కోలీవుడ్ నటి కమల్ హాసన్ తనయ శృతి అటు సింగర్, ఇటు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటూ విమర్శకుల ప్రసంశలందుకుంటోంది. శృతి స్టైలిష్ విషయంలోనూ రెండు విధాలను మిళితం చేస్తూ ట్రెండీ లుక్‌లో కనిపిస్తుంటుంది. ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే స్టైలిష్‌గా ఆహార్యం ఉండేలా చూసుకుంటుంది. ఈసారి కూడా అలానే సరికొత్త లుక్‌లో తళుక్కుముంది. చుట్టూ ఉన్న వాతావరణానికి అనుగుణంగా బ్యూటీఫుల్ గ్రే చీరలో ఆకర్షణీయంగా కనిపించింది.
చూస్తే సంప్రదాయబద్ధంగా..లుక్ పరంగా స్టైలిష్‌గా కనిపించింది. అందుకు సంబంధించిన ఫోటోలన నవంబర్ 15న ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వర్షాభావంతో ఉన్న చెన్నైలో అందుకు తగినట్లుగా రెడీ అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతేగాదు ఆ ఫోటోలను షేర్ చేస్తూ పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది. వర్షపు రోజుల్లో తన హృదయాన్ని గ్రే రంగులో ఉంచుతాయి. ఈ రోజుల్లో చెన్నైలోని అద్భుతమైన వాతావరణం తనను ఎంతగానో ఆకర్షింస్తుందని పేర్కొంది.
ఇక ఆమె చీర అంతటా సున్నితమైన సూక్ష్మ నమునాలు, క్లిష్టమైన డిజైన్‌తో కూడిన లేత స్లేట్ గ్రేరంగు చీరలో హుందాగా కనిపించింది. తేలికైన ఫ్రాబ్రిక్ ఆహ్లాదం, ప్రశాంతత, సౌకర్యవంతం తోపాటు బ్యూటిఫుల్‌గా కనిపించేలా చేసింది. ఈ లుక్‌కి ఆడంబరమైన అలంకరణల జోలికి పోకుండా..స్టైల్ చేసింది. నల్లని కురులను అలలుగా వదలేసి, మినిమల్ మేకప్, సున్నితంగా తీర్చిదిద్దిన కళ్లు, చక్కటి కనుబొమ్మలు, లేత గులాబీ గోధుమ రంగు పెదవులతో తన రూపాన్ని పూర్తి చేసింది. చిన్న నల్లటి గుండ్రటి బొట్టుతో తన ఆహార్యాన్ని ముగించింది.
ట్రెడిషనల్ లుక్ సింపుల్‌గా ఉండాంటే..
సంప్రదాయ శైలితో ఆకట్టుకుంటూ..సింపుల్‌గా కనబడాలనుకునే వారికి శృతి లుక్ హెల్ప్ అవుతుంది. మాములుగా వేసుకునే ప్రకాశవంతమైన రంగులకు భిన్నంగా బూడిదరంగు చీర, కొద్దిపాటి ఆభరణాలు,..చిన్న గుండ్రటి బొట్టు చాలు. మేకప్ కూడా తక్కువగా ఉంటే..భారీ ఆభరణాలతో పనిలేకుండానే స్టైలిష్‌గా హుందాగా కనిపిస్తారని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు.
ఇదీ చదవండి: గృహిణి నుంచి అంతర్జాతీయ గుర్తింపు వరకు..! ఇద్దరు పిల్లల తల్లి సక్సెస్ స్టోరీ


