చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ | Mohammed Shami Scripts Massive Record With KL Rahuls Wicket | Sakshi
Sakshi News home page

IPL 2026: చరిత్ర సృష్టించిన మహ్మద్‌ షమీ

Apr 2 2026 11:56 AM | Updated on Apr 2 2026 2:14 PM

Mohammed Shami Scripts Massive Record With KL Rahuls Wicket

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఓట‌మితో ఆరంభించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధ‌వారం ఏకానా స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ల‌క్నో ఓట‌మి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ల‌క్నో త‌ర‌పున అరంగేట్రం చేసిన సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ మాత్రం త‌న బౌలింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. 

ఢిల్లీ ఇన్నింగ్స్ తొలి బంతికే కేఎల్ రాహుల్‌ను షమీ పెవిలియన్‌కు పంపాడు. షమీ ఇన్నింగ్స్ మొదటి బంతికే వికెట్ తీయడం ఇది ఐదోసారి. తద్వారా ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి బంతికే ఐదుసార్లు వికెట్ తీసిన ఏకైక బౌలర్‌గా షమీ నిలిచాడు. 

గతంలో ఏడుగురు బౌలర్లు తలో మూడు సార్లు ఈ ఫీట్ సాధించారు. కాగా గ‌త సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన ష‌మీని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే మొద‌టి మ్యాచ్‌లో ష‌మీ త‌న మార్క్‌ను చూపించాడు. నాలుగు ఓవ‌ర్ల కోటాలో 28 ప‌రుగులిచ్చి ఒక వికెట్ ప‌డ‌గొట్టాడు.

ఐపీఎల్‌లో తొలి బంతికే అత్య‌ధిక సార్లు వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే :
5 - మహ్మద్ షమీ
3 - ప్రవీణ్ కుమార్
3 - ఉమేష్ యాదవ్
3 - ట్రెంట్ బౌల్ట్
3 - లసిత్ మలింగ
3 - భువనేశ్వర్ కుమార్
3 - అశోక్ దిండా
3 - పాట్ కమిన్స్
చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement