●నేత్రపర్వంగా రథోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

●నేత్రపర్వంగా రథోత్సవాలు

Apr 3 2026 7:26 AM | Updated on Apr 3 2026 7:26 AM

ఉరవకొండ: మల్లేశ్వరస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

కూడేరు: సంగమేశ్వర క్షేత్రంలో రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

ఉరవకొండ రూరల్‌: రాకెట్లలో సాగుతున్న సుంకులమ్మ దేవి రథోత్సవం

ఉరవకొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం రథోత్సవాలు నేత్రపర్వంగా సాగాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో వెలసిన సుంకులమ్మ దేవి రథోత్సవంలో ఏర్పాట్లను గ్రామ సర్పంచ్‌ శివమ్మ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌, నాయకుడు దయ్యాల నాగరాజు పర్యవేక్షించారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాఈయి. చుట్టుపక్కల గ్రామాలతో పాటు, కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. అలాగే ఉరవకొండలో నిర్వహించిన మల్లేశ్వరస్వామి రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి హర హర మహదేవ శంభోశంకర అంటూ రథాన్ని ముందుకు లాగారు. కూడేరులో వెలసిన జోడులింగాల సంగమేశ్వర క్షేత్రం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రథోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సాయంత్రం 5.30 గంటలకు శివపార్వతుల ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేసి శివనామస్మరణతో భక్తులు ముందుకు లాగారు. జోడు లింగాలను మంత్రి పయ్యావుల కేశవ్‌ దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రమేష్‌బాబు, ఎంపీపీ నారాయణరెడ్డి, ఆలయ సేవా, జీర్ణోద్ధారణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. – ఉరవకొండ/రూరల్‌/కూడేరు:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement