర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేట‌ర్ పోరులో ముందు వ‌రుస‌లో ఉంది.  ఆగ‌స్టు 15న ఎలిమినేట‌ర్ పోరు, ఆగ‌స్టు 16న ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నున్నాయి.

Read: స్ట‌బ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement