Hanamkonda
-
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లిలకి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలిçంచగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు. -
కిషన్‌రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
హనుమకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, హనుమకొండ జిల్లా: డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదులతో బీమారంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండలో అద్దె ఇంటితో పాటు, హైదరాబాద్, జగిత్యాలలోని బంధువుల ఇళ్లలోను ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు.ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ అధికారిగా పనిచేసిన పుప్పాల శ్రీనివాస్ గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లాకు బదిలీపై వచ్చారు. అయితే ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. -
హనుమకొండ : సంబురంగా సదర్ ఉత్సవం (ఫొటోలు)
-
హన్మకొండలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
ప్రజాభిప్రాయమే జీవోగా రైతుభరోసా
సాక్షిప్రతినిధి, వరంగల్: ప్రజల అభిప్రాయాలనే ప్రభుత్వ ఉత్తర్వులుగా..చరిత్రాత్మక నిర్ణయంగా తీసుకురావడంలో ఎలాంటి సందేహం లేదని, రైతుభరోసా విషయంలో కూడా ప్రజల అభిప్రా యమే జీవోగా రాబోతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతుల అభిప్రా యాల మేరకు శాసనసభలో రైతుభరోసా పథకం రూపకల్పనకు చర్చిస్తామని చెప్పారు. సోమ వారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫ రెన్స్ హాల్లో రైతుభరోసా పథకం అమలు కోసం విధివిధానాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది.మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క, సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు జిల్లామంత్రులు మంత్రి కొండా సురే ఖ, ధనసరి అనసూయ (సీతక్క), ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, హాజరయ్యారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రైతులు, రైతుసంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రైతుభరోసా విషయంలో సంపూర్ణంగా ప్రజలు ఏం చెబితే దాన్నే అమ లు చేస్తామన్నారు. అందరి సూచనలు నోట్ చేసు కున్నామని, వాటిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, అందరి అభిప్రాయానికి తగినట్టుగా సబ్‌కమిటీ నిర్ణయం తీసుకుంటుందని భట్టి విక్రమార్క చెప్పా రు. వరంగల్ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ రైతు æభరోసా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రైతుభరోసాపై అసెంబ్లీలో ఒక రోజంతా చర్చిస్తామని, ఆ తర్వాత అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి పేర్కొన్నారు. రైతుల నోటా..వైఎస్ రాజశేఖరరెడ్డి మాటహన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడిన రైతుల్లో 90శాతం మంది దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పేరు ప్రస్తావించారు. నాడు వైఎస్ వల్లనే ఉచిత విద్యుత్, మద్దతుధర, సబ్సిడీ విత్తనాలు, పంట బీమా వచ్చాయని తెలిపారు. ఆయన కాలంలో వ్యవసాయం పండుగలా సాగిందని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత వ్యవసాయం గురించి, రైతుల గురించి పట్టించుకున్న ప్రభుత్వం, నాయకులు లేరన్నారు. రైతును రాజును చేయడానికి వైఎస్ కృషి చేశాడని కొనియాడారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు. దీంతో రాజ్‌కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్‌కుమార్‌ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
Bhimaa Movie: గోపీచంద్ ‘భీమా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విద్యార్థిని అనుమానాస్పద మృతి
హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి శివారులోని ఓ విద్యాసంస్థలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్ధిని అనుమానాస్పదంగా మృతి చెందింది. అయితే తన కూతురును హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి రాథోడ్ మోహన్‌సింగ్ ఆరోపించారు. ఈ మేరకు హసన్‌పర్తి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కండెపల్లికి చెందిన రాథోడ్ మోహన్‌సింగ్ (డిప్యూటీ కలెక్టర్, మైనారిటీ కార్పొరేషన్ అ«ధికారి, నిర్మల్) కూతురు రాథోడ్ దీప్తి(19) కళాశాల హాస్టల్లోనే ఉంటూ అగ్రికల్చర్ బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం దీప్తి కళాశాల హాస్టల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. ఉరి వేసుకున్నట్టు సమాచారం ఇవ్వలేదు దీప్తి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, గురువారం సాయంత్రం తాను ఫోన్లో మాట్లాడినట్టు తండ్రి మోహన్‌సింగ్ పేర్కొన్నారు. ఉదయం తన భార్య ఫోన్ చేస్తే త్వరగా ఎంజీఎంకు రమ్మన్నారే తప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం చెప్పలేదన్నారు. మృతదేహాన్ని కిందకు దింపిన సమయంలో సెక్యూరిటీ సిబ్బందితోపాటు మరికొంతమంది మగవారు ఉన్నట్టు స్పష్టమవుతోందన్నారు. కిందకు దింపినప్పుడు తహసీల్దార్, పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. దీప్తిపై అత్యాచారం, ఆపై హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తండ్రి మోహన్‌సింగ్ పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. 11,12 తేదీల్లో సీసీ ఫుటేజీ సేకరించాలని పోలీసులను కోరారు. దీప్తి మృతిపై సమగ్ర విచారణకు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. టీజీవీపీ, టీఎస్ఎఫ్, గిరిజన శక్తి మోర్చ సంఘాలు ఆ విద్యాసంస్థ ఎదుట ఆందోళన నిర్వహించాయి. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దీప్తి మృతిపై సమగ్ర విచారణ జరుపుతున్నట్టు హసన్‌పర్తి ఇన్స్పెక్టర్ గోపి తెలిపారు. కాజీపేట ఏసీపీ డేవిడ్ రాజు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేసినట్టు తెలిపారు. -
ఒకే రోజు రెండు ఘోర ప్రమాదాలు.. ఎనిమిది మంది మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దారవీడు మండలం దేవరాజు గట్టు గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిని మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన వారిలో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన రావు నాగేశ్వరరావు రావు వెంకటేశ్వర్లు, ఆటోలో ప్రయాణిస్తున్న మార్కాపురం పట్టణానికి చెందిన షేక్ బాబు, ఆమని గుడిపాడుకు చెందిన ఎనిబెర అభినయ్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.. ఆటోలోని నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరోవైపు హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన మంతెన శంకర్ తన కుటుంబ సభ్యులతో వేములవాడ వెళ్తుండగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి వస్తున్న ఇసుక లారీ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతులను మంతెన కాంతయ్య (7 ), మంతెన శంకర్ (60), మంతెన భరత్ (29), మంతెన వందన (16)గా గుర్తించారు. తీవ్ర గాయాలతో ఎంజీఎం లో చికిత్స పొందుతున్న వారిలో మంతెన రేణుక (60), మంతెన భార్గవ్ (30), మంతెన శ్రీదేవి (50), ఉన్నారు. -
ఓటు వేసి.. మృత్యుఒడిలోకి..
హన్మకొండ: అసెంబ్లీ ఎన్నికలు ఆ కుటుంబంలో విషాదాన్ని నింపాయి. స్వగ్రామంలో ఓటు వేసి తిరిగి వెళ్తుండగా మృత్యువు కారు రూపంలో వచ్చి వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్య మృతి చెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇద్దరు కుమారుల కాళ్లు విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతురాలి బంధువుల కథనం ప్రకారం. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన వాంకుడోత్ రవీందర్ తన కుటుంబంతో కలిసి హనుమకొండ రెడ్డికాలనీలో నివాసముంటున్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకుని బైక్ పై భార్య మానస(27), ఇద్దరు కుమారులు జ్ఞాన చైతన్య, హర్షవర్ధన్‌ను తీసుకుని హనుమకొండకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యలో వరంగల్–నర్సంపేట రహదారిపై గీసుకొండ మండలం కొమ్మాల శివారులోకి రాగానే నర్సంపేట వైపునకు ఎదురుగా వస్తున్న కారు డ్రైవర్ అతి వేగంగా వచ్చి వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రవీందర్, మానసకు బలమైన గాయాలు కాగా వారి కుమారుల కాళ్లు విరిగాయి. వారందరినీ 108 అంబులెన్స్‌లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యసేవల కోసం మానసను హనుకొండలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఆమె శుక్రవారం ఉదయం మృతి చెందింది. అజాగ్రత్తగా కారు నడిపిన డ్రైవర్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని, మృతురాలి బంధువు వాంకుడోత్ ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ సీఐ రామకృష్ణ తెలిపారు. -
Rashi Khanna Latest HD Images: ఓరుగల్లులో సినీనటి రాశీఖన్నా సందడి (ఫోటోలు)
-
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం. కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి బుధవారం హనుమకొండ కంచరకుంటలోని సెయింట్‌పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు. వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి -
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక
సాక్షి, వరంగల్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్లో బహిరంగ సభ నిర్వహించగా.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూలై 8న వరంగల్‌లో ప్రధాని పర్యటించనున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు. తరువాత హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. 200 ఎకరాల్లో రూ. 10 వేల కోట్లతో టెక్స్ టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతోంది. చదవండి: జూలై 3న కేంద్ర కేబినెట్ భేటీ.. ఆరోజే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ! అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో అధికార కార్యక్రమాలతోపాటు, బహిరంగ సభకు కాషాయ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర నాయకత్వ మార్పు, బండి సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి, కిషన్ రెడ్డికి తెలంగాణ అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించనున్నట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాని తెలంగాణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: Hyderabad: ఎమ్మెల్యే చిన్నయ్య బాధితురాలు శేజల్ సూసైడ్ అటెంప్ట్ -
బావిలో భారీ కొండచిలువ
సాక్షి, హన్మకొండ: మంచినీటి బావిలో భారీ కొండచిలువ కనిపించడంతో నీటి కోసం వచ్చిన మహిళలు హడలిపోయారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలో మంగళవారం జరిగిన ఈ సంఘటన వివరాలివి. రోజు మాదిరిగానే ఉదయం తాగునీటిని తెచ్చుకోవడానికి మంచినీటి బావి వద్దకు వెళ్లి మహిళలకు అందులో అతిపెద్ద కొండచిలువ కనిపించింది. దీంతో మహిళలు భయబ్రాంతులై కేకలు వేయడంతో స్థానిక సర్పంచ్ అబ్బు ప్రకాశ్‌రెడ్డి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు మూడున్నర మీటర్ల పొడవున్న కొండచిలువను పట్టుకుని అడవిలో వదిలేశారు. చదవండి: వెనక్కి తగ్గిన బీజేపీ.. కేసీఆర్ వైఫల్యాలపై రివర్స్ అటాక్ కు ‘నో’ -
మొన్ననే వివాహం.. ప్రియుడితో కలిసి ఆత్మహత్యాయత్నం.. ప్రియురాలు మృతి
సాక్షి న్యూస్ వరంగల్: ప్రేమ... పెళ్ళి... ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రేమించిన యువకుడిని కాదని మరో అబ్బాయితో పెళ్లి చేసుకున్న యువతి, చివరకు ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. యువతి వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా ప్రియుడు హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసే వాళ్ళం కాదంటున్నారు మృతురాలి బంధువులు. భీమదేవరపల్లి మండలం గొల్లపల్లికి చెందిన సంఘ లింగయ్య-రాజేశ్వరి దంపతుల కుమార్తె. మానస అదే మండలంలోని కొత్తకొండకు చెందిన విజయ్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలియక పెద్దలు మానస కు హుస్నాబాద్ మండలానికి చెందిన అబ్బాయితో ఈనెల 11న వివాహం జరిపించారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిని కాదనలేక, ప్రియుడిని వదులుకోలేక మానసిక ఆందోళన చెందిన మానస 19న హన్మకొండలో ప్రియుడిని కలిసి మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడవలేక పోయినా కలిసి చనిపోవాలనుకున్నారు. ఇద్దరు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలు మానస వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు చివరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రేమించిన విషయం ముందే చెప్పి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదంటున్నారు మృతురాలి కుటుంబ సభ్యులు. ప్రేమించిన విషయం చెప్పలేదని, చెప్పిఉంటే మరో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసే వాళ్ళం కాదని తెలిపారు. - లింగయ్య, మృతురాలి తండ్రి కులాలు వేరు కావడంతో ప్రేమ పెళ్ళికి పెద్దలు అంగీకరించలేదని ప్రచారం జరుగుతుంది. ప్రేమ గురించి మానస పెద్దలకు చెప్పినప్పటికీ యాదవ వర్గాని చెందిన అమ్మాయిని పద్మశాలి వర్గానికి చెందిన ప్రియుడికి ఇచ్చి వివాహం చేయలేకనే తమ కులానికి చెందిన మరో అబ్బాయితో పెళ్ళి జరిపించినట్లు ప్రియుడి బందువులు తెలిపారు. ప్రియుడు ప్రస్తుతం హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు. -
అన్న ప్రభుత్వ ఉద్యోగి, తమ్ముడు సాఫ్ట్వేర్.. ఊహించని రోడ్డు ప్రమాదంలో
సాక్షి, హన్మకొడ: హన్మకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదం ఇద్దరు అన్నదమ్ముల్ని పొట్టన పెట్టుకుంది. హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పలపల్లి శివరాం, హరికృష్ణగా గుర్తించారు. వివరాలు.. హుజూరాబాద్ కందుగుల గ్రామానికి చెందిన ఇప్పలపల్లి మనోహర్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు శివరామకృష్ణ (25), చిన్న కుమారుడు హరికృష్ణ (23). శివరామకృష్ణ రైల్వే శాఖలో ఉద్యోగానికి ఎంపికై మౌలాలీ (సికింద్రాబాద్)లో శిక్షణ పొందుతున్నాడు. హరికృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. కాగా ఇటీవల పెద్దకుమారుడు శివరామకృష్ణకు పోస్టల్ శాఖలో మరో ఉద్యోగం వచ్చింది. ఈ విషయం చెప్పడం కోసం ఆదివారం స్వగ్రామం కందుగులకు వచ్చాడు. తిరిగి సోమవారం డ్యూటీకి వెళ్లాలని ఉదయం 4.30 గంటలకు ఇంటి నుంచి తమ్ముడితో కలిసి స్కూటీపై హైదరాబాద్‌కు బయలుదేరాడు. ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద 5.30 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం వారి స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ, హరికృష్ణ తలలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరు కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి మనోహర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
హనుమకొండ : వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)
-
హన్మకొండలో దారుణం.. వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి..
సాక్షి, వరంగల్: మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధుల్లో కనీస మార్పు రావడం లేదు. రోజురోజుకీ మృగాలు రెచ్చిపోతుండటంతో ఆడవాళ్లు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళలపై లైంగిక వేధింపులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నయీమ్‌నగర్‌కు చెందిన వివాహిత ఇంట్లో గొడవపడి రోడ్డు మీదకు రాగా.. ముగ్గురు వ్యక్తులు ఆమెను ట్రాప్ చేశారు. బలవంతంగా ఆటోలో ఎక్కించి భీమారం వైపు తీసుకెళ్లి మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. కాగా మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు శనివారం హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాకేశ్ అనే ఆటోడ్రైవర్‌తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. చదవండి: మౌనిక మృతి.. ‘బయటకెళ్తే ఇంటికొస్తారనే నమ్మకం లేదు’ -
బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
-
అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తాం: ఈటల
సాక్షి, హన్మకొండ: ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నా ఈటల. అధికారంలోకి వచ్చాక లెక్క తేలుస్తామని ఈటల అన్నారు. హన్మకొండలో బీజేపీ నిరుద్యోగ మార్చ్ చేపట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులతో పాటు నిరుద్యోగ యువత ఈ మార్చ్‌లో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాలయాపన వద్దు.. కొలువులు ముద్దు అంటూ నిరుద్యోగ యువత మార్చ్‌లో పాల్గొంది. కేయూ క్రాస్ నుండి బీజేపీ నిరుద్యోగ మార్చ్ ప్రారంభమయ్యే బీజేపీ నిరుద్యోగ మార్చ్. నయీమ్ నగర్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకూ కొనసాగనుంది. -
సంజయ్‌కు బెయిల్
సాక్షి ప్రతినిధి, వరంగల్/ వరంగల్ లీగల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కు హనుమకొండ నాలుగో మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం రాత్రి బెయిల్ మంజూరు చేసింది. కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి హిందీ పరీక్ష పత్రం లీక్, కాపీ కుట్ర కేసులో పోలీసులు బుధవారం బండి సంజయ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంజయ్ తరఫు న్యాయవాదులు వేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం సుదీర్ఘంగా విచారణ సాగింది. పలుమార్లు వాయిదాలతో.. సుమారు 8 గంటల పాటు జరిగిన వాదోపవాదాల అనంతరం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి రాపోలు అనిత తీర్పు ఇచ్చారు. రూ.20 వేల చొప్పున ఇద్దరు జమానతుదారుల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. దేశం విడిచి వెళ్లకూడదని, కేసు విచారణ నిమిత్తం ప్రాసిక్యూషన్‌కు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను చెరిపివేయకూడదని షరతులు విధించారు. బెయిల్ ప్రక్రియ పూర్తయ్యేసరికి గురువారం రాత్రి అవడంతో.. బండి సంజయ్ శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదల కానున్నారు. దురుద్దేశంతో ఇరికించారు..: సంజయ్ లాయర్లు బండి సంజయ్ బెయిల్ విషయమై కోర్టులో గురువారం లంచ్ విరామం తర్వాత మొదలైన వాదనలు రాత్రి 8 గంటల వరకు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా పోలీసులతో అక్రమ కేసు బనాయించిందని ఆయన తరఫు న్యాయవాదులు శ్యాంసుందర్‌రెడ్డి, విద్యాసాగర్‌రెడ్డి, రామకృష్ణ, సునీల్‌లు వాదించారు. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ఆరోపణలుగానీ, ఫిర్యాదుదారు పిటిషన్లో ఆరోపించిన విషయాలుగానీ బండి సంజయ్‌కు వర్తించవని.. దురుద్దేశంతోనే కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఇప్పటికే కేసుకు సంబంధించి విచారణ పూర్తయిందని, నివేదిక మాత్రమే కోర్టులో దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు విన్నవించారు. సాక్షులను ప్రభావితం చేయడంగానీ, సాక్ష్యాధారాలను చెరిపేయడంగానీ చేసే ఆస్కారం లేనందున సంజయ్‌కు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా ఎంపీగా, సంబంధిత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ ఆ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరారు. బెయిలిస్తే శాంతిభద్రతల సమస్య: పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరోవైపు సంజయ్‌కు బెయిల్ ఇవ్వకూడదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రేవతిదేవి కోర్టును కోరారు. ‘‘తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇదే తీరుగా నేరాలు పునరావృతం కాకుండా జాగ్రత్తపడాల్సి ఉంది. నిందితుడు బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయనపై తీవ్రమైన చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. అది రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యగా మారే ప్రమాదం ఉంది. అంతేగాకుండా ఈ కేసులో మరికొందరు సాక్షులను విచారించాలి. నిందితులు ముందస్తుగా కుట్రపన్ని ప్రశ్నపత్రాల లీక్, కాపీకి పాల్పడ్డారు. వారి ఫోన్‌కాల్స్, వాట్సాప్ చాట్ల వివరాలను విశ్లేషించడం ద్వారా వారి పాత్ర బయటపడింది. ఇంకా సాంకేతిక ఆధారాలు లభించాల్సి ఉంది. వాస్తవాలను వెలికితీసేందుకు లోతైన దర్యాప్తు అవసరం. ఏ1 నిందితుడికి బెయిలిస్తే సాక్షులను బెదిరించి, దర్యాప్తునకు ఆటంకం కల్పించడంతోపాటు సాంకేతిక ఆధారాలను చెరిపేసే అవకాశం ఉంది. సంజయ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించాలి’’ అని కోరారు. బెయిల్ మంజూరు.. కస్టడీ పిటిషన్ వాయిదా ప్రాసిక్యూషన్, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనల అనంతరం గురువారం రాత్రి 10 గంటల సమయంలో జడ్జి తీర్పు ఇచ్చారు. సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. జమానతుదారుల పూచీకత్తు పత్రాలను సంజయ్ తరఫు న్యాయవాదులు సమర్పించగా.. కోర్టు విడుదల ఆదేశాలు (రిలీజ్ ఆర్డర్) జారీ చేసింది. మరోవైపు సంజయ్‌ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌పై తీర్పును సోమవారానికి వాయిదా వేసింది. శనివారం ఉదయం విడుదల బండి సంజయ్ బెయిల్ పేపర్లు ఇంకా మాకు అందలేదు. అందినా రాత్రి పూట విడుదల చేసే అవకాశం లేదు. శుక్రవారం ఉదయం బెయిల్ పేపర్లు అందే అవకాశాలు ఉన్నాయి. రాగానే వాటిని పరిశీలించి సంజయ్‌ను విడుదల చేస్తాం. – సమ్మయ్య, కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ చదవండి: బండి సంజయ్ చేసిన తప్పేంటి?.. అది లీకేజీ ఎలా అవుతుంది: హైకోర్టు -
బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
సాక్షి, వరంగల్: మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వాడీవేడీగా వాదనలు.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. భారీ భద్రత.. అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఖమ్మం జైలుకు.. తీర్పు అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చొక్కా విప్పిన బండి.. కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు. చదవండి: బండి సంజయ్‌పై నమోదైన కేసు ఇదే.. అరెస్టుపై అమిత్‌షా ఆరా.. ఏం జరిగిందో చెప్పిన కిషన్ రెడ్డి.. -
హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, వరంగల్: హన్మకొండలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. నగరంలోని సువిద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఫస్టియర్ విద్యార్థిని నాగజ్యోతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ నిన్న జరిగిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ సరిగా రాయకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి కళాశాలకు చెందిన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. నిన్న పరీక్ష రాసి హాస్టల్‌కు వెళ్లిన విద్యార్థిని రాత్రి ఉరి వేసుకుంది. వెంటనే తోటి విద్యార్థులతో పాటు కళాశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పేరెంట్స్ వస్తే గాని విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని ఆత్మహత్యతో కళాశాల వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనలకు తావు లేకుండా చర్యలు చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజునే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తుంది. చదవండి: అందం ఆమె పాలిట శాపమైంది -
ఇద్దరు కొడుకులతో కలసి బావిలోకి దూకిన తల్లి
నడికూడ: ఇద్దరు కొడుకులతో కలసి తల్లి బావిలో దూకగా.. ఒక కొడుకు, తల్లి మృతిచెందిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడి కుమారస్వామితో దేశాయిపేటకు చెందిన కావ్య అలియాస్ లావణ్య (30)కు 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు విద్యాధర్ 3వ తరగతి చదువుతుండగా.. చిన్న కొడుకు శశిధర్ (7) ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా, కావ్య ఆదివారం మధ్యాహ్నం తన ఇద్దరు కుమారులతో కలసి గ్రామంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. ముందుగా ఇద్దరు కుమారులను బావిలోకి తోసి.. ఆ తర్వాత తానూ బావిలోకి దూకింది. వీరిలో పెద్ద కుమారుడు బావిలోని విద్యుత్ మోటార్ పైపును పట్టుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, వ్యవసాయ కూలీలు వచ్చి విద్యాధర్‌ను పైకి తీశారు. అప్పటికే తల్లి, చిన్న కుమారుడు శశిధర్ మృతిచెందారు. కావ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కొడుకు విద్యాధర్‌ను ప్రశ్నించగా నానమ్మతో తల్లికి గొడవ జరిగిందని తెలిపాడు. మృతురాలు కావ్యకు మతిస్థిమితం సరిగా లేదని తెలిసింది. -
ఈటల ఇలాకాలో కేటీఆర్‌కు నిరసన సెగ.. చేనేత కార్మికుల నిలదీత
హన్మకొండ: ఈటల రాజేందర్ ఇలాక కమలాపూర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగింది. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు కేటీఆర్ కాన్వాయ్ ముందు నల్ల చొక్కాలతో నిరసన వ్యక్తం చేశారు. వీరిపై బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి నిరసన తెలిపిన ఐదుగురు ఎన్ఎస్యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కమ్యూనిటీ కాంప్లెక్స్ వద్ద మంత్రి కేటీఆర్‌ను చేనేత కార్మికులు నిలదీశారు. తమ అభివృద్ధి కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. దీనికి స్పందనగా పద్మశాలీల అభివృద్ధికి ఏం చేశారో మోదీని అడగాలని కేటీఆర్ బదులిచ్చారు. దీంతో మోదీ మాకు తెల్వదు.. మీరే అభివృద్ధి చేయాలంటూ ఓ మహిళ సమాధానమిచ్చింది. పిల్లలతో భోజనం.. నిరసనలు ఎదురైన తన పర్యటను యథావిధిగా కొనసాగించారు కేటీఆర్. కమలాపుర్ ఎంజేపీ స్కూల్ పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మాట్లాడి ముచ్చటించారు. అనంతరం డ్రోన్ల ఉపయోగాల గురించి వివరించారు. 'డ్రోన్‌తో రైతుల పంటపొలాలపై పురుగుల మందు స్ప్రే చేయొచ్చు. డ్రోన్ అంటే కెమెరా కాదు.. మనుషులను తీసుకుకేళ్ళే వాహనం కూడా అవుతుంది. డ్రోన్‌తో అమ్మాయిల భద్రత విషయంలో చర్యలు తీసుకోవచ్చు. వీటితో గుట్టలు, చెరువులు, కుంటల సరిహద్దులను నిర్ధరించవచ్చు. ఎవరూ చొరబడకుండా చూడవచ్చు' అని కేటీఆర్ చెప్పారు. అలాగే చదువుకుని మీరంతా ఎమవుతారు? ఉద్యోగం చేస్తారా? అని విద్యార్థులను కేటీఆర్ ప్రశ్నించారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయవచ్చు లేదా 10 మందికి మీరే ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. అవకాశాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పిల్లలను హైదరాబాద్‌లోని టీ-హబ్ టాస్క్‌కు తీసుకురావాలని కలెక్టర్, ప్రిన్సిపాల్‌లను కేటీఆర్ అదేశించారు. చదవండి: తెలంగాణ బడ్జెట్‌కి గవర్నర్ ఆమోదం -
నటరాజ వందనం.. శివుడికే అంకితం
సాక్షి, హన్మకొండ: ‘నటరాజ వందనం.. శివుడికి అంకితం చేసిన నృత్య ప్రదర్శన. నా తల్లి మృణాళిని సారాభాయ్ వెలువరించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి రూపొందించింది. సాధారణంగా పురుష దేవతల్లో ఐక్యత కోసం నాయిక అన్వేషణగా ఇది ప్రదర్శితమవుతుంది.’ అని అంతర్జాతీయ శాస్త్రీయ నృత్యకారిణి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయ్ అన్నారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రామప్ప ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం హనుమకొండ బాలసముద్రం ‘కుడా’ మైదానంలో ‘నటరాజ వందనం’ నృత్యాన్ని ప్రదర్శించారు. ఈసందర్భంగా ఆమె ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన నృత్య అనుభవం.. నటరాజ వందనం ప్రదర్శన తీరు, వివిధ ఆలయాల్లోని శిల్పాల్లో నృత్య భంగిమల ప్రత్యేకతల్ని వివరించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. నాకు నృత్యమంటే ప్రాణం. ఈ ఇష్టం మా అమ్మ నుంచి వచ్చినట్టుంది. అమ్మ శాస్త్రీయ నృత్యకారిణి. పుస్తకాలు రచించేది. ఆ అభిరుచి నాకు కూడా అలవడింది. కాకతీయుల కాలం నుంచి ప్రసిద్ధి చెందిన పేరిణి నృత్యం గురించి నాకు తెలుసు. 40 ఏళ్ల క్రితం కూచిపూడి గ్రామానికి చెందిన సీఆర్ ఆచార్యుల వద్ద నేను నృత్యం నేర్చుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరిణి నృత్య ప్రదర్శనలిచ్చా. శాస్త్రీయ సమకాలీన రచనలు సృష్టించి ప్రదర్శనలిస్తూ వస్తున్నా. 30 ఏళ్లుగా ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సంస్థ ‘దర్పణ అకాడమీ ఆఫ్ ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్’కు కో–డైరెక్టర్‌గా ఉన్నా. 1989లో మహిళా శక్తిని బలోపేతం చేసే సోలో థియేట్రికల్ వర్క్‌లను ప్రదర్శించాం. సామాజిక మార్పు కోసం, మహిళా సాధికారత, పర్యావరణ స్పృహ కలిగించేలా మా ప్రదర్శనలుంటాయి. అనేక రంగస్థల నిర్మాణాల్ని రూపొందించాం. సామాజిక మార్పు, పరివర్తన కోసం కళల్ని ఉపయోగించడమే నా ధ్యేయం. నాట్యాల్లో ప్రత్యేకం.. నాట్యాల్లో నటరాజ వందనం ప్రదర్శన ఒక ప్రత్యేకం. మా అమ్మ మృణాళిని సారాభాయ్ రచించిన ‘లవ్ సాంగ్స్ టు శివ’ పుస్తకం నుంచి దీన్ని కూర్పు చేశాను. పరమాత్మ కోసం ఆత్మ చేసే అన్వేషణే భరతనాట్యం. శివపార్వతుల నృత్యాన్ని చూడడానికి విశ్వం నిశ్చలంగా మారుతుంది. ఈ ప్రదర్శనను వర్ణం అని కూడా పిలుస్తారు. ఈప్రదర్శనలో నృత్యకారుడు శివుడి తాండవ నృత్య శక్తిని, గంభీరమైన రూపాన్ని చూపిస్తాడు. రామప్పలో ప్రదర్శించాలని కోరిక.. రామప్పలో నటరాజ నృత్య ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక. కొన్ని కారణాల వల్ల ప్రదర్శన ఇవ్వలేకపోయా. కానీ కాకతీయులు ఏలిన వరంగల్ నగరంలో ప్రదర్శించడం కూడా సంతోషంగానే ఉంది. ఇందుకు కాకతీయ హెరిటెజ్ ట్రస్ట్ వారు చాలా సహకారం అందించారు. రామప్ప ఆలయంలోని శిల్పాల నృత్యభంగిమలు ఎంతో ప్రత్యేకమైనవి. పూర్వం పురాతన దేవాలయాల్లోనే శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు జరిగేవి. అప్పటి వాళ్లు కళాపిపాసులు. అందుకేనేమో నృత్య ప్రదర్శనలను వివిధ నృత్య భంగిమల్లో శిల్పాలుగా రూపొందించారు. చరిత్రను, పురాతన దేవాలయాలను కాపాడుకోవాలి. అభిరుచి ఉండాలి.. ఈపోటీ ప్రపంచంలో శాస్త్రీయ నృత్యం నేర్చుకోవాలంటే అభిరుచి ఉండి తీరాలి. లేదంటే మనల్ని మనం నిరూపించుకోలేం. ముందు తరాల వారు శాస్త్రీయ నృత్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలి. నేర్చుకోవాలనే బలమైన కోరిక ఉండి, ఆర్థిక బలహీనత వల్ల వెనకబడేవారికి నేర్చుకునేలా అవకాశం కల్పించాలి. మన ప్రభుత్వం శాస్త్రీయ కళలకు నిధులివ్వట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం అవసరం. మల్లికా సారాభాయ్ గురించి క్లుప్తంగా.. అంతరిక్ష శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, శాస్త్రీ య నృత్యకారిణి మృణాళిని సారాభాయ్ దంపతుల కుమార్తె మల్లికా సారాభాయ్. 1954 మే9న అహ్మదాబాద్‌లో జన్మించారు. చిన్నతనంలోనే నృత్యం నేర్చుకున్నారు. 15ఏళ్ల వయస్సులో సినీ నటిగా పేరు తెచ్చుకున్నారు. 18 ఏళ్ల వయస్సులో భరతనాట్యం, కూచి పూడి శాస్త్రీయ నృత్యంలో అసాధారణ మైన యువనర్తకిగా గుర్తింపు పొందారు. నాటక, నృత్యరంగంలో చేసిన కృషికిగానూ గుజరాత్ ప్రభుత్వం ఆమెకు గౌరవ్ పురస్కార్ అందించింది. 2010లో భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. -
చోరీ నెపంతో తల్లి ఎదుటే విద్యార్థిని చితకబాదిన ప్రిన్సిపాల్
సాక్షి, హనుమకొండ: సెల్‌ఫోన్ చోరీ చేశావంటూ ఓ విద్యార్థిపై నిందమోసి చితకబాదాడొక ప్రిన్సిపాల్. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని మహాత్మా జ్యోతిభాపూలే బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై బాధిత విద్యార్థి, తల్లిదండ్రుల కథనమిది. కమలాపూర్ మండలం అంబాలకు చెందిన మాట్ల విష్ణు కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది దసరా సెలవులకు ముందు పాఠశాలలోని ఓ వంట మనిషి సెల్‌ఫోన్ చోరీకి గురైంది. అది ఎవరు దొంగిలించారో తెలియకపోయినా.. నేరాన్ని విద్యార్థులు యాకూబ్, విష్ణుపై ప్రిన్సిపాల్ పింగిలి వెంకటరమణారెడ్డి మోపారు. క్రిస్మస్ సెలవులకు ముందు ఇద్దరిని సుమారు పదిరోజుల పాటు సస్పెండ్ చేశారు. క్రిస్మస్ సెలవుల ఆనంతరం గురువారం విష్ణుతోపాటు మరో విద్యార్థి పాఠశాలకు రాగా.. పాఠశాలకు ఎందుకు వచ్చారంటూ ప్రిన్సిపాల్ మండిపడ్డారు. అదే పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్న విష్ణు తల్లి కవితను పిలిపించి.. ‘మీ అబ్బాయి సెల్‌ఫోన్ దొంగతనం చేశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని, టీసీ తీసుకొని వెళ్లిపోండని’.. ఆదేశించారు. చదవండి: (భర్త నిర్వాకం.. రెండో వివాహం చేసుకొని.. మొదటి భార్యను..) తన కొడుకు అలాంటి వాడు కాదని, దొంగతనం చేయలేదని ఎంత చెప్పినా వినిపించుకోని ప్రిన్సిపాల్.. ఆమె ఎదుటే విష్ణును గొడ్డును బాదినట్టు బాదారు. చోరీకి గురైన సెల్‌ఫోన్ డబ్బు ఇస్తామని తమతో ప్రిన్సిపాల్ ఒప్పంద పత్రం రాయించుకున్నారని, విష్ణును కొట్టిన విషయం బయటకు చెబితే స్వీపర్ పనినుంచి తీయించేస్తానని బెదిరించారని కవిత ఆవేదన వ్యక్తం చేసింది. తాను చేయని నేరానికి దెబ్బలు తినాల్సి వచ్చిందని మనస్తాపానికి గురైన విష్ణు చనిపోతాననడంతో ఆందోళన చెందిన కవిత ఇంటి వద్ద బిడ్డకు కాపలా కాస్తోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ విద్యార్థి విష్ణును పాఠశాలకు పిలిపించుకుని ‘తనకు కొందరు తప్పుడు సమాచారం ఇచ్చారని.. దొంగతనం చేసింది నువ్వు కాదని తెలిసిందని.. నిన్ను కొట్టినందుకు సారీ’.. అని క్షమాపణ చెప్పారు. విషయం తెలిసిన ఎన్ఎస్యూఐ, దళిత సంఘాల నేతలు శుక్రవారం విష్ణు తల్లిదండ్రులతో కలిసి పాఠశాలలో విచారణకు వచ్చిన జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డిని నిలదీశారు. ప్రిన్సిపాల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేశారు. ఈ సంఘటనపై ఆర్సీవో ఆదేశాల మేరకు విచారణ జరిపానని, నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని మనోహర్‌రెడ్డి తెలిపారు. -
ప్రభుత్వోద్యోగం రాలేదని..
ఐనవోలు: ప్రభుత్వోద్యోగం రావడం లేదని మనస్తాపానికి గురైన ఒక యువకుడు పురుగు మందు తాగి చనిపోయాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రా మంలో ఈ ఘటన జ రిగింది, ఎస్ఐ వెంకన్న కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జక్కుల రాజ్‌కమల్ (25) డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వో ద్యోగాల కోసం ప్ర యత్నిస్తున్నాడు. ఇటీవల పలు నోటిఫికేషన్లు విడుదల కాగా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వోద్యోగం రావడం లేదని దిగులుగా ఉండే వాడు. అది గమనించిన రాజ్‌కమల్ తల్లిదండ్రులు ఉద్యోగం రాకు న్నా పర్వాలేదని.. ఏదైనా దుకాణం పెట్టు కుని బతకవచ్చని ధైర్యం చెప్పేవారు. దుకాణం నడపడం ఇష్టం లేకపోవడంతోపాటు ఉద్యోగం రాక అందరిలో చులకన అవుతున్నానని మనస్తాపం చెందిన రాజ్‌కమల్ ఈ నెల 4న రాత్రి పురుగు మందుల తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
వాహనదారులకు షాక్! లీటర్ పెట్రోల్‌లో ఏకంగా 90 శాతం నీరు?
శాయంపేట: పెట్రోల్‌లో నీరు చేరడంతో వాహనాలు మోరాయించాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు వాహనాలు పెట్రోల్ పోసుకున్న అరగంటకే మోరాయించడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి యజమానిని ప్రశ్నించారు. దీంతో బంక్ యజమాని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న గ్రామస్తులు బాటిల్లో పెట్రోల్ పట్టగా నీరే అధిక శాతం కనిపించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గంగిరేణిగూడెం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గంగిరేణిగూడెంలోని పెట్రోల్ బంక్‌లో బుధవారం ఉదయం పోతు సునీల్, దొంగరి శ్రావణ్, ముక్కెర సురేష్ తమ ద్విచక్రవాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కాసేపటికే వాహనాలు మోరాయించడంతో మెకానిక్ వద్దకు వెళ్లారు. కల్తీ పెట్రోల్ వల్ల వాహనాలు చెడిపోయాయని చెప్పడంతో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. దీంతో అతడు బుకాయిస్తూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని సమస్య విని ఖాళీ వాటర్ బాటిల్లో పెట్రోల్ పోయించగా 90శాతం నీరు, 10శాతం మాత్రం పెట్రోల్ రావడంతో కంగుతిన్నారు. దీంతో కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని బంక్ యజమానిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంక్ సీజ్ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ విషయమై బంక్ యజమాని శ్రీనివాస్‌ను ప్రశ్నించగా మంగళవారం సాయంత్రం కొత్త లోడు వచ్చిందని, ఉదయం నుంచి పెట్రోల్ అమ్మకాలు చేపడుతున్నామని, నీరు ఎలా సింక్ అయిందో తెలియదని తెలిపారు. పెట్రోల్ పోసుకున్న వారి వాహనాలు పాడైతే మర్మమ్మతు చేయించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. -
విద్యలో వివక్ష ఉండొద్దు
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్‌లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్‌ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. -
24 గంటలపాటు ప్రసంగం
విద్యారణ్యపురి: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రియాంక సుంకురుశెట్టి. 24 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రియాంక హనుమకొండ నక్కలగుట్టలోని ఆస్పైర్ క్లినీ అకాడమీలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి సోమవారం ఉదయం 9:30 గంటల వరకు 24 గంటపాటు ‘సన్‌రైజ్ టు సన్‌రైజ్’పేరుతో మారథాన్ లెక్చర్ ఇచ్చారు. ప్రతిగంటకు 5 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. క్లినిక్ రీసెర్చ్ అండ్ క్లినిక్ డేటా మేనేజ్మెంట్ తదితర అంశాలపై 24 గంటల పాటు ఆమె ప్రసంగించారు. తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్‌కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమకొండ వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. -
అమెరికాలో హనుమకొండవాసి మృతి
వరంగల్ క్రైం: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హనుమకొండ నక్కలగుట్టకు చెందిన కుంటా ఉత్తేజ్(27) నీటిలో మునిగిపోతున్న స్నేహితుడిని కాపాడబోయి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఉత్తేజ్ గత ఆగస్టు ఒకటిన అమెరికాలో ఎంఎస్ చదవడానికి వెళ్లాడు. మిస్సౌరిలోని సెయింట్ లూయిస్ కాలేజీలో ఎంఎస్ చదువుతున్న ఉత్తేజ్ అమెరికా కాలమాన ప్రకారం ఈ నెల 26న మధ్యాహ్నం నలుగురు స్నేహితులతో కలిసి ఓజార్క్ సరస్సుకు వెళ్లారు. తనతోపాటు హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో బీడీఎస్ చదివిన తాండూరుకు చెందిన శివదత్తు అనే విద్యార్థి సరస్సులో దిగి మునిగిపోతుండటంతో కాపాడటానికి దిగిన ఉత్తేజ్ కూడా గల్లంతయ్యాడు. గట్టుపై ఉన్న మరో ఇద్దరు స్నేహితులు అక్కడి పోలీసులకు సమాచారం అందించడంతో అమెరికా రెస్క్యూ టీం గాలింపు చేపట్టి ఆదివారంరాత్రి ఉత్తేజ్ మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం బుధవారం అర్ధరాత్రి హనుమకొండకు చేరనుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఉత్తేజ్ పదవ తరగతి వరకు నక్కలగుట్టలోని విజ్ఞాన్ పాఠశాలలో, ఇంటర్మీడియెట్ విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో, బీడీఎస్ హైదరాబాద్‌లోని పానానియా డెంటల్ కళాశాలలో చదివాడు. ఉత్తేజ్ తండ్రి జనార్దన్ ఎల్కతుర్తి మండలం గోపాల్పూర్ ప్రా«థమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్. తల్లి ఝాన్సీలక్ష్మి గృహిణి. ఉత్తేజ్‌కు సోదరుడు ఉజ్వల్, సోదరి సాయిసేవికా ఉన్నారు. -
అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
సాక్షి, వరంగల్: అమెరికాలోని మిస్సోరి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మిస్సోరిలోని ఓజార్క్ సరస్సులో ఈతకు వెళ్లిన నలుగురు తెలుగు విద్యార్థులు.. ప్రమాదవశాత్తు అందులో గల్లంతయ్యారు. వీరిలో వికారాబాద్‌కు చెందిన శివదత్తు, హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. నలుగురు తెలుగు విధ్యార్థులు మిస్సోరి రాష్ట్రం సెయింట్ లూయిస్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ మరణ వార్త తెలియడంతో అతని తల్లిదండ్రులు జనార్థన్, ఝాన్సీ లక్ష్మీ బోరున విలపిస్తున్నారు. కాగా గతేడాది ఆగస్టులో అమెరికా వెళ్లిన ఉత్తేజ్ హెల్త్ సైన్స్ డేటాలో మాస్టర్స్ చేస్తున్నాడు. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లాతాండూరుకు చెందిన అపెక్స్ ఆస్పత్రి యజమాని వెంకటేశం, జ్యోతి దంపతుల రెండో కుమారుడు శివదత్తు (25) కూడా మరణించారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఈ ఏడాది జనవరిలో అమెరికా వెళ్లాడు శివదత్తు. సెయింట్ లూయిస్ వర్సిటీలో డెంటల్ ఎంఎస్ విద్య అభ్యసిస్తున్నాడు. శనివారం దత్తు స్నేహితులతొ కలిసి ఓజార్క్ లేక్‌కు వెళ్లాడు. సరస్సులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు ఇద్దరూ మునిగిపోయారు. విషయం తెలిసి మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: రాత్రి ఇంటికి రానని చెప్పి.. ఫ్రెండ్‌ను బస్టాప్‌లో దింపేందుకు వెళ్తుండగా.. -
విషాదం: వైద్యం కోసం బస్సులో వెళ్తుండగా భార్య ఒడిలోనే..
పరకాల: వైద్యం కోసం ఆర్టీసీ బస్సులో బయల్దేరిన ఒక డయాలసిస్ రోగి గుండెపోటుతో భార్య ఒడిలోనే కుప్పకూలాడు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్‌లో శుక్రవారం ఉదయం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన అలిగేటి తిరుపతి రెడ్డి (44) కొంతకాలంగా వరంగల్‌లో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యం కోసం భార్య స్వప్నతో కలిసి వెంకట్రావుపల్లి నుంచి వరంగల్‌కు ఆర్టీసీ బస్సులో వస్తున్నారు. బస్సు పరకాల బస్టాండ్‌కు చేరుకున్న కాసేపటికే.. భార్య ఒడిలో గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వైద్యం చేస్తే బతుకుతాడనుకున్న భర్త.. కన్ను మూయడంతో భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. (క్లిక్ చేయండి: సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి) -
Warangal: బర్త్‌డే వేడుకల్లో గొడవ.. శానిటైజర్ తాగిన విద్యార్థినులు
వరంగల్/ఎంజీఎం: హనుమకొండ జిల్లా ఆరెపల్లి సమీపంలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ఉదయం 10వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగారు. దీంతో రుతిక, స్ఫూర్తి, జోత్స్న, ఉమాదేవి, చార్విక అనే విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం వారిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యు లు విద్యార్థినులకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో స్కూల్ నిర్వాహకులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ములుగు జిల్లా పాకాల కొత్తగూడకు సంబంధించిన జ్యోతిరావుపూలే బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆరెపల్లి వద్ద ఒక ప్రైవేటు పాఠశాలను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. కాగా, శనివారం 10వ తరగతి విద్యార్థిని పుట్టినరోజు వేడుకల్లో తలెత్తిన గొడవ ఈ ఘటనకు దారి తీసినట్లు తెలుస్తోంది. బర్త్‌డేకు హాస్టల్లోని వారే కాకుండా ఇతర విద్యార్థులు కూడా హాజరు కావడంతో హాస్టల్ విద్యార్థినుల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో ఈ గొడవపై వసతి గృహం అధి కారులు విద్యార్థినులను మందలించినట్లు తెలిసింది. అంతేకాకుండా ఈ విషయాన్ని వారు ఆదివారం ఉదయం ప్రిన్సి పాల్ దృష్టికి తీసుకెళ్లడంతో గొడవతో సంబంధం ఉన్న ఐదుగురు విద్యార్థినులు శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. అధికారులు మాత్రం విద్యారి్థని బర్త్ డే వేడుకల్లో తలెత్తిన గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. కాగా, హాస్టల్లో విద్యార్థినులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లు ఆరా తీసినట్లు సమాచారం. ఆస్పత్రి లో ఉన్న విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని వై ద్యులకు సూచించినట్లు తెలుస్తోంది. విచారణకు ఆదేశించిన మంత్రి.. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ విచారణకు ఆదేశించినట్లు చెపుతున్నారు. మరో పక్క ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చే స్తున్నాయి. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని వరంగల్ అదనపు కలెక్టర్ శ్రీవత్స పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో.. తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. విద్యారి్థనుల తల్లిదండ్రులతో మాట్లాడి హాస్టల్లో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్ ఎదుట సంతోష్ హాజరు లేనట్టే! -
డివైడర్‌తోపాటు లారీని ఢీకొట్టి..
కమలాపూర్: ఐదుగురితో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న ఫ్లయాష్ లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం శనిగరం గ్రామ శివారులో శుక్రవా రం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఉంటున్న గుంటూర్‌పల్లికి చెందిన అన్నెం నాగార్జునరెడ్డి (38) తన భార్యాపిల్లలతో గోపాల్పూర్ అనుబంధ గ్రామం గుంటూర్ పల్లిలో శుక్రవారం తన బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి వచ్చారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత తన సొంత పనిమీద గోపాల్ పూర్‌కు చెందిన చుక్క అశోక్ (27), చుక్క అజయ్ (25), గుంటూర్ పల్లికి చెందిన ఉజ్జేతుల వి జేందర్ (35), తాడూరి ప్రవీణ్ అనే నలు గురు స్నేహితులతో కలిసి కారులో రాత్రి 11.30 గంటలకు పరకాలకు బయల్దే రారు. ఈ క్రమంలో శనిగరం గ్రామ శివారులోకి వెళ్లగానే రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యాన్ని తప్పించబోయే ప్రయత్నంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపు ఎదురుగా పరకాల నుంచి వస్తున్న ఫ్లయాష్ లారీని ఢీకొ ట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి అందులో ప్ర యాణిస్తున్న అన్నెం నాగార్జున రెడ్డి, చుక్క అజయ్‌లు అక్కడి కక్కడే మృతిచెందారు. చుక్క అశోక్, ఉజ్జేతుల విజేందర్, తాడూరి ప్రవీణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకున్న క్షతగాత్రు లను బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 ద్వారా వరంగల్ ఆరెపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తర లించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విజేందర్ మరణించగా..మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నాగార్జునరెడ్డి తల్లి లక్ష్మీనర్సమ్మ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ సంజీవ్ తెలిపారు. మృతులు నాగార్జునరెడ్డికి భా ర్య, కూతురు, అజయ్‌కు భార్య, కూతురు, విజేందర్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
వీఆర్ఏలపై సీఎం కేసీఆర్ సీరియస్.. వినతిపత్రం విసిరేసి..
సాక్షి, వరంగల్: వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్.. ఆయన స్నేహితుడు, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి వెళ్లారు. అనారోగ్యంతో ఉన్న లక్ష్మీకాంతరావును పరామర్శించారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏలు) అక్కడికి వచ్చారు. తొలుత నలుగురు వీఆర్ఏలను లోపలికి తీసుకెళ్లారు. అందులో వీఆర్ఏల జేఏసీ హనుమకొండ జిల్లా కార్యదర్శి సతీశ్ ఒక్కడినే అనుమతించగా.. ఆయన సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందించారు. సీఎం ఆ వినతిపత్రాన్ని చదువుతుండగా సతీశ్ తమ సమస్యలను వివరించారు. ఈ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వినతిపత్రాన్ని సతీశ్ వైపు విసిరేస్తూ.. సమ్మె విరమించాలని చెప్పినా వినడం లేదని, తరచూ కాన్వాయ్‌కు అడ్డుపడుతున్నారని మండిపడినట్టు సమాచారం. దీంతో వీఆర్ఏలతోపాటు అక్కడున్న నాయకులు ఆశ్చర్యపోయినట్టు తెలిసింది. చదవండి: కేంద్ర మంత్రులు తిట్టిపోయిన మరునాడే అవార్డులు వస్తున్నాయి: సీఎం కేసీఆర్ లక్ష్మీకాంతరావును పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -
పాఠాలు బోధించే బడిలోనే ప్రాణాలు విడిచింది..
సాక్షి, హన్మకొండ: పాఠాలు బోధించే బడిలోనే ఓ ఉపాధ్యాయురాలు ప్రాణాలు విడిచింది. రోజూ మాదిరిగానే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు అలసటగా ఉందని, ఒళ్లు చెమటలు పట్టేస్తున్నాయని, చేతులు లాగుతున్నాయంటూ రెస్ట్ రూంలోకి వెళ్లింది. అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుండగానే విగతజీవిగా మారిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందిందని తెలపడటంతో పాఠశాల శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషాద ఘటన మంగళవారం హనుమకొండలోని యాదవనగర్‌లోని సిద్దార్థ హైస్కూల్లో చోటుచేసుకుంది. పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ ఇల్లందుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ బ్రాహ్మణవాడకు చెందిన చెరుకుపెల్లి ఉషశ్రీ (45) సుమారు 12 సంవత్సరాలుగా సిద్దార్థ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. రెండు రోజులుగా ఆరోగ్యం సహకరించడం లేదంటూనే మంగళవారం విధులకు హాజరైంది. మధ్యాహ్నం 1గంట సమయంలో ఒళ్లు అలసటగా ఉందని, చేతులు లాగుతున్నాయంటూ తరగతిలో నుంచి బయటకు వచ్చింది. అంతలోనే సహచర సిబ్బంది ఏమైందని తెలుసుకునేలోగా స్పృహ కోల్పోయింది. హుటాహుటిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు పాఠాలు బోధించిన టీచర్ ఇకలేరని తెలుసుకున్న విద్యార్థులు రోదనలు మిన్నంటాయి. చదవండి: (Engineering: ఫీజులను పెంచేసిన పలు కాలేజీలు) -
హన్మకొండ జిల్లాలో ఎన్ఐఏ సోదాలు కలకలం..
సాక్షి, హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనిత, ఇంట్లో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్‌రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్సోఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేదని ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశంలో రాసుకున్న బుక్ ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. మహిళలకు సమాజంలో జరుగుతున్న అన్యాయంపై మాట్లాడొద్దని చెప్పారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్ తెలంగాణ సరిహద్దులో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్ మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
రక్తం సలసల మరుగుతోంది.. కేసీఆర్‌పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: బీజేపీ కార్యకర్తలను కేసులతో బెదిరించలేరని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాళాల మైదానంలో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, బైంసాలో ఎంఐఎం కుట్రలను తట్టుకొని ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బతికినన్నాళ్లు ధర్మం కోసమే బతుకుతారన్నారు. ట్రాఫిక్ నిబంధనల పేరుతో బీజేపీ సభలను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా ‘‘బీజేపీ తెలంగాణ అభివృద్ధి కోసమే మాట్లాడుతుంది. నన్ను అరెస్ట్ చేసినా నా యాత్ర ఆపలేదు. కార్యకర్తలను, పార్టీ శ్రేణులను కేసులు, అరెస్టులతో ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడు చస్తామో, ఎన్నాళ్లు బతుకుతామో చెప్పలేని పరిస్థితులు. కేసీఆర్‌ను వదిలే ప్రసక్తేలేదు.. రక్తం సలసల మరుగుతోంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అభివృద్ధి విషయంలో చర్చకు మేం సిద్ధం. కేసీఆర్ మోసాలను ప్రజలు గమనిస్తున్నారు’’ అని బండి సంజయ్ అన్నారు. -
ఈటల రాజేందర్ ఇంట విషాదం
సాక్షి, హనుమకొండ: హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య(104) అనారోగ్యంతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. దీంతో స్వగ్రామం కమలాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రే కమలాపూర్‌కు చేరుకున్న ఈటల.. తండ్రి భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పితృవియోగంపై ఈటల రాజేందర్‌ను పలువురు నేతలు పరామర్శించారు. సంతాప సూచికంగా.. కమలాపూర్తో పాటు హనుమకొండలో ఇవాళ బిజెపీ చేపట్టాల్సిన నిరసన దీక్షలు రద్దు అయ్యాయి. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్యకు హైదరాబాద్‌లోని ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. ఇక ఈటల మలయ్య అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదీ చదవండి: బీజేపీ స్టార్ క్యాంపెయినర్ హఠాన్మరణం -
అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలంలో భార్యను హత్య చేసిన ఓ భర్త.. తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవిపేటకు చెందిన పుష్పలీలకు హరీష్‌తో రెండు నెలల కిత్రం వివాహం జరిగింది. అయితే భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని ఆమెపై భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల కిత్రమే భార్యతో గొడవపడిన హరీష్ క్రిమిసంహారక మందు తాగాడు. హస్పిటల్లో చికిత్స తీసుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నాడు. అయితే మరోసారి భార్యభర్తల మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రోక్తుడైన భర్త హరీష్ సోమవారం అర్థరాత్రి భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
హనుమకొండలో బీజేపీ, కాంగ్రెస్ వర్గాల ఘర్షణ
హనుమకొండ: కాంగ్రెస్, బీజేపీ పరస్పర దాడులతో హనుమకొండలోని హంటర్ రోడ్డు ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడిలో సీఐ గన్‌మన్ గాయపడ్డారు. బీజేపీ తెలంగాణ సంపర్క్ అభియాన్‌లో భాగంగా అనుబంధ సమావేశాలు జరుగుతున్న ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిపథ్‌ను ఉపసంహరించుకోవాలని, రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు అడ్వకేట్స్ కాలనీ నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం సమీపానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయం కింద ఉన్న హాల్లో అప్పటికే బీజేపీ ఓబీసీ మోర్చా సమావేశం జరుగుతోంది. దీనికి రాజ్యసభ సభ్యుడు ఓంప్రకాశ్ మాథూర్ హాజరయ్యారు. ఉద్రిక్త పరిస్థితుల గురించి తెలుసుకున్న సుబేదారి, కేయూసీ ఇన్స్పెక్టర్లు రాఘవేందర్, దయాకర్ పోలీసు బలగాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. రాజేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేస్తుండగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలి క్యాంపు కార్యాలయం వద్దకు చొచ్చుకెళ్లారు. బీజేపీ కార్యకర్తలు సమావేశం నుంచి బయటకు రావడంతో ఇరువర్గాలవారు కర్రలతో దాడి చేసుకుంటున్న సమయంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కారులో వచ్చి దిగారు. బీజేపీ కార్యకర్తలు ఆమె కారును చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. ఇరువర్గాల దాడితో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. దాడిలో సుబేదారి ఇన్స్పెక్టర్ గన్‌మేన్ అనిల్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు లాఠీచార్జీ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. కాగా, టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఒక్కటై తమ కార్యాలయంపై దాడికి దిగారని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మాత్రమే వచ్చామని, బీజేపీ నేతలే కావాలని దాడి చేశారని రాజేందర్‌రెడ్డి ప్రత్యారోపణ చేశారు. -
పేదలకు ఎకరం భూమి.. 10 లక్షల ఉద్యోగాలు
హన్మకొండ అర్బన్: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌లో మార్చి 6న ప్రారంభమైన బహుజన రాజ్యాధికార యాత్ర బహుజనుడిని ముఖ్యమంత్రి చేసేవరకు ఆగేదిలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. 2023లో తెలంగాణ లో బీఎస్పీ అధికారంలోకి వస్తుందని, ప్రగ తిభవన్‌పై నీలిజెండా ఎగురుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ లో ఉండి దొరలకు చెంచా కొడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు బీఎస్పీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. బహుజన రాజ్యాధికార యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకాశ్‌ఆనంద్, ఎంపీ రాంజీగౌతం, ఇతర నాయకులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి, ఉచితంగా విద్య, వైద్యం అందిస్తామన్నారు. పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. 60వేల పుస్తకాలు చదివిన మేధావులకు ప్రశాంత్‌కిశోర్ సలహా లు ఎందుకని ప్రశ్నించారు. బీఎస్పీలో 60 వేల పుస్తకాలు చదివిన మేధావులు, 90 ఎంఎల్ తాగుబోతులు లేరని ఎద్దే వా చేశారు. తమ వెనక పార్టీని నడపడానికి స్వామీజీలు లేరని, మెగా, మైహోం లు లేవని, కాళేశ్వరం ప్రా జెక్టులు లేవని, బహుజనుల గుండె ధైర్యం ఉందని అన్నారు. -
రైతులకు మద్దతు.. తీన్మార్ మల్లన్న అరెస్ట్
సాక్షి, హన్మకొండ: జిల్లాలోని ఆరెపల్లిలో భూసేకరణ జీఓ 80ఏ ను రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన రైతుల ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపిన తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును అడ్డుకునేందుకు రైతులు, రైతు కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. గ్రామసభ నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చి అడ్డుకున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన కారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రైతులను నెట్టేసి, తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసి వేలేరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం స్వంత పూచికత్తుపై వదిలిపెట్టారు. అయితే జీఓ 80ను వ్యతిరేకంగా ఆరెపల్లిలో రైతులు పోచమ్మ ఆలయం వద్ద గ్రామ సభ నిర్వహించగా వారికి మద్దతుగా వెళ్ళితే అరెస్టు చేయడంతో పాటు అక్రమ కేసు నమోదు చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని, ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించిన జీవో 80ఏ ను రద్దు చేసే వరకు రైతుల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. గ్రామంలో ప్రశాంతంగా గ్రామ సభ పెట్టుకుంటే పోలీసులు వచ్చి సభను భగ్నం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతమందిని అరెస్ట్ చేసిన ఉద్యమం ఆగదని, భూసేకరణ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఊరు మునిగింది.. ఉపాధి పోయింది! -
హన్మకొండలో పాయల్ రాజ్‌పుత్ సందడి
వరంగల్‌లో సినీ నటీ పాయల్ రాజ్‌పుత్ సందడి చేశారు. సౌత్ ఇండియా బ్రైడల్ మేకప్ స్టూడియో ఆధ్వర్యంలో హన్మకొండలో నిర్వహించిన బిగ్గెస్ట్ బ్రైడల్ మేకప్ కాంపిటేషన్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మాయిలందరితో కలిసి డ్యాన్స్ చేసి అందరిని ఆకట్టుకున్నారు. మేకప్ కాంపిటీషన్‌కు పలు రాష్ట్రాల నుంచి సుమారు 200 మంది మోడల్స్ పాల్గొన్నారు. ఫ్యాషన్ షో తో ర్యాంప్ వాక్, క్యాట్ వాక్ నిర్వహించి తమ ప్రతిభను చాటుకున్నారు. కాగా పాయల్ రాజ్‌పుత్ బిగ్‌బాస్ తెలుగు ఓటీటీ నాన్‌స్టాప్ షోలో బిందుమాధవికి మద్దతు పలికిన విషయం తెలిసిందే! నువ్వు టైటిల్ గెలవడానికి అర్హురాలివి అంటూ బిందుకు సపోర్ట్ చేసింది. చదవండి 👇 ఓ వైపు చెల్లి పెళ్లి, మరోవైపు బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ -
పెళ్లయిన నెల రోజులకే.. భర్త మెడ కోసింది
దామెర: వారికి నెల రోజుల కింద పెళ్లయింది. మొదట బాగానే ఉన్న అమ్మాయి.. కొద్దిరోజులకు అసలు విషయం బయటపెట్టింది.. తన కు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్తతో చెప్పింది.. మెల్లగా సర్దుకుంటుందిలే అని భర్త అనుకున్నాడు.. కానీ ఓ అర్ధరాత్రి.. బాత్రూమ్కని లేచిన అమ్మాయి.. మెల్లగా బ్లేడ్ తీసుకుని వచ్చింది.. బెడ్‌పై పడుకుని ఉన్న భర్త మెడ కోసేందుకు యత్నించింది.. అది గమనించిన భర్త గట్టిగా అరవడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఆస్పత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పసరగొండలో సోమవారం ఈ ఘటన జరిగింది. పరకాల పోలీ సులు,బాధితుడు ఈ వివరాలు వెల్లడించారు. ఇష్టం లేదని చెప్పి.. పసరగొండకు చెందిన మాడిశెట్టి రాజు గ్రామ సమీపంలోని ఒక క్రషర్లో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఆత్మకూర్ మండలం మల్లక్కపేట గ్రామానికి చెందిన హేమలత అలియాస్ అర్చనతో మార్చి 25న పెళ్లి జరిగింది. కొద్దిరోజుల క్రితం తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని భర్త రాజుతో చెప్పింది. రాజు అంటే ఇష్టం లేదంది. అయినా రాజు ఏమీ అనలేదు. తనంటే ఇష్టం కలిగే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో అర్చన బాత్రూమ్కని లేచి అటుఇటు తిరిగి నిద్రపోయింది. తర్వాత 2 గంటల సమయంలో మళ్లీ లేచింది. వెళ్లి బ్లేడ్ తీసుకొని వచ్చి రాజు గొంతు కోసేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో రాజు ఓ పక్కకు తిరిగి పడుకోవడంతో అతడి మెడపై గాయమైంది. ఆమె మరోసారి బ్లేడుతో కోసేందుకు సిద్ధమయ్యేసరికి రాజు తేరుకున్నాడు. అర్చనను నెట్టివేసి గట్టిగా అరిచాడు. కుటుం బ సభ్యులు పరుగెత్తుకువచ్చి రాజును రక్షిం చారు. మెడపై గాయంతో రక్తం కారుతున్న రాజును.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజుకు చికిత్స చేశారు. మెడ వెనుకవైపున గాయమవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని చెప్పి ఇంటికి పంపించారు. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. కేసు పూర్తి వివరాలను తర్వాత ప్రకటిస్తామని ఏసీపీ జూపల్లి శివరామయ్య తెలిపారు. సర్దుకుంటుందని అనుకున్నా.. ‘నెల క్రితం మా పెళ్లయింది. ఈ మధ్యే తనకు నేనంటే ఇష్టం లేదని చెప్పింది. పెళ్లయి కొన్నిరోజులే కదా అయింది. నెమ్మదిగా సర్దుకుంటుందని అనుకున్నా.. రాత్రి పడుకున్న తర్వాత లేచింది. బాత్రూమ్కు వెళ్తుందనుకున్నా.. కానీ బ్లేడు తెచ్చి గొంతుకోయాలని చూసింది. నేను గట్టిగా అరిచే సరికి పక్క గదిలోకి వెళ్లి దాక్కుంది’ అని రాజు తెలిపాడు. -
KTR వరంగల్ పర్యటన
-
కేసీఆర్ 3 గంటలే నిద్రపోతున్నారు
వరంగల్ స్పోర్ట్స్/వరంగల్/ఖిలా వరంగల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రోజుకు మూడు గంట లు మాత్రమే నిద్రిస్తూ తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి అనుక్షణం తాపత్రయ పడుతున్నారని మంత్రి శ్రీని వాస్‌గౌడ్ పేర్కొన్నారు. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 2 రోజుల పాటు జరగనున్న 8వ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఖిలా వరంగల్ మధ్యకోటలో రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.వరంగల్ పోచమ్మ మైదాన్‌లో హరిత హోటల్ నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఐదు టూరిజం సర్క్యూట్లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. 40 ఏళ్లు పైబడిన వెటరన్ క్రీడాకారులు ఈ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు అథ్లెటిక్స్ మీట్ నిర్వహణ కార్యదర్శి కూరాకుల భారతి తెలిపారు. -
మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు.. ఒక్కో ప్రయాణికుడికి ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కుంభమేళా.. వనదేవతల జాతర భక్తజనంతో పోటెత్తుతోంది. ఈ నెల 16న ప్రారంభమైన జాతర 19వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సొంత వాహనాల్లో వస్తుంటారు. అయితే మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం పర్యాటక శాఖ ప్రధాన నగరాల నుంచి హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హనుమకొండ నుంచి హెలికాప్టర్ సౌకర్యం కల్పించారు. కాజీపేటలోని సేయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్ నుంచి మేడారం వరకు సేవలందిస్తోంది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ సంస్థ ట్యాక్సీ హెలికాప్టర్‌ను నడుపుతోంది. చార్జీలు ఇలా.. హన్మకొండ నుంచి మేడారం షటిల్ సర్వీస్ ఒక్కో ప్రయాణికుడికి (అప్ అండ్ డౌన్) రూ.19,999 జాతరలో 7,8 నిమిషాల ఏరియల్ వ్యూ రైడ్ ఒక్కొక్కరికి రూ.3,700 బుకింగ్ ఇలా.. హెలికాప్టర్ టికెట్ బుకింగ్, ఇతర వివరాల కోసం 94003 99999, 98805 05905 సెల్‌నంబర్లలో లేదా info@helitaxi.com ద్వారా చేసుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరను సందర్శించే భక్తుల సౌకర్యార్థం బేగంపేట ఎయిర్‌పోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. జాయ్ రైడ్, షటిల్ సర్వీస్, చార్టర్ సర్వీస్ అనే మూడు రకాల సేవలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ సేవలు బుధవారం నుంచి ఆదివారం వరకు అందుబాటులో ఉండనున్నాయని పేర్కొన్నారు. హెలికాప్టర్ చార్టర్ సర్వీస్ అయితే కరీంనగర్ నుంచి మేడారానికి రూ. 75,000గా నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి మేడారానికి రూ. 75,000, మహబూబ్‌నగర్ నుంచి మేడారానికి రూ. 1,00,000 టికెట్ ధరను నిర్ణయించారు. ఇందులో 5 సీట్లు ఉంటాయి. వీఐపీ దర్శనం కల్పిస్తారు. విశేష స్పందన డారంలో హెలీకాప్టర్ రైడ్‌కు విశేష స్పందన లభిస్తోంది. హెలికాప్టర్ ఎక్కి సమ్మక్క సారలమ్మ వార్ల గద్దెలు జంపన్న వాగు గుట్టలు పై నుంచి మేడారం అందాలు చూసేందుకు భక్తులు పోటీ పడుతున్నారు.. 2014 నుంచి వరంగల్ మామునూరు బేగంపేట విమానాశ్రయాల నుంచి మేడారానికి భక్తులను తీసుకెళ్లే హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం మేడారంలో భక్తులను ఎక్కించుకొని తిప్పి చూపించే స్థాయికి హేలీ సర్వీసులు చేరుకున్నాయి. -
జంగారెడ్డి మృతిపట్ల పీఎం మోదీ సంతాపం
సాక్షి, ఢిల్లీ: మాజీ బీజేపీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి.. సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రధాని మోదీ సంతాప ప్రకటన విడుదల చేశారు. ‘జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి మాజీ ఎంపీ జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. అనేకమంది బీజేపీ కార్యకర్తలకు ఆయన ప్రేరణ ఇచ్చార’ని ప్రధాని కొనియాడారు. Shri C Janga Reddy Garu devoted his life to public service. He was an integral part of the efforts to take the Jana Sangh and BJP to new heights of success. He made a place in the hearts and minds of several people. He also motivated many Karyakartas. Saddened by his demise.— Narendra Modi (@narendramodi) February 5, 2022 బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కరెంట్ జంగన్నగా పేరుపొందారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి పట్ల కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని ఆయన మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని, జనం మధ్య పనిచేస్తూ ప్రజా ప్రతినిధిగా అనేక సార్లు గెలిచారని గుర్తుచేసుకున్నారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడు జంగారెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా చేయించడంలో, మోటార్లు కరెంటు మోటార్లు బిగించడంలో విశేష కృషి చేస్తూ కరెంట్ జంగన్నగా పేరుపొందారని తెలిపారు. జంగారెడ్డి కృషి చిరస్మరణీయం బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యా సాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి.. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఈరోజు బీజేపీ తెలంగాణలో ఈ స్థాయిలో ఉందంటే.. అందులో ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు. జంగారెడ్డి.. నేటి తరానికి ఆదర్శనీయం.. బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ నేత లక్ష్మణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేయడానికి జంగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. జంగారెడ్డి లాంటి వ్యక్తులు వేసిన పునాదులే ఈరోజు బీజేపీ మహావృక్షంగా ఎదగడానికి కారణమయ్యాయని తెలిపారు. జంగారెడ్డి.. నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శనీయమని చెప్పారు. రాజకీయాల్లో ఉండేవాళ్లు మడమ తిప్పకుండా జనం కోసం నిరంతరం శ్రమించాలని జంగారెడ్డి చెప్పేవారని తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాడేవారు బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ.. విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేసుకున్నారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని చెప్పారు. -
బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి కన్నుమూత
సాక్షి, హనుమకొండ: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి... హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడంలో ఆయనకు ఇబ్బందికలగడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు. దీంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. జంగారెడ్డి ఆకస్మిక మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌తో పాటు పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. జంగారెడ్డి పార్థివదేహానికి హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఉదయం 9:30 నుంచి 10 గంటల వరకు పార్టీ కార్యకర్తలు నాయకులు నివాళులర్పిస్తారు. కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డితో జంగారెడ్డి(ఫైల్ ఫోటో) వరంగల్ జిల్లా పరకాలకు చెందిన చందుపట్ట జంగారెడ్డి 18 నవంబర్ 1935న జన్మించారు. ఆయన 1953లో సి.సుధేష్ణను వివాహం చేసుకున్నారు. జంగారెడ్డికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన హన్మకొండలో నివాసం ఉంటున్నారు. 1984లో బీజేపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలలో జంగారెడ్డి ఒకరు. అప్పట్లో హనుమకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై భారీ మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొదారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు కొద్ది రోజులు ప్రభుత్వ పాఠశాలలో హయ్యర్ సెకండరీ టీచర్‌గా పనిచేశారు. చదవండి: రాజ్యాంగం గురించి మాట్లాడితే రాళ్లతో కొట్టిస్తాం.. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ -
Fake Currency: రాత్రి వేళ నకిలీ నోట్ల దందా
హసన్‌పర్తి (వరంగల్): నకిలీ నోట్లను అరికట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. నోట్లు రద్దు చేసి కొత్త నోట్లను చెలామణిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ మార్కెట్లో మాత్రం నకిలీ నోట్ల దందా మాత్రం జోరుగా సాగుతోంది. ఇటీవల హసన్‌పర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో నకిలీ నోట్లను స్థానిక వ్యాపారులు గుర్తించారు. రాత్రి వేళ కొనసాగుతోంది. సరుకులు ఇచ్చి నకిలీ రెండువేలు రూపాయలు తీసుకున్న ఓ వ్యాపారి ఆ తర్వాత అది అసలు నోటు కాదని తెలియడంతో లబోదిబోమన్నాడు. చదవండి: (Nalgonda: 'రూ. 1.50లక్షల ఆర్థికసాయం.. ఆస్పత్రి ఖర్చులన్నీ భరిస్తా') -
పొలం అమ్ముకొని సినిమా తీశా.. ఇండస్ట్రీలో వివక్ష బాధాకరం
సాక్షి, హన్మకొండ చౌరస్తా: ప్రసుత్త సమాజంలో కొందరు కులపిచ్చితో పరువు హత్యలకు పాల్పడుతుంటే.. సినిమా పరిశ్రమలోనూ కొత్త నటులపై వివక్ష కొనసాగుతోందని, ఈక్రమంలో పొలం అమ్ముకొని తీసిన సినిమా విడుదలకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రాకపోవడం బాధాకరమని యువ నటుడు, ‘‘ఊరికి ఉత్తరాన’’ హీరో వనపర్తి నరేందర్ అలియాస్ నరేన్ అన్నారు. డబ్బు, బ్యాక్‌గ్రౌండ్ ఉంటేనే ఫిలిం ఇండస్ట్రీలో స్థానం ఉంటుందనే భావన కలిగేలా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 19న విడుదలైన సినిమా విజయోత్సవ యాత్రలో భాగంగా సినిమా యూనిట్ వరంగల్‌కు వచ్చింది. ఈ సందర్భంగా సినీ హీరో నరేన్ ‘సాక్షి’తో పంచుకున్నారు. మాది వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం, రేబల్లె గ్రామానికి చెందిన వనపర్తి కొమురమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు నరేన్. హనుమకొండలో డిగ్రీ పూర్తి చేశాక, ఎంసీఏ కోసం 2003లో హైదరాబాద్ వెళ్లి.. కృష్ణానగర్‌లో గది అద్దెకు తీసుకుని చదువుతూ అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఎలాగైనా సినిమా తీయాలన్న నా కోరికతో ఊరిలో ఉన్న మూడెకరాల పొలం, రెండు ప్లాట్లు అమ్ముకొని జబర్తస్త్ ఫణీ, ఉదయ్‌తో కలిసి నాన్న వెంకటయ్య గణేష్‌రెడ్డి బీవీఎం నిర్మాతలుగా ఊరికి ఉత్తరాన సినిమా రూపొందించాడు. మూడు దశాబ్దాల క్రితం ఓ గ్రామంలో జరిగిన ప్రేమ వివాహం యువకుడి హత్య తమ కథావస్తువుగా రూపొందించామని నరేన్ తెలిపారు. సినిమా షూటింగ్ ఎక్కువ శాతం వరంగల్‌లోని పర్వతగిరి మండలం వడ్లకొండ గడీ, ఖిలావరంగల్, హైదరాబాద్ ప్రాంతాల్లో తీశామన్నాడు. సినిమా విడుదలకు ఒక్క డిస్ట్రిబ్యూటర్ ముందుకు రాలేదని తప్పనిసరి పరిస్థితుల్లో మరో రూ.60లక్షల తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 100 థియేటర్లలో స్వతహాగా ఈ నెల 19న విడుదల చేశాం. -
బోయినపల్లి వినోద్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్
సాక్షి, హనుమకొండ: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కుమారుడు డాక్టర్ ప్రతీక్ వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. హనుమకొండలో గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకలో నూతన దంపతులను సీఎం కేసీఆర్ ఆశీర్వదించారు. -
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..
వరంగల్ నగర ప్రజల జిహ్వచాపల్యం భలేగాఉంది. ఉదయం టిఫిన్‌ను ఎక్కువగా ఇడ్లీ తీసుకుంటుండగా, అదేస్థాయిలో ఆయిల్ ఫుడ్ అయిన పూరీని కూడా అంతే ఇష్టపడుతున్నారు. మరికొందరు వడ, దోశ కూడా భుజిస్తున్నారు. ఉదయాన్నే విధులకు హాజరుకావాల్సి ఉండడంతో ఇంట్లో అల్పాహారం తయారీకి తగిన సమయం లేకపోవడంతో హోటళ్లవైపు చూస్తున్నారు. ఇంట్లోకంటే రుచిగా ఉండడం మరో కారణంగా చెబుతున్నారు. ఇంటివారిని ఉదయాన్నే ఇబ్బంది పెట్టకుండా బయట టిఫిన్ చేస్తున్న వారు మరికొందరు ఉన్నారు. అదేసమయంలో కరోనా సమయం కాబట్టి హోటళ్లకంటే ఇంటికి పార్సిల్ తీసుకెళ్తున్నారు. వరంగల్ నగరంలో ప్రజల అల్పాహార రుచులపై ‘సాక్షి’ సోమవారం పలుచోట్ల సర్వే నిర్వహించింది. వరంగల్, హనుమకొండలో 8 టిఫిన్ సెంటర్లలో సాక్షి ప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. 20 ఏళ్లలోపు వారికి పూరీ అంటేనే ఇష్టం.. కాజీపేట ఏరియాలో నిట్, ఇతర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ ఏరియాలోని రెండు హోటళ్లలో జరిపిన సర్వేలో యువత పూరీ ఇష్టపడుతున్నారు. ఫాతిమానగర్‌లోని ఓ మెస్‌లో నిట్ విద్యార్థులు పూరీనే అధికంగా తీసుకున్నారు. 10 నుంచి 20 ఏళ్ల వయస్సు గల 25 మందిని సర్వే చేయగా.. ఎవరు కూడా ఇడ్లీని ఇష్టపడడం లేదు. పూరీపైనే ఆసక్తి కనబరిచారు. హన్మకొండలోని మరో ప్రధాన హోటళ్లలో ఇడ్లీ 10 మంది.. పూరీ ఆరుగురు ఇష్టపడ్డారు. వీరంతా యువతే కావడం గమనార్హం. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు.. క్షణం తీరికలేని ఉరుకుల పరుగుల జీవనశైలిలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో బిజీ లైఫ్‌లో సైతం ఆహార విషయంలో కచ్చితమైన జాగ్రత్తలను పాటిస్తున్నారు. ఉదయం తీసుకునే టిఫిన్స్‌పై ప్రజల అభిప్రాయాన్ని అధ్యయనం చేయగా అత్యధిక శాతం ఇడ్లీనే ఇష్టపడుతున్నారు. ఆయిల్ఫుడ్కు దూరంగా ఉండాలనుకోవడం, సులువుగా జీర్ణం అవుతుండడం, ఆరోగ్యవంతమైన ఫుడ్ కావడమే ముఖ్య కారణం. యువత పూరీ, దోశ, వడలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇవీ తినడానికి రుచిగా ఉన్నాయని చెబుతున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా 15ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు వారు హోటళ్లలో టిఫిన్స్ కోసం వచ్చారు. ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ల వయస్సుగల యువత ఎక్కువగా ఇడ్లీ, వడ, పూరీ, దోశను ఆర్డర్ చేశారు. 40ఏళ్ల పైపడిన వారు ఇడ్లీ ఎంచుకున్నారు. ఇందులో ఎక్కువ ఇడ్లీ, వడ కాంబినేషన్ తిన్నారు. కొంతమంది ఫేమస్ హోటల్స్ అని తెలవడంతో రుచిచూద్దామనే ఆలోచనతో వచ్చామని చెప్పగా, మరికొందరు ఫ్రెండ్స్‌తో టిఫిన్స్ ఆరగించామని వివరించారు. ఉదయం ఇడ్లీ, పూరీ, బొండా, వడ లాంటి టిఫిన్లను నగర వాసులు ఇష్టపడుతుండగా, సాయంత్రం ఇడ్లీ, దోశ, చపాతీ లాంటి టిఫిన్లకు ఎక్కువగా గిరాకీ ఉంటున్నదని నిర్వాహకులు తెలిపారు. ఇంట్లో ఒకే వెరైటీ... ఇంట్లో చేస్తే ఒకే వెరైటీ టిఫిన్ చేస్తారు. అదే హోటల్‌కు వెళితే ఇడ్లీ సాంబార్‌తో, చట్నీ, నెయ్యి, కారంతో లాగించేయొచ్చు. ఇలా ఇంట్లో కుదరదు. ఇడ్లీతోపాటు వడ, పూరీ, చక్కరపొంగలి, పెసరట్టు, దోశతోపాటు వెరైటీలు తినొచ్చు.- గాండ్ల మధు, వరంగల్ రుచికరంగా ఉంటాయంటే వచ్చా కరీమాబాద్ జంక్షన్లో టిఫిన్స్ రుచికరంగా ఉన్నాయని తెలిసి ఫెండ్స్‌తో కలిసి వచ్చాను. అప్పుడçప్పుడు మాత్రమే హోటల్స్‌లో తినడానికి ఇష్టపడతాను. - బొల్లం రాకేశ్, వరంగల్ పూరీ నా ఫేవరెట్ నేను ప్రతి రోజూ పూరీని టిఫిన్‌గా తింటాను, పూరీ నా ఫేవరెట్ టిఫిన్. మా ఇంట్లో చేసిన టిఫిన్ కంటే అన్నపూర్ణ హోటల్లోని పూరీ ఇష్టంగా తింటాను. స్కూల్‌కు వెళ్లే సమయంలో పూరీని టిఫిన్ బాక్స్‌లో తీసుకువెళ్లేందుకు ఇష్టపడతాను. – కట్కూరి అనుష్క, కాజీపేట ఇడ్లీ ఆరోగ్యానికి మంచిదని నా వయస్సు 55 సంవత్సరాలు. దాదాపు 40 ఏళ్లుగా టైలర్ వృత్తిలో ఉన్నా. వృత్తిరీత్యా ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తుంటాను. నేను తీసుకునే ఆహారం ఈజీగా జీర్ణం కావాలంటే ఇడ్లీ తీసుకోవడమే మంచిది. పొద్దున్నే ఇడ్లీ కాకుండా పూరీ, వడ లాంటి ఆయిల్ ఫుడ్ తీసుకుంటే జీర్ణం కావు. ఆయిల్‌ఫుడ్ తిని అనారోగ్య సమస్యలను తెచ్చుకోవడం కంటే వితౌట్ ఆయిల్‌తో చేసిన ఇడ్లీ తినడం ఆరోగ్యానికి మంచిదే కదా. – పొడిశెట్టి వెంకటేశ్వర్లు, టైలర్, కుమార్‌పల్లి సర్వే ఇలా.. వరంగల్, హనుమకొండ ఏరియాల్లో మొత్తం 8 ప్రధాన టిఫిన్ సెంటర్లలో ఉదయం 7 నుంచి 9 గంటల వరకు పరిశీలన.. తీసుకున్న శాంపిల్స్ : 105 ఆన్లైన్లో.. 39 పార్సిల్ 46 హోటల్లో తిన్నవారు 128 ఇడ్లీ : 19 పూరీ : 12 వడ : 10 దోశ, ఇతరాలు : 14 ఇడ్లీ : 10 పూరీ : 19 వడ : 04 దోశ, ఇతరాలు : 17 చదవండి: అందరి చూపు చిరుధాన్యాలపైనే.. కారణం ఏంటంటే! -
వరంగల్, హన్మకొండ జిల్లాలు: ఏ మండలాలు ఎందులోకి?
సాక్షి, వరంగల్ : వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాల పేర్ల మార్పుపై అభ్యంతరాలు, వినతుల స్వీకరణకు నెల రోజుల సమయం ఇచ్చింది. ఈ రెండు జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు జూన్ 21న వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లతో కలిపి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయనుండగా, మొత్తం 12 మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది. వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్ జిల్లా ఏర్పడనుండగా, మొత్తం 15 మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా కిందికి వస్తాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు వరంగల్‌లో కలవగా, వరంగల్ రూరల్‌లోని పరకాల, నడికుడ, దామెర మండలాలు హన్మకొండ జిల్లాలో కలిశాయి. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు.. ప్రజాభిప్రాయం మేరకు ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేందుకు జిల్లా పేర్ల మార్పు జరుగుతోందని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఇప్పటికే ప్రారంభం కాగా.. వరంగల్ కలెక్టర్ కార్యాలయం.. ఆజంజాహిæ మిల్లు మైదానం, ఆటోనగర్ ఏదో ఒక ప్రాంతంలో నిర్మాణానికి యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి జీఓ వెలువడిన నేపథ్యంలో నెల రోజులపాటు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. గెజిట్ రాగానే.. అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో.. హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా అధికారికంగా కార్యకలాపాలు సాగుతాయి. ఇదిలా ఉంటే హన్మకొండ, వరంగల్ రెండు జిల్లాలైనప్పటికీ.. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ 66 డివిజన్లు, రెండు జిల్లాల పరిధిలోనే ఉంటాయి. అయితే కార్పొరేషన్ సర్కిళ్లు పెరిగే అవకాశాలున్నాయి. హన్మకొండ జిల్లాలో.. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా హన్మకొండలోనే ఉంటుంది. పరకాల, హుస్నాబాద్, హుజూరాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధ్దన్నపేట నియోజకవర్గాలకు చెందిన మండలాలు కూడా ఈ జిల్లాలోకి వస్తాయి. వరంగల్ జిల్లాలో తూర్పు, నర్సంపేట నియోజకవర్గాలు పూర్తిగా ఈ జిల్లాలోకే రానుండగా, పాలకుర్తి, పరకాల, వర్ధ్దన్నపేట తదితర నియోజకవర్గాల మండలాలు కూడా వస్తాయి. నాలుగు రెవెన్యూ డివిజన్లు.. 27 మండలాలు... జిల్లాల పునర్విభజన తర్వాత ఈ రెండు జిల్లాల్లో 27 మండలాలు ఉంటాయి. హన్మకొండ జిల్లాలో హన్మకొండ రెవెన్యూ డివిజన్ కింద 8, పరకాల డివిజన్ పరిధిలోని నాలుగు మండలాలు ఉండేలా చేశారు. ►హన్మకొండ డివిజన్లో హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లిలు ►పరకాల డివిజన్లో కమలాపూర్, పరకాల, నడికుడ, దామెర మండలాలు వస్తాయి. ►వరంగల్ జిల్లాలో వరంగల్ రెవెన్యూ డివిజన్లో 9, నర్సంపేట డివిజన్లో 6 మండలాలు వస్తాయి. ►వరంగల్ పరిధిలో వరంగల్, ఖిలా వరంగల్, గీసుకొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్దన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెంలు ఉంటాయి. ►నర్సంపేట డివిజన్లో నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ మండలాలు ఉంటాయి. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దీని ద్వారా పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని తెలిపారు. -
మద్యం సేవించి భార్యకు వేధింపులు..ఇటుకలతో కొట్టిన భార్య
గీసుకొండ: భర్త నిత్యం మద్యం తాగొచ్చి కొడుతుండడంతో తట్టుకోలేక ఓ మహిళ ఇటుకలతో కొట్టగా.. ఆ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి.. గూడూరు మండలం నాంపల్లికి చెందిన నాగమణిని శనిగరం కార్తీక్ (35) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, నాలుగేళ్ల నుంచి నాగమణి అక్కతో కార్తీక్ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో నాగమణి, ఆమె అక్కతో కలసి కార్తీక్ వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. కార్తీక్ తరచూ నాగమణిని కొడుతుండగా, ఇటీవల గాయపడిన ఆమె హన్మకొండలో చికిత్స చేయించుకుంది. అక్కడి నుంచి నాగమణి మరో సోదరి సుగుణ నివాసముండే కీర్తినగర్‌కు ఈనెల 11న వచ్చింది. అదేరోజు రాత్రి కార్తీక్ మద్యం తాగొచ్చి గొడవ పడగా, నాగమణి భర్తను నెట్టి వేయడంతో కింద పడ్డాడు. ఆమె ఇటుకలతో కార్తీక్‌ను తీవ్రంగా కొట్టింది. గాయపడిన అతడిని 108 అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తమ్ముడు కుమారస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. (చదవండి: కిరోసిన్ పోసి.. నిప్పంటించి..) -
యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేస్తున్న ఫేక్ డాక్టర్..
సాక్షి, వరంగల్ : అల్లోపతిక్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం నిబంధనలను ఉల్లఘించిన హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిలా పార్క్ ఎదురుగా ఉన్న సిటీ ఆస్పత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ లలితాదేవి, సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు తమకు అందిన సమాచారంతో ఆస్పత్రిలో తనిఖీ చేయగా అర్హులైన వైద్యులు, సిబ్బంది లేకుండా నిర్వహణ సాగుతున్నట్లు వెల్లడైందని తెలిపారు. అంతేకాకుండా ఆస్పత్రి నిర్వహకుడు అండ్రు ఇంద్రారెడ్డిపై కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. బీఎస్సీ చదివిన ఇంద్రారెడ్డి మెడికల్ రిప్రజెంటీవ్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఎంబీబీఎస్ చదివినట్లుగా అవతారమెత్తాడు. యూట్యూబ్‌లో చూస్తూ ఆపరేషన్లు కూడా చేసేస్తున్నాడు. అలాగే వచ్చీ రానీ వైద్యంతో అబార్షన్లు చేస్తూ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ఇంద్రారెడ్డి ట్రీట్మెంట్పై అనుమానం రావడంతో వైద్యశాఖ అధికారులకు కొంతమంది సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడ దూకి పారిపోయాడు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళన బాత్రూమ్లో దాచారు. పోలీసుల సహాయంతో ఆ మహిళను బయటకు తీసుకొచ్చిన అధికారులు ఆమెను విచారించారు. తీవ్రరక్తస్రావం అవుతుండడంతో సదరు మహిళను హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. డీఎంహెచ్‌వో ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆసుపత్రిని జిల్లా వైద్య అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఇంద్రారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంద్రారెడ్డి ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు.. గతంలోనూ వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోనూ ఇలాగే ఓ ఆసుపత్రి ఏర్పాటు చేయగా.. దాన్ని అధికారులు దాన్ని సీజ్ చేశారు. చదవండి: ఉద్యోగం పేరుతో ఆశ: బాలికను లక్ష రూపాయలకు.. -
‘నీవు లేకుండా నేను ఎలా బతకాలి’
జఫర్‌గఢ్: ఆ దంపతులకు సంతానం లేదు.. ఒకరికొకరు తోడునీడగా బతికారు. భర్త మృతి చెందిన గంటల వ్యవధిలోనే నీ వెంటే నేను.. అంటూ భార్య తనువు చాలించింది. ఈ ఘటన జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రొడ్డ మంగయ్య (68), ఎల్లమ్మ (65) దంపతులకు సంతానం లేదు. బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం హన్మకొండకు వలస వెళ్లారు. లాక్డౌన్ సమయంలో ఉపాధి లేక తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజులుగా మంగయ్య అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. దీంతో మృతదేహం వద్ద భార్య కన్నీరు మున్నీరైంది. ‘చూసే వాళ్లు లేరు.. కన్నవాళ్లు లేరు.. నీవు లేకుండా నేను ఎలా బతకాలి’ అంటూ మంగళవారం తెల్లవారుజాము వరకు ఏడుస్తూ ఉన్న ఎల్లమ్మ.. భర్త శవం ఎదుటే తనువు చాలించింది. మృత్యువులోనూ కలిసే సాగిన వారి బంధాన్ని చూసిన గ్రామస్తులు కంటతడి పెట్టారు. మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. -
వరుస సస్పెన్షన్లు.. తర్వాత ఎవరు?!
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆరు నెలల కాలంలో శాఖలోని పలువురు అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్చలు చర్చనీయాంశంగా మారాయి. పోలీసు కమిషనర్‌గా పి.ప్రమోద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించాక శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. భూసెటిల్మెంట్లు, దందాల్లో జోక్యం చేసుకుంటున్న కొందరు అధికారులపై ఆయన అంతర్గత విచారణకు ఆదేశించారు. సమగ్ర విచారణ అనంతరం అనివార్యమని తేలిన పలువురిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే పలువురు సీఐలు, ఎస్ఐలపై సస్పెన్షన్, బదిలీల వేటు వేస్తుండగా, ఓ డీసీపీ, ఏసీపీల బదిలీ జరిగింది. అయితే, ఆ తర్వాత వరుసలో ఎవరనే చర్చ పోలీసువర్గాల్లో సాగుతోంది. కేయూసీ ఇన్స్పెక్టర్పై వేటు ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్న అధికారులపై వరుస చర్యలు పోలీసుశాఖలో హాట్‌టాపిక్‌గా మారగా, సోమవారం మరొకరిని హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేయడం గమనార్హం. కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సీపీ ప్రమోద్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో సైబర్ క్రైం విభాగం ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎస్హెచ్ఓలు, నలుగురు సబ్ ఇన్స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుల్, హెడ్‌కానిస్టేబుళ్ల సస్పెన్షన్ వేటు పడింది. అలాగే, ముగ్గురిని క్రమశిక్షణ చర్యల కింద బదిలీ చేశారు. హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలో హన్మకొండ, సుబేదారి, కాజీపేట ఏసీపీ కార్యాలయం పరిధిలో కమలాపూర్ ఎస్హెచ్ఓ సస్పెండైన వారిలో ఉండగా, వరంగల్, కాజీపేట కార్యాలయాల పరిధిలో మామూనూరు, ధర్మసాగర్ ఎస్హెచ్ఓలను వీఆర్‌కు అటాచ్డ్ అయ్యారు. తాజాగా హన్మకొండ ఏసీపీ కార్యాలయంలో పరిధిలోని కేయూ పోలీసుస్టేషన్ ఎస్హెచ్ఓ డేవిడ్ రాజును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు.(చదవండి: సొంత శాఖలో అక్రమార్కులపై పోలీసు కథాస్త్రం!) కేయూసీలో ఘటనపై ఆరా కాకతీయ యూనివర్సిటీలో ఆదివారం చోటుచేసుకున్న గొడవ అటు ప్రజాప్రతినిధులు, ఇటు పోలీసు ఉన్నతాధికారుల్లో చర్చకు దారి తీసినట్లు సమాచారం. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాస్కర్ కాన్వాయిని ఏబీవీపీ సభ్యులు అడ్డుకోవడం.. ఆ తర్వాత ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలను సీరియస్‌గా తీసుకున్నట్లు చెబున్నారు. ఈ సందర్భంగా పరిస్థితిని ముందుగా అంచనా వేయడంలో నిఘావర్గాలు కూడా వైఫల్యం చెందాయనే చర్చ సాగుతోంది. ఇదే విషయమై ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేయూ ఘటనపై హైదరాబాద్ నుంచి సైతం కీలక నేతలు, పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీయగా, ఇది చినికిచినికి గాలివానగా మారిందని తెలుస్తోంది. -
సీఎం కేసీఆర్ ఎటువైపు
సాక్షి, వరంగల్ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై దేశ వ్యాప్తంగా ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పక్షమా, బీజేపీ వైపా తేల్చుకోవాలని మాజీ ఎంపీ వి. హనుమంతరావు సూచించారు. చట్టాలకు వ్యతిరేకంగా హన్మకొండలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వెళ్తున్న వీహెచ్‌ను జనగామ జిల్లా పెంబర్తి బైపాస్ వద్ద అడ్డుకున్నారు. అంతలోనే సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు వస్తుండటంతో ఆయనను లింగాలఘణపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వీహెచ్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలపై భారత్ బంద్‌లో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నా, సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే మార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేకశారు. హన్మకొండలో విద్యార్థులు చేపట్టిన దీక్షలకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తనను అరెస్టు చేయడమేమిటో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, రైతులకు న్యాయం జరిగే వరకు ప్రాణాలర్పించైనా పోరాడుతామని అన్నారు. కాగా పోలీసు స్టేషనులో వీహెచ్‌ను కాంగ్రెస్ నాయకులు చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, ధర్మపురి శ్రీనివాస్, లింగాజీ, ఎండీ అజీజ్, విజయ్‌మనోహార్, బిక్షపతి, భృగుమహర్షఙ, రాజిరెడ్డి తదితరులు కలవగా, అనంతరం ఆయనను సొంత పూచీకత్తుపై పోలీసులు పంపించారు. -
జర్నలిస్టుల భిక్షాటన
సాక్షి, హన్మకొండ : కరోనాతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫొటో జర్నలిస్టు బెలిదే శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ శుక్రవారం జర్నలిస్టులు భిక్షాటన చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్ క్లబ్ వద్ద మొదలైన భిక్షాటన సుబేదారిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొనసాగింది. శ్రీనివాస్ చికిత్స కోసం ఇప్పటికే రూ.20 లక్షల వరకు బిల్లు కాగా, ఆ కుటుంబం డబ్బు చెల్లించలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు దాతలు పెద్ద మనస్సుతో ఆదుకోవాలని వేడుకున్నారు. కాగా, వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యాన శ్రీనివాస్ చికిత్స నిమిత్తం రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. (20 లక్షలు దాటిన కరోనా టెస్టులు) -
ఇంకా వరద బురదలోనే వరంగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్ మహానగరం ఇంకా జలదిగ్బంధంలోనే ఉంది. ఎటు చూసిన బురదమయమైన కాలనీలు, దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు, సాయం కోసం బాధితుల ఆక్రందనలు.. ఇలా ఒకటేమిటి.. అనేక సమస్యలతో జనజీవనం అతలాకుతలమైంది. ఐదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు వరంగల్ మహానగరాన్ని ముంచెత్తిన విషయం విదితమే. వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రైసిటీస్లోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలే కాకుండా ఈసారి ప్రధాన కాలనీలు కూడా ఇంకా జల దిగ్భంధం నుంచి బయట పడలేదంటే పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ గంట గంటకూ సమీక్షిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. (7 నుంచి అసెంబ్లీ.. ) సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వరద నీటిలో చిక్కుకు పోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (ఎన్డీఆర్ఎఫ్) బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 4,116 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించాయి. అయితే వరద సహాయక చర్యల్లో భాగంగా పడవలను ఉపయోగించడం నగర చరిత్రలో ఇదే మొదటి సారి కాగా, హంటర్ రోడ్డు, సాయినగర్ కాలనీ, సంతోషిమాత, కాలనీ, సరస్వతీ నగర్, నయీంనగర్, ములుగు రోడ్డు, హంటర్ రోడ్డు, అండర్ రైల్వే గేటు, దేశాయిపేట, నజరత్ పురం, వడ్డెపల్లి కాలనీ, కేయూ 100 ఫీట్ల రోడ్డు, తదితర ప్రాంతాలు వరద తాకిడి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. మంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్‌రావు, కమిషనర్ పమేలా సత్పతి నగరంలో పర్యటించి పలు కాలనీలు, ముంపు ప్రాంతాలను సందర్శించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బాధితులకు భరోసా ఇచ్చారు. కదిలిస్తే కన్నీళ్లు పోటెత్తిన వరద లోతట్టు ప్రాంతాల ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. సోమవారం వరుణుడు కరుణించినప్పటికి జనజీవనం గాడిన పడలేదు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వరద నీటిలో మగ్గుతున్నారు. నిత్యావసర వస్తువులు తడిసిపోయి, విష సర్పాల నడుమ అర్ధాకలితో అలమటిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పాలక, అధికార వర్గాలు అందిస్తున్న సహాయక చర్యలు కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఇళ్ల చూట్టూ వరద నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక అవస్థలు పడ్డారు. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వల్ల మురుగు కాల్వలు పొంగి పొర్లాయి. ప్రధానమైన నాలాలు ద్వారా ఆ వరద నీరు వెళ్లకపోగా నేరుగా కాలనీల్లోకి ప్రవేశించాయి. ఇంకా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. హన్మకొండ హంటర్ రోడ్డులో ఎటు చూసినా వరద నీరు నిలిచి ఉన్నాయి. బొందివాగు నాలా నీరు సవ్యంగా వెళ్లకపోవడంతో సమీపంలోని ఉన్న కాలనీలను వరద ముంచెత్తింది. దీంతో హంటర్ రోడ్డుకు సమీపంలో ఉన్న సాయినగర్ కాలనీ, సంతోషిమాత కాలనీ, ఎన్టీర్ నగర్, గాయిత్రీ నగర్, భద్రకాళి నగర్, రామన్నపేట రోడ్డు కాలనీల్లో ఉన్న ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో జనం జలం మధ్య బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హన్మకొండ ప్రాంతంలోని నయీం నగర్ పోచమ్మకుంట వరకు ఉన్న నాలాల ద్వారా నీళ్లు వెళ్లడం లేదు. ప్రైవేట్ ఖాళీ స్థలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి గోదావరి, ఇంద్రావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు లోనయ్యే ఇళ్ల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. ములుగు మండలం బండారుపల్లి గ్రామము వద్ద రాళ్లవాగులో ఆర్టీసీ బస్సు, అందులోని ప్రయాణికులు చిక్కుకోగా..పోలీసులు వారిని కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించారు. భూపాలపల్లి నియోజకవర్గం మోరంచ వాగులో బీహార్ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులు చిక్కుకున్నారు. రెస్క్యూ టీంను రంగంలోకి దించగా ఒడ్డుకు చేర్చారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఆపన్న హస్తం అందించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మోదుగుగడ్డ తండాకు చెందిన ముగ్గురు రైతులు వ్యవసాయ పనులు నిమిత్తం ఆకెరువాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి చెట్టుని పట్టుకొని సహాయం కోసం ఎదురు చూశారు. తండావాసులు వారిని ఒడ్డున చేర్చారు. మంగళవారం మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. హన్మకొండలో దేశంలోనే అత్యధిక వర్షపాతం వరంగల్ అర్బన్ : దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదైన పది నగరాల్లో హన్మకొండ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. హన్మకొండలో 212 మి.మీ. వర్షపాతం నమోదు కాగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో మహారాష్ట్రలోని మహబలేశ్వరంలో 155 మి.మీ., మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌లోని ఉమరిలో 153 మి.మీ. వర్షపాతం నమోదైంది. కాగా, వర్షం భారీగా కాకుండా ఐదు రోజుల పాటు ఓ మోస్తరు, ముసురు రూపంలో కురవడంతో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని, అలా కాకుండా భారీ వర్షం కురిస్తే జలప్రళయం ఏర్పడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
నా చావుకు ఎమ్మెల్యేనే కారణం
కాజీపేట అర్బన్ /నెక్కొండ: వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణం అంటూ సూసైడ్ నోట్ కూడా రాశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెక్కొండ మండలం అలంకానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లు చిన్న కుమారుడు రామరాజు నర్సంపేటలోని ఓడీసీఎంఎస్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో విధు లు నిర్వర్తిస్తున్నాడు. లాక్డౌన్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పక్కనబెట్టారు. ఈ క్రమంలో తన కుమారుడికి తిరిగి ఉద్యోగం ఇప్పించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని నెక్కొండకు వచ్చిన సందర్భంగా వెంకటేశ్వర్లు కోరాడు. మంగళవారం కూడా హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలసి విషయాన్ని వివరించాడు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం వద్దకు చేరుకున్న వెంకటేశ్వర్లు చాకుతో గొంతు కోసుకున్నాడు. ఈ సందర్భంగా ‘నా చావుకు కారణం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. కేసీఆర్ సార్ వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వొద్దు’అంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టా్ట డు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, వెంకటేశ్వర్లు పరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. విచారణ జరిపిస్తా అలంకానిపేట గ్రామ ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మాసం వెంకటేశ్వర్లు సూసైడ్ నోట్లో నా పేరు ప్రస్తావించడంపై విచారణ జరిపిస్తా. గతంలో ఆయన కొడుకు ఉద్యోగం విషయంలో నన్ను కలిశాడు. దీంతో నేను సానుకూలంగా స్పందించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాను. -పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
అమరవీరుల స్థూపం వద్ద ఆత్మహత్యా యత్నం
సాక్షి, వరంగల్ అర్బన్ : జిల్లాలోని హన్మకొండలో దారుణం చోటుచేసుకుంది. అదాలత్ జంక్షన్ అమరవీరుల స్థూపం వద్ద ఓ వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పలువురు అతన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని నెక్కొండ మండలం అలంఖానిపేటకు చెందిన మాసం వెంకటేశ్వర్లుగా గుర్తించారు. కాగా, తన చావుకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కారణమని బాధితుడు ఓ లేఖలో పేర్కొన్నాడు. (చదవండి : తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా) -
ఎట్టకేలకు ఇంటికి ఆటోడ్రైవర్ కుటుంబం
హన్మకొండ అర్బన్: హన్మకొండలో అద్దెకు ఉంటున్న ఆటోడ్రైవర్ రాజేందర్ దంపతులు ఎట్టకేలకు సోమవారం తమ స్వగ్రామం రాయపర్తి మం డలం ఊకల్ బాలాజీ తండాకు చేరుకున్నారు. రెండు రోజుల పాటు చంటి బిడ్డతో తాము అనుభవించిన నరకయాతనను అధికారుల దృష్టికి తీసుకువచ్చి అండగా నిలిచిన ’సాక్షి’కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ‘36 గంటల నరకం’శీర్షికన ‘సాక్షి’ప్రధాన సంచికలో రాజేందర్ కుటుంబ వెతలపై కథనం ప్రచురితమైన విషయం విదితమే. (చదవండి : 36 గంటల నరకం.. ) ఈ కథనం వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల అధికార యంత్రాంగం లో చర్చనీయాంశమైంది. ఇలాంటివి జరగకుండా సమన్వయంతో పనిచేయాలని రాయపర్తి ఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఉన్నతాధికారులు సూచించారు. ఆదివారం రాత్రి రాయపర్తి చేరుకున్న రాజేందర్ కుటుంబానికి స్థానిక గురుకులంలో అధికారులు బస ఏర్పాటుచేసి భోజనం అందించారు. రాయపర్తి తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో వైద్య, పోలీసు అధికారులు బాలాజీ తండాకు వెళ్లి స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించాక రాజేందర్ కుటుంబాన్ని ఇంటికి చేర్చి, 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. వాస్తవ పరిస్థితిని తమ దృష్టికి తీసుకువ్చనందుకు హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి ‘సాక్షి’ని అభినందించారు. -
అర్ధరాత్రి వేళ.. అగ్నిప్రమాదం
సాక్షి, హన్మకొండ : అందరూ నిద్రిస్తున్న వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనం పూర్తిగా దెబ్బతిని స్లాబ్ లోపలి చువ్వలు బయటకు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తుండగా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు నైట్ వాచ్మెన్ అంజనేయులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి. ఏబీకే మాల్లోని రెండో అంతస్తులో మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యాలయం ఏర్పాటుకు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయానికి అనువుగా తీర్చిదిద్దుతున్న పనులు చివరి దశకు చేరుకోగా.. కార్మికులు రెండో అంతస్తులో నిద్రించారు. ఇందులో కొందరు తెల్లవారుజామున మూత్రవిసర్జనకు నిద్ర లేవగా మంటలు కనిపించడంతో ఫైర్ స్టేషన్‌కే కాకుండా భవనంలోని ఇతర సంస్థల ప్రతినిధులకు ఫోన్ చేశారు. దీంతో హన్మకొండ ఫైర్ ఆఫీసర్ నాగరాజు నేతృత్వంలో సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల ద్వారా చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో పీఎన్బీ హౌజింగ్ ఫైనాన్స్ కార్యాలయంలోని ఏసీల తదితర సామగ్రి దెబ్బతిన్నదని అసిస్టెంట్ మేనేజర్ బి.రామారావు తెలిపారు. అయితే, పై అంతస్తుల్లో ఉన్న కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రీజియన్ కార్యాలయం, ఏపీజీవీబీతో పాటు చిట్‌ఫండ్ కార్యాలయాలు, మెడికల్ షాపులు ఉన్నాయి. -
వారు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం
హన్మకొండ చౌరస్తా: ‘వారు రాళ్లు పడితే.. మేం బాంబులు పడతాం.. కర్రలు పడితే మేం కత్తులు పడతాం..’ అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. జాతీయవాదుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయిస్తంభాల గుడి నుంచి హన్మకొండ పబ్లిక్ గార్డెన్ వరకు పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ.. గుంటూరులో సీఏఏకు మద్దతుగా జాతీయవాదులు ర్యాలీ తీస్తుంటే రాళ్లతో దాడులు చేశారని, వాళ్లు రాకెట్లు పడితే మేం లాంచర్లు పడతామన్నా రు. యుద్ధం ప్రారంభమైనందున ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న విషయం వారికి తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదు ‘కేటీఆర్ మా అయ్య గొప్ప హిందువు అని చెబుతున్నాడు.. కరీంనగర్లో హిందుగాళ్లు బొందు గాళ్లు అన్నప్పుడు మీ అయ్య ఎక్కడికి పోయాడు’అని సంజయ్ ప్రశ్నించాడు. అందుకే హిందువులంతా ఏకమై బొందు గాళ్లను బొంద పెట్టారని తెలిపారు. సీఏఏ విషయంపై కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారందరినీ బ్రేకుల్లేని వాహనాల్లో ఎక్కించి మూసీ నదిలో తోయాలని సంజయ్ అన్నారు. -
మంత్రి దయాకర్‌రావు ఇంటి ముట్టడి..
సాక్షి, హన్మకొండ : ఇటు సమస్యలు పరిష్కరించకుండా.. అటు చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మికులు కన్నెర్ర చేశారు. తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులుగా స్పందించి సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్‌చేస్తూ ప్రజాపతినిధుల ఇళ్లను సోమవారం ముట్టడించారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల పరిధిలో ఆర్టీసీ కార్మికులు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించారు. ఈ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయగా... అరెస్టులతో శాంతియుతంగానే ముగిసింది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉందన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు కనిపిస్తే అరెస్టు చేయాలన్న ఆదేశాలతో ఎక్కడికక్కడ కార్మికులు, పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. విపక్షాలు, ఆర్టీసీ కార్మికులు ప్రధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్ ఇళ్లను ముట్టడించాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో పోలీసులు ఇక్కడే ప్రధానంగా దృష్టి సారించారు. హన్మకొండలో నివాసముంటున్న రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్ ఇళ్ల వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేసినా కార్మికులు అటువైపు పెద్దగా దృష్టి సారించలేదు. ఇదే అదనుగా కార్మికుల్లోని ఓ వర్గం కెప్టెన్ ఇంటిని ఏ మాత్రం ప్రతిఘటన లేకుండా ముట్టడించడంతో పాటు డప్పులు మోగించారు. హన్మకొండ రాంనగర్‌లోని మంత్రి దయాకర్‌రావు ఇంటి ముందుకు వెళ్లకుండా రెండు వైపుల దారిలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోప్‌పార్టీతో పాటు, ఇతర పోలీసు బలగాలతో భారీ భద్రత కల్పించారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు హన్మకొండ డిపో నుంచి ర్యాలీగా మంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను నెట్టి వేస్తూ ముందుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు నిలువరించారు. ఈ మేరకు నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. మాదిగ ఉద్యోగ సమాఖ్య అధ్వర్యంలో ఎంపీ లక్ష్మీకాంతరావు ఇంటిని ముట్టడించిన ఆర్టీసీ కార్మికులు చావు డప్పు కొట్టారు. హంటర్ రోడ్డులోని రాజ్ హోటల్ నుంచి ర్యాలీగా కెప్టెన్ ఇంటి వద్దకు చేరుకుని ముట్టడించడంతో పాటు డప్పు కొడుతూ నినాదాలు చేశారు. అప్పటికే ఇక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు సుబేదారి సీఐ అజయ్‌కు సమాచారం ఇవ్వగా వాహనాలు, అదనపు బలగాలతో చేరుకుని కార్మికులు, కళాకారులను అరెస్టు చేసి, పలివేల్పులలోని శుభం గార్డెన్స్‌కు తరలించారు. హన్మకొండ బాలసముద్రంలోని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఇంటిని ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు దశల వారీగా ముట్టడించారు. ముందుగా సీపీఎం, సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు ఇంటి ముట్టడికి చేరుకోగా పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ నాయకులు.. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులు వేర్వేరుగా రాగా పోలీసులు అంతే వేగంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ జేఏసీతో పాటు వివిధ పార్టీలు, సంఘాల నాయకులతోపాటు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. మంత్రి ఇంటి వద్ద ఆర్టీసీ జేఏసీ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి యత్నం హసన్‌పర్తి: వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇళ్లు ముట్టడికి ఆర్టీసీ జేఏసీ నాయకులు యత్నించారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు బయలుదేరుగా పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం జేఏసీ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. హసన్‌పర్తి జేఏసీ చైర్మన్ పుట్ట రవిమాదిగ, కోకన్వీనర్ అనుమాండ్ల విద్యాసాగర్‌తో పాటు మారపెల్లి రామచంద్రారెడ్డి, బొక్క కుమార్, గొర్రె కిరణ్, కార్మికులు మేకల యుగేందర్, రాజేందర్, శీలం రమేష్, సురేందర్, అమరేందర్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే నరేందర్ ఇంటి వద్ద.. ఖిలా వరంగల్: కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, ఎంసీపీఐ నాయకుల ఆధ్వర్యాన పెరకవాడలోని ఎమ్మెల్యే నరేందర్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఎమ్మెల్యే ఇంట్లో లేకపోవడంతో గేటుకు వినతిపత్రం అందించి నినాదాలు చేశారు. అప్పటికే బందోబస్తులో ఉన్న మిల్స్‌కాలనీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యాన వారిని ఆరెస్ట్ చేసి మిల్స్‌కాలనీ పోలీస్ స్ట్రేషన్‌కు తరలించారు. -
కండక్టర్ అంత్యక్రియల్లో పోలీసుల అత్యుత్సాహం
సాక్షి, వరంగల్: వరంగల్ రూరల్ జిల్లాలోని ఆత్మకూరులో ఆర్టీసీ కండక్టర్ రవీందర్ అంతిమయాత్రలో గందరగోళం చోటుచేసుకుంది. అంతిమయాత్రను త్వరగా ముగించాలని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. కుటుంబ సభ్యులు, అంతిమయాత్రలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో పోలీసులకు, ఆర్టీసీ కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహించిన పోలీసు కమిషనర్ మధు ఆర్టీసీ కార్మికులపై చేయి చేకున్నారు. పోలీసుల తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా పోలీసులు తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతిమయాత్రను ఆపి.. రవీందర్ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కార్మికులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గుండె పోటుతో ఆస్పత్రిలో చేరిన ఆర్టీసీ కండక్టర్ రవీందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత అర్ధరాత్రి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు భారీ కాన్వాయ్‌తో రవీందర్ మృతదేహాన్ని ఆయన స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు తరలించారు. రవీందర్‌కు భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవీందర్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 29వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. చదవండి: ఆగిన మరో ఆర్టీసీ కార్మికుడి గుండె -
రోడ్డెక్కిన హాస్టల్ విద్యార్థులు
సాక్షి, వరంగల్ అర్బన్: బాలికల వసతి గృహంలో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం హన్మకొండలోని జూలైవాడ గిరిజన బాలికల హాస్టల్ విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వసతి గృహంలో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో వార్డెన్ ప్రమేయం ఉందని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలని, అదే విధంగా అక్రమ బియ్యం రవాణాపై విచారణ జరిపి దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన భోజనాన్ని సమయానికి అందించాలని, హాస్టల్ విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని కోరారు. -
ఆస్తి కోసం ‘శవ’ పంచాయితీ
సాక్షి, హన్మకొండ: కష్టపడి ఆస్తిని సంపాదించిన వారు కాటికి పోయారు. కానీ వారి వారసులుగా చెప్పుకుని తేరగా వచ్చే ఆస్తి కోసం మృతదేహాన్ని ముందర పెట్టుకుని పంచాయితీకి దిగారు. మావన సంబంధాలకు మచ్చతెచ్చే అమానవీయ ఘటన గురువారం హన్మకొండలోని గుడిబండల్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గుడిబండల్‌కు చెందిన పిట్టల స్వామి కొన్ని సంవత్సరాల క్రితం కొమురమ్మ(76)ను పెళ్లి చేసుకున్నాడు. కొమురమ్మకు సంతానం కలగకపోవడంతో లచ్చమ్మను మరో పెళ్లి చేసుకున్నాడు. లచ్చమ్మకు 9 మంది సంతానం. కాగా సుమారు దశాబ్దకాలం క్రితం స్వామి మృతి చెందాడు. ఆయన సంపాదించిన ఆస్తిని ఇద్దరు భార్యలకు చెందేలా రాసిచ్చి కాలం చేశాడు. ఇదిలా ఉండగా కొమురమ్మ(76) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. దహన సంస్కారాలు చేసే క్రమంలో మృతురాలు కొమురమ్మ సోదరి వెంకటమ్మ కూతురు వచ్చి మాపెద్దమ్మ ఆస్తిని తనకు రాసిచ్చిందని, ఆస్తి తనకే దక్కుతుందని గొడవకు తెరలేపింది. దీంతో లచ్చమ్మ వారసులు మీకెలా చెందుతుందని, ఇది మా నాన్న సంపాధించిన ఆస్తి కాబట్టి తమకే దక్కుతుందని, అలా తమ పెద్దమ్మ రాసిచ్చిందని వాదనకు దిగారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవ కాస్త పోలీస్ ఠాణా మెట్లక్కెంది. కేసు నమోదు చేసుకున్న హన్మకొండ పోలీసులు ముందుగా దహన సంస్కారాలు కానివ్వండి అని చెప్పడంతో గురువారం సాయంత్రం దహన సంస్కారాలు చేశారు. -
అభివృద్ధిలో అగ్రస్థానం: ఎర్రబెల్లి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ ప్రతీ అంశంలోనూ అభివృద్ధి సాధిస్తోందని... ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలు ఇందులో అగ్రస్థానంలో నిలవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి వేగంగా అభివృద్ధిని సాధించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ఆరు జిల్లాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, జిల్లా అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ఎనిమిది గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో మిషన్ భగీరథ, హరితహారం, పంచాయతీరాజ్ చట్టం అమలు, ఓడీఎఫ్ పురోగతి, దేవాదుల భూసేకరణ, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, విద్య, వైద్యం, డబుల్ బెడ్రూం గృహాలు, వ్యవసాయం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. మిషన్.. బృహత్తర పథకం ‘మిషన్ భగీరథ’ బృహత్తర పథకం. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి భగీరథ కార్యక్రమం లేదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ ఒక్క మహిళ నెత్తిన బిందె పెట్టుకుని నీళ్ల కోసం ఎక్కడికో వెళ్లాలిసిన పరిస్థితి ఎదురుకాకూడదు. అధికారులు మంచిగ పని చేస్తున్నారు. ఎండాకాలంలో నీటి సమస్య రాకుండా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 15 వరకు పనులు పూర్తి చేసి ప్రతీ ఇంటికీ వంద శాతం నీరు సరఫరా చేయాలి. ప్రభుత్వ విద్యాసంస్థలతోపాటు ఆలయాలు, మసీదులు, చర్చిలకు ఉచితంగా నీరు సరఫరా చేసేలా పనులు పూర్తి చేయాలి. పనులు వంద శాతం పూర్తయినట్లుగా గ్రామపంచాయతీ గ్రామసభలో ఆమోదించి సర్పంచ్‌తో సంతకం చేయించాలి. ఈ పనులపై ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రోడ్లపై ఉన్న నల్లాల పైపులను ఇంటిలోపలి వరకు బిగించాలి. తాగునీరు వృథా చేస్తే గ్రామపంచాయతీలు జరిమానా విధించాలి. మిషన్ భగీరథ పనుల కోసం తవ్విన రోడ్ల మరమ్మతులను పూర్తి చేయాలి. మేడారం జాతర అవసరాలకు తగ్టట్లు నీరు సరఫరా చేసే పనులు జరిగేలా చూడాలి’ అని మంత్రి దయాకర్‌రావు సూచించారు. హరితహారం.. యజ్ఞం హరితహారంలో ఆరు జిల్లాలు అగ్రస్థానంలో ఉండాలని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. ‘మొక్కల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలి. భవిష్యత్ తరాల కోసం ప్రకృతిని కాపాడుకోవాలి. హరితహారంలో ప్రభుత్వ లక్ష్యాలను కచ్చితంగా పూర్తి చేయాలి. అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావాల్సి ఉండగా పోలీసు శాఖ కీలకంగా వ్యవహరించాలి. మొక్కలను నాటడంతోనే ఆగిపోకుండా సంరక్షణ ముఖ్యం. మండంలో పని చేసే అధికారుల ఒక్కో గ్రామానికి బాధ్యులుగా ఉండాలి. ఎవరెవరు ఎన్ని మొక్కలు నాటారో గ్రామపంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. అలా అయితే అవి ఎండిపోకుండా జాగ్రత్త పడతారు. చెట్లను నరికితే కఠినంగా వ్యవహరించాలి. వాల్టా చట్టం అమలు చేసే దిశగా చర్యలు తీసుకోవాలి. హరితహారంలో ముందున్న గ్రామపంచాయతీలకు అభివద్ధి పనుల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తాం’ అని మంత్రి అన్నారు. గ్రామాలు.. స్వచ్ఛత గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతీ అధికారి కృషి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. ‘ఉమ్మడి వరంగల్ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంచి అభిప్రాయం ఉంది. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా మనం పని చేయాలి. జిల్లాల పునర్విభజన తర్వాత గ్రామాలను బాగు చేసే సువర్ణ అవకాశం కలెక్టర్లకు దక్కింది. కలెక్టర్లు అన్ని శాఖలను సమన్వయం చేయాలి. అవసరమైన మేరకు చట్టాలను కఠినంగానే అమలు చేయాలి. అధికారులు చేసే మంచి పనులకు ప్రజా ప్రతినిధుల సహకారం ఎప్పటికీ ఉంటది. పని చేయని వారిపైన చర్యలు తీసుకోండి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ఎవరూ మీకు అడ్డు చెప్పరు’ అని స్పష్టం చేశారు. సాగునీరు.. రైతులకు భరోసా సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు వ్యవసాయంపై భరోసా కలుగుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. దేవాదుల భూసేకరణ ప్రక్రియలో జాప్యంపై అధికారులపై అసంతప్తి వ్యక్తం చేశారు. జనగామ జిల్లా రెవెన్యూ యంత్రాంగం.. ముఖ్యంగా ఆర్డీఓ తీరు సరిగా లేదని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ వేగంగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరు జిల్లాల అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని అన్నారు. ‘ప్రపంచంలోనే అతి పెద్దదైన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని వేగంగా పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. దీని తొలి ఫలితం మన వరంగల్ జిల్లాకే అందుతోంది. కాళేశ్వరంతో వచ్చే నీరు ఎస్సారెస్పీ ద్వారా సాగు అవసరాలకు అందుతుంది. కాళేశ్వరం నీటితో ప్రతీ చెరువు నింపేలా ప్రణాళిక రూపొందించారు. అవసరమైన ప్రతీచోట చెక్ డ్యాంలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.650 కోట్లు మంజూరు చేసింది. క్షేత్ర స్థాయిలో పనులు వేగంగా జరగాలి’ మంత్రి సూచించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే... ► పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి. ఇప్పటికే చాలా వరకు పూర్తయినా.. మిగిలిన పాస్‌పుస్తకాల పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సంక్లిష్టంగా ఉన్న చోట తహసీల్దార్లు, ఆర్డీఓలు స్వయంగా వెళ్లి త్వరగా ముగించాలి. గ్రామసభలు నిర్వహించి మిగిలిపోయిన పాసుపుస్తకాలను పంపిణీ చేయాలి. ► ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడాన్ని అందరూ బాధ్యతగా తీసుకోవాలి. హెచ్ఎంలు, ఉపాధ్యాయుల తీసుకుంటున్న శ్రద్ధతో విద్యార్థుల సంఖ్య పెరిగినా.. కొందరు మాత్రం పట్టింపులేకుండా ఉంటున్నారు. సర్పంచ్‌లు, స్థానిక యువత, ప్రభుత్వ అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి మూత పడే స్థితికి వచ్చే పాఠశాలల విషయంలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి చైతన్యం తీసుకురావాలి. కలెక్టర్లు పాఠశాలలను తనిఖీ చేయాలి. ► వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో సీజన్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను మెరుగుపర్చాలి. ఎంజీఎం అభివృద్ధి విషయంలో రెండు దశాబ్దాల క్రితం స మస్యలు ఉన్నా దాతల విరాళాలతో అత్యాధునికంగా అభివృద్ధి చేశాం. ► డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి. వారంలోపు అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభోత్సవాలు, పనుల శంకుస్థాపనలు జరగాలి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్మాణంలో పురోగతి కనిపించాలి. లబ్ధిదారుల ఎంపిక పారద్శకంగా చేపట్టడంతో పాటు అర్హులకే ఇళ్ల కేటాయింపు జరగాలి.లని అన్నారు. మంత్రి – ఎమ్మెల్యేల జల సంవాదం బీంఘనపూర్, చలివాగు ప్రాజెక్టుల నుంచి నిర్ధేశిత నీటి మట్టం కంటే ఎక్కువ నీటిని మాత్రమే ఇతర ప్రాంతాలకు ఎత్తిపోయాలని పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే, నీరు ఎత్తిపోయకుంటే మిట్ట ప్రాంతాలకు సాగు, నీరు ఎలా అందుతుందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. ‘మీరు పాలకుర్తి, జనగామకు నీరు తీసుకుపోతే మా ప్రాంతాల్లో ప్రాజెక్టు ఉన్నా నీరు అందకపోతే రైతులు, ప్రజలు మమ్ముల్ని నిలదీస్తారు’ అని ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. దీనికి ప్రతిగా ‘గతంలో నీటి కోసం మీరు చేసిందంతా నాకు తెలుసు’ అని మంత్రి అనడంతో ఎమ్మెల్యేలు ఎవరి ప్రాంతం కోసం వారు డిమాండ్ చేయడం సహజమేనని పేర్కొన్నారు. దీనిపై మంత్రి దయాకర్‌రావు స్పందిస్తూ ప్రాజెక్టుల్లో నీటి మట్టాల పర్యవేక్షణ, ఆయకట్టుకు విడుదల తదితర అంశాలను ఆ యా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్‌ఈలే పర్యవేక్షించాలని ఆదేశించారు. మంత్రిగా తాను కానీ ఎమ్మెలేలు కానీ నీటి విడుదలపై నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. హాజరైంది వీరే... సమీక్ష సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, సత్యవతిరాథోడ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, తాటికొండ రాజయ్య, దాస్యం వినయ్‌భాస్కర్, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోతు శంకర్‌నాయక్, వొడితల సతీష్‌కుమార్, నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి, పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి కమిషన్ నీతూకుమారి, మిషన్ భగీరథ అధికారి జి.కృపాకర్‌రెడ్డితో పాటు జిల్లాల కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎం.హరిత, వినయ్కష్ణారెడ్డి, వాసం వెంకటేశ్వర్లు, శివలింగయ్య, నారాయణరెడ్డి, గ్రేటర్ వరంగల్ కమిషనర్ రవీందర్, ఆరు జిల్లాల అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్‌కు మెడికల్ కాలేజీ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణం కోసం కలెక్టర్ నాలుగు ఎకరాల స్థలం కేటాయించినట్లు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ సమావేశంలో వెల్లడించారు. దీంతో జోక్యం చేసుకున్న మంత్రి దయాకర్‌రావు ‘కలెక్టర్ గారూ.. మానుకోటలో ప్రభుత్వ ఆస్పత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం.. సీఎం కేసీఆర్ గారు సానుకూలంగా స్పందించారు.. ఆ ఏర్పాట్లు కూడా చూడండి ’ అంటూ కలెక్టర్ శివలింగయ్యకు సూచించారు. -
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
-
ఇంటర్ పరీక్షలు..యువతి ఆత్మహత్యాయత్నం..!
సాక్షి, వరంగల్ అర్బన్ : ఇంటర్మీడియట్ పరీక్షలు నేడు (బుధవారం) మొదయ్యాయి. ఎలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎగ్జామ్ సెంటర్లలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అయితే, హన్మకొండలోని నయీంనగర్‌లో గల ఆర్డీ కళాశాలలో ఒక విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడుతుండగా.. కాలేజీ సిబ్బంది గుర్తించారు. దీంతో అవమాన భారానికి గురైన పోలసాని రక్షరావు (16) కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన రక్షను ఆస్పత్రికి తరలించారు. (తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభం) తెలంగాణలో 9లక్షల 42వేల 719 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు సిద్ధమయ్యారు. తెలంగాణ బోర్డు తమ విద్యార్థుల కోసం 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో 32సమస్యాత్మక కేంద్రాలున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, ఉదయం 8 గంటల 45 నిమిషాల్లోగా పరీక్ష హాల్లోకి చేరుకోవాలని అధికారులు ఇప్పటికే సూచించారు. 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. -
‘ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే.. బీజేపీ కీ రోల్’
సాక్షి, వరంగల్ : ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఇప్పటికీ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వడం లేదని రాజ్యసభ ఎంపీ, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహ రావు తెలిపారు. కేసీఆర్, కూటమిని ప్రజలు ఎవ్వరు నమ్మడం లేదన్నారు. టీఆర్ఎస్, కూటమికి స్పష్టమైన మెజారిటీ రాదని పేర్కొన్నారు. తెలంగాణలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీ రోల్ పోషిస్తుందన్నారు. హన్మకొండలోని బీజేపీ అర్బన్ ఆఫీస్‌లో శనివారం జీవీఎల్ విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అన్నారు. కాంగ్రెస్ బలం సరిపోక రూ.500 కోట్లకు కక్కుర్తిపడి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. కానీ, చంద్రబాబు నాయుడును చూసి కూటమి నేతలు జంకుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ కంట్రాక్టు రూపంలో టీడీపీతో జత కట్టిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరంగల్ తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అని తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా అధికారాన్ని ఉపయోగించి భూకబ్జాలు చేశారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చినా కేసీఆర్ పాలన చేయలేకపోయారని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబంలో తప్ప ఏ ఒక్కరికి ఉద్యోగాలు రాలేదని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలు అన్ని కుటుంబ పార్టీలేనని, మూడు పార్టీలు పుత్రదాహం కోసం ఆరాట పడుతున్నాయన్నారు. -
వైకుంఠానికేగిన వేదాంతి
హన్మకొండ కల్చరల్: ఉభయ వేదాంత ప్రవీణకవిశాబ్ది కేసరి, మహా మహోపాధ్యాయ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి(93) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస వదిలారు. ఆయనకు భార్య సీతమ్మ(88), కుమార్తెలు శేషమ్మ(70), శ్రీదేవి(63), నీలాదేవి(62), గోదాదేవి(61) మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వరంగల్ కరీమాబాద్‌లోని ఎస్ఆర్ఆర్ తోటలో ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ యాత్రలో పండితులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. 1926 మే 1న ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మోటూరులో జన్మించిన రఘునాథాచార్యులు, పండితులైన తన తండ్రి తాతాచార్యుల వద్ద సంస్కృత దివ్యప్రబంధ సంప్రదాయక విషయాలు అధ్యయనం చేశారు. విద్యాభ్యాసం.. ఉద్యోగం 1942 నుంచి హైదరాబాద్ సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధినీ సంస్కృత విద్యాలయంలో శ్రీమాన్ శఠగోపారామానుజాచార్య స్వామి, శ్రీమాన్ వేదాంతచార్య స్వామి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నారు. 1944–66 వరకు వరంగల్‌లోని వైదిక కళాశాలలో ప్రధాన అధ్యాపకులుగా, 1966–88 వరకు వరంగల్‌లోని శ్రీ విశ్వేశ్వరయ్య సంస్కృతాంధ్ర కళాశాలలో సంస్కృత అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత వరంగల్‌లోనే ఉంటూ సత్సంప్రదాయ పరిరక్షణ సభ ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీ భాష్య, భగవద్విషయ, గీతాభాష్య విషయాలను ఉపదేశిస్తూ ఎందరినో వేదాంత పండితులుగా తీర్చిదిద్దారు. రచనలు.. పురస్కారాలు ఆచార్యుల వారు శ్రీవిష్ణు సహస్రనామస్తోత్రం, శ్రీభాష్యము కఠోపనిషత్, ఈశావ్యాసోపనిషత్ వ్యాఖ్యా నాలు, కురంగీపంచకం తదితర యాభైకి పైగా ఉభయ వేదాంత గ్రంథాలను ప్రచురించారు. దీంతో పాటు ఉత్తరరామ చరిత్రకు శ్రీకుమార తాతాచార్య సంస్కృత వ్యాఖ్య, వేంకటాధ్వరి లక్ష్మీసహస్రమునకు శ్రీకృష్ణ బ్రహ్మతంత్ర పరకాల మునీంద్రుని అముద్రిత సంస్కృతవ్యాఖ్య, శ్రీవాధూల వీరరాఘవాచార్యస్వామి విరచిత సూక్తిసాధుత్వమాలికా, రసోదారభాణ తదితర అమూల్య గ్రంథాలను రాశారు. 1989–91వరకు కర్ణాటక మేల్కోటలోని సంస్కృత పరిశోధనా సంసత్, వారి ఉపనిషత్ ప్రణాళికకు వీరు ప్రధాన పరిశోధకులుగా పనిచేశారు. ‘కవిశాబ్దికేసరి’, ‘ఉభయవేదాంత ఆచార్య’, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, గోపాలోపాయన ప్రథమ పురస్కారం, మహా మహోపాధ్యాయ, తులాభారం–కనకాభి షేకం, తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కారం అందుకున్నారు. సర్వవైదిక సంస్థాన్ ‘శాస్త్రరత్నాకర ’బిరుదు, శ్రీ అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి వారిచే గజారోహణ సన్మానం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొం దారు. శ్రీ శ్రీరామచంద్రరామానుజ జీయర్‌స్వామి వారిచే బ్రహ్మరథోత్సవ సన్మానం, అ.జో–వి.భో కం దాళం ఫౌండేషన్ విశిష్ట పురస్కారం, తెలంగాణ తొలి అవతరణ దినోత్సవం సన్మానం, మరింగంటి శ్రీరంగాచార్య స్మారక పురస్కారం, పెద్ద జీయర్‌స్వామి చేతుల మీదుగా ఉభయవేదాంత మహోదధి పురస్కారం, సర్వార్థ సంక్షేమ సమితి స్థితప్రజ్ఞ బిరుదు, శ్రీరామానుజ రామచంద్ర జీయర్‌స్వామి చేతుల మీదుగా గోపాలదేశిక పురస్కారం, కవిరత్న ఫౌండేషన్ కవిరత్న పురస్కారం పొందారు. చెన్నై యూనివర్సిటీ జీవిత సాఫల్య పురస్కారం, శలాకవిద్వత్సమర్చన పురస్కారం అందుకున్నారు. సంస్కృత విజ్ఞానవర్ధినీ పరిషత్ స్థాపించి పరిషత్, సత్సంప్రదాయ పరిరక్షణ సభను భగవత్కైంకర్యనిధి స్థాపించి శ్రీపాంచ రాత్రాగమ పాఠశాలను స్థాపించి శ్రీరామక్రతువు నిర్వహణ, పుస్తక ప్రచురణ చేశారు. ఆలయాలకు జీర్ణోద్ధరణ: హన్మకొండలో చిన్న కోవెల, కృష్ణాజిల్లా మోటూరులో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరిపారు. శ్రీ తిరుమలాచార్య రామానుజ కూటమును నిర్మించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వీరి స్ఫూర్తి, ప్రోత్సాహం తో ఎన్నో దేవాలయాల నిర్మాణం, ప్రతిష్టలు జరిగాయి. చారిత్రక శ్రీ వేయిస్తంభాల త్రికూటాలయం లోని కేశవస్వామి గర్భగుడిలో కాకతీయుల కాలంలో ఉన్నట్లుగానే విగ్రహ ప్రతిష్టకు కృషి చేశారు. శ్రీ రఘునాథదేశిక విశిష్ట పురస్కార ప్రదానం తన తిరునక్షత్రోత్సవ సభల ద్వారా 13సంవత్సరాలుగా 52 మంది పండితులకు ‘శ్రీరఘునాథదేశిక విశిష్ట పురస్కారం ప్రదానం’చేశారు. శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్‌స్వామి, భీమవరానికి చెందిన భాష్యకారసిద్ధాంతపీఠం పీఠాధిపతి శ్రీ శ్రీ రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి, శ్రీ శ్రీ రంగరామానుజ జీయర్‌స్వామి, శ్రీ అష్టాక్షరి సంపత్కుమార రామానుజ జీయర్‌స్వామి, శ్రీ అహోబిలం జీయర్‌స్వామి, శ్రీదేవనాథ్ జీయర్‌స్వామి వంటి ఎందరో ఆచార్యులకే ఆచార్యులుగా గౌరవం అందుకున్నారు. కేసీఆర్ సంతాపం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంస్కృత పండితులు కవిశాబ్దిక కేసరి మహామహోపాధ్యాయ రఘునాథాచార్య స్వామి వారి మరణం ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. శ్రీవైష్ణవ సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనమని, జీయర్ స్వాములతో పాటు ఎందరో శిష్యులను మహోన్నతులుగా తీర్చిదిద్దిన ఆచార్యులు సత్సంప్రదాయ పరిరక్షణకు అహర్నిశలూ కృషిచేశారన్నారు. ఆజన్మాంతం తన ప్రవచన పరంపరతో ప్రతిఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన కల్పించిన మహామనీషి రఘునాథాచార్య స్వామి అని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
భార్యను వదిలి విదేశాలకు చెక్కేశాడు
-
వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి..
సాక్షి, హన్మకొండ : జీవితాంతం తోడుంటానని పెళ్లి చేసుకున్న ఓ యువకుడు భార్యను వదిలి విదేశాలకు వెళ్లాడు. నాలుగేళ్లుగా పట్టించుకోకపోవడంతో బాధితురాలు అత్తింటి ఎదుట కొద్ది రోజులుగా ఆందోళనకు దిగింది. బాధితురాల కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన సొంటి కళావతి, మధుసూదన్‌రెడ్డి దంపతుల కూతురు తనుశ్రీని వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతంపల్లికి చెందిన చాడ శోభ, రాఘవేందర్‌రెడ్డి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు ఇచ్చి 2015 ఫిబ్రవరి 11న వివాహం చేశారు. తనుశ్రీ తండ్రి ఆమె చిన్నప్పుడే చనిపోయాడు. దీంతో తల్లే అన్నీ తానై కూతురు వివాహం చేసింది. వివాహ సమయంలో రూ.20లక్షల కట్నం, 50తులాల బంగారం, మరో రూ.10లక్షలు వివాహ ఖర్చు ఇచ్చారు. అయినప్పటికీ ఆమెను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వివాహమై నెల రోజుల తర్వాత శ్రావణ్‌కుమార్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్కు వెళ్లిపోయాడు. వీసా రాగానే తీసుకెళ్తానని చెప్పి నాలుగేళ్లుగా పట్టించుకోవడంలేదు. ఆ తర్వాత భర్తతో ఫోన్లో మాట్లాడినా ఏడాది కాలంగా ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ఆమె పేర్కొంది. అత్తా, మామలు శోభ, రాఘవేందర్‌రెడ్డి హన్మకొండ నక్కలగుట్ట వివేక్‌నగర్‌లో నివసిస్తున్నారు. తనను భర్త వదిలేయడంతో తరుచూ అత్తింటి ఎదుట తరుచూ బైఠాయించి న్యాయం చేయాలని కోరుతోంది. నాలుగు రోజులుగా బైఠాయించి ఆందోళన చేస్తున్నా ఎవరూ రావడంలేదని తెలిపింది. కొద్ది రోజుల క్రితం తనను అత్తమామ, బావ జీవన్‌రెడ్డి (భర్త సోదరుడు) కొట్టి, రైల్వేస్టేషన్‌కు తీసుకెళ్లి పంపించారని పేర్కొంది. ఇప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని రోదించింది. తాను హైదరాబాద్ సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని వివరించింది. తనకు అన్ని వర్గాల ప్రజలు అండగా నిలువాలని కోరుతోంది. -
భయం.. భయం
హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంతో రోగులు, వారి బంధువులు ఆస్పత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. కాగా ప్రమాదం జరిగిన విషయం తెలియగానే డిప్యూటీ సీఎం, పలు రాజకీయ పార్టీ నేతలు, అధికారులు ఆస్పత్రిని సందర్శించి సహాయ సహకారాలు అందించారు. హన్మకొండ చౌరస్తా: హన్మకొండ సుబేదారిలోని రోహిణి ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంతో రోగులు, బంధువులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యసేవల కోసం వచ్చిన రోగులకు కనీసం స్ట్రెచర్ కూడా కరువైంది. దీంతో వారిని వీల్చైర్లు, బెడ్‌లోనే పడుకోబెట్టగా రోగి బంధువులు సెలైన్ బాటిల్‌ను పట్టుకున్నారు. దట్టమైన పొగతో శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారడం, బయటకు వచ్చేందుకు ఎమర్జెనీ ద్వారం తెరుచుకోకపోవడంతో అద్దాలను ధ్వంసం చేశారు. భయానక వాతావరంణలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసేక్రమంలో రోగులు, వారి బంధువులు తెచ్చుకున్న నగదు, విలువైన వస్తువులను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. రోజు వారిగా మందులు వేసుకోవాల్సిన రోగులకు అవస్థలు తప్పలేదు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆస్పత్రి ఆవరణలో ఎక్కడా చూసిన జనం హాహాకారాలు, రోదనలు మిన్నంటాయి. ఊహించని ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటన విషయాన్ని తెలుసుకున్న జనం ఆస్పత్రి వద్దకు జనం పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర ఆస్పత్రుల్లో చేర్చేందుకు అంబులెన్స్‌కు హుటాహుటిన ఆస్పత్రి ప్రాంగణానికి చేరుకున్నాయి. అప్రమత్తమైన పోలీసులు నక్కలగుట్ట కాళోజీ జంక్షన్ నుంచి రోహిణీ ఆస్పత్రి వైపు వెళ్లే వాహనాలను మళ్లీంచారు. మరోవైపు కలెక్టర్ నుంచి సర్యూ్కట్ గెస్ట్ హౌస్ రోడ్డుకు వాహనాలను మళ్లించారు. అంబులెన్స్‌లు సులువుగా వెళ్లేందుకు ట్రాఫిక్‌ను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందంటే.. వరంగల్ క్రైం: రోహిణి ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం 5.10 గంటలకు జరిగిన అగ్ని ప్రమాదం ఆక్సిజన్ సిలిండర్లు పేలడం వల్లే జరిగిందని ఆస్పత్రి వర్గాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆస్పత్రిలోని రెండో అంతస్తులో రెండు ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇందులో న్యూరో విభాగానికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటల తరువాత ఒక ఆపరేషన్ పూర్తయింది. రెండో ఆపరేషన్ చేస్తుండగా సాయంత్రం 5.10 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్లో పెద్ద శబ్ధం వచ్చింది. ఒక్కసారిగా ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ సంజయ్‌తో పాటు సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అప్పటికే మంటలు వస్తుండంతో పేషెంట్‌ను సిబ్బంది సహాయంతో కిందికి పరుగులు తీశారు. ఆ మంటలు పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్లోకి వ్యాపించాయి. మంటలతో పాటు పొగ పెద్ద ఎత్తున గదుల్లోకి వ్యాపించడం వల్ల రెండో థియేటర్లో కాలుకు ఆపరేషన్ చేస్తున్న డాక్టర్లు పేషెంట్‌ను అక్కడే వదిలి పరుగు పెట్టారు. ఆక్సిజన్, నైట్రస్ ఆక్సైడ్ పేలడం వల్లే... ఆపరేషన్ థియేటర్‌కు సప్లయి అయ్యే ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే ప్రమాదం జరిగిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బెడ్లపై ఉన్న దుప్పట్లు తొందరగా అంటుకోవడం వల్ల మంటలు క్షణాల్లో ఇతర గదులకు వ్యాపించాయి. ప్రమాదం జరిగిందని తెలియగానే పేషెంట్లు, వారి బంధువులు, సిబ్బంది ఒక్కసారిగా పరుగు తేసే క్రమంలో భయంతో ఒకరినొకరు తోసుకుంటూ కిందికి వెళ్లారు. ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న మెట్ల దగ్గర గిల్స్‌కు తాళం వేసి ఉన్నట్లు తెలిసింది. నా భర్త మంటల్లో ఉన్నాడు.. వరంగల్ క్రైం: సంఘటన స్థలంలో మొదటి నుంచి చివరి వరకు రోదిస్తూ... నా భర్త ఆపరేషన్ థియేటర్ మంటల్లో ఉన్నాడు కాపాడండి అంటూ చిట్యాల మండలం వెంకట్రావ్పల్లి గ్రామంకు చెందిన జెట్టి లక్ష్మి రోదించింది. ఆ పరేషన్ థియేటర్లో ఉండి మరణించిన జట్టి కుమారస్వామికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నా రు. కాలుకు గాయం కావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చమని... యాజమాన్యం నిర్లక్ష్యంతో తన భర్త ప్రాణాలు కోల్పోపోయాయని ఆమె రోదించిన తీరు అక్కడున్న వారిని కలచివేసింది. తనకు న్యాయం చేయాలని ఆమె అందరినీ వేడుకుంది. వెంకట్రావుపల్లిలో విషాదం.. చిట్యాల(భూపాలపల్లి): జెట్టి కుమారస్వామి(40) మృతి చెందడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెంకట్రావుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తెలు మమత, మౌనిక, మానస ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. కాగా జెట్టి కుమారస్వామి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో ఎంజీఎంకు తరలించారు. ఎంజీఎం తరలించే లోపే.. ఎంజీఎం/కాటారం: రోహిణి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలిని ఎంజీఎంకు తరలించే లోపు మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి... ఈ నెల 14న తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన రత్న మల్లక్క(65) రోహిణి ఆస్పత్రిలో అడ్మిట్ అయింది. సోమవారం ఆస్పత్రిలో మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదానికి గురైన ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వారి బంధుమిత్రులు, ఆస్పత్రి సిబ్బంది వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఈ క్రమంలో మల్లమ్మ అనే వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్దారించారు. పలువురు చికిత్స పొందుతున్నారు. మా అమ్మను మూడో అంతస్తు నుంచి తీసుకొచ్చా.. హన్మకొండ అర్బన్: మా అమ్మ లెల్లమ్మను శనివారం ఆస్పత్రిలో చేర్పించాం. సోమవారం ప్రమాద ఘటన తెలియగానే ఒక్కసారిగా ఏమీ తోచలేదు. ఒకరిని ఒకరు పట్టించుకునే పరిస్థితి లేదు. అంతా అరుపులు, ఉరుకుల పరుగులతో భయానకరంగా తయారైంది. నేను వెళ్లి వీల్ చైర్ తీసుకొచ్చి మా అమ్మను కిందకి తీసుకొచ్చ. సామగ్రి అన్నీ అక్కడే వదిలేసి వచ్చాం. ప్రాణాలు కాపాడుకుంటే చాలనుకునే పరిస్థితి ఉంది. - తహసీల్దార్ శ్రీనివాస్, అర్బన్ కలెక్టరేట్ ఆస్పత్రిలో రెవెన్యూ సిబ్బంది సేవలు హన్మకొండ అర్బన్: ఆస్పత్రిలో ప్రమాదం విషయం తెలియగానే వరంగల్ ఆర్డీఓ వెంకారెడ్డి, హన్మకొండ తహసీల్దార్ కిరణ్ప్రకాష్తోపాటు ఆర్ఐ సరిత సంఘటనా స్థలానికి చేరుకుని కలెక్టరేట్ జేసీలకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశారు. బాధితులను తరలించడంలో సేవలందించారు. ఘటనపై సమగ్ర విచారణ హన్మకొండ: రోహిణి ఆస్పత్రిలో జరిగిన ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. ఆస్పత్రిలో జరిగిన ప్రమాదం సమాచారం అందుకున్న కడియం శ్రీహరి ఆస్పత్రికి చేరుకున్నారు. వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్‌రెడ్డిని సంఘటనను జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోహిణి ఆస్పత్రిలో 199 మంది రోగులు చికిత్స పొందుతున్నారన్నారు. 198 మందిని హుటాహుటిని నగరంలోని ఇతర ఆస్పత్రుల్లోకి తరలించారన్నారు. అందులో ఒక రోగి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఆస్పత్రిలో జరిగిన సంఘటన వివరాలపై విచారణ జరుపుతామన్నారు. రోగులకు సరైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాం... కలెక్టర్ అమ్రపాలి కాట హన్మకొండ: ప్రమాదం జరుగగానే రోగులను వెంట వెంటనే ఇతర ఆస్పత్రుల్లోకి తరలించామని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట అన్నారు. రోహిణి సంఘటన జరిగిన సమాచారం అందుకున్న కలెక్టర్ అమ్రపాలి రోహిణికి చేసుకుని సంఘటన పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, రోహిణి ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ నగరంలోని 40 వరకు ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఉన్న ఆస్పత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేర్పించామన్నారు. జిల్లాలోని ఆస్పత్రులను తనిఖీ చేసి భద్రతా ఏర్పాట్లను పరీక్షించనున్నట్లు తెలిపారు. సంఘటన జరిగిన సమయంలో ఆస్పత్రిలో 193 మంది రోగులున్నారన్నారు. వీరందరికీ వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. -
ఐసెట్ పరీక్షకు ప్రశ్న పత్రం ఎంపిక
హన్మకొండ : ఐసెట్ ప్రశ్నపత్రం కోడ్ ను ఎంపికచేశారు. కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కోడ్ ను గురువారం ఉదయం ఎంపిక చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్-2017 ప్రవేశ పరీక్ష గురువారం ఉదయం 10 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐసెట్ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని, వారి కోసం 16 రీజినల్ సెంటర్లు, 132 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, 9:30 గంటల వరకు విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు నమోదు చేసి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్టు పేర్కొన్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించరని వివరించారు. సమస్యలుంటే 0870-238088 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. -
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
-
సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
హన్మకొండ : ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఆశీర్వదించేందుకు ప్రజలు సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ బహిరంగ సభకు అంచనాలకు మించి జనం హాజరవుతారన్నారు. బహిరంగ సభాస్థలంలో ఏర్పాట్లు అద్భుతంగా జరుగుతున్నాయని వెల్లడించారు. మరోసారి చరిత్ర తిరగరాసే విధంగా బహిరంగ సభను నిర్వహిస్తామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. సభకు హాజరయ్యేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
చంద్రబాబు సమక్షంలో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీటీడీపీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించిన అర్షంస్వామి అనే టీడీపీ నేతను పలువురు అడ్డుకోవడంతో.. మనస్తాపానికి గురైన అర్షంస్వామి వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో ఈరోజు జరిగిన ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క కుమారుడి వివాహానికి చంద్రబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయనను కలిసి తన కష్టాలు చెప్పుకోవాలనుకున్న టీడీపీ నేతను స్థానిక నాయకులు అడ్డుకోవడంతో అతను ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. -
హన్మకొండలో లారీ బీభత్సం
వరంగల్ అర్బన్: హన్మకొండలోని హంటర్ రోడ్లో శుక్రవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాకతీయ ఫిజియోథెరపీ కళాశాలలోకి దూసుకెళ్లింది. దీంతో కళాశాల మెయిన్ గేట్ పక్కనే ఉన్న వాచ్మెన్ గది పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో వాచ్‌మెన్‌తో పాటు అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మాజీ ఎంపీ జంగారెడ్డి పై దాడి
-
మంత్రులు మాట మీద నిలబడరు
హామీలు ఇచ్చి తప్పించుకుంటారు ఒప్పందాలకు తిలోదకాలు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హన్మకొండ: టీఆర్ఎస్ మంత్రులు మాట మీద నిలబడరని టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హన్మకొండలో చేపట్టిన విద్యుత్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలకు ఆయన శుక్రవారం సంఘీభావం తెలిపి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ లు ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శిం చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని చెప్పి, అదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తూర్పారబట్టారు. విద్యుత్ ఉద్యోగులతో విద్యుత్ శాఖ మంత్రి ఒప్పందం చేసుకుని ఆ ఒప్పందానికి తిలోదకాలు ఇవ్వడంతో విద్యుత్ ఉద్యోగులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు. దీనికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, విద్యుత్ సంస్థల యాజమాన్యాలదే బాధ్యత అని అన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవని, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వీరి సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఇనుగాల శ్రీధర్ మాట్లాడుతూ డిసెంబర్ 6వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకుంటే ఆ రోజు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 30న వరంగల్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం వరంగల్: ప్రపంచంలో మూడో ప్రత్యామ్నాయ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌ను పెద్ద నోట్ల రద్దు చేసి నడ్డివిరిచిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. వరంగల్‌కు వచ్చిన ఆయన డీసీసీ భవన్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైందని ప్రపంచంలోని పలువురు ప్రముఖ ఎకనామిస్టులు అన్నారని తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బ్లాక్ మనీ బయటకు తెస్తా అన్న మోదీ దేశానికి బ్లాక్ రోజులను తీసుకువచ్చారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై దేశవ్యాప్తంగా ఈ నెల 28న నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చిందని, అన్ని జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల కేంద్రాల్లో బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్– హన్మకొండ
ప్రస్తుత కార్యాలయాలన్నీ హన్మకొండ జిల్లాకు వరంగల్ జిల్లాకు తాత్కాలిక భవనాలు వరంగల్ కలెక్టరేట్‌గా సాగునీటి శాఖ కార్యాలయం నాలుగు జిల్లాలపై పూర్తి స్థాయిలో స్పష్టత సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లాల పునర్విభజన చివరి దశకు చేరింది. ఆగస్టు 22న ప్రభుత్వం జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారమే జిల్లాల పునర్విభజన ఉండనుందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయాలు, జిల్లా పరిపాలన యంత్రాంగం చేస్తున్న ఏర్పాట్లు దీన్నే స్పష్టం చేస్తున్నాయి. పునర్విభజనలో భాగంగా వరంగల్ జిల్లాను... వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి(జయశంకర్), మహబూబాబాద్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్లో పేర్కొంది. గ్రేటర్ వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. గ్రేటర్ వరంగల్ నగరం మొత్తం ఒకే జిల్లాలో ఉండేలా... వరంగల్, వరంగల్ రూరల్(కాకతీయ) జిల్లాల ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. దీనిపై కూడా వ్యతిరేకత వచ్చింది. వరంగల్ నగరాన్ని ఆనుకుని ఉండే మండలాలను ఇతర జిల్లాలో చేర్చడంపై విమర్శలు వచ్చాయి. వరంగల్ రూరల్ జిల్లాకు కేంద్రం ఎక్కడ అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చివరికి వరంగల్, హన్మకొండ జిల్లాలుగానే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు జిల్లాల పరిపాలన కేంద్రాలను గ్రేటర్ వరంగల్ పరిధిలోనే ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ ప్రభుత్వ శాఖల జిల్లా కార్యాలయాలు ప్రస్తుతం హన్మకొండలోనే ఉన్నాయి. వీటన్నింటినీ హన్మకొండ జిల్లా కార్యాలయాలుగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్ జిల్లా కార్యాలయాలను వరంగల్ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం తాత్కాలికంగా హన్మకొండలోనే ఉండనుంది. జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా ఏర్పడబోయే వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని సాగునీటి శాఖ శాఖ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. జిల్లాల పునర్విభజన ప్రక్రియ అనంతరం దసరా రోజు నుంచి వరంగల్ జిల్లా కలెక్టర్ ఈ కార్యాలయంలోనే విధులు నిర్వహించనున్నారు. ఇలా హన్మకొండలోనే... రెండు జిల్లాల కలెక్టర్ల కార్యాలయాలు ఉండనున్నాయి. జిల్లాల పునర్విభజనలో ఏర్పడబోయే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌ను సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నీటిపారుదల శాఖ ఉద్యోగులు సంతకాలు సేకరించి ఆ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు, ముఖ్య కార్యదర్శికి, ఇంజనీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)కు వినతి పత్రాలు ఇచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను కూడా కలిసి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయం తాత్కాలికంగానే వరంగల్ జిల్లా కలెక్టరేట్‌గా ఉంటుందని.. వరంగల్‌లో కొత్త భవనం నిర్మాణం పూర్తి కాగానే మళ్లీ సాగునీటి శాఖకే అప్పగిస్తామని కలెక్టర్ కరుణ వారికి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియకు సహకరించాలని ఉద్యోగులను కోరారు. దీంతో సాగునీటి శాఖ సర్కిల్ కార్యాలయంలోనే వరంగల్ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటయ్యే విషయంలో స్పష్టత వచ్చినట్లయింది. మరోవైపు మహబూబాబాద్, భూపాలపల్లి(జయశంకర్) జిల్లాల కేంద్రాల్లో కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాల ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు చేరింది. -
18న జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు 18న ఉదయం 9గంటలకు జేఎన్ఎస్లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ 98492 10746 నెంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. -
‘జోయాలుక్కాస్’లో బెంజ్ కారు ఆఫర్ పొడిగింపు
హన్మకొండ చౌరస్తా : హన్మకొండ చౌరస్తా సమీపంలోని పింజర్లవీధిలో ఉన్న జోయాలుక్కాస్ జ్యుయెలరీ షోరూంలో కొత్త ఆఫర్లను మంగళవారం ప్రవేశపెట్టారు. ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్న బెంజ్ కారు ఆఫర్ ను వినియోగదారుల కోరిక మేరకు మరో పదిహేను రోజుల పాటు పొడిగించినట్లు హన్మకొండ బ్రాంచ్ మేనేజర్ జోసెఫ్పాల్ తెలిపారు. అలాగే, కొత్త ఆఫర్లలో భాగంగా బంగారు వేస్జేజ్, డైమంట్ ఆభరణాల కొనుగోలుపై ధర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జోయాలుక్కాస్ షోరూం మార్కెటింగ్ సిబ్బంది, పలువురు వినియోగదారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించొద్దు
హన్మకొండ : వ్యవసాయ, రిటైల్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్yీ ఐ)ను అనుమతించొద్దని స్వదేశీ జాగరణ్ మంచ్ జిల్లా కన్వీనర్ గురిజాల రవీందర్ కోరారు. ఈ మేరకు గురువారం హన్మకొండలో జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌కు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. తమ విజ్ఞాపన పత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పం పించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ, రిటైల్ రంగాల్లోకి ఎఫ్‌డీఐలు ప్రవేశపెడితే కోట్లాది కుటుంబాలు ఉపాధిని కోల్పోతాయన్నారు. ఫార్మసీ రంగంలో 5 సంవత్సరాల పేటెంట్ 20 సంవత్సరాలకు పెంచడం ద్వారా సగటు రోగికి మందులు ఆందుబాటులో ఉండే పరిస్థితి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, రాఘవరెడ్డి, రాంచందర్‌రావు, సౌమిత్రి లక్ష్మణాచార్య పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి
-
రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకులు మృతి
హన్మకొండ : వేగంగా వెళ్తున్న బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన హన్మకొండలోని నాయుడు పెట్రోల్ బంక్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. న్యూసైన్స్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న మహబూబాబాద్‌కు చెందిన సందీప్ (20), భరత్ (20) స్థానికంగా బంగారు పని చేసుకునే అశోక్ (22) తో కలిసి బైక్ పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి...పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
లక్ష్యసాధన కోసం అభ్యర్థులు శ్రమించాలి
ఎంజీఎం : దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ లక్ష్యసాధన కోసం మరింత శ్రమించాల్సి ఉంటుందని వరంగల్ పోలీసు కమిషనర్ జి.సుధీర్‌బాబు సూచించారు. గురువారం పోలీస్ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా గతంలో నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు హన్మకొండలోని జేఎన్ఎస్ గ్రౌండ్స్‌లో ఏడో రోజు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధీర్‌బాబు మాట్లాడుతూ నిత్యం సాధన చేయడం ద్వారా పోలీసు కొలువులు సాధించడం చాలా సులభమవుతుందని సూచించారు. గురువారం 963 మంది అభ్యర్థులు 800 మీటర్ల అర్హత పరీక్షకు హాజరయ్యారు. 172 మంది మహిళా అభ్యర్థులు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్ అంశాలల్లో పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ యాదయ్య, పరిపాలన విభాగం అధికారి స్వరూపరాణి, ఏసీపీలు శోభన్‌కుమార్, జనార్దన్, మహేందర్, సురేంద్రనాథ్, వెంకటేశ్వరరావు, ఈశ్వర్రావు, రవీందర్రావు, రమేశ్‌కుమార్ పాల్గొన్నారు. -
హన్మకొండలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
హన్మకొండ : వరంగల్ లోని హన్మకొండలో బుధవారం ఉదయం ఆర్మీ పోస్టుల నియామకాల ర్యాలీ ప్రారంభమైంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరుగుతున్న ర్యాలీని జిల్లా కలెక్టర్ కరుణ హాజరై ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనుంది. ఏడు విభాగాల్లో 1,000 పోస్టులకు గాను 29,500 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 4 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8గంటల వరకు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
నాలాంటి సీఎం ఎవరూ లేరు: కేసీఆర్
వరంగల్: పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తెలిపారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... 2018 నాటికి రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇస్తామని హామీ యిచ్చారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవారికి కళ్యాణలక్ష్మి పథకం అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. తామే పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. తర్వాత దశలో రూ. 4 వేల కోట్లతో 60 వేల ఇళ్లు కట్టించనున్నట్టు కేసీఆర్ వెల్లడించారు. అలాగే ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, అంగన్ వాడీ కార్మికులకు జీతాలు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ఓట్లు అడగనని చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరని కేసీఆర్ అన్నారు. రెండున్నరేళ్లలో వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ ఆడపడుచుల పాదాలు కడుగుతామన్నారు. ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్ష నాయకులు నోటికి తాళం లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. అడ్డం, పొడవు మాట్లాడే పార్టీలకు శిక్ష వేయాలని వరంగల్ ప్రజలను ఆయన కోరారు. ప్రతిపక్షాలకు ఓట్ల రూపంలో బుద్ధి చెప్పాలని, తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. -
నాలాంటి సీఎం ఎవరూ లేరు: కేసీఆర్
-
కార్మికులకు సేవచేస్తూ చనిపోతా
హన్మకొండ : కార్మికులకు సేవ చేస్తూనే చనిపోవాలని ఉందని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి అన్నారు. భగవంతుడు ప్రత్యక్షమైతే జీవించే వరకూ కార్మికులకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు. హన్మకొండ సహకారనగర్‌లోని విష్ణుప్రియ గార్డెన్లో సోమవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 అనుబంధ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం బహిరంగ సభ జరిగింది. సభలో జి.సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అంటూ విభజించడంలో తేడా ఏమిటో అర్థం కావడంలేదన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడానని చెప్పారు. రెగ్యులరైజేషన్‌లో కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. గతంలో ఏడు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయగా విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లగా వెనక్కి వచ్చారని వివరించారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ కావడానికి హైకోర్టు తీర్పు అడ్డంకిగా మారిందన్నారు. కార్మిక చట్టాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. కోర్టు తీర్పులను పూర్తి స్థాయిలో పరిశీలించి విద్యుత్ అధికారులతో చర్చించి రెగ్యులరైజేషన్ కోసం కృషి చేస్తామన్నారు. ఈ లోగా నేరుగా జీతాలు తీసుకోవడాన్ని సాధించుకుందామన్నారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సీఎండీ వెంకటనారాయణను ఘనంగా సన్మానించారు. అంతకుముందు హన్మకొండ వడ్డెపల్లి రోడ్డులోని పల్లా రవీందర్‌రెడ్డి భవన్లో ఐఎన్టీయూసీ జిల్లా అఫీస్బేరర్ల సమావేశం జరిగింది. ఈ సభలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు బోంపెల్లి పురుషోత్తంరావు, విద్యుత్ ఉద్యోగుల సంఘం ఏపీ సెక్రటరీ జనరల్ సాయిబాబా, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవేందర్‌రెడ్డి, నాయకులు ముత్తయ్య, మహేందర్‌రెడ్డి, హన్మంతరావు, అంజయ్యగౌడ్, రాజిరెడ్డి, సదయ్య, మహేందర్‌రెడ్డి, దారవత్ సికిందర్, దేవేందర్, నీలం ఐలేష్, ఎం.ప్రభాకర్, పుల్లా రమేశ్, ఎ.సుధాకర్, రాజేందర్, లింగమూర్తి, ప్రసాద్, సమ్మిరెడ్డి, శంకర్, ప్రభాకర్‌రెడ్డి, అశోక్, శ్రీనివాస్, రాజమౌళి పాల్గొన్నారు. త్వరలో అనుకూలంగా నిర్ణయం విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై వేసిన కమిటీ సమస్యలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కార్మికులకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు కష్టించి పనిచేస్తున్నారు. వీరి కృషి వల్లే వినియోగదారులకు మెరుగైన సేవలందుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగాలన్నదే నా అభిమతం. - కొంటే వెంకటనారాయణ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కాంట్రాక్ట్ విధానాన్ని ఎత్తివేయాలి రాష్ర్టంలో కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా ఎత్తి వేయాలి. ఎన్నికలముందు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కాంట్రాక్ట్ విధానం బానిస విధానమని, ఈ విధానం లేకుండా చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం-327 కృషి చేస్తుంది. - శ్రీధర్, రాష్ట్ర సెక్రటరీ జనరల్, టీఎస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం పర్మనెంట్ చేయాలి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మిలకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగిగా వయస్సు మీరుతోంది. కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేసే బాధ్యతను జి.సంజీవరెడ్డి తీసుకుంటారు. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వారు పర్మనెంట్ అయ్యారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు యాజమాన్యం నేరుగా జీతాలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. -జి.మోహన్‌రెడ్డి, విద్యుత్ఉద్యోగుల సంఘంతెలంగాణ, ఏపీ కోఆర్డినేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కార్మిక సంఘాలు ఏకం కావాలి విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ సాధనకు విద్యుత్ సంస్థల్లోని అన్ని సంఘాలు ఏకమయ్యాయని, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడు సంఘాలు ఏకం కాలేకపోతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్ష చూపుతున్నట్లుగా ఉంది. విద్యుత్ సంస్థల్లోని అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఏకమై కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేయాలి. వయస్సు మీరుతున్నా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. - యుగందర్, టీఎస్ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యదర్శి -
టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
హన్మకొండ : టీఆర్ఎస్ సభ్యత్వానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు. నయీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం పలువురు వికలాంగులకు ఆయన సభ్యత్వాలు అందజేశారు. అనంతరం లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం స్వీకరిస్తున్నారని తెలిపారు. సమావేశంలో టీజీఏ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డి, టీఆర్ఎస్ అర్బన్ మాజీ అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, నాయకులు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఆరూరి రంజిత్, బి.వీరేందర్, కత్తరపల్లి దామోదర్ౠ చిర్ర రాజు, చిరంజీవి, గణేశ్, ఎల్.రాజేశ్వర్‌రావు, శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
హన్మకొండలో భారీ అగ్నిప్రమాదం
వరంగల్: వరంగల్ జిల్లా హన్మకొండ చౌరస్తాలోని జుబేర్ పుస్తకాల షాపులో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.... దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదంలో ఆ షాపు పక్కనే ఉన్న మరో ఎనిమిది షాపులు దగ్ధమైనాయి. రెండు కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంగమ్మ ఒడికి గౌరీపుత్రుడు
గణాధిపతి... సిద్ధిబుద్ధి ప్రదాత... తొలి పూజలందుకున్న గౌరీ నందనుడు గంగమ్మ ఒడికి చేరాడు. వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చిన కొండంత దేవుడు మళ్లీ వస్తానంటూ సెలవు తీసుకున్నాడు. 9 రోజులు పత్రి, గరిక పూజలు అందుకొని.. పండ్లు, పాయసం, ఉండ్రాళ్లు ఆరగించిన బొజ్జ గణపయ్య ఆదివారం నిమజ్జనానికి వెడలాడు. విగ్రహాల శోభాయూత్ర అంగరంగ వైభవంగా జరిగింది. యువతీ యువకుల కోలాటాలు, నృత్యాలు, బ్యాండుమేళాలు, డప్పుచప్పుళ్ల సందడి మధ్య గణేష్ మహరాజ్ జలాధివాసానికి తరలాడు. మూషిక వాహనుడికి లారీలు, ట్రాక్టర్లు... అన్నీ వాహనాలయ్యూరుు. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆయూ చెరువులు, జలాశయూల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం కనులపండువగా జరిగింది. హన్మకొండ కల్చరల్ : తొమ్మిది రోజుల పాటు జిల్లా ప్రజల ను అలరించి భక్తిసాగరంలో ముంచెత్తిన పార్వతీ తనయుడు గణనాథుడి విగ్రహాలను భక్తులు ఘనంగా నిమజ్జనం చేశా రు. రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పుటికీ ఆదివారం మధ్యాహ్నం నుంచి తెరపి ఇవ్వడంతో గణనాథుల ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. నగరంలో సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జనం అర్ధరాత్రి వరకు కొనసాగింది. యువకులు, యువతులు, మహిళలు, పిల్లలు, పెద్దలు ఊరేగింపు వేడుకల్లో హుషారుగా పాల్గొన్నారు. గణపతి బొప్పామోరియా, జైబోలో గణేష్ మహరాజ్‌కీ జై అంటూ వీరభక్తిని చాటుకున్నారు. కాషాయ రిబ్బన్లు, టోపీలు, జెండాలు ధరించి హోలీ రంగులు చల్లుకుంటూ బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు చేశారు. గణపతులకు ఘనంగా స్వాగతించడానికి వరంగల్ మహానగర గణపతి నవరాత్రి ఉత్సవ సమితి, విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. వరంగ ల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, జిల్లా అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి సాయంత్రం 6.00 గంటలకు బంధంచేరువు వద్ద గణపతి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలి హన్మకొండలోని వినాయకులు పలు వీధుల నుంచి ఊరేగిం పుగా వచ్చి చౌరస్తా మీదుగా పద్మాక్షి గుండం, సిద్ధేశ్వ గుం డం, ములుగు రోడ్డులోని కోటచెరువు వైపు తీసుకువేళ్లారు. హన్మకొండ చౌరస్తా శక్తిస్థల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక నుంచి గుజ్జుల నరసయ్య, రామానుజం తదితరులు వినాయక ఊరేగింపులకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాత్రి 7.00 గంటలకు ఈ వేదికపై నుంచి అర్బన్ ఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని, ఎవరికీ ఇబ్బంది కలగకుండా కార్యక్రమం పూర్తి చేయాలని ప్రకటించారు. కాజీపేట వైపు నుంచి బంధం చెరువు దిక్కు వచ్చే వినాయకులను దర్గాసెంటర్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి శ్రీనివాస్‌రావు తదితరులు, వరంగల్ వైపు నుంచి చిన్నవడ్డేపల్లి చెరువుకు వస్తున్న వినాయకులను పోచ్చమ్మమైదాన్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి నందాల చందర్బాబు, భైరిశ్యామ్సుందర్ ఆధ్వర్యంలో ఆహ్వనించారు. రాత్రి 12 గంటల వరకు జిల్లా మొత్తం మీద 8000 వినాయకులను నిమజ్జనం చేశారు. కాజీపేట బంధం చెరువులో 500, సిద్ధేశ్వర గుండంలో 500, కోటచెరువులో 800, చిన్నవడ్డేపల్లి చెరువులో 1500, ఉర్సు రంగసముద్రంలో 400ల వినాయక విగ్రహలను నిమజ్జనం చేశారు. నగరం మొత్తం మీద 3700 విగ్రహాలను నిమజ్జనం చేశారు. జిల్లా పోలీస్, రెవెన్యూశాఖ, మున్సిపల్ కార్పొరేషన్ ఆధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి నిమజ్జనం సక్రమంగా జరిగేలా పర్యవేక్షించారు. వేలాది మంది ప్రజలు చెరువుల వద్దకు తరలివచ్చారు. వేడి తగ్గిన వేలం పాటలు బోజ్జ గణపయ్య లడ్డూ తింటే భలే రుచి మాత్రమే కాదు కలిసొస్తుందని భక్తుల నమ్మకం. అయితే నగరంలోని పలుచోట్ల గణేష మండళ్లు నిర్వహించిన లడ్డూ వేలం పాటలు గతంలో కంటే తక్కువకు పోయాయి. కొన్నిచోట్ల గజానన మండలివారే జోక్యం చేసుకుని కొనుగొలు చేయాల్సివచ్చింది. హన్మకొండ అడ్వకేట్స్ కాలనీలోని శ్రీగజానన మండలిలో నిర్వహించిన వేలం పాటలో నూతన గజానన మండలి కమిటీవారే రూ.35,116లకు గణపతి లడ్డూ కైవసం చేసుకున్నారు. ఎక్సైజ్ కాలనీలోని శ్రీనాగేంద్రస్వామి శ్రీరాజరాజేశ్వరస్వామి, శ్రీఆభయాంజనేయస్వామి సహిత శ్రీలక్ష్మీగణపతి దేవాలయంలో జరిగిన వేలంపాటలో ఏనుగుల సాంబరెడ్డి, మంజుల దంపతులు రూ.2,116లకు లడ్డూ దక్కించుకున్నారు. -
నేడు జయశంకర్ జయంతి
హన్మకొండ అర్బన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, నవ తెలంగాణ దార్శనికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌సార్ 80వ జయంతిని బుధవారం అధికారికంగా నిర్వహించనున్నారు. కొత్త రాష్ట్రంలో తొలి జయంతిని నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాల సముద్రంలోని ఏకశిలా పార్కులో బుధవారం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. అందుకు ఓరుగల్లు సేవా సమితి ఏర్పాట్లు చేసింది. తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ అవిశ్రాంత కృషి చేశారు. విద్యార్థి దశనుంచి ఉద్యమంలో పాల్గొన్న జయశంకర్.. మలిదశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఖాయమని చెప్పినా చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని చూడకుండానే ఆనాగర్యోంతో 2011జూన్ 21న కన్నుమూశారు. పార్థీవదేహం ఉంచిన చోటే... జయశంకర్ కన్నుమూసిన తరువాత ప్రజల సందర్శనార్థం పార్థీవ దేహాన్ని బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌లో ఉంచారు. అనంతరం దశదిన ఖర్మ వరకు పార్కులో జయశంకర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి బాలసముద్రంలోని ఏకశిలా పార్క్‌ను జయశంకర్ ృ్మతివనం అని పేరుపెట్టారు. రాష్ట్రం ఏర్పాటు అయితన తరువాత స్వయంగా రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ నగరంలో జయశంకర్ ృ్మతి వనం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం స్థలపరిశీలన,విగ్రహం ఏర్పాటు వంటి పనుల బాధ్యతలు జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఓరుగల్లు సేవాసమితికి అప్పగించారు. దీంతో నగరంలోని జయశంకర్ విగ్రహ ఏర్పాటుకు నగరంలోని పలు ప్రదేశాలు పరిశీలించిన సమితి సభ్యులు.. చివరికి బాలసముద్రంలోని ఏకశిలాపార్కు సరైన స్థలమని చెప్పారు. రూ.1.37కోట్లతో ప్రతిపాదనలు బాలసముద్రంలోని పార్కులో రూ.1.37కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందకు ప్రతి పాదనలు కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చేరాయి. త్వరలో ఈ నిధులు విడుదలవుతాయని కలెక్టర్ మంగళవారం ప్రకటించారు. నిధులు రాగానే అభివృద్ధి పనులు ప్రారంబిస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మాణం, మొక్కల పెంపకం, తాగునీరు, సానిటరీ సౌకర్యాలు, కమ్యూనిటీ హాలు నిర్మాణం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం మాత్రం వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ల ఆర్థిక సహకారంతో ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు పనులు చేపట్టారు. 10 అడుగుల విగ్రహం ఏర్పాటు సమితి ఆధ్వర్యంలో సృతి వనంలో బుధవారం నిర్వహించనున్న జయశంకర్‌సార్ 80వ జయంతిని పురస్కరించుకుని*’10లక్షల ఖర్చుతో పది అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 10గంటలకు నిర్వహంచే జయంతి వేడుకలకు రాష్ట్ర ఉపముఖ్యంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసుదనాచారితో పాటు కలెక్టర్ జి.కిషన్, ఓరుగల్లు సేవాసమితి ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారు. అదేవిధంగా వరంగల్‌లోని విశ్వకర్మ వీధిలో, కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో కూడా జయశంకర్ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
14 మండలాల్లో హంగ్
- స్వతంత్రుల మద్దతుకు పార్టీల పాట్లు - ఎంపీపీ పీఠం కోసం ఎత్తులు - పాలకుర్తిలో టీఆర్ఎస్కు - కాంగ్రెస్ గాలం - 18 మండలాలు హస్తానికి - 13 మండలాల్లో టీఆర్ఎస్ - టీడీపీకి రెండు చోట్ల సంపూర్ణం - రాయపర్తిలో టీఆర్ఎస్, - కాంగ్రెస్, సీపీఐ మధ్య చర్చలు హన్మకొండ, న్యూస్‌లైన్, మండల పరిషత్ పీఠాలను దక్కించుకునేందుకు క్యాంపు రాజకీయూలు మొదలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మండల స్థాయిలో ఎంపీపీ పీఠం కోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. స్థానిక పోరు కావడంతో అభ్యర్థుల బలంపైనే పార్టీలకు అధిక స్థానాలు వచ్చాయని భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు.. టికెట్ల గొడవల్లో పడి పల్లెల్లో అభ్యర్థులను పట్టించుకోలేదనే ఆరోపణలున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎంపీటీసీ సభ్యులు పక్క పార్టీ వైపు చూస్తున్నారు. పలు మండలాల్లో ఏ పార్టీకీ సరైన మెజార్టీ రాకపోవడంతో స్వతంత్రులు, టీడీపీ, సీపీఐ నుంచి గెలిచిన ఎంపీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది. కొంతమందిని బలవంతంగానైనా క్యాంపులకు తరలించారు. మరికొంత మంది క్యాంపులకు వెళ్లకుండానే మంతనాలు జరుపుతున్నారు. కొన్నిచోట్ల టీడీపీ, బీజేపీ నుంచి గెలిచిన వారిని తమతో కలుపుకునేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు పోటీ పడుతున్నారు. అవసరమైతే ఉపాధ్యక్ష పదవిని అప్పగించేందుకు ఆశ చూపిస్తున్నారు. హంగ్ ఎక్కడంటే.. టీపీసీసీ అధ్యక్షుడు సొంత నియోజకవర్గంలోని జనగామ మండలంలో హంగ్ ఏర్పడింది. జనగామలో 11 స్థానాలుంటే కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 3, టీడీపీ ఒకటి, రెండు చోట్ల స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్‌కు ఇద్దరు స్వతంత్రుల మద్దతు తప్పనిసరైంది. దీంతో వారిని తమతో కలుపుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. - పాలకుర్తిలో కాంగ్రెస్ 7, టీడీపీ 7 స్థానాలను దక్కించుకున్నాయి. ఇక్కడ మూడుస్థానాల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు కీలకంగా మారారు. వారి మద్దతు కోసం కాంగ్రెస్ క్యాంపు రాజకీయాలను మొదలుపెట్టింది. - కేసముద్రం మండలంలోని 19 ఎంపీటీసీ స్థానాల్లో 8 కాంగ్రెస్ గెలుచుకుంది. ఇక్కడ రెండు స్థానాల్లో గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. - గోవిందరావుపేట మండలంలోని 9 స్థానాల్లో చెరో 4 చోట్ల కాంగ్రెస్, టీడీపీ విజయం సాధించారుు. ఒక్కస్థానంలో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీటీసీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. - ములుగు మండలంలోని 18 స్థానాల్లో 8చోట్ల కాంగ్రెస్, 7చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించారుు. రెండుచోట్ల బీజేపీ, ఒక్కస్థానంలో గెలిచిన స్వతంత్ర ఎంపీటీసీ సభ్యుల కోసం రెండు పార్టీలూ కన్నేశాయి. తమకు మద్దతిస్తే వైస్ ఎంపీపీ పదవి ఇస్తామని ఆశ పెడుతున్నారు. - వెంకటాపూర్ మండలంలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని దక్కించుకుంది. టీఆర్ఎస్ 4చోట్ల గెలిచింది. అయితే టీడీపీ రెండుచోట్ల గెలువగా... వారిని కలుపుకునేందుకు రెండు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. టీడీపీ ఇక్కడ వైస్ ఎంపీపీ పదవిని ఇస్తామంటూ ఆశ పెట్టింది. - నల్లబెల్లిలో టీఆర్ఎస్, టీడీపీలు చెరి నాలుగు చోట్ల గెలిచారుు. మొత్తం 11 స్థానాల్లో మూడింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ మద్దతు కోసం టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. - మొగుళ్లపల్లిలోని 11 స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకుని.. ఒక్కచోట గెలిచిన బీజేపీ అభ్యర్థికి గాలం వేస్తోంది. - గీసుగొండలో టీఆర్ఎస్, టీడీపీ చేరో మూడు స్థానాలు గెలుచుకున్నారుు. ఇక్కడ స్వతంత్రులుగా ఉన్న ముగ్గురి కోసం రెండు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిని ఎంపీపీగా చేయాలని చక్రం తిప్పుతున్నారు. - పరకాల మండలంలోని 15 స్థానాల్లో ఆరింటిని కాంగ్రెస్ దక్కించుకుంది. నాలుగేసి చోట్ల టీడీపీ, టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ ఓ స్వతంత్ర అభ్యర్థితో కలిసి కాంగ్రెస్ క్యాంపు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. - రేగొండలో మొత్తం 17 స్థానాల్లో ఏడింట్లో కాంగ్రెస్ గెలిచింది. ఎంపీపీ పీఠం దక్కించుకోవాలనే ఉద్ధేశంతో రెండుచోట్ల గెలిచిన స్వతంత్రులతో మంతనాలు చేస్తున్నారు. - ఆత్మకూరు మండలంలోని 17 స్థానాల్లో ఏ పార్టీకీ మెజార్టీ రాలేదు. కాంగ్రెస్, టీడీపీ చేరో ఆరు స్థానాలు, టీఆర్ఎస్ నాలుగు స్థానాలు దక్కించుకున్నారుు. బీజేపీ ఒక్కచోట గెలిచింది. ఇక్కడ టీఆర్ఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. - జఫర్‌గఢ్ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాల్లో 5 కాంగ్రెస్, 6 టీఆర్ఎస్ గెలుచుకుంది. ఇద్దరు టీడీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుల మద్దతు కోసం రెండు పార్టీలూ ప్రయత్నాలు చేస్తున్నాయి. - లింగాల ఘనపురం మండలంలోని 11 స్థానాల్లో టీఆర్ఎస్ 5 చోట్ల, కాంగ్రెస్ 3, టీడీపీ 2 స్థానాల్లో గెలిచారుు. ఇక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు కోసం మంతనాలు జరుపుతున్నారు. ఇక్కడ విచిత్ర పరిస్థితి.. హన్మకొండ, రాయపర్తి మండలాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. హన్మకొండ మండల పరిధిలో రెండు ఎంపీటీసీ స్థానాలుండగా... ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా ఎన్నిక కానున్నారు. ఇక రాయపర్తిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ కలిసి ఎంపీపీ పీఠం కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్కు, కాంగ్రెస్ కూటమికి సమాన స్థానాలున్నాయి. ఇక్కడ టీడీపీకి 8 సభ్యులుండగా... టీఆర్ఎస్కు నలుగురు, కాంగ్రెస్‌కు ముగ్గురు, సీపీఐ తరఫున ఒకరు గెలిచారు. అయితే ఇక్కడ ఈ మూడు పార్టీలు కలిసేందుకు చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌కు దక్కే స్థానాలు జిల్లాలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ పీఠాలను ఖాతాలో వేసుకోనుంది. దేవరుప్పుల, మద్దూరు, కురవి, మహబూబాబాద్, నర్సింహులపేట, నెల్లికుదురు, డోర్నకల్, మరిపెడ, ఏటూరునాగారం, మంగపేట, చెన్నారావుపేట, దుగ్గొండి, గూడూరు, ఖానాపురం, నర్సంపేట, చిట్యాల, గణపురం(ములుగు), శాయంపేట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. టీఆర్ఎస్కు ఇవీ.. 13 ఎంపీపీ పీఠాలను టీఆర్ఎస్ దక్కించుకోనుంది. బచ్చన్నపేట, చేర్యాల, కొడకండ్ల, నర్మెట, రఘునాతపల్లి, నెక్కొండ, తొర్రూరు, భూపాలపల్లి, ధర్మసాగర్, స్టేషన్ ఘన్పూర్, హసన్‌పర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరనున్నాయి. టీడీపీకి రెండే.. సంగెం, తాడ్వాయి మండలాల్లో మాత్రమే టీడీపీ మెజార్టీ సాధించింది. రాయపర్తిలో 8 స్థానాలు దక్కించుకున్నా... ఇక్కడ మిగిలిన అన్ని పార్టీలు ఏకమయ్యేందుకు మంతనాలు సాగుతున్నాయి. కాగా, కొత్తగూడ ఎంపీపీ పీఠం న్యూడెమోక్రసీ పార్టీ ఖాతాలో పడుతోంది. మొత్తం 11 స్థానాల్లో ఆరింటిలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. -
కాంగ్రెస్‌లో సమష్టి నాయకత్వం లేక నష్టం: గండ్ర
వరంగల్: తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమష్టిగా లేకపోవడంతో ఈ ఎన్నికల్లో కొంత నష్టం జరిగిందని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హన్మకొండలోని తన నివాసంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బస్సుయాత్ర చేపట్టినట్లుగా.. ఈసారి ప్రచారం చేసే నేత లేని లోపం కొట్టొచ్చినట్లు కనిపించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎంతో సహకరించినా స్థానికంగా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోయామని చెప్పారు. పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షునిగా నియమించినప్పటికీ పొత్తులు, టికెట్‌లంటూనే సమయం గడిచిపోయిందని, కొన్ని లోపాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందని ముందుగా భావించామని, పరిస్థితులను వినియోగించుకోక పోవడంతో గట్టిగా పోటీపడాల్సి వచ్చిందన్నారు. -
నేటితో ప్రచారానికి తెర
- మూగబోనున్న మైకులు - పంపకాలకు సిద్ధమవుతున్న నేతలు - తుది దశకు చేరిన ‘సార్వత్రిక’ సమరం హన్మకొండ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. దాదాపు రెండు నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడనుంది. ఇప్పటివరకు ప్రచార రథాలు... మైకుల మోతలు.. కళాకారుల ఆటపాటలు... పార్టీల అధినేతల పర్యటనలతో సందడిగా మారిన పట్టణాలు, పల్లెలు నిశ బ్దంగా మారనున్నాయి. ఈనెల 30న జరుగనున్న ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారంతో ముగుస్తుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు. పగలంతా ప్రచారం చేస్తున్న నేతలు... రాత్రిపూట ఓటర్లకు తాయిలాలు అందిస్తూ వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులు ఈ ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఒక్కో అభ్యర్థి రూ. 2 నుంచి 5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఎన్నికల అధికారులు కూడా ఇప్పుడు అభ్యర్థులు, వారి పెట్టే ఖర్చు, ఓటర్లకు ప్రలోభాల అంశంపైనే దృష్టి పెట్టారు. నిన్నటి వరకు అక్కడా... ఇక్కడా తిరిగిన అధికారులు ఇప్పుడు నియోజకవర్గాల్లో మకాం పెట్టారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, పరిశీలకులు సెగ్మెంట్లకు వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సెగ్మెంట్లలో ఇన్ని రోజులు ప్రచారం చేసిన స్థానికేతర నేతలు తమ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. స్థానికేతర నేతలు సెగ్మెంట్లలో ఉంటే అభ్యర్థులదే పూర్తి బాధ్యత అని, వారిపై కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరికల నోటీసులు జారీ చేశారు. ఓటర్లకు వల.. ఎన్నికలు దగ్గర పడడంతో అభ్యర్థులంతా క్షణం తీరిక లేకుండా ఓట్లు రాబట్టుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఇంటింటి ప్రచారం పూర్తి చేసుకున్న నేతలు... ఇప్పుడు గంపగుత్త ఓట్ల కోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాత్రిపూట గ్రామాలు, మండలాలు, డివిజన్ల వారీగా నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాలనీలు, గ్రామ పెద్దలతో సమావేశమై తమకు పడే ఓట్లు ఎన్ని.. వాటికి ఎంత ఖర్చు చేయాలనే విషయంపై చర్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అయితే ఒప్పందం కుదిరిన తర్వాత ప్రలోభాల మూటలను పంపిస్తూ హామీలను లిఖిత పూర్వకంగా రాసిస్తూ ఓట్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ఎన్నికల అధికారులకు చిక్కకుండా అభ్యర్థులు ప్రలోభాల పాట్లు పాట్లు పడుతున్నారు. ఎన్నికల పరిశీలకులు డేగకళ్లతో నిఘా పెట్టినా... ప్రలోభాలు మాత్రం జోరుగా సాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈసారి క్రీడా సామగ్రి, చీరెలు, వస్తువులను కాకుండా... నగదు రూపంలోనే ఓటర్లకు ఎక్కువ పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కాగా, కొన్ని ప్రాంతాల్లో కుల, యువజన సంఘాలకు లక్షల్లో ముట్టజెప్పుతున్నారు. వారి సంఘం పేరిట నగదును మధ్యవర్తుల వద్ద పెడుతున్నారు. పోలింగ్ తర్వాత వారికి పడిన ఓట్లను అంచనా వేసుకుని వాటిని వారికి అప్పగించే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కంటే ఈసారి ఒక్కో సెగ్మెంట్లో అదనంగా 40 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుం దని పార్టీల అభ్యర్థులే బాహాటంగా చెబుతుండడం గమనార్హం. -
ప్రచారం పరిపరి విధాలు..
పార్టీ గుర్తులతో పేపర్ గ్లాసులు సైకిళ్లు, ఫెక్సీలకు భలే గిరాకీ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : నామినేషన్ వేసింది మొదలు గుర్తులు కేటాయించాక వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం పది మందికి తగ్గకుండా అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ఎవరికి ఓట్లు పడతాయో.. ఈవీఎంలో ఏ గుర్తుపై ఓటేస్తారో అర్థంకాని పరిస్థితి. తమదైన శైలిలో ప్రజలకు చేరువయ్యేందుకు కొత్త కొత్త ప్రచారాస్త్రాలను అభ్యర్థులు ఎంచుకున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఊపిరి సలపకుండా ప్రచారం చేస్తున్నారు. తమకు కేటాయించిన గు ర్తుతో ఇంటింటికి తిరుగుతూ పలకరిస్తున్నారు. ప్రజలకు చేరువయ్యేందుకు, ఓటర్లను ఆకట్టుకునేందుకు వారి పనిలో భాగస్వాములవుతున్నారు. ఒక నాయకుడు కొబ్బరిబొండా కొడి తే.. మరొకరు చాయ్ అమ్ముతూ.. ఇంకొకకు హోటల్లో గరిటె తిప్పుతూ.. పొలం గట్ల వెంట కూలీలను పలకరిస్తూ.. బస్సు లు, ఆటోల్లో ప్రయాణికులను కలుస్తూ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఇవేకాక ఫ్లెక్సీలు, డీజే సౌండ్లతో గల్లీగల్లీ తిరుగుతున్న అభ్యర్థులు ప్రచారంలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఎల్ఈడీ ద్వారా త్రీజీ షోలలో వారి ప్రసంగాలను ప్రజలకు వినిపిస్తున్నారు. ఈ ప్రచారం కొద్దిమందికే చేరుతుందని గమనించిన అభ్యర్థులు.. గ్రామీణ ఓటర్లకు చేరువయ్యేందుకు కొత్త ప్రచార అస్త్రాలను ఉపయోగిస్తున్నారు. హోటళ్లే అడ్డా.. నలుగురు మిత్రులు కలిసినప్పుడు ఓ హోటల్లో కూర్చొని రాజకీయ, సామాజిక అంశాలపై చిన్నపాటి చర్చ. అయితే చాయ్ తాగి పడేసే పేపర్ కప్పులను కూడా ప్రచార అస్త్రాలు గా నాయకులు మల్చుకున్నారు. చాయ్ కప్పుపై బరిలో నిలిచిన అభ్యర్థుల ఫొటోలు, వారి గుర్తులను ముద్రించి అందజేస్తున్నారు. కొత్తగా కనిపించే కప్పులను తీక్షణంగా పరి శీలిస్తున్న ప్రజలు ఆసక్తికర ప్రచారంపై గంటలకొద్దీ చర్చకు దారితీస్తోంది. దీంతో పార్టీగుర్తు సామాన్యుడికి సైతం సులువుగా గుర్తుండిపోతుందని భావిస్తున్నారు. అంతేకాక ఖర్చు తక్కువ, ప్రచారం ఎక్కు వ ఉండడంతో నాయకులు టీ గ్లాసుల ప్రచారానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి జిల్లాకు... పేపర్ కప్పులపై నాయకుల ఫొటోలు, గుర్తులు వేసే సరికొత్త ప్రచారానికి మెదక్ జిల్లా వేదికైంది. పేపర్ గ్లాసులు అంతటా దొరికినప్పటికీ నాయకులకు అనుగుణంగా రంగులను ముద్రించే ప్రొడక్షన్ మాత్రం మెదక్‌లో తయారవుతోంది. సాధారణ పేపర్ గ్లాసుకు 60 పైసలు ఉంటే.. రంగులు అద్దుకున్న ఈ గ్లాసు రూ.1.60 పైసలు పలుకుతోంది. ఫ్లెక్సీలకు గిరాకీ గతంలో క్లాత్‌పై రాసిన బ్యానర్లు సందడి చేసేవి. వాటి స్థానా న్ని ఇప్పుడు ఫ్లెక్సీలు ఆక్రమించాయి. క్షణాల్లో కంప్యూటర్‌పై కొత్త డిజైన్లలో వచ్చే ఫ్లెక్సీలు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. దీంతో పలు ఫ్లెక్సీ షాపులు బిజీబిజీగా మారాయి. ఆటోకు మూడు వైపులా సరిపడే ఫ్లెక్సీలు కడితే రూ.3వేలు, టాటా ఏస్‌కు రూ.6వేలు, డీసీఎం, లారీ, బస్సులకు అయితే రూ.15 నుంచి రూ.20వేలు తీసుకుంటున్నారు. ట్రైసైకిళ్లపై కూడా ప్రచారం చేయిస్తున్నారు. -
నేడు మడికొండలో ఓరుగల్లు గర్జన
హాజరుకానున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లక్ష మంది సమీకరణ లక్ష్యం సభకు భారీ ఏర్పాట్లు వరంగల్, న్యూస్‌లైన్ : సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ శివారు మడికొండలో ఓరుగల్లు గర్జన పేరిట టీఆర్ఎస్ గురువారం బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానున్న సభకు గులాబీ దళం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ దఫా టీఆర్ఎస్ ఒంటరిగా అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ సభను టీఆర్ఎస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సభ సక్సెస్ చేసి... ఓటర్ల మనసులను దోచుకునే ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీ జనసమీకరణకు ప్రణాళికలు రూపొందించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇదివరకే జనసమీకరణ లక్ష్యం నిర్ధేశించారు. ఇందుకనుగుణంగా మడికొండలోని టీఎన్జీవోలకు చెందిన 40 ఎకరాల గ్రౌండ్లో 30 ఎకరాల భూమిని చదును చేశారు. ముళ్లపొదలు తొలగించి సభాస్థలిలో లైటింగ్ ఏర్పాట్లు చేపట్టారు. సాయంత్రం 5 గంటలకు కేసీఆర్ రాక సభలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్లో హన్మకొండకు రానున్నారు. ఈ మేరకు ఆర్ట్స్ కళాశాల మైదానంలో హెలిపాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా జేఎస్ఎం పాఠశాలలో ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ... హైటెన్ష్‌న్ తీగల అడ్డంకితో అక్కడికి మార్చారు. కేసీఆర్ ఇక్కడకు చేరుకున్న అనంతరం నేరుగా హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ కొద్దిసేపు సేద తీరి, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, ముఖ్య నేతలతో చర్చించనున్నట్లు సమాచారం.ఆ తర్వాత సాయంత్రం ఆరు గంటల వరకు సభాస్థలికి చేరుకోనున్నారు. సభ అనంతరం రాత్రి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ సభలో 12 నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులతోపాటు రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు హాజరుకానున్నారు. లక్ష మంది లక్ష్యం : రవీందర్రావు గులాబీ గుభాళించేలా... ప్రత్యర్థి పక్షాలను ఆత్మరక్షణలో పడేసేలా సభ నిర్వహిస్తామని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. సభాస్థలిలో జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రవీందర్రావు మాట్లాడుతూ లక్ష మంది లక్ష్యంగా జనసమీకరణ చేపట్టామన్నారు.టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయనతోపాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పిలుపునిచ్చారు. -
జేఈఈకి సర్వం సిద్ధం
నేడు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నగరంలో 17 పరీక్ష కేంద్రాలు హాజరుకానున్న 12,820 మంది విద్యార్థులు ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు సాక్షి, హన్మకొండ : దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఆదివారం నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ)కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. వరంగల్ నగరంలో 17 కేంద్రాలను ఏర్పాటు చేయగా... 12,820 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 9,935 మంది... బీ ఆర్క్, బీ ప్లానింగ్ విభాగంలో 2,885 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... బీ ఆర్క్, బీ ప్లానింగ్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. ప్రత్యేక బస్సులు జేఈఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఇన్చార్జ్ ఆర్ఎం అంచూరి శ్రీధర్ తెలిపారు. హైదరాబాద్‌కు 50, కరీంనగర్ రూట్లో 25 బస్సులు వేసినట్లు పేర్కొన్నారు. వరంగల్ నగరంలో పరీక్షలు జరిగే సెంటర్లకు సంబంధించిన రూట్లలో ఉద యం 7 గంటల నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు వివరించారు. అదేవిధంగా... సెయింట్ పీటర్స్, గ్రీన్వుడ్, జేఎస్ఎం పాఠశాలల నిర్వాహకులు సైతం ఉచితంగా 25 బస్సులు ఏర్పాటు చేశారు. వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు, బస్స్టేషన్లతోపాటు అదాలత్ సెంటర్లలో ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నారు. తప్పిన తిప్పలు రెండేళ్లుగా జేఈఈ పరీక్షలకు సంబంధించి మెట్రో నగరాల్లో ఆన్లైన్ కేంద్రాలు, వరంగల్, గుంటూరు, తిరుపతి వంటి ద్వితీయశ్రేణి నగరాల్లో ఆఫ్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ కేంద్రాల్లో పరీక్షలు రాయడం పట్ల రాష్ట్ర విద్యార్థులు విముఖత చూపడంతో ఎక్కువ మంది విద్యార్థులు ఆఫ్‌లైన్ సెంటర్లనే ఎంపిక చేసుకున్నారు. దీంతో ద్వితీయశ్రేణి నగరాలపై తీవ్రమైన ఒత్తిడి పడింది. 2012లో 50 వేల మంది విద్యార్థులు వరంగల్‌ను పరీక్ష కేంద్రంగా ఎంపిక చేసుకోగా... 2013లో ఈ సంఖ్య 55 వేలకు చేరుకుంది. నగరం నలుమూలలా 85 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సకాలంలో పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడికి చేరుకోవడం గగనంగా మారింది. అంతేకాదు... విద్యార్థులు, వారి వెంట వచ్చే సహాయకులకు వసతి, భోజనం వంటి అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికంగా ఉన్న హోటళ్లలో గదులన్నీ ముందే బుక్ అయ్యాయి. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ హాళ్లలో విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. రెండేళ్లుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సారి హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో వరంగల్, తిరుపతి, గుంటూరు, ఖమ్మం వంటి నగరాలపై ఒత్తిడి తగ్గింది. విద్యార్థులకు సూచనలు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకుచేరుకోవాలి. నిర్ణీత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా... అనుమతించరు. జవాబు పత్రాన్ని నలుపు, నీలిరంగు బాల్‌పాయింట్ పెన్నులతోనే నింపాలి. బీ ఆర్క్ విద్యార్థులు పెన్సిల్, జామెట్రీబాక్స్, క్రేయాన్స్లను పరీక్ష హాల్లోకి తీసుకెళ్లవచ్చు. ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. రూట్ల వారీగా ఆర్టీసీ బస్సులు.. రూట్ నంబర్-1 : కాజీపేట-వరంగల్ రూట్లో బాలసముద్రంలోని ఎస్ఆర్ డిగ్రీ, పీజీ కాలేజీ... అంబేద్కర్ సెంటర్లోని గురుకుల్ స్కూల్... నక్కలగుట్టలోని కాకతీయ మహిళా కాలేజీ... ములుగురోడ్డులోని శ్రీ గాయత్రి కాలేజీ... సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ... పీజీ కాలేజీ... హన్మకొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని కాకతీయ ప్రభుత్వ కాలేజీ... కిషన్‌పురలోని చైతన్య డిగ్రీ కాలేజీ... కాజీపేటలోని నిట్ పరీక్ష కేంద్రాలకు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ తెలిపారు. రూట్ నంబర్-2 : వరంగల్-కాజీపేట, వయా ఎన్జీవోస్ కాలనీ రూట్లో సెయింట్ పీటర్స్ పబ్లిక్‌స్కూల్‌కు విద్యార్థులను చేరవేస్తామన్నారు. రూట్ నంబర్-3 : కాజీపేట-వరంగల్ వయా హంటర్రోడ్టు రూట్లో ఎస్వీ రామన్ కాలేజీ, అల్లూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సెన్సైస్, న్యూసైన్స్ పీజీ కాలేజీ, వరంగల్ పబ్లిక్ స్కూల్, జేఎస్ఎం హైస్కూల్, న్యూ సైన్స్ డిగ్రీ కాలేజీలకు ఆర్టీసీ బస్సులు నడపనున్నామని చెప్పారు. రూట్ నంబర్ 24 : ఎర్రగట్టు కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ సమీంపలోని గ్రీన్వుడ్ హైస్కూల్ సెంటర్‌కు విద్యార్థులను చేరవేయనున్నట్లు శ్రీధర్ వెల్లడించారు. - న్యూస్‌లైన్, హన్మకొండ సిటీ -
మేనిఫెస్టో అమలులో అధికార, ప్రతిపక్షాలు విఫలం
హన్మకొండసిటీ, న్యూస్‌లైన్ : మేనిఫెస్టో అమలులో అధికార, ప్రతిపక్షాలు పూర్తిగా విఫల మయ్యాయని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండలోని ఎంఎస్పీ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో విడుదల చేసిన మేనిఫెస్టో ను అమలు చేయడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయ్యారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదలతో పాటు అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగానే తాము మేనిఫెస్టోను రూపొందించామన్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో తమ పార్టీ అభ్యర్థులు 30 అసెంబ్లీ స్థానాలు, ఐదు నుంచి ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారని చెప్పారు. తెలంగాణలో 15 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిగతా జాబితాను 6, 7 తేదీల్లో ప్రకటించనున్నట్లు చెప్పారు. ఎన్నికలను పురస్కరించుకుని వివిధ పార్టీలు మాటల యుద్ధం చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నాయని తెలి పారు. ఓట్లు, సీట్ల కోసం జెండాలు మోసిన కార్యకర్తలను వదలిపెట్టి అప్పటికప్పుడు వస్తు న్న నాయకులను చేరదీసి పార్టీలో టికెట్లు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఎంఎస్పీ నిజమైన కార్యకర్తలకే గుర్తింపునిస్తుందని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహ్మద్ రియాజ్, జిల్లా అధికార ప్రతినిధి తీగలప్రదీప్కుమార్గౌడ్, బండారి సురేందర్, రాజు, ప్రభాకర్, లింగం పాల్గొన్నారు. -
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తా
హన్మకొండ, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వరంగల్ జిల్లాను హైదరాబాద్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. హన్మకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో బుధవారం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎడవెల్లి బస్వారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రజాగర్జన సభలో చంద్రబాబు జిల్లాకు హామీల వర్షం గుప్పించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తామని, అందుకు సరపడా నిధులు కేటాయిస్తామన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్‌కు కేవలం గంట సమయంలో వెళ్లే విధంగా 6లేన్, 8లేన్ రోడ్లను నిర్మాణం చేస్తామన్నారు. అంతేకాకుండా రైల్వే లైన్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో లోకల్లో ఫాస్ట్‌ట్రాక్ రైలును నడుపుతామన్నారు. కరీంనగర్, ఖమ్మం, మధ్యప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డులను నిర్మానం చేస్తామని చెప్పారు. భూపాలపల్లిలో 2వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధంగా ప్లాంట్లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఉత్తర తెలంగాణకు ప్రధానమైన ఎంజీఎంను ఆల్ ఇండియా లెవల్లో తీర్చిదిద్దుతామన్నారు. వరంగల్‌ను ఐటీ హబ్‌గా చేసి, ఇక్కడ చదువుకున్న వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్టులకు పూర్తి చేస్తామని, అపెరల్ పార్కును అభివృద్ధి చేస్తామని, కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకువస్తామన్నారు. సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌గా చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. టూరిజం హబ్‌గా చేస్తామని కాకతీయ ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ మంత్రులు హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికే మరిచిపోయారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే టూరిజానికి కొత్త వెలుగులు తీసుకువస్తామన్నారు. రాజధానికి మిన్నగా మెగా టౌన్‌గా చేసే బాధ్యతను తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నేను సీఎం అవుతానని ఆశపడ్డా తెలంగాణ తర్వాత తాను కూడా సీఎం అవుతానని ఆశపడ్డాన ని, కానీ... టీడీపీ చాలా గొప్ప నిర్ణయం తీసుకుందని, బీసీని ముఖ్యమంత్రి చేయాలని పార్టీ బలంగా ఉందని టీడీపీ ఎన్నిక ల కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయూకర్‌రావు అన్నా రు. కేసీఆర్ టికెట్లు అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారిని పార్టీలోకి తీసుకుంటూ జెండాలు మోసిన వారికి మోసం చేస్తున్నారని విమర్శించారు. ‘అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వాలంటే శంకరమ్మకు ఆంధ్రా సరిహద్దులోని హుజూర్నగర్ సెగ్మెంట్ ఇస్తారట. కోదండరాం, లక్ష్మయ్యలకు సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఇస్తారట. గెలవలేని సీట్లు వీరికి... గెలిచే సీట్లు కొడుక్కు, అల్లుడు, బిడ్డకు. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిస్తే... మళ్లీ గడీల పాలన వస్తుంది’ అని అన్నారు. సాగునీరిచ్చింది మేమే.. జిల్లాలో ఇప్పుడు పండుతున్న పంటలకు సాగునీరు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమేనని నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఎస్సారెస్పీ-1, ఎస్సారెస్పీ-2, దేవాదుల ప్రాజెక్టులను తీసుకువచ్చింది తామేనని, 14 ఏళ్లు ఉద్యమం చేస్తున్నట్లు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ... కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉన్నప్పుడు తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. టీడీపీని ఖాళీ చేయిస్తామని కేసీఆర్ కథలు చెబుతున్నాడని, కానీ తెలంగాణలో కేసీఆర్ దుకాణం ఖాళీ అవుతుంన్నారు. టీడీపీకి ఓటేయకుంటే ద్రోహులుగా ఉంటాం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించిన టీడీపీకి ఓటేయకుంటే 56 శాతం ఉన్న బీసీలంతా ద్రోహులుగా మిగిలిపోతామ ని ఆర్.కృష్ణయ్య అన్నారు. కేసీఆర్ పాలన వస్తే... మళ్లీ దోరల పాలన వస్తుందని, ఇప్పటికే అల్లునికో జిల్లా, కొడుక్కొకటి, బిడ్డకొకటి చొప్పున జిల్లాలు రాసిచ్చాడని, విద్యార్థులు, ఉద్యోగులు, యువత బాధలు పట్టించుకోలేదని విమర్శించారు. టీఆర్ఎస్సో, మరే పార్టీకో అధికారం అప్పగిస్తే బీసీలు మరో 100 ఏళ్లు ఇలాగే ఉండాల్సి వస్తుందన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రమేష్ రాథోడ్, మోహన్‌రావు, గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు సీతక్క, విజయరమణారావు, తుమ్మల నాగేశ్వర్రావు, బోడకుంట్ల వెంకటేశ్వర్లు, జిల్లా ఇన్చార్జి అరవింద్‌కుమార్‌గౌడ్, నేత లు వేం నరేందర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, దొమ్మాటి సాంబయ్య, బానో తు మోహన్‌లాల్, గండ్ర సత్యనారాయరావు, చల్లా ధర్మారెడ్డి, మనోజ్‌రెడ్డి, ఈగమల్లేషం, బాబూరావు, బాలూ చౌహాన్, నెహ్రూ నాయక్, అనిశెట్టి మురళి, గట్టు ప్రసాద్, వెంకటనారాయణ గౌడ్, చాడ సురేశ్‌రెడ్డి, మండల శ్రీరాములు, గండు సా విత్రమ్మ, బాబా ఖాదర్ అలీ, బయ్య స్వామి, కృష్ణ, ఎం.సుధాకర్, కక్కె సారయ్య, గోపాల్, బొట్ల శ్రీనివాస్, పుల్లూరి అశోక్ కుమార్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మిగిలినయ్ నాలుగూళ్లే!
హసన్‌పర్తి/హన్మకొండ సిటీ, ఏదైనా పదవికి పోటీ చేయాలంటే కనీస కోరం అవసరం... అలాంటి కోరం ఇక్కడ అవసరమే లేదు. రిజర్వేషన్ అయితే చాలు... ఎన్నిక ఏకగ్రీవమే. ఓపెన్ అయితే కొంత ఇబ్బంది అరుునప్పటికీ ఎన్నిక లాంఛనమే. ఇదీ... నాలుగు గ్రామాలున్న హన్మకొండ మండల ప్రత్యేకత. వరంగల్ నగర పాలక సంస్థలో గ్రామాల విలీనం నేపథ్యంలో ఈ మండలం అందరి నోళ్లలో నానగా... తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైన తరుణంలో మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో హన్మకొండ మండల అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ ఉండేది. 23 గ్రామాలకు 23 ఎంపీటీసీ సభ్యులు, ఒక జెడ్పీటీసీ సభ్యుడు ఉండేవారు. హన్మకొండ మండలం నగరానికి చుట్టుపక్కల విస్తరించి ఉండడం... మండల పరిషత్ కార్యాలయం నగర నడి బొడ్డున ఉండడంతో ఎంపీపీ పదవి కోసం కుస్తీ పడేవారు. కానీ... హన్మకొండ మండల పరిధిలోని 19 గ్రామాలు ఏడాది క్రితం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనమైన నేపథ్యంలో అక్కడి పరిస్థితి తారుమారైంది. ఆ మండలంలో మిగిలినవి నాలుగు గ్రామాలు మాత్రమే. ప్రస్తుతం హన్మకొండ మండలంలోని కొండపర్తి, ముల్కలగూడెం, నర్సింహులగూడెం, వనమాల కనపర్తి గ్రామాలకు రెండు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. గురువారం ప్రకటించిన రిజర్వేషన్ ప్రకారం కొండపర్తి ఎంపీటీసీ బీసీ మహిళకు రిజర్వ్ కాగా, వనమాల కనపర్తి (నర్సింహులగూడెం, ముల్కలగూడెం) ఎంపీటీసీ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. ఇందులో ఎవరు గెలిచినా... చివరకు మండల పరిషత్ అధ్యక్షురాలిగా మహిళ ఎన్నిక కావడం లాంఛనమే. రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే... హన్మకొండ మండల ఎంపీపీ పీఠం రిజర్వేషన్ అయితే ఏకగ్రీవమే. బీసీ కేటగిరిలో రిజర్వేషన్ చేస్తే కొండపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీ పీఠం అధిరోహిస్తారు. ఒకవేళ ఎస్సీ రిజర్వేషన్ అయితే వనమాల కనపర్తి నుంచి ఎన్నికయ్యే అభ్యర్థి ఎంపీపీగా బాధ్యతల స్వీకరిస్తారు. ఓపెన్ కేటగిరి అరుుతే... ఇద్దరి మధ్య పోటీ తప్పదు. జెడ్పీటీసీ మహిళే... హన్మకొండ మండలంలోని నాలుగు గ్రామాల్లో సుమారు ఎనిమిది వేల జనాభా ఉంది. ఈ లెక్కన సుమారు ఆరు వేల ఓటుండగా... ఒక జెడ్పీటీసీ స్థానాన్ని కేటాయించారు. రెండు ఎంపీటీసీ స్థానాలు మహిళలకే రిజర్వ్ కాగా... జెడ్పీటీసీ స్థానం కూడా బీసీ మహిళకే రిజర్వ్ కావడం విశేషం. -
ఎవరు అడ్డుపడినా తెలంగాణ ఆగదు
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : ఆరు దశాబ్దాల సుదీర్ఘ ఉద్యమం, ప్రజల ఆకాంక్షను గుర్తించి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి పేర్కొన్నారు. ఎవరు అడ్డుపడినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలే రని ఆయన స్పష్టం చేశారు. డీసీసీ భవన్లో ఆది వారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయాలని సోనియాగాంధీ ఎప్పుడు ఆలోచించలేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రకు ఎలాంటి నష్టం వాటిల్లదని వివరించారు. పీసీసీ కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, కానుగంటి శేఖర్, శ్రీనివాసచారి, సమ్మిరెడ్డి, తుల రమేష్, కామిడి సతీష్, సీత శ్యాం, జాఫర్ పాల్గొన్నారు. -
వైభవంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం
ఎంగిలిపూల బతుకమ్మతో తొమ్మిది రోజుల పండగ శోభాయమానంగా ప్రారంభమైంది. మొదటి రోజు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆలయూలన్నీ మహిళలు, చిన్నారులతో కిటకిటలాడాయి. హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర స్వామి వేయిస్తంభాల దేవాలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వర ఆలయూల్లో జరిగిన వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. -
తీరుమారని విద్యాశాఖ
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్ ఎప్పటిలానే వాగ్వాదాలు, తోపులాటలతో వారుుదాపడింది. సీనియారిటీ జాబితాను రూపొందించడంలో విద్యాశాఖ తీరు మారులేదు. సర్వీస్ నిబంధనల ప్రకారం సీనియారిటీ జాబితా రూపకల్పన ప్రక్రియ షరామామూలుగా జాప్యం జరిగింది. హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలో మంగళవారం స్థానిక సంస్థల యాజమాన్య పరిధిలోని పాఠశాలల ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహిం చారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకే అర్హులైన ఎస్జీటీ అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీల్లో బయోలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్, పీడీ, ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంలు అన్ని కలిపి 84 వరకు వేకెన్సీల్లో పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అయితే సబ్జెక్టుల వారీ గా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా రూపొందించడంలో జాప్యం జరగగా... సాయంత్రం 6 గంటల వరకు పలు అభ్యం తరాలు వస్తూనే ఉన్నాయి. తమ పేర్లను సీనియారిటీ జాబితా లో చేర్చాలని కొందరు... 610 జీఓ ప్రకారం పదోన్నతులు కల్పించాలని మరికొందరు... ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్ల ప్రకారం పదోన్నతులు చేపట్టాలని ఆ సంఘాల ఉపాధ్యాయు లు విజ్ఞప్తులు కోకొల్లలుగా రావడంతో జాబితా రూపొందించడంలో జాప్యం చోటుచేసుకుంది. వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని... వాటిని సరిచూడకుండా కౌన్సెలింగ్ నిర్వహించడం కుదరదని డీఈఓ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్ చెప్పడంతో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేతలు ఆందోళనకు దిగారు. నిర్వహించాల్సిందేనని డీఈఓను పట్టుబట్టగా... సాయంత్రం 6.15గంటల వరకు నిర్వహిస్తామని విజయ్‌కుమార్ చెప్పారు. ఆ సమయం కూడా దాటిపోవడంతో మళ్లీ ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మరి కొందరు ఉపాధ్యాయులు అక్కడికి వచ్చి... అన్ని పరిశీలించాకే పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించాలని, లేకుంటే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం,. తోపులాట చోటుచేసుకుంది. దీంతో చాంబర్ నుంచి డీఈఓ బయటికి వెళుతుండగా... ఆయనను అడ్డుకునేందుకు యత్నించారు. ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయులు పలువురు కారుకు అడ్డంగా పడుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పదోన్నతులు నిర్వహిస్తామని డీఈఓ ప్రకటించారు. దీంతోపాటు ఉపాధ్యాయుల ఆందోళన విషయూన్ని అదనపు జేసీ సంజీవయ్యకు డీఈఓ ఫోన్లో చెప్పారు. ఇంతలో సుబేదారి పోలీసులు డీఈఓ కార్యాలయూనికి వచ్చి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు. కలెక్టర్‌ను కలిసిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయుల సంఘాల జేఏసీ నాయకులు దామెర ఉపేందర్, కొమ్ముల బాబు, యు.బిక్షపతి, నరేంద ర్‌నాయక్, ప్రవీణ్‌కుమార్,హాల్యానాయక్ రాత్రి 8.30 గంటల తర్వాత కలెక్టర్ కిషన్‌ను కలిశారు. ఎస్సీ,ఎస్టీ రోస్టర్ ప్రకారం పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించేలా చూడాలని కోరారు. తాను డీఈఓతోమాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కాగా, ఇద్దరు ఉపాధ్యాయులు కులం పేరుతో దూషించారని, కొట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ సంఘం నేతలు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై పోలీసులు కేసు నమోద ుచేసినట్లు సమాచారం నేడు కౌన్సెలింగ్ లేనట్లే.. ఇదిలా ఉండగా... అభ్యంతరాలు, విజ్ఞప్తులు పరిశీలించాకే సీనియారిటీ జాబితా రూపొందిస్తామని డీఈఓ విజయకుమార్ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో సమవేశం నిర్వహించిన తర్వాతే ఒక తేదీని నిర్ణయించి పదోన్నతులు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.హైదరాబాద్‌లో కోర్టు కేసుకు హాజరుకావాల్సిన్నందున బుధవారం పదోన్నతుల కౌన్సెలింగ్‌ను నిర్వహించలేమన్నారు, కాగా, ప్రభుత్వ యాజమన్యాలపరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు మంగళవారం మ్యాథ్స్, బయోలజికల్ సైన్స్, పీడీ, హిందీ స్కూల్‌అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించామన్నారు. ఇంగ్లిష్ ,ఫిజికల్సైన్స్,ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంల పదోన్నతులు వాయిదా పడ్డాయని వెల్లడించారు.