'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' | Pat Cummins Breaks Silence After Bangladesh Shock Australia In First Test Viral On Social Media, Says No Excuses And They Played Well | Sakshi
Sakshi News home page

Pat Cummins: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే'

Aug 16 2026 1:38 PM | Updated on Aug 16 2026 2:45 PM

Pat Cummins Says-Not-Any-Excuses-1st Test Loss-Bangladesh-Played Well

Photo Credit: Twitter

ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఓటమి పాలవ్వడంపై  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ ప్రిపరేషన్‌లో ఎలాంటి లోపాలు లేవని.. ఓటమికి సాకులు వెతకనని, బంగ్లాదేశ్ తమకన్నా బాగా ఆడిందన్నాడు. ఈ విజయానికి వారే అర్హులని పేర్కొన్నాడు. 

బంగ్లాతో టెస్టు సిరీస్ ఆడేందుకు కోట్ల రూపాయలు ఇచ్చే హండ్రెడ్ లీగ్ కాంట్రాక్టులను వదులుకొని తమ ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారని తెలిపాడు. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా ఆటగాళ్లు పడిన శ్రమను, చేసిన త్యాగాలను కమిన్స్ గుర్తుచేసుకున్నాడు. 'తమ ఆటగాళ్లలో కొందరు కేవలం 20 రోజుల వ్యవధిలో దాదాపు అర మిలియన్ పౌండ్ల (రూ. 5 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఇచ్చే ‘ది హండ్రెడ్’ లీగ్ కాంట్రాక్టులను కూడా పక్కనబెట్టి బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ కోసం ప్రాక్టీస్ చేశారు. 

మా ప్రాక్టీస్ సరైన రీతిలోనే సాగింది. అందులో ఎలాంటి లోపం, నిర్లక్ష్యం లేదు. అలానే ఓటమిపై ఎలాంటి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు. బంగ్లాదేశ్ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి రోజు వికెట్ కాస్త అనుకూలించినప్పటికీ, మేము క్రీజులో ఎక్కువ సమయం నిలదొక్కుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టలేకపోయాం' అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ విషయానికొస్తే డార్విన్ వేదికగా జ‌రిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. 

షాద్‌మ‌న్ ఇస్లామ్ (25 నాటౌట్‌), మోమినుల్ హ‌క్ (30 నాటౌట్‌) జ‌ట్టును విజ‌య‌తీరాలకు చేర్చారు. ఇరుజ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదిక‌గా ఆగ‌స్టు 22 నుంచి జ‌ర‌గ‌నుంది. రెండు ఇన్నింగ్స్‌లు క‌లిపి 9 వికెట్లు తీసిన హ‌స‌న్ మహ్మద్‌కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు ల‌భించింది.

Read: బంగ్లా బౌల‌ర్ అద్భుత బంతి.. బిత్త‌రపోయిన ఆసీస్ స్టార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement