శివోహం.. భజేహం
ముసునూరు మండలం బలివే ఉత్సవాల్లో జన సందోహం
ముసునూరు: హరహర మహాదేవ శంభోశంకర స్మ రణలు మార్మోగాయి. బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. ఆదివారం వేకువజామున విశేష అభిషేకాల అనంతరం భక్తులను అనుమతించారు. ముందుగా భక్తు లు తమ్మిలేరు, జల్లు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదా నాలు చేసి తర్పణలు వదిలారు. అన్నిశాఖల అధికారులు, పంచాయతీ సమష్టి కృషితో ఉత్సవాలు జయప్రదమైనట్టు సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య ప్రకటించారు. మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్, జిల్లా అదనపు ఎస్పీ మునిరాజు, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐలు రామకృష్ణ, సత్య శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.
భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు
స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేశారు. పీహెచ్‌సీ వైద్యాధికారి షకీనా ఇవాంజిలిన్ ఆధ్వర్యంలో ఏడుగురు వైద్యాధికారులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 1,708 మందికి వైద్య సేవలు అందించారు. సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
పట్టిసం.. భక్తజన సంద్రం
పోలవరం రూరల్: పట్టిసంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పు ణ్యస్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చినట్టు అంచనా. వీరిలో సు మారు 50 వేల మంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులు క్షేత్రం దిగువన ఇసుక తిన్నెల వరకూ క్యూకట్టారు. క్యూలైన్‌లో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఇసుక తిన్నెలపై జాతర సందడి కనిపించింది. వేకువజామున ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు కుటుంబసభ్యులు స్వామివారికి తొలిపూజ నిర్వహించారు. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది.
పాతాళ భోగేశ్వరా.. పాహిమాం
కలిదిండి(కై కలూరు): దక్షిణ కాశీగా పేర్గాంచిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి శివరా త్రి కల్యాణం (తీర్థం)కు భక్తులు పోటెత్తారు. శనివా రం అర్ధరాత్రి స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఆ దివారం వేకువజాము నుంచి భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. రాత్రి స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుచేశారు.
ద్వారకాతిరుమలలో..
ద్వారకాతిరుమల : క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. వే కువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
హరహర మహాదేవ
శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు
బలివే, పట్టిసంలో జనసందోహం
వేకువజాము నుంచి బారులు
ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు
శివోహం.. భజేహం
శివోహం.. భజేహం


