breaking news
Gooseberry Candy
-
ఈ కార్తీకంలో ఉసిరితో పసందైన వంటకాలు చేసేద్దాం ఇలా..!
ఉసిరి క్యాండీకావలసినవి: ఉసిరికాయలు (పెద్దవి)– అర కప్పు, పంచదార – అరకప్పు (ఉసిరికాయల బరువుకు సమానంగా తీసుకోవచ్చు)ఏలకుల పొడి, పంచదార పొడి– కొద్దికొద్దిగా (గార్నిష్ కోసం, అభిరుచిని బట్టి)తయారీ: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను చల్లార్చి, చాకుతో గింజలను తీసి ముక్కలను జాగ్రత్తగా విడదీయాలి. ఈలోపు ఒక వెడల్పాటిపాత్ర తీసుకుని, అందులో సగం ఉసిరి ముక్కలు, దానిపై సగం పంచదార వేయాలి. ఇదే విధంగా మిగిలిన ఉసిరి ముక్కలు, మిగిలిన పంచదార వేయాలి. పాత్రపై మూత పెట్టి, 3 నుంచి 4 రోజుల పాటు ఉంచాలి. ఈ సమయంలో పంచదార మొత్తం కరిగి, పాకంగా మారి ఉసిరి ముక్కలలోకి చేరుతుంది. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు ముక్కలు విరగకుండా పాత్రను మెల్లగా కదపాలి. 4 రోజుల తర్వాత ఉసిరి ముక్కలు మెత్తగా మారి, పంచదార మొత్తం ద్రవ రూపంలోకి మారుతుంది. ఇప్పుడు ఆ ఉసిరి ముక్కలను పాకం నుంచి వేరు చేసి, ఒక ప్లేట్లో లేదా జల్లెడలో పరచాలి. (ఆ పంచదార పాకాన్ని వేరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు). పాకం తీసిన ఉసిరి ముక్కలను, ఎండ తగిలే ప్రదేశంలో సుమారు 3 రోజుల పాటు పూర్తిగా ఆరిపోయే వరకు ఎండబెట్టాలి. క్యాండీ ఒకదానికి ఒకటి అంటుకోకుండా, మృదువుగా అయ్యేంతవరకు ఎండబెట్టడం ముఖ్యం. పూర్తిగా ఆరిన ఆ ఉసిరి క్యాండీ ముక్కలను సర్వ్ చేసుకునే ముందు ఏలకుల పొడి, పంచదార పొడితో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటాయి. ఈ ఉసిరి క్యాండీని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే, ఏడాది వరకు పాడవకుండా ఉంటుంది.ఉసిరి పులిహోరకావలసినవి: అన్నం– ఒక కప్పు (వండి చల్లార్చినది)ఉసిరికాయలు (పెద్దవి)– 5 (మరింత పులుపు కావాలనుకుంటే పెంచుకోవచ్చు)నూనె– 3 టేబుల్‌స్పూన్లు, ఆవాలు– ఒక టీస్పూన్శనగపప్పు, మినప్పప్పు– ఒక టేబుల్‌స్పూన్ చొప్పునపల్లీలు– 2 టేబుల్స్పూన్లుఎండు మిరపకాయలు– 2 (తుంచి పెట్టుకోవాలి)పచ్చి మిరపకాయలు– 3 (మధ్యలోకి కట్ చేసుకోవాలి)అల్లం – చిన్నది (తరగాలి), కరివేపాకు– ఒక రెమ్మపసుపు – అర టీస్పూన్, ఇంగువ– చిటికెడు (అభిరుచిని బట్టి), ఉప్పు– సరిపడా, కొత్తిమీర– కొద్దిగాతయారీ: ముందుగా అన్నాన్ని వెడల్పాటి పాత్రలో వేసి పూర్తిగా చల్లార్చాలి. ఈలోపు ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, గింజ తీసి, తురుముకోవాలి. వాటిని మిక్సీ పట్టుకోవాలి. లేదంటే ఉసిరికాయలను కొద్దిగా ఉడికించి, చల్లారాక తురుముకోవచ్చు. ఇప్పుడు ఒక మందపాటి కడాయిలో నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక, ఆవాలు వేసి చిటపటలాడగానే, శనగపప్పు, మినçప్పప్పు, పల్లీలు వేసి దోరగా వేయించాలి. తరువాత ఎండు మిరపకాయలు, పచ్చి మిరపకాయలు, అల్లం తురుము, కరివేపాకు, చిటికెడు ఇంగువ, పసుపు, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా కలపాలి. ఇప్పుడు ఉసిరికాయ తురుమును తాలింపులో వేసి, పచ్చి వాసన పోయే వరకు సుమారు 2 లేదా 3 నిమిషాలు వేయించాలి. ఉసిరి తురుము వేగిన తర్వాత స్టవ్ ఆపెయ్యాలి. ఆ ఉసిరి తాలింపును చల్లారిన అన్నంలో వేసి, అన్నం మెతుకు విరగకుండా, తాలింపు అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి, అవసరమైతే కొద్దిగా వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. కాసేపు పక్కనే ఉంచితే ఉసిరికాయ పులుపు అన్నానికి బాగా పట్టి, మంచి రుచి వస్తుంది. తర్వాత కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.ఉసిరి హల్వాకావలసినవి: ఉసిరికాయలు (పెద్దవి)›– 500 గ్రా., చక్కెర లేదా బెల్లం తురుము – 500 గ్రా., (ఉసిరికాయలు ఎంత తీసుకుంటే అంత మోతాదులో తీసుకోవచ్చు), నెయ్యి – 5 టేబుల్‌స్పూన్లు, ఏలకుల పొడి – ఒక టీస్పూన్, ఫుడ్ కలర్ – అభిరుచిని బట్టి, డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు) – కొద్దికొద్దిగా (నేతిలో వేయించుకోవాలి)తయారీ: ముందుగా ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను చల్లార్చి, గింజలు తీసేసి, ముక్కలను మిక్సీలో నీళ్లు వేయకుండా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈలోపు ఒక మందపాటి కడాయిలో రెండు టేబుల్స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని, అందులో జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వంటి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఉసిరి పేస్ట్‌ను వేసి, నెయ్యిలో పచ్చి వాసన పోయే వరకు సుమారు 7 నిమిషాలు బాగా వేయించాలి. ఉసిరి పేస్ట్ కాస్త రంగు మారిన తర్వాత, బెల్లం తురుము లేదా చక్కెరను వేసుకోవాలి. అది కరిగి, ఉసిరి పేస్ట్‌తో బాగా కలిసిపోయి, ఆ మిశ్రమం దగ్గరపడే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. మధ్యలో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమం గట్టిపడుతున్నప్పుడు, మిగిలిన నెయ్యిని కొద్దికొద్దిగా, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. హల్వా కడాయి అంచులను వదిలి, ముద్దగా తయారయ్యే వరకు ఉడికించాలి. చివరిగా ఏలకుల పొడి వేసి బాగా కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలతో అలంకరించి సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. -
నోరూరించి ఉసిరితో మెంతి కుర్మా చేయండి ఇలా!
కావలసినవి: ఉసిరి కాయలు – పది మెంతిఆకు –రెండు కట్టలు పచ్చిమిర్చి – రెండు అల్లం – అంగుళం ముక్క వెల్లుల్లి రెబ్బలు – ఐదు ఉల్లిపాయలు – రెండు టొమాటోలు – రెండు నూనె – రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను సోంపు – అర టీస్పూను వాము – టీస్పూను ఇంగువ – చిటికెడు పసుపు – అర టీస్పూను గరం మసాలా – టీస్పూను ధనియాల పొడి – టీస్పూను జీలకర్ర – టీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం: ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఉడికిన తర్వాత గింజలు తీసేసి, పెద్దసైజు ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లిని సన్నగా తరగాలి. మెంతిఆకును కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. మందపాటి బాణలిలో నూనెవేసి వేడెక్కనివ్వాలి. నూనె కాగిన తరువాత, మీడియం మంట మీద ఉంచి..జీలకర్ర, సోంపు, వాము వేయాలి. ఇవి చిటపటలాడాక పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి తరుగు వేసి నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు మగ్గనియ్యాలి. ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిన తరువాత టొమాటో ముక్కలు కొద్దిగా నీళ్లుపోసి మూతపెట్టి మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తరువాత మూత తీసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మగ్గిన తరువాత టొమాటో ముక్కలు చక్కగా మెత్తబడతాయి. ఇప్పుడు మెంతిఆకు తరుగు వేసి కలపాలి. సన్నని మంట మీద కలుపుతూ ఉంటే మెంతిఆకు ఇట్టే మగ్గిపోతుంది మెంతిఆకు మగ్గిన తరువాత గరం మసాలా, జీలకర్ర, ధనియాల పొడులు వేయాలి. వెంటనే ఉసిరికాయ ముక్కలను వేసి మసాలాలు ముక్కలకు పట్టేలా కలపాలి. చివరిగా రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే మెంతి ఉసిరి కుర్మా రెడీ. చపాతీ, రోటీ, అన్నం, సలాడ్లోకి ఈ కుర్మా మంచి కాంబినేషన్. (చదవండి: -
ఉసిరి లడ్డూ కావాలా నాయనా!
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): ఉసిరి లడ్డూ కావాలా నాయనా... ఉసిరి క్యాండీతో ఎంజాయ్ చెయండి అంటున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని కృషివిజ్ఞాన కేంద్రంలో శిక్షణ పొందిన కొందరు ఔత్సాహికులు. రాతి ఉసిరి అంటే పచ్చడి మాత్రమే అందరికి తెలుసు. కాలక్షేపానికి ఒకట్రెండు కాయలు తినేందుకో, వైద్యానికో వినియోగిస్తారు. ఇప్పుడు ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి లడ్డూలు, ఆమ్లా మురబ్బా, ఆమ్లా హనీ, చట్పటా (కాలక్షేపానికి తినడానికి)తయారు చేస్తున్నారు. సహజసిద్ధమైన ఉసిరి పులుపు రుచికి తేనెను చేర్చి కొత్త రుచులు తీసుకొస్తున్నారు. ఉసిరిని హనీ లడ్డూగా మారుస్తున్నారు. ఆర్యతో కొత్త అడుగు : యువతను వ్యవసాయం వైపు ఆకర్షించి వారిని ఆ రంగంలో నిలదొక్కుకొనేందుకు తీసుకొచ్చిన పథకం ఆర్య(అట్రాకింగ్ అండ్ రీటెనియింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్). ఇందులో ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకం, పెరటికోళ్ల పెంపకం, సమీకృత వ్యవసాయం ఉన్నాయి. ఫ్రూట్ అండ్ విజిటబుల్ ప్రాసెసింగ్, తేనెటీగల పెంపకాన్ని సమ్మిళితం చేసిన ప్రయోగానికి ప్రతిరూపమే ఉసిరి లడ్డూలు, మురబ్బాలు. కృషి విజ్ఞాన కేంద్రంలోని శిక్షణను అందిపుచ్చుకున్న పెదతాడేపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మధుశ్రీ ఆర్గానిక్స్ పేరుతో ఉసిరి యూనిట్‌ను ప్రారంభించారు. దీంతో ఉసిరి లడ్డూలు ఇతర ఉత్పత్తులు మార్కెట్లోకి గత 6 నెలలుగా వస్తున్నాయి. ఉసిరి లడ్డూ తయారీ ఇలా.. ఉసిరి కాయలను తీసుకొని తేమ 20 శాతం ఉండేలా చూస్తారు. తేనెలో 72 నుంచి 80 వరకు బ్రిక్స్ (చక్కెర శాతం )ఉండేలా చూస్తారు. 72 గంటల పాటు తేనెలో ఉసిరి కాయలు నాననిచ్చి మాగపెడతారు. తర్వాత ఆరబెడతారు. ఇలా తయారయ్యిన ఉసిర లడ్డూలు ఏడాది పాడవకుండా ఉంటాయి. గ్రేడింగ్‌లో తీసేసిన కాయలతో ఆమ్లా మురబ్బా( తొనలు) తయారు చేస్తారు. ఉసిరి కాయలకు ఉప్పును చేర్చి చట్పటా తయారు చేస్తారు. పరిశ్రమను మరింత విస్తరిస్తాం ఉసిరితో ఉత్పత్తులను తయారుచేసే విషయంపై ఐదుగురం శిక్షణ పొందాం. ఏడు నెలల క్రితం ఉత్పత్తులు ప్రారంభించాం. జిల్లాతో పాటు కర్నూలు, వైజాగ్, హైద్రాబాద్ వంటి ప్రాంతాలకు ఉత్పత్తులు పంపించి వ్యాపారం చేస్తున్నాం. పరిశ్రమను అన్ని హంగులతో విస్తరించే యోచనలో ఉన్నాం. – గీతాంజలి, మధుశ్రీ ఆర్గానిక్స్, పెదతాడేపల్లి


