Eluru
-
సాయం పేరుతో స్వాహా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి అందరూ బియ్యం ఇవ్వాలంటూ జనసేన శ్రేణులు గత ఏడాది ఊరూరా తిరిగి సేకరించారు. ఇలా దాతలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థల నుంచి భారీగా సేకరించారు. చివరికి అనుకున్న స్థాయిలో బియ్యం సేకరించాక ఆ మొత్తాన్ని జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఒకరు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడిది బయటకు పొక్కింది. దీంతో.. ఆ మొత్తం డబ్బును పార్టీకి విరాళంగా ఇస్తానని.. ఇదంతా మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పేచేశానని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో దీనిపై పంచాయితీ జరిగింది. అయినా సెటిల్ కాకపోవడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్లారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పుడీ వ్యవహారం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..అసలేం జరిగిందంటే.. విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికంటూ జనసేన పార్టీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి దొడ్డిగర్ల సువర్ణరాజు నేతృత్వంలో గతేడాది నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో భారీగా బియ్యం సేకరించారు. కానీ, ఇలా సేకరించిన బియ్యాన్ని విజయవాడలో బాధితులకు పంచకుండా ఆయన విక్రయించేశారు. ఈ సొమ్మును నియోజకవర్గ ఇన్చార్జే స్వాహా చేశాడని ఒక వర్గం దుమ్మెత్తిపోస్తుండగా.. ఇన్చార్జి వర్గం మాత్రం సొమ్ము తమవద్దే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని, మంత్రి కందుల దుర్గేష్‌కు విషయం చెప్పామని, ఆయన విరాళం ఇవ్వడానికి పవన్‌కళ్యాణ్ వద్దకు తీసుకువెళ్తారంటూ చెబుతున్నారు. అయితే, నాలుగు నెలల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం వచ్చినప్పడు కూడా ఆయనకు చెక్కు ఇవ్వడం కుదరలేదా అని ప్రత్యర్థి వర్గం నిలదీస్తోంది.రూ.10 లక్షలు కాదు.. 16 లక్షలకు అమ్ముకున్నారు..జనసేన నియోజకవర్గ ఇన్చార్జి సువర్ణరాజు, ఆయన వ్యతిరేక వర్గం మధ్య ఈ విషయంలో కొద్దిరోజులుగా తారాస్థాయిలో వివాదం నడుస్తోంది. సేకరించిన బియ్యాన్ని రూ.10.27 లక్షలకు విక్రయించానని సువర్ణరాజు చెబుతుంటే.. రూ.16 లక్షలకు అమ్ముకున్నారని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీనిపై పార్టీ జిల్లా నేతల వద్ద పంచాయితీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జనసేన నాయకుడు కరాటం సాయి పార్టీ ఆదేశాలతో గోపాలపురం నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు. సువర్ణరాజు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణకు దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో కరాటం సాయి చేతులెత్తేసి జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ దృష్టికి వ్యవహారం తీసుకెళ్తున్నట్లు చెప్పి సమావేశం ముగించారు. -
ధాన్యం కొనుగోలులో సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 2024–25 రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధిత శాఖలు సమన్వంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అన్నారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో రబీ ధాన్యం సేకరణపై జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి అధ్యక్షతన జిల్లా సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ రబీ పంటకు సంబంధించి 98 శాతం ఈకేవైసీ పూర్తయిందన్నారు. జిల్లాలో 3,97,807 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేశామని, 2,,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గోనె సంచులను రైస్ మిల్లర్లు ముందస్తుగానే పరిశీలించి నిర్దేశించిన గోడౌన్లలో ఉంచాలన్నారు. వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్ రాజ్, ఆర్డీవోలు అచ్యుత్ అంబరీష్, ఎం.వి.రమణ, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ వి.శ్రీలక్ష్మీ, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు . జేసీ పి.ధాత్రిరెడ్డి -
పరిశోధన ఫలితాలు లాభసాటిగా ఉండాలి
నూజివీడు: మామిడి పరిశోధన ఫలితాలు రైతులకు లాభసాటిగా ఉండాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. నూజివీడు మామిడి పరిశోధ నస్థానం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో కిసాన్ మేళా, వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి ముందుగా స్టాల్స్ సందర్శించారు. అనంతరం రైతులు, వ్యాపారులు, శాస్త్రవేత్తలనుద్ధేశించి మాట్లాడుతూ నూజివీడు మామిడికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇటీవల నాణ్యమైన మామిడి దిగుబడి రాకపోవడంతో రైతులు ఎంతగానో నష్టపోతున్నారన్నారు. ప్రస్తుతం మామిడికి నల్ల తామర పురుగులు ప్రధాన సమస్యగా తయారయ్యాయని మామిడి శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు తోటల్లో జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నివారించుకోవాలి తప్ప పురుగుమందులతో నివారించలేమన్నారు. సమావేశంలో వైఎస్సార్ హార్టీకల్చర్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే గోపాల్, అపేడా రీజనల్ హెడ్ ఆర్పీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
పెదవాగు బాధితులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్) : గత ఏడాది గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్బగా కమిటీ కార్యదర్శి ఎస్కె గౌస్ మాట్లాడుతూ వేలేరు పాడు, కుకునూరు మండలాల్లోని 50 గ్రామాలలో పంట భూముల్లో ఇసుక మేటలు వేసి, గండ్లు పడ్డాయని అన్నారు. నష్టపోయిన ప్రజలకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక సార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిస్కారం కాలేదన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి 50 గ్రామాలలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అల్లూరి నగర్ పంపుహౌస్ లో ఉన్న నీటిని మోటార్లతో మేడేపల్లి, రామవరం గ్రామ పంచాయతీ గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల నాయకులు సిరికొండ రామారావు, కట్టాం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నిరాశపర్చిన పొగాకు ధర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా ప్రారంభ ధర రైతులను నిరాశ పర్చింది. ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో సోమవారం కొనుగోలు ప్రారంభమైంది. ప్రారంభ ధర కేజీకి రూ.290 పలికింది. సరాసరి ధర కంటే రూ.340 పలుకుతుందని ఆశించారు. గత ఏడాది ధర దృష్ట్యా కౌలు ధరలు, ఎరువులు, రైతు కూలీల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. గత ఏడాది వర్జీనియా వేలం ప్రక్రియపై నమ్మకంతో అధిక పెట్టుబడులతో ఎక్కువ పంటను పండించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే 20 మిలియన్ల కేజీల పంట అధికంగా ఉండొచ్చని అంచనా. గరిష్ట ధర 400 పైగా రావాలని, సరాసరి రూ.350కి తగ్గకుండా వస్తేనే ఈ ఏడాది రైతులు గట్టెక్కే పరిస్థితి ఉందని రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. ప్రారంభ ధర కేజీకి రూ.290 సరాసరి రూ.350 పైగా వస్తేనే గిట్టుబాటు సరైన ధర వచ్చేలా చూడాలి తొలి రోజు ధర ఏ విధంగాను ఆమోదయోగ్యం కాదు. గత ఏడాది వేలం ప్రక్రియ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ధర మీద ఆశతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నిర్ధేశించిన దాని కంటే ఎక్కువ పండిందని అధికారులు చెబుతున్నారు. కనీసం వారు నిర్ధేశించిన లక్ష్యానికై నా రూ.411 పైగా ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలి. – పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
తీవ్ర నిరాశ కలిగించింది
తొలి రోజు రూ.290 రావడంతో రైతులు నిరాశ చెందారు. గత ఏడాది సరాసరి రూ.335 వచ్చింది. సరాసరి రూ.350 వస్తేనే పెట్టుబడులు తిరిగి వస్తాయి. 10 రోజులు చూస్తాం. ఇలాగే కొనసాగితే ప్రతిఘటిస్తాం. సరాసరి రూ.350 వచ్చేలా కంపెనీలు, బోర్డు, ప్రభుత్వం కృషిచేయాలి. జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులతో పోల్చితే మిగిలిన చోట్ల పంట తక్కువ. దీంతో ఆఖరిగా నిలిచిన జంగారెడ్డిగూడెం –1, –2 బోర్డులలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఐదు బోర్డులను సమానం చేసి వేలం నిర్వహించాలి. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘ నాయకుడు -
కృత్రిమ అవయవాల పంపిణీ
ఏలూరు (టూటౌన్): ఏలూరు దొండపాడులో ఉమా ఎడ్యుకేషనల్ – టెక్నికల్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ నిర్వహించారు. సంస్థ కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఫిజియోథెరపీ, ఆడియోలజీ, స్పీచ్ థెరఫీ తదితర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇతర వివరాల కోసం 08812 –249297,7386565469లో సంప్రదించాలన్నారు. మెగా డీఎస్సీకి ఉచిత కోచింగ్ ఏలూరు (టూటౌన్): బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెగా డీఎస్సీ–2025 పరీక్షలకు బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఉచిత ఆన్లైన్ డీఎస్సీ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారిణి ఆర్వి.నాగరాణి ఒక ప్రకటనలో కోరారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, టీటీసీ, బీఎడ్, కుల, ఆదాయ నివాస ధ్రువ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థులు స్వయంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు 8686180018 నెంబరులో సంప్రదించాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందాలి ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలో ప్రజలు ఆయా సమస్యలపై పోలీస్స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. ఆయా సమస్యలపై పోలీస్ అధికారులతో నేరుగా మాట్లాడి వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. సుమారు 36 ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్ పాల్గొన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పోలవరం రూరల్: ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించనున్న దృష్ట్యా ఏర్పాట్లను కలెక్టర్ కే వెట్రిసెల్వి, జేసీ పీ ధాత్రిరెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతంలో సమావేశ హాలులో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. డయాఫ్రమ్ వాల్, ఎగువ కాపర్ డ్యామ్, గ్యాప్– 1, 2 తదితర పనులను పరిశీలించే అవకాశం ఉందన్నారు. ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ కూడా అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. అవసరమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై శ్రద్ధ పెట్టాలి ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయనతో పాటు ఆర్డీవో అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పిడి ఆర్.విజయరాజు తదితరులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఓ సూచించారు. నిర్ణీత గడువులోగా అర్జీలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు తదితర శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయన్నారు. -
మంచి ధర వచ్చేలా కృషి చేస్తాం
పొగాకు బోర్డు రైతులకు మంచి రేటు వచ్చేలా కృషిచేస్తుంది. ఈ ఏడాది కూడా ఆశించిన మేరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంటను బయటకు అమ్ముకోవద్దు. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పెద్దఎత్తున పంట పండించారు. గట్టి పోటీ ఉన్న పరిస్థితుల్లో ధర విషయంలో కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది వచ్చిన విధంగానే సరాసరి వచ్చేలా కృషిచేస్తాం. కర్నాటకలో ఆక్షన్ పూర్తి కాగానే, ఇక్కడ ధర పెరిగే అవకాశం ఉంది. – సీహెచ్ యశ్వంత్‌కుమార్, చైర్మన్ , వర్జీనియా పొగాకు బోర్డు -
30న శ్రీవారి క్షేత్రంలో ఉగాది వేడుకలు
ద్వారకాతిరుమల: నూతన సంవత్సరాది పర్వదినానికి శ్రీవారి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈ ఏడాది ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సోమవారం స్థానిక ఉగాది మండపానికి రంగులు వేసే పనులను ప్రారంభించారు. అలాగే మండప పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్నారు. ఈనెల 30న విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు సాయంత్రం 6 గంటలకు ఉభయ దేవేరులతో శ్రీవారు ఆలయం నుంచి వెండి శేష వాహనంపై ఊరేగింపుగా మండపం వద్దకు వెళ్తారు. అక్కడ మండపంలో ఏర్పాటు చేసిన సింహాసనంపై కొలువై భక్తులకు దర్శనమిస్తారు. అనంతరం అర్చకులు, పండితులు పంచాంగ శ్రవణము జరుపుతారు. ఆ తరువాత పండిత సత్కారం, తీర్థప్రసాద వినియోగం జరుగుతుందని, భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ సత్యన్నారాయణ మూర్తి కోరారు. పసల కృష్ణభారతి యువతకు ఆదర్శనీయం తాడేపల్లిగూడెం అర్బన్ : గాంధేయవాది, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణ భారతి నేటి యువతరానికి ఆదర్శనీయమని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కృష్ణభారతి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మిల రెండో కుమార్తె కృష్ణభారతి తల్లిదండ్రుల అడుగుజాడల్లో పయనించి స్వాతంత్య్ర సమరయోధురాలిగా నిలిచారని అన్నారు. ఆమె వృద్ధాశ్రమాలను స్థాపించి నిరాశ్రయులైన వృద్ధులకు తోడుగా నిలిచి సేవా తత్పరత కలిగిన మహిళగా ప్రసిద్ధి పొందారని మాజీ మంత్రి కొట్టు తెలిపారు. ఆమె కుటుంబం తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. కృష్ణభారతి కుటుంబంతో తమకు బంధుత్వం ఉందని గుర్తు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కృష్ణభారతి పోషించిన కీలక పాత్రను తెలుసుకుని ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వయంగా ఆమె పాదాలకు నమస్కరించడం ఆమె ఔన్నత్యానికి నిదర్శనమన్నారు. కృష్ణభారతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
సాహసమే ఊపిరిగా..
ఎండల నుంచి కార్మికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి దెందులూరు: వారి సాహసం ఎంతో మందికి ఊపిరి పోస్తుంది. ఆపదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణం పోస్తుంది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వరదలు, తుపానుల్లో చిక్కుకున్న వారిని కాపాడి రియల్ హిరోలుగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రియాక్షన్ ఫోర్స్ (ఏపీఎస్డీఆర్ఎఫ్) బృందాలు. రాష్ట్రంలో 2016 మార్చి 24న ఈ సంస్థ ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. మెరికలు లాంటి శిక్షణ పొందిన పోలీసులు ఎంతోమందిని రక్షించి ప్రశంసలందుకుంటున్నారు. 324 మంది ప్రాణాలు నిలిపారు జిల్లాలో 9 ఏళ్లలో సంభవించిన విపత్తుల్లో అతిపెద్ద విపత్తు బుడమేరు వరదలు. ఏలూరు జిల్లా నూజివీడు సమీపంలో బుడమేరు వరదల్లో ఇన్స్పెక్టర జనరల్ అసిస్టెంట్ కమాండెంట్ రాజకుమారి నాయకత్వంలో 37 బోట్లతో, 12 బృందాలు, 21 ప్రాంతాల్లో రెస్క్యూ చేశారు. జిల్లాలో 9 ఏళ్లలో ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాహసోపేత రెస్క్యూల ద్వారా 324 మందిని కాపాడారు. 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 5 వేల మందికి ఆహారం, తాగునీరు అందించారు. వివిధ రకాల 54 జంతువులను రక్షించారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 42 మృతదేహాలను వెలికి తీశారు. యువతకు స్ఫూర్తి యుద్ధభూమిలో సైనికులు, వరదలు తుపానులలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విధి నిర్వహణ యువతకు స్ఫూర్తిదాయకం. చరిత్ర ఉన్నంతకాలం వారి ధైర్యం, సేవ, అంకితభావం కీర్తింపబడుతూనే ఉంటాయి. – డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర మాజీ హోం మంత్రి విపత్తుల్లో బృందాల సేవలు కీలకం విపత్తుల సమయంలో బృందాల సేవలు స్ఫూర్తిదాయకం. సమిష్టి కృషితో విపత్తుల సమయంలో నష్ట ప్రభావాన్ని తగ్గించారు. ప్రాణాలను కాపాడటం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం అందించడం, మృతదేహాల వెలికితేత వంటి సేవలతో ఏపీఎన్డీఆర్ఎఫ్ కీర్తి ప్రతిష్టలను దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశారు. – రాజకుమారి ఇన్స్పెక్టర్ జనరల్, ఏపీ ఎన్డీఆర్ఎఫ్ ●ఏలూరు (టూటౌన్): అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఉప కార్మిక కమిషనర్ పి.శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ కమిషనరు, విజయవాడ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు సోమవారం కార్మిక శాఖ కార్యాలయంలో హీట్ వేవ్స్‌పై సమావేశం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ అధిక ఉష్ణోగ్రతల నుంచి కార్మికుల రక్షణకు యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. కార్మికులకు పని సమయంలో చల్లటి తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచాలన్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కార్మికులు/ఉద్యోగుల పని గంటలను రీ–షెడ్యూలింగ్ చేయాలన్నారు. ఓఆర్ఎస్ ఐవి ద్రవా లు వంటి అత్యవసర మందులు, ప్రథమ చికిత్స కిట్లు పని ప్రదేశాల్లో అందుబాటులో ఉంచాలన్నారు. గది ఉష్ణోగ్రతను తగ్గించడానికి నీరు తాగడం, విండో షేడ్స్ ఉపయోగించడం, ఫ్యానింగ్, క్రాస్ వెంటిలేషన్ వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాస్ డాంగే, ఆర్కే డబ్ల్యూసి రత్నబాబు, షేక్ షరీఫ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్విడి ప్రసాద్, ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, మదర్ థెరిస్సా బిల్డింగ్ వర్కర్స్, ఐఎఫ్టీయూ, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, దుకాణాలు, సంస్థల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. -
ఆ పార్టీలను మట్టిలో కలిపేస్తాం
యలమంచిలి: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మనుగడ లేకుండా మట్టిలో కలుపుతామని పీవీ రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మాపు సూర్యవరప్రసాదరావు హెచ్చరించారు. ఆయన ఆధ్వర్యంలో సోమవారం యలమంచిలిలో మాల మహానాడు సమావేశం నిర్వహించారు. ముందుగా బాబా సాహెబ్ డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుమ్మాపు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు మాలలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరగదని తెలిసి కూడా రాజ్యాంగ విరుద్ధమైన పనులకు మద్దతు ఇవ్వడమంటే, కేవలం ఓటు బ్యాంకు రాజకీయ పరమైన కుట్ర అని ఆరోపించారు. రాష్ట్రంలో అన్నదమ్ములుగా కలిసి ఉన్న మాల, మాదిగలను విడగొట్టాలని 1997–98లో నారా చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. అప్పుడు మాలల పంతం చంద్రబాబు అంతం అనే నినాదంతో ఆ రోజు అధికారం కోల్పోవటం జరిగిందన్నారు. ఆ సంఘటన మర్చిపోయి మళ్లీ కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చి కేవలం మాలలను కించపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. పూర్తిగా అవాస్తవంతో కూడిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను రద్దు చేసి, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో త్రిసభ్య కమిటీ వేసి విచారణ చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణను నిలిపివేసి ప్రస్తుతం పెరిగిన జనాభా నిష్పత్తి ప్రకారం 15 శాతం ఉన్న రిజర్వేషన్ శాతాన్ని 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా యలమంచిలి మండల యూత్ విభాగం అధ్యక్షుడుగా జల్లి అనిల్‌ను నియమించి నియామాకపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పితాని పుష్పరాజ్, రాష్ట్ర లీగల్ అడ్వైజర్ కార్యదర్శి బండి సుందరరామూర్తి, నియోజకవర్గ కన్వీనర్ బుంగా జయరాజ్, ఎస్సీ ఉద్యోగుల సంఘం మండల నాయకులు ముడకల గోపాలరావు, బొంద బుజ్జిబాబు, కప్పల బన్నీ, సోడగిరి ప్రదీప్, జల్లి విజయరాజు, రాపాక సుధీర్, తోట ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణపై పీవీ రావు మాల మహానాడు ధ్వజం -
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో సంచలనం రేకెత్తించిన వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసుబాబు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదని, వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు తేల్చారు. బోసుబాబు భార్య శాంతికుమారి తనకు మేనమామ వరుసైన సొంగా గోపాలరావుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి జీలుగుమిల్లి సీఐ బి. వెంకటేశ్వరరావు, ఎస్సై నవీన్‌కుమార్ సోమవారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. భర్త పెట్టే బాధలు భరించలేక గంధం బోసుబాబు భార్య శాంతికుమారి, తన మేనమామ వరుసైన గోపాలరావు వివాహానికి ముందే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇరువురి పెద్దలు అంగీకరించకపోవడంతో వీరిద్దరూ వేర్వేరు వివాహాలు చేసుకున్నారు. వివాహమైన అనంతరం శాంతికుమారి తన భర్తకు తెలియకుండా గోపాలరావుతో వివాహేతర సంబంధం కొనసాగించింది. బోసు ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా చేసే సమయంలో వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని శాంతికుమారిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఎన్నికల సమయంలో బెట్టింగ్‌లు కట్టి డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలయ్యాడు. అంతేకాకుండా భార్య శాంతికుమారి వద్ద ఉన్న డబ్బులు కూడా బలవంతంగా తీసుకున్నాడు. తరచూ తనను హింసించడంతో భర్త బోసుబాబు అడ్డు తొలగించాలని శాంతికుమారి, గోపాలరావు నిర్ణయించుకున్నారు. సమయం కోసం ఎదురు చూస్తుండగా జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో జరిగిన అవకతవకలపై పత్రికలో వచ్చిన కథనాలను ఆమె భర్త బోసు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయమై అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు బోసును ఫోన్లో బెదిరించిన కాల్ రికార్డ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సమయంలో తన భర్త బోసుబాబును ఏం చేసినా అది చిర్రి వెంకటేశ్వరరావు మీదకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ నెల 17వ తేదీ శాంతికుమారి గోపాలరావును రాత్రి ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టింది. తర్వాత బోసు, పిల్లలు ఇంటి పోర్షన్ బయట వరండాలో పడుకుని పూర్తిగా నిద్రలోకి వెళ్లిన తర్వాత శాంతికుమారి సాయంతో గోపాలరావు తనతోపాటు తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో బోసు తలపై కుడి వైపున ఇనుపరాడ్డుతో బలంగా కొట్టాడు. తర్వాత అక్కడి నుంచి గోపాలరావు ఆ రాడ్డుతో పారిపోయాడు. ఈ ఘటనపై ఈనెల 18వ తేదీన తమకు అందిన ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయగా భర్త బోసు పెట్టే బాధలు భరించలేకే శాంతికుమారి, గోపాలరావు వివాహేతర సంబంధం కొనసాగించేందుకు ఈ హత్య చేసినట్లు ముద్దాయిలిద్దరూ అంగీకరించారని సీఐ తెలిపారు. అలాగే హత్యకు ఉపయోగించిన ఇనుపరాడ్డును, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఈ కేసు దర్యాప్తుకు సహకరించిన కై కలూరు రూరల్ సీఐ, పోలవరం, గణపవరం సీఐలు, చాట్రాయి, ముదినేపల్లి, కొయ్యలగూడెం ఎస్సైలు, సర్కిల్ సిబ్బందిని ఎస్పీ అభినందించినట్లు తెలిపారు. బోసుబాబు హత్యకేసును ఛేదించిన పోలీసులు కేసుకు సంబంధించి ఇద్దరి అరెస్ట్ -
10 వేల మందికి క్యాన్సర్ టీకాలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు 10 వేల మంది విద్యార్థులకు టీకాలు వేయించనున్నట్టు రోటరీ (3020) జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక వైఎంహెచ్ఏ హాల్లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోట రీ ఆధ్వర్యంలో వైద్య కళాశాలలో తల్లిపాల స్టోరేజీ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. పోలియో నిర్మూలనకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. గత రెండేళ్లలో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. క్లబ్ అధ్యక్షుడు ఎన్జీవీ స్వామి మాట్లాడుతూ రోటరీ సేవలు మరింత విస్తృతం చేయనున్నామన్నారు. అన్నార్తులకు, దివ్యాంగులకు ఆహారం అందజేస్తామన్నారు. స్థానిక సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ సెంటర్లో రోటరీ పీస్ టవర్ నిర్మాణానికి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ దాకారపు కృష్ణ, జిల్లా సెక్రటరీ కల్యాణ్‌రాజు, రోటరీ పీడీజీ డాక్టర్ పి.దామోదర్ రెడ్డి, డాక్టర్ లలిత పాల్గొన్నారు. 26న జాబ్‌మేళా బుట్టాయగూడెం : ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. బుట్టాయగూడెం ప్రభు త్వ జూనియర్ కళాశాలలో మేళా జరుగుతుందని ప్రిన్సిపాల్ జి.కుసుమ ప్రకటనలో తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. 150 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. పదో తరగతి ఆపై చదివి 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. అభ్యర్థులు బ యోడేటా, సర్టిఫికెట్ల నకళ్లతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ 9492582007, 9666322032 నంబర్లలో సంప్రదించాలని కోరారు. పీజీఆర్ఎస్ వికేంద్రీకరణ ఏలూరు(మెట్రో) : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం మండల, డివిజనల్, మున్సిపల్, జిల్లా స్థాయిలో కూడా నిర్వహించనున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి పోలవరం పర్యటన ఈనెల 27న ఉన్న నేపథ్యంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సోమవారం పోలవరంలో ఏర్పాట్ల పరిశీలనలో ఉంటారన్నారు. అయినా ఏలూరు కలెక్టరేట్లో జిల్లాస్థాయి అధికారులు ప్రజల నుంచి పీజీఆర్ఎస్లో అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారని డీఆర్వో పేర్కొన్నారు. గ్రంథాలయాలకు సెస్ బకాయిలు చెల్లించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా గ్రంథాలయ సంస్థకు ఏలూరు నగరపాలక సంస్థ చెల్లించాల్సిన సుమారు రూ.11 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఆర్టీఐ కార్యకర్త కాపల్లి విజయ మారుతి హరినాథరాజు ఆదివారం ప్రకటనలో డిమాండ్ చేశారు. స్థానిక సంస్థలు ప్రజల నుంచి సెస్సులు వసూలు చేస్తున్నా వాటిలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వా టా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన బకాయిల కోసం అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు. దీనిపై తాను లోకాయుక్తను ఆశ్రయించగా నగరపాలక సంస్థ కమిషనర్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసిందన్నారు. దీనికి స్పందించిన కమిషనర్ తక్షణమే జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.20 లక్షలు చెల్లించారని పేర్కొన్నారు. అలాగే జిల్లాలోని అన్ని స్థానిక సంస్థలూ జిల్లా గ్రంథాలయ సంస్థకు బకాయి ఉన్న సెస్ వాటాను వెంటనే చెల్లించాలని కోరారు. ప్రశాంతంగా ఉల్లాస్ పరీక్షలు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 27 మండలాల్లో ఆదివారం ఉల్లాస్ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 7,321 మందికి 7,261 మంది పరీక్షకు హాజరయ్యారని, 99.18 శాతం హాజరు నమోదైనట్టు వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ జీసీహెచ్ ప్రభాకర్ రావు తెలిపారు. పీఎం ఇంటర్న్‌షిప్‌నకు దరఖాస్తుల ఆహ్వానంభీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కోసం నిరుద్యోగులు ఈనెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికై న వారికి రాష్ట్రంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో 550 పరిశ్రమల్లో శిక్షణ ఇస్తారన్నారు. -
ట్రిపుల్ఐటీ చదువులు.. పేద కుటుంబాల్లో వెలుగులు
పేద విద్యార్థులకు వైఎస్సార్ వరం నూజివీడు క్యాంపస్‌లో 2008 బ్యాచ్ విద్యార్థుల మనోగతం ముగిసిన మొదటి బ్యాచ్ ఉద్యోగుల సమ్మేళనం వారంతా పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తేనే కుటుంబ జీవనం సాగుతుంది. ప్రతిభ ఉన్నా ఆర్థిక సహకారం లేక అందుబాటులో ఉన్న విద్యతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదే సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీలు వారి జీవితాలను పూర్తిగా మార్చేశాయి. పేద వర్గాలకు చెందిన ప్రతిభ గల విద్యార్థులకు చేయందించి.. ఆరేళ్లపాటు రూపాయి ఖర్చు లేకుండా సమీకృత ఇంజనీరింగ్ విద్యను అందించడంతో దానిని అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కొలువులు సాధించారు. దీంతో ఒకప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉన్న వారంతా నేడు పేదరికంలో నుంచి బయటకు వచ్చారు. ఇదంతా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏర్పాటు చేసిన ట్రిపుల్‌ఐటీల వల్లే సాధ్యమైందని పూర్వ విద్యార్థులు ముక్తకంఠంతో చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన తొలి బ్యాచ్ 2008–14 విద్యార్థుల సమ్మేళనం ఆదివారం కూడా ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు నాటి తమ పరిస్థితులను వివరించారు. – నూజివీడు వైఎస్సార్‌ని మరువలేం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మా సొంతూరు. ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాళ్లం. కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. ట్రిపుల్‌ఐటీలో ఈసీఈ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశా. ఆ తర్వాత జేఎన్టీయూ హైదరాబాద్‌లో ఎంటెక్ పూర్తి చేశా. 2018లో ఎస్సైగా ఎంపికయ్యా. ఇప్పుడు తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్నా. సొంతూరిలో ఇల్లు కట్టుకున్నా. ఆనందంగా బతుకుతున్నాం. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని జీవితంలో మరిచిపోలేం. – చారీ రాంబాబుకొత్త ఇల్లు కట్టుకున్నాం ప్రకాశం జిల్లా దొనకొండ మండలం భూమానపల్లి మా సొంతూరు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లేవారు. రెక్కాడితేనే గానీ డొక్కాడని కుటుంబం మాది. 2008లో ట్రిపుల్‌ఐటీలో సీటు రావడంతో అక్కడే సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2017లో మున్సిపాలిటీలో ఏఈఈ ఉద్యోగం వచ్చింది. దీంతో మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త ఇల్లు కూడా కట్టుకున్నాం. ట్రిపుల్‌ఐటీలో చదువుకోవడం వల్లే మా పేద కుటుంబంలో మార్పు వచ్చింది. – మురికిపూడి మరియదాసు ఫీజు కట్టలేని కుటుంబం మాది.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం భోగోలు మా ఊరు. పూరింట్లో ఉండేవాళ్లం. అమ్మానాన్న కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ఐటీ అనేది ఒకటి ఉందనే విషయమే తెలియదు. దరఖాస్తు చేయకుండానే సీటు వచ్చింది చేరమంటూ కాల్ లెటర్ వచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. 2020లో ఆర్ఎస్సైగా ఉద్యోగం వచ్చింది. మంచి ఇల్లు కట్టి అమ్మానాన్నలకు బహుమతిగా ఇచ్చా. ట్రిపుల్ఐటీ లేకపోతే మా తల్లిదండ్రులు బయటి కాలేజీల్లో చదివించేవారే కాదేమో. – తాడేపల్లి మౌనిక -
మంత్రి ఇలాకా.. పారిశుద్ధ్యం ఇలాగా..?
నూజివీడు పట్టణంలో పారిశుద్ధ్యం అడుగడుగునా అధ్వానంగా తయారైంది. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమే కాకుండా, ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్‌గా ఉండగా పారిశుద్ధ్యం ఇలాగేనా ఉండేదని పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు దాదాపు 150 మంది ఉన్నా పారిశుద్ధ్యం దిగజారుతోంది. రోజుకు 30 టన్నుల చెత్త నూజివీడులో ఉత్పత్తి అవుతుండగా, ఆదివారం వస్తే కేవలం కొన్ని ప్రధాన రహదారుల్లోని చెత్తను మాత్రమే తొలగిస్తూ మిగిలిన పట్టణమంతా వదిలేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి నెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర అంటూ ప్రచారార్భాటం తప్పితే క్షేత్రస్థాయిలో మాత్రం జరిగేది శూన్యమనే విమర్శలు వినిపిస్తున్నాయి. పన్నుల వసూళ్లపై చూపుతున్న శ్రద్ధను మున్సిపల్ అధికారులు పారిశుద్ధ్యం మెరుగుపరచడంలో చూపించడం లేదని ప్రజలు వాపోతున్నారు. – నూజివీడు -
కాపులపై కూటమివివక్ష
కాపు ఐక్యవేదికలో ధ్వజమెత్తిన నేతలు తణుకు అర్బన్: కాపుల ఓట్లతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం కాపులపై కుల వివక్ష, సవతితల్లి ప్రేమను చూపిస్తోందని కాపు ఐక్య వేదిక రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ జె.నాగబాబు, ఉత్తరాంధ్ర తెలగ సంఘం చైర్మన్ పి.వెంకట రామారావు విమర్శించారు. ఆదివారం పైడిపర్రు కాపు కల్యాణమండపంలో కాపు ఐక్య వేదిక చైర్మన్ రాలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2024 ఎన్నికల ముందు ఏదోరకంగా అందలమెక్కాలనే ఉద్దేశంతో పవన్‌కల్యాణ్‌ను అడ్డం పెట్టుకుని కాపుల భావోద్వేగాలను రెచ్చగొట్టి 95 శాతం కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నా రు. అయితే నేడు కాపుల ప్రయోజనాలను పూర్తిగా గాలికొదిలేసి కుల వివక్షను చూపిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం కాపుల ప్రయోజనాలకు సంబంధించి ఏ ఒక్క నిర్ణయం తీసుకోకుండా కుల వివక్ష చూపిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.3 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇటీవల బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమన్నారు. హై కోర్టు కాపుల విషయంలో సమర్థించిన జీఓ 30 అ మలు చేయాలని, మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాల కు కేటాయించిట్టుగా 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లను బ్రాహ్మణ, క్ష త్రి య, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి కులాల్లో పేదల కు కొనసాగిస్తే సమన్యాయం జరుగు తుందన్నా రు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి వర్గాల ప్రయోజనాలను, ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని పే ర్కొన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులపై అవలంబిస్తున్న వైఖరిని వీడాలని కోరారు. -
సంరక్షించి.. సాగరంలో విడిచి..
నరసాపురం రూరల్: సంతానోత్పత్తి కోసం నరసాపురం మండలం చినమైనవానిలంక ప్రాంతానికి వచ్చి ఆలివ్ రెడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టగా.. గుడ్లను సంరక్షించి పొదిగిన తర్వాత 34 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర ప్రాంతాల్లో కనిపించే ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఆహార అన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తున్నాయి. అలా వచ్చి తీరంలో గుడ్లు పెడుతుండగా అటవీ శాఖ అధికారులు వాటిని సంరక్షిస్తున్నారు. ఫిబ్రవరి 3న తొలిసారిగా గుర్తించిన తాబేళ్ల గుడ్ల నుంచి పిల్లలు బయటకు రాగా ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సముద్రంలోకి విడిచి పెట్టారు. సంరక్షణ కేంద్రంలో ఇప్పటివరకూ 135 తాబేళ్లు పెట్టిన 14,300 గుడ్లు సేకరించి భద్రపరిచినట్టు సిబ్బంది తెలిపారు. తాబేలు పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టే కార్యక్రమంలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ కె.రాంప్రసాద్, తాబేళ్ల సంరక్షణా పునరుత్పత్తి కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. సముద్రంలోకి వెళుతున్న తాబేలు పిల్లలు సముద్రంలోకి ఆలివ్ రిడ్లే తాబేళ్లు తొలిసారిగా 34 తాబేలు పిల్లల విడుదల -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ నెల 13తో అమ్మవారి జాతర మహోత్సవాలు ముగిసినప్పటికీ ఈ నెల చివరి వరకు భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఆదివారం కావడంతో సమీప జిల్లాల నుంచి భక్తులు అమ్మను దర్శించుకున్నారు. వేడి నైవేద్యాలు సమర్పించారు. జాతరకు ఏర్పాటు చేసిన చలువ పందిళ్లలో భక్తులు వంటలు చేసుకుని భోజనాలు చేశారు. దేవస్థానంలో శ్రీక్యూశ్రీ లైన్లు నిండాయి. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్కరోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండనశాల, పెద్ద, చిన్న తీర్ధాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, చిత్రపటాల అమ్మకం, అమ్మవారికి కానుకల ద్వారా రూ.2,92,056 ఆదాయం వచ్చిందని తెలిపారు. అంబేడ్కర్‌ను అవమానించిన వారిని శిక్షించాలి గణపవరం: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మాలమహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం గణపవరం మండలం పిప్పరలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాలమహానాడు జాతీయాధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలు మేధావిగా కొనియాడిన బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించడం భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు. పేద, దళిత, నిమ్న జాతుల గుండెల్లో కొలువైఉన్న అంబేడ్కర్‌ను ఎవరు అవమానించినా సహించేదిలేదన్నారు. దళితుల మధ్య ఉన్న ఐక్యతను చెడగొట్టి వారి మధ్య విభేదాలు సృష్టించడానికి పాలకులు చేస్తున్న ప్రయత్నాల కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు చోడదాసి జైపాల్, సబ్బితిరాజు, నీతిపూడి వెంకటేశ్వర్లు, ప్రసన్నకుమార్, వెన్నపుచంటి, బీర త్రిమూర్తులు, సారధి, మోహనరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు. -
హైవే మొబైల్ వెహికల్స్‌కు జీపీఆర్ఎస్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసు శాఖలోని హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ అమర్చినట్లు ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లాలో రహదారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని.. ఈ నేపథ్యంలో సిబ్బంది సేవలను మరింత సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు జీపీఆర్ఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏలూరు జిల్లాలోని 8 హైవే మొబైల్ వాహనాలకు జీపీఆర్ఎస్ ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ హైవే మొబైల్ వాహనాలను పర్యవేక్షించటంతోపాటు ఏదైనా అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేలా అవకాశం లభిస్తుందని డీఎస్పీ చెప్పారు. సిబ్బందికి రేడియం జాకెట్లు, బేటన్స్ అందజేశామని, మరింత సౌకర్యాలు కల్పిస్తూ విధులు సక్రమంగా నిర్వర్తించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. జాతీయ రహదారుల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం, మితిమీరిన వేగంతో వెళ్ళే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపట్టేలా శ్రద్ద వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఏదైనా అత్యవసర సమయాల్లో హైవే మొబైల్, పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 83329 59175 లేదా డయల్ 112కు ఫోన్ చేయాలని ఏలూరు డీఎస్పీ సూచించారు. బెల్టు షాపు నిర్వాహకుడి అరెస్ట్ పెనుగొండ: మండలంలోని తామరాడలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.మణికంఠ రెడ్డి తెలిపారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో గుబ్బల జ్ఞానేశ్వరరావు(50)ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. దాడుల్లో ఎస్సై ఆర్ మధుబాబు, హెచ్‌సీ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ నాగరాజు పాల్గొన్నారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు ప్రదానం
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగగుంట గ్రామానికి చెందిన బోనగిరి రమేష్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఆర్యవైశ్య సంఘంలో కీలకంగా వ్యవహరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న రమేష్ సేవలను గుర్తించి, ఈ అవార్డు ప్రదానం చేశారు. 48 మద్యం సీసాల స్వాధీనం ఆగిరిపల్లి: అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శుభశేఖర్ తెలిపారు. మండలంలోని తోటపల్లిలో ఆరేపల్లి వేణుగోపాల్ అనే వ్యక్తి అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నాడనే సమాచారంతో ఆదివారం సిబ్బందితో కలిసి దాడి చేసి అతని వద్ద ఉన్న 48 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాట్నాలమ్మకు రూ.1,26,343 ఆదాయం పెదవేగి: భక్తుల తాకిడితో రాట్నాలమ్మ అమ్మవారి దేవస్థానం కిటకిటలాడింది. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన రాట్నాలమ్మ తల్లికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుంలతో రూ.60,850, విరాళాలుగా రూ.36,493, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.27,000, ఫొటోల అమ్మకం వల్ల రూ.2,000 ఆదాయం లభించగా, మొత్తం ఆదాయం రూ.1,26,343 లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు. -
నిట్‌లో ఉత్సాహంగా మారథాన్
తాడేపల్లిగూడెం (టీఓసీ): పరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఏపీ నిట్ డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ డాక్టర్ కె.హిమబిందు సూచించారు. నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణారావు ఆధ్వర్యంలో సంస్థలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లబ్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మారథాన్ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం, పరుగు, నడక, యోగా వంటివి ఎంతగానో దోహదం చేస్తాయని వీటి సాధన కోసం విద్యార్థులు నిత్యం కొంత సమయాన్ని కేటాయించాలని వివరించారు. అనంతరం నిట్ ముఖద్వారం నుంచి బాలికల వసతి గృహాల వరకు, అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిట్ ముఖద్వారం వరకు మారథాన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ టి.జగన్మోహన్రావు, శారదా ప్రసన్న మాలిక్, సుశాంత్ కుమార్, బెహారా తదితరులు పాల్గొన్నారు. -
రికవరీ ఏజెన్సీల మాఫియా?
తీగలాగితే డొంక కదిలింది ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతంలోని ఒక సచివాలయంలో పనిచేస్తున్న మహిళా పోలీసుకు ఫోన్ కాల్ వచ్చింది. తాను ఏలూరు నుంచి సీఐ నాగరాజును మాట్లాడుతున్నానని.. చింతలపూడిలోని ఒక వ్యక్తికి చెందిన ఆధార్, పాన్‌కార్డ్ అతని పూర్తి వివరాలు వాట్సప్‌లో ఇవ్వాలని చెప్పాడు. ఆమెకు అనుమానం రావడంతో ఏలూరులోని పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తీగ లాగితే.. మొత్తం డొంక కదిలింది. ఏలూరు శాంతినగర్‌లో థర్డ్ పార్టీ ఏజెన్సీ పేరుతో ఒక కార్యాలయాన్ని నడుపుతున్న ముఠా దొరికింది. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీసీఎస్ పోలీసులు, ఏలూరు త్రీటౌన్ పోలీసులు కార్యాలయంపై మూడు రోజుల క్రితం దాడి చేశారు. పత్తేబాద రోడ్డులోనూ ఇదే తరహా ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయాన్ని పోలీసులు తనిఖీ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు ఏజెన్సీ మాఫియా ఫైనాన్స్ కంపెనీలు రుణాల రికవరీకి థర్డ్‌పార్టీ ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో ఏలూరు కేంద్రంగా ప్రైవేటు ఏజెన్సీ మాఫియా జనాలను పోలీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ ఏజెన్సీలో ఏలూరుకు చెందిన ఆరుగురు వ్యక్తులు, తిరుపతికి చెందిన ఇద్దరు, బెంగుళూరుకు చెందిన మరో ఇద్దరు కీలక పాత్రధారులుగా ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన గడ్డం కిషోర్ అలియాస్ నాగరాజు, మధ్యాహ్నపు వంశీకృష్ణ, ప్రవీణ్‌కుమార్, రియాజ్, వెంకట్, ఇబ్రహీం, మరో నలుగురిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ ఏజెన్సీ ముఠాలో 10 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో ప్రజల వ్యక్తిగత సమాచారం? ప్రైవేటు ఏజెన్సీల పేరుతో సాగుతున్న దందాతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుల పేరుతో ఏకంగా సచివాలయ ఉద్యోగులను సైతం ప్రభావితం చేస్తూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం చూస్తే .. వ్యక్తిగత గోప్యత ప్రమాదంలో పడినట్లవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నకిలీ పోలీసులే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారా ? లేక నిజంగానే ఎవరైనా పోలీస్ అధికారులు ఈ ఏజెన్సీలకు అండగా నిలుస్తున్నారా? అనేది సందేహంగా మారింది. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో ప్రైవేటు ఏజెన్సీల ఆగడాలు సాగుతున్నా పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు. దుగ్గిరాల ప్రాంతానికి చెందిన కలగంటి గోవింద్ కొంతకాలం క్రితం ప్రైవేటు ఫైనాన్స్‌లో రుణం తీసుకున్నాడు. ఇటీవల అతనికి రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఏజెన్సీ వ్యక్తులు అతడిని కలిసి నీకు బీమా వస్తుంది.. కొంత కడితే ఇంక లోన్ కట్టాల్సిన పనిలేదని కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకున్నారు. కొద్దిరోజుల క్రితం థర్డ్‌పార్టీ ఏజెన్సీ పేరుతో సీఐ అంటూ ఫోన్ చేసి డబ్బులు కట్టాలని, రూ.1.80 లక్షలు చెల్లించకుంటే చెక్‌బౌన్స్ కేసు నమోదు చేస్తామని, అల్లరి చేస్తామని, బెయిల్ కూడా రాదంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఏలూరు టౌన్: ఏలూరు పత్తేబాద ప్రాంతానికి చెందిన రామసీత ఒక ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో పర్సనల్ లోన్ తీసుకున్నారు. నాలుగేళ్లుగా కడుతూ ఉండగా ఆరు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో బకాయి పడింది. రామసీతకు ఇటీవల ఒక ఫోన్ వచ్చింది. అమరావతి నుంచి సీఐను మాట్లాడుతున్నాను. మీపై హైకోర్టులో కేసు వేస్తున్నారు. మీ ఇంటికి గంటలో పోలీసు జీపు వస్తుంది. మిమ్మల్ని చెక్‌బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ బెదిరించారు. కొంతసేపటి తర్వాత పత్తేబాద సచివాలయానికి చెందిన ఒక మహిళా పోలీసు (మహిళా సంరక్షణ కార్యదర్శి) రామసీత ఇంటికి వచ్చి మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారని.. మీపై చెక్‌బౌన్స్ కేసు పెట్టారని.. వెంటనే సంబంధిత ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుకుని బకాయి డబ్బులు కట్టకపోతే.. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తాం.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసుల పేరుతో భయభ్రాంతులు సచివాలయ సిబ్బందిని వినియోగిస్త్తున్న వైనం ఏలూరులో రెండు చోట్ల తాత్కాలిక ఆఫీసులు? 9 మందిపై కేసు నమోదు -
ట్రిపుల్ఐటీతోనే ఈ స్థాయికి..
కాకినాడ రూరల్ మండ లం పోలవరం మా ఊరు. మేము నలుగురం అ న్న దమ్ములం. తల్లిదండ్రు లు కూలి పనులకు వెళ్లేవారు. ట్రిపుల్ ఐటీలో ఉ చితంగా చదువుకునే అవకాశం రావడం వల్ల నే నొక్కడినే చదువుకున్నాను. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశా. 2015 నుంచి కోరమాండల్ కంపెనీలో మేనేజర్‌గా చేస్తున్నా. కొత్త ఇల్లు కట్టుకోవడంతో పాటు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నా. –కర్రి కోటేశ్వరరావు వైఎస్సార్‌కు రుణపడి ఉంటాం ప్రకాశం జిల్లా కొత్తపట్న ం మండలం బీరంగుంట మా ఊరు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులకు వెళ్తేనే ఇల్లు గడిచేది. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి 2016 నుంచి కన్యాకుమారిలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో ఇంజనీర్‌గా చేస్తున్నా. తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నా. ట్రిపుల్ఐటీ లేకపోతే ఏ డిగ్రీనో చదివి ఉండేవాడిని. వైఎస్సార్‌కు రుణపడి ఉంటా. –మద్దా సురేష్ -
చోరీ కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: ఆశా వర్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. చిన్నంవారిగూడెం గ్రామానికి చెందిన ఏలేటి రాణి అదే గ్రామంలో ఆశా వర్కర్‌గా పనిచేస్తుంది. ఈనెల 18న ఉదయం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా.. తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించింది. వెంటనే బీరువా వెతకగా, బీరువాలో ఉంచిన 4 కాసుల బంగారం కనబడలేదని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఇంటి పక్కనే ఉన్న ఇద్దరిపై అనుమానం ఉన్నట్లు ఫిర్యాదుతో పేర్కొన్నారని, ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కండక్టర్‌పై దాడి, కేసు నమోదు జంగారెడ్డిగూడెం: ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై దాడి చేసిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న కోనా ప్రసాద్ శనివారం మధ్యాహ్నం జంగారెడ్డిగూడెం – తాడేపల్లిగూడెం సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జంగారెడ్డిగూడెం నుంచి కొయ్యలగూడెం వెళ్లేందుకు బస్సు ఎక్కిన జల్లి ప్రవీణ్‌కుమార్‌ను టిక్కెట్ అడిగారు. కండక్టర్ టిక్కెట్‌కు సరిపడా చిల్లర ఇమ్మని ప్రవీణ్‌కుమార్‌కు సూచించారు. దీంతో ప్రవీణ్‌కుమార్ కండక్టర్‌ను దుర్భాషలాడుతూ క్యాష్‌బ్యాగ్ లాక్కొని, కొట్టడంతో పాటు, బస్సులోని రాడ్డుకు కండక్టర్‌ను కొట్టాడు. దీంతో కండక్టర్‌కు గాయాలయ్యాయి. కండక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చేతల్లిగా వరాలిచ్చే అమ్మగా పేరుపొందడంతో మంగమ్మగుడికి వచ్చే భక్తుల సంఖ్య ప్రతీ వారం పెరుగుతూనే ఉంది. ఈ నెల 14 నుంచి 16 వరకూ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. దర్శనానికి సుమారు 3 గంటల సమయం పట్టింది. క్యూలో నిలుచున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. 26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్‌మేళా కై కలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు. జాబ్‌మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కై కలూరు నేషనల్ స్కూల్, నవతా రోడ్డు ట్రాన్స్‌పోర్టు కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18–35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు. నాటు సారా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ చింతలపూడి: నాగిరెడ్డిగూడెం గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున నాటుసారా రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. చాట్రాయి మండలం కొత్తగూడెంకు చెందిన ముల్లంగి శ్రీనివాసరావు, ముల్లంగి రామేశ్వరం బైక్‌పై నాటుసారా రవాణా చేస్తుండగా 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ పి.అశోక్ తెలిపారు. తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్సైలు ఆర్వీఎల్ నరసింహారావు, అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్టీసీకి స్పెషల్ ఆదాయం
భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ గత ఐదేళ్లుగా మంచి ఆదాయంతో దూసుకుపోతోంది. పండుగలకు, తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తోంది. జిల్లాలోని భీమవరం, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల నుంచి ఏటా సంక్రాంతి, దసరా పండగలతోపాటు కార్తీక మాసంలో, అరుణాచలం తదితర తీర్థ యాత్రలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. టికెట్ ధరలు పెంచకుండా సాధారణ ధరలకే ఈ ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా ప్రజలకు ఆర్టీసీ బాగా చేరువైంది. రికార్డు స్థాయిలో ఆదాయం గత ఐదేళ్లుగా ఆర్టీసీ మంచి ఆదాయాన్ని సాధించింది. 2020లో ఏడాదికి రూ.48 లక్షల ఆదాయం సాధించగా.. 2024 నాటికి ఏడాదికి రూ.కోటి ఆదాయం ఆర్జించే స్థాయికి చేరింది. ఏటా సంక్రాంతికి ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి జిల్లాకు.. జిల్లా నుంచి హైదరాబాద్‌కు పది రోజుల పాటు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి రికార్డు స్థాయిలో రూ.99 లక్షల ఆదాయాన్ని సాధించింది. ఈ ఏడాది పంచారామాల ప్రత్యేక బస్సు సర్వీసులు నాటికి ఆర్టీసీ ఆదాయం రూ.1.50 కోట్లు దాటనుంది. ప్రైవేటు బస్సుల దందాకు చెక్ పండుగ సీజన్లు తీర్థయాత్రలకు ప్రైవేటు బస్సుల యాజమాన్యం ఇష్టానుసారంగా టిక్కెట్ ధరలు పెంచి ప్రజలను దోపిడీ చేసేవి. దాంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులతో టిక్కెట్ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ప్రత్యేక బస్సుల ఏర్పాటుతో ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. వారు కోరుకున్న తీర్థయాత్రలకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు వల్ల ప్రైవేటు బస్సుల టిక్కెట్ దందాకు చెక్ పెట్టారు. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల ద్వారా గత 5 ఏళ్ల నుంచి రూ.5 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా విపత్తు రెండేళ్లలో కూడా సంక్రాంతి, దసరా, ఇతర తీర్థ యాత్రలకు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపారు. ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ద్వారా రూ.5 కోట్ల రాబడి ఈ ఏడాది సంక్రాంతికి రూ.99.30 లక్షల ఆదాయం పండగలు, యాత్రలకు ప్రత్యేక సర్వీసులతో ప్రైవేటు దందాకు చెక్గత ఐదేళ్లలో ప్రత్యేక సర్వీసుల ఆదాయం ఏడాది సంక్రాంతికి ఇతర సర్వీసులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) 2020 36.93 11.80 2021 36.88 28 2022 54.62 30 2023 60 35 2024 70 40 2025 99.51ప్రత్యేక బస్సులతో మంచి ఆదాయం పండగలు, తీర్థ యాత్రలకు, దైవ దర్శనాలకు జిల్లాలోని 4 డిపోల నుంచి ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక సర్వీసుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా ఆర్టీసిని జిల్లా ప్రజలకు మరింత చేరువ చేసేలా టిక్కెట్ ధరలు పెంచకుండానే అన్ని పండుగలకు బస్సులు ఏర్పాటు చేసి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నాం. సంక్రాంతి, దసరా పండుగలకు హైదరాబాద్ నుంచి జిల్లాకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం. ఎన్వీఆర్ వర ప్రసాద్, జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి -
నీటి సమస్యను సమష్టిగా అధిగమించాలి
పెదవేగి: సమాజం నీటి సమస్యను ఎదుర్కొంటుందని దీనిని సమష్టి కృషితో అధిగమించాలని ఏలూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.కె.వి.బులి కృష్ణ అన్నారు. శనివారం పెదవేగి మండలం వంగూరు ఉన్నత పాఠశాలలో జాతీయ నీటి దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి బులి కృష్ణ మాట్లాడుతూ ఇంకుడు గుంటలు నిర్మించడం, చెరువుల పునరుద్ధరణ తదితర చర్యలతో నీటి సమస్యను అధిగమించవచ్చని చెప్పారు. ఏలూరు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి.రచన మాట్లాడుతూ గ్రామాల్లో అక్కడక్కడ బాల్య వివాహాలు జరుగుతున్నాయని ఈ సమస్యను సమూలంగా నిర్మించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.రాజరాజేశ్వరి తేజస్వి, తణుకు మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్.రంజిత్ కుమార్, పాలకొల్లు రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి.వి.ఎన్.ఎల్.లావణ్య తదితరులు పాల్గొన్నారు. -
నిషేధిత మందులు.. యథేచ్ఛగా అమ్మకాలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధిత మందుల అక్రమాలపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. పక్కా సమాచారంతో ఏకకాలంలో దాడులు చేయగా.. ఊహించని స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులు, గర్భవిచ్ఛిత్తి, మత్తు కలిగించే మందులు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. ● జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అధికారుల దాడులు ● లైంగిక సామర్థ్యం పెంచే మందులు భారీ ఎత్తున సీజ్ ● కాలం చెల్లిన మందులపై స్టిక్కర్లు అంటించి విక్రయాలు తణుకు అర్బన్: జిల్లాలో పలు మందుల దుకాణాల్లో నిషేధిక డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారంతో జరిపిన దాడుల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. ఈ నెల 21న తణుకు నియోజకవర్గంలో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించగా.. నిషేధిత మందులతో పాటు.. కాలం చెల్లిన మందులకు స్టిక్కర్లు అంటించి అమ్ముతున్న వైనం వెలుగుచూసింది. ఈ నిషేధిత మందుల్లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులతోపాటు మత్తు కలిగించేవి, గర్భస్రావం మందులున్నాయి. తణుకు నియోజకవర్గంలోని అత్తిలిలో సత్యకృష్ణ మందుల దుకాణంలో నిషేధిత మందులతోపాటు కాలం చెల్లిన మందుల నిల్వను అధికారులు కనుగొన్నారు. ఈ దుకాణాన్ని మూసివేసి లైసెన్స్ రద్దుకు సిఫార్సు చేశారు. తణుకులోని తంగిరాల వారివీధిలో పెంజర్ల నాగేశ్వరరావు కొంతకాలంగా నిషేధిత మందుల్ని రావులపాలెం నుంచి కొని స్థానికంగా అధిక ధరలకు అమ్మడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించి దాడి చేసి పట్టుకున్నారు. అధిక శాతం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల విక్రయాలు తణుకు పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయని విక్రయదారుడు తెలపడం విశేషం. నాగేశ్వరరావు తణుకులోని పలు దుకాణాలకు ఈ మందులు సరఫరా చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తాడేపల్లిగూడెం, తణుకు, అత్తిలి, ఏలూరులో పలు దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిషేధిత మందుల విక్రయాలకు సంబంధించి రూ.కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. నరసాపురం డివిజన్లో సుమారుగా 800, భీమవరం డివిజన్లో 600కు పైగా మందుల దుకాణాలు ఉన్నాయి., కొన్ని దుకాణాల్లో నిషేధిత మందులు విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దాడుల విషయం తెలియడంతో అక్రమార్కులు జాగ్రత్త పడిపోయారు. తణుకులో ఒక ఇంట్లో నిషేధిత మందులు విక్రయాలకు సంబంధించి సుమారు రూ.6 లక్షల వరకు మందులు కొనుగోలు చేసినట్లు తెలిసింది. రావులపాలెంకు చెందిన బచ్చు సుబ్బారావు బ్యాంకు ఖాతాకు ఫోన్ పే ద్వారా పంపినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సేకరించారు. నిషేధిత మందులతో ఆరోగ్యంపై ప్రభావం లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందుల వల్ల గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు, ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ మందు అధిక వాడకం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంటుంది. గర్భస్రావం కోసం ఉపయోగించే మందులు ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తాయని, భవిష్యత్తులో తీవ్రం ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. మత్తు మందుల వాడకంతో కొన్నాళ్లకు నరాల సమస్యలు, నిద్రలేమి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఔషధ నియంత్రణ శాఖ నిర్లక్ష్యం విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగితే తప్ప నిషేధిత మందుల వినియోగంపై ఔషధ నియంత్రణ శాఖ పర్యవేక్షణ లేకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ దుకాణంలో ఏ మందులు ఉన్నాయి.. ఏ దుకాణంలో నిబంధనలు పాటిస్తున్నారనే విషయంపై ఔషధ నియంత్రణ శాఖ అధికారులకు స్పష్టత ఉంటుంది. కొన్ని రకాల కారణాలతో దాడులు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఔషధ నియంత్రణ శాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షించి తరచూ దుకాణాలపై దాడులు చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
భీమడోలు : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పులదండ వేసి అవమానపర్చిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం రాత్రి దళిత నాయకులు కొవ్వొత్తులు పట్టుకుని నిరసన తెలిపారు. తొలుత భీమడోలు సంత మార్కెట్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి దళిత నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో దళిత నాయకుల పైడిమాల యుగంధర్, తుమ్మల శాంతభూషణం, గోగులమూడి రవికుమార్, మద్దాల వెంకటరత్నం, కాలి కిరణ్, రత్తయ్య, బెంజిమన్, డి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరులో.. ఏలూరు (టూటౌన్): అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలని ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక నరసింహారావుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం రాత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో అంబేడ్కర్‌ను అవమానించడం విచారించదగ్గ విషయం అన్నారు. దూబచర్ల వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. నాయకులు ఎన్.కార్తీక్, బి.నాగరాజు, పాము మాన్ సింగ్, అంబటి నాగేంద్ర, కె.మురళీ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దెందులూరు మండలంలో.. దెందులూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేయడంపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఫారెస్ట్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు గొల్ల కిరణ్, దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ కన్వీనర్ పొలిమేర హరికృష్ణ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తనగాల శేఖర్ తీవ్రంగా ఖండించారు. 48 గంటల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. -
మద్యంషాపు ఏర్పాటుపై మండిపాటు
నరసాపురం: నరసాపురంలోని 26వ వార్డు వీవర్స్ కాలనీలో మద్యం షాపు ఏర్పాటును శనివారం స్థానికులు అడ్డుకున్నారు. కల్లుగీత కార్మికుల కోటాలో షాపును వీవర్స్ కాలనీలో ఇళ్ల మధ్య ఏర్పాటు చేసే యత్నం చేశారు. షాపును ప్రారంభానికి సిద్ధం చేస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు. కాలనీలో ఇళ్ల మధ్య బ్రాందీ షాపు పెడితే ఎలాగని ప్రశ్నంచారు. కాలనీలో రోడ్డుపై మహిళలు తిరగలేరని, చిన్న పిల్లలు ఆడుకునే గ్రౌండ్ వద్ద షాపు ఎలా పెడతారని నిలదీశారు. మహిళల ఆందోళనతో నిర్వాహకులు షాపు ఏర్పాటు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. -
ఏరులై పారుతున్న మద్యం
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎకై ్సజ్ అధికారులు దాడులు చేస్తున్నా.. మద్యం అక్రమ విక్రయాలను నియంత్రించలేపోతున్నారు. మరో వైపు కూటమి నేతల సాయంతో బెల్టు షాపుల ఏర్పాటు చేసి జోరుగా విక్రయాలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 2025 జనవరి 1 నుంచి మార్చి 15 వరకు అక్రమ అమ్మకాలపై ఏకంగా 899 కేసులు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఏడు ఎకై ్సజ్ సర్కిళ్ల పరిధిలో 144 మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలపై భారీగా కేసులు నమోదయ్యాయి. 315 ఐడీ కేసుల్లో 324 మంది, 157 బెల్లపు ఊట కేసుల్లో 44 మంది, 345 బెల్టు షాపులపై కేసుల్లో 348 మంది, 50 ఎన్డీపీఎల్ కేసుల్లో 51 మంది, 28 ఇతర కేసుల్లో 28 మందిపై కేసులు నమోదు చేశారు. 42 వాహనాలను ఎకై ్సజ్ పోలీసులు సీజ్ చేశారు. ఏడు ఎకై ్సజ్ సర్కిళ్లలో ఇలా.. జిల్లాలోని ఏడు సర్కిళ్ల పరిధిలో భీమడోలు, ఏలూరు సర్కిళ్లలో తక్కువ కేసులు నమోదయ్యాయి. చింతలపూడి సర్కిల్లో 256 కేసులు నమోదు చేశారు. నూజివీడు సర్కిల్లో 203 కేసులు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 124 కేసులు, పోలవరం 121, కై కలూరు సర్కిల్లో 77 కేసులు నమోదు చేశారు. బెల్టుషాపుల విషయానికొస్తే కై కలూరులో 70, నూజివీడు 50, చింతలపూడి సర్కిల్ పరిధిలో 52 కేసులు నమోదు చేశారు. బెల్లపుఊటకు సంబంధించి చింతలపూడిలో 52 కేసుల్లో 59 వేల లీటర్లు ధ్వంసం చేయగా.. పోలవరం సర్కిల్లో 47,800 లీటర్లు, నూజివీడు సర్కిల్లో 45,310 లీటర్లు, జంగారెడ్డిగూడెం సర్కిల్లో 15,320 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేశారు. చింతలపూడి పరిధిలో 15 వాహనాలు, నూజివీడులో 16 వాహనాలు, పోలవరం 6, జంగారెడ్డిగూడెం 4, ఏలూరులో ఒక్క వాహనాన్ని సీజ్ చేశారు. నిబంధనలు పాటించాలి అక్రమంగా మద్యం విక్రయించినా.. నిబంధనలు పాటించకపోయినా కేసులు నమోదు చేస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో సారా తయారీపై నిఘా ఉంచి దాడులు చేస్తున్నాం. మూడు నెలల్లో భారీగా కేసులు నమోదు చేశాం. – ఆవులయ్య, ఎకై ్సజ్ అధికారి, ఏలూరు 899 కేసుల్లో 799 మంది అరెస్ట్ బెల్టు షాపులపై 345 కేసులు -
బెల్టు షాపులను అరికట్టలేని ప్రభుత్వం
భీమవరం: రాష్ట్రంలో బెల్టుషాపులను అరికట్ట లేని కూటమి ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తోందని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి దుయ్యబట్టారు. శనివారం భీమ వరం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన కల్లుగీత సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా లో 70 వేలకుపైగా బెల్టుషాపులు ఉన్నాయని, గోవా, యానాం నుంచి అక్రమ మద్యం వస్తుండటంతో తాటి కల్లు ఉనికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గీత కార్మికుల పరిస్థితి మ రింత అధ్వానంగా మారిందన్నారు. కల్లు గీత వృత్తిలో మార్పు తెచ్చి గీత కుటుంబాలకు ఉ పాధి కల్పించి ఆదుకోవాలన్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతోనే బెల్ట్ షాపులు నిర్వహించ డం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లా సంఘం అధ్యక్షుడు కామన మునిస్వామి మాట్లాడుతూ బెల్ట్ షాపులు, అక్రమ మద్యం అరికట్టలేని ఎక్సైజ్‌శాఖ గీత కార్మికుల ఇళ్లపై దాడులు చేయడం సిగ్గుచేటన్నారు. -
ప్రతిభ చూపిన సిబ్బందికి ప్రశంసలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహల పర్యాటక ప్రాంతంలో ఐదేళ్ల క్రితం బాలికపై హత్యాచారం, ప్రియుడిపై దాడి కేసులో పోలీసులు ప్రతిభ చూపి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేశారని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. ఏలూరు పోక్సో కోర్టు న్యాయమూర్తి నలుగురు నిందితులకు జీవిత కాల ఖైదు విధించారు. ఈ నేపథ్యంలో శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఈ కేసులో ప్రతిభ చాటిన వారిని ఎస్పీ అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చేయటంలో అధికారులు, సిబ్బంది చూపించిన శ్రద్ధ, చిత్తశుద్ధిని ఆయన అభినందించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ యూ.రవిచంద్ర, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, భీమడోలు సీఐ యూజే విల్సన్, జంగారెడ్డిగూడెం సీఐ బీ.కృష్ణబాబు, తడికలపూడి ఎస్సై చెన్నారావు, టీ.నరసాపురం ఎస్సై కే.విజయబాబు, ఏలూరు మహిళా స్టేషన్ సీఐ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్చార్జ్ ఎం.సుబ్బారావు, తడికలపూడి కోర్టు కానిస్టేబుల్ కేపీవీడీఎన్ కొండలరావు, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ ఎం.శ్రీనివాస్, మహిళా హెడ్ కానిస్టేబుల్ ఎం.వెంకటరమణ, కానిస్టేబుల్ టీ.రవికుమార్‌ను అభినందించారు. -
బోసు కుటుంబానికి అండగా ఉంటాం
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మృతికి కారకులైన వారిని పట్టుకుని పోలీసులు కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాటాకులగూడెంలో బోస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బోసు మృతి వైఎస్సార్సీపీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. విషయాన్ని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు బోదా శ్రీనివాసరెడ్డి, బుట్టాయగూడెం మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. గడ్డి ట్రాక్టర్ దగ్ధం కామవరపుకోట: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో గడ్డి ట్రాక్టర్ దగ్ధమైన ఘటన తడికలపూడిలో శనివారం చోటుచేసుకుంది. ఏడీఎఫ్ వి.రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం నిడమర్రు మండలం మందలపర్రు గ్రామానికి చెందిన సీహెచ్ లక్ష్మికి చెందిన ట్రాక్టర్ ఉదయం గడ్డి లోడుతో మందలపర్రులో బయలుదేరి తడికలపూడికి వచ్చింది. మధ్యాహ్న భోజనం చేసేందుకు పెట్రోల్ బంక్ సమీపంలో ట్రాక్టర్ పెట్టి కూలీలు, డ్రైవరు వెళ్ళగా, పైనున్న విద్యుత్ తీగలు గడ్డికి తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు ఏలూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు. డీఏ ఎరియర్లు చెల్లించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన డీఏ ఎరియర్లు వెంటనే చెల్లించాలని ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బకాయిలు రూ. 6200 కోట్లు చెల్లించాలని నిర్ణయించటం హర్షణీయమని.. ఉద్యోగుల నుంచి మినహాయించిన పీఎఫ్, ఏపీజీఎల్ఐ డబ్బులు, సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్, సరెండర్ లీవ్ బకాయిలను మాత్రమే చెల్లించి బకాయిలు చెల్లించామంటే సరిపోదన్నారు. ఇంతవరకు నిధి పోర్టల్‌లో ఒక్క ఎరియర్ బిల్ ఎనేబుల్ చేయలేదని, ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ఆదివారం.. ఆమె కోసం..
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025●మనసున మనసై.. ● వారాంతాల్లో విరామంతో ఇల్లాలికి ఉపశమనం ● ఇంటి పనుల్లో భర్త భాగస్వామ్యం అవసరం ● ఇద్దరి మధ్య బలమైన బంధానికి పునాది ● వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్ అంటున్న మానసిక నిపుణులు భార్యకు విశ్రాంతి అవసరం భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం. – చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు ఆయనకు సెలవొస్తే.. మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం. – అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం తప్పనిసరిగా సహకరించాలి ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషీగా ఫీల్ కాకూడదు. – కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం ఇంటి పనుల్లో సాయపడతాను నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. – పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు ప్రయోజనాలెన్నో.. ● ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్‌తో ఆ ఇంట హ్యాపీనెస్ లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ● ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది. ● ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది. ● సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. ● ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. ● ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు. సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్‌లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం. భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. కుటుంబానికి చేదోడుగా.. భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూ చిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు. న్యూస్రీల్ఏమేం చేయాలంటే.. ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వా రికి స్నానాలు చేయించడం, హోంవర్క్‌లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి. -
కోకో కొనుగోలు కోసం ధర్నాలు
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీల్లో మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. చొదిమెళ్లలో నాయకులు శనివారం పర్యటించారు. ధర్నా, రాస్తారోకోలను జయప్రదం చేయాలని రైతులను కోరారు. కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యలపై ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిగినా కోకో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సంఘ బదిలీలు, పదోన్నతుల చట్టం ఏకపక్షం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అవమానించడమే అని వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ పాయింట్ ఏడాదికి ఒకటి కావాలని అడిగినా 0.5 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రిటైర్మెంట్కు మూడేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయించాలని కోరినా అధికారులు రెండేళ్లు ఉన్నవారికి మాత్రమే మి నహాయింపు ఇచ్చారన్నారు. జీఓ 117 రద్దుతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 10 వేలు మిగులు చూపుతారని, అలాంటప్పుడు ఎస్జీటీలకు పదోన్న తులు ఎక్కడ కల్పిస్తారని ప్రశ్నించారు. పలు ప్రాథమిక పాఠశాలల మూతకు రంగం సిద్ధమైందని, భవిష్యత్తులో ఎస్జీటీ టీచర్ల నియామకం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 117 రద్దుతో అపకారమే ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఏలూరు(మెట్రో): జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపి, యువతకు ఉద్యోగా వకాశాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు వివరాలు సేకరించాలని, వచ్చేఏడాది మార్చిలోపు 7 వేల యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్ర భాకర్, సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. నిధుల దుర్వినియోగంపై విచారణ ఉంగుటూరు: కాగుపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రెండోసారి శనివారం విచారణ జరిగింది. నూజివీడు డీఎల్పీఓ కార్యాలయంలో డీఎల్పీఓ విచారణ చేయగా ఆరోపణలకు బాధ్యులు సర్పంచ్ కడియాల సుదీష్ణ, కార్యదర్శి, దుర్గాధర్, పూర్వ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీదేవి, ఆరోపణలు చేసిన వార్డు సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శి బాలకృష్ణ రూ.1.42 లక్షలు, కార్యదర్శి శ్రీదేవి రూ.6.35 లక్షలు, సర్పంచి సుదీష్ణ రూ.7.77 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్టు నోటీసులో తెలిపారు. టెన్త్ పరీక్షలకు 4,399 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 సంస్కృతం పరీక్షలకు 4,398 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,388 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 18 మందికి 11 మంది హాజరయ్యారు. జిల్లాలోని 40 కేంద్రాలను అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చే సినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. రుణాల దరఖాస్తులకు గడువు పెంపు ఏలూరు (టూటౌన్): జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారన్నారు. అధికారులు ఈ మేరకు దర ఖాస్తులు స్వీకరించాలన్నారు. -
నేరాల నిరోధానికి పటిష్ట చర్యలు
ఏలూరు టౌన్: జిల్లాలో నేరాలను నిరోధించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, నేరస్తులపై నిరంత నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం పోలీస్ సబ్ డివిజన్ల పరిధిలో కేసుల పురోగతిపై సమీక్షించారు. జిల్లాలో వ్యాపార సముదాయాలు, ఆలయాలు, అపార్ట్మెంట్లు, ముఖ్య కూడళ్లు, కాలేజీలు తదితర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలనీ, వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. కోడిపందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డీఎస్పీలు డి.శ్రావణ్‌కుమార్, ఎం.వెంకటేశ్వరరావు, యు.రవిచంద్ర, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ -
మట్టి టిప్పర్ కనిపిస్తే సీజ్
కై కలూరు: కై కలూరు నియోజకవర్గంలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టి రవాణాపై ‘సాక్షి’లో ప్రచురించిన ‘కూటమి మట్టి మాఫియా’ కథనానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులు, విలేకరులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో బుసక మట్టితో టిప్పర్ తిరిగితే వెంటనే కేసులు నమోదు చేసి సీజ్ చేయాలని రెవెన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు. బోర్డర్లలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయిస్తామన్నారు. తన కుమారుడు టిప్పర్ పంపినా చర్యలు తీసుకోవాలని అన్నారు. గృహ అవసరాలకు ట్రాక్టర్లతో మట్టి తరలించవచ్చని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, తహసీల్దార్లు పాల్గొన్నారు. అలాగే కొల్లేరు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఎమ్మెల్యే కామినేని అన్నారు. కొల్లేరు అభయారణ్యంలో డీ ఫాం, జిరాయితీ భూములు 22 వేల ఎకరాలను మినహాయించి 55 వేల ఎకరాల్లో అభయారణ్యాన్ని నిర్ణయించాలని ప్రభు త్వాన్ని కోరుతున్నామన్నారు. -
కొల్లేరులో ఆక్రమణదారులకు నోటీసులు
ఖండ్రిక కాలువ ప్రక్షాళనకు ప్రతిపాదనలు నిడమర్రు: కొల్లేరు అభయా రణ్య పరిధిలో అక్రమ ఆక్వా సాగుపై శనివారం ‘సాక్షి’లో ప్రచురించిన ‘కొల్లేరు అభయారణ్యం.. ఆక్రమణలే సర్వం’ శీర్షికన కథనానికి జిల్లా అటవీ శాఖ అధికారులు స్పందించా రు. జిల్లా అటవీ శాఖ అధికారి (వన్యప్రాణి యాజమాన్యం) డి.విజయ దేవరగోపవరంలో 5వ కాంటూరులోపు అక్రమ సాగు చేస్తున్న ఆక్వా చెరువులు, విద్యుత్ తీగలు, బోర్లను పరిశీలించారు. బహిరంగంగా విద్యుత్ తీగలు కనిపిస్తున్నా ఏం చేస్తున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్ చేస్తామని సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు రైతులతో మాట్లాడారు. పెదనిండ్రకొలను నుంచి దేవరగోవపరం మీదుగా కొల్లేరులో కలిసేలా 2.5 కిలోమీటర్లు మేర ఖండ్రిక పంట కాలువ రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పెదనిండ్రకొలను గ్రామ పరిధిలో కాలువ ఆక్రమణలు లేవని, దేవరగోపవరం 5వ కాంటూరు పరిధి నుంచి ఆక్రమణలు ఉన్నట్లు నిర్ధారించారు. సుమారు కిలోమీటరు మేర ఖండ్రిక పంట కాలువ తొమ్మిది ఆక్వా చెరువుల మధ్యలో ఉన్నట్టు గుర్తించారు. ఆయా చెరువుల నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్టు తహసీల్దార్ నాగరాజు తెలిపారు. ఆక్రమిత పంట కాలువ 5వ కాంటూరు పరిధిలో ఉండటంతో కాలువ ప్రక్షాళనకు ప్రభుత్వ అనుమతి కోరడంతోపాటు కాలువ తవ్వేందుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదించిన రూ.11.80 లక్షల నిధులు మంజూరు చేసేలా నివేదిక పంపుతామన్నారు. ఏలూరు రేంజర్ అధికారి మోహిని విజయలక్ష్మి, అటవీ సిబ్బంది ఉన్నారు. -
ఆ చిన్నారుల చదువుకు వీధి లైట్లే దిక్కు
● ఇళ్ల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు ● పట్టాలిచ్చినా కట్టుకునే స్థోమత లేక అవస్థలు ● దయ చూపండని బాఽధితులు, పిల్లల మొర సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆకివీడులోని అమృతరావు కాలనీకి చేర్చి శ్మశాన భూమికి మధ్య ఆక్రమణలను తొ లగించడంతో బాధితులు వీధిన పడ్డారు. వారి పిల్ల లు వీధి దీపాల కింద చదువుకోవాల్సిన దుస్థితి నె లకొంది. 30 ఏళ్లుగా శ్మశానానికి ఆనుకుని పూరి పా కలు, పందిళ్లు వేసుకుని సుమారు 29 కుటుంబాల వారు జీవిస్తున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాలతో రెవె న్యూ అధికారులు ఆక్రమణలను తొలగించారు. గత ప్రభుత్వంలోనే 22 మంది బాధితులకు పట్టాలు ఇచ్చారు. తమకు ఇల్లు కట్టుకునే స్థోమత లేదని బా ధితులు ఆక్రమణల నుంచి వైదొలగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్రమణలను ఖాళీ చే యించారు. ఆక్రమణదారులు ఆయా పంచల్లోనే కా లం గడుపుతున్నారు. తాము ఇల్లు నిర్మించుకునే స్థితిలో లేమని చెప్పడంతో ఆయా పట్టాలను వేరొకరికి మార్పు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వమే తమకు ఇల్లు నిర్మించి ఇ వ్వాలని కోరుతున్నారు. 30 ఏళ్లుగా వర్షాలు, ముంపు నీటిలోనే జీవనం గడిపామని, పాములు, క్రిమికీటకాలతో పాటు, శవ దహనాల ఎదురుగా భోజ నాలు చేశామని, నిద్రపోయామని వాపోతున్నారు. వీధి దీపాల కింద చదువులు : 29 బాధిత కుటుంబాల్లో సుమారు వంద మందికి పైగా ఉన్నారు. వా రిలో సుమారు 25 నుంచి 30 మంది వరకు పిల్లలుండగా చాలా మంది ఆరు నుంచి పదో తరగతి చ దువుతున్నవారే. వీరంతా గూడు లేక, చదువుకునేందుకు ఆస్కారం లేక వీధి దీపాల కింద చదువుకుంటూ కాలం గడుపుతున్నారు. ఒక పక్క దోమలు, మరో పక్క ఉక్కబెట్టే వాతావరణంలో అల్లాడిపోతున్నారు. రోడ్లపై పడుకుంటూ, వీధిలైట్ల వెలుగులో చదువుకుంటు న్నా అధికారులకు, పాలకులకు కనికరం లేదని ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకునేందుకు కూ టమి ప్రభుత్వం ముందుకు వస్తుందని ఆశించామని, ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా పట్టించుకోలేదని పిల్లలు, వృద్ధులు, మహిళలు వాపోతున్నారు. రెండు మూడు తరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామని, వైఎస్ జగన్ ప్రభుత్వంలో తమకు పట్టాలిచ్చారని చెబుతున్నారు. ఇల్లు నిర్మించుకునేందుకు కూటమి ప్రభుత్వం రూ.4 లక్షలు ఇస్తానని ప్రకటించడంతో ఆశగా ఎదురు చూశామని, అవి కాస్తా ఆవిరయ్యాయని ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా వీధి దీపాల కింద పిల్లలు చదు వు కుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే రఘు రామకృష్ణంరాజు స్థానిక పార్టీ నేతలను పంపించి విషయం బయటికి రాకుండా సద్దుమణిచే ప్రయ త్నం చేయడం గమనార్హం -
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. – ఆకివీడు -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్‌పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్‌పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు. -
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
హ్యాండ్‌బాల్ రాష్ట్ర విజేత పశ్చిమగోదావరి
విజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి అండర్–19 జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా సత్తా చాటింది. ఈ నెల 20న విజయవాడలోని ఆంధ్రా లయోల కాలేజీలో ప్రారంభమైన ఈ పోటీలకు 12 ఉమ్మడి జిల్లాలు ప్రాతినిధ్యం వహించాయి. లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు వరుస విజయాలను సాధించింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో ప్రత్యర్థి తూర్పుగోదావరి జిల్లా జట్టును ఓడించి విన్నర్ ట్రోఫీని అందుకుంది. విజేతలకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లేశ్వరరావు, లయోల కాలేజీ వ్యాయామ విద్యా విభాగాధిపతి డాక్టర్ కె.సుజాత ట్రోఫీలు అందజేశారు. -
ముగిసిన ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్
భీమవరం: స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్లో నిర్వహించిన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నీస్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. 35,45, 55, 65, 75 ఏళ్ల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీలు నిర్వహించారు. 45 ప్లస్ సింగిల్స్‌లో ఎంవీఎల్‌ఎన్ రాజు, 55 ప్లస్ సింగిల్స్‌లో మణిందన్, 65 ప్లస్ డబుల్స్‌లో ఆనందస్వరూప్, శ్రీనివాస్, 65 ప్లస్ సింగిల్స్‌లో వి.శ్రీనివాసరెడ్డి, 70 ప్లస్ సింగిల్స్‌లో సేతు, 70 ప్లస్ డబుల్స్‌లో సన్యాసిరాజు, గజపతి, 75 ప్లస్ డబుల్స్‌లో అశోక్‌రెడ్డి, సాయి రాంబాబు విజేతలుగా నిలిచారు. టోర్నమెంట్ విజేతలకు క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పెన్మెత్స వెంకటరామరాజు, టోర్నమెంట్ సెక్రటరీ వీవీఎస్ సుబ్రహ్మణ్యంరాజు, ఎ.రాంబాబు బహుమతులు అందజేశారు. ల్యాప్‌టాప్‌లు, టచ్ ఫోన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం ఏలూరు (టూటౌన్): అర్హత కలిగిన విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్‌ట్యాప్‌లు, బదిరులకు టచ్ ఫోన్ల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ జిల్లా మేనేజరు బి.రామ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరం, పాలిటెక్నిక్, ఐటీఐ చదివే వారు వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 08812–234146 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీ ఉంగుటూరు: స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో రూ.91 వేలు చోరీకు గురైంది. ఇంటి పన్నులు, కుళాయి పన్నులు వసూలు చేసిన బీరువాలో పెట్టి తాళం వేశారు. అయితే గురువారం ఉదయం ఆఫీసు తీసేసరికి బీరువా తాళం పగలగొట్టి ఉండడంతో పంచాయతీ కార్యదర్శి పరిశీలించి చోరీ జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్మాప్తు చేస్తున్నామని ఎస్సై సూర్యభగవాన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా ఏలూరు (టూటౌన్): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 24, 25 తేదీల్లో తలపెట్టిన ఉద్యోగుల సమ్మె వాయిదా పడినట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం అధ్యక్షులు డి.శ్రీనివాస్ మోహాన్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఢిల్లీలో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్, ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, డిపార్ట్మ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సెంట్రల్ లేబర్ కమిషన్ మధ్యన శుక్రవారం జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె వాయిదా వేశారని పేర్కొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక
పెదవేగి: మండలంలోని విజయరాయి సీతారామ కల్యాణ మండపంలో శుక్రవారం కోకో రైతుల రాష్ట్ర కమిటీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బొల్లు రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గా కె.శ్రీనివాస్, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బోళ్ల సుబ్బారావు (పశ్చిమగోదావరి), పానుగంటి అచ్యుతరామయ్య (ఏలూరు), ఉప్పుగంటి భాస్కరరావు (కోనసీమ), గుదిబండి బండి వీరారెడ్డి (ఏలూరు), మార్ని శ్రీనివాసరావు (తూర్పుగోదావరి) సహాయ కార్యదర్శులుగా ఉప్పల కాశీ (తూర్పుగోదావరి), కొసరాజు రాధాకష్ణ (ఏలూరు), కొప్పిశెట్టి ఆనంద వెంకటప్రసాద్ (కోనసీమ), కోశాధికారిగా జాస్తి కాశీ బాబు (ఏలూరు) మరో 35 మందితో రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. కోకో రైతుల సమస్యలను పరిష్కరించాలని 24, 25 తేదీల్లో కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. -
బాలిక హత్య కేసులో నలుగురికి జీవిత ఖైదు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా తడికలపూడి మండలం జీలకర్రగూడెంలో గుంటుపల్లి గుహల వద్ద బాలికపై నలుగురు అగంతకులు లైంగికదాడికి పాల్పడి ఆపై హతమార్చిన ఘటనలో నిందితులకు జీవిత ఖైదును విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. శుక్రవారం రాత్రి ఏలూరు పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 24న ఉదయం 11 గంటలకు గుంటుపల్లి గుహల వద్దకు సరదాగా గడిపేందుకు వచ్చిన ప్రేమ జంటపై నలుగురు అగంతుకులు దాడి చేశారు. బాలికపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించిన ప్రియుడిని సైతం దుంగకర్రతో కొట్టి గాయపర్చారు. దీనిపై గుహల ప్రాంతంలో ఆర్కియోలాజికల్ సర్వే సిబ్బంది వడమాల మునిరత్నం ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దోచుకునేందుకు వెళ్లి.. హతమార్చి.. నిందితులను కృష్ణా జిల్లా మైలవరం మండలం చండ్రారం గ్రామానికి చెందిన పొట్నూరి రాజు, ద్వార కాతిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, కృష్ణా జిల్లా నందివాడ మండలం అరిసిలాల గ్రామానికి చెందిన కొమరగిరి నాగరాజుగా గుర్తించారు. వీరు ఒంటరిగా ఉన్న ప్రేమ జంటను గమనించి వారిని దోచుకునేందుకు వెళ్లారు. కత్తి, దుంగకర్రతో ప్రేమ జంట వద్దకు వెళ్లిన వీరు డబ్బులు ఇవ్వాలని లేకుంటే చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో పొట్నూరి రాజు దుంగకర్రతో తీవ్రస్థాయిలో తలపై కొట్టడంతో ప్రియుడు అక్కడే పడిపోయాడు. అనంతరం బాలిక వద్దకు వెళ్లి ఆమె దుస్తులను చించివేసి కర్రతో తలపై బలంగా కొట్టి లైంగికదాడికి పా ల్పడ్డారు. తీవ్ర గాయాలైన ప్రియుడు అపస్మారక స్థితిలోకి వెళ్లగా బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఆరేళ్ల పాటు ఏలూరు పోక్సో కోర్టులో విచారణ కొనసాగింది. జీవిత ఖైదు.. రూ.10 వేల జరిమానా పోక్సో కోర్టు న్యాయమూర్తి సునంద శుక్రవారం తుది తీర్పును వెల్లడించారు. నలుగురు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఐపీసీ 397, 376 (ఎ), సెక్షన్ 4 పోక్సో, 302 ఐపీసీ, 25 (1ఎ) భారతీయ ఆయుధాల చట్టం, 27 భారతీయ ఆయుధ చట్టం మేరకు కఠిన శిక్షలు విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. మృతురాలు తల్లిదండ్రులకు రూ.3 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రియుడు నవీన్‌కుమార్‌కు తగిన పరిహారం అందజేయాలని డీఎల్ఎస్ఏ ఏలూరుకు లేఖ రాశారు. పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనే సీతారామ్ బాధితుల తరఫున వాదించగా అప్పటి చింతలపూడి సీఐ యూజే విల్సన్, మరో సీఐ పి.రాజేష్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసుపై రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. విలేకరుల సమావేశంలో ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ హబీబ్‌బాషా, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, డీసీఆర్బీ ఎస్సై రాజారెడ్డి, తడికలపూడి ఎస్సై చెన్నారావు, ఏపీపీ డీవీ రామాంజనేయులు పాల్గొన్నారు. లైంగికదాడి ఆపై హత్య శిక్ష ఖరారు చేసిన పోక్సో కోర్టు 2019లో గుంటుపల్లి గుహల వద్ద ఘటన -
మెడికల్ షాపులపై దాడులు
తణుకు అర్బన్ : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్స్, ఈగల్, ఔషధ నియంత్రణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో ఉన్న మందుల వివరాలు, నిల్వలు, ఎక్స్పైరీ తేదీలు తదితర అంశాలతోపాటు నిషేధిత మందుల నిల్వలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. విజిలెన్స్ జిల్లా ఎస్పీ శ్రీరామ్‌బాబు ఆదేశాల మేరకు తణుకు పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు చేసినట్లు విజిలెన్స్ ఎస్సై కె.సీతారాం తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తంగిరాల వారి వీధిలోని ఇండియన్ పబ్లిక్ స్కూలు ఎదురుగా ఉన్న భవనం మూడో అంతస్తులో అనధికారికంగా నిల్వ ఉంచిన నిషేధిత మందులను గుర్తించినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యాన్ని పెంచేవి, మత్తునిచ్చేవి, గర్భస్రావం అయ్యేటటువంటి మందులను అనధికారికంగా నిల్వ ఉంచి విక్రయాలు చేస్తున్న పెంజర్ల నాగేశ్వరరావుపై డ్రగ్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ 1940 అండర్ సెక్షన్ 18 సీ ప్రకారం కేసు నమోదు చేసి, అతని నుంచి మందులు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ మందులు తూర్పుగోదావరి జిల్లా రావులపాలేనికి చెందిన బచ్చు వెంకట సుబ్బారావు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అలాగే తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో మరొక మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. దాడుల్లో ఈగల్ సీఐ సూర్య మోహన్‌రావు, సీసీఎస్ సీఐ రాంబాబు, తణుకు డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పి.మల్లికార్జునరావు, విజిలెన్స్ ఏఈ ఎం.అనీల్‌బాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో.. తాడేపల్లిగూడెం : పట్టణంలోని మెడికల్ షాపులపై శుక్రవారం విజిలెన్సు అధికారులు దాడులు చేశారు. పట్టణంలోని పోర్టుగేట్ డ్రగ్ హౌస్‌లో ఈ సోదాలు జరిగాయి. దుకాణం లైసెన్సు, నిషేధిత మందులు ఏమైనా ఉన్నాయా? జీఎస్టీ ఇతర అంశాలపై డ్రగ్స్, పోలీసు అధికారుల సమక్షంలో దాడులు చేశారు. తనిఖీల నేపధ్యంలో పట్టణంలోని మెడికల్ షాపులను మూసివేశారు. విజిలెన్సు సీఐ శివరామకృష్ణ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అబీద్ అలీ, పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అత్తిలిలో.. అత్తిలి : స్థానిక సత్యకృష్ణ మెడికల్ షాపును విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జౌషధ నియంత్రణశాఖ సంయుక్తంగా శుక్రవారం తనిఖీ చేశారు. మెడికల్షాపులో అనుమతి లేని మందులతో పాటు కాలం చెల్లిన మందులను విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించామని భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలీ తెలిపారు. ట్యాబ్లెట్ షీట్లపై ఎక్స్పైరీ డేట్ కట్ చేసి స్టిక్కర్లు వేసి మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి, షాపును మూయించివేశారు. మెడికల్ షాపు లైసెన్సును రద్దు చేస్తామని అలీ చెప్పారు. ఏలూరు జిల్లాలో.. ఏలూరు టౌన్ : ప్రభుత్వ ఆదేశాలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో సంయుక్తంగా ప్రత్యేకంగా నియమితులైన విచారణ అధికారులు మెడికల్ షాపులపై దాడులు చేశారు. ఏలూరు జిల్లాలో నూజివీడు, ఏలూరు, ద్వారకాతిరుమల ప్రాంతాల్లో ఒకేసారి అధికారులు తనిఖీలు చేశారు. ఏలూరు నగరంలోని ఉదయ్ జనరిక్, సద్భావన మెడికల్స్, ద్వారకాతిరుమలలోని సంజీవిని మెడికల్స్, నూజివీడు ప్రాంతంలో సాయి బాలాజీ మెడికల్స్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. మందుల షాపుల్లో అనధికారికంగా మందుల విక్రయాలు, డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల విక్రయాలు, గడువు ముగిసిన మందులను సైతం ఇష్టారాజ్యంగా అమ్ముతున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రికార్డులు సైతం సక్రమంగా లేవని అధికారుల గుర్తించారు. కొన్ని మందుల షాపుల్లో శుక్రవారం రాత్రి వరకూ తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ తనిఖీల్లో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, నూజివీడు రూరల్ సీఐ కె.రామకృష్ణ, విజిలెన్స్ విభాగం సీఐ ప్రసాద్‌కుమార్, ఎస్సై రంజిత్‌కుమార్, నాగరాజు, విజిలెన్స్ డీఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తణుకులో నిషేధిత మందులు స్వాధీనం -
గంగానమ్మ విగ్రహ తొలగింపుతో ఉద్రిక్తత
నూజివీడు : పట్టణంలోని కృష్ణా బడ్డీ కొట్టు సెంటర్లో రావి చె ట్టు వద్ద ఉన్న గంగానమ్మ విగ్రహాలను శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో యడవల్లి రవిచంద్ర(32) అనే అతను గునపంతో తవ్వి ధ్వంసం చేసి పక్కన పడేశాడు. అంతేకాకుండా అక్కడే ఉన్న దేవుడి ఫొటోలను సైతం పక్కన పడేశాడు. ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం కలిగించింది. ఈ విషయం తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వెంటనే స్పందించి యడవల్లి రవిచంద్రను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది తమ సొంత స్థలమని, అందులో ఎవరెవరో వచ్చి విగ్రహాలు పెట్టి తాము ఏర్పాటు చేసిన గుడి అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, అసలు తమ పట్టా భూమిని తాము స్వాధీనం చేసుకోవడానికి తవ్వినట్లు రవిచంద్ర విచారణలో తెలిపాడని సీఐ పి.సత్యశ్రీనివాస్ తెలిపారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణతో పాటు పట్టణానికి చెందిన పలువురు పెద్దలు ఇప్పటివరకు ఎక్కడైతే గంగానమ్మ విగ్రహం ఉందో మళ్లీ అక్కడే విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
5 వేల నీటి కుంటల నిర్మాణం లక్ష్యం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): జిల్లాలో 5 వేల నీటి కుంటల నిర్మాణం లక్ష్యం కాగా ఇప్పటివరకూ 2,389 పనులు మంజూరు చేసినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ప్రపంచ జల దినోత్సవం, పల్లె పండుగ కార్యక్రమంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి హాజరయ్యారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన నీటి కుంటల నిర్మాణాలను జూన్ నెలాఖరు నాటికి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. పంట నీటి కుంటల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయడానికి అధికారులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. జిల్లావ్యాప్తంగా 850 గోకులం షెడ్డులు మంజూరు కాగా ఇప్పటికే 623 పూర్తయి మిగిలినవి పురోగతిలో ఉన్నాయన్నారు. పల్లె పండుగ కింద జిల్లాలో 162.33 కి.మీ. మేర సీసీ రోడ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. పంచాయితీరాజ్ ద్వారా ఇప్పటివరకూ 155.29 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారన్నారు. డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి షేక్ హబీబ్ బాషా, జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, డీపీఓ కె.అనురాధ, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎంవీ రమణమూర్తి పాల్గొన్నారు. -
కొల్లేరు అభయారణ్యం.. ఆరకమణలే సర్వం
నిడమర్రు: కొల్లేరు అభయారణ్య పరిధిలోని నిషేధిత భూముల్లో ఆక్వా సాగు సాగుతోంది. 5వ కాంటూరు పరిధిలోని జిరాయితీ భూముల్లో ఆక్వా సా గు నిషేధం కాగా.. దేవరగోపవరం ఖండ్రిక పరి ధిలో సుమారు 300 ఎకరాల్లో చేపలు, రొయ్యల సా గు యథేచ్ఛగా సాగుతోంది. సాగు చేస్తున్న వారికి ప్రభుత్వ పెద్దలు, అధికారుల మద్దతు ఉన్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయా చెరువులకు బహిరంగంగానే విద్యుత్ కూడా సరఫరా అవుతోంది. కొన్నిచోట్ల అనధికార బోర్లు, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ డ్రెయిన్ల నీటితో చెరువులు నింపుతున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు అంటున్నారు. ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలి కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోకి వచ్చే దేవరగోపవరం ఖండ్రిక కోడును ఆనుకుని గతంలో జిరా యితీ పొలాలు ఉండేవి. కొల్లేరు ప్రక్షాళన అనంతరం ఆ భూములను ఆక్వా చెరువులుగా కొందరు పెద్దలు మార్చేశారు. ఈ క్రమంలో సుమారు 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఖండ్రిక కోడును ఆక్రమించుకుని చెరువుల్లో కలిపేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరులోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో నీరు ఎగదన్ని తమ పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పెదనిండ్రకొలను, దేవరగోపవరం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖండ్రిక కోడును ప్రక్షాళన చేసి తిరిగి ఇరిగేషన్ డ్రెయిన్‌గా మార్చాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా అధికారుల వాదన మరోలా ఉంది. నోటిఫైడ్ డ్రెయిన్లు, నాన్ నోటిఫైడ్ డ్రెయిన్లు 67 ఉండగా వీటిలో ఖండ్రిక కోడు లేదని అంటున్నారు. సదరు డ్రెయిన్‌ను తవ్వాల్సి వస్తే ఇది 5వ కాంటూరు పరిధిలో ఉందని, వన్యప్రాణ సంరక్షణ చట్టం ప్రకారం నేరమని అధికారులు చెబుతున్నారు. యంత్రాలతో తవ్వాలంటే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరని డిప్యూటీసీఎం పవన్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై వివరణలో జిల్లా అధికారులు పేర్కొన్నారు. యథేచ్ఛగా బోర్లు వినియోగం 5వ కాంటూరులో నుంచి విద్యుత్ సరఫరా నిషేధం. అయినా ఇక్కడ ఆక్వా చెరువులకు విద్యుత్ సరఫరా అవుతోంది. చెరువుల వద్దకు నేరుగా తీగల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చెరువుల వద్ద అక్రమ బోర్లు వె లుస్తున్నాయి. ఈ విషయం వన్యప్రాణి సంరక్షణ, అటవీ శాఖ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో అటువైపు చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే అటవీ శాఖ సిబ్బంది చెరువుల వద్దకు వచ్చి విద్యుత్ వైర్లను కట్ చేసి చర్యలు తీసుకున్నట్టు హడావుడి చేస్తున్నారు. మరుసటి రోజే విద్యుత్ తీగలను కలిపి విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆక్రమణదారులు చూసుకుంటున్నారు. విద్యుత్ బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడుతున్నా ఏ శాఖ అధికారులూ కన్నెత్తి చూడటం లేదు. యథేచ్ఛగా ఆక్వా సాగు 5వ కాంటూరులోపు ప్రభుత్వ భూముల కబ్జా! కాలువల నీటిని చెరువుల్లో నింపుతున్నట్టు ఫిర్యాదులు అనధికార బోర్లతో ఆక్వా సాగు కనీసం సర్వే కూడా చేయలేదు ఖండ్రిక కోడు ఆక్రమణలు తొలగించాలని గతేడాది అక్టోబర్‌లో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ఫిర్యాదు చేశాను. ఎగువనున్న రైతులు వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారని, సర్వే చేసి కబ్జాదారుల నుంచి ఖండ్రిక కోడును ప్రభుత్వం స్వాధీ నం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నా. దీనికి ప్రభుత్వ అనుమతి కావాలని ఫిర్యాదుకు వివరణ ఇచ్చారే తప్ప ఇప్పటివరకూ కనీసం సర్వే కూడా చేయలేదు. – తుమ్మూరి శ్రీనివాసు, దేవరగోపవరం -
పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే
20 వేల కిలోమీటర్లు వచ్చి.. గుడ్లు పెట్టి.. తాము జన్మించిన చోటే మళ్లీ గుడ్లు పెట్టే జీవి సముద్ర తాబేలు మాత్రమే. వీటిలో ఎన్ని రకాలున్నా సముద్ర పర్యావరణాన్ని కాపాడటంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు ముఖ్యమైనవి. ఇవి రెండడుగుల వరకు పొడవు, సుమారు 500 కేజీల వర కు బరువు ఉంటాయి. ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఈ తాబేళ్లు ఎక్కువగా జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో కనిపిస్తాయి. జీవితాంతం సముద్రంలో గడిపే ఈ జీవులకు స్థిర నివాసం ఉండదు. కేవలం గుడ్లు పెట్టేందుకు మాత్రమే భూమి మీదకు వస్తాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. ఏటా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఒడిసా, ఆంధ్రప్రదేశ్‌లోని ఒడ్డుకు చేరుకుని ఒక్కో తాబేలు 60 నుంచి 150 గుడ్లు పెట్టి ఎవరూ గుర్తుపట్టకుండా ఇసుకతో కప్పేసి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోతాయి. రాష్ట్రంలోని సూర్యలంక, పలుచోట్ల వీటి సంరక్షణకు గతంలోనే కేంద్రాలను ఏర్పాటుచేశారు. వీటి మాంసానికి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో కొందరు వీటిని వేటాడి మాంసాన్ని అమ్ముతుంటారు. ఇవి అంతరించిపోకుండా సముద్ర తాబేళ్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక జాబితాలో చేర్చి సంరక్షిస్తోంది. సాక్షి, భీమవరం/ నరసాపురం రూరల్: ఉభయ చరజీవుల్లో తాబేళ్లు ఒకటి. తాబేళ్లలో పలురకాలు ఉన్నా ఆలివ్ రిడ్లే రకం వెరీ స్పెషల్. తాబేళ్ల జాతుల్లో ప్రత్యేకమైనవిగా చెప్పుకునే ఆలివ్ రెడ్లీ తమ సంతానోత్పత్తికి పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతాన్ని ఆవాసంగా చేసుకుంటున్నాయి. ఇటీవల దీనిని గుర్తించిన జిల్లా అటవీ శాఖ వాటి గుడ్ల కోసం చినమైనివాలంకలో తొలిసారిగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుచేసింది. ఇప్పటివరకూ 116 తాబేళ్లకు చెందిన 12,341 గుడ్లను సేకరించి వాటి నుంచి పిల్లలు బయటకు వచ్చేందుకు వీలుగా ఇక్కడ భద్రపరిచారు. 19 కిలోమీటర్ల తీరం జిల్లాలోని నరసాపురం మండలం మర్రితిప్ప నుంచి మొగల్తూరు మండలం మోళ్లపర్రు వరకు 19 కి లోమీటర్లు మేర సముద్ర తీరం ఉంది. ఈ ఏడాది జనవరిలో పదుల సంఖ్యలో మృత ఆలివ్ రిడ్లే తాబేళ్లు పెదమైనివానిలంక, చినమైనివానిలంక గ్రామాల్లోని తీరానికి కొట్టుకురావడాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో చినమైనివానిలంక తీరంలోని ఓ చోట తాబేలు గుడ్లు ఉండటాన్ని గుర్తించిన అధికారులు సంతానోత్పత్తికి తాబేళ్లు ఇక్కడికి వస్తున్నాయని నిర్ధారించారు. కుక్కలు, ఇతర జంతువులు, ఆకతాయిలు నుంచి గుడ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ముందుగా గుర్తించిన గుడ్లను తరలించే వీలులేక వాటి రక్షణ కోసం చుట్టూ పొదలను ఏర్పాటుచేశారు. జిల్లాలో తొలిసారిగా.. తాబేళ్ల గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని తొలిసారిగా జిల్లాలోని చినమైనివానిలంక తీరం వద్ద జనవరిలో అటవీశాఖ ఏర్పాటు చేసింది. రోజూ సంరక్షణ కేంద్రం సిబ్బంది తీరం వెంబడి తిరుగుతూ తాబేలు అడుగుల ఆనవాళ్లను బట్టి గుడ్లు పెట్టిన చోటును గుర్తిస్తున్నారు. తాబేలు గుడ్లు పెట్టిన తర్వాత అవి దెబ్బతినకుండా రక్షణ కోసం పైపొరగా వాటిపై రసాయనాలు విడుదల చేస్తుంది. ఈ రక్షణ పొర దెబ్బతినకుండా జాగ్రత్తగా గుడ్ల ను సేకరిస్తున్నారు. సంరక్షణ కేంద్రంలో 10 అంగుళాల లోతులో గుండ్రపు గొయ్యి తీసి వాటిలో 100 నుంచి 150 వరకు గుడ్లను పెట్టి ఇసుకతో కప్పుతున్నారు. గత రెండు నెలల్లో 12,341 గుడ్లు సేకరించి హేచరీలో భద్రపరిచారు. గొయ్యిలోని గుడ్లను ఎప్పుడు సేకరించింది?, ఎన్ని భద్రపరచిందనే వివరాలను గొయ్యి వద్ద స్లిప్పులపై నమోదుచేస్తున్నారు. సహజసిద్ధంగా రెండు నెలల వ్యవధిలో గుడ్ల నుంచి తాబేలు పిల్లలు బయటకు వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. సముద్ర జీవులపై స్థానికులకు అవగాహన కలిగేలా తాబేలు పిల్లలను సముద్రంలో విడిచిపెట్టే కార్యక్రమంలో విద్యార్థులు, స్థానికులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తామన్నారు. కడలి తీరం.. కూర్మాల ఆవాసం సంతానోత్పత్తి కోసం సముద్ర తాబేళ్ల రాక గుర్తించిన అటవీ శాఖ గుడ్ల సంరక్షణకు హేచరీ చినమైనివానిలంక వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటివరకూ 12,341 గుడ్ల సేకరణ తాబేళ్ల సంరక్షణకు చర్యలు పర్యావరణ సమతుల్యతకు సముద్ర జీవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. చినమైనివానిలంక వద్ద తాబేళ్ల గుడ్ల సంరక్షణకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో వాటి రాకకు ఆటంకం కలగకుండా స్థానికులు సహకరించాలి. – చదలవాడ నాగరాణి, కలెక్టర్ రూ.10 లక్షలతో బడ్జెట్ జిల్లాలోని తీర ప్రాంతంలో గుడ్లు పెట్టేందుకు తాబేళ్లు రావడం గుర్తించి తొలిసారిగా సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశాం. రానున్న సీజన్లో లక్షకు పైగా గుడ్లను సంరక్షించే లక్ష్యంతో శాశ్వత సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రూ.10 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. – కిరణ్, జిల్లా అటవీశాఖ అధికారి. -
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: మండలంలోని పెనుమల్లి వద్ద శుక్రవారం ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ గ్రామతులు ఆందోళనకు దిగడంతో రెండు గంటల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వివరాల ప్రకారం మండలంలోని సంఖర్షణపురానికిచెందిన ముత్యాల చక్రవర్తి(32), మరో ఐదుగురు కూలీలతో మినుము నూర్పిడి చేసేందుకు ట్రాక్టర్‌పై కూలి పనికి వెళ్తున్నారు. పెనుమల్లి సమీపానికి వెళ్లగానే మలుపు వద్ద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రమాదం నుంచి ఐదుగురు కూలీలు తప్పించుకోగా ట్రాక్టర్‌పై ఉన్న మినుము నూర్పిడి యంత్రం చక్రవర్తిపై పడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రమాద సమయంలో స్థానికులు ఎవ్వరూ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర గాయాలతో అరగంట సేపు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడాడు. సమాచారం అందుకున్న బంధువులు గుడివాడ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చక్రవర్తి మృతదేహంతో గుడివాడ నుంచి బయల్దేరిన గ్రామస్తులు చక్రవర్తి కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేయాలని నిర్ణయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసు సిబ్బంది గుడివాడ నుంచి వస్తున్న చక్రవర్తి మృతదేహాన్ని జాతీయ రహదారిపై కోడూరు వద్ద అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులకు, పోలీసులకు తీవ్ర వాగ్వివాదం జరిగింది. మృతుడి తరఫు వ్యక్తులకు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తరఫు వ్యక్తులకు మధ్య రాజీ చర్చలు సఫలం కావడంతో ఆందోళన విరమించారు. -
మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టిన దొంగలు
కామవరపుకోట: ఒక మోటార్ సైకిల్ నిప్పంటించి కాల్చి వేసి, వేరొక మోటార్ సైకిల్ దొంగిలించిన ఘటన ఈస్ట్ యడవెల్లి గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని కొణతం స్వామి ఇంటి ఆవరణలో గురువారం రాత్రి పెట్టిన హోండా షైన్ మోటార్ సైకిల్ శుక్రవారం ఉదయానికి పూర్తిగా కాలిపోయి కనిపించింది. అదే రోజు రాత్రి ముక్కు కృపారాజు ఇంటి ఆవరణలో ఉన్న హోండా షైన్ మోటార్ సైకిల్ దొంగలు దొంగలించిపోయారు. ఈ ఘటనపై బాధితులు తడికలపూడి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాలువలో స్నానానికి దిగి విద్యార్థి గల్లంతు పెంటపాడు: మండలంలోని పరిమెళ్ల చినకాపవరం కాలువలో డ్యాం వద్ద స్నానానికి దిగి ఒక విద్యార్థి గల్లంతయ్యాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న 8 మంది విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరిమెళ్ల గ్రామ శివారు చినకాపవరం కాలువలోకి స్నానాలు చేసేందుకు వెళ్లారు. కొంతసేపు వారంతా కాలువలో ఆటలాడారు. ఉన్నట్టుండి ఒక విద్యార్థి అయిన గుంటూరు జిల్లా మండేపూడి గ్రామానికి చెందిన పల్లెపోగు వరప్రసాద్ (20) ప్రమాదవశాత్తూ కాలువ లోతు తెలియక కొట్టుకుని పోయాడు. వెంటనే సహచర విద్యార్థులు, స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. కాగా రెస్క్యూ సిబ్బంది సాయంతో పరిసర ప్రాంతమంతా రాత్రి పొద్దుపోయే వరకు వెతికినా ప్రసాద్ ఆచూకీ లభించలేదు. ఫైర్ అధికారి జీవీ సుబ్బారావు, ఎస్సై స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను పరిశీలించారు. కాపర్ వైరు చోరీ కేసులో 8 మంది అరెస్ట్ ఎంవీపీకాలనీ: విశాఖపట్నంలోని ఎంవీపీకాలనీలో పలు చోట్ల డ్రిల్లింగ్ చేసి కాపర్ దొంగతనానికి పాల్పడిన కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు ద్వారకా క్రైమ్ సీఐ చక్రధరరావు తెలిపారు. నగరంలో ఎనిమిదేళ్ల క్రితం కాపర్వైరుతో బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ పనులు చేశారు. ప్రస్తుతం ల్యాండ్ లైన్ సేవలు నిలిచిపోవడంతో ఎవరూ పట్టించుకోరనే ఉద్దేశంతో కాపర్ వైర్ దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఎంవీపీకాలనీలో రాత్రి పూట అండర్ గ్రౌండ్ డ్రిల్లింగ్ చేసి 800 మీటర్ల కాపర్ వైరు చోరీ చేశారు. దీనిపై బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి చుట్టురి మురళీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారంపై బయటపడింది. ఈ కేసులో పెందుర్తికి చెందిన ఆసనాల పిట్టోడు(ఏ1), ఏలూరుకు చెందిన బి.శ్రీను, జి.గోవర్ధన్, బి.ఏడుకొండలు, బి.రాజు, సీహెచ్ దుర్గాప్రసాద్, డి.రాజేష్, బి.ప్రసాద్ అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. నిందుతుల నుంచి 300 కిలోల కాపర్ వైరుతో పాటు టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. – ఆకివీడు -
మధ్యవర్తిత్వంతో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారానికి మధ్యవర్తిత్వం ఎంతో దోహాదపడుతుందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యా యమూర్తి (ఎఫ్ఏసీ) ఎం.సునీల్ కుమార్ అ న్నారు. ఎంపిక చేసిన న్యాయవాదులకు, సోష ల్ వర్కర్ల జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం శుక్రవారంతో ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎం.సునీల్‌కుమార్ మాట్లాడుతూ ఐదు రోజులపాటు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో తెలుసుకున్న మెలకువలతో మరింత నైపుణ్యంతో కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన, చట్టపరమైన షరతులతో రాజీ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా జడ్జి పి.మంగకుమారి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్, బార్ అసో సియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. టెన్త్ పరీక్షలకు 22,356 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 22,356 మంది విద్యార్థులు హాజరయ్యారు. 22,735 మంది రెగ్యులర్ విద్యార్థులకు 22,288 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 133 మందికి 68 మంది హాజరయ్యారు. జిల్లాలోని 64 కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. దూరవిద్య పరీక్షలకు.. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న టెన్త్ తెలుగు పరీక్షకు 460 మంది విద్యార్థులకు 402 మంది హాజరయ్యారు. ఉర్దూ పరీక్షకు ఆరుగురికి ఆరుగురు హాజరయ్యారు. తొమ్మిది కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో.. భీమవరం: జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షకు 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు. 21,867 మంది విద్యార్థులకు 398 మంది గైర్హాజరయ్యారన్నారు. ఏపీఓఎస్ఎస్ తెలుగు పరీక్షకు 461 మందికి 368 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. నైపుణ్యంతో అపార అవకాశాలు భీమడోలు: నైపుణ్యాలు గల యువతకు ఉద్యో గ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా ప్లేస్మెంట్ అధికారి రవి శ్యామ్ అన్నారు. భీమడోలు వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్, జిల్లా ఉపాధి కల్పనా శాఖల సంయుక్త ఆ ధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. 10వ తరగతి ఆపై చదివిని పలువురు నిరుద్యోగులు హాజరయ్యారు. డైకిన్, ముత్తూట్ ఫైనాన్స్, అరిజియో ఫైనాన్స్ కంపెనీల్లో 25 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. కళాశాల ప్రి న్సిపల్ బొమ్ము రవికుమార్, నైపుణ్యాభివృద్ది సంస్థ ప్రతినిధులు జే.రాము. ప్రవీణ్, కోఆర్డినేటర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ అరెస్ట్ భీమవరం: భీమవరం మండలం చినఅమిరంలో నిధుల దుర్వినియోగం కేసులో పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన సాగిరాజు కిషోర్గోపాల్ కృష్ణంరాజును శుక్రవారం అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఆర్జే జయసూర్య తెలిపారు. చినఅమిరం పంచాయతీలో సుమారు రూ.3.63 కోట్లు నిధులు దుర్వినియోగం కాగా అధికారుల ఫిర్యాదు మేరకు కృష్ణంరాజును అరెస్ట్ చేశామన్నారు. అతడిని భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. నిధుల గోల్‌మాల్‌పై విచారణ పెనుగొండ: మండలంలోని ములపర్రు ప్రాథమిక సహకార సంఘంలో 2018లో రూ.90 లక్షలు గోల్మాల్ కాగా దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. అప్పటి పాలకవర్గ సభ్యులను అప్పట్లో ప్రజలు, డిపాజిటర్లు, పాలకవర్గ సభ్యులు నిలదీయడంతో రూ.50 లక్షలు చెల్లించారు. మిగతా రూ.40 లక్షలు అప్పటినుంచి రికవరీ కాలేదు. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంఎం రెహమాన్ ములపర్రు సొసైటీలో విచారణ చేపట్టారు. విచారణలో వచ్చిన అంశాలను ఉన్నతాధికారులకు నివేదించినట్టు ఆయన చెప్పారు. -
లారీ ఢీకొని ఉపాధ్యాయురాలి మృతి
పెనుమంట్ర: మండలంలోని నెగ్గిపూడి గ్రామ పంచాయతీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం టిప్పర్ లారీ స్కూటర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మార్టేరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న సిర్ల సుజాత (55) అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహం తలపై నుంచి లారీ టైరు వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. భోజన విరామ సమయంలో తన యాక్టివా మోటార్ సైకిల్‌పై పాఠశాల నుంచి నెగ్గిపూడిలోని ఇంటికి వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె భర్త సిర్ల చిన్న సూర్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలి ఏలూరు(మెట్రో): సరెండర్ లీవ్‌లు, ఆర్జిత సెలవుల బకాయిలు వెంటనే చెల్లించాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 6200 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఉద్యోగ వర్గానికి రెండు విడతల సరెండర్ లీవులు సీపీఎస్ ఉద్యోగులకు ప్రాన్ అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశౠరు. రిటైలర్ అయిన ఉద్యోగులకు జీపీఎఫ్, ఆర్జిత సెలవుకు సంబంధించిన బకాయిలు, పోలీసులకు సరెండర్ లీవ్ నిధులను కూడా త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ గుడి వద్ద శుక్రవారం ఓ మోటార్ బైక్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం వేగివాడకు చెందిన గంటా భరత్(21), గోపాలపురానికి చెందిన చల్లా సుబ్రహ్మణ్యం ఇద్దరూ స్నేహితులు. వారు శుక్రవారం వ్యక్తిగత పనుల నిమిత్తం ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం బైక్‌పై వెళ్లి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు భీమడోలు వైపుగా వస్తున్నారు. కనకదుర్గ గుడి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయాయ్యి. వారిని భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేసి ఏలూరు వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంటా భరత్(21) మృతి చెందాడు. తీవ్ర గాయాలైన సుబ్రహ్మణ్యాన్ని విజయవాడ తరలించారు. ఈ మేరకు భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి తాడేపల్లిగూడెం (టీఓసీ): ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు మార్చి నెలాఖరులోగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, అమరావతి జేఏసీ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. యూనియన్ పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం స్థానిక సూర్యవంశీ ఎన్‌క్లేవ్‌లో రీజినల్ అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆరేళ్లు గడిచినా ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బందికి ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. మూడు వేల మంది సిబ్బంది ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. పదోన్నతులతో పాటు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరండర్ లీవ్ సొమ్ములు దశలవారీగా చెల్లించాలని కోరారు. తొలుత పట్టణంలో ఈయూ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఈయూ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.డీ ప్రసాద్, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్,సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల బీమారావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థుల బహుముఖ ప్రతిభ అభినందనీయం
తాడేపల్లిగూడెం: చదువుతో పాటు, ఇతర రంగాల్లో విద్యార్థులు బహుముఖ ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. శుక్రవారం నిట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నిట్‌కు చెందిన విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, దీంతో అనేక పురస్కారాలను అందుకుంటున్నందుకు అభినందనీయమన్నారు. సీనియర్ విద్యార్థుల స్ఫూర్తితో జూనియర్లు ప్రేరణ పొంది అన్ని విషయాలలో అన్ని రంగాలల్లో అగ్రగామిగా ఉండాలన్నారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ బరోడా అచీవర్స్ అవార్డులను అందించారు. బీటెక్ 2021–25కు చెందిన బీటెక్ ఆఖరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కలిదిండి పవన్‌తేజ సత్యవర్మను , తుమ్మూరి మంజునాథ్‌లను అభినందించారు. ఆలిండియా నిట్ పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన ఎస్.హర్షిత్‌ను అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్‌రెడ్డి, బ్యాంక్ ఆప్ బరోడా పెదతాడేపల్లి బ్రాంచ్‌మేనేజర్ ఎం.కేదారి తదితరులు పాల్గొన్నారు. -
ఆగని కంకర అక్రమ తవ్వకాలు
ఉంగుటూరు: కంకర అక్రమ తవ్వకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన కూటమి నాయకులే ఈ దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉంగుటూరు మండలం మెట్టప్రాంతంలో సుమారు 20 కిలోమీటర్లు పోలవరం కుడి కాలువ ఉంది. ఈ కాలువ గట్టుపై రాత్రినక పగలనక తవ్వకాలు యథేచ్ఛగా జరిపారు. దీంతో కాలువగట్లు స్వరూపాలు మారిపోయాయి. ప్రస్తుతం ఇక్కడ గట్టు మీద తవ్వకాలు పూర్తికాగా ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి సరిహద్దు ప్రాంతంనుంచి భీమడోలు మండలం సరిహద్దు ప్రాంతాల నుంచి కంకర తవ్వి తరలిస్తున్నారు. ఉంగటూరు మండలం కంసాలిగుంట రోడ్డునుంచి గొల్లగూడెం మీదుగా ఈ దందా సాగుతోంది. మట్టి దందాలో వీఆర్వోలు, రెవెన్యూ అధికారులు సైతం పాలు పంచుకున్నట్లు ప్రజలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఎవరైనా పలానాచోట కంకర తవ్వి పట్టుకుపోతున్నారని అధికారులకే చెబుతుంటే వెంటనే ఆ విషయాన్ని కంకర మాఫీయా వ్యక్తులకు నిమిషాల వ్యవధిలో చేరవేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్‌ను వివరణ కోరగా తమకు ఎక్కడైనా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదు వస్తే వెంటనే కేసులు పెట్టడం జరగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకాలు జరగకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఉద్యోగులను గస్తీ పెడుతున్నట్లు చెప్పారు. మట్టి అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. -
నకిలీ బంగారం అంటగడుతున్న ముఠా అరెస్టు
కై కలూరు: బంగారపు దుకాణాల వద్దకు కారులో దర్జాగా వెళతారు.. అత్యవసరం అంటూ రూ.3 లక్షల విలువ చేసే బ్రాస్లెట్ తాకట్టు పెట్టుకుని కేవలం రూ.1.50 లక్షలు ఇవ్వండనీ అడుగుతారు. హాల్‌మార్క్ గుర్తుతో పాటు హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన రశీదు ఇస్తారు. చివరికు అది ఒన్ గ్రామ్ బంగారంగా తేలుతోంది. ఈ విధంగా ఏలూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలో మోసాలకు పాల్పడిన ముఠాను కై కలూరు టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టౌన్ సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్‌కుమార్, డి.శ్రీనులతో కలసి కేసు వివరాలను స్టేషన్లో గురువారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా రామవరప్పాడుకు చెందిన కడియాల వెంకటేశ్వరరావు(40) భార్యతో కలసి హైదరాబాదు ఎల్బీ నగర్లో ఒన్ గ్రామ్ బంగారం దుకాణం నడుపుతున్నాడు. పెద్ద తిరుపతిలో కొండపైకి భక్తులను జీపుల్లో తరలించే విజయనగం జిల్లా మెంటాడకు చెందిన చొక్కాపు మణికంఠ(32), నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఉన్నం చంద్రమోహన్(54)లను కలుపుకుని వెంకటేశ్వరరావు మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ నెల 13న కై కలూరు మహాలక్ష్మీ గోల్డ్ షాప్‌లో బ్రాస్లెట్ తాకట్టు పెట్టి రూ.90 వేలు యజమాని మెంట దీలిప్ నుంచి తీసుకున్నారు. తర్వాత సమీపంలోని కార్తీకేయ ఫైనాన్స్ యజమాని శివవరప్రసాద్కు చైన్ తాకట్టు పెట్టి రూ.1,50 లక్షలు తీసుకున్నాడు. ఆ సమయంలో అతనికి అనుమానం రావడంతో చాకుతో బెదిరించి పరారయ్యారు. తర్వాత భీమవరంలో రూ.1.50 లక్షలు, గుడివాడలో రూ.1.50 లక్షలు, గణపవరంలో రూ.1.30 లక్షలకు నకిలీ బంగారు వస్తువులు అంటగట్టి నగదుతో పరారయ్యారు. తిరిగి కై కలూరులో మోసాలకు పాల్పడడానికి గురువారం వచ్చిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.88 వేలు నగదు, 4 చైన్లు, 4 బ్రాస్లెట్లు, 3 సెల్ఫోన్లు, తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్థానిక కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన సీఐ పి.కృష్ణ, ఎస్సైలు డి.వెంకట్‌కుమార్, డి.శ్రీనులను ఎస్పీ అభినందించారు. గోల్డ్ షాపులే టార్గెట్‌గా మోసాలు కై కలూరు పోలీసులకు చిక్కిన ఘరానా కేటుగాళ్లు -
ఆదుకోకోంటే ఉద్యమమే
సదస్సు తీర్మానాలివీ.. ● అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద ఉన్న కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేయాలి. ● కంపెనీలు రైతులను నష్టపరిచే చర్యలను అరికట్టాలి. ● కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. ● ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి. ● విదేశీ కోకో గింజలు, పొడి, బట్టర్ వంటి దిగుమతులు నిలుపుదల చేయాలి. మన రైతులను నష్టపరిచే పద్ధతుల్లో దిగుమతులు ఉండరాదు. ● కోకో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణం చేయాలి. ● కోకో తోటలు సాగు చేస్తున్న రైతులకు ఉద్యాన శాఖ నుంచి రావాల్సిన సబ్సిడీ బకాయిలు చెల్లించాలి. పెదవేగి : కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్‌తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం ప్రపంచంలోని 20 దేశాల్లో 20వ స్థానంలో ఉందని, మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని చెప్పారు. 80 శాతం కోకోను ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గత సంవత్సరం కంపెనీలు పోటీపడి అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలో గింజలను రూ.1,040 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశాయని గుర్తుచేశారు. ఈ ఏడాది కంపెనీలు సిండికేట్‌గా మారి అంతర్జాతీయ ధర ఇవ్వడం లేదని చెప్పారు. పైగా అన్ సీజన్ గింజలు కొనుగోలు చేయడం లేదని, సీజన్ కోకో గింజల ధర రోజురోజుకీ తగ్గించి వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్‌గా ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. నిల్వ ఉంచిన గింజలను పచ్చళ్లు పట్టుకోండి అంటూ రైతులను ఎగతాళి చేస్తూ కంపెనీలు మాట్లాడుతుండటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఈ సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం పరిధి ఆయిల్ పామ్ రైతుల సంఘం అధ్యక్షుడు ఉండవల్లి వెంకటరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి, కోకో రైతులు పాల్గొన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. రాష్ట్రస్థాయి సదస్సులో తేల్చిచెప్పిన కోకో రైతులు కోకో గింజల కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలోని సదస్సుకు పెద్ద సంఖ్యలో కోకో రైతుల హాజరు -
ఆర్టీసీ రక్షణకు 24న చలో ఢిల్లీ
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): దేశంలోని రవాణా రంగ కార్మికులకు ఒక సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న చలో పార్లమెంట్ కార్యక్రమానికి ఆలిండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల స్థానంలో దేశవ్యాప్తంగా విద్యుత్ బస్సులను తీసుకొని భవిష్యత్తులో ఆర్టీసీలను కనుమరుగు చేయాలని కేంద్ర ప్రభుత్వం పథకం వేసిందనీ, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం– ఈ బస్సు స్కీము కూడా ఇందులో భాగమే అన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడి ఆర్టీసీలను కాపాడుకోవాలనీ, ఈనెల 24న ఢిల్లీలో భారీ ప్రదర్శనతో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ ప్రసాద్, ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టీపీఆర్ దొర, ఎస్బీ అనిల్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎన్.సురేష్, డిపో అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ ప్రసాద్, టీకే రావు తదితరులు పాల్గొన్నారు. -
27 నుంచి గుంటూరులో వ్యవసాయ ప్రదర్శన
ఏలూరు(మెట్రో): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈనెల 27 నుంచి 29 వరకు లాంఫామ్ గుంటూరులో దక్షిణ భారత ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ఏలూరు సమన్వయకర్త డాక్టర్ కె. ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల వ్యవసాయ పద్ధతులు, కూరగాయలు, పండ్ల సాగులో అధునాతన సాగు పద్ధతులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం తదితర అంశాల ప్రదర్శనతోపాటు రైతుల–శాస్త్రవేత్తల చర్చా కార్యక్రమాలు ఉంటాయన్నారు. దక్షిణ భారత వ్యవసాయ నిపుణులు రైతులతో సంభాషించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రదర్శనకు రైతులను ఉచితంగా తీసుకెళ్తామని, ఔత్సాహిక రైతులు ఏరువాక కేంద్రం, ఏలూరు వారి ఆఫీసు నెంబర్ (99896 23804)కు సంప్రదించాలని కోరారు. ఏలూరులో సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీసిద్ధి ధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2 చిత్ర రూపకల్పనకు గురువారం ప్రారంభ పూజ చేశారు. సెంటిమెంట్, హర్రర్, కామెడీ మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు వెంకట్ జుత్తిగ తెలిపారు. ఈ చిత్రం షూటింగ్ నిరంతరాయంగా కొనసాగిస్తామని, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లొకేషన్లు పరిశీలించినట్లు చెప్పారు. ఈ చిత్రంలో ఇరువురు ప్రముఖ సీనియర్ నటులు ప్రధాన పాత్రల్లో నటిస్తారని, వారి వివరాలు, హీరోయిన్ల వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు. సినీ నిర్మాత వట్టి శ్యామ్‌బాబు మాట్లాడుతూ అనన్య చిత్రంలో విలన్ క్యారెక్టర్లో నటించిన అరవింద్ జాలా తమ చిత్రంలో హీరోగా నటిస్తున్నట్లు చెప్పారు. తొలుత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించి నిర్మాత, దర్శకుడు ఇతర తారాగణం సక్సెస్ కావాలని, చిత్రం ప్రజాదరణ పొందాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి ఏలూరు (టూటౌన్): రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే ఎస్సై పి.సైమన్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు పవర్‌పేట రైల్వే స్టేషన్ నందు రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు కృష్ణా జిల్లా వేల్పూరుకు చెందిన నంబూరి రవికుమార్(57)గా గుర్తించినట్లు చెప్పారు. రవికుమార్ మృత దేహాన్ని ఏలూరు సర్వజన ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచామని, కేసును దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలి
ఏలూరు (మెట్రో): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అర్హులైన వీఆర్వోలకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమగోదావరి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్‌ను వెట్రిసెల్వికి వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన గ్రేడ్–1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్లు ఇవ్వాలని, అలాగే గ్రేడ్–2 వారికి గ్రేడ్–1 వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రెవెన్యూ విలేజ్‌లకు సంబంధం లేకుండా రెండు సచివాలయలను కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఒక వీఆర్ఓ ఉండేలాగా నిర్ణయం తీసుకోవడం వల్ల పని భారం పెరుగుతుందని, రెవెన్యూ సేవలు కూడా ఆలస్యం అవుతాయని అన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో ముఖ్యమంత్రితో జరిగే సదస్సులో క్లస్టర్ విధానం గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిరియాల లక్ష్మీనారాయణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు అక్బర్, జిల్లా కోశాధికారి రవికుమార్, డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ఏలూరు, పెదవేగి, దెందులూరు, పెదపాడు మండల వీఆరోఓలు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల్లో తృతీయ స్థానం
పెదపాడు : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈనెల 14 నుంచి 16 వరకు జరిగిన 34వ సబ్‌జూనియర్ అంతర్ జిల్లా బాలబాలికల కబడ్డీ పోటీల్లో పెదపాడు మండలం వీరమ్మకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తృతీయ స్థానం సాధించినట్లు హెచ్ఎం రాంప్రసాద్ తెలిపారు. కబడ్డీ పోటీల్లో విద్యార్థులు హర్ష, శాంతరాజు ప్రతిభ చాటారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. తుది దశకు టెన్నిస్ పోటీలు భీమవరం: భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న వెర్టెక్స్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం నిర్వహించిన పోటీల్లో ఫలితాలివి. 75+ డబుల్స్ విభాగంలో అశోక్‌రెడ్డి–సాయి రాంబాబు, 70+ డబుల్స్ విభాగంలో సన్యాసిరాజు–గజపతి, 65+ డబుల్స్ విభాగంలో ఆనంద స్వరూప్– శ్రీనివాస్ జోడి విజయం సాధించారు. 65+ సింగిల్స్ విభాగంలో వి.శ్రీనివాసరెడ్డి, 70+ సింగిల్స్ విభాగంలో సేతు విజేతలుగా నిలిచారు. -
ఏకపక్షంగా గేదెల పాక తొలగింపు
నూజివీడు: తుక్కులూరులో పదేళ్లుగా రెవెన్యూ పోరంబోకు భూమిలో ఉన్న గేదెల పూరి పాకను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ పాక వైఎస్సార్సీపీ సానుభూతి పరుడైన కొలుసు భాస్కరరావుకు చెందినది కావడంతో ఈ నెల 18న అధికారులు ఆఘమేఘాలపై వచ్చి తొలగించడం గమనార్హం. అదే గ్రామంలో మచిలీపట్నం–కల్లూరు జాతీయ రహదారి మార్జిన్లను ఆక్రమించుకొని అనేక దుకాణాలున్నప్పటికీ వాటి వైపు మాత్రం రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కొలుసు భాస్కరరావు వైఎస్సార్సీపీ సానుభూతి పరుడుగా ఉండటమే కాకుండా అతని భార్య గ్రామంలో అమూల్ పాలకేంద్రాన్ని నడుపుతోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అమూల్ కేంద్రాన్ని వదిలేయమని ఆమైపె ఒత్తిడి తీసుకువస్తున్నారు. దానికి నిరాకరించడంతో తమ మాట వినడం లేదని చెప్పి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి చేయించి గేదెల పాకను తొలగించేలా చేశారు. దీంతో భాస్కరరావు తన గేదెలను కట్టేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనుమతి లేకుండా వెంచర్.. పంచాయతీ అభ్యంతరం ఉంగుటూరు: కై కరం పంచాయతీ పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యక్తులు అనుమతి లేకుండా వేసిన ప్రైవేట్ వెంచర్‌ను గ్రామ పంచాయతీ అడ్డుకుంది. కై కరం పంచాయతీలో రియల్ ఎస్టేట్ వ్యక్తులు వెంచర్ వేసి స్థలాలు విడదీసి ప్లాట్లుగా విభజించి రహదార్లు నిర్మిస్తున్నారు. ప్లాట్లు అమ్మబడును అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. దీంతో బుధవారం గ్రామ పంచాయతీ వారు అనుమతులు లేకుండా ఇలా చేయకూడదని బోర్డు ఏర్పాటు చేశారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యక్తులు గురువారం ఆ బోర్డును తొలగించేసి స్థలాలను చదును చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీ రాజు గురువారం మరో బోర్డును ఏర్పాటుచేసి వారిని హెచ్చరించారు. వూడా పరిధిలో ఉండటంతో వాళ్లుకు కూడా పంచాయతీ కార్యదర్శి సమాచారాన్ని అందించారు. -
సునీతా విలియమ్స్‌కు శుభాకాంక్షలు
ఏలూరు (టూటౌన్): అగ్గిపుల్లపై వ్యోమగామి సునీతా విలియమ్స్ చిత్రాన్ని చిత్రీకరించి అబ్బుర పరుస్తున్నారు ఏలూరుకు చెందిన సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్‌బాబు. తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపి క్షేమంగా భూమిపైకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తనదైన శైలిలో సునీతా విలియమ్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సూక్ష్మ కళాకారుడు మేతర సురేష్ బాబుకు పలువురు అభినందనలు తెలియజేశారు. చెల్లని చెక్కు కేసులో జైలు శిక్ష, జరిమానా నూజివీడు: చెక్కు చెల్లని కేసులో ఒక వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు ముసునూరు మండలం కాట్రేనిపాడుకు చెందిన ముసునూరు ప్రభుదాస్‌కు గోపవరంనకు చెందిన వల్లభనేని గోపాలకృష్ణ 2017 జూన్ 25న రూ.5 లక్షలు అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించే నిమిత్తం ప్రభుదాస్ రూ.5 లక్షల చెక్కు ఇచ్చాడు. ఈ చెక్కును గోపాలకృష్ణ బ్యాంకులో వేయగా ప్రభుదాస్ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు చెక్కును తిప్పి పంపారు. దీంతో గోపాలకృష్ణ కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ ప్రభుదాస్‌కు ఆరు నెలల జైలుశిక్ష, రూ.6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. అనుమానాస్పద స్థితిలో రిటైర్డ్ ఉద్యోగి మృతి చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీ పాత చింతలపూడిలో రిటైర్డ్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలివి. డి హేమప్రకాష్ (65) రిటైర్డ్ ఉద్యోగి. పాత చింతలపూడిలో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా హేమ ప్రకాష్‌ను ఆస్తి కోసం కుటుంబ సభ్యులే కొట్టి చంపారని మృతుని సోదరుడు మోహన్ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రకాష్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసి ఎస్సై కుటుంబరావు దర్యాప్తు చేస్తున్నారు. -
తాగునీటి సమస్య తలెత్తితే ఊరుకోం
ఏలూరు(మెట్రో): రానున్న వేసవిలో జిల్లాలో అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య తలెత్తితే ఊ రుకోబోమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లో గురువారం తాగునీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాల అమలుపై అధికారులతో ఆ మె సమీక్షించారు. జిల్లాలో తాగునీటికి సంబంధించి సమస్యాత్మక గ్రామాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో తాగునీటి సరఫరాపై వారంలోపు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. కాలువలకు నీటిని నిలిపివేసే లోపు గ్రామాల్లో తాగునీటి వనరులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని, బోర్‌వెల్స్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని, రక్షిత తాగునీటి పథకాల్లో ఫిల్టర్‌బెడ్స్‌కు మరమ్మతులు చేయించాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పురోగతిలో ఉన్న 325 పనులతో పాటు, ఇంకా ప్రారంభం కాని 108 పనులను జూన్ నెలాఖరులోపు పూర్తిచేయాలన్నారు. జెడ్పీ సీఈఓ కె.భీమేశ్వరరావు, ఐటీ డీఏ పీఓ కె.రాములునాయక్, ఆర్డబ్ల్యూఎస్, ఇరిగేషన్ ఎస్ఈలు జి.త్రినాథబాబు, పి.నాగార్జునరావు, డీపీఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ నమోదు వేగిరపర్చాలి జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ వివరాలు నమోదును పూర్తిచేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లాస్థాయి ఆధార్ మోనటరింగ్ కమిటీ సమావేశాన్ని నర్విహించారు. ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ బయోమెట్రిక్, అప్డేట్ అంశాలపై సమీక్షించారు. సారారహిత జిల్లాగా మార్చాలి సారారహిత జిల్లాగా ఏలూరును మార్చేందుకు అ ధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సారా నిర్మూలనా కార్య క్రమం నవోదయం 2.0పై సమావేశం నిర్వహించా రు. ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌తో కలిసి సమీక్షించారు. నవోదయం 2.0పై కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించారు. మత్తుపదార్థాల నివారణే లక్ష్యం మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో నార్కోటిక్ కో–ఆర్డినేషన్ సమావేశాన్ని ఎస్పీ కేపీఎస్ కిషోర్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి కె.రత్నప్రసాద్‌తో కలిసి నిర్వహించారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం టోల్ ఫ్రీ నం.1972పై విస్తృత ప్రచారానికి స్టిక్కర్లను, కరపత్రాలను, ఆవిష్కరించారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
నీటి ఎద్దడి ఆవరించేను
ఆరుగాలం కష్టించినా అన్నదాతకు సాగులో ఇబ్బందులు తప్పట్లేదు. చివరి దశలోనూ నీటి సమస్యలు వెంటాడుతుండటంతో చేతికందిన పంటను కాపాడుకునేందుకు నానా పాట్లు పడుతున్నాడు. పొలాలకు నీరందించే విషయంలో అధికారుల సమన్వయ లోపం వీరికి శాపంలా మారింది. దెందులూరు మండలం పాలగూడెం శివారు పొలాలు నీటి ఎద్దడితో నెర్రలు తీశాయి. దీంతో కొవ్వలి డ్రెయిన్‌లో ఉన్న కొద్దిపాటి నీటిని మోటార్లతో తోడుకుంటూ చేలకు అందిస్తున్నారు. ఎకరాకు అదనంగా రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, మునుపెన్నడూ లేనివిధంగా నీటి కోసం అవస్థలు పడుతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
‘గేట్’లో విద్యార్థుల ప్రతిభ
ఆర్జీయూకేటీ విద్యార్థులకు 1,000లోపు 30 ర్యాంకులు నూజివీడు: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)లో ఆర్జీయూకేటీ పరిధి లోని నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపు ల్ ఐటీల విద్యార్థులు ప్రతిభ కనబర్చారని రిజిస్ట్రా ర్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం తెలిపారు. 400 మంది ఉత్తమ ర్యాంకులు సాధించారని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీకి చెందిన కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థి అమిరెడ్డి అశోక్ జాతీయ స్థాయిలో 12వ ర్యాంకు సాధించాడన్నారు. ఈసీఈ విద్యార్థులు 125, 201, 655, 679, 875, 907 ర్యాంకులు, సీఎస్ఈ విద్యార్థులు 182, 241, 298, 308, 342, 475, 663, 680, 724, 783, 844, 915, 983, మెకానికల్ విద్యార్థులు 174, 240, 242, 484, 491, 585, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 12, 666 ర్యాంకులతో సత్తాచాటారన్నారు. తాము చేపట్టిన గేట్–25 సపోర్ట్ కార్యక్రమమే విజయానికి కారణమని సెంట్రల్ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటీటివ్ ఎ గ్జామ్ సెల్ కో–ఆర్డినేటర్ ఎం.రామకృష్ణ తెలిపారు. సాయిచరణ్‌కు 9వ ర్యాంక్ కై కలూరు: గేట్ పరీక్షలో కలిదిండి మండలం ఆరుతెగలపాడుకి చెందిన చిలుకూరి సాయి చరణ్ 9వ ర్యాంకు సాధించాడు. చిలుకూరి కిషోర్‌బాబు కుమారుడు చరణ్ కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తిచేసి హైదరాబాద్‌లో గేట్ కోచింగ్ తీసుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 77.67 శాతం మార్కులతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. -
అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్తత
బుట్టాయగూడెం: జీలుగుమిల్లిలోని అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రెండు రోజుల క్రితం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడేనికి చెందిన గంధం బోసు అనే వైఎస్సార్సీపీ కార్యకర్తపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా ఖమ్మంలో చికిత్స పొందుతూ మృతిచెందిన విష యం తెలిసిందే. మృతదేహాన్ని గురువారం ఖమ్మం నుంచి బోసు స్వగ్రామానికి తీసుకువస్తుండగా తె లంగాణ, ఆంధ్ర సరిహద్దు వద్ద కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. బోసు మృతికి కారణాలు తేల్చాలంటూ భీష్మించారు. సీఐ బి.వెంకటేశ్వరరావు, ఎ స్సైలు నవీన్‌కుమార్, చంద్రశేఖర్ ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు, కుటుంబ సభ్యులకు వాదోపవా దం జరిగింది. రాత్రి సమయానికి కూడా ఆందోళన కొనసాగడంతో సరిహద్దు వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకుని శుక్రవారం నాటికి నిందితులెవరో తేలుస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. బోసు మృతదేహాన్ని స్వగ్రామం తరలిస్తున్న సమయంలో కూడా పోలీసులు వెంటే ఉన్నారు. మృతదేహానికి శుక్రవారం అంత్యక్రియలు చేస్తామని బంధువులు తెలిపారు. ఇదిలా ఉండా బోసుపై దాడి కేసులో అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. దోషులను ప్రభుత్వం వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు డిమాండ్ చేశారు. గుర్తుతెలియని వ్యక్తి దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా కుటుంబసభ్యుల ఆందోళన -
మన్యంలో మట్టి దందా
బుట్టాయగూడెం: అధికారం మాది.. మేం చెప్పిందే వినాలి.. మేం చేసిందే చూడాలి.. మమ్మల్ని ఆపేదెవడ్రా.. అన్నట్టు సాగుతోంది గిరిజన ప్రాంతంలో మట్టి దందా. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో రాత్రీపగలు తేడాలేకుండా పొక్లయిన్లతో మట్టిని తవ్వి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. కొండలు, గుట్టలను తవ్వుతూ జేబులు నింపుకుంటున్నారు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అండదండలతోనే ఈ తతంగమంతా జరుగుతోందని పలువురు నాయకులు ఆరోపిస్తున్నారు. తవ్వుకో.. తరలించుకో.. సామాన్యులు ఎవరైనా చెరువులో గుప్పెడు మట్టి తీసుకువెళ్తే వాహనం సీజ్ చేసి అపరాధ రుసుం విధించే అధికారులు మన్యం ప్రాంతంలో నెలల తరబడి మట్టిని తవ్వి అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా నిమ్మను నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో మట్టి వ్యాపారులు మరింత చెలరేగిపోతున్నారు. చెరువులు, కొండల్లో మట్టి, గ్రావెల్‌ను తవ్వి ఇటుక బట్టీలకు అమ్ముకుంటున్నారు. బుట్టాయగూడెం మండలంలోని దండిపూడి చెరువులో, మర్రిగూడెం చెరువులో, కోయరాజమండ్రి సమీపంలోని దొర మామిడి, గాడిదబోరు సమీపంలో కొండలను తవ్వి గ్రావెల్, మట్టి అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలంలో కూడా గ్రావెల్, మట్టి అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోయింది. ఇటీవల జీలుగుమిల్లి మండలం చీమలవారిగూడెం సమీపంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గట్టును ఆనుకుని ఉన్న ఆర్అండ్ఆర్ భూమిలో పొక్లయిన్లతో మట్టిని తవ్వి తరలించారు. అలాగే బుట్టాయగూడెం మండలం మర్లగూడెం అటవీ ప్రాంతం సమీపంలో కూడా యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ తరలింపులు జరిగాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి : ప్రభుత్వం చేపట్టిన పనులు, రహదారి నిర్మాణాలకు మట్టి, గ్రావెల్ కావాల్సి వస్తే సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. క్యూబిక్ మీటర్‌కు రూ.50 నుంచి రూ.60 వరకు చెల్లించాలి. వాణిజ్య అవసరాలకు అయితే రూ.135 నుంచి రూ.140 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ట్రాక్టర్‌కు రూ.750 నుంచి రూ.800 వరకు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అయి తే ఏజెన్సీ ప్రాంతంలో ఇవేమీ అమలుకావడం లేదు. ఎటువంటి అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్లు మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. చెరువు మట్టి.. కొల్లగొట్టి యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు రాత్రీపగలూ తోలకాలు నిబంధనలు మీరినా పట్టని అధికారులు కూటమి నేతల అక్రమాలు ఎలాంటి అనుమతులూ లేవు బుట్టాయగూడెం మండలంలో మట్టి, గ్రావెల్ తోలకాలకు ఎటువంటి అనుమతులు లేవు. ఎవరైనా అక్రమంగా మట్టి, గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తాం. – పీవీ చలపతిరావు, తహసీల్దార్, బుట్టాయగూడెం అడ్డుకట్ట వేయాలి కూటవి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏజెన్సీ ప్రాంతంలో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. కొందరు చెరు వులు, కొండలను కొల్లగొడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ రవాణాకు అధికారులు అడ్డు కట్టవేయాలి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం -
గళమెత్తిన విద్యుత్ మీటర్ రీడర్లు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏలూరు విద్యుత్ సంస్థ ఎస్ఈ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం నాయకులు ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరిలో విద్యుత్ సంస్థ సీఎండీతో చేసుకున్న ఒప్పందంలో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తున్న నేపథ్యంలో రా ష్ట్రంలోని 4,500 మంది మీటర్ రీడర్లు ఉపాధి కో ల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరందరికీ అర్హతను బట్టి విద్యుత్ శాఖలో ఉపాధి కల్పించాలని కో రారు. ప్రతి నెలా వేతనాలు చెల్లించడానికి ఎస్క్రో ఖాతాను తక్షణమే ప్రారంభించాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ డాంగే, ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వర రావు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కోశాధికారి కె.మల్లేశ్వరరావు మాట్లాడారు. -
బ్యాంకర్లు లక్ష్యాలు పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు. జిల్లాలో 23,314 మంది సీసీఆర్సీ కౌలు రైతులకు ఇంతవరకు రూ. 142.85 కోట్లు అందించారని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి డిసెంబరు వరకు రూ.6,639 కోట్ల స్వల్పకాలిక వ్యవసాయ రుణాలు అందించారన్నారు. మార్చి చివరి నాటికి నూరుశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. ఆర్బీఐ నిబంధనలు ప్రకారం సీడీ రేషియో ప్రమాణం కనీసం 60 శాతం ఉండాల్సి ఉండగా ఏలూరు జిల్లాలో ఇది 199 శాతంగా ఉండటం మంచి పరిణామమన్నారు. జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 90.63 కోట్లు విద్యా రుణాలుగా, రూ.618.63 కోట్లు హౌసింగ్ రుణాలుగా అందించారని వీటిని మరింత విస్తృతం చేయాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీఓ పి.పూర్ణిమ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎన్.శ్రీనివాస్, ఎల్డీఎం డి.నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ కాంత్, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా, ఉధ్యానశాఖ డీడీ ఎస్.రామ్మోహన్, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఇ పి.సాల్మన్ రాజు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు పాల్గొన్నారు. -
కొల్లేరుపై సుప్రీంలో వాదనలు
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంపై సుప్రీంకోర్టులో బుధవారం వాడివేడిగా వాదనలు సాగాయి. కొల్లేరు సంరక్షణ కోసం 2006 ఏప్రిల్ 10న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయలేదని, కొల్లేరు సరస్సులో అక్రమంగా చేపల చెరువుల సాగు జరుగుతోందని కాకినాడకు చెందిన విశ్రాంత ఉద్యోగి మృత్యుంజయరావు 2004 సెప్టెంబరులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ ఏడాది జనవరి 16న సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్.గవాయి, జస్టిస్ ఆగస్టీ జార్జ్ మసీహ్, జస్టిస్ కె.వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల్లోపు కొల్లేరు సరిహద్దులు గుర్తించి అక్షాంశాలు, రేఖాంశాలు ఖరారు చేసి, కొల్లేరు ప్రజలకు అవగాహన కల్పించాలని, అక్రమ చేపల చెరువులను తొలగించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసు మార్చి 14న విచారిస్తామని పేర్కొంది. దీంతో ఈ నెల 19 వరకు ప్రభుత్వం గడువు కోరింది. ఈ నేపథ్యంలో అటవీశాఖ నివేదిక అందించింది. సీఈసీ నివేదిక సమర్పించాలని ఆదేశం సుప్రీంకోర్టులో బుధవారం కొల్లేరు అంశంపై విచారణ కొనసాగింది. కొల్లేరు అభయారణ్యాన్ని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కుదించి మిగులు భూములు పంపినీ చేయాలని కొల్లేరు పరివాహక గ్రామాల ప్రజలు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డుకు నివేదికలు పంపింది. వైల్డ్ లైఫ్ బోర్డు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ(సీఈసీ)ని నియమించింది. సుకుమార్, అజీజ్ అనే రెండు కమిటీలు అభయారణ్య కుదింపు అంశంపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి నివేదికలు సీఈసీకి అందించాయి. ఈ కమిటీల పూర్తి సారాంశాన్ని, కొల్లేరు కాంటూరు కుదింపు సాధ్యసాధ్యాలకు చేసిన సిఫార్సులను ఏప్రిల్ 2న సుప్రీంకోర్టుకు నివేదించాలని సీఈసీని కోర్టు ఆదేశించింది. 9,500 ఎకరాల్లో చెరువులకు గండ్లు కొల్లేరులో అక్రమ చేపల చెరువులు ఉన్నాయని అటవీశాఖ గతంలో సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. కొల్లేరులో మత్స్యకారుల జీవనోపాధికి అడ్డంకులు కల్పించమని, ప్రభుత్వం వారికి అవగాహన కల్పించి కోర్టు ఉత్తర్వుల అమలుకు అడ్డు తగలకుండా చెరువుల ధ్వంసంపై చర్యలు తీసుకోవాలని సుప్రీం సూచించింది. రెండు జిల్లాల్లో 18 వేల ఎకరాల చెరువులకు గండ్లు కొట్టాల్సి ఉండగా కోర్టుకు నివేదిక పంపించే సమయానికి 9,500 ఎకరాల చెరువులకు అటవీశాఖ గండ్లు కొట్టింది. దీంతో అనేక గ్రామాల్లో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఏప్రిల్ 2న మరోసారి విచారణ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని పూర్తి నివేదిక కోరిన సుప్రీం అక్రమ చెరువుల ధ్వంసం వివరాలు అందించిన అటవీశాఖ -
కృష్ణా వర్సిటీకి రూ.20 కోట్ల కేటాయింపు
నూజివీడు: కృష్ణా యూనివర్సిటీకి పీఎం ఉష పోగ్రామ్‌లో భాగంగా రూ.20 కోట్ల నిధులు వచ్చాయని, వీటిలో రూ.2 కోట్లను నూజివీడులోని ఎమ్మార్ అప్పారావు కాలేజీ ఆఫ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు(పీజీ సెంటర్) విడుదల చేసినట్లు కృష్ణా యూని వర్శిటీ వైస్ చాన్సలర్ ఆచార్య కూన రాంజీ పేర్కొన్నారు. పట్టణంలోని కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ని స్థానిక పీజీ సెంటర్‌ను బుధవారం ఆయన సందర్శించారు. దీనిలో భాగంగా క్యాంపస్‌లోని క్యాంటీన్, బాలికల హాస్టల్, నూతనంగా నిర్మించిన అకడమిక్ భవనాన్ని, తరగతి గదులను, లేబొరేటరీలను, బాత్రూమ్లు పరిశీలించారు. ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ప్రిన్సిపాల్ జే.నవీన లావణ్యలతకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా నూతన కోర్సులను యూనివర్శిటీలో ప్రవేశపెడతామన్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో యూనివర్శిటీ ఉద్యోగుల జీతాల కోసం రూ.10.50 కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. బాలికల హాస్టల్ వద్ద కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున హాస్టల్ చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. యూనివర్శిటీ రెక్టార్ ఆచార్య మండవ వెంకట బసవేశ్వరరావు, ప్రిన్సిపాల్, పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. తరగతి గదుల్లో, కారిడార్‌లో మంచినీటి సదుపాయాన్ని కల్పించడం లేదని, మంచినీటి కోసం క్యాంటీన్ వరకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థులు వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. -
దాడిలో గాయపడ్డ వైఎస్సార్సీపీ కార్యకర్త మృతి
నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్త గంధం బోసు(31) బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బోసును కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వైద్యులు చెప్పారు. బోసుపై దాడి జరిగి 48 గంటలు గడిచినా కారణాలు తెలియలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దాడి చేసిన వ్యక్తుల ఆచూకీ తెలియకపోవడం పట్ల నియోజకవర్గంలో భారీ స్థాయిలో చర్చ జరుగుతుంది. బోసుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయ కర్త కారుమూరి సునీల్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజులు డిమాండ్ చేశారు. దాడి జరిగి రెండు రోజులు గడుస్తున్నా నిందితులను కనిపెట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. ప్రశాంతమైన ఏజెన్సీ ప్రాంతంలో బోసు హత్యతో గంధరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ రకమైన హత్యలు జరగడం దారుణమన్నారు. జీలుగుమిల్లి జాతరలో జరిగిన అవకతవకలపై పత్రికల్లో వచ్చిన వార్తలను బోసు ఫార్వార్డ్ చేయడంతో ఆలయ చైర్మన్, టీడీపీ నాయకుడు వెంకటేశ్వరరావు ఫోన్లోనే బోసును బెదిరించిన కొద్దిరోజుల్లోనే బోసుపై దాడి జరగడం, బోసు మృతి చెందడం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని అన్నారు. బోసు మరణం పార్టీకి తీరనిలోటన్నారు. బోసు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. -
అభయాంజనేయస్వామి హుండీ లెక్కింపు
పెదపాడు: అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.12,08,963 వచ్చినట్లు ఆలయ ఈఓ పీ.తారకేశ్వరరావు తెలిపారు. అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించారు. 80 రోజులకు జరిగిన లెక్కింపులో ఈ ఆదాయం వచ్చిందని పర్యవేక్షణాధికారి సురేష్ కుమార్ తెలిపారు. గత సీజన్లో డీసీఎంఎస్ అత్యుత్తమ ప్రదర్శన ఏలూరు(మెట్రో): గత వ్యవసాయ సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో డీసీఎంఎస్ అత్యుత్తమ పనితీరుని కనపర్చిందని, రాబోయే రబీలో కూడా అదే స్పూర్తితో ధాన్యం సేకరణ చేసి రైతులకు మేలు చేయాలని జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ పర్సన్ ఇన్చార్జ్ పి.ధాత్రిరెడ్డి అన్నారు. ఏలూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ సర్వజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వ్యవసాయ సీజన్లలో పటిష్టమైన ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి రైతులకు ఎంతో సహకరిస్తున్నారన్నారు. ధాన్యం కొనుగోలుపై సిబ్బంది మరింత శిక్షణ అందించాలన్నారు. జిల్లా సహకార అధికారి ఏ.శ్రీనివాస్ మాట్లాడుతూ ఏప్రిల్ 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు బుధవారం విద్యా సంస్థల బస్సుల తనిఖీలు నిర్వహించి 8 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన బీమా తదితర అంశాలను పరిశీలించి ఆయా సర్టిఫికెట్లు లేని, నిబంధనలకు విరుద్ధంగా నడుతుపున్న 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్టు వివరించారు. ఆర్థిక గణనకు జిల్లా స్థాయి కమిటీ ఏలూరు(మెట్రో): వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా 8వ ఆర్థిక గణన నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్థిక గణనను సులభతరం చేయడానికి జిల్లా స్తాయి కమిటీని ఏర్పాటుచేస్తూ కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. కలెక్టర్ చైర్‌పర్సన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా జిల్లా ఎకనామిక్స్ ఆఫీసర్(సీపీవో) వ్యవహరిస్తారు. జిల్లా ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పరిశ్రమల అధికారి, డీఐపీఆర్ఓ, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, డీపీవో, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనరు తదితరులు సభ్యులుగా ఉంటారు. పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఈఈగా మూర్తి పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు డివిజన్–2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఏఎస్ఎల్ఎన్ఎస్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన మూర్తిని సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. జలవనరుల శాఖలో పదోన్నతులు పోలవరం ప్రాజెక్టు జలవనరుల శాఖ అధికారులకు పదోన్నతులు లభించాయి. పి.వెంకటరమణ డివిజన్–1 ఈఈగా, ఏఎస్ఎల్ఎస్ఎన్ మూర్తి డివిజన్–2 ఈఈగా, డి.శ్రీనివాసరావు డివిజన్–3 ఈఈగా, కె.సుబ్రహ్మణ్యం డివిజన్–4 ఈఈగా, జి.కృష్ణ, డివిజన్–5 ఈఈగా, కె.బాలకృష్ణమూర్తి డివిజన్–6ఈఈగా, డి.దామోదరం డివిజన్–7ఈఈగా, కె.పుల్లారావు డివిజన్–8ఈఈగా పదోన్నతులు పొందినట్లు అధికారులు పేర్కొన్నారు. -
రోడ్డెక్కిన కాంట్రాక్టర్లు
ఏలూరు ఆర్అండ్బీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కాంట్రాక్టర్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు/ఏలూరు(టూటౌన్) : కాంట్రాక్టర్లు రోడ్డెక్కారు.. సుమారు రూ.300 కోట్ల బకాయిలు నిలిచిపోవడంతో జిల్లాలో వందల మంది కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఏలూరు నగరంలోని ఆర్అండ్బీ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా రోడ్లు ఊడ్చుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారని ఆగమేఘాల మీద రోడ్లపై గుంతలు పూడ్చితే.. నెలలు గడిచినా పట్టించుకోవడం లేదంటూ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. 700 మంది కాంట్రాక్టర్లకు బకాయిలు జిల్లాలో కాంట్రాక్టర్లు బకాయిల కోసం నిరసన గళం విప్పారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల కాంట్రాక్టర్లు, మున్సిపల్ కాంట్రాక్టర్లు, బీఏఐ, ఎస్ఏబీఐ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారు రూ.300 కోట్ల బకాయిలున్నాయని, మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో నామినేషన్ ప్రాతిపదికన, ఇతర పనులు నిర్వహించినా బిల్లులు మంజూరు కాలేదు. జిల్లాలో ఆర్అండ్బీ, ఇరిగేషన్ శాఖల్లోని రూ.130 నుంచి రూ.150 కోట్ల పైచిలుకు, సోషల్ వెల్ఫేర్‌లో రూ.30 కోట్లు, జనరల్ ఫండ్ కింద పనులకు మరో రూ.30 కోట్లు, పంచాయితీరాజ్‌లో రూ.10 కోట్లు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, అన్న క్యాంటీన్లు అన్ని కలిపి మరో రూ.20 కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయి. ఏలూరు నగరంలో జనరల్ ఫండ్ కింద నిర్వహించిన పనులకు రూ.12 కోట్లు, ఇరిగేషన్ రూ.25 కోట్లు, పంచాయతీరాజ్ బకాయిలు, ఏలూరు డివిజన్లో రూ.8 కోట్లు, ఆర్అండ్బీ పనులకు సంబంధించి రూ.40 కోట్లు, సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి రూ.10 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 200 మంది కాంట్రాక్టర్లు, ఉభయగోదావరి జిల్లాలో 700 మంది కాంట్రాక్టర్లకు బకా యిలు రావాల్సి ఉంది. ఇలా అయితే కాంట్రాక్టర్లు పూర్తిగా అప్పులుపాలై రోడ్డునపడే పరిస్థితులుంటాయని, నిరర్ధక ఆస్తులు (ఎంపీఏ) చెక్కు బౌన్సులతో ఎక్కువ మంది ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ చైర్మన్ సతీష్ చౌదరి తెలిపారు. తమ కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామని వాపోయారు. నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించకపోతే భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పనికి టెండర్లు వేయబోమని స్పష్టం చేశారు. పది నెలలుగా బిల్లుల కోసం తిప్పలు ఏలూరు జిల్లాలో సుమారు రూ.300 కోట్ల బకాయిలు 20 ప్రభుత్వ శాఖల్లో నిలిచిన బిల్లులు -
కై కలూరు కూటమిలో కుమ్ములాటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కై కలూరులో కూటమిలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. సైకిల్, కమలం నేతగా పేరున్న బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టీడీపీ, జనసేనను సమన్వయం చేసుకుని సర్దుబాటు చేసుకోవడంలో విఫలమవుతుండటంతో సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా షాపు విషయమై టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం తలెత్తి తీవ్ర ఘర్షణలకు దారితీసింది. ఇరు పార్టీల నాయకులు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడం నియోజకవర్గంలో హాట్‌టాఫిక్‌గా మారింది. కై కలూరు ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు 2014, 2024లో టిక్కెట్ దక్కించుకుని టీడీపీ, జనసేన ఓట్లతో ఎమ్మెల్యే అయ్యిఆరు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తనకు సన్నిహితంగా ఉండే నలుగురు టీడీపీ నేతలను రింగ్ లీడర్లుగా ఏర్పాటు చేసి చిన్నపాటి వివాదాల నుంచి భారీ పైరవీల వరకు అన్ని వారి కనుసన్నల్లోనే జరిగేలా చూస్తుంటారు. ఐదేళ్ల పాటు సొంత పార్టీ బీజేపీ నేతలు, మిగిలినవారిని పట్టించుకోని పరిస్ధితి. కామినేని ప్రాబల్యంతో టీడీపీ, జనసేనకు నియోజకవర్గ ఇన్చార్జుల్ని నియమించలేని పరిస్ధితి. అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా టీడీపీ, జనసేన కోసం పనిచేసిన వారిని పట్టించుకోకపోగా ఏం జరిగినా సంబంధం లేదన్న రీతిలో ఎమ్మెల్యే వ్యవహరిస్తుండటంతో నియోజకవర్గంలో కూటమి నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టీడీపీ వర్సెస్ జనసేన టీడీపీ రాష్ట్ర ఆర్యవైశ్య డెవలప్మెంట్ వెల్ఫేర్ కార్పొ రేషన్ డైరెక్టర్ పైడిమర్రి జయశ్యామల మాల్యాద్రి కై కలూరులో తన కార్యాలయంలో ఉండగా గత శనివారం రాత్రి దాదాపు 30 మంది జనసేన కార్యకర్తలు వచ్చి ఘర్షణకు దిగి దౌర్జన్యం చేశారు. గాంధీబొమ్మ సెంటర్లో సులభ్ కాంప్లెక్స్ ఏర్పాటు వల్ల ప్రభుత్వ భూమిలో ఉన్న జనసేన కార్యకర్త బడ్డికొట్టు పోతుందని, ఇందుకు కారణం మాల్యాద్రి అని జనసేన ఆరోపణ. తమ బడ్డికొట్టుపై రాళ్ళు వేశారని జనసేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే గొడవ చేశారు. టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా కై కలూరు టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ కేసులను పోలీసులు హోల్డ్‌లో ఉంచారు. నియోజకవర్గంలో అక్రమ మట్టి దందా సాగుతుందని పదుల సంఖ్యలో వాహనాలు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, అక్రమ రవాణా చేసే టిప్పర్లను సీజ్ చేయాలనే డిమాండ్‌తో టీడీపీ నేత వీరాబత్తుల సుధ కొద్ది రోజుల క్రితం సీఐ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేసిన కంచర్ల రామకృష్ణ పదవుల్లో టీడీపీ శ్రేణులకు అన్యాయం జరుగుతుందని పోస్టు పెట్టినందుకు టీడీపీ మండల అధ్యక్షుడు త్రినాథరావు ఏకంగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల పెద్దింట్లమ్మ జాతరలో టీడీపీ నేతలకు ఆహ్వానం, ప్రాధాన్యం లేదని ఈఓ తీరుపై మండిపడి ఫిర్యాదులు చేశారు. ఇలా వరుసగా అనేక ఘటనలు జరుగుతున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోని పరిస్థితి. షాడోలదే హవా నాలుగు మండలాల్లో కామినేని ప్రతినిధులుగా నలుగురు టీడీపీ నేతలు హవా సాగిస్తున్నారు. టీడీపీ కేడర్‌కు గాని, మండల స్థాయి నేతలు కనీసం పట్టించుకోకపోగా చిన్నపాటి సిఫార్సును కూడా లైట్‌గా తీసుకోవడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎన్నికల సమయంలో వలస వచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులకు కనీస ప్రాధాన్యం లేదు. నామినేటేడ్ పదవుల చిచ్చు: నియోజకవర్గంలో మూడు పార్టీల నాయకులకు నామినేటెడ్ పదువుల పందేరం పెద్ద తలనొప్పిగా మారింది. వీటిలో కై కలూరు, కలిదిండి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ల పదవులు కీలకం. కలిదిండి మార్కెట్ యార్డు చైర్మన్‌గా జనసేన నాయకుడు చలపతి, అండ్రాజు శ్రీను, లంక రత్నారావు, పంతగాని సురేష్‌లు ఆశించారు. చివరకు టీడీపీ మండలాధ్యక్షుడు జోగిరాజు పేరు ఖరారు చేసినట్లు తెలిసింది. జనసేన నాయకుడు చలపతి ధిక్కార స్వరం వినిపించారు. జనసేన నేతలతో ఫోన్లు చేయించారు. కై కలూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కోసం టీడీపీ మండలాధ్యక్షుడు పెన్మత్స త్రినాథరాజు, గంగుల శ్రీదేవి, పూల రాజీ ఆశించారు. పూలా రాజీ భార్యకు కేటాయిస్తారని సమాచారం. ఇక్కడ కూడా ఆశావాహుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన మధ్య తారాస్థాయికి విభేదాలు పోలీసు స్టేషన్లో ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు ఎమ్మెల్యే కామినేని తీరుపై టీడీపీ, జనసేన నేతల అసంతృప్తి టీడీపీ అధిష్టానానికి పార్టీ శ్రేణుల ఫిర్యాదు -
దారి దోపిడీ కేసులో ముగ్గురి అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు వన్‌టౌన్ ప్రాంతంలో గత నెలలో ఒక వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ.2.40 లక్షలు దోచుకెళ్లిన దారి దోపిడీ ముఠాను ఏలూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రావణ్‌కుమార్ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన కల్లపల్లి దుర్గా నాగ వెంకట కొండలరావు అలియాస్ పండు అనే వ్యక్తి ఏలూరులోని ఆదిత్య అసోసియేషన్ అనే హిందుస్థాన్ లివర్ సంస్థలో డ్రైవర్‌గా పనిచేసి మానివేశాడు. అక్కడ అకౌంటెంట్‌గా పనిచేసే గొట్ట వీరేష్ నిత్యం సంస్థ నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు నగదును వెంట తీసుకువెళ్లి తిరిగి మరలా ఉదయం కార్యాలయానికి తీసుకురావడాన్ని పండు గమనించాడు. ఆ సొమ్మును కాజేసేందుకు పండు తన స్నేహితులైన ఏలూరు నగరంలోని దక్షిణపు వీధి ప్రాంతానికి చెందిన గుమ్మల మణికంఠ, అతని బావమరిది కల్లపల్లి చందు అలియాస్ అచ్చులతో కలిసి వీరేష్ కదలికలపై రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి విధులు ముగించుకుని వీరేష్ మోటారుసైకిల్ పై ఇంటికి వెళుతుండగా ముగ్గురూ కలిసి వీరేష్ కళ్లల్లో కారం కొట్టి అతని వద్దనున్న రూ 2.40 లక్షల నగదు బ్యాగును అపహరించి పారిపోయారు. బాధితుడు ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏలూరు వన్‌టౌన్ సీఐ జీ.సత్యనారాయణ ప్రత్యేక బృందంతో చాకచక్యంగా నిందితులను అరెస్ట్ చేశారని డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రూ.1.90 లక్షల నగదును, మోటారు సైకిల్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏలూరు వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ఎ. సత్యనారాయణ, సీసీఎస్ సీఐ రాజశేఖర్, ఎస్సై కే.మదీనాబాషా, ఎస్సై బీ.నాగబాబు, సీసీఎస్ ఏఎస్సై ఎస్.రాజకుమార్, అహ్మద్, కానిస్టేబుళ్లు ఆర్.మోహనకృష్ణ, బీ నాగార్జున, ఎన్.శేషుకుమార్, ఎ.యశ్వంత్ కుమార్, టీ.సురేష్‌కుమార్, ఎండీ రుహుల్లాలను ఎస్పీ అభినందించారు. -
మద్యం దుకాణంలో వ్యక్తిపై దాడి
తణుకు అర్బన్ : మద్యం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని అగంతకుడు దాడిచేసిన ఘటన తణుకులో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తణుకు ఉండ్రాజవరం జంక్షన్ గణేష్ చౌక్ ప్రాంతంలోని మద్యం దుకాణం (నైట్ పాయింట్)లో మద్యం విక్రయిస్తున్న పట్టణానికి చెందిన సిర్రా పండుపై గుర్తుతెలియని వ్యక్తి చేసిన దాడి భయబ్రాంతులకు గురిచేసింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన అగంతకుడు మద్యం దుకాణం వద్దకు వచ్చి తచ్చాడిన తరువాత దుకాణంలో ఉన్న పండుపై ఇనుప రాడ్‌తో విచక్షణారహితంగా దాడిచేయడంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియో పుటేజీలో దాడి జరిగిన తీరు భయాన్ని కొలిపే విధంగా ఉంది. దాడిచేసే సమయంలో దుకాణం వద్దకు వచ్చిన వారిని కూడా అగంతకుడు హెచ్చరించడం, ఆ తరువాత తాపీగా అతడు వాహనాన్ని స్టార్ట్ చేసుకుని వెళ్లడం సంచలనంగా మారింది. పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి సీపీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పండు కుటుంబ సభ్యులు.దళిత వర్గాలు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. -
ఎస్సీ వర్గీకరణకు నిరసనగా దున్నపోతుకు వినతిపత్రం
భీమవరం: ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యుత్సాహం తన రాజకీయ పతనానికి నాంది పలుకుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ బుధవారం భీమవరం నియోజకవర్గం రాయలం గ్రామంలో వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తుండగా భీమవరం టూటౌన్ సీఐ జి.కాళీచరణ్, ఎస్సైలు రెహమాన్, ఇజ్రాయిల్ అడ్డుకున్నారు. అనంతరం పుష్పరాజ్ మాట్లాడుతూ గతంలో చంద్రబాబు వర్గీకరణ విషయంలో చేసిన తప్పుల వల్లనే కొన్నేళ్లు అధికారానికి దూరమయ్యారని మళ్లీ కూటమి ప్రభుత్వంతో అంటకాగి ఎస్సీ వర్గీకరణ చేయడం రాజకీయ పతనానికి దారితీసుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో మాల, మాదిగలు అన్నదమ్ముల భావంతో కలిసి మెలిసి ఉంటుండగా వర్గీకరణ పేరుతో వారిని విడగొట్టి పబ్బం కడుపుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చెల్లుబాటు కాదని ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తెలుసుకోవాలని రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వాలు పనిచేయడం చాలా దారుణమన్నారు. ఇప్పటికై నా చెల్లుబాటు కానీ వర్గీకరణ విషయాన్ని పక్కన పెట్టి రిజర్వేషన్లు పెంచే ఆలోచనలో చేయాలని, లేకుంటే వినూత్న రీతిలో నిరసనలు తెలియజేస్తామని పుష్పరాజ్ హెచ్చరించారు. కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నేతల సువర్ణరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు చిగురుపాటి రాజేష్, పిట్టా వినోద్ కుమార్,గడ్డం అబ్రహం, జొన్నల వజ్రం, యాకోబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఈఈఈతో జీవితం ఉన్నతం
తాడేపల్లిగూడెం: విద్యార్థులు తమ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఐఈఈఈ ఎంతగానో ఉపయోగపడుతుందని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పూర్వ జీఎం డాక్టర్ కప్పగంటు రామకృష్ణ తెలిపారు. ఏపీ నిట్‌లో బుధవారం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, డీఎస్ఐఆర్, సీఆర్డీ హెచ్ఐ, ఈఈఈ నిట్ స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో జాయింట్ చాప్టర్ వైజాగ్‌బే విభాగం సహకారంతో అధునాతన సాంకేతికతలు, భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఎలక్ట్రికల్ గ్రిడ్‌లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నాయన్నారు. వాటిని అందిపుచ్చుకొనేందుకు విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. రిజిస్ట్రార్, డీన్ ప్లానింగ్ దినేష్‌రెడ్డి, వి.సందీప్ మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్ధులు సాంకేతికతపై పట్టు సాధించాలన్నారు. ఐఈఈఈలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు అలవడతాయన్నారు. ఆచార్యులు పి.శంకర్, కిరణ్తీపర్తి, వీరా కుమారి, మధు, దిలీప్‌వర్మ తదితరులు పాల్గొన్నారు. కాళ్ళకూరు వెంకన్న హుండీ ఆదాయం రూ.13 లక్షలు కాళ్ల: కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూః శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం లెక్కించారు. 58 రోజులకు గాను రూ:13,74,218 వచ్చినట్లు ఆలయ కార్వనిర్వహణాధికారి అరుణ్ కుమార్ తెలిపారు. గ్రామస్తులు, భక్తులు, మహిళా మండలి సభ్యులు దేవదాయ శాఖ తనిఖీదారు వర్ధినీడి వెంకటేశ్వరరావు సమక్షంలో హుండీ ఆదాయ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. చోరీ కేసులో మరో నిందితుడి అరెస్ట్పెనుగొండ: ఆచంట మండలం వల్లూరులో చోరీ కేసులో మరో నిందితుడు రాజమండ్రికి చెందిన యడ్ల వెంకటేష్‌ను అరెస్ట్ చేసినట్లు పెనుగొండ సీఐ రాయుడు విజయ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 2న వడ్లమన్నాటి భాస్కరరావు వెంకటలక్ష్మి దంపతులను వారి నివాసంలో నిందితులు కత్తితో బెదిరించి సుమారు రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొచుకెళ్లారు. దీనిపై వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి 5గురు నిందితులను ఈనెల 14న అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు వెంకటేష్‌ను రాజమండ్రిలోని అతడి నివాసంలోనే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి మంగళ సూత్రాలు, కొన పూసతో ఉన్న బంగారు బొందు, సుమారు నాలుగున్నర కాసుల బంగారం, వెండి చెంబు, వెండి పట్టీలు, మరికొంత వెండి స్వాధీనం చేసుకొన్నట్లు వివరించారు. కేసు త్వరితగతిన పురోగతి సాధించడానికి కృషి చేసిన డీఎస్పీ డాక్టర్ జి వేద, సీఐ రాయుడు విజయ్‌కుమార్, ఆచంట ఎస్సై కేవీ రమణను ఎస్పీ నయీం అస్మీ అభినందించారు. -
రైతులకు మెరుగైన సేవలందించాలి
ఏలూరు(మెట్రో): జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలందించాలని జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రత్యేక అధికారి పి.ధాత్రిరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మహాజన సభ స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జేసీ, డీసీసీబీ ప్రత్యేక అధికారి ధాత్రిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా రైతులకు దరఖాస్తు చేసిన 20 రోజుల్లోగా పంట రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. పీఏసీఎస్‌లో వ్యాపార కార్యకలాపాలను పూర్తిస్థాయిలో కంప్యూటరీకరించాలన్నారు. నిరర్ధక రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రుణాల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. రుణాలను సక్రమంగా చెల్లించే ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తామని, వారికి వడ్డీలో కొంత మొత్తం రాయితీపై రుణాలను అందిస్తామన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రాబడి, వ్యయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలను కూడా సభలో ఆమోదించారు. సమావేశంలో జిల్లా సహకార శాఖాధికారి ఏ.శ్రీనివాస్, డీసీసీబీ సీఈఓ సింహాచలం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రతినిధులు, సహకార శాఖ పర్సన్ ఇన్‌చార్జ్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రికవరీ చేసిన సెల్ఫోన్ల పంపిణీ
భీమవరం: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో దొంగిలించబడిన, చేజార్చుకున్న రూ.23 లక్షల విలువైన 155 సెల్ఫోన్లను బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ఫోన్లను రికవరీ చేసి తొమ్మిది విడతల్లో సుమారు రూ.రెండు కోట్లు విలువైన 1,394 సెల్ఫోన్లు రికవరీచేసి బాధితులకు అందజేశామన్నారు. 9వ విడతలో 155 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించడంలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అహ్మదున్నిషా, ఎస్సై నాగేశ్వరరావు ఇతర సిబ్బంది విశేషంగా కృషిచేశారని ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి భీమారావు, ఆర్మ్ ్డ రిజర్వ్ డీఎస్పీ ఎంవీవీ సత్యనారాయణ, భీమవరం డీఎస్పీ రావూరి గణేష్ జయసూర్య తదితరులు పాల్గొన్నారు. -
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న వేళ విద్యార్థులు కూడా సాంకేతికతకు సంబంధించిన కోర్సులను నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్‌లో సైతం కంప్యూటర్ ఆధారిత కోర్సులవైపే మొగ్గు చూపుతున్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసే విద్యార్థుల కంటే ముందుగానే ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ పూర్తి చేసిన అభ్యర్థులకు లభిస్తుంది. దీంతో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుపై దృష్టి పెడుతున్నారు. సాంకేతిక విద్యకు పునాది సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 30వ తేదీన జరగనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యా శాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2025ను ప్రకటించింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పాలిటెక్నిక్ ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే, దానిని పునాదిగా మార్చుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక విద్యను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకుంది. వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలని పలువురు సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందొచ్చని సూచిస్తున్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఈ నెల 10వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి గాను ఈ నెల 12వ తేదీ నుంచే ఫీజులను ఆన్లైన్లో గేట్‌వే ద్వారా చెల్లించే సౌకర్యం అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ఎంట్రన్స్ రాయదలుచుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15వ తేదీ వరకూ గడువు ఉంది. 10వ తరగతి, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, ఈ ఏడాది అటువంటి పరీక్షలు రాస్తున్నవారు కూడా పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 120 మార్కులకు నిర్వహిస్తారు. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు జిల్లాలో విద్యార్థులకు మొత్తం 7 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఏలూరులోని సీఆర్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, హేలాపురి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కలిదిండిలో డాక్టర్ వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నూజివీడులో నూజివీడు పాలిటెక్నిక్ కళాశాల, శ్రీ సారధి ఇనిస్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలున్నాయి. వాటన్నింటిలో కలిపి మొత్తం 2,536 సీట్లు వివిధ కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా ముదినేపల్లిలో ఏవీఎన్ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా ఈ కళాశాలలో విద్యార్థుల ప్రవేశాలు అతి స్వల్పంగా ఉండడంతో ఈ ఏడాది తమ కళాశాలను నిర్వహించలేమని, మూసివేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆ కళాశాల యాజమాన్యం సాంకేతిక విద్యాశాఖకు దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తుకు ఏప్రిల్ 15 వరకూ గడువు ఏప్రిల్ 30న పాలిసెట్ పరీక్ష జిల్లాలో 7 పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో 2,536 సీట్లు సద్వినియోగం చేసుకోవాలి పదో తరగతి ముగిసిన వెంటనే పాలిటెక్నిక్ చదివితే చిన్న వయసులోనే ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉన్నత విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు ఉంటాయి. పాలిసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వారి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేస్తారు. అలాగే ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఆయా కళాశాలల్లో ఉచిత కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు. – పెదపట్నం సుబ్రహ్మణ్యం, ఏపీ పాలిసెట్ ఏలూరు జిల్లా కో–ఆర్డినేటర్ లభించే కోర్సులు ఇవీ పాలిటెక్నిక్‌లో వివిధ కోర్సులను జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలు చోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచికి 60 నుంచి 120 వరకు సీట్లు అందుబాటులో ఉంటాయి. పాలిటెక్నిక్ కోర్సుల కాల వ్యవధి మూడేళ్ల వరకు ఉంటుంది. ఆరు నెలల పాటు విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ కూడా ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. -
వేసవి తాపానికి ఉపశమనం
బుట్టాయగూడెం/పాలకోడేరు: భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటివారం నుంచే ఒకపక్క తీవ్రమైన ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు తాటి ముంజెలు, పుచ్చకాయలు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. పుచ్చకాయ శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు చలువ చేస్తుంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో.. పుచ్చకాయల కొనుగోలుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో కిలో పుచ్చకాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుంది. మన జిల్లాలో సుగర్ బేబీ, నాన్దారి, ఆర్క్మెన్ తదితర రకాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. పుచ్చకాయతో ప్రయోజనాలు పుచ్చకాయలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. పుచ్చలో విటమిన్ బి, పొటాషియం, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం లభించి.. తక్షణ శక్తి నిస్తుంది. ఆల్క్లైన్తో పాటు పీచు పదార్థం ఉండడం వల్ల మూత్ర పిండాలకు ఎంతో ఉపయోగకరం. 100 గ్రాముల పుచ్చకాయలో 91.45 గ్రాముల నీరు, 6 శాతం చక్కెర , 30 క్యాలరీల శక్తి, 7.6 గ్రాముల పిండి పదార్ధాలు, 0.6 గ్రాముల మాంసకృత్తులు, 12 గ్రాముల పొటాషియం, 7 గ్రాముల కాల్షియం ఉంటాయి. వేసవి తాపం తగ్గించే ముంజెలు తాటి ముంజెలు ఎండాకాలంలో మాత్రమే లభిస్తుంటాయి. వేసవి తాపాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్య రక్షణలో ఎంతో ఉపయోగపడతాయి. ఎండలు తీవ్రంగా ఉండటంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో, రోడ్ల వెంట తాటి ముంజలు ఏజెన్సీ ప్రాంతంలో విక్రయిస్తూ అనేక మంది వ్యాపారులు కనిపిస్తున్నారు. మార్కెట్లో ముంజెల వ్యాపారం చేసే వ్యాపారులకు మార్చి, ఏప్రిల్, మే నెలలో అధికంగా ఆదాయం వస్తుంది. తాటి ముంజలు 12 ముంజెలు రూ.40కు విక్రయిస్తుండగా మరి కొందరు 18 ముంజులు రూ.50 విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో సుమారు 75 కుటుంబాలకు పైగా ముంజెలు, తాటి ఆకుల విక్రయాలతో వేసవి కాలంలో జీవనం సాగిస్తున్నారు. తాటి ముంజెలతో ఉపయోగాలు ● ఎన్ని నీళ్లు తాగినా అలసిపోయివారు.. తాటి ముంజెలు తినడం వల్ల చలాకీగా ఉంటారు. ● తాటి ముంజెల్లో ఏ, బీ, సీ విటమిన్లతో పాటు జింక్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ● వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వ్యక్తుల బరువు తగ్గేందుకు దోహదం చేస్తాయి. ● శరీరంలో శక్తిని పెంచి అలసటను దూరం చేస్తుంది. పుచ్చకాయలు, ముంజెలకు వేసవిలో డిమాండ్ జోరందుకుంటున్న అమ్మకాలు ముంజెలతో వేసవిలో మంచి ఆరోగ్యం వేసవి కాలంలో ప్రకృతి సిద్దంగా లభించే తాటి ముంజెలు తినడం మంచిది. ఈ ముంజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఎండలో తిరిగేవారు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తాటి ముంజలు ఎంతగానో పనిచేస్తాయి. డాక్టర్ సుధీర్, వైద్యుడు, బుట్టాయగూడెం సీహెచ్‌సీ వేసవిలో ఎంతో ప్రయోజనకరం పుచ్చకాయ వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ దీనిని తినవచ్చు. వేసవి తాపం నుంచి రక్షణ పొందవచ్చు. చినమిల్లి రంగమనాయుడు, పీహెచ్సీ వైద్యాధికారి, పాలకోడేరు -
వేసవి దుక్కులతో లాభాలు
చింతలపూడి: జిల్లాలోని మెట్ట ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో భూసారం దెబ్బతినడంతో దిగుబడులు తగ్గి పోవడం, చీడ పీడల ఉధృతి పెరగడం వంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. రైతులు సరైన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చునని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సబ్ డివిజన్లో ఖరీఫ్ సీజన్లో 15,792 హెక్టార్లలో వరి పంట సాగు చేస్తున్నారు. ఇందులో చింతలపూడి మండలంలో అత్యధికంగా 7,603 హెక్టార్లు, లింగపాలెం మండలంలో 3,072 హెక్టార్లు, కామవరపుకోట మండలంలో 2,457 హెక్టార్లు, టి.నరసాపురం మండలంలో 2,661 హెక్టార్లల్లో వరి సాగు చేపట్టారు. వేసవి దుక్కులతో చీడ పీడల నివారణ వేసవి దుక్కులు పంటలకు ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా రైతులు కోతలు పూర్తవగానే పొలాలను అలాగే వదిలేస్తారు. తొలకరి పలకరించగానే సాగుకు సిద్ధమవుతారు. చినుకులు పడగానే దుక్కులు దున్నడం ప్రారంభిస్తారు. అలా కాకుండా వేసవిలోనే దుక్కులు దున్నడంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.నాగకుమార్ సూచిస్తున్నారు. వేసవిలో భూమిని దుక్కి దున్నకుండా వదిలేస్తే కలుపు మొక్కలు పెరుగుతాయి. అవి భూమిలోని నీటిని, పోషక పదార్థాల్ని గ్రహించి పెరుగుతాయి. కారణంగా భూమి లోపలి పొరల్లో నీరు హరించుకుపోతుంది. భూసారం తగ్గి పోతుంది. రైతు వేసిన పంటకు పోషకాలు లభించవు. వేసవి దుక్కుల వల్ల భూమి లోపలి పొరల్లో దాగివున్న కీటకాల గుడ్లు, శిలీంధ్రాలు బయటకు వచ్చి ఎండ తీవ్రతకు నశిస్తాయి. దుక్కిలో బయటపడిన పురుగులను పక్షులు తినడం వల్ల పంటలకు చీడ పీడల బెడద తప్పుతుంది. భూసారం పెంచడం ఎలా? భూసారాన్ని పెంచుకోవడానికి రైతులు కనీసం రెండు పంటలు వేసిన తరువాత పచ్చి రొట్ట సాగు చేయాలి. దీనివల్ల భూసారం పెరగడమేకాక చీడ పీడల బెడద తప్పి దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. సేంద్రియ పదార్థాలను నేలకు అందించడం, కలుపు మొక్కలు నివారించడం, నేలలో నివశించే జీవరాశులకు ఆహారంగా, మొక్కలకు కావల్సిన అన్ని పోషక పదార్థాలను అందించే సాధనాలుగా ఈ పచ్చిరొట్ట పంటలు ఉపయోగపడతాయి. నేల సారవంతం భూమిని 25 నుండి 30 సెంటీమీటర్ల లోతు వరకు దుక్కులు దున్నడం వల్ల నేలలో గాలి లభ్యత పెరిగి సూక్ష్మ జీవుల సాంద్రత పెరుగుతుంది. కర్బన పదార్థం లభ్యత పెరిగి నేల సారవంతమవుతుంది. భూమికి వాలుగా దుక్కి దున్నడంతో వర్షం కురిసినప్పుడు ఆ నీరు భూమి లోపలకు ఇంకుతుంది. భూమికి నీరు నిల్వ చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది. వాతావరణంలోని నత్రజని వర్షపు నీటితో కలిసి నేలకు చేరడంతో సారవంతంగా మారుతుంది. బి నాగకుమార్ –ఏడీఏ–వ్యవసాయ సబ్‌డివిజన్ -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
బుట్టాయగూడెం: గుర్తు తెలియని వ్యక్తులు వైఎస్సార్ సీపీ కార్యకర్తపై మారణాయుధాలతో దాడి చేసి పరారీ కావడం జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెంలో కలకలం రేపింది. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితుడిని తెల్లవారుజామున కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గంథం బోసుబాబు సోమవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతడి తలపై దాడి చేసి పరారయ్యారు. తెల్లవారుజామున కుమారుడు అనూప్శక్తి గమనించి విషయాన్ని తల్లి శాంతికుమారికి చెప్పడంతో ఆమె వెంటనే తన మరిది వీరాంజనేయులు, కడెల్లి చిన్ని అనే వారికి తెలియజేసింది. వెంటనే బంధువులు రక్తపు మడుగులో ఉన్న బోసుబాబును తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఖమ్మం ఆస్పత్రికి రిఫర్ చేయడంతో అక్కడికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐలు బి. వెంకటేశ్వరరావు, బాల సురేష్, ఎస్సైలు నవీన్ కుమార్, చంధ్రశేఖర్ దర్యాప్తు చేపట్టారు. బోసుబాబు ఇంటికి జాగిలాలను రప్పించి తనిఖీలు చేశారు. క్లూస్ టీమ్ కూడా వచ్చి వివరాలు సేకరించారు. కాగా అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి ఇటీవల జీలుగుమిల్లిలో జరిగిన జగదాంబ అమ్మవారి తిరుణాళ్లలో అవకతవకలపై ఒక పత్రికలో వచ్చిన వార్తను వాట్సాప్ గ్రూప్‌లో తన భర్త బోసుబాబు సెండ్ చేసినట్లు అతని భార్య శాంతకుమారి తెలిపారు. ఈ విషయమై జగదాంబ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు ఫోన్ చేసి తన భర్తను నానా దుర్భాషలాడి ఎప్పటికై నా తన భర్తను నరికి చంపుతానని హెచ్చరించారని ఈ విషయం తన భర్త తనతో చెప్పినట్లు తెలిపారు. దీంతో ఈ విషయంపై నాలుగురోజుల క్రితం జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. ఈలోపే తన భర్తపై దాడి జరిగిందని దీనిపై విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రివూట ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిపై మారణాయుధాలతో దాడి దాడి చేసి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు తాటాకులగూడెంలో కలకలం బాధితుడి భార్య ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు -
జేసీ – శాట్‌లో గాయత్రికి ఆల్ ఇండియా రెండో ర్యాంక్
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): నగరంలోని రామచంద్రరావుపేట శ్రీ శర్వాణీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని ముత్యాల గాయత్రి గత సెప్టెంబర్‌లో జూనియర్ చాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జేసీ– శాట్ లెవల్–2 ఆల్ ఇండియా పోటీ పరీక్షల్లో పాల్గొని జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం పాఠశాలలో గాయత్రిని పలువురు అభినందించారు. గాయత్రి ఇటువంటి అద్భుత విజయాలు మరిన్ని సాధించాలని ప్రధానోపాధ్యాయిని సీహెచ్ సత్యశారద ఆకాంక్షించారు. జేసీ–ఐ జాతీయ ఉపాధ్యక్షుడు బీ. సిద్థార్థ, జోన్– 26 అధ్యక్షుడు ఎంఆర్టీ భరత్, జే. ఆదిత్య, ఏలూరు ఐపీపీ కేఎన్ రోహిత్, ఏలూరు జోన్ ఎస్ ప్రెసిడెంట్ అరవింద్ గాయత్రికి రూ.51 వేలు నగదు బహుమతి, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందించి అభినందించారు. పాఠశాల డైరెక్టర్ కే.మదనమోహనరాజు, ఉపాధ్యాయలు విద్యార్థినిని అభినందించారు. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ఏలూరు (టూటౌన్): ఆదివాసీ సంక్షేమ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ కోట రామచంద్రపురం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) ఆధ్వర్యంలో ఈ నెల 19న నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ భాషా ఒక ప్రకటనలో కోరారు. పోలవరం మండలం జిల్లెల్లగూడెం, ప్రగడపల్లి, వింజరం పంచాయతీల్లో గత మూడు దశాబ్దాలుగా గిరిజనుల సాగులో ఉన్న భూములకు సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాను మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాధేశ్వరరావు ప్రారంభిస్తారన్నారు. లైంగిక వేధింపులపై కేసు నమోదు ఆకివీడు: చెరుకుమిల్లి గ్రామ శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు యత్నించిన దోనాద్రి నరసన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై హనుమంతు నాగరాజు మంగళవారం చెప్పారు. ఈ నెల 6వ తేదీన నిందితుడు ఇంటికి రమ్మని భార్యతో ఫోన్ చేయించాడని, తాను ఇంటికి వెళ్లిన సమయంలో లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించగా అదే సమయంలో తన భర్త ఇంటికి వచ్చి తన కోసం గట్టిగా కేక వేయగా నిందితుడు పరారయ్యాడని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. క్షీరారామలింగేశ్వర స్వామి సన్నిధిలో... పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీక్షీరారామలింగేశ్వరస్వామిని తెలంగాణ రాష్ట్ర యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకులు నల్లంతిఘల్ లక్ష్మీనరసింహాచార్యులు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన లక్ష్మీనరసింహాచార్యులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వామి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు స్వామివారి చిత్రపటాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. లక్ష్మీనరసింహాచార్యులు మాట్లాడుతూ క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. -
ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదంపై హర్షం
ఏలూరు (టూటౌన్): ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రి వర్గం ఆమోదించడంపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు కందుల రమేష్ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కండ్రిగగూడెంలోని సంఘ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. దళితుల్లో సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఎస్సీ రిజర్వేషన్ అమలు కోసం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని అన్నారు. ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు మాదిగ రాష్ట్ర నాయకులు కాశీ కృష్ణ, ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు కొత్తపల్లి మురళి, ప్రధాన కార్యదర్శి తాళ్లూరి నాగేంద్రబాబు, ఎంఎస్పీ ఏలూరు అధ్యక్షుడు గద్దల ప్రసాద్, ఏలూరు వర్కింగ్ అధ్యక్షుడు గూడూరు రాజేష్ బాబు తదితరులు హర్షం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. దళిత సేన హర్షం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదికను రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంపై దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దీని వల్ల ఎస్సీల్లోని అన్ని ఉప కులాలకు మేలు జరిగేలా సమాన అవకాశాలు ఏర్పడతాయని ఆకాంక్షించారు. -
రోడ్డున పడ్డ హెల్త్ అసిస్టెంట్లు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాలకు పైగా కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లుగా ప్రజలకు వైద్య సేవలందించిన వారిని కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసింది. వీరిలో మరో ఐదారేళ్లలో రిటైరయ్యేవారు ఎంతోమంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నవారికి ఊహించని షాక్ ఇచ్చింది. కోర్టు తీర్పును సాకుగా చూపించి రాష్ట్ర వ్యాప్తంగా 920 మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో వారంతా కన్నీటి పర్యంతమవుతున్నారు. జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన కూటమి నేతలు.. అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలివ్వకపోగా ఉన్న ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కోసం పారామెడికల్ రిక్రూట్మెంట్ ద్వారా హెల్త్ అసిస్టెంట్ల (మేల్) నియామకానికి 2002 మే నెలలో నాటి ఉమ్మడి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2324 పోస్టులకు 10వ తరగతి పూర్తి చేసి హెల్త్ అసిస్టెంట్ ట్రైనింగ్ డిప్లమో ఉండడాన్ని విద్యార్హతగా ప్రకటించింది. పరీక్షకు 10వ తరగతి వారితో పాటు ఇంటర్ పూర్తి చేసి హెల్త్ అసిస్టెంట్ శిక్షణ పొందినవారు హాజరయ్యారు. జాబు రాని ఇంటర్ విద్యార్థులు కోరు్ుట్న ఆశ్రయించడంతో 2006లో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ మేరకు సుమారు వెయ్యి మందిని హోల్డ్‌లో పెట్టి ఇంటర్ చదివిన వారిని విధుల్లోకి తీసుకున్నారు. తదనంతర పరిణామాలతో వారిని చేర్చుకోవడంతో ఉద్యోగుల సంఖ్య దాదాపు 3324కు చేరింది. నోటిషికేషన్ మేరకు 2324 మంది ఉద్యోగులు మాత్రమే ఉండాలని 2012లో కోర్టు తీర్పు ఇవ్వడంతో అదనంగా ఉన్న వెయ్యి మందిని తొలగించారు. వీరంతా ఆందోళన బాట పట్టడంతో అప్పటి ప్రభుత్వం మానవతా దృక్పథంతో విధుల్లోకి తీసుకుంది. ఆగమేఘాలపై తొలగింపు : మార్కులు తక్కువ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారంటూ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. డీ మెరిట్ ఉద్యోగులను తొలగించి వారికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి న్యాయం చేయాలని గత నవంబర్ 29న తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సాకుగా చూపించి కోర్టు ఇచ్చిన 90 రోజుల గడువును పట్టించుకోకుండా తీర్పు వచ్చిన వారంలోపే ఆగమేఘాలపై డిసెంబరు 5, 6 తేదీల్లో ఉన్నతాధికారులు 920 మందిని తొలగించేశారని బాధిత ఉద్యోగులు చెబుతున్నారు. తెలంగాణలోని 280 మంది కాంట్రాక్టు ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం నేటికీ కొనసాగిస్తుండటం గమనార్హం. రోడ్డున పడ్డ కుటుంబాలు రూ.3550 జీతానికి ఉద్యోగంలో చేరి ప్రస్తుతం రూ.30,200 జీతం అందుకుంటున్న 920 మంది కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లు, వారి కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరిలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవారు 70 మందికి పైగా ఉన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పనిచేశామని, క్షేత్రస్థాయిలో వైద్యసేవలందించడంలో రెండు దశాబ్దాలకు పైగా కీలకంగా పనిచేస్తున్న తమ పట్ల ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందని వాపోతున్నారు. కోర్టు తీర్పు అమలుచేశామని చెబుతున్న పాలకులు, అధికారులు కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. రేపోమాపో తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని ఎదురుచూస్తుంటే ఉన్న వాటిని తొలగించడం దారుణమంటున్నారు. ఉద్యోగాలు పోయిన బాధతో గుంటూరు, ఉత్తరాంధ్రలోని ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు గుండెపోటుతో ప్రాణాలను కోల్పోయినట్టు తెలిపారు. 920 మందిని తొలగించిన కూటమి సర్కారు కాంట్రాక్టు ఉద్యోగులుగా రెండు దశాబ్దాలకు పైగా సేవలు వీరిలో పలువురు ఐదారేళ్లలో రిటైరయ్యేవారే.. ఉద్యోగాలు పోవడంతో దిక్కుతోచని స్థితిలో కుటుంబాలు నిర్దాక్షిణ్యంగా తొలగించారు హైకోర్టు ఆదేశాల మేరకు 90 రోజుల గడువు ఉన్నప్పటికీ వారం లోపే తొల గిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదెక్కడి న్యాయమని అధికారులు, పాలకులను అడిగితే పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. ఉన్నత స్థాయి లోని కొందరు చేసిన తప్పులకు మా కాంట్రాక్టు ఉద్యోగులను బలిపశువులను చేశారు. – సయ్యద్ జఫ్రుల్లా, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేత -
నెత్తుటి ధారలు
హైవేపై రహదారులు రక్తసిక్తమవుతున్నాయి.. రోజు మార్చి రోజు ప్రమాదాలకు జిల్లాలోని జాతీయ రహదారులు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.. పది రోజుల వ్యవధిలో ఆరుకుపైగా ప్రమాదాలు జరగ్గా, రెండు భారీ ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారుల నుంచి మంత్రుల వరకు మొక్కుబడిగా హడావుడి చేయడం తప్ప శాశ్వత చర్యలు చేపట్టడం లేదు. బ్లాక్ స్పాట్ల వద్ద జాగ్రత్తలు, సూచిక బోర్డుల ఏర్పాటు, రహదారి స్థితిగతులపై కనీస పర్యవేక్షణ వంటి ప్రాథమిక అంశాలపై కూడా దృష్టి సారించడం లేదు. బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025ప్రమాద ఘంటికలు ● రక్తసిక్తంగా జాతీయ రహదారులు ● పట్టించుకోని ఎన్‌హెచ్, ఆర్అండ్బీ అధికారులు ● పది రోజుల్లో ఆరుకు పైగా ప్రమాదాలు ● ఏడుగురు దుర్మరణం ● భద్రతా చర్యలు, ముందస్తు జాగ్రత్తలు శూన్యం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు కీలక జాతీయ రహదారులు ఉన్నాయి. ఎన్‌హెచ్–16, ఎన్‌హెచ్ 216 (ఎ) మీదుగా అత్యధిక రాకపోకలు జరుగుతుంటాయి. ఆయా రహదారుల్లో నెలకు సగటున 20 నుంచి 25 వరకు ప్రమాదాలు జరుగుతుండగా.. 10 మందికిపైనే మృత్యువాతపడుతున్నారు. ఎన్‌హెచ్–216 (ఎ)లో ద్విచక్రవాహనాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్‌హెచ్–16 మీదుగా రోజుకు 25 వేల వరకు నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 12 వేల వరకు ఆటోలు, ద్విచక్రవాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఎన్‌హెచ్–216 (ఎ) మీదుగా సగటున 15 వేలకుపైగా నాలుగు చక్రాలు, ఆపై వాహనాలు, 10 వేలకు పైగా ఆటోలు, ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 34 బ్లాక్ స్పాట్లు ఏలూరు జిల్లాలో తరుచూ ప్రమాదాలు జరిగే, అత్యంత సంక్లిష్టంగా ఉండే 34 ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్లుగా గుర్తించారు. ఇలా గుర్తించిన ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగు స్థలం నెమ్మదిగా వెళ్లాలని సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలి. అలాగే వాహనాల వేగాన్ని తగ్గించడానికి రంబల్ స్టిప్స్ ఏర్పాటు చేయడం, రేడియం స్టిక్కర్లు, హైవే, పోలీస్ పెట్రోలింగ్ లాంటివి నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి. అయితే జిల్లాలో ఒక్క చోట కూడా మచ్చుకై నా అలాంటి పరిస్థితి లేదు. టోల్ వసూళ్లకే పరిమితమవుతూ.. జాతీయ రహదారిపై గతంలో టోల్ వసూలు చేసే కంపెనీలే కొంతమేర రహదారి మరమ్మతులు నిర్వహించేవి. అయితే ఇటీవల కాలంలో టోల్‌ప్లాజాలు కేవలం టోలు వసూలు మినహా మిగతా అంశాలతో సంబంధం లేనివిధంగా పనిచేస్తున్నాయి. గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్థార్థ నుంచి కలపర్రు టోల్‌గేటు వరకు ఒక సంస్థ, పాత టోల్‌గేటు నుంచి గుండుగొలను వరకు మరో కంపెనీకి మరమ్మతులు, ఇతర రహదారుల నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ కట్టపెట్టింది. అయినా పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువయ్యింది. రహదారులపై పలుచోట్ల గోతులు, ప్రమాదకర మలుపు ఉండటం, అలాంటి చోట్ల కనీసం సూచిక బోర్డులు కూడా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అతి వేగం.. ప్రమాదాలకు కారణం రాత్రిళ్లు, వేకువజామున ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర వాహనాలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. 60 నుంచి 80 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ కాగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నాయి. పచ్చదనం కరువు డివైడర్లల్లో తప్పనిసరిగా మొక్కలు పెంచాలి. మొక్కలు దట్టంగా పెంచడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ ఇబ్బందులు తగ్గడంతో పాటు వాహనాల నుంచి వెలువడే కార్బన్ డయాకై ్సడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను ఇస్తాయని గన్నేరు, ఇతర మొక్కలు పెంచాల్సి ఉంది. కలపర్రు నుంచి గుండుగొలను వరకు ఎక్కడా పచ్చదనం కనిపించని పరిస్థితి. ప్రమాదాలు ఇక్కడే ఎక్కువగా.. దెందులూరు చెక్‌పోస్టు నుంచి ఆశ్రం, గుండుగొలను నుంచి సత్యనారాయణపురం, ఆశ్రం జంక్షన్, నోవా ఇంజనీరింగ్ కాలేజీ వద్ద బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతున్నాయి. సమన్వయ లోపం నేషనల్ హైవే అథారిటీ, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయ లోపం మరో ప్రధాన సమస్య. అలాగే వరుస ప్రమాదాలు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా స్పందించడం లేదు. కనీసం పోలీస్ శాఖపరంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పరిస్థితి కొంత మెరుగవుతుంది. న్యూస్రీల్అన్ని చర్యలూ తీసుకుంటాం రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. వేగాన్ని నియంత్రించేలా చర్యలు తీసుకోవడానికి వీలుగా నేషనల్ హైవే అథారిటీ అధికారులతో మాట్లాడుతున్నాం. బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం – షేక్ కరీమ్, ఉప రవాణా కమిషనర్, ఏలూరు ఎన్‌హెచ్ 16 హనుమాన్ జంక్షన్ నుంచి భీమడోలు మండలం వరకు.. రోజుకు సగటున 35,000పైగా వాహనాల రాకపోకలు ఎన్‌హెచ్ 216 (ఏ) గుండుగొలను జంక్షన్ నుంచి సిద్ధాంతం వరకు.. రోజుకుసగటున 25,000పైగా వాహనాల రాకపోకలు -
పోలీస్ స్టేషన్లో ఇంటి దొంగలు
● ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో ప్రాపర్టీ, రికార్డులు మాయం ● జంగారెడ్డిగూడెం డీఎస్పీ విచారణ ఏలూరు టౌన్: జిల్లా కేంద్రం ఏలూరు పోలీస్ స్టేషన్లలో అవినీతి, అక్రమాలకు కొదవలేదు. పోలీస్ ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నా... నిఘా విభాగం పనిచేస్తున్నా ... పోలీస్ స్టేషన్లలో పనిచేస్తోన్న సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దొరికినకాడికి కాజేస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ప్రాపర్టీ మిస్సింగ్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై జిల్లా పోలీస్ బాస్ చర్యలు చేపట్టేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇంటి దొంగలను పట్టుకునేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే స్టేషన్ రైటర్‌ను సస్పెండ్ చేయగా... ఏం జరిగిందనే అంశంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. త్రీటౌన్ స్టేషన్లో ఆయా కేసులకు సంబంధించి ప్రాపర్టీ, ఇతర రికార్డులు మాయమైనట్లు తెలుస్తోంది. వివిధ కేసులకు సంబంధించిన ప్రాపర్టీ, నగదు, ఇతర రికార్డులన్నీ భద్రం చేయాలి. స్టేషన్ హౌస్ ఆఫీసర్ మారిన వెంటనే వాటికి సంబంధించిన వివరాలు సరిచూసుకోవడం పరిపాటి. ఈ నేపథ్యంలో ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు పాత రికార్డులు, ప్రాపర్టీ వివరాలు ఆరా తీయగా.. కొన్ని రికార్డులు, ప్రాపర్టీ మాయమైనట్లు గుర్తించారంటున్నారు. రూ.2 లక్షలకు పైగా నగదు కూడా కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవాలు ఏమిటనేది విచారణలో తేలనుంది. విచారణకు ఎస్పీ ఆదేశాలు రికార్డులు, ప్రాపర్టీ మాయంపై జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సీరియస్ అయ్యారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్రకు విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రాథమిక విచారణలో త్రీటౌన్ రైటర్‌ను సస్పెండ్ చేయగా.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ పాత్ర.. ఇతర పోలీస్ అధికారులు పాత్రపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గత రెండేళ్ళ క్రితం నుంచి పనిచేసిన పోలీస్ అధికారులను విచారణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో గత ఏడాది ఏసీబీ ట్రాప్‌లో ఒక కానిస్టేబుల్ దొరికిపోయారు. ఈ ఏసీబీ దాడిలో సీఐ, ఎస్ఐలు పాత్రధారులుగా ఉండగా, సంబంధం లేని కానిస్టేబుల్‌ను బలిచేశారని పోలీస్ వర్గాల్లో జోరుగా చర్చసాగింది. ఐదేళ్ళ క్రితం ఇదే త్రీటౌన్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ స్టేషన్‌లోని ప్రాపర్టీని సొంత అవసరాలకు వాడుకోగా ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. ఇదే తరహాలో గతంలో పెదవేగి పోలీస్‌స్టేషన్‌లోను ప్రాపర్టీని హెడ్‌కానిస్టేబుల్ వాడుకుని, చాలా రోజులు సెలవుపై వెళ్ళిపోయారనే అంశంపై పెద్ద చర్చ సాగింది. -
మినుముల కొనుగోలు కేంద్రం ప్రారంభం
దెందులూరు: ‘కొనుగోలు కేంద్రాలు ఎక్కడ’ అనే శీర్షికన ఈ నెల 16న సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం దెందులూరు కోపరేటివ్ సొసైటీలో మార్క్‌ఫెడ్ సంయుక్త ఆధ్వర్యంలో పెసలు, మినుములు కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా మాట్లాడుతూ దెందులూరుతో పాటు పెదపాడు, వట్లూరు, జాలి పూడి డీసీఎంఎస్ సెంటర్లలో పెసలు మినుములు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏడీ సుబ్బారావు, తహసీల్దార్ బీ సుమతి, ఏవో దామా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
బెదిరించి.. లైంగిక దాడికి పాల్పడి..
ఏలూరు (టూటౌన్): తనను బెదిరించి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడంతో పాటు తనను నగ్నంగా వీడియోలు తీసిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఓ వివాహిత కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌కు సోమవారం వినతిపత్రం అందజేసింది. పోలీసులను ఆశ్రయించినా కనీసం పట్టించుకోవడం లేదని, పైగా రాజీకి రావాలని, లేదంటే కౌంటర్ కేసు పెడతామని పోలీసులే బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తనకు, తన కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలంటూ ఐజీని కలిసినట్టు చెప్పింది. బాధితురాలు, ఆమె బంధువులు స్థానిక ఏటిగట్టు వద్ద ఉన్న జిల్లా రజక సంఘం కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఓ వివాహితపై అదే ప్రాంతానికి చెందిన యర్రంశెట్టి రవి, అతని స్నేహితుడు గుబ్బల సోమేశ్వరరావు అలియాస్ సోము అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను బలవంతంగా లోబర్చుకోవాలని ప్రయత్నించారు. మాట వినకపోతే ఆమె భర్తను, కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో వివాహితను బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆమెకు మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో బీచ్‌కు, భీమవరంలోని స్నేహితుల గదికి తీసుకువెళ్లి పలుమార్లు లైంగిక దాడికి తెగబడ్డారు. అలాగే ఆమెను బెదిరించి పలు దఫాలుగా ఆమె నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని మళ్లీ డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారు.రాజీ చేసుకోవాలని పోలీసుల ఒత్తిడితనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు ఉండి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు పట్టించుకోకపోగా నిందితుల పక్షాన కొమ్ము కాశారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కేసును వెనక్కి తీసుకోకపోతే తన భర్తపై, భర్త సోదరునిపై కౌంటర్ రేప్ కేసు పెడతామని, రాజీ చేసుకోవాలని పోలీసులే బెదిరిస్తున్నారని ఆమె వాపోయింది. ఈ విషయంపై పలుమార్లు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది.ఈ క్రమంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షుడు చిలకలపల్లి కట్లయ్యతో కలిసి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌కుమార్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. దీనిపై ఐజీ అశోక్‌కుమార్ స్పందించారని, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని విచారణ అధికారిగా నియమించారని, తగిన న్యా యం చేస్తామని హామీ ఇచ్చారని కట్లయ్య తెలి పారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.మురళీకృష్ణ, యలమంచిలి శేషు, బుద్దవరపు గోపి, యండమూరి వీర్రాజు పాల్గొన్నారు. -
సినీ నటుడు నితిన్ సందడి
జంగారెడ్డిగూడెం: సినీ హీరో నితిన్ గుర్వాయిగూడెం మద్ది క్షేత్రాన్ని దర్శించుకున్నారు. హీరో నితిన్‌తో పాటు, మైత్రీ మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. తొలుత వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ ముఖమండపం వద్ద అర్చకులు వేద ఆశీర్వాదం అందజేసి స్వామి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన, పర్యవేక్షకుడు జువ్వాది కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కోకోకు గిట్టుబాటు ధర ఇవ్వాలి
సాక్షి, అమరావతి: కోకో రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరకు కంపెనీలు కొనుగోలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కోకో గింజల కొనుగోలు కంపెనీలు, కోకో రైతుల సంఘాల ప్రతినిధులతో సోమవారం గుంటూరులోని ఉద్యాన శాఖ కార్యాలయంలో జరిగిన సమీక్షలో కంపెనీల మాయాజాలం వలన తాము ఏవిధంగా నష్టపోతున్నామో పలువురు కోకో రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఏపీ కోకో రైతు సంఘం ప్రతినిధులు ఎస్.గోపాలకృష్ణ, బొల్లు రామకృష్ణ, కోనేరు సతీష్ బాబు, గుదిబండి వీరారెడ్డి తదితరులు మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో కోకో గింజలకు కిలో రూ.700కు పైగా పలుకుతుండగా, రాష్ట్రంలో కంపెనీలు మాత్రం కిలో రూ.550–600కు మించి చెల్లించడం లేదన్నారు. గ్రేడింగ్ పేరిట అడ్డగోలుగా ధర తగ్గించడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పారు. వర్షాకాలపు పంట(అన్ సీజన్ ) కోకో గింజలను కంపెనీలు కొనుగోలు చేయడం లేదని, ఫలితంగా రైతులు వద్ద పెద్ద ఎత్తున నిల్వలు పేరుకుపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్ ధర ఇచ్చి సీజన్, అన్ సీజన్ కోకో గింజలను తక్షణమే కొనుగోలు చేయాలన్నారు. కంపెనీలు తగిన ధర ఇవ్వకపోతే వ్యత్యాసపు ధరను రాష్ట్ర ప్రభుత్వం కోకో రైతులకు చెల్లించేలా చర్యలు తీసుకుని కోకో రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీంను కోకో రైతులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ కే.శ్రీనివాసులు మాట్లాడుతూ కోకో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలి -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.75 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానం హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో చినవెంకన్నకు విశేష ఆదాయం సమకూరింది. గడచిన 18 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ.1,75,65,133 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. భక్తులు కానుకల రూపేణా సమర్పించిన 137 గ్రాముల బంగారం, 3.130 కేజీల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల రూపంలో రూ.17,500 లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సాయం చేసేవారు లేక..
ఏలూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లే రోగుల బాధలు అన్నీ ఇన్నీ కావు. నడవలేని రోగులను సహాయకులు వీల్‌చైర్‌పై స్కానింగ్‌కు, రక్తపరీక్షకు, ఎక్స్‌రేకు, ఫిజియోథెరపీకి తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది ఎవరూ స్పందించరు. బోలెడన్ని పనులున్నాయ్ మీరే తీసుకువెళ్లాలంటూ చిరాకుగా సమాధానాలు చెబుతారు. చేసేదేం లేక తామే తీసుకువెళ్తున్నామని రోగుల కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలో పురుష, సీ్త్ర సహాయకులుగా సుమారు 35 మంది ఉండేవారని ఇప్పుడు కేవలం 12 మందికే పరిమితమయ్యారని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఏలూరు జీజీహెచ్‌లో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
గిరిజనుడిపై దాడి దారుణం
బుట్టాయగూడెం: ఇటీవల గుళ్లపూడికి చెందిన మడకం యాకోబు అనే గిరిజనుడిపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవా లని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న యాకోబును పరా మర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. అలాగే అతడి వైద్యానికి ఆర్థిక సహా యం కూడా చేసినట్టు చెప్పారు. యాకోబుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తప్పు చేసినట్టు రుజువైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గాని చిత్ర హింసలు పెట్టడం సరికాదన్నారు. ఫారెస్ట్ అధికారుల దాడిలో యాకోబు పక్కటెముకలు విరిగాయన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన సబ్ డీఎఫ్ఓ, ఇతర అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. విషయాన్ని డీఎస్పీ దృష్టికి కూ డా తాను తీసుకువెళ్లానని, బాధితుడికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని బాలరాజు తెలిపారు. వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ నేత సోదెం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద వాగు మరమ్మతులకు కృషివేలేరుపాడు: తెలంగాణలోని పెద్దవాగు ప్రాజెక్ట్ మరమ్మతుల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి 15 రోజుల్లో ఓ కొలిక్కి తెస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. సోమవారం అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లిలో పెద్దవాగు ప్రాజెక్టును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ఆయకట్టు రైతులతో ఆయన మాట్లాడారు. ప్రాజెక్ట్ వ్యవహారంపై తక్షణమే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లకు నోటిసులు జారీ చేసి ఢిల్లీకి రప్పిస్తానన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్లతోపాటు ఇరిగేషన్ ఎస్ఈలను అక్కడికే పిలిచి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసి పెదవాగు ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేలా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చా రు. అనంతరం గండ్లు పడిన పెద్దవాగు ప్రా జెక్టు ప్రధాన ఆనకట్టను పరిశీలించి ఆయకట్టు రైతులతో మాట్లాడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలుగును ఐచ్ఛికం చేయొద్దు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధ్యాపకుల సంఘం నాయకులు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె. యోహానుకు వినతిపత్రం సమర్పించారు. సోమవారం స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ప్రారంభమైన ఇంటర్ మూల్యాంకనం సందర్భంగా వినతిపత్రాన్ని సమర్పించారు. తెలుగును ఐచ్ఛికం చేయడం వల్ల భాష మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీబీ రాజేష్ కుమార్, టి.ప్రేమ్‌కుమార్, కృష్ణంరాజు, కనకదుర్గ తదితరులు ఉన్నారు. అపరాల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఏలూరు(మెట్రో): ఏపీ మార్క్‌ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మద్దతు ధరతో మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టు జేసీ పి.ధాత్రిరెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. పెదపాడు, వట్లూరు, డీసీఎంఎస్ ఏలూరు, జాలిపూడి, దెందులూరు సొసైటీల్లో పెసలు కొనుగోలు కేంద్రాలు, లింగాల, దేవపూడి, తామరకొల్లు, డీసీఎంఎస్ ఏలూరు, దెందులూరు, డీసీఎంఎస్ అప్పన్నవీడు, పెదపాడు, వెంకటాపురం సొసైటీల్లో మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. -
గిట్టుబాటు ధర ఇవ్వాలి
కోకోకు గిట్టుబాటు ధర కల్పించాలని కోకో రైతుల సంఘం డిమాండ్ చేసింది. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సంఘ సభ్యులు డైరెక్టర్‌కు అందజేశారు. 8లో uఏడాదిగా తిరుగుతూ.. జంగారెడ్డిగూడానికి చెందిన చిట్లూరి రామారావు పూర్తిగా దివ్యాంగుడు. కర్ర సాయంతో, మరో వ్యక్తి సాయంతోనే నడుస్తున్నాడు. గత ఏడాది కాలంగా దివ్యాంగుల పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. కనీసం ఏ అధికారి కూడా తనను పట్టించుకోవడం లేదంటూ, ఏలూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చాడు. తన సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశాడు. -
మిన్నంటిన నిరసనలు
ఏలూరు (టూటౌన్): తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య మిత్రలు సోమవారం నిరసన తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆరోగ్యమిత్ర డీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి జిల్లా సమన్వయకర్తకు వినతి పత్రం అందజేశారు. శాంతియుతంగా విధుల బహిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. చేనేతలను ఆదుకోవాలని.. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి రూ.2 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కౌలు రైతుల సమస్యలపై : కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ కౌలురైతుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ నియామకాలు చేపట్టాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగాలైనా ఇవ్వండి లేదా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అయిన అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గళమెత్తిన స్కూల్ స్వీపర్లు స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లకు జీఓ నం.7 ప్రకారం కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని, ప్రతి నెలా సకాలంలో జీతాలు ఇవ్వాలని, స్కూల్ స్వీపర్లకు యూనిఫాం, గ్రూప్ ఇన్సూరెన్స్, పీఎఫ్, ఈఎస్ అమలు చేయాలని కోరుతూ స్కూ ల్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఏలూరు, వేలూరుపాడు, ముదినేపల్లి, పెదపాడు మండలాలకు చెందిన స్కూల్ స్వీపర్లు, స్కూల్ శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు . -
ప్రశాంతంగా పది పరీక్షలు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 25,179 మంది విద్యార్థులకు 23,064 మంది హాజరయ్యారు. 91.60 శాతం హాజరు నమోదైంది. ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన తాగునీరు, ఇతర వసతులను, వైద్య శిబిరాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఈఓ ఎం.వెంకటలక్ష్మమ్మ మాట్లాడుతూ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. పరీక్షా కేంద్రాల తనిఖీలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు 54 పరీక్షా కేంద్రాలను, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 9 కేంద్రాలు, తాను 6 కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 4 కేంద్రాలను తనిఖీ చేసినట్టు చెప్పారు. -
పరిష్కార వేదిక.. సమస్యలు తీర్చలేక !
ఏలూరు(మెట్రో)/ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సమస్యల పరిష్కారంలో విఫలమైంది. సమస్యలు పట్టి పీడిస్తున్నా పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. కూటమి ప్రభుత్వం కార్యక్రమం పేరు మార్చడంలో చూపిన శ్రద్ధ సమస్యల పరిష్కారంలో చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఫిర్యాదుల స్వీకరణపైనే దృష్టి సారించిన కూటమి సర్కారు సమస్యల పరిష్కరానికి క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమీక్షా సమావేశాల నిర్వహణలో చూపడం లేదు. దీంతో ఫిర్యాదుల పరిష్కారం కోసం అర్జీదారులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. సోమవారం.. సమస్యలు అనేకం ప్రతి సోమవారం బాహాటంగా నిర్వహిస్తున్న పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగిన కార్యక్రమానికి 318 ఫిర్యాదులు వచ్చాయంటే సమస్యల తీవ్రత అర్థం చేసుకోవచ్చు. సచివాలయాల నిర్వీర్యంతో.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో సచివాలయాల వద్దకు వెళ్లేందుకు ప్రజలు విముఖత చూపుతున్నారు. సచివాలయాలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వం ఉద్యోగులపై భారం మోపడంతో పాటు ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాట్లు చేయడం లేదు. మూడు నెలల్లో 1,845 ఫిర్యాదులు జిల్లావ్యాప్తంగా గత మూడు నెలల్లో 1,845 ఫిర్యాదులు రాగా 712 అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. 1,125 అర్జీలను పరిష్కరించామని అధికారులు చెబుతున్నా అవి కూడా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదనే వాదన వినిపిస్తోంది. 318 అర్జీలు : ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్‌కు ప్రజలు పోటెత్తారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్‌తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 318 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. తన కుమారులు చూడటం లేదంటూ రోదిస్తున్న అమ్మపాలేనికి చెందిన వెంకటాయమ్మ ప్రతి వారం వినతుల వెల్లువ పరిష్కారానికి నోచుకోని ఫిర్యాదులు పేరు మార్పుతో సరిపెట్టిన కూటమి ప్రభుత్వం పింఛన్, భూసమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు విలపింఛెన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: రెండు కాళ్లు పూర్తిగా చచ్చుపడిపోయాయి 10 నెలల నుంచి పెన్షన్ కోసం కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు ఇదొక దివ్యాంగుడి ఆవేదన.. కొత్త పెన్షన్లు ఏమో గాని ఉన్న పెన్షన్లు ఎందుకు తీసేశారో తెలియడం లేదు.. న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చా ఇదొక వృద్ధురాలి వేదన.. ఇలా ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే పీజీఆర్ఎస్కు వచ్చే వినతుల్లో ఎక్కువ శాతం పింఛన్ దరఖాస్తులే ఉంటున్నాయి. సోమవారం ‘సాక్షి’ బృందం ఏలూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఎక్కువ మంది పెన్షన్‌తో పాటు భూసంబంధిత సమస్యలపై అర్జీలు అందించారు. రెండు నెలలుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో నిలిచిపోయిన ఈ కార్యక్రమం రెండు వారాల నుంచి యథావిధిగా జరుగుతోంది. -
టెకు బ్యాంకు వ్యాపార విస్తరణకు ఆమోదం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరుకు చెందిన ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (టెకు బ్యాంక్) వ్యాపారాన్ని మరిన్ని జిల్లాలకు విస్తరించాలని ఆ బ్యాంక్ మహాజన సభ ఆమోదించింది. ఆదివారం వైఎంహెచ్ఏ హాలులో టెకు బ్యాంక్ మహాజన సభ బ్యాంక్ ఛైర్మన్ అంబికా ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో బ్యాంకు అభివృద్ధిపై సమీక్షించారు. కొత్త సభ్యత్వాలు, వాపసు చేసిన వాటాధనం ఆమోదించారు. వాయిదా మీరిన అప్పులపై సమీక్షించారు. బ్యాంకు చైర్మన్ అంబికా ప్రసాద్ మాట్లాడుతూ ప్రసుత్తం బ్యాంకు వ్యాపార పరిధి ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో విస్తరించి ఉందని, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా, విశాఖపట్నం జిల్లాకు విస్తరించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంకు డైరెక్టర్లు సిబ్బంది, సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు. -
సందేశాత్మకంగా కళా పరిషత్ నాటికలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో కళా పరిషత్ ఆధ్వర్యంలో రెండో రోజు ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. ఆదివారం మూడు నాటికలు ప్రదర్శించారు. ఇది రహదారి కాదు, (అ)సత్యం, మా ఇంట్లో మహాభారతం నాటికలు ఆకట్టుకున్నాయి. సమాజంలో దారితప్పిన యువ జంటకు సందేశాన్ని అందించేలా సాగిన మిత్ర క్రియేషన్స్ వారి శ్రీఇది రహదారి కాదుశ్రీ నాటికను ఆకురాతి భాస్కర్ రచించగా, ఎస్ఎం బాషా దర్శకత్వం వహించారు. మద్దుకూరు ఆర్ట్ క్రియేషన్స్, చిలకలూరిపేట వారి మా ఇంట్లో మహాభారతం నాటికను మద్దుకూరి రవీంద్రబాబు రచించగా.. నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. చెతన్య కళాస్రవంతి విశాఖపట్నం వారు రచించిన అ(సత్యం) నాటిక కంటికి కనిపించేదంతా సత్యం కాదు.. కనిపించనిదంతా అసత్యం కాదు. అబద్ధమైనా సరే అది ఒక మంచికి దోహదపడితే అది సత్యం అని తెలిపేదే ఈ నాటిక. పిన్నమనేని మృత్యంజయరావు రచించగా.. పి.బాలాజీనాయక్ దర్శకత్వం వహించారు. -
పునరావాసం ఎక్కడ సారూ?
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలకు ఆర్ అండ్ ఆర్ పరిహారాన్ని జమచేసిన ప్రభుత్వం వచ్చే జూన్ కల్లా వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ విషయమై ఇటీవల జరిగిన సమావేశంలో పనులు వేగవంతం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆప్షన్ 2 ను ఎంచుకున్న నిర్వాసితులకు ఇంతవరకు స్థలాలను అప్పగించలేదని ఉన్నట్టుండి గ్రామాలను ఖాళీ చేయమంటే తమ పరిస్థితి ఏంటని కొందరు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. స్థలం ఇవ్వనేలేదు.. ఖాళీ చేయమంటే ఎలా పోలవరం ప్రాజెక్ట్ 41.15 కాంటూర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గ్రామాలకు గతంలో సర్వే నిర్వహించిన ప్రభుత్వం ఆర్అండ్ఆర్ పరిహారానికి సంబంధించి నిర్వహించిన గ్రామసభలో నిర్వాసితుల వద్ద నుంచి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 కింద దరఖాస్తులను స్వీకరించింది. ఆప్షన్ 1 ఎంచుకున్న నిర్వాసితులకు ప్రభుత్వం ఆర్అండ్ఆర్ పరిహారం చెల్లించి ఇంటి నిర్మాణం ప్రభుత్వేమే చేపట్టి ఇస్తుంది. ఆప్షన్ 2 ఎంచుకున్న నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ పరిహారంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఎంత ఖర్చయితే చేస్తుందో ఆ మొత్తాన్ని నిర్వాసితుల ఖాతాల్లో జమచేస్తుంది. ఇంటి నిర్మాణాన్ని నిర్వాసితుడే చేపట్టుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ 3 ఎంచుకున్న వారికి ఇళ్లు, స్థలం రెండు వద్దనుకున్నారు కనుక వారికి ఆర్‌అండ్‌ఆర్‌తో పాటు ఆ రెంటికి అయ్యే ఖర్చును నిర్వాసితుల ఖాతాల్లో జమచేస్తుంది. ఈ విధంగానే ఇటీవల ఆర్అండ్ఆర్ పరిహారాన్ని నిర్వాసితుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. అయితే ఆప్షన్ 2 ను ఎంచుకున్న నిర్వాసితులకు ఇంతవరకు స్థలాలను స్థలాలను అప్పగించలేదు. దీంతో జూన్ కల్లా నిర్వాసితులను పునరావాస కాలనీలకు తరలించే ప్రక్రియ చేపడితే స్థలాలను అప్పగించకుండా ఇంటి నిర్మాణం చేసుకోకుండా అప్పటికప్పుడు గ్రామాలను ఖాళీ చేసి ఎక్కడికి వెళ్లాలని ఆప్షన్ 2కు దరఖాస్తు చేసుకున్న నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు తమకు స్థలాలను అప్పగిస్తే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించుకుంటామని ఆప్షన్ 2 నిర్వాసితులు కోరుతున్నారు. జూన్ కల్లా నిర్వాసితులను తరలించేందుకు ప్రభుత్వం చర్యలు నేటికీ ఆప్షన్ 2 నిర్వాసితులకు స్థలాలు చూపించని వైనం స్థలాలు అప్పగించండి నేను కుక్కునూరు ఏ బ్లాక్ నిర్వాసితుడిని. ఆర్అండ్ఆర్ గ్రామ సభలో ఆప్షన్ 2 కు దరఖాస్తు చేసుకున్నాను. అయితే పునరావాస కాలనీల్లో నాకు కేటాయించిన స్థలానికి సంబంధించి పట్టాను అధికారులు అందించారు. కాని ఇంతవరకు నా స్థలం ఎక్కడుందో చూపించలేదు. మా స్థలాలను అప్పగిస్తే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటాం. అప్పటికప్పుడు ఇళ్లను ఖాళీ చేయమంటే మేము ఉన్నట్టుండి ఎక్కడికెళ్లాలో అధికారులే ఆలోచించాలి. – వినపాల ప్రభాకర్, నిర్వాసితుడు, కుక్కునూరు -
ముగిసిన మదనగోపాల స్వామి కల్యాణోత్సవాలు
అత్తిలి: బల్లిపాడు శ్రీమదనగోపాలస్వామి కల్యాణ మహోత్సవాలు శ్రీపుష్పయాగోత్సవంతో ముగిశాయి. శ్రీ స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పాలతో అలంకరించిన పల్లకీలో ఉంచి పవళింపు సేవ జరిపారు. ఆలయ అర్చకులు దంపతులకు తాంబూళాలు అందజేశారు. హాజరైన మహిళా భక్తులకు కుంకుమ భరిణీలు పంపిణీ చేశారు. లక్కీడ్రా నిర్వహించి డ్రాలో గెలుపొందిన ముగ్గురుకి స్వామివారి చిత్రపటాలను ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా హాజరైన భక్తులకు 12 రకాల ప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు గారపాటి వెంకట సుబ్బారావు, గారపాటి శివకృష్ణ అశోక్, బుద్ధాల భాస్కరరావు, ఆకుల వెంకటేశ్వరరావు, తోట శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ వ్యవహారంపై విచారణ భీమవరం: భీమవరం పట్టణంలోని శ్రీవేంకటేశ్వర బధిరోన్నత పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బందిని అధికారులు ఆదివారం విచారించారు. ప్రిన్సిపాల్ పి.పద్మనాభరాజు తమను దూషించారంటూ పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 19 మంది ప్రైవేటు ఉద్యోగులు ఇటీవల ఆరోపించారు. ఈ విషయమై ఈనెల 10న పాఠశాలలో ఆందోళన వ్యక్తం చేయడంతో తాను తిట్టడం వాస్తవమని, మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తిట్టానని, మన్నించాలంటూ లేఖను ప్రిన్సిపాల్ రాసి ఇచ్చారు. ఉద్యోగం నుంచి కూడా తప్పుకుంటున్నానంటూ చెప్పారు. సంఘటన జరిగి వారం రోజులవుతున్నా తమకు న్యాయం జరగడంలేదని ఉద్యోగినులు ఆరోపించారు. దీనిపై నాలుగు రోజుల కిందట తమకు వచ్చిన ఆదేశాల మేరకు విచారణకు వచ్చినట్లు తితిదే విద్యాశాఖ అధికారిణి విజయలక్ష్మి చెప్పారు. నివేదికను ఈవోకు అందజేస్తానన్నారు. పోస్టాఫీసులో చోరీ యత్నం జంగారెడ్డిగూడెం: స్థానిక హెడ్ పోస్టాఫీసులో ఆదివారం చోరీ యత్నం జరిగింది. పోస్టాఫీసు వెనుక తలుపుల తాళాలు పగులగొట్టి దుండగుడు లోనికి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. నైట్ వాచ్‌మన్ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే సరికి పోస్టాఫీసు వెనుక తలుపు తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టాఫీసులో ఏవీ చోరీకి గురికాలేదని గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ భీమవరం: ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి ఎక్కువ రేటుకు విక్రయిస్తున్న ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు భీమవరం ఎకై ్సజ్ సీఐ బలరామరాజు తెలిపారు. ప్రధాన ముద్దాయి షణ్ముగం ప్రభును పీటీ వారెంట్‌పై చైన్నె నుంచి తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారన్నారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో గత జనవరిలో ముద్దాయిలను గుర్తించి వారిని అరెస్ట్ చేశామన్నారు. -
చిన్నారులను హింసించిన ఘటనలో కేసు నమోదు
జంగారెడ్డిగూడెం: చిన్నారులను హింసించిన ఘటనకు సంబంధించి స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను ఐసీడీఎస్ పీవో బ్యూలా, సూపర్వైజర్ లక్ష్మి పరామర్శించారు. శనివారం నుంచి చిన్నారులకు అందుతున్న వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మారుటి తండ్రి పుచ్చకాయల దుర్గాప్రసాద్ చిన్నారులు సాత్విక్, కరుణసత్యలను కొట్టి హింసించిన ఘటనపై పోలీసులు వివరాలు సేకరించారు. మరో రెండు రోజులు చిన్నారులను పర్యవేక్షణలో ఉంచనున్నట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ బేబీ కమల తెలిపారు. సాత్విక్‌కు సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనలో దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై షేక్‌జబీర్ తెలిపారు. -
ప్రోత్సాహం బాగుంది
ప్రభుత్వం బొప్పాయి పంటకు ఇచ్చే ప్రోత్సాహం బాగుంది. ఎకరాకు మల్చింగ్ షీటుకు రూ.6,500, మొక్కలకు రూ.9,865 సబ్సిడీ ఇస్తున్నారు. వైరస్ తెగుళ్లు ఆశించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించవచ్చు. మద్దిపాటి దిలీప్, ఉద్యాన వన సహాయకుడు, గొల్లగూడెం, బొప్పాయి పంటతో మంచి లాభాలు బొప్పాయి పంట అంతర పంటగా వేసుకునేందుకు అనుకూలంగా ఉంది. నా తోటలో కాపు బాగుంది. 2 టన్నులు సైకిళ్ల వాళ్లకి అమ్మాం. డిల్లీకి ఎగుమతి చేసేందుకు కొందరు వచ్చారు. పూర్వం అంతర పంటగా పొగాకు వేసే వాళ్లం. అయితే బొప్పాయి సాగు బాగుంది. గన్నమని రామకృష్ణ, రైతు, గొల్లగూడెం -
ఆరేళ్లకు చిక్కిన ముద్దాయి
ఏలూరు (టూటౌన్): ఏలూరు త్రీ టౌన్లో నమోదైన కేసులో ఆరేళ్ల నుంచి పరారీలో ఉన్న ముద్దాయిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. 2019లో నమోదైన చీటింగ్ కేసులో మూడో పట్టణ పోలీసులు పురోగతి సాధించారు. ఏ2 ముద్దాయిని అరెస్టు చేశారు. మూడో పట్టణ పరిధిలో 2019లో 140/2019 క్రైమ్ నెంబర్‌పై చీటింగ్ కేసు నమోదైంది. అమలాపురానికి చెందిన చిలుకూరి దీపక్ వర్మ విజయవాడకు చెందిన పొన్నం సైదేశ్వర చౌదరి, పొన్నం లక్ష్మీ కుమారితో కలిసి మలేషియాలో మ్యాన్ పవర్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు దానికి సంబంధించి కొంతమంది ఉద్యోగులను నియమించుకున్నట్లు తెలిపారు. ఏలూరుకు చెందిన గుడిపూడి చక్రవర్తి 22 మంది నిరుద్యోగులతో వారిని కలిశాడు. ఈ 22 మంది రూ.17.50 లక్షలు విమాన టికెట్లు, దారిఖర్చుల కోసం ఇచ్చారు. ఐదుగురికి విమాన టికెట్లు పంపారు. ఆ టికెట్లు తీసుకుని చైన్నె ఎయిర్‌పోర్టుకు వెళ్ళగా అవి నకిలీవని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు గత ఆరేళ్లుగా పరారీలో ఉండగా మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు వారిలో సైదేశ్వర చౌదరని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. -
వెదురు వస్తువుల తయారీలో నైపుణ్యం సాధించాలి
బుట్టాయగూడెం: వెదురు వస్తువుల తయారీలో మరింత నైపుణ్యాన్ని సాధించేలా గిరిజన మహిళలకు తోడ్పాటు అందిస్తామని అటవీ శాఖ సీసీఎఫ్ బీఎంఎం మూర్తి, మహారాష్ట్రకు చెందిన పారిశ్రామికవేత్త కాన్‌బ్యాంక్ సంస్థ ప్రతినిధి సంజీవ్ కార్పే తెలిపారు. పులిరామన్నగూడెంలో అటవీ ఉత్పత్తులు తయారు చేసే శిక్షణా కేంద్రాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ గిరిజన మహిళలు తయారు చేసిన వివిధ రకాల వెదురు కళాకృతులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వెదురు వస్తువులతో గిరిజన మహిళలు తయారు చేసిన కళాకృతులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేలా తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం మండలంలోని ముంజులూరు, ఉప్పరిల్ల, ఒర్రింక, కల్లుమామిడి, చింతపల్లి, గోగుమిల్లి, తదితర ప్రాంతాల్లో అడవుల్లో వస్తువుల తయారీకి అనుకూలంగా ఉన్న వెదురును పరిశీలించారు.కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీశుభం, రీసెర్చ్ డీఎఫ్ఓ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పామాయిల్లో బొప్పాయి సాగు
ఉంగుటూరు: మెట్ట ప్రాంతంలో పామాయిల్ తోటలో అంతర పంటగా బొప్పాయి సాగు చేస్తున్నారు. ఫలితాలు బాగండటంతో విస్తీర్ణం పెరుగుతోంది. రెండు సంవత్సరాల పంట కాలంలో దిగుబడి బాగుందని రైతులు చెబుతున్నారు. ఎకరానికి 15 నుంచి 20 టన్నులు దిగుబడి లభిస్తోంది. మండలంలోని రావులపాలెం చుట్టు పక్కల గ్రామాల్లోని బొప్పాయి నర్సరీల నుంచి మొక్కలు తీసుకొచ్చి పెంచుతున్నారు. పామాయిల్ మొక్క తోటలో బొప్పాయి పంట సాగు చేస్తున్నారు. ఎకరాకు 900 మొక్కలు పడుతుండగా.. 8 అడుగులు వెడల్పులో బెడ్లు ఏర్పాటుచేసి మొక్కకి మొక్కకి మధ్య 6 అడుగులు వ్యత్యాసం ఉండేలా నాటాలి. పంట కాలంలో దోమ, నల్లి, తామర పురుగు ఆశిస్తే మందులు పిచికారి చేస్తే సరిపోతోంది. కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు సీజన్ ప్రకారం ధర పలుకుతోంది. ఎకరాకు ఖర్చు రూ.లక్ష వరకూ అవుతుందని.. అయితే రూ.లక్షకు పైనే లాభం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పంటకు హార్టీకల్చర్ శాఖ సబ్సిడీ అందిస్తుంది. మల్చింగ్ షీటు వేస్తే ఎకరాకు 6400 సబ్సిడీ ఇస్తున్నారు. ఎకరాకు మరో రూ.9,865 సబ్సిడీ ఇస్తున్నారు. ఉంగుటూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల, భీమడోలు, కామవరపుకోట తదితర మండలాల్లో పామాయిల్ తోటలో అంతరపంటగా బొప్పాయి వేస్తున్నారు. ఎకరానికి 15 నుంచి 20 టన్నుల దిగుబడి -
రైలు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి మృతి
ఏలూరు టౌన్: చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి ప్రమాదవశాత్తు రైలు ఢీకొని మృతిచెందారు. ఏలూరు రైల్వే ఎస్ఐ సైమన్ తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ఏలూరు సత్రంపాడు ప్రాంతానికి చెందిన సందోలు నవీన్ సాగర్(42) పెదవేగి మండలం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో ఓఈటిగా పనిచేస్తున్నాడు. ఆదివారం ఏలూరు సీఆర్ రెడ్డి కళాశాల రైల్వే ట్రాక్ సమీపంలో రైలు పట్టాలను దాటుతున్న సమయంలో గుర్తుతెలియని రైలు ఢీకొట్టింది. నవీన్ సాగర్ అక్కడికక్కడే మృతిచెందారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాక్‌కు దూరంగా మృతదేహం ఉండడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్య...హత్య? లేక ప్రమాదమా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ‘పది’ పరీక్షల సిబ్బంది నిబంధనలు పాటించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పరీక్షల విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ సూచించారు. పరీక్షల సిబ్బంది విధిగా గుర్తింపు కార్డులు ధరించాలని, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షా కేంద్రంలోని సిబ్బందితో బంధుత్వాలు లేవని విధిగా సర్టిఫికెట్ తీసుకోవాలన్నారు. స్టోరేజ్ పాయింట్లో ప్రశ్నాపత్రాలు తీసుకొన్న వెంటనే సరైన సంఖ్యలో ఉన్నాయో లేవో, ఆ రోజుకి సంబంధించిన సబ్జెక్ట్/ పేపర్ కోడ్ వంటివి సరిచూసుకోవాలని, పుకార్లు, అనధికార వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసే వ్యక్తులపై సైబర్ నేరం కింద చర్యలు తీసుకుంటారన్నారు. విద్యార్థుల సహాయార్థం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో 8466974001 నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. -
‘దాచుకో.. దోచుకో.. పంచుకో.. చంద్రబాబు పాలన ఇదే’
సాక్షి, ఏలూరు జిల్లా: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛతలో రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు.వైఎస్ జగన్ హయాంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా క్లాప్ వెహికల్స్ పెట్టారని. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ను వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. స్వచ్ఛ భారత్ క్లాప్ వ్యాన్లను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందని.. వాటిని తొలగించడంతో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.‘‘చంద్రబాబు పర్యటనలో తణుకును దిగ్బంధం చేశారు. తేతలిలో పశువధ కర్మాగారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. పశువుల కర్మాగారం పక్కనున్న ఎఫ్‌సీఐ గోడౌన్లు సైతం ఖాళీ చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చినా కానీ.. పశువధ కర్మాగారం వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. పశువధ కర్మాగారం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాల చుట్టూ పశువధ కర్మాగారం బాధితులు తిరిగిన వారికి న్యాయం జరగలేదు. పశువధ దుర్గంధంతో తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు’’ అని కారుమూరి పేర్కొన్నారు.‘‘ఆరుమిల్లి రాధాకృష్ణకు పావలా ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. లిక్కర్, గంజాయిలో దాచుకో.. దోచుకో.. పంచుకో అన్న రీతిలో పాలన సాగుతుంది. వైఎస్ జగన్ బస్సులో వెళ్లేటప్పుడు ఎవరైనా వినతిపత్రం చూపిస్తే వెంటనే స్పందించేవారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర సభలో చంద్రబాబు భజనే సరిపోయింది. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు అందులో ఐదు పూర్తయ్యాయి. 750 మెడికల్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి గ్రామంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు రైతుభరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు దర్శనమిస్తాయి. 9 నెలలోనే చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. వైఎస్ జగన్ పథకాలు కొనసాగించక పోగా మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేదు.17 లక్షల రైతులు వద్ద రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం మీరు గతంలో కొంటే వైఎస్ జగన్ హయాంలో 37 లక్షల మంది రైతుల వద్ద మూడు కోట్ల 40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాము. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ విధానాలు ఎత్తేశారు. చంద్రబాబు రైతుల నడ్డి విరిచేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలు బాధలతో అల్లాడిపోతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, తల్లికి వందనం ఊసే లేదు.. నీకు 15000 నీకు 18000 అన్నారు వాటి ఇప్పుడు ఆ 15 లేదు 18 లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీ హయాంలోనే వచ్చింది. పయ్యావుల కేశవ్ గతంలో ఇది చాలా మంచిదని అనలేదా..?. మేము దాన్ని అమలు చేస్తే బురదజల్లారురూ.75,000 ఉండే మెడికల్ కాలేజీ ఫీజు లక్ష ఇరవై వేలకు పెంచేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే ఆ పథకాలన్నీ నిలిపివేశారు. పేద ప్రజలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా?. సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. -
ఆస్తి తగాదాలో.. కుటుంబంపై దాడి
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆస్తుల పంపకాలపై కోర్టులో కేసు జరుగుతున్న నేపథ్యంలో తాము నివాసం ఉంటున్న ఇంటిని జేసీబీతో పడగొట్టేందుకు ప్రయత్నించి మాపై దాడి చేసి చంపబోయారని చల్ల చింతలపూడికి చెందిన ముమ్మడి సత్యనారాయణ, మల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు దెందులూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాము ఉంటున్న ఇంటి పైకప్పు గతంలో పడగొట్టారని, తాటాకులు వేసుకొని ఉంటున్నామన్నారు. ఇంటికున్న తాటాకులు కూడా తీసివేసి జేసీబీతో ఇల్లు పడగొట్టేందుకు యత్నించారని, అడ్డుకున్న తమను తమ కుటుంబ సభ్యులు చవల వరలక్ష్మి భర్త అర్జున్ రావు కొడుకులు శివరామకృష్ణ ప్రసాద్ కొట్టి చంపబోయారని ఆరోపించారు. -
పది విజయానికి.. పన్నెండు సూత్రాలు
గణపవరం: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల గడువు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్ధుల్లో భయం, ఆందోళన, పెరిగిపోతోంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో అయితే ఆందోళన మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నిరంతర సాధన, గుండెలనిండా ధైర్యం, నమ్మకమే విజయతీరాలకు చేర్చుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. ప్రతి విద్యార్ధి పదోతరగతిలో విజయ కేతనం ఎగరవేయడానికి ఈ పన్నెండు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. భయం వద్దు అనవసర భయాలవల్ల టెన్షన్ వస్తుంది. పరీక్షలపై దృష్టిపెట్టి, ఆయా సబ్జెక్టుల్లో నిరంతర సాధన చేయాలి. విద్యార్థులు ప్రతి రోజూ పదినిముషాలపాటు ధ్యానం లేదా పూజ చేస్తే మంచిది. సందేహమెందుకు? చదివిన ప్రశ్నలు రాకపోతే.. చదివింది గుర్తుకు రాకపోతే... లాంటి ఆలోచనలు దరిచేరనీయవద్దు. ప్రణాళిక ముఖ్యం ఎంత చదివామన్నది ముఖ్యంకాదు.. ప్రణాళికతో ఎలా చదివామన్నది ముఖ్యం. జాగ్రత్త అవసరం చదువు ధ్యాసలో పడి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. వేళకు తేలికపాటి, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. పండ్లరసాలు, కొబ్బరిబొండం నీరు, మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. మంచి నిద్ర మేలు సరైన మోతాదులో నిద్ర అవసరం. పరీక్షల సమయంలో అర్ధరాత్రి దాటే వరకూ చదవడం వల్ల ఉపయోగం ఉండదు. రాత్రి పదిగంటలకు పడుకుని, వేకువజామునే లేచి చదివితే మంచిది. కొత్త విషయాల జోలికి పోవద్దు పరీక్షల సమయంలో కొత్తవిషయాలు నేర్చుకునే ప్రయత్నం వద్దు. ఈ సమయంలో కేవలం రివిజన్ మాత్రమే చేయాలి. ఇదివరకు చదవని ప్రశ్నలు మరీ ముఖ్యమైనవి అయితేనే తప్ప నేర్చుకునే ప్రయత్నం చేయవద్దు. సెల్ఫోన్లకు దూరం పరీక్షల సమయంలో సెల్‌ఫోన్ చూడటం, సెల్‌ఫోన్ ముచ్చట్లు, ఫ్రెండ్స్‌తో చర్చలు అనవసరం. ముందుగా వెళ్లడం శ్రేయస్కరం పరీక్షకు అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరండి. దారిలో ప్రయాణంలో చదవడం, పరీక్షా గదిలోకి వెళ్లేముందు ఓసారి పుస్తకం తీసి చూడాలన్న ఆలోచనే వద్దు. ఇతరులను పట్టించుకోకండి పరీక్ష రాసే సమయంలో పక్కకి చూడవద్దు. ఎవరు ఎన్ని ఎడిషనల్ షీట్లు తీసుకుని రాస్తున్నారన్నది పట్టించుకోకండి. అది మీలో తెలియని ఆందోళన పెంచుతుంది. తెలిసిన ప్రశ్నలకు ముందు ప్రాధాన్యత బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా జవాబులు రాయండి. సాధ్యమైనంత వరకూ దిద్దుబాటు లేకుండా చూడండి. టైం పూర్తయ్యేవరకూ పరీక్షాహాలు వదిలి రాకండి. హాల్‌టికెట్ నంబరు, ప్రశ్నల నంబర్లు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవడం మంచిది. ప్రశాంతంగా ఉండండి మామూలు రోజుల్లో ఎలా ఉంటారో పరీక్షలప్పుడు కూడా అలాగే ప్రశాంతంగా ఉండండి. పరీక్షరాసిన వెంటనే ఇంటికి రావడం మంచిది. ఫలానా ప్రశ్నకు సమాధానం సరైనదేనా కాదా అంటూ స్నేహితులతో చర్చ పెడితే ఒకరు రైట్అని, మరొకరు రాంగ్ అని చెబితే మీరు పూర్తి కన్ఫ్యూజన్లోకి వెళ్లిపోయి, మరుసటి రోజు పరీక్షపై అనవసర భయం ఏర్పడుతుంది. విసుక్కోవద్దు.. పోల్చవద్దు తల్లిదండ్రులు పిల్లలను విసుక్కోవడం, చదవడంలేదని తిట్టడంవంటివి చేయవద్దు. పరీక్షలు రాస్తున్న పిల్లలను పంక్షన్లు వంటి ఇతర కార్యక్రమాలకు తీసుకెళ్లడం మంచిదికాదు. ముఖ్యంగా ఇతర విద్యార్ధులతో మీ పిల్లలను అస్సలు పోల్చవద్దు. ఆహారపు అలవాట్లతో అప్రమత్తం పరీక్షకు వెళ్లడానికి రెండుగంటల ముందు కొబ్బరినీళ్లు తాగాలి. తేనె, నిమ్మరసం, వేడి గంజి వంటివాటిలో ఏదైనా మంచిదే. దీనివలన శక్తి వస్తుంది. బయట ఆహారం, ఫాస్ట్ఫుడ్స్వంటి వాటికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. మొలకలు, క్యారెట్, కీరదోస వంటివి తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది. ఇవి శరీరానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. – పి.కిరణ్మయి. వైద్యాధికారిణిపునశ్చరణకే ప్రాధాన్యం పరీక్షల సమయంలో కొత్తవి చదివేకన్నా పునశ్చరణకే ప్రాధాన్యత ఇవ్వాలి. పరీక్షరోజున వేకువజామునే లేచి కొంతసమయం ముఖ్య, అతి ముఖ్య ప్రశ్నలు ఒకసారి మననం చేసుకుంటూ చదివితే మంచిది. పరీక్ష పేపరులో అక్షరాలు పొందికగా, పెద్దగా, చూడముచ్చటగా ఉండాలి. ఇంగ్లీషులో గ్రామర్, లెక్కల్లో ఫార్ములాలు, సైన్సులో డయాగ్రమ్‌లు, సోషల్‌లో మ్యాప్‌లు బాగా ప్రాక్టీస్ చేయండి. పరీక్షల సమయంలో సెల్‌ఫోన్‌కు విశ్రాంతి ఇవ్వడం మరచిపోవద్దు. – గొర్రెల బాలయ్య, సబ్జక్టునిపుణులు, ఎంఈవో–2 -
పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం
పది నెలలైనా పత్తా లేరు నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి ఓ పక్క పనులు జరుగుతుండగా మరోపక్క కళాశాల పార్కింగ్ స్థలంలో నిలబడి ఇక్కడ ఏ పనులూ జరగడం లేదంటూ చాలా హడావుడి చేసి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడ అంతా బురదే తప్ప పనులేమీ జరగడం లేదని తమ అనుకూల శ్రీపచ్చశ్రీ మీడియా ద్వారా రాద్ధాంతం సృష్టించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తోంది. అధికారంలో లేనప్పుడు మెడికల్ కళాశాల చుట్టూ తిరిగి రాద్ధాంతం చేసిన రామానాయుడు నేడు మంత్రి హోదాలో ఉండి మెడికల్ కళాశాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. మెడికల్ కళాశాల వద్దకు వెళితే కాంట్రాక్టర్‌ను ప్రశ్నించలేని దుస్థితి. బిల్లులు విడుదల చేస్తే తాము పనులు మొదలు పెడతామని కాంట్రాక్టర్ ఎదురు ప్రశ్నిస్తారేమోననే భయంతో మంత్రి నిమ్మల మెడికల్ కళాశాల వైపు వెళ్లడం లేదనే ప్రచారం జరుగుతోంది. మెడికల్ కళాశాల పనులు త్వరగా పూర్తయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతో పనులు ఆపించారని, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి ఆపై నిధులు రిలీజ్ చేసి తమ హయాంలోనే మెడికల్ కళాశాల పూర్తయిందని గొప్పలు చెప్పుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పడకేశాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్న సమయంలో.. నాడు ప్రతిపక్షంలో ఉన్న రామానాయుడు, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మెడికల్ కళాశాల వద్దకు వెళ్లి పనులు ఏమీ జరగడం లేదని నానా యాగీ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా అప్పుడు అల్లరి చేసిన టీడీపీ పెద్దలు వివిధ పదవుల్లో ఉండి కూడా ఇప్పటివరకు కశాళాల వైపే కన్నెత్తిచూసిన పాపాన పోలేదు. కనీసం బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంతో ప్రస్తుతం కళాశాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. సుమారు రూ.75 కోట్లు వృథాయేనా..? పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, పరిసర ప్రాంత ప్రజలు మెడిసిన్ విద్య అభ్యసించే నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు 60 ఎకరాల్లో రూ.475 కోట్ల వ్యయంతో ఇక్కడ మెడికల్ కళాశాల మంజూరు చేశారు. వర్చువల్ పద్ధతిలో ఆయన శంకుస్థాపన కూడా చేశారు. 2023 ఫిబ్రవరిలో ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకున్న మెగా కన్స్ట్రక్షన్ ఆగస్టులో పనులు ప్రారంభించింది. మొత్తం నిర్మాణం చేయాల్సిన బ్లాక్‌లు 16 కాగా మొదలుపెట్టిన బ్లాక్‌లు 3. వాటిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ బ్లాక్‌లు ఫైల్స్ వర్క్‌లు (పిల్లర్ పనులు) పూర్తవ్వగా, 24 గంటల సర్వీస్ బ్లాక్‌లో 82 శాతం ఫైల్స్ వర్క్ పనులు పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.75 కోట్ల విలువైన పనులు పూర్తిచేశారు. వీటి నిమిత్తం ఇంకా సుమారు రూ.30 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్టు సమాచారం. అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ పనులు నిలుపుదల చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ సైట్లో ఉన్న ఇసుక, ఇనుము, కంకర వంటి మెటీరియల్‌ను మెగా కంపెనీకి సంబంధించి మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల నిమిత్తం తరలించేశారు. మొత్తం సైటు ఖాళీ చేసేశారు. నాడు ఓ పక్క పనులు జరుగుతున్నా ఏమీ జరగడం లేదంటూ నిరసనలు నేడు పది నెలలైనా ఆ వైపే చూడని మంత్రి నిమ్మల మెడికల్ కళాశాల బిల్లులు రాక పనులు నిలుపుదల చేసిన సంస్థ ఇప్పటి వరకూ జరిగిన రూ. 75 కోట్ల పనులు గంగపాలేనా...? ఇదీ దగ్గులూరు మెడికల్ కళాశాల దుస్థితి -
ప్లాస్టిక్ రహిత నగరంగా మారుద్దాం
ఏలూరు (టూటౌన్): ఏలూరును ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపు నిచ్చారు. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం సాధ్యమని అన్నారు. శనివారం ఏలూరు ఆర్ఆర్ పేటలోని ఎన్టీఆర్ పార్కు వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్, ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ రిజర్వాయర్ ప్రహరీ గోడకు పెయింటింగ్ వేశారు. సభలో ప్రతిజ్ఞ నిర్వహించి స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా మూడో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. చిత్తశుద్ధితో అందరూ పరిశుభ్రత పాటించాలని చెప్పారు. వంద మైక్రోన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ బదులు క్లాత్, జ్యూట్ వంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగించాలన్నారు. మేయర్ షేక్ నూర్జహాన్, కమిషనర్ భాను ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
బాలుడిని గొలుసులతో కట్టేసిన వైనం
క్రొవ్విడిలో దారుణం నిడమర్రు: కొల్లేరు జీరాయితీ చేలల్లో చేపలు పడుతున్నాడంటూ ఓ బాలుడిని కొట్టి గొలుసుతో కట్టేసిన సంఘటన శుక్రవారం నిడమర్రు మండలం క్రొవ్విడిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం 5వ కాంటూరు పరిధిలో నిరుపయోగంగా ఉన్న చేలల్లో ఉప్పరగుడెంకు చెందిన తాటిపర్తి బుజ్జన్న కుమారుడు లోకేష్ వరుణ్ చేపలు పడుతుండడం గమనించిన అదే గ్రామానికి చెందిన గండికోట వెంకన్న, పండు అతన్ని గ్రామంలోకి తీసుకొచ్చి గొలుసుతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడినా వదలలేదు. లోకేష్ తాత, మావయ్య విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు. అప్పుడు బాలుడ్ని విడిచి పెట్టినట్లు తెలిసింది. లోకేష్ తండ్రి సాక్షితో మాట్లాడుతూ సుమారు 3 గంటల పాటు తన కొడుకుని కట్టేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
పెదవేగి : మోటార్‌సైక్లిస్టు చెట్టును ఢీకొని మృతి చెందిన ఘటన కొప్పాకగూడెంలో చోటుచేసుకుంది. పెదవేగి ఎస్సై కె రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం విజయరాయి గ్రామానికి చెందిన మరీదు రాంబాబు (57శ్రీ శనివారం విజయరాయి నుంచి బొమ్ములూరు వెళుతుండగా కొప్పాకగూడెం వద్దకు వెళ్లేసరికి ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మామపై అల్లుడు హత్యాయత్నం ఏలూరు టౌన్: మామపై అల్లుడు హత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఇది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు తంగెళ్ళమూడి కబడ్డీగూడెంకు చెందిన ధర్మవరపు శ్రీను కుమార్తె జ్యోతికి కొత్తపల్లి వెంగళరావుతో 18 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వెంగళరావు మద్యానికి బానిసై ఇటీవల భార్య జ్యోతిని ఇష్టారాజ్యంగా కొడుతూ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ నెల 14న భర్త వేధింపులు భరించలేక జ్యోతి తండ్రి ఇంటికి వచ్చింది. వెంగళరావు అక్కడకు రావడంతో మామ, అల్లుడి మధ్య వాగ్వివాదం చెలరేగి గొడవగా మారింది. వెంగళరావు తనతో తెచ్చుకున్న బ్లేడుతో మామ శ్రీనుపై దాడి చేశాడు. అనంతరం మరోసారి రాత్రివేళ వచ్చి తన భార్యను పంపాలంటూ గొడవకు దిగాడు. మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరగగా అల్లుడు వెంగళరావు తనతో తెచ్చుకున్న కత్తితో మామ శ్రీనును పొడిచాడు. తీవ్ర గాయాలు కావడంతో భార్య లక్ష్మి, మనవడు కొత్తపల్లి నాగు శ్రీనుని ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆసుపత్రి వైద్యులు మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి ఆసుపత్రిలోని పోలీస్ ఔట్‌పోస్టుకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఏలూరు టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలు ఉంగుటూరు: జాతీయరహదారిపై శనివారం కై కరం నుంచి భీమడోలు వెళుతున్న రెండు బైకులు ఢీకొని నలుగురుకి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాల ప్రకారం ముందు వెళుతున్న బైక్‌ను ఓవర్టేక్ చేస్తుండగా రెండు బైక్‌ల హేండిళ్లు లింక్ అవడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులది కూరెళ్లగూడెం, పత్తేపురం గ్రామాలు అని తెల్సింది. క్షతగాత్రులు కె.సుగుణ (38), కె.శాంతిరాజు (39), జాన్సి (46), సాయికిరణ్(24) ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
చిన్నారులపై మారుటి తండ్రి దాడి
జంగారెడ్డిగూడెం: చిన్నారులను పాశవికంగా హింసించిన ఘటన మరోసారి జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. రెండవ భర్త దాడిలో వివాహిత, ఆమె సంతానం దాడికి గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణానికి అంకుశం జ్యోత్స్న, పూతి ఉమామహేశ్వరరావు భార్యభర్తలు. వీరి సంతానం సాత్విక్ (11) 4వ తరగతి చదువుతున్నాడు. కరుణ సత్య (8) 2వ తరగతి చదువుతున్నారు. కాగా జ్యోత్స్న ఉమామహేశ్వరరావుకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో పుచ్చకాయల దుర్గాప్రసాద్ అనే వ్యక్తితో ఆమెకు పరిచయం కాగా వారు గౌరీ పట్నంలో వివాహం చేసుకుని స్థానిక సుబ్బంపేట రోడ్డులో నివాసం ఉంటున్నారు. గత మూడు రోజులుగా దుర్గాప్రసాద్ మద్యం సేవించి వచ్చి పిల్లలు సాత్విక్, కరుణసత్యలను కొడుతున్నాడు. అడ్డుకోబోయిన జ్యోత్స్నపై కూడా దాడి చేశాడు. స్థానికులు గాయపడిన సాత్విక్‌ను శనివారం ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు సాత్విక్‌కు చికిత్స అందిస్తుండగా, జ్యోత్స్న, కరుణసత్య ఆసుపత్రిలోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న సీడీపీవో బ్యూలా, సూపర్వైజర్, అంగన్వాడీ సిబ్బంది ఆసుపత్రికి వెళ్లి జ్యోత్స్న, చిన్నారులను అడిగి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. సీఐ వి.కృష్ణబాబు వివరాలు సేకరించారు. గతంలో కూడా దుర్గాప్రసాద్ తనను చంపడానికి ప్రయత్నించాడని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు జ్యోత్స్న తెలియజేసింది. గాయపడిన చిన్నారి సాత్విక్‌కు ఏరియా ఆసుపత్రిలో చికిత్స వివరాలు సేకరించిన అధికారులు -
సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాలి
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఆదివాసీలపై ఉందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాల్లో వారు పాల్గొని పూజారి వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తొలుత బాలరాజు దంపతులకు ఆలయ కమిటీవారు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం బాలరాజు, రాజ్యలక్ష్మి దంపతులు కొద్దిసేపు గిరిజన సంప్రదాయ డోలు కొయ్యి నృత్యాలు చేసి సందడి చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు, గుజ్జు రామారావు, తదితరులు బాలరాజు దంపతులను శాలువా కప్పి సత్కరించారు. నూజివీడులో చోరీ నూజివీడు: తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన ఘటన నూజివీడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం పట్టణంలోని బాపూనగర్‌లో చెరువుగట్టు ప్రసాద్ అనే వ్యక్తి ఈ నెల 8న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హనుమాన్‌జంక్షన్‌లోని బంధువుల పెళ్లికి వెళ్లాడు. శనివారం ఉదయం తలుపు తీసి ఉండటం పక్కింటి వారు వెంటనే ప్రసాద్‌కు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో వెంటనే అతను హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చి చూడగా ఇంట్లోని బీరువా, అరమరలు అన్నీ తీసి వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. ఇంట్లో ఉంచిన రూ.2 లక్షల నగదును దొంగలు చోరీ చేసినట్టు గుర్తించాడు. దీనిపై పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ సత్య శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏలూరు నుంచి క్లూస్ టీం వచ్చి ఆధారాలు సేకరించారు. కాగా నాలుగు రోజుల క్రితం ఎంప్లాయిస్ కాలనీలో సైతం దొంగలు పడ్డారు. రెండిళ్ల తాళాలు పగులగొట్టి జొరబడ్డారు. అయితే ఆ ఇళ్లలో ఏ నష్టం జరగలేదని తెలిసింది. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ఉంగుటూరు: చేబ్రోలు రైల్వేస్టేషన్‌లోని వెయింటింగ్ హాల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలు ఉంటుందని, తెలుగురంగు చిన్ని గీతల పుల్ హ్యండ్ షర్టు, బిస్కట్ రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నట్లు రైల్వే ఎస్సై పి.అప్పారావు తెలిపారు. మృతదేహన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలిస్తే 94906 17090, 99480 10061 నంబర్లలో తెలియజేయాలన్నారు. -
ట్రిపుల్ ఐటీలో సిగ్నస్ వేడుకలు
నూజివీడు: స్థానిక ట్రిపుల్ ఐటీలో రెండురోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన సాంస్కృతిక సంబరాల వేడుక సిగ్నస్–25 శనివారం రాత్రి ముగిసింది. మరుగున పడుతున్న సంస్కృతి సంప్రదాయాలను భావి తరాల వారికి తెలపడమే లక్ష్యంగా సిగ్నస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిస్టర్ అండ్ మిస్ ఆర్జీయూకేటీ, కిచెన్ క్రానికల్, సినీవేర్స్, కాన్వాస్ ఆఫ్ హెరిటేజ్, రంగోలీ ఆర్ట్ ఫెస్ట్ తదితర పోటీలను నిర్వహించారు. విద్యార్థులు వినోదకరమైన గేమ్ స్టాల్స్ ఏర్పాటు చేసి క్యాంపస్ మొత్తం ఉల్లాసకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. అంతేగాకుండా సంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించి ఉత్సాహాన్ని కలిగించారు. ఈ సంబరాల్లో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌చే నిర్వహించబడిన నవదుర్గ–అష్టలక్ష్మి నృత్యప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనతో శక్తి, భక్తి, కళా వైభవం ఉట్టిపడింది. మిస్టర్ ఆర్జీయూకేటీగా యశ్వంత్‌కుమార్ , మిస్ ఆర్జీయూకేటీగా రిష్పా నిలిచారు. తోలుబొమ్మలాట నిర్వహించి అనాదిగా వస్తున్న కళను నేటి విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు చూపించారు. దీనికిగాను కాకినాడకు చెందిన తోట బాలకృష్ణమూర్తి బృందం రామాయణంలోని సుందరకాండను ప్రదర్శించారు. అనంతరం బాలకృష్ణమూర్తి బృందాన్ని అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఏఓ బీ లక్ష్మణరావు, సెంట్రల్ డీన్ దువ్వూరు శ్రావణి, డీన్ అకడమిక్స్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణలో టెక్నాలజీ సాయం
జంగారెడ్డిగూడెం: శాంతి భద్రతల పరిరక్షణకు సాంకేతికతను వినియోగిస్తున్నామని ఎస్పీ కేపీఎస్ కిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, కేసుల తీరు, శాంతిభద్రల కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వార్షిక తనిఖీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్‌ను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇమామ్, మౌజన్లు ధ్రువపత్రాలు సమర్పించాలి ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని మసీదుల్లో ఇమామత్ నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్‌లు, మౌజన్లు, వారితో పాటు ప్రస్తుతం ఉన్న ముతవల్లి లేదా మసీదు అధ్యక్షులు వారి ఆధార్ జిరాక్స్ కాపీలు 2, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 2, మసీదు పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్స్పెక్టర్ కేఎండీ అలీం ఒక ప్రకటనలో తెలిపారు. డాక్యుమెంట్లను జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సమర్పించాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గోపి ఏలూరు (టూటౌన్): జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా లక్కోజు రాజగోపాలాచారిని(గోపి) నియమించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు యాదవ్ నియామక పత్రాన్ని గోపికి అందజేశారు. స్థానిక పవర్ పేట వడ్రంగి సంక్షేమ సంఘం భవనంలో శనివారం జరిగిన జిల్లా బీసీ సంఘ సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా రాజగోపాలాచారిని, మహిళా కార్యదర్శిగా బాలిన ధనలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శిగా చిదరబోయిన శ్రీనివాస్ యాదవ్, నగర యూత్ అధ్యక్షుడిగా జరజాపు రాఘవ, యూత్ కార్యదర్శిగా ఇదలాడ నాని, బంకురి వెంకట్, బీసీ మహిళ అధ్యక్షురాలిగా మోతిక రాఘవమ్మ, జిల్లా కమిటీ సభ్యులుగా బాయి వెంకట్రావు, కింజంగి రాజు, కొత్తల శివ, కెల్ల దుర్గాప్రసాద్, చిట్టు మోజు రత్నబాబు, కొండల ప్రసాద్ తదితరులను నాయకులును నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు. దూరవిద్య పరీక్షకు 49 మంది గైర్హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూర విద్య విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో శనివారం నిర్వహించిన పరీక్షలకు 49 మంది గైర్హాజరయ్యారు. జీవశాస్త్రం పరీక్షకు 121 మందికి 99 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. వ్యాపార శాస్త్రం పరీక్షకు 295 మందికి గాను 264 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా విద్యాశాఖాధికారి రెండు కేంద్రాల్లో, డీఈసీ కమిటీ రెండు కేంద్రాల్లో, ఫ్లయింగ్ స్క్వాడ్ మరో రెండు కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఇంటర్ పరీక్షలకు 12,930 మంది హాజరు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన కెమిస్ట్రీ –2, కామర్స్–2 పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో మొత్తం 13,390 మంది విద్యార్థులకు గాను 12,930 మంది హాజరయ్యారు. 12,238 మంది జనరల్ విద్యార్థులకు 11,992 మంది హాజరు కాగా 1,152 మంది ఒకేషనల్ విద్యార్థులకు 938 మంది హాజరయ్యారు. శనివారంతో ఇంటర్ ప్రధాన పరీక్షలు ముగిశాయి. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యోహాన్ తెలిపారు. ఈ నెల 17 నుంచి ఇంగ్లీష్, తెలుగు, గణితం, హిందీ, సివిక్స్ సబ్జెక్టులకు మూల్యాంకనం ఏలూరులోని కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతాయని తెలిపారు. -
కొనుగోలు కేంద్రాలు ఎక్కడ?
దెందులూరు: ఏలూరు జిల్లాలో పెసర, మినుము రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని ఆశలు పెట్టుకుంటే ఇంతవరకూ వాటి ఊసే లేదు. గత ఏడాది నవంబర్‌లో పెసర, మినుము పంట సాగు చేశారు. ఫిబ్రవరి నెలాఖరుకు దిగుబడి చేతికొచ్చింది. గత ప్రభుత్వ హయాంలో పంటల సాగు పూర్తయ్యే నాటికి రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం ఇంతవరకూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు దెందులూరు కోపరేటివ్ సొసైటీకి వెళ్లి నిలదీశారు. ఏలూరు జిల్లాలో 12,900 ఎకరాల్లో పెసర, 2500 ఎకరాల్లో మినుము పంట సాగు చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం ఇవ్వకపోయినా పండించిన పంటను కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఎలా? అని రైతులు, రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే తక్కువ ధరకు అమ్ముకోవాలని.. పెట్టుబడి సొమ్ము కూడా అందదని వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు సైతం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడడం లేదు. జాయింట్ కలెక్టర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినా.. ఆ ఆదేశాలు అమలు కాలేదు. పండించిన పంటను మంచి ధరకు అమ్ముకోవచ్చని ఆశలు పెట్టుకున్న రైతులకు నిరాశ మిగిలింది. ఇలాగైతే నష్టానికి అమ్ముకోవడం తప్ప వేరే గత్యంతరం లేదంటున్నారు. ఇంకా పూర్తికాని ఈ–క్రాప్ నమోదు వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నమోదు, రైతుల వివరాలు పంట వేసిన తరువాత రైతుతో మాట్లాడి ఈ–క్రాప్ నమోదు చేస్తారు. అయితే పంట చేతికి వచ్చిన తరువాత ఇప్పటికీ పంట నమోదు కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయాన్ని మార్క్‌ఫెడ్, వ్యవసాయ శాఖాధికారులు ధ్రువీకరించారు. పెసర, మినుము రైతుల ఆవేదన పంటను నష్టానికి అమ్ముకోవాల్సిన దుస్థితి -
నిజ నిర్ధారణ కమిటీ పర్యటన
జంగారెడ్డిగూడెం: మండలంలోని చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీ శనివారం పర్యటించింది. ఐదుగురు సభ్యుల బృందం కాలనీలో పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో కూనవరం, వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం, వీఆర్‌పురం, వి.రామచంద్రాపురం, చింతూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు చల్లవారిగూడెంలో ఇళ్లను ఇచ్చారని.. ఆ ప్రాంతంలో పెద్ద గోతులు, తుప్పలతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో నిర్వాసితులే సొంత సొమ్ములు ఖర్చు చేసి గోతులను సరిచేసుకున్నారని సదరు సొమ్మును ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. చల్లవారిగూడెం ఆర్అండ్ఆర్ కాలనీలో అసంపూర్తి నిర్మాణాలు 2 వేలకు వరకు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే నిర్మించాలన్నారు. నాలుగు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల్లో ఒక్కటే పనిచేస్తుందని, నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మిగిలిన మూడు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను వాడుకలో తీసుకురావాలన్నారు. వెంటనే రైతు భరోసా, తల్లికి వందనం తదితర సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో వెంటనే అమలు చేయాలని డిమండ్ చేశారు. కమిటీలో జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు, సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ తదితరులున్నారు. -
కొనుగోలుకు ఇబ్బంది ఏంటి?
తాము పండించిన పెసలు, మినుములు కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? పంటను ఇంట్లో ఉంచండి.. కొంటాం అంటున్నారు. రేపు మాపు అంటూ గడిపేస్తున్నారు. స్పష్టమైన ప్రకటన చేయాలి. – మాగంటి రాజు, రైతు, దెందులూరు సర్వే పేరిట తాత్సారం ప్రభుత్వ విధానంపై నమ్మకం లేదు. అనేక మంది రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిదా.. ఆలస్యం లేకుండా కొంంటే నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. – కొలుసు గణపతిరావు, రైతు, సొసైటీ మాజీ చైర్మన్ ● -
పది పరీక్షలకు సిద్ధం
పడకేసిన మెడికల్ కాలేజీ నిర్మాణం పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పడకేశాయి. బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. 8లో uఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 25,179 మంది విద్యార్థులు 133 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు విద్యా శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రతి తరగతి గదిలో గాలి, వెలుతురు సక్రమంగా ఉండేలా ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, ప్రతి విద్యార్థి బెంచిపై కూర్చునే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే సమయంలో 144వ సెక్షన్ అమల్లో ఉంటుంది. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా ఉండాలని, ఏదైనా జరిగితే సంబంధిత ఇన్విజిలేటరే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్య శాఖాధికారులు ఇప్పటికే హెచ్చరించారు. ఈ నెల 31 వరకూ రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12. 45 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయి. జవాబు పత్రాల వాల్యుయేషన్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభించి ఏప్రిల్ 9 వరకు కొనసాగిస్తారు. జిల్లా వ్యాప్తంగా 25179 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా.. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 23,051 మంది ఉండగా వారిలో 11,529 మంది బాలురు, 11522 మంది బాలికలు ఉన్నారు. ఒకసారి అనుత్తీర్ణులైన విద్యార్థులు 2,128 మంది విద్యార్థులుండగా వీరిలో 1432 మంది బాలురు, 696 మంది బాలికలు ఉన్నారు. పరీక్షా పత్రాలను పరీక్షా కేంద్రాలకు సమీపంలోని 31 పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష జరిగే రోజు ఉదయం సంబంధిత ప్రధానోపాధ్యాయులు పోలీస్ స్టేషన్ల నుంచి తీసుకువెళ్లే ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో 6 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. వీటిలో ఉంగుటూరు మండలంలోని కై కరం జెడ్పీ పాఠశాల, లింగపాలెం మండలంలోని రంగాపురం జెడ్పీ పాఠశాల, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం జెడ్పీ పాఠశాల, కలిదిండి మండలం కోరుకొల్లు జెడ్పీ పాఠశాల, టీ.నరసాపురం జెడ్పీ పాఠశాల, జీలుగుమిల్లిలోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ఉన్నాయి. ఈ ఆరు కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి వివిధ స్థాయిల్లో అధికారులను నియమించారు. అన్ని కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించారు. మరో ఐదుగురు అదనపు డిపార్ట్మెంటల్ అధికారులు, 62 మంది కస్టోడియన్లను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్లు, రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించారు. 1,120 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. న్యూస్రీల్పరీక్షల షెడ్యూల్ 17వ తేదీన ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ –ఏ, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 (కాంపోజిట్ కోర్సు) 19న సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష 21న ఇంగ్లీష్ 22న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2(కాంపోజిట్ కోర్సు) 24న గణితం 26న ఫిజికల్ సైన్స్ 28న బయోలాజికల్ సైన్స్ 29న ఓల్డ్ ఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్), ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ పరీక్షలు) 31న సాంఘిక శాస్త్రం దూర విద్య పరీక్షలకు ఏర్పాట్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలు ఈ నెల 17 నుంచే నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 28 వరకూ నిర్వహించనున్నారు. 793 మంది పరీక్షలు రాసేందుకు 17 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. రేపటి నుంచి 133 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ హాజరుకానున్న 25,179 మంది విద్యార్థులు 6 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు పారదర్శకంగా పరీక్షల నిర్వహణ పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాకుండా చూడాలని సంబంధిత అధికారులు, ఇన్విజిలేటర్లకు స్పష్టం చేశాం. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలి. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరు. పాఠశాల యూనిఫారం ధరించి పరీక్షకు హాజరుకాకూడదు. – ఎం.వెంకట లక్ష్మమ్మ, ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి -
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
టి.నరసాపురం: విద్యుత్ షాక్‌తో గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. వివరాల ప్రకారం టి.నరసాపురానికి చెందిన కుప్పల లక్ష్మి (35) శుక్రవారం ఓ రైతు పొలంలో కోకో కాయలు కోసేందుకు వెళ్లింది. కోకో కాయలు కోస్తుండగా, సమీపంలోని విద్యుత్ వైరుకు కాయలు కోస్తున్న గెడ తగలడంతో లక్ష్మి విద్యుత్ షాక్‌కు గురైంది. దీంతో లక్ష్మిని చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. అక్రమ కలప పట్టివేత కుక్కునూరు: అక్రమంగా దాచి ఉంచిన ఇరుగుడు చావ (రోజ్ వుడ్) కలపను శుక్రవారం కుక్కునూరు అటవీశాఖాధికారులు పట్టుకున్నారు. కుక్కునూరు అటవీశాఖ రేంజ్ అధికారి కె.కృష్ణకుమారి చెప్పిన వివరాల ప్రకారం మండలంలోని బెస్తగూడెం గ్రామ శివారులో రోజ్ వుడ్ కలపను అక్రమంగా దాచి ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేసినట్టు చెప్పారు.ఈ దాడులలో 52 సైజ్‌ల రోజ్ వుడ్‌ను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఐరన్ ప్లేట్ పడి కూలీ మృతి పెంటపాడు: ప్రత్తిపాడులో ఓ పేపర్‌మిల్లులో పని చేస్తూ ప్రమాదవశాత్తూ ఐరన్ ప్లేట్ మీద పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. పెంటపాడు ఎస్సై స్వామి తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెంలోని యాగర్లపల్లికి చెందిన షేక్ మస్తాన్ (38) పట్టణంలో పాత ఇనుము దుకాణంలో పని చేస్తున్నాడు. అయితే ఈనెల 13న పెంటపాడు మండలం ప్రత్తిపాడులోని ఓ పేపర్‌మిల్లులో ఇనుప వస్తువులను తొలగించేందుకు వెళ్లాడు. పని చేస్తున్న క్రమంలో మస్తాన్‌పై బరువైన ఐరన్ప్లేట్ పడటంతో దాని కింద పడి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో విషయం శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎవరీకీ తెలియరాలేదు. సమాచారం తెలుసుకున్న ఎస్సై అక్కడకు చేరుకొని వివరాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. -
జలాశయంలో దూకి మహిళ ఆత్మహత్య
బుట్టాయగూడెం: భర్తతో గొడవ జరగడంతో మనస్థాపం చెందిన భార్య జలాశయంలోకి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం మండలంలోని చింతలగూడెంలోని పొగొండ రిజర్వాయర్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఇనూమూరుకు చెందిన తేజస్విని ఇదే మండలం సీతప్పగూడేనికి చెందిన రవితేజ ఇద్దరూ సంవత్సరం పాటు ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. అయితే ఇటీవల వీరిద్దరూ తరచూ గొడవపడుతున్నారు. అయితే గురువారం కూడా భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. తీవ్ర మనస్థాపం చెందిన తేజస్విని గురువారం సాయంత్రం సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే శుక్రవారం ఉదయం తేజస్విని మృతదేహం పోగొండ రిజర్వాయర్‌లో పైకి తేలి ఉన్నట్లు తెలుసుకున్న తేజస్విని తరఫు బంధువులు లబోదిబోమంటూ అక్కడకు చేరుకున్నారు. తల్లి బేలం దుర్గమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కాగా మృతి చెందిన తేజస్విని, రవితేజ దంపతులకు 7 నెలల పాప ఉంది. -
గుడి వద్ద జనసేన సభ ప్రసార స్క్రీన్
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జనసేన పార్టీ ఆవిర్భావ సభకు సంబంధించిన ప్రత్యక్షంగా ప్రసారం చేయడానికి స్థానిక రామచంద్రరావు పేట శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని వినియోగించుకోవడం సిగ్గు చేటని వైఎస్సార్ సీపీ ఏలూరు నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు శివ రావు ఒక ప్రకటనలో ఖండించారు. జనసేన ఆవిర్భావ సభ ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన స్క్రీన్‌ను వేంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను తుంగలో తొక్కారని, ప్రశాంతంగా దేవుని దర్శనానికి వచ్చే భక్తులకు మానసిక ప్రశాంతతను దూరం చేయడం ఏ మేరకు సబబన్నారు. కాగా ఈ విషయాన్ని పలు హిందూ సంఘాల నాయకులు సైతం ఖండించారు. బడి దగ్గర మద్యం, గుడి దగ్గర రాజకీయాలు చేయడం ఒక్క కూటమి నాయకులకే చెల్లిందన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే ప్రజలే తరిమికొట్టే పరిస్థితి ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. -
బాస్కెట్‌బాల్ పోటీలకు ఐదుగురి ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొనే జట్టుకు ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎంపికయ్యారని బాస్కెట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె.కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు .గత జనవరి 28 నుంచి 31వ తేదీ వరకూ విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ జట్టులో ఏలూరుకు చెందిన బీ. లీలావతి, ఏ. టాలీ అనిత, జీ. నాగదేవి, పి.వినయ శ్రీ, పాలకొల్లుకు చెందిన ఆర్.మహతి ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే 23వ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. -
బతుకుతెరువు కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు
కాళ్ల: బతుకుతెరువు కోసం వెళ్లి ఘోర రోడ్డు ప్రమాదంలో మండలానికి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మండలంలోని ప్రాతాళ్ళమెరక గ్రామానికి చెందిన కోటి వెంకట వరప్రసాద్(54) తన బొలెరో వ్యాన్‌లో కిరాయికి రొయ్యలు పిల్లలు తేవడానికి ఆఫ్టింగ్ డ్రైవర్‌గా వెళ్లే జువ్వలపాలెం గ్రామానికి చెందిన చీపురుపల్లి శివకృష్ణ (29) తీసుకుని గురువారం రాత్రి కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున రొయ్యపిల్లలు వ్యాన్ లో తీసుకుని చల్లపల్లి మీదుగా వస్తుండగా ఘంటసాల మండలం జీలగలగండి గ్రామ పరిధిలో దురదృష్టవశాత్తు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శివకృష్ణకు ఇంకా వివాహం కాలేకపోవడంతో, అందరితో కలిసి తిరిగే మిత్రుడు మరణవార్త తెలియడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
గుండుగొలను వంతెన నిర్మాణం ప్రశ్నార్థకం
భీమడోలు: గోదావరి కాలువపై గుండుగొలను వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు నిలిపివేయాలని రాజమండ్రి కేంద్ర జల రవాణా శాఖ(ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఇండియా) ఆదేశించింది. దీంతో చివరి దశలో శ్లాబ్ వేసేందుకు సిద్ధంగా ఉన్న వంతెన అర్ధాంతరంగా నిలిచిపోయింది. కాలువపై వంతెన నిర్మాణం చేసే తరుణంలో కేంద్ర జలరవాణా శాఖ నుంచి నేషనల్ హైవే అథారిటీ సంస్థ కాంట్రాక్టర్ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే మూడేళ్లుగా ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన వివిధ శాఖల అనుమతులు తీసుకోకుండా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు కాలాయాపన చేశారు. తాజాగా వంతెన పనులు శ్లాబ్ దశకు రావడంతో కేంద్ర జలరవాణా శాఖ వంతెన పనులు ఆపాలని లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఎత్తు తగ్గడం వల్లే వాస్తవానికి జాతీయ రహదారికి 11 మీటర్ల ఎత్తులో వంతెన నిర్మాణం జరగాల్సి ఉంది. కానీ కేవలం 5 మీటర్ల ఎత్తు ఉండడంతో ఆ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో గోదావరి కాలువలో జల రవాణా శాఖ చేసే క్రమంలో వివిధ స్టీమర్లు, పడవలు, ఓడలు రవాణాకు ఈ వంతెన అడ్డంకిగా మారుతుందని పేర్కొంది. తక్షణమే నిలిపివేయాలని ఆ శాఖ సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనితో సమస్య మొదటికొచ్చింది. దీనితో పలు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండున్నరేళ్ల క్రితం కూలిన వంతెన బ్రిటిష్ హాయంలో గుండుగొలను వద్ద నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరడంతో రెండున్నరేళ్ల కితం కూలిపోయింది. నిత్యం రద్దీగా ఈ వంతెనపై వాహనాల రాకపోకలు స్థంభించాయి. నిత్యం భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, కై కలూరు మండలాల నుంచి రాకపోకలు సాగించే వేలాది మంది ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కూలీలు, భక్తుల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీనితో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఈ సమస్యను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి రూ.4 కోట్ల నిధులు మంజూరు చేయించారు. నేషనల్ హైవే అథారిటి సంస్థ 2023 జూన్‌లో కూలిన వంతెన స్థానంలో కొత్త వంతెన నిర్మాణ పనులు ప్రారంభించింది. వైఎస్సార్ సీపీ హయాంలో 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. అయితే మిగిలిన 40 పనులును కూటమి సర్కార్ రాగానే పనులు చేపట్టగా అడుగుడుగునా ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం శ్లాబ్ వేయాల్సి ఉంది. బెయిలీ వంతెనపై భయం భయంగా.. గుండుగొలను వద్ద శాశ్వత వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు నిర్మించిన బ్రెయిలీ వంతెనపై ప్రజలు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ వంతెన వ్యవధి రెండేళ్లు అని ఆర్అండ్బీ అధికారులు బెయిలీ వంతెన ప్రారంభోత్సవంలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌కు గడువు ముగుస్తుంది. అయితే ఈ వంతెనపై భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేయాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. వంతెన శ్లాబ్ వేయవద్దని కేంద్ర జల రవాణా శాఖ ఆదేశాలు అర్ధాంతరంగా నిలిచిన పనులు -
గుబ్బల మంగమ్మ తల్లి జాతర ప్రారంభం
బుట్టాయగూడెం : మండంలోని కామవరం సమీపంలో దట్టమైన అటవీలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మతల్లి జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురూజీ వర్సా పుల్లారావు ఆధ్వర్యంలో గణపతి విశేష పూజలు, పాలాభిషేకం పూజా కార్యక్రమాలు ఆదివాసీ సాంస్కృతిక, సంప్రదాయాల ప్రకారం విశేష పూజలు చేశారు. జాతర సందర్భంగా డోలు వాయిద్యాల దరువులతో కొండలు దద్దరిల్లాయి. మరో రెండు రోజులు మంగమ్మతల్లి జాతర మహోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు ఉత్సవాల్లో స్థానిక నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 4 వేలు మందికి పైగా ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు జిల్లాల నుంచి భక్తులు అమ్మ వారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటి ప్రతినిధి, సర్పంచ్ కోర్స గంగరాజు తెలిపారు. కాలుజారి కాలువలో పడి మహిళ మృతి భీమడోలు: మండలంలోని పూళ్ల వద్ద శుక్రవారం తెల్లవారుజామున గోదావరి కాలులో కాలుజారి ప్రమాదవశాత్తు కోడూరుపాడుకు చెందిన మహిళ జోగినీడి లక్ష్మి(59) మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోడూరుపాడుకు చెందిన జోగినీడి లక్ష్మి ప్రతి శుక్రవారం పూళ్లలోని గోదావరి కాలువలో స్నానం చేసి రేవు వద్ద ఉన్న గుళ్లల్లో చేస్తుంది. ఈ క్రమంలో రోజు మాదిరిగానే తెల్లవారుజామున భర్తతో గోదావరి స్నానానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. అయితే ఉదయం 8 గంటల కూడా ఇంటి రాకపోవడంతో భర్త గోదావరి కాలువ దగ్గరికు వచ్చి చూడగా లక్ష్మీ చెప్పులు కనబడగా స్థానికుల సహాయంతో కాలువలో గాలించగా లక్ష్మీ మృతదేహం బయటపడింది. భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై.సుధాకర్ తెలిపారు. ఆటో–లారీ ఢీ ఒకరికి తీవ్రగాయాలు గణపవరం: మండలంలోని వరదరాజపురం గ్రామ శివారున లారీ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఆటోడ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గురువారం రాత్రి పిప్పర వైపు నుంచి వరదరాజపురం వస్తున్న ఖాళీ ఆటోను పిప్పరవైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో తీవ్రంగా దెబ్బతినగా ఆటో డ్రైవర్ కర్రిశ్రీను తలకు తీవ్రంగా గాయం కావడంతో అతనిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. వరదరాజపురం గ్రామానికి చెందిన కర్రి శ్రీను ఇంటికి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో వెంటనే స్థానికులు వచ్చి క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. -
పోలీసుల దిగ్బంధంలో తణుకు
తణుకు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనలో భాగంగా ఆంక్షలు, నిర్భంధాల మధ్య తణుకు పట్టణం వేడెక్కింది. శుక్రవారం పట్టణం పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. రాష్ట్రపతి రోడ్డు, పెరవలి రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు, సొసైటీ రోడ్డుల్లో పోలీసుల భద్రత కట్టుదిట్టం చేశారు. నిరంతరం పోలీసు సైరన్లతో పట్టణ ప్రాంతం మార్మోగిపోయింది. తాడేపల్లిగూడెం, భీమవరం మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రప్పించి పారిశుద్ధ్య నిర్వహణ చేయిస్తున్నారు. గతంలో తణుకు ప్రాంతానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి హాజరైనప్పటికీ ప్రజలపై ఎలాంటి ఆంక్షలు, ఇబ్బందులు లేకుండానే పర్యటన నిర్వహించారు. నేడు ఇంత భద్రత, ఇన్ని రకాల ఆంక్షలు ఏంటనేది ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి రోడ్డులో అడుగడుగునా పోలీసు అఽధికారులు, కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహిస్తుండగా పర్యవేక్షణకు ఉన్నతాధికారులు వాహనాల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు పర్యటన కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయాలని ఆదేశాలివ్వగా, దుకాణాలు మూసివేయాలని ఆంక్షలు విధించడం ఆశ్చర్యం కలిగిస్తుందని ప్రజలు చెబుతున్నారు.● సీఎం పర్యటనతో ఎన్నడూ లేని విధంగా భద్రత ● పట్టణంలో అడుగడుగునా ఆంక్షలు -
వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకులకు పదవులు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు మైనార్టీ నాయకులను వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగంలో పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు చెందిన మహమ్మద్ జహీర్‌ను పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శిగా నియమించారు. ఎస్కే సయ్యద్‌బాజీ (గాజుల బాజీ)ని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారికి వైభవంగా డోలా పౌర్ణమి ఉత్సవం ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శుక్రవారం డోలా పౌర్ణమి ఉత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరులతో శ్రీవారు తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. ముందుగా ఆలయంలో ఉదయం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. ఆ తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా తిరువీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిట భక్తులు స్వామివారికి నీరాజనాలు సమర్పించి, భక్తిప్రపత్తులను చాటారు. బాలల చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ఏలూరు (టూటౌన్): బాలల చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్ సూచించారు. ఏలూరు వన్‌టౌన్ ఏరియాలో ఉన్న హోటల్ ఆదిత్య సెంట్రల్లో చైల్డ్ రైట్స్ అడ్వకసీ ఫౌండేషన్ – క్రాఫ్ ఆధ్వర్యంలో బాలలతో ముఖాముఖీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ క్రాఫ్ సిబ్బంది బాలల న్యాయ చట్టాల గురించి వివరించడమే కాకుండా బాలల సమస్యలను గుర్తించి అధికారులకు తెలియజేసేలా ప్రోత్సహించడం మంచి ఆలోచన అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో బాలల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఏ విధమైన ఉచిత న్యాయ సలహాలు కావాలన్నా మండల స్థాయిలో మండల లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా స్థాయిలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలన్నారు. కేంద్రీయ విద్యాలయం స్థలం పరిశీలన నూజివీడు: కేంద్రీయ విద్యాలయానికి ట్రిపుల్ ఐటీ సమీపంలో గత ప్రభుత్వం కేటాయించిన ఏడెకరాల స్థలాన్ని శుక్రవారం కేంద్రీయ విద్యాలయానికి చెందిన అధికారులు పరిశీలించారు. కేంద్రీయ విద్యాలయం ఏలూరు ప్రిన్సిపాల్ బీఎస్ మీనా, ఈఈ కిశోర్, డీఈ కృష్ణమోహన్ నూజివీడు విచ్చేసి మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రామిరెడ్డితో వెళ్లి పరిశీలించారు. స్థలంలో ఉన్న పిచ్చి చెట్లు, ముళ్లకంపను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌కు తెలిపారు. ఎలాంటి ముళ్ల చెట్లు లేకుండా అప్పగిస్తే అందులో శాశ్వత భవనాల నిర్మాణానికి ముందడుగు పడుతుందన్నారు. తహసీల్దార్ బీవీ సుబ్బారావు, ఆర్ఐ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
హైవేపై ఘోర ప్రమాదం
ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతితాడేపల్లిగూడెం రూరల్: తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతిచెందాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఒక ఐటీ కంపెనీకి చెందిన హెచ్ఆర్ విభాగం ఉద్యోగి భోగెల్లి వెంకట సత్య సురేన్ (37), ఆయన భార్య నవ్య (35), కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్య శాంత్రో కారులో తూర్పు గోదావరి జిల్లా ఏడిద గ్రామంలో జరగనున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి బయల్దేరారు. శుక్రవారం మధ్యాహ్నం 12.45 గంటల ప్రాంతంలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లి వద్ద జాతీయ రహదారిపైకి వచ్చేసరికి సురేన్ డ్రైవ్ చేస్తున్న కారు జాతీయ రహదారి మెయింట్‌నెన్స్ పనులు చేస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సత్య సురేన్, నవ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తె వాసకి కృష్ణ (5), బంధువు శ్రీరమ్యను తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వాసకి కృష్ణ మృతి చెందగా, శ్రీరమ్యను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఏఎస్సై పీవీకే.దుర్గారావు వివరాలు సేకరించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించి, రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిద్ర మత్తు వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మండపేటలో విషాద ఛాయలు ఈ ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లా మండపేట పట్టణంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సత్య సురేన్ తండ్రి పాపారావు రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఘటనలో పాపారావు చెల్లెలు కుమార్తె ఉప్పులూరి శ్రీరమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. యూఎస్‌లో ఉంటున్న ఆమె ఇటీవల గృహ ప్రవేశ శుభకార్యానికి హైదరాబాద్ వచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురిని మృత్యువు కాటేయడంతో కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఈ ఆక్రమణలపై అంత ప్రేమ ఎందుకు?
ఉండి: పేదోడిపై ప్రతాపం, ధనవంతుడిపై ప్రేమ కురిపిస్తున్న ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుకు పారిశ్రామికవేత్త రంగరాజు ఆక్రమణలపై అంత ప్రేమ ఎందుకు? అని సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్ మండిపడ్డారు. శుక్రవారం ఎన్నార్పీ అగ్రహారంలో నిర్వహించిన సైకిల్‌యాత్రలో గ్రామ ప్రజలు రంగరాజు ప్రభుత్వ భూముల ఆక్రమణలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బురిడి వాసుదేవరావు మాట్లాడుతూ 1987లో జాతీయ రహదారిని ఆనుకుని బీసీ కాలనీ ఏర్పడిందన్నారు. జాతీయ రహదారికి వెళ్లేందుకు 60 అడుగుల రహదారి అవసరం కాగా రంగరాజు ఆక్రమణలతో కేవలం 8 అడుగుల రహదారి మాత్రమే ఇస్తానని చెబుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు రంగరాజు జోలికి వెళ్లకుండా రహదారి కబ్జాను ప్రోత్సహిస్తున్నట్లున్నారని ఆరోపించారు. -
మీ అవగాహనే బ్రహ్మాస్త్రం
శనివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2025వినియోగదారుడి విజయాలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వినియోగదారుల కమిషన్ ద్వారా వినియోగదారులు పలు విజయాలను సాధించారు. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో సేవల లోపంపై ఏలూరుకు చెందిన బీకెఎస్ఆర్ అయ్యంగార్ రూ.10 వేల నష్టపరిహారం అందుకున్నారు. ఆర్‌ఆర్‌పేటలోని వెంకటేశ్వరస్వామి గుడిలో విక్రయించే ప్రసాదాల్లో నాణ్యతా లోపంపై వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడంతో రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. యురేకా ట్రేడర్స్‌కు సంబంధించిన కేసులో బాధితుడికి రూ.40 వేలు నష్టపరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అమెజాన్‌లో సేవల లోపానికి బీకే బింధు నష్టపరిహారం కోసం వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించడంతో అమెజాన్ రూ.13 వేల నష్టపరిహారం చెల్లించింది. ఏలూరు (టూటౌన్): ఇటీవల జిల్లాలో తూనికలు, కొలతల్లో వ్యాపారుల మోసం ఎక్కువైంది. వినియోగదారులు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాటాలు రావడంతో మోసం చేసేవారికి మరింత సులువైంది. నిత్యావసరాలు, కూరగాయాలు, చికెన్, మటన్ వంటివే గాకుండా రైతుల వద్ద వ్యాపారులు కొను గోలు చేసే ధాన్యం, చేపలు, రొయ్యల తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కిలోకు దాదాపు 100 గ్రాముల తక్కువ బరువుతో వినియోగదారుడిని మోసగిస్తున్నారు. తక్కెడకు వినియోగించే కిలో, అర కిలో రాళ్లను తూనికలు, కొలతల అధికారులు నిత్యం పర్యవేక్షించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో కొంతమంది వ్యాపారులు రాళ్లను అరగదీయడం, లోపల కన్నాలు పెట్టి పైన పూత వేయడం వంటి మోసాలకు పాల్పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో మోసాలు పెట్రోల్ కంపెనీలు డీలర్లుకు బంక్‌లను లీజుకు ఇచ్చి నిర్వహణ చేస్తుంటాయి. కొందరు డీలర్లు పెట్రోల్, డీజిల్ పంపులకు ఉండే డిజిటల్ మిషన్‌లో కంపెనీలకు తెలియకుండా మార్పులు, చేర్పులు చేసి వియోగదారురులను మోసగిస్తున్నాయి. స్వీట్ షాపు యజమానులు తూనికల్లో మోసం చేస్తున్నారు. వినియోగదారులకు కేవలం స్వీట్ మాత్రమే తూకం వేయాల్సివుండగా స్వీట్స్ పెట్టే బాక్స్‌లను సైతం తూకం వేసి విక్రయిస్తున్నారు. బిల్ తప్పనిసరి ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన వారిని వినియోగదారుడుగా గుర్తిస్తారు. అమ్మే వారిని ట్రేడర్ అంటారు. ట్రేడర్ వద్ద కొనుగోలు చేసి బయటకు వచ్చి తర్వాత దానిలో ఏదైనా లోపం గుర్తించి తిరిగి తీసుకోమంటే ట్రేడర్ తమకు సంబంధం లేదనేవారు. 2019లో చేసిన సవరణ ప్రకారం సరకు నాణ్యత, పనితీరుపై అమ్మిన వారిదే పూర్తి బాధ్యత. ఇదే క్రమంలో వినియోగదారులు తాము కొనుగోలు చేసిన రూ.50 విలువకు పైన ఉన్న ప్రతి ఐటెమ్‌కు ఖచ్చితంగా బిల్ తీసుకోవాలి. బిల్‌తో పాటు ఆ వస్తువుకు సంబంధించిన వారెంటీ కార్డులు వంటివి భద్రపర్చుకోవాలి. ట్రేడర్స్ ఇచ్చే బిల్లో ఎస్టిమేషన్ కాకుండా ఇన్వాయిస్ బిల్లు.. ఆ ట్రేడర్‌కు సంబంధించిన లెటర్ హెడ్‌పైన స్టాంప్ వేసింది మాత్రమే తీసుకోవాలి. దీనివల్ల ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మిన ట్రేడర్ను నిలదీసే అధికారం ఉంటుంది. అవగాహన పెంచుకోవాలి వినియోగదారుడు తమ హక్కు లపై అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. వస్తుసేవల్లో ఏవిధమైన లోపం జరిగినా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. వినియోగదారుల కమిషన్‌లో ఏడు కేసుల్లోనూ విజయం సాధించాం. – బీకేఎస్‌ఆర్ అయ్యంగార్, మాజీ అధ్యక్షుడు, కన్స్యూమర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏలూరు 1,274 కేసుల నమోదు ఏడాది ఇంతవరకూ నిబంధనలు అతిక్రమించిన వారిపై 1274 కేసులు నమోదు చేశాం. వాటిలో తూనికలు కొలతలకు సంబంధించినవి 491 కేసులు, ప్యాకేజీల్లో తేడాలకు సంబంధించిన 783 కేసులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టాంపిగ్ ఫీజు కింద ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ. 1,65,53,073 వసూలు చేశాం. వివిధ కేసులకు సంబంధించి జరిమానాగా రూ.83,54,500 విధించాం. – పీ సాయిరాం, అసిస్టెంట్ కంట్రోలర్, తూనికలు, కొలతల శాఖ న్యూస్రీల్ఎవరిని ఆశ్రయించాలి ? వినియోగదారుడు తనకు జరిగిన అసౌకర్యానికి నేరుగా జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. సంబంధిత ట్రేడర్‌కు కమిషన్ ముందుగా నోటీసు ఇస్తుంది. 10 నుంచి 15 రోజుల వ్యవధిలో స్పందించక పోతే అరెస్టు వారెంట్ సైతం జారీ చేస్తారు. గతంలో వినియోగదారుల ఫోరం తీర్పుపై ఇతర కోర్టులకు వెళ్లేవారు. ప్రస్తుతం నేరుగానే వినియోగదారుల కమిషన్ తీర్పును అమలు చేయాల్సి ఉంది. కమిషన్ తీర్పును అమలు చేయని ట్రేడర్లకు సంబంధించిన ఆస్తులను జప్తుచేసి బాధిత వినియోగదారుడికి నష్టపరిహారం చెల్లించే వెసులు బాటు ఉంది. 3 నెలల లోపు వినియోగదారునికి న్యాయం జరగాలి.మనం కొనే వస్తువు, అందించే సేవలో ఏదైనా లోపం ఉంటే న్యాయం పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగిన వస్తువులు లేదా సేవలు పొందడం వినియోగదారుడి ప్రాథమిక హక్కు. ఇటీవల కాలంలో వస్తువుల్లో నాణ్యతా లోపాలు, తూకాల్లో మోసాలు, సేవల్లో నిర్లక్ష్యం వంటివి ఎక్కువై పోయాయి. తాగే పాళ్లు, నీళ్లను కూడా కల్తీ చేస్తున్నారు. సామాన్యుడు వీటిని ప్రశ్నించలేక ఎక్కడికక్కడ సర్దుకుపోతున్నాడు. ఈ తరహా మోసాలను అరికట్టేందుకు వినియోగదారుడు మేల్కొనాలి. అందుకే ఏటా మార్చి 15న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వస్తువుల నాణ్యత, సేవల్లో లోపాలకు చెక్ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదుతో అక్రమాలకు అడ్డుకట్ట నేడు అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం -
బాస్కెట్‌బాల్ పోటీలకు ఐదుగురి ఎంపిక
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జాతీయస్థాయి బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొనే జట్టుకు ఏలూరుకు చెందిన ఐదుగురు క్రీడాకారిణులు ఎంపికయ్యారని బాస్కెట్‌బాల్ జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె.కృష్ణారెడ్డి, గవ్వ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు .గత జనవరి 28 నుంచి 31వ తేదీ వరకూ విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. ఈ జట్టులో ఏలూరుకు చెందిన బీ. లీలావతి, ఏ. టాలీ అనిత, జీ. నాగదేవి, పి.వినయ శ్రీ, పాలకొల్లుకు చెందిన ఆర్.మహతి ఎంపికయ్యారని వివరించారు. వీరంతా ఈ నెల 18 నుంచి 24వ తేదీ వరకూ అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో జరిగే 23వ జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. -
అక్రమ తవ్వకాలను ఆపేదెవరు ?
ద్వారకాతిరుమల: ఎడాపెడా ఏది చేసినా..అడిగేదెవడ్రా నా ఇష్టం అని గ్రామాల్లో టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామస్థాయి నేతలు ఆయా గ్రామాల్లోని చెరువుల్లో అక్రమ తవ్వకాలకు పూనుకుంటున్నారు. మండలంలోని సత్తాల గ్రామంలో ఓ టీడీపీ నాయకుడు అక్రమ మట్టి తవ్వకాలకు తెరతీశాడు. టీడీపీ నేత మట్టి అక్రమ దందాపై సత్తాల గ్రామ ప్రజలు రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా వాటిని లెక్కచేయకుండా ఆ నాయకుడు తన పనిని దర్జాగా సాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మండలంలోని సత్తాల గ్రామంలో ఆర్ఎస్ నెంబర్ 205 లో 32.48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సత్తాల (ఇరిగేషన్) చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. స్థానిక టీడీపీ నాయకుడు ‘రాజు’లా ఆ పార్టీ పెద్దల అండదండలతో ఈ దందాను కొనసాగిస్తున్నాడు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు వివిధ ప్రాంతాలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ నాయకుడు దౌర్జన్యం చేస్తూ, బూతులు తిడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. చెరువు నిండా గుంతలే అక్రమ తవ్వకాలు కారణంగా చెరువులో 10 నుంచి 15 అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయని, వాటి వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. మట్టి రవాణా కారణంగా గ్రామంలోని రహదారులు సైతం ధ్వంసం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా జరుగుతున్న ఈ అక్రమ మట్టి తవ్వకాలపై ఈ నెల 12 న జిల్లా కలెక్టర్‌కు, అలాగే మైనింగ్, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. అయినా ఇప్పటివరకు ఈ మట్టి దందాకు అడ్డుకట్ట పడకపోవడం దారుణమని మండిపడుతున్నారు. అధికార పార్టీ నాయకుడికి భయపడి అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సత్తాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు ద్వారా పోగేసిన సొమ్మును టీడీపీ నాయకుడి నుంచి రికవరీ చేసి, ప్రభుత్వానికి జమ చేయాలని పలువురు కోరుతున్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్ సత్తాల చెరువులో కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు సత్తాల చెరువులో జరుగుతున్న మట్టి దందాకు అడ్డుకట్ట వేయాలని జిల్లా కలెక్టర్‌కు, ఇతర అధికారులకు కొంత మంది గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేశాం. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతోనే ఈ దందా సాగుతోంది. – కుంచే రాజేష్, సత్తాల గ్రామస్తుడుఇంత దారుణమా..? పట్టపగలు ఇష్టానుసారం చెరువును తవ్వేస్తుంటే పట్టించుకునే నాథుడు లేడు. ముడుపులు అందాయో, లేక అధికార పార్టీ నాయకులకు భయపడ్డారో? తెలియదు గానీ మట్టి అక్రమ తవ్వకాలను మాత్రం ఎవరూ అడ్డుకోవడం లేదు. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. – పుల్లా అచ్చియ్య – సత్తాల గ్రామస్తుడు -
యాకోబుపై దాడి దారుణం
జంగారెడ్డిగూడెం: మడకం యాకోబుపై దాడి చేసిన కన్నాపురం రేంజర్ శివరామకృష్ణ. సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, విధులు నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న యాకోబును పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, గిరిజన నేత కూరం సత్యనారాయణ మా ట్లాడుతూ బుట్టాయగూడెం మండలం గొ ల్లపూడి గ్రామానికి చెందిన యాకోబు తనకున్న పట్టా భూమిలో కలపను తీసి బయటకు తోలే క్రమంలో కన్నాపురం అధికారులు అడ్డు కున్నారన్నారు. దీనిపై ప్రశ్నించేందుకు కన్నాపురం రిజర్వ్ ఆఫీస్‌కు వెళ్లిన యాకోబును రేంజర్, సబ్ డీఎఫ్ఓ విచక్షరహితంగా కొట్టడమే కాకుండా కులం పేరుతో దూషించారని మండిపడ్డారు. ఈ సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గిరిజన సంఘ నాయకులు పోలోజు నాగేశ్వరావు, సోయం శ్రీను తదితరులు ఉన్నారు. -
చాట్రాయి తహసీల్దార్ సస్పెన్షన్
అవినీతి ఆరోపణలపై కలెక్టర్ చర్యలు చాట్రాయి: అవినీతి ఆరోపణల నేపథ్యంలో చాట్రాయి తహసీల్దార్ డి.ప్రశాంతిని కలెక్టర్ వెట్రిసెల్వి గురువా రం సస్పెండ్ చేశారు. చాట్రా యి మండలంలోని సోమవరంలో రిజిస్ట్రేషన్ అటవీ భూములను మ్యూటేషన్ చేయడం, జనార్దనవరంలో వాగు పోరంబోకు, అసైన్డ్ భూమికి పట్టా ఇవ్వడంపై ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై కలెక్టర్ రెండుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా తహసీల్దార్ స్పందించలేదు. అలాగే త హసీల్దార్ అవినీతిపై సీఎం చంద్రబాబు వద్దకూ ఫిర్యాదు లు వెళ్లాయి. సొమ్ములు తీసుకోకుండా తహసీల్దార్ ఏపని చేయడం లేదని మండల ప్రజలు అంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు గ్రావెల్ తవ్వకాలకు అనుమతులు కోరగా ఇవ్వనని, మంత్రి పార్థసారథిని వెళ్లి కలవాలనడం, గ్రావెల్ కోసం నరసింహరావుపాలెం పంచాయతీ తీర్మానం చేసినా అ నుమతులు ఇవ్వకపోవడం వివాదాస్పదమయ్యా యి. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ వారికి అనుమతులు ఇవ్వడం, వైఎస్సార్సీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఆమె కార్యాలయానికి వెళితే పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. టీడీపీకి చెందిన ఇద్దరు వ్యకులు తహసీల్దార్‌కు షాడోలుగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. తనకు మంత్రి అండదండలు ఉన్నాయని తహసీల్దార్ ప్రశాంతి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. -
రహదారి భద్రత.. అంతా మిథ్య!
దెందులూరు : జిల్లాలోని జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)పై ప్రయాణం ప్రమాదభరితంగా మా రింది. వాహనాల అతివేగాన్ని గుర్తించే స్పీడ్ గన్స్, వాహనాల డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసే పరికరాలు పనిచేయకపోవడం, పూర్తిస్థాయిలో పర్యవేక్షణ కరువవడం ప్రమాదాలకు కారణంగా కనిపిస్తున్నాయి. దీంతో దెందులూరు నియోజకవర్గంలోని జాతీయరహదారిపై ప్రమాదాలు అధికా రులకు పెను సవాల్‌గా మారాయి. బ్రీత్ అనలైజర్స్ పరీక్షలేవీ జిల్లాలో జాతీయ రహదారిపై మద్యం తాగి వాహనాలు నడిపే వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరగడం లేదు. రవాణాశాఖ అధికారుల వద్ద ఉన్న బ్రీత్ అనలైజర్స్ పనిచేయకపోవడమే ఇందుకు కారణం. పెద్ద ఖరీదు లేకపోయినా కనీసం బ్రీత్ అనలైజర్స్‌ను కూడా కూటమి ప్రభుత్వం సమకూర్చడం లేదనే విమర్శలు ఉన్నాయి. రంబల్ స్ట్రిప్స్ ఎక్కడ? జాతీయరహదారిపై వాహనాల వేగానికి కళ్లెం వేసే రంబల్ స్ట్రిప్స్ ఎక్కడా కనిపించడం లేదు. బ్రిడ్జిలు, టర్నింగ్‌ల వద్ద వీటిని ఏర్పాటుచేస్తే కొంతమేర వాహనాల వేగం తగ్గుతుంది. సిబ్బంది కొరత రవాణా శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జిల్లాలో ఒక డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్, ఆర్టీఓ, ఏడుగురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, 15 మంది అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వీరికి సహాయకారిగా ఉండే కానిస్టేబుళ్లు ఒక్కరూ లేరు. సాధారణంగా ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు ఒక కానిస్టేబుల్ ఉండాలి. దీంతో ఎంవీఐ, ఏఎంవీఐలే రహదారి పర్యవేక్షణ పనులు చూస్తున్నారు. రవాణా చెక్‌పోస్టులు లేవు జిల్లాలో జాతీయ రహదారిపై రవాణా చెక్ పోస్టులు కూడా లేవు. గతంలో జిల్లాలో 16 వరకు చెక్‌పోస్టులు ఉండగా ప్రస్తుతం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఎన్‌హెచ్‌పై రవాణా చెక్‌పోస్టులు ఉంటే వాహనచోదకులు జాగ్రత్తగా వెళతారని, మితిమీరిన వేగం తగ్గుతుందని,ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. అక్రమ రవాణాను అరికట్టవచ్చని చెబుతున్నారు. టోల్గేట్ల వద్దే హైవే పెట్రోలింగ్ పోలీసులు హైవే పెట్రోలింగ్ పోలీసులు టోల్‌ప్లాజాలకే పరిమితమవుతున్నారు. నిత్యం జాతీయ రహదారి వెంబడి తిరుగుతూ ఎక్కడైనా వాహనాలు నిలిచిపోయినా, ప్రమాదాలు జరిగినా వీరు సహాయక చర్యలు అందించాల్సి ఉంది. అయితే కొన్ని పెట్రోలింగ్ వాహనాలు టోల్గేట్ల వద్ద, మరికొన్ని చెట్ల కింద నిలిపి ఉంటున్నాయి. ఇలా జాతీయ రహదారిపై భద్రతా లోపాలు, పర్యవేక్షణ లేమి, పరికరాల లోటుతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పనిచేయని స్పీడ్ గన్స్, బ్రీత్ అనలైజర్స్ రవాణా శాఖలో సిబ్బంది కొరత రవాణా చెక్‌పోస్టులూ లేవు టోల్‌ప్లాజాలకే పరిమితమవుతున్న ఎన్‌హెచ్ పెట్రోలింగ్ వాహనాలు ఎన్‌హెచ్–16పై పర్యవేక్షణ కరువు గత ప్రభుత్వంలో పక్కాగా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జాతీయ రహదారిపై స్పీడ్ గన్స్ పనిచేయడంతో పాటు వాటి పర్యవేక్షణకు డీఎస్పీ స్థాయి అధికారి ఉండేవారు. అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించి వాహన యజమానులకు జరిమానాలు పంపేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పీడ్ గన్స్ పనిచేయడం లేదు. వీటి పర్యవేక్షణ కరువవడంతో జరిమానాల మాటేలేదు. దీంతో వాహనచోదకులు మితిమీరిన వేగంతో వెళుతూ ప్రమాదాల బారినపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిబంధనల మేరకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సి ఉండగా 120 కిలోమీటర్లకు మించి వేగంతో కొన్ని వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ప్రమాదాల నివారణకు సమష్టి కృషి జిల్లాలో ప్రమాదాల నివారణకు కృషిచేస్తున్నాం. ఆరు నెలల్లో పలు రకాల వాహనాలపై 15,105 కేసులు నమోదు చేసి రూ.9.26 కోట్లు అపరాధ రుసుంగా వసూ లు చేశాం. రవాణా శాఖలో సిబ్బంది కొరత ఉంది. తమ అధికారుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో 174 అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలి. జాతీయ రహదారులపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. – కరీం, జిల్లా రవాణా శాఖ కమిషనర్, ఏలూరు -
మొల్ల జీవితం ఆదర్శనీయం
ఏలూరు(మెట్రో): కవయిత్రి మొల్లమాంబ జీవితం ఆదర్శనీయమని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. గురువారం కలెక్టర్ బంగ్లా వద్ద కవయిత్రి మొల్ల జయంతిని నిర్వహించారు. మొల్ల చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. రామాయణాన్ని సరళమైన భాషలో, తక్కువ వ్యవధిలో రచించిన గొప్ప కవయిత్రి మొల్ల అని కొనియాడారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆర్వీ నాగరాణి, బీసీ కార్పొరేషన్ ఏడీ ఎన్.పుష్పలత పాల్గొన్నారు. 17 నుంచి ఒంటి పూట బడులు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈనెల 17 నుంచి జిల్లాలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. పాఠశాలలు ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పనిచేస్తాయని, పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న చోట మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తామని తెలిపారు. -
యశ్వంత్ మృతిపై సమగ్ర విచారణ జరపాలి
ఏలూరు (టూటౌన్): ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బంగారు యశ్వంత్ (15) మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని దళిత, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థాని క కలెక్టరేట్ వద్ద గురువారం నిరసన తెలిపి డీఆర్వో విశ్వేశ్వరరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏలూరులోని చేపల తూము సెంటర్లోని రెల్లిపేటలో ఉంటున్న యశ్వంత్‌ను ఈనెల 5న రాత్రి సీసీఎస్ పోలీసులు వచ్చి మోటారు సైకిల్ చోరీ కేసులో తీసుకువెళ్లారన్నారు. విచారణ నెపంతో కోటదిబ్బ పోలీస్‌స్టేషన్ లో చిత్రహింసలు పెట్టారన్నారు. ఈ క్రమంలో ఈ నెల 6న పెదవేగి సమీపంలోని కాలువ గట్టుపై యశ్వంత్ శవమై పడి ఉన్నాడన్నారు. యశ్వంత్ మృతిని లాకప్ డెత్‌గా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఆర్వోను కలిసిన వారిలో కేవీపీఎస్ నాయకులు మంచెల్ల ఇస్సాక్, రేవుగడ్డ మనీసుందర్ సింగ్, దళిత రైట్ ప్రొటెక్షన్ స్టేట్ ప్రెసిడెంట్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్, ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్.మధు, పౌరహ క్కుల సంఘం నాయకులు కేవీ రత్నం ఉన్నారు. -
కేసుల పరిష్కారానికి కృషి
ఏలూరు (టూటౌన్): ప్యానల్ న్యాయవాదులు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని డీఎల్ఎస్ఏ జిల్లా కార్యదర్శి కె.రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. గురువారం ఏలూరు, భీమడోలు కోర్టుల పరిధిలో ప్యానల్ న్యాయవాదులతో ఆయన సమావేశం ఏర్పాటుచేశారు. న్యాయ సేవాధికార సంస్థ అందించే ఉచిత సేవలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని, న్యాయవిజ్ఞాన సదస్సుల్లో పాల్గొని ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించాలని, సంక్షేమ పథకాలను పొందటానికి అర్హులైన వారికి అవసరమైతే న్యాయ సహాయాన్ని అందించాలని సూచించారు. ఆయా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్యానల్ న్యాయవాదులు పాల్గొన్నారు.