Pregnant Samantha spotted outside bandra : నటి సమంత తన ప్రెగ్నెంట్ జర్నీని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. అలాగే ఆ సమయంలో నిపుణులు సూచనలతో ఎలాంటి వర్కౌట్లు చేయవచ్చు..వంటి ఎన్నో అమూల్యమైన విషయాలు పంచుకుంది. ఇప్పుడు తొమ్మిదో నెలలోకి ఎంట్రీ ఇస్తుండగా నిండు గర్బణీ ముఖంలో కనిపించే అందం ఆమె ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.
అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ముంబైలోని బాంద్రాలో ఒక సెలూన్ బయట కనిపించారు. సాధారణ దుస్తులలో కనిపించినప్పటికీ కాబోయే అమ్మలో కనిపించే కాంతి ఆమెలో ప్రస్ఫుటంగా కనపించింది. గులాబీ రంగు మ్యాక్సీ డ్రెస్‌లో ఆకర్షణీయంగా కనిపించింది. తెల్లటి పూల ప్రింట్‌తో వదులుగా ఉండే డ్రెస్‌లో చాలా క్యూట్‌గా ఉంది. ఆమె తన లుక్‌ను ముదురు రంగు గుండ్రటి సన్‌గ్లాస్‌తో పూర్తి చేసింది.
చేతిలో ఒక ఇన్సులేటెడ్ టంబ్లర్ పట్టుకుని బయటకు వస్తున్న పోటోలు నెట్టంగ తెగ హల్‌చల్ చేశాయి. ఇటీవలే కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 30న సమంత రూత్ ప్రభు గర్భధారణ సమయంలో తన ఫిట్‌నెస్ ప్రయాణాన్ని వివరిస్తూ..మొదటి నెల నుంచి తొమ్మిది నెల వరకు వివిధ దశల్లోని వర్కౌట్ దృశ్యాలు ఉన్నాయి.
అంతేగాదు నెలలు నిండి ఉన్నా..కూడా డంబెల్ దగ్గరకు పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపర్చింది. కాగా ఆమె ప్రస్తుతం‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్’ అనే వంటల రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రసూతి విరామం అనంతరం తన రాబోయే వెబ్‌సీరిస్ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ షోలో కూడా పని చేయనున్నారు.
ఇదీ చదవండి: ఈ ఫ్యామిలీకి పుట్టుకే రికార్డు ..! వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ


