మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం | Training aircraft crashes near Baramati airport after Ajit Pawar flight crash | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కుప్పకూలిన ట్రైనీ విమానం

May 13 2026 2:33 PM | Updated on May 13 2026 2:33 PM

Training aircraft crashes near Baramati airport  after Ajit Pawar flight crash

సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల్లా, బారామతి విమానాశ్రయం సమీపంలో ఒక శిక్షణ విమానం కుప్పకూలింది. రెడ్ బర్డ్ ఏవియేషన్'(Red Bird Aviation) సంస్థకు చెందిన టూ-సీటర్ శిక్షణ విమానం సాంకేతిలోపం కారణంగా కూలిపోయింది. బారామతిలోని గోజుబావి గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. సరిగ్గా నాలుగు నెలల క్రితం ఇదే ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో, అప్పటి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించిన ఘటన జరిగిన తర్వాత ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

పుణే రూరల్ పోలీస్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానంలో కేవలం ఒకే ఒక ట్రైనీ పైలట్ ఉన్నారు. విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు సాంకేతిక లోపం తలెత్తిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఒక విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నేలపై పడిపోయింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

కాగా ఈ ఏడాది జనవరిలో మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న లియర్‌జెట్ 45 వివిమానం బారామతి విమానాశ్రయం వద్ద క్రాష్ ల్యాండ్ అయింది.ఘోర  ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు (ఒక పీఎస్ఓ, ఒక అటెండెంట్ మరియు ఇద్దరు పైలట్లు) అక్కడికక్కడే మరణించిన ఘటన సంచలనం సృష్టించింది.

ఇదీ చదవండి: సోదరుడి ఆకస్మిక మృతి, అఖిలేష్‌ యాదవ్‌ స్పందన

Advertisement
 
Advertisement
Advertisement