మృతిచెందిన తల్లీకొడుకులు యల్లమ్మ, చిన్నా (ఫైల్ ఫొటో)
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. సవతుల మధ్య పోరుతో.. రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. మొదటి భార్య కొడుకులు పిన్ని, ఆమె కొడుకును దారుణంగా హతమార్చారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
తరిమెల గ్రామంలో ఈ దారుణం జరిగింది. నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆస్తి విషయంలో ఇద్దరు భార్యలు చాలా కాలంగా తగాదాలు పడుతున్నారు. ఈ క్రమంలో.. మొదటి భార్య కొడుకులు రెండో భార్య అయిన యల్లమ్మ (38).. ఆమె తనయుడు చిన్నా (22) లను హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘాతుకానికి పాల్పడింది సమీప బంధువులేనని పోలీసులు చెబుతున్నారు. యల్లమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


