మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా? | Mens Footwear Fashion Styling Tips | Sakshi
Sakshi News home page

మీ షూస్‌ చూస్తేనే మీ స్టేటస్‌ తెలిసిపోతుందా?

Nov 8 2026 1:43 PM | Updated on Nov 8 2026 1:43 PM

Mens Footwear Fashion Styling Tips

ఫండే

ఫ్యాషన్‌

ట్రెండీమెన్‌

మీరు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అందరి చూపులు మొదట మీ ముఖం మీదికో లేదా మీరు వేసుకున్న బ్రాండెడ్‌ షర్ట్‌ మీదికో వెళ్తాయని అనుకుంటే మీ పొరపాటు! సైకాలజీ ప్రకారం, ఎవరినైనా మొదటిసారి చూసినప్పుడు వాళ్ల కళ్లు వెతికే మొదటి విషయం మీరు వేసుకున్న పాదరక్షలనే! అందుకే, సమాజంలో మిమ్మల్ని గంభీరంగా నిలబెట్టే  పాదర„ý ల స్టయిలింగ్‌ టిప్స్‌ ఇప్పుడు మీకోసం...

లక్ష రూపాయల సూట్‌ వేసుకున్నా, కింద అరిగిపోయిన మురికి చెప్పులు కనిపిస్తే మీ వాల్యూ పడిపోతుంది. దీనికోసం డిజైనర్లు ప్రధానంగా నాలుగు సూత్రాలు సూచిస్తున్నారు..

ది లెదర్‌ మ్యాచింగ్‌ రూల్‌
మీరు ఫార్మల్‌ లేదా సెమీ ఫార్మల్‌ దుస్తులు ధరించినప్పుడు, మీ షూస్‌ ఏ రంగు లెదర్‌తో ఉంటాయో, మీ బెల్ట్, మీ వాచ్‌ స్ట్రాప్‌ కూడా అదే రంగు లెదర్‌ టోన్‌ లో ఉండాలి. ఈ చిన్న టిప్‌ బాగా పనిచేస్తుంది.

సాక్స్‌ కోఆర్డినేషన్‌
ఫార్మల్‌ షూస్‌ వేసుకునేటప్పుడు సాక్స్‌ రంగు ఎప్పుడూ మీ ప్యాంట్‌ రంగుతో మ్యాచ్‌ అవ్వాలి. స్నీకర్స్‌ లేదా లోఫర్స్‌ వేసుకున్నప్పుడు సాక్స్‌ బయటకు కనిపిం^è కూడదు.

ది ఫార్మాలిటీ స్కేల్‌...
రంగు ఎంత ముదురుగా ఉంటే ఆ షూ అంత ఫార్మల్‌ అని అర్థం. అలాగే, ఏ రకం దుస్తులకు ఏ రకం ఫుట్‌వేర్‌ వేసుకోవాలో కూడా తెలుసుకోవాలి.

ఆక్స్‌ఫర్డ్స్‌
ఇవి కేవలం ఫార్మల్‌ సూట్స్, ఆఫీస్‌ వేర్‌తో మాత్రమే జత చేయాలి.

లోఫర్స్‌
స్మార్ట్‌ క్యాజువల్స్‌కి ఇవే రారాజులు. చినోస్‌ ప్యాంట్స్, యాంకిల్‌ లెంగ్త్‌ ట్రౌజర్స్‌పైకి సాక్స్‌ లేకుండా లోఫర్స్‌ వేసుకుంటే లుక్‌ అద్భుతంగా ఉంటుంది.

వైట్‌ స్నీకర్స్‌
ప్రతి మగాడి దగ్గరా ఉండాల్సిన ఎవర్‌గ్రీన్‌  ఐటమ్‌. జీన్‌్స, కాటన్‌ ప్యాంట్స్‌ లేదా క్యాజువల్‌ టీషర్ట్స్‌పైకి క్లీన్‌ వైట్‌ లెదర్‌ స్నీకర్స్‌ వేసుకుంటే చాలా మోడరన్‌ వైబ్స్‌ వస్తాయి.

క్యాజువల్‌ అండ్‌ కంఫర్ట్‌ లుక్‌
చాలామంది స్లిప్పర్స్‌ లేదా సాండల్స్‌ అనగానే కేవలం ఇంట్లో వేసుకునేవి అనుకుంటారు. కానీ నేటి మోడర్న్‌ ఫ్యాషన్‌లో స్లిప్పర్స్‌తో కూడా స్టయిలిష్‌గా మెరిసిపోవచ్చు. అయితే బయటకు వెళ్లేటప్పుడు రబ్బర్‌ లేదా ప్లాస్టిక్‌ ఫ్లిప్‌ ఫ్లాప్స్‌కి బదులుగా ప్రీమియం లెదర్‌ స్లిప్పర్స్, బ్రౌన్‌, బ్లాక్‌ లెదర్‌ సాండల్స్‌గా వాటిని ఎంచుకోండి. ఇవి కుర్తాలు, లినెన్‌ షర్టులు, షార్ట్స్‌పైకి ఎంతో రాయల్‌ లుక్‌ను ఇస్తాయి. ఒక వేళ ఓపెన్‌ స్లిప్పర్స్‌ వేసుకుంటే మీ పాదాలు, గోర్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

ఇదీ చదవండి: సాయిపల్లవి చేతికి ఎప్పుడూ ఆ మాలే ఎందుకు? ఆసక్తికర విషయాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement