అమ్మో.. రుక్మిణినా?.. భయపడిపోతున్న దర్శకనిర్మాతలు! | Rukmini Vasanth Hike Her Remuneration After Kantara 2 | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: చేసింది 12 సినిమాలే.. కోట్ల పారితోషికం, అవకాశాలు రావట్లేదు!

Feb 27 2026 8:02 AM | Updated on Feb 27 2026 9:00 AM

Rukmini Vasanth Hike Her Remuneration After Kantara 2

ఈ తరం హీరోయిన్లు నటనపై కంటే ధనార్జన పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారా? అలా అవకాశాలను కోల్పోతున్నారా ? నటి రుక్మిణి వసంత్‌ లాంటి నటీమణులను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ కన్నడ భామ సినీ పయనం జస్ట్‌ ఆరేళ్లే. అయితే ఈ అమ్మడు ఇంత తక్కువ కాలంలోనే పాన్‌ ఇండియా కథానాయకిగా మారడం విశేషమే.

 2019లో ఒక కన్నడ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ వెంటనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత తమిళం, తాజాగా తెలుగు భాషల్లో చిత్రాలు చేశారు. ఇటీవల కన్నడం చిత్రం కాంతార –2లో నటించి విశేష గుర్తింపును పొందారు. పారితోషికం పెంచాలంటే ఎవరైనా, మంచి విజయం కోసం ఎదురు చూడాలి. అలాంటి హిట్‌ రుక్మిణి వసంత్‌కు కాంతారా– 2 చిత్రంతో వచ్చింది. తాజాగా ఓ తెలుగు, కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో ఇంతకు ముందు విజయ్‌ సేతుపతికి జంటగా ఏస్‌ చిత్రంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. ఆ తరువాత శివకార్తికేయన్‌ సరసన నటించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. 

అదే విధంగా తెలుగులోనూ రంగప్రవేశం చేశారు. అక్కడ నటించిన తొలి చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం విజయాన్ని ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ అమ్మడికి లక్కు ఉన్నట్లుంది ఇప్పుడు డ్రాగన్‌ చిత్రంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన నటించే అవకాశం వరించింది. 

ఇకపోతే కన్నడంలో యశ్‌తో కలిసి నటించిన టాక్సిక్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ అమ్మడి చేతిలో డ్రాగన్‌ అనే ఒక్క చిత్రం మాత్రమే ఉంది. కొత్తగా అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం ఈ భామ తన పారితోషికాన్ని అమాంతంగా పెంచేయడమేనట. ఇలాంటి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం వల్లే దర్శక నిర్మాతలు ఈ బ్యూటీని ఎంపిక చేయడానికి వెనుకడుగు వేస్తున్నారట. రుక్మిణి వసంత్‌ ఇప్పటికి అన్ని భాషల్లో కలిపి 12 చిత్రాలు మాత్రమే చేశారు. అప్పుడే కోట్లలో పారితోషికం డిమాండ్‌ చేస్తుండడం చర్చనీయాశంగా మారుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement