ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు.. | Two Children Drown While Playing Near Pond in Maheshwaram | Sakshi
Sakshi News home page

ఆడుకునేందుకు వెళ్లి అనంతలోకాలకు..

Feb 3 2026 11:42 AM | Updated on Feb 3 2026 11:54 AM

Two Children Drown While Playing Near Pond in Maheshwaram

రంగారెడ్డి జిల్లా: చెరువు ఒడ్డున ఆడుకుంటూ అందులో జారిపడిన ఇద్దరు చిన్నారులు శవాలుగా తేలారు. సీఐ వెంకటేశ్వర్లు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కొత్వాల్‌చెరువుతండాకు చెందిన జాటోత్‌ బద్రీనాథ్‌ (8), జాటోత్‌ మోహన్‌రామ్‌ (రిషీ 7), కరణ్‌టోత్‌ శోభిత్‌ ముగ్గురూ స్నేహితులు. వీరు ఆదివారం సాయంత్రం తండా సమీపంలోని కొత్వాల్‌చెరువు వద్దకు ఆడుకునేందుకు వెళ్లారు. చెరువు ఒడ్డుమీద ఉన్న బండరాయిపై కూర్చుని ఆడుకుంటుండగా బద్రీనాథ్, మోహన్‌రామ్‌ నీటిలో పడిపోయారు. 

ఇది గమనించిన శోభిత్‌ భయంతో ఏడుస్తూ తండాకు పరుగెత్తి, తల్లిదండ్రు లకు చెప్పాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా ఆదివారం అర్ధరాత్రి వరకూ ఆచూకీ దొరక లేదు. సోమవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. బద్రీనాథ్‌ తండాలోనే మూడో తరగతి, మోహన్‌రామ్‌ ఒకటో తరగతి చదువుతున్నారు. ఇద్దరు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.   

సబితారెడ్డి నివాళి 
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి చిన్నారుల మృతదేహాలకు నివాళులరి్పంచారు. బాధిత తల్లిదండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చెరువు వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.  

Advertisement
 
Advertisement
Advertisement