ఫండే
ఘనాంకాలు
దీపావళి మర్నాటి నుంచి కార్తీకమాసం మొదలవుతోంది. కార్తీకంలో ఉసిరిచెట్టు నీడన వనభోజనాలు చేసే సంప్రదాయం మన దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉంది. పురాతన కాలం నుంచి మనవాళ్లకు ఉసిరి ఘనత తెలుసు. పురాణేతిహాసాల్లో ఉసిరి ప్రస్తావన కనిపిస్తుంది. ఉసిరికాయ పోషక విలువలను గుర్తించడం వల్ల పూర్వీకులు దీనిని ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగించడం ప్రారంభించారు.
ఉసిరిచెట్లు భారత ఉపఖండ ప్రాంతమంతటా విస్తారంగా కనిపిస్తాయి. ఉసిరి ఉత్పాదనలో మన దేశం తరతరాలుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. మన ఇరుగు పొరుగు దేశాల్లోను, కొన్ని యూరోపియన్ దేశాల్లోను కూడా ఉసిరి పండిస్తున్నా, మన దేశంలోని ఉత్పాదనతో పోల్చుకుంటే నామమాత్రమే! ఉసిరి విశేషాలను గణాంకాల్లో తెలుసుకుందాం...
మన దేశంలో ఉత్తరప్రదేశ్ ఉసిరి ఉత్పాదనలో అగ్రస్థానంలో ఉంటోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా ‘ఉసిరి రాజధాని’గా ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఉసిరి వార్షిక ఉత్పాదన 11.64 లక్షల టన్నుల వరకు ఉంటుంది. ఉసిరి ఉత్పాదనలో టాప్–10 రాష్ట్రాల గణాంకాలు.
ఇదీ చదవండి: పైన రిమోట్... కింద కరెంట్!


