#Virosh హల్దీ సెలబ్రేషన్.. ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్ | Ashika Ranaganath Share Pictures Vijay Rashmika Haldi | Sakshi
Sakshi News home page

Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లికి టాలీవుడ్ హీరోయిన్లు కూడా

Feb 26 2026 8:29 AM | Updated on Feb 26 2026 9:53 AM

Ashika Ranaganath Share Pictures Vijay Rashmika Haldi

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ రష్మిక పెళ్లికి అంతా సిద్ధం. ఈరోజు(ఫిబ్రవరి 26) ఉదయం 10:10 గంటలకు విజయ్ మూడు మూళ్లు వేయనున్నాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మెమొంటోస్ హోటల్.. ఈ వివాహానికి వేదిక. ఇప్పటికే బారాత్ మొదలైపోయింది. ఉదయం తెలుగు సంప్రదాయంలో పెళ్లి జరగనుండగా.. సాయంత్రం 4 గంటల తర్వాత (కొడవ) కన్నడ సంప్రదాయంలో మరోసారి వివాహ తంతు జరగనుంది.

(ఇదీ చదవండి: Virosh.. రష్మికకు మూడోసారి.. విజయ్‌కు మాత్రం తొలిసారి!)

ఇకపోతే బుధవారం సాయంత్రం హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా.. వేడుకకు వచ్చిన అతిధులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ కూడా వెళ్లింది. హల్దీకి సంబంధించిన ఫొటోలని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది హల్దీ కాదని ముందే హోలీ వచ్చేసిందని చెప్పుకొచ్చింది. ఇదే పెళ్లి కోసం హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ కూడా అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో పెట్టిన ఓ ఫొటో చూస్తే.. ఈమె కూడా హల్దీ వేడుకల్లో పాల్గొన్నట్లు కనిపిస్తోంది.

ఇదే పెళ్లి కోసం డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా, టాలీవుడ్ స్టైలిష్ట్ శ్రావ్య వర్మ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదితరులు ఇప్పటికే ఉదయ్‌పుర్ చేరుకున్నారు. ఈ రోజు గానీ రేపు గానీ వాళ్లు కూడా సోషల్ మీడియాలో కొత్త జంట విజయ్ దేవరకొండ-రష్మికకు పెళ్లి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడతారు. ఫొటోలు కూడా రిలీజ్ చేయడం గ్యారంటీ. అలానే మార్చి 4న హైదారాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: విజయ్- రష్మిక వెడ్డింగ్.. అసలేంటి ఈ సెలబ్రిటీ ట్రెండ్‌?)

Advertisement
 
Advertisement
Advertisement