జగద్గిరిగుట్ట మద్దూర్ నగర్‌లోని నాగార్జున హైస్కూల్లో శనివారం సైన్స్ ఫెస్ట్ జరిగింది.
ఈ ఫెస్టివల్లో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొని 210 నమూనాల ప్రాజెక్టులను ప్రదర్శించారు.
ఎంతో ప్రయోజనాత్మకతతో అతిథులు విద్యార్థుల తల్లిదండ్రులు కొత్త కొత్త నమూనాలను చూసి ఆశ్చర్యపోయారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదిరిగుట్ట పోలీస్ స్టేషన్ సీఐ బి. వెంకటేశం హాజరయ్యారు.
కార్పొరేటర్ జగన్. స్కూల్ ప్రిన్సిపల్ బి. కిషన్ రావు మొదలైనవారు కూడా పాల్గొన్నారు


