ఇద్దరి మధ్య 16 ఏళ్ల గ్యాప్.. రష్మిక చెల్లి గురించి తెలుసా? | Rashmika Sister Shiman Mandanna Full Details | Sakshi
Sakshi News home page

Rashmika Sister: పేరుకే చెల్లి కానీ కూతురిలా.. రష్మికకు చెల్లిపై ఎంత ప్రేమంటే?

Feb 26 2026 1:26 PM | Updated on Feb 26 2026 1:30 PM

Rashmika Sister Shiman Mandanna Full Details

హీరోయిన్ రష్మిక ఎట్టకేలకు హీరో విజయ్ దేవరకొండని పెళ్లాడింది. ఉదయ్‌పుర్ వేదికగా కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తెలుగు సంప్రదాయంలో ఏడడుగులు వేశారు. ఈ రోజు సాయంత్రం రష్మికకు చెందిన కొడవ పద్ధతిలోనూ వివాహం జరగనుంది. సరే ఈ విషయాలు కాసేపు పక్కనబెడితే విజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలుసు. కానీ రష్మిక విషయానికొస్తే ఈమె కుటుంబం గురించి చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. మరీ ముఖ్యంగా రష్మిక చిట్టి చెల్లెలు ఎవరు? ఈమెకు ఆమెకు 16 ఏళ్ల గ్యాప్ అని తెలుసా?

రష్మిక విషయానికొస్తే.. కర్ణాటకలోని విరాజీపేటలో 1995లో పుట్టింది. తండ్రి మదన్‌కి స్థానికంగా ఓ కాఫీ ఎస్టేట్, ఫంక్షన్ హాల్ ఉంది. తల్లి సుమన్ హౌస్ వైఫ్. రష్మికతో పాటు వీళ్లకు మరో కూతురు కూడా ఉంది. పేరు షిమన్. ఈ పాపకు ఇప్పుడు 14 ఏళ్లు. అంటే రష్మిక కంటే 16 ఏళ్లు చిన్నది. ప్రస్తుతం స్కూలింగ్ చేస్తోంది. ఇంతలా వయసు వ్యత్యాసం వల్ల షిమన్‌ని చెల్లిలా కంటే కూతురిలా చూసుకుంటున్నాని రష్మిక గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: #Virosh.. పెళ్లి చేసుకున్న విజయ్-రష్మిక)

రష్మిక కాస్త పెద్దయ్యాక షిమన్ పుట్టింది. దీంతో తన చిట్టి చెల్లిల్ని ఎంతో గారాబంగా చూసుకోవాలని రష్మిక అనుకుంది. కానీ నటిగా మారి వరస సినిమాలు చేయడం వల్ల చెల్లితో గడపడమే రష్మికకు చాలా కష్టమైపోయింది. షిమన్‌ని చాలా మిస్ అవుతున్నాననే విషయాన్ని ఏ మాత్రం దాచుకోలేదు. చాలా ఇంటర్వ్యూల్లో ఈ విషయాన్ని రష్మిక బయటపెట్టింది కూడా. ఇండస్ట్రీలోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా ఆమెతో(చెల్లి) ఉండలేకపోతున్నాను. పెరిగి పెద్దవడాన్ని చూడలేకపోతున్నాను. ఇప్పుడు నా అంత ఎత్తు ఎదిగిపోయింది. ఒక్కోసారి తనని కలవలేకపోతున్నానని ఏడ్చేసేదాన్ని అని రష్మిక చెప్పుకొచ్చింది.

రష్మిక ఇంతలా పాన్ ఇండియా స్టార‌డమ్ అనుభవిస్తున్నప్పటికీ.. తన కుటుంబాన్ని ఎ‍ప్పుడు పెద్దగా మీడియా కంటపడనివ్వలేదు. ఈమె తల్లిదండ్రులు కూడా షిమన్‌ని సాధారణ పిల్లల్లానే పెంచాలనుకున్నారు. అందుకే తల్లిదండ్రులతో కలిసి షిమన్.. మైసూరులో ఉండగా.. రష్మిక మాత్రం వరస సినిమాలతో హైదరాబాద్, ముంబైకి తిరుగుతూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఎప్పుడైనా ఖాళీ టైం దొరికితే ఇంట్లో వాలిపోయి చెల్లితో సరదాగా ఆడుకుంటుంది. ఆ ఫొటోల్ని కూడా పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement