గోపీ అచ్చెర, శివానీ నాగారం, సుహాస్, వంశీ నందిపాటి, నరేంద్ర రెడ్డి
‘‘అంబాజీ పేట మ్యారేజి బ్యాండు’ సినిమా తర్వాత నా సినిమాల కలెక్షన్లు మినిమమ్ నంబర్లు కూడా కనబడకపోవడంతో భయం వేసింది. కానీ, ‘హే బల్‌వంత్’ మూవీ వసూళ్లు చూశాక ధైర్యం వచ్చింది. ఓవర్‌సీస్‌లో కూడా మంచి కలెక్షన్లు వచ్చాయి’’ అని హీరో సుహాస్ పేర్కొన్నారు. గోపీ అచ్చెర దర్శకత్వంలో సుహాస్, శివానీ నాగారం జోడీగా నటించిన చిత్రం ‘హే బల్‌వంత్’. బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ నెల 20న విడుదల చేశారు. గురువారం నిర్వహించిన ‘థాంక్యూ మీట్ ఫర్ బ్రేక్ ఈవెన్ డన్ ఈవెంట్’లో బి. నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్‌లో వచ్చిన తొలి సక్సెస్ ఇది. మంచి సినిమా తీశారంటూ ప్రేక్షకులు అభినందించడం సంతృప్తినిచ్చింది’’ అని తెలిపారు.
‘‘మా మూవీ చూసిన అందరూ యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు గోపీ అచ్చెర. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘హే బల్‌వంత్’కి బ్రేక్ ఈవెన్ కావడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సినిమాని దాదాపు 10 క్లోట బడ్జెట్‌తో నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్ ఇతర హక్కులు, థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ కలిపి పది కోట్లు పెట్టుబడి సాధించాం. ముఖ్యంగా యూఎస్‌లో మంచి వసూళ్లు వచ్చాయి.
రానున్న రోజుల్లో లాభాల్లోకి వెళతాం. నంది అవార్డ్స్ లాంటి అవార్డు అందుకోవాలని ఆశగా ఉండేది. ఆ కలతోనే పరిశ్రమకు వచ్చాను. ఇలాంటి గొప్ప అవార్డ్స్ గురించి నేను ఈ మధ్య తప్పుగా మాట్లాడాను. నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే ఐయామ్ సారీ’’ అని చెప్పారు. నటి, యాంకర్ స్రవంతి చొక్కారపు, లావణ్య రెడ్డి, మహీ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.


