హన్మకొండలోని హంటర్ రోడ్లో శుక్రవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది.
వరంగల్ అర్బన్: హన్మకొండలోని హంటర్ రోడ్లో శుక్రవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాకతీయ ఫిజియోథెరపీ కళాశాలలోకి దూసుకెళ్లింది. దీంతో కళాశాల మెయిన్ గేట్ పక్కనే ఉన్న వాచ్‌మెన్ గది పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో వాచ్‌మెన్‌తో పాటు అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.