దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ | PM Modi launches nationwide HPV vaccination drive for girls in Rajasthan | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ

Feb 28 2026 6:43 PM | Updated on Feb 28 2026 6:45 PM

PM Modi launches nationwide HPV vaccination drive for girls in Rajasthan

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా  ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.  ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.

అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది  14  ఏళ్ల  సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్‌’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

భారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్,  (ముఖ్యంగా హెచ్‌పీవీ టైప్‌ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్‌ హెచ్‌పీవీ టైప్‌ 16, 18తోపాటు టైప్‌ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని  కేంద్రం తెలిపింది. 

ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం


 

Advertisement
 
Advertisement
Advertisement