breaking news
Hundred Men's Competition
-
'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం'
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్‌జెయింట్స్ ప్రయాణం మొదలై నాలుగేళ్లు అయినప్పటికీ టైటిల్ గెలవడంలో విఫలమైంది. కానీ హండ్రెడ్ లీగ్‌లో మాత్రం సంజీవ్ గోయెంకాకు చెందిన మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తాము ఆడుతున్న తొలి సీజన్లోనే టైటిల్ సాధించడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అతడి చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సంజీవ్ గోయెంకా మరోసారి వార్తల్లో నిలిచాడు. ‘‘మా తొలి సీజన్లోనే మేము చాంపియన్స్‌గా నిలిచాం. కంగ్రాట్స్ మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్. లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్లో మాంచెస్టర్ సాధించిన ఈ అద్భుత విజయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఈ విజయం మా సూపర్‌జెయింట్స్ ఫ్యామిలీకి గర్వకారణం. జట్టు సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైంది. టిమ్ సీఫెర్ట్ నిజంగా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక నూర్ అహ్మద్ తన అద్భుత బౌలింగ్‌తో వికెట్లు పడగొట్టి టైటిల్ గెలవడంలో ప్రధానపాత్ర పోషించాడు. జోస్ బట్లర్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడమే గాక అందరిని కలుపుకుపోయి సమిష్టిగా రాణించి టైటిల్ అందించడంలో విజయవంతమయ్యాడు. జోస్‌తో పాటు ప్రతీ ఆటగాడికి నా ప్రత్యేక అభినందనలు. మాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు’’ అని గోయెంకా ముగించాడు.మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ గతంలో మాంచెస్టర్ ఒరిజినల్స్ పేరుతో హండ్రెడ్ టోర్నీ ఆడింది. అయితే 2025లో జట్టు అమ్మకానికి వచ్చినప్పుడు సంజీవ్ గోయెంకా 70శాతం పెట్టుబడి పెట్టడంతో జట్టు కాస్తా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్‌గా మారిపోయింది. లంకాషైర్ వాటా 30 శాతంగా ఉంది.ఇక ఐపీఎల్ 2022 సీజన్లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్‌జెయింట్స్ కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో మంచి ప్రదర్శన చేసింది. తొలి రెండు సీజన్లలో లక్నో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్‌తో విబేధాలు రావడంతో అతడిని వదులుకుంది. రూ. 27 కోట్ల రికార్డు ధరకు పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ అతడికే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ సారథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ 2025, 2026 సీజన్లలో దారుణ ప్రదర్శన కనబరిచింది. కనీసం ప్లే ఆఫ్స్ చేరడంలో కూడా లక్నో విఫలమైంది. దీంతో పంత్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ పదవికి రాజీనామా కూడా చేశాడు. వచ్చే సీజన్లో పంత్ స్థానంలో ఎవరు కెప్టెన్‌గా వ్యవహరిస్తారనేది చూడాలి.Sanjiv Goenka used to thank God for every win, now his team won the championship finally in cricket.🏆Congratulations to @DrSanjivGoenka and Manchester Super Giants🎉🎊 pic.twitter.com/qeZNY2U8Sn— कट्टर INDIA समर्थक 🦁🇮🇳 ™ (@KKRWeRule) August 16, 2026 Manchester Super Giants Clinch Maiden Hundred Title, Owner Sanjiv Goenka's Reaction Goes Viral#SanjivGoenka #ManchesterSuperGiants #Hundred https://t.co/k804UhYLHU pic.twitter.com/QxU6W8ILnd— NDTV Sports (@Sports_NDTV) August 17, 2026Read: బాంబు పేల్చిన రొనాల్డో.. షాక్‌లో అభిమానులు! -
కివీస్ బ్యాటర్ వన్‌మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్‌పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్‌ను ఈజీగా అందుకున్న సూపర్‌జెయింట్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్‌గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్‌గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్‌కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్‌తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్మద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.🔴BIG REALITY CHECK FOR PAT CUMMINS & AUSTRALIA 🤯Before Bangladesh test series:Cummins🎙️: Some of our guys are saying no to half-a-million pounds for 20 days' work to go and play those two Test matches against Bangladesh.🙄After such a confident statement from Pat,… pic.twitter.com/iS79Cmc6tr— Sam (@cricsam02) August 16, 2026🔴PAT CUMMINS BLAMES THE PITCH FOR AUSTRALIA’S LOSS 🤯Cummins🎙️: The pitch was rock hard with a bit of grass, so we thought the first hour might be tough. But after that, it felt like a pretty good batting track.We expected it to crack up in the heat and spin on Days 4 and 5,… pic.twitter.com/BJmiDYGe2L— Sam (@cricsam02) August 16, 2026Read: బంగ్లా బౌలర్ అద్భుత బంతి.. బిత్తరపోయిన ఆసీస్ స్టార్ -
సన్‌రైజర్స్ కొంపముంచిన క్లాసెన్.. ఫైనల్లో సూపర్ జెయింట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్, ఓపెనర్ పాల్ వాల్టర్ విధ్వంసానికి తోడుగా బౌలింగ్‌లో జోష్ టంగ్ అద్భుత ప్రదర్శన సూపర్ జెయింట్స్‌కు విక్టరీని అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. పాల్ వాల్టర్ (46 బంతుల్లో 80; 3 ఫోర్లు, 8 సిక్సర్లు), క్లాసెన్ (26 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెప్టెన్ జోస్ బట్లర్ (33) రాణించాడు. సన్‌రైజర్స్ లీడ్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్, నాథన్ ఎల్లిస్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రియాన్ రికిల్టన్ (54 నాటౌట్) చివరివరకు అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. హ్యారీ బ్రూక్ (49) నిధానంగా ఆడడం జట్టు కొంపముంచింది. ఆద్యంతం సూపర్ జెయింట్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో సన్‌రైజర్స్ లీడ్స్ పరుగులు చేయడంలో విఫలమైంది. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో జోష్ టంగ్ 4 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. రేపు జరగనున్న హండ్రెడ్ మెన్స్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ తలపడనుంది. ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించే క్లాసెన్ హండ్రెడ్‌లో మాత్రం సన్‌రైజర్స్‌కు ప్రత్యర్థిగా ఆడి వాళ్లు ఫైనల్ చేరకుండా సైంధవుడిలా అడ్డుపడ్డాడు.ఫైనల్లో సన్‌రైజర్స్ వుమెన్ టీంమరోవైపు హండ్రెడ్ వుమెన్ కాంపిటీషన్లో మాత్రం సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సదరన్ బ్రేవ్‌తో జరిగిన ఎలిమినేటర్ పోరులో సన్‌రైజర్స్ లీడ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. లిజెల్లీ లీ (32) టాప్ స్కోరర్. అన్నాబెల్ సదర్లాండ్, హన్నా బేకర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం సన్‌రైజర్స్ లీడ్స్ వుమెన్ జట్టు 89 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసి విజయాన్ని సాధించింది. లారెన్ విన్ఫీల్డ్ (37), దీప్తి శర్మ (28 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రేపే జరగనున్న వుమెన్ ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.SunRisers Leeds Women enters @thehundred final after beating Southern Brave Women, while Manchester Super Giants Men does so in other match beating #SRL.Lauren Winfield-Hill (37), Deepti Sharma (28* & 1/24) & Hannah Baker (2/13) led #SRLW, while #MSG had Paul Walter (80),…— The CricHub (@thecrichub_live) August 14, 2026 -
హండ్రెడ్‌లో విధ్వంసం.. కివీస్ బ్యాటర్ సిక్సర్ల వర్షం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్ లీడ్స్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సూపర్ జెయింట్స్ ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (40 బంతుల్లో 80 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు), పాల్ వాల్టర్ (28 బంతుల్లో 44 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో 128 పరుగుల టార్గెట్‌ను మరో 33 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన సూపర్‌జెయింట్స్ పట్టికలో రెండో స్థానానికి చేరింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ లీడ్స్ 100 బంతుల్లో 127 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32), జాక్ క్రాలీ (31) రాణించగా, రికెల్టన్ (17) పర్వాలేదనిపించాడు. సూపర్‌జెయింట్స్ బౌలర్లలో గస్ అకిన్సన్ మూడు వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. అయితే ఇన్నింగ్స్‌లో ఏడు సిక్సర్లు బాదిన టిమ్ సీఫర్ట్ బ్రైడన్ కార్స్ బౌలింగ్ హ్యాట్రిక్ సిక్సర్లు బాదడం విశేషం. అతడు వేసిన ఇన్నింగ్స్ 7, 8, 9 బంతులను సీఫర్ట్ వరుసగా సిక్సర్లు సంధించాడు. ఇప్పటికే ట్రెంట్ రాకెట్స్ ఫైనల్లో అడుగుపెట్టగా, ఎలిమినేటర్ పోరు కోసం నాలుగు జట్లు పోటీలో ఉన్నాయి. ఇందులో సూపర్‌జెయింట్స్ రెండో స్థానంలో నిలిచి ఎలిమినేటర్ పోరులో ముందు వరుసలో ఉంది. ఆగస్టు 15న ఎలిమినేటర్ పోరు, ఆగస్టు 16న ఫైనల్ మ్యాచ్ జరగనున్నాయి.THREE SIXES IN A ROW FOR TIM SEIFERT! 💥#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/rMG9rIKmYE— The Hundred (@thehundred) August 11, 2026Read: స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్! -
స్టబ్స్ విధ్వంసం.. ట్రెంట్ రాకెట్స్‌కు షాక్!
హండ్రెడ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సదరన్ బ్రేవ్.. వరుస విజయాలతో పట్టికలో తొలి స్థానంలో ఉన్న ట్రెంట్ రాకెట్స్‌ను ఊహించని దెబ్బ కొట్టింది. ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మిచెల్ సాంట్నర్ (35 నాటౌట్), లూయిస్ జార్జరీ (28 నాటౌట్) ఆఖర్లో మెరవడంతో ట్రెంట్ రాకెట్స్ మంచి స్కోరును సాధించింది. అంతకముందు ఫిన్ అలెన్ (23) పర్వాలేదనిపించాడు. సదరన్ బ్రేవ్ బౌలర్లలో నిఖిల్ చౌదరీ, డానియెల్ వోర్రల్, స్టోయినిస్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం సదరన్ బ్రేవ్ 97 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ట్రిస్టన్ స్టబ్స్ (28 బంతుల్లో 52 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, మార్కస్ స్టోయినిస్ (25 బంతుల్లో 46) మెరిశాడు. ఓపెనర్ జేమి స్మిత్ (26) పరుగులు చేశాడు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో క్లావిన్ హారిసన్ 2 వికెట్లు తీయగా, బెన్ సాండర్సన్, క్రెయిగ్ ఓవర్టన్ చెరొక వికెట్ పడగొట్టారు.Tristan Stubbs reaches his 50 with a six! It's game on 👊#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/yfoaFvNGMK— The Hundred (@thehundred) August 8, 2026Read: లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు! -
నామమాత్రపు మ్యాచ్.. లివింగ్‌స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ నుంచి ఇప్పటికే వైదొలిగిన లండన్ స్పిరిట్, బర్మింగ్హమ్ ఫోనిక్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జో క్లార్క్ (42 బంతుల్లో 73) రాణించగా, ఆఖర్లో సీన్ డిక్సన్ (28 బంతుల్లో 51 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్) విధ్వంసం చేయడంతో బర్మింగ్హమ్ భారీ స్కోరు సాధించింది. లండన్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, హెన్రీ క్రొకొంబెలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లండన్ స్పిరిట్ 82 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (30 బంతుల్లో 66), డెవాల్డ్ బ్రెవిస్ (31 బంతుల్లో 55 నాటౌట్) విధ్వంసంతో లండన్ స్పిరిట్ ఈజీ విక్టరీ అందుకుంది. బర్మింగ్హమ్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్, సకిబ్ మహ్మూద్, టామ్ హెల్మ్లు తలా ఒక వికెట్ తీశారు. టోర్నీలో చివరి రెండు స్థానాల్లో ఉన్న లండన్ స్పిరిట్, బర్మింగ్ హమ్ ఫోనిక్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కాగా, ట్రెంట్ రాకెట్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టాప్‌లో నిలిచి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. -
సామ్ బిల్లింగ్స్ సిక్సర్ల వర్షం.. దూసుకెళ్తున్న ట్రెంట్ రాకెట్స్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్-2026లో ట్రెంట్ రాకెట్స్ ఐదో విజయాన్ని అందుకొని టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ విధ్వంసానికి తోడు ఓపెనర్లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై గెలుపొందింది. 112 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ట్రెంట్ రాకెట్స్ 83 బంతుల్లోనే 3 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. సామ్ బిలింగ్స్ (19 బంతుల్లో 31 నాటౌట్, 1 ఫోర్, మూడు సిక్సర్లు) అజేయం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా, ఓపెనర్లు బెన్ డకెట్ (22), ఫిన్ అలెన్ (28) రాణించారు. బర్మింగ్హమ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 2 వికెట్లు తీయగా, బెన్డార్ఫుసిస్ ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫొనిక్స్ 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. జో క్లార్క్ (45 బంతుల్లో 62) అర్ధసెంచరీ మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. లారి ఎవన్స్ (19) పర్వాలేదనిపించాడు. ట్రెంట్ బౌలర్లలో లూయిస్ గ్రెగొరి 2 వికెట్లు తీయగా, మొహమ్మద్ ఆమిర్, మాట్ హెన్రీ,మిచెల్ సాంట్నర్ తలా ఒక వికెట్ తీశారు. ఆరు మ్యాచ్‌ల్లో ఐదో విజయంతో ట్రెంట్ రాకెట్స్ 20 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉండగా, బర్మింగ్హమ్ ఫొనిక్స్ నాలుగో పరాజయంతో పట్టికలో అట్టడుగున నిలిచింది. 🚨 Crowd catch! Sam Billings smashes it into the crowd, and the safe hands of this fan 🙌#TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/8MTtMl4pbT— The Hundred (@thehundred) August 5, 2026Sam Billings Is A Very Clean Hitter. Great Technique pic.twitter.com/7nZ2qPFP2m— Aryan Goel 2.0 (@AryanGoelNew) August 5, 2026చదవండి: కళ్లు చెదిరేలా షకీబ్ అల్ హసన్ ఆస్తుల విలువ! -
స్వదేశానికి రషీద్ ఖాన్.. జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్!
జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ సికందర్ రజా హండ్రెడ్ కాంపిటీషన్లో బంపరాఫర్ కొట్టేశాడు. ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ కారణంగా అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎంఐ లండన్‌ను వీడాడు. దీంతో రషీద్ ఖాన్ స్థానంలో సికందర్ రజాను తాత్కాలిక విదేశీ ఆటగాడిగా ఎంపిక చేసినట్లు ఎంఐ లండన్ ఫ్రాంచైజీ తెలిపింది. ఐర్లాండ్‌తో సిరీస్ కోసం రషీద్ వెళ్లిపోవడంతో రజాతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐ లండన్ మిగతా మ్యాచ్‌లకు అతడిని అందుబాటులో ఉండాలని కోరింది. దీనికి సికందర్ రజా కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఎంఐ లండన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది. 'రషీద్ ఖాన్ స్థానంలో తాత్కాలిక ఆటగాడిగా జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజాను ఎంపిక చేశాం. రషీద్ స్థానంలో మిగిలిన మ్యాచ్‌లను సికందర్ రజా ఆడనున్నాడు. ఎంఐ లండన్లోకి నీకు స్వాగతం రజా' అని తెలిపింది. ఇక హండ్రెడ్ టోర్నీలో చాంపియన్‌గా నిలవాలని తాపత్రయపడుతున్న ఎంఐ లండన్ జట్టులో సికందర్ రజా చేరికతో మిడిలార్డర్ బలోపేతం కావడంతో పాటు అతడి స్పిన్ సేవలు జట్టుకు ఎంతో ఉపయోగపడనుందని చెప్పొచ్చు.ఇక సికందర్ రజా స్వదేశంలో బంగ్లాదేశ్, భారత్‌లతో జరిగిన వైట్‌బాల్ సిరీస్ అనంతరం వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో పాల్గొన్నాడు. టోర్నీలో వోర్సెస్టర్షైర్ తరఫున ఆడిన సికందర్ రజా తొమ్మిది మ్యాచ్‌లాడి 258 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఎంఐ లండన్ ప్రాంచైజీ నుంచి పిలుపు రావడంతో సికందర్ రజా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు లండన్‌కు చేరుకున్నాడు. ఇటీవలి కాలంలో టీ20 క్రికెట్లో సికందర్ రజా బెస్ట్ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు 376 టీ20 మ్యాచ్‌లాడిన సికందర్ రజా 136 స్ట్రైక్‌రేట్‌తో 7,609 పరుగులు సాధించాడు. ఇక తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 255 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తన సారథ్యంలోనే జింబాబ్వే సూపర్-6 స్టేజీలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాకౌట్ స్టేజీల్లో సికందర్ రజాకు మంచి రికార్డు ఉంది.Sikandar Raza will temporarily replace Rashid Khan as an overseas player for MI London.Rashid Khan has joined up with Afghanistan for their white-ball series in Ireland. The experienced Zimbabwe all-rounder joins MI London after being on international duty for his home… pic.twitter.com/zSufGHOwZu— MI London (@MILondonCricket) August 5, 2026Read: విండీస్‌పై పాక్ విజయం.. డబ్ల్యూటీసీ లెక్కలు తారుమారు! -
టీ20 క్రికెట్లో జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ కెప్టెన్ జోస్ బట్లర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా వెల్ష్‌ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ 20 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు (491 ఇన్నింగ్స్‌ల్లో 14,833 పరుగులు) చేసిన బ్యాటర్‌గా బట్లర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు టీ20 క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల (14,803 పరుగులు)రికార్డు బట్లర్ బద్దలు కొట్టాడు. బట్లర్, పొలార్డ్ తర్వాత విండీస్ హార్డ్ హిట్టర్, మాజీ ఆటగాడు క్రిస్ గేల్ (14, 562 పరుగులు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెల్ష్ఫైర్పై మాంచెస్టర్ సూపర్‌జెయింట్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. వెల్ష్‌ఫైర్ విధించిన 156 పరుగుల టార్గెట్‌ను మాంచెస్టర్ జెయింట్స్ మరో 31 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ (36 బంతుల్లో 62 నాటౌట్), బట్లర్ (20 బంతుల్లో 51 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. మరో ఓపెనర్ పాల్ వాల్టర్ (18 బంతుల్లో 37) రాణించాడు. అంతకముందు వెల్ష్ ఫైర్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ మాథ్యూ షార్ట్ (47 బంతుల్లో 71) విధ్వంసం సృష్టించగా, మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (48) రాణించాడు. మాంచెస్టర్ బౌలర్లలో గస్ అకిన్సన్ 2 వికెట్లు తీయగా, జోష్ టంగ్, పాల్ వాల్టర్ చెరొక వికెట్ తీశారు. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.మార్కరమ్ స్థానంలో కెప్టెన్గాఇక మాంచెస్టర్ రెగ్యులర్ కెప్టెన్ ఐడెన్ మార్కరమ్ వ్యక్తిగత కారణాలతో టోర్నీ నుంచి వైదొలగడంతో బట్లర్ తొలిసారి జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే విజయాన్ని సాధించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా వెళ్లిపోయిన మార్కరమ్ మిగతా టోర్నీకి దూరమవ్వడంతో బట్లర్ జట్టును నడిపించనున్నాడు. ఇక బట్లర్ బ్యాటర్‌గా హండ్రెడ్ టోర్నీలో అదరగొడుతున్నాడు. ఈ వికెట్ కీపర్ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో 92.3 స్ట్రైక్ రేట్‌తో 277 పరుగులు సాధించాడు. ఇక మార్కరమ్ స్థానంలో మైకెల్ బ్రాస్వెల్ను తీసుకున్నట్లు మాంచెస్టర్ ఫ్రాంచైజీ ప్రకటించింది. #JosButtler leaves the bowlers stunned 💥He has now surpassed #KieronPollard to become the leading run scorer in T20 history! 🙌#TheHundred 2026 👉 Welsh Fire vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/AO9Q7O9TbK— Star Sports (@StarSportsIndia) August 5, 2026 Record breaker 📈👑 @josbuttler Congratulations to Jos Buttler on becoming the all-time leading run scorer in T20 cricket. ⚡️ #StrikeTogether pic.twitter.com/FMuMEetTzL— Lancashire Cricket (@lancscricket) August 5, 2026 There’s a new king of T20 batting 👑Jos Buttler surpasses Kieron Pollard’s 14,803 runs to become the leading run-scorer in T20 history ✨ pic.twitter.com/QlAYAFwKFU— Cricinfo (@cricinfo) August 5, 2026Read: నా ఫెవరేట్ కోచ్ అతడే.. గంభీర్ మాత్రం కాదు: షమీ -
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్‌లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్‌లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్‌ను చూడకుండా గ్రౌండ్‌నే చూడడం హైలైట్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్‌కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్‌ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్‌ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన -
సిక్సర్లతో జట్టును గెలిపించిన భారత బ్యాటర్!
హండ్రెడ్ కాంపిటీషన్ 2026లో భారత మహిళా బ్యాటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా భారత వికెట్‌కీపర్ రిచా ఘోష్ రెండు భారీ సిక్సర్లతో తన జట్టును విజయతీరాలకు చేర్చడం మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ రిచా ( 5 బంతుల్లో 15 నాటౌట్, రెండు సిక్సర్లు) ధాటికి 59 బంతుల్లోనే ఛేదించి 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మిగిలినవారిలో పేజ్ స్కోఫీల్డ్ (15 బంతుల్లో 22 నాటౌట్), మెగ్ లానింగ్ (24 బంతుల్లో 21) రాణించారు. అంతకముందు లండన్ స్పిరిట్ వుమెన్ 91 బంతుల్లో 80 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ చార్లెట్ డీన్ (14), చారిస్ పవెలి (13) పర్వాలేదనిపించారు. మాంచెస్టర్ బౌలర్లలో రియానా మెక్‌డొనాల్డ్ 4 వికెట్లతో సత్తా చాటింది.ఇక పురుషుల క్రికెట్లో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ ఏడు పరుగుల తేడాతో లండన్ స్పిరిట్‌పై విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టిమ్ సిఫెర్ట్ (45 బంతుల్లో 67) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం లండన్ నైట్స్ 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. లివింగ్ స్టోన్ (40 బంతుల్లో 69 నాటౌట్) అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. Power-hitting at its finest! 💥#RichaGhosh dispatches two massive sixes to power Manchester Super Giants to a comfortable win over London Spirit! 🔥#TheHundred 2026 👉 London Spirit vs Manchester Super Giants | LIVE NOW! pic.twitter.com/dMeQaYE6Ol— Star Sports (@StarSportsIndia) July 23, 2026Read: ప్లాన్ అదిరింది.. మెస్సీ రిటైర్మెంట్ అప్పుడే!


