అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభరాజు తన అక్క కొడుకు రాజ్ నిడిమోరు,కోడలు సమంతల గురించి సాక్షిఫ్యామిలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను మొదట్లో సమంత ఒక సినీ నటి కావడంతో కొంచెం భయపడ్డానని అన్నారు. కానీ ఆమె గురించి తెలుసుకున్నాక ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని శోభరాజు చెప్పారు.
సమంత ఆధ్యాత్మిక క్రమశిక్షణ కూడా తనను ఎంతగానో ఇంప్రెస్ చేసిందన్నారు. ఆమె తరుచుగా ఈషా ఫౌండెషన్‌కి వెళ్లి పోన్ కూడా దగ్గర పెట్టుకోకుండా మౌనవ్రతం పాటిస్తుందని తెలిసి చాలా సంతోసించానన్నారు. అలాగే ఆమె మయోసైటిస్ వంటి క్లిష్టమైన ఆటో ఇమ్యూన్ వ్యాధిని కేవలం యోగా, ధ్యానం, ఆహార నియమాలతో జయించి, ఇప్పుడు పండంటి బిడ్డకు జన్మనివ్వడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారామె.
సమంత సీమంతం..
తన వ్యక్తిగత జీవితంలో 200-300 కోట్ల రూపాయల ఆఫర్ వచ్చినా వద్దనుకున్న గొప్ప వ్యక్తిత్వం సమంతదని, అనాథ పిల్లల చదువుకు, ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం స్కూల్ నడుపుతూ ఎంతో సేవ చేస్తోందని ప్రశంసించారు.
అలాగే ఆమె తల్లి కాబోతుందని తెలిసి చాలా సంతోషించానని అందుకే ఆమె సీమంతం వేడుక కోసం స్వయంగా "సమంత సీమంతం.. ఆనందం విరిసే అమృతమే కురిసే.." అనే పాట రాసి బృందావని రాగంలో స్వరపరిచానని చెప్పారు. ఆ పాటను రాజ్ సోదరి శీతల్ ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆ వేడుకలో పాడగా..సమంత ఎంతో భావోద్వేగానికి గురై ఆనందంతో హత్తుకుందని శోభరాజు నాటి ఘటనను గుర్తుచేసుకున్నారు.


