హెల్మెట్ లేదా?..పెట్రోల్ వేయం!
వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు నిబంధన విధించారు. హెల్మెట్ లేకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనదారుల శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరి చేశామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ అంశాన్ని తెరపైకి తెచ్చారు. హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ వేయవద్దని బంకుల నిర్వాహకులకు సూచించారు. ఈ క్రమంలో సోమవారం అనంతపురంలోని పలు పెట్రోల్ బంకుల్లో హెల్మెట్ లేని వారికి ఇంధనం వేయలేదు. అలాగే పోలీసులు పలుచోట్ల వాహన తనిఖీలు చేపట్టి హెల్మెట్ లేని వారికి జరిమానా విధించారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం


