పెళ్లయిన నెలకే 'ముగ్గురమయ్యాం' అంటూ రష్మిక పోస్ట్‌.. ప్రెగ్నెంట్‌? | Rashmika Mandanna Says now its us Three, Spark Pregnancy Rumours | Sakshi
Sakshi News home page

ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం.. వీడియో షేర్‌ చేసిన రష్మిక

Apr 3 2026 10:30 AM | Updated on Apr 3 2026 12:27 PM

Rashmika Mandanna Says now its us Three, Spark Pregnancy Rumours

విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఈ జంట పక్షులు సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నా సరే పర్సనల్‌ లైఫ్‌లో ఓ అడుగు ముందుకు వేయడానికి సమయం తీసుకున్నారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకున్నారు. ప్రేమలో ఉన్న విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్‌గానే ఉంచే ప్రయత్నం చేసినా పెళ్లిని మాత్రం అధికారికంగా ప్రకటించారు. రిసెప్షన్‌ను ఎంతో వైభవంగా జరుపుకున్నారు.

బడ్డీమూన్‌
పలు నగరాల్లో అభిమానుల కోసం స్వీట్లు కూడా పంచారు. పెళ్లయిన వెంటనే ఈ కొత్త జంట ఏకాంతంగా హనీమూన్‌కు వెళ్లకుండా ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో బడ్డీమూన్‌కు వెళ్లింది. అత్యంత సన్నిహితులతో చేసే విహారయాత్రే ఈ బడ్డీమూన్‌. ఆ తర్వాత ఈ నూతన దంపతులు ఇతర పెళ్లి వేడుకలకు కూడా హాజరయ్యారు. ఆ ఫోటోలు కూడా సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి.

మేము ముగ్గురమయ్యాం
ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి సెన్సేషన్‌గా మారింది. 'ఇప్పుడు మేము ముగ్గురమయ్యాం' అంటూ ఓ చిన్న యానిమేషన్‌ వీడియో క్లిప్‌ షేర్‌ చేసింది. అందులో రష్మిక, విజయ్‌తో పాటు ఓ పొద్దుతిరుగుడు పువ్వు ఉంది. రష్మిక టీ షర్ట్‌పై గుడ్డు ఫోటో కూడా ఉంది. దీంతో చాలామంది రష్మిక తల్లి కాబోతోందా? ఒక నెలలోనే గుడ్‌న్యూస్‌ చెప్పారు అంటూ శుభాకాంక్షలు చెప్తున్నారు.

ఇదీ సంగతి!
అసలు విషయమేంటంటే.. పొద్దుతిరుగుడు పువ్వును రష్మిక తన క్లోజ్‌ ఫ్రెండ్‌గా భావిస్తుంది. దానికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా (Rashmikaru పేరిట) ఓ అకౌంట్‌ కూడా ఉంది. అందులో ఆ పువ్వుతో ముచ్చట్లు చెప్తున్న సంగతులను, కథలను యానిమేటెడ్‌ ఫోటో, వీడియోల ద్వారా షేర్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యానిమేషన్‌ ప్రపంచంలోకి విజయ్‌ను ఆహ్వానిస్తూ ఈ పోస్ట్‌ పెట్టినట్లు తెలుస్తోంది.

 

చదవండి: అప్పుడేమో పెదవి విరిచి.. ఇప్పుడేమో రామాయణపై సీత ప్రశంసలు

Advertisement
 
Advertisement
Advertisement