నిట్ వరంగల్‌లో విద్యార్థులు నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవం (కల్చరల్ ఫెస్ట్) కలర్‌ఫుల్‌గా సాగింది. ఈ ఫెస్ట్‌లో దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొని తమతమ సంస్కృతీ సంప్రదాయాలను పంచుకున్నారు.
తొలిరోజు శుక్రవారం స్ప్రింగ్‌స్ప్రీ–26లో డైరెక్టర్స్ కట్‌లో సినిమా డైరెక్టర్ శైలేష్ కొలను, స్వయంభు మూవీ హీరో నిఖిల్ సిద్ధార్థ్, హీరోయిన్లు సంయుక్త మీనన్, నభా నటేష్, అభినవ్ గోమటమ్, కెమెరామెన్ కేకే సెంథిల్‌కుమార్, ప్రోషోలో జోనితాగాంధీ తన గానామృతంతో విద్యార్థులను అలరించారు.
‘వారెవ్వ ఏమి ఫేసు.. అచ్చం హీరోలా ఉంది బాసు’ అని పాట పాడుతూ విద్యార్థులు ఫేస్ పేయింటింగ్‌లో కలర్‌ఫుల్ లుక్ ఇచ్చారు. తమ ముఖాలపై డైనోసార్, కమెడియన్, హలోవేషన్, బటర్‌ఫ్లై, డేంజరస్ మ్యాన్, ప్రకృతిని తమ చేతి కుంచెతో వివిధ రంగులతో ఆవిష్కరించుకున్నారు.


