breaking news
Cinema News
-
ఆ ఒక్క సంఘటనతో 36 ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరం!
ఎన్టీఆర్.. ఈ పేరొక ప్రభంజనం. క్లాస్ అయినా, మాస్ అయినా, దేశభక్తి అయినా, ఆధ్యాత్మికం అయినా.. ఎటువంటి సినిమాలోనైనా సరే ఇట్టే జీవించి తన పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు నందమూరి తారకరామారావు. అచంచలమైన నటనతో తెలుగువారి మనసులో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈయన సోదరుడు త్రివిక్రమరావు రావు కూడా నిర్మాతగా చలనచిత్ర పరిశ్రమకు సేవలందించారు. ఈయన కుమారులు కళ్యాన్, హరిన్ ఇద్దరూ యాక్టింగ్‌నే ఎంచుకున్నారు.హీరోగా ఎంట్రీకళ్యాణ్ చక్రవర్తి 1986లో 'అత్తగారు స్వాగతం' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కథానాయకుడిగానే కాకుండా సహాయక పాత్రల్లోనూ మెప్పించారు. తలంబ్రాలు, ఇంటి దొంగ, మామా కోడలు సవాల్, రౌడీ బాబాయ్, అత్తగారు జిందాబాద్, ప్రేమ కిరీటం వంటి పలు సినిమాలు చేశారు. చివరగా మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు (1989) మూవీలో కీలక పాత్రలో నటించారు.ఆ విషాదంవల్లే..నటుడిగా బిజీగా ఉన్న సమయంలో కళ్యాణ్ చక్రవర్తి (Nandamuri Kalyana Chakravarthy) ఇంట తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయన సోదరుడు హరిన్ మరణించారు. తండ్రి త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తండ్రిని కంటికి రెప్పలా చూసుకోవడం కోసం తన నట జీవితాన్ని త్యాగం చేసి చెన్నైలో ఉండిపోయారు. తర్వాత బిజినెస్ చూసుకున్నారు. మధ్యలో 2003లో వచ్చిన కబీర్దాస్ మూవీలో శ్రీరాముడి పాత్రలో కాసేపు కనిపించారు. 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ పూర్తి స్థాయిలో నటుడిగా మాత్రం దాదాపు 36 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. రోషన్ మేక హీరోగా నటిస్తున్న ఛాంపియన్ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి.. రాజిరెడ్డి అనే పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌లో కళ్యాణ్ లుక్ పవర్‌ఫుల్‌గా ఉంది. కాగా ఎన్టీఆర్ నామకరణం చేసిన వైజయంతి మూవీస్ సంస్థతోనే కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ ఇస్తుండటం విశేషం! ఈ మూవీ డిసెంబర్ 25న విడుదలవుతోంది.చదవండి: రాత్రిపూట మనోజ్ ఫోన్‌కాల్.. ఎంతో ఏడ్చా! బాలీవుడ్ నటుడు -
రాత్రిపూట మనోజ్ ఫోన్ కాల్.. ఎంతో ఏడ్చా: బాలీవుడ్ నటుడు
సినిమా లేదా సిరీస్ బాగుందంటే జనం ఆటోమేటిక్‌గా చూస్తారు. సెలబ్రిటీలు కూడా ఆయా ప్రాజెక్ట్‌ను మెచ్చుకుంటూ పోస్టులు పెడతారు. అయితే బాలీవుడ్లో ఇలా మెచ్చుకునే ప్రోగ్రామ్స్ ఉండవంటున్నాడు నటుడు మనోజ్ బాజ్‌పాయ్. ఇతడు ప్రధాన పాత్రలో నటించిన హిట్ సిరీస్ 'ద ఫ్యామిలీ మ్యాన్'. ఈ సిరీస్ మూడో సీజన్ ఇటీవలే రిలీజవగా మంచి రెస్పాన్స్ వచ్చింది.జీవితంలో మర్చిపోలేనుతాజాగా ఫ్యామిలీ మ్యాన్ టీమ్ అంతా ఓ చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా జైదీప్ అహ్లావత్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ సీజన్ 1 రిలీజైనప్పుడు మనోజ్ రాత్రిపూట నాకు ఫోన్ చేసి పావుగంటపైనే మాట్లాడాడు. అది నేను నా జీవితంలో మర్చిపోలేను. ఆ ఫోన్‌కాల్ తర్వాత నేనెంతో ఏడ్చాను అని చెప్పాడు. ఇంతలో మనోజ్ మాట్లాడుతూ.. ఆ రోజు ఫోన్లో ఏం చెప్పానంటే అతడు ఒక ఇన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే అందులో తాను ఒక విద్యార్థిగా చేరతానన్నాను అని గుర్తు చేసుకున్నాడు. అభద్రతా భావం ఎక్కువఆ వెంటనే ఇండస్ట్రీలో ఇలా ఒకరినొకరు పొగడటం చాలా తక్కువ అని చెప్పాడు. ఏ సెలబ్రిటీ కూడా ఫోన్ చేసి నీ యాక్టింగ్ బాగుంది, నీ ప్రాజెక్ట్ బాగుంది అని చెప్పరు. ఎందుకంటే వాళ్లకు అభద్రతా భావం ఎక్కువ. ఇప్పటికీ నేను మంచి పాత్రల కోసం ఫోన్ చేసి అడుగుతుంటాను. కష్టజీవిగా ఉండటానికే నేను ఇష్టపడతాను అని మనోజ్(Manoj Bajpayee) చెప్పుకొచ్చాడు. కాగా మనోజ్ బాజ్‌పాయ్, జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat).. గతంలో గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్ అనే వెబ్ సిరీస్‌లో, చిట్టగ్యాంగ్ మూవీలో నటించారు.చదవండి: చిన్న వయసులో చాలా చూశా.. ఏడ్చేసిన కృతీ శెట్టి -
వైకల్యం, అవమానాలు అధిగమించి గీత రచయితగా..
ఒక పాటలో కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు అన్నారో కవి. అది పాటకే పరిమితం కాదు, వాస్తవం. ప్రపంచంలో చాలా మంది తమలోని వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. పలు అవమానాలను, అవహేళనలను దాటుకుని అకుంఠిత దీక్షతో ఎదిగిన వారెందరో.. అలాంటి స్ఫూర్తిదాయకులు అన్ని రంగాల్లోనూ ఉంటారు. అలా తన వైకల్యాన్ని అధిగమించి గీత రచయితగా రాణిస్తున్న కవి కరుణాకరన్. ఆత్మస్థైర్యం ఎక్కువఈయనకు రెండు కాళ్ళు పని చేయవు. వీల్‌చైర్‌లోనే కూర్చుంటారు. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే ఒక వ్యక్తి సాయం అవసరం. అయితే కరుణాకరన్‌కు ఆత్మస్థైర్యం ఎక్కువ. అందుకు కారణం తనకున్న ప్రతిభ. ముఖ్యంగా సినీ సాహిత్యంపై మంచి పట్టు ఉన్న రచయిత. అయితే ప్రతిభ ఉన్నంత మాత్రాన అవకాశాలు రావు. అందుకోసం నిరంతర శ్రమ, పట్టుదల, ప్రయత్నం అవసరం. ఈయన పాటలు ఏం రాస్తారులే?అంగవైకల్యం అనే లోపం వల్ల చాలా అవమానాలను, అవహేళనలను ఎదుర్కొన్నానని అంటున్న కరుణాకరన్ ఇప్పుడు ప్రముఖ సినీ గీతా రచయితగా రాణిస్తున్నారు. పోరాడే గుణం మాత్రమే అపజయాలను చెదరగొడుతుంది అంటున్న ఈయన తన సినీ ప్రయాణమే ఒక పోరాటం అన్నారు. దివ్యాంగుడైన ఈయన పాటలు ఏం రాస్తారులే అని పలువురు పరిహాసం చేశారన్నారు. అలా సినీ ఎంట్రీఅలా తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టిన ఘటనలను అధిగమించి, పలువురు తనపై ఉంచిన నమ్మకంతో, ఆత్మస్థైర్యంతోను ఈ స్థాయికి చేరుకున్నట్లు పేర్కొన్నారు. భగవంతుడు, దివంగత ప్రఖ్యాత గీత రచయిత కన్నదాసన్ మార్గ దర్శకత్వం, తన అన్వేషణ, ప్రతిభ, ప్రయత్నాలతోనే సినీ రంగ ప్రవేశం చేశానన్నారు. వల్లభ ఫస్ట్ మూవీదివంగత ప్రముఖ గీత రచయిత వాలి తనకు గొప్ప శక్తి అని పేర్కొన్నారు. తనను ఆదరిస్తున్న దర్శకులకు, సంగీత దర్శకులకు, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హీరో శింభు నటించిన వల్లభ చిత్రం ద్వారా ఈయన గీత రచయితగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు అవరోధాలను అధిగమించి పలు చిత్రాలకు పాటలు అందించారు. మంచి పేరుఇటీవల విడుదలైన నిర్వాకం పొరుప్పల్ల, కిణరు చిత్రాలకు ఈయన రాసిన పాటలకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం విశాల్ కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న మకుటం చిత్రం, వెబ్ టుడే తదితర చిత్రాలకు కరుణాకరం పాటలను రాస్తున్నారు అదేవిధంగా తెలుగు, మలయాళం, హిందీ ఇతర భాషల నుంచి అనువాదం అవుతున్న చిత్రాలకు ఈయన మాటలు, పాటలు అందిస్తున్నారు. -
డేంజర్ జోన్లో బాలీవుడ్ భామలు!
మొన్నటి వరకు వెండితెరపై బాలీవుడ్ భామలదే హవా. తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ వాళ్లే నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలీవుడ్‌ని సౌత్ బ్యూటీస్ ఏలేస్తున్నారు. రష్మిక, సమంత, నయనతార లాంటి తారలు అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అవుతుంటే.. బాలీవుడ్ భామలు మాత్రం కెరీర్ విషయంలో తడబడుతున్నారు. వరుస అపజయాల కారణంగా పాన్ ఇండియా సినిమాల్లోనే కాదు బాలీవుడ్‌లోనూ అవకాశాలు రావట్లేదు. ఇక దీపికా పదుకొణె లాంటి హీరోయిన్లు మాత్రం కండీషన్ల కారణంగా చేతికి వచ్చిన ప్రాజెక్టులను కోల్పోతూ.. కెరీర్‌ని నాశనం చేసుకుంటున్నారు.అలియా చేతితో ‘ఆల్ఫా’ ఒక్కటేబాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో అలియాభట్ ఒకరు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం పడలేదు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన జిగ్రా చిత్రం భారీ అంచనాల మధ్య 2024లో ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది. రూ. 80 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రానికి కేవలం 32 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. అలియా కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చిత్రంగా మిగిలిపోయింది. దీంతో అలియా చేతికి మరో భారీ ప్రాజెక్టు రాలేదు. ఇప్పుడు తన ఆశలన్నీ ‘ఆల్ఫా’ చిత్రం మీదే పెట్టుకుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో మొదటి ఫీమేల్-లెడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.హిట్ కోసం కృతి ఎదురుచూపులుబాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు, సుకుమార్ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యి అక్కడే వరుస సినిమాల్లో నటిస్తుంది. అయితే ఈ బ్యూటీ ఖాతాలో కూడా భారీ హిట్ లేదు. ధనుష్‌తో కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే' ఈ మధ్య రిలీజై హిట్ టాక్ని సంపాదించుకుంది. అయితే కృతి చేతిలో మాత్రం ప్రస్తుతం భారీ ప్రాజెక్టులేవీ లేవు.కియారాకు వరుస షాకులుఅందం, అభినయం ఉన్న కియారా అద్వానీకి బాక్సాఫీస్ వద్ద వరస షాకులు తగులుతున్నాయి.‘భూల్ భులయ్యా 2’ తర్వాత కియరా ఖాతాలో హిట్ అనేదే లేదు. ‘జగ్ జగ్ జియో’ మొదలు గేమ్ ఛేంజర్ వరకు ఇలా ఆమె నటించిన భారీ చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కియరాకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రసుత్తం ఆమె చేతిన ఒకటి రెండు ప్రాజెక్టులు ఉన్నా.. వాటిపై పెద్ద అంచాలు అయితే లేవు.‘కండీషన్ల’తో రిస్క్ చేస్తున్న దీపికబాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొణెది విచిత్రమైన పరిస్థితి. మిగతావాళ్లంతా భారీ ప్రాజెక్టులకు కోసం ఎదురు చూస్తుంటే..దీపికా పదుకొణె మాత్రం చేతికి వచ్చిన అవకాశాలను వదులుకొని కెరీర్‌ని రిస్క్‌లో పెడుతోంది. స్పిరిట్‌లో ప్రభాస్‌కు జోడీగా నటించే అవకాశం మొదట్లో దీపికా పదుకొణెకే వచ్చింది. అయితే ఆమె పెట్టిన పని గంటల కండీషన్ నచ్చక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఆ ప్రాజెక్టు నుంచి దీపికను తప్పించాడు. ఆ తర్వాత 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి కూడా ఆమె తప్పుకున్నారు.ప్రస్తుతం దీపికా రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి షారుఖ్ ఖాన్ ‘కింగ్’. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. మరొకటి అల్లు అర్జున్-అట్లీ మూవీ. ఈ రెండింటిపైనే దీపికా ఆశలు పెట్టుకుంది. కానీ ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో కండీషన్స్ అంటూ దీపికా తన కెరీర్‌ని ప్రమాదంలోకి తీసుకెళ్తోంది. ఒవైపు సౌత్ స్టార్ల డామినేషన్..మరోవైపు కొత్త భామల దూకుడు కారణంగా ఈ బ్యూటీస్ కెరీర్ డేంజర్ పడింది. బాలీవుడ్లో తమ స్థానాన్ని కాపాడుకోవాలంటే..వీళ్లందరికి అర్జెంట్‌గా భారీ హిట్ పడాల్సిందే. -
60 ఏళ్లకు లవ్‌లో పడాలనుకోలే..
అరవై ఏళ్లకు ఎవరైనా రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ సినిమా హీరోలు మాత్రం యంగ్ హీరోలకు పోటినిచ్చేలా ఎలాంటి సినిమాలు తీయాలన్న ప్లానింగ్‌లో ఉంటారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ ఆ పనితో పాటు మరో పనిలో కూడా ఉన్నాడు. గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే అధికారికంగా వెల్లడించాడు.మూడోసారి ప్రేమలో..రెండు పెళ్లిళ్లు - విడాకుల తర్వాత ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడ్డానని తెలిపాడు. కానీ ఈ ఏజ్‌లో లవ్‌లో పడతానని అస్సలు ఊహించలేదని, ప్రేమ కోసం పాకులాడలేదని చెప్తున్నాడు. తాజాగా ఓ వేదికపై ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను మళ్లీ రిలేషన్షిప్లో అడుగుపెడతానని అస్సలు అనుకోలేదు. కానీ గౌరీ నా జీవితంలో చాలా ప్రశాంతతను, స్థిరత్వాన్ని తీసుకొచ్చింది. తనొక అద్భుతమైన వ్యక్తి. తనను కలవడమే ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. గొడవల్లేవ్వైవాహిక బంధంలో సక్సెస్ అవకపోయినప్పటికీ మాజీ భార్యలు రీనా, కిరణ్‌లను కలుస్తూ ఉంటాను. ఇప్పుడు గౌరీ కూడా యాడ్ అయింది. నేను వ్యక్తిగా ఎదిగేందుకు వీళ్లంతా చాలా దోహదపడ్డారు. అందుకు నేను వారిని ఎంతో గౌరవిస్తాను. రీనా దత్తాతో నేను విడిపోయినప్పటికీ మా మధ్య ఎటువంటి గొడవలు లేవు. మంచి స్నేహితులుగా కలిసే ఉంటాం. ఫస్ట్ పెళ్లికిరణ్ విషయంలోనూ అంతే.. తను కూడా ఎంతో అద్భుతమైన వ్యక్తి. మేమిద్దరం భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ కుటుంబంగా మాత్రం కలిసే ఉన్నాం. రీనా.. ఆమె పేరెంట్స్, కిరణ్.. ఆమె పేరెంట్స్.. నా తల్లిదండ్రులు.. అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. కాగా ఆమిర్ ఖాన్.. 1986లో రీనా దత్తాను పెళ్లాడాడు. వీరికి జునైద్ ఖాన్, ఇరా ఖాన్ సంతానం. రెండో పెళ్లికొంతకాలానికి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు రావడంతో 2022లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ (Aamir Khan).. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నాడు . వీరికి కుమారుడు ఆజాద్ సంతానం. పెళ్లయిన 16 ఏళ్ల తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌తో ప్రేమాయణం సాగిస్తున్నాడు.చదవండి: తనూజ చెల్లి వివాహం.. ఫోటోలు వైరల్ -
‘మహానటి’కి మరణం లేదు: వెంకయ్య నాయుడు
అందం, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో మహానటిగా చెరగని ముద్ర వేశారు సావిత్రి. శనివారం (డిసెంబరు 6) ఆమె 90వ జయంతిని పురస్కరించుకుని సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో సంగమం ఫౌండేషన్ చైర్మన్ సంజయ్ కిశోర్ నిర్వహణలో హైదరాబాద్‌లో ‘సావిత్రి మహోత్సవం’ని ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ– ‘‘మహానటికి మరణం లేదు. ప్రతి చిత్రంలో ఆమె పాత్ర మాత్రమే కనిపించేది తప్ప సావిత్రి కనిపించేది కాదు’’ అన్నారు.ఈ వేదికపై ‘మహానటి’ చిత్రనిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్‌లను, అలాగే రచయిత సంజయ్ కిశోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను సత్కరించారు. అదే విధంగా 90 మంది బాల గాయనీమణులు సావిత్రి పాటల పల్లవులను ఆలపించారు. ఇంకా సావిత్రి పాటల పోటీ విజేతలకు బహుమతులు అందించారు. నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, మురళీమోహన్, తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు. -
15 ఏళ్లుగా పోరాటం.. గ్లామర్ ఉన్నా నో లక్!
పదిహేనేళ్లుగా స్టార్ హీరోయిన్ స్టేటస్ కోసం కష్టపడుతోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్. 2010లో వచ్చిన తమిళ చిత్రం ఒర్ ఎరవుతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత తననెవరూ గుర్తించకపోయేసరికి బుల్లితెరకు షిఫ్ట్ అయింది. ఆహా, మాయ సీరియల్స్ చేసింది. 2013-2018 వరకు ప్రసారమైన దైవమగళ్ సీరియల్‌తో ఆమె కెరీర్ టర్న్ అయిపోయింది. ఇందులో వాణి అందం, నటన చూసి సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అలా 2019లో తెలుగులో ఏకైక మూవీ 'మీకు మాత్రమే చెప్తా'లో హీరోయిన్గా చేసింది.సీన్స్ కట్ఆ మరుసటి ఏడాది తమిళంలో చేసిన ఓ మై కడవులే పెద్ద విజయం సాధించింది. దీంతో తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ పోయింది. మహాన్‌లో కీలక పాత్రలో నటించినప్పటికీ చివర్లో ఆమె నటించిన సీన్స్ అన్నీ ఎత్తేశారు. సినిమాలు చేస్తుందే కానీ అనుకున్నంత గుర్తింపయితే రాలేదు. ఆ మధ్యలో తమిళ్ రాకర్స్, సెంగళం, చట్నీ సాంబార్ అని వెబ్ సిరీస్‌లలోనూ యాక్ట్ చేసింది.వివాదంవాణి భోజన్.. నటుడు జైతో సహజీవనం చేస్తోందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారమని వాణి ఖండించింది. కష్టపడి బ్యాంకు లోను తీసుకుని ఇల్లు కట్టుకుంటే సొంత ఇంట్లో కాకుండా ఎవరో ఒకరి ఇంట్లో అతడితో కలిసున్నానని రాయడం చాలా చీప్ అని ఆవేదన వ్యక్తం చేసింది. కోరికసెంగళం అనే వెబ్ సిరీస్‌లో రాజకీయ నాయకురాలి పాత్ర పోషించిన ఈ బ్యూటీకి రాజకీయాలపై ఆసక్తి ఉంది. భవిష్యత్తులో పాలిటిక్స్‌లో అడుగుపెడతానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. అలాగే గంగూభాయ్ కథియావాడి వంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఆశపడుతోంది. మరి వాణి భోజన్ (Vani Bhojan)కు అలాంటి ఆఫర్స్ ఎప్పుడొస్తాయో, తెలుగులో మళ్లీ ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Prashun Prashanth Sridhar (@prachuprashanth) -
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న నందమూరి హీరో!
మూడు దశాబ్దాల తర్వాత నందమూరి కల్యాణ్ చక్రవర్తి( వెండితెరపై కనిపించనున్నారు. రోషన్, అనస్వరా రాజన్ హీరో హీరోయిన్లుగా, కల్యాణ్ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ మూవీ ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమాలోని కీలకమైన రాజి రెడ్డి పాత్రలో నందమూరి కల్యాణ్ చక్రవర్తి(Nandamuri Kalyan Chakravarthy) నటించినట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘1980లలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన కల్యాణ్ చక్రవర్తి మా ‘ఛాంపియన్’ సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. చిరంజీవిగారి ‘లంకేశ్వరుడు’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన తర్వాత, ఆయన నటన నుంచి విరామం తీసుకుని, మళ్లీ 35 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
గత సినిమా ఆడలేదు, అందుకే గ్యాప్ తీసుకున్నా..
త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఈషా’. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహించారు. కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. చివరి సినిమా ఆడలేదుఈ సందర్భంగా దామోదర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘నిర్మాతగా నా గత చిత్రం ‘ఫాదర్.. చిట్టి.. ఉమా.. కార్తీక్’ను మంచి కంటెంట్‌తో తీసినా ఎందుకో ప్రేక్షకాదరణ దక్కలేదు. దీంతో ప్రేక్షకులకు ఎలాంటి కథలు నచ్చుతున్నాయనే ఆలోచనలో పడ్డాను. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ‘ఈషా’ కథను శ్రీనివాస్ మన్నె చెప్పగా ఆసక్తిగా అనిపించి ఈ చిత్రం చేశాం. దేవుడుంటే దెయ్యం కూడా..దేవుడు ఉన్నాడని నమ్మితే, దెయ్యం కూడా ఉందని నమ్ముతారు. నేనేతై అన్నీ నమ్ముతాను. మూఢ నమ్మకానికి, నమ్మకానికి మధ్య ఉన్న క్లాష్ ‘ఈషా’ సినిమా అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో రియాలిటీ ఎక్కువగా ఉంటుంది. కష్టపడేతత్వం, ప్యాషన్, ఓర్పు... ఇవన్నీ శ్రీనివాస్‌లో చూశాను. ఈ సినిమా చూశా.. చాలా బాగుంది. థ్రిల్లర్ సినిమాలో విజువల్, సౌండ్ చాలా ముఖ్యం. సక్సెస్ రావట్లేఈ చిత్రంలో ఈ రెండూ బాగుంటాయి. ఇక కోవిడ్ తర్వాత సినిమా వ్యాపారం పూర్తిగా మారిపోయింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి సినిమాలు నిర్మిస్తే కానీ సక్సెస్ రావడం లేదు. మా సంస్థలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందుకనే బ్యాక్ టు బ్యాక్ కాకుండా క్వాలిటీ సినిమాలు చేయాలనుకుంటున్నాను’’ అని దామోదర ప్రసాద్ (KL Damodar Prasad) అన్నారు.చదవండి: బిగ్‌బాస్ ట్రోఫీకి ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? -
ప్రధాని మోదీ ఈ సినిమా చూసేలా ప్రయత్నిస్తాను: మంత్రి కోమటిరెడ్డి
‘‘ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్న గుమ్మడి నర్సయ్యను ప్రజాప్రతినిధులు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ‘గుమ్మడి నర్సయ్య’ సినిమా తీస్తుండటం అభినందనీయం. ఈ సినిమాతో అయినా సమాజంలో మార్పు రావాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవితం ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో వెండితెరకు రానుంది. ఆయన పాత్రలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కనిపించనున్నారు. పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో నల్లా సురేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ– ‘‘ప్రధాని మోదీగారు కూడా ఈ సినిమా చూసేలా ప్రయత్నిస్తాను. అన్ని భాషల్లో ఈ చిత్రం తీయాలి’’ అని సూచించారు. ‘‘రాజకీయం అంటే ఉద్యోగమో, వ్యాపారమో కాదు... ఇదొక సామాజిక బాధ్యత అని గుర్తు చేయడం కోసం ఈ సినిమా చేస్తున్నాను’’ అన్నారు పరమేశ్వర్ హివ్రాలే. ‘‘మా సినిమా రిలీజ్ తర్వాత రాజకీయాల్లో మార్పు వస్తుందని భావిస్తున్నాను’’ అని నల్లా సురేష్ రెడ్డి తెలిపారు. ‘‘గుమ్మడి నర్సయ్యగారిలాంటి మంచి మనిషి పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉంది’’ అని శివరాజ్ కుమార్ చెప్పారు. ‘‘నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు గుమ్మడి నర్సయ్య. ఈ సినిమా ప్రారంభోత్సవంలో కొత్తగూడెం, పిన΄ాక ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, ΄ాయం వెంకటేశ్వర్లు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తదితరులు ΄ాల్గొన్నారు. -
సినిమాలో అన్ని పాటలు పాడిన రెహమాన్
సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, నటుడు, నృత్య దర్శకుడు ప్రభుదేవాలది హిట్ కాంబినేషన్. మొదట్లో వీరి కాంబోలో రూపొందిన కాదలన్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత ప్రభుదేవా, రెహమాన్ కాంబోలో చిత్రం రూపొందుతోంది. అంతేకాదు, ఈ చిత్రంలోని ఐదు పాటలకు బాణీలు కట్టి పాడింది రెహమానే కావడం విశేషం. ఇలా తన ఆల్బమ్‌లో అన్ని పాటలు పాడటం రెహమాన్‌కు ఇదే మొదటిసారి!అది రిపీట్ అవాలని..ఈ సినిమా పేరు మూన్ వాక్ (Moon Walk Movie). దీన్ని బిహైండ్స్ వుడ్స్ సౌత్ నిర్మిస్తోంది. ఈ సంస్థ వ్యవహస్థాపకుడు, సీఈఓ మనోజ్ నిర్మల శ్రీధర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఇష్టపడిన జెంటిల్మన్, కాదలన్ అనుభవాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావించానన్నారు. ఆ ప్రయత్నమే మూన్ వాక్ అన్నారు. రెండు వారాల రిహార్సల్స్ఇందులో సంగీతానికి, డ్యాన్స్‌కు కొరతే ఉండదన్నారు. ఈ మూవీలోని ప్రతి పాటకు ప్రభుదేవా రెండు వారాలు రిహార్సల్స్ చేసి నటించారని చెప్పారు. గత మూడేళ్లుగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026లో సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది పూర్తిగా వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందన్నారు.చదవండి: అప్పుడే తెలిసిపోయింది -
‘అండర్ గ్రౌండ్‌కి వెళ్లడానికి రెడీ’ అన్న హీరోయిన్
ఒక్కసినిమాలో పాత్రతోనే కొందరు నటీనటులు చాలాకాలం గుర్తుండిపోతారు. అలాగే నిజ జీవితంలో జరిగిన ఒక్క సంఘటనతో మరికొందరు గుర్తుండిపోతారు. అయితే అటు సినిమాల్లో పాత్రతోనూ ఇటు నిజజీవితంలో సంఘటనతోనూ గుర్తుండిపోతుంది శ్వేతాబసు ప్రసాద్. కొత్త బంగారు లోకం అనే సినిమాలో ఎ...క్క....డ అంటూ వరుణ్ సందేశ్‌ను ఆటపట్టిస్తూ ప్రేక్షకుల మనసుల్లో తిష్టవేసుకున్న ఆ టీనేజ్ బ్యూటీ... దురదృష్టవశాత్తూ... హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉన్న ఓ స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో పట్టుబడిన అత్యంత పిన్నవయస్కురాలైన తారగా కూడా గుర్తుండిపోయింది.ఆ తర్వాత చాలా కాలం పాటు తెరమరుగైన శ్వేతాబసు... కొంత కాలంగా సినిమాల్లో, వెబ్‌సిరీస్‌లలో రాణిస్తూ మరోసారి నటిగా తన సత్తా చాటుతోంది. ఇటీవల మహారాణి అనే వెబ్‌సిరీస్ 4వ సీజన్ ద్వారా మరోసారి తన నటనా ప్రతిభను చాటింది. ఈ నేపధ్యంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకుంది. తాను నిలకడగా నిదానంగా పని చేస్తున్నాన నీ అవకాశాల వెంట పరుగులు తీయడం లేదని ఆమె అంటోంది. తాను చాలా జాగ్రత్తగా పాత్రలు ఎంపిక చేసుకుంటూన్నానని అందుకే తనను ఇష్టపడే, తన నటనపై నమ్మకం ఉన్న ప్రేక్షకులు తనకు ఉన్నారని చెప్పింది. ప్రత్యేకతను సృష్టించుకోవడం చాలా ముఖ్యమంటూ, తన పాత్రలను ఎంచుకోవడంలో అది కనిపిస్తుందంది. భవిష్యత్తులో తన ఎంపికలు తప్పుకావచ్చు కానీ తాను ప్రయోగాలు చేయడానికి భయపడనని స్పష్టం చేసింది. నిజానికి తన వద్దకు వచ్చే 10 ప్రాజెక్టులలో 9 ప్రాజెక్టులకు నో చెబుతున్నానంది. దాని వల్ల అవకాశాలు కోల్పోతున్న అనే బాధ లేదని అవసరమైతే 6 నెలలు ఇంట్లో కూర్చున్నా తనకు ఓకే అంది. ‘‘నా జీవితంలో ఆడంబరాలు, విలాసాలు లేవు, అవి ఉంటే ఇతరుల అంచనాలకు అనుగుణంగా జీవించాలి ఫోటోషూట్లు చేస్తూనే ఉండాలి’’ అంటోంది. ఆ తరహా జీవనశైలి వల్ల తనకు నిరంతరం ఒత్తిడి ఉండదనీ,అవసరమైతే అండర్ గ్రౌండ్( అజ్ఞాతం)లోకి వెళ్లిపోయి పని ఉన్నప్పుడు మాత్రమే బయటకు రావడడం తనకు సులభం అని అని టెలివిజన్‌తో సహా హిందీ, తెలుగు, తమిళ సినిమాల్లో పనిచేసిన బహుభాషా నటి అంటోంది. గత కొంత కాలంగా మక్దీ, ఇక్బాల్, తాష్కెంట్ ఫైల్స్, సీరియస్ మెన్, జూబ్లీ, త్రిభువన్ మిశ్రా సిఎ టాపర్ వంటి పలు వైవిధ్య భరిత చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించిన శ్వేత, తన ఎంపికల ప్రాధాన్యతల వల్లే ఆసక్తికరమైన పాత్రలు తన వైపు వస్తున్నాయని స్పష్టం చేసింది. ‘‘నేను ముందు ప్రేక్షకురాలిని ఆ తర్వాత నటిని. నేను ఏది ఎంచుకున్నా అది నేను చూడాలనుకునేది కావడం చాలా ముఖ్యం.’’ అంటూ వివరించింది. , ప్రేక్షకులు ప్రయోగాలను ఆదరించరనేది ఇప్పుడు ఒక అపోహ. ప్రేక్షకులు అన్ని రకాల ప్రాజెక్టులను చూస్తున్నారు కాబట్టే నిర్మాతలు ధైర్యం చేయగలుగుతున్నారు అంటోందామె. ఒక నటిగా కొనసాగేందుకు ఇది గొప్ప సమయం అందామె. -
కొడుకుని చూడక పదేళ్లు! అమ్మ కనిపిస్తే పక్కింటావిడ అని!
దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్నాడు బండి సరోజ్ కుమార్. ప్రస్తుతం ఈయన మోగ్లీ మూవీలో కీలక పాత్రలో నటించాడు. యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 12న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా బండి సరోజ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఎవరితో టచ్‌లో లేనుఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ.. మాది మధ్యతరగతి కుటుంబం. కానీ, చిన్నప్పటినుంచే నేను చాలా ధనవంతుడిని అని ఫీలయ్యేవాడిని. మా అమ్మ స్కూల్‌కి వస్తే కూడా పక్కింటావిడ అని చెప్పేవాడిని. డబ్బుల గురించి కాదు కానీ ఎప్పుడూ అందరికంటే పైన ఉండాలని ఆశపడేవాడిని. అమ్మానాన్నకు టచ్‌లో లేను. వాళ్ల ఫోటో కూడా నా దగ్గర లేదు. భార్యాబిడ్డకు దూరంఅందరికంటే నేను తేడాగా ఎందుకున్నానని ఆలోచించాను. మామూలుగా ఉండాలని ప్రయత్నించాను. సీరియస్‌గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ తర్వాత ఈ జీవితమంతా ఫేక్ అనిపించింది. నా భార్య ఏడాది వయసున్న నా కొడుకును తీసుకొచ్చి చూపిస్తే నాలో ఎటువంటి చలనం లేదు. అంటే నాకు కడుపు తీపి లేదు. కొడుకుని చూసి పదేళ్లవుతోంది. వాళ్లందరికీ దూరంగా ఉన్నాను.సిగరెట్లు మానేశా..నాకు కేవలం సినిమాలపైనే ఆసక్తి ఉంది. దేనిపైనా నాకు వ్యామోహం లేదు. అంతకుముందు అమ్మాయిలను ఇంటికి పిలిచేవాడిని. కానీ, ఏడాదికాలంగా బ్రహ్మచర్యం పాటిస్తున్నాను. అప్పట్లో వెయ్యికి పైగా సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు పూర్తిగా మానేశాను. కాకపోతే మోగ్లీ సినిమాలో మాత్రం సిగరెట్లు తాగుతూ కనిపిస్తాను అని బండి సరోజ్ కుమార్ (Bandi Saroj Kumar) చెప్పుకొచ్చాడు.సినిమాబండి సరోజ్ కుమార్ నిర్బంధం, నిర్బంధం 2, మాంగళ్యం, పరాక్రమం సినిమాల్లో నటించడంతోపాటు స్వీయదర్శకత్వం వహించి నిర్మాతగానూ వ్యవహరించాడు. పోర్కాలం, అస్తమానం అనే తమిళ సినిమాలకు దర్శకరచయితగానూ పని చేశాడు.చదవండి: ఇమ్మాన్యుయేల్ తొండాట.. బయటపెట్టిన నాగార్జున -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘దురంధర్’.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
బాలీవుడ్లో ఈ వారం రిలీజ్ అయిన పెద్ద చిత్రం ‘దురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఆదిత్య ధర్ తెరకెక్కించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య నిన్న (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. మూడున్నర గంటల నిడివితో వచ్చినప్పటికీ.. ఎంగేజ్ చేసేలా ఉందని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముందు నుంచే భారీ అంచనాల ఉండడం.. రిలీజ్ తర్వాత హిట్ టాక్ రావడంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి.తొలి రోజు ఈ చిత్రాని(Dhurandhar Box Office Collection)కి దాదాపు రూ. 27 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినిమాకు ఉన్న బజ్‌కి రూ. 15-18 కోట్ల వరకు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా..అంతకు మించి కలెక్షన్స్‌ని రాబట్టి.. హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత రణ్వీర్ సింగ్ ఖాతాలో హిట్ పడిందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. సినిమాకు వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. వీకెండ్‌లోగా రూ. 100 కోట్ల క్లబ్లో చేరే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కథ విషయానికొస్తే.. ఇదొక దేశభక్తి అంశాలతో ముడిపడిన స్పై యాక్షన్ థ్రిల్లర్. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల్ని అంతమొందించేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చేపట్టిన రహస్య ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఇందులో సీక్రెట్ ఏజెంట్‌గా రణ్వీర్ సింగ్.. ఐబీ చీఫ్‌గా మాధవన్ నటించారు. విలన్‌గా అక్షయ్ ఖన్నా తనదైన నటనతో మెప్పించాడు. -
సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది!: రాజ్ పిన్ని
హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వీరి పెళ్లి ఎంతో సింపుల్‌గా జరిగింది. ఈ వివాహం గురించి సంగీత విద్వాంసురాలు శోభారాజు మాట్లాడారు. ఈమె ఎవరంటే.. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సంగీత దర్శకురాలిగా మంచి పేరు గడించింది డాక్టర్ శోభారాజు. శోభారాజు రియాక్షన్2010లో ఈమెను పద్మశ్రీ పురస్కారం వరించింది. ఈమెకు రాజ్ నిడిమోరు బంధువవుతాడు. శోభారాజు అక్క రమాదేవి కొడుకే రాజ్ నిడిమోరు. కోడలి వరసయ్యే సమంత గురించి శోభారాజు మాట్లాడుతూ.. ఒక ఆధ్యాత్మిక పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. ఆశ్రమంలో స్వామివారి ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుక జరిగింది. రాజ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే..వాడు చిన్నగా ఉన్నప్పుడే ముద్దుగారే యశోద.. వంటి పాటలు నేర్చుకుని పాడేవాడు. మీ పిన్ని పేరు నిలబెట్టావని అందరూ వాడిని మెచ్చుకునేవాళ్లు. అది నాకు చాలా సంతోషంగా అనిపించేది. తను సంగీతం నేర్చుకుని ఎన్నో పాటలు పాడాడు. వాడికి స్పిరిచ్యువాలిటీ ఎక్కువ. సమంతకు కూడా ఆధ్యాత్మిక మార్గంపై ఆసక్తి ఉందని తెలిసింది.పక్కన కూర్చోవాలంటే సిగ్గేసిందిఓ రెండుసార్లు తను వచ్చినప్పుడు చూశాను, చాలా సన్నగా ఉంది. తన పక్కన కూర్చోవాలంటే సిగ్గేసింది. సన్నగా అవాలంటే ఎలా? అని అడిగినప్పుడు ఏవో ఎక్సర్సైజ్లు చెప్పింది, కానీ నేను చేయలేనన్నాను. తను మూడు నెలలకోసారి ఈషా ఆశ్రమానికి వెళ్లి మౌనం పాటిస్తూ సాధన చేస్తుందని తెలిసి సంతోషంగా అనిపించింది. బహుమతులు ఏమిచ్చారంటే?ఎంతో బిజీ నటి అయుండి ఇలా ధ్యానానికి సమయం కేటాయిస్తుందంటే ముచ్చటేసింది. అలాంటి అమ్మాయి రాజ్‌కు దొరకడం హ్యాపీ. సమంత (Samantha Ruth Prabhu) వాడిని మరింత ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తుందని ఆశిస్తుందన్నాను. పెళ్లిలో ఆరోగ్యకరమైన ఆహారమే వడ్డించారు. అలాగే కెమికల్స్ వాడని పర్ఫ్యూమ్స్ కానుకగా ఇచ్చారు అని శోభా రాజు చెప్పుకొచ్చారు. చదవండి: పవన్ కల్యాణ్.. బిగ్‌బాస్ చరిత్ర తిరగరాయనున్నాడా? -
అఖండ 2.. టాలీవుడ్‌కి ఓ గుణపాఠం!
సినిమా అనేది కూడా ఒక వ్యాపారం. ఇక్కడ ఎవరి లెక్కలు వాళ్లకు ఉంటాయి. స్టార్ హీరో సినిమా అయినా..‘లెక్కల్లో’ తేడా వస్తే.. ఆగిపోవాల్సిందే. దానికి మంచి ఉదాహరణే ‘అఖండ 2’. అన్ని అనుకున్నట్లుగా సాగితే నిన్ననే(డిసెంబర్ 5) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేది. ఈ పాటికి హిట్టో, ఫ్లాపో అనే విషయం కూడా తెలిసిపోయేది. కానీ చివరి నిమిషంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ముందుగా ప్రీమియర్స్‌ని రద్దు చేసిన నిర్మాతలు.. ఆ తర్వాత కొన్ని గంటలకే సినిమా విడుదలనే వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు.వాయిదా కామన్ కానీ.. సినిమా విడుదల వాయిదా అనేది ఇండస్ట్రీలో కామన్. అనుకున్న తేదికి రిలీజ్ కానీ సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు దాదాపు అనుకున్న తేదికి రిలీజ్ కావు. షూటింగ్ ఆసల్యం అవ్వడం లేదా.. ఓటీటీ బిజినెస్ కాకపోవడం..ఫైనాన్షియల్ ప్రాబ్లమ్.. ఇలా వివిధ కారణాలతో కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే అవన్నీ వాయిదా వేసిన విషయం కనీసం రిలీజ్‌కి వారం, పది రోజలు ముందే చెప్పేవి. కానీ అన్ని పనులు పూర్తి చేసుకొని..కొన్ని గంటల్లో థియేటర్స్‌కి రావాల్సిన సినిమా..ఆగిపోవడం అనేది ‘అఖండ 2’(Akhanda 2) విషయంలో మాత్రమే జరిగింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే ఇప్పటి వరకు ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోతున్నామని చెప్పినప్పటికీ.. 14 రీల్స్ ప్లస్ సంస్థ అధినేతలకు, ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థకు మధ్య ఫైనాన్స్ వివాదం వల్ల సినిమా ఆగిపోయిందనే విషయం దాచలేని సత్యం.అలెర్ట్ కాకపోతే ఇబ్బందులు తప్పవు!ఫైనాన్స్ ఇష్యూలతో సినిమా రీలీజ్ ఆలస్యం అవడం అనేది ఇండస్ట్రీలో తరచు జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీ పెద్దలు చొరవ చేసుకొని సమస్యలను పరిష్కరించి రిలీజ్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ మధ్య హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరిగింది. చివరి నిమిషయంలో పవన్ కల్యాణ్ రంగంలోకి దిగడంతో సినిమా విడుదల అయింది. అఖండ 2 విషయంలోనూ అదే జరుగుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. ఈ సంఘటన టాలీవుడ్‌కి ఓ గుణపాఠం అనే చెప్పాలి. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకున్న తర్వాతే సినిమాను విడదల చేయాలి. అంతేకానీ ఫైనాన్షియల్ ఇష్యూని తేలిగ్గా తీసుకొని.. తర్వాత చూసుకుందాంలే అని వస్తే మాత్రం..‘అఖండ 2’ పరిస్థితే వస్తుంది. సినిమా రిలీజ్ తర్వాత నిర్మాతలు చేతులు ఎత్తేస్తారని తెలిసి..కొంతమంది ఫైనాన్షియర్లు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఏదైనా ఉంటే రిలీజ్‌కు ముందే చూసుకోవాలని వారి ఆలోచన. ఇక్కడ వారిని కూడా తప్పుపట్టలేం. ఇలాంటి సమస్యలను నిర్మాతలు రిలీజ్‌కు ముందే పరిష్కరించుకుంటే మంచిది. లేదంటే ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆర్థికంగా భారీగా నష్టపోయే అవకాశం ఉంది. -
తండ్రయిన వెంటనే ఖరీదైన కారు కొన్న హీరో
బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ ఇటీవలే తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. నవంబర్ 7న కత్రినా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబును ఆడించడంలోనే ఈ దంపతులిద్దరూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాబు పుట్టాక తొలిసారి ఓ ఖరీదైన వస్తువు కొన్నారు.లగ్జరీ కారులెక్సస్ బ్రాండ్‌కు LM350h 4S మోడల్ కారును తమ సొంతం చేసుకున్నారు. దీని విలువ రూ.3.20 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. విక్కీ కౌశల్ ఈ కారును నడుపుతున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కారులో ప్రీమియం సౌండ్‌తో పాటు 48 ఇంచుల హెచ్డీ డిస్ప్లే ఉంది. సీటింగ్ కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది.అదో కొత్త ఫీలింగ్ఇకపోతే ఈ ఏడాది తనకు ఎక్కువ సంతోషాన్నిచ్చిన క్షణం.. తాను తండ్రవడమేనని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు విక్కీ కౌశల్. అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని, ఒక మ్యాజికల్ మూమెంట్ అని పేర్కొన్నాడు. ఈ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా భావోద్వేగానికి లోనవుతానని తనకు తెలుసని.. బాబును చేతుల్లోకి తీసుకున్నప్పుడు మనసుకెంతో ప్రశాంతంగా అనిపించిందన్నాడు. అలాంటి అనుభూతి అంతకుముందెన్నడూ కలగలేదని గుర్తు చేసుకున్నాడు. కాగా విక్కీ కౌశల్ (Vicky Kaushal), కత్రినా 2021 డిసెంబర్ 9న పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)చదవండి: అఖండ 2.. ఇప్పట్లో రిలీజ్ లేనట్లేనా? -
నాగార్జున గోవాకు పిలిచి మరీ వార్నింగ్..: దర్శకుడు
తొలి సినిమాతో 'సింహరాశి'తోనే ఇండస్ట్రీలో తన పేరు మారుమోగిపోయేలా చేశాడు దర్శకుడు వి. సముద్ర. శివరామరాజు, టైగర్ హరిశ్చంద్రప్రసాద్, ఎవడైతే నాకేంటి, మహానంది, పంచాక్షరి.. ఇలా ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనేక విశేషాలను పంచుకున్నాడు.లారెన్స్‌ను పరిచయం చేశా..సముద్ర మాట్లాడుతూ.. మొదట్లో అనేకమంది దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ముత్యాల సుబ్బయ్యగారి దగ్గర పనిచేస్తున్నప్పుడు చిరంజీవి హిట్లర్ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా సమయంలోనే చిరంజీవికి తొలిసారి లారెన్స్‌ను పరియం చేశాను. 'అబీబీ అబీబీ..' పాటలో సిగ్నేచర్ స్టెప్పును లారెన్స్ కొరియోగ్రఫీ చేశాడు. ఆ సినిమా తర్వాత లారెన్స్ వెనక్కు తిరిగి చూసుకోలేదు.నాగార్జున పిలిచి మరీ..అనుష్కతో నేను పంచాక్షరి సినిమా తీశాను. నాగార్జున (Nagarjuna Akkineni) మేకప్‌మెన్ చంద్ర ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించాడు. నాగార్జున నన్ను ఓసారి గోవాకు పిలిచి.. శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అరుంధతి తీశాడు. ఆయన పెద్ద ప్రొడ్యూసర్.. ఇక్కడుంది చంద్ర, నా మేకప్‌మెన్. అంత పెద్ద నిర్మాత కాదు. వీడి లైఫ్ జాగ్రత్త.. అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. నాగార్జున తన దగ్గర పనిచేసేవాళ్లను చాలా బాగా చూసుకుంటాడు.గోరుముద్దలుమహానంది సమయంలో అనుష్క (Anushka Shetty) నాకు గోరుముద్దలు పెట్టేది. అప్పుడెలా అన్నం తినిపించిందో పంచాక్షరి సమయంలోనూ అలాగే ప్రేమగా తినిపించింది. అలా నాకు గోరుముద్దలు పెట్టిన హీరోయిన్లు మరెవరూ లేరు. తర్వాత తను స్టార్ హీరోయిన్గా మారాక తన నడవడికలో కొంత తేడా వచ్చినట్లు అనిపించింది. అయితే అప్పటికీ, ఇప్పటికీ తను చాలా మంచి అమ్మాయి అని సముద్ర (V Samudra) చెప్పుకొచ్చాడు.చదవండి: వాళ్లంతా సర్వనాశనం అయిపోతారు: ఇంద్రజ -
పెళ్లయిన వారానికే రాహుల్ సిప్లిగంజ్ హనీమూన్
అలా పెళ్లయిదో లేదో ఇలా వెకేషన్ చెక్కేశాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. హరణ్యతో ఇటీవలే (నవంబర్ 27న) అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో క్రికెటర్స్, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా భార్యతో కలిసి హనీమూన్ వెళ్లిపోయాడు రాహుల్.వెకేషన్లో కొత్త జంటమాల్దీవుల్లో కొత్త దంపతులు ప్రకృతిని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లయిన వారానికే హనీమూన్ వెళ్లిపోయి ఏకాంతంగా సేద తీరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.రాహుల్ నేపథ్యంరాహుల్ (Rahul Sipligunj) జర్నీ విషయానికి వస్తే ఇతడు పక్కా హైదరాబాదీ కుర్రాడు. చిన్నప్పటినుంచే సంగీతం అంటే పిచ్చి. ఓపక్క తండ్రికి సాయంగా బార్బర్ షాప్‌లో పని చేస్తూనే మరోపక్క సంగీతంలో శిక్షణ తీసుకునేవాడు. సినిమాల్లో పాటలు పాడటంతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేశాడు. అవే అతడికి ఎక్కువ పేరు తీసుకొచ్చాయి. తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక ఆర్ఆర్ఆర్ మూవీలో కాలభైరవతో కలిసి పాడిన నాటునాటు సాంగ్ అతడికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) -
ఏడేళ్లు సీరియల్స్.. సినిమాల్లో కలిసిరాని లక్!
అందం, టాలెంట్ ఉంటే సరిపోదు కూసింత అదృష్టం కూడా ఉండాలి. పాయల్ రాజ్‌పుత్‌కు లక్ మెరుపుతీగలా వచ్చి వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే ఇప్పటికీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. నేడు (డిసెంబర్ 5) పాయల్ రాజ్‌పుత్ 33వ బర్త్‌డే.. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..సీరియల్ నటిగా..1992 డిసెంబర్ 5న ఢిల్లీలో పాయల్ జన్మించింది. చిన్ననాటి నుంచే సినీ ఇండస్ట్రీపై ఆసక్తి ఉంది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమె ఇష్టాన్ని కాదనుకుండా నచ్చింది చేయమని ప్రోత్సహించారు. అలా సీరియల్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టింది. 2010 నుంచి ఏడేళ్లపాటు హిందీలో పలు సీరియల్స్ చేసింది. చన్నా మేరేయా (2018) అనే పంజాబీ చిత్రంతో హీరోయిన్గా మారింది.ఫస్ట్ మూవీతో క్రేజ్ఈ మూవీలో పాయల్‌ను చూసిన తెలుగు దర్శకుడు అజయ్ భూపతి ఫిదా అయ్యాడు. అలా ఆర్ఎక్స్ 100 మూవీతో ఆమె తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్ అందుకుంది. వెంకీ మామ, డిస్కో రాజా, ఆర్డీఎక్స్ లవ్, అనగనగా ఓ అతిథి, జిన్నా, తీస్మార్ఖాన్ వంటి సినిమాలు చేసింది. కానీ అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. కెరీర్అలాంటి సమయంలో అజయ్ భూపతి మంగళవారం సినిమాతో తనకు ఘన విజయాన్ని అందించాడు. ఈ హిట్టు తనను మళ్లీ నిలబెట్టేలా చేసింది. మరో కమర్షియల్ హిట్టు పడితేనే పాయల్ (Payal Rajput) కెరీర్ పుంజుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాలు చేస్తోంది. మరి మున్ముందైనా మంచి సక్సెస్ వస్తుందేమో చూడాలి!చదవండి: ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నా.. ఖాళీగా ఉన్నా ఓకే! -
'అఖండ 2' విడుదల వాయిదాకు కారణాలివే!
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన ‘అఖండ-2’ నేడు(డిసెంబర్ 5) రిలీజ్ కావాల్సింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది. టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు విడుదలకు కావాల్సిన పనులన్నీ పూర్తి చేసుకున్న సినిమా.. సడెన్‌గా ఆడిపోవడానికి గల కారణాలు ఏంటి?షాకిచ్చిన మద్రాసు హైకోర్టుఅఖండ 2 చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ప్లస్ సంస్థ తమకు రూ. 28 కోట్ల బాకీ ఉందని, ఆ డబ్బులు ఇవ్వకుండా సినిమా విడుదల చేయొద్దని ఆదేశాలను ఇవ్వాలంటూ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సమస్య పరిష్కారమయ్యే వరకు సినిమాను రిలీజ్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా వాయిదా పడాల్సి వచ్చింది.28 కోట్ల బాకీ సంగతేంటి?ఈరోస్ ఇంటర్నేషనల్(Eros International Media Ltd) - 14 రీల్స్ సంస్థ మధ్య గొడవ ఇప్పటిది కాదు. అఖండ 2(Akhanda 2: Thaandavam) సినిమాతో ఈరోస్‌కు ఎలాంటి సంబంధం లేదు. కానీ గతంలో 14 రీల్స్ సంస్థ అధినేతలు రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి అనిల్ సుంకర నిర్మించిన ‘1-నేక్కొడినే’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం అయింది. ఆ చిత్రానికి ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించడంతో పాటు ఫైనాన్స్ కూడా చేసింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా విఫలమవడంతో భారీ మొత్తంలో రికవరీ జరగలేదు. ఆ నష్టాలను పూడ్చేందుకు మహేశ్ బాబు మరో చిత్రం ‘ఆగడు’ కూడా అదే సంస్థకు ఇచ్చారు. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో 14 రీల్స్( 14 Reels Entertainment)-ఈరోస్ మధ్య రెవెన్యూ షేరింగ్, సెటిల్మెంట్ విషయంలో గొడవలు వచ్చాయి. 14 రీల్స్ సంస్థ తమకు రూ. 28 కోట్ల వరకు బాకీ ఉందంటూ ఈరోస్ కోర్టు మెట్లు ఎక్కింది.పేరు మార్చిన ఫలితం లేదు!14 రీల్స్-ఈరోస్ మంధ్య కోర్టు కేసు కొన్నేళ్లుగా నానుతూ ఉంది. కొన్నేళ్ల కిత్రం ఈరోస్ ట్రిబ్యునల్‌కి వెళ్లగా.. 2019లో వాళ్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ 14 రీల్స్ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2021లో సుప్రీం కోర్టుకు కూడా వెళ్లింది. ఇలా కోర్టులో పిటిషన్స్ వేస్తూ.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. పైగా 14 రీల్స్ నిర్మాణ సంస్థ పేరును కాస్త ‘14 రీల్స్ ప్లస్’గా పేరు మార్చి.. అఖండ 2 సినిమాను నిర్మించారు. అయితే ఈ రెండు నిర్మాణ సంస్థలు ఒక్కటే అని.. ఈరోస్ ఆధారాలతో సహా కోర్టుకు అప్పజెప్పడంతో.. రిలీజ్ చేయొద్దంటూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు మరికొంత మంది ఫైనాన్షియర్లు కూడా డబ్బులు ఇవ్వలేదని గొడవకు దిగినట్లు సమాచారం. అఖండ 2 చిత్రానికి ఐవివై ఎంటర్టైన్మెంట్తో పాటు మరో మగ్గురు ఫైనాన్స్ చేశారు. వాళ్ల అమౌంట్ కూడా సెటిల్ చేయకుండానే రిలీజ్‌కి వచ్చేశారట. దీంతో వాళ్లు కూడా విడుదలను అడ్గుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయితేనే..అఖండ-2 రిలీజ్ డేట్‌పై స్పష్టత వస్తుంది. -
శంకర్ సినిమాలో హీరో సూర్య!
ఏ రంగంలోనైనా జయాపజయాలు సహజం. అయితే ఒకటీరెడు అపజయాలతో సినీ ప్రముఖుల పేరు తగ్గిపోదు. దర్శకుడు శంకర్ తొలి చిత్రం జెంటిల్మెన్తోనే ఘన విజయాన్ని సాధించారు. ఆ తర్వాత ముదల్వన్, బాయ్స్, ఇండియన్, రోబో, నన్బన్ (స్నేహితులు), అన్నియన్ (అపరిచితుడు), శివాజీ ఇలా వరుసగా బ్రహ్మాండమైన చిత్రాలతో తమిళ సినిమాను భారతీయ చిత్రాల స్థాయికి తీసుకెళ్లారు. బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్అయితే ఇటీవలి కాలంలో ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ నిరాశపర్చాయి. ఇకపోతే ఈసారి శంకర్ చారిత్రక కథను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. వేల్చారి అనే నవల ఆధారంగా శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. అందుకు సంబంధించిన ప్రీపొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య గ్రీన్ సిగ్నల్?ఈ సినిమాలో హీరో సూర్య (Suriya) నటించే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ టాక్. ఈమేరకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూర్య ఇంతవరకు శంకర్ దర్శకత్వంలో నటించనేలేదు. దీంతో వేల్చారి చిత్రంలో సూర్య నటిస్తే కచ్చితంగా ఈ చిత్రానికి మంచి క్రేజ్ రావడం ఖాయం. మరి ఈ ప్రచారంలో నిజమెంతో చూడాలి! ప్రస్తుతం సూర్య నటించిన కరుప్పు త్వరలో రిలీజ్ కానుంది. అలాగే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత మలయాళ దర్శకుడితో ఓ మూవీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
‘అఖండ- 2’ ప్రీమియర్ షోలు రద్దు
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. అఖండ 2:తాండవం ప్రీమియర్స్ షోలు క్యాన్సిల్ అయ్యాయి. మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రిమియర్స్ పడాల్సింది. కానీ సాంకేతిక కారణంగా ప్రీమియర్స్ షోలని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం అఖండ 2(Akhanda 2) . ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతు వచ్చిన ఈ చిత్రం రేపు(డిసెంబర్ 5)న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రీలీజ్‌కి ఒక్క రోజు ముందే అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ వేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల నంచి అనుమతి కూడా తీసుకున్నారు. ఏపీలో బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఇక మరికొన్ని గంటల్లో థియేటర్స్ బాలయ్య బొమ్మ పడుతుందని ఆశించిన అభిమానులకు చివరి నిమిషంలో మేకర్స్ షాకిచ్చారు. “ఈరోజు వేయాల్సిన అఖండ ప్రీమియర్స్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయ్యాయి. మేము సినిమా షో వేయడానికి చాలా ప్రయత్నించాం, కానీ కొన్ని మా చేతుల్లో లేకుండా పోయాయి. సారీ ఫర్ ది ఇన్‌కన్వీనియన్స్” అంటూ నిర్మాత సంస్థ 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేసింది. అయితే ఓవర్సీస్లో మాత్రం యాథావిధిగా ప్రీమియర్స్ షోలు ఉంటాయని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. #Akhanda2 Premieres scheduled for today are canceled due to technical issues. We've tried our best, but a few things are beyond our control. Sorry for the inconvenience.— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025 -
విడాకుల నుంచి వివాహం దాకా సమంతను చెక్కిన ‘శిల్పం’, ఆమేనా?
దక్షిణాది అందాల ప్రపంచంలో ఆమెది చిరపరిచితమైన పేరు. మిసెస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న తొలి తెలుగు మహిళ అనే ఘనత దగ్గర నుంచి ఆ తర్వాత ఆమె మరెన్నో ఘనతల్ని స్వంతం చేసుకుంటూ సినిమా సెలబ్రిటీలకు తీసిపోని పాప్యులారిటీని దక్కించుకుంది. ఆమే తెలంగాణకు చెందిన హైదరాబాద్ వాసి శిల్పారెడ్డి. సినిమా రంగంలోని కుటుంబాలతో దగ్గర సంబంధం, బంధుత్వాలు కూడా శిల్ప(Shilpa Reddy) కుటుంబానికి ఉన్నాయి. ఆమె సోదరుడు కూడా కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున కుటుంబంతో శిల్పారెడ్డికి దగ్గర బంధుత్వం ఉంది. నాగార్జున మేనల్లుడు సుమంత్ మాజీ భార్య కీర్తిరెడ్డి కూడా శిల్పారెడ్డి కి బంధువే. గతంలో నాగార్జున తో శిల్పారెడ్డి, ఆమె భర్త వ్యాపార భాగస్వాములుగా కూడా ఉన్నారు. బంజారాహిల్స్‌లో టచ్ పబ్ పేరిట ఒక అత్యంత అధునాతన రెస్టారెంట్‌ను వీరు భాగస్వాములుగా కొంత కాలం పాటు నిర్వహించారు కూడా.ఈ నేపధ్యంలోనే నాగచైతన్యకు కొంత కాలం పాటు ప్రియురాలిగా, ఆ తర్వాత భార్యగా ఉన్న సమంత(Samantha ) కూడా శిల్పారెడ్డికి క్లోజ్ ఫ్రెండ్‌గా మారింది. మోడలింగ్ నుంచి ఫ్యాషన్ డిజైనర్‌గా మారిన శిల్ప డిజైన్లను సమంత బాగా ఇష్టపడేది. అలాగే ఫిట్నెస్ నిపుణురాలిగానూ ఆమెకు శిల్ప చాలా రకాలుగా సలహాలు సూచనలు అందించేది. వీరిద్దరి స్నేహం నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా అంతే గాఢంగా ఇంకా చెప్పాలంటే మరింత సన్నిహితంగా కొనసాగడం విశేషం.ఇప్పటికీ సమంత కి సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సింగర్ చిన్మయి, శిల్పా రెడ్డి లే అని చెబుతారు. ఫ్యాషన్ నుంచి రిలేషన్స్ దాకా ఎన్నో జీవిత పాఠాలను శిల్పా నేర్పింది అని అంటుంటారు. జీవితంలో వచ్చిన కష్టాలు, సంతోషాలు అన్నింటిలో శిల్ప చేదోడు వాదోడుగా నిలిచింది. విడాకుల తరువాత విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించి అనారోగ్యానికి కూడా గురైన సమంత కోలుకోవడానికి అండదండలు అందించిన వారిలో శిల్ప మొదటి స్థానంలో ఉటుంది. అలా బెస్ట్ ఫ్రెండ్స్ అనే పదానికి వీరిద్దరూ బ్రాండ్ అంబాసిడర్లుగా కొనసాగుతున్నారు. సమంత తన జీవితంలో తీసుకునే కీలక నిర్ణయాలు అన్నింటిలోనూ శిల్పారెడ్డి పాత్ర ఉంటుందని సన్నిహితులు చెబుతారు. ఇక రాజ్ నిడిమోరుతో ప్రేమ, పెళ్లి విషయంలో కూడా శిల్ప తన వంతు సలహాలు అందించినట్టు సమాచారం. రాజ్, సమంతల పెళ్లి వేడుకలో శిల్ప సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మారింది. సమంత పెళ్లి ఫోటోలను శిల్ప సైతం అభిమానులతో షేర్ చేసుకుంది. శిల్పా తన జీవితంలోకి వచ్చాక ఎంత మార్పు వచ్చిందో సమంత మాటల్లోనే చెప్పాలంటే... ’శిల్పా రెడ్డి నువ్వు నా జీవితాన్ని ఎన్ని రకాలుగా మార్చావో అది నీకు కూడా తెలియదు. , నువ్వు నన్ను ధ్యానంలోకి నెట్టిన ఆ 15 నిమిషాలు నా జీవిత గమనాన్ని నిజంగా మార్చాయి. అలాంటి గొప్ప బహుమతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ సమంత తన కృతజ్ఞతన వ్యక్తం చేసింది. ఏదేమైనా..అవసరాలే ప్రాతిపదికగా వర్ధిల్లే స్నేహాలకు చిరునామా లాంటి సినీ రంగంలో ఇలాంటి అపురూప స్నేహాలు అప్పుడప్పుడయినా తారసపడుతుండడం స్నేహపిపాసులకు కొంతయినా ఉపశమనమే అనాలి. -
మా సినిమాకు శృంగారం ఇతివృత్తమే కానీ అసభ్యత ఉండదు: దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జున్, సురభి లలిత, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్". ఈ చిత్రాన్ని సుమలీల సినిమా బ్యానర్ పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సందేశాత్మక కథా కథనాలతో రూపొందిన "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను ఈ నెల 12న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు బాపిరాజు. బుధవారం హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత ఎన్ హెచ్ ప్రసాద్ మాట్లాడుతూ - నేను పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ చేశాను. గతంలో బంగారు పాదం అనే చిత్రాన్ని రూపొందించాను. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నా. మాది బడ్జెట్ వైజ్ చిన్న సినిమా కానీ క్వాలిటీలో కాదు. నా దృష్టిలో మంచి సినిమా, చెడ్డ సినిమా రెండే ఉంటాయి. మా సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా ఎక్కడా అసభ్యత లేకుండా క్లీన్ గా మూవీ చేశాం. సెన్సార్ వాళ్ల దృష్టి చిన్న సినిమాకు ఒకలా, పెద్ద సినిమాకు ఒకలా ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. నాకూ అలాంటి భావనే కలిగింది. మా చిత్రాన్ని పొయెటిక్ గా రూపొందించాం. కాళిదాసు మేఘదూతం, జయదేవుడి గీత గోవిందం...నుంచి కొన్ని కవిత్వాలు మా సినిమాలో ఉపయోగించాం. మా సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నా, మంచి సినిమా చేశారు, క్వాలిటీ మూవీ చేశారనే పేరు మాత్రం తప్పకుండా వస్తుంది అన్నారు.నటుడు బుగత సత్యనారాయణ మాట్లాడుతూ - నేటి సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను కళ్లకు కట్టినట్లు మా డైరెక్టర్ ప్రసాద్ ఈ చిత్రంలో చూపించారు. ఆయన తన భుజాలపై ఈ సినిమాను వేసుకుని తెరకెక్కించారు. ఈ మధ్య చిన్న చిత్రాలే ఘన విజయాలు సాధిస్తున్నాయి. మా "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాను కూడా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా అన్నారు.నటుడు జోగారావు మాట్లాడుతూ - ఇటీవలే నేను ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలో నటించాను. ఆ చిత్రానికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమా కూడా నాకు నటుడిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను. చిన్న చిత్రాలను ఆదరించినప్పుడే మాలాంటి ఎంతోమంది నటీనటులు, టెక్నీషియన్స్ కు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుంది. ప్రేక్షకులు, మీడియా మిత్రులు మా సినిమాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా అన్నారు.డీవోపీ శివశంకర వరప్రసాద్ మాట్లాడుతూ - "కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్" సినిమాకు డీవోపీగా వర్క్ చేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. మా డైరెక్టర్ ప్రసాద్ గారు ఎంతో డెడికేషన్ తో ఈ సినిమాను రూపొందించారు. మాకున్న రిసోర్సెస్ లో విజువల్ గా మంచి క్వాలిటీ ఉండేలా సినిమా చేశాం అన్నారు. -
దయచేసి అలాంటివాళ్లు ఈ సినిమా చూడొద్దు: బన్నీవాసు
సినిమా చూసేందుకు థియేటర్స్‌కి రండి అంటూ ప్రేక్షకులను వేడుకుంటున్న ఈ రోజుల్లో.. నిర్మాత బన్నీ వాసు మాత్రం మా సినిమా చూసి ఇబ్బంది పడొద్దని కొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాడు. అంతేకాదు థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైనా జరిగితే మా బాధ్యత కూడా కాదని ముందే చెబుతున్నాడు. అయితే ఈ హెచ్చరిక హార్ట్ వీక్ ఉన్నవాళ్లకి మాత్రమే అంటున్నాడు బన్నీవాసు. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్న బన్నీ వాసు(Bunny Vasu)..త్వరలోనే ‘ఈషా’ అనే హారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీనివాస మన్నే దర్శకత్వంలో పోతుల హేమ వెంకటేశ్వరరావు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బన్నీవాసు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ఇలాంటి హారర్ మూవీ రాలేదని.. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకులు కచ్చితంగా భయపడడం ఖాయమన్నారు.(చదవండి: భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’)‘దెయ్యాలు, ఆత్మలు అంటే నేను భయపడను. ఎక్కడైన హంటింగ్ ప్లేస్ ఉందంటే ప్రత్యేకంగా వెళ్లి చూసొస్తాను. ఈషా సినిమా గురించి చెప్పినప్పుడు రొటీన్‌గానే ఉంటుందని కూర్చున్నాను. హారర్ సినిమాను ఎలా తెరకెక్కిస్తారనేది మాకు తెలుసు కాబట్టి.. సినిమా చూసినప్పుడు భయం కలగలదు. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను నాలుగు సార్లు భయపడ్డాను. దెయ్యం మేకప్ ఎలా వేస్తారో, షూటింగ్ ఎలా చేస్తారో..ఇలా అన్ని తెలిసిన నేను కూడా భయపడ్డాను. తెలిసి కూడా భయపడే సినిమా ఇది. ఎడిటింగ్ మీద, సౌండింగ్ మీద ఎంతో గ్రిప్ ఉంటేనే ఇలాంటి సినిమా వస్తుంది. దర్శకుడు శ్రీనివాస్ చాలా అద్బుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. చివరి 15 నిమిషాలు అయితే అద్భుతంగా ఉంటుంది. డిసెంబర్ 12న థియేటర్స్‌కి రండి భయపడి ఎంజాయ్ చేయండి. కొంచెం హార్ట్ వీక్ ఉన్నవాళ్లు మాత్ర దయచేసి ఈ సినిమాను చూడకండి. థియేటర్స్‌కి వచ్చిన తర్వాత ఏమైన అయితే మమ్మల్ని అడగొద్దు. ముందే చెబుతున్నా..హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూస్తే ఇబ్బంది పడతారు’ అని బన్నీ వాసు చెప్పారు. -
భయపెట్టించే మరో హారర్.. గ్లింప్స్‌తోనే వణికించిన ‘ఈషా’
తెలుగులో ప్రాపర్ హారర్ మూవీ వచ్చి చాలా రోజులవుతుంది. కామెడీ హారర్ చిత్రాలు తరచు వస్తున్నాయి కానీ.. పూర్తిగా భయపెట్టే చిత్రాలేవి రావట్లేదు. ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు ‘ఈషా’ వచ్చేస్తుంది. త్రిగుణ్, హెబ్బాపటేల్ కీలక పాత్రల్లో రూపొందిన హారర్ థ్రిల్లర్‌కి శ్రీనివాస్ మన్నె దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్. సరికొత్త థ్రిల్లింగ్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక నిమిషం రెండు సెకన్ల నిడివి గల ఈ గ్లింప్స్ చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఆత్మలు ఉన్నాయా లేదా అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. -
భర్తపై ఫేక్ న్యూస్.. రకుల్ ప్రీత్ ఏమన్నారంటే..
సినిమావాళ్లపై గాసిప్స్ కామన్. కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పై కూడా రకరకాల పుకార్లు పుట్టుకొస్తుంటాయి. చాలామంది నటీనటులు వాటిని పెద్దగా పట్టించుకోరు. ఆ లిస్ట్‌లోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా వస్తుంది. క్లిక్స్ కోసం రాసే వార్తలపై స్పదించాల్సిన అవసరం లేదంటోంది ఈ టాలీవుడ్ బ్యూటీ. ఇటీవల రకుల్(Rakul Preet Singh) భర్త జాకీ భగ్నానీ(Jackky Bhagnani) సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆయన నిర్మించిన ‘బడే మియా.. ఛోటే మియా’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో ఆర్థికంగా చాలా నష్టపోయాడనని.. కంపెనీ మూసేశారనే వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై రకుల్ స్పందించింది. ‘ఆర్థికంగా నష్టపోయిన సంగతి నిజమే కానీ..కంపెనీ మూసేశారనడం పచ్చి అబద్ధం అన్నారు. క్లిక్స్ కోసం కొందరు తప్పుడు వార్తలు రాస్తుంటారని.. వాటిని పట్టించుకోబోమని చెప్పారు. ‘క్లిక్స్ కోసం ఏమైనా రాసేవాళ్లు ఉన్నారు. ఆ వార్తల్లో ఒక్కశాతం కూడా నిజం ఉండదు. అసలు నిజమేంటో నాకు తెలుసు కాబట్టి..అలాంటి వార్తలను పట్టించుకోను. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కొన్ని విషయాల పట్ల మౌనంగా ఉండడమే బెటర్. సమయం వచ్చినప్పుడు నిజానిజాలు ఏంటో ప్రేక్షకులకు తెలుస్తాయి. జాకీ భగ్నానీపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు.. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నాడో నేను దగ్గర నుంచి చూశాను. కంపెనీ మూసేశారని రాశారు. అతడు నిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆర్థికంగా చాలా నష్టం కలిగింది. కానీ, కంపెనీ మూసివేయలేదు. ఇండస్ట్రీలోని ప్రతి నిర్మాతకు అప్పుడప్పుడు అలా జరుగుతుంది. ఒకనొక సమయంలో అమితాబ్‌బచ్చన్‌కు కూడా ఇలానే జరిగింది. ఎదిగేక్రమంలో ఇలాంటి ఒడుదొడుకులు సహజం. వాటిని తట్టుకొని నిలబడితేనే విజయం వరిస్తుంది’ అని రకుల్ చెప్పుకొచ్చింది.కాగా, రూ. 400 భారీ బడ్జెట్‌తో జాకీ భగ్నానీ నిర్మించిన ‘బడే మియా.. ఛోటే మియా’ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి..డిజాస్టర్‌గా నిలిచింది. అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్స్ నటించిన చిత్రం అయినప్పటికీ.. కనీస ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. -
సింగర్ తల్లి నోట పాట.. వీడియో వైరల్
హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం వా వాద్దియార్ (తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరిట రిలీజవుతోంది.). కృతిశెట్టి హీరోయిన్గా నటించిన ఇందులో సత్యరాజ్, రాజ్‌కిరణ్, జీఎం సుందర్, శిల్పామంజునాథ్, ఆనంద్‌రాజ్, కరుణాకరన్, రమేష్ తిలక్, పీఎల్ తేనప్పన్ ముఖ్యపాత్రలు పోషించారు. స్టూడియో గ్రీన్ ప్రతాపంపై జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని, జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం డిసెంబర్ 12న తెరపైకి రానుంది.ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో పాటను సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ తన తల్లితో కలిసి పాడడం విశేషం. ఈ పాట వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది గతంలో ఎంజీఆర్ చిత్రంలోని 'రాజా విన్ పార్ర్వై రాణి ఇన్ పక్కం..' పాటకు రీమిక్స్ అన్నది గమనార్హం. ఈ పాటను పాడిన సంతోష్ నారాయణన్ తల్లికి కార్తీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటకు పలువురు నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కృతి శెట్టి వావ్ సూపర్.. అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదేవిధంగా సిద్ధార్థ్, అతిథిరావ్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, గాయకుడు విజయ్ ఏసుదాస్ వంటి ప్రముఖులు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రంలో కార్తీ ఎంజీఆర్ వీరాభిమానిగా నటించినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్ర ట్రైలర్, ఆడియోలను ఆవిష్కరణ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. View this post on Instagram A post shared by Santhosh Narayanan (@musicsanthosh) -
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత
దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) ఇక లేరు. వయో భారం.. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళంలో చిత్రాలు నిర్మించారాయన. ఎంజీఆర్, శివాజీ, జెమిని గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్‌లతో వంటి లెజెండరీలు.. విక్రమ్, రానాలాంటి తారలు ఈ ప్రతిష్టాత్మక బ్యానర్లో నటించారు. ఏవీఎం అంటే అర్థం.. ఏవీ మేయప్పన్. ఆయన శరవణన్ తండ్రి. మద్రాస్(నేటి చెన్నై) కేంద్రంగా ఈ బ్యానర్ తొలినాళ్లలో సరస్వతి సౌండ్ ప్రొడక్షన్స్‌గా..ఆ తర్వాత ప్రగతి పిక్చర్స్ లిమిటెడ్, ప్రగతి స్టూడియోస్.. మేయప్పన్( ఏవీ మేయ్యప్ప చెట్టియార్) తన భాగస్వాములతో కలిసి నడిపించారు. 1945లో AVM Productionsగా మారింది. అప్పటి నుంచి ఈ బ్యానర్లో ఎన్నో గొప్ప చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. తండ్రి ఏవీ మేయప్పన్ తర్వాత శరవణన్ ఆ ప్రొడక్షన్ హౌజ్‌ను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు. వివిధ భాషల్లో 176 సినిమాలతో పాటు తెలుగు, తమిళ్, మలయాళంలో సీరియల్స్‌ను ఏవీఎం బ్యానర్లో నిర్మించారు. భూకైలాస్(1940), శివాజీ ది బాస్, మెరుపుకలలు, జెమినీ, లీడర్, సంసారం ఒక చదరంగం.. ఇలా ఎన్నో మరుపురాని హిట్స్ అందించారు. ఏవీఎం బ్యానర్లో వచ్చిన చివరి చిత్రం ఇదువుమ్ కదాందు పొగుమ్(2014). 2022లో అరుణ్ విజయ్ లీడ్ రోల్లో తమిళ్‌రాకర్స్ అనే వెబ్‌సిరీస్ కూడా నిర్మించారు. ఈయన కుమారుడు ఎమ్ఎస్ గుహాన్ కూడా నిర్మాతగా రాణిస్తున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. -
భారీగా డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి!
డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినవారిలో హీరోయిన్ సాయిపల్లవి ఒకరు. చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగింది. ఈమె మలయాళంలో నటించిన ప్రేమమ్ అనూహ్య విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈ నేచురల్ బ్యూటీకి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు ఎర్ర తివాచీ పరిచాయి. మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన సాయిపల్లవి మొదటినుంచి గ్లామర్‌ను దరి చేరనీయకుండా జాగ్రత్త పడుతూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకుంది.అంతేకాకుండా ఈమె నటించిన చిత్రాలు మంచి విజయాన్ని సాధిస్తుండటంతో బోలెడంత క్రేజ్ వచ్చింది. తెలుగులో నాగచైతన్యకు జంటగా నటించిన తండేల్, తమిళంలో శివకార్తికేయన సరసన నటించిన అమరన్ ఘన విజయాలు సాధించడంతో ఆమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఈమె బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అక్కడ రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో సీతగా నటిస్తోంది. దాంతో పాటు మరో హిందీ చిత్రంలోనూ నటించే అవకాశం వరించిందని సమాచారం. కొంత గ్యాప్ తర్వాత దక్షిణాది చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది సాయిపల్లవి (Sai Pallavi). రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో సాయిపల్లవి నటించనున్నారని లేటెస్ట్ టాక్. ఈ మూవీలో నటించేందుకు ఆమె అత్యధికంగా రూ.15 కోట్ల పారితోషికం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. -
యంగ్ హీరో సినిమా.. క్లైమాక్స్ కోసమే రూ. 20 కోట్లతో భారీ సెట్!
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న తాజా పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యాసీవ్ సినిమాటిక్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్బంప్స్ పుట్టించే క్లైమాక్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా విజువల్ గా అద్భుతంగా చూపించేలా డిజైన్ చేశారు.అద్భుతమైన యాక్షన్‌కు ప్రసిద్ధిగాంచిన థాయ్ స్టంట్ మాస్టర్ కేచా ఖాంఫాక్‌డీని టీం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. ఆయన బెర్త్ టేకింగ్ యాక్షన్ కొరియోగ్రఫీతో సీక్వెన్స్ ని గ్రాండ్ గా తీర్చిదిద్దితున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాలతో ఈ సీక్వెన్ అద్భుతంగా, విజువల్‌గా మైండ్ బ్లోయింగ్ ఉండబోతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో నభా నటేష్ , ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ,బి.ఎస్. అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
అరడజను సినిమాలు.. క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టాడని, అక్కడ వరుసగా ఆరు సినిమాలు నిర్మించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలకు, ఇప్పటి విషయాలకు ముడిపెడుతూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వాటిని నమ్మొద్దని దిల్ రాజు(Dil Raju) కోరారు.‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదు. ప్రస్తుతం మేము అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మేమే అధికారికంగా ప్రకటిస్తాం. అప్పటివరకూ ఈ రూమర్స్‌ను నమ్మొద్దు. అవాస్తవాలను ప్రచారం చేయొద్దని మీడియాను కోరుతున్నాను’ అని దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. కాగా, అక్షయ్ కుమార్‌తో దిల్ రాజు నిర్మించే సినిమా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ అని ప్రచారం జరుగుతుంది. -
ఆ ఇద్దరు హీరోల స్నేహ చిహ్నం ఈ పురాతన బైక్.. స్పెషల్ ఏంటంటే..?
షోలే సినిమాను సినీ అభిమానులు ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఆ సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను కూడా మరిచిపోలేరు. ఆ పాటలో స్నేహితులైన జై–వీరు (అమితాబ్–ధర్మేంద్ర) మోటార్ సైకిల్ బాలీవుడ్లో ఉపయోగించిన అత్యంత ప్రసిద్ధ స్క్రీన్ వస్తువులలో ఒకటిగా నిలుస్తుంది. ఈ పురాతన మోటార్ సైకిల్ 1942 బిఎస్ఎ డబ్ల్యుడబ్ల్యుయ20 సినిమాలోని ప్రసిద్ధ పాట యే దోస్తీ హమ్ నహీ తోడెంగేలో తెరపై కనిపిస్తుంది. «లెజండరీ నటుడు దర్మేంద్ర మృతి తర్వాత ఈ మోటార్ సైకిల్ తిరిగి వెలుగులోకి వచ్చింది.ఒకప్పుడు కర్ణాటకలోని రామనగర కొండల లో ప్రయాణించిన ఈ పాతకాలపు యంత్రం ఇటీవల గోవాలో ముగిసిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఎఫ్ఎఫ్ఐ 2025)లో ప్రదర్శనకు నోచుకుని ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. షోలే(Sholay) 50 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, సినీ అభిమానులను తక్షణమే సినిమా ప్రపంచంలోకి తీసుకెళ్లే‘ వస్తువులను ప్రదర్శించడమే లక్ష్యంగా దీన్ని మరోసారి అందరి ముందుకు తెచ్చినట్టుంది కర్ణాటక ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ ’డిఐపిఆర్) కమిషనర్ ఎడిజిపి హేమంత్ నింబాల్కర్ అంటున్నారు.ఈ చిత్రంలో వినియోగించిన బైక్‌ను బెంగళూరు మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి బెంగళూరు బిజినెస్ కారిడార్ చైర్పర్సన్ ఎల్‌కె అతిక్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం స్వంతం చేసుకున్నారని హేమంత్ నింబాల్కర్ వివరించారు. ఈ బిఎస్ఎ మోటార్‌సైకిల్ కర్ణాటకలో కుటుంబానికి చెందిన తాత నుంచి మనవడికి అన్నట్టు వారసత్వంగా చేతులు మారుతోంది.ఈ ప్రఖ్యాత జై–వీరు మోటార్‌సైకిల్‌ను బ్రిటిష్ సంస్థ బర్మింగ్‌హామ్ స్మాల్ ఆర్మ్స్ తయారు చేసింది. ఈ బైక్స్‌ను రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ సైన్యం కోసం భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశారు. సైనిక సేవలో ఇది గంటకు 55–60 కి.మీ. వేగంతో సమర్ధవంతంగా పనిచేసింది. 1942లో, బ్రిటిష్ సైన్యం ఈ మోడల్‌ను దాదాపు 50 నుంచి 60 పౌండ్లకు కొనుగోలు చేసింది, ఇది ఆ సమయంలో మన రూపాయల్లో చెప్పాలంటే దాదాపు రూ.700 నుంచి రూ.800 వరకు ఉండేది.ఇక ఈ చిత్రంలో ఉపయోగించిన బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంవైబి 3047 కాగా ఇది ఛాసిస్ నంబర్ ఎం 20 116283 , ఇంజిన్ నంబర్ ఎం 20 4299లను కలిగి ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే ఇది 12.5 హార్స్‌పవర్‌ను అందించే 500 సిసి సింగిల్–సిలిండర్ సైడ్–వాల్వ్ ఇంజిన్ తో శక్తి నిచ్చింది. ఇది గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని చేరుకోగలదు, ఈ బైక్ బరువు 170 కిలోగ్రాములు 13–లీటర్ ఇంధన ట్యాంక్‌తో వచ్చింది. దీనిలో ముందు భాగంలో గిర్డర్ ఫోర్కులు వెనుక పెద్ద క్యారియర్ ఉన్నాయి. రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి యుద్ధకాలంలో రబ్బరు కొరత కారణంగా, హ్యాండిల్బార్లు ఫుట్‌రెస్ట్‌లను కాన్వాస్‌లో చుట్టబడిన లోహంతో తయారు చేశారు. -
రోజుకు 500 కాల్స్.. తలనొప్పిపడలేక వీడియో చేశా: హేమ
సీనియర్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమపై గతేడాది డ్రగ్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో హేమ జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇటీవల కర్ణాటక హైకోర్టు ఆ కేసును పూర్తిగా కొట్టివేసింది. అయితే తనపై కేసు నమోదైనప్పుడు మీడియాలో చాలా వార్తలు వచ్చాయని.. అదే కేసును కొట్టివేసినప్పుడు మాత్రం తక్కువమంది మాత్రమే రాశారని హేమ అసహనం వ్యక్తం చేసింది. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమ ఈ కేసుపై స్పందిస్తూ.. డ్రగ్స్ తీసుకున్నట్లు తనపై ఆరోపణలు చేయడం ఎంతగానో బాధించిందన్నారు.‘నేను డ్రగ్స్ తీసుకున్నానని చెప్పడం వందశాతం అబద్దం. కానీ బర్త్‌డే పార్టీకి వెళ్లింది నిజం. నా తమ్ముడి లాంటి వ్యక్తి పుట్టినరోజు పార్టీకి పిలిస్తే వెళ్లాను. అక్కడ నేను డ్రగ్స్ తీసుకోలేదు. ఆ పార్టీకి అందరూ ఫ్యామిలీతో వచ్చారు. అది రేవ్ పార్టీ కాదు.. వందశాతం బర్త్‌డే పార్టీనే. నేను పార్టీ నుంచి వచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ దొరికింది. కానీ మీడియా మొత్తం రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన హేమ రాసేసింది. ఇది చూసి నాకు తెలిసివాళ్లంతా ఫోన్ చేసి ఆరా తీశారు. ఆ సమయంలో నాకు రోజుకు 500 పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. అందరికి సమాధానం చెప్పాను. ఇక ఫోన్ కాల్స్ వల్ల వచ్చే తలనొప్పి భరించలేక.. ఓ వీడియో తీసి పెట్టాను. దాన్ని కూడా కొంతమంది తప్పుగా ప్రచారం చేశారు’ అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. -
18 కిలోలు తగ్గాను.. నచ్చకపోతే క్షమాపణలు చెబుతా: నందు
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు అయింది. నా నటన గురించి ఇప్పటివరకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. ‘సైక్ సిద్ధార్థ’ సినిమా నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతాను. ఒకవేళ ఫెయిల్ అయినా ఇక్కడే ఉంటూ సినిమాలు చేస్తాను. గెలిచేవరకు ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు శ్రీ నందు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీ నందు, యామినీ భాస్కర్ జోడీగా నటించిన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. రానా స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్‌పై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజ్ కానుంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ నందు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రకథ ఇప్పుడున్న సొసైటీకి రిలేట్ అయ్యేలా, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. దర్శకులు రాఘవేంద్రరావు, సాయిరాజేశ్, అనుదీప్గార్లు మా సినిమా చూసి, అభినందించారు. ఈ చిత్రం కోసం నేను పద్దెనిమిది కిలోలు తగ్గాను’’ అని చెప్పారు. ‘‘మా సినిమా అందర్నీ ఎంటర్టైన్ చేస్తుంది’’ అన్నారు వరుణ్ రెడ్డి. ‘‘చాలా గ్యాప్ తర్వాత నా సినిమా రిలీజవుతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు యామినీ భాస్కర్. -
అఖండ 2 టికెట్ల రేట్ల పెంపు.. సీపీఐ నారాయణ ఫైర్
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోతున్న తాజా చిత్రం ‘అఖండ 2:తాండవం’. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో రూ. 100, సింగిల్ స్క్రీన్లలో రూ. 75 పెంచుకునేందుకు వెలుసుబాటు కల్పిస్తూ ఉత్తర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ఈ నెల 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్స్‌కి కూడా అనుమతి ఇస్తూ.. టికెట్ ధరను రూ. 600గా నిర్ణయించింది.పెంచిన ధరలు పది రోజుల పాటు అమల్లో ఉంటాయి. ఈ విధంగా టికెట్ల రేట్లను పెంచడం పట్ల పలువురు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు నచ్చినట్లుగా టికెట్ల రేట్లను పెంచి సామాన్యులపై భారం వేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా సీపీఐ నారాయణ(CPI Narayana ) కూడా అఖండ 2 టికెట్ల రేట్ల పెంపుపై స్పందించారు. వందల కోట్లలో సినిమాలు తీసి.. ఆ భారం సామాన్య ప్రజలపై వేయడం కరెక్ట్ కాదన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కు లేదుఅఖండ 2( Akhanda 2 ) చిత్రానికి టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇలాంటి ప్రకటన వల్లే కదా ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుట్టుకొచ్చేంది. కోట్ల కోట్ల రూపాయలను ఖర్చు చేసి సినిమా తీసి.. ఆ భారమంతా ప్రజలపై వేస్తాననడం ఎంత వరకు న్యాయం? ఇలాంటి విలువలైన సినిమాలను చూడడానికి ఇష్టపడని ప్రజానీకం.. ఐబొమ్మ రవిలాంటి వాళ్లు చేసిన పైరసీని ఎంకరేజ్ చేనస్తున్నారు. మీరే కదా రవిని సృష్టిస్తున్నారు. ఈ రాష్ట్రానికి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసే నైతిక హక్కులేదు.రవి లాంటివాళ్లు పుడుతూనే ఉంటారుసంక్రాంతి పండుగ సందర్భంగా ఐదారు సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా సినిమా టికెట్ల రేట్లను పెంచుతారు. ఇలా పెంచుకుంటూ పోతున్నంత కాలం ఐబొమ్మ రవిలాంటి వాళ్లు వస్తూనే ఉంటారు. వాళ్లను ఆపడం ఎవరి తరం కాదు. ఇది స్వయంకృతాపరాధం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే..ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి’ అని నారాయణ అన్నారు. -
ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు తక్కువే ఉన్నాయి: ‘ఆంధ్రకింగ్..’ నిర్మాత
‘‘ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో మనం చాలా ఎమోషన్స్ చూశాం. కానీ, ఓ స్టార్ హీరో, ఫ్యాన్‌కి మధ్య ఉన్న భావోద్వేగాన్ని చెబుతూ, హ్యూమన్ ఎమోషన్ని కూడా టచ్ చేసిన సినిమా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఇలాంటి భావోద్వేగం ప్రపంచంలో ఎక్కడా లేదు... మన తెలుగు సినిమాకే సొంతం. మనం సినిమా లవర్స్... మంచి సినిమాకి గుర్తింపు వస్తూనే ఉంటుంది’’ అన్నారు రామ్ పోతినేని. మహేశ్‌బాబు పి. దర్శకత్వంలో రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. ఉపేంద్ర కీలక పాత్ర పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 27న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకి ప్రశంసలతో పోల్చుకుంటే వసూళ్లు కాస్త తక్కువగానే ఉన్నాయి. నెక్ట్స్ వీక్ అద్భుతమైన రన్ ఉంటుందని నమ్ముతున్నాం. నేటి నుంచి థియేటర్స్‌ని విజిట్ చేసి, ఫ్యాన్స్‌ని కలుసుకుంటాం’’ అని తెలిపారు. ‘‘ఈ చిత్రంలో మహాలక్ష్మిలాంటి మంచి పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు భాగ్యశ్రీ. ‘‘ఇక్కడి నుంచి మా సినిమా చాలా లాంగ్ వెళ్లబోతోంది’’ అని మహేశ్‌బాబు పి. పేర్కొన్నారు. మ్యూజిక్ డైరెక్టర్స్ వివేక్, మెర్విన్ మాట్లాడారు. -
నేనంటే చిన్నచూపు.. స్టేజీపై ఏడ్చేసిన నందు
యాంకర్‌గా, హీరోగా నందు అందరికీ సుపరిచితుడు. ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అతడు అన్నుకుంత సక్సెస్ చూడలేకపోయాడు. అది తల్చుకుని తాజా ఈవెంట్లో ఎమోషనలయ్యాడు. నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించగా రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్‌రెడ్డితో పాటు నందు కూడా సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నాడు.నేనంటే చిన్న చూపు: నందు ఎమోషనల్ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 2న) సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందు భావోద్వేగానికి లోనయ్యాడు. అతడు మాట్లాడుతూ.. ట్రైలర్ ఈవెంట్‌కు ఇంత ఎమోషనల్ అవడం మీకు ఓవర్‌గా అనిపించొచ్చు. కానీ ఇదంతా నాకు ఒక జర్నీ. (కన్నీళ్లు తుడుచుకుంటూ) ఇది పీఆర్ స్టంట్ అయితే కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లు అవుతోందని ఓ పాడ్‌కాస్ట్ వాళ్లు చెప్పారు. నేనంటే అందరికీ చాలా చిన్నచూపు.సక్సెస్ రాలే..పెళ్లిచూపులు సినిమాలో నేను సెకండ్ హీరోగా చేశాను. అందులో చేసిన హీరో పెద్ద హీరో అయ్యాడు. అందులో మంచి రోల్ చేసిన ప్రియదర్శి మంచి హీరో అయిపోయాడు. నాకు పేరొచ్చింది, కానీ సక్సెస్ రాలేదు. నా ప్యాషన్ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో నా నటనకు నెగెటివ్ కామెంట్స్ రాలేదు. నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చాను.సినిమా నచ్చకపోతే..ఆర్సీబీలో విరాట్ కోహ్లి వంటి ప్లేయర్ ఉన్నాసరే ఐపీఎల్ కప్పు గెలవడానికి 18 ఏళ్లు పట్టింది. వాళ్లు ఈసారి కప్ నమ్దే అన్నారు. నేను కూడా ఈసారి హిట్టు నమ్దే అంటున్నా.. సినిమా చూడండి. మీకు నచ్చకపోతే ప్రెస్‌మీట్ పెట్టి మీ అందరికీ క్షమాపణలు చెప్తాను. కానీ ఫెయిలైనా ఇక్కడే ఉంటా.. చచ్చేవరకు సినిమాలే చేస్తా అని నందు (Actor Nandu) చెప్పుకొచ్చాడు. సైక్ సిద్దార్థ మూవీ (Psych Siddhartha Movie) డిసెంబర్ 12న విడుదల కానుంది.చదవండి: బిగ్‌బాస్ 9: దుమ్ము దులిపిన ఇమ్మూ, తనూజ.. రేసులో ఆమె అవుట్ -
నన్ను కాదు, వాళ్లను ఆరాధించండి: హీరో
కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నవారిలో శివకార్తికేయన్ ఒకరు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న ఈయన ప్రస్తుతం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పరాశక్తి. ఈ చిత్రం 2026లో పొంగల్ సందర్భంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే సోమవారం సాయంత్రం చెన్నైలో జరిగిన ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో శివకార్తికేయన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వాస్తవాలు మాత్రమే ప్రచారంఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన పేరుతో ఇన్స్టాగ్రామ్, ఎక్స్, టెలిగ్రామ్‌లో చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయని, వాటిని ఎవరెవరు నిర్వహిస్తున్నారో కూడా తెలియదన్నారు. సామాజిక మాధ్యమాల్లో వాస్తవాలకు బదులుగా అసత్య ప్రచారాలే ఎక్కువ వైరలవుతున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో ఫ్యాన్లీ ఎంటర్టైన్మెంట్ యాప్ ప్రారంభించడం స్వాగతించదగిన విషయమని, ఇది వాస్తవాలను మాత్రమే ప్రచారం చేస్తుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాంటివారే ఇష్టంతనకే మంచి మేధాశక్తి ఉంటే దర్శకులను విసిగించేవాడినని అన్నారు. అదేవిధంగా తనను ఆరాధించే అభిమానులు వద్దని, వారి తల్లిదండ్రులను, దైవాన్ని ఆరాధించేవారంటే ఇష్టమని పేర్కొన్నారు. తనను ఒక స్నేహితుడిగా, సోదరుడిగా భావించే అభిమానులే తనకు కావాలన్నారు. అలాంటి ఫ్యాన్స్‌ను తన కుటుంబ సభ్యులుగా భావిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ శిక్షకుడు, పద్మ భూషణ్ పుల్లెల గోపీచంద్, ప్రపంచ చెస్ ఛాపింయన్ గుకేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ యాప్ నటీనటులకు, అభిమానులకు మధ్య అనుసంధానంగా నిలిచే యాప్ అని నిర్వాహకులు పేర్కొన్నారు. -
పసుపు అంటిన పది నోటు ఎక్కడ.. ఆసక్తికరంగా ‘పైసావాలా’ ట్రైలర్!
కంటెంట్ ఉంటే చాలు హీరోహీరోయిన్లను పట్టించుకోకుండా సినిమాను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఈ మధ్యకాలంలో స్టార్స్‌ని కంటె కంటెంట్‌ని నమ్ముకొని సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రిలీజ్ చేసి చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.ట్రైలర్ విషయానికొస్తే..‘హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత ఫోన్, పర్సు మిస్ అయింది. అందులోనే హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుందంటూ’ ఓ మహిళ..హీరోకి చెప్పే సీన్‌తో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేరు వేరు గ్యాంగులు తిరగడం.. ఈక్రమంలో బెరిదింపులు, హత్యలు.. కొత్త కొత్త పాత్రల ఎంట్రీతో ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. చివరిలో తొమ్మిది పాత్రలను చూపిస్తూ..వీరిలో అపరాధి ఎవరంటూ సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రానికి నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 12న విడుదల కానుంది. -
ఆ తర్వాతే నటించడం మానేస్తా : కమల్ హాసన్
71 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు విశ్వనటుడు కమల్ హాసన్. యంగ్ హీరోలకు ధీటుగా ఏడాదికో సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఇటీవల ఆయనను రాజ్యసభ పదవి వరించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సీనీ కెరీర్‌పై రకరకాల పుకార్లు వచ్చాయి. ఇక ఆయన సినిమాల్లో నటించబోరనే వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైనా ఓ మంచి సినిమా తీసి రిటైర్మెంట్ అవుతానని చెప్పారు. తాజాగా ఆయన నటి మంజు వారియర్‌తో కలిసి కేరళలో అర్ట్ అండ్ లిటరేచర్‌పై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పదవి విరమణపై ఎదురైన ప్రశ్నకు పైవిధంగా సమాధానం చెప్పారు.‘నన్ను రిటైర్ అవ్వమని ఎవ్వరూ అడగడం లేదు. కానీ కొన్నిసార్లు నాకే ఇక సినిమాలు ఆపేయాలనిపిస్తుంది. ముఖ్యంగా నా నుంచి వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడిన ప్రతిసారి అలానే అనిపిస్తుంది. కానీ నా శ్రేయోభిలాషులు, అభిమానులు మాత్రం సినిమాలు ఆపోద్దని చెబుతున్నారు. ‘ఒక మంచి సినిమా తీసి సినిమాలు ఆపేయండి’ అని సలహాలు ఇస్తున్నారు. నేను కూడా అలాంటి ఓ మంచి సినిమా కోసమే ఎదురు చూస్తున్నాను’ అని కమల్(Kamal Haasan) చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఓ బ్లాక్ బస్టర సినిమా తీసి సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలని కమల్ భావిస్తున్నాడు. మరి ఆ చిత్రం ఎప్పుడొస్తుందో చూడాలి. ఇటీవల ఆయన ‘థగ్‌లైఫ్’తో ప్రేక్షకుల ముందుకు రాగా.. అది ఘోరంగా విఫలం అయింది. ప్రస్తుతం ఆయన చేతిలో కల్కి 2 చిత్రం ఉంది. అలాగే లోకేష్ కనగరాజ్‌తో విక్రమ్ 2 కూడా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు రజనీకాంత్ హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. -
సమంత రెండో పెళ్లి.. నాగచైతన్య పాత వీడియో వైరల్
డేటింగ్ వార్తలకు తెరదించుతూ సమంత- రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో యోగ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ధి వివాహం’ ద్వారా సామ్-రాజ్ ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. అటు సామ్(Samantha)కి, ఇటు రాజ్‌కి ఇది రెండో పెళ్లి. 2017లో సమంత.. నాగ చైతన్య(Naga Chaitanya)ను ప్రేమ వివాహం చేసుకుంది. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తర్వాత 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నప్పటికీ.. సామ్ మాత్రం ఒంటరిగా ఉంది. రాజ్‌తో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె స్పందించలేదు. ఇప్పుడు సడెన్‌గా పెళ్లి చేసుకొని అందరికి షాకిచ్చింది. (చదవండి: సమంత రెండో పెళ్లి.. అలా చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే..!)ఇదిలా ఉంటే.. సామ్ పెళ్లి చేసుకున్న ఫోటోలు బయటకు రాగానే.. సోషల్ మీడియా నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. గతంలో ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో చైతన్య విడాకుల విషయంపై ఎమోషనల్‌గా మాట్లాడారు.‘నా జీవితంలో ఏదైనా జరిగింది(విడాకులు).. అలా చాలా మంది జీవితాల్లో కూడా జరిగింది. కానీ నన్ను ఒక్కడినే క్రిమినల్‌గా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. మేమిద్దరం పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం.ఈ విడాకుల బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుండే బ్రోకెన్ ఫ్యామిలీ నుండి వచ్చాను. అందుకే ఒక బంధాన్ని బ్రేక్ చేసుకునే సమయంలో ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించాను. వెయ్యి సార్లు ఆలోచించాకే ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం. ఆ సమయంలో మాకు ప్రైవసీ ఇవ్వాలి అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు అది హెడ్ లైన్‌గా అయిపోయి.. గాసిప్లా మార్చేసి.. చివరకు ఆ టాపిక్‌ని ఒక ఎంటర్టైన్మెంట్లా మార్చేశారు. నేను చాలా సార్లు ఆలోచించాను. బయటకు వచ్చి దాని గురించి మాట్లాడితే.. దాని మీద కూడా ఇంకొన్ని ఆర్టికల్స్ పుడతాయి. అందుకే మాట్లాడలేదు. రాసేవాళ్లే దీనికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలి’ అని చైతూ చెప్పుకొచ్చాడు. The moment he's speaking with a well-disciplined expression I'm came here from a broken family, Naaku thelusu aa pain ento.Hatts off to your Maturity levels 📈 #NagaChaitanya ❤️🩹🛐 pic.twitter.com/8aYYqCU9HX— Amoxicillin (@__Amoxicillin_) December 1, 2025 -
‘వన్ బై ఫోర్’.. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు: వెంకటేశ్ పెద్దపాలెం
వెంకటేశ్ పెద్దపాలెం హీరోగా, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోయిన్లుగా నటించిన యాక్షన్, క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ పెద్దపాలెం మాట్లాడుతూ– ‘‘నాది మదనపల్లి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామా సినిమా తీశాం. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు. ‘‘తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ సినిమాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు రంజన రాజేష్. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అని రోహిత్ రాందాస్, దర్శకుడు పళని తెలిపారు. అపర్ణ మల్లిక్, హీనా సోని, కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు మాట్లాడారు. -
ఓటీటీలో వరుణ్ సందేశ్ కొత్త వెబ్ సిరీస్.. రిలీజ్ ఎప్పుడంటే?
కొత్తబంగారు లోకం హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇతడు ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘నయనం’. ఈ సిరీస్ జీ5లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సైకో థ్రిల్లర్‌ను స్వాతి ప్రకాశ్ డైరెక్ట్ చేశారు. మనుషుల్లోని నిజ స్వభావానికి, ఏదో కావాలని తపించే తత్వానికి మధ్య ఉండే సున్నితమైన అంశాలను ఇందులో చూపించారు.ఫస్ట్ లుక్ రిలీజ్సోమవారంనాడు ఈ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. డాక్టర్ నయన్ పాత్రలో వరుణ్ సందేశ్ కనిపించనున్నాడు. తన పాత్రలోని డార్క్ యాంగిల్, సైకలాజికల్ సంక్లిష్టతను ఇందులో ఆవిష్కరించారు. ఈ వెబ్ సిరీస్‌లో ఆరు ఎపిసోడ్స్ ఉండనున్నాయి.వెబ్‌సిరీస్‌లో వరుణ్ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్న వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నటుడిగా నాకు ఇది సరికొత్త ప్రయాణం. ఇప్పటి వరకు చేయనటువంటి విభిన్నమైన పాత్రలో డాక్టర్ నయన్‌గా కనిపించబోతున్నాను. పోస్టర్ గమనిస్తే నా పాత్రలో ఇంటెన్సిటీ అర్థమవుతుంది. ఓటీటీలో యాక్ట్ చేయటం వల్ల ఇలాంటి పాత్రలో డెప్త్‌ను మరింతగా ఎలివేట్ చేసినట్లయింది అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) చదవండి: ఆ కారణాల వల్లే దివ్య ఎలిమినేట్ -
నేడు సమంత పెళ్లి? రాజ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీళ్లిద్దరూ ఆ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మల్చుకోవాలని భావిస్తున్నారట! నేడు (డిసెంబర్ 1న) కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఈ లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలిదే పెట్టిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. బరి తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు అని రాసుకొచ్చింది.అందుకే అక్కడ!కాగా సమంత.. సమయం దొరికితే చాలు ఈషా ఫౌండేషన్‌కు వెళ్తుంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటుంది. ఆ ప్రదేశానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చే సామ్.. తన పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలనుకుంటుందని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉందిపెళ్లి- విడాకులురాజ్ నిడిమోరు (Raj Nidimoru)- శ్యామలిదే 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు సమంత (Samantha Ruth Prabhu)- నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్‌లో వీరి వివాహం జరిగింది. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట సడన్‌గా విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. 2021 అక్టోబర్‌లో చైసామ్ విడాకులు తీసుకున్నారు.చదవండి: బిగ్‌బాస్ 9: తనూజను ఎత్తుకుంటే నీకేంటి సమస్య? ఏడ్చిన దివ్య -
నా ఫ్రెండ్ రాసుకున్న స్టోరీ లైన్.. తను చనిపోయినా..
రామ్‌కిరణ్, మేఘా ఆకాశ్ జంటగా రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సఃకుటుంబానాం’. ఉదయ్ శర్మ దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను చేసిన పాత్రకు చాలెంజ్‌లు ఉన్నాయి. కుటుంబం నేపథ్యంలో కుటుంబం గొప్పతనాన్ని, ప్రాముఖ్యతను తెలియజేసే ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అని చెప్పారు. ఆయన చనిపోవడంతో..బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా చిత్రంగా ఉంటుంది. దర్శకుడు ఉదయ్ శర్మ తనకు కావాల్సిన అవుట్‌పుట్ రాబట్టుకోగలిగిన మంచి దర్శకుడు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ– ‘‘నా స్నేహితుడు విక్రమ్ ఒక స్టోరీ లైన్‌ను సినిమాగా చేయాలనుకున్నాడు. కానీ ఆయన చనిపోవడంతో తన ఫ్రెండ్ ఉదయ్ ఆ లైన్‌ను కథగా మార్చి, సినిమా చేస్తున్నాడని చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాను. ఈ సినిమా సుకుమార్‌గారి ఐడియాతో ఉంటుంది. ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. పదహారేళ్ల కల నెరవేరింది‘‘హీరో కావాలనుకున్న నా పదహారేళ్ల కల ఈ సినిమాతో నిజమైంది’’ అని చెప్పారు రామ్‌కిరణ్. ‘‘నా తొలి చిత్రానికి మణిశర్మగారు సంగీతం అందించడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను’’ అన్నారు ఉదయ్ శర్మ. ‘‘మా హెచ్ఎన్జీ బ్యానర్లో వస్తున్న తొలి చిత్రమిది. ప్రేక్షకులు ఈ సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని మహదేవ్ గౌడ్ మాట్లాడారు. -
లవ్ ఫెయిల్... సరదాగా నవ్వించే మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఫెయిల్యూర్నాటి దేవదాసు నుండి నేటి గర్ల్ ఫ్రెండ్ వరకు ప్రేమను ఓ అందమైన దృశ్య కావ్యంగా చిత్రీకరించిన సినిమాలు ఎన్నో వచ్చాయి. సక్సెస్ఫుల్ ప్రేమ ముందుగా ఫెయిల్యూర్‌తోనే పుడుతుంది. అది ఏ కాలమైనా, ప్రాంతమైనా, భాష అయినా ఇదే సిద్ధాంతం. అందుకేనేమో ఈ థీమ్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకుల మదిలో అలా పదిలంగా నిలిచిపోతాయి. కానీ ఓ సీరియస్ ప్రేమ అయిన స్వీట్‌కు కామెడీ అనే కారం తగిలిస్తే ఎలా ఉంటుందో తెలిపేదే ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’.ఎలా ఉందంటే?ఈ సినిమా పేరుతోనే దర్శకుడు ప్రేక్షకుడికి కాస్తంత గిలిగింతలు పెట్టించాడు. కాస్త లోతుగా గమనిస్తే సెటైరికల్ మోడ్‌లో మహా గమ్మత్తుగా ఉందీ టైటిల్. శశాంక్ ఖేతన్ ఈ కథ రాసి, దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ జంటగా, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రూ. వంద కోట్ల వసూళ్లు దక్కించుకుంది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.సన్నీ సంస్కారి తన గర్ల్ ఫ్రెండ్ అయిన అనన్యకు వినూత్న రీతిలో... ఇంకా చెప్పాలంటే బాహుబలి సెటప్‌లో కాస్త భారీగానే ప్రపోజ్ చేయడానికి ప్లాన్ చేస్తాడు. సెటప్, గెటప్ అంతా బాగానే ఉన్నా అనన్య మాత్రం కోటీశ్వరుడైన విక్రమ్‌తో తన తల్లిదండ్రులు తనకు పెళ్ళి నిర్ణయించారని సంస్కారికి ససేమిరా నో చెబుతుంది. ఇది విన్న సన్నీ బాగా బాధపడి ఎలాగైనా అనన్యను సొంతం చేసుకోవాలని విక్రమ్ గురించి ఆరా తీస్తాడు. తులసీ కుమారి అనే అమ్మాయితో ఇటీవలే విక్రమ్‌కు బ్రేకప్ అయిన విషయం తెలుసుకొని తులసీ కుమారిని కలవడానికి వెళతాడు. ఈ లోపల అనన్య, విక్రమ్‌ల పెళ్ళి ఆహ్వాన పత్రిక సన్నీతో పాటు తులసీ కుమారికి కూడా అందుతుంది. తులసీతో కలిసి సన్నీ ఈ పెళ్ళి చెడగొట్టడానికి ఓ కుట్ర పన్నుతాడు (Sunny Sanskari Ki Tulsi Kumari Movie Review). మరి... సన్నీ ప్లాన్ సక్సెస్ అయి, అనన్యను పెళ్ళి చేసుకుంటాడా? అలాగే విక్రమ్, తులసీ కుమారి మళ్ళీ కలిసిపోతారా? అన్న విషయం మాత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి’ సినిమాలోనే చూడాలి. వరుణ్ తన ఈజ్‌తో... అలాగే జాన్వీ తన క్రేజ్‌తో యూత్‌ని బాగా అలరించే సినిమా ఇది. అక్కడక్కడా కాస్త ఓవర్ యాక్షన్ అనిపించినా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు... సరికదా సరదాగా సాగిపోతుంది. వర్త్ టు వాచ్. – హరికృష్ణ ఇంటూరు -
60% భగవంత్ కేసరి కథే!
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి సినిమా జననాయకన్. ఇది ఆయన నటిస్తున్న 69వ సినిమా. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తుండగా మమితా బైజు ముఖ్య పాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. కేవీఎన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి ముందు దర్శకుడు వినోద్.. కమల్ హాసన్ కోసం ఒక కథ సిద్ధం చేశారు. మొదట్లో కాదన్నారు.. కానీ!అయితే ఆ కథలో కమల్ నటించలేదు. దీంతో అదే కథతో విజయ్ను హీరోగా పెట్టి సినిమా చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత.. బాలకృష్ణ తెలుగులో నటించిన భగవంత్ కేసరి కాపీనీ కొడుతున్నారని వార్తలు వైరలయ్యాయి. ఈ ప్రచారాన్ని దర్శకుడు ఖండించాడు. ఇదిలా ఉంటే జననాయకన్ సినిమా నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. 2026 జనవరి 9న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో..ఈ క్రమంలో కొన్ని ముఖ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదేమిటంటే.. నేలకొండ భగవంత్ కేసరి చిత్రానికి చెందిన 60 శాతం జననాయకన్ చిత్రంలో ఉంటుందని, మిగతా భాగాన్ని దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారట. విజయ్ (Vijay) రాజకీయ పార్టీ పేరు తమిళగ వెట్రి కళగం అన్న విషయం తెలిసిందే.. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ ఇందులో నటించాడు. సమకాలీన రాజకీయ అంశాలు సినిమాలో ఉండబోతున్నాయి. -
టాలీవుడ్ నవంబర్ రివ్యూ.. 35లో మూడు మాత్రమేనా?
టాలీవుడ్లో ఓ సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు పెద్దగా ఆడవని నమ్ముతారు. అందుకే ఈ నెలలో పెద్ద చిత్రాలేవి విడుదల కావు. గతేడాది అయితే అన్ని చిన్న చిత్రాలతో నవంబర్ నెల గడిచిపోయింది. కానీ ఈ ఏడాది మాత్రం ఒకటి రెండు బడా చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. దాంతో పాటు స్టార్ హీరోల హిట్ చిత్రాలు కూడా రీరిలీజ్ అయ్యాయి. మరి వాటిలో ఏవి హిట్ అయ్యాయి? ఏవి అపజయాన్ని మూటగట్టుకున్నాయి? ఓ లుక్కేద్దాం.సెంటిమెంట్ ప్రకారమే.. ఈ ఏడాది నవంబర్ కూడా భారీ ఫ్లాప్‌తో ప్రారంభం అయింది. మంచి అంచనాలతో నవంబర్ 1న విడుదలైన రవితేజ ‘మాస్ జాతర’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా రిలీజ్ అయిన తొలి రోజే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడలేదు.ఇక ఆ తర్వాతి వారం ది గర్ల్‌ఫ్రెండ్, జటాధర, ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో చిత్రంలో పాటు మరో ఐదారు చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిల్లో ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి హిట్ టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక జటాధర మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీవెడ్డింగ్ షో’ మాత్రం ఊహించని విజయాన్ని అందుకుంది. మిగిలిన చిత్రాలన్ని ఒక్కరోజుతోనే థియేటర్స్ నుంచి బయటకు వచ్చేశాయి.ఇక రెండోవారం(నవంబర్ 14) కాంత, జిగ్రీస్, సంతాన ప్రాప్తిరస్తు, గతవైభవంతో పాటు మరో నాలుగైదు సినిమాలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ టాక్ని సంపాదించుకోలేకపోయింది. భారీ అంచనాల మధ్య వచ్చన కాంత.. తొలి రోజు మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. అయితే రెండో రోజు నుంచి మెల్లిగా పికప్ అవుతుందని ఆశించినా.. ప్రేక్షకులు మాత్రం ఈ ప్రయోగాత్మక చిత్రాన్ని తిరస్కరించారు. మిగిలినవన్నీ అపజయాన్ని మూటగట్టుకున్నాయి. అయితే ఇదే వారం రీరిలీజ్ అయిన శివ మాత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది.ఇక నవంబర్ 21న అల్లరి నరేశ్ ‘12 ఏ రైల్వేకాలనీ’, ప్రియదర్శి ‘ప్రేమంటే’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, పాంచ్ మినార్‌తో పాటు మొత్తం 21 సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఏ ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఉన్నంతలో రాజు వెడ్స్ రాంబాయి మంచి విజయం సాధించింది. అల్లరి నరేశ్ 12 ఏ రైల్వేకాలనీ చిత్రం అయితే ఫస్ట్ షోకే నెగెటివ్ టాక్ని మూటగట్టుకొని..కనీస ఓపెనింగ్స్ రాబట్టుకోలేకపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘కొదమసింహం’తో పాటు కార్తి ‘ఆవారా’ చిత్రం కూడా ఈ వారంలోనే రీరిలీజ్ అయింది. ఈ రెండింటిని కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు.ఇక నవంబర్ చివరివారంలో రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలుకా’తో, కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆంధ్రకింగ్ తాలుకా చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా.. భారీ ఓపెనింగ్స్ అయితే రాబట్టుకోలేకపోయింది. రెండో రోజు నుంచి పుంజుకుంటుందని ఆశించినా.. అదీ జరగలేదు. రివాల్వర్ రీటా డిజాస్టర్ టాక్ని మూటగట్టుకుంది. మొత్తంగా నవంబర్ నెలలో 35పైగా చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తే..వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ఫ్రీవెడ్డింగ్ షో’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే కాస్త అలరించాయి. రీరిలీజ్‌లలో శివ చిత్రం మంచి కలెక్షన్స్‌ని రాబట్టుకుంది. మిగిలిన చిత్రాలేవి ఆకట్టుకోలేకపోయాయి. డిసెంబర్లో అయిన టాలీవుడ్‌కి బ్లాక్ బస్టర్ హిట్ దక్కుతుందో చూడాలి. -
ఆయనతో పదేపదే కిస్ సీన్ చేయనన్న హీరోయిన్
షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, సన్నీ డియోల్ వంటి హీరోలతో ఎక్కువగా జోడీ కట్టింది జూహీ చావ్లా. అలా సన్నీ డియోల్‌తో లూటెరే అనే హిట్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ విశేషాల గురించి నిర్మాత సునీల్ దర్శన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. 'జూహీ కెరీర్లో ముఖ్య పాత్ర పోషించిన సినిమాల్లో లూటెరె ఒకటి. దివ్య భారతిని కాదని..ఆమె నటించిన సుల్తానాత్ (1986), ఖయామత్ సే ఖయామత్ టక్ (1988) సినిమలను నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. తను చాలా బాగా యాక్ట్ చేయగలదు. అందుకే లూటెరె మూవీలో తనను హీరోయిన్గా తీసుకున్నాం. నిజానికి దివ్య భారతి అప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తను ఈ సినిమాలో భాగం కావాలని కోరుకుంది. కానీ, ఆమె ఈ పాత్రకు సరిపోదని భావించాం. దర్శకుడు ధర్మేశ్, నేను.. తనను కాదని జూహీ చావ్లాను తీసుకున్నాం.గ్లామర్‌గా చూపించాంఅయితే ఈ సినిమాలో మే తేరీ రాణి తు రాజా అని ఓ బీచ్ సాంగ్ ఉంటుంది. అందులో ఆమె బీచ్‌లో షర్ట్ ధరించి నీళ్లలో తడవాల్సి ఉంటుంది. అప్పటిదాకా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌తో ఉన్న జూహీ చావ్లా.. సడన్‌గా గ్లామర్‌గా కనిపించాలంటే కొంత భయపడింది. కానీ కథ మొత్తం చెప్పాకే తను సినిమా చేసేందుకు ఒప్పుకుంది. కాబట్టి చేయక తప్పలేదు. ముద్దు సన్నివేశంఅలాగే హీరోతో ముద్దు సన్నివేశం ఉంటుందని కూడా చెప్పాం. అలా మొదట్లో సీన్ షూట్ చేశాం. అయితే ఔట్డౌర్లో ఆ సీన్ తీస్తే బాగుంటుందనుకున్నాం. అంతా సిద్ధం చేసుకున్నాక జూహీ రాలేదు. తనకు వేరే షూటింగ్ ఉందని సాకు చెప్పి తప్పించుకుంది. సినిమాకు ఆ సన్నివేశం కీలకమని, ఏదో సంచలనం కోసం దాన్ని షూట్ చేయట్లేదని దర్శకుడు అన్నాడు.రీటేక్‌కు ఒప్పుకోలేదుఅలా సన్నీ డియోల్ , జూహి (Juhi Chawla)తో ముద్దు సీన్ తీశారు. అప్పటికీ అది సరిగా రాలేదని రీటేక్ చేయాలన్నాడు. దీంతో ఆగ్రహానికి లోనైన జూహి.. కాంట్రాక్ట్‌లో ఒక ముద్దు సన్నివేశంలో మాత్రమే నటిస్తానని చెప్పాను. అది ఆల్రెడీ చేశానుగా అని వాదించింది. అందుకని ఆమెను బలవంతం చేయకుండా ఫస్ట్ తీసిన సీన్‌ను అలాగే ఉంచాం. ఆ సినిమా జూహీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది' అని సునీల్ దర్శన్ (Suneel Darshan) చెప్పుకొచ్చాడు.చదవండి: కాంతార దైవాన్ని దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ స్టార్ -
తిరుపతిలో దేవగుడి చిత్ర యూనిట్ సందడి
పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకం పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వం లో నిర్మించిన చిత్రం దేవగుడి . ఈ చిత్రం డిసెంబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తిరుపతి , గొల్లపల్లిలోని సిద్ధార్థ ఎడ్యుకేషనల్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ లో, విద్యార్థుల సమక్షంలో చిత్ర యూనిట్ సందడి చేసింది .ఈ సందర్భంగా గాయని చిత్ర ఈ సినిమాలో పాడిన పాటను సైతం కళాశాలలో ప్రదర్శించారు. హీరో కావాలని ఎన్నో ఏళ్ల పాటు కష్టపడ్డానని, ప్రేక్షకులందరూ తనను ఆశీర్వదించాలని హీరో అభినవ శౌర్య కోరారు. Dఇంజనీరింగ్ విద్యార్థుల కేరింతల నడుమ హీరోయిన్ అను శ్రీ సినిమాలో కొన్ని డైలాగులు చెప్పింది. దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 19 విడుదల కానుందని, ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు గానే తిరుపతిలో ప్రివ్యూ షో వేస్తున్నట్లు ప్రకటించారు బెల్లం రామ కృష్ణారెడ్డి.సినిమాలో ఓ పాటకు హీరో, హీరోయిన్లు స్టెప్పులు వేసి అలరించారు. -
భారీ ధరకు ‘పెద్ది’ ఓటీటీ రైట్స్... రిలీజ్‌కు ముందే సంచలనం!
ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మధ్యే రిలీజ్ అయితే ‘చికిరి’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపిస్తోంది. అంతకు ముందు విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఈ పాట కూడా హిట్ కావడంతో పెద్దిపై అంచనాలు అమాంతం పెరిగాయి.సినిమాకు వచ్చిన బజ్‌తో పలు ఓటీటీ సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీపడ్డాయట. ముఖ్యంగా రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీలో నిలవగా.. భారీ ధరకు నెటిఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్ పెట్టి పెద్ది(Peddi) కోనుగోలు చేసిందట నెట్‌ఫ్లిక్స్. అన్ని భాషలకు గాను ఈ మొత్తాన్ని చెల్లించబోతుందట. షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కాబోతున్న చిత్రాలకే ఓటీటీ బిజినెస్ అవ్వడం లేదు. అలాంటిది ఇంకా షూటింగ్ కూడా పూర్తికాని పెద్ది చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే. మల్టీస్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా సిద్ధం చేయించిన భారీ సెట్లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్‌చరణ్, ఇతర ఫైటర్లతో పాటు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ కూడా పాల్గొంటున్నారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ తండ్రి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ ‘దంగల్’ ఫేమ్ షామ్ కౌశల్ ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను పర్యవేక్షిస్తుండగా, నవకాంత్ స్టంట్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘ప్రతి ఫైట్ సీక్వెన్స్‌ను ప్రత్యేకమైన కాన్సెప్ట్‌తో, ఉత్కంఠభరితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బుచ్చిబాబు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ఓ హైలైట్‌గా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. -
దేవతను దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్ హీరో
ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఇఫీ (అంతర్జాతీయ చలనచిత్రోత్సవ) వేడుకలు శుక్రవారం (నవంబర్ 28న) విజయవంతంగా ముగిశాయి. గోవాలో ఈ ముగింపు వేడుకకు కాంతార హీరో రిషబ్ శెట్టితో పాటు బాలీవుడ్ స్టార్ రణ్వీర్ సింగ్ సైతం హాజరయ్యాడు. కానీ అత్యుత్సాహంతో రణ్వీర్ చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.ఇంతకీ ఏం జరిగిందంటే?స్టేజీపై రణ్వీర్ మాట్లాడుతూ.. నేను కాంతార: చాప్టర్ 1 థియేటర్లో చూశాను. రిషబ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. ఆడ దెయ్యం అతడి శరీరంలో ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశం అయితే అమేజింగ్ అంటూ ఆ సీన్‌ను రీక్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే తనను కాంతార 3లో చూడాలనుకుంటే రిషబ్‌ను మీరే ఒప్పించండి అని ప్రేక్షకులను కోరాడు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక నటుడిగా స్టేజీపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది కూడా తెలీదా? దైవాన్ని పట్టుకుని దెయ్యం అంటాడేంటి? దేవతను కించరిచే హక్కు ఈయనకెక్కడిది? అని మండిపడుతున్నారు.కాంతార విశేషాలురిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 రిలీజైంది. జయరామ్, రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. #RanveerSingh literally called chavundi mata a ghost and mimicked her in funny way Isn't this Blasphemy pic.twitter.com/iJ1bAjRCLs— Tyler Burbun (@BurbunPitt) November 29, 2025 చదవండి: ప్రకాశ్ రాజ్ భార్యగా ఛాన్స్.. ఐదుగురితో కాంప్రమైజ్ అడిగారు -
నెల తిరక్కుండానే ఓటీటీలోకి 'ది గర్ల్‌ఫ్రెండ్'
ఏ సినిమాలో అయినా హీరోహీరోయిన్ కలిస్తే జనం చప్పట్లు కొడతారు. కానీ, ఈ సినిమాలో మాత్రం వాళ్లిద్దరికీ బ్రేకప్ అయినప్పుడు జనం సంతోషంతో చప్పట్లు కొట్టారు. ఆ మూవీయే ది గర్ల్‌ఫ్రెండ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు.నెల తిరగకముందే ఓటీటీలోనవంబర్ 7న విడుదలైన ఈ చిత్రం రూ.28 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 5న అందుబాటులోకి వస్తున్నట్లు వెల్లడించారు. నెలరోజులు కాకముందే ది గర్ల్‌ఫ్రెండ్ ఓటీటీలో సందడి చేయనుందన్నమాట! తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమ్ అవనుంది. ఇది చూసిన అభిమానులు.. ఈ మూవీ కోసం ఎంతలా ఎదురుచూస్తున్నామో అని కామెంట్లు చేస్తున్నారు.కథేంటంటే?The Girlfriend Movie: భూమా (రష్మిక మందన్నా) తండ్రి (రావు రమేశ్)చాటు కూతురు. పీజీ చదివేందుకు తొలిసారి తండ్రిని వదిలి నగరానికి వెళ్లి ఓ కాలేజీలో చేరుతుంది. అదే కాలేజీలో విక్రమ్ (దీక్షిత్ శెట్టి), దుర్గ (అను ఇమ్మాన్యుయేల్) కూడా చేరతారు. దుర్గ.. విక్రమ్‌ను ప్రేమిస్తే.. అతడు మాత్రం భూమాను లవ్ చేస్తాడు. ప్రేమ జోలికి వెళ్లకూడదనుకుంటూనే భూమా కూడా అతడితో ప్రేమలో పడిపోతుంది. తర్వాత ఏం జరిగింది? భూమా జీవితం విక్రమ్ కంట్రోల్లోకి వెళ్లిందని తెలుసుకుని ఆమె ఏం చేసింది? అన్నదే మిగతా కథ. ఈ శుక్రవారం ఎంచక్కా ఓటీటీలో గర్ల్‌ఫ్రెండ్ చూసేయండి.. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) చదవండి: బ్రహ్మానందంపై నోరు జారిన రాజేంద్రప్రసాద్.. అంతమాటన్నాడా? -
బ్రహ్మానందాన్ని తిట్టిన రాజేంద్రప్రసాద్
రానురానూ రాజేంద్రప్రసాద్ తీరు అద్వాణ్నంగా తయారవుతోంది. మైక్ దొరికితే చాలు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియని పరిస్థితి. ఏళ్లకొద్దీ అనుభవం ఉంటే ఏం లాభం? సభామర్యాదను పాటించకుండా స్టేజీపైనే బూతులు మాట్లాడుతున్నాడు. తాజాగా హాస్యబ్రహ్మ బ్రహ్మానందంను కించపరుస్తూ మాట్లాడాడు.ఈవెంట్లో నోరు జారిన రాజేంద్రప్రసాద్శనివారం నాడు స:కుటుంబానాం సినిమా ఈవెంట్‌కు బ్రహ్మానందంతో పాటు రాజేంద్రప్రసాద్ హాజరయ్యాడు. బ్రహ్మానందం ప్రసంగం ముగిసిన తర్వాత రాజేంద్రప్రసాద్‌కు మైక్ ఇచ్చారు. పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందంగారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్లు మాట్లాడటం.. అంటూ స్పీచ్ మొదలుపెట్టారు. నటుడిపై ఆగ్రహంఇంతలో సడన్‌గా బ్రహ్మానందం (Brahmanandam)తో నువ్వు ముసలి ** కొడుకువి అంటూ నోరు జారాడు. ఆ మాటకు షాకైన బ్రహ్మానందం ఎవరు? అని అడగ్గానే నేనే అంటూ కవర్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజేంద్రప్రసాద్‌ను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. ప్రతిసారి ఇలా నోరు జారడం అలవాటైపోయిందని మండిపడుతున్నారు. వివాదాలతో సావాసంవివాదాలు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)కు కొత్తేమీ కాదు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్‌ను అసభ్య పదజాలంతో సంబోధించాడు. ఓ ఈవెంట్లో ఎవరూ చప్పట్లు కొట్టకపోతే బ్రెయిన్ పోయిందా? చప్పట్లు కొట్టకపోతే సిగ్గు లేనట్లే అని చులకనగా మాట్లాడాడు. మరో ఈవెంట్లో కమెడియన్ అలీని దారుణంగా తిట్టాడు. అయితే ఓ ఇంటర్వ్యూలో దీనిపై క్షమాపణలు చెప్తూ మరోసారి నోరు జారనని హామీ ఇచ్చాడు. ఇంతలోనే బ్రహ్మానందాన్ని కించపరిచేలా కామెంట్స్ చేసి విమర్శలపాలయ్యాడు.చదవండి: డైరెక్టర్ మా ఇంటికొచ్చి మరీ నీచంగా..: నటి -
క్రికెట్ నేపథ్యంలో సుడిగాలి సుధీర్ G.O.A.T.. రంగంలోకి టాప్ టెక్నీషియన్!
‘సుడిగాలి’ సుధీర్, దివ్య భారతి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జీవోఏటీ’. క్రికెట్ నేపథ్యంలో వినోద ప్రధానంగా సాగే ఈ సినిమాను మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను మాత్రం ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ అందించనున్నారు. ఈ విషయాన్ని చిత్రనిర్మాత శనివారం అధికారికంగా తెలిపారు. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఒడియమ్మ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. లియోన్ జేమ్స్ ఈ పాటని అదిరిపోయే లవ్ మెలోడీ గా కంపోజ్ చేశారు. సుధీర్(Sudigali Sudheer) కెరీర్లో ఇంత వేగంగా వైరల్ అయిన పాట ఇదే అనే చెప్పాలి. రిలీజ్ అయిన ఒక్క రోజులోనే రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోయి, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు విడుదలైన అన్ని పాటలు హిట్ అంటూ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన అందుకుంటున్నాయి. దీంతో సినిమా పై బజ్ మరింతగా పెరిగింది. -
ప్రకాశ్‌రాజ్ భార్యగా ఛాన్స్... ఐదుగురితో కాంప్రమైజ్!
అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తోంది మాధవి. మిర్చి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇటీవల సీరియల్స్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా అవకాశాలు పెద్దగా రావడం లేదని, వచ్చినా కమిట్మెంట్ అడుగుతున్నారని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి మాట్లాడింది.లావుగా ఉన్నానని..'అన్నీ ఉన్నా ఆఫర్స్ రావటంలేదు. ఆడిషన్స్‌కు వెళ్తేనేమో మీరా మాధవిగారు.. మీరు తెలుసు అనేస్తారు. సీరియల్స్‌లో అయితే డిమాండ్ ఉంది. సినిమాల్లోనే.. పిలుస్తున్నారు కానీ ఫైనల్ చేయడం లేదు. కొన్నిసార్లు లావుగా ఉన్నానని రిజెక్ట్ చేస్తారు. ఆడవారికి ఒక వయసు దాటాక హార్మోన్ల సమస్యలు వస్తాయి.. లావైపోతాం. దానికి మనమేం చేయలేం.. మరి వీళ్లంతా నేను సన్నగా ఉన్నప్పుడు ఏం చేశారో..?ఇంటికి వచ్చి మరీ..12 ఏళ్ల క్రితం ఒక దర్శకుడు ఫోన్ చేశాడు. తనింకా ఆఫీస్ పెట్టలేదని, ఇంటికొచ్చి మాట్లాడతానన్నాడు. నేను ఉత్సాహంతో సరే, రండి సర్ అన్నాను. అప్పుడు ఇంట్లో అమ్మ, నేను, పనిమనిషి ఉన్నాం. ఆయన వచ్చాక నన్నోసారి నడవమన్నారు. ఆడిషన్ చేస్తున్నారేమోనని నడిచి చూపించాను. అప్పుడు డ్రెస్‌లో ఉండేసరికి చీర కట్టుకుని రమ్మన్నాడు. సరే అని చీర కట్టుకుని రెడీ అయి ముందు నిల్చున్నాను. చెప్పు తీసుకుని కొడతా..ఆయన నన్ను ఎగాదిగా చూసి కాస్త నీ నడుము చూపించు అన్నాడు. వెంటనే కోపంతో నువ్వు లేరా.. చెప్పు తీసుకుని కొడతా, బయటకు పో అని గెంటేశాను. ఒకవేళ ఆయన తలుపేసి ఏమైనా చేసుంటే నా పరిస్థితి ఏంటి? అని నిలువెల్లా వణికిపోయాను. మరో సంఘటన.. 100% లవ్ సినిమా చేశాక నాకో ఫోన్ కాల్ వచ్చింది. ప్రకాశ్‌రాజ్ పక్కన భార్య పాత్ర.. ఐదుగురితో కాంప్రమైజ్ కావాలి అని అడిగారు. ఆ టైప్ కాదన్నాను100% లవ్‌లో కూడా కాంప్రమైజ్ ఇచ్చారని మాకు తెలిసింది అన్నాడు. అలాంటిదేమీ లేదు, కావాలంటే వాళ్లను అడగండి అని చెప్పాను. అలాంటి మార్గం ఎంచుకుంటే అదే పని చేసుకునేదాన్ని.. నేనలా కాదు, సారీ అని చెప్పాను. మంచి అవకాశం అని బలవంతం చేశారు, కానీ నేను వదిలేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. మాధవి (Mirchi Madhavi) చివరగా గుప్పెడంత మనసు సీరియల్లో మెప్పించింది. ప్రస్తుతం గోపీచంద్ సినిమాతో పాటు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చేస్తోందిచదవండి: OTT: గుల్మొహర్ మూవీ రివ్యూ -
గుల్మొహర్ రివ్యూ.. మనసును హత్తుకునే సినిమా
ఇల్లు అంటే కేవలం నాలుగు గదులు అంతేనా? కాదు, ఇల్లు అంటే కుటుంబంలో ఒక భాగం. కుటుంబసభ్యుల ప్రేమానురాగాలకు, అలకలకు, కోపతాపాలకు, రహస్యాలకు, విషాదాలకు.. ఇలా అన్నిరకాల జ్ఞాపకాలకు నిలువెత్తు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉన్న సొంతింటిని వీడాలంటే కన్నతల్లికే దూరమవుతున్నట్లు మనసు తల్లడిల్లుతుంది. అలా ఇంటి చుట్టూ తిరిగే కథ గుల్మొహర్.అందరి ఇంటి కథమనోజ్ బాజ్‌పాయ్, షర్మిల ఠాగోర్, జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన మూవీ గుల్మొహర్. రాహుల్ చిట్టెల, అర్పిత ముఖర్జీ ఇల్లు, అందులో ఉండే కుటుంబం గురించి కథ రాసుకున్నారు. చూడటానికి సింపుల్‌గా ఉన్నా కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తాయి. కుసుమ్ బాత్రగా షర్మిల నటన ఆకట్టుకుంటుంది. అందరి ఇంట్లోలాగే తను కూడా ఇంటిపెద్దగా, నాయినమ్మగా పెత్తనం చెలాయిస్తుంటుంది. కానీ, తన మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ ఉండదు.కథఅందరం కలిసికట్టుగా జీవించాలనుకునే వ్యక్తి అరుణ్ (మనోజ్ బాజ్‌పాయ్). కానీ అతడి కుమారుడు ఆది (సూరజ్ శర్మ) భార్యతో కలిసి విడిగా ఉండాలనుకుంటాడు. తండ్రి సాయం లేకుండా సొంతంగా తన కాళ్లపై నిలబడాలనుకుంటాడు. అది అరుణ్‌కు నచ్చదు. కుటుంబం ఎప్పుడూ ఒకేచోట ఉండాలన్నది అతడి విధానం. ఇంతలో అతడి తల్లి కుసుమ్ కూడా పుదుచ్చేరిలో ఇల్లు కొన్నానని, ఒక్కతే అక్కడ ఉండబోతున్నానని చెప్పి బాంబు పేలుస్తుంది. ఇది ఎవరికీ మింగుడు పడకపోయినా ఆమెను ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయరు.ఎలా ఉందంటే?చేతి ఐదువేళ్లు ఒకేలా ఎలా ఉండవో.. ఇంట్లోని మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కొరిది ఒక్కో స్వభావం. దాన్ని సినిమాలో చాలా బాగా చూపించారు. (Gulmohar Movie Review) క్లైమాక్స్‌లో మనోజ్ తన నటనతో ఏడిపించేశాడు. ఆ ఇంట్లో చివరి హోలీ చేసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అది చూశాక మన మనసులు కూడా కాస్త తేలికపడతాయి. అందర్నీ ఇంతలా మెప్పించిన ఈ సినిమాకు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. -
అందాల ఆరబోత.. నేను చేయట్లేదా?: రకుల్
ఒకప్పటి హీరోయిన్లను ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని చెప్పక తప్పదు. పాతతరం కథానాయికలు బొద్దుగా ఉండేవారు. ఈ తరం కథానాయికలు సైజ్ జీరోపై మక్కువ చూపుతారు. ఒకవేళ శరీర కొలతలు పెరిగితే దాన్ని తగ్గించుకోవడానికి నానా అవస్థలు పడుతుంటారు. డైటింగ్ పేరుతో నోళ్లు కట్టేసుకుంటారు. ఈ విషయంలో ఉత్తరాది హీరోయిన్లు ముందుంటారని చెప్పక తప్పదు. పెళ్లి తర్వాతఅలా వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. కొందరు హీరోయిన్లు పెళ్లి తర్వాత స్లిమ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కారణం.. మళ్లీ నటించడానికి రెడీ అవడమే. హీరోయిన్ రకుల్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఈమె కోలీవుడ్‌లో చివరగా నటించిన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపర్చింది. అది తప్పుఆ తర్వాత దక్షిణాదిలో తనకు అవకాశాలు రాలేదు. అయినప్పటికీ అందాలారబోతతో పలు ఫోటోషూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. దీని గురించి రకుల్ మాట్లాడుతూ.. సాధారణంగా పెళ్లయితే హీరోయిన్ల పని అయిపోయినట్లే అనే భావన ఉందని తెలిపింది. అయితే అది తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని పేర్కొంది. తనకు సంబంధించినంతవరకు అందాల ఆరబోత అనేది వారి వారి ఇష్టాన్ని బట్టి ఉంటుందని తెలిపింది. అందం హద్దులను పెళ్లి చెరిపేయదని.. పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పని చేస్తుందని చెప్పుకొచ్చింది. -
‘లవ్ డేస్’ హిట్ కావాలి: దర్శకుడు సముద్ర
నవీన్, కుసుమ చందక జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల రాక్షసి’ లాంటి అద్భుతమైన ప్రేమ కథల్లా ఈ ‘లవ్ డేస్’ నిలిచిపోతుంది. ‘లవ్ డేస్’ పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఈ మూవీ జీవితంలో ఎన్నో మెమోరీస్‌ను అందించాలని కోరుకుంటున్నాను. మనస్పూర్తిగా ఈ మూవీ బిగ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.నిర్మాత మాదల వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘సురేష్ లంకలపల్లి చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ ప్రయాణంలో అతని డెడికేషన్ నాకు చాలా నచ్చింది. ఆయనతోనే మళ్లీ నెక్ట్స్ సినిమా కూడా చేయబోతోన్నాం. భవిష్యత్తులో కూడా ఆయనతో సినిమాలు చేస్తాను. నేను చేయనున్న నాలుగో సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారు. నవీన్, కుసుమ, ఆదిత్య ఇలా అందరూ ఈ చిత్రంలో అద్భుతంగా నటించారు. మా మూవీ టైటిల్, గ్లింప్స్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. త్వరలోనే మేం ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ .. ‘నిర్మాత వెంకట్ గారి వల్లే ఈ కథ, ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చింది. నవీన్ కటౌట్ బాగుంటుంది. కుసుమకి సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. ఆదిత్యకి తెలుగు అంతగా రాకపోయినా కష్టపడి డైలాగ్స్ చెప్పాడు. ఈ మూవీలో ప్రతీ ఒక్కరి పాత్ర బాగుంటుంది’ అన్నారు. -
దయచేసి నా పిల్లల ఫోటోలను వాడకండి.. నటి విజ్ఞప్తి
భర్తపై గృహహింస కేసు నమోదు చేయడంలో బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా సెలీనా జైట్లీ పేరు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. భర్త పీటర్ హాగ్ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ ఇటీవల ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సెలీనాపై రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. జాతీయ మీడియాలో ఆమెపై వరుస కథనాలు వస్తున్నాయి. వారి పిల్లల ఫోటోలను సైతం మీడియాలో చూపిస్తున్నారు. ఈ పరిణామాలతో బాధపడుతున్న సెలీనా జైట్లీ(Celina Jaitly )... మీడియాకు భావోద్వేగ విజ్ఞప్తి చేశారు. ఈ కేసు వివాదంలోకి తన పిల్లలను లాగొద్దని..వారి ఫోటోలను మీడియాలో ప్రసారం చేయొద్దని కోరింది. ‘నా గురించి రాసే వార్తల్లో మా పిల్లల ఫోటోలను వాడొద్దని మీడియాకు వేడుకుంటున్నా. నా విజ్ఞప్తిని అర్థం చేసుకొని.. అందరూ సహకరించాలని కోరుతున్నా. ఇప్పటికే ఓ తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నాను’ అంటూ ట్వీట్ చేసింది సెలీనా జైట్లి.పిల్లల గోప్యత, మానసిక భద్రతను దృష్టిలో ఉంచుకుని చేసిన సెలీనా విజ్ఞప్తికి సోషల్ మీడియాలో అనేక మంది మద్దతు తెలిపారు. అదే సమయంలో కొందరు మీడియా సంస్థలు ఇప్పటికీ పిల్లల ఫొటోలతోనే కథనాలు ప్రచురిస్తుండటం విమర్శలకు దారితీసింది.సెలీనా జైట్లీ, పీటర్ హాగ్ 2010లో ఆస్ట్రియాలో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సెలీనా జైట్లీ ఆస్ట్రియాలోని వియన్నాలో తన కవల పిల్లలతో కలిసి ఉంటున్నారు. సెలీనా పెట్టిన గృహహింస కేసు డిసెంబర్ 12న విచారణకు రానుంది. pic.twitter.com/QLPr2BgnOV— Celina Jaitly (@CelinaJaitly) November 28, 2025 -
గుడ్‌న్యూస్ చెప్పిన 'జాట్' విలన్
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా శుభవార్త చెప్పాడు. 50 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. రణ్‌దీప్ హుడా నటి లిన్ లైశ్రామ్ను 2023లో పెళ్లి చేసుకున్నాడు. నేడు (నవంబర్ 29న) వారి పెళ్లి రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేశారు. అందులో దంపతులిద్దరూ పచ్చని చెట్ల మధ్య చలి మంట కాచుకుంటున్నారు. త్వరలో బుజ్జి పాపాయిఈ పోస్ట్ కింద.. రెండేళ్ల ప్రయాణం, ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది.. అని క్యాప్షన్ జోడించారు. ఇది చూసిన సెలబ్రిటీలు, అభిమానులు రణ్‌దీప్ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. లిన్ లైశ్రామ్.. ఓం శాంతి ఓం, మేరీ కోమ్, ఉమ్రిక, రంగూన్ వంటి పలు సినిమాలు చేసింది. సినిమా నటుడు రణ్‌దీప్ (Randeep Hooda).. రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హీరోయిన్, మర్డర్ 3, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 వంటి పలు సినిమాలు చేశాడు. స్వతంత్ర వీర్ సావర్కర్ సినిమాలో నటించడంతో పాటు దర్శకుడిగా, నిర్మాతగానూ వ్యవహరించాడు. చివరగా జాట్ సినిమాలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం అమెరికన్ ఫిలిం మ్యాచ్బాక్స్లో నటిస్తున్నాడు. View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda) చదవండి: శ్రావణ భార్గవితో విడాకులు.. హేమచంద్ర ఏమన్నాడంటే? -
ఆ నటుడికి రుణపడి ఉన్న కృష్ణవంశీ.. ఏం చేశాడంటే?
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కెరీర్ తొలినాళ్లలో రామ్‌గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. గులాబీ సినిమాతో దర్శకుడిగా మారాడు. అంతేకాదు తొలి సినిమాకే నంది అవార్డు అందుకున్నాడు. రెండో సినిమా నిన్నేపెళ్లాడతా, మూడో మూవీ సింధూరం చిత్రాలకు ఏకంగా జాతీయ అవార్డులు గెల్చుకోవడం విశేషం. ఈయన చివరగా రంగమార్తాండ సినిమా తెరకెక్కించాడు.కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులుఅయితే కృష్ణవంశీ కెరీర్ తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కడుపు నిండా తిండి తినలేని స్థితిలో ఉన్నాడు. ఒక్కోసారి నాలుగైదు రోజుల వరకు ఆకలి కేకలతో అలమటించేవాడట! అంత ఆకలిగా ఉన్నా సరే.. ఎవరైనా పిలిస్తే వెళ్లేవాడు కాదట. కారణం.. ఎవరికీ రుణపడి ఉండటం ఆయనకు ఇష్టముండదు.తిండి లేక అలమటించాడుఓసారి కృష్ణవంశీ (Director Krishna Vamsi) ఐదు రోజులుగా తిండి లేక అలమటించాడు. అప్పుడు బ్రహ్మాజీ తిందాం రమ్మని పిలిచాడు. ఆ రోజు ఒంట్లో ఓపిక లేక కాదనలేకపోయాడట! అతడితో కలిసి వెళ్లి భోజనం చేశాడు. అయితే అతడికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని అప్పటినుంచి మథనపడటం మొదలుపెట్టాడు.కృతజ్ఞతతో..అలా సింధూరం సినిమా రాసుకున్నప్పుడు బ్రహ్మాజీ (Brahmaji) హీరోగా ఎందుకు చేయకూడదు? అని ఆలోచించాడు. స్టార్స్‌తో తీస్తే డబ్బులు వస్తాయి. కానీ, బ్రహ్మాజీతో తీస్తే సంతృప్తి లభిస్తుందని ఆలోచించాడు. బ్రహ్మాజీ అన్నం పెట్టాడనే కృతజ్ఞతతో అతడిని హీరోగా పెట్టి సింధూరం తీశాడు. అది పెద్దగా ఆడకపోయినా తర్వాతి సినిమాల్లో మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. అలా ఒక్కపూట అన్నం పెట్టినందుకు బ్రహ్మాజీ కృతజ్ఞత తీర్చుకున్నాడు కృష్ణవంశీ.చదవండి: చీప్ పాత్రలు చేయను: రాశీఖన్నా -
శ్రావణ భార్గవితో విడాకులు? స్పందించిన హేమచంద్ర
టాలీవుడ్ సింగర్స్ హేమచంద్ర- శ్రావణ భార్గవి విడిపోయి మూడేళ్లవుతోంది. కానీ, ఇంతవరకు ఈ విషయాన్ని ఈ జంట ధ్రువీకరించలేదు. అసలు దానిపై మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన హేమచంద్రకు విడాకుల విషయంపై ప్రశ్న ఎదురైంది.మీకేంటి ఉపయోగం?దానిపై హేమచంద్ర మాట్లాడుతూ.. విడాకుల వార్త నిజమా? కాదా? ఎవరైనా కావాలని రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారా? అన్న విషయాలు పక్కన పెడితే.. ఈ విషయం గురించి తెలుసుకోవడం వల్ల మీకేమైనా ప్రయోజనం కలుగుతుందా? ఏదైనా పనికొస్తుందంటే చెప్పండి.. అప్పుడు దీని గురించి మాట్లాడతాను. నాపై వచ్చే కామెంట్స్‌ను నేనస్సలు పట్టించుకోను. ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలనుకునే వ్యక్తిని కాదు.పనికిమాలిన విషయాలను పట్టించుకోనుమీ అందరికీ నేను సింగర్‌గా తెలుసు. ఆ పని గురించి అడగండి. నా మాటల వల్ల ఒక్కరు స్ఫూర్తి పొందినా చాలు. పనికిమాలిన విషయాల గురించి పట్టించుకోను. నా పర్సనల్ విషయాల గురించి ఎవరైనా తెలుసుకోవాలనుంటే ఒక షో ఏర్పాటు చేయండి. అక్కడ అందరం కలుసుకుందాం. నీకు ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలనుంది? అని నేను అడుగుతా.. కరెక్ట్ సమాధానం చెప్పారంటే అప్పుడు నేను జవాబిస్తాను. పెళ్లిచివరగా నేను ఏం చెప్తానంటే నాకు సమయం వచ్చినప్పుడే ఈ విషయం గురించి మాట్లాడతాను అని హేమచంద్ర చెప్పుకొచ్చాడు. హేమచంద్ర (Hema Chandra)-శ్రావణ భార్గవి 2013లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులు జంటగా యాంకరింగ్ కూడా చేశారు. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా 2016లో పాప శిఖర చంద్రిక పుట్టింది. ఎవరి దిష్టి తగిలిందో.. ఏమో.. కానీ ఈ జంట చాలాకాలంగా విడివిడిగానే జీవిస్తున్నారు.చదవండి: అలా హీరోయిన్ అయ్యా: కృతీ శెట్టి -
సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్.. ఏ ఓటీటీలో ఉందంటే?
సినిమాలకు ఏమాత్రం తగ్గని విధంగా వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయి. సినిమాలు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటే వెబ్ సిరీస్‌లు ఇంకా ముందుకెళ్లి అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌ల నిర్మాణం అధికం అవుతోంది. అలా తాజాగా జీ 5 ఓటీటీ సంస్థ రేకై అనే వెబ్ సిరీస్ ముందుకు తీచ్చింది. ప్రముఖ నవలా రచయిత రాజేశ్ కుమార్ రాసిన క్రైమ్ నవల ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్ ఇది. ఈయన ఇంతకు ముందు రాసిన పలు క్రైమ్ నవలలు బహు ప్రాచుర్యం పొందాయి.అలా ఆయన తాజాగా రాసిన నవల ఆధారంగా రూపొందిన రేకై వెబ్ సిరీస్‌కు ఎం.దినకరన్ దర్శకత్వం వహించారు. ఎస్.సింగారవేలన్ నిర్మించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌గా రూపొందింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఇంతకు ముందు పలు సినిమాలు, వెబ్ సిరీస్ రూపొందాయి. వాటికి భిన్నంగా ఉత్కంఠభరిత కథ, కథనాలతో రూపొందిన వెబ్ సిరీస్ రేకై . కథఒక ఐస్ ట్రక్ అనూహ్యంగా ప్రమాదానికి గురవుతుంది. దీంతో దాని డ్రైవర్ మృతి చెందుతాడు. అయితే ఆ ట్రక్‌లో ఓ మొండి చేయి బయట పడుతుంది. అది ఎవరిది? దాని వెనుక ఉన్న హంతకులు ఎవరన్న ఇన్వెస్టిగేషన్తో కథ మొదలవుతుంది. పోలీసుల విచారణలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయి. అదే సమయంలో ఆ మొండి చెయ్యి రేఖలతో మరో ఆరుగురి రేఖలు కనుగొనబడతాయి. దీంతో కేసు విచారణ క్లిష్టంగా మారుతుంది. మరో పక్క డిపార్టెమెంట్‌లోనూ కొందరు ప్రముఖులు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మరో పక్క మానవ అవయవాల రాకెట్ దందా పెద్ద స్థాయిలో జరుగుతోందనే విషయాన్ని పోలీస్ అధికారులు చేధించగలిగారా? లేదా? ఇలా పలు ఊహకు అందని సంఘటనలతో కథ సాగుతుంది. ఈ వెబ్ సిరీస్‌లో బాలహాసన్, పవిత్ర జనని, బోపాలన్ ప్రగదీశ్, వినోదిని వైద్యనాథన్, శ్రీరామ్.ఎం, అంజలిరావ్, ఇంద్రజిత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిరీస్ శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
హీరోయిన్ ఎలా అయ్యానంటే..: కృతీ శెట్టి
ఒక్కోసారి అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. అలా లక్‌తో హీరోయిన్ అయిన బ్యూటీ కృతీ శెట్టి. ఈ బెంగళూరు బ్యూటీ పుట్టింది మాత్రం ముంబైలో! తండ్రి వ్యాపారవేత్త, తల్లి ఫ్యాషన్ డిజైనర్. కృతీకి నటనపై ఆసక్తి ఉండటంతో తొలి ప్రయత్నంగా వాణిజ్య ప్రకటనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అదే ఈమెను హీరోయిన్ను చేసింది.ఉప్పెనతో హీరోయిన్గా17 ఏళ్ల వయసులో ఉప్పెన మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు వచ్చాయి. అలా శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి పలు చిత్రాల్లో నటించింది. వీటిలో ఒకటీరెండు సినిమాలు మాత్రమే హిట్టవడంతో అమ్మడి క్రేజ్ అమాంతం తగ్గిపోయింది.తమిళ సినిమాలుదీంతో కేవలం టాలీవుడ్‌నే నమ్ముకోకుండా తమిళ, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేస్తోంది. తాజాగా తమిళంలో జీనీ, వా వాద్దియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. కృతీ కెరీర్‌కు ఈ మూడు సినిమాల ఫలితాలు చాలా కీలకంగా మారనున్నాయి. వా వాద్దియార్లో కార్తీతో జత కట్టగా జీనీలో రవిమోహన్ సరసన నటిస్తోంది. లవ్ ఇన్సూరెన్స్‌లో ప్రదీప్ రంగనాథన్‌తో కలిసి నటించింది.హీరోయిన్ ఎలా అయ్యానంటే?వా వాద్దియార్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఓ భేటీలో పాల్గొన్న కృతీ శెట్టి.. తాను హీరోయిన్ ఎలా అయ్యానన్నది వెల్లడించింది. ఒక వాణిజ్య ప్రకటనలో నటించేందుకు ఆడిషన్స్‌కు వెళ్లానని, అది ముగిసిన తర్వాత తనను తీసుకెళ్లడానికి తండ్రి రావడం ఆలస్యమైందని పేర్కొంది. దీంతో సమీపంలో ఒక స్టూడియో కనిపిస్తే అక్కడికి వెళ్లగా, అక్కడ ఒక చిత్రం కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంది. దర్శకుడు ఫోన్ చేసి..వాళ్లు తనను చూసి సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా? అని అడిగారని గుర్తు చేసుకుంది. దీంతో తన తల్లి ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చేశానంది. ఆ తర్వాత దర్శకుడు చిట్టిబాబు ఫోన్ చేసి మాట్లాడారని, అలా తెలుగులో ఉప్పెన మూవీలో హీరోయిన్గా నటించానంది. తమిళంలో కార్తీ సరసన, ప్రదీప్ సరసన నటించడం సంతోషంగా ఉందని కృతీ శెట్టి పేర్కొంది. -
కూతురి పేరు వెల్లడించిన గేమ్ ఛేంజర్ బ్యూటీ
బాలీవుడ్ హీరోయిన్, గేమ్ ఛేంజర్ బ్యూటీ కియారా అద్వానీ ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. కియారా- సిద్దార్థ్జంటకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. శుక్రవారం నాడు పాప పేరును సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అలాగే ఓ ఫోటోను సైతం షేర్ చేశారు. మా ప్రార్థనల నుంచి మా చేతుల్లోకి వచ్చిన మా బుజ్జిపాపాయి.. సరాయా మల్హోత్రా (Saraayah Malhotra) అని రాసుకొచ్చారు. సిద్దార్థ్‌లోని స అక్షరాన్ని, కియారా(Kiara Advani) లోని యారా అక్షరాలను కలిపితే వచ్చేలా సరాయా అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. సరాయా అంటే అరబిక్‌లో యువరాణి అని అర్థం. అయితే పాప ముఖాన్ని మాత్రం చూపించలేదు. కేవలం సాక్సులు తొడిగిన పాప కాళ్లను పట్టుకున్న ఫోటో మాత్రమే షేర్ చేశారు. ఏదేమైనా కియారా జంటకు అభిమానులు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిద్దార్థా- కియారా 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 15న వీరికి కూతురు పుట్టింది.సినిమాలుసినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా తెలుగులో మాత్రం పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేశ్‌బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్‌చరణ్ సరసన 'వినయ విధేయ రామ', 'గేమ్ ఛేంజర్' చిత్రాలు చేసింది. ఈ ఏడాది హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్ 'వార్ 2' మూవీలో తళుక్కుమని మెరిసింది. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్' సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా చివరగా 'పరమ సుందరి' సినిమా చేశాడు. ప్రస్తుతం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ద ఫారెస్ట్' మూవీలో యాక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) చదవండి: -
సౌత్‌లో విలన్లుగా బాలీవుడ్ హీరోలు.. నచ్చట్లేదు!
కొంతకాలంగా సౌత్ సినిమాల్లో బాలీవుడ్ యాక్టర్స్ విలన్‌గా మెప్పిస్తున్నారు. ఈ ధోరణి తనకు నచ్చలేదంటున్నాడు ప్రముఖ నటుడు సునీల్ శెట్టి (Suniel Shetty). దక్షిణాది చిత్రాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను మాత్రమే ఆఫర్ చేయడం సబబు కాదంటున్నాడు. ద లాలంటాప్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. నాకు సౌత్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. నచ్చట్లే..కానీ ఇక్కడేం జరుగుతుందంటే మాకు నెగెటివ్ పాత్రలే ఆఫర్ చేస్తున్నారు. హిందీ హీరోలను శక్తివంతమైన విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాకు, ప్రేక్షకులకు అదే కిక్కిస్తుందని చెప్తున్నారు. నాకది ఏమాత్రం నచ్చడం లేదు. అందుకే అలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్నాను. రజనీకాంత్ దర్బార్‌లోనూ నెగెటివ్ రోల్ చేశాను. కాకపోతే రజనీ సర్‌తో కలిసి నటించాలన్న ఏకైక కోరికతోనే ఆ సినిమా ఒప్పుకున్నాను. కంటెంటే కింగ్ఈ మధ్యే 'జై' అనే తుళు సినిమా చేశాను. ప్రాంతీయ సినిమాలను ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే అందులో యాక్ట్ చేశా.. ఆ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ఈ రోజుల్లో సినిమాకు భాషా సరిహద్దులంటూ లేవు. కంటెంట్ ఒక్కటే కింగ్. కంటెంట్ బాగుందంటే అది అన్ని హద్దులు దాటుకుని విజయజెండా ఎగరేస్తుంది అని చెప్పుకొచ్చాడు. సునీల్ శెట్టి చివరగా కేసరి వీర్, నడానియన్ సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్, హెరా ఫెరి 3 మూవీస్ చేస్తున్నాడు. ఈయన తెలుగులో మోసగాళ్లు, గని సినిమాలు చేశాడు.చదవండి: తనూజతో అతి చేసిన యావర్.. చివరి కెప్టెన్ ఎవరంటే? -
కామెడీ థ్రిల్లర్.. వారం రోజులకే ఓటీటీలోకి..
థియేటర్లో రిలీజైన సినిమాలు నాలుగైదు వారాల తర్వాత కానీ ఓటీటీలోకి రావు. కానీ ఓ తెలుగు మూవీ మాత్రం కేవలం వారానికే ఓటీటీలోకి వచ్చి షాకిచ్చింది. ఆ సినిమాయే పాంచ్ మినార్. రాజ్‌తరుణ్ హీరోగా, రాశీ సింగ్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ పాంచ్ మినార్. రామ్ కడుముల దర్శకత్వం వహించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలు పోషించారు. గోవిందరాజు సమర్పణలో మాధవి, ఎంఎస్ఎం రెడ్డి నిర్మించారు. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజ్ తరుణ్ గత సినిమాలకంటే ఈ మూవీకి మంచి టాక్ వచ్చింది. అయినప్పటికీ కేవలం వారం రోజుల్లోనే ఓటీటీలో రిలీజ్ చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్ సర్ప్రైజ్గా స్ట్రీమింగ్కు తీసుకొచ్చారు.కథేంటంటే..కిట్టు (రాజ్ తరుణ్) నిరుద్యోగి. ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకుంటాడు. బిట్‌కాయిన్ స్కామ్ ఐదు లక్షలు పోగొట్టుకుంటాడు. ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఒకసారి ఇద్దరు హంతకులు కిట్టు క్యాబ్ బుక్ చేసుకుని అతడి ముందే ఓ హత్య చేస్తారు. వాళ్ల ముందు చెవిటివాడిగా నటించి తప్పుకున్న కిట్టు తర్వాత ఏం చేశాడు? అదేరోజు కిట్టుకు కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? దాంతో ఏం చేశాడు? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: బిగ్‌బాస్ హౌస్ చివరి కెప్టెన్ ఎవరంటే? -
రజనీకాంత్ సినిమాలో సాయిపల్లవి?
తమిళ సినిమా మూలస్తంభాలైన కమల్ హాసన్, రజనీకాంత్‌ల కాంబినేషన్లో ఇంతకుముందు దాదాపు 11 సూపర్ హిట్ చిత్రాలు రూపొందాయి. ఆ తర్వాత సూపర్‌స్టార్ ఇమేజ్ కారణంగా ఇద్దరూ వేర్వేరుగా నటిస్తూ వచ్చారు. అలాంటిది సుదీర్ఘకాలం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి నటించడానికి సిద్ధమయ్యారు. రజనీ హీరోగా, కమల్ నిర్మాతగాఅయితే దీనికంటే ముందు కమల్‌హాసన్(Kamal Haasan) తన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్న చిత్రంలో రజనీకాంత్ హీరోగా (#Thalaivar 173) నటించనున్నారు. దీనికి సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. కానీ, తర్వాత అనూహ్యంగా సుందర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి వైదొలగుతున్నట్లు మీడియా ద్వారా ఒక లేఖను విడుదల చేసి షాకిచ్చారు. దీంతో ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనే ఆసక్తి నెలకొంది.సాయిపల్లవి?పార్కింగ్ చిత్రంతో జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు పొందిన రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించబోతున్నారనేది లేటెస్ట్ టాక్. ఈ భారీ బడ్జెట్ మూవీలో సాయిపల్లవి నటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మరో నటుడు ఖదీర్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
బ్లూ, ఎల్లో కలిస్తే గ్రీన్ ఒస్తాది.. సాంగ్ విన్నారా?
టాలీవుడ్ నటుడు, నందు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సైక్ సిద్దార్థ (Psych Siddhartha Movie). పేరుకు తగ్గట్లే సినిమాలో బూతులకు కొదవే లేదు. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యామిని భాస్కర్ హీరోయిన్. ఇటీవల రిలీజైన టీజర్ మొత్తం బూతులతోనే నిండిపోయింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. బ్లూ ఎల్లో కలిపితే రెడ్ అవుతాది అంటూ సాగే ఈ పాట వెరైటీగా ఆకట్టుకుంటోంది.వదిలేసి వెళ్లిపోయిందిసిగరెట్స్ లంగ్స్‌కు అస్సలు మంచిది కాదు.. అయినా అందరూ ఇంటర్వెల్లో కాలుస్తారు. ఆల్కహాల్.. లివర్‌కు అస్సలు మంచిది కాదు. అయినా అందరూ బేబీ సినిమా చూసొచ్చి తాగుతారు. అట్లనే లవ్.. హార్ట్‌కు అస్సలు మంచిది కాదు. అయితే మీరందరు లవ్ చేసిర్రని తెలుసు.. నేను కూడా అట్లనే చేశిన.. కానీ, ఆమె నన్ను వదిలేసి వెళ్లిపోయిందిరా అంటూ ఏడుపందుకున్నాడు నందు. ఆ తర్వాత అసలు పాట మొదలైంది.కలర్స్ సాంగ్'బ్లూ, ఎల్లో కలిసినాయంటే గ్రీన్ ఒస్తాది.. రెడ్, ఎల్లో కలిసినాయంటే ఆరెంజ్ ఒస్తాది.. బ్లాక్.. నలుపాయే జిందగీ నువ్వెళ్లిపోతే చెలి' అంటూ పాట సాగింది. స్మరణ్ సాయి సంగీతం అందించిన ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించాడు. పాట వెరైటీగా భలే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: దండం పెడ్తా.. పంపించు బిగ్‌బాస్: అడుక్కున్న సోహైల్ -
6 ఏళ్లకే నటిగా.. 19 ఏళ్ల వయసులో హీరోయిన్గా!
చిన్న వయసులో వెండితెరపై అడుగుపెట్టి తర్వాత హీరోయిన్గా రాణించినవారు చాలామంది ఉన్నారు. పైన కనిపిస్తున్న ఈ క్యూట్ పాప కూడా మొదట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసింది. 20 ఏళ్లు కూడా నిండకముందే హీరోయిన్గా సినిమాలు చేసింది. ఇంతకీ తనెవరో గుర్తుపట్టారా? ఆ పాపే 'బుట్టబొమ్మ' అనిఖా సురేంద్రన్ (Anikha Surendran). చైల్డ్ ఆర్టిస్ట్‌గా..ఈ మలయాళ కుట్టి బాలనటిగా యాక్ట్ చేసిన మొదటి చిత్రం 'కద తుదరున్ను'. అప్పుడు తన వయసు ఆరేళ్లే! విశ్వాసం సినిమాలో అజిత్- నయనతార కూతురిగా నటించింది. అప్పటినుంచి తనను కుట్టి నయనతార అని పిలుస్తూ ఉంటారు. ఈమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మలయాళ, తమిళ భాషల్లో దాదాపు 15 సినిమాలు చేసింది. తెలుగులో ద ఘోస్ట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెరిసింది. 19 ఏళ్ల వయసులో బుట్టబొమ్మ సినిమాతో హీరోయిన్గా మారింది. కానీ, తర్వాత మళ్లీ తెలుగులో కనిపించనేలేదు. సినిమాలుమలయాళంలో ఓ మై డార్లింగ్, కింగ్ ఆఫ్ కొత్త.. తమిళంలో నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం(తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా), ఇంద్ర, పీటీ సర్ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళంలో ఒకే ఒక మూవీ చేస్తోంది. యూట్యూబర్‌లో రెండు,మూడు షార్ట్ ఫిలింస్ కూడా చేసింది. రెండేళ్ల క్రితం ఆమె చనిపోయినట్లు ఓ పోస్టర్ వైరలయింది. అది చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకయ్యారు. కానీ అది రియల్ పోస్టర్ కాదు, రీల్ పోస్టర్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ బుట్టబొమ్మ తెలుగులో మళ్లీ ఎప్పుడు సినిమాలు చేస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) చదవండి: హిట్టు మూవీ.. థియేటర్లలో ఫ్రీ టికెట్ -
హిట్టు మూవీ.. ఫ్రీగా చూసేయండి.. థియేటర్ల లిస్ట్ ఇదే!
రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie).. చాలామంది ఈ సినిమా మీద మనసు పారేసుకున్నారు. జనాలను అంత బాగా మెప్పిస్తోందీ చిత్రం. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి ఘన విజయాన్ని సాధించింది. తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకుల కోసం చిత్రయూనిట్ ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. మహిళందరికీ ఉచితంగా సినిమా చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఫ్రీ టికెట్ తీసుకోండిఈ విషయాన్ని నిర్మాత వేణు ఊడుగుల సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో ఏ థియేటర్‌కు అయినా వెళ్లండి. కౌంటర్ దగ్గరకు వెళ్లి ఫ్రీ టికెట్ తీసుకోండి.. ఉచితంగా సినిమా చూడండి.. ఈ ఆఫర్ కేవలం మహిళలకు మాత్రమే అని ట్వీట్ చేశాడు. మరో ట్వీట్లో ఏరియా.. అక్కడున్న థియేటర్ల వివరాలను సైతం పొందుపరిచాడు. ఆ లిస్ట్ కింద చూసేయండి..థియేటర్ల లిస్ట్విశాఖపట్నం: శ్రీ కన్య, జగదాంబవిజయనగరం: కృష్ణరాజమండ్రి: ఊర్వశి కాంప్లెక్స్కాకినాడ: పద్మప్రియ కాంప్లెక్స్శ్రీకాకుళం: సూర్య మహల్తణుకు: శ్రీ వెంకటేశ్వరఏలూరు: అంబిక కాంప్లెక్స్విజయవాడ: స్వర్ణ కాంప్లెక్స్గుంటూరు: బాలీవుడ్ఒంగోలు: గోపిమచిలీపట్నం: సిరి కృష్ణనెల్లూరు: సిరి మల్టీప్లెక్స్కావలి: లత 2 షోస్, మానస 2 షోస్చిత్తూరు: గురునాథ్తిరుపతి: జయ శ్యామ్కర్నూలు: ఆనంద్నంద్యాల: నిధికడప: రవిరాయచోటి: సాయిఅనంతపురం: ఎస్వీ సినీ మాక్స్హిందూపూర్: గురునాథ్సినిమాఈ ఆఫర్ ఈరోజు (నవంబర్ 27న) మాత్రమే వర్తిస్తుంది. సినిమా విషయానికి వస్తే.. అఖిల్, తేజస్విని జంటగా నటించిన మూవీయే రాజు వెడ్స్ రాంబాయి. సాయిలు కంపాటి దర్శకత్వం వహించగా వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల చేశారు. ఈ చిత్రం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.చదవండి: సాయిలు సవాల్ విని భయమేసింది: దర్శకుడు బాబీ -
'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విటర్ రివ్యూ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన తాజా చిత్రం'ఆంధ్ర కింగ్ తాలూకా'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య నేడు(నవంబర్ 27) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Andhra King Taluka Talk)ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్డ్డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ‘రామ్ ఖాతాలో హిట్ పడిందా? ఆంధ్రకింగ్ తాలుకా కథేంటి? ఎలా ఉంది? తదితర అంశాలను ఎక్స్‌లో చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. (Andhra King Taluka Movie Twitter Review)ఎక్స్‌లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమా బాగుందని..రామ్ వన్‌మ్యాన్ షో అని నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మహేశ్ మరోసారి హార్ట్‌ఫుల్ డ్రామాని తెరకెక్కించారని ప్రశంసిస్తున్నారు. నిడివి కాస్త ఎక్కువ ఉండడం, ఫస్టాఫ్ నెమ్మదిగా సాగడం మైనస్ అని చెబుతున్నారు. #AndhraKingTaluka A Satisfactory Fanism/Love Story that’s predictable and too lengthy, yet maintains a decent feel-good vibe throughout!The film blends a hero & fan track with a love story to form an interesting drama. Both halves stay true to the core storyline and offer a few…— Venky Reviews (@venkyreviews) November 27, 2025 ఆంధ్రకింగ్ ఊహించదగ్గ ఫ్యానిజమ్, లవ్‌స్టోరి. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. దర్శకుడు మహేశ్ మరో మంచి హార్ట్‌ఫుల్ డ్రామాని తెరకెక్కించాడు. రామ్ నటన అదిరిపోయింది. సినిమాలో హీరో పాత్రకి ఉపేంద్రని ఎంపిక చేయడం సరైన నిర్ణయం. అద్భుతంగా నటించాడు. ఊహకందేలా ఉన్నప్పటికీ..చాలా నిజాయితీగా ఈ కథను చెప్పారంటూ ఓ నెటిజన్ 2.75 రేటింగ్ ఇచ్చాడు. Chala manchi Katha...Chala manchi cinema...Every fan of any hero will easily connect to it...Writing chala bavundhi...A small parallel that is drawn in 2nd half is too beautiful...A Meaningful and Heartwarming STAR - FAN story...BONAFIDE BLOCKBUSTER 💯 RAPO🤩❤️ #AndhraKingTaluka— SRUJAN (@SRUJAN_JGM) November 27, 2025 చాలా మంచి సినిమా. ప్రతి హీరో అభిమాని ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడు. రైటింగ్ చాలా బాగుంది. సెకండాఫ్ అద్భుతంగా ఉంటుంది. మినింగ్ఫుల్& హార్ట్‌వార్మింగ్ స్టార్-ఫ్యాన్ స్టోరీ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.#AndhraKingTaluka Review : "Emotional & Engaging"Rating: (3/5)⭐️⭐️⭐️Positives:👉#RamPothineni delivers one of his finest performance👉Strong dialogues & Solid writing by @filmymahesh 👉Soulful songs & Second half👉The Climax lands beautifully, leaving a warm impact…— PaniPuri (@THEPANIPURI) November 26, 2025 ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ మూవీ ఇది. రామ్ తన ఫెర్మార్మెన్స్‌తో అదరగొట్టాడు. డైలాగులు బాగున్నాయి. పాటలు, సెంకడాఫ్ బ్యూటిఫుల్‌గా ఉంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగడం మైనస్. ఓవరాల్‌గా ఆంధ్రకింగ్ చాలా బాగుంది అంటూ మరో నెటిజన్ 3 రేటింగ్ ఇచ్చాడు.💥 Comeback confirmed! #AndhraKingTaluka is winning hearts with its emotional depth & layered storytelling.🔥 First half sets the tone, second half hits hard with drama & that Ramayanam scene everyone’s talking about!What’s your favorite moment so far? Drop it below! 👇— Brat Dot AI (@BratDotAI) November 27, 2025#AndhraKingTaluka – Raka RakaAa mass oobi nundi bayatiki vachchi, kothaga decent ga cinema chesadu.E cinema ni mundu theatre lo enjoy cheyandi.Own fans definitely enjoy chestaru,Movie lovers ki kuda maximum ga convincing ga untundi.I hope it makes some good profits 😊 pic.twitter.com/7jTnyN8t5f— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) November 26, 2025#AndhraKingTalukaReview:The first half is decently engaging with a well written hero fan relationship even though they do not meet. The chemistry between #RamPothineni and Bhagyashri Borse feels sweet and natural. Ram is really good and delivers one of his finest performances…— Movies4u Reviews (@Movies4uReviews) November 27, 2025@ramsayz anna, #AndhraKingTaluka was an absolute BLAST! 🔥Pure emotion, fun, vibes, and full-on entertainment.#Jagadam has always been my all-time favorite… and this gave me that same emotional high.You delivered on another level, anna. Please keep giving us gems like this 🤗— శ్రీ (@SreeNTR_12) November 27, 2025 -
కలిసిరాని సినిమాలు.. స్టార్ హీరోయిన్ అయ్యేదెప్పుడో?
కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు.. హీరోయిన్ ప్రియాంక మోహన్ (Priyanka Mohan) పరిస్థితి కూడా ఇదే! బెంగళూర్‌కు చెందిన ఈ మూడు పదుల భామ 2019లో మాతృభాష (కన్నడం)లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత టాలీవుడ్‌పై బ్యూటీ దృష్టి పడింది. అలా నాని గ్యాంగ్‌లీడర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఆ చిత్రం విజయంతో శ్రీకారం అనే చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ, ఈ మూవీ నిరాశ పరిచింది.బ్రేక్అయినా ప్రియాంక మోహన్‌ను లక్కు వదలలేదు. వెంటనే శివకార్తికేయన్‌కు జంటగా డాక్టర్ అనే చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం హిట్ అవ్వడంతో అదే హీరోతో డాన్ అనే మరో చిత్రం చేసింది. అది సూపర్‌హిట్ అయ్యింది. ఆ తరువాతనే బ్రేక్ పడింది. సూర్యకు జంటగా నటించిన ఎదర్కుం తునిందవన్ చిత్రం నిరాశ పరచింది. ఆ తరువాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఈ అమ్మడికి తెలుగులో సరిపోదా శనివారం చిత్రం విజయం కాస్త ఊరటనిచ్చింది. ఉపయోగపడని ఓజీపవన్కల్యాణ్కు జంటగా ఓజీ చిత్రంలో నటించే అవకాశం రావడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వస్తుందని తెగ సంబరపడిపోయిందనే చెప్పాలి. అయితే ఆ చిత్రం హిట్ అనిపించుకున్నా, ప్రియాంక మోహన్ కెరీర్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదు. అంతే కాదు తెలుగులో ఇప్పటి వరకూ మరో అవకాశం రాలేదు. తమిళంలో జయంరవికి జంటగా నటించిన బ్రదర్ చిత్రం బోల్తా పడింది. ఆ తరువాత నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడీ కోపం చిత్రంలో గోల్డెన్ స్పారో అనే ప్రత్యేక పాటలో యాక్ట్ చేసింది. ఆ చిత్రం ఈమె కెరీర్‌కు ఉపయోగపడలేదు. ఈ సినిమాలపైనే ఆశలుకాగా ప్రస్తుతం కెవిన్‌కు జంటగా ఒక చిత్రం, మేడ్ ఇన్ కొరియా అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. వీటిలో ఏదైనా హిట్ అయితేనే ప్రియాంకమోహన్‌కు మరిన్ని అవకాశాలు వస్తాయనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. కాగా సుమారు ఐదేళ్ల తరువాత మాతృభాషలో నటించే అవకాశం ఆ బ్యూటీని వరించింది. ఇలా తమిళం, తెలుగు, కన్నడం, భాషల్లో గత ఆరేళ్లుగా నటిస్తున్నా ఇంకా స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతోంది. -
సోషియో ఫాంటసీ కథతో ‘వానర’
అవినాశ్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్న "వానర" సినిమా సోషియో ఫాంటసీ కథతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు రాబోతోంది."వానర" చిత్రాన్ని శంతను పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాశ్ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కాబోతోంది. ఈ రోజు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో అవినాశ్ బైక్ పై వెళ్తుండగా, ఆయనను రక్షణగా హనుమంతుడు వెంటే వెళ్తున్న స్టిల్ ఆసక్తి కలిగిస్తోంది. "వానర" సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. -
ఏఐ వీడియో.. ప్రభాస్-అనుష్క పెళ్లి.. చిందులేసిన బన్నీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)..ఇప్పుడు ప్రపంచాన్ని కింగ్‌లా శాసిస్తుంది. విద్య, వైద్య.. ఇలా అన్ని రంగాల్లోనూ ఇది ప్రవేశించింది. సాధారణ ప్రజలు కూడా వారి దైనందిన జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో సాధ్యం కానిది ఏమున్నది అన్నట్లుగా తమ ఆలోచనలకు నెటిజన్లు రూపమిస్తున్నారు. తాము కోరుకున్నది నిజజీవితంలో కాకపోతే.. ఏఐ రూపంలో అది నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా తమ అభిమాన నటీనటులు విషయంలో ఈ టెక్నాలజీని బాగా వాడేస్తున్నారు. తమ ఫేవరేట్ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారు..అలా ఫోటోలను ఎడిట్ చేస్తున్నారు. అంతేకాదు తమకు నచ్చిన హీరోహీరోయిన్లకు ఈ టెక్నాలజీతో పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. గతంలో ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రభాస్‌కి పెళ్లి జరిగి..పిల్లలు పుడితే వాళ్లు ఎలా ఉంటారనేది చూపించారు. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఏఐ టెక్నాలజీతో వెండితెరపై సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలకు పెళ్లి జరిపించారు. అంతేకాదు ఈ పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరోలంతా తలో ఓ పని చేశారు.ప్రభాస్-అనుష్కల పెళ్లికి నాగార్జున-నాని సన్నాయి వాయించగా.. అల్లు అర్జున్, రవితేజ చిందులేశారు. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటలు చేయగా..గోపిచంద్ వడ్డించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్ బంతి భోజనం చేశారు. కాజల్, తమన్నా పెళ్లి మండపంలో డ్యాన్స్ చేస్తుండగా.. మహేశ్ బాబు, వెంకటేశ్ పంచ కట్టుతో పెళ్లికి హాజరయ్యారు. ప్రభాస్-అనుష్కల పెళ్లి ..అందరూ ఆహ్వానితులే అంటూ ఓ నెటిజన్ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇది వాస్తవం అయితే ఎంత బాగుండేదో.. అని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. Prabhas weds Anushka🥰అందరు ఆహ్వానితులే 🙏🏻#Prabhas #AnushkaShetty pic.twitter.com/7tsH0vVrRN— 🧚 NIMMI 💫✨🐦 (@AlwaysNirmala_) November 26, 2025 -
నలుగురిలో నవ్వులు.. నాలుగోడల మధ్య నరకం
సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం... తెరపై హీరోయిన్లు మెరిసే నక్షత్రాల్లా కనిపిస్తారు. అందం, గ్లామర్, అభిమానుల ఆరాధన – ఇవన్నీ వారి జీవితంలో బయటి ముఖం మాత్రమే. కానీ ఆ కెమెరాలు ఆఫైన తర్వాత, ఆ లైట్లు ఆరిపోయిన తర్వాత... చాలా మంది తారలు తమ ఇంటి నాలుగు గోడల్లో తీవ్రమైన గృహహింసకు గురవుతున్నారు.సాధారణ గృహిణులతో పోల్చితే వీరి బాధ రెట్టింపు – ఎందుకంటే వారి నొప్పి ప్రైవేట్‌గా మిగలకుండా, మీడియా ట్రయల్‌గా మారుతుంది. అందుకే కొందరు కెరీర్ నాశనం అవుతుందనే భయంతో ఆ బాధను భరిస్తున్నారు... మరికొందరు మాత్రం ధైర్యంగా న్యాయస్థానాలను ఆశ్రయించి, తమ భర్తలపై గృహహింస కేసులు పెట్టి ఇతర మహిళలకు ప్రేరణగా నిలుస్తున్నారు.తాజాగా బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై గృహహింస కేసు పెట్టారు. గృహహింస, క్రూరత్వం, మోసపూరిత చర్యలకు పాల్పడినందుకు గాను ఆమె ఈ కేసు పెట్టి.. రూ. 50 కోట్ల నష్ట పరిహారం అడిగారు. సెలీనా జైట్లీ మాదిరే గతంలోనూ పలువురు బాలీవుడ్ తారలు తమ భర్తలు పెట్టే హింసను భరించలేక న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం.రతి అగ్నిహోత్రి1980లలో బాలీవుడ్లో హీరోయిన్గా రాణించిన రతి, 1985లో అనిల్ విర్వానీని వివాహం చేసుకున్న తర్వాత 30 సంవత్సరాలు శారీరక, మానసిక హింసకు గురయ్యారు. 2015లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసి, గృహ హింస కేసు దాఖలు చేశారు. ఆమె కుమారుడు వితర్ణ్ సహాయంతో ఈ అంశాన్ని బయటపెట్టారు.కరిష్మా కపూర్సూపర్స్టార్ కరణ్ జోహర్ సోదరి కరిష్మా తన మాజీ భర్త సంజయ్ కపూర్‌తో విడాకుల సమయంలో భావోద్వేగ, శారీరక హింసను ఆరోపించింది. "నన్ను వస్తువులా చూశారు" అని చెప్పుకుంది. డైవోర్స్ తర్వాత కూతుళ్ల కస్టడీ కోసం ఇంకా లీగల్ ఫైట్ లో ఉంది. కాగా, కరిష్మా, సంజయ్‌ల వివాహం 2003లో జరగ్గా.. పదేళ్ల తర్వాత 2014లో విడాకులు తీసుకున్నారు.యుక్తా మూక్కే:మిస్ వరల్డ్ 1999 యుక్తా తన భర్త ప్రిన్స్ తులి మీద 2013లో గృహహింస కేసు పెట్టింది. కొట్టడంతో పాటు మాటలతో మానసికంగా వేధించాడంటూ భర్తపై కేసు పెట్టింది. ‘పిల్లల కోసం సహించాను, కానీ ఇక భరించలేను’ అంటూ అప్పట్లో యుక్తా ఎమోషనల్ అయింది.శ్వేతా తివారీ టీవీ సీరియల్స్‌లో ప్రసిద్ధి చెందిన శ్వేతా, మొదటి భర్త్ రాజా చౌధరీ మీద 2009లో గృహ హింస కేసు పెట్టి విడాకులు తీర్చుకున్నారు. రెండో భర్త్ అభినవ్ కోహ్లీ మీద కూడా హింస ఆరోపణలు చేశారు. ఆమె కథ ధైర్యానికి చిహ్నం.రాఖీ సావంత్ బిగ్ బాస్ స్టార్ రాఖీ, 2023లో భర్త్ అదిల్ ఖాన్ దుర్రానీ మీద గృహ హింస, మోసం కేసులు దాఖలు చేశారు. వివాహం తర్వాత 8 నెలల పాటు తనను శారీరకంగా వేధించాడని, ప్రైవేట్ ఫోటోలు లీక్ చేశారని ఆరోపించారు. ఈ కేసులో అదిల్ అరెస్టయ్యారు.డింపీ గంగూలీ'బిగ్ బాస్' ఫైనలిస్ట్ డింపీ, 2014లో భర్త్ రాహుల్ మహాజన్ మీద శారీరక హింస కేసు దాఖలు చేశారు. చేతులు, కాళ్లు గాయపడిన ఫోటోలు వైరలయ్యాయి. గన్ చూపించి బెదిరించాడని ఆరోపించారు. -
ఓటీటీలోకి అనుపమ పరమేశ్వరన్ కామెడీ థ్రిల్లర్
అనుపమ పరమేశ్వరన్ నటించిన తాజా మలయాళ కామెడీ థ్రిల్లర్ ‘ది పెట్ డిటెక్టివ్’. షరాఫుద్దీన్, వినాయకన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రణీష్ విజయన్ దర్శకత్వం వహిచారు. అక్టోబర్ 16న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దాదాపు ఐదు వారాల తర్వాత ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా కథ విషయానికొస్తే.. జోస్ అలులా (షరాఫుద్దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు. కథలోని హాస్యం, విచిత్రమైన పాత్రలు, ఊహించని మలుపులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. -
ఇంతకన్నా అవమానం ఉంటుందా?: నిర్మాత ఎమోషనల్
ఒక్క షో ఆడదన్నారు.. ఈరోజు జనం మా సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు అంటూ ఎమోషనలయ్యాడు దర్శకనిర్మాత వేణు ఊడుగుల. ఈయన రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai Movie). అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ మూవీకి సాయిలు కంపాటి దర్శకత్వం వహించాడు. మంగళవారం నాడు సినిమా సక్సెస్ మీట్ జరగ్గా ఈ కార్యక్రమానికి హీరో శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బివిఎస్ రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దొంగల్లా పరిగెట్టారుఈ సందర్భంగా నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ.. సినిమాను కొంతమందికి చూపించాం. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లాంటి పెద్దమనిషిని పిలిచాం. వాళ్లతోపాటు ఓ ఐదుగురు చెప్పా పెట్టకుండా వచ్చారు. వారిని మేము పిలవనేలేదు. ఇంటర్వెల్ అవగానే సడన్‌గా లేచి వెళ్లిపోయారు. దొంగల్లాగా పరిగెడుతున్నారు. వాళ్లు నాక్కూడా పరిచయం ఉన్నవాళ్లే! థియేటర్లో అంతమంది ఎదుట అలా వెళ్లిపోతుంటే వారి మూడ్ చెడిపోదా? ఒక ఫిలింమేకర్కు ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంతకన్నా అవమానం ఇంకేదైనా ఉంటుందా? అదసలు మర్యాదగా ఉందా?గుండెల్లో పెట్టుకున్నారుమావాళ్లేమన్నారంటే.. ఇది అందరికీ నచ్చే సినిమా కాదు, పోనివ్వండి అన్నారు. వెళ్లిపోయాక రెండుమూడు రోజులు నెగెటివ్ ప్రచారం చేశారు. వాడు డైరెక్టరే కాదు, సినిమా తీయడమే రాలేదు. అది సినిమానే కాదు, ఒక్క షో ఆడదన్నారు. కానీ, ఈరోజు జనాలు సినిమాను గుండెల్లో పెట్టుకున్నారు. సినిమా హిట్టయిందన్న బలుపుతో ఇదంతా చెప్పడం లేదు. సినిమాకు కనీస మర్యాద ఇవ్వాలని చెప్తున్నాను అంతే! ఎవరు ప్రివ్యూకి పిలిచినా వెళ్లండి, కానీ మధ్యలో వచ్చేయకండి అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం -
నీ ప్రేమ మళ్లీ కావాలి బాపూ.. దర్శకుడు భావోద్వేగం
తెలుగు దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కిష్టయ్య (73) మరణించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తన నివాసంలో కన్నుమూశారు. కిష్టయ్య మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. తండ్రి మరణవార్తను సంపత్ నంది సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులుబాపును తల్చుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. బాపు.. నువ్ లేకుండానే తెల్లారింది. నువ్ లేకుండానే ఓదెల లేచింది.. నువ్ లేకుండానే ఇల్లూ లేచింది. కల్లాపితో తడవాల్సిన వాకిలి కన్నీళ్ళతో తడిచింది.. “ఎట్లున్నవ్” అని అడగాల్సిన మనుషులు.. “ఎట్ల పోయాడు” అని అడుగుతున్నారు. ఎక్కెక్కి ఏడుస్తున్న గొంతులు విని నీ గుండె మళ్లీ కదిలితే ఎంత బావుండు! చిన్నప్పుడు జబ్బు చేస్తే ఆయుర్వేద వైద్యం కోసం భుజంపై 10km ఎత్తుకెళ్లింది మొన్నే కదా అనిపిస్తోంది. భుజంపై ఎత్తుకెళ్లావ్గంగుల కనకయ్య చుక్కల థియేటర్ లో నన్ను ఖైదీ సినిమాకు పంపించింది నిన్నే కదా అనిపిస్తోంది. నువ్ నేర్పిన ఎడ్ల బండి నడక.. మనం దున్నిన జంబు అరక.. పత్తి మందుకు పంపు.. పల్లి చేను లో సద్ది.. మిరప నారుతో నాటు.. బురద పొలం లో జలగల తో పాట్లు.. ఇక అన్నీ జ్ఞాపకాలేనా? దసరాకు నేనొస్తున్నానని తెలియగానే రాపు దగ్గర నీ ఎదురుచూపులు.. మేమొచ్చామని బగార, నీర కల్లు ఏర్పాట్లు.. ఏ సినీ అభిమాని ఇంటికొచ్చినా నా ఫోన్ నంబరిచ్చి ఇచ్చి మావోడి దగ్గరికెళ్లమని నువ్వు ఇచ్చే ప్రోత్సాహం.. ఇక అన్నీ గుర్తులేనా? నీ ప్రేమ నాకు మళ్లీ కావాలిఇప్పటివరకూ నేను తీసిన సినిమాలు తప్ప వేరే ఏ సినిమా థియేటర్ లో చూడని నీ ప్రేమ నాకు మళ్లీ కావాలి.. నీకు నలుగురు పిల్లలున్నారు.. వాళ్ళకీ పిల్లలున్నారు.. ఏ కడుపునైనా ఎంచుకో.. ఏ గడపనైనా పంచుకో.. కానీ మళ్లీ రా.. అంటూ ఎమోషనలయ్యాడు. సంపత్ నంది విషయానికి వస్తే ఏమైంది ఈవేళతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్ సినిమాలకు తెరకెక్కించాడు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల 2, బ్లాక్ రోజ్ చిత్రాలకు కథ అందించాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా 'భోగి' సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Sampath Nandi (@isampathnandi) -
నటికి లవ్ లెటర్ రాశా: శివాజీ రాజా
చిన్న సినిమాగా వచ్చిన "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ (Raju Weds Rambai Movie)కి మంచి ఆదరణ లభిస్తోంది. మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో సీనియర్ నటుడు శివాజీ రాజా ఓ సరదా విషయాన్ని బయటపెట్టాడు.ప్రేమలేఖశివాజీ రాజా మాట్లాడుతూ.. అనిత చౌదరి, నేను చాలా సినిమాలు చేశాం. మురారి సమయంలో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. దర్శకుడు కృష్ణవంశీ ఖాళీగా కూర్చోకుండా ఓ లవ్ లెటర్ రాయమన్నాడు. అచ్చ తెలుగు భాషలో, పశ్చిమ గోదావరి యాసలో అనితకు ప్రేమలేఖ రాశా.. ఆమె ఒక్కతే చదువుకోవచ్చుగా! ఆస్పత్రిలో ఉండగా నా భార్యకు..యూనిట్ అందరికీ ఇచ్చింది. నాకు యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో ఉంటే అక్కడికి వచ్చి నా భార్యకు లవ్‌లెటర్ చూపించింది అని గుర్తు చేసుకున్నాడు. గతంలో ఎన్నో సినిమాల్లో జంటగా నటించిన శివాజీ రాజా- అనిత.. రాజు వెడ్స్ రాంబాయి మూవీలో భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. అనిత.. గోల్మాల్, సంతోషం, నువ్వే నువ్వే, ఉయ్యాల జంపాల, వరుడు, మన్మథుడు, తులసీదళం వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే పలు సీరియల్స్ చేసింది.సినిమాశివాజీ రాజా.. ప్రేమంటే ఇదేరా, పెళ్లి సందడి, మావిచిగురు, నిన్నే ప్రేమిస్తా, మురారి, నరసింహనాయుడు, నీ స్నేహం, వర్షం, మొగుడ్స్ పెళ్లాంస్ ఇలా అనేక సినిమాలు చేశాడు. బుల్లితెరపై అమృతం సీరియల్లో యాక్ట్ చేశాడు. అలాగే మరికొన్ని ధారావాహికల్లోనూ మెప్పించాడు.చదవండి: అమ్మను అవమానించారు: మృణాల్ ఠాకూర్ -
అమ్మను కారులో ఎక్కనివ్వకుండా అవమానించి...
చిత్రపరిశ్రమలో కష్టపడి పైకొచ్చిన వారు చాలామంది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కూడా ఈ కోవకు చెందిన వారే! ఈ విషయాన్ని ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో స్వయంగా పేర్కొన్నారు. మరాఠి, హిందీ చిత్రాల్లో నటిస్తూ ఆ తరువాత సీతారామమ్ చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. మధ్య తరగతి అమ్మాయినిఅలా తెలుగులో వరుస అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలతో పాటు నాలుగు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ భామ బెంజ్ కారు కొన్నారట. దీని గురించి మృణాల్‌ఠాకూర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను చాలా మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని అని చెప్పారు. అవమానంచిన్నతనంలో తల్లితో కలిసి బంధువుల వేడుకకు వెళ్లానని.. అక్కడ తమ బంధువులు కారులో వెళుతూ తన తల్లిని ఎక్కించుకోకుండా చాలా అవమానించారని పేర్కొన్నారు. అప్పుడే తాను ఒక కారు కొనాలని నిర్ణయించుకున్నానని, అది ఇప్పటికి నెరవేరిందని చెప్పారు. ఇప్పుడు తమ బంధువుల్లో బెంజ్ కారు ఉన్నది తమకు మాత్రమేనని మృణాల్ పేర్కొన్నారు. -
బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలుసా..?
బాలీవుడ్ లెజెండ్, 'హీ-మ్యాన్' ధర్మేంద్రకు కేవలం నటనపైనే కాదు, ఆహారం, ఆతిథ్యంపై కూడా మక్కువ ఎక్కువ. ఆయన సినీ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, పంజాబీ కల్చర్ ను ప్రతిబింబించేలా ప్రారంభించిన రెస్టారెంట్ ప్రాజెక్టే ఈ 'గరం ధరం - ధాబా తే ఠేకా'.రెస్టారెంట్ ప్రత్యేకతలు ఇవే.. 'గరం ధరం ధాబా' కేవలం భోజనశాల కాదు, ధర్మేంద్ర అభిమానులకు ఒక ఆలయం లాంటిది. ధర్మేంద్ర వ్యక్తిత్వం, ఆయన నటించిన సినిమా లలోని ముఖ్య ఘట్టాలు, డైలాగ్‌లు ఈ ధాబాలోని ప్రతి గోడపై కనిపిస్తాయి.సందర్శకులను ఆకర్షించే థీమ్..ఈ రెస్టారెంట్ మొత్తం బాలీవుడ్ థీమ్‌తో అలంకరించి ఉంటుంది. ధర్మేంద్ర క్లాసిక్ చిత్రాల పోస్టర్లు, అద్భుతమైన డైలాగ్స్ గోడలపై కనిపిస్తాయి.ఐకానిక్ ఆర్ట్ వర్క్స్.. ధర్మేంద్ర వివిధ రూపాల పోర్ట్రెయిట్లు, గ్రాఫిటీ ఆర్ట్ ఈ స్థలాన్ని నింపుతాయి. 'షోలే' సినిమాలోని ప్రసిద్ధ 'ట్యాంకీ' సీన్, జై-వీరు ప్రయాణించిన ఐకానిక్ కారు మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.'దేశీ' ఇంటీరియర్ తో..ఇటుక గోడలు, రంగుల దీపాలు, పాతకాలపు హెడ్‌లైట్స్, చేతిపంపులు వంటివి ధాబాకు దేశీ రూపాన్ని ఇస్తాయి. హర్యానాలోని ముర్తల్‌లో ప్రారంభించిన మొట్టమొదటి అవుట్లెట్ 1,200 మంది కూర్చునే సామర్థ్యంతో, 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారతదేశంలోనే అతిపెద్ద ధాబాగా ప్రసిద్ధి చెందింది.రుచికరమైన ఆహారం, దేశీ ఫ్లేవర్స్.. ఈ ధాబాలో నార్త్ ఇండియన్, పంజాబీ వంటకాలకు పెద్ద పీట వేస్తారు. రుచిలో రాజీ పడకుండా, ఇంటి భోజనాన్ని తలపించేలా ఇక్కడ వడ్డిస్తారు.మఖానీ పరాఠాలు, దాల్ మఖానీ, గలోటి కబాబ్‌లు, తందూరి పనీర్ టిక్కా, బిర్యానీ, వివిధ రకాల రుచికరమైన కూరలు ఇక్కడ లభిస్తాయి.ప్రత్యేక మెనూ ఏమిటంటే..?మెనూలో కొన్ని వంటకాలకు ఆయన సినిమాల పేర్లు పెట్టి, 'ధరం జీ స్పెషల్' అనే ప్రత్యేక పేజీని కూడా ఉంచారు. క్విర్కీ డ్రింక్స్ 'వీరూ కీ ఘుట్టీ', 'ప్యారే మోహన్ మసాలా నింబు' వంటి మోక్టైల్స్ ను బంటా అంటే దేశీ స్టైల్ సీసాలలో అందిస్తారు. ధాబా ఆవిర్భావం..ధర్మేంద్ర రెస్టారెంట్ వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు చాలా రీసెర్చ్ చేశారు. ఆ తర్వాత ఉమాంగ్ తివారీ, మిక్కీ మెహతా లతో కలిసి భాగస్వామ్యంలో మొదటి రెస్టారెంట్ ను ప్రారంభించారు.మొదటి ఔట్లెట్ ప్రారంభమైందిలా..ఫిబ్రవరి 23, 2018 న హర్యానాలోని ప్రసిద్ధ ఫుడ్ స్టాప్ ముర్తల్‌లో ఈ 'గరం ధరం ధాబా' తన మొదటి బ్రాంచ్ ను ఓపెన్ చేశారు. ముర్తల్ బ్రాంచ్ విజయవంతం అయిన తర్వాత, దీని శాఖలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఘజియాబాద్ అర్థాలా, మోహన్ నగర్), నోయిడా, న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ వంటి అనేక ప్రదేశాలలో విస్తరించాయి.'హీ-మ్యాన్' రెస్టారెంట్.. 'గరం ధరం' విజయం తర్వాత, ధర్మేంద్ర కర్నాల్‌లో 'ఫామ్-టు-ఫోర్క్' కాన్సెప్ట్‌తో 'హీ-మ్యాన్' అనే తన రెండవ రెస్టారెంట్‌ను కూడా ప్రారంభించారు. ఈ 'గరం ధరం ధాబా' ధర్మేంద్ర అభిమానులకు ఆయన గురించి, ఆయన సినిమాల గురించి, ఆయన దేశీ జీవనశైలి గురించి గుర్తుచేసే ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.- సాక్షి స్పెషల్ -
‘రాజు వెడ్స్ రాంబాయి’ కలెక్షన్స్ ఎంతంటే?
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం .. తొలిరోజే హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. 4 రోజుల్లో ఈ సినిమాకు 9.08 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. ఈ సినిమాకు రోజు రోజుకూ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటి రోజు కంటే రెండో రోజు, రెండో రోజును మించిన వసూళ్లు మూడో రోజు, మూడో రోజును మించి నాలుగో రోజు ఈ చిత్రానికి కలెక్షన్లు దక్కాయి. వీక్ డేస్ లోనూ "రాజు వెడ్స్ రాంబాయి" బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుండటం విశేషం."రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చారు. -
హీరో అవుతానంటే కమెడియన్ అన్నారు: శివకార్తికేయన్
ఇప్పుడున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొని, వాటిని దాటుకుంటూ వచ్చినవాళ్లే! వారిలో తమిళ స్టార్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) ఒకరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు వచ్చిన ఇతడు తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నాడు.సినిమాల్లోకి వస్తావా?టీవీలో పనిచేసినప్పుడు ఓసారి దర్శకనిర్మాత కేఎస్.సినిశ్ ఆఫీస్‌కు వెళ్లాను. ఆయన నన్ను చూడగానే సినిమాల్లోకి వచ్చి ఏం చేస్తావ్? అన్నాడు. అప్పుడు నేను 'వేట్టయి మన్నన్' మూవీలో చిన్న కామెడీ రోల్ చేస్తున్నా.. హీరో అవ్వాలని నేనేమీ కలలు కనలేదు. కానీ, పైకి మాత్రం హీరో అవుతా అని చెప్పాను.కామెడీ పాత్రలే సెట్టు!ఇలాంటి పనికిమాలిన కలలు ఎందుకు కంటున్నావ్? అయినా నువ్వు కామెడీ బాగా చేస్తావ్.. అలాంటి పాత్రలు ట్రై చేయ్ అని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. ఏ.. నేను ఎందుకు హీరో కాకూడదు? అని అడిగాను. అందుకాయన ఓ డ్యాన్సర్‌ని చూపించి అతడు హీరో కాగలడేమోకానీ నేను కాదని కరాఖండిగా చెప్పాడు. తర్వాత అదంతా నేను మర్చిపోయాను కానీ, సినిశ్ మర్చిపోలేదు. నేను మర్చిపోయా.. కానీ!నేను హీరో అయ్యాక ఓసారి అతడు ఫోన్ చేసి.. నేనలా మాట్లాడినందుకు కోపంగా ఉందా? అని అడిగాడు. అప్పుడు నేను పనిలో బిజీగా ఉండటంతో సరిగా మాట్లాడలేకపోయాను. తర్వాత ఎప్పుడూ దానిగురించే మాట్లాడనేలేదు. బహుశా అతడిప్పటికీ అదే మాటపై నిలబడ్డాడేమో! అని సరదాగా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 14న విడుదల కానుంది.చదవండి: నా ముఖం చూస్తేనే లవ్ ఫెయిల్యూర్: ధనుష్ -
లవ్ ఫెయిల్యూర్.. అద్దం ముందు నిలబడి..: ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush).. అప్పుడప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తుంటాడు. చివరగా బాలీవుడ్లో 'ఆత్రంగిరె' అనే స్ట్రయిట్ ఫిలిం చేశాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత 'తేరే ఇష్క్ మే' సినిమాతో బాలీవుడ్లో సందడి చేయనున్నాడు. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 28న విడుదల కానుంది.లవ్ ఫెయిల్యూర్సినిమా ప్రమోషన్స్‌లో ధనుష్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఎప్పుడూ నన్ను లవ్ ఫెయిల్యూర్ పాత్రలోనే చూపిస్తారెందుకు? అని దర్శకుడిని అడిగాను. అందుకాయన లవ్ ఫెయిల్యూర్ అయినవాడిలా నా ముఖం ఉంటుందన్నాడు. అది విని నేను నవ్వుకున్నాను. ఆరోజు ఇంటికెళ్లాక అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకున్నాను. నా ముఖాన్ని జాగ్రత్తగా పరిశీలించాను. ఏదేమైనా ఫెయిల్యూటర్ పాత్రలు పోషించడం అంత ఈజీ అయితే కాదు. చాలా కష్టంఉదాహరణకు 'రాంజన' సినిమాలో కుందన్ పాత్ర చూడటానికి ఈజీగా అనిపించినా ఆ రోల్ చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే నేను ఏ చిన్న పొరపాటు చేసినా జనం నా పాత్రను ఇష్టపడరు. తేరే ఇష్క్ మే సినిమాలో శంకర్ పాత్ర కూడా చాలెంజెస్‌తో కూడుకున్నది. ఆ పాత్ర ఎంత వైవిధ్యమైనదో తెరపై మీరే చూస్తారు. ఇది నా అభిమానులకు కొత్త అనుభవాన్ని ఇస్తుందనుకుంటున్నాను అని చెప్పాడు. కాగా ధనుష్ హిందీలో నటించిన రాంఝన, ఆత్రంగిరే.. సినిమాలను సైతం ఆనంద్ ఎల్. రాయే తెరకెక్కించాడు.చదవండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రాజాసాబ్ డైరెక్టర్ క్షమాపణలు -
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు దర్శకుడు మారుతి క్షమాపణలు
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) లేటెస్ట్ మూవీ రాజాసాబ్. ఈ హారర్ కామెడీ మూవీని మారుతి తెరకెక్కిస్తున్నాడు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ షురూ చేశారు. రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. అయితే ఈ వేదికపై దర్శకుడు మారుతి కొన్ని అనవసరమైన డైలాగులు కొట్టాడు.మారుతిపై ట్రోలింగ్సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పిన మారుతి.. పండక్కి ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగరేసుకుంటారు అని నేను చెప్పలేను. ఎందుకంటే ప్రభాస్ కటౌట్‌కు అవన్నీ చిన్నమాటలైపోతాయి అన్నాడు. ఈ కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హర్టయ్యారు. ఎందుకంటే ఇటీవలే తారక్ వార్ 2 రిలీజ్ సమయంలో తన రెండు కాలర్స్ పైకి ఎగరేసి చూపించారు.క్షమాపణలు చెప్పిన మారుతిఇప్పుడు మారుతి.. ప్రభాస్ కటౌట్‌కి కాలర్ ఎగరేయడం చిన్న విషయం అనడంతో తారక్ ఫ్యాన్స్ అతడిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మారుతి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పాడు. ఎన్టీఆర్ అభిమానులందర్నీ క్షమించమని కోరుతూ ట్వీట్ చేశాడు.నా ఉద్దేశం అది కాదుముందుగా అభిమానులకు క్షమాపణలు. నేను ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేయలేదు. నేనేదో ఫ్లోలో మాట్లాడాను. దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎన్టీఆర్‌గారంటే ఎనలేని గౌరవం. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడలేదు. అది మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని మారుతి రాసుకొచ్చాడు. Dear Venky…Felt like clarifying this personally.First I sincerely apologise to every fan. It was never my intention to hurt or disrespect anyone. Sometimes in the flow of words things come out differently from what we truly mean and I regret that it was received in the wrong…— Director Maruthi (@DirectorMaruthi) November 24, 2025 చదవండి: అందంగా రెడీ అయిన ఖుష్బూ.. ముఖం కడుక్కోమన్న కమల్ -
23 ఏళ్ల ప్రేమ.. గుళ్లో పెళ్లి చేసుకున్న సీరియల్ జంట
బుల్లితెర జంట అశ్లేష సావంత్ (Ashlesha Savant)- సందీప్ బస్వాన (Sandeep Baswana) పెళ్లిపీటలెక్కారు. వీళ్లది రెండు మూడేళ్ల ప్రేమ కాదు.. ఏకంగా 23 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇన్నాళ్లకు తమ ప్రేమబంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ఈమేరకు తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని బృందావన్ చంద్రోదయ ఆలయం ఈ పెళ్లికి వేదికగా మారింది.ఆ గుడికెళ్లాకే..నవంబర్ 16న ఈ పెళ్లి జరగ్గా ఆలస్యంగా బయటకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ.. అశ్లేష, నేను ఏప్రిల్‌లో బృందావనానికి వెళ్లాం. అక్కడి రాధాకృష్ణుడి గుడి మమ్మల్ని కట్టిపడేసింది. ఆ ట్రిప్ తర్వాతే పెళ్లి చేసుకోవాలన్న కోరిక పుట్టింది. 23 ఏళ్లుగా జంటగా ఉన్న మేము అలా వైవాహిక జీవితంలో అడుగుపెట్టాం. అలా మొదలైందిమా పేరెంట్స్ ఈ శుభవార్త కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. సింపుల్‌గా మా పెళ్లి జరుపుకున్నాం. కృష్ణుడి గుడిలో వెడ్డింగ్ జరగడం కన్నా ఉత్తమమైనది ఇంకేముంటుంది? అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అశ్లేష వయసు 41 కాగా, సందీప్ వయసు 47. వీరిద్దరూ 2002లో వచ్చిన 'క్యూంకీ సాస్బీ కభీ బహుతీ' సీరియల్లో కలిసి నటించారు. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యమైనప్పుడు అశ్లేష తన ఇల్లు దూరంగా ఉండటంతో సందీప్ ఇంటికి వెళ్లి అక్కడే బస చేసేది. సీరియల్స్అలా వీరిమధ్య బంధం మొదలైంది. చాలా ఏళ్లుగా వీరు కలిసే జీవిస్తున్నారు. ప్రస్తుతం అశ్లేష.. జనక్ సీరియల్ చేస్తోంది. గతంలో అనుపమ సీరియల్లో నెగెటివ్ పాత్ర పోషించింది. సందీప్ చివరగా 'అపొల్లెనా- సప్నోకీ ఉంచి ఉడాన్' సీరియల్లో కనిపించాడు. View this post on Instagram A post shared by 𝑨𝒔𝒉𝒍𝒆𝒔𝒉𝒂 🧿 (@ashleshasavant) చదవండి: బిగ్‌బాస్9: 12వ వారం నామినేషన్స్‌లో ఎవరంటే? -
సిక్స్‌ప్యాక్‌తో హీరో సెకండ్ ఇన్నింగ్స్..
మంగాత్త, జిల్లా, అన్బానవన్ అడంగాదవన్ అసరాదవన్, మానాడు వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన నటుడు మహత్ రాఘవేంద్ర (Mahat Raghavendra). కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు. అయితే అవేవీ ఆశించిన విజయాలు సాధించలేదు. దీంతో చిన్నగ్యాప్ తీసుకున్న మహత్ రాఘవేంద్ర తాజాగా కొత్త లుక్కు తయారయ్యారు. ఫుల్ వర్కవుట్స్‌తో సిక్స్ ప్యాక్ బాడీతో సిద్ధంగా ఉన్నారు. ఇకపై తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాబోతుందన్నారు. పలు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. తాజాగా మహత్ రాఘవేంద్ర ఓ సినిమాలో హీరోగా నటించనున్నారని సమాచారం.ఈ మూవీలో ఆయేనకు జంటగా ఐశ్వర్య రాజేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుందట! ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుందని.. తమిళం, తెలుగు భాషల్లో రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Raghavendra Mahat (@mahatofficial) -
ఐబొమ్మ రవి విలనా? హీరోనా?
పైరసీ అనేది చట్టరిత్యా నేరం. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సినిమాను తెరకెక్కించే నిర్మాతలకు ఓ రకంగా అది మరణ శాసనం. అలాంటి పైరసీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్ అయితే అందరూ సంతోషించాలి. పోలీసులను అభినందించాలి. కానీ ఇమ్మడి రవి అలియాస్ ‘ఐబొమ్మ’ రవి విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. పోలీసులను ద్వేషిస్తూ.. రవికి మద్దతుగా లక్షలాది మంది నిలుస్తున్నారు. ‘రవి మా రాబిన్‌హుడ్’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇమ్మడి రవికి సోషల్ మీడియాలో అంత మద్దతు ఎందుకు? ఒక నిందితుడికి మద్దతుగా లక్షలాది మంది గళం విప్పడం వెనక కారణం ఏంటి? స్టార్స్ ఏమంటున్నారు? సామాన్యులు ఏమంటున్నారు?చట్టం ప్రకారం రవి( iBomma Ravi) చేసింది నేరం. కొత్త సినిమాను పైరసీ చేయడమే కాకుండా.. హెచ్డీ ప్రింట్‌ని సామాన్యులకు ఉచితంగా అందించాడు. అయితే ఇదోదే సంఘ సేవ అయితే కాదు. ఫ్రీగా సినిమా చూపిస్తూనే.. వెనకాల ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్, గేమింగ్ సైట్లను ప్రమోట్ చేసి కోట్లు సంపాదించాడని పోలిసులు చెబుతున్నారు. అంతేకాదు వ్యక్తిగత డేటాని కూడా దొంగిలించాడని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఇలాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్టు అయితే, సోషల్ మీడియాలో అతనిపై పాజిటివ్ పోస్టులు పెట్టడం అనేది ఆందోళనకరమైన విషయమే. అయితే తాము ఎందుకు రవికి మద్దతు తెలపాల్సి వస్తుందో కూడా కొంతమంది నెటిజన్స్ చెబుతున్నారు. మొత్తంగా చూస్తే..రెండు బలమైన కారణాల వల్లే రవికి సామాన్యుల మద్దతు లభిస్తుందనే విషయం తెలుస్తోంది.సామాన్యుడిని దూరం చేశారు!సినిమా అనేది ఒకప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఓ వినోదం. కానీ ఇప్పుడు కొందరికి మాత్రమే అన్నట్లుగా మారిపోయింది. సామాన్యులు థియేటర్స్‌కి రావాలంటే భయపడిపోతున్నారు. టికెట్ల రేట్లను అంతలా పెంచేశారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఓ సినిమా చూడాలంటే దాదాపు రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు ఈజీగా ఖర్చు అవుతుంది. పాప్ కార్న్‌తో పాటు కూల్‌డ్రింక్స్ రేట్లు కూడా భారీగానే ఉంటుంది. పైగా భారీ బడ్జెట్ సినిమా అంటూ టికెట్ల రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్ షో, ప్రీమియర్ షో అంటూ ఫ్యాన్స్ జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ ఆర్థిక భారాన్ని తట్టుకోలేని సామాన్యుడికి ‘ఐబొమ్మ’ అనే పైరసీ వెబ్సైట్ ఉచిత వినోద సాధనంగా మారింది. రూ. 30 ఉండే పాప్ కార్న్‌ని రూ. 700 వరకు అమ్ముతుంటే సినిమా ఎలా చూస్తామని నెటిజన్స్ ట్వీట్ చేస్తున్నారు.క్వాలిటీ కంటెంట్.. ఓ వ్యక్తి సినిమాకు వచ్చేదే ఎంటర్టైన్మెంట్ కోసం. అన్ని మర్చిపోయి హాయిగా రెండున్నర గంటల పాటు ఎంజాయ్ చేయడానికి థియేటర్స్‌కి వస్తారు. కానీ కొన్ని సినిమాలు మాత్రం పెట్టిన డబ్బులకు న్యాయం చేయలేకపోతున్నాయి. రిలీజ్ ముందు వరకు భారీ హైప్ క్రియేట్ చేసుకొని..టికెట్ల రేట్లు పెంచుకుంటున్నారు. తీరా థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడికి తలపోటు తెప్పించి బయటకు పంపిస్తున్నారు. ఇది కూడా ఓ రకంగా పైరసీని ప్రోత్సహించడానికి కారణం అవుతుంది. నాసిరకం సినిమాలకు వందల రూపాయలు ఖర్చు చేసి థియేటర్స్‌కి వెళ్లడం కంటే.. ఇంట్లో కూర్చోని ఫోన్లో చూడడం బెటర్ అనే భావనకు ప్రేక్షకులు వచ్చారు. రిలీజైన గంటల్లోనే తన ఫోన్లోకి సినిమా వచ్చేస్తే.. సామాన్య ప్రేక్షకుడికి అంతకన్నా కావాలిసిందేముంది? ఇదే ఇప్పుడు సామాన్యుల దృష్టిలో రవిని హీరోగా చేసింది. సినీ ప్రముఖులు ఏమంటున్నారు?రవి అరెస్ట్ పట్ల సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రవిని రాబిన్ హుడ్ అంటూ పొగడడాన్ని ఆర్జీవీ తప్పుబట్టాడు. టికెట్లు పెరిగాయాని పైరసీ తీసి అందరికి చూపిస్తానంటే.. ఈ లెక్కన బంగారం దుకాణాన్ని దోచుకొని అందరికి ఉచితం ఎందుకు పంచట్లేదు? BMW కార్లను కొట్టేసి మురికి వాడల్లో ఉన్నవాళ్లకి ఇవొచ్చు కదా అని లాజిక్‌తో ప్రశ్నించాడు. అంతేకాదు పైరసీ చేసినవాడిని కాదు పైరసీ చూసిన వాళ్లను కూడా అరెస్ట్ చేయడమే దీనికి సరైన పరిష్కారం అని సలహా ఇచ్చాడు. ఇక సినీ నిర్మాత సి. కల్యాణ్ అయితే పైరసీని చేసిన రవికి ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశాడు. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఎలా హానికరమో, పైరసీ సినిమాలు అదే స్థాయిలో హానికరం అని నిర్మాత సురేశ్ బాబు అన్నారు. ఒక సినిమా వెనుక ఎంతో మంది కష్టం ఉటుందని, ఇల్లీగల్‌గా ముమ్మాటికే తప్పే అని అని దిల్ రాజు అన్నారు. ఏదీ ఉచితంగా రాదు. సినిమాలు ఉచితంగా చూస్తున్నామని ప్రజలు అనుకుంటున్నారు. వెబ్సైట్ల నిర్వాహకులకు డబ్బును ప్రజలే ఇస్తున్నారు. పర్సనల్ డాటాను విక్రయించడం ద్వారా ఇస్తున్నారు. పేరు, ఫోన్ నంబరు, ఆధార్ నంబరు ఇవ్వడం ద్వారా వాటిని నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు’’ అని అన్నారు రాజమౌళి. మొత్తానికి సామాన్యులకు రవి హీరోగా కనిపిస్తే.. సినీ స్టార్స్‌కి మాత్రం విలన్‌గా కనిస్తాడు. కొంతమంది మాత్రం రవి చేసింది తప్పని అంటూనే.. రేట్ల విషయంలో సినిమా పరిశ్రమ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. -
హ్యాపీ బర్త్‌డే లవర్.. శోభిత లవ్లీ విషెస్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitaya Akkineni) బర్త్‌డే నేడు (నవంబర్ 23). తన 39వ పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయన అర్ధాంగి, హీరోయిన్ శోభిత (Sobhita Dhulipala) కూడా భర్తకు ఆన్లైన్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేసింది. భర్తను ప్రియుడిగా..హ్యాపీ బర్త్‌డే లవర్ అంటూ ఓ ఫోటో షేర్ చేసింది. అందులో ఫారిన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఇద్దరూ ఓ చోట ఆగిపోగా.. చై ప్రేమగా భార్యకు స్వెటర్ తొడిగాడు. ఇది చూసిన జనాలు భార్యంటే ఎంత ప్రేమో.. అని కామెంట్లు చేస్తున్నారు. కాగా చై జర్నీ జోష్‌తో మొదలైంది. రెండో సినిమా ఏ మాయ చేసావెతో మంచి హిట్టందుకున్నాడు. ఈ మూవీ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడ్డాడు. ఏడేళ్లు తిరిగేసరికి పెద్దలను ఒప్పించి సామ్‌ను పెళ్లి చేసుకున్నాడు. పర్సనల్ లైఫ్బయట చాలా చలాకీగా, ఖుషీగా కనిపించే ఈ జంట మధ్య రానురానూ భేదాభిప్రాయాలు మొదలయ్యాయి. దీంతో 2017లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత చై-శోభితతో ప్రేమలో పడ్డాడు. సోషల్ మీడియాలో మొదలైన చాటింగ్ ప్రేమకు దారి తీసింది. అలా మరోసారి పెద్దలను ఒప్పించి చై-శోభిత 2024 డిసెంబర్లో మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సమంత.. ఫ్యామిలీ మ్యాన్ దర్శకద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) చదవండి: సినిమా కొనేందుకు డబ్బుల్లేవ్.. కట్ చేస్తే! -
'ఆమె'పై అనుమానం.. ఓటీటీలో ఈ మలయాళ చిత్రం చూశారా?
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం అవిహితమ్ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. కల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు అన్నది నాటి నానుడైతే అనుమానమొచ్చినా ఆనందమొచ్చినా ఆపుకోలేరన్నది నేటి మాట. అనుమానమొస్తే మాత్రం అది తెలుసుకునేంతవరకు నిద్రపట్టదు కొందరికి. తమకు సగమే తెలిసిన గోరంత విషయాన్ని కొండంత చేసి, అవతలి వాళ్ళలో అనుమానపు బీజాలు నాటే బడా బాబులు చాలామందే ఉంటారు. మరీ ముఖ్యంగా ఇలాంటివాళ్ళ వల్లే పల్లెటూళ్ళలో కొన్ని చోట్ల గాలివార్తలకు కొదవ లేకుండా పోతుంది. వాళ్ళను దృష్టిలో ఉంచుకుని రాసిన కథే ఈ ‘అవిహితమ్’. వైవిధ్యానికి పెద్ద పీట వేసుకుంటూ తమ ప్రేక్షక పరిధిని ఈ ఓటీటీ కాలంలో పెంచుకుంటూ పోతున్న మలయాళ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో మణిమాణిక్యమే ఈ ‘అవిహితమ్’. ఇది నిజంగా హాస్యప్రియమ్ అని చెప్పాలి. చిన్న పాయింట్‌తో దాదాపు రెండు గంటలపాటు ప్రేక్షకుడిని కదలకుండా కట్టిపడేశారు ఈ సినిమా దర్శకుడు సెన్నా హెగ్డే. ఈ ‘అవిహితమ్’లో అంతలా ఏముందో ఓసారి చూద్దాం. అది ఓ మారుమూల పల్లెటూరు. ప్రకాశన్ అనే వ్యక్తి ఓ రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో మందు పార్టీ ముగించుకుని తన ఇంటికి వెళ్ళబోతుండగా దొంగతనంగా సన్నిహితంగా ఉన్న ఓ జంటను వడ్రంగి మాధవన్ ఇంటి పరిసరాల్లో చూసి అవాక్కవుతాడు. ఆ జంట ప్రతి రోజూ ఓ సమయంలో కలవడంతో పాటు ఆ జంటలో మాధవన్ వదిన నిర్మల ఉందన్న విషయాన్ని గుర్తుపట్టి, ఇదే విషయాన్ని ఊళ్ళో కాస్త పెద్ద తరహాగా వ్యవహరించే టైలర్ వేణన్నకు చెబుతాడు ప్రకాశన్. మాధవన్‌కు ఈ విషయాన్ని ఆ వేణన్న చేరవేస్తాడు. మాధవన్ ఈ విషయాన్ని తన తండ్రికి, అలాగే తన సోదరుడు ముకుందన్‌కు చెబుతాడు. అలా మెల్లమెల్లగా ఊరంతా ఈ విషయం పాకి పోతుంది. ఆ జంటను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఊరంతా ఏకమై ఓ పెద్ద ఆపరేషనే చేపడతారు. మరి... ఈ ఆపరేషన్‌లో ఆ జంట దొరికిపోతుందా? దొరికిన తరువాత మాధవన్ కుటుంబంతో పాటు ఊరి ప్రతిస్పందన ఎలా ఉంటుందనే విషయాన్ని ‘అవిహితమ్’లోనే చూడాలి. ఈ సినిమా మొత్తం ఓ అనుమానంతో ప్రారంభమైతే చూసే ప్రేక్షకులకు కూడా ఆ అనుమానం నివృత్తి చేసుకోవాలనే తపన అంతకంతకూ పెరుగుతుంది. హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా లభ్యమవుతోంది. ఈ ‘అవిహితమ్’ హాస్యప్రియమ్ కాబట్టి ఇది ప్రేక్షకప్రియమ్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
డబ్బుల్లేవన్న ఓటీటీ.. కట్ చేస్తే జాతీయ అవార్డులు!
12th ఫెయిల్ (12th Fail Movie).. అందరినీ కంటతడి పెట్టించిన సినిమా. అందరి మనసులు గెల్చుకున్న మూవీ. కానీ ఈ సినిమా రిలీజ్‌కు ముందు దీన్ని కొనేందుకు ఓటీటీలు వెనకడుగు వేశాయంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు విధు వినోద్ చోప్రా (Vidhu Vinod Chopra). ఈయన ఇప్పటితరానికి 12th ఫెయిల్ డైరెక్టర్‌గా తెలుసు.. కానీ ఇతడు పరిండా, 1942:ఎ లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాలను తెరకెక్కించాడు. వినోద్ చోప్రా తాజాగా 56వ ఇఫీ(ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకకు హాజరయ్యాడు. థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు'అన్స్క్రిప్ట్డ్: ద ఆర్ట్ అండ్ ఎమోషన్ ఆఫ్ ఫిలింమేకింగ్' పేరిట జరిగిన చర్చలో విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ.. 12th ఫెయిల్ తీసినప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాదన్నారు. నా భార్యతో సహా అందరూ దీన్ని థియేటర్లో రిలీజ్ చేయొద్దన్నారు. ఇలాంటి సినిమాను ఎవరూ వెళ్లి చూడరని చెప్పారు. ఎంతో ప్రేమతో ఈ సినిమా చేశాం.. జనాలు కచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకం నాకుందన్నాను.దర్శకుడు విధు వినోద్ చోప్రాడబ్బుల్లేవన్న ఓటీటీనా నమ్మకం నిజమైంది. థియేటర్లలో ఏడు నెలలపాటు ఆడింది. ఒక ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయితే సినిమా చూశాక తమ దగ్గర కొనేంత డబ్బు లేదని చెప్పింది. మీకు సినిమా అర్థం కాలేదేమో అన్నాను. అందుకో వ్యక్తి.. సినిమాలో చూపించిన మనుషులు నిజ జీవితంలో ఉండరు అన్నాడు. అలా వారు మా సినిమాను కొనేందుకు ఇష్టపడలేదు అని గుర్తు చేసుకున్నాడు. తర్వాత సినిమా బ్లాక్‌బస్టర్ హిట్టవడం జియో హాట్‌స్టార్‌లో రిలీజవడం చకచకా జరిగిపోయాయి. జాతీయ అవార్డులు మొన్నటి మొన్న (ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో) రెండు జాతీయ అవార్డులు సైతం సాధించింది. 12th ఫెయిల్ మూవీ విషయానికి వస్తే ఇందులో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించగా మేధా శంకర్ హీరోయిన్గా నటించింది. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ- ఐఆర్ఎస్ అధికారిణి శ్రద్ధా జోషిల జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2023 అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.చదవండి: చెత్త అమ్ముకునేవాడిని..షాప్ అమ్ముకునే దుస్థితి: జబర్దస్త్ కమెడియన్ -
ఫ్యామిలీ మ్యాన్-3.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ‘ఫ్యామిలీ మ్యాన్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దర్శకద్వయం రాజ్-డీకే తీసిన ఈ సిరీస్ తొలి భాగం 2019లో రిలీజై..బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన సిరీస్‌గా రికార్డుకెక్కింది. 2021లో రెండో సీజన్ రాగా..అది కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మూడో సీజన్(The Family Man 3 ) కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (చదవండి: ‘ద ఫ్యామిలీ మ్యాన్ 3’ రివ్యూ)ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో పాకిస్థాన్-మయన్మార్‌తో కలిసి భారత్‌పై చైనా చేస్తున్న కుట్రలు, భారత్ -మయన్మార్ సరిహద్దుల్లోని ఉద్రిక్త పరిస్థితులను చూపించారు. సీజన్ 3 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.ఇదిలా ఉంటే.. ఈ సిరీస్ రిలీజ్ తర్వాత మనోజ్ బాజ్‌పేయి తో పాటు ప్రధాన పాత్రల్లో నటించిన వారి పారితోషికంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎవరెంత పుచ్చుకున్నరనేదానిపై రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీజన్ 3కి గాను శ్రీకాంత్ తివారి పాత్ర పోషించిన మనోజ్ బాజ్‌పేయి రూ. 20-22కోట్ల మేరకు పారితోషికం పుచ్చుకున్నారట. ఇక ఈ సిరీస్‌లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు తీసుకున్నాడట. మనోజ్ బాజ్‌పేయికి జోడీగా నటించిన ప్రియమణి ఈ సీజన్‌కి రూ. 7 కోట్ల వరకు అదించినట్లు సమాచారం.మీరా పాత్ర పోషించిన నిమ్రత్ కౌర్ కూడా రూ. 8-9 కోట్ల వరకు తీసుకున్నారట. నిడివి తక్కువే అయినప్పటికీ దర్శన్ కుమార్ కూడా దాదాపు 8 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. కీలక పాత్రలో నటించిన సీనియర్ నటి సీమా బిస్వాస్, విపిన్ శర్మ రూ. 1-2 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెమ్యునరేషన్లకు దాదాపు రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. -
అందుకే సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పుకోవట్లేదు : చైతన్య జొన్నలగడ్డ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా, చైతన్య జొన్నలగడ్డ కీ రోల్ చేసిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రొడక్షన్స్‌లో సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. బన్నీ వాసు, వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. శనివారం చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘బబుల్గమ్, హిట్ 3’ వంటి చిత్రాల్లో నటించాను కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ‘రాజు వెడ్స్ రాంబాయి’లో నేను చేసిన వెంకన్న పాత్రకు, సినిమాకూ మంచి స్పందన లభిస్తుండటం హ్యాపీ. నేను లీడ్ రోల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా రావాల్సింది. ఆ సినిమా పనుల్లో ఉన్న నాకు దివ్యాంగుడు వెంకన్న రోల్ చేసే చాన్స్ వచ్చింది. ఈ పాత్ర కోసం చీకట్లో కుంటడం ప్రాక్టీస్ చేశాను. హీరో సిద్ధు జొన్నలగడ్డ నా బ్రదర్ అని చెప్పి, తన పేరు ఉపయోగించుకోవాలనుకోలేదు. ఏ సపోర్ట్ లేకుండా నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే సిద్ధును మా సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్ కు పిలవడం లేదు.‘రాజు వెడ్స్ రాంబాయి’లో నా నటనను మెచ్చుకుంటూ సిద్ధు మెసేజ్ చేశాడు. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ సినిమా చేస్తున్నాను. పవన్ డైరెక్షన్లోనే రాజశేఖర్‌గారు హీరోగా చేస్తున్న ‘మగాడు’ సినిమాలో నటించాను’’ అన్నారు. అవకాశం వస్తే సిద్ధుతో కలిసి నటిస్తా’ అని అన్నారు. . -
ఇఫీలో అమరన్ సినిమా
గోవాలో జరుగుతున్న 56 ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవ (IFFI–2025) వేడుకల్లో అమరన్ చిత్రం (Amaran Movie) ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శనకు ఎంపికైంది. స్టార్ హీరో కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ, టెర్మరిక్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన చిత్రం అమరన్. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ పెరియస్వామి తెరకెక్కించారు. ఇఫీ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం అమరన్ చిత్ర యూనిట్‌కు గౌరవ మైలురాయి అయింది.ఇఫీలో అమరన్భారతీయ సినిమాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి, ప్రశంసలు పొందిన చిత్రాలే ఇండియన్ పనోరమ చిత్ర ఉత్సవాల్లో ప్రదర్శనకు ఎంపికవుతాయి. అలా ఎంపికైన అమరన్ చిత్ర ప్రదర్శన శనివారం నాడు ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల వేడుకలో ప్రదర్శించారు. కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్, దర్శకుడు రాజకుమార్ పెరియస్వామి, శివకార్తికేయన్, సాయిపల్లవి వేడుకలో పాల్గొన్నారు.మేజర్ ముకుంద్ జీవితకథఅశోకచక్ర బిరుదు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రతో తెరకెక్కిన చిత్రం అమరన్. దేశభక్తిని, త్యాగాన్ని, ధైర్యాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించిన చిత్రం. మేజర్ ముకుంద్ దేశభక్తిని ,అత్యున్నత సేవలను ప్రదర్శించిన చిత్రం అమరన్. ఇందులో భారత సైనికుల వీరత్వాన్ని, ఘనతను ఆవిష్కరించారు. అలాంటి చిత్రం ఇండియన్ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు ఎంపిక కావడం ఆ చిత్ర యూనిట్ ప్రతిభకు నిదర్శనం. అంతేకాకుండా అమరన్ చిత్రం అంతర్జాతీయ గోల్డెన్ పికాక్ చిత్రోత్సవాల్లో నామినేషన్‌కు పంపడం గమనార్హం.చదవండి: ఒక్కరోజే ఇన్ని సినిమాలా? -
‘తెలంగాణ రైజింగ్ 2047’లో చిత్ర పరిశ్రమది కీలకపాత్ర : భట్టి విక్రమార్క
‘1970లలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోను స్థాపించడం ఒక అద్భుతం’ అని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నాగార్జున ఆహ్వానం మేరకు శనివారం ఆయన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను సందర్శించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావుని గుర్తుచేసుకున్నారు. ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోని ప్రారంభించిన నాటి నుంచే సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌లలో ఒకటిగా ఎదిగింది. అన్నపూర్ణ కళాశాల విద్యార్థులు రూపొందించిన ‘రోల్ నం.52’ను నేను చూశాను. ఎంతో అర్థవంతమైన కథతో రూపొందిన ఆ సినిమా అందరి హృదయాలను హత్తుకుంది’’ అంటూ ప్రశంసలు కురిపించారు.ఇక తెలంగాణ ఆర్థిక వృద్ధికి ప్రభుత్వ దార్శనికతను ఆయన హైలైట్ చేస్తూ, “2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ భవిష్యత్తును నిర్మించడంలో చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి సీనియర్ సినీ దిగ్గజాల మద్దతును మేము ఆశిస్తున్నాము” అని అన్నారు. అన్నపూర్ణ కళాశాల నుండి వెలువడుతున్న అసాధారణ ప్రతిభ గురించి అక్కినేని నాగార్జున స్వయంగా మాట్లాడారని, అది తన సందర్శనకు ప్రేరణనిచ్చిందని ఆయన అన్నారు. ‘సినిమా రంగంలో తెలంగాణను ప్రపంచంలోనే మేటిగా అభివృద్ధి చేయడంలో తనతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ మద్దతు ఎప్పటికీ ఉంటుంది’ అని నాగార్జున అన్నారు. -
చెత్త రీల్స్ ఒక్కచోట చేర్చితే డ్యూడ్.. దర్శకుడి రిప్లై ఇదే!
దీపావళికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా డ్యూడ్ (Dude Movie). ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఏకంగా రూ.100 కోట్లు రాబట్టింది. ఈ చిత్రంతోనే కీర్తిశ్వరన్ అనే యువకుడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చింది.అది నార్మల్ కాదుదీంతో ఓటీటీలో సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా సినిమా గురించి నేరుగా దర్శకుడికే మెసేజ్ చేసింది. బ్రో.. మీ ఇంటర్వ్యూ క్లిక్ కూడా చూశాను. మమిత మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని నార్మలైజ్ చేశారు. అలాంటివి చాలా మామూలు విషయం అన్నట్లు చూపించకండి.చెత్త రీల్స్నిజమైన స్నేహితులెప్పుడూ అలా మాట్లాడుకోరు. సినిమా మొత్తం అర్థంపర్థం లేకుండా ఉంది. సన్నివేశాల మధ్య కనెక్షన్ మిస్ అయింది. చెత్త రీల్స్‌ను ఒకచోట చేర్చినట్లుగా ఉంది. ఇకనుంచైనా కాస్త మంచి సినిమాలు తీయు అని సలహాచ్చింది. దీనికి కీర్తిశ్వరన్ స్పందిస్తూ... నాకు మెసేజ్‌లు చేసే బదులు నీ బతుకేదో నువ్వు చూసుకో.. అని వెటకారంగా బదులిచ్చాడు. విమర్శించే హక్కుఈ చాటింగ్‌ను స్క్రీన్‌షాట్ తీసిన ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. డ్యూడ్ సినిమాతో పాటు దర్శకుడి ఇంటర్వ్యూ క్లిప్ చూశాను. నా జేబులో నుంచి డబ్బు ఖర్చు పెట్టి మరీ సినిమా చూసినప్పుడు దాన్ని విమర్శించే హక్కు నాకుంది. నా అభిప్రాయాన్ని దర్శకుడితో పంచుకున్నాను. కొత్త డైరెక్టర్.. నా విమర్శను స్వీకరిస్తాడనుకున్నాను.. కానీ, ఇదిగో ఇలా రిప్లై ఇచ్చాడు. దమ్ము లేదుఇక్కడే అతడి మైండ్‌సెట్ ఏంటో తెలిసిపోతుంది. ఫీడ్‌బ్యాక్‌ను తీసుకునే దమ్ము లేదని రుజువవుతోంది అని రాసుకొచ్చింది. ఈ వ్యవహారంపై నెటిజన్లు భిన్నవిధాలుగా స్పందిస్తున్నారు. డ్యూడ్ సినిమా ప్రదీప్‌తో కాకుండా వేరే హీరోతో చేసుంటే కచ్చితంగా ఫ్లాప్ అయ్యేది.. విమర్శలు తీసుకోవడం కూడా రావాలని దర్శకుడిని మందలిస్తున్నారు. మెజారిటీ జనాలు మాత్రం.. ఇది సినిమానా? చెత్త రీల్స్ అన్ని కలగలిసినట్లుగా ఉందని నానామాటలు అంటే ఇలాగే స్పందిస్తారని దర్శకుడిని వెనకేసుకొస్తున్నారు. Dude Director “ Keerthishwaran “ reply to a influencer question about the worst scene in movie. It’s just a Audacity way of response :( pic.twitter.com/EdQKaI50eI— Kolly Censor (@KollyCensor) November 21, 2025 చదవండి: చెల్లి పెళ్లయిన మూడున్నరేండ్లకు.. బుల్లితెర నటి ఎంగేజ్మెంట్ -
ఓటీటీలో లేటెస్ట్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమిళ హీరో విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఆర్యన్ (Aaryan Movie). తెలుగమ్మాయి మానస చౌదరి హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించింది. ప్రవీణ్.కె దర్శకత్వం వహించిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ అక్టోబర్ 21న విడుదలైంది. ఈ చిత్రాన్ని హీరో నితిన్ తండ్రి, నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేశారు. ఓటీటీలో ఆర్యన్వారం ఆలస్యంగా నవంబర్ 7న తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది. సినిమాకు టాక్ బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రాలేదు. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. నవంబర్ 28న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్యన్ అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు!కథేంటంటే?ఆత్రేయ (సెల్వ రాఘవన్) అనే వ్యక్తి ఓ న్యూస్ ఛానెల్‌కి వెళ్తాడు. తాను ఫెయిల్యూర్ రచయితనని చెప్తూ రాబోయే ఐదు రోజుల్లో ఐదు హత్యలు చేస్తానని చెప్తాడు. అంతలోనే గన్‌తో కాల్చుకుని చనిపోతాడు. ఈ కేసును పోలీసు అధికారి నంది (విష్ణు విశాల్)కి అప్పగిస్తారు. ఆత్రేయ బతికి లేకపోయినా హత్యలు జరుగుతుంటాయి? అదెలా సాధ్యం? అన్నది తెలియాలంటే ఓటీటీలో ఆర్యన్ చూడాల్సిందే! #Aaryan - thrilling your NETFLIX screens from 28th November!@TheVishnuVishal @VVStudioz @adamworx @selvaraghavan @ShraddhaSrinath @Maanasa_chou @GhibranVaibodha @dop_harish @Sanlokesh @silvastunt @PC_stunts @jayachandran46 @itshravanthi @prathool @Netflix_INSouth @SreshthMovies… pic.twitter.com/I2JRhlRKve— Vishnu Vishal Studioz (@VVStudioz) November 22, 2025 చదవండి: నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా? -
నిన్ను ఒక్కసారి ముట్టుకోవచ్చా?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) బిజీ యాక్టర్. ఎప్పుడూ ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంటాడు. ఈ ఏడాదైతే ఇప్పటివరకు ఏకంగా నాలుగు సినిమాల్లో కనిపించాడు (ఎల్ 2: ఎంపురాన్, తుడరుమ్, కన్నప్ప, హృదయపూర్వం). ప్రస్తుతం వృషభ, దృశ్యం 3, పేట్రియాట్, రామ్ వంటి పలు సినిమాలు చేస్తున్నాడు.హీరో కోసం 80 ఏళ్ల వృద్ధురాలుదృశ్యం 3 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళలోని అయిమురిలో ఓ చర్చి దగ్గర ఓ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఆ విషయం తెలిసి ఓ 80 ఏళ్ల వృద్దురాలు అక్కడికి చేరింది. కొత్తగా కొన్న చీర కట్టుకుని మనవడు శ్యామ్‌ను వెంటేసుకుని లొకేషన్లో అడుగుపెట్టింది. కానీ జనం రద్దీ అధికంగా ఉండటంతో లోనికి ఎవరినీ అనుమతించలేదు. అందరూ దూరం నుంచే మోహన్‌లాల్‌ను చూసి సంతోషించారు. అయినా లీలామణి అమ్మకు తృప్తి తీరలేదు.మహిళా అభిమానిని కలిసిన మోహన్లాల్చూశాకే తిరిగెళ్తా!ఆయన్ను కచ్చితంగా దగ్గరినుంచి చూసి తీరాల్సిందేనని భీష్మించుకుంది. ఆయన్ను కలిసేవరకు తిరిగి వెళ్లే ప్రసక్తేలేదని మొండిగా కూర్చుంది. ఈ విషయం హీరో చెవిన పడింది. సాయంత్రం ఐదు గంటలకు లీలామణి అమ్మను కలిశాడు. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఇంట్లో అందరూ బాగున్నారా? అని యోగక్షేమాలు అడిగాడు. అప్పుడు ఆ ముసలమ్మ నెమ్మదిగా ఓ కోరిక కోరింది. ముట్టుకోవాలని కోరికనేను మిమ్మల్ని ఒక్కసారి ముట్టుకోవచ్చా? అని అడిగింది. అందుకు మోహన్‌లాల్ నవ్వుతో అంగీకారం తెలుపుతూ ఆమెను దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. హీరో కోసం పాట కూడా పాడాలనుకుంది, కానీ అక్కడ అంత సమయం దొరకలేదని చెప్తోంది. మోహన్‌లాల్ సినిమా వస్తుందంటే చాలు టీవీకి అతుక్కుపోతుంది లీలామణి. ఆయన నటించిన వాటిలో ఆరం తంపురన్ మూవీ తనకెంతో ఇష్టమని చెప్తోంది. చివరగా తన పిల్లలతో కలిసి తుడరుమ్ సినిమా చూశానంది. దృశ్యం 1, 2 సినిమాలను చూశానని, మూడో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నానంది.చదవండి: దర్శన్ ఎలాంటివాడో మీఅందరికీ తెలుసు..: హీరో భార్య -
మీ ప్రేమ చూస్తుంటే కళ్లలో నీళ్లు..: దర్శన్ భార్య
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan) కటకటాలపాలయ్యాడు. ప్రియురాలి కోసం దర్శన్ ఊచలు లెక్కపెడుతుంటే.. ఆయన నటించిన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ భార్య కష్టపడుతోంది. ప్రకాశ్ వీర్ దర్శకత్వం వహించిన డెవిల్ సినిమా షూటింగ్ గతంలోనే పూర్తయిపోయింది. వచ్చే నెల డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానుంది.నోట మాట రాలేదుదీంతో సినిమా ప్రమోషన్స్ కోసం దర్శన్ తరపున అతడి భార్య విజయలక్ష్మి మీడియా ముందుకు వచ్చింది. ఇటీవలే ఆడియో లాంచ్ కార్యక్రమానికి హాజరైంది. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. నేనెప్పుడూ సినిమా ఈవెంట్లకు వెళ్లలేదు. తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో జనం ముందుకు రావడం.. వాళ్లందరూ డి బాస్ అంటూ నినాదాలు చేయడం చూసి చాలా సంతోషించాను. నిర్మాతలే అన్నదాతలువాళ్లు చాలాసేపటివరకు అలా నినాదాలు చేస్తూ నన్ను మాట్లాడనివ్వలేదు. అభిమానుల ప్రేమాభిమానాలకు నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఓపక్క సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే దర్శన్ డెవిల్ సినిమా రిలీజ్ గురించే ఆందోళన చెందాడు. నిర్మాతలే మన అన్నదాతలు. నా వల్ల వారికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకూడదు అని చెప్పాడు. అభిమానులు కురిపించిన ప్రేమ గురించి చెప్పినప్పుడు మీ అందర్నీ ఆయన సెలబ్రిటీలుగా అభివర్ణించాడు.అభిమానులంటే ప్రేమఅభిమానులు ఆయన్ను అంతలా ఎందుకు ప్రేమిస్తారో తెలుసా? దర్శన్ మంచి మనిషి అని వాళ్లకు బాగా తెలుసు. అభిమానులకు ఓ విషయం చెప్పమన్నాడు. తన గురించి కంగారు పడొద్దని, తన సినిమాలకు సపోర్ట్ చేయమని కోరాడు. తనెంత ఎదిగినా ఒదిగే ఉంటాడు. బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా ఆటోలపై దర్శన్ అనే స్టిక్కర్ కనిపిస్తే వెంటనే ఆటోవాలాను కలిసి థాంక్యూ చెప్తాడు. అభిమానులంటే ఆయనకు అంతిష్టం. పెయిన్ కిల్లర్ ఇంజక్షన్స్ఇప్పటికీ వృద్ధాశ్రమంలో ఉన్న ఓ కళాకారుడి బాగోగులను దర్శనే చూసుకుంటున్నాడు. నేను తన సినిమా సెట్స్‌కు పెద్దగా వెళ్లేదాన్ని కాదు. రాజస్తాన్, బ్యాంకాక్ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ అయినప్పుడు మాత్రం నేను, మా కొడుకు వినిశ్ తనకు తోడుగా ఉన్నాం. ఎందుకంటే ఆయన శారీరకంగా, మానసికంగా అలిసిపోయేవాడు. నడుమునొప్పి, వెన్ను నొప్పి తట్టుకోలేక పెయిన్‌కిల్లర్ ఇంజక్షన్స్ తీసుకుని డెవిల్ సెట్‌కు వెళ్లేవాడు. యాక్షన్ సన్నివేశాల్లో చాలా దెబ్బలు తగిలించుకున్నాడు. హీరోయిన్‌కు సలహాఅప్పుడు దర్శకనిర్మాతలు కూడా ఆయనకు అండగా నిలబడ్డారు. హీరోయిన్ రచనతో రొమాంటిక్ సన్నివేశాలు చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేనున్నానని ఇబ్బందిగా ఫీలవద్దని రచనతో అన్నాను. ఇకపోతే నేను ఇంట్లోనే ఉండి సింపుల్‌గా బతకడానికే ఇష్టపడతాను. కానీ కొన్ని నెలలుగా మా జీవితాలు ఎంతో భారంగా సాగుతున్నాయి. నేను బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది.కన్నీళ్లు దిగమింగుకునిఓ పక్క పని, మరోపక్క పోలీసులు, లాయర్స్‌ను కలవడం, నా కొడుకును చూసుకోవడం.. ఇలా అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తోంది. దర్శన్‌కు, ఈ ప్రపంచానికి కనిపించకుండా ఎన్నోసార్లు ఏడ్చాను. ఆ బాధ దర్శన్ ఇట్టే కనిపెట్టేస్తాడు. అందుకే తనను కలవడానికి వెళ్లినప్పుడు బలవంతంగా చిరునవ్వు పులుముకునేదాన్ని. అంతా బానే ఉందని అబద్ధాలు చెప్తుంటాను అని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది.చదవండి: ఏయ్, ఏం పొడిచావ్? సీరియల్ స్టార్.. ఏడుపొక్కటే వచ్చంటూ గలీజ్ పంచాయితీ -
కుటుంబం రోడ్డుమీదకు.. నాన్న గుండె ఆగిపోయింది!
సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఏఆర్ రెహమాన్ (AR Rahman). ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతం అందించిన ఆయన బాల్యంలో ఎన్నో కష్టాలు చూశాడు. వాటిని తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. నానమ్మ మరణం. నాన్న మరణం.. ఈ రెండూ మా జీవితాలను కుదిపేశాయి. నాన్న చనిపోయినప్పుడు నాకు తొమ్మిదేళ్లే! ఎన్నో అవమానాలుఒంటరి తల్లిగా అమ్మ ఎన్నో బాధలు భరిస్తూ మమ్మల్ని పెంచింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే కుంగిపోకుండా మమ్మల్ని ముందుకు నడిపించింది. నా బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది. నేను అక్కడే పుట్టాను. మా నాన్న అక్కడి స్టూడియోలలోనే పనిచేసేవారు. కోడంబాక్కం దగ్గర్లోనే మేముండేవాళ్లం. నా పేరెంట్స్‌ను వారి కుటుంబసభ్యులే ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. నడివీధిలో నిలబెట్టారు. మాకంటూ మంచి ఇల్లుండాలని నాన్న పగలూరాత్రి తేడా లేకుండా కష్టపడేవాడు. కోలుకోవడానికి చాలా ఏళ్లువిశ్రాంతి లేకుండా రోజులో మూడు ఉద్యోగాలు చేసేసరికి ఆయన గుండె అలిసిపోయి ఒకరోజు ఆగిపోయింది. ఈ విషాదం నుంచి కోలుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది అని చెప్పుకొచ్చాడు. ఏఆర్ రెహమాన్ చివరగా ధనుష్-కృతీ సనన్ల 'తేరే ఇష్క్ మే' సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ 'పెద్ది' మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. అలాగే రామాయణ: పార్ట్ 1, జీనీ వంటి పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్నాడు.చదవండి: అమల అక్కినేని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలుసా? -
రాజాసాబ్: విజిల్స్ వేయించే సాంగ్ వస్తోంది!
డార్లింగ్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలు చేస్తున్నాడు. హను రాఘవపూడితో 'ఫౌజీ', సందీప్‌రెడ్డి వంగాతో 'స్పిరిట్', నాగ్ అశ్విన్‌తో 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్, ప్రశాంత్ నీల్‌తో 'సలార్ 2', మారుతితో 'ది రాజాసాబ్' సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. వీటిలో ది రాజాసాబ్ ఈ ఏడాది డిసెంబర్లో రిలీజవుతుందని మొదట్లో ప్రకటించారు. ఫస్ట్ సాంగ్కానీ, పలు కారణాల రీత్యా దాన్ని వాయిదా వేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ది రాజాసాబ్ నుంచి ఇప్పటివరకు టీజర్, ట్రైలర్ మాత్రమే చూశారు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ రాబోతుందని అప్డేట్ వదిలారు. నవంబర్ 23న రెబల్ సాంగ్ రిలీజ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు (#TheRajaSaab First Single #RebelSaab Release Date). విజిల్ కొట్టించేలా..ఈ పాట మీతో విజిల్ కొట్టించేలా ఉంటుందంటూ ప్రభాస్ పోస్టర్ కూడా షేర్ చేశారు. అందులో ప్రభాస్ ఫుల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ పాట కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్ మూవీ విషయానికి వస్తే ఇందులో నిధి అగర్వాల్, మాళవికా మోహన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. Here comes #TheRajaSaab STYLE 😎Bringing you the MOST WHISTLE WORTHY TREAT #RebelSaab Song on NOV 23rd 🔥A @MusicThaman musical vibe 🎧#TheRajaSaabOnJan9th #Prabhas @DuttSanjay @DirectorMaruthi @AgerwalNidhhi @MalavikaM_ #RiddhiKumar @Bomanirani @vishwaprasadtg… pic.twitter.com/ceNYsGcCZ4— People Media Factory (@peoplemediafcy) November 21, 2025 చదవండి: అమల ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా? -
ఫస్ట్ సినిమాకే హీరోయిన్‌తో ప్రేమ? క్లారిటీ ఇచ్చిన హీరో
బాలీవుడ్లో ఈ ఏడాది సంచలనం సృష్టించిన మూవీ సయారా (Saiyaara Movie). చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. లైగర్ బ్యూటీ అనన్య పాండే కజిన్ అహాన్ పాండే (Ahaan Panday) కథానాయకుడిగా పరిచయం అవగా, బాలీవుడ్ నటి అనీత్ పడ్డా (Aneet Padda) హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తను నా బెస్ట్ఫ్రెండ్ఆన్స్క్రీన్పై జంటగా కనిపించిన వీరు రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై అహాన్ పాండే స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. అనీత్ నా బెస్ట్‌ఫ్రెండ్. సోషల్ మీడియాలో అనుకున్నట్లుగా మేము ప్రేమికులమైతే కాదు. మా మధ్య కెమిస్ట్రీ ఉంది. కానీ అది మీరనుకునే కెమిస్ట్రీ కాదు. కెమిస్ట్రీ అంటే రొమాంటిక్ అని అర్థం కాదు. కంఫర్ట్, భద్రత, ఒకరినొకరు చూసుకోవడం. ఇప్పుడైతే సింగిల్మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. తనతో ఉన్నట్లుగా నేనెవరితోనూ లేను. అలా అని తను నా ప్రేయసి మాత్రం కాదు. ప్రస్తుతానికి నేను సింగిల్ అని చెప్పుకొచ్చాడు. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన సయారా మూవీ జూలై 18న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.570 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.చదవండి: పక్కా ప్లాన్‌తో స్క్రిప్ట్ రాస్తున్నా: కీర్తి సురేశ్ -
ఇఫీ లో వేవ్స్ ఫిల్మ్ బజార్ ప్రారంభం...
భారత 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఇఫీ) లో భాగంగా, 19వ ఫిల్మ్ బజార్ గా కొత్త పేరుతో వేవ్స్ ఫిల్మ్ బజార్‌గా ఘనంగా ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం నవంబర్ 20 నుంచి 28 వరకు జరిగే ఇఫీ దేశంలోని అతిపెద్ద అంతర్జాతీయ చలన చిత్రోత్సవం. ఇది ప్రపంచదేశాల దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, కథా రచయితలను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.ఆసియాలో అత్యంత ప్రముఖమైన ఫిల్మ్ మార్కెట్లలో ఒకటిగా పేరొందిన వేవ్స్ ఫిల్మ్ బజార్, చిత్రకారులను పెట్టుబడిదారులు, స్టూడియోలు, అంతర్జాతీయ భాగస్వాములు, ఫెస్టివల్ ప్రోగ్రామర్లతో కలుపుతూ ప్రత్యేక పరిశ్రమ వేదికగా సేవలు అందిస్తుంది.ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొరియా రిపబ్లిక్కు చెందిన జేవోన్ కిమ్, భారత ప్రభుత్వ సమాచార & ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు, దర్శకుడు గార్త్ డేవిస్, నటుడు అనుపమ్ ఖేర్, కేంద్ర సమాచార & ప్రసార శాఖకు చెందిన డా. ఎల్. మురుగన్, అదనపు కార్యదర్శి ప్రభాత్ కుమార్, వేవ్స్ బజార్ సలహాదారు జెరోమ్ పిలోఆర్డ్, నటుడు నందమూరి బాలకృష్ణ, ఇఫీ ఫెస్టివల్ డైరెక్టర్ శేఖర్ కపూర్ హాజరయ్యారు.వేవ్స్ బజార్ పేరిట ఈ ఏడాది విస్తరించిన కార్యక్రమాలు, అవకాశాల గురించిసంజయ్ జాజుమాట్లాడుతూ “ఈ సంవత్సరం వేవ్స్ ఫిల్మ్ బజార్ 300కి పైగా చిత్రాలతో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వబోతోంది. తొలిసారిగా యువ ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించేందుకు 20,000 అమెరికన్ డాలర్ల నగదు బహుమతిని కూడా ప్రకటిస్తున్నాం” అని తెలిపారు.డా. ఎల్. మురుగన్ మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి గారు WAVES గురించి పేర్కొన్నట్లుగా, ఉత్పత్తి, డిజిటల్ కంటెంట్, గేమింగ్, ఫ్యాషన్, సంగీత రంగాల్లో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతోంది. WAVES ఫిల్మ్ బజార్ థియేటర్ల నుండి ప్రపంచ నిర్మాతల వరకు ఉన్న అంతరాన్ని తగ్గించి యువ ప్రతిభలకు వేదికగా నిలుస్తుంది” అన్నారు.ఈ వేడుకలో కొరియన్ అతిథి జేవోన్ కిమ్ “వందే మాతరం” గానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులు అందరూ లేచి కలిసి పాడిన ఈ ఘట్టం కార్యక్రమానికి ప్రత్యేకమైన ఉత్సాహాన్ని అందించింది.అంతర్జాతీయ పాల్గొనుదల, కొత్త గ్రాంట్ వ్యవస్థలు, బలమైన పరిశ్రమ వేదికలతో వేవ్స్ ఫిల్మ్ బజార్ IFFIని ప్రపంచ సినీ సహకారం మరియు సృజనాత్మక మార్పిడికి కీలక కేంద్రంగా నిలుపుతోంది. -
ప్రియాంక పీఆర్ స్టంట్? వాళ్లు నిజమైన ఫ్యాన్స్ కాదా?
సెలబ్రిటీలు కనిపిస్తే చాలు సెల్ఫీ ప్లీజ్ అని జనాలు వెంటపడతారు. ఎయిర్‌పోర్టులోనూ ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) వెంట సైతం ఫ్యాన్స్.. ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అని వెంటపడుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఓ పాత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో ప్రియాంకను ఇద్దరు అభిమానులు పదేపదే ఆటోగ్రాఫ్ అడిగారు. పీఆర్ స్టంట్?తను కూడా వారి అభ్యర్థనను తిరస్కరించకుండా రెండుసార్లు ఆటోగ్రాఫ్ ఇచ్చింది. ఇది చూసిన జనాలు ఇది కచ్చితంగా పీఆర్ స్టంటే, వాళ్లసలు అభిమానులే కాదని విమర్శించడం మొదలుపెట్టారు. ఈ వైరల్ వీడియోపై హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ స్పందించింది. 'ఇది పీఆర్ స్టంట్ అని నేననుకోవడం లేదు. వాళ్లు ఆమెను విమానాశ్రయం లోపల నుంచి వెంబడిస్తున్నారు. అది నిజం కాదువీలైనన్ని సార్లు ప్రియాంక సంతకాన్ని సేకరించారు. ఆ ఆటోగ్రాఫ్స్ని వారు ఆన్లైన్లో అమ్ముకుంటారు. నేను కూడా మొదట మీలాగే పొరబడ్డాను. కానీ వాళ్లిద్దరూ ఆమెను వదిలిపెట్టలేదు. తన వెంటపడ్డారు. దాంతో ప్రియాంక.. మంచితనంతో ఓపికగా అడిగిన ప్రతిసారి సంతకం చేసిందంతే! అని చెప్పుకొచ్చింది.తెలుగులో ఎంట్రీఇకపోతే బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా చాలాకాలం తర్వాత ఇండియన్ సినిమాకు రీఎంట్రీ ఇస్తోంది. అది కూడా తెలుగు సినిమా వారణాసితో! టాలీవుడ్లో ఇదే తన తొలి మూవీ కావడం విశేషం. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం 2027లో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Timesapplaud Buzz (@timesapplaudbuzz) చదవండి: పవన్ తండ్రికి క్యాన్సర్.. నోరు తిరగక, తిండి తినక.. -
‘రవితేజ ముందు ఒకలా..నరేశ్ ముందు మరోలా’ అని విమర్శించారు: భీమ్స్
‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో ‘12ఎ రైల్వే కాలనీ’ డిఫరెంట్ జోనర్ సినిమా. ఈ సినిమా మ్యూజిక్ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. శ్రీనివాసాగారు, నరేశ్‌గారు, డైరెక్టర్, రచయితలు నమ్మడం వల్లే నేను చేయగలిగాను. ఈ మూవీ ఔట్పుట్ చూశాక వారందరూ సంతోషంగా ఉన్నారు’’ అని సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో(Bheems Ceciroleo ) తెలిపారు. ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన చిత్రం ‘12ఏ రైల్వే కాలనీ’(12A Railway Colony). పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ– ‘‘మొదటిసారి ‘12ఏ రైల్వే కాలనీ’ లాంటి థ్రిల్లర్ మూవీకి సంగీతం ఇవ్వడం కొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి జానర్లోనూ నేను సినిమా చేయగలను అనే నమ్మకాన్ని ఈ ప్రాజెక్టు ఇచ్చింది. నరేశ్‌గారికి గతంలో గుర్తుండిపోయే పాటలు ఇచ్చాను. ఈ సినిమాలో రెండు మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ గురించి ఆలోచించను. నేను ఆ జోనర్లో లేను. నన్ను నమ్మి సినిమా ఇస్తే ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ మధ్య కొన్ని కామెంట్స్ చూశాను. రవితేజగారు స్టేజ్‌పై ఉన్నప్పుడు ఒకలా, నరేశ్‌గారు స్టేజ్‌పై ఉన్నప్పుడు మరోలా మాట్లాడానని కామెంట్లు పెట్టారు. సంగీత దర్శకుడిగా నాకు మొదట అవకాశం ఇచ్చింది నరేశ్‌గారు... ఆగిపోయిన నా కెరీర్‌కి పునర్జన్మ ఇచ్చింది రవితేజగారు. ఇదే విషయాన్ని నేను చెప్పాను. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక విమర్శలు చేశారు. ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, డెకాయిట్, టైసన్ నాయుడు, భోగి, ఫంకీ’ వంటి సినిమాలకి సంగీతం అందిస్తున్నాను’’ అని చెప్పారు. -
నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం: నాగచైతన్య
‘‘ఒక నటుడిగా, ప్రేక్షకుడిగా నాకు లవ్‌స్టోరీ సినిమాలంటే పిచ్చి ఇష్టం. కోవిడ్ తర్వాత అందరూ యాక్షన్ , సినిమాటిక్ యూనివర్స్, కొత్త వరల్డ్ నేపథ్యంలో వచ్చే సినిమాలకే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెప్పారు. కానీ ప్రేమకథలు థియేటర్స్‌లోకి వస్తే, విజయాలు సాధిస్తాయని ఇటీవల మరోసారి ప్రూవ్ అయ్యింది. లవ్‌స్టోరీస్ టైమ్‌లెస్’’ అని చెప్పారు నాగచైతన్య. ప్రియదర్శి, ఆనంది జంటగా, సుమ కనకాల కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ప్రేమంటే..’. నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రానా సమర్పణలో పుస్కూర్ రామ్మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరై, బిగ్ టికెట్‌ను లాంచ్ చేశారు. తొలి టికెట్‌ను రూ.లక్షా పదహారువేల నూటపదహార్లకు కడివేలు సాయి కొనుగోలు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఉన్న విలక్షణ నటుల్లో ప్రియదర్శి ఒకరు. స్మాల్, బిగ్ బడ్జెట్ చిత్రాలు.. హారర్, కామెడీ, యాక్షన్ , లీడ్ యాక్టర్, హీరో... ఇలా తను ఒక మంచి కెరీర్‌ను బిల్డ్ చేసుకున్నాడు. నవనీత్ ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. సుమగారు యాక్ట్ చేయడం ఓ సర్ప్రైజ్. ఈ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’’ అని చెప్పారు.‘‘ప్రియదర్శి మంచి సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నవనీత్ టెన్షన్ లేకుండా కనిపిస్తున్నాడు. సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. చిన్న సినిమాలు బాగా ఆడుతున్న టైమ్ ఇది. ఈ యంగ్ టీమ్ చేసిన ఈ చిత్రం సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు శేఖర్ కమ్ముల. ‘‘ఏషియన్స్ ప్రొడక్షన్స్ హౌస్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలో నేను సినిమా చేసే అవకాశాన్ని ఫ్యాన్స్ ప్రేమ వల్లే పొందగలిగాను’’ అన్నారు ప్రియదర్శి. ‘‘పెళ్లయిన తర్వాత ఎంత కొట్లాడుకున్నా, ఎంత అరుచుకున్నా, ఒక చాయ్ తాగుతూ మాట్లాడుకుని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు’ అన్నదే ఈ సినిమా కథ’’ అని తెలి΄ారు నవనీత్. తెలుగు పరిశ్రమలోనివారిపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నవారిని హైపర్ ఆది విమర్శించారు. నిర్మాతలు సురేష్‌బాబు, జాన్వీ నారంగ్ మాట్లాడారు. -
పదేళ్ల తర్వాత నా లైఫ్ మారబోతుంది : అఖిల్
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ఉంటున్న నాకు సరైన బ్రేక్ రాలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది’’ అని హీరో అఖిల్ రాజ్(Akhil Raj) చెప్పారు. సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.తేజస్విని మాట్లాడుతూ– ‘‘రాంబాయి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు సాయిలుగారు సపోర్ట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా.ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చు. ఆ చిత్రాల్లాగే మా సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుంది’ అన్నారు. -
ఐదు డిఫరెంట్ రోల్స్‌లో జ్యోతి.. ‘కిల్లర్’తో సరికొత్త ప్రయత్నం
‘‘తెలుగు సినిమా కొత్తదారిలో వెళుతున్న ఈ సమయంలో మేం చేసిన ‘కిల్లర్’ మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు దర్శక–నిర్మాత–నటుడు పూర్వజ్. జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ నటించిన సినిమా ‘కిల్లర్’. పూర్వజ్ దర్శకత్వంలో ఉర్వీశ్ పూర్వజ్ సమర్పణలో పూర్వజ్, పద్మనాభ రెడ్డి. ఎ నిర్మించిన ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలోని ‘ఫైర్ అండ్ ఐస్’ సాంగ్ లాంచ్ ఈవెంట్లో పూర్వజ్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో స్పై, వాంపైర్, సూపర్ షీ, టెర్రరిస్ట్, రక్షా రై... ఇలా ఐదు డిఫరెంట్ రోల్స్‌లో నటించారు జ్యోతి. ఈ సైన్స్ ఫిక్షన్ స్టోరీని ఆడియన్స్ థియేటర్స్‌లోనే చూడాలి’’ అని చెప్పారు. ‘‘డాక్టర్ కావాలనుకుని ఐటీ కంపెనీలో పని చేశాను. ఆ తర్వాత సీరియల్స్‌లో పాపులరై, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాను. ‘కిల్లర్’ కొత్త తరహా కంటెంట్’’ అన్నారు జ్యోతి పూర్వజ్. ‘‘కిల్లర్’లోని విజువల్స్, సాంగ్, ఔట్పుట్ చూసి సర్ప్రైజ్ అయ్యాం’’ అని చెప్పారు పద్మనాభరెడ్డి. -
పైరసీ చేసేవాళ్లను ఎన్కౌంటర్ చేయాలి: నిర్మాత సి.కళ్యాణ్
పైరసీ చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి అని డిమాండ్ చేశారు ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్. పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి, సీపీ సజ్జనార్‌కి సినీ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వందలాది మంది కష్టం సినిమా. అలాంటి కష్టాన్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. నేను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీగా ఉన్న సమయంలో.. యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటైంది. పైరసీని అరికట్టడం సాధ్యమేనా? అని అప్పుడు చాలామంది అడిగారు. మన ఇండస్ట్రీని మనం కాపాడుకోవాలన్న బాధ్యతతో దానిని ప్రారంభించాం. కొందరు రిటైర్ పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.పైరసీ అరికట్టేందుకు ఫిలిం చాంబర్లో ఏర్పాటు చేసి పైరసీ సెల్ ఎంతో కృషి చేసింది. ఇక్కడే కాదు విదేశీ సినిమాల విషయంలోనూ పైరసీని అరికట్టేందుకు ఈ విభాగం ఎంతో పని చేసింది. ఆస్ట్రేలియా, ఫ్రెంచ్ దేశాలకు చెందిన సినీ పెద్దలను పైరసీ సెల్‌ని అభినందిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ‘ఐబొమ్మ’ వాళ్లను పట్టుకోవడంతో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసు డిపార్ట్మెంట్కి టాలీవుడ్ తరపున ధన్యవాదాలు. పైరసీ అరికట్టడంతో ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తాం’ అన్నారు. ఫిలిం చాంబర్ అధ్యక్షకులు భరత్ భూషన్ మాట్లాడుతూ.. ‘ఛాంబర్ కు సంబంధించిన వీడియో పైరసీ సెల్ కూడా పైరసీకి అరికట్టేందుకు ఎంతో కృషి చేస్తుంది. పైరసీ చేస్తున్న వాళ్ళను అరెస్ట్ చేసిన తెలంగాణా ప్రభుత్వానికి , సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు’ అన్నారు.చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... " పోలీస్ వారిని, ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాలను పైరసీలో చూస్తున్నారు అంటున్నారు. కానీ ఈ పరిస్థితి వల్ల మిగతా చిన్న సినిమాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. అలాగే సినిమా క్యూబ్, యుఎఫ్ఓ వెళుతున్న సంగతి అర్థమవుతుంది. వారి సర్వర్లు బలంగా ఉండేలా చూసుకోవాలి" అని అన్నారు.వల్లభనేని అనిల్ కుమార్ మాట్లాడుతూ... "సినిమాలు ప్రస్తుతం విజయం సాధించలేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. అది టెక్నాలజీ మారుతూ వచ్చిన ప్రతిసారి పైరసీ కూడా రూపం మార్చుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం జరిగింది. అది సినీ పరిశ్రమకు వరం. టికెట్ ధరలు కూడా కుటుంబంతో సహా వచ్చి చూసే విధంగా టికెట్ ధరలు ఉండేలా చూడాలి. పైరసీని పూర్తిగా అరికడితేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు" అని అన్నారు. -
స్పీడ్ పెంచిన రాజ్ తరుణ్.. ఈ సారి థ్రిల్లర్‌తో!
రాజ్‌తరుణ్, అమృత చౌదరి జంటగా, అవసరాల శ్రీనివాస్, ధన్యా బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో ‘టార్టాయిస్’ అనే కొత్త సినిమా ఆరంభమైంది. రిత్విక్ కుమార్ దర్శకత్వంలో ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కే గోల్డెన్ ఆర్ట్స్, చందమామ క్రియేషన్స్, ఎన్వీఎల్ క్రియేషన్స్‌పై శశిధర్ నల్ల, విజయ్ కుమార్, ఇమ్మడి సంతోష్, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ– ‘‘టార్టాయిస్’ చిత్రం చాలా కొత్తగా, వైవిధ్యంగా ఉంటుంది. నా కెరీర్‌కు కిక్ ఇచ్చే చిత్రం ఇది’’ అని తెలిపారు. ‘‘సరికొత్త స్క్రీన్ ప్లేతో సాగే థ్రిల్లర్ చిత్రం ఇది’’ అన్నారు రిత్విక్ కుమార్. ‘‘త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అని శశిధర్ నల్ల, విజయ్ కుమార్, సంతోష్ ఇమ్మడి, రామిశెట్టి రాంబాబు పేర్కొన్నారు. ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్స్ అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. -
NBK 111: పవర్ఫుల్ క్వీన్‌గా నయనతార!
లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara ) టాలీవుడ్లో మళ్లీ బిజీ అయింది. కొన్నాళ్ల పాటు తెలుగు తెరపై అంతగా కనిపించని నయన్..ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాలోనూ నయన్ హీరోయిన్గా నటించబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా(#NBK111) చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార నటించబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. నేడు(నవంబర్ 18) నయనతార బర్త్‌డే. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నయనతార పవర్ఫుల్ మహారాణి పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘సముద్రమంత ప్రశాంతతను, తుపాను అంత బీభత్సాన్ని తనలో మోసే రాణి మా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టనుంది’ అంటూ వీడియోతో ద్వారా చిత్ర యూనిట్ నయనతారకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, బాలయ్యతో నయనతార ఇప్పటికే మూడు సినిమాల్లో నటించింది. తొలుత సింహా చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. ఆ తర్వాత ‘జై సింహా’, ‘శ్రీరామరాజ్యం’ చిత్రాల్లోనూ ఈ హిట్ జోడీ రిపీట్ అయింది. ఇప్పుడు నాలుగోసారి వెండితెరపై ఈ జంట అలరించబోతుంది. గతంలో మలినేని గోపిచంద్, బాలయ్య కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కావడంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. -
సమాజానికి సందేశం ఇచ్చేలా ‘నా తెలుగోడు’
హరినాథ్ పొలిచర్ల హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నా తెలుగోడు’(Na Telugodu). తనికెళ్ల భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నిధి పాల్, రోనీ కౌలా, సోఫియా తన్వీర్ ఇతర పాత్రలు పోషించారు. డ్రీం టీం ప్రొడక్షన్స్‌పై రూపొందిన ఈ సినిమా డిసెంబరుర్ 12న విడుదల కానుంది. హరినాథ్ పొలిచర్ల మాట్లాడుతూ–‘‘ఈ సినిమాలో సైనికుడిగా చేశాను. సైనికులు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేస్తారు. వారి జీవితంతో పాటు డ్రగ్స్ నుండి సమాజాన్ని కాపాడాలి, మహిళలను సంరక్షించాలంటూ సమాజానికి సందేశం ఇచ్చే అంశాలను మా చిత్రంలో చూపించాను. ఎన్టీఆర్‌గారి స్ఫూర్తితో ‘నా తెలుగోడు’ టైటిల్ పెట్టడం గర్వంగా ఉంది. మా చిత్రాన్ని ‘ఆర్కే’ పేరుతో హిందీలో విడుదల చేయనున్నాం’’ అన్నారు. -
'తు మేరా లవర్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)కు గడ్డుకాలం నడుస్తోంది. ఏ సినిమా చేసినా వైఫల్యమే ఎదురవుతోంది. తనకు మంచి హిట్టు పడి చాలాకలమే అవుతోంది. ఇటీవల ఆయన మాస్ జాతరతో ప్రేక్షకుల్ని పలకరించాడు. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయకుండానే కనుమరుగైపోయింది.వీడియో సాంగ్ రిలీజ్అయితే ఇందులోని కొన్ని పాటలు మాత్రం బాగానే క్లిక్కయ్యాయి. అందులో ఒకటి 'తు మేరా లవర్' సాంగ్. ఇడియట్ సినిమాలోని 'చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే..' పాటను రీమిక్స్ చేసి ఈ సాంగ్ తెరకెక్కించారు. సోమవారం (నవంబర్ 17న) తు మేరా లవర్ పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇందులో రవితేజ మాస్ స్టెప్పులు మీరూ చూసేయండి.. చదవండి: సినిమా ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ -
ఇండస్ట్రీకి నా అవసరం లేదు: హనీరోజ్ ఎమోషనల్
మలయాళ బ్యూటీ హనీరోజ్ (Honey Rose) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా తను ప్రధాన పాత్రలో నటించిన రాహెల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఎమోషనల్ కామెంట్స్ చేసింది. హనీరోజ్ మాట్లాడుతూ.. మలయాళ సినిమాకు నా అవసరం ఉందా? అని నన్ను అడిగితే లేదనే చెప్తాను. నేనే ఈ ఇండస్ట్రీకి గట్టిగా అతుక్కుపోయాను.వేలు పట్టుకుని నడిపించారునేను ఇండస్ట్రీలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. దర్శకుడు వినాయన్ సర్ మొదటి నుంచి నా చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవుతుందని ఆయన భావిస్తున్నారనుకుంటా! నాకు బోలెడన్ని అవకాశాలు రావాలి.. వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ పోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. వచ్చినవాటిలో ఉత్తమమైన వాటినే ఎంపిక చేసుకుంటాను. వాటికోసమే కష్టపడతాను. సినిమా అంటే నాకు అంత పిచ్చి అని హనీరోజ్ చెప్పుకొచ్చింది. ఊహించినదానికన్నా అద్భుతంగా..వినాయన్ మాట్లాడుతూ.. మలయాళంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ల కంటే కూడా హనీరోజ్ ఎక్కువ సంపాదిస్తుంది. ఆమెకు ఈవెంట్లు, ప్రోగ్రామ్‌ల ద్వారా మంచి ఆదాయం వస్తుంది. కానీ, తనకు డబ్బు కన్నా సినిమా అంటేనే ఎక్కువ ఇష్టం. రాహేల్లో హనీ.. నేను ఊహించినదానికన్నా అద్భుతంగా నటించింది అని చెప్పుకొచ్చాడు. ఈమె తెలుగులో ఆలయం, ఈ వర్షం సాక్షిగా, వీర సింహా రెడ్డి చిత్రాల్లో నటించింది.చదవండి: రాహేలు ట్రైలర్ చూశారా? -
లాభాలతో పాటు గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా
రియోరాజ్, మాళవిక మనోజ్ జంటగా నటించిన తమిళ చిత్రం ఆన్‌పావం పొల్లాదదు (Aan Paavam Pollathathu Movie). ఆర్జే విగ్నేష్కాంత్, షీలా, జెన్సన్ దివాకర్ ముఖ్యపాత్రులు పోషించిన ఈ చిత్రం ద్వారా కలైయరసన్ తంగవేల్ దర్శకుడుగా పరిచయమయ్యారు. డ్రమస్టిక్ ప్రొడక్షన్స్ పతాకంపై వెడిక్కారన్‌పట్టి ఎస్ శక్తివేల్ నిర్మించిన ఈ చిత్రానికి టీకేటీ నందకుమార్, ఎంఎస్కే ఆనంద్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేసింది. బ్లాక్‌షిప్ ఫైండింగ్స్ సంస్థ సహకారంతో రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో థాంక్స్ గివింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఆర్జే విఘ్నేశ్‌కాంత్ మాట్లాడుతూ.. నిన్నటి జ్ఞాపకాలను మధురంగానూ, నేటి జ్ఞాపకాలను అనుభవాలుగానూ, రేపటి కలలను నిజం చేసేలా తాము నాటిన ఈ విత్తనానికి ఆదరణ తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడు కలైయరసన్ తంగవేల్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని కథా రచయిత శివకుమార్ మురుగేశన్‌తో కలిసి పంచుకుంటున్నానని అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ అందరూ ఒక కుటుంబం మాదిరి పని చేశారన్నారు. తాము ఇంతకుముందు నిర్మించిన కొన్ని చిత్రాలు విమర్శలను ఎదుర్కొన్నా, కమర్షియల్‌గా హిట్ అయ్యాయన్నారు. అయితే ఆన్‌పావం పొల్లాదదు చిత్రం లాభాలు తెచ్చిపెట్టడంతోపాటు తమ గౌరవాన్ని పెంచిందన్నారు. రియోరాజ్ మాట్లాడుతూ ఇకపై కూడా మీకు నచ్చే కథా చిత్రాలనే చేస్తానని అన్నారు. -
Awara Re-Release: మరోసారి థియేటర్స్‌లో ‘ఆవారా’
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. స్టార్ హీరోల సినిమాలతోపాటు చిన్న హీరోల మూవీస్ కూడా థియేటర్లలో రీరిలీజ్ అవుతూ ఎంతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని చిత్రాలు రిలీజ్ సమయంలో కంటే రీరిలీజ్‌లో మరింత ఎక్కువ వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇలా రీరిలీజ్ సినిమాలు ఎంజాయ్ చేస్తున్నా సిని లవర్స్‌కు ఇప్పుడు మరో గుడ్ న్యూస్ అందింది. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘ఆవారా’ చిత్రం రీరిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.కార్తీ, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి ఎన్. లింగుస్వామి దర్శకత్వం వహించారు. 2010లో విడుదలైన ‘ఆవారా’ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, యూత్‌ను కట్టిపడేసిన సాంగ్స్‌తో ఇప్పటికీ గుర్తుండిపోతోంది. ఈ పాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్‌గా రికార్డులు సృష్టించిన ‘ఆవారా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ది ఎవర్ రిఫ్రెషింగ్ లవ్ స్టోరీ ఆవారా... నవంబర్ 22న తిరిగి థియేటర్లలో! మ్యూజికల్ హిట్‌ను మరోసారి ఎంజాయ్ చేయండి’ అంటూ విడుదల చేసిన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కళ్ల ముందే ఓ ప్రాణం పోయింది, నెక్స్ట్ నా వంతే!
పులి కడుపున పులే పుడుతుందంటారు. లెజెండరీ యాక్షన్ డైరెక్టర్ వీరు దేవ్‌గణ్ ఎన్నో సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేశారు. కొన్ని చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. తన శరీరంలో ఎన్ని ఎముకలు విరిగినా సరే ఏమాత్రం జంకకుండా ఎన్నో సినిమాలకు స్టంట్‌మెన్‌గా వ్యవహరించారు. తండ్రి ధైర్యమే కొడుక్కీ వచ్చింది.ప్రాక్టీస్ చేయకుండా దూకేశాడుబాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ (Ajay Devgn) కూడా సాహసోపేతమైన సన్నివేశాలకు వెనకడుగు వేయడు. దేదే ప్యార్ దే 2లోనూ అలాంటి స్టంట్లు చేశాడు. 'విమానంలోనుంచి దూకే సన్నివేశం అది.. కనీసం ఒక్కసారి కూడా ప్రాక్టీస్ చేయకుండానే విమానంలో నుంచి సడన్‌గా దూకి స్కైడైవింగ్ చేశాడు' అని నటుడు మాధవన్ అజయ్ గురించి గొప్పగా చెప్పాడు.కళ్ల ముందే ఓ ప్రాణంఇంతలో అజయ్ అందుకుంటూ.. నేను షూటింగ్ లొకేషన్‌కు వెళ్లగానే ఓ బాధాకర సంఘటన జరిగింది. నా కళ్లముందే ఒక వ్యక్తి పారాచూట్ పని చేయక లోయలో పడి చనిపోయాడు. తర్వాత నావంతు వచ్చింది. ఇది ప్రమాదకరమైనప్పటికీ నేనే రిస్క్ చేసి దూకుతున్నాను తప్ప ఎవరి బలవంతం లేదు అని ఓ వీడియో రికార్డ్ చేసి నా సీన్ పూర్తి చేశాను. ఆ హీరోకీ తప్పలేదు!హాలీవుడ్ స్టార్ లినార్డో డికాప్రియోకి కూడా ఈ లొకేషన్లో చేదు అనుభవం ఎదురైంది. ఒకసారి సినిమా షూటింగ్లో భాగంగా ఇక్కడే స్కైడైవింగ్ చేశాడు. అతడి పారాచూట్ పనిచేయకపోయేసరికి అక్కడున్న ఇన్స్ట్రక్టర్ వెంటనే దూకి అతడి ప్రాణాలు కాపాడాడు అని గుర్తు చేసుకున్నాడు.చదవండి: కుమిలి కుమిలి ఏడ్చా!: మంచు లక్ష్మి -
అర్థరాత్రి 2 గంటలకు ఫోన్..నాకేంటి అనేవాళ్లు : నటి
‘తెలుగమ్మాయిలు ఎక్స్‌ఫోజింగ్ చేయమంటే చేయలేరు.. అందుకే అవకాశాలు రావు’ అని చెప్పేవాళ్లకు..‘అది తప్పు మేం కూడా కథ డిమాండ్ చేస్తే అలాంటి సీన్స్ చేయగలం’ అని నిరూపించడానికే బోల్డ్ ఫోటో షూట్ చేశానని అంటోంది నటి దక్షి గుత్తికొండ(Dakkshi Guttikonda). ఆర్జీవీ ‘కరోనా వైరస్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ విజయవాడ అమ్మాయి.. కొత్త పోరడు వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. అయితే సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది. ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ని అలరిస్తుంది. అయితే ఒకరు ధరించే దుస్తులను చూసి వారి క్యారెక్టర్ని అంచనా వేయొద్దని చెబుతోంది దక్ష. తాజాగా ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది.అలా సినిమాల్లోకి.. చిన్నప్పటి నుంచి నాకు సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చినా..అమ్మ చేయనీయలేదు. చదవు పూర్తయిన తర్వాత సినిమాల్లోకి వెళ్లమని చెప్పింది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చా. కరోనా సమయంలో ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఆడిషన్స్ కోసం వెళ్లాను. ఒక్కరోజులోనే ఆడిషన్స్, లుక్‌టెస్ట్ పూర్తి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా ‘కరోనా వైరస్’ సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యాను.ఆర్జీవీ బోల్డ్‌గా చూపిస్తారు కానీ..ఆర్జీవీ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చినప్పుడు భయపడ్డాను. మీడియాలో ఆయనను చూపించే కోణం వేరు. ఆయనను బోల్డ్‌గా చూపించారు. నాకే కాదు కొత్తగా వచ్చిన అమ్మాయిలకు ఆర్జీవీని కలవాలంటే కాస్త భయమే. కానీ బయట మాత్రం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనకున్నంత సినిమా నాలెడ్జ్ ఇంకెవరీకీ లేదు. చాలా తక్కువ మాట్లాడతారు. కరోనా వైరస్ సినిమా సమయంలో నేను 12 రోజుల పాటు షూటింగ్లో పాల్గాన్నా. చాలా బాగా చూసుకున్నారు.కొత్త అమ్మాయిలకు తప్పవు..సినిమా ఇండస్ట్రీ ఒక్కటే కాదు ఎక్కడగా అమ్మాయిలకు వేధింపులు ఉన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ అనేది అంతటా ఉంది. కెరీర్ ప్రారంభంలో నేను కూడా అది ఫేస్ చేశా. కొంతమంది అర్థరాత్రి 2-3 గంటలకు ఫోన్ చేసేవారు. చాలా పెద్ద సినిమాలో అవకాశం ఇప్పిస్తామని.. నీ కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుందని చెప్పి చివరిలో ‘నాకేంటి’ అనేవాళ్లు. స్టార్టింగ్‌లో అలా అడిగితే చాలా ఏడ్చాను. కానీ కొన్నాళ్ల తర్వాత తిరిగి నేనే మారిపోయాను. ఎవరైనా కాల్ చేస్తే..‘మీకు అలాంటి వాళ్లు కావాలంటే వేరే వాళ్లు ఉంటారు అక్కడకు వెళ్లండి...ఆర్టిస్ట్ కోసం అయితే నా దగ్గరకు రండి’ అని చెప్పేదాన్ని. అర్థరాత్రి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఉదయం చేసేదాన్ని.కొంతమంది ఫోన్ లిప్ట్ చేసేవాళ్లు కాదు. నాకే కాదు ఏ అమ్మాయికి అయినా ఇలాంటి వేధింపులు కామన్. కొత్తగా ఓ అమ్మాయి వస్తుందంటే చాలు..అలాంటి వెదవలు కాల్ చేస్తునే ఉంటారు. అమ్మాయిలు ఎలా డీల్ చేశారనేది ముఖ్యం. కొంతమంది అమ్మాయిలు స్కిన్ షో చేసి చాన్స్‌లు కొట్టేస్తారు. అయితే వాళ్లకు నాలుగైదు చాన్స్ వస్తాయంటే..అంతకు మించి ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు ఉండలేరు’ అని దక్షి చెప్పుకొచ్చింది. -
‘రాజు వెడ్స్ రాంబాయి’ అలాంటి కథే : దర్శకుడు
‘‘2004లో జరిగిన ఓ వాస్తవ ఘటన గురించి నా చిన్నప్పుడు విన్నాను. ఆ నేపథ్యంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ రాసుకున్నాను. ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు... కానీ, అలాంటిదే. ప్రేమికులకు ఏం జరిగింది? అనేది మాత్రం తెరపైనే చూడాలి’’ అని డైరెక్టర్ సాయిలు కంపాటి తెలిపారు. అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్‌పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సాయిలు కం΄ాటి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్స్ వేణు ఊడుగుల, శ్రీకాంత్ అడ్డాలగార్ల దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. వేణు ఊడుగుల అన్నకు నేను చెప్పిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ నచ్చడంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీ విన్ వాళ్లు కూడా మా ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా ఔట్పుట్ చూసి వేణు అన్న, బన్నీ వాసు, వంశీ నంది΄ాటిగార్లు సంతోషించారు. మా కంటెంట్ మీద మాకు నమ్మకం ఉంది. అందుకే ఈ నెల 21న ఎక్కువ సినిమాలు విడుదలవుతున్నా ఒత్తిడిగా భావించడం లేదు. నా తదుపరి సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. వేణు అన్న ఓ నిర్మాతగా ఉంటారు. ఆ ్ర΄ాజెక్ట్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. -
‘వారణాసి’ చూసి యావత్ దేశం గర్వపడుతుంది: మహేశ్ బాబు
నాన్నగారు(కృష్ణ) ఎప్పుడూ నన్ను ఒక మాట అడుగుతూ ఉండేవారు. ‘నువ్వు పౌరాణిక పాత్ర చేస్తే చూడాలని ఉంది’ అని చాలా సార్లు అడిగారు. ఈ విషయంలో నేను ఆయన మాట వినలేదు. ఇన్నాళ్లకు వారణాసి(Varanasi)లో అలాంటి పాత్ర చేశా. ఆయన ఎక్కడ ఉన్నా ఆశిస్సులు మనతో ఉంటాయి’ అన్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu). రాజమౌళి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం ‘వారణాసి’. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించాడు. గ్లోబ్ ట్రాటర్ పేరుతో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్లో శనివారం ఈ మూవీ టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు.ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..‘వారణాసి నా డ్రీమ్ ప్రాజెక్ట్. జీవితంలో ఒక్కసారి మాత్రం ఇలాంటి సినిమా చేసే అవకాశం వస్తుంది. దీని కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతా. అందరూ గర్వపడేలా చేస్తా. ముఖ్యంగా రాజమౌళి గర్వపడేలా శ్రమిస్తా. ఈ మూవీ విడుదలైన తర్వాత యావత్ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈ ఈవెంట్ కేవలం టైటిల్ ప్రకటన కోసమే. ముమ్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. మీ(ఫ్యాన్స్) సపోర్ట్ ఎప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. మీరు చూపించే అభిమానానికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. ఈ ఈవెంట్ ఇంత సజావుగా జరిగేలా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు’ అని అన్నారు. ఎంఎం కీరవాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
'ఐ-బొమ్మ' రవి అరెస్ట్.. పోలీసుల చేతిలో కీలక ఆధారాలు!
పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ(iBomma ) నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో రవి(Immadi Ravi)ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టుకి తరలించారు. రవి నుంచి వైరసీ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. రవి ఆంధప్రదేశ్‌లోని వైజాగ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.కూకట్‌పల్లిలోని అపార్ట్మెంట్లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్క్‌లు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్ చేసినట్టు సమాచారం. రవిని అదుపులోకి తీసుకొని విచారించగా..సంచలన విషయాలు బయటపడ్డాయట. పైరసీ వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్న మరికొంతమంది పేర్లు కూడా వెల్లడించినట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంపై గతంలో ఐ-బొమ్మపై తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వెబ్సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాలు విసిరారు. ఆ ఛాలెంజింగ్‌గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు వారిపై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని.. శనివారం ఉదయం కూకట్‌పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. రవి కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. -
దానికంటే ముందు చాలా సినిమాలు రిజెక్ట్ చేశా!
'ఓం శాంతి ఓం' సినిమాతో బాలీవుడ్లో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది దీపికా పదుకొణె (Deepika Pdukone). తక్కువకాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. అయితే ఓం శాంతి ఓం కంటే ముందు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని, వాటన్నింటినీ తాను వదిలేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో దీపిక మాట్లాడుతూ.. కొన్నిసార్లు మనం చూస్తుండగానే అన్నీ జరిగిపోతుంటాయి. నేను రెండేళ్లు మోడల్‌గా చేశాను. రెడీగా లేనుఅప్పటినుంచే సినిమా ఛాన్సులు రావడం మొదలైంది. చాలామంది దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు. కానీ, అప్పటికి నేను సిద్ధంగా లేను. గ్లామర్ ప్రపంచంలో మోడల్‌గా అప్పుడే కదా కెరీర్ ప్రారంభించాను. ఇక్కడినుంచి సినిమాలకు షిఫ్ట్ అవడానికి ఇంకాస్త సమయం తీసుకోవాలనుకున్నాను. అందువల్లే నాకు వచ్చిన ఆఫర్లను ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేశాను. నన్ను నమ్మి ఛాన్సులిచ్చిన అందరికీ నేనెంతో కృతజ్ఞురాలిని.ఎప్పుడూ నేర్చుకుంటూనే..ఓం శాంతి ఓం ఆఫర్ చేసినప్పుడు ఇదే కరెక్ట్ టైం అనిపించి సెట్లోకి అడుగు పెట్టాను. ర్యాంప్ వాక్ అయినా, యాక్టింగ్ అయినా.. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండేదాన్ని. ఇండస్ట్రీని, కళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పటికీ సెట్లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే గతంలో కంటే ఇప్పుడు నేను ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నాను. అప్పుడు నేను చేసేది కరెక్టేనా? జనాలు ఏమనుకుంటారు? ఇలాంటి ఆలోచనలుండేవి. సినిమాకానీ, ఇప్పుడు నాకు నచ్చింది చేస్తున్నా.. నాకు నచ్చినట్లే ఉంటున్నా అని చెప్పుకొచ్చింది. దీపికా.. ఓం శాంతి ఓం సినిమా కంటే ముందు కన్నడలో ఐశ్వర్య అనే మూవీ చేసింది. తర్వాత మళ్లీ సాండల్‌వుడ్‌లో కనిపించనేలేదు. ఈమె తెలుగులో కల్కి 2898 ఏడీ సినిమా చేసింది. అయితే కొన్ని ప్రత్యేక డిమాండ్లు చేసిందన్న కారణంతో కల్కి సీక్వెల్ నుంచి ఆమెను తప్పించారు. అలాగే ప్రభాస్ స్పిరిట్ మూవీలోనూ నటించే ఛాన్స్ వచ్చినప్పటికీ సడన్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగింది. ప్రస్తుతం అల్లు అర్జున్- అట్లీ, షారూఖ్ ఖాన్ 'కింగ్' సినిమాలు చేస్తోంది.చదవండి: సస్పెన్స్‌కు బ్రేక్.. వీడియో షేర్ చేసిన తెలుగు సీరియల్ నటి -
Paisawala: ఆకట్టుకుంటున్న ‘పైసా.. పైసా’ సాంగ్
అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పైసావాలా’. కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, , వీకేఎం మూవీస్ బ్యానర్లపై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన లవ్ సాంగ్ ‘ఏమైందిదో ..’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాటను విశాఖపట్నంలోని సిద్ధార్థ డిగ్రీ కాలేజీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో అధ్విక్, దర్శకుడు కె. నవీన్ తేజస్, నిర్మాతలు పైడిరాజు, పి.ఎస్.ఎన్. రాజు హాజరయ్యారు.‘జీవుల మనుగడకు సృష్టించిన పైసా.. జీవం లేకున్నా నిర్జీవిరా పైసా’ అంటూ సాగే ఈ పాటకు నగేశ్ గౌరీష్ సంగీతం అందించగా, కాకి లక్ష్మణ్‌రెడ్డి ఆలపించారు. డబ్బుతో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలియజేసేలా ఈవీఆర్ & గురుబిల్లి జగదీష్ ఈ పాటను రచించారు. గౌతం వాయిలాడ సినిమాటోగ్రాఫర్‌గా, ఎంజే సూర్య ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. -
పెళ్లిరోజే గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
బాలీవుడ్ జంట రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) - పాత్రలేఖ (Patralekhaa) గుడ్‌న్యూస్ చెప్పింది. తమ పెళ్లిరోజునాడే పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు దంపతులు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నవంబర్ 15న రాజ్‌కుమార్- పాత్రలేఖల పెళ్లిరోజు. వెడ్డింగ్ యానివర్సరీ నాడే బిడ్డ జన్మించడంతో దంపతులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందిన వీరికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.2014లో లవ్..రాజ్‌కుమార్ రావు- పాత్రలేఖ సిటీలైట్స్ (2014) సినిమా సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ ప్రేమకు పెద్దలు సైతం పచ్చజెండా ఊపడంతో 2021 నవంబర్ 15న పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది జూలై 9న పాత్రలేఖ తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించింది. న్యూజిలాండ్ ట్రిప్‌లో ఉన్నప్పుడు తాను గర్భం దాల్చిన విషయాన్ని కనుగొంది. డెలివరీ తర్వాత బిడ్డతో కలిసి న్యూజిలాండ్ ట్రిప్‌ను పూర్తి చేస్తానంది. అలాగే బిడ్డను ఎత్తుకుని బంగీ జంప్ కూడా చేస్తానంది.సినిమాసినిమాల విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ రావు 2010లో రణ్ మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. లవ్ సెక్స్ ఔర్ ధోఖా, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ 2, తలాష్, కై పో చె, సిటీ లైట్స్, హమారీ అదూరీ కహాని, స్త్రీ, లవ్ సోనియా, లూడో, హిట్: ద ఫస్ట్ కేస్, భేడియా, శ్రీకాంత్, మిస్టర్ అండ్ మిసెస్ మహి, స్త్రీ 2 వంటి పలు సినిమాలతో అలరించాడు. పాత్రలేఖ.. లవ్ గేమ్స్, నానూ కీ జాను, బద్నాం గాలి, వైల్డ్ వైల్డ్ పంజాబ్, పూలె వంటి పలు మూవీస్ చేసింది. View this post on Instagram A post shared by RajKummar Rao (@rajkummar_rao) చదవండి: కల్యాణ్, ఇమ్మూ గుండెలో ఇంత బాధుందా? -
మార్క్: 200 అడుగుల పొడవైన షిప్లో క్లైమాక్స్..
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌కు దక్షిణాది చిత్ర పరిశ్రమలో మంచి పేరుంది. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం మార్క్. భారీ ఎత్తున రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. అందుకోసం 200 అడుగుల పొడవైన షిప్ సెట్ వేసినట్లు చెప్పారు. 400 మందితో పాటఈ సెట్లో చిత్రీకరించిన పాటలో 100 మందికి పైగా నటీనటులు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని చెప్పారు. ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా మార్క్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ముఖ్య పాత్రల్లో నటుడు నవీన్ చంద్ర, యోగిబాబు, గురు సోమసుందరం, విక్రాంత్ తదితరులు నటించినట్లు చెప్పారు. రిలీజ్ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి అజనీశ్ లోకనాథ్ సంతం అందిస్తున్నారు. కిచ్చా సుదీప్ చిత్రం అంటే కన్నడం, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో విడుదల అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో మార్క్ చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.చదవండి: పూల వ్యాపారే నిర్మాత: అర్జున్ -
చిల్ట్రన్స్‌డే రోజే వదిలేసి వెళ్లిపోయావ్.. జీవితం శూన్యం!
నేడు (నవంబర్ 14న) బాలల దినోత్సవం. ఈ రోజును ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే ఎంతో ఇష్టమైన ఈరోజు తన జీవితంలో బాధాకరమైన రోజుగా మారిపోయిందంటోంది స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య, నిర్మాత సుప్రియ మీనన్ (Supriya Menon Prithviraj). బాలల దినోత్సవం నాడే తండ్రి తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.శాశ్వతంగా దూరమై 4 ఏళ్లునాన్న, నువ్వు మాకు దూరమై నాలుగేళ్లవుతోంది. నువ్వు వెళ్లిపోయాక ఎన్నోసార్లు జీవితం ఒక శూన్యంలా అనిపించింది. సంతోషకర క్షణాల్లో కూడా తెలియని బాధ మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. నువ్వు ఇంకొంతకాలం మాతో ఉంటే బాగుండని చాలాసార్లు అనిపించింది. నీతో కలిసి నేను ఎన్నో పనులు చేయాలనుకున్నాను. కానీ, అంత సమయం లేకపోయింది.మాటల్లో చెప్పలేనుఅన్నిటికంటే బాధాకరమైన విషయమేంటో తెలుసా? చిల్డ్రన్స్ డే రోజే నువ్వు నాకు శాశ్వతంగా దూరమయ్యావు. నిన్ను ప్రతిరోజు మిస్ అవుతున్నాను డాడీ.. మిస్‌యూ సో మచ్. నిన్ను ఎంత మిస్ అవుతున్నానో మాటల్లో చెప్పలేను అంటూ తండ్రితో కలిసి దిగిన పలు ఫోటోలను షేర్ చేసింది. సుప్రియ తండ్రి, నిర్మాత, బిజినెస్మెన్ విజయకుమార్ 2021లో క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశాడు.మలయాళ స్టార్‌తో పెళ్లిసుప్రియ ఒక జర్నలిస్టు. ఈమె.. హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran)ను 2011లో పెళ్లి చేసుకోగా వీరికి ఓ కూతురు సంతానం. పృథ్వీరాజ్ భార్య సుప్రియతో కలిసి పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ బ్యానర్లో 9, డ్రైవింగ్ లైసెన్స్, జనగణమన, కడువ, గురువాయూర్ అంబలనడయిల్ సినిమాలు నిర్మించారు. సినిమాకేజీఎఫ్:2, సలార్ సినిమాలను మలయాళంలో డిస్ట్రిబ్యూట్ చేశారు. ద గోట్ లైఫ్ (ఆడు జీవితం), సలార్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న పృథ్వీరాజ్ ప్రస్తుతం #SSMB29 (మహేశ్‌బాబు -రాజమౌళి కాంబినేషన్) మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Supriya Menon Prithviraj (@supriyamenonprithviraj) చదవండి: నా కొడుకు ఆ ఫోటోలు చూస్తే ఇంకేమైనా ఉందా? : నటి -
‘స్పిరిట్’లో చిరు, డాన్ లీ..? క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న చిత్రం ‘స్పిరిట్’. అయితే ఇటీవల స్పిరిట్ గురించి వస్తున్న రూమర్స్‌పై సందీప్ రెడ్డి స్పష్టత ఇచ్చాడు. తాజాగా ‘జిగ్రీస్’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందంతో కలిసి చిట్ చాట్‌లో పాల్గొన్న ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.సందీప్ వంగా మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి ‘స్పిరిట్’లో నటిస్తున్నారన్న వార్తలు నిజం కాదు. మా ఇద్దరి మద్య అలాంటి చర్చలు జరగలేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే” అని తెలిపారు. కాగా “ఎప్పుడైనా చిరంజీవితో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం అది తప్పకుండా సోలో ఫిలిం రూపంలో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే అది ఏ జానర్లో, ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను” అని అన్నాడు.మరోవైపు సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ కూడా ‘స్పిరిట్’ సినిమాలో నటిస్తున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా సందీప్ స్పందించాడు. అది కూడా రూమర్ మాత్రమే అని స్పష్టం చేశాడు. -
‘గర్ల్ ఫ్రెండ్’కి రూ.20 కోట్లు
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటించిన "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందించారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహించారు."ది గర్ల్ ఫ్రెండ్" మూవీ సూపర్ హిట్ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ 5 రోజుల్లో 20.4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు చిత్ర యూనిట్ పేర్కొంది. రిలీజ్ రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కాస్త తగ్గాయి. కానీ రెండో రోజు నుంచి పాజిటివ్ మౌత్‌టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. -
రీరిలీజ్ హవా.. 15 రోజుల్లో 6 సినిమాలు!
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో రీరిలీజ్ హవా కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగులో ఈ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలు మరోసారి థియేటర్స్‌లో సందడి చేస్తున్నాయి. 4K రీమాస్టర్ వెర్షన్లతో పాత క్లాసిక్ సినిమాలు తిరిగి విడుదల అవుతున్నాయి.ఫ్యాన్స్ వీటిని బాగా ఆదరిస్తున్నాయి. కలెక్షన్స్ కూడా భారీగానే వస్తుండడంతో అందరు హీరోలు ఇప్పుడు ఇదే ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలన్నీ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రానున్న పక్షం రోజుల్లో అరడజనుకు పైగా చిత్రాలు రీరిలీజ్ అవుతున్నాయి.‘శివ’తో ప్రారంభం.. నవంబర్ నెలలో కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాలు మినహా మిగతా పెద్ద చిత్రాలేవి రిలీజ్ కావడం లేదు. చిన్న చిత్రాలు బరిలో ఉన్నప్పటికీ వాటిపై బజ్ క్రియేట్ కాలేదు. దీంతో ఈ గ్యాప్‌ని సొమ్ము చేసుకునేందుకు రెడీ అయ్యారు టాలీవుడ్ నిర్మాతలు. వరసగా పాత చిత్రాలను మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ నెలలో మొదటగా రీరిలీజ్ అవుతున్న చిత్రం ‘శివ’. 36 ఏళ్ల కిత్రం(1989) రామ్ గోపాల్‌వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం.. టాలీవుడ్లో హిస్టరీ క్రియేట్ చేసింది. నాగార్జున కెరీర్లో అతి ముఖ్యమైన ఈ సినిమా.. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 4కె ప్రింట్‌తో, డాల్బీ అట్మాస్ సౌండ్ తో రాబోతున్న ఈ కల్ట్ మూవీ.. ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.‘కొదమసింహం’తో మెగాస్టార్.. ‘శివ రిలీజ్ అయిన మరుసటి రోజే.. అంటే నవంబర్ 15న సిద్ధార్థ్-త్రిషల సూపర్ హిట్ చిత్రం ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీలోని పాటలు ఎంత సూపర్ హిట్‌గా నిలిచాయో అందరికి తెలిసిందే. యూత్ టార్గెట్‌గా ఈ మూవీ మరోసారి థియేటర్స్‌లోకి రాబోతుంది.ఇక నవంబర్ 21న మెగాసార్ చిరంజీవి ‘కొదమసింహం’ రీరిలీజ్ కాబోతుంది. . చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు.వారం గ్యాప్‌లో కోలీవుడ్ బ్రదర్స్కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తికి తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు హీరోలు వారం గ్యాప్‌లో బాక్సాఫీస్ ముందుకు రాబోతున్నారు. కార్తిని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేసిన చిత్రం ‘ఆవారా’. ఈ మూవీ తర్వాత టాలీవుడ్లో కార్తి మార్కెట్ పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి థియేటర్స్‌లో సందడ చేయబోతుంది. నవంబర్ 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక వారం రోజుల గ్యాప్ తర్వాత కార్తీ బ్రదర్, కోలీవుడ్ హీరో సూర్య ‘సికిందర్’ చిత్రం రీరిలీజ్ కాబోతుంది.ఇక నవంబర్ చివరి వారం(నవంబర్ 29)లో మహేశ్ బాబు ‘బిజినెస్ మెన్’ తో మరోసారి థియేటర్స్‌లోకి వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఒకసారి ఈ చిత్రం రీరిలీజ్ అయింది. అయితే అప్పుడు కొన్ని చోట్ల మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రీరిలీజ్‌కి ప్లాన్ చేసినట్లు సమాచారం. మొత్తంగా రానున్న 15 రోజుల్లో అరడజనుకు పైగా సినిమాలు మరోసారి విడుదల కానున్నాయి. వీటీల్లో ఏ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబడుతుందో చూడాలి. -
పెళ్లికి ఎక్స్పైరీ డేట్.. ఎక్కువకాలం భరించాల్సిన పని లేదు!
మనం తినే ఆహారపదార్థాలకు, వాడే వస్తువులకు ఎక్స్పైరీ డేట్ ఉన్నట్లే పెళ్లికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉండాలంటోంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). అది తప్పేం కాదని సమర్థిస్తోంది. కాజోల్, ట్వింకిల్ ఖన్నా జంటగా హోస్ట్ చేస్తున్న షో 'టూ మచ్ విత్ కాజోల్'. తాజా ఎపిసోడ్‌కు విక్కీ కౌశల్, కృతి సనన్ గెస్టులుగా విచ్చేశారు. వీరితో ముచ్చటించే క్రమంలో పెళ్లికి ఎక్స్పైరీ డేట్, రెన్యువల్ ఆప్షన్ ఉండాలా? అన్న ప్రశ్న తలెత్తింది.ఎక్స్పైరీ డేట్ ఉండాల్సిందే!వివాహానికి ఎక్స్పైరీ ఏంటి? అని కృతి సనన్, విక్కీ కౌశల్, ట్వింకిల్ ఖన్నా తల బాదుకుంటే.. కాజోల్ మాత్రం ఆ ఐడియాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. అది చూసిన ట్వింకిల్.. ఇది పెళ్లి, వాషింగ్ మెషిన్ కాదని గుర్తు చేసింది. అందుకు కాజోల్.. వివాహబంధానికి ఎక్స్పైరీ డేట్ ఉంటే మంచిదే అనిపిస్తోంది. కరెక్ట్ పర్సన్నే పెళ్లి చేసుకున్నామన్న గ్యారెంటీ ఏంటి? అలాంటి సందర్భాల్లో ఈ ఎక్స్పైరీ డేట్ పుణ్యమా అని జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఉండదు. ఓటీటీలో టాక్ షోఅలాగే రెన్యువల్ ఆప్షన్ ఉంటే ఉన్నచోటే ఆగిపోకుండా ముందడుగు వేయొచ్చు అని పేర్కొంది. 'టూమచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' (Two Much with Kajol and Twinkle) టాక్ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. కాజోల్ విషయానికి వస్తే.. 1999లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు కూతురు నైసా దేవ్‌గణ్ సంతానం.చదవండి: 14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి -
14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్.. 49 ఏళ్లకే మృతి.. ఎవరీ సూపర్ స్టార్?
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరు స్టార్ అవుతారు..ఎవరు జీరో అవుతారో ఊహించలేం.డబ్బు, ఫేమ్ ఎలా వస్తుందో, ఎలా పోతుందో ఎవరూ అంచనా వేయలేం. స్టార్ అవ్వడానికి ఎంత కష్టపడాలో ఆ స్టార్‌డమ్‌ని కాపాడుకోవడానికి కూడా అంతే కష్టపడాలి. ఒక చిన్నతప్పు చాలు ‘స్టార్’ని కాస్త జీరో చేయడానికి. ఉన్న ఫేమ్ పోయిన తర్వాత మళ్లీ తిరిగి తెచ్చుకోవడం కష్టం. రాలేదు కూడా. అలా ఓ వ్యక్తి తక్కువ రోజుల్లోనే స్టార్ హీరోగా గుర్తింపు పొంది.. ఈగోతో గొడవలకు పోయి ఉన్న పేరుని కాస్త చెడగొట్టుకోవడమే కాదు.. హత్య కేసులో జైలుకి కూడా వెళ్లి వచ్చాడు.అంతేకాదు 49 ఏళ్లకే తన జీవితానికి ‘శుభం’ కార్డు వేసుకున్నాడు. ఆయనే ఎంకే త్యాగరాజ భాగవతార్ అలియాస్ ఎంకేటీ.14 సినిమాల్లో 10 బ్లాక్ బస్టర్స్ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు తమిళ చిత్రపరిశ్రమలో సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి.ఆయన నటించిన హరిదాస్ వంద వారాలకు పైగా ఆడిందట. ఎంకే త్యాగరాజ భాగవతార్ పూర్తి పేరు మాయవరం కృష్ణసామి త్యాగరాజ భాగవతార్. అభిమానులు ముద్దుగా ఎంకేటీ అని పిలుస్తారు. 1910లో పుట్టిన త్యాగరాజన్ది పేద కుటుంబం. కర్ణాటక సంగీత గాయకుడుగా పేరు సంపాదించింది తర్వాత సినిమాల్లోకి వచ్చాడు.1934-59 మధ్యకాలంలో 14 సినిమాల్లో హీరోగా నటిస్తే.. అందులో 10 భారీ విజయం సాధించాయి. దీంతో ఆయనకు సూపర్ స్టార్ ఇమేజ్ వచ్చింది. 1940 ప్రాంతంలోనే మెర్సీడెస్ బెంజ్‌లో తిరగడమే కాక.. బంగారు పళ్లేల్లో భోజనం చేసేవాడట.హత్యకేసులో జైలుకు..స్టార్ హీరోగా మారిన తర్వాత ఎంకేటీ ప్రవర్తలో మార్పు వచ్చింది. ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తలకిందులు చేసిందట. ఈగోతో ఆ దర్శకుడితో గొడవపడడంతో తర్వాత అవకాశాలు తగ్గిపోయాయట. ఆ సమయంలోనే జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ అవకాశాలు రాలేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఆయన అవకాశాల కోసం చాలా ప్రయత్నాలే చేశాడట. చివరకు అనారోగ్య భారిన పడి 1959 నవంబర్ 1వ 49 ఏళ్లకే కన్నుమూశారు.‘కాంత’ ఈ హీరో కథేనా?దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కాంతా’. రానా దగ్గుబాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే..ఇది ఎంకేటీ బయోపిక్లాగే అనిపిస్తుంది. ఇందులో ఎంకేటీ పాత్రలో దుల్కర్ నటించగా.. ఆయన పతనానికి కారణం అయిన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇది ఎంకేటీ బయోపిక్ అనే విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. -
14 ఏళ్లుగా ప్రేమ లేకపోయినా కలిసుంటున్నాం: నటి
ఒకప్పుడు మలయాళంలో పలు సినిమాలు చేసిన సుమ జయరామ్ (Suma Jayaram) పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరమైపోయింది. చాలాకాలం తర్వాత ఓ ఇంటర్వ్యూకి హాజరైన ఈ నటి వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది. సుమ జయరామ్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. మా పెళ్లయిన వారానికే మా జోడీ కరెక్ట్ కాదని అర్థమైంది. మా ఇద్దరికీ పెళ్లి జరక్కుండా ఉండాల్సింది అనిపించింది. మా మధ్య ఎటువంటి ప్రేమ లేనప్పటికీ పద్నాలుగేళ్లుగా కలిసుంటున్నాం.మళ్లీ పెళ్లి?ఇన్నేండ్లలో ఆయన ఒక్కసారి కూడా కుదురుగా ఇంట్లో ఉండలేదు. కొన్నిసార్లు తాగి ఇంటికి వచ్చేవాడు. తాగిన మైకంలో కోపంతో ఊగిపోతూ ఏదేదో వాగేవాడు. ఇప్పుడంటే ఇప్పుడు నిన్ను, ఈ ఇంటిని వదిలేసి నేను వెళ్లిపోవచ్చు. కానీ, అప్పుడు నీకే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేదాన్ని. అందుకతడు బయటకు వెళ్లి రెండో పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు. పెళ్లి ఎంత పవిత్రమైనదో నాకు తెలుసు.నా పరిస్థితి అస్సలు బాగోలేదునాకున్న సమస్యల్లా నీ తాగుడు. నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మంచిది. కనీసం పిల్లలకోసమైనా దానికి దూరంగా ఉండమని చెప్పేదాన్ని. ఇప్పుడిలా ఇంటర్వ్యూ ఇస్తున్నాను కానీ నేను భయంకరమైన స్థితిలో ఉన్నాను. అయినప్పటికీ దేవుడిపై భారం వేసి అంతా మంచే జరుగుతుందని భావిస్తున్నా.. ఇప్పుడు కూడా ఆయన బిజినెస్ ట్రిప్‌కు వెళ్లాడు. ఆరునెలల వరకు ఇంటికి రాడు. ఆయన లేనప్పుడు అమ్మ వచ్చి నాకు తోడుగా ఉంటుంది. నా పరిస్థితి చూసి తను బాధపడుతూ ఉంటుంది. మమ్ముట్టిని చూసి కనీసం..ఒకసారేమైందంటే నా భర్తతో కలిసి ఇంటర్నేషనల్ ట్రిప్‌కు వెళ్లాను. అక్కడ భోజనం చేస్తుండగా మమ్ముట్టి నన్ను చూసి నావైపుగా వస్తున్నాడు. ఆయన్ని చూడగానే నేను లేచి పరుగెత్తుకెళ్లాను. మమ్ముట్టికి నా భర్తను పరిచయం చేశాను. నా భర్త మాత్రం నేను తింటున్నా.. అంటూ లేవడానికి కూడా ఇష్టపడలేదు. అతడు ఎవరితోనూ మాట్లాడడని మమ్ముట్టికి కూడా క్షణాల్లోనే అర్థమైంది. అని సుమ జయరామ్ చెప్పుకొచ్చింది. సుమ.. ఇష్టం, ఏకలవ్య, అడిక్కురిప్పు, స్తలతె ప్రధాన పయ్యన్స్ వంటి పలు మూవీస్‌లో యాక్ట్ చేసింది.చదవండి: కొత్త చాప్టర్ మొదలైంది..: సమంత -
మా మూవీలో విలన్ ఎవరో ఊహించలేరు: అల్లరి నరేశ్
‘‘నేనిప్పటివరకు చాలా జానర్స్ చేశాను. కానీ ‘12ఏ రైల్వే కాలనీ’(12 A Railway Colony)లాంటి థ్రిల్లర్స్ చేయలేదు. ఈ సినిమా చూసి రెండు మూడు చోట్ల జర్క్ అవుతారు. మా మూవీలో విలన్ ఎవరు? అని ఊహించలేరు’’ అని ‘అల్లరి’ నరేశ్(Allari Naresh) చెప్పారు. ‘పొలిమేర, ΄పొలిమేర 2’ చిత్రాల ఫేమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించి, షో రన్నర్‌గా వ్యవహరించారు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్, కామాక్షీ భాస్కర్ల జోడీగా నటించారు. పవన్‌కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నాని మాట్లాడుతూ– ‘‘నవంబర్ 21 తర్వాత నాని అనే నా పేరు గట్టిగా వినిపిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా తర్వాత నన్ను ఆరాధన అని పిలుస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు కామాక్షి. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజాయ్ చేసేవారికి మా సినిమా ఓ మంచి ట్రీట్’’ అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు. -
IFFI 2025: ఒక్క మహిళ కూడా కనిపించలేదా?.. నెటిజన్స్ ఫైర్
‘ఇఫీ’ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) 56వ ఎడిషన్ ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 దేశాలకు చెందిన 240 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ‘ఇఫీ’(IFFI 2025)లోని ఇండియన్ పనోరమా(Indian Panorama) సెక్షన్ జ్యూరీ చైర్మన్‌గా దర్శక–నిర్మాత–నటుడు రాజ్ బుందేలా నియమితులయ్యారు. తాజాగా ఈ విభాగానికి సంబంధించిన జ్యూరీ సభ్యులను అధికారికంగా ప్రకటించారు. కృష్ణ హెబ్బాళే, కమలేష్ కె. మిశ్రా, మలయ్ రే, సుభాష్ సెహ్గల్, అరుణ్ భక్షి, అసీమ్ సిన్హా, అశోక్ శరణ్, సుకుమార్ జతానియా, బీఎస్ బసవరాజు, అమరేష్ చక్రవర్తి, నెపోలియన్ థంగా, జడుమోని దత్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ప్యానెల్లో మహిళలకు చోటు దక్కకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ‘జ్యూరీలో మహిళలకు చోటు లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’, ‘ఉమెన్ జ్యూరీ అంటూ ప్రత్యేకమైన పోస్ట్ ఏమైనా ఉందా?’ (వ్యంగ్యంగా..), ‘మహిళల కోసం మహిళలు నటించిన సినిమాలను ఎంపిక చేసేందుకు అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేకమైన జ్యూరీ ఏదైనా ఉందా?’, ‘జ్యూరీలో భాగం చేయడానికి దేశం మొత్తం మీద మీకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా?’ అంటూ... సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. మరోవైపు... లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడం లేదంటూ కొంకణి దర్శక–రచయిత ఎస్. లక్ష్మీకాంత్ ‘ఇఫీ’ వైఖరిని తప్పుపట్టారు. పలు అవార్డులు, రివార్డులు పొందిన కొంకణి షార్ట్ ఫిల్మ్ ‘ఆన్సెస్సావో’ని ప్రదర్శనకు ఎంపిక చేయకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (తెలుగు), ‘అమరన్’ (తమిళం), ‘తుడరుమ్’ (మలయాళం) ‘సు ఫ్రమ్ సో’ (కన్నడ), గ్రౌండ్ జీరో, తన్వి ది గ్రేట్, ఛావా, ది బెంగాలీ ఫైల్స్ (హిందీ)..’ వంటి చిత్రాలతో ΄ాటు పలు భాషలకు చెందిన దాదాపు ముప్పై చిత్రాలు పోటీ పడుతున్నాయి. -
కొత్త చాప్టర్ మొదలైంది..: సమంత
హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ఫోకస్ అంతా సినిమాల కన్నా బిజినెస్ వైపే ఎక్కువగా ఉంది. మొన్నటికి మొన్న కొత్త పర్ఫ్యూమ్ లాంచ్ చేసిన సామ్ ఇప్పుడు మరో నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ 'ట్రూలీ స్మా' అనే క్లాతింగ్ బ్రాండ్‌ను లాంచ్ చేసింది. ఈ బ్రాండ్‌కు సామ్ సహ వ్యవస్థాపకురాలిగా ఉంది. ఈ మేరకు ఓ వీడియో షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు హీరోయిన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బిజినెస్ ఉమెన్సమంత యాక్టింగ్‌కే కాదు, లుక్స్‌కు కూడా చాలా మంది ఫిదా అవుతుంటారు. ఎప్పుడూ కొత్త డిజైనరీ డ్రెసెస్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇప్పటికే సామ్.. 'సాకీ' పేరుతో బట్టల బిజినెస్ చేస్తోంది. 2020లో ఈ వ్యాపారం ప్రారంభించింది. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ట్రూలీ స్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌లో భాగమైంది. ఇవే కాకుండా తను 'ట్రలాలా' అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్లో 'శుభం' అనే సినిమాతో మంచి బోణీ కొట్టింది. ఇదే బ్యానర్లో తను హీరోయిన్గా మా ఇంటి బంగారం మూవీ చేస్తోంది. ఈ మధ్యే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: 'శివ' చైల్డ్ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ -
'శివ' చైల్డ్ ఆర్టిస్ట్‌కు 36 ఏళ్ల తర్వాత సారీ చెప్పిన ఆర్జీవీ
తెలుగులో ఓ కొత్త శకానికి నాంది పలికిన సినిమా శివ (Siva Movie). ఫస్ట్ మూవీతోనే రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఇండస్ట్రీ హిట్ కొట్టడంతోపాటు స్టార్ హీరోగా నాగార్జున దశ తిరిగిపోయింది. అమల హీరోయిన్గా జేడీ చక్రవర్తి కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం 1989 అక్టోబర్ 5న విడుదలైంది. 36 ఏళ్ల తర్వాత శివ నవంబర్ 14న రీరిలీజ్ అవుతోంది.చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడేం చేస్తోందంటే?ఈ సందర్భంగా ఆర్జీవీ సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఫోటో పోస్ట్ చేశాడు. ఆమె మరెవరో కాదు, శివ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్. శివ సినిమాలో భవానీ గ్యాంగ్.. నాగార్జునను చేజ్ చేస్తుంటుంది. నాగ్ ఓ చిన్నపాపను ముందు కూర్చోబెట్టుకుని వేగంగా సైకిల్ తొక్కుతుంటాడు. ఇంతలో యాక్సిడెంట్ అయి ఇద్దరూ కిందపడిపోతారు. అప్పుడు పాపను ఎత్తుకుని నాగ్.. గూండాలతో ఫైటింగ్ చేస్తుంటాడు. ఇదీ ఆ సీన్.క్షమించండిఆ సీన్లో ఉన్న పాప పేరు సుష్మ. ఆమె ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందని తెలియజేస్తూ వర్మ ఓ పోస్ట్ పెట్టాడు. సైకిల్ చేజ్ సీన్లో ఉన్న చిన్నారే ఈ సుష్మ. ప్రస్తుతం అమెరికాలో ఏఐ, కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోంది అని పేర్కొన్నాడు. మరో ట్వీట్లో.. సుష్మ, నువ్వు చాలా సాహసోపేతమైన సన్నివేశాల్లో నటించావు. అప్పుడు ఆ సీన్ ఎంత ప్రమాదకరమనేది నాకు అర్థం కాలేదు. దర్శకుడిగా నా స్వార్థం మాత్రమే చూసుకుని ఇలాంటి రిస్కీ షాట్స్ తీశాను. అందుకు నన్ను క్షమించు అంటూ 36 ఏళ్ల తర్వాత ఆమెకు సారీ చెప్పాడు.Being part of Shiva is a cherished memory. That cycle chase adventure influenced me and prepared me for later intellectual endeavors and adventures. I felt safe and excited to be part of something magical. Shiva remains a souvenir. 🙏https://t.co/bzdtBwMCVP— Sushma Anand Akoju. She/Her (@symbolicsushi) November 12, 2025చదవండి: PR కోసం రూ.16 లక్షలు.. తెలుగులోనూ ఇదే జరుగుతోందా? -
‘రాబందు’హిట్ కావాలి: మంత్రి కోమటిరెడ్డి
ప్రీతి నిగమ్, రామ్, భాను ప్రసాద్, సురేష్ రాజ్, బ్రహ్మానందం రెడ్డి కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘రాబందు’. జయశేఖర్ కల్లు దర్శకత్వంలో పులిజాల సురేష్ నిర్మించిన చిత్రం ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని సినిమాటోగ్రఫి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిలీజ్ చేసి యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.అనంతరం గెస్ట్ గా వచ్చిన దర్శకుడు సముద్ర లిరికల్ సాంగ్ ను విడుదల చేయగా చిత్ర నటి ప్రీతీ నిగమ్ టీజర్ లాంచ్ చేశారు. ఇంకా సెన్సార్ బోర్డు మెంబర్ ఉపేంద్ర , రేణుకుమార్, చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రీతి నిగమ్ మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే నాకు గూస్ బమ్స్ వచ్చాయి. అంత బాగా ఉంది. రాబందు అనే పక్షి ఎంత పట్టుదలతో ఉంటుందో ఈ సినిమా స్టోరీలో కూడా అదే పట్టుదలే కనిపిస్తుంది. ముఖ్యంగా మా డైరెక్టర్ & ప్రొడ్యూసర్ గారికి కాంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. తన కష్టార్జితాన్ని మొత్తం సినిమా కోసం పెట్టడం అనేది ఒక చాలా ధైర్యం కావాలి. ఆలా సినిమా మీదున్న ప్యాషన్ తో మంచి సినిమా తీసిన ఇలాంటి ప్రొడ్యూసర్స్ ని డెఫినెట్ గా ఎంకరేజ్ చేయాలి. నేను ప్రేక్షకులందరినీ చెప్పేది ఏంటంటే, దయచేసి సినిమా థియేటర్ కి వెళ్లి సినిమా చూడండి ఆదరించండి’ అన్నారు .ప్రముఖ దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. యానిమల్ సినిమా లాగా రాబందు టైటిల్ చాలా మాస్ ఉంది. టైటిల్ లాగే ఈ సినిమా కూడా వైలెంట్ గా ఉంటుందనుకుంటున్నాను. ఈ సినిమా మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.చిత్ర దర్శకులు జయశేఖర్ కల్లు మాట్లాడుతూ.. నేటిసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలన ఆధారంగా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో పులిజాల ఫిలిమ్స్ బ్యానర్ మీద మేము నిర్మించిన చిత్రం రాబందు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మా చిత్రాన్ని చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను’ అన్నారు. -
హృదయాలను హత్తుకునేలా ‘మరి మరి..’ సాంగ్
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు"(Santhana Prapthirasthu). ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ రోజు ఈ సినిమా నుంచి 'మరి మరి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే -' మరి మరి నిన్ను వెతికేలా, మరవదు ఓ క్షణమైనా, మనసంతా నీ తలపులే, ప్రతి చోటా నీ గురుతులే, వేచా గడిచిన నిన్నల్లో, వెతికా నడిచిన దారుల్లో, వెలుగే విడిచిన నీడల్లో, వదిలి వెళ్లిన జాడల్లో...'అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట. ప్రాణంగా ప్రేమించిన భార్యతో వచ్చిన ఎడబాటు ఎలాంటి బాధను మిగిల్చిందో హీరో వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. -
స్టార్ హీరోలతో సినిమా.. రిగ్రెట్ ఫీల్ అవుతున్నానన్న హీరోయిన్
నేను తెలుగు తమిళంలో స్టార్ హీరోలతో నటించాను. పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, నాని, నాగ చైతన్య, శివకార్తికేయన్, కార్తి, విశాల్..ఇలా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అయితే నా కెరీర్ లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదు అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ మూవీస్ లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి లభించదు. నాలుగు డ్యాన్స్ స్టెప్స్ వేసి, ఏవో డైలాగ్స్ చెప్పిస్తారు. ఈ రొటీన్ మూవీస్ చేసేప్పుడు నేను రియలైజ్ కాలేదు గానీ ఇకపై అలాంటి మూవీస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నా’ అని అన్నారు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్. ఈ బ్యూటీ కీలకపాత్రలో, రష్మిక-దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుర్గ అనే క్యారెక్టర్లో అను నటించింది. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చిన నేపథ్యంలో తాజాగా అను మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలతో పాటు తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.→ ఈ సినిమా కోసం మొదట ప్రొడ్యూసర్ ధీరజ్ నుంచి కాల్ వచ్చింది. ఆ తర్వాత రాహుల్ కలిసి స్క్రిప్ట్ చెప్పారు. స్క్రిప్ట్, నా క్యారెక్టర్ గురించి విన్న తర్వాత తప్పకుండా ఈ మూవీలో నటించాలని అనిపించింది. అమ్మాయిల గురించి ఒక మంచి విషయం చెప్పే మూవీ ఇది. ఈ చిత్రంలో నటించడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది గీతా ఆర్ట్స్ సినిమా కాబట్టి బాగా చూసుకుంటారనే నమ్మకం ఉంది. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాకు వస్తున్న రెస్పాన్స్ హ్యాపీగా ఉంది. అయితే నేను ఏ సినిమా చేసినా ఆ మూవీకి ఎలాంటి ప్రశంసలు వస్తాయని ఆశించను.→ ఈ చిత్రంలో దుర్గ క్యారెక్టర్ లో నటించాను. ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నా క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయంవేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ రాహుల్ నా క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన విధానంతో హ్యాపీగా ఫీలయ్యా. రాహుల్ చాలా సెన్సిటివ్ డైరెక్టర్. నా క్యారెక్టర్ ఒక్కటే కాదు, అన్ని పాత్రలను చేయి పట్టి నడిపించారు. కమర్షియల్ మూవీస్ లో మాతో ఓవర్ యాక్షన్ చేయిస్తారు.→ ఈ చిత్రంలో నాకు అవకాశం వచ్చేసరికే రశ్మికను భూమా పాత్రకు తీసుకున్నారు. నేను భూమా పాత్రలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. హాలీవుడ్ లో మూవీస్ చూస్తే హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు. ప్రతి ఒక్కరూ కథకు కాంట్రిబ్యూట్ చేసేలా క్యారెక్టర్స్ చేస్తారు. ఈ చిత్రంలో రాహుల్ అలాంటి ప్రయత్నమే చేశారు. అన్ని పాత్రలను జస్టిఫై చేసేలా మూవీ రూపొందించారు.→ నా కెరీర్ పరంగా అసంతృప్తిగానే ఉన్నా, అయితే నటిగా సంతృప్తి ఉంది. పెద్ద పెద్ద స్టార్స్ తో కలిసి నటించాను. అయితే నాది అవకాశాల కోసం ఆరాటపడే తత్వం కాదు. నాకు వచ్చే సినిమా తప్పకుండా దక్కుతుందని నమ్ముతా.→ ప్రొడ్యూసర్ ధీరజ్ తో గతంలో ఊర్వశివో రాక్షసివో సినిమా చేశాను. "ది గర్ల్ ఫ్రెండ్" లాంటి చిత్రాలు వర్కవుట్ కావాలంటే ధీరజ్ లాంటి మంచి ప్రొడ్యూసర్ ఉండాలి. మంచి టీమ్ కుదరకే గతంలో కొన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ ఆదరణ పొందలేకపోయాయి.→ ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్స్ స్టేజ్ లో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. -
ఆయన గట్టి గట్టిగా అరిచాడు.. నేనైతే ఏడ్చేదాన్ని: అను ఇమ్మాన్యుయేల్
తమిళ సినిమా 'అదర్స్' ప్రమోషన్లలో నటి గౌరీ కిషన్‌కి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో 'మీ బరువెంత?' అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం వివాదస్పదమైంది. సినిమా గురించి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నా పర్సనల్ విషయాల గురించి ఎందుకు అడిగారని సదరు జర్నలిస్ట్‌పై గౌరీ ఫైర్ అయ్యారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్స్ గౌరికి మద్దతు తెలుపుతూ.. జర్నలిస్ట్‌ని ట్రోల్ చేశారు. చివరకు సదరు జర్నలిస్ట్ క్షమాపణలు చెప్పినా కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. జర్నలిస్ట్ సారీని గౌరీ అంగీకరించలేదు. 'జవాబుదారీతనం లేని క్షమాపణ అసలు క్షమాపణే కాదు. ఆయన ప్రశ్నని నేను తప్పుగా అర్థం చేసుకున్నానని.. ఆయన బాడీ షేమింగ్ చేయలేదనడం కరెక్ట్ కాదు’ అంటూ ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు చిత్రపరిశ్రమం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా దీనిపై హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Anu Emmanuel ) స్పందించింది. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న చాలా తప్పని అను చెప్పింది. ఒకరి బాడీపై కామెంట్స్ చేసే అధికారం ఎవరికీ లేదని అను పేర్కొంది.గర్ల్‌ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గౌరి కిషన్ ఇష్యూ గురించి ప్రశ్నించగా.. పై విధంగా సమాధానం చెప్పారు. ‘నేను ఆ ప్లేస్‌లో ఉంటే ఏడ్చేదాన్నేమో. ఆ జర్నలిస్ట్ గౌరీపై గట్టి గట్టిగా అరిచాడు. కానీ ఆమె ధైర్యంగా ఎదురించింది. హీరోని సినిమా విషయాల గురించి చక్కగా అడిగిన ఆ జర్నలిస్ట్.. హీరోయిన్ దగ్గరకు వచ్చేసరికి ‘బరువెంత?’అని అడిగాడు. సినిమాకు ఆమె బరువుకు ఏం సంబంధం? హీరోయిన్ అంటే లిప్‌స్టిప్ పెట్టుకొని మంచిగా రెడీ అయి ఉండడమేనా? అంతకు మించి కూడా మాలో వేరే టాలెంట్ ఉంటుంది. అది గుర్తించండి’ అని అను ఇమ్మాన్యుయేల్ పేర్కొంది. -
కొందరు హీరోలు నో చెప్పారు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్‌పై ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ‘మధుర’ శ్రీధర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ–‘‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్‌ని కొందరు పేరున్న హీరోలకు వినిపించాం. కథలో హీరోకు స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటుంది. ఈ కారణం చేత తమ ఇమేజ్‌కు ఇబ్బంది అవుతుందంటూ నో చెప్పారు. కొత్త అబ్బాయితో వెళితే ఎలాంటి ఇమేజ్ ఇబ్బందులు ఉండవని విక్రాంత్‌ను తీసుకున్నాం. మేల్ ఫెర్టిలిటీ సమస్య నేపథ్యంగా సాగే ఈ సినిమాలో ఎక్కడా అభ్యంతరకరమైన డైలాగ్స్ లేవు. మా సినిమా చూశాక ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో బాధపడుతున్న వారికి ఒక ధైర్యం వస్తుంది. కరోనా పరిస్థితుల తర్వాత ప్రేక్షకుల అభిరుచులు మారాయి. నాలుగేళ్ల క్రితం అయితే ఈ సినిమా ట్రైలర్‌ను మా కుటుంబ సభ్యులకే చూపించలేకపోయేవాడిని. ఇప్పుడు మా అబ్బాయిలు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూడగలుగుతున్నారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తర్వాత ఫేక్ ఫెర్టిలిటీ సెంటర్స్ నేపథ్యంతో ‘సంతానప్రాప్తిరస్తు 2’ చేయాలనుకుంటున్నాం. మన నేటివ్ సినిమాల్లో కంటెంట్ బాగుంటే అదే గ్లోబల్ స్థాయికి వెళ్తుంది. పాఇండియా అవుతుంది. కరోనా తర్వాత ఓటీటీ డీల్స్ విషయంలో మార్పులు వచ్చాయి. కొన్ని కారణాల వల్ల పేమెంట్స్ తగ్గిస్తున్నారు. భవిష్యత్‌లో నా దర్శకత్వంలో మళ్లీ సినిమా ఉండొచ్చు. కొత్త ఫిల్మ్‌మేకర్స్ మా మధుర ఆడియో పాటలను వినియోగించుకుంటే నేను డబ్బులు చార్జ్ చేయడం లేదు’’ అని అన్నారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ–‘‘ఐటీ రంగం నుంచి వచ్చిన నేను ‘సంతాన ప్రాప్తిరస్తు’ తో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అని తెలిపారు. -
ఇంటి తాళం పగులగొట్టి నానా బీభత్సం.. బెల్లంకొండపై కేసు నమోదు!
సాక్షి, ఫిలింనగర్(హైదరాబాద్): ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేశ్(Bellamkonda Suresh)పై ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ఫిలింనగర్ రోడ్ నెంబర్–7లో శివప్రసాద్ అనే వ్యక్తికి ఇల్లు ఉండగా కొంతకాలంగా ఆయన ఇంటికి తాళం వేసి తన బంధువుల వద్దకు వెళ్లాడు. మూడు రోజుల క్రితం బెల్లంకొండ సురేష్‌తో పాటు ఆయన అనుచరులు శివప్రసాద్ ఇంటికి వచ్చి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఆస్తులు ధ్వంసం చేసి గోడలు పగులగొట్టి నానా బీభత్సం సృష్టించారు. ఇంటిని ఆక్రమించుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న శివప్రసాద్ ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఇల్లంతా పూర్తిగా దెబ్బతిని ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బెల్లంకొండ సురేష్ 30 మంది అనుచరులతో వచ్చి తన ఇంటిని ధ్వంసం చేశాడని తెలుసుకున్న బాధితుడు తన సిబ్బందిని బెల్లంకొండ సురేష్ ఇంటికి పంపించాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సురేష్ సిబ్బందిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ దూషణలతో న్యూసెన్స్ చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫిలింనగర్ పోలీసులు బెల్లంకొండ సురేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మరణాన్ని ముందే ఊహించిన హీరో..
తమిళ హీరో అభినయ్ కింగర్ (44) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం (నవంబర్ 10న) చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణాన్ని ఆయన ముందుగానే అంచనా వేశారు. కేవలం ఏడాది లేదా ఏడాదిన్నర మాత్రమే బతుకుతానని డాక్టర్స్ చెప్పారంటూ ఇటీవల ఓ వీడియోలో మాట్లాడారు. అందులో అతడు బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ వీడియో బయటకు వచ్చిన మూడు నెలలకే అభినయ్ మరణించడం విషాదకరం!ఎవరీ అభినయ్?ప్రముఖ మలయాళ నటి టి.పి.రాధామణి కుమారుడే అభినయ్ కింగర్ (Abhinay Kinger). తుళ్లువదో ఇళమై అనే తమిళ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమ్యారు. తమిళ చిత్రం 'జంక్షన్'తో హీరోగా మారారు. కానీ తర్వాత హీరోగా కంటిన్యూ కాలేకపోయారు. సక్సెస్, పొన్ మేఘలై, ఆరుముగం, సింగారా చెన్నై, ఆరోహణం వంటి పలు కోలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. మలయాళంలో కేవలం మూడే మూడు మూవీస్ చేశారు. చివరగా 2014లో వచ్చిన వల్లవణుక్కు పుళ్లం ఆయుధం సినిమాలో బిజినెస్‌మెన్‌గా కనిపించారు. అంతేకాకుండా మిలింద్ సోమన్, బాబు ఆంటోని, విద్యుత్ జమ్వాల్ వంటి నటులకు డబ్బింగ్ చెప్పారు. View this post on Instagram A post shared by Balan Akassh Balaiyan Jaganathan (@bjbala_kpy) చదవండి: 'పర్ఫామెన్స్ తక్కువ, డ్రామా ఎక్కువ'.. నామినేషన్స్‌లో ఎవరంటే? -
నా సినిమాల విజయంలో అందెశ్రీ..: నారాయణ మూర్తి
ప్రముఖ రచయిత అందెశ్రీ (Ande Sri) ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోనైన ఆయన ఇంట్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. అందెశ్రీ మరణంపై దర్శకనటుడు, పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy) స్పందించారు.తీరని లోటుప్రజాకవి అందెశ్రీ మరణం కేవలం తెలంగాణ సమాజానికే కాదు, యావత్ ప్రపంచ తెలుగు జాతికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలైన ఊరు మనదిరా, ఎర్ర సముద్రం, వేగు చుక్కలకు అమోఘమైన పాటలు ఇచ్చి చిత్ర విజయాలకు అందెశ్రీ ఎంతో దోహదం చేశారు. ఎర్ర సముద్రంలో మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు అనే పాట తెలంగాణ పాఠ్య పుస్తకాలలో ముద్రించబడింది. అది ఆ పాట గొప్పతనం..జన్మ ధన్యంఊరు మనదిరా మూవీలోని చూడా చక్కని తల్లి.. చుక్కల్లో జాబిల్లి అనే పాట తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర వహించడమే కాదు నాటికి, నేటికి, ఏ నాటికైనా చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా అనే పాట కూడా అంతే బాగుంటుంది. అన్నింటినీ మించి జయ జయహే తెలంగాణ.. పాటతో ఆయన జన్మ ధన్యం చేసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ పాట గొప్పతనాన్ని గుర్తించి, గౌరవించి తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించింది. ఇలాంటి గొప్ప పాటలు అందించిన ఆయన ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి అని ప్రార్థిస్తున్నాను అని నారాయణమూర్తి పేర్కొన్నారు.చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం -
ఎట్టకేలకు ప్రకటించేశారు.. ఓటీటీలోకి వచ్చేస్తున్న డ్యూడ్
దీపావళికి రిలీజైన అన్ని సినిమాలు ఓటీటీ డేట్ ఇచ్చేశాయి. కిరణ్ అబ్బవరం 'కె-ర్యాంప్' నవంబర్ 15న ఆహాలో రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా' మూవీ నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఇక దీపావళి రేసులో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'డ్యూడ్' సినిమా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయకుండా అభిమానులను సస్పెన్స్‌లో ఉంచారు.ఈ వారమే ఓటీటీలోఈ సస్పెన్స్‌కు తెర దించుతూ ఎట్టకేలకు డ్యూడ్ ఓటీటీ రిలీజ్ డేట్ (Dude Movie OTT Reelase Date) ప్రకటించారు. నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో రానుందంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో డ్యూడ్ అందుబాటులోకి రానుందని వెల్లడించారు. డ్యూడ్ విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించారు. శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించగా కీర్తి శ్వరన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాగా ఈజీగా రూ.100 కోట్లు రాబట్టింది.కథడ్యూడ్ కథేంటంటే.. గగన్ (ప్రదీప్ రంగనాథన్).. ఆముద (నేహా శెట్టి)ని ప్రేమిస్తాడు. కానీ మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. గగన్‌ను అతడి మేనమామ (శరత్ కుమార్) కూతురు కుందన (మమిత బైజు) ప్రేమిస్తుంది. కానీ, ఆమె పెళ్లి ప్రపోజల్‌ను గగన్ రిజెక్ట్ చేస్తాడు. కొంతకాలానికి ఆమెనే పెళ్లాడాలనుకున్న టైమ్‌కు కుందన పార్దు (హృదయ్)తో ప్రేమలో ఉంటుంది. అయినప్పటికీ గగన్-కుందనకే పెళ్లి జరుగుతుంది. వీళ్ల పెళ్లికి కారణమేంటి? తర్వాత కలిసున్నారా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. Orey oru Dude, oraayiram problems, zero solutions 🤭😭 pic.twitter.com/ShfAo36IJz— Netflix India South (@Netflix_INSouth) November 10, 2025చదవండి: ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం -
ముక్కోటి గొంతుకల్ని ఏకం చేసిన అందెశ్రీ.. పాటతోనే ప్రాణం
ఆయన పదాలు కడితే పాటతల్లి పులకరిస్తుంది. ఆ పాట వింటుంటే హృదయాలు పరవశిస్తాయి. ఆయన పాటలెప్పుడూ ప్రకృతి, జనంతో మమేకమై ఉంటాయి. ఉత్తేజం, ఉక్రోషం, ఆవేదన, నిరసన.. ఇలా అన్నీ ఆయన పాటలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. తెలంగాణ ఉద్యమంలో పాటనే ఆయుధంగా చేసుకున్నారు. ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ముందుకు నడిపించారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర గీతకర్త, పాటల రచయిత అందెశ్రీ. సోమవారం (నవంబర్ 10) నాడు అందెశ్రీ ఇక సెలవంటూ వీడ్కోలు తీసుకున్నారు. ఆయన గురించి ఈ ప్రత్యేక కథనం..అందెశ్రీ పేరెలా వచ్చింది?అందెశ్రీ (Ande Sri).. 1961 జూలై 18న జన్మించారు. ఈయన అసలు పేరు ఎల్లయ్య. అతడి 16వ ఏట శృంగేరీ పీఠానికి చెందిన స్వాములు శంకర్ మహారాజ్.. ‘బిడ్డా.. కాళిదాసు, తెనాలి రామకృష్ణను కనికరించిన అమ్మవారు నీలో ఉంది. నీ సాహిత్యంలో ఆమె అందె విన్పిస్తోంది. నీవు నేటి నుంచి అందె శ్రీవి' అని ఆశీర్వదించారు. అలా ఆయనకు ఈ పేరు వచ్చింది.పుస్తకాల్లోకెక్కిన పాటపేరుకు తగ్గట్లుగానే ఆయన కలం నుంచి వచ్చే కవిత్వం, పాటలు కూడా ఎంతో గొప్పగా ఉండేవి. బడి ముఖం చూడకపోయినా సమాజాన్ని, ప్రకృతిని అందరికంటే ఎక్కువ చదివేశారు. ఎర్ర సముద్రం సినిమాలో 'మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు..' పాటతో హృదయాలు మెలిపెట్టేశారు. తర్వాత ఈ పాట పాఠ్యాంశంగానూ మారడం విశేషం! గంగ సినిమాలో 'వెళ్లిపోతున్నావా..' పాటకుగానూ ఉత్తమ గేయరచయితగా నంది అవార్డు తీసుకున్నారు. మనకంటూ పాట లేదా?తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న అందెశ్రీకి ఓసారి స్టేజీ ఎక్కినప్పుడు మొదట ఏ పాట పాడాలో అర్థం కాలేదు. అప్పుడే మనకంటూ ఓ పాట లేదా? అన్న ప్రశ్న మనసును తొలిచేసింది. అలా 'జయ జయహే తెలంగాణ పాట' పురుడు పోసుకుంది. ఈ పాట స్టేజీపై పాడిన తొలిసారే.. వెనకనుంచి ఎవరో ఇది తెలంగాణ జాతీయగీతం అన్నారు. వెక్కిరిస్తున్నారేమో అని అందెశ్రీ భయపడ్డారు. కానీ, తర్వాత అదే తెలంగాణ రాష్ట్ర గీతంగా కీర్తికెక్కింది.పాటకు ప్రాణం'పల్లె నీకు వందనాలమ్మో..', 'కొమ్మ చెక్కితే బొమ్మరా.. కొలిచి మొక్కితే అమ్మరా' అంటూ ప్రకృతికి, మన జీవన విధానానికి చేతులెత్తి మొక్కుతారాయన. 'జన జాతరలో మన గీతం.. జయకేతనమై ఎగరాలి.. ఝంఝా మారుత జననినాదమై జేగంటలు మోగించాలి..' అంటూ జైబోలో తెలంగాణలో రాసిన పాట అందరు పిడికిలి బిగించి మరింత గట్టిగా, ధైర్యంగా జై తెలంగాణ అనేలా చేసింది. ఒకటే జననం, ఒకటే మరణం.. ఈ మధ్యలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా తెలంగాణ సాధించడం ఒక్కటే మన కర్తవ్యం అంటూ పాటతోనే జనాన్ని ముందుకు నడిపించారు. ఎవరు రాయగలరు ఇంతకంటే గొప్ప గీతం అనిపించేలా పాటలు రాయడంలో ఆయనకు ఆయనే సాటి! చదవండి: అందెశ్రీ కన్నుమూత


