breaking news
Hasan Mahmud
-
ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ చారిత్రక విజయం
సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు బంగ్లాదేశ్ ఊహించని షాక్ ఇచ్చింది. డార్విన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై సంచలన విజయాన్ని సాధించింది. దీంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా విధించిన 57 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. షాద్మన్ ఇస్లామ్ (25 నాటౌట్), మోమినుల్ హక్ (30 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ మాకే వేదికగా ఆగస్టు 22 నుంచి జరగనుంది. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 9 వికెట్లు తీసిన హసన్ మహ్ముద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోరు 161 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా 284 పరుగులకు ఆలౌటైంది. కామెరాన్ గ్రీన్ (104 పరుగులు) శతకంతో మెరవగా, స్మిత్ (44), అలెక్స్ క్యారీ (30) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహదీ హసన్ మిరాజ్ ఐదు వికెట్లతో చెలరేగగా, హసన్ మహ్ముద్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇక బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులకు ఆలౌటైంది. తంజిద్ సెంచరీతో చెలరేగగా, నజ్ముల్, మెహదీ హసన్‌లు అర్ధశతకాలతో రాణించారు. అంతకముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా బౌలర్ల ధాటికి 198 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. మహ్ముద్ హసన్ 6 వికెట్లతో చెలరేగాడు. 👉23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతున్న బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను వారి హోంగ్రౌండ్లో మట్టికరిపించడం ఇదే తొలిసారి. ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాకు ఇది రెండోసారి. గతంలో 2017లో మీర్పూర్లో జరిగిన టెస్టులో ఆసీస్‌ను తొలిసారి ఓడించింది.సంక్షిప్త స్కోర్లు:ఆస్ట్రేలియా: 198 ఆలౌట్ & 284 ఆలౌట్బంగ్లాదేశ్: 426 ఆలౌట్ & 57/1Dominant. Commanding. Controlling.These are all words to describe a proud moment in Bangladesh history, because they have THUMPED Australia in Australia to win a Test by nine wickets! pic.twitter.com/MGUXtIySP9— 7Cricket (@7Cricket) August 16, 2026Read: క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్! -
AUS vs BAN: నా కెరీర్లో ఇలాంటిది చూడలేదు: గిల్‌క్రిస్ట్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. డార్విన్ వేదికగా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు ఈ రైటార్మ్ ఫాస్ట్‌బౌలర్. తాజాగా రెండో ఇన్నింగ్స్‌లోనూ జోరు కొనసాగిస్తూ ఓపెనర్ల వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.మరోసారి ఓపెనర్ల పని పట్టిన హసన్హసన్ మహమూద్ బౌలింగ్‌లో తొలుత జేక్ వెదర్లాండ్ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ 35 బంతుల్లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. వీళ్లిద్దరిని అద్భుతమైన డెలివరీలతో మహమూద్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ వెదర్లాండ్ (23), ట్రవిస్ హెడ్ (22) హసన్ మహమూద్ బౌలింగ్‌నే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.అదే తీరుగా మరోసారి బౌల్డ్అయితే, యాధృచ్చికంగా తొలి ఇన్నింగ్స్‌లో ఎలాగైతే హెడ్ బౌల్డ్ అయ్యాడో.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే రీతిలో వికెట్ పారేసుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్లో మహమూద్ బంతితో రంగంలోకి దిగాడు. రెండో బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో మహమూద్ వేయగా.. స్క్వేర్ కట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హెడ్ బౌల్డ్ అయ్యాడు."I've never seen that in all my cricketing career."Travis Head chopped on for a second time in this match, but his considerate move even caught Adam Gilchrist off guard. #AUSvBAN pic.twitter.com/LEKgbtbshq— cricket.com.au (@cricketcomau) August 15, 2026నా కెరీర్లో ఇలాంటిది చూడలేదుఅయినప్పటికీ ఎంతో సంయమనంగా హెడ్.. బెయిల్స్‌ను తీసి స్టంప్స్ మీద సర్ది నెమ్మదిగా క్రీజును వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో కామెంటెరీ బాక్స్‌లో ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్.. ‘నా క్రికెటింగ్ కెరీర్లో ఇంత వరకు ఇలాంటిది చూడలేదు’ అని హెడ్ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. రెండుసార్లు ఒకే బౌలర్ బౌలింగ్‌లో.. ఒకే విధంగా అవుటైనప్పటికీ.. ప్రశాంతంగా ఉండటం అతడికే చెల్లించిందని చెప్పుకొచ్చాడు.బంగ్లాదేశ్ ఆధిపత్యంకాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లాదేశ్ మధ్య గురువారం మరారా స్టేడియంలో తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్ 426 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా బంగ్లా 228 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 42 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. బంగ్లా కంటే ఇంకా 89 పరుగులు వెనుకబడి ఉంది.చదవండి: జైస్వాల్‌ను రనౌట్ చేయనా? ఇందులో తప్పేముంది?.. కానివ్వు! -
ఓవరాక్షన్ వద్దు.. ఆట కంటే గొప్పోడివా?: స్మిత్‌పై ఫైర్
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌కు చేదు అనుభవం ఎదురైంది. ‘క్రికెట్ కంటే నువ్వేమీ గొప్పోడివి కాదు’ అంటూ ఓ అభిమాని అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆసీస్ సొంతగడ్డపై బంగ్లాతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది.చెలరేగిన హసన్ మహమూద్ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య గురువారం డార్విన్‌లో తొలి టెస్టు మొదలైంది. మరారా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ దాటికి కంగారూల బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఈ రైటార్మ్ పేసర్ ఆరు వికెట్లతో చెలరేగి ఆసీస్ పతనాన్ని శాసించాడు.198 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. నాలుగో నంబర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అర్ధ శతకం (71) బాదడంతో ఈ మేర గౌరవప్రదమైన స్కోరు సాధ్యమైంది. అయితే, మ్యాచ్ మధ్యలో స్మిత్ వ్యవహరించిన తీరు ఓ అభిమానికి చిర్రెత్తించింది.ఆటకు అంతరాయంసెకండ్ సెషన్ వేళ సైట్ స్క్రీన్ (బ్యాటర్ ఎదురుగా ఉండే స్క్రీన్) సరిగ్గా లేదంటూ స్మిత్ పదే పదే ఆటకు అంతరాయం కలిగించాడు. స్క్రీన్‌ను సరిచేయాల్సిందిగా గ్రౌండ్ సహాయక సిబ్బందికి చెప్పాడు. ఈ క్రమంలో ఆట ఆలస్యమైంది.ఓవరాక్షన్ చేయకుఈ నేపథ్యంలో ప్రేక్షకుల మధ్యలో ఉన్న ఓ అభిమాని.. ‘‘స్మడ్జ్ (స్మిత్ ముద్దుపేరు).. నువ్వు బంతిని బాదడంపై దృష్టి పెట్టు. ప్రత్యేకంగా ఏదో కావాలన్నట్లుగా ఓవరాక్షన్ చేయకు. నువ్వేమీ ఆట కంటే గొప్పోడికి కాదు స్టీవ్. ఆడి చూపించు’’ అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఫాక్స్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్‌గా మారింది.చదవండి: ఆసీస్ గడ్డ మీద చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్ View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన బంగ్లా పేసర్
బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద ఇంతకు ముందు బంగ్లా బౌలర్లు ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ తొలిసారి ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఆరేసిన మహమూద్రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆసీస్- బంగ్లా మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత డార్విన్‌లోని మరారా స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. అనూహ్య రీతిలో 198 పరుగులకే ఆసీస్‌ను ఆలౌట్ చేసింది.ఆది నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపించాడు బంగ్లా పేసర్ హసన్ మహమూద్. ఓపెనర్లు ట్రవిస్ హెడ్ (22), జేక్ వెదర్లాండ్ (23)లతో పాటు.. స్టీవ్ స్మిత్ (71) రూపంలో మూడు కీలక వికెట్లు కూల్చాడు. అదే విధంగా.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (9), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియాన్ (7) వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.తొలి బంగ్లా బౌలర్గామొత్తంగా ఆసీస్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో మహమూద్.. 17 ఓవర్లు బౌలింగ్ చేసి 55 పరుగులు ఇచ్చి.. ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఈ క్రమంలో ఆసీస్ గడ్డ మీద టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు ఆస్ట్రేలియాలో ఓవరాల్‌గా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గానూ చరిత్రకెక్కాడు.ముఖాముఖి పోరులో హీరోగా..అదే విధంగా.. ఆసీస్- బంగ్లా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు సాధించిన పేసర్‌గా 26 ఏళ్ల మహమూద్ నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఆసీస్ మాజీ పేసర్ జేసన్ గిల్లెస్పి పేరిట ఉండేది. 2003లో గిల్లెస్పి బంగ్లాదేశ్‌తో టెస్టులో 38 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా.. మహమూద్ తాజాగా అతడిని అధిగమించాడు.ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్లు1. మైకేల్ కాస్ప్రోవిక్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 7/392. హసన్ మహమూద్ (బంగ్లాదేశ్)- 2026లో ఆస్ట్రేలియా మీద 6/553. చమిందా వాస్ (శ్రీలంక)- 2004లో ఆస్ట్రేలియా మీద 5/314. గ్లెన్ మెగ్రాత్ (ఆస్ట్రేలియా)- 2004లో శ్రీలంక మీద 5/375. స్టువర్ట్ మెక్‌గిల్ (ఆస్ట్రేలియా)- 2003లో బంగ్లాదేశ్ మీద 5/65. చదవండి: వైభవ్ విషయంలో అది నేను అంగీకరించను: ఆసీస్ దిగ్గజంHasan Mahmud’s 6-Wicket Haul vs Australia | 1st Test 🔥🇧🇩 pic.twitter.com/5qaJN4qTss— Bangladesh Cricket (@BCBtigers) August 13, 2026 -
Ind vs Ban: టీమిండియాదే విజయం.. రికార్డులే సాక్ష్యం!
పాకిస్తాన్‌ను సొంతగడ్డపై మట్టికరిపించి 2-0తో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లాదేశ్ జట్టు.. అదే జోరులో భారత్‌లో అడుగుపెట్టింది. పటిష్ట టీమిండియాను పడగొట్టడం తేలికేమీ కాదని తెలిసినా.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొంది. అయితే, తొలి టెస్టు తొలి రోజు ఆరంభంలో కాస్త పైచేయి సాధించినా.. తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.భారీ లక్ష్యం.. బంగ్లాదేశ్ ఒక్కటీ గెలవలేదు!.గెలుపు సంగతి దేవుడెరుగు.. బంగ్లాదేశ్ ప్రస్తుతం భారీ ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియని స్థితిలో నిలిచింది. అవును.. రెండు రోజుల ఆట మిగిలి ఉండవచ్చ. కానీ 515 పరుగులు సాధించడమైతే షాంటో బృందానికి అంత తేలికేమీ కాదు. గత రికార్డులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి.ఇప్పటి వరకు టెస్టుల్లో 400 పరుగులకు పైగా లక్ష్యాన్ని(ఫోర్త్ ఇన్నింగ్స్) బంగ్లాదేశ్ ఇప్పటి వరకు ఎప్పుడూ ఛేదించనే లేదు. 20 సార్లు ఇంతంటి భారీ లక్ష్యం ముందు నిలిచిన బంగ్లా.. ఒక్కసారి మాత్రం మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. అయితే.. పందొమ్మిదిసార్లూ ఓటమినే చవిచూసింది. టీమిండియా బౌలర్ల జోరు చూస్తూ ఉంటే.. బంగ్లాదేశ్ ఖాతాలో 20వ పరాజయం కూడా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.అప్పుడు అశ్విన్ సెంచరీ.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే, ఆరంభంలో బంగ్లా పేసర్ హసన్ మహమూద్ ధాటి(5/83)కి ఇబ్బంది పడ్డ టీమిండియా.. రవిచంద్రన్ అశ్విన్(113) సూపర్ సెంచరీతో కోలుకుంది.అశూతో పాటు ఓపెనర్ యశస్వి జైస్వాల్ 56, మరో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 86 పరుగులతో రాణించారు. ఫలితంగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు స్కోరు చేసింది. అనంతరం.. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా 4, సిరాజ్ రెండు, ఆకాశ్ దీప్ రెండు వికెట్లు తీయగా.. స్పిన్నర్ జడ్డూ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇపుడు గిల్, పంత్ శతకాలుఈ క్రమంలో 227 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాను శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ మరింత పటిష్ట స్థితిలో నిలిపారు. గిల్(119 నాటౌట్), పంత్(109) అద్భుత శతకాలతో దుమ్ములేపారు. ఈ క్రమంలో 64 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగుల వద్ద ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో ఓవరాల్‌గా 514 పరుగుల లీడ్‌లో ఉన్న భారత్.. బంగ్లాదేశ్‌కు 515 పరుగుల టార్గెట్ విధించింది. అయితే, ఇంతటి లక్ష్యాన్ని ఛేదించాలంటే బంగ్లాదేశ్‌కు ఈజీ కాదు. ఏమో గుర్రం ఎగరావచ్చు అంటారా?! చూద్దాం.. ఇప్పటికైతే టీమిండియా విజయం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు (సెప్టెంబరు 19- 23)టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 376బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 149టీమిండియా రెండో ఇన్నింగ్స్- 287/4 డిక్లేర్డ్బంగ్లాదేశ్ లక్ష్యం- 515 పరుగులుచదవండి: AFG vs SA: వన్డేల్లో అఫ్గన్ సంచలన విజయం.. సౌతాఫ్రికాపై సిరీస్ గెలుపు Aaj ka toh din hi 𝙎𝙝𝙪𝙗𝙝 hai! 🤌🏻Shubman Gill joins the centurion party with a stylish 💯#INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/ZpcuwZyjxQ— JioCinema (@JioCinema) September 21, 2024WELCOME BACK TO TEST CRICKET, RISHABH PANT! 🙌🏻💯#RishabhPant #INDvBAN #IDFCFirstBankTestSeries #JioCinemaSports pic.twitter.com/C4gJuv29Y1— JioCinema (@JioCinema) September 21, 2024 -
Ind vs Ban: 400 వికెట్ల క్లబ్లో పేస్‘గుర్రం’
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన భారత పదో బౌలర్‌గా.. ఆరో పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు రెండో రోజు ఆట సందర్భంగా బుమ్రా 400 వికెట్ల క్లబ్లో చేరాడు.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్‌తో సొంత గడ్డపై రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో చెన్నైలోని చెపాక్ మైదానంలో ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన.. తొలి రోజు ఆరు వికెట్లు నష్టపోయి 339 పరుగులు చేసింది.అశ్విన్ సూపర్ సెంచరీస్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ‘లోకల్ బాయ్ ’ రవిచంద్రన్ అశ్విన్ సూపర్ సెంచరీ(113) కారణంగా ఈ మేర స్కోరు సాధ్యమైంది. ఇక శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో మరో 37 పరుగులు జోడించి.. 376 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు భారత పేసర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు.బుమ్రా విశ్వరూపంమొదటి ఓవర్లోనే ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం(2)ను బౌల్డ్ చేసి బుమ్రా శుభారంభం అందించగా.. ఆకాశ్ దీప్ జకీర్ హసన్(3), మొమినుల్(0)లను బౌల్డ్ చేసి మరో బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత సిరాజ్.. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ షాంటో(20) వికెట్ పడగొట్టగా.. బుమ్రా ముష్ఫికర్ రహీం(8) రూపంలో మరో కీలక వికెట్ కూల్చాడు.ఆ తర్వాత స్పిన్నర్ రవీంద్ర జడేజా డేంజరస్ బ్యాటర్ లిటన్ దాస్(22)ను వెనక్కి పంపడంతో పాటు షకీబ్ అల్ హసన్(32) వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం బుమ్రా హసన్ మహమూద్(9) రూపంలో తన మూడో వికెట్‌ను అందుకున్నాడు. బుమ్రా ఇంటర్నేషనల్ కెరీర్లో ఇది 400వ వికెట్ కావడం విశేషం. ఇక హసన్ తర్వాత ఈ మ్యాచ్‌లో బుమ్రా... తస్కిన్ అహ్మద్(11)ను కూడా అవుట్ చేశాడు.400 వికెట్ల క్లబ్లోకాగా 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇప్పటి వరకు టెస్టుల్లో 163, వన్డేల్లో 149, టీ20లలో 89 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 23 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. బంగ్లా మీద 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. చదవండి: Ind vs Ban: పంత్‌పై సిరాజ్ ఆగ్రహం.. రోహిత్ కూడా ఇలా చేస్తాడనుకోలేదు!Bumrah ki pace se hue Shadman gumrah 🔥☝️#IDFCFirstBankTestSeries #INDvBAN #JioCinemaSports pic.twitter.com/M4iVtf98BU— JioCinema (@JioCinema) September 20, 2024 -
భారత గడ్డపై బంగ్లా బౌలర్ సరికొత్త చరిత్ర..
చెపాక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహమూద్ సత్తాచాటాడు. మహమూద్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి అదరహో అన్పించాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, గిల్, పంత్ వంటి వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు. తన కెరీర్లో కేవలం నాలుగో టెస్టు మాత్రమే ఆడుతున్న ఈ యంగ్ ఫాస్ట్ బౌలర్.. తన పేస్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కాగా టెస్టు క్రికెట్లో హసన్ ఐదు వికెట్ల ఘనత సాధించడం ఇది రెండుసారి కావడం గమనార్హం. ఈ సిరీస్ కంటే ముందు పాక్‌తో జరిగిన రెండో హసన్ ఐదు వికెట్లు సాధించాడు. ఓవరాల్‌గా తన కెరీర్లో 18 వికెట్లుహసన్ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన హసన్ మహమూద్ ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై టెస్టుల్లో 5 వికెట్ల హాల్ సాధించిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా హసన్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ బంగ్లా బౌలర్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. ఓవరాల్‌గా భారత్‌పై 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా హసన్ నిలిచాడు. ఈ జాబితాలో నైమూర్ రెహమాన్, షకీబ్ అల్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్,షహదత్ హుస్సేన్, హసన్ మహమూద్ ఉన్నారు.చదవండి: Eng Vs Aus: లబుషేన్ ప్రపంచ రికార్డు.. వన్డే చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా -
రోహిత్, కోహ్లిలకే చుక్కలు చూపించాడు.. ఎవరీ హసన్ మహమూద్?
చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహమూద్ నిప్పులు చేరుగుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన పేస్ బౌలింగ్‌తో భారత బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. లంచ్ విరామానికి ముందు అతడిని ఆపడం ఎవరి తరం కాలేదు. భీకరమైన బౌన్సర్లతో టీమిండియా ఆటగాళ్లును బోల్తా కొట్టించాడు.ఆఖరికి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వంటి స్టార్ ప్లేయర్ల సైతం అతడి బౌలింగ్ ముందు బ్యాట్లెత్తాశారు. అతడి దెబ్బకు 34 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న రిషబ్ పంత్‌ను సైతం మహముద్ పెవిలియన్‌కు పంపాడు.ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 18 ఓవర్లు బౌలింగ్ చేసిన హసన్.. 58 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో భారత్‌ను ఆరంభంలోనే కష్టాల్లో నెట్టిన ఈ యువ పేసర్ గురించి నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.ఎవరీ హసన్ మహమూద్?24 ఏళ్ల హసన్ మహమూద్ 1999, ఆక్టోబర్ 12న బంగ్లాదేశ్‌లోని లక్ష్మీపూర్‌లో జన్మించాడు. మార్చి 2020లో మహమూద్ జాతీయ జట్టు తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. స్వదేశంలో జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌తో మహమూద్ తన ఇంటర్ననేషనల్ కెరీర్‌ను ప్రారంభించాడు.ఆ తర్వాత ఏడాదికే వన్డేల్లో వెస్టిండీస్‌పై హసన్ డెబ్యూ చేశాడు. వైట్‌బాల్ క్రికెట్లో సత్తాచాటడంతో అతడికి బంగ్లా టెస్టు జట్టులో కూడా చోటు దక్కింది. ఈ ఏడాది మొదట్లో శ్రీలంకపై టెస్టు క్రికెట్లోకి అతడు అడుగుపెట్టాడు. అక్కడ కూడా మహమూద్ అదరగొట్టాడు.కాగా హసన్‌కు ఇది నాలుగో టెస్టు. ఇంతకుముందు కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడిన హసన్..13 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ మూడు మ్యాచ్‌ల్లో హసన్ 4 కంటే తక్కువ ఎకానమీ రేటును కలిగి ఉండడం గమనార్హం.ఈ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా హసన్ దుమ్ములేపాడు. పాక్‌తో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. పాక్‌పై బంగ్లాదేశ్ చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించడంలో హసన్‌ది కీలక పాత్ర. కొత్త బంతితో రెండు వైపులా స్వింగ్ చేయగలిగే సత్తా అతడికి ఉంది. మొత్తంగా ఈ మ్యాచ్‌తో కలపునకుని అతడి ఖాతాలో 17 టెస్టు వికెట్లు ఉన్నాయి. అదే విధంగా వన్డేల్లో 30, టీ20ల్లో 18 వికెట్లు హసన్ పేరిట ఉన్నాయి.చదవండి: IND vs BAN: చెపాక్‌లో చితక్కొట్టుడు.. అశ్విన్ సూపర్ సెంచరీ


