ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఏకంగా మెగాస్టార్‌తోనే మ్యాజిక్ క్రియేట్ చేశాడు. మనశంకర వరప్రసాద్‌గారు మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ అతిథి పాత్రలో మెరిశారు. ఈ మల్టీస్టారర్ మూవీ 2026 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
అయితే ఈ సినిమా హిట్ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ సినిమాను కూడా ప్రకటించారు. మరోసారి టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టనున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ హిట్ కొట్టి వీరిద్దరు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఈ విషయాన్ని డైరెక్టర్ అనిల్ ట్వీట్ చేశారు.
మొదటి "వందకోట్ల బొమ్మ" కొట్టిన హీరో.. వెంకీమామతో.. "మొదటిసారి బొమ్మ" తీసే అవకాశం ఇచ్చిన హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి..2027 మొదటి పండగకి మీ ముందుకు వస్తున్నాం అంటూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ క్రేజీ కాంబో మల్టీస్టారర్ మూవీ కోసం వెంకీమామ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Back again with my director @AnilRavipudi for #VenkyAnil5 🤗🤗🤗
Every time we team up, it feels like coming back home full of fun, positivity, and pure entertainment! ❤️
Glad to have @NANDAMURIKALYAN join this journey making it special for all of us.. పండగకి కలుద్దాం!!… https://t.co/mCqMXCW10x— Venkatesh Daggubati (@VenkyMama) February 26, 2026


