Photo Credit: Twitter
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది.
షాద్‌మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు.
ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్‌లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు.
👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్‌లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్‌లో జరిగిన టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది.
సంక్షిప్త స్కోర్లు:
ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్
బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1
Dominant. Commanding. Controlling.
These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026
Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!


