ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్‌, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్‌ | Wedding of ViRosh Vijay Deverakonda Mother Gifts Heirloom Bangles To Rashmika | Sakshi
Sakshi News home page

ViRosh రెండు పద్ధతుల్లో వెడ్డింగ్‌, కాబోయే కోడలికి అత్తగారి అందమైన గిఫ్ట్‌

Feb 25 2026 2:04 PM | Updated on Feb 25 2026 3:03 PM

Wedding of ViRosh Vijay Deverakonda Mother Gifts Heirloom Bangles To Rashmika

Wedding of ViRosh నేషనల్‌ క్రష్‌, నటి రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ  పెళ్లి సందడికి సంబంధించిన కబుర్లుఉ ఊపందుకున్నాయి.విరోష్‌ అంటూ తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఫిబ్రవరి 26న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే వధూవరులతోపాటు, అతిరథమహారథులు ఈ వివాహ వేడుకకోసం ఉదయపూర్‌కు వెళ్లారు.  తెలుగు, కొడవ ఇలా రెండు సంప్రాదాయ పద్ధతుల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది.  తాజా నివేదికల ప్రకారం  ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు  జోరుగా సాగుతున్నాయి.

విజయ్ దేవరకొండ తల్లి రష్మిక మందన్నకు బహుమతి
సంగీత వేడుకను మంగళవారం ఘనంగా జరిగింది. సరదాగా క్రికెట్ ఆడిన తర్వాత, ఉదయపూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్‌లో సంగీత నైట్‌  ఉత్సాహంగా నిర్వహించుకోగా, ఈ వేడుకలకు సంబంధించి ఒక భావోద్వేగ సంగతి నెట్టింట విశేషంగా నిలుస్తోంది. సంగీత వేడుకలో విజయ్ తల్లి మాధవి దేవరకొండ కుటుంబ సంప్రదాయానికిఅనుగుణంగా రష్మికకు వారసత్వ గాజులను బహుకరించారట.  తద్వారా తమ కుటుంబంలోకి కోడలిగా రష్మికను ప్రేమగా ఆహ్వానం పలికినట్టుగా భావిస్తున్నారు.  సంగీత వేడుక నుండి లీక్ అయిన ఫుటేజ్ సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. ఈరోజు హల్దీ వేడుకు జరగనుంది

విరోష్ పెళ్లికి తరలివెళ్లిన అతిథులు
మరోవైపు అనేక మంది అతిథులు ఇప్పటికే లేక్స్ నగరానికి చేరుకున్నారు.  పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్,నటి ఈషా రెబ్బాతోపాటు ఈ జంటకు సన్నిహితురాలైన  స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా హాజరయ్యారు. అంతేకాదు రష్మిక బ్లాక్‌బస్టర్‌ మూవీ ది గర్ల్‌ఫ్రెండ్ నటి ఆషికా రంగనాథ్ , దర్శకుడు-నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా వేడుకలకు తరలివెళ్లారు. కోకిలాబెన్ అంబానీ, ముఖేష్ అంబానీ, నీతా, ఆకాష్, శ్లోకా అంబానీలతో సహా అంబానీ కుటుబం కూడా ఉదయపూర్‌లో దిగినట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే మార్చి 4న హైదరాబాద్‌లో జరగబోయే రిసెప్షన్ కోసం హితులు, సన్నిహితులతోపాటు, స్టార్‌ లవ్‌బర్డ్స్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయ్ & రష్మిక వెడ్డింగ్ విశేషాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement