బంగ్లాదేశ్‌ బౌలర్‌ అరుదైన ఘనత.. షేన్‌ వార్న్‌ సరసన చోటు | Hasan Mahmud Joins Shane Warne In Elite Test Cricket List After Hat Trick And Fifer Against Afghanistan, Check More Details | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌ బౌలర్‌ అరుదైన ఘనత.. షేన్‌ వార్న్‌ సరసన చోటు

Oct 12 2026 4:28 PM | Updated on Oct 12 2026 4:44 PM

Hasan Mahmud Joins Shane Warne In Elite List After Fifer vs Afghanistan

బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్‌ మహ్ముద్‌ టెస్టు క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. దిగ్గజ స్సిన్నర్‌ షేన్‌ వార్న్‌ తర్వాత భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, యూఏఈ దేశాల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. అబుదాబీ (యూఏఈ) వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్‌ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడంతో ఈ ఘనత సాధించాడు.

మహ్ముద్‌ 2024లో భారత్‌పై తన తొలి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆ తర్వాత పాకిస్తాన్‌ పర్యటనలో, ఇదే ఏడాది ఆస్ట్రేలియా పర్యటనలో, తాజాగా యూఏఈలో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.

వార్న్‌ విషయానికొస్తే.. కెరీర్‌ మొత్తంలో 37 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేసిన అతడు, భారత్‌లో ఓసారి, పాకిస్తాన్‌లో రెండుసార్లు, ఆస్ట్రేలియాలో 15 సార్లు, యూఏఈలో ఒకసారి ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు.

మూడో బంగ్లాదేశ్‌ బౌలర్‌
ఆఫ్ఘన్‌తో మ్యాచ్‌లో మహ్ముద్‌ మరో ఘనత కూడా సాధించాడు. టెస్టు క్రికెట్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో బంగ్లాదేశ్‌ బౌలర్‌గా నిలిచాడు. మహ్ముద్‌కు ముందు సోహాగ్‌ ఘాజీ, అలోక్‌ కపాలి మాత్రమే బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో హ్యాట్రిక్‌లు సాధించారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ (372-7) చేసిన బంగ్లాదేశ్‌ ఆఫ్ఘనిస్తాన్‌ ముందు 479 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో లిట్టన్‌ దాస్‌ (102) సెంచరీతో కదంతొక్కాడు. నజ్ముల్‌ హసన్‌ షాంటో (82), ముష్ఫికర్‌ రహీం (81), మెహిది హసన్‌ మిరాజ్‌ (52 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు.

ఛేదన ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్‌ నాలుగో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆ జట్టు గెలవాలంటే ఇంకా 428 పరుగులు చేయాలి. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన వెస్టిండీస్.. 'సిక్సర్ల' ప్రపంచ రికార్డు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement