Rashmika Mandanna: నా కాబోయే భర్త అలానే ఉండాలి..! | Actress Rashmika Mandanna Shared The Qualities She Wants In A Partner | Sakshi
Sakshi News home page

అలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తినే పెళ్లాడతా..!: రష్మిక మందన్న

Feb 26 2026 12:20 PM | Updated on Feb 26 2026 12:26 PM

Actress Rashmika Mandanna Shared The Qualities She Wants In A Partner

టాలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు చాలాకాలం ప్రేమలో ఉన్నారు. అయితే ఆ విషయం బయటకు చెప్పకపోవడంతో.. ఈ ఇద్దరూ ఎక్కడ  కనిపించినా.. రకరకాల పుకార్లు, గాసిప్స్‌  చక్కెర్లు కొట్టాయి. ప్రస్తుతం వాటిన్నింటికీ చెక్‌పెట్టేస్తూ..ఈ ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనుంది ఈ జంట. ఇంకొన్ని గంటల్లో పెళ్లి బంధంతో ఒక్కటికానుకున్న నేపథ్యంలో రష్మిక మందన్న తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఓ ఇంటర్యూలో చాలా ఆసక్తికరంగా చెప్పారు. అవేంటో ఈ సందర్భంగా చూద్దామా..!

‍ప్రతి అమ్మాయి పెళ్లి విషయంలో ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలు, ఆకాంక్షలు ఉంటాయి. అది సహజం. ఇక్కడ నటి మదన్న కూడా అలానే భావించారు. ఈ ముద్దుగుమ్మ సైతం సగటు అమ్మాయిలా..తన కాబోయే వాడు అలానే ఉండాలని అలా ఉంటేనే అతడిని పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేసింది. ఇంతకీ ఆమె తన భాగస్వామి ఎలా ఉండాలందంటే..

ప్రేమలో దయ, గౌరవం ఉంటేనే ఆ బంధం నిలబడుతుందని అంటోంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమయంలో సహచరుడు తప్పక ఉండాలి. కాబట్టి ఆ అమ్మాయికి తన కాబోయే జీవిత భాగస్వామి చాలా స్పెషల్‌గా ఉండాలి. ఏవిధంగా అంటే..ఆ అమ్మాయి ప్రతి బాధ, కష్టం, ఆనందంలోనూ తన పక్కనే ఉండాలి . ఆ భాగస్వామిని చూడగానే ఎలాంటి ఒడిదుడుకులనైనా ఇట్టే ఎదుర్కొనగలను అనే ధైర్యం, నమ్మకం కలగించేలా ఉండాలి.

అతడే ఆమెకు ఓదార్పు, భద్రత, సానుభూతి.. అన్ని అవ్వాలి. అవే ఏ అమ్మాయైనా తన కాబోయే భర్తలో కోరుకునేది. అలాంటి వ్యక్తి లభిస్తే ఏ అమ్మాయి అయినా..అదృష్టవంతురాలే అంటూ తన కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చాలా చక్కగా వివరించింది రష్మిక. అంతేగాదు ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు గౌరవించుకుంటున్నప్పుడు, శ్రద్ధ వహిస్తున్నప్పుడు, బాధ్యత వహిస్తున్నప్పుడు..ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని అంటోంది. 

చివరగా..ఇలాంటి లక్షణాలే తన భర్తలో ఉండాలని కోరుకుంటానని నవ్వుతూ చెప్పింది రష్మిక. మరి అలాంటి లక్షణాలే విజయ్‌లో ఉన్నాయి కాబోలు..అందుకే ఈ క్రేజీ బోయ్‌తో ఇంకొన్ని గంటల్లో ఏడుగుగులు వేసి..కొత్త జీవితాన్ని ఆరభించనుంది ఈ బ్యూటీ. కాగా, విజయ్‌ రష్మికలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కి 50 కి.మీ దూరంలో ఉన్న లగ్జరీ హోటల్‌ ఐటీసీ మెమెంటోస్‌లో గ్రాండ్‌గా వివాహం చేసుకోనున్నారు.

(చదవండి: ట్రెండీగా 'కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా' ..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement