టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వీరిద్దరి ప్రేమపై వస్తున్న వార్తలకు తెరదించుతూ, నేడు (ఫిబ్రవరి 26) ఉదయం 10.10 గంటలకు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక సాగింది.
వివాహం అనంతరం విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాలో పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, తన లవ్‌స్టోరీని అభిమానులతో పంచుకున్నారు. ‘ఒక రోజు ఆమెను చాలా మిస్ అయ్యాను. తను నా పక్కనే ఉంటే బాగుంటుందని, తను ఎదురుగా ఉంటే నేను తినే భోజనానికి ఒక అర్థం ఉంటుందని గ్రహించాను. జిమ్‌లో తను తోడుంటే ఆ కష్టం శిక్షలా కాకుండా సరదాగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే, మనశ్శాంతిని ఇచ్చే 'ఇల్లు' అంటే తనే అని నాకు అర్థమైంది. అందుకే నా బెస్ట్ ఫ్రెండ్‌నే నా భార్యగా చేసుకున్నాను’ అని విజయ్ తన పెళ్లి విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. అటు రష్మిక కూడా ‘నా భర్తను పరిచయం చేస్తున్నా’ అంటూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' సినిమాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ జంటగా మారడం పట్ల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి పెళ్లి ఫోటోలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


