breaking news
Narendra Modi
-
దేశభద్రతలో ఆత్మనిర్భరత
కోల్‌కతా: దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్‌కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ (సీసీసీ)ను ప్రారంభించారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం మార్పు: సీసీసీలో సైనిక దళాల్లో గత రెండు సంవత్సరాల్లో చేపట్టిన సంస్కరణలను ప్రధాని సమీక్షించారు. వచ్చే రెండు సంవత్సరాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్‌లో సైనిక దళాలు చూపిన తెగువను ప్రధాని ప్రశంసించారు. ‘సంస్కరణల సంవత్సరం– భవిష్యత్తు కోసం మార్పు’ అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో సైనిక, ఆయుధ పరంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. భారత త్రివిధ దళాలు జాతి నిర్మాణంతోపాటు కల్లోల ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తిరిగి తీసుకురావటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ప్రకృతి విపత్తుల సమయంలో దళాల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను సమర్ధంగా ఎదుర్కోవాలంటే దళాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలని, సైనిక పరంగా స్వయంసమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. -
బిహార్‌ను బీడీతో పోలుస్తారా!
పుర్నియా: బిహార్ అభివృద్ధిబాటన సాగుతుండగా ప్రతిపక్ష కాంగ్రెస్, ఆర్జేడీలు ఓర్వలేని తనంతో చులకనగా మాట్లాడుతున్నాయని ప్రధాని మోదీ మండిపడ్డారు. అవమానించడమే ప్రతిపక్ష నాయకులు పనిగా పెట్టుకున్నారని ధ్వజమె త్తారు. మోదీ సోమవారం బిహార్‌లోని పుర్నియా లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిహార్ అంటే బీడీ అంటూ ప్రతిపక్ష నాయకులు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బిహార్‌లో తయారైన రైలింజిన్లు ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్, ఆర్జేడీ నేతలకు నచ్చడం లేదు. బిహార్‌లో అభివృద్ధి ఛాయలు కనిపించినప్పుడల్లా ఈ నేతలు చెలరేగిపోతున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ఏకమై బిహార్‌ను బీడీతో పోలుస్తూ సోషల్ మీడియా వేదికలపై చెలరేగిపోతున్నారు’అని ఆయన అన్నారు. ‘ఈ రెండు పార్టీల నేతలు సొంత కుటుంబసభ్యుల గురించే ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు. మీ కుటుంబం సంక్షేమం వారికి పట్టదు. కానీ, మోదీకి మీరందరూ కుటుంబ సభ్యులే. అందుకే సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అని మోదీ అంటున్నారు. మీ కుటుంబం, సంక్షేమం, మీ బాగోగుల గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు’అని తెలిపారు. బిహార్, పశ్చిమబెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసదారులకు ప్రతిపక్షాలు అండగా నిలుస్తున్నా యని, వీటి తీరుతో ఆయా రా ష్ట్రాల జనాభాలో తీరుతెన్నుల్లో తీ వ్రమైన మార్పులు సంభవిస్తున్నా యని ఆయన హెచ్చరించారు. ఆయా రాష్ట్రాల్లోని వారు తమ తోబుట్టువులు, కుమార్తెల ఆత్మ గౌరవం గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపారు.దేశ భద్రత, వనరులను ప్రతిపక్షాలు ఫణంగా పెడుతున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. విదేశాల నుంచి అందుతున్న మద్దతుతో వలసదారులకు మద్దతుగా యాత్రలు నిర్వహిస్తూ నినాదాలు చేస్తూ నిస్సిగ్గుగా వ్యవహ రిస్తున్నారంటూ కాంగ్రెస్ చేపట్టిన ఓటర్ అధికార యాత్రనుద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. ప్రతి చొరబాటుదారునూ దేశం నుంచి వెళ్లగొట్టేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రూ.40 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. పుర్నియా ఎయిర్‌పోర్టులో కొత్తగా అభివృద్ధి పర్చిన టెర్మినల్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. పుర్నియా–కోల్‌కతా మార్గంలో మొదటి విమానాన్ని జెండా ఊపి ప్రారంభించారు. మఖానా రంగం అభివృద్ధికి నేషనల్ మఖానా బోర్డు ద్వారా రూ.475 కోట్లు వెచ్చిస్తా మని ప్రకటించారు. భాగల్పూర్లో రూ.25 వేల కోట్లతో నిర్మించే ధర్మల్ విద్యుత్ ప్రాజెక్టుకు, రూ.2,680 కోట్ల కోసి–మెచి ఇంట్రా స్టేట్ రివర్ లింకు ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేశారు. -
మణిపూర్‌కు సాంత్వన!
మానవీయ స్పర్శ లేశమాత్రం లేని మానవాకార మృగాలు రోజుల తరబడి సృష్టించిన బీభత్సం పర్యవసానంగా అయినవారినీ, ఆవాసాలనూ మాత్రమే కాదు... జీవిక కోల్పోయి చెట్టుకొకరు పుట్టకొకరై 28 నెలల నుంచి అనాథలుగా బతుకీడుస్తున్న మణిపూర్ పౌరులకు ఆలస్యంగానైనా సాంత్వన లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తొలుత చురాచాంద్‌పూర్ బహిరంగ సభలో బాధితులనుద్దేశించి మాట్లాడాక, రాజధాని ఇంఫాల్‌లో ఉన్న కాంగ్లా ఫోర్ట్ వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. సాధారణ పరిస్థితుల్ని పునరుద్ధరించటానికి చేయాల్సిందంతా చేస్తామని ఆయన హామీ ఇవ్వటంతో పాటు వేలాది కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్ని ప్రారంభించటం, మరికొన్నిటికి శంకుస్థాపన చేయటం హర్షించదగ్గవి. ఇవన్నీ రాగల కాలంలో సామరస్య వాతావరణానికి దోహదపడే అవకాశం ఉన్న మాట నిజమే అయినా, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ మధ్య తలెత్తిన ఘర్షణల పర్యవసానంగా మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోగా, 60,000 మంది నిరాశ్రయులయ్యారు. ఆ తెగల మధ్య పరస్పర అవిశ్వాసం, ఘర్షణలు ఈనాటివి కాదు. వీటిని చక్కదిద్దటానికి ఏ ప్రభుత్వమూ పెద్దగా ప్రయత్నించింది లేదు. బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ కూటమి ప్రభుత్వమైతే మెయితీల అనుకూలమన్న ముద్ర పడేలా వ్యవహరించి ఆ ఘర్షణ వాతావరణాన్ని పెంచింది. 2023 మే 3 మొదలుకొని సాగిన దారుణాలు సిగ్గు చేటైనవి. రాష్ట్రంలో మెజారిటీగా ఉన్న మెయితీలకూ, కుకీ–జో తెగలకూ తలెత్తిన ఘర్షణల్లో మహిళలపై గుంపులు దాడిచేసి వారిని వివస్త్రలను చేయటం, నగ్నంగా ఊరేగించి అత్యాచారాలకు తెగబడటం వంటివి చోటుచేసుకున్నాయి. చురాచాంద్‌పూర్‌లో కుకీ–జో తెగలవారికి సహాయక శిబిరాలు నెలకొల్పగా, మెయితీ బాధితులు ఇంఫాల్ రక్షణ శిబిరాల్లో ఉంటున్నారు. దురదృష్టమేమంటే కుకీ–జో తెగలవారు ఇంఫాల్‌లో అడుగుపెట్టలేరు. మెయితీలు కొండప్రాంత జిల్లాలకు పోలేరు. ఇదంతా ఇప్పట్లో చక్కబడే అవకాశం లేదు. కుకీ–జో తెగల మండలి ప్రధానికి సమర్పించిన వినతిపత్రంలో తమకు ప్రత్యేక పాలనాధికార వ్యవస్థ కావాలని కోరింది.అటు మెయితీలకు ప్రాతినిధ్యం వహించే మణిపూర్ సమగ్రతా సమన్వయ కమిటీ (కొకొమీ) అందుకు ససేమిరా అంటున్నది. ఆ వ్యవస్థ ఏర్పాటైతే రాష్ట్ర ప్రతిపత్తి దెబ్బతింటుందనీ, పౌరసత్వాన్ని తెగల వారీగా గుర్తించి, రాష్ట్రాన్ని విభజించినట్టవుతుందనీ దాని వాదన. ‘చట్ట విరుద్ధ’ వలసలను అరికట్టాలని డిమాండ్ చేస్తోంది. పైగా మెయితీలు ఏనాటి నుంచో ఎస్టీ ప్రతిపత్తి కోరుతున్నారు. ఇదే జరిగితే భూహక్కులు కోల్పోతామని కుకీ–జో తెగల భయం. ఈ వాదనలూ, భయాందోళనలూ వర్తమాన సంక్లిష్టతకు అద్దం పడతాయి. రాష్ట్రాన్ని ఆవరించిన కల్లోలం ‘మన పూర్వీకుల స్మృతికి కళంకం మాత్రమే కాదు... భవిష్యత్ తరాలకు అన్యాయం చేయటం కూడా’ అని మోదీ సరిగానే అన్నారు. దీన్ని చక్కదిద్దటానికి ఇంఫాల్ లోయకూ, కొండ ప్రాంత జిల్లాలకూ మధ్య పటిష్ఠమైన వారధులు నిర్మించాల్సి ఉందన్న ఆయన అభిప్రాయం కూడా సబబైనదే. ఇది జరగాలంటే వైషమ్యాలను పెంచి పోషిస్తున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. వదంతుల వ్యాప్తిని సహించకూడదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను ప్రచారంలో పెట్టడంతోనే సమస్య మొదలైందనీ, ప్రధాన స్రవంతి మీడియా ‘మెయితీ మీడియా’గా మారి వీటిని పెంచిపోషిందనీ ఎడిటర్స్ గిల్డ్ నిజనిర్ధారణ కమిటీ గతంలో ఆరోపించింది. ఇందుకు నాటి మణిపూర్ ప్రభుత్వం ఆగ్రహించి కేసులు కూడా పెట్టింది. మణిపూర్ తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మయన్మార్‌తో 352 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. నిరవధిక ఉద్రిక్త వాతావరణం ఎంతమాత్రమూ మంచిది కాదు. బీరేన్‌సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయటంతో సహా చాలా విషయాల్లో ఎంతో జాప్యం జరిగింది. ఇప్పటికైనా నిర్దిష్ట కాల వ్యవధిలో అమలయ్యేలా చర్యలుండాలి. అభివృద్ధి జరిగేలా, ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, జన జీవనం మళ్లీ పట్టాలెక్కేలా చూడాలి. ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్న అపవాదు కలగని రీతిలో పాలనను చక్కదిద్దాలి. -
నేడు బిహార్‌లో ప్రధాని పర్యటన
పట్నా: ప్రధాని మోదీ సోమవారం బిహార్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పుర్నియాలో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రూ.36 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. పుర్నియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెరి్మనల్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని ప్రారంభిస్తారు. మఖానాను సూపర్‌ఫుడ్‌గా పలుమార్లు ప్రధాని మోదీ పేర్కొనడం తెల్సిందే. దేశంలో ఉత్పత్తయ్యే మఖానాలో అత్యధికంగా 90 శాతం మేర బిహార్‌లో సాగవుతోంది. మరికొద్ది నెలల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే మరోసారి అధికారం చేపట్టాలని భావిస్తోంది. అందుకే ప్రధాని మోదీ బిహార్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. గత 11 ఏళ్లలో బిహార్ అభివృద్ధికి ప్రధాని మోదీ రూ.1.50 లక్షల కోట్ల ప్రాజెక్టులను మంజూరు చేశారని బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర డెప్యూటీ సీఎం సమ్రాట్ చౌధరి తెలిపారు. తమ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఫలాలను అందుకుంటోందన్నారు. ప్రధాని పర్యటనను పురస్కరించుకుని భద్రతా ఏర్పాట్లను భారీగా చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై వాహనాలను అధికారులు నిషేధించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పుర్నియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడ రోగులతో మాట్లాడి, వారు పడుతున్న ఇబ్బందులపై ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాల కల్పనలో సీఎం నితీశ్ కుమార్ సారథ్యంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. -
చొరబాటుదారులకు మద్దతా?
గౌహతి: విపక్ష కాంగ్రెస్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. పాకిస్తాన్ నుంచి పుట్టుకొస్తున్న ఉగ్రవాదులకు, మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నవారికి ఆ పార్టీ మద్దతిస్తోందని మండిపడ్డారు. మన సైన్యానికి అండగా ఉండడానికి బదులు నిస్సిగ్గుగా ముష్కర మూకలను వెనకేసుకొస్తోందని ధ్వజమెత్తారు. చొరబాటుదారులను, దేశ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ కాపాడుతోందని ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆ పార్టీ నిజస్వరూపం ప్రజలకు తెలిసిపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని, దేశ ప్రయోజనాలను ఆ పార్టీ ఏనాడూ కాపాడలేదని నిప్పులు చెరిగారు. చొరబాటుదారులు మనదేశంలోకి ప్రవేశించి, భూములు ఆక్రమించుకొని, ఇక్కడే తిష్టవేసి జనాభా స్థితిగతులను మార్చేస్తామంటే సహించే ప్రసక్తే లేదని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ అస్సాంలో రెండో రోజు ఆదివారం పర్యటించారు. దరాంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి, నుమాలీగఢ్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కామాఖ్య మాత ఆశీస్సుల వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందని, ఈ పవిత్రమైన నేలపై అడుగుపెట్టడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. అస్సాంతో, అస్సాం ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే... తప్పో ఒప్పో ప్రజలే నిర్ణయిస్తారు ‘‘అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ నిన్ననే ఒక వీడియోను నాకు చూపించారు. పాటగాళ్లను, తైతక్కలాడేవాళ్లను బీజేపీ నెత్తిమీద పెట్టుకుంటోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఒకరు విమర్శిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 2019లో అస్సాం గాయకుడు భూపేన్ హజారికాకు మేం భారతరత్న పురస్కారం ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆ మాజీ అధ్యక్షుడు మాట్లాడారు. 1962లో చైనా దురాక్రమణ సమయంలో అస్సాం ప్రజలకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన గాయాలు ఇప్పటికీ మానలేదు. పైగా భూపేన్ హజారికాను కించపర్చడం ద్వారా ఆ గాయాలపై కాంగ్రెస్ ఉప్పు చల్లుతోంది. భూపేన్‌ను కించపర్చడం చూసి చాలా బాధపడ్డా. ప్రజలే నాకు యజమానులు. భూపేన్‌కు భారతరత్న ఇవ్వడం తప్పో ఒప్పో వారే నిర్ణయిస్తారు. ఆ మహా గాయకుడిని ఎందుకు అవమానించారంటూ కాంగ్రెస్‌ను ప్రజలు నిలదీయాలి. ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ అస్సాం ప్రజల కలలు నిజం చేయడానికి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ అక్రమ వలసదారులను బయటకు పంపిస్తుండడం హర్షణీయం. భూములను వలసదారుల చెర నుంచి విడిపించి, మళ్లీ రైతులకు అప్పగిస్తున్నారు. ఆ భూముల్లో రైతులు, స్థానికులు వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్నారు. చొరబాటుదారులు మన దేశంలోకి ప్రవేశించి, మన అక్కచెల్లెమ్మలను, తల్లులను అవమానిస్తామంటే చూస్తూ సహించాలా? జాతీయ భద్రతకు ముప్పుగా మారిన వారిని వదిలిపెట్టబోం. బయటకు తరిమికొట్టడం ఖాయం. చొరబాటుదారులకు సమాజంలో ఓ వర్గం నుంచి రక్షణ లభిస్తుండడం సిగ్గుచేటు. అక్రమంగా వలస వచ్చినవారి నుంచి అస్సాంను కాపాడేందుకు పోరాటం జరగాల్సిందే. చొరబాటుదారుల వల్ల మన దేశ జనాభాలో మార్పులు రాకుండా చూడడానికి ‘నేషనల్ డెమొగ్రఫీ మిషన్’ తీసుకొస్తున్నాం. ‘వికసిత్ భారత్’లో ఈశాన్య రాష్ట్రాలు కీలకం కాంగ్రెస్ పార్టీ అస్సాంను కొన్ని దశాబ్దాల పాటు పరిపాలించింది. బ్రహ్మపత్ర నదిపై కేవలం మూడు వంతెనలు నిర్మించింది. మేము పదేళ్లలో ఆరు వంతెనలు నిర్మించాం. మనదేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోంది. అస్సాంలో 13 శాతం వృద్ధిరేటు నమోదైంది. డబుల్ ఇంజన్ సర్కార్ కృషి వల్లే ఇది సాధ్యమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అస్సాంను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతున్నాయి. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఈశాన్య రాష్ట్రాలకు కీలక పాత్ర పోషించబోతున్నాయి. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకోవాలన్న సంకల్పంతో దేశం మొత్తం ఐక్యంగా ముందుకు కదులుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం పెంచడానికి చర్యలు చేపట్టాం. ఏ ప్రాంతమైనా వేగంగా అభివృద్ధి చెందాలంటే అక్కడ బలమైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. 21వ శతాబ్దంలో 25 ఏళ్లు గడిచిపోయాయి. ఈ శతాబ్దంలో తదుపరి అధ్యాయం తూర్పు, ఈశాన్య భారతదేశానిదే. దేశీయంగానే చమురు, సహజ వాయువు ఉత్పత్తి ముడి చమురు, సహజ వాయువు దిగుమతులను తగ్గించుకోవడానికి చర్యలు ప్రారంభించాం. మన దేశం ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న తరుణంలో ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి విదేశాలపై ఆధారపడడం సరైంది కాదు. అందుకే ఈ పరిస్థితిని మార్చాలని సంకల్పించాం. దేశీయంగానే శిలాజ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడానికి ప్రయతి్నస్తున్నాం. ఇంధనాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఆ దిశగా ఇథనాల్ ఒక చక్కటి ప్రత్యామ్నాయం అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇంధనం, సెమీకండక్టర్లు చాలా ముఖ్యం. వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటే మనకు ప్రయోజనం’’ అని అన్నారు.ఆ గరళం గొంతులో దాచుకుంటా నన్ను చాలామంది దూషిస్తున్నారు. అవమా నించడమే పనిగా పెట్టుకున్నారు. వారు నన్ను ఎంతగా తిట్టినా పట్టించుకోను. నేను శివ భక్తుడిని. అన్నింటినీ భరిస్తా. ఆ గరళాన్ని గొంతులో దాచుకుంటా. కానీ, ప్రజలను అవమానిస్తే మాత్రం ఊరుకోను. ప్రజలే నా రిమోట్ కంట్రోల్. నాకు మరో రిమోట్ కంట్రోల్ లేదు. స్వదేశీ ఉత్పత్తులే కొనుగోలు చేయాలని దేశ ప్రజలను మరోసారి కోరుతున్నా. మన దేశం అభివృద్ధి చెందాలన్నా, మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు దక్కాలన్నా మన దేశంలో తయారైన వస్తువులు, సరుకులే ఉపయోగించుకోవాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులే మన నిత్య జీవితంలో భాగం కావాలి. మోదీకి బహుమతిగా పెయింటింగ్లుఅస్సాం సభల్లో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని పలుమార్లు కొద్దిసేపు నిలిపివేశారు. కొందరు యువతీ యువకులు మోదీ, ఆయన మాతృమూర్తి హీరాబెన్ మోదీకి సంబంధించిన పెయింటింగ్‌లను సభల్లో ప్రదర్శించారు. వాటిని ఆయనకు బహుమతిగా అందజేయాలన్నదే వారి ఉద్దేశం. ఆ విషయం మోదీ గ్రహించారు. పెయింటింగ్‌ల వెనుక మీ పేరు, చిరునామా రాసి ఇవ్వండి అని కోరారు. వేదిక పైనుంచి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయా పెయింటింగ్‌లను తీసుకోవాల్సిందిగా తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. అలాగే తనకు లేఖ ఇవ్వడానికి ప్రయత్నించిన దివ్యాంగుడికి ఇబ్బంది కలిగించవద్దని ప్రజలకు సూచించారు.రూ.12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రధానమంత్రి అస్సాంలో ఆదివారం రూ. 12,230 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో రూ.5,000 కోట్ల విలువైన ఇథనాల్ ప్లాంట్ కూడా ఉంది. వెదురుతో ఇక్కడ ఇథనాలు ఉత్పత్తి చేయబోతున్నారు. అలాగే రూ.7,230 కోట్ల విలువైన చమురు శుద్ధి కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. పాలీప్రొపైలీన్ ప్లాంట్ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. దరాంగ్ మెడికల్ కాలేజీకి పునాదిరాయి వేశారు. 2.9 కిలోమీటర్ల పొడవైన నరెంగీ–కురువా వారధి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. -
‘నేను శివభక్తుణ్ని.. ఆ విషాన్ని నేను హరించేస్తా’
దిస్పూర్: తనపై,తన తల్లి హీరాబెన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను శివభక్తుణ్ని.. కాంగ్రెస్ విమర్శల విషాన్ని హరించేస్తా’అని స్పష్టం చేశారు. ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అసోంలో దరంగ్ జిల్లాలో ఆదివారం వేలకోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘నేను ఇలా మాట్లాడితే మోదీ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది. నన్ను ఎంత దూషించినా పట్టించుకోను. ఎందుకంటే నేను శివుని భక్తుడిని.. విమర్శల విషాన్ని హరించేస్తా. నా రిమోట్ కంట్రోల్ వాళ్లేకానీ దేశ ప్రజలపై దాడి చేస్తే మాత్రం మౌనంగా ఉండను. ప్రజలే నా దేవుళ్లు. నా బాధను వాళ్ల ముందు వ్యక్తం చేయకపోతే .. ఎవరి ముందు చేస్తాను. అందుకే వాళ్లే నా యజమానులు, నా దేవతలు, నా రిమోట్ కంట్రోల్. నాకు వేరే రిమోట్ కంట్రోల్ లేదు’ అని స్పష్టం చేశారు.చర్చకు దారితీసిన మోదీ రిమోట్ కంట్రోల్ వ్యాఖ్యలు అయితే, అస్సాం సభలో ప్రధాని మోదీ మరోసారి‘రిమోట్ కంట్రోల్’ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ రిమోట్ కంట్రోల్ చేశారని మోదీ ఆరోపించారు. అలాగే, ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాంధీ కుటుంబం రిమోట్ కంట్రోల్లో ఉన్నారని కూడా విమర్శించారు.2019లో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రముఖ అస్సామీ సంగీత కళాకారుడు భూపెన్ హజారికాకు భారతరత్న అవార్డ్‌తో సత్కరించింది. ఆ అవార్డుపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ గాయకులకు, నర్తకులకు అవార్డు ఇస్తున్నారు’ అని ఎద్దేవా చేశారు. అప్పట్లో తాను చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో ఖర్గే క్షమాపణలు చెప్పారు. ఖర్గే.. భూపెన్ హాజారికాను ఉద్దేశిస్తూ చేసిన విమర్శలను రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ తనతో ప్రస్తావించినట్లు మోదీ తాజాగా సభలో గుర్తు చేశారు. అవును.. ఖర్గే అనుచితంగా మాట్లాడారుఅవును. భారత ప్రభుత్వం ఈ దేశపు ముద్దుబిడ్డ అస్సాం గర్వకారణం భూపేన్ హజారికాను భారతరత్నతో సత్కరించిన రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ ఈ అవార్డును ‘గాయకులు, నృత్యకారులకు’ఇచ్చారని అన్నారంటూ అస్సాం సభలో మోదీ గుర్తు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో.. బీజేపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చర్చించారు. ఇటీవల రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను విడుదల చేసింది. ఆ సమయంలో ఆ వీడియోపై ..మోదీ స్పందిస్తూ.. కాంగ్రెస్ తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడం సరైందికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం సోషల్ మీడియాలో ఓ ఏఐ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోను మోదీ, తల్లి హీరాబెన్‌ను ఉద్దేశించి ఉండటం తీవ్ర దుమారం రేగింది. కాంగ్రెస్ తనని వ్యక్తిగత హననం చేయడంపై ఇవాళ అస్సాంలో మోదీ స్పందించారు. -
Delhi: 15 రోజుల పాటు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు.. రోజుకొక బహుమతి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలకు ఢిల్లీ ప్రభుత్వం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజు నుండి రాజధానిలో 15 రోజుల పాటు పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. త్యాగరాజు స్టేడియంలో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇతర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవాలు ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సన్నాహాలను సమీక్షించారు. వేడుకలలో ఢిల్లీ పౌరులకు ప్రతిరోజూ కొత్త బహుమతిని అందించనున్నామని ప్రకటించారు. ఇవి ఢిల్లీ అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయని, వీక్షిత్ ఢిల్లీ దార్శనికతను నెరవేర్చడంలో సహాయపడతాయని సీఎం రేఖా గుప్తా పేర్కొన్నారు. వీటిలో 101 ఆరోగ్య నిలయాలు, 150 డయాలసిస్ కేంద్రాలు, కొత్త హాస్పిటల్ బ్లాక్‌లు, అవయవ మార్పిడి, అవగాహన పోర్టల్ ప్రారంభం మొదలైనవి ఉండనున్నాయి.అలాగే ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రాజ్‌పుతానా రైఫిల్స్ బేస్ సమీపంలో ఫుట్ ఓవర్‌బ్రిడ్జికి పునాది వేయడం, ఆటోమేటెడ్ మల్టీలెవల్ పార్కింగ్ వ్యవస్థలకు శ్రీకారం, గ్రీన్ ఎనర్జీ,పరిశుభ్రత విస్తరణ ప్రణాళికలు, నంగ్లీ సక్రవతిలో బయోగ్యాస్ ప్లాంట్, ఘోఘా డైరీలో బయోగ్యాస్ ప్లాంట్, యమునా యాక్షన్ ప్లాన్ అప్‌గ్రేడ్, మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టులు మొదలైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నరేలాలో కొత్త అగ్నిమాపక కేంద్రం, మండోలి జైలు సమీపంలో రూ. 65 కోట్ల గ్రిడ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఆరోగ్య సంరక్షణ , పారిశుధ్యం, విద్య, రవాణా, పునరుత్పాదక ఇంధనం వరకు మొత్తం 75 ప్రాజెక్టులు, పథకాలను 15 రోజుల పాటు జరిగే ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రారంభించనున్నారు. -
పాక్‌తో భారత్ మ్యాచ్.. మోదీకి షాకిచ్చిన పహల్గాం బాధితులు
ఢిల్లీ: ఆసియా కప్ (Asia Cup)లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పహల్గాం దాడి ఘటన బాధితులు స్పందిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. భారత ప్రభుత్వం, బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పాక్ జట్టుతో మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన తమ వారిని తిరిగి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథా అని అనిపిస్తోంది అంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై పహల్గాం బాధిత కుటుంబాలు స్పందిస్తున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డాం. పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధాలు ఉండొద్దు. మీరు మ్యాచ్ ఆడాలి అనుకుంటే దాడి ప్రాణాలు కోల్పోయిన మా వారిని తీసుకురావాలి. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ప్రధాని మోదీ చెప్పారు. మరి పాకిస్తాన్‌తో ఎందుకు మ్యాచ్ నిర్వహిస్తున్నారు అని ప్రశ్నించారు.ఆపరేషన్ సిందూర్ ఎందుకు?మరోవైపు.. పహల్గాం ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన బాధితురాలు ఐషాన్య ద్వివేది స్పందిస్తూ.. భారత్-పాక్ మ్యాచ్‌పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను బీసీసీఐ విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. కేవలం ఇద్దరు ముగ్గురు క్రికెటర్లే ముందుకువచ్చారు. మిలిగిన వారు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. పాక్‌తో మ్యాచ్ ఆడాలని క్రికెటర్లను బీసీసీఐ బలవంతపెట్టొద్దని.. దేశం తరఫున నిలబడాలని సూచించాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీసీసీఐ నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. పహల్గాం దాడిలో తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాల వేదనను అప్పుడే మర్చిపోయారా అని స్పాన్సర్లు, క్రికెటర్లను ప్రశ్నించారు. ఈ మ్యాచ్‌తో వచ్చిన ఆదాయాన్ని ఆ దేశ ప్రభుత్వం మళ్లీ ఉగ్రవాదులను పోషించడానికే ఉపయోగిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. మ్యాచ్‌ను నిర్వహిస్తే.. మనపై దాడి చేయడానికి వారిని మనమే సిద్ధం చేస్తున్నట్లు అవుతుందన్నారు. దేశ ప్రజలంతా భారత్-పాక్ మ్యాచ్‌ను చూడకుండా బహిష్కరించాలని కోరారు.నా తమ్ముడిని తీసుకురండి: సావన్పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో సావన్ పర్మార్.. తన తండ్రితో పాటు సోదరుడు కూడా ఉగ్రవాదుల కాల్పులకు బలై ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే భారత్-పాక్ మ్యాచ్‌పై సావన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మీకు మ్యాచ్ ఆడాలని ఉంటే.. తుపాకీ తూటాలకు బలైన నా 16 ఏళ్ల తమ్ముడిని తిరిగి తీసుకురండి. ఆపరేషన్ సిందూర్ ఇప్పుడు వృథానేమో అనిపిస్తోంది. పహల్గాంలో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకులను చంపిన తర్వాత కూడా ఈ మ్యాచ్ ఆడటం సరికాదు అని ఘాటు విమర్శలు చేశారు.మా బాధ మీకు పట్టదా?మరోవైపు.. సావన్ తల్లి కిరణ్ యతీష్ పర్మార్ మాట్లాడుతూ.. బాధిత కుటుంబాల గాయాలు ఇంకా మానలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని.. ఇలాంటి సమయంలో భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు జరుగుతోందని ఆమె ప్రధాని మోదీని ప్రశ్నించారు. ‘ఈ మ్యాచ్ జరగకూడదు. నేను ప్రధానమంత్రి మోదీని అడగాలనుకుంటున్నాను. ఆపరేషన్ సిందూర్ ముగియనప్పుడు ఈ మ్యాచ్ ఎందుకు జరుగుతోంది? పహల్గాం ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలను ఒకసారి సందర్శించి, వారి బాధ ఎలా ఉందో చూడాలని దేశంలోని ప్రతి ఒక్కరికీ నేను చెప్పాలనుకుంటున్నాను. మా గాయాలు ఇంకా మానలేదు’ అని అన్నారు. -
‘చోటే భాయ్’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్ సంచలన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. More than 200 days since the Srisailam Left Bank Canal tunnel collapsed, killing 8 hapless workers due to the criminal negligence of the corrupt Revanth GovtThis inefficient Congress govt couldn’t even retrieve the bodies of 6 victims, and hasn’t paid any compensation to the… pic.twitter.com/Rl11OwVJvf— KTR (@KTRBRS) September 14, 2025 -
భారత్-పాక్ మ్యాచ్.. మోదీ, బీజేపీపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్-2025లో భాగంగా నేడు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పాక్ జట్టుతో భారత్ క్రికెట్ ఆడటంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన ప్రధాని మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఆడటానికి ఎలా అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించారు. ఈ క్రమంలో తాజాగా అసద్ మీడియాతో మాట్లాడుతూ.. పహల్గాం దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ ఎలా ఆడుతారు. మతాన్ని అడిగి మరీ 26 మందిని దారుణంగా కాల్చి చంపారు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని చెప్పిన మోదీ.. క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందో చెప్పాలి. 26 మంది పౌరుల ప్రాణాల కంటే డబ్బే ఎక్కువ విలువైందా?. దీనికి కేంద్రంలోని బీజేపీ సమాధానం చెప్పాలి. పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకున్నప్పుడు.. నీటి ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నప్పుడు మ్యాచ్ మాత్రం ఎందుకు ఆడుతున్నారు. పహల్గాం బాధితులకు మోదీ ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. దేశభక్తి పేరుతో బీజేపీ వ్యాపారం చేస్తోందని ఆరోపించారు.ఇదిలా ఉండగా.. భారత్–పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నిర్వాహణపై మొదటి నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ, ఇరు జట్లు మాత్రం ఆడకూడదని ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక, మాజీ క్రికెటర్లు కూడా దీనిపై స్పందిస్తూ, “అంతర్జాతీయ టోర్నమెంట్లలో మ్యాచ్‌లు తప్పనిసరిగా ఆడాలి. లేకపోతే జట్లను మొత్తం సిరీస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది” అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా భారత్–పాక్ మ్యాచ్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. #BoycottPakistanMatch హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో కొనసాగుతుండగా, యువత భారీ స్థాయిలో ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడవద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఐదు గంటల హడావుడి: ఖర్గే
న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కనీసం ఐదు గంటలు కూడా ఆయన మణిపూర్ ప్రజలతో గడపలేకపోయారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వర్గవైషమ్యాలతో రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న వారిని ఈ పర్యటనతో మోదీ ఘోరంగా అవమానించారన్నారు. మోదీ పర్యటనను ఆయన పిట్ స్టాప్‌గా అభివరి్ణంచారు. ‘రెండేళ్లకుపైగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనల్లో సుమారు 300 మంది చనిపోగా, 1,500 మంది గాయపడ్డారు. మరో 67 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకు అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రధాని మోదీ ఇప్పుడు హడావుడిగా ఇంఫాల్ నుంచి చురాచాంద్‌పూర్ వరకు రోడ్ షో చేపట్టడమేంటి?’అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సహాయ శిబిరాల్లోని ప్రజల మొర ఆలకించకుండా పిరికితనంతో తప్పించుకోవడానికే మోదీ షో చేపట్టారని ఎక్స్‌లో ఖర్గే వ్యాఖ్యానించారు. పర్యటనకు వెళ్లిన మోదీ ఘనమైన స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేయించుకోవడం బాధితుల గాయాలను మరింతగా పెంచడమేనన్నారు. ఇలాంటి చర్యలతో మోదీలో పశ్చాత్తాపం గానీ, అపరాధ భావన కానీ లేవని వెల్లడవుతోందన్నారు. మణిపూర్‌లో అశాంతి కొనసాగుతున్న గత 864 రోజుల సమయంలో 46 విదేశీ పర్యటనలు చేసిన మోదీకి, మన పౌరులతో రెండు సానుభూతి మాటలు పంచుకునే తీరికే దొరకలేదా అని ప్రశ్నించారు. మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అసమర్థత బయటపడిందన్నారు. దీన్నుంచి తప్పించుకునేందుకు మాత్రమే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారని ఖర్గే ఆరోపించారు. మీ రాజ్యధర్మం ఎక్కడికి పోయిందంటూ 2002లో మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయి అప్పట్లో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఖర్గే ప్రస్తావించారు. ఇలా ఉండగా, 28 నెలలుగా ఎదురుచూస్తున్న మణిపూర్ ప్రజలతో ప్రధాని మోదీ కనీసం ఐదు గంటలైనా గడపలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ప్రచారానికి, విదేశాల్లో పర్యటనలకు ఉన్న సమయం ప్రజల మధ్య గడిపేందుకు ఆయనకు దొరకలేదా అని నిలదీశారు. -
విశ్వాస వారధి నిర్మించాలి: ప్రధాని మోదీ
ఇంఫాల్/చురాచాంద్‌పూర్: మణిపూర్‌లో జాతుల మధ్య సోదరభావం నెలకొనాలని, అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసికట్టుగా జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, లోయ మధ్య బలమైన విశ్వాస వారధిని కచ్చితంగా నిర్మించాలని తేల్చిచెప్పారు. మణిపూర్ లోయలో మైతేయీలు, కొండ ప్రాంతాల్లో కుకీలు నివసిస్తుంటారు. రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా మారుస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు. హింసను విడనాడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆశ, విశ్వాసం అనే నూతన సూర్యోదయం సంభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మణిపూర్‌లో పర్యటించారు. 2023 మే నెలలో కుకీలు, మైతేయీల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజధాని ఇంఫాల్‌లోని కాంగ్లా పోర్ట్, చురాచాంద్‌పూర్‌లో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. మణిపూర్ ప్రజలకు తగిలిన గాయాలను నయం చేయడానికి, వారిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, బాధితులందరినీ ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మణిపూర్ అంటే ఒక రత్నం.. అది భరతమాత కిరీటంలో పొదిగిన రత్నమని అభివరి్ణంచారు. రాష్ట్రంలో హింస ఎక్కడ, ఏ రూపంలో జరిగినా ఖండించాల్సిందేనని చెప్పారు. హింస దురదృష్టకరమని, హింసాకాండకు పాల్పడడం మన పూరీ్వకులకు, భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. మనమంతా కలిసి మణిపూర్‌ను శాంతి, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్దామని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... హింసతో సామాజిక జీవనం బలహీనం మణిపూర్‌లో శాంతిని బేరసారాలు, బలప్రయోగంతో సాధించలేం. సుహృద్భావ వాతావరణంలో సంప్రదింపులు, ప్రజల ఐక్యతతోనే అది సాధ్యం. మణిపూర్ శక్తివంతమైన, సుందరమైన రాష్ట్రం. కానీ, ఇక్కడి సామాజిక జీవనాన్ని హింసాకాండ బలహీనపర్చింది. శాంతి, సామరస్యంతోనే తూర్పు భారతదేశ కీర్తికిరీటంలో తన స్థానాన్ని మణిపూర్ తిరిగి పొందుతుంది. మణిపూర్‌లోనే మణి ఉంది. ఈశాన్య భారతదేశంలో ఈ మణి గొప్పగా ప్రకాశించబోతోంది. రాష్ట్రంలో ఘర్షణ వల్ల నష్టపోయిన బాధితుల కోసం రాష్ట్రంలో 7,000 నూతన ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం. రూ.3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. బాధితులకు సాంత్వన కలిగించడమే మా లక్ష్యం. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్‌లో ప్రగతి వేగం పుంజుకుంది. 2014 కంటే ముందు ఇక్కడ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువే. ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉంది. 21వ శతాబ్దం తూర్పు, ఈశాన్య భారతదేశానికే చెందుతుంది. అందుకే మణిపూర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ‘సిందూర్’ విజయంలో మణిపూర్ జవాన్లు ‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ మణిపూర్‌ను భారతదేశ స్వాతంత్య్రానికి ముఖద్వారంగా అభివర్ణించారు. భారత జాతీయ సైన్యం(ఐఎన్ఏ) త్రివర్ణ పతాకాన్ని మొదట ఇక్కడే ఎగురవేసింది. ఈ రాష్ట్రం ఎంతోమంది వీరులను దేశానికి అందించింది. వారి త్యాగాల స్ఫూర్తితోనే మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మహిళా సాధికారత మణిపూర్ సంప్రదాయం. పూర్తిగా మహిళలతోనే నడిచే మార్కెట్ ఇమా కీథెల్ ఉంది. మహిళామణుల గొప్పతనానికి అదొక ఉదాహరణ. ఆర్థిక వ్యవస్థలో తల్లులు, సోదరీమణులు ముందు వరుసలో ఉంటున్నారు. దేశ ప్రగతికి, స్వయం స్వావలంబనకు మహిళల బలమే చోదకశక్తి. ఈ స్ఫూర్తిని అందిస్తున్న రాష్ట్రం మణిపూర్. దేశ రక్షణకు మణిపూర్ సైనికులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు’’ అని మోదీ ప్రశంసించారు. పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం ప్రధాని మోదీ మణిపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాజధాని ఇంఫాల్‌లో రూ.1,200 కోట్ల విలువైన 17 ప్రాజెక్టులను ప్రారంభించారు. పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం చేశారు. అలాగే మహిళా మార్కెట్లను, ఐదు ప్రభుత్వ కాలేజీలను, వంతెనలు, రహదారులను ప్రారంభించారు. చురాచాంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకస్థాపన చేశారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు ‘‘అభివృద్ధి జరగాలంటే శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరి. గత 11 ఏళ్లలో ఈశాన్యంలో ఎన్నో వివాదాలు, ఘర్షణలను పరిష్కరించాం. ఇక్కడి ప్రజలు శాంతి, అభివృద్ధినే కోరుకుంటున్నారు. మీ కలలు నిజం చేసుకోవాలంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే శాంతి మార్గంలో నడవాలని జాతులకు సంబంధించిన అన్ని గ్రూప్‌లను కోరుతున్నా. మేము మీతోనే ఉన్నాం. మీకు సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వ చొరవతో లోయ, కొండ ప్రాంతాల మధ్య ఇటీవల చర్చలు జరగడం సంతోషంగా ఉంది. మణిపూర్ ప్రజలు ఈరోజు నాపై కురిపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రధాని మోదీ అన్నారు.నిరాశ్రయులకు మోదీ అభయం మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణల కారణంగా నిరాశ్రయులై, ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను ప్రధాని మోదీ పరామర్శించారు. ఇంఫాల్‌తోపాటు చురాచాంద్‌పూర్‌లో వారిని కలుసుకున్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కలి్పంచారు. నిరాశ్రయులు మోదీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బోరున విలపించారు. కొందరు కన్నీళ్లు ఆపుకొనేందుకు ప్రయత్నించారు. హింసాకాండలో కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారులను మోదీ పలుకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛం, పెయింటింగ్‌ను అందజేశారు. పక్షి ఈకలతో రూపొందించిన టోపీని ఓ చిన్నారి బహూకరించగా, మోదీ దాన్ని ధరించారు. రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం నెలకొంటుందని, మీ జీవితాలు మెరుగుపడతాయని మోదీ చెప్పారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 60,000 మంది నిరాశ్రయులైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వీరిలో కుకీలు 40,000 మంది, మైతేయీలు 20,000 మంది ఉన్నారు. గ్రోత్ ఇంజన్ ‘ఈశాన్యం’ గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అన్యాయం మేము వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం మిజోరంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ ఐజ్వాల్: ఈశాన్య భారతదేశం గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎంతగానో నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో నేడు అదే ఈశాన్య ప్రాంతం భారతదేశ గ్రోత్ ఇంజన్‌గా మారిందని ఉద్ఘాటించారు. ఆయన శనివారం ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో పర్యటించారు. రూ.9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. రాజధాని ఐజ్వాల్‌లోని లామ్వాల్ గ్రౌండ్లో సభలో పాల్గొనాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు. దాంతో ఎయిర్‌పోర్టులోనే అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. పలు రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. గతంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శించారు. కేవలం ఎక్కువ ఓట్లు, సీట్లు ఉన్న ప్రాంతాలపైనే ఆ పారీ్టల దృష్టి ఉండేదని చెప్పారు. దీనివల్ల మిజోరం సహా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రూ.8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ–సైరంగ్ రైల్వేలైన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 51.38 కిలోమీటర్ల ఈ లైన్ మిజోరంను దేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక దినమని పేర్కొన్నారు. -
చురాచాంద్ పూర్ సభలో ప్రధాని మోదీ శాంతి సందేశం
-
మణిపూర్ సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సెటైర్లు
తెగల మధ్య ఘర్షణలు.. తదనంతరం చెలరేగిన హింసతో చీకట్లో ఉండిపోయిన మణిపూర్‌ని ఇప్పుడు శాంతి-అభివృద్ధి అనే కొత్త ఉదయం తడుతోందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి పాలనలో ఉన్న ఆ రాష్ట్రంలో శనివారం ఆయన పర్యటించారు. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థానం చేసిన అనంతరం.. చురాచంద్పూర్ పీస్ గ్రౌండ్ వేదికగా మోదీ ప్రసంగించారు. మణిపూర్ ఆశల భూమి. గతంలో హింస అనే చీకటి ఈ అందమైన ప్రాంతాన్ని కమ్మేసింది. కానీ ఇప్పుడు నమ్మకం, శాంతి, అభివృద్ధి అనే కొత్త వేకువ రాబోతోంది. హింసతో ఎవరికీ లాభం ఉండదు. మీ పిల్లల భవిష్యత్తు కోసం శాంతిని ఎంచుకోండి. శాంతి ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించండి.. ..ఇవాళ ఇంఫాల్‌లో కొత్త విమానాశ్రయం, జిరిబాం-ఇంఫాల్ రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు, మహిళా హాస్టళ్లు, ఐటీ పార్కులు వంటి వేల కోట్ల రూపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాం. మణిపూర్‌లో 60,000 పక్కా ఇళ్లు నిర్మించాం. 3.5 లక్షల ఇళ్లకు త్రాగునీటి సరఫరా అందిస్తున్నాం. మణిపూర్ అంతటా పక్కా ఇళ్లు నిర్మించాలన్నది మా అభిమతం. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ మణిపూర్ ప్రజలతోనే ఉంటుంది. గతంలో ఢిల్లీ నుంచి నిర్ణయాలు మణిపూర్‌కు రావడానికి నెలలు, సంవత్సరాలు పట్టేవి. ఓటు బ్యాంకు రాజకీయాలు ఈశాన్య భారతాన్ని ఇబ్బంది పెట్టాయి. కానీ గత 11 ఏళ్లుగా.. ఇక్కడి ఎన్నో సంక్షోభాలు పరిష్కారానికి నొచుకున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంతో నిర్ణయాలు అమలు కావడానికి ఎంతో సమయం పట్టదు. మీరు కలలు కనండి. మేము వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తాం. భారత్ త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. అభివృద్ధిలో మణిపూర్ దేశంతో పాటు ముందుకు సాగుతుంది’’ అని అన్నారాయన. మోదీ ఇవాళ రూ.8,500 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులకు మణిపూర్‌లో శంకుస్థాపన చేశారు. ఇంఫాల్‌కు కొత్త ఎయిర్పోర్ట్, కొత్త హైవేలు, రైలు-రోడ్డు మార్గం అనుసంధానం, జిరిబమ్ ఇంఫాల్ మధ్య రైల్వే ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఉన్నాయి.ఈ కార్యక్రమం కంటే ముందు.. చురాచంద్పూర్లో హింసాత్మక ఘటనల కారణంగా నిరాశ్రయులైన వారిని కలిసి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ సమయంలో వాళ్లకు ఆయన ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు, హక్కుల విషయంలో మైతేయి, కుకీ తెగల మధ్య 2023 మే నెలలో ఘర్షణలు మొదలై.. ఆ అల్లర్లలో హింస ప్రజ్వరిల్లింది. ఆ ఘర్షణల్లో 250 మంది దాకా మరణించారు. వేలాది మంది(60 వేల మందికిపైనే) నిరాశ్రయులయ్యారు. అప్పటి నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల కారణంగా.. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ నేపథ్యంతో.. వేల మంది ఇంకా తమ ఇళ్లకు చేరకుండా క్యాంపుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ క్రమంలోనే బీరెన్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది.ఇదిలా ఉంటే.. గతంలో.. మోదీ 2014లో ప్రధాని అయిన తర్వాత 2018లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను తొలిసారి సందర్శించారు. ఆ సమయంలో ఇంఫాల్ నగరంలో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, 2022లో కూడా ఆయన మణిపూర్‌కు వర్చువల్ రూపంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం కోసం ప్రసంగించారు. హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇవాళే తొలిసారి(29 నెలల తర్వాత). 2023 జూలై 20న, హింసపై తొలిసారి పార్లమెంటులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కు పెట్టాయి. మోదీ పర్యటన.. మణిపూర్ ప్రజలను అవమానించడమే అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ మణిపూర్ పర్యటన పెద్ద విషయమేమీ కాదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మణిపూర్ చాలా కాలంగా సమస్యల్లో ఉంది. ఇప్పుడు ప్రధాని అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది పెద్ద విషయం కాదు. ప్రస్తుతం దేశంలో అసలు సమస్య 'ఓటు దొంగతనం' (Vote Chori) అని పేర్కొన్నారాయన. ఇక.. మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదంటూ మోదీ మణిపుర్ పర్యటనపై ప్రియాంక గాంధీ వాద్రా విమర్శలు గుప్పించారు. ‘‘రెండేళ్ల తర్వాత బాధితులను పరామర్శించడానికి వెళ్లడం బాధాకరం. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడకు వెళ్లే వాళ్లు. స్వాతంత్ర్యం నుంచి అందరూ ప్రధానులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ప్రధాని మోదీ మాత్రం రెండేళ్లు ఆలస్యంగా దాన్ని పాటిస్తున్నారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. -
మిజోరం రాజధానికి కొత్త రైల్వే లైన్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
మణిపుర్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఇంఫాల్: ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం మణిపుర్‌కు వచ్చారు. ఇంఫాల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ పునీత్ కుమార్ గోయెల్ స్వాగతం పలికారు. 2023లో ఈ ఈశాన్య రాష్ట్రంలో హింసాత్మక ఘర్షణల తర్వాత మోదీ ఇక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. STORY | PM Modi reaches Manipur on his first visit after ethnic violence broke out in 2023Prime Minister Narendra Modi reached Imphal on Saturday on his first visit to Manipur after ethnic violence broke out in May 2023. Modi was received at the Imphal airport by Governor Ajay… pic.twitter.com/W4VvnAOfiD— Press Trust of India (@PTI_News) September 13, 20252023 మే నెలలో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మోదీ తొలిసారిగా మణిపుర్‌కు వచ్చారు. ఈ పర్యటనలో ఆయన చురాచంద్పూర్, ఇంఫాల్‌లను సందర్శించనున్నారు. అలాగే రూ. 8,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని మోదీ సందర్శన రాష్ట్రంలో శాంతి, అభివృద్ధిని పునరుద్ధరించడానికి దోహదపడుతుందని మణిపూర్ ముఖ్య కార్యదర్శి పునీత్ కుమార్ గోయల్ అన్నారు. #WATCH | Manipur: PM Modi being welcomed in Churachandpur as he arrives in the city. PM also interacts with the locals of the city. PM will lay the foundation stone of multiple development projects worth over Rs 7,300 crore at Churachandpur today. The projects include Manipur… pic.twitter.com/wvDxi3P28i— ANI (@ANI) September 13, 2025 మణిపూర్‌లోని చురాచంద్‌పూర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అపూర్వ స్వాగతం లభించింది. ఆయనను స్వాగతించడానికి దారి పొడవునా స్థానికులు నిలుచున్నారు. మోదీ వారికి అభివాదాలు తెలిపారు. ప్రధాని మోదీ రూ. 7,300 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది వేయనున్నారు. వాటిలో ముఖ్యమైనవిమణిపూర్ అర్బన్ రోడ్స్, డ్రైనేజీ, ఆస్తి నిర్వహణ మెరుగుదల ప్రాజెక్ట్. ఇది పట్టణ రవాణా, ప్రజా సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.3,600 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. చురచంద్‌పూర్‌లో రూ.7,300 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. #WATCH | Churachandpur, Manipur: Prime Minister Narendra Modi lays the foundation stone of multiple development projects worth over Rs 7,300 crore at Churachandpur. The projects include Manipur Urban Roads, drainage and asset management improvement project worth over Rs 3,600… pic.twitter.com/SqNNAAvr0I— ANI (@ANI) September 13, 2025 -
ఐజ్వాల్‌కు చారిత్రక దినం: ప్రధాని మోదీ
ఢిల్లీ: మిజోరాం లోని ఐజ్వాల్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐజ్వాల్ కు నేడు చారిత్రక దినం అని, రైల్వే మ్యాప్‌లో మిజోరాంలోని ఐజ్వాల్ కు స్థానం దొరికిందన్నారు. ఈశాన్య రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజన్లు అని మోదీ అభివర్ణించారు. ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక కారిడార్ లో మిజోరం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశానిదేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈశాన్య ప్రాంతంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ శనివారం ఉదయం ఐజ్వాల్ చేరుకున్నారు. అయితే భారీ వర్షం కారణంగా లెంగ్‌పుయ్ విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా ఐజ్వాల్‌లోని లమ్మువల్ గ్రౌండ్‌కు చేరుకోలేకపోయారు. తొలుత ప్రధాని మోదీ సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్‌కతా-సైరాంగ్-కోల్‌కతా ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), గౌహతి-సైరాంగ్-గువహతి ఎక్స్‌ప్రెస్ (రోజువారీ) మూడు రైళ్లకు ఆయన పచ్చజెండా ఊపి ప్రారంభించారు. వర్చువల్‌గా ప్రసంగించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమం అయినా, జాతి నిర్మాణం అయినా, మిజోరాం ప్రజలు ఎల్లప్పుడూ సహకరించడంలో ముందున్నారన్నారు. త్యాగం సేవ, ధైర్యం, కరుణ ఈ విలువలు మిజో సమాజానికి కేంద్రంగా నిలిచివున్నయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రోజు, మిజోరం భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇది దేశానికి.. ముఖ్యంగా మిజోరం ప్రజలకు ఒక చారిత్రాత్మక రోజు. నేటి నుండి, ఐజ్వాల్ భారతదేశ రైల్వే పటంలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం, ఐజ్వాల్ రైల్వే లైన్‌కు పునాది వేసే అవకాశం తనకు లభించిందని ఈ రోజు దానిని దేశ ప్రజలకు గర్వంగా అంకితం చేస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మా ఇంజనీర్ల నైపుణ్యాలు, మా కార్మికుల స్ఫూర్తి దీనిని సాధ్యం చేశాయని ప్రధాని వారిని కొనియాడారు. ఈ కొత్త రైలు నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత, మిజోరాంలోని రైతులు, వ్యాపారులు దేశవ్యాప్తంగా మరిన్ని మార్కెట్లను చేరుకోగలవని, విద్య ఆరోగ్య సంరక్షణ కోసం మరిన్ని ఎంపికలను పొందగలరన్నారు. ఈ నూతన రైల్వే లైను పర్యాటకం, రవాణా, ఆతిథ్య రంగాలలో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. A landmark day for Mizoram as it joins India's railway map! Key infrastructure projects are also being initiated. Speaking at a programme in Aizawl. https://t.co/MxM6c2WZHZ— Narendra Modi (@narendramodi) September 13, 2025 -
బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికే పెద్దపీట వేస్తోందని, తద్వారా భారత్‌ను ప్రపంచ టాప్–10 క్రీడా దేశాల్లో నిలపడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన ‘ప్లేకామ్ బిజినెస్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్మిట్’లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘గతంలో క్రీడా సమాఖ్యల్లో తిష్ట వేసుకు కూర్చున్న సమస్యలు, వివాదాలే పతాక శీర్షికలయ్యేవి. ప్రస్తుతం మేం ఈ వివాదాలను పక్కనబెట్టి అథ్లెట్ల ప్రదర్శన మెరుగుపర్చడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాం. అంతర్జాతీయ క్రీడల్లో భారత ఆటగాళ్లు పోడియంలో నిలిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. కొత్తగా తీసుకొచ్చిన క్రీడా బిల్లు కూడా తగవుల్ని పరిష్కరించడంతో పాటు క్రీడాకారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. అథ్లెట్లు రాణించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తున్నాం’ అని అన్నారు. బీసీసీఐ కూడా చెప్పినట్లే వినాలి!దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ క్రీడా బిల్లుకు లోబడే ఉండాలని నిర్ణయించామని, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా కొత్త క్రీడా పాలసీ ప్రకారమే నడచుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. తద్వారా ప్రతీ సమాఖ్యలోనూ జవాబుదారీతనాన్ని పెంచామని అన్నారు. అంతర్జాతీయ క్రీడల్లో పురుషులకు దీటుగా భారత మహిళా అథ్లెట్లు పోటీపడాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ‘ఫిట్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’, టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) కార్యక్రమాలు అథ్లెట్ల కోసమే రూపొందించామని మాండవీయ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో వ్యవహరిస్తున్నారని, భారత క్రీడావికాసం కోసం ప్రణాళికబద్ధంగా కృష్టి చేస్తున్నారని ఆయన చెప్పారు. పదేళ్ల ప్రణాళికతో క్రీడాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మన్సుఖ్ మాండవీయ అన్నారు. క్షేత్రస్థాయిలోఇక భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ప్రతిభాన్వేషణ పోటీలను పెంచుతామని చెప్పారు. కేవలం నగరాలు, అకాడమీలే కాదు... మారుమూల గ్రామాలు, పట్టణాల్లో ఉన్న ప్రతిభావంతులను పాఠశాల స్థాయి పోటీల్లో గుర్తించి నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. -
నేడు మణిపూర్‌లో ప్రధాని పర్యటన
ఇంఫాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్‌లో అడుగుపెడుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారని, రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్‌కుమార్ గోయల్ శుక్రవారం తెలిపారు. చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. రెండు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రగతి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టంచేసింది. మణిపూర్‌లో నరేంద్ర మోదీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్‌ను ప్రారంభించబోతున్నారు. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మణిపూర్ కేవలం సరిహద్దు రాష్ట్రం కాదని.. యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక మూలస్తంభమని, సౌత్ఈస్ట్ ఆసియాకు ముఖద్వారమని పునీత్‌కుమార్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలని, ఆయన నిర్వహించే సభల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
హీరాబెన్-మోదీపై ఏఐ వీడియో.. బీజేపీ గుర్రు
బీహార్ ఎన్నికల ప్రచారం పోనుపోను వ్యక్తిగత విమర్శలకు కేరాఫ్‌గా మారేలా కనిపిస్తోంది. మొన్నీమధ్యే రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రలో మోదీని, మోదీ తల్లిని కొందరు దూషించినట్లుగా ఓ వీడియోను బీజేపీ వైరల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ సైతం తన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా బీహార్ కాంగ్రెస్ విభాగం నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేసిన ఓ ఏఐ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది.సాహబ్ కలలో అమ్మ .. ఆ తర్వాత ఏం జరిగిందో చూసేయమంటూ.. ఆ వీడియో ఉంది. అందులో ప్రధాని మోదీని పోలిన క్యారెక్టర్.. ‘‘ఈరోజు ఓట్ల దొంగతనం(Vote Chori) అయిపోయింది.. ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు అని కళ్లు మూసుకుంటుంది. ఆ వెంటనే హీరాబెన్‌ను పోలి ఉన్న పాత్ర కలలో ప్రత్యక్షమై.. "ఓట్ల కోసం నా పేరును ఉపయోగించడంలో ఎంత దూరం వెళ్తావు? రాజకీయాల్లో నీతిని మరచిపోయావా? అని అంటుంది. ఈ మాటలతో నిద్రపోతున్న వ్యక్తి ఆశ్చర్యంతో మెలకువకు వస్తాడు.ఈ వీడియోపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఎంపీ రాధా మోహన్ దాస్ అగర్వాల్ కాంగ్రెస్ విడుదల చేసిన AI వీడియోపై తీవ్రంగా స్పందించారు.. ఈ వీడియో రాజకీయాల్లో దిగజారిన స్థాయికి నిదర్శనమని అన్నారాయన. రాహుల్ గాంధీ సూచన మేరకే బీహార్ కాంగ్రెస్ యూనిట్ ఈ వీడియోను రూపొందించిందని ఆరోపించారాయన. ప్రధాని మోదీ ఎప్పుడూ కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచారని, కానీ ఇప్పుడు ఆయన తల్లి హీరాబెన్‌ను రాజకీయాల్లోకి లాగి మరీ కాంగ్రెస్ దాడి చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. టెక్నాలజీని ఉపయోగించి దేశాన్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా.. మోదీ సహా దేశంలోని ప్రజలందరి తల్లుల గౌరవాన్ని అవమానించడమే ఈ వీడియో ఉద్దేశమని విమర్శించారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.साहब के सपनों में आईं "माँ" देखिए रोचक संवाद 👇 pic.twitter.com/aA4mKGa67m— Bihar Congress (@INCBihar) September 10, 2025అయితే.. క్షమాపణలకు కాంగ్రెస్ నిరాకరిస్తోంది. ఇదేం వ్యక్తిగత దూషణ కాదని.. రాజకీయ విమర్శ మాత్రమే అని చెబుతోంది. వీడియోలో వ్యక్తీకరించిన సందేశం ప్రధానిగా మోదీ తన తల్లి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారనే విమర్శ మాత్రమే అని అంటోంది. -
ఆయన్ని పట్టించుకోకండి.. ట్రంప్-మోదీ మధ్యే గొడవలు పెట్టబోయాడు
టారిఫ్ వార్తో మొదలైన అమెరికా-భారత్ ఉద్రిక్తతలు.. ట్రంప్-మోదీ పరస్పర సోషల్ మీడియా స్నేహపూర్వక సందేశాలతో కాస్త చల్లారినట్లే కనిపిస్తోంది. ఈ తరుణంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్(John Bolton) కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత.. సోషల్ మీడియా విమర్శలు పక్కనపెట్టి వాస్తవిక వ్యూహాత్మక చర్చలు జరగాలని ఇరు దేశాలకు సూచించారాయన.అంతేకాదు.. ట్రంప్ వాణిజ్యసలహాదారు పీటర్ నవారో(Peter Navarro) వల్లే భారత్, అమెరికా మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు నెలకొన్నాయని బోల్టన్ అంటున్నారు. తాజాగా భారత్‌కు చెందిన ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలే వెల్లడించారు.పీటర్ నవారో అనే వ్యక్తి ట్రంప్ ప్రభుత్వంలో వాణిజ్య సలహాదారుగా ఉన్నారు. ఆయన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ మధ్య గొడవను ప్రేరేపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నవారో అనే వ్యక్తి ఎలాంటి వారంటే.. ఒక గదిలో ఆయన్ని మాత్రమే ఉంచండి. ఓ గంట తర్వాత వచ్చి చూడండి. ఆయనతో ఆయనే గొడవ పడుతుంటాడు.. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. అయితే..భారత్‌పై నవారో చేస్తున్న ఆరోపణలు తీవ్రతతో కూడుకున్నవే అయినప్పటికీ.. ప్రాధాన్యత లేని అంశంగా ఇరు దేశాలు భావించాలి. అసలు వాణిజ్య చర్చలు ప్రామాణిక ప్రతినిధుల మధ్య జరగాలి. అలాగే.. భారత్ సోషల్ మీడియా తరఫున బెదిరింపులు, గందరగోళం లాంటివి లేకుండా ఉంటే మరీ మంచిది. అప్పుడే.. రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణంలో ఒప్పందానికి అవకాశం ఉంటుంది.అలాగని ఈ సమస్యలు తేలికగా.. త్వరగా పరిష్కారమవుతాయన్నది నేను అనుకోవడం లేదు. కానీ రెండు పక్షాల్లోనూ మంచి నమ్మకం ఉంటుందని.. అదే మార్గం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది అని భావిస్తున్నాను. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అంతర్జాతీయ సంబంధాలను తన వ్యక్తిగత సంబంధాలతో పోల్చుకుంటారు. ఉదాహరణకు.. ట్రంప్ మోదీ(modi) మధ్య మంచి సంబంధం ఉంటే.. ఆయన దృష్టిలో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు ఉన్నట్లే అని బోల్టన్ చెప్పారు. కాబట్టి ఇరు దేశాధినేతల మధ్య ప్రజాస్వామ్యానికి హాని కలిగించే గొడవలు కాకుండా.. నిజమైన వ్యూహాత్మక చర్చలు జరగాలని బోల్టన్ ఆశించారు.ఇదిలా ఉంటే.. భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ టారిఫ్‌లను కొందరు అమెరికా విశ్లేషకులు తప్పుపట్టగా.. పీటర్ నవారో, బెసెంట్ వంటి వారు మాత్రం భారత్‌ను ఉద్దేశిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని నవారో ఇటీవల చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఆయన మాటలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.అయినప్పటికీ రష్యాతో భారత్ కొనసాగిస్తున్న విధానాలపై ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. భారత్‌ను టారిఫ్ మహారాజా అని పిలుస్తూ.. రష్యా చమురు కొనుగోలుపై బ్లడ్ మనీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన ఆరోపణలు అబద్ధమని ఎక్స్ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. అయినప్పటికీ.. నవారో తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. అంతేకాదు.. భారతీయ సోషల్ మీడియా యూజర్లను కీబోర్డ్ మినియన్స్(తెలివి తక్కువ, పనికి మాలిన అని నానార్థాలు వస్తాయి) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కొందరు భారతీయులు నవారోని టార్గెట్ చేస్తూ పోస్టులతో తిట్టిపోస్తున్నారు. -
కొండలను చీలుస్తూ.. లోయలను దాటుతూ..
ఐజోల్ నుంచి సాక్షి ప్రతినిధి గౌరీభట్ల నరసింహమూర్తి: ఎత్తయిన కొండలు, ఒకటి కాదు రెండు కాదు వందలు.. ఆ వెంటనే అగాధాలను తలపించే లోయలు... కొండలను చీలుస్తూ పరుగులెత్తే నదులు.. ఇలాంటి ప్రాంతాల్లో నడకదారి నిర్మాణం కూడా కష్టమే. ఇది ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మిజోరం భౌగోళిక పరిస్థితి. ఆ రాష్ట్ర రాజధాని నగరమైన ఐజోల్‌లో భారీ భవనాలు కూడా చాలినంత స్థలం లేక కొండ అంచుల్లో కొంతమేర అగాధంలోకి వేలాడుతున్నట్టు పిల్లర్లపై నిర్మించి ఉంటాయి. నడకదారి నిర్మాణం కూడా కనాకష్టంగా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు 52 కి.మీ.మేర రైల్వే లైన్ నిర్మితమైంది. ఆ రైల్వే ప్రాజెక్టును ప్రతిపాదించటమే ఓ సాహసం. అలాంటిది 11 ఏళ్ల కఠోర శ్రమతో ఇంజినీర్లు అద్భుతాన్ని చేసి చూపారు. ప్రపంచంలోనే అతి కష్టమైన రైల్వే ప్రాజెక్టుల్లో ఒకటిగా ఇప్పుడది రికార్డుల్లోకెక్కింది. దాన్నిశనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేస్తున్నారు. కొత్తగా నిర్మించిన రైలు కారిడార్ నిడివి 51.38 కి.మీ. కానీ, దీని నిర్మాణానికి అయిన వ్యయం రూ.8,071కోట్లు. అంటే కి.మీ.కు రూ.157 కోట్లు అన్నమాట. సాధారణంగా రైల్వే లైన్ల నిర్మాణంలో కి.మీ.కు అయ్యే ఖర్చు రూ.13 కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉంటుంది. కానీ, ఇక్కడ వ్యయం అంతకంటే పది రెట్లు ఎక్కువగా ఉండటం ఓ రికార్డు. వంతెనలు, సొరంగాలు... ఈ కారిడార్ నిర్మాణంలో 153 వంతెనలు, 45 సొరంగాలను నిర్మించాల్సి రావటమే భారీ వ్యయానికి కారణం. ఒకదానిని ఆనుకుని ఒకటిగా ఈ ప్రాంతంలో భారీ కొండలుంటాయి. ఆ కొండలను తొలిస్తే తప్ప రైలు కారిడార్ నిర్మాణం సాధ్యం కాదు. దీంతో 45 కొండలను తొలుస్తూ సొరంగాలు నిర్మించారు. రెండు కొండల మధ్య అగాధంలా లోయలున్నందున, సొరంగాలకు సమాంతరంగా వంతెనలు నిర్మించి దానిమీదుగా ట్రాక్ ఏర్పాటు చేశారు. సొరంగాలలో మూడో దాని నిడివి 1.9 కి.మీ. కావటం విశేషం. అలా మొత్తం సొరంగాల నిడివి 15.88 కి.మీ.గా ఉంది.అంటే మొత్తం రైలు కారిడార్‌లో 31 శాతం నిడివి సొరంగాలతోనే ఉందన్నమాట. ఇక 153 వంతెనల్లో 55 వంతెనలు అతి భారీవి. వాటిల్లో 97వ నంబర్ వంతెన పొడవు 742 మీటర్లు కాగా, దానికి నిర్మించిన స్తంభాల ఎత్తు 114 మీటర్లు. మరో 88 వంతెనలు కాస్త చిన్నవి. 10 ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు కూడా ఉన్నాయి. ఇలా మొత్తం వంతెనల నిడివి కలిపితే 11.76 కి.మీ. మొత్తం కారిడార్ నిడివిలో వీటి వాటా 23 శాతం. అంటే 54 శాతం రైల్వే లైను వంతెనలు, సొరంగాలతోనే ఉంటుందన్నమాట. ఐజోల్‌కు భాగ్యం ⇒ దేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాలకు గాను సిక్కింలో అసలు రైల్వే లైనే లేదు. ఆరు రాష్ట్రాల్లో పాక్షికంగా ఉన్నప్పటికీ, మిజోరం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్ రాజధానులకు రైల్వే కనెక్టివిటీ లేదు. ఇంతకాలం తర్వాత మిజోరం రాజధాని ఐజోల్‌కు ఆ భాగ్యం దక్కబోతోంది. మిగతా మూడు రాష్ట్రాల రాజధానులను రైల్వేతో జోడించే కసరత్తు జరుగుతోంది. ⇒ ఐజోల్‌కు 20 కి.మీ. దూరంలో ఉన్న సాయిరంగ్ స్టేషన్ నుంచి ఇక నాలుగు రైళ్లు నడవనున్నాయి. ఇందులో రాజధాని ఎక్స్‌ప్రెస్ వారానికి ఒక రోజు ఢిల్లీకి, కోల్‌కతాకు వారంలో మూడు రోజులు నడిచే మరో ఎక్స్‌ప్రెస్, అస్సాం రాజధాని గువాహటికి నిత్యం ఓ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం కానున్నాయి. సాయిరంగ్ స్టేషన్ నుంచి మయన్మార్ దేశ సరిహద్దు 223 కి.మీ. దూరంలో ఉంటుంది. ⇒ ప్రకృతి రమణీయతకు నెలవైన ఆ ప్రాంతానికి రైలు కనెక్టివిటీతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుంది. పరిశ్రమలు కూడా రానున్నాయి. ప్రస్తుతం రోడ్డు మార్గాన సరుకుల రవాణా కూడా అతి కష్టంగా ఉన్నందున, ఆ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అధికం. ఇప్పుడు రైలు మార్గాన సరుకు రవాణా సులభతరం కానున్నందున ధరలు దిగివచ్చి సామాన్యులకు ఊరట కలిగే అవకాశం ఉంది. -
మారిషస్‌కు రూ.6,004 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ
వారణాసి: మారిషస్‌కు 680 మిలియన్ డాలర్ల(రూ.6,004 కోట్లు) ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర రామ్‌గూలామ్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో సమావేశమయ్యారు. భారత్– మారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వి ద్య, ఇంధనం, హైడ్రోగ్రఫీ, అంతరిక్ష పరిశోధన వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత్, మారిషస్లు కేవలం భాగస్వామ్య పక్షాలు మా త్రమే కాదని.. అవి ఒకే కుటుంబమని నరేంద్ర మోదీ తేలి్చచెప్పారు. స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన, స్థిరమైన, సౌభాగ్యవంతమైన హిందూ మహాసముద్రం ఇరుదేశాలకు ఉమ్మడి ప్రాధాన్యం కలిగిన అంశమని వివరించారు. నవీన్‌చంద్రతో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రతను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. మారిషస్‌లో యూపీఐ చెల్లింపులు, రూపేకార్డులు అందుబాటులోకి వచ్చాయని, ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీల్లోనే జరి గేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మారిషస్‌లో ‘మిషన్ కర్మయోగి’ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కింద మారిషస్‌లో 10 ప్రాజెక్టులకు భారత్ సాయం అందించబోతోంది. ఇందులో ఓడరేవు, ఎయిర్‌పోర్టు, రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు ఉన్నాయి. ఇది ఆర్థిక సాయం కాదని.. రెండు దేశాల ఉమ్మడి భవిష్యత్తుకు పెట్టే పెట్టుబడి అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్, మారిషస్లు రెండు వేర్వేరు దేశాలు అయినప్పటికీ వాటి స్వప్నాలు, భవిష్యత్తు ఒక్కటేనని స్పష్టంచేశారు. చాగోస్ ఒప్పందం కుదిరినందుకు నవీన్ చంద్రతోపాటు మారిషస్ ప్రజలకు మోదీ అభినందనలు తెలిపారు. మారిషస్ సార్వభౌమత్వానికి ఇదొక చరిత్రాత్మక విజయమని ఉద్ఘాటించారు. మారిషస్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మారిషస్ సార్వ¿ౌమత్వాన్ని పూర్తిస్థాయిలో గుర్తించడానికి తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని తెలిపారు. మారిషస్‌లో నూతన డైరెక్టరేట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని మోదీ చెప్పారు. మారిషస్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి త్వరలో ‘మిషన్ కర్మయోగి’ప్రారంభిస్తామన్నారు. పరిశోధన, విద్య, నవీన ఆవిష్కరణల్లో భారత్, మారిషస్‌ల భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయమని స్పష్టంచేశారు. చాగోస్ దీవులను మారిషస్‌కు అప్పగించేందుకు ఈ ఏడాది మే నెలలో యునైటెడ్ కింగ్డమ్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ దీవులపై హక్కులను యూకే వదులుకుంది. ఇదిలా ఉండగా, మారిషస్ ప్రధానమంత్రి నవీన్‌చంద్ర ఈ నెల 16 దాకా భారత్‌లో పర్యటించనున్నారు. -
జాతి సేవలో మునుముందుకు...
ఈ రోజు సెప్టెంబరు 11... ఈ తేదీ మనకు రెండు విభిన్న చారిత్రక సంఘటనలను గుర్తు చేస్తుంది. మొదటిది... షికా గోలో 1893నాటి స్వామి వివేకానంద ప్రసంగం. ‘సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా’ అన్న ఆయన పలకరింపు ఆ సమావేశ మందిరంలోని వేలాది ప్రేక్షకుల హృద యాలను పులకరింప జేసింది. భారత అజరామర ఆధ్యాత్మిక వారసత్వాన్ని, సార్వత్రిక సోదరభావన ప్రాధాన్యాన్ని ఈ అంతర్జాతీయ వేదికపై నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం చేశారు. రెండోది... ఉగ్రవాద– తీవ్రవాద దుశ్చర్యల ఫలితంగా ఈ సౌహార్ద భావనను తుత్తు నియలు చేస్తూ సాగిన 9/11 నాటి భీకర దాడులు.ఇదే రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది... ‘వసుధైవ కుటుంబకం’ సూత్రంతో ప్రేరణ పొంది, సామాజిక మార్పు–సామరస్యం, సోదరభావ స్ఫూర్తి బలోపేతం లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహనీయుడి జన్మదినమిది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో అనుబంధంగల లక్షలాది మంది ఆయనను సగౌరవంగా... ప్రేమాభిమానాలతో పరమ ‘పూజ్య సర్సంఘ్ చాలక్’ అని పిలుచుకుంటారు. అవును... నేను చెబుతున్నది శ్రీ మోహన్ భాగవత్ గురించే! ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఆయన 75వ జన్మదిన వేడుక నిర్వహించుకోవడం యాదృచ్ఛికం. ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దైవం ఆయనకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.మోహన్ భాగవత్ కుటుంబంతో నా అనుబంధం ఎంతో లోతైనది. ఆయన తండ్రి దివంగత మధుకర్ రావు భాగవత్‌తో సన్నిహితంగా పనిచేసే అదృష్టం నాకు దక్కింది. ఈ అనుభవాన్ని నా రచన ‘జ్యోతిపుంజ్’లో విస్తృతంగా వివరించాను. న్యాయ వ్యవస్థతో తన అనుబంధంతో పాటు, దేశ ప్రగతి కోసం ఆయన తనను తాను అంకితం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా ‘ఆర్ఎస్ఎస్’ను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దేశ పురోగమనంపై మధుకర్ రావు తపన ఎంతటిదంటే– తన కుమారుడు మోహన్ రావును భారత పునరుజ్జీవనం దిశగా కృషికి పురిగొల్పింది. మధుకర్ రావు ఒక పరుసవేది కాగా, మోహన్ రావు రూపంలో మరో ‘మణి’ని తీర్చిదిద్దారు.తొలి అడుగులుమోహన్ 1970 దశకం మధ్య భాగంలో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యారు. ‘ప్రచారక్’ అంటే– ఏదో ఒక సిద్ధాంతం ఆధారంగాసంబంధిత ప్రబోధాలను ప్రచారం చేసే బాధ్యతగా కొందరు అపార్థం చేసుకోవచ్చు. కానీ, ఆర్ఎస్ఎస్ పనితీరు గురించి తెలిసిన వారికి ‘ప్రచారక్’ అనేది సంస్థలో కీలక పని సంప్రదాయమనే వాస్తవం చక్కగా తెలుసు. గడచిన వంద సంవత్సరాలుగా దేశభక్తి ప్రేరణగా వేలాది యువత ‘భారతదేశమే ప్రధానం’ లక్ష్యంగా దాన్ని సాకారం చేసే దిశగా తమ జీవితాలను అంకితం చేశారు. ఇందు కోసం వారు ఇల్లూవాకిలీ సహా కుటుంబ బంధాలన్నిటినీ వదులు కుని దేశమాత సేవలో తరించారు.ఆయన ‘ఆర్ఎస్ఎస్’లో ప్రవేశించిన తొలినాళ్ల సమయాన్ని భారత చరిత్రలో అంధకార యుగంగా అభివర్ణించవచ్చు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత క్రూర ఎమర్జెన్సీ విధించిన సమయ మది. ప్రజాస్వామ్య సూత్రాలను గౌరవిస్తూ, దేశం ప్రగతి పథంలో పయనించాలని ఆకాంక్షించే ప్రతి వ్యక్తీ దీన్ని ప్రతిఘటిస్తూ ఉద్యమంలో దూకడం అత్యంత సహజం. అదే తరహాలో మోహన్ సహా అసంఖ్యాక ‘ఆర్ఎస్ఎస్’ స్వయంసేవకులు కూడా ఇలాగే చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో... ముఖ్యంగా విదర్భలో ఆయన విస్తృతంగా పనిచేశారు. తద్వారా పేదలు, అణ గారిన వర్గాల సమస్యలను ఆకళింపు చేసుకునే అవకాశం ఆయనకు లభించింది.అనంతర కాలంలో భాగవత్ ‘ఆర్ఎస్ఎస్’లో వివిధ బాధ్య తలు నిర్వర్తించారు. ఆ యా విధుల నిర్వహణలో ఆయన అసమాన నైపుణ్యం ప్రదర్శించారు. ముఖ్యంగా 1990 దశకంలో ‘అఖిల భారతీయ శారీరక్ ప్రముఖ్’ అధిపతిగా మోహన్ పనిచేసిన కాలాన్ని చాలామంది స్వయంసేవకులు నేటికీ ఎంతో ప్రేమాభిమానాలతో స్మరించుకుంటుంటారు. ఆ సమయంలో ఆయన బిహార్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంఘ్ నిర్మాణం కోసం అవిరళ కృషి చేశారు. జనజీవనంలోని క్షేత్రస్థాయి సమస్యలపై ఆయన అవగాహనను ఈ అనుభవాలు మరింత పెంచాయి. అటుపైన 20వ శతాబ్దారంభంలో ఆయన ‘అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్’గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2000లో ‘సర్కార్యవాహ్’ అయ్యారు.ఈ రెండు పదవుల్లోనూ తనదంటూ ప్రత్యేక పనిశైలిని ఆచరణలో పెట్టారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను సులువుగా, కచ్చితత్వంతో నిభాయించారు. ఆ తర్వాత 2009లో ‘సర్సంఘ్చాలక్’గా ఆర్ఎస్ఎస్ పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ అందరికీ ఉత్తేజమిచ్చే విధంగా పని చేస్తున్నారు.ఈ పదవీ నిర్వహణ సంస్థాగత బాధ్యతను మించిన కర్తవ్యం. సంస్థ ఉద్దేశాలు, నిర్దేశాలపై స్పష్టత, భరతమాతపై అపార ప్రేమగల అసాధారణ వ్యక్తులు త్యాగం, అచంచల నిబద్ధతతో ఈ బాధ్యతలకు కొత్త నిర్వచనమిచ్చారు. మోహన్ భాగవత్ ఈ గురుతర బాధ్యతను అనితర సాధ్యంగా నిర్వహించడంతోపాటు స్వీయ శక్తిసామర్థ్యాలు, మేధస్సు జోడించి కరుణార్ద్ర నాయకత్వాన్ని ఆచరణాత్మకంగా చూపారు. ‘దేశమే ప్రధానం’ అన్న సూత్రమే వీటన్నిటికీ ప్రేరణ!ప్రత్యేక కార్యశీలత్వంఅవిచ్ఛిన్నత, అన్వయం... మోహన్ జీ మనఃపూర్వకంగా భావించిన, తన కార్యశైలిలో ఇముడ్చుకున్న ముఖ్యమైన అంశాలపై ఆలోచిస్తే ఈ రెండూ నాకు స్ఫురిస్తాయి. మనం గర్వించే సంస్థాగత భావజాల పరంగా రాజీపడకుండా, అదే సమయంలో మారుతున్న సామాజిక అవసరాలకూ అనుగుణంగా... సంక్లిష్టమైన అంశాల్లోనూ ఆయన సమర్థంగా సంస్థను ముందుకు నడిపారు. ఆయనకు యువతతో సహజమైన అనుబంధం ఉంది. ఎప్పుడూ పెద్ద సంఖ్యలో యువతను సంఘ్‌పరివార్‌లో భాగస్వాములను చేయడంపై దృష్టి సారించారు. ఆయనెప్పుడూ బహిరంగ చర్చల్లో పాల్గొంటూ, ప్రజలతో సంభాషిస్తూ కనిపిస్తారు. నేటి గతిశీల, డిజిటల్ ప్రపంచంలో ఇది అత్యంత ప్రయోజనకరమైన అంశం. స్థూలంగా చెప్పాలంటే, వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానంలో భాగవత్ జీ బాధ్యతలు నిర్వర్తించిన కాలం అత్యంత విప్లవాత్మక సమయమని చెప్పక తప్పదు. యూనిఫాంలో మార్పు నుంచి శిక్షా వర్గలలో (శిక్షణ శిబిరాలు) మార్పుల వరకు... ఆయన నేతృత్వంలో అనేక ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మానవత్వం విపత్తుతో తలపడిన కోవిడ్ కాలంలో మోహన్ జీ కృషి నాకు ఎప్పటికీ గుర్తుంటుంది. జీవితకాలంలో మునుపెన్నడూ చూడని ఆ విపత్తు వేళ ఆర్ఎస్ఎస్ సాంప్రదాయక కార్యకలాపాల కొనసాగింపు సవాలుగా మారింది. సాంకేతికత వినియోగాన్ని పెంచాలని మోహన్ జీ సూచించారు. ప్రపంచవ్యాప్త సవాళ్ల నేపథ్యంలో... సంస్థాగత యంత్రాంగాలను అభివృద్ధి చేస్తూనే, అంత ర్జాతీయ పరిణామాలనూ నిశితంగా పరిశీలించారు. స్వీయ రక్షణ చర్యలతోపాటు ప్రజా రక్షణను కర్తవ్యంగా భావిస్తూ.. ఆపన్నులను ఆదుకునేందుకు కోవిడ్ సమయంలో స్వయంసేవకులంతా శక్తివంచన లేకుండా కృషి చేశారు. అనేక చోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాం. కష్టపడి పనిచేసే స్వయంసేవకులను కూడా కోల్పోయాం. కానీ మోహన్ జీ స్ఫూర్తి వల్ల వారి దృఢ సంకల్పం ఎప్పుడూ సడలలేదు.ఈ ఏడాది మొదట్లో నాగ్‌పూర్‌లో మాధవ్ నేత్ర చికిత్సాలయ ప్రారంభోత్సవం సందర్భంగా... ఆర్ఎస్ఎస్ ఒక అక్షయవటం లాంటిదనీ, అది మన దేశ సంస్కృతినీ, సామూహిక చైతన్యాన్నీ శక్తిమంతం చేస్తుందనీ నేను వ్యాఖ్యానించాను. ఈ అక్షయవట మూలాలు లోతైనవి, బలమైనవి. ఎందుకంటే అవి విలువలతో కూడుకున్నవి. ఈ విలువలను పెంపొందించడానికీ, ముందుకు తీసుకెళ్లడానికీ మోహన్ భాగవత్ జీ అంకితభావంతో వ్యవహరించిన విధానం నిజంగా స్ఫూర్తిదాయకం.మోహన్ జీ వ్యక్తిత్వంలో మరో అద్భుత లక్షణం ఆయన మృదు భాషణం. ఆయన అందరి మాటా వింటారు. ఈ లక్షణం విస్తృత దృక్పథానికి నిదర్శనం. ఇదే ఆయన వ్యక్తిత్వానికి, నాయకత్వానికి శోభనిచ్చింది. పంచ పరివర్తన్వివిధ ప్రజా కార్యక్రమాలపై ఆయన చూపించిన ఆసక్తి గురించి కూడా నేను రాయాలనుకుంటున్నాను. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ నుంచి ‘బేటీ బచావో బేటీ పఢావో’ వరకు.. ఈ కార్య క్రమాల్లో ఉత్సాహంగా భాగస్వామ్యం వహించాలని మొత్తం ఆర్ఎస్ఎస్ కుటుంబానికీ ఆయన ఎప్పుడూ చెప్పేవారు. సామాజిక శ్రేయస్సు కోసం మోహన్ జీ ‘పంచ పరివర్తన్’ అందించారు. సామాజిక సామరస్యం, కుటుంబ విలువలు, పర్యావరణ అవగా హన, జాతీయ భావన, పౌర విధులు ఇందులోని అంశాలు. జీవితంలోని ప్రతి దశలో ఇవి భారతీయులకు స్ఫూర్తిని స్తాయి. బలమైన, సంపన్నమైన దేశాన్ని చూడాలని ప్రతి స్వయంసేవక్ కలలుగంటాడు. దాన్ని సాకారం చేయడం కోసం... స్పష్టమైన దార్శనికత, నిర్ణయాత్మక కార్యాచరణ రెండూ కావాలి. మోహన్ జీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. భాగవత్ జీ ఎప్పుడూ ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ గురించి బలంగా చెప్తారు. భారతదేశ వైవిధ్యాన్ని గట్టిగా నమ్మే వ్యక్తి. దేశంలో భాగమైన అనేక విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ఘనంగా చాటుతారు. తన షెడ్యూల్ వల్ల ఎంత బిజీగా ఉన్నా... మోహన్ జీ సంగీతం, పాటల వంటి అభిరుచులకు ఎప్పుడూ సమయం కేటాయించారు. వివిధ భారతీయ సంగీత వాయిద్యాలలో ఆయన చాలా ప్రజ్ఞాశాలి అని కొద్ది మందికే తెలుసు. చదవడం పట్ల ఆయనకున్న మక్కువ ఆయన ప్రసంగాలు, సంభాషణలలో కనిపిస్తుంది.మరి కొన్ని రోజుల్లో ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సంవత్సరం విజయ దశమి, గాంధీ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒకే రోజున జరగడం కూడా ఒక ఆనందకరమైన యాదృచ్చికం. భారత దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్తో అనుబంధం ఉన్న లక్షలాది మందికి ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అవుతుంది. ఈ సమయంలో మోహన్ జీ వంటి తెలివైన, కష్టపడి పనిచేసే సర్ సంఘచాలక్ సంస్థను నడిపిస్తున్నారు. మనం అంతరాలకూ, హద్దులకూ అతీతంగా ఎదిగి, ప్రతి ఒక్కరినీ మనవారిగా భావిస్తే సమాజంలో నమ్మకం, సోదరభావం, సమానత్వం బలపడుతుందని చాటిన మోహన్ జీ వసుధైక కుటుంబానికి సజీవ ఉదాహ రణగా చెబుతూ నేను ముగిస్తున్నాను. దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంతో మోహన్ జీ భరతమాత సేవలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నరేంద్ర మోదీభారత ప్రధాని -
ట్రంప్ పోస్ట్‌ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
ద్వైపాక్షిక ఒప్పందానికి కృషి
న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు సహజ భాగస్వామ్య దేశాలు అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై చర్చలను సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇరుపక్షాలు ఆ దిశగా కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య వాణిజ్యపరమైన అవరోధాలను తొలగించడానికి ప్రయత్నాలు సాగుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోదీ ప్రతిస్పందించారు. ఈ మేరకు బుధవారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ ప్రకటనను పరోక్షంగా స్వాగతించారు. India and the US are close friends and natural partners. I am confident that our trade negotiations will pave the way for unlocking the limitless potential of the India-US partnership. Our teams are working to conclude these discussions at the earliest. I am also looking forward… pic.twitter.com/3K9hlJxWcl— Narendra Modi (@narendramodi) September 10, 2025 భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. రెండు మిత్ర దేశాల నడుమ భాగస్వామ్యానికి సంబంధించిన పూర్తి శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి వాణిజ్య చర్చలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడేందుకు తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల పౌరులకు మేలు జరిగేలా, ఉజ్వల భవిష్యత్తు ఉండేలా తాము కలిసికట్టుగా పనిచేస్తామని తేల్చిచెప్పారు. మోదీ–ట్రంప్ మధ్య సోషల్ మీడియాలో అనుసంధానం గత నాలుగో రోజుల్లో ఇది రెండోసారి కావడం విశేషం. భారత్–అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పగా, అందుకు మోదీ ఈ నెల 6న హర్షం వ్యక్తంచేశారు. రెండు దేశాల బంధంపై ట్రంప్ అభిప్రాయాన్ని ప్రశంసించారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవల ఒత్తిడికి లోనవుతున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత్‌పై ట్రంప్ సర్కార్ మండిపడుతోంది. భారత ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకాలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్‌తో సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. సంబంధాలను మళ్లీ యథాతథ స్థితికి తీసుకురావాలని ఇరుదేశాలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం త్వరలో ఇండియాకు రానుంది. అమెరికా నుంచి భారత నావికాదళం పీ–8ఐ లాంగ్ రేంజ్, మల్టిమిషన్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనుగోలు చేస్తోంది. దీనిపై త్వరలో ఇరుపక్షాల మధ్య తుది చర్చలు జరుగనున్నాయి. -
మోదీతో మాట్లాడేందుకు సిద్దంగా ఉన్నా.. దెబ్బకు దిగొచ్చిన ట్రంప్!
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించిన దరిమిలా ఇరుదేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా- భారత్‌లు తిరిగి చర్చలు ప్రారంభిస్తాయన్నారు.తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఒక పోస్ట్‌లో ‘భారత్- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలు వాణిజ్య అడ్డంకులను తొలగించుకునేందుకు చర్చలు కొనసాగిస్తున్నాయని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను. రాబోయే రోజుల్లో నా స్నేహితుడు, ప్రధాని మోదీతో మాట్లాడేందుకు నేను ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య చర్చలకు విజయవంతమైన ముగింపు వచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లపై అదనంగా 25 శాతం జరిమానాతో పాటు భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం సుంకాన్ని విధించిన కొన్ని వారాల దరిమిలా ఈ ప్రకటన రావడం గమనార్హం. దీనికిముందు అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్‌లో ఒక ప్రకటన చేస్తూ, భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవిగా పేర్కొన్నారు. తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగా ఉంటామని ధృవీకరించారు. ఆందోళన చెందేందుకు ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ప్రదాని మోదీ తీరుపై అసంతృప్తి ఉందని కూడా కామెంట్ చేశారు.ప్రస్తుత సమయంలో భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?" అని ఏఎన్ఐఐ అడిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నేను మోదీకి ఎప్పటికీ స్నేహితుడినే. ఆయన గొప్ప ప్రధానమంత్రి. అయితే ఈ నిర్దిష్ట సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. కానీ భారత్- అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉందన్నారు. -
అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం
ధర్మశాల/చండీగఢ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. నీట మునిగిన పంట పొలాలు, ధ్వంసమైన ఇళ్లు, రహదారులను స్వయంగా పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలకు తోడు కొండచరియలు విరిగిపడడంతో తీవ్రంగా నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్‌కు తక్షణ సాయం కింద రూ.1,500 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరదల్లో మృతిచెందినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం ఇస్తామని వెల్లడించారు.హిమాచల్ ప్రదేశ్‌లో ఏరియల్ సర్వే అనంతరం కాంగ్రా పట్టణంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సహాయ పునరావాస చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్ సుఖూ పాల్గొన్నారు. వరద బాధితులు సైతం హాజరై తమ గోడు వినిపించారు. తమను ఆదుకోవాలని ప్రధాని మోదీని వేడుకున్నారు. కచ్చితంగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వరదల్లో దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ధ్వంసమైన ఇళ్లను ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పునరి్నరి్మంచాలని సూచించారు. రాష్ట్రంలో ఈ ఏడాది జూన్ 20 నుంచి సెపె్టంబర్ 8 దాకా వరదలు, కొండచరియల కారణంగా ఏకంగా 370 మంది మృతిచెందారు. పంజాబ్‌లో సహాయక చర్యలపై ఆరా ప్రధాని మోదీ హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటన అనంతరం పంజాబ్‌కు చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బాధితులను కలిసి మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోనూ మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. గురుదాస్‌పూర్‌లో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. పంజాబ్‌కు తక్షణ సాయం కింద రూ.1,600 కోట్లు అందజేస్తామని ప్రకటించారు. భారీ వర్షాలతోపాటు సట్లెజ్, బియాస్, రావి నదులు ఉప్పొంగి ప్రవహించడంతో పంజాబ్‌లో భారీ నష్టం వాటిల్లింది. 51 మంది మరణించారు. 1.84 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. రూ.13,000 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. రూ.20,000 కోట్ల సహాయ ప్యాకేజీ ప్రకటించాలని ప్రధాని మోదీని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.చిన్నారి నీతికతో మోదీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సమీక్షా సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ 14 నెలల చిన్నారి నీతికను ఎత్తుకొని బుజ్జగించారు. ప్రకృతి విలయం వల్ల అనాథగా మారిన నీతిక దీనగాథ విని ఆయన చలించిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మండీ జిల్లాలోని తల్వార గ్రామంలో జూన్ 30న రాత్రిపూట హఠాత్తుగా భారీ వర్షం కురిసింది. గ్రామంపై కొండ చరియలు విరుచుకుపడ్డాయి. ఓ ఇంట్లో రమేశ్ కుమార్(31), రాధాదేవి(24) దంపతులు తమ కమార్తె నీతికతోపాటు తల్లి పూనమ్దేవితో కలిసి నిద్రిస్తున్నారు. ఇంట్లోకి బురద చొచ్చుకొచ్చింది.నీతికను వంట గదిలో పడుకోబెట్టి బురదను తొలగించేందుకు ముగ్గురూ ప్రయత్నించారు. ఇంతలో భారీ కొండచరియ ఆ ఇంటిపైకి దూసుకొచ్చింది. వంట గది మినహా ఆ ముగ్గురున్న గది నేలమట్టమైంది. రమేశ్ కుమార్, రాధాదేవి, పూనమ్‌దేవి బురదతోపాటు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. వంట గదికి నష్టం జరగకపోవడంతో నీతిక ప్రాణాలతో బయటపడింది. ఆ సమయంలో నీతిక వయసు 11 నెలలే. నీతికను హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘చైల్డ్ ఆఫ్ ద స్టేట్’గా ప్రకటించింది. ఆమె చదువుతోపాటు జీవనానికి అయ్యే ఖర్చులు భరిస్తామని ప్రకటించింది. -
కొత్త ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ 15వ ఉపరాష్ట్రపతిగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) తరఫున పోటీ చేసిన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డిపై ఆయన ఘన విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి 300 ఓట్లు పొందారు. దీంతో 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ మంగళవారం రాత్రి ప్రకటించారు. దీంతో రాధాకృష్ణన్ త్వరలోనే ఉపరాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. తమిళనాడు నుంచి ఈ పదవిని అధిష్టించిన సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆర్.వెంకట్రామన్‌ల తర్వాత మూడో నాయకుడిగా సీపీ రాధాకృష్ణన్ చరిత్రకెక్కారు. ఘన విజయం... ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నూతన పార్లమెంట్ భవనంలోని ‘వసుధ ఎఫ్–101’లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ పోలింగ్‌లో మొత్తంగా 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 6, లోక్‌సభలో ఒక ఖాళీ స్థానాన్ని పక్కనబెడితే లోక్‌సభలో 542 మంది, రాజ్యసభలో 239 మంది కలిపి 781 మంది ఎంపీలు ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే ముందే ప్రకటించినట్లుగా బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎంపీలు, ఏడుగురు బీజేడీ ఎంపీలతోపాటు శిరోమణి అకాలీదళ్ ఎంపీ ఒకరు, స్వతంత్ర ఎంపీ సరబ్జీత్సింగ్ ఖల్సా ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో మొత్తంగా 767 (98.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. విజయానికి అవసరమైన ఓట్లను 377గా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి రాత్రి 7:30 గంటలకు ఫలితాన్ని ప్రకటించారు. మొత్తం పోలైన 767 ఓట్లలో చెల్లని ఓట్లు 15 ఉండగా మిగిలిన 752 ఓట్లలో రాధాకృష్ణన్‌కు 452 మొదటి ప్రాధాన్యతా ఓట్లు లభించాయని.. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డికి 300 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ ప్రకటించారు. అనుకున్నట్లే క్రాస్ ఓటింగ్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అందరూ ఊహించినట్లే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఇండియా కూటమిలోని పక్షాలు, తమకు మద్దతుగా వచ్చిన ఆప్ సహా ఇతర చిన్నాచితక పార్టీలతో కలిసి కాంగ్రెస్ కనీసం 324 ఓట్లు వస్తాయని అంచనా వేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలోనే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ప్రతిపక్షాలు ఐక్యంగా నిలబడ్డాయి. కూటమికి చెందిన 315 మంది ఎంపీల్లో అందరూ ఓటింగ్ కోసం హాజరయ్యారు’అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అయితే కాంగ్రెస్ పేర్కొన్నట్లుగానే 15 ఓట్లు క్రాస్ ఓటింగ్ అయ్యాయి. దీంతోపాటు చెల్లని ఓట్లు సైతం ఇండియా కూటమి పక్షాలవేనని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే 20–25 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు రాధాకృష్ణన్‌కు ఎన్డీయే కూటమిలోని 427 మంది ఎంపీల మద్దతు ఉందని బీజేపీ కాగితంపై లెక్కలేసుకోగా పోలింగ్‌లో మాత్రం అంతకన్నా ఎక్కువగానే ఓట్లు లభించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో నిర్వహించిన సమర్థవంతమైన ఫ్లోర్ మేనేజ్మెంట్ కారణంగా ఎన్డీయే సునాయాశ విజయం సాధించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్డీఏ కూటమి పక్షాలకు రెండ్రోజులపాటు నిర్వహించిన శిక్షణా తరగతులు, మిత్రపక్షాలతో సమన్వయం, పోలింగ్‌కు ముందు ప్రాంతాలవారీగా ఎంపీలతో సమన్వయం రాధాకృష్ణన్ గెలుపునకు దోహదం చేసిందని చెబుతున్నారు. మిన్నంటిన సంబరాలు.. సీపీ రాధాకృష్ణన్ విజయం సాధించిన వెంటనే బీజేపీలో సంబరాలు మొదలయ్యాయి. కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి నివాసం ముందు తమిళనాడు సంప్రదాయాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సీపీ రాధాకృష్ణన్‌కు బీజేపీ ఎంపీలతోపాటు ఆయనకు మద్దతిచ్చిన పక్షాల ఎంపీలు శుభాకంక్షలు తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, ఖర్గే శుభాకాంక్షలు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర అమిత్ షా సహా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్‌లు చేశారు. ‘ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన రాధాకృష్ణన్‌కు అభినందనలు. ప్రజాజీవితంలో దశబ్దాల గొప్ప అనుభవం, దేశ పురోగతికి గణనీయంగా దోహడపతుంది. విజయవంతమైన, ప్రభావవంతమైన పదవీకాలం కోసం మీకు ఇవే నా శుభాకాంక్షలు’అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన సందేశాన్ని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘రాధాకృష్ణన్‌కు ఎంపీగా, వివిధ రాష్ట్రాల గవర్నర్‌గా గొప్ప అనుభవం ఉంది. ఆయన పార్లమెంటరీ జోక్యాలు ఎల్లప్పుడూ చురుకైనవి. గవర్నర్‌గా పదవీకాలంలో, సాధారణ పౌరులు ఎదుర్కొన్న సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టారు. ఈ అనుభవాలు ఆయనకు శాసన, రాజ్యాంగ విషయాలపై అపార జ్ఞానం ఉందని నిర్ధారించాయి. ఆయన స్ఫూర్తిదాయకమైన ఉపరాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకం ఉంది‘ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వ లక్షణాలను, పరిపాలనపై ఆయనకున్న లోతైన జ్ఞానాన్ని అమిత్ షా ప్రశంసించారు. రాధాకృష్ణన్ అనుభవం, అట్టడుగు స్థాయి నేపథ్యం దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, అణగారిన వర్గాలకు సేవ చేయడానికి సహాయపడతాయని షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఎగువ సభ సంరక్షకుడిగా ఆయన కొత్త పాత్రలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి పెదవివిప్పని జగ్దీప్ ధన్‌ఖడ్.. సీపీ రాధాకృష్ణన్ విజయం నేపథ్యంలో తొలిసారి స్పందించారు. ప్రజాజీవితంలో రాధాకృష్ణన్‌కు ఉన్న అపార అనుభవంతో ఉపరాష్ట్రపతి కార్యాలయం మరింత ఖ్యాతిని పొందుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నాం: ఖర్గే ‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు. ఇండియా కూటమి అభ్యర్థి బి.సుదర్శన్‌రెడ్డి పోరాటానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంప్రదాయాల అత్యున్నత నైతికతను నిలబెట్టుకుంటారని, ప్రతిపక్షాలకు గౌరవాన్ని ఇస్తారని, ఒత్తిళ్లకు లొంగరని ఆశిస్తున్నా. వర్షాకాల సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు, ఇది ఎందుకు అనేది ఎప్పటికీ వివరించలేం. రాజ్యాంగ స్థానాలపట్ల గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది’అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. -
Vice President Election: ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధానమంత్రి మోదీ
-
17న దివంగత తల్లికి ప్రధాని మోదీ పిండ ప్రదానం
న్యూఢిల్లీ: బీహార్‌లోని గయలో జరుగుతున్న పితృపక్ష మేళాకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. సెప్టెంబరు 17న ప్రధాని మోదీ గయ చేరుకుని, దివంగత తన తల్లికి పిండప్రదానం చేయనున్నారు. అలాగే తన పూర్వీకులకు తర్పణాలు అర్పించనున్నారు.ఈ పర్యటనలో ప్రధాని మోదీ రోడ్‌షో నిర్వహించడంతోపాటు పూర్ణియా విమానాశ్రయాన్ని, పట్నా మెట్రోను ప్రారంభించనున్నారు. ప్రధాని రాక సందర్భంగా పట్నా జిల్లా అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది పోలీసులు సమన్వయంతో వివిధ ఏర్పాట్లు చేస్తున్నారు.మరోవైపు పితృపక్ష మేళాకు పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పట్నా మెట్రో బీహార్ అభివృద్ధిలో ఒక మైలురాయి కానుంది. ప్రధాని మోదీ పర్యటన వివరాలను ప్రధాని కార్యాలయం ఇంకా ధృవీకరించనప్పటికీ, పలు సూచనల మేరకు బీహార్ అధికారులు ప్రధాని రాకకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేడు వరద బాధిత ప్రాంతాల్లో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో వరదలు, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను సందర్శించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో ప్రధాని తొలుత ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.నేటి మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రదాని హిమాచల్‌లోని కాంగ్రాకు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర అధికారులను కలుసుకుంటారు. పరిస్థితిని అంచనా వేసేందుకు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. అలాగే వరద బాధితులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఆప్దా మిత్ర బృందంతో సంభాషించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోదీ పంజాబ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏరియల్ సర్వే నిర్వహించాక, గురుదాస్‌పూర్ చేరుకుని, సాయంత్రం 4:15 గంటలకు సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.హిమాచల్‌లో వరదల కారణంగా 355 మంది మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కొండచరియలు విరిగిపడటం, నిర్మాణాలు కూలిపోవడం కారణంగా ప్రాణనష్టం జరిగిందని పేర్కొంది. మరోవైపు బియాస్, సత్లుజ్, రావి, ఘగ్గర్ తదితర నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పంజాబ్ హై అలర్ట్‌లో ఉంది. 23 జిల్లాల్లోని 1,650 కి పైగా గ్రామాలు నీట మునిగాయి, 1.75 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. -
స్వదేశీ మేళాకు పట్టం కట్టండి
న్యూఢిల్లీ: స్నేహితుడు, శత్రువు అనే బేధం లేకుండా అమెరికా ప్రభుత్వం అందరిపై సుంకాలతో బాదేస్తున్న వేళ ప్రధాని మోదీ స్వదేశీరాగం అందుకున్నారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సోమవారం ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ‘‘దేశవాళీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా చూడండి. స్వదేశీ మేళాను ఉద్యమస్థాయికి తీసుకెళ్లండి. విదేశాల అధిక టారిఫ్‌ల వంటి ప్రతికూలతలు, సవాళ్ల సమయంలో భారత్ స్వావలంబన ద్వారా తన శక్తిసామర్థ్యాలను మరింతగా సంతరించుకోవాల్సిన తరుణమిది. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి. జీఎస్టీ రేట్లు భారీగా తగ్గిన చక్కటి తరుణంలో స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని జనాన్ని తెలిసేలా చేయండి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్లో మీమీ నియోజకవర్గాల్లో ప్రజలతో, వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటుచేసి తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను వివరించండి’’అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియాకు వివరించారు. అమెరికా 50 శాతం టారిఫ్ భారం మోపిన వేళ మోదీ స్వదేశీ వస్తువుల ప్రాశస్థ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. శక్తివంతమయ్యేవేళ సవాళ్లు సాధారణం ‘‘భారత్ శక్తివంతంగా ఎదిగే క్రమంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. అయినాసరే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో ఇలాటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మనిర్భర్‌ను సాధించాలి. సొంత నియోజకవర్గాల్లో దేశీయ ఉత్పత్తుల ప్రచారాన్ని మీరే నాయకులుగా ముందుండి నడపాలి. గతంలో భారత్‌లో జపాన్ తయారీ వస్తువుల వినియోగం అధికంగా ఉండేది. అలాంటి భారత్‌లో ఇప్పుడు దేశీయోత్పత్తులను అధికంగా ఉపయోగించగల్గుతున్నామని గర్వపడేలా మనం చేయాలి. మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఉత్పత్తులు కనిపించాలి. ఉపయోగించాలి’’అని ఎంపీలకు మోదీ సూచించారు. ‘‘జీఎస్టీ శ్లాబుల తొలగింపు అనేది ప్రజల్లో పెను సంచలనంగా మారింది. ప్రజలతో ‘స్వదేశీ మేళాలు’, వ్యాపారులతో ‘వ్యాపారీ సమ్మేళన్’లు నిర్వహించండి. గాల్లో తుపాను చెలరేగినాసరే మనం వాహన టైరులో మళ్లీ గాలి కొట్టాల్సిందే. అలాగే దేశీయంగా ‘స్వదేశీ వాతావరణం’ఉన్నాసరే మన మళ్లీ విడిగా మన వంతు తోడ్పాటు అందించాల్సిందే’’అని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్త ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీలు జాగ్రత్త వహించండి. తప్పులు దొర్లకుండా ఓటేయండి. పార్లమెంట్ సభ్యులే ఓటింగ్‌లో తప్పులు చేస్తే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. మన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉత్తమ అభ్యర్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా చక్కటి సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తన పాలనాదక్షతతో ఆయ ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని నేనూ విశ్వసిస్తున్నా’’అని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందం వెనుక అధికార కూటమి ఎంపీల కృషిదాగి ఉందని మోదీ ప్రశంసించారు. హిమాచల్, పంజాబ్‌కు నేడు మోదీ వరద విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ మంగళవారం పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకూ మోదీ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హిమాచల్‌లోని కంగ్రాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
జీఎస్టీ 2.0.. స్వదేశీ అని గర్వంగా చెప్పండి: ప్రధాని మోదీ
జీఎస్టీ 2.0 పేరిట తెచ్చిన సంస్కరణలను మేక్ ఇన్ ఇండియా ప్రచారంలో భాగంగానే పరిగణించాలని.. వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంతో పాటు అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్డీయే ఎంపీలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సోమవారం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. GST 2.0 సంస్కరణల గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ప్రతి ఎంపీ తమ నియోజకవర్గంలో 20 నుంచి 30 సమావేశాలు నిర్వహించాలి. స్థానిక వ్యాపారులు, దుకాణదారులకు GST 2.0 ప్రయోజనాలు వివరించాలి. నవరాత్రి నుంచి దీపావళి మధ్య.. స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం స్థానిక హస్తకళాకారులు, చిన్న పరిశ్రమలు పాల్గొనే స్వదేశీ ప్రదర్శనలు, జాతరలు నిర్వహించాలి. గర్వంగా చెప్పండి.. ఇది స్వదేశీ అనే నినాదంతో అన్ని రంగాల్లోనూ ఎగ్జిబిషన్లు నిర్వహించాలని సూచించారు.అదే సమయంలో పంజాబ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వరదలు కారణంగా ఎన్డీయే ఎంపీల విందు కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, నేను ఉత్సవ విందు ఎలా నిర్వహించగలను? అని అన్నారాయన. ప్రజలపై పన్ను భారం తగ్గించడంతో పాటు భారత ఎకానమీకి బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది. జీఎస్టీ 2.0 అనేది భారత ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా పన్ను సంస్కరణ. ఇది 2025 సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానుంది. 2017లో ప్రారంభమైన జీఎస్టీ వ్యవస్థకు పెద్ద మార్పుగా భావించబడుతోంది.ప్రధాన మార్పులు:• పాత slabs: 0%, 5%, 12%, 18%, 28% + cess• కొత్త slabs: 0%, 5%, 18%, 40% (cess తొలగింపు)ధరలు తగ్గిన వస్తువులు:👉అవశ్యక వస్తువులు: పన్ను 0%పన్నీర్, చపాతీ, UHT పాలు, అవసరమైన ఔషధాలు👉 ప్రాముఖ్యమైన వినియోగ వస్తువులు: 5%షాంపూ, టూత్‌పేస్ట్, హేర్ ఆయిల్, వ్యవసాయ పరికరాలు👉సాధారణ వస్తువులు: 18%TVs, ACs, వాషింగ్ మెషీన్లు, చిన్న కార్లు👉లగ్జరీ & హానికర వస్తువులు: 40%పొగతాగే పదార్థాలు, పాన్ మసాలా, లగ్జరీ కార్లు👉ఆటోమొబైల్ రంగంపై ప్రభావం.. చిన్న కార్లు: GST 28% → 18% (ధరలు తగ్గాయి). బెండ్స్, టాటా, హ్యుందాయ్, రెనాల్ట్ వంటి కంపెనీలు రూ. 60,000–₹10 లక్షల వరకు ధరలు తగ్గించాయి👉 ఇన్సూరెన్స్ పాలసీలు: జీవన, ఆరోగ్య బీమాలపై GST పూర్తిగా మాఫీ👉పాఠశాల వస్తువులు: పెన్సిల్, షార్పెనర్, నోట్‌బుక్‌లపై పన్ను తగ్గింపు👉వ్యవసాయ పరికరాలు: ట్రాక్టర్లు, డ్రిప్ ఇరిగేషన్, కంపోస్టింగ్ యంత్రాలు — 5% GSTజీఎస్టీ 2.0 లక్ష్యాల్లో ప్రధానమైంది సాధారణీకరణ. పన్ను slabs తగ్గించడం ద్వారా వ్యాపారులకు సులభతరం అవుతుంది. అవసరమైన వస్తువులపై పన్ను తగ్గింపుతో పాటు ఆర్థిక వృద్ధికి తోడ్పాటు, తద్వారా వినియోగం పెరగడం ద్వారా GDP వృద్ధి చెందుతుంది. పన్ను వ్యవస్థలో స్పష్టత, పారదర్శకత కారణంగా.. వివాదాలు, విమర్శలు తొలగిపోతాయనే ఆలోచనతోనూ ఎన్డీయే ప్రభుత్వం ఉంది. -
భారత్‌పై జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేసే భారత్ వంటి దేశాలపై ఆంక్షలు విధించడం సరైన నిర్ణయమే అంటూ కుండబద్దలు కొట్టారు. దీంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టు అయ్యింది.భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీపై అడిగిన ప్రశ్నకు జెలెన్స్కీ సమాధానం ఇస్తూ.. రష్యాతో వ్యాపార లావాదేవీలు చేస్తున్న దేశాలపై టారిఫ్‌లు విధించడం సరైన చర్యే. రష్యాను కట్టడి చేయాలంటే సుంకాలు అవసరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అలస్కాలో ట్రంప్-పుతిన్ భేటీకి ఉక్రెయిన్‌కు ఆహ్వానించకపోవడం విచారకరమని కామెంట్స్ చేశారు. అయితే, మాస్కో-కీవ్ మధ్య సంధి కుదిర్చేందుకు భారత్ దౌత్య యత్నాలు చేస్తున్నా ఆయన నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం.కాగా.. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని భారత్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ అటు పుతిన్, ఇటు జెలెన్స్కీతో చర్చలు జరుపుతున్నారు. గత నెల రెండో వారంలో పుతిన్‌తో భేటీకి ముందు ఉక్రెయిన్ అధినేతతో మాట్లాడారు. ఈ వివాదాన్ని వీలైనంత త్వరగా, శాంతియుతంగా పరిష్కరించడంపై భారత్ స్థిరమైన వైఖరి గురించి తెలియజేశారు. యుద్ధం ముగింపు విషయంలో సాధ్యమైన సహకారాన్ని అందించేందుకు, ఉక్రెయిన్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. ఇలాంటి సమయంలో నుంచి భారత్‌పై ప్రతికూల ప్రకటన వెలువడటం గమనార్హం.ఇదిలా ఉండగా.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ చర్చలు విఫలమైన నేపథ్యంలో రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధంలో సహకరించే వారిపై ఆంక్షలు అమలయ్యేలా చూసే బాధ్యత తమదే అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. -
మోదీజీ.. ట్రంప్ అవమానాలు మర్చిపోయారా?: శశిథరూర్
ఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త మాటల మర్మమేమిటో తెలుసుకోవాలన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతించాలని.. ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీకి సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ అనుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం.రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేం అని కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Thiruvananthapuram: On PM Modi's response to US President Donald Trump speaking positively on India-US relationship, Congress MP Shashi Tharoor says, "The Prime Minister was very quick to respond, and the Foreign Minister has also underscored the importance of the basic… pic.twitter.com/Iju3uZUkzl— ANI (@ANI) September 7, 2025ఇదిలా ఉండగా.. భారత్‌పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘భారత్‌తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మోదీ వెంటనే స్పందిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత-అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు పెట్టారు. -
విక్రమ్... ఒక గేమ్ ఛేంజర్
భారతదేశం పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన 32 బిట్ ప్రాసెసర్ ‘విక్రమ్ 3201’ ప్రత్యేకత ఏమిటి? రేపటి తరం ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లను నడి పేంత శక్తిమంతమైంది కాకపోవచ్చు కానీ... భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో మాత్రం కీలకపాత్ర పోషించనుంది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా సెమికాన్ ’ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న విక్రమ్ 3201 ప్రాసెసర్‌దే ప్రతిష్ఠాత్మక చంద్రయాన్ , గగన్ యాన్ యాత్రల ఎలక్ట్రానిక్స్‌లో ముఖ్య భూమిక. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిజైన్ చేయగా మొహాలీలోని సెమీకండక్టర్ లేబొరేటరీ తయారు చేసిన ఈ ప్రాసెసర్‌కు భారతదేశం గర్వించగదగ్గ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయి పేరు పెట్టారు. గతేడాది డిసెంబరులో ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–60లో విజయవంతంగా పరీక్షించి చూశారు కూడా. 2009 నుంచి ఉపయోగిస్తున్న విక్రమ్ 1601 ప్రాసెసర్ స్థానంలో ఇకపై విక్రమ్ 3201ను ఉపయోగిస్తారు.పోటీ పడలేనప్పటికీ...ప్రస్తుతం స్మార్ట్ఫోన్లలో ఉపయోగిస్తున్న ప్రాసెసర్లతో పోల్చి చూస్తే విక్రమ్ 3201 గొప్ప శక్తిమంతమైందేమీ కాదు. సాంకేతిక పరి జ్ఞానం విషయంలోనూ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని ప్రాసెసర్లతో సరితూగేది కాదు. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాల్లో 64 బిట్ ప్రాసె సర్లు ఉపయోగిస్తూండగా విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్ మాత్రమే.కొంచెం సింపుల్‌గా చెప్పాలంటే 32 బిట్ ప్రాసెసర్‌తో నాలుగు గిగాబైట్ల ర్యామ్‌తో పనిచేయగలం. అదే 64 బిట్ ప్రాసెసర్తోనైతే 8 గిగాబైట్లు, అవసరమైతే 16 గిగాబైట్ల ర్యామ్‌తోనూ పనిచేయించవచ్చు. అంటే, 64 బిట్ ప్రాసెసర్‌తో చేయగలిగిన పనులన్నీ 32 బిట్ ప్రాసెసర్‌తో చేయడం కష్టమన్నమాట. అంతేకాదు... విక్రమ్ 3201ను 180 నానోమీటర్ల సైజున్న ట్రాన్సిస్టర్లతో తయారు చేశారు. ఆధునిక మైక్రోప్రాసెసర్లలోని ట్రాన్సిస్టర్ల సైజు ప్రస్తుతం మూడు నానోమీటర్లు! సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్‌లో ఎక్కువ ట్రాన్సి స్టర్లు పడతాయి. తద్వారా వాటి వేగం, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ రకంగా చూస్తే విక్రమ్ 3201 ఎప్పుడో 1990ల నుంచి 2000 సంవత్సరం వరకూ అందుబాటులో ఉన్న ప్రాసెసర్ల స్థాయిది.ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, ఎలెవన్ ్త జనరేషన్ కూడా పది నానో మీటర్ల ట్రాన్సిస్టర్లతో తయారైందన్నది గమనార్హం. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉంటే ప్రాసెసర్ సైజు తగ్గి... చిన్న చిన్న పరికరాల్లోనూ ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నింటికీ తట్టుకునేలా...అయితే స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో పోలిస్తే అంతరిక్షంలో ఉపయోగించే ఎలక్ట్రానిక్స్ తీరుతెన్నులు భిన్నం. అవి అంతరిక్షంలోని కఠిన పరిస్థితులను తట్టుకుని పనిచేయాలి. అక్కడ ఉష్ణో గ్రతల్లో విపరీతమైన మార్పులుంటాయి. భూ కక్ష్యలో తిరుగు తున్నప్పుడు సూర్యాభిముఖంగా ఉన్నప్పుడు ఉపగ్రహాలు 125 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకో వైపు ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు–55 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. రేడియోధార్మికత కూడా ఎక్కువ. పైగా ప్రయోగ సమయంలో పుట్టే ఎలక్ట్రిక్ ప్రకంపనలు, ధ్వని తాలూకూ షాక్‌లను తట్టుకుని మరీ పనిచేయాల్సి ఉంటుంది. భూ వాతావరణ పొర తాలూకూ రక్షణ ఉండదు కాబట్టి సౌరగాలులు, అత్యంత శక్తిమంతమైన కణాలతో కూడిన కాస్మిక్ రేస్ వంటివన్నీ నిత్యం ప్రాసెసర్లకు పరీక్ష పెడుతూంటాయి. ప్రాసెసర్లలో సమాచారం ‘1’, ‘0’ల రూపంలోనే నిక్షిప్త మవుతూ ఉంటుంది. ట్రాన్సిస్టర్ల గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’, ప్రవహించకపోతే ‘0’ అన్నమాట. ఖగోళం నుంచి దూసుకొచ్చే శక్తి మంతమైన కణాలు ట్రాన్సిసర్టలపై ప్రభావం చూపితే సమాచారం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. ఆధునిక మైక్రో ప్రాసెసర్లలో ఇలా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. ట్రాన్సిస్టర్ల సైజు తక్కువగా ఉండటం, విద్యుదావేశాన్ని నిలిపి ఉంచుకోవడం దీనికి కారణాలు. విక్రమ్ 3201లో 180 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లు ఉండటం వల్ల ఈ తప్పులు జరగవు.వేగం కంటే అవసరాలే ముఖ్యం...పీఎస్ఎల్వీ వంటి అంతరిక్ష ప్రయోగాల్లో టెలిమెట్రీ, నావిగేషన్, కంట్రోల్ సిస్టమ్స్ వంటివి నమ్మకంగా పనిచేయాలి. ఈ అవసరాలతో పోలిస్తే స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలోని ప్రాసెసర్ల గిగాబైట్ల వేగం అంత ముఖ్యం కాదు. అత్యంత దుర్భర పరిస్థితు లను తట్టుకుని, అతితక్కువ తప్పులు, వైఫల్యాలతో పనిచేసేలా విక్రమ్ 3201ను తయారు చేశారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన అన్న భారతదేశ ఆశలు నెరవేర్చడంలో విక్రమ్ 3201 మేలి మలుపు కాగలదనడంలో సందేహం లేదు. 2009లో కార్టోశాట్ ఉప గ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఉపయోగించిన పీఎస్ఎల్వీ సీ–47లో విక్రమ్ 1601ను ఉపయోగించగా... ఫ్లోటింగ్ పాయింట్ కాలిక్యులేషన్ వంటి ఆధునిక హంగులు, అడా వంటి ఆధునిక కంప్యూటర్ భాషలతో పనిచేయగల సామర్థ్యాన్ని అందించి విక్రమ్ 3201ను తయారు చేశారు. దీన్ని విజయవంతంగా పరీక్షించిన నేప థ్యంలో ఇస్రో ఇప్పటికే 70 నానోమీటర్ల ట్రాన్సిస్టర్లతో కొత్త మైక్రో ప్రాసెసర్ తయారీ యత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. విక్రమ్ 1601 ప్రాసెసర్ వినియోగం కేవలం అంతరిక్షానికి మాత్రమే పరిమితం కాలేదు. రైల్వే వ్యవస్థల్లోనూ వినియోగి స్తున్నారు. ముఖ్యంగా ట్రాక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఆటోమెటిక్ ట్రెయిన్ సూపర్విజన్స్ వంటి వాటిల్లో. ఇదే విధంగా విక్రమ్ 3201ను కూడా ఇతర రంగాల్లో వాడే అవకాశం ఉంది. విక్రమ్ 1601కు ముందు దేశం ప్రాసెసర్ల దిగుమతిపైనే ఎక్కువగా ఆధార పడి ఉండేది. తద్వారా సరఫరా, నియంత్రణలు, భద్రతాంశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొనేది. 1998 నాటి పోఖ్రాన్ అణు పరీక్షల తరువాత అమెరికా విధించిన ఆంక్షలతో స్వావలంబన అవసరం మరింత పెరిగిన విషయం తెలిసిందే. ఈ సవాలును స్వీకరించిన శాస్త్రవేత్తలు విక్రమ్ 3201తో తొలి అడుగు వేశారని చెప్పాలి. అంత రిక్ష రంగంలో సాంకేతిక పరిజ్ఞానపరంగా ‘ఆత్మ నిర్భరత’ సాధించే విషయంలో ఇది నిజంగానే మేలిమలుపు!టి.వి. వెంకటేశ్వరన్ వ్యాసకర్త మొహాలీలోని ‘ఐసర్’ విజిటింగ్ ప్రొఫెసర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్‌కు చూపించండి’
న్యూఢిల్లీ: ‘మోదీజీ..ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. యావత్‌దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పత్తి పంట చేతికొచ్చే సమయం అక్టోబర్-నవంబర్‌లో ఉండటంతో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అప్పుల బారిన పడతారని, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు వారు అప్పు ఎలా తీర్చాలి?’అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందని ఆరోపించిన కేజ్రీవాల్ .. ట్రంప్‌కు మోదీ తలవంచారు. ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. మోదీ 100 శాతం సుంకం విధించాలని సూచించారు. -
9న పంజాబ్‌కు ప్రధాని మోదీ.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
చండీగఢ్: పంజాబ్‌ను ఇటీవల వరదలు చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9న ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ను సందర్శించి, వరద పరిస్థితిని, సహాయక చర్యలను సమీక్షించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వరద బాధితులతో, రైతులతో నేరుగా మాట్లాడతారని బీజేపీ పంజాబ్ యూనిట్ ‘ఎక్స్’ (ట్విట్టర్)లో తెలిపింది.ప్రధాని మోదీ గురుదాస్‌పూర్ పర్యటన‘ఎక్స్’ పోస్ట్‌లో బీజేపీ.. ‘ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 9న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు వస్తున్నారు. వరద బాధిత రైతులతో ఆయన నేరుగా సమావేశమై వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటారు’ అని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా బీజేపీ ప్రభుత్వం పంజాబ్ ప్రజలకు అండగా ఉంటుందని, ఈ క్లిష్ట సమయంలో సహాయాన్ని అందిస్తుందని పోస్ట్‌లో వివరించారు.ਮਾਨਯੋਗ ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਸ਼੍ਰੀ ਨਰਿੰਦਰ ਮੋਦੀ ਜੀ 9 ਸਤੰਬਰ ਨੂੰ ਪੰਜਾਬ ਦੇ ਗੁਰਦਾਸਪੁਰ ਵਿੱਖੇ ਆ ਰਹੇ ਹਨ।ਹੜ੍ਹ ਪੀੜਿਤ ਭਰਾਵਾਂ-ਭੈਣਾਂ ਅਤੇ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਸਿੱਧੀ ਮੁਲਾਕਾਤ ਕਰਕੇ ਦੁੱਖ ਵੰਡਾਉਣਗੇ ਅਤੇ ਪੀੜਿਤਾਂ ਦੀ ਮਦਦ ਲਈ ਹਰ ਸੰਭਵ ਕਦਮ ਚੁੱਕਣਗੇ।ਪ੍ਰਧਾਨ ਮੰਤਰੀ ਜੀ ਦਾ ਇਹ ਦੌਰਾ ਸਾਬਤ ਕਰਦਾ ਹੈ ਕਿ ਕੇਂਦਰ ਦੀ ਭਾਜਪਾ ਸਰਕਾਰ ਹਮੇਸ਼ਾ…— BJP PUNJAB (@BJP4Punjab) September 7, 2025పంజాబ్‌లో వరదలుప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 500 మందికి పైగా జనం ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌తో పాటు జమ్ముకశ్మీర్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లను సందర్శించనున్నారు. పంజాబ్‌లోని 23 జిల్లాల్లో సుమారు 1,650 గ్రామాలు నీటి మునిగాయి. దాదాపు 1.75 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు, ముఖ్యంగా వరి పంట దెబ్బతింది. బియాస్, సట్లజ్, రావి, ఘగ్గర్ నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. భాక్రా, పాంగ్, రంజిత్ సాగర్ వంటి ప్రధాన ఆనకట్టల నుంచి నీటిని నియంత్రించి విడుదల చేయడం వల్ల సంక్షోభం మరింత తీవ్రమైంది. గురుదాస్‌పూర్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. అలాగే అమృత్సర్, ఫిరోజ్‌పూర్, ఫాజిల్కా జిల్లాలు కూడా ప్రభావితమయ్యాయి. పంజాబ్‌లో ఇప్పటివరకు 37 మంది మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు. సైన్యం, వైమానిక దళం, బీఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, సెప్టెంబర్ 7 వరకు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.గత కొన్ని రోజులుగా పంజాబ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వేలాది ఇళ్లలోకి నీరు చేరింది. రవాణా వ్యవస్థను స్తంభించిపోయింది. గత నెల రోజులుగా సంభవిస్తున్న వరదల కారణంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఈరోజు (ఆదివారం), రాబోయే రెండు రోజులలో పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
-
భారత్ దెబ్బకు భయంతో వణికిపోతున్న బ్లాక్ మెయిల్ ట్రంప్!
-
‘ట్రంప్‌కు అభినందనలు’.. దోస్తీ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ రియాక్షన్
న్యూఢిల్లీ: అమెరికా- భారత్‌ల సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదని అభివర్ణించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాను, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. అధ్యక్షుడు ట్రంప్ భావాలను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని, ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తున్నానని అన్నారు.సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో ప్రధాని మోదీ ‘మా బంధం గురించి అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తపరిచిన భావాలను, ఆయన సానుకూల అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. భారత్- అమెరికాలు సానుకూల, దార్శనిక, సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి’ అని అన్నారు. సుంకాల విషయంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోదీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలకు ఈ విధంగా స్పందించడం ఆసక్తకరంగా మారింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025దీనికిముందు ట్రంప్ భారత్-అమెరికా సంబంధాలను చాలా ప్రత్యేకమైనవని అనడమే కాకుండా, తాను, ప్రధాని మోదీ ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటామన్నారు. అయితే భారత్ రష్యన్ చమురు దిగుమతులను ప్రస్తావిస్తూ, ప్రధాని మోదీ ప్రస్తుతం చేస్తున్న దానిపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశంతో వాణిజ్య చర్చలు చక్కగా జరుగుతున్నాయని కూడా అమెరికా అధ్యక్షుడు అన్నారు. కాగా భారత్ ఎగుమతులపై అమెరికా సుంకాలు ఇప్పుడు 50 శాతానికి మించి ఉన్నాయి. భారతదేశం ఈ చర్యను ఖండించింది. దీనిని అన్యాయం, అసమంజసమైనదని పేర్కొంది. -
రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో ఈ విషయం వెల్లడించింది. రాష్ట్రపతి ముర్మును కలుసుకున్నట్లు ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్‌లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. చైనాలోని తియాంజిన్‌లో ఆగస్ట్ 31 నుంచి సెపె్టంబర్ ఒకటో తేదీ వరకు జరిగిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. అంతకుముందు ఆయన జపాన్‌లో పర్యటించారు. 9వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ రాష్ట్రపతితో సమావేశమైనట్లు భావిస్తున్నారు. -
ఉక్రెయిన్‌పై ఏం చేద్దాం?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నట్టు భారత్, ఫ్రాన్స్ పునరుద్ఘాటించాయి. ప్రధాని నరేంద్ర మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శనివారం ఫోన్లో సంభాషించారు. యుద్ధానికి తెర దించే మార్గాలపై ఇరు నేతలు లోతుగా చర్చలు జరిపారు. అనంతరం ఇరు దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మాక్రాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగినట్టు మోదీ తెలిపారు. పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారం తదితరాలను సమీక్షించినట్టు వివరించారు. ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్న వైఖరికే భారత్ తొలినుంచీ గట్టి మద్దతుదారుగా ఉందని పునరుద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరతలను పెంపొందించడంలో ఇరు దేశాలు ఇకపై కూడా కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఫిబ్రవరిలో భారత్‌లో జరిగే ఐఏ శిఖరాగ్రంలో పాల్గొనేందుకు అంగీకరించినందుకు మాక్రాన్‌కు మోదీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తన ఇటీవలి చర్చలు ఫలప్రదంగా సాగాయని మాక్రాన్ పేర్కొన్నారు. -
ఐరాస సభకు మోదీ వెళ్లరు
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభనుద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ దఫా ప్రసంగించడం లేదు. వార్షిక సమావేశాల్లో ప్రసంగించే వివిధ దేశాల నేతల పేర్ల జాబితాను శుక్రవారం ఐరాస విడుదల చేసింది. ఇందులోని వక్తల జాబితాలో ప్రధాని మోదీ పేరు లేదు. ఈ నెల 9వ తేదీన ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ఉన్నత స్థాయి సాధారణ చర్చ ఈ నెల 23–29వ తేదీల మధ్య జరుగుతుంది. ఆనవాయితీ ప్రకారం మొదటగా బ్రెజిల్, తర్వాత అమెరికా దేశాల నేతలు ప్రసంగిస్తారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్ 23వ తేదీన మొదటిసారిగా ఐరాస జనరల్ అసెంబ్లీనుద్దేశించి మాట్లాడనున్నారు. జూలైలో విడుదల చేసిన జాబితాలో సెప్టెంబర్ 26వ తేదీన భారత్ నుంచి ప్రధాని మోదీ ప్రసంగిస్తారని ఐరాస విడుదల చేసిన జాబితా పేర్కొంది. తాజా లిస్ట్‌లో మాత్రం 27న భారత్ విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ప్రసంగిస్తారని ఉంది. 26న ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నేతల ప్రసంగాలుంటాయి. అయితే, ఇది తుది జాబితా మాత్రం కాదు. ఈ జాబితాలో వ్యక్తుల పేర్లు, వారు ప్రసంగించే తేదీలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని చెబుతున్నారు. ఐరాస 80వ సెషన్ ఈసారి ‘బెటర్ టుగెదర్: 80 ఇయర్స్ అండ్ మోర్ ఫర్ పీస్, డెవలప్మెంట్, హ్యూమన్ రైట్స్’ఇతివృత్తంగా ఉంది. ఇజ్రాయెల్–హమాస్ యుద్ధం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధాలు కొనసాగుతున్న వేళ జరిగే ఈ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అమెరికా వెళ్లారు. వాషింగ్టన్లో అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. అయితే, రష్యా నుంచి భారీ చమురుకొంటూ ఉక్రెయిన్‌తో యుద్ధానికి ప్రేరేపిస్తోందని ఆరోపిస్తూ ఇటీవల భారత్‌పై ట్రంప్ ఏకంగా 50 శాతం టారిఫ్‌లను విధించడం తెల్సిందే. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు తన జోక్యమే కారణమని పదేపదే ప్రకటించుకోగా వాటిని భారత్ ఖండిస్తూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఐరాస సమావేశాల్లో పాల్గొనడం లేదని పరిశీలకులు అంటున్నారు. -
దోస్త్ మేరా దోస్త్!
న్యూయార్క్/వాషింగ్టన్: నాలుకకు నరం లేదని, తన చిత్తం క్షణక్షణానికీ మారుతూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు మరోసారి నిరూపించారు. రష్యా, చైనాతో పాటు భారత్‌పైనా ఒంటికాలిపై లేచి ఒక్కరోజైనా గడవకుండానే షరామామూలుగా ప్లేటు ఫిరాయించారు. భారత్‌పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘భారత్‌తో అమెరికాకు ‘ప్రత్యేక బంధ’ముంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది కూడా’’ అని శుక్రవారం (అమెరికా కాలమానం ప్ర కారం) వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో మీడియా భేటీ సందర్భంగా మీడియా ప్రశ్నలకు బదులుగా చెప్పుకొచ్చారు. మోదీ కూడా అందుకు అత్యంత హుందాగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షుని తాలూకు ఈ మారిన వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత–అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్‌లో ప్రధాని పోస్టు పెట్టారు. భారత్, అమెరికాలది అత్యంత సానుకూల, ప్రగతి శీల, సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వా మ్యం అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. జూన్ 17 నాటి ఫోన్ సంభాషణల అనంతరం ట్రంప్, మోదీ పరస్పరం స్పందించడం ఇదే తొలిసారి. ప్రతీకార సుంకాల కారణంగా దిగజారిన ద్వైపాక్షిక బంధాల పునరుద్ధరణకు అమెరికా, భారత్ సంసిద్ధతకు ఇది నిదర్శనమని పరిశీలకులు భావిస్తున్నారు. నిమిషానికో మాట... భారత్, రష్యాలను దుష్ట చైనాకు కోల్పోయామంటూ సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ట్రూత్‌సోషల్’లో ట్రంప్ ఘాటుగా పోస్టు పెట్టడం తెలిసిందే. ఆ మూడింటి దోస్తీ సుదీర్ఘంగా వర్ధిల్లాలంటూ వ్యంగ్యోక్తులు కూడా విసిరారు. ‘యుద్ధమా, శాంతా అమెరికాయే తేల్చుకోవా’లన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలకు స్పందనగా ట్రంప్ పెట్టిన ఆ పోస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆయన ఒంటెత్తు పోకడల కారణంగా అమెరికాతో భారత సంబంధాలు గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా దిగజారిపోవడం తెలిసిందే. వాటిని పూర్తిస్థాయిలో చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ ట్రంప్‌ను విలేకరులు ప్రశ్నించారు. అందుకాయన రకరకాలుగా స్పందించారు. ‘‘ఇరుదేశాల సంబంధాల విషయంలో ఆందోళన పడాల్సిందేమీ లేదు. ఏదో, అప్పుడప్పుడూ అలా జరుగుతూ ఉంటుంది’ అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. ‘‘మోదీతో నేను చాలా చనువుగా ఉంటా తెలుసా! ఆయన చాలా గొప్ప వ్యక్తి. రెండు నెలల క్రితమే అమెరికాలో పర్యటించారు కదా!’’ అంటూ ప్రధానిపై మరోసారి పొగడ్తలు కురిపించారు. ‘‘ఆ సందర్భంగా మేమిద్దరం కలిసి రోజ్ గార్డెన్లో వ్యాహ్యాళికి వెళ్లాం. అక్కడి గడ్డి చెప్పలేనంత తడిగా ఉంది. మీడియా కాన్ఫరెన్స్‌కు అస్సలు సరైన ప్రదేశం కాదది. అలాంటి చోట ప్రెస్‌మీట్ పెట్టడం నాకదే చివరిసారి’’ అని చెప్పుకున్నారు. అంతలోకే, ‘మోదీ ప్రస్తుతం చేస్తున్న పనే నాకస్సలు నచ్చడం లేదు’ అంటూ రష్యా, చైనాలతో భారత మైత్రిపై తన ఆగ్రహాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘అయినా సరే, భారత్‌తో అమెరికాకు అత్యంత ప్రత్యేక బంధముంది’ అంటూ చిరునవ్వులు చిందించారు. ‘‘అంతలోకే, రష్యా నుంచి భారత్ అంతంత భారీగా చమురు కొనేస్తుండటం నాకస్సలు నచ్చడం లేదు. ఇది నన్నెంతో నిరాశకు గురి చేస్తోంది’’ అంటూ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. ‘‘ఈ విషయం వాళ్లు తెలుసుకోవాలి. అందుకేగా భారత్‌పై అతి భారీగా 50 శాతం సుంకాలు విధించా!’’ అని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే మోదీపై మళ్లీ ప్రశంసలు కురిపించారు. భారత్‌ను చైనాకు కోల్పోయామంటూ మీరు చేసిన పోస్టు నిజమేనా అని మీడియా ప్రశ్నించగా, అలా జరిగిందని తాను అనుకోవడం లేదని ట్రంప్ చెప్పడం విశేషం!వాణిజ్య చర్చలు సూపర్ భారత్‌తో వాణిజ్య చర్చలు అద్భుతంగా సాగుతున్నాయని మీడియా ప్రశ్నకు బదులుగా ట్రంప్ చెప్పారు. ‘‘అన్ని దేశాలతోనూ చర్చలు బాగా జరుగుతున్నాయి. కాకపోతే గూగుల్ తదితర అతి పెద్ద అమెరికా టెక్ దిగ్గజాల పట్ల యూరోపియన్ యూనియన్ వైఖరి విషయంలోనే బాగా నిరాశకు లోనయ్యాం’’ అని బదులిచ్చారు.మళ్లీ నవరో నోటిదురుసు! భారత్ పట్ల విద్వేషానికి పెట్టింది పేరుగా మారిన ట్రంప్ సలహా బృందం సీనియర్ సభ్యుడు పీటర్ నవరో మరోసారి నోరు పారేసుకున్నారు. రష్యా నుంచి భారత్ కొంటున్న చమురు ద్వారా సమకూరుతున్న ఆర్థిక వనరులే ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఆదరువుగా మారాయంటూ మరోసారి ప్రేలాపనలకు దిగారు. -
10న రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రధాని భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ముఖ్యనేతలతో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం కానున్నారు. తెలంగాణలో బీజేపీ ‘యాక్షన్ ప్లాన్’ను ఖరారు చేసేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఈ భేటీకి ముందే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు శని, ఆదివారాల్లో నడ్డా ఆధ్వర్యంలో రాష్ట్ర ఎంపీలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ వరుస భేటీలతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు. అధికార సాధనే లక్ష్యంగా వ్యూహరచనగత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లకే పరిమితమైనా.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సమానంగా 8 సీట్లు గెలుచుకోవడం, అనంతరం 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండింటిని గెలుచుకోవడంతో రాష్ట్రంలో పార్టీకి ఆదరణ పెరుగుతోందని బీజేపీ అగ్ర నాయకత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో కచ్చితమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ ప్రస్తుత పరిస్థితులు, కార్యవర్గ కూర్పుపై సందిగ్ధత, అసంతృప్తులు, సమన్వయ లేమి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది.కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వమే సీబీఐ విచారణ కోరటంతో దీనిని అవకాశంగా మార్చుకోవాలని ఇప్పటికే ముఖ్య నేతలు ఉద్బోధ చేసినట్టు సమాచారం. అంతర్గత, బహిర్గత సమస్యలతో బీఆర్ఎస్ బలహీనపడటంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ఇదే మంచి తరుణమని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించాలని రాష్ట్ర పార్టీకి నాయకత్వం నిర్దేశించినట్టు సమాచారం.ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీలో చేరగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి మరింత మందిని చేర్చుకునే పనిని వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెడుతున్నట్లు సమాచారం. మరోవైపు స్థానిక ఎన్నికల్లో పార్టీ పరంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లను అధిక సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు, కార్యకర్తలను పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. -
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. అంతకు ముందు.. భారత్, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్‌తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్‌తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్‌స్టాప్ పడినట్లయ్యింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025 -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్‌కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్‌తో ఈ ఏడాది సెషన్ జరగనుంది. ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది. జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్‌లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్‌లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్‌పింగ్‌తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్‌తో బంధం ప్రత్యేకమైందన్నారు.అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్‌లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. -
టికెట్ ధరలపై జీఎస్టీ.. ప్రధానికి నాగ్ అశ్విన్ విజ్ఞప్తి
కొత్త జీఎస్టీ సంస్కరణల వల్ల చిత్రపరిశ్రమలో కూడా కొంత ఉపశమనం లభించింది. అయితే, ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్ సోషల్‌మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కాస్త మార్పులు చేస్తే చాలామందికి లాభం చేకూరుతుందన్నారు.కొత్త జీఎస్టీ మార్పుల ప్రకారం రూ. 100 లోపు టికెట్లను కొనుగోలు చేసే వారిపై 5 శాతం జీఎస్టీ పడుతుంది. గతంలో 12 శాతం ఉండేది. అయితే, రూ. 100 మించి టికెట్ ధర ఉంటే రూ. 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఇదే విషయంలో ప్రధానిని నాగ్ అశ్విన్ విజ్ఞప్తి చెశారు. ప్రస్తుతం చాలా తక్కువ థియేటర్లలో మాత్రమే రూ.100 లోపు ధరలతో టికెట్లు విక్రయిస్తున్నారని దీంతో ఎక్కువ మందికి లాభాదాయకంగా ఉండదన్నారు. 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌ని కేవలం రూ.100 లోపు టికెట్లకే కాకుండా.. రూ.250 వరకూ పొడిగిస్తే బాగుంటుందని ఆయన కోరారు. -
మోదీ గొప్పే.. కానీ పనులే నచ్చడం లేదు: ట్రంప్
భారత్‌తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్ గత వ్యాఖ్యలను తిరస్కరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్‌తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్ అన్నారు. భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్‌పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్‌పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్‌లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకోవైపు.. అమెరికా వైట్‌హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది. -
డేంజరస్ చైనాతో.. దోస్తీయా?
చైనాకు రష్యా, భారత్ సన్నిహితం కావటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భగ్గుమంటున్నారు. దుష్ట చైనాతో చేతులు కలుపుతారా? అంటూ రుసరుసలాడుతున్నారు. చైనా అంధకారంలోకి మీరూ పడిపోతున్నారంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి ఉన్న ఫొటోను సోషల్‌మీడియాలో షేర్చేస్తూ అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు అమెరికాకు దీటుగా చైనా తన సైనిక, ఆయుధ శక్తిని ప్రదర్శిస్తుంటే.. ఉక్రెయిన్‌లోకి ఏ ఇతర దేశం బలగాలు వచ్చినా దాడి చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు.న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులు.. ధీటుగా చైనా, రష్యా సవాళ్లతో ప్రపంచం ఉద్రిక్తంగా మారుతోంది. మధ్యేమార్గం అనేది మాయమై.. ప్రపంచం రెండు ముక్కలుగా చీలుతోంది. అమెరికా బెదిరింపులకు గురైనవారిని తాను కాపాడుతాను అన్నట్లుగా చైనా తన సైనిక బలాన్ని ప్రదర్శించటంతో రెండు ప్రపంచ మహాశక్తులు యుద్ధానికి ఎదురెదురుగా నిలబడినట్లయ్యింది.ఈ అసాధారణ పరిణామానికి ఈసారి భారత్ కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చైనాలో నిర్వహించిన షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీఓ) సమావేశంలో కనిపించిన ఒకే ఒక్క దృశ్యం ఇప్పుడు ప్రపంచ దృక్పథాన్ని మార్చివేస్తోంది. ట్రంప్ నిష్టూరాలు ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాను లొంగదీసుకునేందుకు భారత్‌ను వాడుకోవాలని భంగపడి.. సుంకాల పేరుతో బెదిరింపులకు దిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఎస్సీఓ సమావేశంపై భయపడుతూనే నిషూ్టరాలు ఆడారు. ఆ సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుతూ మాట్లాడుకుంటున్న ఫొటోను తన సొంత సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో షేర్ చేస్తూ భారత్, రష్యాను తాము కోల్పోయామని రాసుకొచ్చారు.‘చూడబోతే మేము అంధకార అగాధమైన చైనాకు భారత్, రష్యాలను కోల్పోయినట్లు కనిపిస్తోంది. వారి భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా’అని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. దుష్ట చైనాతో చేతులు కలిపితే అంధకారంలోకి వెళ్లినట్లేనని భావాత్మకంగా చెప్పారు. అదే సమయంలో తన దారికి తెచ్చుకోవాలనుకున్న రష్యా, భారత్‌లు తన ప్రత్యర్థి అయిన చైనా వైపు వెళ్లిపోయాయన్న భయం కూడా ఆయన మాటల్లో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధమా? శాంతా? ప్రపంచంపై అమెరికా ఆధిపత్యానికి ముగింపు పలికే సుముహూర్తం ఇదేనని చైనా భావిస్తోంది. ఈ నెల 3న ఆ దేశం విక్టరీ పరేడ్‌లో చేసిన బలప్రదర్శన ప్రపంచానికి ఈ అంశంలో స్పష్టమైన సందేశం ఇచ్చింది. అమెరికా పేరు ప్రస్తావించకుండానే ‘శాంతియా? యుద్ధమా?’తేల్చుకోవాలని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ స్పష్టమైన హెచ్చరిక జారీచేశారు. ఆ సమావేశానికి అమెరికా ఆగర్భ శత్రువులైన ఉత్తరకొరియా, ఇరాన్ దేశాల అధినేతలు కూడా హాజరయ్యారు. అమెరికా బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాపాడేందుకు తాను ఉన్నానన్న భావన జిన్‌పింగ్ ప్రకటనలో కనిపించిందని నిపుణులు పేర్కొంటున్నారు.జిన్‌పింగ్ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలాంటి ప్రకటనే చేశారు. ఉక్రెయిన్‌తో ఏ దేశం తన బలగాలను మోహరించినా వాటిపై దాడులు చేస్తామని శుక్రవారం హెచ్చరిక జారీచేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం యూరోపియన్ దేశాధినేతలతో సమావేశమై సైనిక మద్దతు కోరిన నేపథ్యంలో పుతిన్ ప్రకటన సంచలనంగా మారింది.ఎందుకంటే అమెరికాతోపాటు దాదాపు యూరప్ దేశాలన్నీ నాటోలో భాగస్వాములుగా ఉన్నాయి. ఒకవేళ నాటో బలగాలు ఉక్రెయిన్‌లోని అడుగుపెడితే.. వాటితో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమని పుతిన్ తేల్చి చెప్పారు. దీంతో ప్రాంతీయ ఘర్షణలన్నీ కలిసి నిర్ణయాత్మక ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? అన్న ఆందోళన ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. భారతే కీలకం దశాబ్దాలుగా మధ్యేవాద విధానంతో ప్రపంచ ప్రధాన శక్తులన్నింటితో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తున్న భారత్.. ప్రస్తుతం ఎటో ఒకవైపు మొగ్గాల్సిన సంకట స్థితిలో పడింది. తన ప్రమేయం లేకుండానే అమెరికా– చైనా శక్తుల మధ్య కేంద్ర బింధువుగా, బాధితురాలిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. భారత్ జోక్యం చేసుకుంటేనే రష్యా– ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే వాదిస్తున్నారు. అందుకు భారత్ స్పందించకపోవటంతో భారత వస్తువులపై 50 శాతం ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అనివార్యంగానే మనదేశం.. చైనా, రష్యాకు మరింత దగ్గర కావాల్సి వస్తోందనే అంచనాలు వినిపిస్తున్నాయి.ఇప్పుడు అమెరికాను దెబ్బకొట్టాలంటే చైనా, రష్యాలకు కూడా భారతే కీలకంగా మారింది. ఎస్సీఓ సమావేశానికి 10 సభ్య దేశాధినేతలు, మరికొన్ని ఆహా్వనిత దేశాల నేతలు విచ్చేసినా.. అందరి దృష్టి భారత ప్రధాని నరేంద్రమోదీపైనే కేంద్రీకృతమైంది. ఈ సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై సొంత దేశంలో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. భారత్‌ను అనవసరంగా దూరం చేసుకున్నామన్న బాధ ఆ విమర్శల్లో కనిపిస్తోంది.అయితే, చైనాతో భారత సంబంధాలు తక్షణం గొప్పస్థాయికి వెళ్తాయన్న నమ్మకం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. సరిహద్దు సమస్యే భారత్–చైనా దైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాన అడ్డంకి అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ జనరల్ అనిల్ చౌహాన్ మాటలను గుర్తుచేస్తున్నారు. -
ఈసారి ఆ ముగ్గురి ఫోటో.. ట్రంప్‌లో వణుకు మొదలైంది..!
డొనాల్డ్ ట్రంప్.. నిన్న, మొన్నటి వరకూ ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. సుంకాల విధింపుతో పలు దేశాలకు నిద్ర లేకుండా చేసిన ట్రంప్‌కు ఇప్పుడు నిద్ర కరువైనట్లుంది. చైనా వేదికగా జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సదస్సు తర్వాత ట్రంప్ నోటి మాటలు కచ్చితంగా రావడం లేదు.. వెన్నులో వణుకు పుట్టిన మనిషి ఎలా బాధ పడతాడో అలా వ్యవహరిస్తున్నారు ట్రంప్.చైనా, భారత్, రష్యాల మైత్రిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే.. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగవచ్చు అంటూనే, తాము భారత్, రష్యాలను కోల్పోయామన్నారు. అదే సమయంలో కుట్ర పూరిత చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం విచారకమరన్నారు. తమతో దాదాపు ఆ రెండు దేశాల సత్సంబంధాలు తెగిపోయినట్లేనని మరొకవైపు విచారం వ్యక్తం చేశారు. చైనా వేదికగా జరిగిన షాంఘై సదస్సు, ఆ దేశం నిర్వహించిన అతిపెద్ద.. శక్తివంతమైన సైనిక పరేడ్పైనే ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. చైనా సైనిక పరేడ్‌కు పుతిన్‌తో పాటు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ హాజరు కావడం కూడా ట్రంప్ నోటిలో ఎలక్కాయ పడ్టట్లు అయ్యింది. నోటి మాట రాక, తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’ వేదికగా వరుస పోస్ట్‌లు పెడుతున్నారు ట్రంప్. ముందుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఫోటోలు పెట్టి.. తన అసహనం వ్యక్తం చేసిన ట్రంప్.. మళ్లీ గంటల వ్యవధిలోనే చైనా అధ్యక్షుడు, భారత్ ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షులతో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా సైట్లో పెట్టి మూడు దేశాల మైత్రిపై స్పందించారు. ఆ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగుతుందంటూనే ఎక్కడో తెలియని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక భారత్, రష్యాలు తమతో లేవనే బాధను కక్కలేక మింగలేక అన్న చందంగా పంచుకున్నారు. ట్రంప్‌పై వ్యతిరేక స్వరంఇక అమెరికాలో ట్రంప్‌పై వ్యతిరేక స్వరం ఎక్కువైంది. ట్రంప్ వ్యతిరేక వర్గం ప్రత్యేకంగా ఆయన చర్యలను తప్పుబడుతోంది. చైనాతో భారత్, రష్యాలు జట్టు కట్టడం కచ్చితంగా ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకు పుట్టిస్తుందంటూ ఆ దేశ రాజకీయ విశ్లేషకుడు వేన్ జోన్స్ అభిప్రాయపడ్డారు. చైనాలో జరిగిన షాంఘై సదస్సు మూడు దేశాల(చైనా, రష్యా, భారత్)ల మధ్య జరిగిన చారిత్రాత్మక సదస్సుగా అభివర్ణించారు. ‘ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మూడు దేశాలు భారీ ఒప్పందాల దిశగా అడుగులు వేశాయి. మోదీ, పుతిన్, జిన్‌పింగ్ కలిసి దిగిన ఫోటోలే అందుకు నిదర్శనం. ఇక్కడ ఇరాన్, నార్త్ కొరియాలు కూడా కలిశాయి. ఇది ప్రతీ అమెరికన్‌కు వెన్నులో వణుకుపుట్టించే అంశం’ అంటూ ట్రంప్ పరిపాలనపై పరోక్షంగా సెటైర్లు వేశారు వేన్ జోన్స్ట్రంప్లో అది పశ్చాత్తాపమేనా?ఈసారి జరిగిన షాంషై సదస్సు ప్రతీ అమెరికన్ వెన్నులో వణుకే పుట్టించేది అన్న వేన్ జోన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ ట్రంప్ పదే పదే పోస్టులు పెట్టడం ఇప్పుడు ఆయనకు వెన్నులో వణుకు మొదలైందనడానికి సంకేతంగా చెప్పొచ్చు. అటు భారత్‌పై కాలు దువ్వి, ఇటు రష్యాపై కూడా నువ్వెంత అన్నట్లుగా వ్యవహరించిన ట్రంప్.. ఇప్పుడు తాను చేసిన తప్పుకు కాస్త పశ్చాత్తాపడుతున్నట్లే ఉన్నారు. తాము లేకపోతే ప్రపంచమే లేదు అన్నట్లు వ్యవహరించిన ట్రంప్‌కు చైనా, భారత్, రష్యాలు గట్టి షాక్ ఇవ్వడంతో ‘ వాట్ నెక్స్ట్’ అనే ఆలోచనలో పడ్డారాయన. అద్భుతమంటూనే సెటైర్ వేసిన ట్రంప్! -
మోదీ సర్కార్ మెగా డిఫెన్స్ ప్లాన్ రెడీ
ఢిల్లీ: మోదీ సర్కార్ 15 ఏళ్ల ప్రణాళికను ఆవిష్కరించింది. సైనిక దళాల ఆధునికీకరణకు భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెగా డిఫెన్స్ ప్లాన్ రూపొందించింది. న్యూక్లియర్ వార్ షిప్స్, హైపర్ సోనిక్ మిస్సైల్స్, లేజర్, రోబోటిక్స్, ఏఐ ఆయుధాలతో భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. నౌక దళం కోసం సరికొత్త ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం మోదీ ప్రభుత్వం అతిపెద్ద రక్షణ అభివృద్ధి ప్రణాళికను ప్రకటించింది. దీని ద్వారా భారత సాయుధ దళాలను బిలియన్ల డాలర్ల పెట్టుబడితో అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించనున్నారు. ఈ రోడ్ మ్యాప్ ప్రకారం, భారత్ తన ఆయుధాగారంలోకి అణుశక్తితో నడిచే యుద్ధ నౌకలు, నెక్ట్స్ జనరేషన్ యుద్ధ ట్యాంకులు, హైపర్సోనిక్ క్షిపణులు, స్టెల్త్ బాంబర్ డ్రోన్లు, AI- ఆధారిత ఆయుధాలు, అంతరిక్ష ఆధారిత యుద్ధ సాంకేతికతను చేర్చనుంది.భారత సైన్యం.. టి-72 యుద్ధ ట్యాంకులకు బదులుగా దాదాపు 1,800 అత్యాధునిక ట్యాంకులను, పర్వత ప్రాంత యుద్ధం కోసం 400 తేలికపాటి ట్యాంకులను, 50,000 ట్యాంకులకు అమర్చే యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులను, 700 రోబోటిక్ కౌంటర్-IED వ్యవస్థలను చేర్చుకోనుంది.నౌకా దళం ఒక కొత్త విమాన వాహక నౌక, 10 అధునాతన యుద్ధ నౌకలు, 7 ఆధునిక కార్వెట్లు, 4 ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫారమ్‌లను పొందనుంది. యుద్ధ నౌకల కోసం అణు చోదక వ్యవస్థ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టమ్‌లకు కూడా ఆమోదం లభించింది. -
ట్రంప్, మోదీ బంధం.. ఇది అందరికీ గుణపాఠం: బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్‌నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్‌నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్‌తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్‌ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్‌కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్‌బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. -
భారత్, ఈయూ నిర్ణయం.. డిసెంబర్‌కల్లా స్వేచ్ఛా వాణిజ్యం!
న్యూఢిల్లీ: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న స్వే చ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని(ఎఫ్‌టీఏ) ఈ ఏడాది డిసెంబర్‌కల్లా కుదుర్చుకోవాలని, అందుకోసం చర్చలను త్వరగా ముగించాలని భారత్, యూరోపియన్ యూనియన్(ఈయూ) నిర్ణయించుకున్నా యి. ప్రధాని మోదీ గురువారం 27 దేశాల ఈయూ కూటమి ముఖ్యనేతలు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో ఫోన్లో మాట్లాడారు.అమెరికా భారీ టారిఫ్‌ల నేపథ్యంలో నిబంధనల ఆధారిత ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమస్యల పరిష్కారంలో భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం పాత్ర కీలకమని మోదీ, ఆంటోనియో కోస్టా, ఉర్సు లా వాన్ డెర్ లెయన్ నిర్ణయానికొచ్చారు. త్వరలో ఇండియాలో జరుగను న్న ఇండియా– ఈయూ సదస్సు గురించి ముగ్గురు నేతలు చర్చించుకున్నారు. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆంటోనియో కోస్టా, ఉర్సులాను మోదీ ఆహ్వానించారు. -
భారత్–సింగపూర్ మధ్య సుదృఢ బంధం
న్యూఢిల్లీ: సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు తీర్మానించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ గురువారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. భారత్–సింగపూర్ మధ్య దౌత్యానికి మించిన గొప్ప అనుబంధం ఉన్నట్లు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్‌తోపాటు ఇతర డిజిటల్ టెక్నాలజీల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడాలి మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై సింగపూర్‌తో కలిసి పోరాడుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. లారెన్స్ వాంగ్‌తో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాలు ఉగ్రవాదం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడడం మానవత్వాన్ని విశ్వసించే అన్ని దేశాల బాధ్యత అని స్పష్టంచేశారు. భారత్–సింగపూర్ సంబంధాలకు కలిసి పంచుకుంటున్న విలువలు, ప్రయోజనాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. శాంతి, సౌభాగ్యాలే రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్–సింగపూర్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని లారెన్స్ వాంగ్ స్పష్టంచేశారు. మోదీ, వాంగ్ భేటీ నేపథ్యంలో ఇరుదేశాల నడుమ పలు అవగాహనా ఒప్పందాలపై(ఎంఓయూ) సంతకాలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య డిజిటల్ అస్సెట్ ఇన్నోవేషన్ ఒప్పందం కుదిరింది. అలాగే గ్రీన్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు కలిసికట్టుగా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్(జీడీఎస్సీ)ను ఏర్పాటు చేయబోతున్నాయి. జేఎన్‌పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశ ప్రారంభం భారత, సింగపూర్ ప్రధానమంత్రులు మోదీ, లారెన్స్ వాంగ్ గురువారం ముంబైలో జేఎన్‌పోర్ట్ పీఎస్ఏ టెర్మినల్ రెండో దశను వర్చువల్‌గా ప్రారంభించారు. దీనివల్ల ఈ టెర్మినల్ కంటైనర్ హ్యాండ్లింగ్ సామర్థ్యం 4.8 మిలియన్ టీఈయూలకు పెరగనుంది. -
అన్నీ మంచి శకునములే...
భారతదేశంపై సుంకాలను అమెరికా అధ్యక్షుడు 50 శాతానికి పెంచిన ఐదు రోజులకు జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశాల నుంచి దేశానికి అన్నీ మంచి శకునాలే లభించాయి. చైనా, రష్యాలతో సంబంధాలు మరింత బలో పేతమయ్యాయి. ఈ కొత్త స్థితి వెంటనే అమెరికన్ అధ్యక్షుడు ట్రంప్, ఆయన వాణిజ్య సలహాదారు పీటర్ నవారోలు,ఇండియాపై చేసిన అనుచితమైన వ్యాఖ్య లలో ప్రతిఫలించింది. ప్రధాని మోదీ తమపై కొంత అలిగినా తిరిగి వైఖరి మార్చుకోగలరని వారు చివరి వరకూ ఆశించారు. ఆయనకు తాము తప్ప గత్యంతరం లేదనుకున్నారు. కానీ, మోదీ వైఖరి మరింత దృఢంగా మారినట్లు తియాన్జిన్లో అడుగడుగునా కనిపించింది.అర్థాలు–అంతరార్థాలుఈ సందర్భంగా మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలేమిటో యథాతథంగా చూడటం అవసరం. జిన్‌పింగ్‌తో సమావేశం అనంతరం మోదీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తూ, రెండు దేశాలూ అభివృద్ధిలో భాగస్వా ములే తప్ప ప్రత్యర్థులు కాదనీ, భిన్నాభిప్రాయాలు వివాదాలుగా మారరాదనీ భావించినట్లు పేర్కొన్నది. పరస్పర గౌరవం, ఉభయుల ప్రయోజనాలు, ఇరువురి సున్నితమైన మనోభావాల గుర్తింపు అవసర మన్నది. ఇటువంటి అవగాహనలు 21వ శతాబ్దపు ధోరణులకు అను గుణంగా బహుళ ధ్రువ ప్రపంచంతోపాటు బహుళ ధ్రువ ఆసియా రూపు తీసుకునేందుకు ఆవశ్యకమని పేర్కొన్నది. చైనాతో సంబంధాల మెరుగుదల నిరుటి కజాన్–బ్రిక్స్ సమావేశాల నుంచే మొద లైందని పలుమార్లు గుర్తు చేస్తున్న మోదీ, ఇపుడు రెండు దేశాల మధ్య ‘శాంతి, సుస్థిరతల వాతావరణం ఏర్పడింద’న్నారు. జిన్‌పింగ్ మాటలను కూడా కొంత చెప్పుకొన్న తర్వాత ఇరువురి అభిప్రాయాల అర్థాలు, అంతరార్థాలు చూద్దాము: రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన 80 సంవత్సరాల తర్వాత కూడా ప్రచ్ఛన్న యుద్ధ కాలపు మనస్తత్వం, ఆధిపత్య ధోరణి, ప్రొటెక్షనిజం కొనసాగుతున్నాయి. కొద్ది దేశాల అంతర్గత విధానాలను ఇతరులపై రుద్దకూడదు. అంతర్జాతీయ నియమ నిబంధనలన్నవి పరీక్షాత్మక దశకు చేరుకున్నాయి. సమ్మిళితమైన ఆర్థిక ప్రపంచీకరణ అవసరం. భారతదేశం, చైనాలు పరస్పర విశ్వాసాన్ని బలపరచుకుని, పరస్పర అభివృద్ధికి అవకాశాలను పెంచుకోవాలి. వ్యూహాత్మకమైన, దీర్ఘ కాలిక దృక్కోణంతో వ్యవహరించాలి. నాయకులిద్దరూ చెప్పినవి ఇంకా ఉన్నాయిగానీ, అన్నీ ఈ ప్రధా నమైన మాటల చుట్టూ తిరిగేవే. సరిహద్దు వివాదాన్ని, పాకిస్తాన్ అంశాన్ని ప్రధానంగా ముందుకు తెచ్చుకుని అభివృద్ధి సహకార అవకాశాలను విస్మరించవద్దన్నది మొదటి అంతరార్థం. ఇరువురి సున్నిత మనోభావాలన్నది ఇందుకు సంబంధించినదే గాక, ఆసియాతో పాటు ప్రపంచంలోనూ ఒక శక్తిగా ఎదగజూస్తున్న ఇండి యాకు ఆటంకాలు కల్పించరాదనే అర్థం వస్తుంది. ఇక్కడ, బహుళ ధ్రువ ప్రపంచం అన్నమాటతో పాటు, బహుళ ధ్రువ ఆసియా అనే మాటను కొత్తగా ఉపయోగంలోకి తేవటం గమనించదగ్గది. అనగా, చైనాయేగాక ఇండియా కూడా ఒక ధ్రువమనేది గుర్తించటమన్న మాట. 21వ శతాబ్దపు ధోరణులలోకి అది కూడా వస్తుంది. సుంకాలకు ముందు నుంచే...చైనాతో సంబంధాల మెరుగుదల కజాన్ నుంచే మొదలైన మాట నిజమే అయినా ఆ విషయాన్ని మోదీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు? కేవలం ట్రంప్ సుంకాలు అందుకు కారణమని అమెరికాలో, బయటా జరుగుతున్న ప్రచారం నిజం కాదనీ, భారత దేశం తన ప్రయోజనాల కోసం స్వతంత్ర నిర్ణయాలు గతం నుంచే తీసుకుంటున్నదనీ ప్రకటించేందుకు!చైనా అధ్యక్షుని ఉద్దేశం... రెండు దేశాల మధ్య సరిహద్దుల వంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, అందుకు పరిష్కార ప్రయ త్నాలు జరుగుతున్నందున, అందుకు బందీ కాకుండా, పరస్పర అభివృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టాలని! అందుకు అనుగుణంగా తాము భారతదేశంతో కలిసి పనిచేయగలమనటం! ఆయన ఉప యోగించిన డ్రాగన్, ఏనుగు కలిసి నాట్యం చేయటమనే మాటలో ఈ అంతరార్థాలన్నీ కనిపిస్తాయి. మారుతున్న పరిస్థితులు, అందు వల్ల రెండు దేశాలకు కలుగుతున్న సమస్యలు, వాటి నుంచి బయట పడేందుకుగానీ, భవిష్యత్తులో అభివృద్ధి కోసం గానీ అవసరమైన వేమిటో రెండు దేశాల నాయకులకు స్పష్టమైన అవగాహన ఏర్పడి నట్లు కనిపిస్తున్నది. రెండు దేశాల మధ్య చాలా కాలంగా నిలిచి పోయిన ఒప్పందాలు ఒక్కటొక్కటిగా ఇప్పటికే జరుగుతుండటం తెలిసిందే.స్పష్టమైన సందేశంరష్యా విషయానికి వస్తే, ప్రధాని మోదీ రష్యా అధ్యక్షునితో జరిపిన సమావేశం, అనూహ్యంగా ఆయన కారులో ప్రయాణించటం, హోటల్‌కు చేరిన తర్వాత కూడా కారులోనే ఉండి ముప్పావు గంట సేపు చర్చించి ఆ ఫొటోను పోస్ట్ చేయటం, బయట కూడా పుతిన్‌తో కలిసి వెళ్లి జిన్‌పింగ్‌తో చేసిన సంభాషణల వంటివన్నీ ఇటు భారతీయులకు, ప్రపంచ దేశాలకు, అటు అమెరికా శిబిరానికి పంపవలసిన సందేశాలనే పంపాయి. దేశ ప్రయోజనాల కోసం రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగటమే గాక, ఉభయుల మధ్యగల చిరకాలపు సాన్నిహిత్యం ఇంకా బలపడగలదని, సుంకా లకు వెరవబోమనే సంకేతాలను భారత ప్రధాని అమెరికా శిబిరానికి 50 శాతం నాటి ముందుకన్నా బలంగా పంపటం విశేషం. ఇప్పటి కైనా వివేకం కలిగితే ఆ శిబిరం చేయవలసింది తమ తీరును అన్ని విధాలా మార్చుకుని, మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా వ్యవహరించటం!షాంఘై సంస్థ నిజానికి రక్షణ, తీవ్రవాదం అంశాలకు సంబంధించినది. కానీ, మొదటిసారిగా తియాన్జిన్లో ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వ్యూహాల గురించి చర్చించటం మారుతున్న పరిస్థితులకు, పాశ్చాత్య ప్రపంచానికి బయటి దేశాల ఆందోళనలు, అవసరాలకు అద్దం పడుతున్నది. ఈ విధంగా ‘బ్రిక్స్’కు అదనంగా మరొక సంస్థ క్రమంగా బలపడుతున్నది. కజాన్‌లో వలెనే తియాన్‌జిన్‌లోనూ పాశ్చాత్య ఆధిపత్య వ్యతిరేకత, బహుళ ధ్రువ ప్రపంచ నిర్మాణం, డాలర్‌ను క్రమంగా బలహీనపరచటం, ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు, ప్రస్తుతం గల అంతర్జాతీయ వ్యవస్థలపై అమెరికా కూటమి నియంత్రణ స్థానే సంస్కరణలతో ప్రజాస్వామికీకరణ, వర్ధమాన దేశాల మధ్య అవగాహనలను, మైత్రీ సహకారాలను బలపరచుకోవటం ప్రధానాంశాలయ్యాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
దేశ ప్రగతికి ‘డబుల్ డోసు’
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లో ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. దేశ అభివృద్ధికి ఇది ‘డబుల్ డోసు’ మద్దతు అని తేల్చిచెప్పారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో పన్నుల విధానం గందరగోళం ఉండేదని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల వ్యవస్థను సంస్కరించి, సరళీకృతం చేశామని పేర్కొన్నారు. జీఎస్టీలో తాజా సంస్కరణలను ప్రసార మాధ్యమాలు ‘జీఎస్టీ 2.0’గా అభివరి్ణస్తున్నాయని తెలిపారు. తాజా మార్పులతో రెండు విధాలుగా లబ్ధి కలుగుతుందని వివరించారు. సాధారణ ప్రజలకు డబ్బు ఆదా కావడంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని.. అందుకే ఇది డబుల్ డోసు అని స్పష్టంచేశారు. గురువారం ఢిల్లీలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన విజేతలతో మోదీ మాట్లాడారు. జీఎస్టీలో సంస్కరణలతో సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘దేశం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకోసం తదుపరి తరం సంస్కరణలను ఆపే ప్రసక్తేలేదు. దేశ ప్రజలకు డబుల్ ధమాకా ఇస్తానని ఎర్రకోట నుంచి హామీ ఇచ్చా. సెపె్టంబర్ 22న నవరాత్రుల తొలి రోజు నుంచే ఈ ధమాకా అందుబాటులోకి రాబోతోంది. దేశ చరిత్రలో ఇదొక మైలురాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలపై అధిక పన్నులు విధించాయి. వంట గదిలో వాడుకొనే వస్తువులను, ఆఖరికి ఔషధాలను కూడా వదిలిపెట్టలేదు. అప్పటి పాలన ఇంకా కొనసాగుతూ ఉంటే రూ.100 విలువైన వస్తువు కొనుగోలుపై రూ.25 పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రజల చేతుల్లో డబ్బులు మిగిల్చి, వారి జీవితాలను మెరుగుపర్చాలన్న ధ్యేయంతో మేము పని చేస్తున్నాం. ఆన్లైన్ మనీ గేమింగ్‌ను నియంత్రించడానికి కొత్త చట్టం తీసుకొచ్చాం. ఈ విషయంలో మాపై ఒత్తిళ్లు వచ్చినా వెనక్కి తగ్గలేదు. యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని నిర్ణయించాం. గేమింగ్ అనేది చెడ్డది కాకపోయినా అదే పేరుతో జూదం ఆడడం ప్రమాదకరమే. ఆన్లైన్ గేమింగ్ సరైన రీతిలో నిర్వహిస్తే గ్లోబల్ మార్కెట్లో మన దేశమే నంబర్ వన్ అవుతుంది. మన దేశ ప్రగతి కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు స్వదేశీ ఉత్పత్తులే ఉపయోగించుకోవాలని మరోసారి కోరుతున్నా’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
Top Twitters: మోడీ తర్వాత మన ఎన్టీఆరే..!
-
ట్రంప్‌తో జస్ట్ 30 సెకన్లు.. మోదీతో మాత్రం 45 నిమిషాలు
చైనా టియాంజిన్ వేదికగా జరిగిన షాంగై సదస్సు తర్వాత.. భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు ద్వైపాక్షికంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హోటల్లో భేటీ జరిగింది కేవలం 15 నిమిషాలుకాగా, మరో 45 నిమిషాల ఇద్దరూ కారులోనే ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వాళ్లేం మాట్లాడుకున్నారనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమైంది. షాంగై సదస్సు కోసం మోదీ రెండ్రోజులపాటు చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. సదస్సు వేదికగా.. పహల్గాం ఉగ్రదాడిపై సభ్యదేశాల మద్దతును తీర్మానం రూపంలో కూడగట్టారాయన. అయితే సోమవారం సదస్సు తర్వాత.. మోదీ కోసం పుతిన్ 10 నిమిషాలు ఎదురు చూశారు. ఆపై మోదీతో కలిసి తన ప్రత్యేకమైన ఆరుస్ లిమోసిన్Aurus limousine కారులో మాట్లాడుకుంటూ ప్రయాణించారు. అమెరికాతో భారత్‌కు టారిఫ్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఈ ఇద్దరూ భేటీ కావడం, పైగా ఆ కారు చాలా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థతో కూడుకున్నది కావడంతో ఆటోమేటిక్‌గా ఏం మాట్లాడుకున్నారనే ప్రశ్న ఎదురైంది. అయితే అందులో పెద్ద రహస్యం ఏం లేదని చైనా పర్యటనలోనే ఉన్న పుతిన్ చెప్పుకొచ్చారు. ‘‘అందులో సీక్రెట్ ఏం లేదు. ఆలస్కా సదస్సులో జరిగిన పరిణామాలను ఆయనకు వివరించా’’ అని ప్రెస్మీట్లో పుతిన్ చెప్పారు. అంతేకాదు.. అలస్కా భేటీ సమయంలోనూ ఆయన ట్రంప్‌తో కారులో ప్రయాణించిన విషయంపైనా క్లారిటీ ఇచ్చారు. అలస్కా యాంకరేజ్ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత పుతిన్, ట్రంప్‌కు చెందిన లిమోసిన్ ‘ది బీస్ట్’లో భేటీ జరగాల్సిన ప్రాంతం వద్దకు ప్రయాణించారు. అయితే.. ఎయిర్పోర్ట్ నుంచి వేదిక చాలా దగ్గర. అందుకే తమ మధ్య కేవలం 30 సెకన్లపాటే మాటలు జరిగాయని.. అదీ కూడా బ్రోకెన్ ఇంగ్లీష్‌లోనే సాగిందని అన్నారు. ఆ సమయంలో.. ట్రంప్ పూర్తి ఆరోగ్యవంతంగా కనిపించడంతో తాను సంతోషం వ్యక్తం చేశానని పుతిన్ అన్నారు. మరోవైపు.. రష్యా నేషనల్ రేడియో స్టేషన్ ‘వెస్టిఎఫ్ఎమ్’ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. మోదీ-పుతిన్‌లు తమ బృందాలతో చైనాలోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. అంతకంటే ముందు.. ఆ వేదికకు చేరే క్రమంలో కారులో సుదీర్ఘంగా సంభాషించుకున్నారు అని తెలిపింది. మరోవైపు.. క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ స్పందిస్తూ.. పుతిన్-మోదీ ముఖాముఖి మాట్లాడుకున్నారు. ఆయన(పుతిన్) తమ సంభాషణ మధ్యలో ఎలాంటి అంతరాయం కలగకూడదని భావించే కారులో ప్రయాణించారు’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు నేపథ్యంతో ట్రంప్ భారత్‌పై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. భారత్ తమ దేశంపై అధిక సుంకాలు విధిస్తోందంటూ సంచలన ఆరోపణలకు దిగారాయన. ఈ పరిణామంపై పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇండియా, చైనాలాంటి దేశాలతో ఆ తీరున వ్యవహారించడం సరికాదని, భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని ట్రంప్ వైఖరిని తప్పుబట్టారు. మరోవైపు పుతిన్ డిసెంబర్లో భారత్ పర్యటనకు రానున్నారు, ఉక్రెయిన్ శాంతి చర్చలు.. కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఆగస్టు 15న తటస్థ వేదికగా అలస్కాలో ట్రంప్-పుతిన్‌ల భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది. మరోవైపు జెలెన్స్కీ-యూరప్ దేశాధినేతలతో వైట్‌హౌజ్‌లో జరిగిన చర్చలు మాత్రం సవ్యంగా సాగినట్లు సంకేతాలు అందాయి. దీంతో.. తదుపరి దశలో జరగబోయే అమెరికా-ఉక్రెయిన్-రష్యా త్రైపాక్షిక చర్చలపై ఉత్కంఠ నెలకొంది. -
అల్లు కనకరత్నమ్మ మృతికి ప్రధాని సంతాపం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ(94) మృతి చెందిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె గత శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. కనకరత్నమ్మ మృతి పట్ల ధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అల్లు కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కనకరత్నమ్మ తన కళ్లను దానం చేయడం గొప్ప విషయం అని.. ఒక జీవితానికి వెలుగునిచ్చి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ కష్ట సమయంలో అల్లు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మోదీ ఓ సందేశాన్ని పంపారు. ప్రధానమంత్రి తెలిపిస సంతాప సందేశానికి అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు.అల్లు కనకరత్నమ్మ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కోకాపేటలోని అల్లు కుటుంబ ఫామ్‌హౌస్‌లో జరిగాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, వెంకటేష్, నాగ చైతన్య, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. -
జీఎస్టీ భారీగా తగ్గింపు.. వీటి ధరలు దిగొస్తాయ్
న్యూఢిల్లీ: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవంనాడు ప్రధాని ప్రకటించిన దీపావళి కానుక దసరాకు ముందే వచ్చింది. చపాతీ, పరోటా, బ్రెడ్డు, బన్నులపై జీఎస్టీని పూర్తిగా తొలగించాలని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అధ్యక్షతన భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్య, జీవిత బీమాపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీని ఎత్తివేయనుంది. దీంతో ఆ మేరకు వాటి ప్రీమియంలు తగ్గనున్నాయి. ఇకపై జీఎస్టీలో 5, 18 శాతం పన్ను శ్లాబులే ఉంటాయి. 12 శాతం, 28 శాతం శ్లాబుల్లోని వస్తువులు 5, 18 శాతం శ్లాబుల్లోకి మారనున్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలపై ప్రత్యేక పన్ను రేటు 3 శాతం ఇక ముందూ కొనసాగనుంది. సెప్టెంబర్ 22 నుంచే (దేవీ నవరాత్రి వేడుకలు మొదలయ్యే రోజు) కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ప్రతిపాదనలకు అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ‘‘సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి. కార్మీకుల ఆధారిత రంగాలకు చక్కని మద్దతు లభిస్తుంది. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం ప్రయోజనం పొందుతాయి. ఆర్థిక వ్యవస్థలోని కీలక చోదకాలకు ప్రాధాన్యం ఇచ్చాం’’అని మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. వ్యాపార నిర్వహణ సైతం సులభతరం అవుతుందని, నిబంధనల అమలు సరళంగా మారుతుందన్నారు. తాజా పన్ను శ్లాబుల క్రమబద్దీకరణతో రూ.48,000 కోట్ల ఆదాయం తగ్గిపోనుందని, ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ నిర్ణయాలతో దేశీ వినియోగం మరింత పెరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా. మన జీడీపీలో 61.4 శాతం వినియోగం రూపంలోనే సమకూరుతుండడం గమనార్హం. జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన రెండో ఏడాదిలో జీడీపీ వృద్ధి 0.5 శాతం మేర అదనంగా నమోవుతుందని ఆర్థిక వేత్తల అంచనా. భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌లు దేశ ఆర్థిక వృద్ధిని 0.20–0.50 శాతం ప్రభావితం చేస్తాయన్న ఆందోళనలు నెలకొనగా.. జీఎస్టీ సంస్కరణలతో ఈ ప్రభావం సమసిపోనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటి ధరలు దిగొస్తాయ్.. ప్రస్తుతం బ్రాండెడ్ బ్రెడ్, బ్రెడ్ ఉత్పత్తులపై 5–18 శాతం మేర జీఎస్టీ అమల్లో ఉండగా ఇది తొలగిపోనుంది. పరాటాపై 18 శాతం, చపాతీ, యూహెచ్‌టీ పాలపై 5 శాతం రేటును ఎత్తివేయనున్నారు. నిత్యావసరాలైన టూత్‌పేస్ట్, టూత్ బ్రష్‌లు, టాల్కమ్ పౌడర్, షాంపూలు, సబ్బులు, హెయిర్ ఆయిల్, బటర్, నెయ్యి, మాంసం, బిస్కెట్లతో పాటు షుగర్ కన్ఫెక్షనరీ, జామ్, ఫ్రూట్ జెల్లీలు, డ్రై నట్స్, ఐస్‌క్రీమ్, పండ్ల రసాలు, కార్న్‌ఫ్లెక్స్ తదితర ఉత్పత్తులపై 18 శాతం జీఎస్టీ 5 శాతానికి తగ్గిపోనుంది. ఇక వంటింటి వస్తువులు, గొడుగులు, సైకిళ్లు, వెదురు ఫర్నీచర్ వస్తువులు, ఫీడింగ్ బాటిళ్లు, టూత్ పౌడర్‌పై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి దిగిరానుంది. ఇంటి నిర్మాణంలోకి వినియోగించే సిమెంట్‌పైనా పన్ను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుంది. 350 సీసీ ఇంజన్ సామర్థ్యం వరకు ఉన్న ద్విచక్ర మోటారు వాహనాలు, ఏసీలు, డిష్వాషర్లు, టీవీలు (32 అంగుళాలకు పైన) తదితర ఎలక్ట్రానిక్స్ వస్తువులపైనా ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి దిగిరానుంది. ప1,200 సీసీ, 4,000 ఎంఎం పొడవు మించని పెట్రోల్, ఎల్పీజీ, సీఎన్జీ వాహనాలు, 1,500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాలపైనా పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. 1,200 సీసీ నుంచి 4,000 ఎంఎం కంటే పొడవైన మోటారు వాహనాలు, 350సీసీకి పైన ద్విచక్ర వాహనాలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు (వ్యక్తిగత వినియోగానికి), రేసింగ్కార్లు, క్యాసినోలు/గ్యాంబ్లింగ్/గుర్రపు పందేలు/లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమలవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలపై ఎప్పటి మాదిరే 5 శాతం పన్ను కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతానికి 28 శాతం సిగరెట్లు, గుట్కాలు, పాన్ మసాలా, జర్దా తదితర పొగాకు ఉత్పత్తులపైనా 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించారు. అయినప్పటికీ ప్రస్తుతానికి వీటిపై 28 శాతం జీఎస్టీ, దీనిపై కాంపన్సేషన్ సెస్సును కొనసాగించనున్నారు. రాష్ట్రాలకు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు తీసుకున్న రుణాలను తిరిగి పూర్తిగా చెల్లించేంత వరకు ఇది కొనసాగుతుందని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. ఆ తర్వాత వీటిపైనా 40 శాతం పన్ను రేటు అమలు కానుంది. ఇది ఎప్పటి నుంచి అన్నది జీఎస్టీ మండలి తర్వాత నిర్ణయిస్తుంది. పౌరుల జీవనం మెరుగుపడుతుంది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్టీ సంస్కరణలకు జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు సామాన్యులకు, రైతులు, ఎంఎస్‌ంఎఈలు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయి. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయి. వ్యాపార నిర్వహణ అన్నది, ముఖ్యంగా చిన్న వర్తకులు, వ్యాపారులకు సులభతరం అవుతుంది’’ – ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రధాని మోదీ స్పందన -
జిన్‌పింగ్ కుడి భుజం కైక్వీతో మోదీ చర్చలు.. ‘నవ్వని వ్యక్తి’తో నెగ్గుకొచ్చారా?
బీజింగ్: కైక్వీ.. కమ్యూనిస్ట్ చైనాలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కుడిభుజంగా పేరొందిన కైక్వీ అంటే అపరచాణిక్యుడనే పేరు. అటు చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీపీ)లో అగ్రగణ్యునిగా కొనసాగుతూనే ఇటు ప్రభుత్వంలోనూ కీలక పదవుల్లో అవలీలగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిన్‌పింగ్‌కు తల్లో నాలుకలా వ్యవహరిస్తూ జాతీయ, అంతర్జాతీయ వ్యవహరాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పుడూ సీరియస్‌గా కనిపిస్తారు. ఆయన నవ్వడం ఎవరూ చూడలేదని చైనా రాజకీయవర్గాల్లో ఓ మాట వినిపిస్తుంది.విదేశాల నుంచి జిన్‌పింగ్‌ను కలిసేందుకు ఎందరో దౌత్యాధికారులు వచ్చినా తర్వాత కైక్వీని కలిసి ప్రసన్నంచేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆయన ఎవరినీ కలవరు. ఇటీవల షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర భేటీ కోసం తియాంజిన్ తీరనగరానికి విచ్చేసిన ఎస్సీఓ అగ్రనేతలు, దౌత్యవేత్తలు తనను కలవాలని చూసినా కైక్వీ ససేమిరా అన్నారట. అలాంటి కైక్వీ ప్రత్యేకంగా భారత ప్రధాని మోదీతో 45 నిమిషాలకుపైగా విడిగా మాట్లాడిన వార్త ఇప్పుడు చైనా వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.చైనాలో జిన్‌పింగ్ శకం ముగిసి కైక్వీ భావ చైనా అధ్యక్షుడు కావొచ్చనే వాదన సైతం మొదలైంది. అందుకే కైక్వీతో మోదీ భేటీని జిన్‌పింగ్ స్వయంగా ఏర్పాటుచేశారని తెలుస్తోంది. గల్వాన్ ఘటన తర్వాత దెబ్బతిన్న భారత్, చైనా బంధాన్ని మళ్లీ పూర్వస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా కైక్వీని కలవాలని మోదీకి జిన్‌పింగ్ సూచించినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరుదేశాల మధ్య బంధాన్ని పటిష్టపర్చి మరింత మెరుగైన ఆర్థిక, దౌత్య సంబంధాల కోసం తీసుకోవాల్సిన నిర్ణయాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు వార్తలొచ్చాయి. ఎవరీ కైక్వీ? చైనా కమ్యూనిస్ట్ పారీ్టలో అత్యున్నత నిర్ణాయక మండలిలో ఈయన సీనియర్సభ్యునిగా ఉన్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఐదో అత్యున్నత నేతగా కొనసాగుతున్నారు. జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడుగా పేరొందారు. జిన్‌పింగ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గానూ కైక్వీ మరో పదవిలో కొనసాగుతున్నారు. మావో తర్వాత చైనాలో ఇలా రెండు, మూడు పదవుల్లో ఏకకాలంలో కొనసాగుతున్న వ్యక్తి ఈయనే కావడం విశేషం. చైనాలోని అధికార క్రమంలో ఐదో స్థానంలో ఉన్నప్పటికీ జిన్‌పింగ్‌తో ఉన్న అత్యంత దగ్గరి రాజకీయ సాన్నిహిత్యం కారణంగా తదుపరి దేశాధ్యక్షుడు ఇతననే వాదన సైతం బలంగా వినిపిస్తోంది.ఫుజియాన్ ప్రావిన్స్‌లోని యూక్సీ కౌంటీలో జన్మించిన ఈయ తొలిసారిగా 1980వ దశకంలో జిన్‌పింగ్‌ను కలిశారు. 1975లో ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. సాన్మింగ్, ఖ్వుజోయూ, హాంగ్జోయూ నగరాలకు మేయర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 2016లో బీజింగ్ నగరానికి తాత్కాలిక మేయర్‌గా పనిచేశారు. ప్రస్తుతం చైనా ప్రభుత్వంలో, పార్టీలో ఏ స్థాయి ర్యాంక్‌లో కొనసాగుతున్నాసరే కైక్వీ మాట చెల్లుబాటు అవుతుందని తెలుస్తోంది. పార్టీ జనరల్ ఆఫీస్‌కి డైరెక్టర్‌గానూ ఉన్నారు. జిన్‌పింగ్‌ను అందరి ఎదుట కైక్వీ ‘అంకుల్’, ‘బాస్’అని పిలుస్తారు. -
నేను క్షమించినా ప్రజలు క్షమించరు: మోదీ
పట్నా: బిహార్‌లో రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మోదీ తల్లి దివంగత హీరాబెన్నుద్దేశిస్తూ కొందరు విపక్షనేతలు అవమానకరంగా మాట్లాడిన ఉదంతంపై ప్రధాని మోదీ తొలిసారిగా ఆవేదనాభరితంగా స్పందించారు. బిహార్‌లో మహిళల నైపుణ్యాభివృద్ధికి కృషిచేసే కొత్త ‘బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్’ను మంగళవారం ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించి లక్షలాది మంది మహిళలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ దివంగత నా మాతృమూర్తికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. రాజకీయాలకు దూరంగా ఉండిపోవడమే ఆమె చేసిన తప్పా? ఆమెను మాత్రమే దూషించాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అంటూ గద్గద స్వరంలో మోదీ తన ప్రసంగాన్ని మొదలెట్టారు.‘‘ నా తల్లిని అవమానించిన బిహార్ ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలను నేను క్షమిస్తానేమోగానీ దేశంలోని ప్రజలెవ్వరూ వారిని క్షమించబోరు. ఒకరి తల్లిని దూషించిన వారిని ఇంకొకరు పొరపాటున కూడా క్షమించబోరు. తల్లిపై దారుణదూషణోదంతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ పార్టీలను బాధ్యులను చేయాల్సిన కనీస బాధ్యత బిహార్‌లోని ప్రతి ఒక్క కుమారుడిపై ఉంది. ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలు ఏ వీధిలోకి వెళ్లినా, ఏ పట్టణంలో ప్రచారంచేసినా అక్కడ మాతృమూర్తులు, సోదరీమణులను అవమానిస్తే అస్స లు ఊరుకోబోమని, సహించబోమని గట్టిగా, స్పష్టంగా తెలిసేలా చేయండి’’ అని బిహార్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు.‘‘ తల్లిపై దుర్భాషలాడిన ఆర్జేడీ–కాంగ్రెస్ నేతలను బిహార్‌లోని తల్లులు, సోదరసోదరీమణులు వీధుల్లోకి వచ్చిమరీ నిలదీయాలి. ఇలాంటివి అస్సలు సహించబోమని స్పష్టంచేయాలి. నన్ను విమర్శించే క్రమంలో తల్లిని, మహిళను తిడితే ఎవ్వరూ ఊరుకోబోరని, తిట్లదండకానికి తెరదించుతామని మీరంతా నిరూపించాలి’’ అని మహిళలకు మోదీ పిలుపునిచ్చారు. బిహార్ రాజ్య జీవిక నిధి సహకార సంఘ్ లిమిటెడ్ అనేది మహిళా స్వయంసహాయక బృందాలకు తక్కువ వడ్డీలకు రుణాలను అందిస్తూ వారి నైపుణ్యాభివృద్ధికి కృషిచేస్తుంది.జానకీమాతకు జన్మస్థలి‘‘బిహార్ అనేది జానకీమాతకు జన్మస్థలి. బిహార్ రాష్ట్రం ఎల్లవేళలా మహిళలను గౌరవిస్తుంది. ఆర్జేడీ–కాంగ్రెస్ సంయుక్త రాజకీయ కార్యక్రమం నా తల్లిని అవమానించేందుకు వేదికగా మారడం, అందునా బిహార్‌లో ఈ కార్యక్రమం జరగడాన్ని అస్సలు ఊహించలేదు. ఇది నిజంగా బిహార్ తల్లులు, సోదరీమణులను అవమానించడమే. ఇలాంటి నేతలను బిహార్ ప్రజలు అస్సలు క్షమించరు’’ అని మోదీ అన్నారు. ‘‘ ఆర్జేడీ పాలనా కాలంలో తల్లులు, మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారు. నేరçస్తులు, రేపిస్టులు, హంతకులను ఆర్జేడీ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంది. తమ కుటుంబసభ్యులు క్షేమంగా రోజూ ఇంటికి తిరిగొస్తారో లేదోనని బిహార్ మహిళలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.అందుకే తర్వాత మహిళా ఓటర్లు ఆర్జేడీ సర్కార్‌ను ఇంటికి సాగనంపారు. నాడు ఆర్జేడీ కూటమిని ఇంటికి సాగనంపిన అదే మహిళాలు ఇప్పుడు నా తల్లికి జరిగిన అవమానాకి ప్రతీకారం తీర్చుకుంటారు. దర్భంగాలో జరిగిన దుర్ఘటన విపక్షాల కూటమి దారుణాలకు దర్పణం పడుతోంది. రాష్ట్రంలో మహిళలు దోపిడీ, అణచివేతకు గురవుతున్నారు’’ అని మోదీ అన్నారు. ‘‘ కొడుక్కి తన తల్లి అంటే దేవత, దైవంతో సమానం’’ అని భోజ్‌పురీ సామెతను రాబోయే నవరాత్రి, ఛాత్ పండుగలను పురస్కరించుకుని మోదీ గుర్తుచేశారు. ‘‘సూర్యభగవానుని మహిళారూపంలో ఏడుగురు దుర్గామాత అక్కచెల్లెళ్ల రూపంలో బిహార్ ప్రజలు పూజిస్తారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్–ఆర్జేడీ క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని మోదీ అన్నారు.‘‘ దేశసేవకు నా జీవితాన్ని అంకితం చేస్తానని మా అమ్మతో చెప్పినప్పుడు ఆమె అందుకు అడ్డుచెప్పలేదు. పైగా దేశసేవ చేస్తానన్నందుకు అభినందించి ప్రోత్సహించారు. కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుంటానని చెబితే వారించలేదు. పేద తల్లి కుమారుడు అధికారాన్ని(ప్రధాని పదవిని) స్వీకరించడం పేరుగొప్ప నేతలకు అస్సలు నచ్చట్లేదు. మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతినీ వాళ్లు ఓర్వలేకపోతున్నారు. దేశానికి తొలి మహిళా రాష్ట్రపతిగా ఆసీనులైన ద్రౌపదీముర్మును సైతం అవమానించడానికి వాళ్లు దుస్సాహసం చేశారు. నాకంటే 20 ఏళ్లు జూనియర్ అయిన(రాహుల్‌గాంధీ) ఓ వ్యక్తి ఓ పదిహేను రోజులు ఎస్ఐఆర్పై పోరు పేరు చెప్పి యాత్రచేశారు’’ అని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. -
ప్రపంచాన్ని మార్చే భారత్ చిప్!
న్యూఢిల్లీ: భారత్‌లో తయారైన ఓ చిన్న చిప్ ప్రపంచంలో పెద్ద మార్పును తీసుకొస్తుందని, అది ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మాట్లాడారు. భారత్‌లో రూపుదిద్దుకుని, భారత్‌లో తయారైందంటూ ప్రపంచమంతా మర్మోగే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.18 బిలియన్ డాలర్ల విలువ చేసే 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయంటూ.. తదుపరి దశ భారత సెమీకండక్టర్ మిషన్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ప్రకటించారు. ట్రిలియన్ డాలర్ల అంతర్జాతీయ చిప్ మార్కెట్లో స్థానాన్ని సంపాదించడమే భారత్ లక్ష్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన సెమీకండక్టర్ నిపుణులు, 50 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో భారత యువ శక్తి, ఆవిష్కరణలు ప్రస్ఫుటమవుతున్నట్టు ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రపంచం విశ్వసిస్తున్నట్టు ఇది స్పష్టమైన సంకేతం పంపిస్తుందన్నారు. భారత్‌తో కలసి సెమీకండక్టర్ భవిష్యత్ నిర్మాణానికి ప్రపంచం సుముఖంగా ఉన్నట్టు చెప్పారు. డిజిటల్ డైమండ్స్...చిప్‌లపై ప్రధాని మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆయిల్ అన్నది నల్ల బంగారం. కానీ చిప్‌లు అన్నవి డిజిటల్ వజ్రాలు’’అని పేర్కొన్నారు. చమురు గత శతాబ్దాన్ని మలుపు తిప్పగా, 21వ శతాబ్దాన్ని చిన్న చిప్‌లు నడిపించనున్నట్టు చెప్పారు. పరిమాణంలోనే చిన్నవే అయినా ప్రపంచ పురోగతిని వేగవంతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. నోయిడా, బెంగళూరులో ఏర్పాటు చేసిన డిజైన్ కేంద్రాలు ప్రపంచంలోనే అత్యాధునికమైన చిప్‌ల అభివృద్ధిపై పనిచేస్తున్నాయని, అవి బిలియన్ల లావాదేవీలను నిల్వ చేయగలవన్నారు.‘‘ప్రస్తుతం ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్ 600 బిలియన్ డాలర్లుగా ఉంటే, రానున్న సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. సెమీకండక్టర్ రంగంలో సాధిస్తున్న పురోగతి దృష్ట్యా భవిష్యత్తులో ట్రిలియన్ డాలర్ల మార్కెట్లో భారత్ చెప్పుకోతగ్గ వాటాను సొంతం చేసుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ పెద్ద హృదయంతో ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలుకుతున్నట్టు ప్రకటించారు. భారత విధానాలు స్వల్పకాలం కోసం కాదంటూ ప్రతి ఇన్వెస్టర్ అవసరాలకు అనుగుణంగా ఉంటాయన్నారు.సెమీకండక్టర్ రంగంలో వేగం ముఖ్యమంటూ.. దరఖాస్తు నుంచి ఫ్యాక్టరీ నిర్మాణం వరకు పేపర్ పని తక్కువగా ఉంటే వేఫర్ తయారీ వేగంగా సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వం ఇదే ధోరణితో పనిచేస్తున్నట్టు తెలిపారు. జాతీయ స్థాయిలో సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్టు చెప్పారు. వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ పార్క్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. భూమి, విద్యుత్, పోర్ట్, ఎయిర్‌పోర్ట్‌లతో అనుసంధానత, నిపుణులైన మానవవనరులు ఇలా అన్ని అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. వీటితో పారిశ్రామికవృద్ధి వేగవంతం అవుతుందన్నారు. సీజీ పవర్‌కు చెందిన సెమీకండక్టర్ పైలట్ ప్లాంట్ ఆగస్ట్ 28న కార్యకలాపాలు మొదలు పెట్టిందని, కేనెస్ టెక్నాలజీ ప్లాంట్ పైలట్ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు చెప్పారు. మైక్రాన్ టెక్నాలజీ, టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పటికే తయారీ కార్యకలాపాలు మొదలు పెట్టాయని, వాణిజ్య చిప్ ఉత్పత్తి ఈ ఏడాదే మొదలవుతుందని ప్రధాని ప్రకటించారు. విక్రమ్.. తొలి మేడిన్ ఇండియా చిప్భారత్లో రూపుదిద్దుకుని, ఇక్కడే తయారైన విక్రమ్ 32 బిట్ మైక్రో ప్రాసెసర్‌తో పాటు ఇతర టెస్ట్ చిప్‌లను ప్రధాని మోదీకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఇదే కార్యక్రమంలో అందజేశారు. ఈ తొలి మేడిన్ ఇండియా చిప్ విక్రమ్‌ను ఇస్రో సెమీకండక్టర్ ల్యాబ్ అభివృద్ధి చేసింది. కఠినమైన ఉపగ్రహ ప్రయోగ పరిస్థితుల్లోనూ వినియోగించేందుకు అనుకూలంగా రూపొందించారు. సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించిన మూడున్నరేళ్లలోనే ప్రపంచం భారత్‌వైపు చూసేలా పురోగతి సాధించినట్టు మంత్రి అశ్వని వైష్ణవ్ పేర్కొన్నారు. -
అసహనంలో అమెరికా.. భారత్‌కు రష్యా బంపరాఫర్!
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సు అనంతరం, భారత్–రష్యా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు రష్యా బంపరాఫ్ ఇచ్చింది. ముడి చమురుపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి, అక్టోబర్‌లో లోడ్ అయ్యే ఉరల్స్ గ్రేడ్ చమురు బ్యారెల్‌కు 3నుంచి 4 డాలర్ల వరకు తగ్గింపు ఇవ్వనున్నట్లు బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది.ఎస్సీవో సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తూ, దాదాపు గంట పాటు చర్చలు జరిపారు. ఈ సమావేశం అనంతరం, రష్యా భారత్‌కు చమురు డిస్కౌంట్ ప్రకటించడం గమనార్హం.మరోవైపు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఉత్పత్తులపై 50శాతం టారిఫ్ విధించింది. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్..ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్ మద్దతిస్తుందని అక్కసు వెళ్లగక్కారు. అయితే,భారత్ మాత్రం రష్యా చమురు కొనుగోళ్లను సమర్థిస్తోంది. చమురు ఎక్కడ తక్కవ దొరికితే అక్కడ నుంచి కొనుగోలు చేస్తామని కుండబద్దలు కొట్టి చెప్పింది. అమెరికా విధించిన టారిఫ్‌లను భారత్ వ్యతిరేకిస్తోంది. ఈ పరిణామాలు భారత్ అంతర్జాతీయ వ్యూహాత్మక సంబంధాల్లో కీలక మలుపు తిరగనుంది. చమురు వ్యాపారం కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు. ఇది అంతర్జాతీయంగా పలుదేశాల్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనమని నిపుణులు అభివర్ణిస్తున్నారు. Always a delight to meet President Putin! pic.twitter.com/XtDSyWEmtw— Narendra Modi (@narendramodi) September 1, 2025 -
70 కిలోల ప్రధాని మోదీ చాక్లెట్ శిల్పం..!
ఒడిశాలో విద్యార్థుల అద్భుతమైన పాక ప్రతిభతో ప్రధాని మోదీ శిల్పానికి ప్రాణాం పోశారు. తమ కళాత్మక ప్రతిభతో మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించారు. దీన్ని పూర్తిగా చాక్లెట్ తయారు చేశారు. దాదాపు 70 కిలోలు బరువు ఉంటుంది. అందుకోసం ఆ విద్యార్థులు సుమారు 55 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల వైట్ చాక్లెట్‌ని విపియోగించారు. భువనేశ్వర్ చాక్లెట్ క్లబ్లో డిప్లోమా చేస్తున్న ఈ విద్యార్థు ఆ ప్రతిమలో ప్రభుత్వ సంబంధిత పథకాలకు సంబంధించిన క్లిష్లమైన వివరాలను పొందుపర్చేలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఈ క్లబ్ ప్రొఫెషనల్ బేకింగ్ అండ్ ఫైన్ పాటిస్సేరీ పాఠశాల. రాకేష్ కుమార్ సాహు, రంజాన్ పరిదా నేతృత్వంలో సుమారు 15 మంది విద్యార్థుల బృందం ఈ ప్రత్యేకమైన కళకు జీవం పోశారు. మోదీ చాక్లెట్ కళాకృతి తయారు చేసేందుకు సుమారు ఏడు రోజులు పట్టిందట. ఈ ప్రతిమలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన, ప్రధాన మంత్రి ఆపరేషన్ సిందూర్, స్వచ్ఛ భారత్ మిషన్ వంటి కీలకమైన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇందులో ఉన్నాయి. అంతేగాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సాధించిన విజయాలను కూడా ఈ ప్రతిమలో హైలెట్ చేశారు. ఆ సంస్థ ప్రకారం..భారతదేశంలో ఇలా మోదీ చాక్లెట్ శిల్పాన్ని రూపొందించడం ఇదే ప్రప్రథమం. దీన్ని విద్యార్థులు కళ, నైపుణ్యాల కలయికగా అభివర్ణించారు. గతేడాది కూడా మోదీ పుట్టిన రోజు పురస్కరించుకుని ఒడిశాలోని భువనేశ్వర్‌లోని గడకానాలో 2.5 మిలియన్లకు పైగా ప్రధానమంత్రి ఆవాస్ గృహాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో సుభద్ర యోజనను కూడా ప్రారంభించారు. అలాగే భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కూడా మోదీ పుట్టినరోజు నిమిత్తం పఖ్వాడా" లేదా "సేవా పర్వ్" ప్రచారంతో రక్తదాన శిబిరాలు, డ్రైవ్‌లు వంటి సామాజిక సేవ కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే ప్రధాని మోదీ సైతం తన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించేవారు. అలాగనే మోదీ కూడా తన పుట్టినరోజు సందర్భంగా 2023లో చేతివృత్తులవారి కోసం విశ్వకర్మ యోజన, 2022లో ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేయడం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను చేపట్టిన సంగతి తెలిసిందే.(చదవండి: దేశంలోనే తొలి మహిళా మావటి..!) -
డిజిటల్ డైమండ్.. ఈ శతాబ్దం దీనికే!.. నరేంద్ర మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఈ తరుణంలో న్యూఢిల్లీలో జరిగిన 'సెమికాన్ ఇండియా 2025' శిఖరాగ్ర సమావేశంలో.. సెమీకండక్టర్ల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు.ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి మాట్లాడుతూ.. పెట్టుబడిదారులందరినీ స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచంలోని చాలా దేశాలు.. భారతదేశంలో తయారైన వాటిని విశ్వసిస్తున్నాయి అని చెప్పే రోజు ఎంతో.. దూరంలో లేదని అన్నారు. ప్రపంచంలో.. చమురును నల్ల బంగారం అని, చిప్స్‌ను డిజిటల్ డైమండ్స్ అంటారని అన్నారు. గత శతాబ్దం మొత్తం చమురుకు ప్రాధాన్యత ఇచ్చింది. కానీ 21వ శతాబ్దం మాత్రం చిప్కే పరిమితం అని అన్నారు. ఈ చిప్ ప్రపంచ అభివృద్ధిని వేగవంతం చేసే శక్తిని కలిగి ఉందని మోదీ పేర్కొన్నారు.#WATCH | At Semicon India 2025, Union Minister for Electronics & Information Technology, Ashwini Vaishnaw presents Vikram 32-bit processor and test chips of the 4 approved projects to PM Narendra Modi.Vikram 32-bit processor is the first fully “Make-in-India” 32-bit… pic.twitter.com/8FCkbe0sve— ANI (@ANI) September 2, 2025కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సెమికాన్ ఇండియాలో.. ప్రధాని మోదీకి విక్రమ్ 32 బిట్ ప్రాసెసర్, టెస్ట్ చిప్‌లను అందజేశారు. మన ప్రధానమంత్రిని దూరదృష్టితో కొత్త ఆరంభం కోసం మొదటిసారి కలిశాము. అప్పుడే మేము ఇండియా సెమీకండక్టర్ మిషన్‌ను ప్రారంభించాము. ఇది 3.5 సంవత్సరాల వ్యవధిలోనే.. ప్రపంచం భారతదేశం వైపు నమ్మకంగా చూసేలా చేసింది. నేడు, ఐదు సెమీకండక్టర్ యూనిట్ల నిర్మాణం వేగంగా జరుగుతోంది. మేము ఇప్పుడు మొదటి 'మేడ్-ఇన్-ఇండియా' చిప్‌ను ప్రధాని మోదీకి అందించామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నాడు.ఇదీ చదవండి: యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారుగత కొన్ని సంవత్సరాలుగా సెమికాన్ ఇండియా ప్రణాళిక కింద జరుగుతున్న పురోగతి గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు. 2023 నాటికి, భారతదేశంలో మొట్టమొదటి సెమీకండక్టర్ ప్లాంట్ సిద్ధమైంది. 2024లో మేము అదనపు ప్లాంట్లను ఆమోదించాము. 2025లో మరో ఐదు అదనపు ప్రాజెక్టులను క్లియర్ చేసాము. మొత్తం మీద ప్రభుత్వం పది సెమీకండక్టర్ ప్రాజెక్టులలో రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు. ఇది భారతదేశంపై ప్రపంచ దేశాలు పెంచుకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు.First ‘Made in India’ Chips!A moment of pride for any nation. Today, Bharat has achieved it. 🇮🇳This significant milestone was made possible by our Hon’ble PM @narendramodi Ji’s far-sighted vision, strong will and decisive action. pic.twitter.com/ao2YeoAkCv— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 2, 2025 -
యూరోపియన్ దేశాలకు.. మోదీ ప్రారంభించిన కారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల భారతదేశంలో మారుతి సుజుకి తయారు చేసిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఈ-విటారా'ను ప్రారంభించారు. ఈ మోడల్ కార్లను కంపెనీ 12 యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమైంది. గుజరాత్‌లోని హన్సల్పూర్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన 2,900 ఈ-విటారా యూనిట్లను సంస్థ తరలించింది. కాగా ఇక్కడి నుంచే కంపెనీ 100 దేశాలకు ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.మొట్టమొదటి మారుతి సుజుకి ఈ-విటారా షిప్మెంట్లను.. రాష్ట్రంలోని పిపాపావ్ పోర్టు నుంచి యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, నార్వే, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్వీడన్, హంగేరీ, ఐస్లాండ్, బెల్జియంలకు పంపించారు. ఇప్పటికే సుజుకి స్వదేశమైన జపాన్‌తో సహా దాదాపు 100 దేశాలకు తన 17 ఇతర కార్లను ఎగుమతి చేస్తోంది.ప్రతి సంవత్సరం 50,000 నుంచి 1,00,000 ఈ-విటారాలను కంపెనీ చేయనున్నట్లు మారుతి చైర్మన్ ఆర్సీ భార్గవ పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధమైన సామర్థ్యంతో, గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారబోతోందని సుజుకి మోటార్ కార్పొరేషన్ సిఓ తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. ప్రస్తుతం ఇక్కడ మూడు ఉత్పత్తి లైన్లలో సంవత్సరానికి 7,50,000 వాహనాలను ఉత్పత్తి చేయగలదు.ఇదీ చదవండి: చైనా బ్రాండ్ కార్లు.. 10వేల మంది కొన్నారుమారుతి ఈ-విటారా ప్రస్తుతం ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. కానీ దేశీయ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే ఇది భారతీయ వినియోగదారులకు ఉపయోగపడేలా.. తయారవుతుందని కంపెనీ చెబుతోంది. ఇది అత్యాధునిక డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుందని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుందని చెబుతున్నారు. అయితే ధరలు అధికారికంగా.. లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. -
‘మోదీ క్షమించినా.. బీహార్ వాళ్లను క్షమించదు’
తన మాతృమూర్తి హీరాబెన్‌పై అనుచిత వ్యాఖ్యల పేరిట వైరల్ అయిన వీడియోపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి స్పందించారు. తన తల్లికే కాదని.. దేశంలోని తల్లులందరికీ ఇది అవమానమేనని భావోద్వేగంగా మాట్లాడారు. బీహార్‌లో మహిళల కోసం బీహార్ రాజ్య జీవికా నిధి సాఖ్ సహకారి సంఘ్ లిమిటెడ్‌ను వర్చువల్‌గా ప్రారంభించిన ఆయన.. ఆ కార్యక్రమానికి హాజరైన 20 లక్షల మంది మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.చనిపోయిన నా తల్లికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినా అందులోకి లాగారు. కేవలం నా తల్లినే కాదు.. దేశంలోని ప్రతీ తల్లినీ, సోదరినీ కాంగ్రెస్, ఆర్జేడీలు అవమానించాయి అని అన్నారాయన. ఈ మాటలు నా తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించాయి. మీరు కూడా ఈ మాటలు విన్న తర్వాత నాతోపాటు మీరూ ఎంతగా బాధపడి ఉంటారో నాకు తెలుసు అంటూ ఆయన భావోద్వేగంగా స్పందించారు. అనారోగ్యంతో బాధపడుతూ కూడా నా తల్లి కష్టపడడం ఆపలేదు. మా కోసం దుస్తులు తయారు చేయించేందుకు ప్రతి పైసా ఆదా చేసేది. దేశంలో కోట్లాది తల్లులు ఇలాగే త్యాగం చేస్తూ జీవిస్తున్నారు. తల్లి స్థానం దేవతలకంటే గొప్పది అని ప్రధాని అన్నారు. బీహార్‌లో కాంగ్రెస్–RJD వేదికపై వాడిన అసభ్య పదజాలం తన తల్లిని మాత్రమే కాదు, దేశంలోని ప్రతి తల్లి, సోదరిని అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టినవారు పేద తల్లుల బాధను, వారి కుమారుల పోరాటాన్ని అర్థం చేసుకోలేరు. వీరంతా బంగారు, వెండి చెంచాలతో పుట్టినవారు. బీహార్‌లో అధికారాన్ని తమ కుటుంబాల స్వంతంగా భావిస్తున్నారు. కానీ మీరు ఒక పేద తల్లి కుమారుడిని ప్రధాన సేవకుడిగా ఆశీర్వదించారు. ఇది ‘నామ్‌దార్’లకు జీర్ణించుకోవడం కష్టమైంది అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, RJD నేత తేజస్వీ యాదవ్‌లపై విమర్శలు చేశారు.నాపై అసభ్య పదజాలం వాడిన జాబితా చాలా పొడవుగా ఉంది. నన్ను నీచ్, గంది నాళీ కీ కీడా, పాము అని అంటున్నారు. ఇప్పుడు ‘తూ’ అని కూడా సంబోధిస్తున్నారు.. అంటూ రాహుల్ గాంధీ ర్యాలీలో తనను ‘తూ’ అని పిలిచిన విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇలాంటి వ్యాఖ్యలకు మోదీ క్షమించినా.. బీహార్ ప్రజలు క్షమించబోరని అన్నారాయన.ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీ బీహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర సందర్బంగా.. దర్భంగలో మోదీ, ఆయన తల్లి హీరాబన్ను దూషించినట్లుగా ఓ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ ఘటనపై కేసు నమోదుకాగా.. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు కూడా. -
SCO సదస్సు వద్ద మోదీ-పుతిన్-జిన్‌పింగ్ స్నేహ ప్రదర్శన
-
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్‌పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్‌లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్‌ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్‌లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్‌కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
13న ప్రధాని మోదీ మిజోరం సందర్శన.. ఈశాన్యాన్ని కలిపే రైల్వే లైన్‌కు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 13న మిజోరం, మణిపూర్‌లను సందర్శించే అవకాశం ఉంది. మిజోరం రాష్ట్ర ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని తన పర్యటనను మిజోరంలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన 51.38 కి.మీ. పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ప్రాజెక్ట్ కేంద్రం చేపట్టిన యాక్ట్ ఈస్ట్ పాలసీలో కీలక అడుగు. ఈశాన్య ప్రాంతంలో కనెక్టివిటీని బలోపేతం చేయడం, ఆర్థిక వృద్ధిని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం దీనిని చేపట్టింది. ఈ రైల్వే లైన్ ఐజ్వాల్‌ను అస్సాంలోని సిల్చార్ ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలను కలుపుతుంది.మిజోరం పర్యటన అనంతరం ప్రధాని మోదీ మణిపూర్‌కు విమానంలో వెళ్లే అవకాశం ఉంది. 2023 మేలో జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి అవుతుంది. ప్రధాని పర్యటనకు సన్నాహాలు జరుగుతున్నాయని మిజోరం అధికారులు చెబుతున్నప్పటికీ, ఇంఫాల్‌లోని అధికారులు మోదీ పర్యటన ఇంకా ధృవీకరణ కాలేదన్నారు. కాగా మిజోరం ప్రధాన కార్యదర్శి ఖిల్లీ రామ్ మీనా ప్రధాని రాక సందర్భంగా వివిధ విభాగాలు, చట్ట అమలు సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.మణిపూర్‌లో జాతి హింసజాతి ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మణిపూర్ పర్యటన ఆసక్తికరంగా మారింది. మే 2023 నుండి రాష్ట్రంలో మెయిటీ, కుకి-జో వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ అశాంతియుత వాతావరణంలో 60 మంది ప్రాణాలను కోల్పోయారు. ఆస్తి విధ్వంసం జరిగింది. వేలాది మంది వలసబాట పట్టారు. మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. అప్పటి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. 2027 వరకు పదవీకాలం ఉన్న రాష్ట్ర అసెంబ్లీని తాత్కాలికంగా నిలిపివేశారు. -
కలసికట్టుగా ముందుకెళ్దాం... చైనాలోని తియాంజిన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్‌తో భేటీ
-
సెమికాన్ ఇండియా సదస్సు నేటి నుంచి
సాక్షి, న్యూఢిల్లీ: దేశాన్ని సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధి కేంద్రంగా మార్చే లక్ష్యంతో దేశ రాజధాని ఢిల్లీ మరో అంతర్జాతీయ మహాసదస్సుకు వేదికైంది. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని యశో భూమిలో ‘సెమికాన్ ఇండియా–2025’సదస్సును ప్రారంభించనున్నారు. ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు కొనసాగనుంది. 3వ తేదీ ఉదయం 9.30 గంటలకు ప్రధాని మోదీ వివిధ కంపెనీల సీఈవోల రౌండ్‌టేబుల్ భేటీలో పాల్గొని చర్చలు జరపనున్నారు. సదస్సుకు 20,750 మంది పాల్గొననున్నారు. వీరిలో 48 దేశాల 2,500 ప్రతినిధులున్నారు. 350 ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రదర్శించనున్నారు. 2022లో బెంగళూరు, 2023లో గాం«దీనగర్, 2024లో గ్రేటర్ నోయిడాలో ఈ సదస్సులు జరిగాయి. -
భద్రత, శాంతితోనే అభివృద్ధి
తియాంజిన్: షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) పట్ల భారత్ వైఖరి, విధానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఎస్ అంటే సెక్యూరిటీ(భద్రత), సీ అంటే కనెక్టివిటీ(అనుసంధానం), ఓ అంటే అపర్చునిటీ(అవకాశం) అని చెప్పారు. ప్రపంచంలో ఏ దేశ అభివృద్ధికైనా భద్రత, శాంతి, స్థిరత్వమే పునాది అని వెల్లడించారు. ప్రపంచ దేశాల పురోగతికి ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం ఎన్నో సవాళ్లు విసురుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై పోరాటం చేయడం మానత్వం పట్ల మన బాధ్యత అని సూచించారు. చైనాలోని తియాంజిన్‌లో ఎస్సీఓ సదస్సులో రెండో రోజు సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రాంతీయ అభివృద్ధికి అనుసంధానం అత్యంత కీలకమని చెప్పారు. అనుసంధానం దిశగా జరిగే ప్రతి ప్రయత్నమూ ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించేలా ఉండాలని సూచించారు. ఎస్సీఓ చార్టర్‌లోని మూలసూత్రాల్లో ఇది కూడా ఒక భాగమేనని గుర్తుచేశారు. కాలం చెల్లిన విధానాలు వద్దు ఎస్సీఓ కింద ‘సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్’ ఏర్పాటు చేసుకుందామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. ఘనమైన మన ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాలను అంతర్జాతీయ వేదికపై పరస్పరం పంచుకోవడానికి ఈ ఫోరమ్ తోడ్పడతుందని అన్నారు. దక్షిణార్ధ గోళ దేశాలు(గ్లోబల్ సౌత్) మరింత వేగంగా ప్రగతి సాధించాలని పిలుపునిచ్చారు. కాలం చెల్లిన విధానాలతో అనుకున్న లక్ష్యం సాధించలేమని చెప్పారు. ఇంకా వాటినే నమ్ముకొని ఉండడం భవిష్యతు తరాలకు అన్యాయం చేయడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని విధానాలు రూపొందించుకోవాలని సూచించారు. భారతదేశ ప్రగతి ప్రయాణాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంస్కరణ, పనితీరు, మార్పు అనే మంత్రంతో తమదేశం ముందుకు సాగుతోందన్నారు. విస్తృత స్థాయిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని, దీనివల్ల జాతీయ అభివృద్ధికి, అంతర్జాతీయ సహకారానికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. భారత్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వామిగా మారాలంటూ ఎస్సీఓ సభ్య దేశాలను మోదీ ఆహా్వనించారు. ముష్కరులను పోషించడం మానుకోవాలి ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం కొన్ని దేశాలు ఇకనైనా మానుకోవాలని ప్రధాని మోదీ పరోక్షంగా పాకిస్తాన్‌కు హితవు పలికారు. ముష్కర మూకలను పెంచిపోíÙస్తే మొత్తం మానవళికి ముప్పు తప్పదని హెచ్చరించారు. ఉగ్రవాదం అనేది ఏ ఒక్క దేశానికో పరిమితమైన సమస్య కాదని అన్నారు. తాము క్షేమంగా ఉన్నామని ఏ ఒక్కరూ అనుకోవడానికి వీల్లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే ఉగ్రవాదం అంతమవుతుందని ఉద్ఘాటించారు. అల్‌ఖైదా, అని అనుబంధ గ్రూప్‌లపై యుద్ధం ప్రారంభించామని చెప్పారు. పహల్గాం ఉగ్రవాద దాడిని కూడా ప్రధాని ప్రస్తావించారు. ఇది కేవలం భారత్‌పై జరిగిన దాడి కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్క దేశానికీ, ప్రతి పౌరుడీకి ఒక సవాల్ అని పేర్కొన్నారు. పహల్గాం దాడి సమయంలో భారత్‌కు అండగా నిలిచిన దేశాలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఉమ్మడిగా ముందుకెళ్దాం
తియాంజిన్: ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, సుస్థిరతలకు భారత్–రష్యా సంబంధాలే మూలస్తంభమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం రెండు దేశాలు భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఉమ్మడిగా ముందుకెళ్తాయని అన్నారు. చైనాలోని తియాంజిన్‌లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థికం, ఇంధనం, ఎరువులు, వాణిజ్యం, అంతరిక్షం, సాంస్కృతిక, భద్రత తదితర రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా చర్చలు జరిగాయి. పుతిన్‌తో సమావేశం అనంతరం మోదీ మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్లో పుతిన్ ఇండియాలో పర్యటించబోతున్నారని, ఆయనకు స్వాగతం పలకడానికి 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. భారత్, రష్యా మధ్యనున్న ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రాధాన్యతకు ఇది నిదర్శనమని చెప్పారు. భారత్–రష్యా బంధం కేవలం ఇరుదేశాల ప్రజలకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా కీలకమేనని వివరించారు. అది మానవాళి కోరిక ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం ఇటీవల జరిగిన ప్రయత్నాలను మోదీ స్వాగతించారు. ఉక్రెయిన్‌లో ఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరపడాలని ఆకాంక్షించారు. ఇందుకోసం భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలన్నారు. అక్కడ యుద్ధం ముగిసి, శాశ్వత శాంతి నెలకొనాలన్నది మొత్తం మానవాళి కోరిక అని ఉద్ఘాటించారు. పుతిన్‌తో భేటీ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. కారులో పుతిన్‌తో కలిసి ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేశారు. రష్యా అధ్యక్షుడితో అద్భుతమైన చర్చ జరిగిందని పేర్కొన్నారు. కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఉక్రెయిన్ ఘర్షణకు శాంతియుత పరిష్కారం సహా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు. బహుముఖ సంబంధాల్లో చురుగ్గా పురోగతి: పుతిన్ భారత్‌తో బంధానికి ఎల్లప్పుడూ అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పుతిన్ పునరుద్ఘాటించారు. భారత్–రష్యా సంబంధాలు ప్రత్యేక, విశేష వ్యూహా త్మక భాగస్వామ్యం స్థాయికి చేరడం ఆనందంగా ఉందన్నారు. రెండు దేశాలు కలిసి పని చేస్తూనే ఉంటాయని స్పష్టంచేశారు. రెండు దేశాల బహుముఖ సంబంధాలు చురుగ్గా పురోగతి సాధిస్తూనే ఉంటాయన్నారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు పూర్తి సానుకూలంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. బహుళ స్థాయి సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, రెండు దేశాల మధ్య పర్యాటకుల మారి్పడి నానాటికీ వృద్ధి చెందుతోందని, ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్, జీ20, ఎస్సీఓ తదితర అంతర్జాతీయ వేదికలపై సన్నిహితంగా, సమన్వయంతో కలిసి పని చేస్తున్నామని పుతిన్ వెల్లడించారు. ముఖ్యమైన రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షికబంధంపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తంచేశారని భారత ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరుదేశాల మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని వారు నిర్ణయానికొచ్చినట్లు పేర్కొంది. ఒకే కారులో మోదీ, పుతిన్ ప్రయాణం తియాంజిన్‌లో ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధినేత పుతిన్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యాలో తయారైన అరుస్ లిమోజిన్ కారులో ఇరువురు నేతలు ఎస్సీఓ సదస్సు వేదిక నుంచి రిట్జ్–కార్ల్టన్ హోటల్‌కు చేరుకున్నారు. ఇరువురు నేతలు ఒకే కారులో కలిసి ప్రయాణించడం, సన్నిహితంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ, పుతిన్ మధ్య వ్యక్తిగత, వ్యూహాత్మక స్నేహ సంబంధాలకు ఈ ఘటన నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. పుతిన్‌తో సంభాషణ ఎల్లప్పుడూ అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉంటుందని మోదీ పేర్కొన్నారు. మోదీతో కలిసి ప్రయాణించాలని మొదట పుతిన్ కోరుకున్నట్లు తెలిసింది. అంతేకాకుండా మోదీ రాక కోసం ఆయన ఎస్సీఓ వేదిక వద్ద 10 నిమిషాల పాటు వేచి చూశారు. హోటల్‌కు చేరుకున్న తర్వాత కూడా కారులోనే 45 నిమిషాలపాటు మాట్లాడుకోవడం విశేషం. అనంతరం హోటల్ లోపల ద్వైపాక్షిక సమావేశం జరిగింది. అంతకుముందు ఎస్సీఓ వేదిక వద్ద మోదీని పుతిన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. పుతిన్‌ను కలుసుకోవడం నాకు సదా ఆనందదాయకం అని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మోదీ, పుతిన్, చైనా అధినేత జిన్‌పింగ్ కలిసి ఉన్న చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
శుభ పరిణామం... త్రైపాక్షికం
ఏడేళ్ల అనంతరం తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో జరిపిన పర్యటన అనేక విధాల సత్ఫలితాలనిచ్చింది. ఇది అంతర్జాతీయ పెత్తందార్లకు తగిన సందేశం పంపింది. పెహల్గామ్ ఉగ్రవాద దాడిపై మూణ్ణెల్లు గడిచినా ఉలుకూ పలుకూ లేకుండా ఉండి పోయిన షాంఘై సహకార సంస్థ(ఎస్సీవో)తో ఆ ఘటనను ఖండిస్తూ తీర్మానం చేయించింది. చైనా, రష్యాలతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత మెరుగుపరుచుకునే దిశగా ప్రగతి సాధించింది. ఈ పరిణామాలన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదు.అంతర్జాతీయ సంబంధాల్లో అమెరికా సృష్టించిన సరికొత్త గందరగోళం వల్ల ఏర్పడిన అయోమయ వాతావరణాన్ని ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు ఒక కుదుపు కుదిపింది. ప్రపంచవ్యాప్త మీడియా ఈ శిఖరాగ్ర సదస్సు కన్నా మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చర్చించుకుంటున్న వీడియోకూ, ఛాయాచిత్రాలకూ అత్యధిక ప్రాధాన్యమివ్వటం మోదీ చైనా సందర్శనలోని అంతరార్థాన్నీ, దాని పరిణామాలనూ అవగాహన చేసుకోవటం వల్లే. అయితే కేవలం ఈ పర్యటన వల్లే అంతా మారిపోతుందనీ, చైనా మనతో సవ్యంగా ఉంటుందనీ, అమెరికా తన తెలివితక్కువ విధానాలను సవరించుకుంటుందనీ అనుకోనవసరం లేదు. ఇప్పటికైతే యూరేసియాలోని మూడు అగ్ర దేశాల కలయిక అవసరార్థ బంధమే. బలపడాలంటే చేయాల్సింది చాలా ఉంటుంది. రష్యాకిది వర్తించదు. ఆ దేశంతో మన మైత్రి చిరకాలమైనది. దాన్ని నీరుగార్చడానికి అమెరికా ఎంత ప్రయత్నించినప్పటికీ అదేమంత తగ్గలేదు. కానీ పెరగాల్సినంత పెరగలేదు. ఈ మూడు దేశాల కలయికా ఈ దేశాల ప్రయోజనాలు నెరవేర్చుకోవటంతోపాటు ఈ ప్రాంత శాంతికీ, సుస్థిరతకూ, అభివృద్ధికీ దోహదపడుతుంది. దీని మూలాలు ప్రచ్ఛన్న యుద్ధానంతర పరిణామాల్లో ఉన్నాయి. సోవియెట్ యూనియన్ కుప్పకూలి రష్యాగా మిగిలిపోయిన 1990వ దశకంలో అప్పటి ఆ దేశ ప్రధాని యెవ్జెనీ ప్రైమకోవ్ ఈ భావనకు రూపుదిద్దారు. ఈ వ్యూహాత్మక కలయిక భవిష్యత్తులో అమెరికా ఆధిపత్యా నికి చెక్ పెట్టగలదని భావించారు. మంత్రుల స్థాయిలో, నిపుణుల స్థాయిలో పలు సమావేశాలు కూడా జరిగాయి. కానీ 2020లో గల్వాన్ ఉదంతం అనంతరం నిలిచిపోయాయి. చైనాతో మనకున్న సరిహద్దు తగాదాలూ, చేదు అనుభవాలూ తక్కువేం కాదు. నిజానికి మొన్నటికి మొన్న ఎస్సీవో మంత్రుల స్థాయి భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తూ మన దేశం దానిపై సంతకం చేసేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఎస్సీవో తన తప్పు దిద్దుకోవటం శుభæపరిణామం.ఈ త్రైపాక్షిక కలయికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటలు గమనిస్తే ఆయనెంత కలవరపడుతున్నారో తెలుస్తుంది. ఇది ‘ఏకపక్ష విపత్తు’గా పరిణమిస్తుందట! ఆ దేశ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సరేసరి. రోజుకో రకంగా నోరు పారేసు కుంటున్నారు. మన దేశం సంయమనంతో అమెరికా 50 శాతం సుంకాలు ఎంత అర్థరహితమో చెప్తూ వస్తోంది. తాను తప్ప దిక్కులేదనే స్థితికి చేరిన అమెరికా కళ్లు తెరిపించటం ప్రస్తుతావసరం. దేశాల మధ్య పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న కాలంలో తనకు అనుకూలమైన నిబంధనలతో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)ను అమల్లోకి తెచ్చింది అమెరికాయే. పర్యవనసానంగా ఎడాపెడా ఆర్జించి, స్వీయ తప్పిదాల కారణంగా సంక్షోభంలో పడిన ఆ దేశం అందుకు ఇతరులను నిందిస్తూ మూర్ఖంగా ప్రవర్తిస్తోంది. భారత–చైనా సంబంధాలపై రెండు వైపుల నుంచీ వెలువడిన ప్రకటనలు ఒకే స్వరంతో ఉండటం గమనించదగ్గది. ఇరు దేశాలూ భాగస్వాములే తప్ప ప్రత్యర్థులు కారని ఆ ప్రకటనలు గుర్తుచేశాయి. చైనాతో మన సంబంధాలు బాగున్నప్పుడు పాకిస్తాన్ అణిగిమణిగి ఉండటం మొదటినుంచీ కనబడుతోంది. ఇకపై కూడా అదే జరిగితే మంచిదే. ఏదేమైనా పెత్తందారీ పోకడలు చెల్లబోవని చెప్పాల్సిన తరుణం ఆసన్నమైంది. కాకపోతే భారత్–చైనా–రష్యా కలయిక వికసించాలంటే ఎంతో చిత్త శుద్ధితో, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది. అది జరగాలని ఈ మూడు దేశాలు మాత్రమే కాదు... ప్రపంచమే కోరుకుంటోంది. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్‌లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్‌సోషల్‌లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్‌తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్‌కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్‌కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్‌లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్‌పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
హతవిధి.. పాక్ ప్రధానికి ఘోర పరాభవం!
2025లో చైనా తియాంజిన్‌లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు గురించి ప్రపంచమంతా ఇప్పుడు చర్చించుకుంటోంది. ట్రంప్ టారిఫ్ వార్, ఉక్రెయిన్ శాంతి చర్చల అంశాలతో పాటు పహల్గాం దాడి విషయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా.. భారత దేశానికి మద్దతుగా సదస్సులో పాల్గొన్న దేశాలు తీర్మానం సైతం చేయడం ప్రధానంగా నిలిచాయి. అయితే.. ఈ సదస్సు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చిందన్న చర్చ జోరుగా నడుస్తోంది. అందుకు ఈ సమ్మిట్‌లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు కారణంగా కాగా.. వాటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ చేస్తూ పాక్ ప్రధానిని నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. షరీఫ్ అంతర్జాతీయంగా అవమానానికి గురయ్యారన్నది ఆ పోస్టుల సారాంశం. అందుకు కారణం లేకపోలేదు.. వేదికపై ఆతిథ్య దేశాధినేత సహా మిగతా ప్రపంచాధినేతలెవరూ ఆయన్ని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. కాదు కాదు.. అసలు పట్టన్నట్లు వ్యవహరించడమే పెద్దగా హైలైట్ అయ్యింది. అవి ఒక్కొక్కటిగా పరిశీలిస్తే.. મોદી અને પુતિનની મુલાકાત દરમિયાન પાકિસ્તાનને નીચે જોવા જેવી સ્થિતિ પેદા થઈRead more at: https://t.co/xr1jIGM2b2#PMModiSCOsummit2025 #NarendraModi #PMModi #ShehbazSharif #VladimirPutin #SCOsummit2025 #SCOsummitinChina #XiJinping #Reels #shorts #newskida #treeshinewskida pic.twitter.com/NxjZc9wc6W— NewsKida (@TreeshiNewsKida) September 1, 2025భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ప్రధాని షరీఫ్‌ను అసలు పట్టించుకోలేదు. మోదీ-పుతిన్ ఇద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా.. షరీఫ్ బిక్కముఖం వేసుకుని పలకరించలేదే అన్నట్లు చూస్తూ ఉండిపోయారు. పైగా మోదీ తన ప్రసంగంలో పహల్గాం దాడి గురించి మాట్లాడిన ఆయన.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయంటూ పాక్‌నే ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ ప్రసంగం సాగినంత సేపు అక్కడే ఉన్న షరీఫ్ ముఖంలో నెత్తురు చుక్క కనిపించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది!. PM Modi, Putin, Xi Jinping and Shehbaz Sharif meetup in SCO Summit 2025😭🤣#SCOSummit pic.twitter.com/MKnj7TjCO1— Bruce Wayne (@_Bruce__007) September 1, 2025ఇక.. పుతిన్‌ను కలవాలన్న షరీఫ్ ఉత్సాహం.. అవమానాన్నే మిగిల్చింది. సదస్సు ముగిశాక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కరచలనం చేయడానికి షరీఫ్ కంగారుగా పరిగెత్తుతూ కనిపించారు. పుతిన్ షేక్ హ్యాండ్ ఇవ్వడంతో షరీఫ్ మురిసిపోయారు. ఆ సమయంలో పక్కనే ఉన్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. షరీఫ్‌ను చూసి పూర్తిగా పట్టన్నట్లు ప్రవర్తించారు. అయితే కాసేపటికే పుతిన్ మరోసారి ఆయన్ని పలకరించారు.आतंक पर बड़ी चोट कर रहे थे PM मोदी, सुन रहे थे पाक पीएम शहबाज शरीफ#PMModi #ShehbazSharif #PMModiInChina #SCOSummit2025 #Pakistan pic.twitter.com/EU2UkhZCq1— One India News (@oneindianewscom) September 1, 2025Shehbaz Sharif after seeing Xi and Putin with Modi while ignoring him 😭 pic.twitter.com/fDlEIEQDor— Fazal Afghan (@fhzadran) September 1, 2025 Pakistan PM Shehbaz Sharif Serving Juice to @narendramodi and #Putin Nice Gesture 🙌 #NarendraModi #ShehbazSharif #SCOSummit #SCOSummit2025 pic.twitter.com/R1eZEni9M7— SATYA ᴿᶜᴮ 🚩 (@sidhufromnaayak) September 1, 2025 ఇక సదస్సు ముగిసిన తర్వాత.. గ్రూప్ ఫొటో సమయంలోనూ షరీఫ్‌కూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. మోదీకి ఎక్కడో ఎనిమిది మంది దేశాధినేతల అవతల నిలబెట్టారు. అంతెందుకు.. చైనా, పాకిస్తాన్‌కు దశాబ్దాలుగా మిత్ర దేశం అయినప్పటికీ.. ఈ సదస్సులో షరీఫ్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కొసమెరుపు. దీంతో.. షాంగై సదస్సు ఏమోగానీ పాక్ ప్రధాని పరిస్థితి దయనీయంగా, దౌర్భాగ్యంగా కనిపించిందని కొందరు నెటిజన్స్ అభివర్ణించారు. ఇంకొందరైతే ఓ అడుగు ముందుకువేసి.. పుతిన్-మోదీ-జిన్‌పింగ్ భేటీ అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి, ఇటు పాక్ షరీఫ్‌కు పీడకలను మిగిల్చే అవకాశం ఉందంటూ జోకులు పేలుస్తున్నారు. ట్విటర్, రెడ్డిట్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ లాంటి ఫేమస్ ఫ్లాట్ఫారమ్లలో మీమ్స్, ట్రోలింగ్ ముంచెత్తాయి. మిత్ర హస్తం అవతలి వాళ్లు అందించాలే తప్ప.. అడుక్కోకూడదు అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పుతిన్‌తో కరచలనం కోసం ఓ బిచ్చగాడిలా ప్రవర్తించారంటూ పాక్ ప్రజలే ఆయన్ని దెప్పి పొడుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్‌కు, ఆ దేశ ప్రధానికి ఉన్న ప్రాధాన్యం ఇదేనా? అనే చర్చా జోరుగా నడుస్తోంది. అదే సమయంలో పాక్ మీడియా షరీఫ్‌ను గ్లోబల్ పవర్‌హౌజ్ అంటూ కితాబిస్తూ ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
మోదీ కోసం చైనా ప్రతిష్టాత్మక వాహనం.. ప్రత్యేకతలివే..
చైనాలో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల టియాంజిన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మోదీ కోసం ఆ దేశంలోని ప్రతిష్టాత్మక వాహనంగా ఉన్న ‘హాంగ్కీ ఎల్ 5’ను ఏర్పాటు చేసింది. దీనికి చైనాలో అత్యంత ప్రముఖమైన, ప్రభుత్వ లగ్జరీ కారుగా గుర్తింపు ఉంది.హాంగ్కీ ఎల్ 5 ప్రత్యేకతలుహాంగ్కీ అంటే మాండరిన్ భాషలో ‘రెడ్ ఫ్లాగ్’ అని అర్థం.ఇది చైనా పురాతన ప్యాసింజర్ కార్ బ్రాండ్. దీన్ని 1958లో ప్రభుత్వ యాజమాన్యంలోని ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ (ఎఫ్ఎడబ్ల్యు) ప్రారంభించింది.ఎల్ 5 మోడల్‌ను చైనా అగ్రనేతల కోసం, ఎంపిక చేసిన విదేశీ ప్రముఖుల కోసం రిజర్వ్ చేశారు.అమెరికా అధ్యక్షుడు ప్రయానించే ‘బీస్ట్’కు ఆ దేశంలో ఎంత గుర్తింపు ఉంటుందో.. చైనాలో ‘హాంగ్కీ ఎల్ 5’కు అంత గుర్తింపు ఉంటుంది.5.5 మీటర్ల పొడవు ఉండే ఈ కారు బరువు 3 టన్నుల కంటే ఎక్కువే. దీని విలువ సుమారు రూ.7 కోట్లు (సుమారు 8 లక్షల డాలర్లు)గా ఉంటుందని అంచనా. ఇందులో లెదర్, హ్యాండ్‌క్రాఫ్ట్ కలపతో ఇంటీరియర్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖులు సంభాషణకు సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: వారెన్ బఫెట్ పంచ సూత్రాలు.. -
రాజీ కుదిరింది.. ఎన్డీయే తమిళనాడు సీఎం అభ్యర్థిగా ఆయనే!
తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నన్ అన్నామలై, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి తమ మధ్య విబేధాలను పక్కనపెట్టి ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై సందడి చేయడమే కాదు.. సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపైనా స్పష్టత ఇచ్చేశారు. గతంలో ఈపీఎస్ మీద అన్నామలై ఏ స్థాయిలో విరుచుకుపడిందో తెలిసిందే. ‘‘పళనిస్వామి ఓ తెలివితక్కువోడు’’.. అంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారాయన. దీనికి కౌంటర్‌గా ‘‘అన్నామలై బుద్ధిహీనుడని, ఆస్పత్రిలో చేర్పించాలి’’ అని ఈపీఎస్ వర్గం కౌంటర్ ఇచ్చింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య వైరం కొనసాగుతూ వచ్చింది. అంతేకాదు.. ఈ ఇద్దరూ ఏ ఎన్డీయే మీటింగ్‌లోనూ కలిసి మెలిగినట్లు కనిపించేది కూడా కాదు. అలాంటిది.. శనివారం చెన్నైలో జరిగిన జీకే మూపనార్ వర్ధంతి కార్యక్రమంలో ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు.. మాజీ ముఖ్యమంత్రి, ఎన్డీయే తరఫున సీఎం అభ్యర్థి ఎడపాడి పళనిస్వామి ఇప్పుడు మాట్లాడారు అంటూ అన్నామలై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘2026లో మార్పు రావాలి, పేదల అభివృద్ధికి ప్రభుత్వం పని చేయాలి. ఎన్డీయే సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ ఉన్నారు’’ అని అన్నారు. దీంతో వీళ్ల రాజకీయ ఐక్యతపై చర్చకు దారి తీసింది. పళనిస్వామి (EPS), అన్నామలై మధ్య విభేదాలు తమిళనాడు ఎన్డీయే కూటమిలో రాజకీయంగా గణనీయమైన ప్రభావం చూపించాయి. వ్యక్తిగత విమర్శలతో పాటు అన్నాడీఎంకే అవసరం ఎన్డీయేకు లేదన్నట్లుగా అన్నామలై వ్యవహరించారు. పైగా సీఎం అభ్యర్థిగా ఈపీఎస్ వర్గం చేసిన ప్రకటనను ఖండించారు. ఈ తీరుతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. అయితే.. ఈ రాజకీయంతో ఈపీఎస్ వర్గం బలపడగా.. బీజేపీ పరిస్థితి దారుణంగా తయారైంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో.. అన్నామలై వైఖరినే మార్చాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. అందుకే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం వ్యూహం మార్చి.. ఈపీఎస్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. అన్నామలై కూడా పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ EPS కు మద్దతు ప్రకటించినట్లు ఆయన మాటల్లోనే తెలుస్తోంది.వీళ్ల కలయికపై ఆదివారం అన్నామలైకి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. ‘‘పార్టీ చెప్పింది, ప్రధాని మోదీ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని శిరసావహించడం కేడర్‌గా నా బాధ్యత. అది అర్థం చేసుకోండి’’ అని అన్నామలై వ్యాఖ్యానించారు. గత విమర్శలపై ప్రశ్నించగా.. వ్యక్తిగత అభిప్రాయాలు వేరే. పార్టీ కేడర్‌గా క్రమశిక్షణ పాటించాలి కదా. ఉదాహరణకు డీఎంకే మంత్రిపై నాకు ఎంత కోపం ఉన్నా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని నేను గౌరవిస్తాను. ఇది అంతే. పార్టీ చెప్పినట్లే అన్నామలై వింటాడు’’ అని ఆయన వివరణ ఇచ్చారు.అన్నామలై 2011 బ్యాచ్‌కు చెందిన మాజీ IPS అధికారి. కర్ణాటకలో ఆయన పోలీసాధికారిగా సేవలందించారు. 2019లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2020లో BJPలో చేరారు. తమిళనాడు BJP అధ్యక్షుడిగా పనిచేసి.. ‘సింగం’గా ప్రజాదరణ పొందారు. అయితే వరుసగా ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు రాబట్టకపోవడంతో బీజేపీ అధిష్టానం ఆయన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది.తాజా పరిణామం.. అన్నాడీఎంకే బీజేపీల మధ్య విభేదాలు తొలిగాయనడానికి సంకేతంగా నిలిచింది. 2026 ఎన్నికల కోసం ఈపీఎస్ నాయకత్వంలో కూటమి ముందుకు సాగుతుందన్న సంకేతాలు స్పష్టంగా అందిస్తోంది. -
పాకిస్థాన్ కు గట్టి షాక్ ఇచ్చిన ప్రధాని మోదీ
-
SCO సదస్సులో పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ
-
ద్వైపాక్షిక భేటీకి ఒక కారులో ప్రధాని మోదీ, పుతిన్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు చైనాలోని తియాంజిన్‌లో జరగబోయే ద్వైపాక్షిక సమావేశానికి చేరేందుకు ఒకే కారులో ప్రయాణించారు. ఈ ఘటన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఇది ఇరువురి నేతల సాన్నిహిత్యాన్ని లోకానికి చాటిందని నిపుణులు అంటున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాధినేతలు ఒకే కారులో ప్రయాణించారు. After the proceedings at the SCO Summit venue, President Putin and I travelled together to the venue of our bilateral meeting. Conversations with him are always insightful. pic.twitter.com/oYZVGDLxtc— Narendra Modi (@narendramodi) September 1, 2025పుతిన్‌తో తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేసిన ప్రధాని మోదీ.. ‘ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం తర్వాత, అధ్యక్షుడు పుతిన్, నేను మా ద్వైపాక్షిక సమావేశ వేదికకు కలిసి ప్రయాణించాం. ఆయనతో సంభాషణలు లోతుగా ఉంటాయి’ అని రాశారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి ముందు, ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ కరచాలనం చేసుకుని ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ప్రధాని మోదీ ‘అధ్యక్షుడు పుతిన్‌ను కలవడం ఆనందంగా ఉంది’ అంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. -
ట్రంప్, మోదీ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు
-
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం అనేది మానవత్వానికి, శాంతికి ముప్పుగా పరిణమించిందని తియాన్జిన్ వేదికగా సోమవారం జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన ప్రసంగించారు‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్సీవో సభ్య దేశంగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీవో కోసం భారత్ విజన్, పాలసీ 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది. భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు 2025(SCO Summit)లో మోదీ ప్రసంగించారు.సరిహద్దు ఉగ్రవాదం భారత్‌తో పాటు చైనాపైనా ప్రభావం చూపుతోంది. ఇరు దేశాలకూ ఇదొక సవాల్‌గా మారిందని మోదీ స్పష్టం చేశారు.ఈ సమస్యను ఎదుర్కొనడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. పాక్ ప్రధానిపై విసుర్లుSCO సదస్సు వేదికలో పాకిస్తాన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా ఘాటు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ‘‘ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. ఆ దేశాలకు మా కృతజ్ఞతలు. అలాగే.. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేం అంగీకరించబోం’’ అని వ్యాఖ్యానించారాయన. భద్రత ప్రతి దేశ హక్కు. ఉగ్రవాదం మనమందరికీ సవాల్. ఇది కేవలం భారత్‌కు మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ముప్పు. SCO సభ్యదేశాలు ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో ఖండించాలి. అంతర్జాతీయంగా ఏకతా అవసరమని మోదీ పిలుపునిచ్చారు. ఆ సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పాక్‌కు అపమానకరమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతకు ముందు.. సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలను ఆప్యాయంగా పలకరించిన మోదీ.. పాక్ ప్రధాని వైపు కనీసం కన్నెత్తి చూడలేదు.పాక్ పేరు లేకుండానే.. సదస్సు ముగింపు ప్రకటనలో చైనా సహా యూరేషియన్(యూరప్+ఆసియా సమాహారం) దేశాలు భారత్ వైపు నిలిచాయి. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. ఎస్సీవో సదస్సులో తీర్మానం చేశాయి. అయితే.. అందులో ఎక్కడా పాకిస్థాన్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం. చైనా, టర్కీ సహా పలు దేశాలు పహల్గాం బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశాయి. దాడికి పాల్పడినవారిని శిక్షించాలని వేదిక నుంచి గళం వినిపించాయి. ఉగ్రవాదం, విభజనవాదం, తీవ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలని సభ్యదేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అదే సమయంలో.. పాక్‌లో జరిగిన జాఫర్ ఎక్స్‌ప్రెస్, ఖుజ్దార్ దాడులను కూడా ఖండించాయి.మరోవైపు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, చైనా అధినేతలు చర్చించుకున్నారు. ఈ విషయంలో భారత్ చైనా మద్దతు కోరగా.. చైనా అందుకు అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వెల్లడించారు. -
Modi in China: షాంఘై శిఖరాగ్ర సమావేశం ప్రారంభం.. నేడు ప్రధాని మోదీ ప్రసంగం
తియాన్జిన్: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సు ఆదివారం రాత్రి తియాన్జిన్లో ప్రారంభమయ్యింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ విందు కార్యక్రమంతో సదస్సు మొదలయ్యింది. నేడు సదస్సులో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.జిన్‌పింగ్ ఇచ్చిన విందు కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా వివిధ దేశాధినేతలు పాల్గొన్నారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి, పురోగమనంలోకి పయనించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. దక్షిణార్థగోళ దేశాల బలాన్ని పెంపొందించేందుకు, మానవ నాగరికత మరింత పురోగమించడానికి వీలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కాగా 20 మంది విదేశీ నేతలను, 10 అంతర్జాతీయ సంస్థల అధిపతులను ఈ సదస్సుకు జిన్‌పింగ్ ఆహ్వానించారు.సోమవారం వీరంతా కీలక సమావేశంలో పాల్గొననున్నారు. వేదికపై మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చైనాతో సంబంధాలపై ఆయన ఈ సదస్సులో మాట్లాడే అవకాశం ఉంది. మోదీ సహా వివిధ దేశాధినేతలు జిన్‌పింగ్‌తో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కాగా షాంఘై సహకార సంస్థ సదస్సులో వివిధ దేశాలు అభివృద్ధిపై వ్యూహాన్ని ఖరారు చేయడంతో పాటు, భద్రత, ఆర్థిక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. PM Modi, President Putin and President Xi shared a light moment on the sidelines of the SCO Summit in China. pic.twitter.com/pEpAdF4qYi— Tar21Operator (@Tar21Operator) September 1, 2025 -
ట్రంప్ కు భారత్ పెద్ద షాక్..!
-
బంధం బలోపేతమే లక్ష్యం
తియాంజిన్: గల్వాన్ ఘటన తర్వాత ఉద్రిక్తతకు నిలయంగా మారిన సరిహద్దు సమస్యను పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ముందుకొచ్చాయి. షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు సన్నాహక భేటీలో భాగంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తియాంజిన్ తీరనగరంలో దాదాపు 60 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘భారత్, చైనా ద్వైపాక్షిక ఒప్పందాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇరువురం కంకణబద్దమయ్యాం. సమష్టిగా వాణిజ్యం, పెట్టుబడులను మరింతగా విస్తరించి అంతర్జాతీయ వాణిజ్య సుస్థిరతలో మన రెండు ఆర్థికవ్యవస్థలు ఎంతటి కీలకమో చాటి చెబుదాం. సరిహద్దు వెంట ఉద్రిక్తత పొడచూపినా సరే ప్రస్తుతం శాంతి, సుస్థిరత కొనసాగడం సంతోషదాయకం. సరిహద్దు వివాదాల పరిష్కారంలో మన ఇరుదేశాల ప్రతినిధి బృందాలు ఉమ్మడి నిర్ణయంతో ముందుకు వెళ్తున్నాయి. భారత్, చైనా మధ్య నేరుగా విమానసర్వీసులను సైతం పునరుద్దరించాం. మన ద్వైపాక్షిక సహకారం అనేది ఇరుదేశాల్లోని 280 కోట్ల మంది ప్రజల సంక్షేమంతో ముడిపడి ఉంది. పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వంతో మన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం. షాంఘై సహకార సంస్థకు అధ్యక్ష బాధ్యతలు అద్బుతంగా పోషిస్తున్న మీకు నా అభినందనలు. కజాన్ నగరంలో మన చివరి భేటీ ఇరుదేశాల ద్వైపాక్షిక బంధంలో పురోగతికి బాటలువేసింది’’అని జిన్‌పింగ్‌తో మోదీ అన్నారు. భారతీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 50% టారిఫ్‌ల భారం మోపిన వేళ ఎస్సీఓ వేదికగా భారత్, చైనా మైత్రీబంధం బలపడటం వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాలకు దర్ప ణం పట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత మోదీ చైనాలో పర్యటించడం విశేషం. భేటీ తర్వాత మోదీ చైనా కమ్యూనిస్ట్‌పార్టీ పాలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాయ్క్వీని కలిశారు. జిన్‌పింగ్‌తో ఉమ్మడి నిర్ణయం పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చేలా సాయపడాలిన కాయ్క్వీని మోదీ కోరారు. ఎన్నెన్నో అంశాల్లో ఏకతాటి మీదకు ద్వైపాక్షిక వాణిజ్యం మొదలు పెట్టుబడులు, వాణిజ్య లోటు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై మోదీ, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. భేటీ వివరాలను తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలోపేర్కొంది. ‘‘భారత్, చైనాలు రెండూ అభివృద్ధి భాగస్వాములేనని మోదీ, జిన్‌పింగ్ పునరుద్ఘాటించారు. విబేధాలు వివాదాలుగా మారొద్దని ఇరునేతలు అభిలషించారు. నేరుగా విమాన సర్వీసులు మొదలు వీసా జారీ వంటి ఇతరత్రా సదుపాయాల ద్వారా ఇరుదేశాల ప్రజల మధ్య సంబందబాంధ్యవాల పెంపును ఇరునేతలు ఆశిస్తున్నారు. వాణిజ్య బంధం పెంపు, వాణిజ్యలోటు తగ్గింపునకు రాజకీయ వ్యూహాత్మక మార్గంలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఇరునేతలు గుర్తించారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అనేది ఇరు దేశాలకు ఉంది. ఇందులో మూడో దేశం జోక్యాన్ని అస్సలు అనుమతించకూడదని ఇరునేతలు నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా భారత్‌లో వచ్చే ఏడాది జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు విచ్చేయాలని జిన్‌పింగ్‌ను మోదీ సాదరంగా ఆహ్వానించారు. ఆహ్వానించినందుకు మోదీకి జిన్‌పింగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భారత బ్రిక్స్ సారథ్యానికి జిన్‌పింగ్ మద్దతు ప్రకటించారు’’అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఏనుగు, డ్రాగన్ డ్యాన్స్: జిన్పింగ్తియాంజిన్లో మోదీ, జిన్‌పింగ్ కరచాలనం ట్రంప్‌కు కంటగింపుగా మారింది. ఇరుగుపొరుగు వైరిదేశాలు టారిఫ్‌ల మోత కారణంగా మళ్లీ సత్సంబంధాల దిశ గా అడుగులేస్తూ.. సుంకాల సుత్తితో మోదినంత మా త్రాన అంతా అయిపోలేదని పరోక్ష హెచ్చరికలు చేశా యి. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మాట్లాడారు. ‘‘చైనా కు భారత్ చక్కని మిత్రదేశంగా మారుతోంది. ఇరుదేశాల బంధాన్ని వ్యూహాత్మకంగా దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా కొనసాగించాలి. చైనా, భారత్ బంధాన్ని కేవలం సరిహద్దు అంశం నిర్ణయించకూడదు. సరిహద్దు కోణంలో బంధాన్ని చూడకూడదు. ఆసియాలోని రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు పరస్పర వాగ్దానాలతో ముందుకు సాగాలి. అక్కడ విరోధానికి తావివ్వకూడదు. ప్రపంచం ఇప్పుడు శతాబ్దానికొకసారి సంభవించే కీలక మలుపులో ఉంది. అంతర్జాతీయ పరిణామాలు వేగం పుంజుకున్నాయి. తూర్పున ఉన్న చైనా, భారత్ ప్రాచీన నాగరికతతో భాసిల్లింది. మనవి ప్రపంచంలోనే అత్యధిక జనాభా దేశాలు. దక్షిణ ధృవ ప్రపంచంలో మనమే పాత సభ్యులం. ఈ తరుణంలో పొరుగు దేశాలమైనం మనం మిత్రులుగా మెలగాలని నిర్ణయించుకోవడం సరైన ఎంపిక. డ్రాగన్(చైనా), ఏనుగు(భారత్) కలిసి నృత్యం చేయాల్సిన సమయం వచ్చింది. ఎదుటి దేశాన్ని మన అభివృద్దికి అవకాశంగా భావించాలి. అంతేగానీ ప్రమాదకారిగా భావించకూడదు. బహుళధృవ ప్రపంచం కోసం పాటుపడదాం. అంతర్జాతీయ సంస్థల్లో ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా చేద్దాం. ఆసియాసహా ప్రపంచవ్యాప్తంగా శాంతి స్తాపనకు మనవంతు కృషిచేద్దాం’’అని మోదీతో జిన్‌పింగ్ అన్నారు.గ్రూప్ ఫొటోలో జిన్‌పింగ్, పుతిన్ పక్కపక్కనే ద్వైపాక్షిక భేటీ తర్వాత జిన్‌పింగ్ షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) విందు కోసం సభ్యదేశాల అగ్రనేతలను ఆహ్వానించారు. ఇందుకోసం తొలుత ఒక్కో నేతలను వేదిక మీదకు ఆహ్వానించి విడివిడిగా ఫొటో దిగారు. తర్వాత నేతలందరితో కలిసి సతీసమేతంగా గ్రూప్ ఫొటో దిగారు. ఇందులో జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ ముందు వరసలో మధ్యలో నిల్చున్నారు. జిన్‌పింగ్‌కు కుడివైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిల్చున్నారు. మరో ఇద్దరు నేతల తర్వాత ప్రధాని మోదీ సైతం ముందు వరసలో నిల్చుని గ్రూప్ ఫొటోకు పోజిచ్చారు. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జూ, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు ముందు వరసలో నిల్చున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాక్ అగ్రనేతలు ఇలా ఒక అంతర్జాతీయ వేదికపై కనిపించడం ఇదే తొలిసారి. కజక్‌స్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్సహా పలు దేశాల అగ్రనేతలు పర్యవేక్షక, దౌత్య భాగస్వామి, అతిథులుగా ఎస్సీఓ విందులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆసియాన్ వంటి సంస్థలు సైతం ఎస్సీఓ చర్చల్లో పాల్గొననున్నాయి. జిన్‌పింగ్ మెచ్చిన కారు మోదీ కోసం రెండ్రోజుల పర్యటన నిమిత్తం చైనాకు విచ్చేసిన ప్రధాని మోదీ అక్కడ ఎక్కడికి వెళ్లాలన్నా ప్రభుత్వ వాహనంలోనే వెళ్లాల్సి ఉంటుంది. అందుకోసం మోదీ కోసం ప్రత్యేకంగా హాంగ్‌క్వీ కారును తెప్పించారు. ఈ మోడల్ కారు అంటే జిన్‌పింగ్‌కు మహా ఇష్టం. 2019లో మహాబలిపురంలో జిన్‌పింగ్ పర్యటించినప్పుడ ఇదే యాంగ్క్వీ ఎల్5 కారులో కలియతిరిగారు. ఈ కారును రెడ్‌ఫ్లాగ్ అని కూడా పిలుస్తారు. మేడిన్ ఇండియాలాగే ఈ కారు మేడిన్ చైనా అన్నమాట. కమ్యూనిస్ట్ పార్టీ చైనా అగ్రనేతల పర్యటన కోసం 1958లో చైనా ప్రభుత్వరంగ ఫస్ట్ ఆటోమోటివ్ వర్క్స్ సంస్థ ఈ మోడల్ కారును తొలిసారిగా రూపొందించింది. ఇక తియాంజిన్‌లో ఉన్నంతసేపూ పుతిన్ రష్యా తయారీ ఆరస్ మోడల్కారులో తిరగనున్నారు. పాతతరం మోడల్లో ఈ కారు ఉంటుంది. రష్యాకు చెందిన ఆరస్ మోటార్స్ సంస్థ ఈ కారును తయారుచేసింది. చైనా తయారీ నంబర్‌ప్లేట్‌ను తగిలించి పుతిన్ ఈ కారులో ప్రయాణిస్తున్నారు. జిన్‌పింగ్ నోట పంచశీల మాట భారత్, చైనాల మధ్య శాంతి, సుస్థిరతలు పరిఢవిల్లాలంటే దశాబ్దాలనాటి ‘పంచశీల’ఒడంబడిక సూత్రాలను అవలంభిస్తే సబబుగా ఉంటుందని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. మోదీతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా జిన్‌పింగ్ తన మనసులో మాట బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఆనాటి పంచశీల ఒడంబడిక అంశం మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ పంచశీల సూత్రాల ఉనినికి గతంలో ఎన్నో ఒప్పందాల సందర్భంగా భారత్, చైనా గుర్తించాయి. ‘‘పంచశీల సూత్రాలను 70 ఏళ్ల క్రితం నాటి చైనా, భారత్ దిగ్గజ నాయకులు రూపొందించారు. ఇవే సూత్రాలు ఇప్పుడూ అనుసరణీయమే’’అని జిన్‌పింగ్ అన్నారు. ఏమిటీ పంచశీల ఒప్పందం? 1954 ఏప్రిల్ 29వ తేదీన భారత్, చైనా అనుసరించాల్సిన విధానాలను ఐదు సూత్రాల నియమావళిగా రూపొందించారు. వీటిని పంచశీల సూత్రాలు అంటారు. అవి.. 1. తోటి దేశ ప్రాదేశిక సమగ్రత, సారభౌమత్వాన్ని పూర్తిస్తాయిలో గౌరవించడం 2. ఆ దేశంపై దురాక్రమణకు పాల్పడకపోవడం 3. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం 4. ఇరుదేశాల మధ్య సమానత్వం, ఉమ్మడి ప్రయోజనాల కోసం కృషిచేయడం 5. శాంతియుత సహజీవనానికి బాటలు వేయడంఆంక్షలపై పోరాడుతాం: పుతిన్ ట్రంప్ విధించిన వివక్షాపూరిత ఆంక్షలపై చైనా, రష్యా పోరాడుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్యానించారు. ఎస్సీఓ సదస్సు కోసం తియాంజిన్ సిటీకొచ్చిన ఆయన చైనా అధికారిక వార్తాసంస్త జిన్హువాతో మాట్లాడారు. ‘‘అంతర్జాతీయ సవాళ్లను బ్రిక్స్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కీలక మౌలికసదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణకు చైనా, రష్యా అదనపు వనరుల సమీకరణలో తలమునకలయ్యాయి. సామాజికఆర్థికాభివృద్ధికి అవరోధంగా మారినఅమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు చైనా, రష్యా సమష్టిగా పోరాడుతున్నాయి’’అని పుతిన్ అన్నారు. మోదీ, జిన్‌పింగ్ భేటీ ‘పది’నిసలు → రష్యాలో బ్రిక్స్ సదస్సు తర్వాత తొలిసారిగా భేటీ అయిన మోదీ, జిన్‌పింగ్‌లు ఇకమీదటైనా ద్వైపాక్షిక ఒప్పందాల్లో పురోగతిని సాధించాలని నిర్ణయించారు → భారత్, చైనా మధ్య నేరుగా పౌరవిమానయాన సర్వీసులను విస్తరించాలని నిర్ణయించారు → కైలాస్ మానససరోవర్ యాత్ర కోసం భారతీయులకు యాత్రా వీసాలు ఇచ్చేందుకు చైనా ముందుకొచ్చింది → పరస్పర వ్యూహాత్మక సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే మూడో దేశం జోక్యాన్ని ఏమాత్రం సహించకూడదని నిర్ణయించుకున్నారు → సరిహద్దు వెంట బలగాల ఉపసంహరణతో శాంతి స్థాపన సాధ్యమైందని నేతలు పునరుద్ఘాటించారు → భారత్, చైనా ఎప్పటికీ మిత్రులుగా, మంచి పొరుగుదేశాలుగా మెలగాలని జిన్‌పింగ్ అభిలషించారు → ఇరుదేశాల బంధాన్ని కేవలం సరిహద్దు వివాదం కోణంలో చూసే ధోరణిని విడనాడాలని నిర్ణయించుకున్నారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయాలని కోరుకున్నారు → చైనా కంపెనీలకు భారత్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా భారత్‌లో విద్యుత్వాహన రంగం సైతం వేగంగా విస్తరిస్తుందని ఇరునేతలు ఆశించారు → ఇటీవల చర్చల నిర్ణయాలకు అనుగుణంగా మూడు సరిహద్దుల గుండా సరకు రవాణా, వాణిజ్యానికి ద్వారాలు తెరవాలని మోదీ, జిన్‌పింగ్ నిర్ణయించారు → అధిక టారిఫ్‌లతో చెడిన అమెరికా బంధానికి బదులు పరస్పర బంధాన్ని బలపర్చుకుని అంతర్జాతీయంగా వాణిజ్యరంగంలో ఎదగాలని ఇరునేతలు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. -
మీ బోర్డర్ దాటి వస్తున్న పాక్ టెర్రరిస్టుల సంగతేంటి?
న్యూఢిల్లీ: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఇందులో చైనా సరిహద్దుల నుంచి భారత్‌లోకి చొరబడుతున్న పాక్ టెర్రరిస్టుల అంశాన్ని కూడా ప్రధాని మోదీ.. జిన్‌పింగ్ వద్ద ప్రస్తావించారు. అయితే దీనికి చైనా తన సంపూర్ణ మద్దతును భారత్‌కు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ‘ జిన్‌పింగ్ వద్ద పాక్ ఉగ్రవాద కార్యకలాపాలను కూడా మోదీ ప్రస్తావించారు. ఇందుకు చైనా సానుకూలంగా స్పందించింది. టెర్రర్ కార్యకలాపాల వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామని జిన్‌పింగ్ అన్నారు. ఎటువంటి ఉగ్రవాద చర్యల నిర్మూలనకైనా తమ మద్దతు ఉంటుందని జిన్‌పింగ్ అన్నారు. ఇరుదేశాలకు ప్రమాదంగా మారిన ఉగ్రవాద అంశాన్ని జిన్‌పింగ్ కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలనకు భారత్‌కు తమ వంతు సహకారం అందిస్తామన్నారు’ అని విక్రమ్ మిస్రీ పేర్కొన్నారు. టియాంజిన్ నగరంలో ఎస్సీవో సదస్సులో పాల్గొన్న మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి.వాణిజ్య, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారత్-చైనా మధ్య స్థిరమైన, స్నేహపూర్వక సంబంధాలు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, శ్రేయస్సుపై సానుకూల ప్రభావం చూపుతాయి అని ప్రధాని మోదీ తెలపడంతో ఇరు దేశాల సంబంధాలు బలోపేతం కావడానికి అడుగులు పడ్డాయి. ఈ పర్యటన ద్వారా భారత్ తన ప్రాంతీయ ప్రాబల్యాన్ని చాటింది. ఇది భారత్-చైనా సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. -
‘అసలు ట్రంప్‌కు బుర్ర ఉందని అనుకోవడం లేదు’
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఫుల్ స్టాప్ పడ్డ పలు ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా మోదీ.. చైనాలో అడుగుపెట్టారు. ఎప్పట్నుంచో భారత్‌తో సంబంధాల కోసం ఎదురుచూస్తున్న చైనా కూడా మోదీ పర్యటనకు ఘన స్వాగతం పలికింది. ఇదిలా ఉంచితే, భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూ సుంకాలను 50 శాతం పెంచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చైనాకు చెందిన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకుడు ఎయిమర్ టాన్జెన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్నానని చెప్పుకుంటున్న ట్రంప్‌కు కనీసం బుర్ర ఉంటే భారత్‌పై ఆ విధంగా సుంకాలు విధించే వాడు కాదంటూ మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్ పరంగా చూసినా, కార్మికుల పరంగా చూసినా భారత్ అతి పెద్దదని, అటువంటి దేశంపై ట్రంప్ విజ్ఞత లేకుండా వ్యవహరించి తప్పు చేశాడన్నారు . ట్రంప్ తన బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకోవడం, అందులోనూ భారత్ లాంటి దేశంపై సుంకాలతో కాలు దువ్వడం వంటిది అమెరికాకే మంచిది కాదన్నారు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-మోదీల మధ్య జరుగుతున్న చర్చలతో మరో కొత్త శకం ఆరంభం కానుందన్నారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌ను బలవంతంగా లొంగిపోయేలా చేయాలనుకున్నారు. రష్యా ఆయిల్ కొంటే సుంకాలు విధించడం ఏంటి?,. భారత్ లాంటి దేశాన్ని తక్కువ చేసి చూడటం సమంజసం కాదనేది నా అభిప్రాయం. తెలివైన వారు ఎవరూ కూడా ఇలా వ్యవహరించరు. ట్రంప్ చర్య సరైనది కాదు. భారత్‌కు బెదిరింపులకు ఎదురొడ్డి నిలబడే శక్తి ఉంది.. అవకాశం కూడా ఉంది’ అని ఎయిమర్ టాన్జెన్ స్సష్టం చేశారు. ఇదీ చదవండి: భారత్‌లోకి మళ్ళీ టిక్‌టాక్?: మొదలైన నియామకాలు -
స్వదేశీ వస్తువులనే వాడండి
సాక్షి, న్యూఢిల్లీ: రాబోయేది పండుగల కాలమని, ఈ సీజన్లో ప్రజలందరూ స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బహుమతులు, దుస్తులు, అలంకరణలు జీవితంలో ప్రతీది మనదేశంలో తయారైందే ఉపయోగించాలని, ఇది స్వదేశీ అని సగర్వంగా చెప్పుకోవాలని సూచించారు. అదే ఆత్మనిర్భర్ భారత్‌కు దారి తీస్తుందని ఉద్ఘాటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయ వస్తువులపై 50 శాతం సుంకం విధించడంతో అమెరికాతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో దేశం స్వావలంబన చెందాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి 125వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ మాట్లాడారు. వివిధ ప్రాంతాలు గణేష్ చతుర్థి, ఆ తరువాత దుర్గా నవరాత్రులు, దీపావళి పండుగలు వరుసగా వస్తున్నందున పండుగల సమయంలో ప్రజలు స్వదేశీ ఉత్పత్తుల గురించి ఎప్పటికీ మరచిపోకూడదన్నారు. రామాయణం, భారతీయ సంస్కృతి పట్ల ప్రేమ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు చేరుకోవడం చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల విధ్వంసంపై విచారం.. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు చేపట్టిన భద్రతా దళాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానికులు చూపిన ధైర్యాన్ని అభినందించారు. ‘వంతెనలు కూలినా, కొండచరియలు విరిగిపడినా, మనుషుల ప్రాణాలను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ చేసిన కృషి దేశానికి గర్వకారణం’అని కొనియాడారు. ప్రకృతి వైపరీత్యాలు సృష్టించిన విధ్వంసంపై ప్రధాని విచారం వ్యక్తం చేశారు. పటేల్ వల్లే హైదరాబాద్ విమోచన.. ‘భారత సమగ్రతను కాపాడటంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పాత్ర చిరస్మరణీయం. 1948లో ఆయనే చూపిన దూరదృష్టి, ధైర్యసాహసాల వలననే హైదరాబాద్ విమోచన సాధ్యమైంది. సెపె్టంబర్ 17వ తేదీ హైదరాబాద్ విమోచన దినోత్సవం మనకు చరిత్రలోని ఒక మహత్తర గాథను గుర్తు చేస్తుంది. అది కేవలం ఒక ప్రాంత విమోచన కాదు, దేశ సమగ్రతకు బలమైన పునాది. ప్రతిభా సేతుతో వందలాది మందికి ఉపాధి యూపీఎస్సీలో ఎంపిక కాని ప్రతిభావంతుల కోసం రూపొందించిన ‘ప్రతిభా సేతు పోర్టల్’గురించి ప్రధాని ప్రస్తావించారు. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటికే వందలాది మంది ఉపాధి పొందారన్నారు. మధ్యప్రదేశ్ యువకులు ఫుట్‌బాల్ ఆడుతున్న దృశ్యం జర్మన్ కోచ్ దృష్టిని ఆకర్షించడం, వారికి జర్మనీలో శిక్షణ కల్పించడానికి ముందుకు రావడాన్ని ప్రధాని ఉదహరించారు. కొంతమంది ఆటగాళ్లు త్వరలో శిక్షణ కోసం జర్మనీకి వెళతారని ప్రధాని తెలిపారు. సైనికుల గాథలను సేకరించి, అమరవీరుల కుటుంబాలతో సంబంధాలు కొనసాగిస్తున్న సమాజసేవకుడు జితేంద్ర సింగ్ రాథోడ్ సేవలను ప్రధాని ప్రశంసించారు. బీహార్‌కు చెందిన ‘సోలార్ దీదీ’ దేవకి సోలార్ పంపుల ద్వారా గ్రామానికి నీరు అందజేసి రైతుల ఆదాయాన్ని పెంచిన కృషిని గుర్తుచేశారు. విశ్వకర్మ సోదరులకూ వందనం ‘సెపె్టంబర్ 17న విశ్వకర్మ జయంతి. ఆ రోజును మన విశ్వకర్మ సోదరులకు అంకితం చేశాం. వడ్రంగులు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరులు, శిల్పులు – ఈ సంప్రదాయ వృత్తులు భారతీయ నాగరికతకు, సాంస్కృతిక వారసత్వానికి పునాదులు. ఒక తరం నుండి మరొక తరానికి నైపుణ్యాన్ని అందిస్తూ, జ్ఞానాన్ని కాపాడుతూ వస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం ‘విశ్వకర్మ యోజన’ను ప్రారంభించింది’అని మోదీ తెలిపారు. PM Narendra Modi (@narendramodi), during the 125th episode of ‘Mann Ki Baat’, says, "Pratibha Setu Portal is a beacon of hope for those UPSC aspirants who narrowly miss selection, opening doors to fresh opportunities and dignity for talented individuals."(Source: Third Party) pic.twitter.com/ODyOTmT87n— Press Trust of India (@PTI_News) August 31, 2025 -
Modi China visit : ద్వైపాక్షిక సహకారంతోనే ప్రజా సంక్షేమం: ప్రధాని మోదీ
తియాంజిన్: ‘పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి మేము కట్టుబడి ఉన్నాము’ అని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇరుదేశాల ప్రజల సంక్షేమం ఈ ద్వైపాక్షిక సహకారంతో ముడిపడి ఉందన్నారు. సరిహద్దుల్లో శాంతి, స్థిరత్వం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఎస్సీఓ సదస్సులో భాగంగా వీరి మధ్య భేటీ జరిగింది. ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. అమెరికా భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్యనున్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరిన ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నేపధ్యంలోనే మోదీ.. జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. చివరిసారిగా ఈ నేతలు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో కలుసుకున్నారు.2020లో గల్వాన్ లోయలో చోటుచేసుకున్న ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఈ భేటీ తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగా ఇరు దేశాలు ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఈ సమావేశం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సంబంధాలను మెరుగుపరుచుకోవడం ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ప్రధాని మోదీ- జిన్‌పింగ్ భేటీలో ముఖ్యాంశాలుప్రధాని మోదీ , చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య సమావేశం 55 నిమిషాల పాటు కొనసాగింది.కైలాస మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది- ప్రధాని మోదీరెండు దేశాల మధ్య ప్రత్యక్ష విమానాలు కూడా ప్రారంభం కానున్నాయి - ప్రధాని మోదీ శిఖరాగ్ర సమావేశం విజయవంతం అయినందుకు అభినందిస్తున్నాను- జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీసంబంధాలను మెరుగుపరచుకోవడానికి కట్టుబడి ఉన్నాం- జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీగత సంవత్సరం కజాన్‌లో అర్థవంతమైన చర్చలు జరిగాయి- ప్రధాని మోదీ Tianjin, China: During his bilateral meeting with Chinese President #XiJinping, Prime Minister Narendra Modi says, "I congratulate you on China's successful chairmanship of the SCO. I thank you for the invitation to visit China and for our meeting today." pic.twitter.com/McF7aOQu11— Priya Mishra (@Priyaaa_B) August 31, 2025 -
జపాన్ పీఎం దంపతులకు మోదీ కానుకలు
న్యూఢిల్లీ: జపాన్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాకు గౌరవప్రదంగా కొన్ని విలువైన కానుకలు బహూకరించారు. షిగేరు సతీమణికి సైతం మోదీ కానుక అందజేశారు. కశ్మీర్లో లభించే చేతితో అల్లిన అత్యంత నాణ్యమైన పశ్మీనా ఉన్ని శాలువను షిగేరు సతీమణి యోషికోకు బహూకరించారు. లద్దాఖ్‌లోని ఛాంగ్థంగీ జాతి మేక ఉన్నితో ఈ పశ్మీనా శాలువను తయారుచేశారు. ఈ శాలువ అత్యంత తేలికగా, మృదువుగా, వెచ్చగా ఉంటుంది. గతంలో కశ్మీరీ రాజుల కాలంలో ఈ పశ్మీనా ఉన్ని దుస్తులను ఎంతగానో ఇష్టపడేవారు. అదే సంస్కృతిని కశ్మీరీలు పరంపరగా కొనసాగిస్తూ హస్తకళను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. శ్వేతవర్ణ అంచుతో, ఎరుపు, గులాబి రంగుల మేళవింపుతో అందంగా ఈ శాలువాను తయారుచేశారు. కాగితపు గుజ్జు, జగురు ఇతర సామగ్రితో అందంగా రూపొందించిన చిన్న పెట్టెలో పెట్టి ఈ శాలువాను ఆమెకు అందజేశారు. ఈ చిన్న పెట్టె మీద సైతం పుష్పాలు, పక్షుల చిత్రాలను అందంగా పెయింటింగ్ వేశారు. జపాన్ ఆహార అలవాట్లకు అనువుగా.. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే అరుదైన గోధుమరంగు మూన్‌స్టోన్ రాయితో చేసిన రామెన్ గిన్నెను జపాన్ ప్రధానికి మోదీ బహూకరించారు. ఈ రామెన్ బౌల్‌ను పెట్టేందుకు రాజస్తానీ పార్చిన్కారి శైలిలో శ్వేతవర్ణ మక్రానా పాలరాయితో ఒక బేస్‌ను తయారుచేశారు. ఈ బేస్‌పై అరుదైన చిన్న రాళ్లను పొదిగారు. ఈ బౌల్లో ఆహారాన్ని జపాన్ శైలిలో తినేందుకు రెండు చాప్‌స్టిక్‌లను తయారుచేశారు. వాటి కొనలను వెండితో రూపొందించారు. పెద్ద బౌల్‌కు తోడుగా నాలుగు చిన్న బౌల్‌లను అందజేశారు. జపాన్‌లోని డోంబురీ, సోబా సంప్రదాయాల్లో ఇలా ఒక పెద్ద గిన్నె, నాలుగు చిన్న గిన్నెలను వాడతారు. మూన్‌స్టోన్ రాయి ప్రేమ, సమతుల్యత, రక్షణలను సూచిస్తుంది. -
పుతిన్-మోదీ భేటీ వేళ.. జెలెన్స్కీకి ఫోన్‌కాల్
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ వేదికగా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భేటీ కంటే ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్ శాంతి చర్చల అంశంపై ఈ ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది.కీవ్‌పై మాస్కో దాడుల ఉధృతమైన నేపథ్యంలో.. తాజా పరిస్థితులు, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై ఇరు దేశాల నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన సమావేశ వివరాలను జెలెన్స్కీ మోదీకి వివరించారు. అలాగే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని తెలిపారు.‘‘ఉక్రెయిన్ అధ్యక్షుడితో జరిగిన చర్చలో యుద్ధ పరిస్థితి, మానవతా అంశాలు, శాంతి స్థాపన ప్రయత్నాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. భారత్ శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు సంపూర్ణ మద్దతు ఇస్తుంది’’ అని భారత ప్రధాని, జెలెన్స్కీతో ఫోన్‌కాల్ సారాంశాన్ని వెల్లడించారు. మరోవైపు.. జెలెన్స్కీ కూడా సంభాషణను ఉపయోగకరమైన, ముఖ్యమైన చర్చగా అభివర్ణించారు. అలస్కాలో ట్రంప్-పుతిన్ సమావేశం జరిగినప్పటి నుంచి.. రష్యా నుంచి శాంతి సంకేతాలు రాలేదని, రష్యా ఇటీవల తమ పౌరులపై దాడులు ఉధృతం చేస్తోందని, అసలు పుతిన్ శాంతి చర్చలకు సిద్ధంగా లేడని జెలెన్స్కీ అంటున్నారు. ఈ యుద్ధం ముగియాలంటే వెంటనే కాల్పుల విరమణ అమలు కావాలని అని జెలెన్స్కీ మోదీతో చెప్పినట్లు తెలుస్తోంది. -
టియాంజిన్ లో ల్యాండ్ అయిన ప్రధాని మోదీ
-
చైనాలో అడుగుపెట్టిన మోదీ
తియాంజిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడేళ్ల తర్వాత చైనాలో అడుగుపెట్టారు. జపాన్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకొని శనివారం సాయంత్రం చైనాకు చేరుకున్నారు. ఉత్తర చైనాలోని తియాంజిన్‌లో ఆదివారం, సోమవారం జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తోపాటు ఇతర దేశాల అధినేతలతో సమావేశమవుతారు. తియాంజిన్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులు సంప్రదాయ రీతిలో సంగీత, నృత్య కార్యక్రమాలతో స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం భారత్, చైనా కలిసికట్టుగా పనిచేయాలని, పరస్పరం సహకరించుకోవాలని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లు విధించిన నేపథ్యంలో భారత్, చైనా మధ్య సంబంధాలు బలపడుతుండడం, మోదీ–జిన్‌పింగ్ భేటీ అవుతుండడాన్ని ప్రపంచదేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రధాని మోదీ చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. అలాగే చైనా అధినేత జిన్‌పింగ్ 2019 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు. గణనాథుడి చిత్రాన్ని షేర్ చేసిన చైనా ప్రధాని మోదీ చైనా పర్యటన నేపథ్యంలో భారత్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి యూ జింగ్.. వినాయకుడి ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇరుదేశాలు కళలు, విశ్వాసం, సంస్కృతులను పంచుకున్నాయని వెల్లడించారు. ఇవి చైనాలోని టాంగ్ రాజవంశం కాలంలో, మొగావో గుహల్లోని గణనాథుడి ప్రతిమలు అని పేర్కొన్నారు. భారత్, చైనా మధ్య శతాబ్దాలుగా బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఇవి అద్భుతమైన ప్రతీకలు అని యూ జింగ్ స్పష్టంచేశారు. #WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives at a hotel in Tianjin, China. Chants of 'Bharat Mata ki jai' and 'Vande Mataram' raised by members of the Indian diaspora.(Video: ANI/DD) pic.twitter.com/hiXQYFqm07— ANI (@ANI) August 30, 2025 -
SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
సెమీకండక్టర్ రంగం అత్యంత కీలకం
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లో షింకాన్సెన్ బుల్లెట్ రైలులో ప్రయాణించారు. జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో కలిసి రాజధాని టోక్యో నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని సెండాయ్‌కి చేరుకున్నారు. అక్కడ సెమీకండక్టర్ ప్లాంట్‌ను సందర్శించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ తొలి రోజు శుక్రవారం ఇషిబాతో సమావేశమై, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రెండో రోజు శనివారం టోక్యో ఎల్రక్టాన్ లిమిటెడ్–మియాగీ(టెల్ మియాగీ)ను సందర్శించారు. సెమీకండక్టర్ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా మారింది. సెమీకండక్టర్ల తయారీలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, జపాన్ ఇప్పటికే నిర్ణయానికొచ్చాయి. モディ首相と仙台へ。昨夜に引き続き、車内からご一緒します。 pic.twitter.com/ggE6DonklN— 石破茂 (@shigeruishiba) August 30, 2025భారత్‌లో ప్లాంట్ల ఏర్పాటుకు జపాన్ సాంకేతిక సహకారం అందించనుంది. అలాగే 508 కిలోమీటర్ల ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టుకు జపాన్ సహకరించేలా ఒప్పందం కుదిరింది. సెండాయ్‌లో మోదీ గౌరవార్థం ఇషిబా ప్రత్యేక విందు ఇచ్చారు. ఇండియా–జపాన్ మధ్య సహకారంలో సెమీకండక్టర్ రంగం అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. టోక్యో ఎల్రక్టాన్ ఫ్యాక్టరీలో ట్రైనింగ్ రూమ్, ప్రొడక్షన్ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను సందర్శించానని, అధికారులతో మాట్లాడానని తెలిపారు. సెమీకండక్టర్ల రంగంలో భారత్, జపాన్ గత కొన్నేళ్లుగా కలిసికట్టుగా ముందుకు సాగుతున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల సరఫరాలో టెల్–మియాగీ ప్రాధాన్యతను అధికారులు మోదీకి వివరించారు. JR東日本で研修中のインド人運転士さんたちとご挨拶。 pic.twitter.com/UXKoSVP50r— 石破茂 (@shigeruishiba) August 30, 2025 -
భారత్-జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం... ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ.. జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక భేటీ
-
మోదీకి జపాన్ కానుకగా ఇచ్చింది మన బోధిధర్మ ప్రతిమే
జపాన్ పర్యటనలో అక్కడి ప్రఖ్యాత షోరిన్జాన్ దారూమేజీ ఆలయ సందర్శన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కానుకగా అందుకున్న దారూమా ప్రతిమ అందరి దృష్టినీ తెగ ఆకర్షిస్తోంది. చివరికి ఇంటర్నెట్లో కూడా అదే ట్రెండింగ్‌గా మారింది. జపాన్ చరిత్ర, సంస్కృతులతో దారూమాది విడదీయలేని బంధం! జపనీస్ భాషలో దారూమ అంటే బోధిధర్మ అని అర్థం. ఇక జీ అంటే ఆలయం. బోధిధర్ముడు జెన్ బౌద్ధ స్థాపకుడు. రాజధాని టోక్యోకు ఉత్తరాన టకసాకిలో ఉన్న షోరిన్జాన్ దారూమేజీ ఆలయం శతాబ్దాలుగా భక్తులు, పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తూ వస్తోంది. ప్రస్తుత రూపంలోని దారూమా ప్రతిమను రూపొందించింది ఆలయపు తొమ్మిదో పీఠాధిపతి అయిన టొగకు. కొంతకాలంలోనే దారూ మా జపనీయుల ఇంటింటి బొమ్మగా మారి పోయింది. నేటికీ ఏటా దారుమా ప్రతిమోత్సవాన్ని షోరిన్జా న్లో ఘనంగా జరుపుతారు. అలాంటి ప్రతిమను మోదీకి బహూ కరించడం ద్వారా భారత్‌కు జపాన్ శుభాకాంక్షలతో పాటు ఆ ధ్యాత్మిక ఆశీస్సులు కూడా అందించిందని భావిస్తు న్నారు. జపాన్‌లో మామూలు కుటుంబాలతో పాటు రాజకీయ నాయకులు మొదలుకుని వ్యాపారవేత్తల దాకా ఆశలకు, ప్రగతికి ప్రతీకగా ఇళ్లు, కార్యాల యాల్లో దారూమా ప్రతిమను ఉంచుకోవడం పరిపాటి. బోధిధర్ముడు మనవాడే!జెన్ బౌద్ధ స్థాపకుడైన బోధిధర్ముడు భారతీ యుడేనని, అందునా దాక్షిణాత్యుడని, క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందినవాడని చెబుతారు. తమిళ నాడులోని పల్లవ రాజు మూడో కుమారుడైన బోధి« దర్మ సన్యాసం స్వీకరించి జెన్ బౌద్ధాన్ని చైనాకు తీసుకెళ్లాడు. అంతేకాదు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ఆయన సాటిలేని మేటి. ఆ పోరాట కళను చైనాకు పరిచయం చేసింది కూడా బోధిధర్ముడే. అందుకే చైనీయులు ఆయనను దామో పేరిట దైవంతో సమానంగా కొలుచు కున్నారు. మూలికా వైద్యంలోనూ బోధిధర్ముడు సిద్ధుడు. ఆ విద్యను చైనీయులకు ప్రసాదించింది కూడా ఆయనేనని మనవాళ్లు నమ్ముతారు. ఆ సిద్ధవైద్య కళ శాశ్వతంగా తమకే సొంతం కావాలనే దురాశతో చివరికి దారుమాను విషమిచ్చి అంతం చేశారంటారు. ఈ ఇతివృత్తంతో సూర్య హీరోగా కొన్నేళ్ల క్రితం వచ్చిన సెవెన్త్ సెన్స్ సినిమా ఘనవిజయం సాధించింది.ఎటు తిప్పినా పైకే!చూసేందుకు చిన్నదే అయినా, దారూమా ప్రతిమ తాలూకు ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు...→ తెరుచుకుని ఉండే కన్ను, తిరుగులేని బ్యాలెన్స్ దీని ప్రధాన ఆకర్షణలు.→ ఇది గుండ్రంగా, లోపలంతా బోలుగా, కళ్లు చెదిరే రంగులతో కూడి ఉంటుంది.→ భారీదనం కారణంగా దారూమాను ఎటువైపు పడేలా తట్టినా వెంటనే పైకి లేస్తుంటుంది.→ ఏడుసార్లు కింద పడ్డా, ఎనిమిదోసారి కూడా పట్టు వీడకుండా పైకి లేవాల్సిందే’నన్న ప్రఖ్యాత జపనీస్ సామెతకు ఇది ప్రతీకగా నిలుస్తుంది.→ లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి, అహరహం శ్రమించి కలలను నిజం చేసుకోవడానికి దారూమా ప్రతిమను చిహ్నంగా భావిస్తారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కలిసి నడుద్దాం..బలపడదాం!
టోక్యో: భారత్–జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన, సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ సహా వివిధ కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం పదేళ్ల రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జపాన్‌తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం జపాన్‌కు చేరుకున్నారు. రాజధాని టోక్యోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. అదృష్టానికి, శుభానికి సంకేతంగా భావించే జపాన్ సంప్రదాయ దారూమా బొమ్మను బౌద్ధ మత గురువులు బహూకరించారు. అనంతరం జపాన్ ప్రధానమంత్రి షిగెరు ఇషిబాతో మోదీ సమావేశమయ్యారు. భారత్–జపాన్ సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. సెమీకండక్టర్ల నుంచి అరుదైన ఖనిజాల సరఫరా దాకా.. కీలక రంగాల్లో సహకారంపై అభిప్రాయాలు పంచుకున్నారు. మానవ వనరుల అభివృద్ధి, సాంస్కృతిక సంబంధాలపైనా చర్చ జరిగింది. సుస్థిర ఇంధన కార్యక్రమం, బ్యాటరీ సరఫరా వ్యవస్థ భాగస్వామ్యం, ఆర్థిక భద్రత–సహకార కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇరువురు నేతలు ఉమ్మడిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టాలెంట్ విన్నింగ్ కాంబినేషన్’ అని మోదీ ఉద్ఘాటించారు. రెండూ పూర్తిస్థాయిలో ఒక్కటైతే ఇక తిరుగుండదని తేలి్చచెప్పారు. భౌగోళిక రాజకీయాల పరంగా సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్, జపాన్ కలిసికట్టుగా పనిచేయాలని, ఒక దేశం బలాన్ని మరో ఉదేశం ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి భారత్–జపాన్ భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలియజేశారు. ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రెండు దేశాలు సమానమైన సవాళ్లు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. 13 ఎంఓయూలపై సంతకాలు ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దడంలో ప్రజాస్వామ్య దేశాల పాత్ర సహజంగానే అధికంగా ఉంటుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ దిశగానే భారత్, జపాన్ కలిసి ప్రయాణం సాగిస్తున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య బలీయ బంధానికి.. పెట్టుబడులు, నవీన ఆవిష్కరణలు, ఆర్థిక భద్రత, పర్యావరణ పరిరక్షణ, అత్యాధునిక సాంకేతికత, ఆరోగ్యం, రవాణా, ప్రజల మధ్య పరస్పర సంబంధాలు, ప్రభుత్వం నడుమ భాగస్వామ్యమే ప్రాతిపదిక అని వివరించారు. అత్యాధునిక టెక్నాలజీలో భాగస్వామ్యానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడించారు. డిజిటల్ భాగస్వామ్యం 2.0, కృత్రిమ మేధ(ఏఐ) సహకార కార్యక్రమంపై సంప్రదింపులు జరుగుతున్నాయని స్పష్టంచేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్–5 మిషన్‌లో జపాన్ సైతం పాలుపంచుకోనుందని ప్రకటించారు. జపాన్ ప్రధాని ఇషిబా మాట్లాడుతూ.. తదుపరి తరం సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలంటే భారత్–జపాన్ సహకరించుకోవాల్సిందేనని స్పష్టంచేశారు. మోదీ–ఇషిబా భేటీ సందర్భంగా భారత్–జపాన్‌లు 13 అవగాహనా ఒప్పందాల (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రాబోయే పదేళ్లలో భారత్‌లో జపాన్ 10 ట్రిలియన్ యెన్లు (రూ.6 లక్షల కోట్లు) పెట్టుబడిగా పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించారు. రక్షణ, నూతన ఆవిష్కరణల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత్, చైనా ఒక్కటైతేనే.. ప్రపంచ ఆర్థిక క్రమం(ఆర్డర్)లో స్థిరత్వం తీసుకురావాలంటే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన భారత్, చైనా తప్పనిసరిగా కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ వెల్లడించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సౌభాగ్యం కోసం ఆసియాలో దిగ్గజ దేశాలైన భారత్, చైనా మధ్య స్నేహ సంబంధాలు బలపడాల్సిందేనని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న టారిఫ్‌ల యుద్ధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్–చైనాలు ఒక్కటైతే ఇరుదేశాలతోపాటు ప్రపంచ దేశాలకు సైతం మేలు జరుగుతుందని చెప్పారు. జపాన్ పత్రిక యోమియురి షిమ్బన్కు ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్–చైనా సంబంధాల ఆవశ్యకతను వివరించారు.పెట్టుబడులకు స్వర్గధామం పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపు భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయ, ఆర్థిక స్థిరత్వం, పరిపాలన–ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత దేశాన్ని పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చాయని అన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోలో భారత్–జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో ప్రసంగించారు. జపాన్ కంపెనీలు ఇండియాలో 40 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు. -
మిత్ర లాభం
అంతా సవ్యంగా ఉన్న రోజుల్లో భిన్న దేశాలతో దౌత్య సంబంధాలు సాఫీగా సాగి పోతాయి. కానీ సవాళ్లు ఎదురయ్యే కాలంలో వాటిని నిలబెట్టుకోవటం, కొత్త బంధాలు ఏర్పర్చుకోవటం సులభం కాదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరి కారణంగా భారత్–అమెరికా సంబంధాల్లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జపాన్‌లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. ఈ నెల 31న, ఆ మర్నాడూ చైనాలోని తియాన్జిన్లో జరగబోయే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సులో కూడా ఆయన పాలుపంచుకుంటారు. జపాన్‌తో మనకు చిరకాల మైత్రి ఉంది. మన స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ)ని స్థాపించి పోరాడినప్పుడు అన్ని విధాలా చేయూతనందించింది జపానే. స్వాతంత్య్రానంతరం ఆ బంధం మరింత బలపడింది. రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి అనంతరం లాంఛనంగా 1951 సెప్టెంబర్ 8న శాన్ఫ్రాన్సిస్కో శాంతి ఒప్పందం కుదిరినప్పుడు జపాన్‌కు పాక్షిక సార్వభౌమత్వం మాత్రమే ఇవ్వాలన్న నిబంధనను మన దేశం తీవ్రంగా వ్యతిరేకించి సంతకం చేసేందుకు నిరాకరించింది. అందుకు జపాన్ ఈనాటికీ మన పట్ల కృతజ్ఞతగా ఉంటుంది. తొలిసారి 2014లో ఎన్డీయే సర్కారు ఏర్పడినప్పుడే మోదీ జపాన్ను సందర్శించారు. ఈ దశాబ్ద కాలంలో ఇరు దేశాల సంబంధాలూ మోదీ అన్నట్టు ఎన్నో రెట్లు పెరిగాయి. మన దేశంలో ప్రస్తుత జపాన్ పెట్టుబడుల విలువ 4,200 కోట్ల డాలర్లు. దేశంలోని ఢిల్లీ, ముంబై, కోల్‌కతా మెట్రో రైలు ప్రాజెక్టులు జపాన్ ఆర్థిక సహకారంతో సాకారమయ్యాయి. ఢిల్లీ–ముంబై పారిశ్రామిక వాడ, సెమీకండక్టర్లు తదితరాలపై జపాన్ ముద్ర బలంగా ఉంది. ముంబై–అహ్మదాబాద్ మధ్య సాకారం కానున్న బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అత్యాధునిక ఈ–10 రకం బుల్లెట్ రైలును అందించాలని జపాన్ నిర్ణయించింది. వచ్చే పదేళ్లలో మన దేశంలో జపాన్ పెట్టుబడుల్ని పది లక్షల కోట్ల యెన్ల(6,800 కోట్ల డాలర్ల) స్థాయికి తీసుకెళ్లాలని మోదీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా శిఖరాగ్ర సమావేశంలో నిర్ణయించటం, పెట్టుబడులతోపాటు నవీకరణ, పర్యావరణం, ఆరోగ్యం తది తరాల్లో కలిసి పనిచేయాలనుకోవటం... రాగల అయిదేళ్లలో భిన్న రంగాల నిపుణుల సేవలు పొందేందుకు పరస్పరం అయిదు లక్షల మందిని బదలాయించుకోవాలను కోవటం భారత్, జపాన్ల మైత్రి పటిష్ఠతకు నిదర్శనం. ఈ క్రమంలో సహజంగానే సవాళ్లుంటాయి. స్వేచ్ఛాయుత, శాంతియుత, సంపద్వంత ఇండో–పసిఫిక్ ఆవిర్భవించాలన్న నినాదం అమెరికా ఛత్రఛాయలో ఏర్పడింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంత సరిహద్దుల విషయంలో చైనాతో జపాన్‌కు తగాదా లేకున్నా, దాని దూకుడు పెద్ద సమస్యగా మారింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల జపాన్‌కు ఎగుమతుల సమస్య ఏర్పడుతోంది. చైనాను కట్టడి చేయాలన్న బృహత్తర పథకానికి ఈ వివాదం తోడ్పడుతుందని అమెరికా భావించి మనల్ని అందులో కీలక భాగస్వామిని చేసింది. సుంకాల వివాదంలో ఇది ఎటు పోతుందన్న ఆందోళన జపాన్‌కు సహజంగానే ఉంటుంది. అయితే తమ వైఖరి మారబోదని మోదీ చెప్పటం జపాన్‌కు ఊరటనిచ్చే అంశం. ఇండో–పసిఫిక్ విషయంలో మన వైఖరి చైనాకు కంటగింపుగానే ఉండొచ్చు. జపా న్‌తో సంబంధాలు సుహృద్భావంతో ఉండగా, చైనాతో సంబంధాలు అందుకు భిన్నం. సుంకాల వివాదం నేపథ్యంలో భారత్ దగ్గరవుతుందన్న అంచనా చైనాకుంది. ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకు మోదీ వెళ్తారా వెళ్లరా అనే సంశయం మొదట్లో ఉన్నా... రష్యా చొరవతో అది సాధ్యపడుతోంది. ఇది సాన్నిహిత్యానికి దారి తీస్తుందా లేదా అన్నది చూడాలి. చైనా ఇప్పటికే ఎరువులు, అరుదైన ఖనిజాలు, సొరంగాల తవ్వకంలో తోడ్పడే యంత్ర సామగ్రి ఎగుమతులపై ఉన్న నిషేధాలు తొలగించటానికి సూత్రప్రాయంగాఅంగీకరించింది. మోదీ చైనా పర్యటనలో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుంది. చైనాతో మన సంబంధాలు బలపడే సూచనలుండగా, ట్రంప్ సైతం చైనాతో సన్నిహితమై దక్షిణాసియాలో పలుకుబడి పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మన వ్యూహాత్మక ఆధిక్యతను నిలబెట్టుకుంటూ జపాన్, చైనాలతో సఖ్యత కుదుర్చుకోవటం దౌత్యపరంగా మనకు పెను సవాలే. మోదీ దీన్ని ఎలా ఛేదించగలరో చూడాలి. -
భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
టోక్యో: భారత్-చైనా సంబంధాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాతో సంబంధాలు మెరుగు పరుచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. చైనాలో జరగనున్న ఎస్సీవో (షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్) సమ్మిట్ కోసం చైనా తియాంజిన్ నగరానికి వెళ్లనున్నారు.అంతకంటే ముందే చైనా పర్యటనపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న మోదీని ఆ దేశ ప్రముఖ జాతీయ దినపత్రిక ‘యోమియురి షింబున్’ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో అంతర్జాతీయంగా ఆర్ధిక ఒడిదుడుకులు కొనసాగుతున్న తరుణంలో భారత్-చైనాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇరు దేశాలు పరస్పర గౌరవం, ప్రయోజనాలు దీర్ఘకాలికంగా కలిసి ముందుకు సాగాలి. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు తియాంజిన్‌కి వెళ్లనున్నట్లు చెప్పిన మోదీ.. గతేడాది కజాన్‌లో జరిగిన ఓ సమావేశం తర్వాత ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడ్డాయని తెలిపారు.భారత్, చైనా వంటి రెండు పెద్ద దేశాల మధ్య స్థిరమైన, అనుకూలమైన సంబంధాలు ప్రాంతీయ, ప్రపంచ శాంతికి, అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అస్థిరత నేపథ్యంలో భారత్-చైనా కలిసి పనిచేయడం ద్వారా ఆర్థిక స్థిరత సాధించవచ్చని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోదీ శనివారం సాయంత్రం చైనాలోని తియాంజిన్ చేరతారు. ఆదివారం ఉదయం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో 40 నిమిషాల పాటు సమావేశం జరగనుంది. సోమవారం ఎస్సీవో ప్రధాన సమావేశం జరుగుతుంది.ఈ క్రమంలో 2020 నుంచి కొనసాగుతున్న సరిహద్దు ఘర్షణల తర్వాత భారత్-చైనా సంబంధాలను పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. -
రాహుల్ క్షమాపణ చెప్పాలి
గౌహతి: చొరబాటుదార్ల కారణంగా అస్సాంలో జనాభా స్థితిగతుల్లో మార్పులు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటు సమస్యను అధ్యయనం చేయడానికి ప్రధాని మోదీ డెమొగ్రఫీ మిషన్‌ను ప్రకటించారని తెలిపారు. చొరబాటుదార్ల నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామంటూ హామీ ఇచ్చామని, అది కచి్చతంగా నిలబెట్టుకుంటామని తేల్చిచెప్పారు. అమిత్ షా శుక్రవారం అస్సాంలో పర్యటించారు. అస్సాం తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి గోలాప్ బొర్బోరా శత జయంతి వేడుకల్లో ప్రసంగించారు. ఏ ఒక్క చొరబాటుదారుడు మన దేశంలో ఉండడానికి వీల్లేదని స్పష్టంచేశారు. విదేశీయుల అక్రమంగా వచ్చి మన దగ్గర తిష్టవేస్తే సహించాలా? అని ప్రశ్నించారు. చొరబాటుదారులందరినీ బయటకు పంపించక తప్పదని అన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)ను చేపట్టిందని, దానిపై రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రతిపక్షాలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలు ఓటర్ అధికార్ యాత్ర ముసుగులో చొరబాటుదార్ల బచావో యాత్ర చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. ఏ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకైనా ఓటర్ల జాబితా గుండెకాయ లాంటిదని స్పష్టం చేశారు. బిహార్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని అమిత్ షా దుయ్యబట్టారు. రాహుల్ గాం«దీకి నిజంగా సిగ్గుంటే తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నేతలు అస్సాంను పాలించాలా? తరచుగా పాకిస్తాన్‌కు వెళ్లొచ్చే నాయకులు అస్సాంను పరిపాలిస్తామంటే ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని పరోక్షంగా మండిపడ్డారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాజధాని గౌహతితో పంచాయతీ ప్రతినిధుల ర్యాలీలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు చొరబాటుదార్లకు, ఆక్రమణదార్లకు మద్దతిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చొరబాటుదార్లు అస్సాంలో వేలాది ఎకరాల భూమిని ఆక్రమించారని, వారిని వెళ్లగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయతి్నస్తుండగా, కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 1.29 లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వం ఆక్రమణదార్ల చెర నుంచి విడిపించిందని గుర్తుచేశారు. అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ వర్మ అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తుందని చెప్పారు. -
Japan: గాయత్రి మంత్రంతో ప్రధాని మోదీకి స్వాగతం
టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనలో భాగంగా జపాన్‌లోని టోక్యోకు చేరుకున్నారు. ఆయన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. టోక్యోలో ప్రధాని మోదీని గాయత్రి మంత్ర జపంతో స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దానిలో జపాన్ కళాకారులతో పాటు ప్రధాని మోదీ కూడా గాయత్రి మంత్రాన్ని పఠించడం కనిపిస్తుంది.జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జపాన్ పర్యటన చేపట్టారు. ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పలువురు వ్యాపారవేత్తలతో సంభాషించనున్నారు. ‘టోక్యోలో అడుగుపెట్టాను. భారత్- జపాన్ తమ అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేసుకుంటున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని ఇషిబా, ఇతర అధికారులతో సంభాషించాలనుకుంటున్నాను. ఇది సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించడానికి ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ‘ఎక్స్’ పోస్టులో పేర్కొన్నారు. VIDEO | Members of the Japanese community welcomed Prime Minister Narendra Modi in Tokyo by reciting the Gayatri Mantra and other chants as he arrived in Japan.PM Modi is on a two-day visit to Japan at the invitation of Japanese Prime Minister Shigeru Ishiba to attend the 15th… pic.twitter.com/95m0ktLB9U— Press Trust of India (@PTI_News) August 29, 2025టోక్యోలో ఆత్మీయ స్వాగతం అందించిన జపాన్‌లోని భారతీయ సమాజాన్ని మోదీ ప్రశంసించారు.‘టోక్యోలోని భారతీయ సమాజం అందించిన ఆప్యాయత నన్ను బాగా ఆకట్టుకుంది. మన సాంస్కృతిక మూలాలను కాపాడుకుంటూనే ఇక్కడి భారతీయులు మెలగడం నిజంగా ప్రశంసనీయం. జపాన్ పర్యటన పూర్తయ్యాక ప్రధాని మోదీ చైనాను సందర్శించనున్నారు. అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. -
క్వాడ్ టు బుల్లెట్ ట్రైన్ .. జపాన్‌లో ప్రధాని మోదీ చర్చలివే
న్యూఢిల్లీ: అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య సుంకాల ఉద్రిక్తతల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఆసక్తికరంగా మారింది. జపాన్‌తో ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకునే వార్షిక ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ ‘క్వాడ్’పై దృష్టి సారించనున్నారు.ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. జపాన్‌కు చెందిన మీడియా ప్లాట్‌ఫామ్ నిక్కీ ఆసియా, రాబోయే దశాబ్దంలో భారతదేశంతో ద్వైపాక్షిక వ్యాపారాన్ని పెంచడానికి జపాన్ 10 ట్రిలియన్ యన్ (68 బిలియన్ అమెరికన్ డాలర్ల) పెట్టుబడి పెడుతుందని తెలిపింది. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పర్యావరణం మరియు వైద్యంతో సహా బహుళ రంగాలో ఇది ఊతం కానున్నదని పేర్కొంది. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ‘ఎక్స్’లో.. ‘ఇరుదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు, ఆర్థిక,పెట్టుబడి సంబంధాల పరిధిని, ఆశయాన్ని విస్తరించేందుకు, ఏఐ,సెమీకండక్టర్లతో సహా నూతన సాంకేతిక రంగాలలో సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామని అన్నారు.ప్రపంచంలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు, ఇండో-పసిఫిక్ దేశాలకు నిధులు, ఆర్థిక అభివృద్ధికి ప్రత్యామ్నాయాన్ని అందించడానికి ఏర్పడిన వ్యూహాత్మక సమూహమే ‘క్వాడ్’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘క్వాడ్’లో భారతదేశం, ఆస్ట్రేలియా, జపాన్, యునైటెడ్ స్టేట్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించిన తర్వాత క్వాడ్ దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జపాన్ వాణిజ్య సంధానకర్త రియోసీ అకాజావా చివరి నిమిషంలో అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. అలాగే జపాన్.. అమెరికాకు అందించే 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ఖరారు చేయడంలో ఆలస్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. Landed in Tokyo. As India and Japan continue to strengthen their developmental cooperation, I look forward to engaging with PM Ishiba and others during this visit, thus providing an opportunity to deepen existing partnerships and explore new avenues of collaboration.… pic.twitter.com/UPwrHtdz3B— Narendra Modi (@narendramodi) August 29, 2025అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్యాకేజీ మొత్తాన్ని తమ ఇష్టానుసారం పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తామని పేర్కొనగా,జపాన్ అధికారులు అందుకు విభేదించారు. తమ పెట్టుబడి పరస్పర ప్రయోజనాలకు లోబడి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రధాని మోదీ ఈ పర్యటనలో టోక్యోలోని ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, బుల్లెట్ రైళ్ల కోచ్‌లను నిర్మించే తోహోకు షింకన్సెన్ ప్లాంట్‌ను కూడా సందర్శిస్తారు. భారతదేశ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో టోక్యో భాగస్వామ్యం పై ఇరు దేశాలు చర్చించనున్నాయి. భారత్- జపాన్ మధ్య రక్షణ సహకారాన్ని మరింతగా పెంచాలని ప్రధాని మోదీ యోచిస్తున్నారు. జపాన్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు టియాంజిన్‌లో జరిగే షాంఘై శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. -
31న జిన్‌పింగ్‌తో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 31, వచ్చే నెల 1వ తేదీల్లో చైనాలో పర్యటించబోతున్నారు. తియాంజిన్ నగరంలో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీన చైనా అధినేత షీ జిన్‌పింగ్‌తో మోదీ సమావేశమవుతారు. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్–చైనా సంబంధాలు, పరస్పర సహకారంతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై వారు చర్చించే అవకాశం ఉంది. అలాగే వచ్చే నెల 1వ తేదీన రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో నరేంద్ర మోదీ భేటీ అవుతారు.భారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఒత్తిడికి లోనవుతున్న నేపథ్యంలో చైనా, రష్యా అధినేతలతో భారత ప్రధానమంత్రి ప్రత్యేకంగా సమావేశం కాబోతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రష్యా నుంచి ముడి చమురు కొంటున్నందుకు భారత ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్–చైనా మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయి. భారత్‌పై అమెరికా విధించిన భారీ టారిఫ్‌లను జిన్‌పింగ్ తప్పుపట్టారు.ప్రధాని మోదీ చైనాలో పర్యటిస్తుండడం ఏడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆయన చివరిసారిగా 2018లో చైనాలో పర్యటించారు. వూహాన్ సిటీలో షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా, మోదీ–పుతిన్ మధ్య జరగబోయే ద్వైపాక్షిక భేటీకి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇటీవలి కాలంలో ఇండియాకు మరింత దగ్గరయ్యేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన తర్వాత రష్యాపై పశ్చిమ దేశాలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత్, చైనాల నుంచి మరింత సహకారాన్ని పుతిన్ కోరుకుంటున్నారు. తియాంజిన్‌లో మోదీ, జిన్‌పింగ్, పుతిన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు రష్యా ప్రభుత్వం ఇటీవల సంకేతాలిచ్చింది. -
పుతిన్ కాదు.. ఇది ‘మోదీ యుద్ధం’.. భారత్‌పై అమెరికా అక్కసు
వాషింగ్టన్: భారత్‌ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.వైట్‌హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in UkraineAnchor (confused): You mean Putin’s war? Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.అంతకుముందు కూడా నవారో భారత్‌పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్‌ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్‌తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘ట్రంప్ ఫోన్.. ఆపరేషన్ సిందూర్‌ను ఆపిన ప్రధాని మోదీ’
పాట్నా: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే అణచివేశానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. తన చొరవ లేకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉండేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ఆయన ప్రధాని మోదీకి ఫోన్ చేసి ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేయాలని సూచించారని, కాబట్టే ఆపరేషన్ సిందూర్ ఆగిందని ఆరోపించారు.బీహార్ ముజాఫర్పూర్లో కాంగ్రెస్ ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో ట్రంప్ ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. వినండి.. మీరు ఏమి చేస్తున్నారో..అది 24 గంటల్లోపు ఆపండి’అని అన్నారు. అందుకు మోదీ ఆపరేషన్ సిందూర్‌ను ఐదుగంటల్లోనే ఆపేశారంటూ విమర్శలు గుప్పించారు. కాగా,బీహార్‌లో కాంగ్రెస్ తలపెట్టిన ఓటర్ అధికార్ యాత్ర కొనసాగుతోంది. బీహార్‌లో 1,300 కిలోమీటర్ల మేర సాగనుంది. 20కి పైగా జిల్లాలను కవర్ చేస్తూ సెప్టెంబర్ 1న పాట్నాలో ముగియనుంది. #WATCH | Muzaffarpur, Bihar | Addressing during the 'Voter Adhikar Yatra', Lok Sabha LoP Rahul Gandhi says, "Trump said today that when the war between India and Pakistan was going on, I picked up the phone and told Narendra Modi and told him to stop whatever he was doing within… pic.twitter.com/ap4ih0Ruqt— ANI (@ANI) August 27, 2025 -
ఫోన్ చేసి బెదిరించా.. మోదీ యుద్ధం ఆపేశారు: ట్రంప్
భారత్ ఎంత ఖండిస్తున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం.. మంగళవారం వైట్‌హౌస్‌లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజు జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ‘‘ఆ రోజు ఓ కఠినమైన వ్యక్తి.. భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. పాకిస్థాన్‌తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించాను. ఆ తర్వాత పాక్‌తోనూ చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్రస్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుఉందని భావించా. అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్, పాక్‌తో వాణిజ్యఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్‌లతో మీ కళ్లు బైర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటిరోజు దాకా సమయం ఇస్తే.. ఐదు గంటల్లోనే అంతా సద్దుమణిగింది’’ అని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.US President #DonaldTrump once again doubles down on his claim of playing a catalyst in the truce between India and Pakistan.I am talking to a very terrific man, Prime Minister of India, Narendra Modi. I said, What's going on with you and Pakistan?, says Trump.For the latest… pic.twitter.com/8eQ86ZU0ql— NDTV Profit (@NDTVProfitIndia) August 27, 2025భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ గత కొంతకాలంగా ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఈ ప్రకటనలో విపక్షాలు ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ వాదనను భారత్ ఎప్పటికప్పుడు తిరస్కరిస్తూ వస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్–పాకిస్థాన్ మధ్య మిలిటరీ స్థాయి చర్చల ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. అలాగే.. మోదీ–ట్రంప్ మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. ఇక..ఆ మధ్య జీ7 సదస్సు నిమిత్తం కెనడా వెళ్లిన ప్రధాని మోదీ దీనిపై స్పందిస్తూ.. భారత్-పాక్ (India-Pakistan) మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చిచెప్పారు. ‘‘పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్యఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్థాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశం పైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్-పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోం’’ అని నాడు అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టం చేశారు. అయినా కూడా ట్రంప్, అమెరికా అదే పాట పాడుతూ వస్తోంది.ఇదీ చదవండి: ట్రంప్ ఫోన్ కాల్స్‌కు మోదీ నో -
పుతిన్, మోదీలకు జిన్‌పింగ్ రెడ్ కార్పెట్
బీజింగ్: ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు చైనాలోని టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సదస్సు(ఎస్సీవో) సందర్భంగా కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ శిఖరాగ్రానికి రావాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీలను రెడ్ కార్పెట్ పరిచి జిన్‌పింగ్ స్వయంగా ఆహా్వనం పలకనున్నారు. బ్రిక్స్ దేశాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చిన వేళ అమెరికా ఆధిపత్యానికి గండికొట్టడంతోపాటు, ప్రత్యామ్నాయం తామేనని చూపేందుకు జిన్‌పింగ్ ప్రయత్నం చేయనున్నారు. ఈ సదస్సుకు మధ్య, పశ్చిమ, దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాల నేతలు పాల్గొననున్నారు. మరో వారంలో మొదలయ్యే కీలక సదస్సులో ఎస్సీవోలో మరికొన్ని దేశాలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని పరిశీలకులు అంటున్నారు. ‘అమెరికా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రమం ఎలా దారుణంగా ఉంటుందో చెప్పడంతోపాటు, జనవరి నుంచి చైనా, ఇరాన్, రష్యా, తాజాగా భారత్‌ను కట్టడి చేసేందుకు వైట్ హౌస్ చేసిన ప్రయత్నాలు అంతగా ప్రభావం చూపలేదని చూపడానికి ఈ శిఖరాగ్ర సమావేశాన్ని ఒక అవకాశంగా ఉపయోగించుకోవాలని జిన్‌పింగ్ భావిస్తున్నారు’అని ది చైనా–గ్లోబల్ సౌత్ ప్రాజెక్ట్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎరిక్ ఒలాండర్ విశ్లేషించారని రాయిటర్స్ పేర్కొంది. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఐక్య వేదికను చూపుకునేందుకు, బహుళ ధ్రువ క్రమం దిశగా ప్రపంచం సాగుతోందని తెలియజేయడమే చైనా లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. అంతర్జాతీయంగా ఇటీవల చోటుచేసుకున్న దౌత్యపరమైన పరిణామాలు, బ్రిక్స్ దేశాల మధ్య బలోపేతమవుతున్న ఆర్థిక సంబంధాలను ప్రస్తావించిన ఒలాండర్..ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య చర్యల ఫలితమేనన్నారు. ఎస్సీవోలో ప్రస్తుతం 10 శాశ్వత సభ్య దేశాలు, మరో 16 దేశాలు పరిశీలక హోదాలో ఉన్నాయి. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకార దృక్పథానికి ఉన్న ప్రాముఖ్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయని ఒలాండర్ పేర్కొన్నారు. సభ్య దేశాల సంఖ్య పెరిగినప్పటికీ దేశాల మధ్య సహకారం పరంగా చూస్తే బ్రిక్స్ మంచి ఫలితాలను రాబట్టలేకపోతోందని తక్షశిల ఇన్స్టిట్యూట్కు చెందిన మనోజ్ కేవల్రమణి రాయిటర్స్‌తో వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఎస్సీవో లక్ష్యం, ఆచరణాత్మక వైఖరి ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. మొత్తమ్మీద అమెరికా విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకోవడమనేదే ఎస్సీవో ప్రధాన లక్ష్యంగా ఉందని చెప్పారు. సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఈ వేదిక లక్ష్యం అయినప్పటికీ, చైనా–భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను సడలించేందుకు ఇది ఉపయోగపడనుందని తెలిపారు. భారత్ మంకుపట్టును వీడి చైనాతో సామరస్యంగా వ్యవహరిస్తుందని ఒలాండర్ అంచనా వేశారు. తద్వారా ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ శిఖరాగ్రం సందర్భంగా భారత్–చైనాలు సరిహద్దుల్లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణతోపాటు వీసా నియంత్రణలు, వాణిజ్య సంబంధాల బలోపేతానికి సంబంధించిన కీలకమైన ప్రకటనలు చేయవచ్చని తెలిపారు. వాతావరణ మార్పుల వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య సహకారం విస్తృతం కానుందన్నారు. భద్రతా పరమైన అంశాల్లో ఎస్సీవో సాధించే పురోగతి మాత్రం పరిమితంగానే ఉంటుందని కేవల్రమణి విశ్లేషించారు. 2001లో ఎస్సీవోను ప్రకటించాక జరుగుతున్న అతిపెద్ద శిఖరాగ్రం ఇదే. అంతర్జాతీయ వ్యవహారాల్లో పెరుగుతున్న ఈ కూటమి ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుందని పరిశీలకులు అంటున్నారు. కొత్త ప్రపంచ క్రమతను చాటే ముఖ్యమైన వేదిక ఎస్సీవో శిఖరాగ్రమని చైనా విదేశాంగ శాఖ తాజాగా అభివర్ణించడం గమనార్హం. -
ట్రంప్ ఫోన్ కాల్స్‌కు మోదీ నో
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడేందుకు పదేపదే ప్రయత్నించారా? అందుకు మోదీ తిరస్కరించారా? ట్రంప్‌తో సంభాషణకు మోదీ ఇష్టపడలేదా? అంటే.. అవుననే చెబుతోంది జర్మనీ వార్తాపత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమేని(ఎఫ్ఏజెడ్). భారత ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం ఏకంగా 50 శాతం టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. దీనిపట్ల భారత నాయకత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీతో ఫోన్లో మాట్లాడడానికి ట్రంప్ కనీసం నాలుగుసార్లు ప్రయత్నించారని జర్మనీ పత్రిక పేర్కొంది. అమెరికా నుంచి నాలుగుసార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని వెల్లడించింది. అమెరికా విజ్ఞప్తులను ఆయన గట్టిగా తిరస్కరించారని, ట్రంప్ విధించిన టారిఫ్‌ల పట్ల తన ఆగ్రహాన్ని పరోక్షంగా వ్యక్తీకరించారని స్పష్టంచేసింది. ఈ మేరకు జర్మనీ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని బెర్లిన్‌కు చెందిన గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ థార్‌స్టెన్ బెన్నర్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ట్రంప్ శాపనార్థాలు భారత్–అమెరికా మధ్య గత 25 ఏళ్లుగా సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కానీ, ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచి్చన తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడాన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. భారత్ ఇస్తున్న సొమ్మును ఉక్రెయిన్‌లో యుద్ధానికి రష్యా ఖర్చు చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అందుకే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రంప్ హెచ్చరికలను భారత ప్రభుత్వం లెక్కచేయకపోవడంతో ప్రతీకార చర్యల కింద 50 శాతం టారిఫ్‌లు విధించారు. భారత్–రష్యా సంబంధాల గురించి తాను పట్టించుకోనని, ఆ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు మృతప్రాయంగా మారుతాయంటూ ట్రంప్ శాపనార్థాలు సైతం పెట్టారు. అయితే, ట్రంప్‌కు ప్రధాని మోదీ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని తేలి్చచెప్పారు. టారిఫ్‌లకు బెదిరిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. రెచ్చగొట్టేలా ట్రంప్ చర్యలు! మరోవైపు భారత్–పాకిస్తాన్ ఘర్షణను తానే ఆపేశానని ట్రంప్ తరచుగా చెప్పుకుంటున్నారు. తాను చొరవ తీసుకోకపోతే రెండు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేదని ఆయన బహిరంగంగా పేర్కొన్నారు. భారత్‌పై ఒత్తిడి తెచ్చి పాకిస్తాన్‌పై దాడులకు తెరదించేలా చేశానని ట్రంప్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ హఠాత్తుగా ఆగిపోవడం తన ఘనతేనని స్పష్టంచేశారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను భారత్ పలుమార్లు ఖండించింది. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. భారత్–పాక్ యుద్ధాన్ని ఆపేసినందుకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడినని అంటున్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ను ట్రంప్ ముద్దు చేస్తున్నారు. వైట్‌హౌస్‌కు అధికారికంగా ఆహా్వనించి, ఘనంగా విందు ఇచ్చారు. పాకిస్తాన్‌కు ఆర్థికంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ భారత ప్రభుత్వానికి రుచించడం లేదు. ట్రంప్ చర్యలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని భావిస్తోంది. అందుకు ట్రంప్‌తో మాటాడ్డానికి ప్రధాని మోదీ ఇష్టపడలేదని తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి కాలంలో చైనాతో సంబంధాలకు మోదీ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఆయన ఈ నెలాఖరులో చైనాలో పర్యటించబోతున్నారు -
హన్సల్ పూర్ లో స్వదేశీ ఈవీ ఫెసిలిటీని ప్రారంభించిన మోదీ
-
భారత్‌లో రూ.70 వేలకోట్ల పెట్టుబడి!.. సుజుకి మోటార్ ప్రెసిడెంట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్‌కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్‌తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు. -
5 ఏళ్లు.. 70,000 కోట్లు
హన్సల్పూర్, గుజరాత్: ఆటో రంగ జపనీస్ దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ భారత్‌లో రానున్న 5–6ఏళ్లలో రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా దేశీయంగా కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకోనున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్ తొషిహిరో సుజుకీ పేర్కొన్నారు. దేశీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ తొలిసారిగా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు ఈ–విటారా ఎగుమతులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అంతేకాకుండా హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహన తయారీలో వినియోగించే లిథియం అయాన్ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తికి సైతం ప్రధాని తెరతీశారు. రానున్న 5–6 ఏళ్లలో దేశీయంగా రూ. 70,000 కోట్ల పెట్టుబడులను చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తొషిహిరో వెల్లడించారు. భారత్ మొబిలిటీ ప్రయాణంలో నాలుగు దశాబ్దాలుగా భాగస్వామి అయినందుకు గర్వపడుతున్నట్లు చెప్పారు. గ్రీన్ మొబిలిటీ, వికసిత భారత్ లక్ష్యాల సాధనలో మద్దతివ్వడానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. వార్షికంగా 40 లక్షల యూనిట్ల తయారీ లక్ష్యాన్ని అందుకునేందుకు తాజా పెట్టుబడులను వినియోగించనున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఇందుకు మద్దతుగా మౌలికసదుపాయాలు, ఆర్అండ్డీ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: సుంకాల ప్రభావం.. ఎదురయ్యే సవాళ్లు: ఆర్బీఐ గవర్నర్జీఎస్టీ సమావేశం తర్వాత.. వచ్చే నెలలో నిర్వహించనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తదుపరి గుజరాత్లో రెండో ప్లాంటు ఏర్పాటుపై స్పష్టత రాగలదని భార్గవ పేర్కొన్నారు. రూ. 35,000 కోట్ల పెట్టుబడితో రెండో ప్లాంటును నెలకొల్పనున్నట్లు గతేడాది ప్రకటించిన నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబుగా భార్గవ జీఎస్టీ నిర్ణయాల కోసం వేచిచూస్తున్నట్లు తెలియజేశారు. ఎగుమతులకు ఉద్ధేశించిన ఈ–విటారా కార్లను 100 దేశాలకు సరఫరా చేయనున్నట్లు భార్గవ వెల్లడించారు. అయితే దేశీయంగా ఎప్పుడు విడుదల చేసేదీ వెల్లడించలేదు. బ్యాటరీలను దిగుమతి చేసుకుంటుండటంతో కార్ల తయారీ ధర అధికంగా ఉందన్నారు. కాగా.. సుజుకీ గ్రూప్ ఇప్పటికే భారత్‌లో రూ. లక్ష కోట్లను ఇన్వెస్ట్ చేసినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 11 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగినట్లు తెలియజేసింది.#WATCH | Gujarat: Prime Minister Narendra Modi flags off the 'e-VITARA', Suzuki’s first global strategic Battery Electric Vehicle (BEV), at the Suzuki Motor plant in Hansalpur, Ahmedabad. (Source: DD News) pic.twitter.com/CLKE9nvnKG— ANI (@ANI) August 26, 2025 -
టారిఫ్‌ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్‌పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్‌పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
Trump Tariffs: కేంద్రం కీలక భేటీ
-
భారత్‌కు అమెరికా టారిఫ్ నోటీసులు
వాషింగ్టన్: భారత్‌పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసు జారీ చేసింది. భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసింది.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగస్టు 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందించాలని యూఎస్ ఏజెన్సీలను ఈ ఉత్తర్వులో ఆదేశించారు. దీనిలో భాగంగా భారతదేశంపై కొత్త సుంకాల విధింపును కూడా పేర్కొన్నారు.ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగులనుండి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీసు ద్వారా సంకేతాలిచ్చారు. ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ఇప్పటివరకు యూఎస్.. చైనాతో సహా రష్యన్ చమురు కొనుగోలుదారులపై ఇలాంటి చర్యలను చేప్టటలేదు. ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్ భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా అమెరికా ఈ చర్య చేపట్టింది. అయితే భారత్ వీటిని ద్వితీయ సుంకాలని పేర్కొంటూ, వీటిని అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. అదే సమయంలో చర్చలలో పురోగతి చోటుచేసుకుంటే పెరిగిన సుంకాల అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది.కాగా అహ్మదాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ అమెరికా సంకాలపై స్పందిస్తూ.. వాషింగ్టన్ విధించే ఆర్థిక ఒత్తిడిని లెక్క చేయమని, ఇందుకు ప్రతిగా తమ ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటామని, నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎంతో శక్తిని పొందుతోందని, దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందన్నారు. -
భరిస్తాం.. స్వప్రయోజనాలను పణంగా పెట్టం: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అధిక పన్నుల భారం మోపినా భరిస్తాంగానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమెరికా మోపిన 50 శాతం దిగుమతి టారిఫ్ భారంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సోమవారం సొంతరాష్ట్రంలో పర్యటన ఆరంభించిన ప్రధాని మోదీ రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత రెండు కిలోమీటర్ల మేర రోడ్‌షో నిర్వహించారు. తర్వాత అహ్మదాబాద్‌లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజ నాలే భారత్‌కు ముఖ్యం. అదనపు టారిఫ్‌ల పేరిట మాపై పెనుభారం మోపినా భరిస్తాం. అంతేగానీ స్వప్రయోజనాలను పణంగా పెట్టబోం’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ భారత్‌పై విదేశీ ప్రభావాన్ని మోదీ ప్రధా నంగా గుర్తు చేశారు. ‘‘ ప్ర పంచ దేశాల్లో నేడు రాజకీ యాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూతా తిరుగుతున్నాయి. అయినా సరే నేను మహాత్మా గాంధీజీ చూపిన స్వదేశీ వస్తువు లకు పట్టం కట్టాలనే బాటలోనే పయనిస్తున్నా. అందుకే చిన్నపరిశ్రమలు, కర్షకులు, పశుపోష కులకు నేనొక్కటే చెప్పదల్చు కున్నా. మీ ప్రయోజ నాలే నాకు సర్వోన్నతం. మీ ప్రయోజనాల విష యంలో మా ప్రభుత్వం ఏమాత్రం పట్టు సడలించదు. మాపై ఎంతటి ఒత్తిడి పడినా సరే మేం భరిస్తాం. మీ ప్రయో జనాలకు భంగం కల్గకుండా చూసుకుంటాం’’ అని మోదీ అన్నారు. చక్రధారి, చరఖాధారి బాటలో..‘‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ, శక్తిసామర్థ్యాలకు, పరి రక్షణకు మారుపేరైన సుదర్శన చక్రధారి అయిన మోహన్ కృష్ణ భగవానుడు, ఛరఖాధారి అయిన మోహన్ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో భారత్ పయనిస్తోంది. నూలు వడికే రాట్నం చక్రంతో గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ఉరకలెత్తించారు. పహల్గాంలో ఉగ్ర ముష్కరుల పాశవిక దాడికి దీటుగా బదులిస్తూ భారత సైనికుల తెగువ, ధైర్య సాహసాలకు దర్పణమే ఆపరేషన్ సిందూర్’’ అని మోదీ అన్నారు.కాంగ్రెస్‌పై విమర్శల జడి‘‘60 నుంచి 65 ఏళ్లపాటు భారత్‌ను పాలించిన కాంగ్రెస్ కూడా ‘దిగుమతి స్కామ్’లకు పాల్పడి భారత్‌ను పరాయి దేశాలపై సరుకుల కోసం ఆధారపడేలా మార్చేసింది. పరాధీనంగా మార్చేసి బాపూజీ కీలక ఉపదేశమైన స్వదేశీ మంత్రాన్ని కాంగ్రెస్ మంటగల్పింది. గాంధీజీ పేరు చెప్పుకుని తిరిగే కాంగ్రెస్ పెద్దలు ఆయన సూచించిన స్వచ్ఛత, స్వదేశీ పదాలను గాలికొదిలేశారు’’ అని మోదీ విమర్శించారు. -
ఇది పరిశ్రమకు కొత్త విజయగాథ: నరేంద్ర మోదీ
ఇండియన్ ఆటోమొబైల్ రంగం దినదినాభివృద్ధి చెందుతోంది. వాహన ఉత్పత్తిలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ మరింత ముందుకు దూసుకెళ్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం 100 దేశాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోందని, దీనిని పరిశ్రమకు "కొత్త విజయగాథ" అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు.భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల ఎగుమతి అంశంపై.. ప్రభుత్వం మొదటిసారిగా ఒక సంఖ్యను నిర్ణయించింది. దేశీయ వాహన తయారీదారులు తమ ప్రపంచ వ్యూహాలను వేగవంతం చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. దేశ ఆర్ధిక వ్యవస్థకు.. ఆటోమొబైల్ రంగం కీలకంగా ఉంది. దీనిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.దశాబ్ద కాలంలో.. భారతదేశ ఆటో ఎగుమతులు బాగా పెరిగాయి. 2014లో దీని విలువ రూ. 50,000 కోట్లు ఉండగా.. నేడు ఇది రూ. 1.2 లక్షల కోట్లకు చేరిందని మోదీ స్పష్టం చేశారు. భారతదేశం నుంచి కార్లు, బైకులు మాత్రమే కాకుండా.. మెట్రో కోచ్‌లు, ట్రైన్ కోచ్‌లు, లోకోమోటివ్ల రవాణాను పెంచాలని అన్నారు.ఇదీ చదవండి: టెక్ దిగ్గజం అతిపెద్ద డీల్.. నెలకు రూ.5.4 కోట్ల రెంట్!భారతదేశం ఎదగాలంటే.. అనుకున్నది సాధించాలంటే, దిగుమతులపై ఎక్కువ ఆధారపడకూడదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విదేశాలలో లభించే పరిజ్ఞానం బాగానే ఉండవచ్చు, కానీ దేశ దీర్ఘకాలిక స్థితిని నిర్ణయించేది మాత్రం స్వదేశీ ఆవిష్కరణలేనని అన్నారు. సొంత పరిజ్ఞానం అలవాటు చేసుకోవాలని మోదీ సూచించారు. -
పీఎం మోదీ డిగ్రీ వివరాలు బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఎన్నో ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీ వివాదం అంశానికి సంబంధించి తనిఖీకి అనుమతిస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ప్రధాని మోదీ విద్యకు సంబంధించిన రికార్డులను బహిరంగ పర్చాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతోంది. 1978లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నరేంద్ర మోదీ.. బీఏ డిగ్రీ పూర్తి చేశారని చెబుతున్న నేపథ్యంలో, ఆ డిగ్రీ వివరాలను బహిర్గతం చేయాలన్న డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే 2016లో కేంద్ర సమాచార కమిషన్.. మోదీ డిగ్రీ రికార్డులను తనిఖీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది ఢిల్లీ యూనివర్సిటీ. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25వ తేదీ) సీఐసీ ఆదేశాలను కొట్టేసింది. వ్యక్తిగత గోప్యత హక్కు అనేది తెలుసుకునే హక్కు కంటే మిన్న అని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. యూనివర్సిటీ విద్యార్థుల రికార్డులు,.. ఆర్టీఐ చట్టం కింద బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని తేల్చింది.మోదీ డిగ్రీ వివరాలను కోర్టుకు అందించేందుకు యూనివర్సిటీ సిద్ధంగా ఉన్నా, అవి అపరిచితులతో పంచుకోవడం గోప్యత ఉల్లంఘన అవుతుందని ఢిల్లీ యూనివర్శిటీ తరఫున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు.. సీఐసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. తాజా హైకోర్టు తీర్పుతో ఇప్పటి వరకూ మోదీ డీగ్రీ వివాదంపై జరుగుతున్న రాజకీయ వివాదానికి దాదాపు ముగింపు దొరికినట్లే కనబడుతోంది. -
ధన్‌ఖడ్ రాజీనామాపై అమిత్ షా స్పందన.. రాజ్యాంగ సవరణపై ఇలా..
ఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా అంశం, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగానే ధన్‌ఖడ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. అలాగే, రాజ్యాంగ సవరణ బిల్లును ఉద్దేశించి.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని ప్రశ్నించారు.ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు. అనంతరం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై మాట్లాడుతూ.. రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు అని అన్నారు.#WATCH | On opposition raising questions about the resignation of former VP Jagdeep Dhankhar, Union HM Amit Shah says, "...'Baat ka batangad nahi banana chahiye' (don't make a fuss about it). Dhankhar ji was on a constitutional post and during his tenure, he did good work… pic.twitter.com/jJGRMogynf— ANI (@ANI) August 25, 2025ఇదే సమయంలో 130వ రాజ్యాంగ సవరణపై మాట్లాడుతూ.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా?. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు. ప్రధాని గానీ, ముఖ్యమంత్రి లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమ తమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా మోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?. బిల్లు కచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది అని వ్యాఖ్యలు చేశారు. -
బీజేపీ, ఈసీ మిలాఖత్
అరారియా: మోదీ సర్కారు, కేంద్రం ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముసుగులో బిహార్‌లో ఓట్ల దోపిడీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. బిహార్‌లో ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో భాగంగా అరారియా జిల్లాలో ఆదివారం బహిరంగ సభలో, అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘నా యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఓటు చోర్, గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగా, దిగిపో) అంటూ ఆరేళ్ల బాలుడు సైతం నినదిస్తున్నాడు’’ అన్నారు. ‘‘బిహార్‌లో ఎస్ఐఆర్ ముసుగులో ఏకంగా 65 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితా నుంచి తొలగించారు. దీనిపై బీజేపీ నోరువిప్పడం లేదు. బీజేపీ, ఈసీ కుమ్మక్కుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈసీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నానంటూ నాపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఎస్ఐఆర్ను బిహార్ ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు’’ అని చెప్పారు. ‘ఇండియా’దే గెలుపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు విపక్ష ‘ఇండియా’ కూటమిదేనని రాహుల్ ధీమా వెలిబుచ్చారు. ‘‘కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయి. పరస్పరం గౌరవించుకుంటున్నాయి. మేం కలిసి పోటీ చేస్తాం. గెలుస్తాం. దీనిపై మా మేనిఫెస్టో కమిటీ కార్యాచరణ ప్రారంభించింది. రైతు సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం’’ అని వెల్లడించారు. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్‌కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్‌కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్‌కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్‌కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్‌ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్‌వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్‌తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్‌ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్‌ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోండి.. భారత్‌కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్‌గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్‌కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్‌ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్‌గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
తేజస్వీ యాదవ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
గడ్చిరోలి/కటిహార్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్ట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశారన్న ఆరోపణలపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై మహారాష్ట్రలో కేసు నమోదైంది. గడ్చిరోలి బీజేపీ ఎమ్మెల్యే మిలింద్ నరొటే ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు శుక్రవారం చెప్పారు.ఈ పరిణామంపై తాజా తేజస్వీ యాదవ్ స్పందించారు. ‘కేసులను చూసి భయపడను, ఇకపైనా నిజమే మాట్లాడుతా’అని ఆయన ప్రకటించారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీహార్ పర్యటన వేళ తేజస్వీ యాదవ్ ‘ఎక్స్’లో బీహార్ ప్రజలకు మోదీ ఇచ్చిన హామీలన్నీ వట్టి భూటకమని విమర్శించారు. ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా తేజస్వీ కటిహార్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రధాని హామీలను భూటకమనడం అభ్యంతరకరమైన మాటలు ఎలా అవుతాయి అంటూ ఎదురుదాడి చేశారు. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోనివ్వండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి
న్యూఢిల్లీ: అంతరిక్ష రహస్యాలు ఛేదించడమే లక్ష్యంగా మరింత లోతైన ప్రయోగాలకు సిద్ధం కావాలని స్పేస్ సైంటిస్టులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి ప్రయోగాలు మానవాళి భవిష్యత్తుకు ఉపకరిస్తాయని తెలిపారు. డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ‘జాతీయ అంతరిక్ష దినం’సందర్భంగా మోదీ శుక్రవారం ఒక వీడియో విడుదల చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష మిషన్ల కోసం ఇప్పటినుంచే వ్యోమగాముల బృందాన్ని సిద్ధం చేస్తున్నామని, యువత ఇందులో భాగస్వాములు కావాలని సూచించారు. చంద్రుడిపైకి, అంగారకుడిపైకి చేరుకున్నామని, ఇకపై అంతరిక్షం లోతుల్లోకి వెళ్లాల్సి ఉందని అన్నారు. స్పేస్ సెక్టార్లో ఒక విజయం తర్వాత మరో విజయం సాధించడం మన దేశానికి, మన సైంటిస్టులకు సహజమైన అలవాటుగా మారిందని ప్రధానమంత్రి హర్షం వ్యక్తంచేశారు. మన విశ్వానికి సరిహద్దు అంటూ లేదని, మన ప్రయోగాల్లోనూ సరిహద్దులు ఉండకూడదని చెప్పారు. ఎలక్ట్రిక్ ప్రొపల్షన్, సెమీ–క్రయోజెనిక్ ఇంజన్ల వంటి అధునాతన సాంకేతికతను మనం సాధించామని తెలిపారు. -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్‌పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్‌ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్‌పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్‌ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్‌పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్‌ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్‌కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్‌ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్‌కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్‌కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
లార్డ్ స్వరాజ్‌పాల్ కన్నుమూత
లండన్/న్యూఢిల్లీ: ప్రముఖ ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ (94) లండన్‌లో కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఇటీవల ఆయన చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారు. స్వరాజ్‌పాల్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పాటుపడిన దానశీలిగా ఆయన్ను అభివరి్ణంచారు. బ్రిటన్–భారత్ సంబంధాలను బలోపేతం చేసేందుకు స్వరాజ్ పాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. వ్యాపార దిగ్గజం, దానశీలి, అంతర్జాతీయంగా ప్రవాస భారతీయులకు ఆయనొక ఐకాన్ అని తెలిపారు. 1966లో కుమార్తె చికిత్స కోసం బ్రిటన్ వెళ్లిన లార్డ్ పాల్ ఆ తర్వాత అక్కడే అంతర్జాతీయ సంస్థ కపారో గ్రూప్‌ను నెలకొల్పారు. ఉక్కు, ఇంజినీరింగ్, ప్రాపర్టీ తదితర రంగాల్లో దిగ్గజంగా తీర్చిదిద్దారు. బ్రిటన్‌లో అత్యంత సంపన్న ఏషియన్‌గా ఎదిగారు. దశాబ్దాల పాటు వ్యాపార, రాజకీయ రంగాల్లో కీలకంగా నిల్చారు. -
‘ఆనాడు కేజ్రీవాల్ రాజీనామా చేసుంటే.. ఈ బిల్లు వచ్చేది కాదు’
న్యూఢిల్లీ: రాజకీయ నాయకులు తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ వరుసగా నెల రోజులు జైల్లో ఉంటే వారు తమ పదవులకు రాజీనామా చేయాల్సిందేనని బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బిల్లును విపక్షాలు వివాదాస్పద బిల్లు అని అంటుంటే, కేంద్రం మాత్రం దాన్ని సమర్ధించుకుంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పైబడినా ఈ తరహా బిల్లును ఎవరూ తీసుకురాలేదని, దీన్ని తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వం గర్విస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లులకు చట్ట సవరణలు చేయాలా? వద్దా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఈ బిల్లుకు చట్ట సవరణ వద్దు అని విపక్షాలు పట్టుబట్టినా దాన్ని తాము ముందుకు తీసుకెళ్లామన్నారాయన. పీఎం నుంచి సీఎం, మంత్రులు ఇలా వెవరైనా తీవ్ర నేరాలకు పాల్పడి ఆ అభియోగాలపై 30 రోజుల పాటు జైల్లో ఉంటే రాజీనామా చేయాలనే బిల్లును తీసుకొస్తే తప్పేముందని ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రశ్నించారు. ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కారణంగానే తీసుకొచ్చిన బిల్లు అనే చర్చకు కూడా ఆయన పుల్‌స్టాప్ పెట్టారు. లిక్కర్ కేసులో జైలు పాలైన అరవింద్ కేజ్రీవాల్ అప్పుడే రాజీనామా చేసి ఉంటే ఈ బిల్లు వచ్చి ఉండేది కాదేమో అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొచ్చారు అమిత్ షా. ఎక్కడైనా నైతికత అనేది చాలా ముఖ్యమైనదని, దాన్ని తుంగలో తొక్కి మళ్లీ పదవులు అలంకరిస్తామంటే కుదరదన్నారు. తీహార్ జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన సాగించిన విషయాన్ని అమిత్ షా ఉదహరించారు. ప్రజాస్వామ్యంలో నైతికతకు ప్రతీ ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత తీసుకోవాలనేది తమ విధానమన్నారు. ఈ క్రమంలోనే బిల్లును సవరించామన్నారు. ‘ఈ దేశంలోని ప్రజలు.. ఏ రాష్ట్ర సీఎం అయినా జైల్లో ఉండి పరిపాలించాలని కోరుకుంటారా?, ఇదేంటో అర్థం కావడం లేదు. ఇక్కడ ఎవరి వైపు నుంచి చూసినా నైతికత అనేదే ముఖ్యం’ అని కేరళలోని మనోరమా న్యూస్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. People of the nation have to decide whether they want a PM, CM, or minister to run government from jail. pic.twitter.com/a8yiTYXM5T— Amit Shah (@AmitShah) August 22, 2025 కాగా, గతేడాది ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసులో జైలు శిక్షను అనుభవించారు. జైలు నుంచి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి సంగతి అటుంచితే.. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ రాజీనామా చేయలేదు. -
ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా ఒక్కటే రూల్ : మోదీ
-
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
గయాజీ: అవినీతికి పాల్పడి జైలుపాలైన ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తప్పించడానికి చట్టం తీసుకొస్తామంటే ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. అధికారం వెలగబెడుతున్న వ్యక్తులు జైలుకెళ్లి, అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్న పరిస్థితులు చూసి మనం నిజంగా బాధపడాలని అన్నారు. ఒకవైపు ఊచలు లెక్కిస్తూ మరోవైపు ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారంటే మనం చింతించాలని చెప్పారు. అలాంటి వ్యక్తులు(ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూ) రాజ్యాంగ విలువలను హేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేరగాళ్లు జైలు నుంచే పరిపాలన చేస్తామంటే మనం చూస్తూ ఉండిపోవాలా? అని నిలదీశారు. 11 ఏళ్ల మా పాలనలో ఎలాంటి అవినీతి మరక లేదని గర్వంగా చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ పాలనలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, బిహార్‌లో ఆర్జేడీ అవినీతి బాగోతాలు ప్రతి ఒక్కరికీ తెలుసని చెప్పారు. అందుకే అవినీతి ముఖ్యమంత్రులు వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచే తొలగించేలా చట్టం తీసుకురావాలని నిర్ణయించామని, ప్రధానమంత్రి సైతం వరుసగా 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుంచి దిగిపోవాల్సిందేనని స్పష్టంచేశారు. ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా తప్పుచేసి 50 గంటలు జైల్లో ఉంటే పోస్టు నుంచి తొలగిస్తారని, మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులను ఎందుకు వదిలిపెట్టాలి? అని ప్రశ్నించారు. తాము తీసుకొస్తున్న కఠినమైన చట్టాన్ని కాంగ్రెస్, ఆర్జేడీ సహా ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని, చేసిన పాపాలకు శిక్ష పడుతుందని భయపడుతున్నాయని విమర్శించారు. నేరగాళ్లు ఉండాల్సింది జైల్లోనే తప్ప పదవుల్లో కాదన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీలు అధికారంలో ఉన్నప్పుడు జనం సొమ్ముతో బొజ్జలు నింపుకున్నాయని నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ శుక్రవారం బిహార్, పశి్చమ బెంగాల్లో పర్యటించారు. బిహార్‌లోని గయాజీ జిల్లాలో రూ.13,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మూడు మెట్రో రైలు మార్గాలను ప్రారంభించారు. ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130 సవరణ) బిల్లు– 2025తోపాటు బిహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పరోక్షంగా సమరి్థంచారు. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... ‘‘పహల్గాంలో మన పర్యాటకులను బలి తీసుకున్న ముష్కరులపై ప్రతీకారం తీర్చుకుంటామని బిహార్ గడ్డపైనే ప్రతిజ్ఞ చేసి, నెరవేర్చి చూపించా. ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టాం.ఓట్ల కోసమే విపక్షాల ఆరాటం: దేశంలో జనాభా స్వరూపం మారకుండా చూడాలన్న లక్ష్యంతో అక్రమ వలసదార్లు, చొరబాటుదార్లపై చర్యలు తీసుకుంటే విపక్షాలకు ఉలుకెందుకు? మన దేశానికి వలసదార్లు, చొరబాటుదార్లు అతిపెద్ద ముప్పుగా మారారు. ఈ సమస్య గురించి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించా. కొన్ని రాష్ట్రాల్లో జనాభా స్వరూపమే మారిపోతోంది. స్థానికులు మైనారీ్టలుగా మారుతున్నారు. ఇది ఇకపై సాగడానికి వీల్లేదు. అందుకే డెమోగ్రఫీ మిషన్ ప్రారంభించాలని నిర్ణయించాం. కానీ, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడేందుకు ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చొరబాటుదార్లను ప్రోత్సహిస్తోంది. కేవలం అధికారం దాహంతో దేశ భద్రతను పణంగా పెడుతోంది. చొరబాటుదార్లను గుర్తించి, వెనక్కి పంపించే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. చొరబాట్లను సహించే ప్రసక్తే లేదు. వారు మన దేశంలో తిష్ట వేస్తామంటే ఒప్పుకోం. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు బుజ్జగింపు రాజకీయాలను నమ్ముకుంటున్నాయి. చొరబాటుదార్ల ఓట్లతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నాయి. అక్రమంగా వచ్చినవారంతా దేశం విడిచి వెళ్లిపోవాల్సిందే. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి సాగనంపాలి’’. -
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్‌గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్‌ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్‌కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్‌కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు.. కానీ: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కొంతకాలంగా ఓట్ చోరీ అంశంపై అటు ఈసీనీ, ఇటు కేంద్రాన్ని విమర్శిస్తున్న ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చురకలంటిచినట్లు తెలుస్తోంది. ఈరోజు(గురువారం, ఆగస్టు 21) పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా టీ బ్రేక్‌లో ఎన్డీఏ నేతలతో మోదీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌లో యువత టాలెంట్‌కు కొదవలేదు. చాలామంది యువ కాంగ్రెస్ నాయకుల్లో మంచి టాలెంట్ ఉంది. యూత్ కాంగ్రెస్ లీడర్లు మంచి టాలెంటెడ్ ఉన్నారు. కానీ వారికి మాట్లాడే అవకాశం రావడం లేదు. దాన్ని రాహుల్ గాంధీనే కల్పించడం లేదు. రాహుల్ గాంధీ అభద్రతా భావంతో ఉన్నట్లు ఉన్నారు. ఇది ‘‘ కుటుంబ అభద్రతాభావం’’ అయి ఉండొచ్చు’ అని ఎన్డీఏ నేతలతో మోదీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. సమావేశాల్లో భాగంగా 21 రోజుల పాటు జరిగిన లోక్‌సభ నేడు నిరవధికంగా వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎక్కువ శాతం నిరసనలతోనే సభ గడిచింది. బీహార్‌లో చేపట్టిన ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చ చేపట్టాలని విపక్షాలు ముందు నుంచి డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ఆ అంశంపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను ప్రభుత్వం మాత్రం పక్కన పెట్టేసింది. జాబితా నుంచి 65 లక్షల ఓటర్ల తొలగింపుపై చర్చ చేపట్టాలని వర్షాకాల సమావేశాలు ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేశాయి.నేడు లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చారు. కానీ విపక్షాలు మాత్రం తమ పట్టువీడలేదు. విపక్షాల తీరుతో విసుగెత్తిన స్పీకర్ ఓం బిర్లా .. సభను నిరవధికంగా వాయిదా వేశారు. -
నింద మాటున ప్రభుత్వాలను కూల్చేస్తారా?... ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రుల తొలగింపు బిల్లులపై లోక్‌సభలో విపక్షాల ఆగ్రహం
-
మళ్లీ చివురించిన చెలిమి
ఏ దేశానికైనా ప్రథమ ప్రాధాన్యం స్వీయ ప్రయోజనాలు. ఆ తర్వాతే మిగిలినవన్నీ. గాల్వాన్ ఘర్షణల తర్వాత గత అయిదేళ్లుగా భారత్, చైనాల మధ్య ఏర్పడిన వివాదాలు అనేకానేక చర్చల పరంపర తర్వాత కూడా అసంపూర్ణంగానే ఉండిపోయిన నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మన దేశంలో రెండురోజులు పర్యటించటం, ఇరు దేశాల మధ్యా ఏదో మేరకు సదవగాహన కుదరటం హర్షించదగ్గ పరిణామం. ఆయన ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అంతకు ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌తో చర్చలు జరిపారు. ఇరుగు పొరుగు అన్నాక సమస్యలు ఉంటాయి. ఒకటి రెండు పర్యటనలతోనో, రెండు మూడు దఫాల చర్చల్లోనో అవి పరిష్కారం కావాలంటే సాధ్యం కాకపోవచ్చు. అందుకు ఎంతో ఓరిమి, తమ వైఖరిపై అవతలి పక్షాన్ని ఒప్పించే నేర్పు అవసరం. దీర్ఘకాలం ఆ వివాదాలను కొనసాగనిస్తే మూడో దేశం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. నిరుడు అక్టోబర్‌లో రష్యాలోని కజాన్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అప్పటికి నాలుగేళ్ల తర్వాత తొలిసారి కలుసుకున్నారు. ఇరు దేశాల సంబంధాలనూ సాధారణ స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మొన్న జూన్‌లో కైలాస– మానససరోవర్ యాత్రకు భక్తులను అనుమతించేందుకు చైనా అంగీకరించింది. భారత్ సందర్శించే చైనా యాత్రికులకు మన దేశం పర్యాటక వీసాలు పునరుద్ధరించింది. ఈనెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో చైనాలోని తియాన్జిన్లో షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో వాంగ్ యీ వచ్చారు. ఆ సదస్సుకు మోదీ హాజరుకావాలంటే సుహృద్భావ సంబంధాలు అవసరమని కూడా చైనా భావించింది. ప్రధాని ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి హాజరైతే ఆయన ఏడేళ్ల అనంతరం చైనా సందర్శించి నట్టవుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్యా జరిగిన ఘర్షణల తర్వాత సైనికాధికారుల స్థాయిలో చాలా దఫాలు చర్చలు సాగాయి. అయినా సరిహద్దుల్లో ఏప్రిల్ 2020కి ముందున్న పరిస్థితులు ఏర్పడలేదు. ఆఖరికి కజాన్‌లో మోదీ–షీల మధ్య సమావేశం తర్వాత కూడా గత పది నెలల్లో చెప్పుకోదగ్గ ప్రగతి లేదు. వాంగ్ యీ పర్యటన సందర్భంగా ఇరుదేశాలూ 12 అంశాల్లో కీలక నిర్ణయాలు తీసు కున్నాయి. రెండు దేశాల మధ్యా విమాన రాకపోకలను పునరుద్ధరించుకోవాలనీ, వివాదాస్పద సరిహద్దు సమస్యపై చర్చించేందుకు మూడు వేర్వేరు బృందాలు ఏర్పాటు చేసుకోవాలనీ తీర్మా నించాయి. సరిహద్దు విషయంలో ఇప్పుడు పనిచేస్తున్న బృందంతో పాటు తూర్పు, మధ్య సెక్టార్లకు సంబంధించి వేర్వేరు బృందాలు ఏర్పడితే త్వరితగతిన పరిష్కారం సాధించవచ్చని ఇరు దేశాల విదేశాంగమంత్రులూ భావించారు. అలాగే వాణిజ్యాన్ని పెంచుకోవటానికి సరి హద్దుల్ని మళ్లీ తెరవాలని నిర్ణయించారు. లిపూలేఖ్ పాస్, షిప్కి లా పాస్, నాథూ లా పాస్‌ల గుండా ఈ వాణిజ్యం సాగుతుంది. అలాగే పరస్పరం పెట్టుబడుల ప్రవాహానికి కూడా అనుమ తిస్తారు. అన్నిటికన్నా ముఖ్యం – అరుదైన ఖనిజాల ఎగుమతులకు చైనా అంగీకరించటం. స్మార్ట్ ఫోన్ల నుంచి ఫైటర్జెట్ల వరకూ, విండ్ టర్బైన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకూ ఉత్పాదన ప్రక్రియలో ఈ అరుదైన ఖనిజాలు అత్యవసరం. ఇవి ప్రపంచంలో 99 శాతం చైనాలోనే లభ్యమవుతాయి. వీటితోపాటు ఎరువుల ఎగుమతులపై లోగడ విధించిన నిషేధాన్ని తొలగించ టానికి చైనా అంగీకరించటం ఈ పర్యటనలో ప్రధానాంశం. మన రైతులు ఎక్కువగా మొగ్గు చూపే డీఏపీ ఎరువులు చైనాలో ఉత్పత్తవుతాయి. రెండుచోట్లా ప్రవహించే నదీజలాలపై డేటాను ఇచ్చిపుచ్చుకోవటానికి భారత్, చైనా అంగీకరించాయి. త్రీగోర్జెస్ డ్యామ్‌ను మించిన స్థాయిలో బ్రహ్మపుత్ర నదిపై 16,000 కోట్ల డాలర్ల వ్యయంతో భారీ ఆనకట్ట నిర్మించాలని చైనా తలపెట్టిన నేపథ్యంలో నదీ జలాల డేటాపై అంగీకారం కుదరటం హర్షించదగ్గది.చర్చల తర్వాత తాజా ప్రపంచ పరిణామాలపై వాంగ్ యీ విడుదల చేసిన ప్రకటనలో పరోక్షంగా అమెరికా వ్యవహారశైలిపై విమర్శలుండటం గమనార్హం. స్వేచ్ఛా వాణిజ్యాన్నీ, అంతర్జాతీయ సంబంధాలనూ భగ్నం చేసేలా కొందరు ఏకపక్షంగా బెదిరింపులకు దిగుతున్న పర్యవ సానంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన ప్రస్తావించారు. ఆధిపత్య ధోరణులు ఏ రూపంలో ఉన్నా గట్టిగా ప్రతిఘటించటం చాలా అవసరం. ఏదేమైనా ఇరుదేశాలూ సాధ్యమైనంత త్వరగా సరిహద్దు సమస్యకు పరిష్కారం అన్వేషించగలిగితే, ఉగ్రవాదం అంతానికి చేతులు కలిపితే... ప్రధాని మోదీ చెప్పినట్టు అది రెండు దేశాల మధ్య మాత్రమే కాదు, ఆసియా ఖండంలోనే కాదు... యావత్ ప్రపంచశాంతికీ, సౌభాగ్యానికీ దోహదపడుతుంది. సాధ్యమైనంత త్వరగా అది సాకారం కావాలని ఆశించాలి. -
దీపావళి కానుకపై ఆశలు
దేశవ్యాప్త వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)ని ఎనిమిదేళ్ళ క్రితం అట్టహాసంగా ప్రారంభించారు. ఆ సందర్భంగా అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించారు. దేశాన్ని ఉమ్మడి ఆర్థిక మార్కెట్‌గా ఏకీకృతం చేసే చారిత్రక సంస్కరణగా దాన్ని కొనియాడారు. పరోక్ష పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తున్నామన్నారు. ఘర్షణలు, ఎగవేతలను నిర్మూలిస్తుందని చెప్పారు. ఎక్సైజ్, సర్వీసు పన్నులను విధించే హక్కును కేంద్ర ప్రభుత్వం వదులుకోవడంతో సాయలాపాయలాగా కుదుర్చుకున్న వ్యవహారంగా జీఎస్టీ సంస్కరణ ఆమోదం ఖ్యాతికెక్కింది. దానికి తగ్గట్లుగానే అన్ని రాష్ట్రాలూ రాష్ట్ర స్థాయిలో విధించే అమ్మకం పన్నులు, విలువ–జోడింపు పన్ను, ఆక్ట్రాయ్ వంటి ఇతర చిన్నా చితకా పన్నులను విధించే హక్కును కేంద్రానికి దత్తం చేశాయి. రాష్ట్రాలకు పన్నుల రాబడులలో ఏర్పడే లోటును తాము భర్తీ చేస్తామని కేంద్రం వాగ్దానం చేయడం వల్ల ఆ రాజీ బేరం కుదిరింది. రాష్ట్రాలు పన్నుల విధింపులో ఉన్న స్వయం ప్రతిపత్తిని త్యాగం చేశాయి. దీన్ని 2017 నాటి తొలి చట్టంలో జీఎస్టీ పరిహార క్లాజుగా చేర్చారు. ఆ క్లాజు గడువు 2022తో పూర్తయింది. ఇపుడు జీఎస్టీలో తమ వాటా ఒక్కసారిగా బాగా తగ్గిపోయే ప్రమాదం ఉందని రాష్ట్రాలు భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ‘దీపావళి కానుక’గా జీఎస్టీలో పెద్ద సంస్కరణనే తీసుకురానున్నట్లు ప్రకటించడం హర్షణీయం. తదుపరి సంస్కరణలు సాధారణ ప్రజానీకంపై, ముఖ్యంగా మధ్యతరగతి, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలపై పన్ను భారాన్ని తగ్గించేవిగా ఉంటాయని ఆయన వాగ్దానం చేశారు. సంస్థాగత సంస్కరణలు, రేటు హేతుబద్ధీకరణ, బతుకు తెరువును సులభతరం చేయడమనే మూడు అంశాలను ప్రభుత్వం పరిగణించవచ్చు.పుట్టుకలోనే లోపాలురూపకల్పన, అమలులో కూడా ఏకీకృత, దేశవ్యాప్త, పరోక్ష పన్నుగా జీఎస్టీ పుట్టుకలోనే కొన్ని లోపాలున్నాయని చెప్పక తప్పదు. రూపకల్పనలోని లోపం ఏమిటంటే, జీఎస్టీ వంటి పరోక్ష పన్ను అంతర్గతంగానే తిరోగమనమైనది. ఒక వ్యక్తి చెల్లించే పన్ను ఆ వ్యక్తి ఆదాయంపైన కాక, కొనే వస్తువు విలువపై ఆధారపడి ఉంటుంది. కనుక, జీఎస్టీ మంట ధనికుల కన్నా పేదలకు ఎక్కువ తెలుస్తుంది. ఆదాయ పన్ను, సంపద పన్ను వంటి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నుల కన్నా ఔచిత్యంతో కూడినవిగా ఉంటాయి. మీ పన్ను ఆదాయంతోపాటే పెరుగుతుంది. ఆదాయం తగ్గితే పన్ను ఉండదు.జీఎస్టీలోని అసమంజసత్వాన్ని తగ్గించేందుకు బహుళ శ్లాబులు పెట్టారు. పేదలు కొనే వస్తువులను సున్నా లేదా 5 శాతం శ్లాబులో పెట్టారు. ధనికులు కొనే వస్తువులను హెచ్చు శ్లాబులో పెట్టారు. ఇది ఒక రకంగా పేదలు ఏ వస్తువులను వాడాలో శాసించడమవుతుంది. సాధారణంగా ఆహారం, ఔషధాలను పన్నుల నుంచి మినహా యించే విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉంది. అన్ని వస్తు వులు, సేవలకు ఒకే రేటు ఉండటం హేతుబద్ధమైన, సమర్థమైన వ్యవస్థ అనిపించుకుంటుంది. యూరోపియన్ యూనియన్ దేశాలు, సింగపూర్, ఆస్ట్రేలియాలలో అది కనిపిస్తుంది. మధ్యస్థ రేటు ఉండా లన్నది స్థూలంగా అంగీకరించే సూత్రం. (ఆహారం, ఔషధాలు వంటి) అత్యవసర వస్తువులపై చాలా తక్కువగా, (పొగాకు, మద్యం వంటి) వ్యసన, విలాస వస్తువులపై చాలా ఎక్కువగా ఉంటుంది. సులభతర శ్లాబులు మేలుఇక అమలులో లోపాల గురించి ముచ్చటించుకుందాం. జీఎస్టీ బహుళ పన్ను శ్లాబుల (0 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం, పాప కార్యాల కింద వచ్చే వాటిపై వేసే పన్ను, వివిధ సెస్సులు)తో కూడిన సంక్లిష్ట వ్యవస్థ. ఈ సంక్లిష్టత, వస్తువులు, సేవల వర్గీకరణ, పన్ను చెల్లింపుదారులలో అయోమయం, వ్యాజ్యాలు వంటి వివాదాలకు దారితీస్తోంది. అంతిమ వస్తువుల పైన కన్నా ఆ యా వస్తువులను తయారు చేసేందుకు ఉపయోగించే వస్తువులపై పన్ను రేట్లు అధికంగా ఉన్న దృష్టాంతాలు కూడా ఉన్నాయి. ఇది దేశంలో వస్తూత్పత్తిని నీరుగారుస్తోంది. వ్యవసాయం, పెట్రోలు ఉత్పత్తులు, విద్యుచ్ఛక్తి, ఆల్కహాల్, స్థిరాస్తుల రంగం వంటి జీడీపీలోని పెద్ద భాగాలు... జీఎస్టీ పరిధికి బయటనే కొనసాగుతున్నాయి. కొన్నింటికి మినహాయింపు ఇవ్వడం వల్ల రెవెన్యూ తగ్గుతుంది. జీఎస్టీ సంస్కరణలోని స్ఫూర్తి దెబ్బతింటోంది. చిన్న వ్యాపారాల వారు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల వారిపై భారం పడుతోంది. కారణం– వారు వెంటనే జీఎస్టీ చెల్లించాల్సి రావడం, వారి ఖాతాదారులు చెల్లింపులలో జాప్యం చేయటం! రిఫండులలో జాప్యాలు ఉండనే ఉన్నాయి. ఇవి వ్యాపారు లకు చేతిలో నగదు ఆడకుండా చేస్తున్నాయి. ప్రధాని ప్రకటించిన ప్రతిపాదిత సంస్కరణల్లో ఒకటి గణ నీయమైన మార్పు తీసుకురాగల ఆశ రేపుతోంది. అది ప్రస్తుత బహుళ శ్లాబుల పద్ధతిని రద్దు చేసి, రెండు (స్టాండర్డ్, మెరిట్ ) రేట్ల శ్లాబుల సులభతర విధానానికి మళ్ళడం! కొన్ని ఎంపిక చేసిన వస్తువులపైన మాత్రం ప్రత్యేక రేట్లు ఉంటాయి. వ్యాజ్యాలతోపాటు, వర్గీకరణకు సంబంధించిన వివాదాలు తగ్గుతాయి. దైనందిన వాడుక వస్తువులు, జనం సమకూర్చుకోవాలని ఆశపడే వాటిపై పన్ను రేటు తగ్గుతుందని భావిస్తున్నారు. వినిమయం పెరగడం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రేట్లు తగ్గించడం వల్ల భారతదేశపు ఎగుమతుల పోటీ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఉద్యోగాల కల్పనకూ సాయపడుతుంది. మధ్యస్థ రేటును మరీ భారం మోపేదిగా ఉన్న 18 శాతంగా కాక 15 శాతంగా నిర్ణయించవచ్చు. పన్నుల సంస్కరణలపై ఏర్పాటు చేసిన కేల్కర్ సత్వర కార్యాచరణ బృందం సిఫార్సు చేసినట్లుగా దాన్ని 15 శాతంకన్నా తక్కువగా 12 శాతంగా నిర్ణయిస్తే ఇంకా బాగుంటుంది. రాష్ట్రాలకు చేయి తిరిగేలా...చివరగా, ఫెడరలిజంలో (ఆరోగ్యం, విద్య వంటివాటిపై) వ్యయాల బాధ్యతలను రాజ్యాంగం రాష్ట్రాల పైనే మోపింది. కానీ, స్వతంత్ర ఆదాయ వనరులను మాత్రం కొద్దిగానే కల్పించింది. ఈ అసమతౌల్యాన్ని జీఎస్టీ ఇంకా పెంచి, కేంద్ర బదలాయింపులపైనే రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడక తప్పని స్థితి కల్పించింది. స్థానిక అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి నిధుల సమీకరణకు రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారం కొంత కావాలి. జీఎస్టీ భారతదేశపు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసిందనే అభిప్రాయం ఒకటి ఉంది. రాష్ట్రాలకు కోశాగారాన్ని విస్తరించుకునే, స్వయం ప్రతిపత్తిని కల్పించే అవకాశాన్ని పునరుద్ధరించేందుకు అన్వేషించవలసిన అవసరం ఉంది. ఫలితంగా, రాష్ట్రాలు వాటి నిర్దిష్ట ఆర్థిక, సామా జిక, ప్రాంతీయ అవసరాలకు తగ్గట్లుగా విధానాలు రూపొందించు కోగలుగుతాయి. అసమానతలను తగ్గించేందుకు, ప్రస్తుతం పరోక్ష పన్నుల వైపు తూగిన తక్కెడను ప్రత్యక్ష పన్నుల వైపు మొగ్గే విధంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అజీత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త (‘దక్కన్ హెరాల్డ్’ సౌజన్యంతో) -
భారత్‌పై సుంకాలు అందుకే.. కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్‌పై సుంకాల విషయమై అమెరికా మరోసారి స్పందించింది. ఉక్రెయిన్, రష్యా యుద్దం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహంలో భాగంగానే భారత్‌పై సుంకాల విధించినట్టు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చారు. రష్యాపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇలా చేసినట్టు తెలిపారు.వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని ట్రంప్ నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయా దేశాల నేతలతో ట్రంప్ చర్చల్లో ఉన్నారు. ఇదే సమయంలో ఉక్రెయిన్‌పై దాడులు నేపథ్యంలో రష్యాతో వాణిజ్యం కొనసాగించే దేశాలపై ట్రంప్ దృష్టి సారించారు. ఆ దేశాలను లక్ష్యంగా చేసుకొని ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. అది ట్రంప్ పరిపాలన వ్యూహం. ఇందులో భాగంగా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించారని అన్నారు. ఇదే సమయంలో భారత్ ఎప్పుడు అమెరికాకు మిత్ర దేశమే అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భారత్- పాక్‌ల మధ్య యుద్ధాన్ని ట్రంప్ వాణిజ్యంతో ముగించారని పాత పాటే పాడారు.మరోవైపు.. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని తెలిపారు. నాటో సెక్రటరీ జనరల్‌తో సహా యూరోపియన్ నాయకులతో జరిగిన చర్చలే తొలి అడుగు అని పేర్కొన్నారు. త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. Breaking:President Trump has put 'sanctions' on India to put 'this war (in Ukraine) to a close' & he 'wants to see this war end' says White House Spokesperson Karoline Leavitt pic.twitter.com/rLLq6aiznT— Sidhant Sibal (@sidhant) August 19, 2025 -
భారత్-చైనా వివాదాల పరిష్కారానికి నిపుణుల బృందం ఏర్పాటు
న్యూఢిల్లీ: భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు త్వరలో ఫుల్స్టాప్ పడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సంయుక్త భేటీ అనంతరం ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.భారత్-చైనాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరో ముందడుగు పడింది. ఇరు దేశాలు సరిహద్దు సమస్య పరిష్కారం కోసం కలసి పనిచేయాలని నిర్ణయించాయి. సరిహద్దు డీలిమిటేషన్‌కు పరిష్కారాన్ని అన్వేషించేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిల సమావేశం అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.ఇరుదేశాలు వీలైనంత త్వరగా ప్రత్యక్ష విమానాలను పునఃప్రారంభించాలని, కైలాస పర్వత యాత్ర, మానసరోవర్ యాత్రకు మరింత ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించాయని ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే లిపులేఖ్ పాస్, షిప్కి లా , నాథు లా వాణిజ్య కేంద్రాల ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ చర్చల ద్వారా త్వరలో భారత్-చైనా సరిహద్దు ప్రాంతాలలో శాంతి కొనసాగేందుకు అడుగుపడనున్నదనే అభిప్రాయాన్ని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధిని ప్రోత్సహించేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని కాపాడుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది.భారత్-చైనాల సరిహద్దు సమస్య పరిష్కారం కోసం న్యాయమైన, సహేతుకమైన, పరస్పరం ఆమోదయోగ్యమైన చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని ఆ ప్రకటనలో వెల్లడించారు. భారత-చైనా సరిహద్దు ప్రాంతాల్లో సరిహద్దు డీలిమిటేషన్‌ను అన్వేషించేందుకు, సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు, సమన్వయం కోసం వర్కింగ్ మెకానిజం (డబ్ల్యూఎంసీసీ) కింద నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధులు అంగీకరించారని ఆ ప్రకటనలో విదేశాంగ శాఖ తెలిపింది. కాగా టియాంజిన్‌లో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ)శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కావడాన్ని చైనా స్వాగతించింది. -
బలపడుతున్న చైనా, భారత్ బంధం
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ ఉదంతం తర్వాత క్షీణించిన భారత్, చైనా సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మంగళవారం ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. త్వరలో చైనాలో మోదీ పర్యటన నేపథ్యంలో భారత్‌లో పర్యటిస్తున్న ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో మంగళవారం విస్తృతస్థాయి చర్చలు జరిపారు. పలు రంగాల్లో పరస్పర సహకారం, అభివృద్దే లక్ష్యంగా 12 అంశాలపై ఉమ్మడిగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. వాణిజ్యం పెంపు ధ్యేయంగా సరిహద్దులను తెరవడం, ఇరువైపులా పెట్టుబడుల వరద పారించడం, నేరుగా పౌరవిమానయాన సేవలను పునరుద్దరించడం వంటి కీలక అంశాలపై నేతలు అవగాహనకొచ్చారు.అమెరికా మోపిన అధిక టారిఫ్ భారం కారణంగా పరోక్షంగా చాన్నాళ్ల తర్వాత భారత్, చైనా ఏకతాటి మీదకు రావడం విశేషం. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల కీలక ఉమ్మడి ఆశయాల అమలుకు కృషిచేయాలని ఇరు పక్షాలు మంగళవారం నిర్ణయించాయి. లిపులేఖ్ పాస్, షిప్కీ లా పాస్, నాథూ లా పాస్ సరిహద్దుల గుండా తిరిగి విస్తృతస్థాయిలో వాణిజ్యం చేయాలని జైశంకర్, వాంగ్ నిర్ణయించారు. స్నేహపూర్వక సంప్రతింపుల ద్వారా సరిహద్దు వెంట మళ్లీ శాంతిస్థాపనకు ప్రయత్నించనున్నారు. ఈ మేరకు 12 అంశాలతో సంయుక్త పత్రాన్ని నేతలు విడుదలచేశారు. పర్యాటకులు, వ్యాపారులు, మీడియా ప్రతినిధులు, ఇతర కారణాలతో సందర్శించే వ్యక్తులకు వీసాలు ఇవ్వాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.వచ్చే ఏడాది కైలాశ్ పర్వత యాత్ర, మానస్‌సరోవర్ యాత్ర కోసం భారతీయులను చైనా అనుమతించనుంది. ఇరుదేశాల భూభాగాల్లో ప్రవహించే నదీజలాలపై సహకారం, ప్రవాహస్థాయిలు, వరదలపై ఎప్పటికప్పుడు సమాచార మారి్పడికి, ఇరుదేశాల నిపుణుల స్థాయి వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వడం వంటివి ఈ సంయుక్త పత్రాల్లో చోటు దక్కించుకున్నాయి. భారత్‌కు అరుదైన ఖనిజాలు, ఎరువుల ఎగుమతులపై ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంక్షలను సడలించడానికి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంగీకరించారు. భారత్‌కు అవసరమైన అరుదైన ఖనిజాలు, ఎరువులు సరఫరా చేస్తామని వాంగ్ హామీ ఇచ్చారు. ఖనిజాలు, ఎరువులతోపాటు టన్నెల్ బోరింగ్ మెషిన్ల అవసరం ఉందని జైశంకర్ చెప్పగా, వాంగ్ యీ వెంటనే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.‘‘తైవాన్‌పై మా వైఖరిలో మార్పు లేదు’’ తైవాన్ విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత ప్రభుత్వ వర్గాలు మంగళవారం తేల్చిచెప్పాయి. వాంగ్‌తో సమావేశమైనప్పుడు చైనాలో తైవాన్ అంతర్భాగం అని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు చైనా విదేశాంగ శాఖ పొరపాటున తెలియజేసింది. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు తాజాగా స్పష్టతనిచ్చాయి. ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలోనే తైవాన్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాయి. తైవాన్‌తో భారత్‌కు చక్కటి సంబంధాలు ఉన్నట్లు వెల్లడించాయి. భారత్ – చైనా సంబంధాలు పైపైకి: మోదీ భారత్–చైనా మధ్య సంబంధాలు స్థిరంగా పురోగమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరస్పర ప్రయోజనాలను, అవసరాలను గౌరవించుకుంటూ ముందుకెళ్తున్నాయని తెలిపారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. భారత్–చైనా సంబంధాలపై వారు మాట్లాడుకున్నారు. అనంతరం మోదీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది అక్టోబర్‌లో రష్యాలోని కజన్ సిటీలో చైనా అధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయ్యానని, అప్పటి నుంచి భారత్–చైనా సంబంధాలు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల నడుమ స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధ బాంధవ్యాల వల్ల ఆసియాతోపాటు ప్రపంచంలో శాంతి, సౌభాగ్యం నెలకొంటాయని మోదీ స్పష్టంచేశారు. -
ప్రజల నడ్డి విరిచే పన్నులు ఎత్తివేయాలి
సాక్షి, హైదరాబాద్: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) స్లాబ్‌లో రద్దు లేదా మార్పు ద్వారా ప్రజలకు నిజమైన దీపావళి అందిస్తామని ప్రచారం చేసుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీకి చిత్తశుద్ధి ఉంటే పెట్రో «ఉత్పత్తుల ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బుధవారం జరిగే జీఎస్టీ జాతీయ కౌన్సిల్ సమావేశ నేపథ్యంలో ప్రధానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి ‘తెలంగాణలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేనేత ఉత్పత్తులపై పన్నులు ఉండకూడదని భావించాం. కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేత వ్రస్తాలపై తొలుత 5శాతం విధించి ఆ తర్వాత 12శాతానికి పెంచాలని నిర్ణయించింది. దేశవ్యాప్త వ్యతిరేకత వెల్లువెత్తడంతో 12శాతం పన్ను విధింపు నిర్ణయాన్ని వాయి దా వేశారు. చేనేతపై పన్ను విధింపును విరమించుకోవాలి. జీఎస్టీలోనీ 12శాతం స్లాబ్ ను రద్దు చేసి పేద, మధ్య తరగతి ప్రజ లకు మేలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మొత్తం జీఎస్టీ ద్వారా సమకూరే రూ.22 లక్షల కోట్లలో 12% స్లాబ్ వాటా కేవలం 5శాతం మాత్రమే. దశాబ్ద కాలంగా నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుడి నడ్డి విరిచిన బీజేపీ ప్రభుత్వం స్లాబ్ రద్దు అంటూ లీకులు ఇస్తూ ప్రచారం చేసుకుంటోంది. పెట్రో, ఎల్పీజీ ధరలను తగ్గించాలి పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ ధరలను తగ్గిస్తే పరోక్షంగా ఇతర నిత్యావసరాల ధరల భారం కూడా తగ్గుతుంది. సెస్సుల రూపంలో రాష్ట్రాల ఆదాయాన్ని దెబ్బకొట్టే కుట్రకు పాల్పడిన కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. పెట్రో ఉత్పత్తులు, ఎల్పీజీ రేట్లను వెంటనే తగ్గించి సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలి. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు, విద్యకు సంబంధించిన ఫీజులు, కేన్సర్ చికిత్సకు అవసరమైన ఔషధాలపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలి’అని ప్రధానికి రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు.కాంగ్రెస్ సర్కారు ముక్కు నేలకు రాయాలి: కేటీఆర్ మహబూబ్‌నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం గుడిబండ పెద్దవాగుపై కాంగ్రెస్ కాంట్రాక్టర్ నిర్మించిన చెక్‌డ్యామ్ 2 నెలల్లోనే ఎందుకు కొట్టుకుపోయిందో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని కేటీఆర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల సంగతిని పక్కన పెడితే ఒక్క ఇటుక ముక్క కూడా సరిగా పేర్చలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలన్నారు.హైదరాబాద్‌లో శాంతిభద్రతలు క్షీణించాయ ని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చందానగర్ నగల దుకాణంలో దోపిడీ, కూకట్‌పల్లిలో 12ఏళ్ల బాలిక దారుణ హత్య దిగజారిన శాంతిభద్రతలకు అద్దం పడుతున్నాయన్నారు. -
నెహ్రూ వల్ల రెండు సార్లు దేశ విభజన: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్‌తో నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో మనకు పూడ్చలేని నష్టం జరిగిందన్నారు. అప్పటి మంత్రివర్గాన్ని గానీ, పార్లమెంట్‌ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ ఒప్పందంపై ఆమోదముద్ర వేశారని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు.దేశానికి.. ప్రధానంగా రైతన్నలకు నష్టం చేకూర్చేలా నెహ్రూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తాము అధికారంలోకి వచి్చన తర్వాత నిలిపివేశామని గుర్తుచేశారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్నారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో భారత్‌ను విభజించారని, సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సి.పి.రాధాకృష్ణన్‌ను ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే... రాద్ధాంతం ఎందుకని దబాయింపు ‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాకిస్తాన్‌కే అప్పగించారు. మన రైతులను దగా చేశారు. అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్‌పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు నెహ్రూ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పార్లమెంట్లో రెండు గంటలపాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీరు పోతే రాద్ధాంతం ఎందుకని నెహ్రూ దబాయించారు. పైగా లద్ధాఖ్‌లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చూసీచూడనట్లు వదిలేశారు. అక్కడ గడ్డి పరక కూడా పెరగదని వ్యంగ్యంగా మాట్లాడారు. చేసిన పొరపాటును నెహ్రూ కొన్నిరోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్‌తో ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భావించానని, కానీ, అలా జరగలేదని ఒక సహచరుడితో అన్నారు. నెహ్రూ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నాం’’ అని అన్నారు. సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు ‘‘ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇదొక నిదర్శనం. దీనివల్ల మన దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకొస్తామని, జీఎస్టీ రేట్లను సరళీకృతం చేస్తామంటూ ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను స్టాక్‌మార్కెట్ స్వాగతించింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ర్యాలీ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలకు ఢోకా లేదు. సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి’’ అని అన్నారు.రాజకీయాలతో రాధాకృష్ణన్ ఆడుకోలేదు ‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం హర్షణీయం. ఆయన ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమయ్యారు. క్రీడల్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రాజకీయాలతో ఏనాడూ ఆడుకోలేదు. రాధాకృష్ణన్‌తో నాకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మాకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచి పరస్పరం మంచి పరిచయం ఉంది. ప్రజాసేవ అంటే ఆయనకు అమితమైన అనురక్తి. వివిధ స్థాయిలో ప్రజలకు సేవలందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్‌ను గెలిపించాలని అన్ని రాజకీయ పారీ్టలకూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా’’ అని అన్నారు. -
సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు కోరిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీకి దిగిన సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధాని మోదీ కోరారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపక్షాలతో సహా అన్ని పార్టీలకు ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారని తెలిపారు.ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఎంపీలు, ఫ్లోర్ లీడర్లు స్వాగతించారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధానమంత్రి మోదీ.. సీపీ రాధాకృష్ణన్ పరిచయం చేశారు.ఎన్టీఏతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ నిర్ణయించిన అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘ఉపరాష్ట్రపతి ఎన్నికలో తాము రాధాకృష్ణన్‌కు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలనుకుంటున్నాం. ఇది మన ప్రజాస్వామ్యానికి, మన దేశానికి, రాజ్యసభను నడపడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
భారతీయులందరికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనలకు పెద్దపీట వేసే ప్రధాని మోదీ దేశ గగన్‌యాన్ కలలను సాకారంచేసే భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను కలిసిన వేళ ఆనందంలో మునిగిపోయారు. రష్యా, అమెరికా మొదలు ఇస్రో, నాసా దాకా అన్ని రకాల వ్యోమగామి శిక్షణా వ్యయాలను భరించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రధాని మోదీని కలిసిన వేళ శుభాంశు శుక్లా సైతం ఒకింత ఉది్వగ్నానికి లోనయ్యారు. అంతరిక్షకేంద్రంలో తాను అనుభవించి, గడించిన అది్వతీయ అనుభూతిని, అనుభవాన్ని చిన్న పిల్లాడిలా ఎంతో ఉత్సాహంతో ప్రధాని మోదీకి పూసగుచ్చినట్లు వివరించారు. ఈ అపురూప ఘట్టానికి ఢిల్లీలోని లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికార నివాసం వేదికైంది. జూన్ 25 నుంచి జూలై 15వ తేదీదాకా యాగ్జియం–4 మిషన్ తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో గడిపిన భారత మొట్టమొదటి వ్యోమగామిగా చరిత్ర లిఖించాక తొలిసారిగా శుభాంశు శుక్లా ప్రధాని మోదీని సోమవారం కలిసి తన అనుభవాలను పంచుకున్నారు. ‘‘వ్యోమగామిగా మాత్రమే కాదు అవనికి ఆవల సైతం భారతీయులు తమ కలలను నెరవేర్చుకోగలరని నువ్వు నిరూపించావు. వాళ్లకు స్ఫూర్తిగా నిలిచావు’’అని శుక్లాను మోదీ పొగిడారు. శుక్లా చెప్పిన ప్రతి విషయాన్ని మోదీ ఎంతో శ్రద్ధగా ఆలకించారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఐఎస్ఎస్లో రెపరెపలాడించినందుకు శుభాంశును మోదీ మనసారా అభినందించారు. వ్యోమగామి ప్రత్యేక జాకెట్ ధరించి వచ్చిన శుభాంశు కలవగానే కరచాలనం చేసి మోదీ ఆయనను ఆతీ్మయంగా హత్తుకున్నారు. శెభాష్ అంటూ భుజం తట్టారు. కొద్దిసేపు హాల్లో నడుస్తూ మాట్లాడారు. తర్వాత కూర్చుని శుక్లా సవివరంగా తన అంతరిక్ష యాత్ర వివరాలను మోదీకి తెలియజేశారు. ట్యాబ్‌లో పలు అంశాలను సోదాహరణంగా వివరించారు. ఆ తర్వాత మోదీకి రెండు బహుమతులను బహూకరించారు. ఐఎస్ఎస్కు వెళ్లినప్పుడు తన వెంట తీసుకెళ్లి తిరుగుపయనం వేళ మళ్లీ వెంట తీసుకొచ్చిన త్రివర్ణ పతాకాన్ని మోదీకి శుభాంశు బహూకరించారు. తర్వాత శుక్లాతో భేటీ వివరాలను ప్రధాని తన సామాజికమాధ్యమం ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘శుభాంశు శుక్లాతో భేటీ అద్భుతంగా సాగింది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రయోగాలు మొదలు అక్కడి సహచరుల తోడ్పాటు, అక్కడి ప్రయోగాల సత్ఫలితాలు, శాస్త్ర, సాంకేతికతల పురోభివృద్ధి, భారత ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ వివరాలపై ఎన్నో విషయాలు నాతో పంచుకున్నారు. ఐఎస్ఎస్లో గడిపి, ఆయన చేసిన ప్రయోగాలతో శుక్లాను చూసి భారత్ గర్వపడుతోంది’’అని మోదీ వ్యాఖ్యానించారు. శుక్లా ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు జూన్ 29వ తేదీన మోదీతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఐఎస్ఎస్లో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుంచు కో. అక్కడి వాతావరణం, ప్రయోగశాల స్థితిగతులు, ప్రయోగాలు చేసే విధానం.. ఇలా ప్రతీది తర్వాత దేశీయంగా భారత్ చేపట్టే సొంత అంతరిక్ష ప్రయోగాలకు అక్కరకొస్తుంది’’అని శుక్లాకు మోదీ సూచించడం తెల్సిందే. ఇదే విషయా న్ని శుక్లా రెండు వారాల క్రితం గుర్తుచేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ఉన్నప్పుడు మోదీ నాకు ఇచ్చిన హోమ్‌వర్క్ నాకు బాగా గుర్తుంది. ఆ హోమ్‌వర్క్‌ను చాలా బాగా పూర్తిచేశా. ఐఎస్ఎస్లో నేను చేసిందంతా మళ్లీ ప్రధానికి చెప్పేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఐఎస్ఎస్లో నేను గడించిన అనుభవం మన గగన్‌యాన్ మిషన్‌కు ఎంత కీలకమో నాకు బాగా తెలుసు’’అని శుక్లా గతంలో చెప్పారు. -
జీఎస్టీ కొత్త రూపు
ఎనిమిదేళ్ల క్రితం అమల్లోకొచ్చిన సరుకులు, సేవల పన్ను (జీఎస్టీ) ఎట్టకేలకు వచ్చే దీపావళి నాటికి కొత్త రూపాన్ని సంతరించుకోబోతోంది. మొన్న శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుపై నుంచి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చల్లని కబురందించారు. 2016లో లోక్‌సభ 122వ రాజ్యాంగ సవరణను ఆమోదించి జీఎస్టీకి మార్గం సుగమం చేయటానికి ముందు పదిహేనేళ్లపాటు ఈ ఏకీకృత పన్నుల వ్యవస్థపై చర్చోపచర్చలు జరిగాయి. రాష్ట్రాలను ఒప్పించేందుకు అంతకు ముందున్న ఎన్డీయే సర్కారు, తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం ఎడతెగని ప్రయత్నాలు చేశాయి. కానీ ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు 2017లో అమల్లోకి వచ్చినప్పుడు సైతం విపక్ష రాష్ట్రాలు రుసరుసలుపోయాయి. ఇంత పెద్ద సంస్కరణలో తన పాత్ర ఘనం అని చెప్పుకోవటానికైనా పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగే ఉత్సవానికి వెళ్లాలని కాంగ్రెస్ అనుకుంది. కానీ చివరకు ముఖం చాటేసింది. జీఎస్టీ విషయంలో వివిధ వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోలేదని, చిన్న వ్యాపారులూ వర్త కులూ దీనివల్ల అగచాట్లు పడతారని కారణాలుగా చూపింది. వామపక్షాలు సరేసరి. నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. జీఎస్టీ రాకతో కేంద్రం విధిస్తున్న ఏడెనిమిది రకాల పన్నులు రద్దుకావటంతో పాటు రాష్ట్రాలు విధించే రకరకాల పన్నులకు స్వస్తి చెబుతామని, పన్ను వసూళ్లను హేతుబద్ధీకరిస్తామని అప్పట్లో ప్రకటించారు. ఇందువల్ల ఆదాయం కోల్పోతామన్న రాష్ట్రాల ఆందోళనను ఉపశమింపజేసేందుకు అయిదేళ్లపాటు ఆ లోటును పూడుస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. కానీ ఆచరణలో సమస్యలెలా వస్తాయో తెలియాలంటే ఇటీవల కర్ణాటకలో చిన్న వ్యాపారులు పడిన అగచాట్లను ప్రస్తావించుకోవాలి. వివిధ రకరకాల యాప్‌ల ద్వారా వినియోగ దారుల నుంచి చెల్లింపులు స్వీకరిస్తున్న తోపుడు బండి వ్యాపారులనూ, వీధుల్లో చిన్నా చితకా దుకాణాలు నడుపుకునేవారినీ లక్ష్యంగా చేసుకుని జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ అక్కడి వాణిజ్య పన్నుల విభాగం 13,000 నోటీసులు జారీచేసింది. వీటికి ఏం జవాబివ్వాలో, ఎవరిని ఆశ్రయించాలో కూడా తెలియక, అందుకయ్యే ఖర్చు భరించలేక చాలామంది నగదు చెల్లించాలని వినియోగదారుల్ని కోరటం మొదలుపెట్టారు. వాజపేయి హయాంలో నాటి ఆర్థిక మంత్రి జశ్వంత్సింగ్కు సలహాదారుగా వ్యవహరించిన విజయ్ కేల్కర్ ఈ జీఎస్టీ ఆలోచనకు ఆద్యుడు. ఆయన ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ పలు దేశాల పన్ను వ్యవస్థలను అధ్యయనం చేసి దీన్ని రూపొందించింది. మధ్యతరగతి, అట్టడుగువర్గాలవారు పన్నుపోటు నుంచి ఉపశమనం పొందుతారని చెప్పింది. కానీ జరిగిందంతా వేరు. పరోక్ష పన్నులు చెల్లించేవారి నుంచి మరింత పిండుకోవడానికే జీఎస్టీ తీసుకొస్తున్నారని, ప్రత్యక్ష పన్నుల జోలికి వెళ్లాలన్న ఆలోచనే కేంద్రం చేయటం లేదని విమర్శలొచ్చాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ. 11.7 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుండగా ఇప్పుడది దాదాపు రెట్టింప యింది. సగటున ప్రతి నెలా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ సాధారణ వర్గాల అవస్థలు అంతకంతా పెరిగాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలు, ఇంకా ఆ దిగువనుండేవారూ జీఎస్టీ కింద దాఖలు చేయాల్సిన రకరకాల పత్రాలు, వివాదాలు, ప్రభుత్వం నుంచి వెనక్కు రావలసిన సొమ్ము కోసం పడి గాపులు... వీటన్నిటితో విసిగిపోయారు. ఈ సంక్లిష్ట వ్యవస్థను సంతృప్తిపరిచే మార్గం దొరక్క అల్లాడిపోయారు. ఈ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థ ద్వారా వసూళ్లు భారీగా పెరుగుతుంటే, ప్రత్యక్ష పన్నులు చెల్లించే కార్పొరేట్ల నుంచి రావాల్సిన ఆదాయం పడిపోవటం ఒక వైచిత్రి. 2023 –24లో వివిధ రకాల ప్రోత్సాహాల కింద దాదాపు లక్ష కోట్ల రూపాయల పన్ను రాయితీలు ఇచ్చామని ఇటీవల పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.జీఎస్టీ సరికొత్త రూపంలో రాబోవటం అన్ని వర్గాలకూ శుభవార్త. ప్రస్తుతం 5, 12, 18, 28 శాతాలుగా ఉన్న నాలుగు స్లాబ్‌ల స్థానంలో ఇకపై రెండే... 5, 18 శాతాలు ఉంటాయని కేంద్రం చెబుతోంది. లగ్జరీ కార్ల వంటి విలాస వస్తువుల పైనా... పొగాకు, పాన్‌మసాలా, ఆన్లైన్ గేమింగ్ వంటి హానికారకాల పైనా మాత్రం 40 శాతం వరకూ ఉంటుంది. జీఎస్టీ వసూళ్లు స్థిరత్వంలో పడటం వల్ల సాధారణ ప్రజానీకాన్ని పన్నుపోటు నుంచి తప్పించాలని భావించినట్టు కనబడుతున్నా, ఇంతకాలమూ ఈ పరిధిలో లేని మద్యం, ఇంధనం వంటివాటిని చేర్చబోతున్నారని అంటున్నారు. సహజంగానే దీనిపై రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ప్రపంచమంతటా ఒకరకమైన మాంద్యం అలుముకున్న వర్తమానంలో జీఎస్టీ సంస్కరణలు మన ఆర్థికవ్యవస్థకు ఊతాన్నివ్వగలవనీ, ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలూ చాలావరకూ తగ్గుతాయనీ ఆశించాలి. -
ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్
మాస్కో: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (valdimir Putin) మధ్య ఉక్రెయిన్ యుద్ధం ముగించే విషయంపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్లాదిమిర్ పుతిన్ తనకు ఫోన్ చేసినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో‘ఇటీవల అలాస్కాలో ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి ఫోన్లో మాట్లాడి, తన అభిప్రాయాలను పంచుకున్నారు. నా స్నేహితుడు పుతిన్‌కు ధన్యవాదాలు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ నిరంతరం కోరుకుంటుంది.ఈ విషయంలో జరుగుతున్న అన్నీ ప్రయాత్నాలకు భారత్ మద్దతు పలుకుతుంది’అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2022 నుండి కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా యుద్ధంపై ప్రపంచ దేశాల ఎదుట భారత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని, ఈ విషయంలో భారత్ తన పూర్తి మద్దతును అందిస్తుందని ప్రధాని కార్యాలయంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. Thank my friend, President Putin, for his phone call and for sharing insights on his recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our…— Narendra Modi (@narendramodi) August 18, 2025 -
జీఎస్టీ సంస్కరణలే దిక్సూచి
స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దీపావళికల్లా వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లో భారీ సంస్కరణలకు తెరతీయనున్నట్లు ప్రకటించడం దేశీయంగా సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోపక్క గత వారం ఎస్అండ్పీ రెండు దశాబ్దాల తదుపరి దేశ సావరిన్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయడం ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. అయితే ఉక్రెయిన్, తదితర అంశాలపై ట్రంప్, పుతిన్ సమావేశం ఎటూ తేల్చకపోవడంతో అంతర్లీనంగా అనిశ్చితి సైతం కనిపించనున్నట్లు విశ్లేషించారు. వివరాలు చూద్దాం... రానున్న దీపావళికల్లా జీఎస్టీలో శ్లాబులను, రేట్లను కనిష్టానికి సవరించనున్నట్లు ప్రధాని మోడీ పేర్కొనడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు జోష్ లభించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న జీఎస్టీలో భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు ప్రధాని తెలియజేశారు. జీఎస్టీ నిబంధనల అమలు, పన్ను ఎగవేతలు, వివాదాలు ముసురుగొనడం వంటి సవాళ్లకు చెక్ పెట్టే బాటలో శ్లాబులను, రేట్లను తగ్గించనున్నట్లు సంకేతమిచ్చారు. దీంతో స్టాక్ మార్కెట్లో సెంటిమెంటు బలపడే వీలున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. సరైన సమయంలో జీఎస్టీ 2.0కు తెరతీయనుండటంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ లభించనున్నట్లు ఈవై ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ప్రపంచవ్యాప్త వాణిజ్య ఆందోళనల మధ్య ఇవి కేవలం విధానపరమైన మార్పులు కాదని, అత్యంత ఆవశ్యకమైన నిర్మాణాత్మక సంస్కరణలని పేర్కొన్నారు. జీఎస్టీలో సంస్కరణల కారణంగా వర్కింగ్ క్యాపిటల్ సమస్యలు పరిష్కారంకావడంతోపాటు.. పోటీ ప్రపంచంలో ఎగుమతులకు దన్ను లభించనున్నట్లు వివరించారు. జెలెన్స్కీతో ట్రంప్ భేటీ కీలకం..కొన్ని నెలలుగా రష్యా– ఉక్రెయిన్ మధ్య తలెత్తిన యుద్ధ పరిస్థితులకు చెక్ పెట్టే బాటలో గత వారాంతాన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ సమావేశమైన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమైంది. అయితే సమావేశ వివరాలు వెల్లడికానప్పటికీ.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో ట్రంప్ భేటీపై మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు తెలియజేశారు. అయితే ముందు ప్రకటించినట్లు ఈ నెల 27నుంచి కొత్త టారిఫ్‌లు అమలుకాకపోవచ్చని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లలో సానుకూలతకు దోహదపడే వీలున్నట్లు అంచనా వేశారు. ఫెడ్ మినిట్స్ ఈ వారం యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ గత పాలసీ సమీక్షా నిర్ణయాల వివరాలు(మినిట్స్) వెల్లడికానున్నాయి. ఫండ్స్ రేట్లను 4.25–4.5 శాతంగా కొనసాగించేందుకే ఫెడ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. మరోపక్క చైనా కేంద్ర బ్యాంకు 1–5 ఏళ్ల కాలావధి రుణాలపై వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇవికాకుండా యూఎస్ హౌసింగ్ గణాంకాలు తదితరాలు వెలువడనున్నాయి. దేశీయంగా హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసుల పీఎంఐ ఇండెక్స్‌లను ప్రకటించనున్నారు. వీటితోపాటు.. దేశీ స్టాక్స్‌లో విదేశీ ఇన్వెస్టర్ల తీరు, డాలరు మారకం, ముడిచమురు ధరలు వంటి అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు. వెరసి కన్సాలిడేషన్ బాటలో సాగుతున్న మార్కెట్లు ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.రేటింగ్ ఎఫెక్ట్ గత వారం రేటింగ్ దిగ్గజం ఎస్అండ్పీ సుమారు 18 ఏళ్ల తరువాత దేశ సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసింది. స్థిరత్వంతోకూడిన ఔట్‌లుక్‌తో బీబీబీ రేటింగ్‌ను ప్రకటించింది. పటిష్ట ఆర్థిక పురోభివృద్ధి, ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వ కట్టుబాటు, ద్రవ్యోల్బణ అదుపునకు ఆర్బీఐ అనుసరిస్తున్న సానుకూల పరపతి విధానాలు ఇందుకు పరిగణనలోకి తీసుకున్నట్లు ఎస్అండ్పీ వివరించింది. వెరసి ఇన్వెస్టర్లకు జోష్ లభించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు తెలియజేశారు.గత వారమిలా.. నాలుగు రోజులకే పరిమితమైన గత వారం(11–14) ట్రేడింగ్‌లో ఎట్టకేలకు 6 వారాల వరుస నష్టాలకు చెక్ పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740 పాయింట్లు(0.9 శాతం) పుంజుకుని 80,598 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 268 పాయింట్లు(1.1 శాతం) ఎగసి 24,631 వద్ద ముగిసింది. అయితే బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం, స్మాల్ క్యాప్ 0.6 శాతం చొప్పున క్షీణించాయి.సాంకేతికంగా చూస్తే.. ఆరు వారాల తదుపరి మార్కెట్లు గత వారం సానుకూలంగా ముగిసినప్పటికీ నష్టాల నుంచి బయటపడిన సంకేతాలు పూర్తిగా వెలువడనట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా మరో రెండు వారాలు కన్సాలిడేషన్ కొనసాగవచ్చని అంచనా వేశారు. వీరి విశ్లేషణ ప్రకారం ఈ వారం మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి సాంకేతికంగా తొలుత 24,450 పాయింట్ల వద్ద బలమైన మద్దతు లభించవచ్చు. ఇలాకాకుండా 24,700ను దాటి బలపడితే.. 24,800 వద్ద, 25,000 వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు. అమ్మకాలు అధికమై 24,450 దిగువకు చేరితే 24,000 సమీపానికి చేరే అవకాశముంది.ఎఫ్‌పీఐల అమ్మకాల స్పీడ్ఈ నెలలో రూ. 21,000 కోట్లు వెనక్కి ఇటీవల దేశీ స్టాక్స్‌లో నిరవధిక విక్రయాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–14) రూ. 21,000 కోట్ల పెట్టుబడులను నికరంగా వెనక్కి తీసుకున్నారు. యూఎస్ వాణిజ్య సుంకాల భారం, తొలి త్రైమాసిక ఫలితాల నిరుత్సాహం, రూపాయి బలహీనత ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఈ కేలండర్ ఏడాదిలో ఇప్పటివరకూ దేశీ ఈక్విటీల నుంచి రూ. 1.16 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం జూలైలోనూ ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. మార్చి– జూన్మధ్య కాలంలో రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! – సాక్షి, బిజినెస్ డెస్క్