విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..! | Vijay Deverakonda And Rashmika Mandanna Marriage Special Sweet Boxes To Media People At Udaipur, Video Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vijay -Rashmika: విరోష్ జంట గొప్పమనసు.. వారికి ప్రత్యేకంగా స్వీట్ బాక్సులు..!

Feb 26 2026 4:17 PM | Updated on Feb 26 2026 4:59 PM

Vijay and rashmika Marriage special Sweet Boxes To media People

ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన తరుణం రానే వచ్చింది. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న విరోష్ జంట పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 10 గంటల 10 నిమిషాలకు రష్మిక మెడలో మూడు ముళ్లు వేశాడు విజయ్ దేవరకొండ. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విరోష్ జంట తమ గొప్పమనసు చాటుకున్నారు. వీరి పెళ్లిని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులకు స్వీట్ బాక్సులు అందించారు. అంతేకాకుండా అక్కడే ఉన్న చిన్నపిల్లలకు సైతం స్వీట్స్‌ పంచారు. ఐటీసీ మెమొంటోస్ హోటల్ బయట ఉన్న వారి దగ్గరికి వచ్చిన ఈ ప్రత్యేక స్వీట్ బాక్సులు అందజేశారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement