టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి.. గురువారం(ఫిబ్రవరి 26) జరగనుంది. ఇప్పటికే వీళ్లిద్దరి కుటుంబ సభ్యులు.. ఉదయ్‌పుర్ వెళ్లిపోయారు. పెళ్లి సందడి కూడా మొదలైపోయింది. మంగళవారం నాడు పెళ్లికొడుకు, పెళ్లి కూతురు టీమ్స్‌గా విడిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అలానే రాత్రి సంగీత్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. నేడు హల్దీ, మెహందీ తదితర సెలబ్రేషన్స్ జరగనున్నాయి. మరోవైపు కాబోయయే వధూవరులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు నోట్ వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: రష్మికకు విజయ్ తల్లిదండ్రులు పెట్టిన కండిషన్ ఏంటి?)
విజయ్-రష్మిక వివాహ వేడుకకు ఆహ్వానం అందుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్న మోదీ.. తన తరఫున శుభాకాంక్షలు తెలిపారు. విజయ్-రష్మిక జీవితంలో ఇది ఓ కొత్త, సుందరమైన అధ్యాయానికి నాంది అని పేర్కొన్నారు. సప్తపది అనే పవిత్ర సంప్రదాయంతో ఏడడుగులు కలిసి వేస్తూ జీవితాంతం స్నేహితులు, భాగస్వాములుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో ఇప్పటికే ఎన్నో పాత్రలు చేసిన విజయ్, రష్మిక.. నిజ జీవితంలో ప్రేమ, అనురాగాలతో నిండిన కొత్త అధ్యాయాన్ని మరింత అందంగా నిర్మించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర గౌరవంతో జీవిత ప్రయాణాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ శుభసందర్భంగా వధూవరులకు, వారి కుటుంబ సభ్యులకు తన ఆశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
(ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకేరోజు 'రెండుసార్లు' పెళ్లి!)


