breaking news
Komaram Bheem
-
అర్ధాకలి చదువులు!
ఇంటర్ విద్యార్థులు.. కెరమెరి(ఆసిఫాబాద్): విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. విద్యార్థులు ప్రతీరోజు కళాశాలకు వచ్చేలా ఇటీవల ఎఫ్ఆర్ఎస్ కూడా అమలు చేసింది. అయితే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి చదువుల కోసం మండల కేంద్రాలకు వస్తున్న ఇంటర్ విద్యార్థులు ఖాళీకడుపులతో అలమటిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు కాకపోవడంతో విద్యార్థులు రోజంతా పస్తులుండాల్సిన పరిస్థితి ఉంది. జూనియర్ కళాశాలలు ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. కళాశాలకు వచ్చే కొందరు విద్యార్థులు అప్పుడప్పుడు లంచ్ బాక్సు తీసుకొస్తుండగా, మరికొందరు ఉదయం ఇళ్ల వద్దే భోజనం చేసి వస్తున్నారు. బాక్సు తెచ్చుకోని విద్యార్థులు కళాశాల ముగిసే వరకు ఆకలితో ఉంటున్నారు. దీంతో అధ్యాపకులు చెప్పే పాఠాలు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 4,625 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఏటా తగ్గుతున్న విద్యార్థులు..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎండీఎం అమలు చేయాలని చాలాకాలంగా డిమాండ్ ఉంది. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని నిర్ణయించారు. మధ్యాహ్న భోజనం అమలుకు ఎంత ఖర్చవుతుందనే వివరాలు సైతం సేకరించారు. కానీ పథకం అమలు మాత్రం జరగలేదు. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థుల వినతులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కాగా ఎండీఎం అమలు కాక ఏటా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. చిరుతిండ్లతో సరి..ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో చాలా వరకు పేద విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్నం విరామంలో స్నాక్స్, పండ్లు, టీ, కాఫీలతో తమ ఆకలిని కొంత వరకు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తే ఎంతో మంది పేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. గతంలో మూడు నెలలు..2020 –21 విద్యాసంవత్సరంలో అప్పటి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జనవరి నుంచి మార్చి వరకు కలెక్టర్ నిధులతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. అలాగే 2022 –23లో అప్పటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డీఎంఎఫ్టీ నిధులతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జనవరి నుంచి మార్చి వరకు వార్షిక పరీక్షల నేపథ్యంలో మధ్యాహ్న భోజనాన్ని అందించారు. సిర్పూర్(టి) మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సైతం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాగజ్‌నగర్ డివిజన్లోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎవరూ కూడా కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పంపిణీ చేయలేదు. ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు: 617ఒకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థులు : 491జిల్లాలోని జూనియర్ కళాశాలల వివరాలు.. -
సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి యువరాజ అన్నారు. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతువేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాల వినియోగం, పేదరిక ని ర్మూలన వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకునే సందర్భంలో ఏవైనా సమస్యలు ఉంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని సంప్రదించడంతో పాటు టోల్ ఫ్రీ నం. 15100ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకట్, ఏడీఏ మిలింద్‌కుమార్, రైతులు, వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టాలి’
ఆసిఫాబాద్‌రూరల్: పాఠశాలలో విద్యార్థుల హాజరుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సా రించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జైనూర్, సిర్పూర్, లింగాపూర్, తిర్యాణి, కెరమెరి ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు ప్రతీ పాఠశాలను సందర్శించి హాజరు శాతంపై ఉపాధ్యాయులతో చర్చించాలన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు రోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని తెలిపారు. పదో తరగతి వి ద్యార్థులపై దృష్టి సారించి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈవో సుభాష్, ఎస్వో అబిద్ అలీ, హెచ్ఎంలు తదితరులు పాల్గొన్నారు. -
‘నేటి బీసీ బంద్ జయప్రదం చేయండి’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాల జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు, వివి ధ సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ రూప్నార్ రమేశ్ కోరారు. శుక్రవారం పట్టణంలోని వ్యాపారులు, కుల సంఘాల నాయకులు, ఆర్టీసీ అధి కారులను కలిసి బంద్‌కు సహకరించాలని విన్నవించారు. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించ ని వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర బీసీ సంఘాల జేఏ సీ నేటి బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నా రు. బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్, జేఏసీ నాయకులు యాదగిరి, లవుకుమార్, నాగోసె శంకర్, షేక్ అసద్, మారుతి, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆశ్రమ’ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
కెరమెరి: ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అన్నారు. శుక్రవారం మండలంలోని మోడి ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ(మోడి)ల ను ఆమె సందర్శించారు. బదిలీలు, ప్రమోషన్లు చేపట్టాలని, సీఆర్టీలకు ప్రతీనెల 1వ తే దీన వేతనాలు చెల్లించాలని, ఎంటీఎస్ వర్తింపజేస్తూ హెల్త్‌కార్డులు అందించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల తనిఖీల కోసం అధికా రులు ఉండగా మళ్లీ పర్యవేక్షణ నిమి త్తం తని ఖీ అధికారులను నియమించ డం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల సిబ్బంది సభ్యత్వ నమోదు చేసుకున్నారు. -
విజన్ 2030తో గిరిజనుల సంక్షేమం
ఆసిఫాబాద్: విజన్ 2030తో జిల్లాలోని గిరిజనుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వాంకిడి మండలం లింబుగూడ ప్రాంతంలోని బహుళార్థక ప్రయోజన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం ద్వారా పీవీటీజీలకు వైద్యం, విద్య, పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందేందుకు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీ కుటుంబాలకు అధునాతన పరికరాలతో నాణ్యమైన వైద్య సేవలందిస్తున్నామన్నారు. గిరిజన పిల్లల మానసిక ఎదుగుదలకు అవసరాలను సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందించడంతో పాటు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణ అందించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. శిక్షణా తరగతులు, సమావేశాలు, సాంస్కృతిక కూటములతో గిరిజనుల మధ్య సత్సంబంధాలు మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాలకు అద్దం పట్టేలా చిత్రాలను రూపొందించడంతో పాటు పురాతన లోహపు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కల్పించేందుకు అధికార యంత్రాంగం సమన్వయంతో కృషి చేస్తుందన్నారు. సమావేశంలో జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షరంపై కక్ష కడుతారా..!
ఆసిఫాబాద్‌అర్బన్: అక్షరంపై కక్ష కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రమాదంలో పడేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. అధికారం చేతిలో ఉందని ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’పై అక్కసు చూపిస్తున్నారు. వార్తలకు భయపడి పత్రిక గొంతు నొక్కాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఖాకీలతో సర్కారు చేయిస్తున్న దమనకాండపై జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీటికి పలు జర్నలిస్టు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కక్ష సాధింపు సరికాదు..ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ యాజమాన్యంపై అవలంబిస్తున్న కక్ష సాధింపు ధోరణి సరికాదని టీయూడబ్ల్యూజే టీయూడ బ్ల్యూ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, సీనియర్ జర్నలిస్టులు రావుల శంకర్, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి వారణాసి శ్రీని వాస్రావులు మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదన్నారు. ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పటికై నా సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో జర్నలి స్టుల సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని కూటమి ప్ర భుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో అక్రిడేషన్ కమిటీ సభ్యులు ప్రకాశ్‌గౌడ్, శ్రీధర్, జానకీరాం, సురేశ్‌చారి, హనుమయ్య, రాధాకృష్ణచారి,ఽ తాటిపల్లి ఆశిష్, ముబ్బషీర్, శ్రీకాంత్, మహిళా జర్నలిస్టు గిరిజ, తదితరులు పాల్గొన్నారు.మీడియా గొంతు నొక్కడమే.. సాక్షి దినపత్రిక కు పదేపదే నోటీసులు ఇస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అంటే మీడియా గొంతు నొక్కడమే. వార్తలు రాస్తే కేసులు పెట్టడం సిగ్గుచేటు. ఒక్క కేసులో 4, 5 నోటీసులు జారీ చేయడం సమంజసం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. సాక్షి దినపత్రిక యాజమాన్యంపై, జర్నలిస్టులపై కొనసాగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. – అబ్దుల్ రహమాన్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు -
వరి ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లాలో వరిధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శులు, ఐకేపీ ఏపీఎంలు, సీసీలు, వీవోఏలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్(వానాకాలం) సీజన్ వరిధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు సమన్వయంతో చేపట్టాలన్నారు. జిల్లాలో 44వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, దాదాపు 30వేల టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్నారు. ఈనెల 24లోగా 40 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకం రూ.2,369 మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందించనున్నట్లు తెలిపారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని తేమ శాతం నిబంధనలకు లోబడి ఉండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు.కొనుగోలు కేంద్రాలను ఎత్తుప్రదేశంలో ఏర్పాటు చేయాలని, సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటు చేసి గన్నీ సంచులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, డ్రయ్యర్లు, తేమశాతం యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ట్యాబ్‌లను అందుబాటులో ఉంచి, రైతుల వద్ద నుంచి క్రమపద్ధతిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం ట్యాగింగ్ చేసిన రైస్‌మిల్లులకు మాత్రమే తరలించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరగా దిగుమతి చేసుకునే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటి, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ఐటీడీఏ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న దినసరి, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో గురువారం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సవ్యసాచి ఘోష్‌కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐటీడీఏ పరిధిలో డైలీవేజ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 30 ఏళ్లుగా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరంతా గిరిజనులే అయినా ఇప్పటివరకు ఉద్యోగ భద్రత కల్పించకపోవడం బాధాకరమన్నారు. సకాలంలో వేతనాలు అందించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. -
సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత
కౌటాల(సిర్పూర్): అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట భద్రత చర్యలు చేపట్టాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కౌటాల సర్కిల్ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. కార్యాలయ రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులు పెండింగ్ లేకుండా చూడాలన్నారు. గ్రేవ్ కేసులను నాణ్యమైన దర్యాప్తు చేసి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. హత్యలు, డౌరీ డెత్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేరాలను అదుపునకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాలు ఎక్కువ జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ హాట్స్పాట్లుగా గుర్తించాలన్నారు. గంజాయి, ఇతర అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట కాగజ్‌నగర్ డీఎస్పీ వహిద్దుదీన్, సీఐ సంతోష్‌కుమార్, ఎస్సైలు చంద్రశేఖర్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
భవితవ్యం.. ప్రశ్నార్థకం
సిర్పూర్(టి): సిర్పూర్(టి) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థంగా మారింది. భవన సముదాయాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో వర్షాకాలంలో జూలై 29న ఖాళీ చేయించి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. అనంతరం వారిని ఇతర గురుకులాల్లో సర్దుబాటు చేశారు. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గురుకుల భవనానికి మరమ్మతులు చేపట్టలేదు. తాత్కాలిక భవనాల కోసం అధికారులు గాలిస్తున్నారు. భవనం ఎంపిక ప్రక్రియ తుదిదశకు చేరుకోలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఐదు గురుకులాలకు విద్యార్థులుసిర్పూర్(టి) గురుకుల పాఠశాల, కళాశాలలో మొ త్తం 640 మంది విద్యార్థులకు పరిమితి ఉండగా ప్ర స్తుతం 490 మంది చదువుతున్నారు. భవనం శిథి లావస్థకు చేరడంతో 490 విద్యార్థులను ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాసిపేట, జైపూర్‌తోపాటు కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు తరలించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారు. మొదట భారీ వర్షాలతో విద్యార్థులను ఇళ్లకు పంపించారు. ఆ తర్వాత ఇతర గురుకులాలకు పంపించడంతో విద్యా సంవత్సరం మధ్యలో ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్ల కోసం కౌటాల మండలం విజయనగరం గ్రామంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల భవనాన్ని పరిశీలించారు. భవనం మార్పునకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ అధికారులు చెబుతుండగా, తమకు సమాచారం లేదని గురుకులాల అధికారులు చెబుతున్నారు. -
నిబంధనలకు పాతర!
కాగజ్‌నగర్‌టౌన్: దీపావళి పండుగ సమీపిస్తోంది. ఓ వైపు పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతోపా టు దీపావళి పండుగ ఉండటంతో కాగజ్‌నగర్ పట్టణంలో నిత్యావసరాల మాటున ఇప్పటికే పెద్దఎత్తున బాణాసంచా నిల్వలు చేరుకున్నట్లు సమాచా రం. అయితే విక్రయదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం లైసెన్స్‌లు పొందకుండానే తాత్కాలికంగా ఎన్వోసీ లెటర్ తీసుకుని పట్టణంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దుకాణాల ఏర్పాటుకు రెవె న్యూ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీసుల అనుమతులు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భా రీగా గండి పడుతోంది. అధిక ధరలకు టపాసులు విక్రయించి సొమ్ము చేసుకునేలా వ్యాపారులు సిండికేట్ అయినట్లు తెలుస్తోంది. రెండు శాఖల నుంచి ఎన్వోసీ..దీపావళి పండుగకు బాణాసంచా విక్రయించేందుకు పట్టణంలోని వినయ్‌గార్డెన్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏ ర్పాటు చేస్తున్నారు. బురదగూడ గ్రామ అగ్నిమాప క శాఖ, పంచాయతీ నుంచి ఏడు దుకాణాలకు ఇప్పటివరకు కేవలం ఎన్వోసీ లెటర్ మాత్రమే తీసుకున్నారు. షాపులు ఇరుకుగా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దుకాణాల మధ్య దూరం పెంచి ఫైర్ అండ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తే ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ఆస్కారం ఉంటుంది. రెవెన్యూ, పోలీసు అధికారులు తనిఖీ చేసి నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించాలి. లైసెన్సులు లేకుండా దుకాణాలు ఏర్పాటు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. నిబంధనలు పాటించాలి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా బాణాసంచా నిల్వలు ఉంచినా, విక్రయించినా చర్యలు తీసుకుంటాం. సేఫ్టీ నిబంధనల ప్రకారమే దుకాణాలు ఏ ర్పాటు చేసుకోవాలి. షాపుల మధ్య కనీసం మూడు మీటర్ల దూరం ఉండాలి. నీరు, ఇసుక, అగ్నిమాపక సిలిండర్ అందుబాటులో ఉంచాలి. – భీమయ్య, ఫైర్ ఆఫీసర్, కాగజ్‌నగర్ -
లక్ష్య సాధనపై గురి!
సంవత్సరం లక్ష్యం సాధించింది శాతం 2021– 22 33.50 24.42 732022– 23 35.00 29.20 832023– 24 36.50 37.50 1032024– 25 38.50 37.50 972025– 26 16.32 13.70 84(అక్టోబర్ 14 వరకు)రెబ్బెన(ఆసిఫాబాద్): ఓసీపీలపై అధిక వర్షాలు తీవ్ర ప్రభావం చూపడంతో బెల్లంపల్లి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. నెలవారీ ఉత్పత్తి సాధన కోసం అధికారులు చర్యలు చేపట్టినా వాతావరణం సహకరించకపోవడంతో ఉత్పత్తి పరంగా నష్టాలు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం వ ర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. బెల్లంపల్లి ఏరియాలో ప్రస్తుతం ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతోంది. గోలేటి ఓసీపీ ఇంకా ప్రారంభం కాకపోవడంతో భారమంతా ఖైరిగూర ఓసీపీపైనే ఉంది. జిల్లాలో గతేడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 మిల్లీమీటర్లుగా నమోదైంది. గడిచిన రెండు నెలల్లో ఎక్కువ రోజులు వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఏరియా వార్షిక లక్ష్యంపై ప్రభావం ప డింది. సెప్టెంబర్‌లో ఏకధాటిగా కురిసిన వర్షాలతో నెలవారీ ఉత్పత్తి లక్ష్యంలో కేవలం 37 శాతం మాత్రమే సాధించగలిగారు. ప్రధానంగా ఆగస్టు, సెప్టెంబర్ రెండు నెలల్లో నాలుగు లక్షల టన్నులకు కేవలం 2.74 లక్షలు మాత్రమే సాధ్యమైంది. వర్షాలను దృష్టిలో పెట్టుకుని నెలవారీ ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించినా పూర్తిస్థాయిలో సాధించలేకపోయారు. ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు20225– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బెల్లంపల్లి ఏరియాకు 35లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని యాజమాన్యం లక్ష్యం విధించింది. గత సంవత్సరం వార్షిక లక్ష్య సాధనలో అడుగు దూరంలో బెల్లంపల్లి ఏరియా నిలిచింది. దీంతో ఈసారి వందశాతం ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వర్షాలు ఉత్పత్తి పరంగా ఏరియాను కుదేలు చేసినా సవాళ్లను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 14 నాటికి బెల్లంపల్లి ఏరియా వార్షిక ఉత్పత్తి సాధనలో 84 శాతంలో ఉంది. వర్షాలు తగ్గడంతో ఉత్పత్తిలో వేగం పెంచుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి నాలుగు నెలలు కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం ఏరియా రోజువారీ ఉత్పత్తి లక్ష్యం 10వేల టన్నులు ఉండగా డిసెంబర్ నుంచి 12వేల వరకు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అదనపు ఉత్పత్తి లక్ష్యం నిర్ణయించడం ద్వారా వర్షాకాలంలో కోల్పోయిన ఉత్పత్తి నష్టాన్ని తిరిగి సాధించనున్నారు. వేగంగా ఓబీ వెలికితీతఓపెన్ కాస్ట్‌ల్లో బొగ్గు ఉత్పత్తి అనుకున్న స్థాయిలో జరగాలంటే అందుకు అవసరమైన బొగ్గు బెంచీలు అందుబాటులో ఉండాలి. ఓబీ పనులు అనుకూలంగా సాగాలి. అనుకున్న రీతిలో ఓబీ తీసినప్పుడే బొగ్గు బెంచ్‌లు సిద్ధంగా ఉంటాయి. సింగరేణిలోనే అతిపెద్ద ఏరియా అయిన శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ వెలికితీత పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థలు పనులను మధ్యలోనే వదిలేస్తూ చేతులెత్తేశాయి. దీంతో శ్రీరాంపూర్ ఓసీపీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కానీ బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీలో ఓబీ వెలికితీస్తున్న కాంట్రాక్టు సంస్థ రోజు వారీ లక్ష్యానికి మించి ఓబీ వెలికితీస్తోంది. ప్రస్తుతం ఓబీ రోజువారీ లక్ష్యం 1.2లక్షల క్యూబిక్ మీటర్లు ఉండగా.. కాంట్రాక్ట్ సంస్థ రోజుకు 1.30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు ఓబీ తొలగిస్తోంది. దీంతో ఏరియాలో డిసెంబర్ నుంచి వందశాతానికి మించి బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. యంత్రాల పని గంటలను పెంచడం, రోజువారీ వార్షిక లక్ష్యాన్ని పెంచడం, అధికారులు, ఉద్యోగులు సమష్టిగా పని చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.ఐదేళ్లలో బెల్లంపల్లి ఏరియా సాధించిన ఉత్పత్తి వివరాలు(లక్షల టన్నుల్లో)వందశాతం లక్ష్యం సాధిస్తాం గతేడాదితో పోల్చితే ఈసారి ఏరియాలో అధిక వర్షపాతం నమోదైంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో సగం ఉత్పత్తిని కూడా సాధించలేకపోయాం. అయినా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం వందశాతం సాధిస్తాం. ఏరియాకు ఈసారి 35 లక్షల టన్నుల లక్ష్యం ఉంది. అక్టోబర్ 14 వరకు ఏరియా 16.32 లక్షల టన్నులకు 13.66 లక్షల టన్నులు సాధించి 84శాతంలో ఉన్నాం. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. – విజయ భాస్కర్‌రెడ్డి, జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా -
నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి
ఆసిఫాబాద్: నూతన ఓటర్లకు తపాలాశాఖ ద్వారా గుర్తింపు కార్డులు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నా రు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికా రి మాట్లాడుతూ ఓటరు జాబితాలో వందేళ్లు కలిగిన ఓటర్లను గుర్తించి, వారి వయస్సుకు త గిన ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని, ఫారం 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూతనంగా ఓటరుగా నమోదైన వారికి తపాలాశాఖ ద్వారా ఓటరు కార్డులు పంపిస్తున్నామని తెలిపారు. వందేళ్లకు పైబడిన వారిని గుర్తిస్తామన్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లోని బూత్‌స్థాయి అధికారులకు గుర్తింపుకార్డులు అందించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, ఎన్నికల పర్యవేక్షకుడు శ్యాంలాల్, అధికారులు పాల్గొన్నారు. -
‘బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వండి’
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 18న చేపట్టిన తెలంగాణ బంద్‌కు మద్ద తు తెలపాలని బీసీ జేఏసీ చైర్మన్ రూప్నార్ రమేశ్ కోరారు. ఈ మేరకు గురువారం రాజకీ య పార్టీల నాయకులతోపాటు కుల, వ్యాపా ర, ఇతర సంఘాల ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వర్రావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మల్లికార్జున్, కిరాణ మర్చంట్ అధ్యక్షుడు గుండా ప్రమోద్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం పట్టణ సీఐ బాలాజీ వరప్రసాద్‌ను కలిసి బంద్‌కు పోలీసు శాఖ సహకరించాలని కోరారు. -
అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు వద్దు
ఆసిఫాబాద్: అటవీ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయవద్దని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా వైల్డ్ లైఫ్, టాస్క్‌ఫోర్స్ టీం, విద్యుత్ అధికారులతో గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ అనుమతి లేకుండా అటవీప్రాంతంలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రిజర్వ్ ఫారెస్టులో ఉన్న విద్యుత్ వైర్లు తొలగించి, రెవెన్యూ భూముల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా వేస్తున్న తీగలతో అటవీ జంతువులతోపాటు మనుషులు కూడా మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో అటవీ మండల అధికారి సుశాంత్ సుఖ్‌దేవ్, డీఎస్పీ వహిదుద్దీన్, అటవీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు ముసవీర్, సద్దాం, సీఐలు రవీందర్, రాణాప్రతాప్, విద్యుత్‌శాఖ ఎస్ఈ శేషారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పులి జాడ కోసం గస్తీ
బెజ్జూర్(సిర్పూర్): బెజ్జూర్ రేంజ్ పరిధిలోని మత్తడివాగు సమీపంలో బీట్ అధికారులు గోపాల్, స్రవంతి టైగర్ ట్రాకర్ సిబ్బందితో కలిసి పెద్దపులి ఆనవాళ్ల కోసం గాలించారు. వివిధ మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గస్తీ తిరుగుతున్నామని వారు తెలిపారు. ఇప్పటివరకు బెజ్జూర్ రేంజ్ పరిధిలోకి పెద్దపులి రాలేదని స్పష్టం చేశారు. మత్తడివాగు సమీపంలో చిరుతపులి తిరుగుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్‌లో గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా పశువైద్యాధికారి సురేశ్‌కుమార్ ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ఈ ఏడాది అధిక వర్షాలతో పశువులు వ్యాధుల బారినపడుతున్నాయని తెలిపారు. రైతులు తమ ఆవులు, గేదెలు, ఎద్దులకు టీకాలు వేయించాలని సూచించారు. అలాగే పశువైద్యశాఖ అధికారులు, సిబ్బంది ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలని, అత్యవసర సమయంలో సంప్రదించాలన్నారు. అనంతరం పశువులకు బలాన్ని అందించే మల్టీమిక్స్ పౌడర్ ప్యాకెట్లను రైతులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది మోతీరాం, సుప్రియ, పద్మ, ప్రశాంత్, వినోద్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు
ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో వరిధాన్యం కొనుగోళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్ డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 44 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. 40 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా అన్ని కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.2,389, సాధారణ రకానికి క్వింటాల్‌కు రూ.2,369 చెల్లిస్తారని, సన్నరకం వడ్లకు క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తారని తెలిపారు. జిల్లా మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, డీఏవో వెంకటి, డీఆర్డీవో దత్తారావు, పౌరసరఫరాల శాఖ అధికారులు స్వామి, సాదిక్ పాల్గొన్నారు. -
తూకాల్లో తేడాలు
కాగజ్‌నగర్‌టౌన్: ఇటీవల తూకాలు, కొలతల్లో మోసాలు పెరిగిపోయాయి. కొందరు వ్యాపారులు తక్కువ తూకాలతో వస్తు సామగ్రిని విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. తూనికల కొలతలు శాఖ(లీగల్ మెట్రాలజీ) అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు చేపడుతుండటంతో వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండా పోయింది. సరిపడా సిబ్బంది లేకపోవడంతో సక్రమంగా తనిఖీలు చేపట్టలేకపోతున్నారు. కాసులకు కక్కుర్తి జిల్లాలో 335 పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రజలు ఎక్కువగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లో వస్తుసామగ్రిని కొనుగోలు చేస్తారు. అయితే గ్రామీణ ప్ర జల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రస్తు తం ప్రతీ వస్తువు కిలోల లెక్కగా మారింది. సీజనల్ పండ్లు మామిడి కాయలు, సీతాఫలం, ఆపిల్స్, ద్రాక్షపండ్లు.. ఇతర సామగ్రిని కిలోల లెక్కనే అ మ్ముతున్నారు. కొంతమంది వ్యాపారులు సరైన కాంటాతో తూకం వేసి అమ్ముతుంటే.. మరికొంద రు మాత్రం కాసులకు కక్కుర్తిపడుతున్నారు. తూ కంలో మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాళ్ల కాంటాలను ఏటా అధికారులు తనిఖీ చేయాలి. వ్యాపారులు కూడా రాళ్లపై అధికారికంగా స్టాంపింగ్ చేయించుకోవాలి. అయితే లీగల్ మెట్రాలజీ అధి కారులు కనీసం వ్యాపారులకు నిబంధనలపై అవగాహన కల్పించడం లేదు. కాంటా రాళ్లు, డిజిటల్ మిషన్లను ఏటా తనిఖీ చేసి స్టాంపింగ్ వేయకపోవడంతో వినియోగదారులు మోసపోతున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో తూనికలు కొలతల శాఖ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ప్యాకేజీ వస్తువుల లోపాలపై 10 కేసులు, తూనికలకు సంబంధించిన 17 కేసులు మాత్రమే నమోదు చేశారు. జిల్లాలో సుమారు 50 వరకు వే బ్రిడ్జి కాంటాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు వాటిని తనిఖీ చేసిన దాఖలాలు లేవు. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతీ వస్తువు, సామగ్రి తూకంలో తేడా రాకుండా చర్యలు తీసుకోవాల్సిన లీగల్ మెట్రాలజీ అధికారులు జిల్లాలో నామమాత్రపు తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్రోల్‌బంక్‌లు, బంగారు షాపులు, పండ్ల షాపులు, కిరాణ షాపుల్లో మోసాలపై అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.సిబ్బంది కొరత ఉందిజిల్లాలో సిబ్బంది కొరత కారణంగా పూర్తిస్థాయిలో తనిఖీలు చేయలేకపోతున్నాం. ఇటీవల జిల్లాకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టాను. ఇక నుంచి జిల్లాలోని దుకాణాలపై ఆకస్మికంగా తనిఖీలు చేపడుతాం. నిబందనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటివరకు ముద్ర రుసుం రూ.5,61,000 వసూలు చేశాం. – విజయసారథి, జిల్లా ఇన్చార్జి, లీగల్ మెట్రాలజీ శాఖ -
‘గుర్తింపు’ ఎన్నికలు నిర్వహించాలని వినతి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపరు మిల్లులో కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్ శ్రీదాన కిశోర్‌కు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని బుధవారం కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, లేబర్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీఎంలో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. చాలా కాలంగా ఎన్నికలు జరగకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారని ఎమ్మెల్యే తెలిపారు. -
రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రైతులు, వ్యాపారులు రుణాలు సద్వినియో గం చేసుకోవాలని స హకార బ్యాంకు ఉమ్మడి జిల్లా సీఈవో సూర్యప్రకాశ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని సహకార బ్యాంకులో బుధవారం జిల్లాలోని సహకార బ్యాంకుల మేనేజర్లు, ఫీల్డ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఎన్ని రు ణాలు మంజూరు చేశారు.. ఎంత వరకు రికవరీ చేశారు.. తదితర వివరాలు అడిగి తెలు సుకున్నారు. అనంతరం మాట్లాడుతూ సహకార బ్యాంకుల ద్వారా పంటలు, వ్యవసా య పరికరాలతోపాటు వ్యాపార, హౌజింగ్, విద్య తదితర అవసరాలకు రుణాలు అంది స్తామని తెలిపారు. -
బడుల తనిఖీలకు కమిటీలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి ఉపాధ్యాయులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌లోనే కమిటీ ఏర్పాటుపై కసరత్తు చేసినా ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం తనిఖీ కమిటీల ఏర్పాటుకే మొగ్గు చూపింది. పదేళ్ల అనుభవం ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఎస్జీటీలు ప్రతిరోజూ రెండు ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేయాలి. అలాగే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలను పదేళ్ల అనుభవం ఉన్న స్కూల్ అసిస్టెంట్లు తనిఖీ చేస్తారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 560 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 100, ఉన్నత పాఠశాలలు 60 ఉన్నాయి. 45 వేల మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత.. పాఠశాలల తనిఖీలు, పర్యవేక్షణ బాధ్యతలను టీచర్లకు అప్పగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాస్థాయిలో డీఈవో, మండల స్థాయిలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు ఉన్నారు. మళ్లీ తనిఖీల కోసం కొత్తగా ఉపాధ్యాయులను నియమించడం సరికాదని ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. మండాలనికి ఇద్దరు చొప్పున జిల్లాలో 30 మంది వరకు టీచర్లు బడులకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జిల్లాలో టీచర్ల కొరత ఉండగా, కొందరు డిప్యూటేషన్ విధానంలో చేస్తున్నారు. కమిటీల ఏర్పాటు బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులను కేవలం బోధన పనులకు ఉపయోగించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు 2009 చెబుతోందని, దానిని ఉల్లంఘించడం సరికాదని పేర్కొంటున్నారు. బోధనేతర పనులతో సతమతం ఉపాధ్యాయులు వివిధ బోధనేతర పనులతో సతమతం అవుతున్నారు. సీసీఈ రికార్డులు రాయడం, ఆన్లైన్ చేయడం, టెస్ట్ బుక్స్, నోట్‌బుక్స్, యూనిఫాం క్లాత్ వివరాలు ఆన్లైన్ చేయడం, ఎఫ్‌ఆర్‌ఎస్‌లో విద్యార్థుల హాజరు వేయడం, మధ్యాహ్న భోజనం వివరాలు అప్లోడ్ చేయడం, టీచర్ డైరీ రాయడం, డ్రాప్‌బాక్స్‌లు క్లియర్ చేయడం, తరగతుల వారీగా జీపీ, ఈపీ, ఎఫ్‌పీలు తదితర పనులు చేస్తున్నారు. నిత్యం తనిఖీలకు పాఠశాలలకు పలువురు అధికారులు వస్తుండటంతో సమయం కేటాయిస్తున్నారు. బోధనపై దృష్టి సారించలేపోతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
● మద్యం దుకాణాలకు మందకొడిగా దరఖాస్తులు ● జిల్లాలోని 32 షాపులకు ఇప్పటివరకు వచ్చినవి 166 మాత్రమే ● మిగిలింది రెండు రోజులే..
ఆసిఫాబాద్: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తు గడువు మరో రెండురోజులు మాత్రమే మిగిలిగింది. గతేడాదితో పోల్చితే ఈసారి టెండర్లకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. సెప్టెంబర్ 26 నుంచి జిల్లాలోని 15 మండలాల్లో 32 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. రిజర్వేషన్ల ప్రాతిపదికన గౌడ కులస్తులకు 2, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒకటి, ఏజెన్సీ ప్రాంతంలో నాలుగు దుకాణాలను ఎస్టీలకు కేటాయించారు. జనరల్ కేటగిరీలో 21 దుకాణాలు ఉన్నాయి. ఒక్కో దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధారించారు. దరఖాస్తు రుసుం పెరగడంతో కొత్త వ్యాపారులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో చాలా మంది గ్రూపులుగా ఏర్పడి దరఖాస్తులు సమర్పిస్తున్నట్లు సమాచారం. 166 దరఖాస్తులు.. రూ.4.98 కోట్ల ఆదాయం జిల్లాలోని 32 మద్యం దుకాణాలకు ఇప్పటివరకు 166 రాగా, ప్రభుత్వానికి రూ.4.98 కోట్ల ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కోరోజే 47 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ డివిజన్లో 120 దరఖాస్తులు రాగా, కాగజ్‌నగర్‌లో 46 మాత్రమే వచ్చాయి. 11 దుకాణాలకు ఇప్పటివరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దరఖాస్తుల్లో ఆసిఫాబాద్ డివిజన్ ముందుండగా, కాగజ్‌నగర్ వెనుకబడింది. గతంలో దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు ఉండగా, తాజాగా రూ.3 లక్షలుగా ఖరారు చేశారు. 2021లో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లావ్యాప్తంగా 26 మద్యం దుకాణాలకు 763 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.15.26 కోట్ల ఆదాయం సమకూరింది. 2023లో నిర్వహించిన టెండర్లలో 32 మద్యం దుకాణాలకు 1020 దరఖాస్తులు రాగా, రూ.20.40 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా పరిస్థితులు చూస్తుంటే ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే చివరి రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.షాపు దరఖాస్తులు ఆసిఫాబాద్(001) 6 ఆసిఫాబాద్(002) 7 ఆసిఫాబాద్(003) 7 ఆసిఫాబాద్(004) 3 ఆసిఫాబాద్(005) 8 ఆసిఫాబాద్(006) 3 వాంకిడి(007) 27 వాంకిడి(008) 21 రెబ్బెన(009) 0 గోలేటి(010) 0 గంగాపూర్(011) 1 విజయనగరం కాలనీ, గోయగాం(012) 16 గోయగాం, మం.కెరమెరి(013) 22 కాగజ్‌నగర్(014) 0 కాగజ్‌నగర్(015) 0 కాగజ్‌నగర్(016) 2 కాగజ్‌నగర్(017) 4 కాగజ్‌నగర్(018) 1 కాగజ్‌నగర్(019) 1 సిర్పూర్– టి(020) 0 నజ్రూల్‌నగర్(021) 2 రవీంద్రనగర్(022) 0 కౌటాల(023) 0 కౌటాల(024) 25 బెజ్జూర్(025) 8 పెంచికల్పేట్(026) 0 దహెగాం(027) 13 గూడెం(028) 14 చింతనమానెపల్లి(029) 0 జైనూర్(030) 0 జైనూర్(031) 1 సిర్పూర్–యూ(032) 0 జిల్లాలో షాపుల వారీగా దరఖాస్తులు18 వరకు గడువుమద్యం దుకాణాలకు ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందించాలి. కొత్త మద్యం పాలసీ ప్రకారం ఒకరు ఎన్ని దుకాణాలకై నా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే లక్కీడ్రాలో ఎన్ని దుకాణాలైనా పొందవచ్చు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే చేతుల మీదుగా లక్కీడ్రా ద్వారా షాపులు కేటాయించనున్నారు. దుకాణాలు పొందిన వారు ఆరు విడతల్లో ట్యాక్స్ చెల్లించాలి. -
విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి
దహెగాం(సిర్పూర్): విద్యుత్ సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిజామాబాద్ చైర్పర్సన్ ఎరుకుల నారాయణ అన్నారు. మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌లో బుధవారం విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ గ్రామాలకు చెందిన వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, అధిక లోడ్ ఉన్నచోట మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని, ఇతర సమస్యలను ప్రజలు విన్నవించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. వ్యవసాయ కనెక్షన్లు, అధిక లోడ్ ఉన్న చోట ప్రత్యామ్నాయంగా మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు వ్యవసాయ మోటర్లకు కెపాసిటర్ బిగించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందని పేర్కొన్నారు. సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక మెంబర్ టెక్నికల్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ అధికారి కిషన్, ఎస్ఈ శేషారావు, డీఈ నాగరాజు, ఏవో దేవీదాస్, ఏఏవో రాజమల్లు, ఏఈ రవీందర్ పాల్గొన్నారు. -
ఆత్మీయం.. ఆదివాసీ వైభవం
దండేపల్లి మండలం గుడిరేవులోని ఏత్మాసూర్ పద్మల్‌పురి కాకో ఆలయంగుస్సాడీలు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో మాలధారణ చేసి పది రోజుల పాటు కఠినదీక్ష చేపడతారు. దీక్ష పూర్తయ్యే వరకు స్నానం ఆచరించరు. ఒంటిపై చుక్క నీరుకూడా పడకుండా.. కాళ్లకు చెప్పులు ధరించకుండా.. ఒంటిపై ఎలాంటి వస్త్రాన్ని కప్పుకోకుండా అర్ధనగ్నంగానే గడుపుతారు. నేలపైనే కూర్చోవడం, నేలపైనే పడుకోవడం వారి ఆచారం. గుస్సాడీల్లో పోరీలది మరింత ప్రాముఖ్యత. సీ్త్ర వేషధారణలో ఉండే యువకులను ఆదివాసీలు పోరీలు అని పిలుస్తారు. వారు ఏ ఊరికి వెళ్లినా.. ఏ ఇంటిని సందర్శించినా మహిళలు మంగళహారతులు ఇచ్చి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఆరాధ్యదైవం ఏత్మాసూర్ పద్మల్‌పురి కాకో ఆదివాసీలకు పెద్ద పండుగ దీపావళి.. ఇందులో భాగంగానే గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మాసూర్ పద్మల్‌పురి కాకో ఆలయానికి భక్తజన దండు కదులుతుంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గోదావరి తీరంలో కొలువై ఉన్న పద్మల్ పురి కాకో ఆలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాల నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివస్తారు. గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరిస్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంటారు. గుస్సాడి టోపీ ప్రత్యేకం గుస్సాడీ టోపీలను నిపుణులైన గోండులు, కొలాంలు తయారు చేస్తారు. నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ ముఖ్యంగా ముందు వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగురంగుల జరీ దారాలు, చక్కటి డిజైన్లు ఉన్న గుడ్డపట్టీలతో, పలు ఆకారాల రంగురంగుల చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్నిసార్లు రెండు వైపులా జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు. ఆదివాసీల మధ్య ఆత్మీయ బంధం దండారీ అంటేనే ఐకమత్యానికి నిదర్శనం. ఈ పండుగ వేళ ఆదివాసీ గ్రామాల గిరిజనం ఒక ఊరి నుంచి మరో ఊరికి విడిది వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. రాత్రంతా నృత్యం చేస్తూ రేలారె రేలా పాటలతో పాటు గోండి హాస్యపు నాటికలు ప్రదర్శించి వినోదాన్ని అందిస్తారు. తెల్లవారుజామునే కాలకృత్యాలు తీర్చుకుని మాన్కోలాతో నృత్య ప్రదర్శనలు చేసి సాయంత్రం సార్కోలాతో ముగిస్తారు. ఈ సందర్భంగా ఆదివాసీలు అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసి వీడ్కోలు పలుకుతారు. అలా చేయడం ద్వారా రెండు గ్రామాల మధ్య సత్సంబంధాలు, బాంధవ్యాలు పెరుగుతాయని ఆదివాసీ పటేళ్లు పేర్కొంటున్నారు. నాలుగు సగల పేరిట ఉత్సవాలు దండారీ పండుగలో ఏత్మాసార్ పేన్ పేరిట గిరిజనులు నాలుగు సగ(గోత్రం)లలో ఉత్సవాలు జరుపుకుంటారు. నాలుగు సగల అంటే గుమ్మేల, ఐదు సగల వారు అంటే ఫర్ర, ఆరు సగల వారు అంటే కోడల్, ఏడు సగల వారు అంటే తపల్ పేరిట ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. వేడుకల్లో భేటికోలా, మాన్కోలా, సదర్కోలా, కోడల్కోలా, సార్కోలా, కలివల్కోలా నృత్యాలు చేయడం ఆదివాసీలకే సొంతం. పేర్లు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో వారి ఆటపాటలు కూడా అంతే వైవిద్యంగా సాగుతాయి. చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ ఉత్సవాలు అట్టహాసంగా కొనసాగుతాయి. కొలబొడితో ముగింపు దీపావళి రెండు రోజుల తరువాత గురువారం కొలబొడితో ఈ దండారీ వేడుకలు ముగుస్తాయి. ఈ సందర్భంగా దండారీ బృందం ఇంటింటికీ వెళ్లగా గృహిణి ఓ పల్లెంలో ధాన్యాలు, తోచినంత నగదు ఉంచిన హారతిని వారికి అందిస్తుంది. దానిని వారు సంతోషంగా స్వీకరించి ఇంట్లో అందరూ బాగుండాలని, పాడిపంటలు సమృద్ధిగా పెంపొందాలని ఆశీ ర్వదిస్తారు. పాటలు పాడుతూ హారతి పూజ ఇస్తా రు. అనంతరం గ్రామ పొలిమేరలో ఉన్న ఇప్పచెట్టు వద్ద తమ ఇలవేల్పు అయిన భీందేవుని సన్నిధికి చేరుకుంటారు. తలకు ధరించిన నెమలి టోపీలను తొలగిస్తారు. గుస్సాడీ వేషధారణ, అలంకరణ వస్తువులను భీందేవుని సన్నిధిలో పెట్టి కోళ్ళు, మేకలను బలి ఇస్తారు. భీం దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం విందు భోజనాలతో కొలబొడి నిర్వహించి కార్యక్రమాన్ని ముగిస్తారు. ఆదివాసీ గూడేల్లో అంగరంగ వైభవంగా సాగే దండారీ సంబరం మొదలైంది. డప్పుల దరువులు, గజ్జెల మోతలు, గుస్సాడీ నృత్యాలతో అడవితల్లి మురిసి పోనుంది. ఆదివాసీల ఆరాధ్య దేవత ‘ఏత్మాసార్ పేన్’ పేరిట చేసే ప్రత్యేక పూజలతో దండారీ పండుగ ప్రారంభమైంది. దీపావళికి ముందు అశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబొడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు గూడేలన్నీ సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దండారిని ప్రత్యేక పండుగగా గుర్తించింది. – బజార్హత్నూర్ ఘనంగా జరుపుకుంటాం దీపావళికి పక్షం రోజుల ముందే అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఎంత పేద గిరిజనుడైనా ఈ పండుగకు ఇంటిని శుభ్రపరచడం, కొత్త బట్టలు కొనుక్కోవడం, పిండివంటలకు సామగ్రి సమకూర్చుకుంటారు. నెమలి ఈకలతో టోపీలు తయారు చేసుకుంటాం. దండారీ ఘనంగా జరుపుకుంటాం. – కనక లంకు మహాజన్, తుమ్ముగూడ, ఇంద్రవెల్లి పవిత్రమైన పండుగ మా ఆదివాసీ గోండు గిరిజనులకు దీపావళి పవిత్రమైన పండుగ. ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకుంటాం. గిరిజన దేవతలను, వన దేవతలను పూజిస్తాం. బంధువుల ఇళ్లకు వెళ్తాం. గుస్సాడీల థింసా నృత్యం, ఆడపడుచుల రేలారేరేలా నృత్యం ఆకట్టుకుంటాయి. – కొడప భీంరావ్ పటేల్, చింతలసాంగ్వీప్రోత్సాహం అందించాలి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం రూ.15 వేలు అందించింది. ఈ సంవత్సరం కూడా ప్రోత్సాహకం అందించాలని జిల్లా సార్మేడీలు, కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తాను కలిసి విన్నవించాం. – మేస్రం దుర్గు, జిల్లా సార్మేడి, ఉట్నూర్ -
బాసర ఆలయ హుండీ లెక్కింపు
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయ హుండీని మంగళవారం లెక్కించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అంజనాదేవి తెలిపారు. 83 రోజులకు రూ.81,69,099 నగదు, 91 గ్రాముల 500 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల 500 గ్రాముల మిశ్రమ వెండి, 79 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఈవో తెలిపారు. కార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త శరత్ పాఠక్, ఏఈవో సుదర్శన్ పర్యవేక్షకులు శివరాజ్, తదితరులు పాల్గొన్నారు. 108 ఈఎంటీకి ఉత్తమ సేవా పురస్కారంఉట్నూర్రూరల్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 108 సిబ్బందికి రాష్ట్ర ఎంఆర్ఐ సంస్థ అందించే ఉత్తమ సేవా పురస్కారానికి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ 108లో మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న గణేశ్ ఎంపికయ్యారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో పీవో ఖుష్బూ గుప్తా చేతుల మీదుగా పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సామ్రాట్, జిల్లా ఇన్చార్జి రాజశేఖర్, పైలట్ సుందర్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య
తిర్యాణి: కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామానికి చెందిన కల్పన (28)కు తిర్యాణి మండలంలోని గంభీరావుపేటకు చెందిన సైదం శేఖర్‌తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది. రెండేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో కల్పన పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించడంతో ఇటీవల మళ్లీ అత్తారింటికి వచ్చింది. సోమవారం మళ్లీ గొడవ జరగడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. తన కుమార్తె మృతికి అల్లుడే కారణమని మృతురాలి తల్లి దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
దండేపల్లి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసీనొద్దీన్ తెలిపిన వివరాల మే రకు మండలంలోని గుడిరేవు గ్రామానికి చెంది న పూసాల రాజు (36) ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. తరచూ భార్య రాజేశ్వరితో గొడవపడటంతో రెండు రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో మనస్తాపం చెందిన రాజు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చిట్టీడబ్బులకోసం వెళ్లిన వ్యక్తి చూడగా ఉరేసుకుని కని పించాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఐటీఐ గేట్‌కు తాళం వేసి నిరసన
మంచిర్యాలఅర్బన్: 2022–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన కోర్సు ఫీజు చెల్లించినప్పటికీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో మంగళవారం డింపి ఐటీఐ గేట్‌కు తాళం వేసి విద్యార్థులు నిరసన తెలిపారు. కళాశాల చైర్మన్ వచ్చారన్న సమాచారంతో వెళ్లి సర్టిఫికెట్లు అడిగితే దాటవేత సమాధానం ఇవ్వడంతో గేటు ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. పీడీఎస్‌యూ, ఏఐఎస్బీ, జేవీఎస్ విద్యార్థి సంఘాల నేతలు శ్రీకాంత్, వంశీ వారికి మద్దతు తెలిపారు. ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కళాశాల యజమానులను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లగా విద్యార్థులు, విద్యార్థిసంఘాల నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్ మధ్య డబ్బుల వివాదంతో సర్టిఫికెట్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాత్రి వరకు సర్టిఫికెట్ల సమస్య పరిష్కారంపై కొలిక్కిరాలేదు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకుని సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
పాఠశాల ఆవరణలో నాగుపాము కలకలం
నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని వెంకటపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం నాగుపాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం ఇంటర్వెల్ సమయంలో మూత్రశాలల సమీపంలో నాగుపామును గమనించిన విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులతో చెప్పా రు. ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని శాంతినగర్ కాలనీకి చెందిన స్నేక్‌క్యాచర్ గిరిగంటి అనిల్‌కు సమాచారం అందించడంతో చాకచక్యంగా పామును బంధించి అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ సందర్భంగా స్నేక్‌క్యాచర్ అనిల్‌ను అభినందించారు. -
దాడి కేసులో నలుగురు..
ౖజైపూర్: మండలంలోని వేలాలలో జరిగిన దాడి కేసులో నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణుచందర్ తెలిపారు. గ్రామంలో ప్యాగ రాజ సమ్మయ్య, అతని సోదరులకు 33 గుంటల భూమి ఉంది. ఆ భూమి విషయంలో అన్న మైసయ్య, అతని కుమారులు సమ్మయ్య, నగేష్, మల్లేశ్‌తో కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అందులో ఇటీవల మైసయ్య ఇల్లు నిర్మాణం చేపట్టగా రాజ సమ్మయ్య కుమారులు శ్రీనివాస్, సంతోష్, భార్య మల్లక్క భూమి వద్దకు వెళ్లి భూమిని పంచుకున్న తర్వాత ఇల్లు కట్టుకొమ్మన్నారు. ఈ విషయంలో సమ్మయ్య, నగేష్, మల్లేశ్, లక్ష్మి వారిపై దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
33వ రోజుకు కార్మికుల సమ్మె
ఉట్నూర్‌రూరల్: తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ ఐటీడీఏ కార్యాలయం ఎదుట కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న డైలీవేజ్, ఔట్సోర్సింగ్ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరుకుంది. మంగళవారం గిరిజన సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు మాట్లాడుతూ సమ్మె చేపట్టి 33 రోజులు కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మద్దతు తెలిపిన వారిలో కొలాం సేవా సంఘం రాష్ట్ర అఽ ద్యక్షుడు కొడప సోనేరావు, కుంర రాజు, భీంరావు, సంజయ్, విజయ్, బీఆర్ఎస్ నాయకులు కొమ్ము విజయ్, కాటం రమేశ్, ధరణి రా జేశ్, బాజీరావు, దావుల రమేశ్ ఉన్నారు. -
సక్రమంగా తాగునీటిని సరఫరా చేస్తాం
కౌటాల(సిర్పూర్): గ్రామాలకు సక్రమంగా మిషన్ భగీరథ తాగునీటిని సరఫరా చేస్తామని మిషన్ భగీరథ ఎస్ఈ ఎ.రవీందర్ అన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘భగీరథ బంద్..!’ కథనానికి అధికారులు స్పందించారు. వీర్ధండి గ్రామంలోని మిషన్ భగీరథ నీటి సరఫరా పైపులు, నల్లాలను మంగళవారం పరిశీలించారు. ప్రతీ ఇంటింటికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఇబ్బందులు ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్, డీఈఈ వి.రాజేశ్, ఏఈఈ సాయిసిద్ధార్థ, ఖాజా ముజహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఎఫెక్ట్ -
పాతాళ గంగ ౖపైపెకి!
ఆసిఫాబాద్: జిల్లాలో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో పాతాళ గంగ పైకొచ్చింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సగటున ఒక మీటర్ నీటిమట్టం పెరిగింది. కాగా, జిల్లాలో ప్రతీ ఏడాది 0.5 నుంచి 0.7 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోతున్నాయి. ఐదేళ్ల క్రితం గ్రౌండ్‌వాటర్ 8 నుంచి 10 మీటర్ల లోతులోనే ఉండేవి. కొన్నేళ్లుగా ఎండలు పెరగడం, సాగు కోసం అత్యధికంగా బోర్లు వినియోగించడంతో భూగర్భ జలాలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ఈ ఏడాది మే నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన వర్షాలకు పాతాళ గంగ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మే నుంచి పెరుగుదలజిల్లాలోని 15 మండలాల్లో భూగర్భజల మట్టాలను కొలిచేందుకు 31 ప్రాంతాల్లో ఫిజోమీటర్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో గతేడాది నవంబర్‌లో సగటున భూ గర్భ జలాలు 6.13 మీటర్ల లోతులో ఉండగా, ఈ యేడాది 4.57 మీటర్లకు పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో భూగర్భ జలాలు 5.91 మీటర్ల లోతులో ఉండగా, ఈ ఏడాది 3.85 మీటర్లకు చేరుకున్నాయి. ఈ ఏడాది మే నుంచి పెరుగుదల కనిపిస్తోంది. మేలో 9.53 మీటర్లు ఉండగా, జూన్‌లో 8.48, జూలై 5.91, ఆగస్టు 4.57, సెప్టెంబర్‌లో 3.85 మీటర్లకు చేరాయి. నీటి సంరక్షణ చర్యలతోనే.. అధిక వర్షాలతోనే జిల్లాలో భూ గర్భ జలాలు పెరిగాయి. నీటి సంరక్షణకు వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవడం, ప్రాంతాన్ని బట్టి చెరువులు, ఇంకుడు గుంతలతో పాటు నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నాం. – సుహాసిని, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారిసెప్టెంబర్లో భూగర్భ జల మట్టం వివరాలుప్రాంతం లోతు(మీటర్లలో) ఆసిఫాబాద్ 9.86 ఆసిఫాబాద్– 2 7.35 కొమ్ముగూడ 0.17 బెజ్జూర్ 1.70 రెబ్బెన 1 పాపన్‌పేట్ 2.60 దహెగాం 15.15 రాసిమెట్ట 0.55 సిర్పూర్(యూ) 0.57 జంబుగ 4 కాగజ్‌నగర్ 0.50 భీమన్‌గోంది 6.43 కెరమెరి 3.30 ఝరి 4.85 కౌటాల 1.67 లొద్దిగూడ 0.46 రవీంద్రనగర్ 0.65 కర్జవెల్లి 0.99 ఎల్కపల్లి 13.40 రెబ్బెన–1 3.29 రెబ్బెన– 2 4.72 సిర్పూర్(టి) 0.02 లోనవెల్లి 1.21 చింతకుంట 5.59 భీమ్‌పూర్ 1.60 పంగిడిమాదర 2.70 తిర్యాణి 8.25 సవాతి 5.90 వాంకిడి 5.05 కనర్గాం 3.66 ఇందాని 2.01 అధిక వర్షపాతం నమోదు..భూగర్భ జలాల పెంపునకు ప్రభుత్వం వర్షపు నీటి సంరక్షణ, చెరువుల్లో పూడికతీత పనులతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. గ్రామాల్లో నీటి గుంతలు నిర్మిస్తున్నారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్, అమ్మలమడుగు, తదితర జలాశయాల్లో నీటి నిల్వలతో భూగర్భ జలాలు పెరిగినట్లు తెలుస్తోంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 1025.6 మిల్లీమీటర్లు కాగా 1175.1 మిల్లీమీటర్లు కురిసింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1076.1 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటివరకు 1364.8 మిల్లీమీటర్లు కురిసింది. 27 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, ఇది భూగర్భ జలాల పెంపునకు దోహదపడింది. -
సమ్మె వీడని కార్మికులు
పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి(డైలీ వేజ్) కార్మికులు సమ్మె వీడటం లేదు. ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె 33వ రోజుకి చేరింది. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిత్యం నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయం వద్ద 72 గంటల నిరసన సైతం చేపట్టారు. మరోవైపు దసరా సెలవులు ముగియడంతో విద్యార్థులు వసతిగృహాలకు చేరుకుంటున్నారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో వసతిగృహాల నిర్వహణకు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య పనులు, విద్యార్థులకు భోజనం వండటంతోపాటు ఇతర పనులు చేపట్టేందుకు తాత్కాలిక కార్మికులను నియమించుకుంటున్నారు. నెలరోజులుగా సమ్మెబాటగిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు జిల్లా వ్యాప్తంగా 46 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారు. 11,560 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆయా వసతిగృహాల్లో పారిశుద్ధ్య పనులు, భోజనం వండటం, ఇతర పనుల కోసం సుమారు 15 ఏళ్ల క్రితం ఔట్సోర్సింగ్ విధానంలో కార్మికులను నియమించారు. ప్రస్తుతం జిల్లాలో డైలీవేజ్ కార్మికులు 410 మంది పనిచేస్తున్నారు. ఐటీడీఏ పరిధిలోని హాస్టళ్లలో పనిచేస్తున్న వీరంతా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2023లో సమ్మె బాట పట్టారు. అధికారులు, ప్రభుత్వం ఇచ్చిన హామీతో అప్పుడు సమ్మె విరమించారు. హామీలు అమలు చేయకపోవడంతో తిరిగి సెప్టెంబర్ 12 నుంచి నిరవధిక సమ్మెబాట చేస్తున్నారు.ప్రధాన డిమాండ్లు.. -
అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా
ఆసిఫాబాద్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చూడాలన్నారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాల్లో అధికా రులు, సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని సూచించారు. సస్పెక్ట్ షీట్, రౌడీ షీట్లలో నమోదైన వ్యక్తులతోపాటు గంజాయి వంటి మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ భూముల్లో గంజాయి సాగు నిర్మూలన కోసం పోలీస్ సెర్చ్ టీములు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సైబర్ నేరా ల నిర్మూలనకు అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. దీపావళి నేపథ్యంలో బాణసంచా దు కాణాలు ఏర్పాటు చేసే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదా లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఏఎ స్పీ చిత్తరంజన్, కాగజ్‌నగర్ డీఎస్పీ వహిదుద్దీన్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
హోరాహోరీగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు హోరాహోరీగా సాగాయి. డీఎస్వో షేకు జెండా ఊపి పోటీలు ప్రారంభించారు. అనంతరం ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ జిల్లాస్థాయి పో టీలకు 300 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. 100, 200, 400 మీటర్ల ర న్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌ఫుట్ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 60 మందిని జోనల్‌స్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, పీఈటీలు శారద, హరీశ్, రాకేశ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వ్యాధుల కాలం.. టీకాలే రక్ష!
కౌటాల(సిర్పూర్): ఏటా చలికాలంలో పశువులకు వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పశుసంవర్థక శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనుంది. ప్రత్యేక కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని, పశువులకు టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలుగాలికుంటు వ్యాధి గేదెలు, ఆవులకు వైరస్‌తో సో కుతుంది. వ్యాధి సోకిన పశువులు బక్కచిక్కి అల్సర్ బారినపడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదా లు, నాలుకతోపాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. మేత, నీళ్లు సరిగా తీసుకోవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో వ్యాధి సోకిన పశువులకు ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించాలి. పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ వాటర్‌తో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు యాంటీ బయాటిక్స్ మందులు, వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి బీ కాంప్లెక్స్ మందులు వాడాలి. అలాగే గాలికుంటు వ్యాధిపై నిర్లక్ష్యం వహించకుండా పశు సంవర్థక శాఖ వైద్యుల సలహా మేరకు క్రమంతప్పకుండా ఏడాదికి రెండు సార్లు టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన పశువులను ఇతర పశువులతో కలిసి ఒకేచోట ఉంచొద్దు. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి క్రిమికీటకాల నివారణకు చర్యలు చేపట్టారు. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. ఒకవేళ పశువు చనిపోతే గోతిలో బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలని పశువైద్యులు సూచిస్తున్నారు. నవంబర్ 14 వరకు టీకాలుజిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 18 ప్రాథమిక పశువైద్యశాలలు ఉన్నాయి. ఏడు సబ్ సెంటర్లు ఉన్నాయి. ఆవులు 2.32 వేలు, గేదెలు 41 వేలు ఉన్నాయి. వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమతో ఆర్థికంగా బలపడుతున్న రైతులు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏటా రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. జిల్లాలోని 75 మందికి పైగా సిబ్బంది ఈ నెల 15 నుంచి నవంబర్ 14 వరకు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయనున్నారు. గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు టీకాలు వేస్తారు. ఉచితంగా టీకాలు వేస్తాం రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ నెల 15 నుంచి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించనున్నాం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 14 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్య సిబ్బందికి సమాచారం అందించాలి. – సురేశ్, జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి -
బీసీ జేఏసీ చైర్మన్‌గా రమేశ్
ఆసిఫాబాద్: బీసీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా జిల్లా కేంద్రానికి చెందిన రూప్నర్ రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్‌గా ప్రణయ్, వైస్ చైర్మన్లుగా ఖాండ్రే విశాల్, మాచర్ల శ్రీనివాస్, గాజుల జక్కయ్య, నికోడె రవీందర్, దీపక్ ముండే, పొన్న రమే శ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కోట వెంకన్న, బొర్కుటె తిరుపతి, లహుకుమార్, మేరాజ్, పురుషోత్తం బాలేశ్, రాపర్తి కార్తీక్, మామిడి కిరణ్, పర్రె గిరి, నాందేవ్, నాగపురి మారుతి, షేక్ అసద్, ఉమేందర్ ఎన్నికయ్యారు. -
కాగజ్‌నగర్ అడవుల్లోకి బెబ్బులి
దహెగాం/కాగజ్‌నగర్‌రూరల్: దహెగాం మండలంలోని పెసరికుంట, బీబ్రా సమీపంలో సోమవారం సంచరించిన పెద్దపులి కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోకి వెనుదిరిగి వెళ్లిపోయింది. ఇటీవల మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ పెద్దపులి జాడను ఈజ్గాం, అనుకోడ, గన్నారం, మండువ అటవీ ప్రాంతంలో మొదట గుర్తించారు. రెండు రోజుల క్రితం రాస్పెల్లి, కొత్తసార్సాల, పాతసార్సాల మీదుగా పెద్దవాగు దాటి బీబ్రా ప్రాంతానికి వెళ్లింది. పెసరికుంట, బీబ్రా గ్రామాల మీదుగా భీమిని మండలం చినగుడిపేట వరకు చేరుకుని మళ్లీ మంగళవారం పెద్దవాగు దాటి రాస్పెల్లి బీట్ పరిధిలోని అడవుల్లోకి వెళ్లినట్లు ఎఫ్ఎస్వో సద్దాం తెలిపారు. రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు గుంపులుగా వెళ్లాలని ఆయన సూచించారు. గ్రామాల్లో డప్పు చాటింపురాస్పెల్లి, కొత్తసార్సాల, పాత సార్సాల, చేడ్వాయి, దరోగపల్లి, గజ్జిగూడ, మోసం, ఆరెగూడ, బాపూనగర్, కడంబ, గన్నారం తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు డప్పు చాటింపు వేస్తున్నారు. పులి జాడను కనుగొనేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు నిఘా ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఆర్వో అనిల్‌కుమార్ వెల్లడించారు. పులి చాలా చురుకుగా ఉందని సీసీ కెమెరాలు అమర్చిన చోటు నుంచి కాకుండా దాని వెనుకవైపు నుంచి వెళ్తుందని తెలిపారు. సల్పలగూడలో పులి సంచారం! ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మండలం ఈదులవాడ పంచాయతీ పరిధిలోని సల్పలగూడ భీమన్న ఆలయం వద్ద మంగళవారం సాయంత్రం పులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో పంచా యతీ కార్యదర్శి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డప్పు చాటింపు వేయించారు. కొన్నిరోజులుగా తి ర్యాణి మండలంలో పులి సంచరిస్తోందని, అదే ఇ టువైపు రావొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. -
దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్: భూసమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావులతో కలిసి తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, రహదారుల నిర్మాణాల్లో ముంపునకు గురైన భూముల వివరాలు, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు సీలింగ్ భూములు, నిషేధిత జాబితాలోని భూముల వివరాలతో స్పష్టమైన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి సంబంధిత వారసులు, దరఖాస్తుదారుడికి నోటీసులు అందించాలని సూచించారు. సాదాబైనామా దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘బెస్ట్ అవైలబుల్’ విద్యార్థులపై దృష్టి సారించాలిఆసిఫాబాద్రూరల్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వి ద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించాలన్నారు. వస తి గృహాల్లో సౌకర్యాలను పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడారు. సమావేశంలో డీటీడీవో రమాదేవి, మైనార్టీ సంక్షేమ శాఖ అధి కారి నదీమ్, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ అధికా రి మండల్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులు చేపట్టాలని మంత్రికి వినతి
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్(టి)లోని సోషల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాల భవనాల కు మరమ్మతులు చేపట్టాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్‌బాబు వినతిపత్రం అందించారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంగళవారం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సమస్యను వివరించారు. గురుకుల పాఠశాలలో చదువుతు న్న 500 మంది విద్యార్థులు విద్యా సంవత్స రం నష్టపోకుండా చూడాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి మరమ్మతుల కు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఉన్నారు. -
నిబంధనలు పాటించకుంటే చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: తూకాల్లో నిబంధనలు పాటించకపోతే వ్యాపారులపై చర్యలు తప్పవని తూనికలు, కొలతల శాఖ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథి హెచ్చరించారు. సోమవారం కాగజ్‌నగర్ పట్టణంలోని బంగారు దుకాణాలు, పెట్రోల్ బంక్‌లు, ఇతర దుకాణలను తనిఖీ చేశారు. వ్యాపారులు వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, రాళ్లు ఉపయోగించే కాంటాలకు గడువు తీరిన తర్వాత సీలు వేయించుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించకుండా తప్పుడు తూకాలతో మోసాల కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. విని యోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది సుందర్రావు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
జోనల్‌స్థాయి పోటీలకు 12 మంది ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజ న ఆదర్శ క్రీడాపాఠశాలలో సోమవారం ఎస్ జీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్ మాట్లాడుతూ అండర్–17 జిల్లాస్థాయి బాలుర వాలీబాల్ పోటీలకు 60 మంది క్రీడాకారులు హాజరుకాగా, 12 మంది జోనల్‌స్థాయికి ఎంపికయ్యారని పేర్కొన్నారు. ఈ నెల 14న నిర్మల్ జిల్లాలో జోనల్‌స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం కర్నూ, పీడీ, పీఈటీలు మీనారెడ్డి, రాజయ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, సుభాశ్, రాకేశ్, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపారిపై కేసు నమోదు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మద్యం టెండర్లలో నిబంధలకు విరుద్ధంగా అడ్డదారుల్లో అప్పులు ఇస్తూ దందా చేయాలని ఎత్తుగడ వేసిన వ్యాపారులపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నెల 8న ‘సాక్షి‘లో ‘అప్పులిస్తా.. దందా చేస్తాం!’అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లలో రూ.లక్షల కొద్ది అప్పులు ఇచ్చి, లక్కీ లాటరీలో షాపు వచ్చినా, రాకున్నా, నిర్వాహకులే లాభం పొందేలా పది కండీషన్లలో ఓ ఒప్పంద పత్రం విడుదల చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ జరిపి కాగజ్‌నగర్‌కు చెందిన వ్యాపారి గజ్జల శ్రీనివాస్‌పై రెండు రోజుల క్రితం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డబ్బుల పంపిణీ, బహుమతుల ఆశ చూపిస్తూ సభ్యులను చేర్చుకోవడం వంటివి నిషేధం. ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీం చట్టంలో సెక్షన్ 3, 4 కింద ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు ఇదే తరహాలో మరికొందరు రాజకీయ పార్టీల్లో ఉన్న వ్యాపారులు సైతం అమాయకులకు మద్యం టెండర్ల పాల్గొనేలా ముందుగా అప్పు రూపంలో ఇస్తూ తర్వాత తీసుకునే విధంగా ఎత్తువేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం అంతా లోలోపల నడుపుతున్నట్లు సమాచారం. ఎఫెక్ట్ -
క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని బెల్లంపల్లి ఏరియా ఫైనాన్స్ మేనేజర్ రవికుమార్ అన్నారు. డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా సోమవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నియర్ బై వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిరంతర సాధనతో నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రావు, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ గౌరవ కార్యదర్శి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, పీఈటీ భాస్కర్ పాల్గొన్నారు. -
గంజాయిపై డ్రోన్ నిఘా
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని కెరమెరి మండలం అంతాపూర్ పంచాయతీ నారాయణగూడ గ్రామ శివారులో ఆదివారం రాష్ట్రంలో తొలిసారి పోలీసులు డ్రోన్ సాంకేతికత వినియోగించి పంట చేలలో సాగుచేస్తున్న పత్తిమొక్కలను గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ ఆధ్వర్యంలో డ్రోన్ సాయంతో గాలించి ఒక్కరోజే 51 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు. నారాయణగూడకు చెందిన రాథోడ్ బాలాజీపై కేసు నమోదు చేశారు. దహెగాం(సిర్పూర్): జిల్లాలో గంజాయి సాగుపై పోలీసుశాఖ ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రంలో తొలిసారి డ్రోన్ సాయంతో గాలించి పత్తి చేలలో పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తిస్తున్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పట్టుకోవడం గతంలో పోలీసులకు కష్టంగా ఉండేది. ఎవరైనా సమాచారం ఇస్తే దాడులు చేసి మొక్కలు స్వాధీనం చేసుకుని నిందితులపై కేసులు నమోదు చేసేవారు. కానీ ప్రస్తుతం పోలీసులు సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే కెరమెరి మండలం నారాయణగూడ గ్రామ శివారులో 51 గంజాయి మొక్కలను డ్రోన్ ద్వారా గుర్తించారు. ఏఎస్పీ చిత్తరంజన్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేస్తూ పత్తి చేలను పరిశీలించారు. అలాగే లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో 35 గంజాయి మొక్కలను పట్టుకున్నారు. వెయ్యికి పైగా మొక్కలు పట్టివేతజిల్లాలో మారుమూల మండలాల్లో వివిధ పంటల్లో గంజాయిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. కెరమెరి, జైనూర్, లింగా పూర్, చింతలమానెపల్లి, కౌటాల, రెబ్బెన, దహెగాం తదితర మండలాల్లో సాగు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది ఇప్పటివరకు 57 గంజాయి కేసులు నమోదు చేశారు. వెయ్యికి పైగా మొక్కలను స్వాధీనం చేసుకోగా, రూ.1.08 కోట్ల విలువైన 14.7 కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. గంజాయి సాగు, క్రయవిక్రయాల గురించి సమాచారం ఇస్తే పారితోషకం ఇస్తామని ఎస్పీ ప్రకటించారు. తద్వారా సాగు గురించి మరింత సమాచారం తెలుస్తుందని భావిస్తున్నారు. అనర్థాలపై అవగాహనగంజాయికి అలవాటు పడితే జరిగే అనర్థాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా రు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలతోపాటు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకం, విని యోగం చట్టపరంగా నేరమని వివరిస్తున్నారు. అక్ర మ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ అవసరమైతే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గంజాయి రహిత జిల్లా సాధనలో యువత, ప్రజలు కలిసి రావాలని పిలుపునిస్తున్నారు. మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. డ్రోన్ సాంకేతిక సహాయంతో గంజాయి సాగును గుర్తిస్తున్నాం. ఆదివారం కెరమెరి మండలం నారాయణగూడలోని పంట చేలలో డ్రోన్‌తో గంజాయి మొక్కలు గుర్తించి స్వాధీనం చేసుకున్నాం. సాగు, రవాణా, వినియోగం, అమ్మకాలు జరిపే వారిపై నిఘా పెంచాం. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. యువత, ప్రజలు గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారమైనా 8712670551, డయల్ 100 నంబర్లకు తెలియజేయాలి. – కాంతిలాల్ పాటిల్, ఎస్పీ -
బీసీ సంఘాలు ఏకతాటిపైకి రావాలి
ఆసిఫాబాద్‌అర్బన్: హక్కుల సాధనకు బీసీలు ఏకతాటిపైకి రావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. 42శాతం రిజర్వేషన్లు సాధించుకునేందుకు పోరాడాలని కోరారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం భవనంలో నిర్వహించే బీసీ జేఏసీ ఏర్పాటు సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్, నాయకులు బాల్దారపు మధుకర్, కమలాకర్ పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి ఎంపీడీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, పీఎం జన్మన్ పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందన్నారు. మండల కేంద్రాల్లో చేపట్టిన మోడల్ ఇళ్లు పూర్తిచేయాలన్నారు. పీఎం జన్మన్ పథకం కింద 2,167 మంది లబ్ధిదారులను గుర్తించామని తెలిపారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తిచేయాలిజిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, రోడ్డు భవనాలు, గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులు, కల్వర్టులు, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ మహిళా శక్తి భవనాన్ని డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీటీడీవో రమాదేవి, డీపీవో భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలు వేగంగా పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కెరమెరి మండలం గోయగాంకు చెందిన ముస్లిం మైనార్టీ మహిళలు తమ గ్రామం ఏజెన్సీ పరిధిలో ఉన్నందున గిరిజనేతర గ్రామంలో ఇళ్ల స్థలాలను ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూమికి పట్టా మంజూరు చేయాలని దహెగాం మండలం బీబ్రా గ్రామానికి చెందిన మేడి తిరుపతిగౌడ్ కోరాడు. రెబ్బెన మండలం దేవులగూడ గ్రామం నుంచి వెళ్తున్న జాతీయ రహదారిపై యూటర్న్ అవకాశం కల్పించాలని గ్రామస్తులు అధికారులకు దరఖాస్తు సమర్పించారు. రెబ్బెన మండలం పుంజుమేర గ్రామంలోని పొలాలకు వెళ్లేందుకు దారి సౌకర్యాన్ని కల్పించాలని రైతులు కోరారు. జైనూర్ మండలం రాసిమెట్ట పంచాయతీ పరిధిలోని సుంగాపూర్‌లో సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కొలాం గిరిజనులు విన్నవించారు. తన పట్టా భూమిలో ఇతరులు అక్రమంగా ఫెన్సింగ్ వేశారని, అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని తిర్యాణి మండలం నాయకపుగుడ గ్రామానికి చెందిన మార్నేని లక్ష్మి అర్జీ అందించింది. పింఛన్లు మంజూరు చేయాలి తమ భర్తలు వివిధ కారణాలతో మరణించారని, ప్రభుత్వం వితంతు పింఛన్ మంజూరు చేయాలని వాంకిడి మండలం చౌపన్‌గూడ గ్రామానికి చెందిన జమ్ముబాయి, ఆత్రం ఆయుబాయి, మడావి భీంబాయి, ఆత్రం ముత్తుబాయి కోరారు. ఇప్పటికే సంబంధిత అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ మంజూరు చేయాలి. – చౌపన్‌గూడ మహిళలు -
‘కాగజ్‌నగర్’లో పులి సంచారం
కాగజ్‌నగర్‌రూరల్: కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో అధికారులు డప్పుచాటింపు ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం పలు గ్రామాల్లో పులి సంచారంపై డప్పు చాటింపు నిర్వహించారు. గస్తీ బృందాలను ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. అయితే కెమెరాల సహాయంతో కదలికలను పర్యవేక్షిస్తున్నప్పటికీ పెద్దపులి జాడ చిక్కడంలేదు. దీంతో పాదముద్రల ఆధారంగా బెబ్బులి ఏ వైపునకు వెళ్తుందో అంచనా వేస్తున్నారు. పెద్దపులి ఎవరికై నా కనిపిస్తే తక్షణమే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. రైతులు ఒంటరిగా రాత్రిపూట పంట చేలకు వెళ్లొద్దని, మధ్యా హ్న సమయంలో గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. కాగా పాదముద్రల ఆధారంగా డివిజన్‌లోకి కొత్తపులి వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి పులి కాగజ్‌నగర్ డివిజన్‌లోకి చేరినట్లు నిర్ణయానికి వచ్చి కదలికలపై నిఘా పెట్టారు. జాడ కనుగొనేందుకు ఆయా ప్రాంతాల్లో ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయినా ఇప్పటివరకు ఏ కెమెరాలోనూ పులి ఆనవాళ్లు చిక్కలేదు. కొత్త పులి జాడను కనుగొనేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని కాగజ్‌నగర్ ఎఫ్ఆర్వో అనిల్‌కుమార్ తెలిపారు. -
తెరుచుకోని కమ్మర్గాం గిరిజన ఆశ్రమ బడి
పెంచికల్పేట్(సిర్పూర్): మండలంలోని కమ్మర్గాం గిరిజన ఆశ్రమ పాఠశాల దసరా సెలవులు ముగిసి పదిరోజులు గడిచినా నేటికీ తెరుచుకోలేదు. ఉపాధ్యాయుల తీరుతో విద్యార్థులు నష్టపోతున్నారు. కమ్మర్గాం ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు వందమంది చదువుకుంటున్నారు. దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో నాలుగు రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వస్తున్నా.. హెచ్ఎం రవికుమార్‌తోపాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. టీచర్లు పాఠశాలకు రాకపోవడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హెచ్ఎం రవికుమార్‌ను సంప్రదించగా.. సమావేశంలో పాల్గొనేందుకు ఆసిఫాబాద్‌కు వెళ్లినట్లు సమాధానం ఇచ్చారు. అలాగే ఏటీడబ్ల్యూవో శ్రీనివాస్‌ను సంప్రదించగా జర్నీలో ఉన్నట్లు తెలిపారు. -
‘పార్టీ బలోపేతానికి కృషి’
ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, గ్రూపు విభేదాలు నివారించే దిశగా డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు నరేశ్‌కుమార్ అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆ దివారం జిల్లా కేంద్రంలోని రోజ్‌గార్డెన్, కాగజ్‌నగర్‌లోని రన్ ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. సాయంత్రం ఆసిఫాబాద్ అ టవీశాఖ అతిథిగృహంలో మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం అన్నివర్గాలతో సమావేశమవుతామని తెలిపారు. గ్రూపు తగాదా లు నివారించే ప్రయత్నం చేస్తామన్నారు. అధ్యక్ష పదవికి ఇప్పటివరకు 25కు పైగా నామినేషన్లు వచ్చాయని, ఇందులో ఆరు నామినేషన్లను కేసీ వేణుగోపాల్ నేతృత్వంలోని జనశక్తి ఆర్గనైజేషన్‌కు అందించామని తెలిపారు. అహ్మదాబాద్ సమావేశంలో జిల్లా అధ్యక్షుల ఎన్నిక చేపడతామని పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు అనిల్‌కుమార్, కోఆర్టినేటర్ శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: డీసీసీ అధ్యక్ష ఎన్నికను ఎలాంటి అపోహలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని ఏఐసీసీ ప్రతినిధి డాక్టర్ నరేష్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో పీసీసీ పరిశీలకులు శ్రీనివాస్, అనిల్‌కుమార్, జ్యోతి, పీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణక్క, ఎమ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావ్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం స క్కుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆది వారం ఉదయం 10:30 గంటలకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ గెస్ట్‌హౌజ్‌లో డీసీసీ సమావేశం, మధ్యాహ్నం సిర్పూర్ నియోజకవర్గ సమావేశం, 13న జిల్లా కేంద్రంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం, 14న సాధారణ ప్రజలతో పా టు మేధావుల అభిప్రాయ సేకరణ, 19న పోటీలో ఉన్న అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఒత్తిళ్లకు, పైరవీ లకు తావులేకుండా జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. రెండు జిల్లాల్లో పర్యటించి నివేదికను అధిష్టానానికి అందించనున్నట్లు పేర్కొన్నారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గుండా శ్యాం, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాదెవేణి మల్లేశ్, నాయకులు అనీల్‌గౌడ్, అబ్దుల్లా, మునీర్ పాల్గొన్నారు. డీసీసీల ఎంపికకు కసరత్తు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి జిల్లాలో డీసీ సీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ), నగర అధ్యక్షుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలైంది. ఆయా జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సరైన నా యకులను ఎంపిక చేసేందుకు పార్టీ ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. ఆదిలాబాద్, నిర్మ ల్ జిల్లాలకు ఎం.అనిల్‌కుమార్‌యాదవ్(ఎంపీ), సీహెచ్.రాంభూపాల్, లకావత్ ధన్వంతి, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, కుమురంభీంఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, రాష్ట్ర నాయకులు డా.పులి అనిల్‌కుమార్, అడువాల జ్యోతి, బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌ను ని యమించింది. పరిశీలకులు నాలుగు జిల్లాల పరిఽ దిలోని పది నియోజకవర్గాల్లో పర్యటించి, నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రస్తుతం పరిశీలకులు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పరిశీలకులకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఆసక్తి గల నాయకుల నుంచి వివరాలు సేకరించడంతోపాటు సామర్థ్యం, డీసీసీ ఎంపికలో జిల్లా పరిస్థితులను అంచనా వేస్తూ అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుల ఖరారులో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన కీలకంగా మారింది. -
గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లించాలి
కాగజ్‌నగర్‌రూరల్: గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. శనివారం మండలంలోని బలగాల మైనార్టీ రెసిడెన్సియల్ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెలలు గడుస్తున్నా వేతనాలు రాకుండా గురుకుల ఉపాధ్యాయులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలని, రెగ్యులర్ స్కేల్ అమలు చేయాలని, గెస్ట్, పార్ట్‌టైం ఉపాధ్యాయులకు 12 నెలల వేతనాలు మంజూరు చేయాలని, మినిమం టైం స్కేల్ వర్తింప జేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాజ్‌కమలాకర్‌రెడ్డి, కాగజ్‌నగర్ మండల అధ్యక్షుడు మైపాల్, జిల్లా కమిటీ సభ్యుడు మహేష్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు భవన నిర్మాణం చేపట్టాలి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలో నూతన కోర్టు భవన నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి భీమపాక నగేశ్‌కు వినతిపత్రం అందజేశారు. మంచిర్యాలలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ సందర్భంగా విచ్చేసిన ఆయనను స్థానిక న్యాయవాదులు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రూ.12 కోట్లతో కోర్టు భవన సముదాయాలు మంజూరు చేయగా జిల్లాకు మాత్రం నిధులు కేటాయించలేదన్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కోర్టు నిర్మాణానికి కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం న్యాయమూర్తిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక న్యాయవాదులు బోనగిరి సతీశ్‌బాబు, నరహరి, ముక్త సురేశ్, రాజీవ్‌రెడ్డి, జగన్మోహన్ రావు, రామకృష్ణ, సత్యశ్రీలత, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు. -
టీఏ, డీఏలు వెంటనే విడుదల చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల లచ్చిరాం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యే విధంగా ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు మంజూరు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేయడం బాధాకరమన్నారు. సమావేశంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు భానుప్రకాష్, ప్రధాన కార్యదర్శి సదాశివ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, రాష్ట్ర బాధ్యులు రాంరెడ్డి, దామోదర్, కిరణ్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
రెబ్బెన: క్రీడాకారులు పోటీల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించాలని బెల్లంపల్లి ఏరియా ఎస్టేట్స్ అధికారి వి.సాగర్ అన్నారు. శనివారం గోలేటిలోని భీమన్న స్టేడియంలో 92వ డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా డిపార్టుమెంట్ బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపు ఓటములను పట్టించుకోకుండా నిరంతరం సాధన చేస్తే విజయాలు సొంతం అవుతాయన్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగ క్రీడాకారులు మంచి క్రీడా నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాలన్నారు. అనంతరం నిర్వహించిన పోటీల్లో ఖైరిగూడ పీవో జట్టుపై ఎస్వోటూ జీఎం జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమాల్లో సీనియర్ పర్సనల్ అధికారి డి.ప్రశాంత్, ఏఐటీయూసీ నాయకులు చంద్రశేఖర్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేష్, జనరల్ క్యాప్టెన్ కిరణ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
ఓసీపీలో ఉద్రిక్తత
శ్రీరాంపూర్: వేతనాలు చెల్లించాలని డిమాండ్ చే స్తూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ కాంట్రాక్టు కార్మికులు శనివారం ఆందోళనను ఉధృతం చేశారు. బొగ్గు ఉత్పత్తిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీరాంపూర్ ఓసీపీలో ఓబీ పనులు నిర్వహించే సీఆర్ఆర్ సంస్థ నెలన్నర క్రితం పనులు నిలిపివేసింది. నాలుగు నెలల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు క్వారీలోకి దిగి వాహనాలను అడ్డుకున్నా రు. అనంతరం ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే టెంటు వేసుకుని భోజ నాలు చేసి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు. అధికారులపై ఆగ్రహం.. కాంట్రాక్ట్ కార్మికులతో శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్, ఎస్వోటు జీఎం సత్యనారాయణ, ఏజెంట్ రాజేందర్, ఓసీపీ పీవో వెంకటేశ్వర్లు, మేనేజర్ ఐ.శ్రీనివాస్ ఇతర అధికారులు చర్చించారు. కంపెనీ పరిధిలోని చర్యలన్నీ తీసుకుంటున్నామని చెప్పినా కార్మికులు వినలేదు. జీఎంను ఘెరావ్ చేసి రోడ్డుపైనే నిర్బంధించారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ తమను ఇబ్బందులకు గురి చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదంటూ రాత్రి వరకు అధికారులను ఎటూ కదలనీయకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. కంపెనీ జీపు కమాన్ బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా కార్మికులు అడ్డుకుని దాడికి యత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీ సెక్యూరిటీ గార్డులను పెద్దఎత్తున మోహరించారు. కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు జీతాలు ఇవ్వకుండా మోసం చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని కంపెనీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని కార్మికులు పట్టుబట్టారు. దీంతో ఓసీపీ పీవో పేరుతో సదరు కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఆర్ఆర్ సంస్థ కాంట్రాక్ట్ కార్మికులు ఐత కిష్టయ్య, జెట్టి రమేశ్, పెద్దపల్లి సురేశ్, జక్కుల రాజలింగు, సిరిపురం శ్రీను, సన్నిగౌడ్, బొడ్డు తిరుపతి, తోట రాజేశ్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. -
మళ్లీ సాగునీటి సంఘాలు!
ఆసిఫాబాద్‌అర్బన్: వ్యవసాయ రంగానికి సాగునీటిని అందించేందుకు గతంలో సంఘాల ఆధ్వర్యంలో పర్యవేక్షణ ఉండేది. కానీ 16 సంవత్సరాలుగా సంఘాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పర్యవేక్షణ లోపించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఈ విషయాన్ని ప్రకటించారు. సాగునీటి సంఘాల ఏర్పాటుతో మిషన్ కాకతీయ అధికారులకు పనిభారం తగ్గడమే కాకుండా నీటి వనరుల పర్యవేక్షణ మెరుగుపడనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు, ప్రాజెక్టులు, డిస్ట్రిబ్యూటరీల వారీగా నీటి వినియోగదారుల సంఘాలు ఉండేవి. ఆయా చెరువులు, ప్రాజెక్టులను వారే పర్యవేక్షించేవారు. వాటి పరిధిలో ఏంజరిగినా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. సత్వర పరిష్కారానికి కృషి చేసేవారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు. చెరువులు, ప్రాజెక్టుల వద్ద ఏ పని జరిగినా అధికారుల పర్యవేక్షణలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. ఫలితంగా నీటి వనరుల సమస్యలను గుర్తించడంలో జాప్యం జరిగి నష్టం వాటిల్లుతోంది. అంతే కాకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడం లేదు. అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన కాల్వల్లో ఆశించిన స్థాయిలో సాగునీరు రావడం లేదు. అదే సంఘాలు ఉంటే సభ్యులుగా ఉండే రైతులు,అధికారుల సమన్వయంతో ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. 16 ఏళ్లుగా ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం.. జిల్లాలో వంద ఎకరాల ఆయకట్టు, అంతకంటే ఎక్కువగా ఉన్న చెరువులు మొత్తం 544 ఉన్నాయి. ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలో 231 చెరువుల కింద 46,571 ఎకరాల సాగు భూమి ఉండగా, కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 313 చెరువుల పరిధిలో 36,525 ఎకరాలు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో వంద ఎకరాల ఆయకట్టు ఉన్న ప్రధాన చెరువులకు సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశారు. వాటి పదవీకాలం 2008లో ముగిసింది. అప్పటి నుంచి మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినా నీటి సంఘాల ఎన్నికల ఊసెత్తలేదు. గత ప్రభుత్వ హయంలో చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. కానీ నీటి సంఘాలు లేకపోవడంతో కాంట్రాక్టర్లు తుతూ మంత్రంగా పనులు చేపట్టి చేతులెత్తేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం చెరువుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సాగునీటి సంఘాల ఎన్నికలను త్వరగా నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. ఎన్నికల నిర్వహణ ఇలా.. గత ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికల నో టిఫికేషన్ విడుదల చేయగానే వంద ఎకరాల ఆయకుట్టు ఉన్న ప్రధాన చెరువుల ఆయకట్టు రైతులు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లను ఎన్నుకునేవారు. పాలకవర్గ సభ్యులు చెరువుల నిర్వహణతో పాటు నీటిని పంట పొలాలకు పొదుపుగా వాడుకునేలా చర్యలు చేపట్టేవారు. అంతేకాకుండా రైతులను సమన్వయపర్చుకుంటూ అభివృద్ధి పనులు నిర్వహించేవారు. కానీ పదహారేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో చెరువుల నిర్వహణ మందగించింది. -
స.హ చట్టం వజ్రాయుధం లాంటిది
రెబ్బెన: సమాచార హక్కు చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిదని బెల్లంపల్లి ఏరి యా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నా రు. శనివారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జీఎం మాట్లాడుతూ పాలనలో పారదర్శకత, అధికారుల్లో జవాబుదారీతనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టమే సమాచార హక్కు చట్టమన్నారు. ప్రతీఒక్కరు ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అయితే ఈ చట్టాన్ని సమాజ ప్రయోజనాలకు మాత్రమే వినియోగించాలని, స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని సూచించారు. వ్యక్తుల వ్యక్తిగత సమాచారం, దేశ రక్షణ రహస్యాల విషయంలో ఈ చట్టం ద్వారా సమాచారాన్ని పొందలేమన్నారు. చట్టాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటే సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఎస్వోటూ జీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్ కుమార్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఏఐటీయూసీ నాయకుడు కిరణ్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
క్రీడలతో స్నేహభావం
రెబ్బెన(ఆసిఫాబాద్): క్రీడలతో వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని బెల్లంపల్లి ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి అన్నారు. 92వ డబ్ల్యూపీఎస్ వార్షిక క్రీడల్లో భాగంగా శుక్రవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నియర్ బై బాల్‌బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి, మందమర్రి ఏరియాల ఉద్యోగ క్రీడాకారులు సమష్టిగా రాణించి కోల్ ఇండియా పోటీల్లో పతకాలు సాధించాలని అన్నారు. సీనియ ర్ క్రీడాకారుల నుంచి అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకుడు సంగెం ప్రకాశ్‌రావు, ఏఐటీయూసీ నాయకుడు జూపాక రాజేశ్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
స్టూడెంట్ లీడర్లు!
కెరమెరి(ఆసిఫాబాద్): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతలను పెంపొందించడమే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతీ ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ఆధారంగా విద్యాశాఖ అధికారులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. కలిసి పనిచేయడం ద్వారా పిల్లల్లో జట్టు భావన, బాధ్యత, నిర్ణయ సామర్థ్యం, సమయ పాలన, సామాజిక బాధ్యత వంటి విలువలు పెంపొందుతాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. జిల్లాలో 60 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, 101 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు 32 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతీ బడిలో నాలుగు కమిటీలు..ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో నాలుగు కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. మహనీయుల పేర్లతో ఏర్పాటు చేసే బృందాలకు ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు రంగులు కేటాయిస్తారు. కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా పై తరగతుల విద్యార్థులు వ్యవహరిస్తారు. బృందంలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఇద్దరు బాలికలు తప్పనిసరిగా ఉండాలి. ప్రధానోపాధ్యాయుడి నిధి నుంచి బృందాలకు ఒక్కో రంగు యూనిఫాం కేటాయించాలి. ఒక ఉపాధ్యాయుడు సలహాదారుడిగా వ్యవహరిస్తారు. వీరు ప్రతీనెల మూడో శనివారం సమావేశం నిర్వహించి పాఠశాల సమస్యలపై చర్చిస్తారు. పర్యవేక్షణలో కీలకం..విద్యార్థుల కమిటీలు పాఠశాలలో వివిధ పనులను పర్యవేక్షించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిరోజూ విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజ నం నాణ్యతను పరిశీలించాలి. ఉదయం ప్రార్థన చేయించాలి. తోటి పిల్లలకు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి. క్రమశిక్షణతో జట్టుగా పనిచేసేలా ప్రోత్సహించాలి. అయితే ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం అనేక బృందాలు పనిచేస్తున్నాయి. పచ్చదనం, పరిశుభ్రతకు ఏకో క్లబ్‌లు పనిచేస్తున్నా యి. భద్రత, బాలిక సాధికారత, ఆరోగ్యం, ప్రహరీ, లైబ్రరీ, సాహిత్య, సాంస్కృతిక, కళలు, క్రీడలు వంటి ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల కమిటీలు ఆయా క్లబ్‌లను సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది.విద్యార్థుల కమిటీల పేర్లు, కేటాయించిన రంగులుపేరు కేటాయించిన రంగు అబ్దుల్ కలాం ఎరుపు శకుంతలాదేవి ఆకుపచ్చ సీవీ రామన్ నీలం రవీంద్రనాథ్ ఠాగూర్ పసుపు -
పర్యటించి.. సూచనలు చేసి
రెబ్బెన(ఆసిఫాబాద్): బెల్లంపల్లి ఏరియాలో శుక్రవారం జీఎం సీహెచ్‌పీ కార్పొరేట్ రామ్మూర్తి పర్యటించారు. ఏరియా అధికారులతో కలిసి గోలేటి సీహెచ్‌పీని సందర్శించా రు. బొగ్గు రవాణా, నాణ్యత విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వినియోగదారులకు నాణ్యమై న బొగ్గును సకాలంలో అందించినప్పుడే సింగరేణి సంస్థకు ఆదాయం పెరుగుతుందన్నా రు. అనంతరం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. ఉత్పత్తి, ఉ త్పాదకత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి ఆయన ను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందించా రు. కార్యక్రమాల్లో ఎస్వోటూజీఎం రాజమ ల్లు, ఏరియా ఇంజినీరు కృష్ణమూర్తి, డీజీఎం ఉజ్వల్‌కుమార్, ప్రాజెక్టు ఇంజినీరు వీరన్న, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు. -
13 నుంచి ప్రత్యేక తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఈ నెల 13 నుంచి ప్రతిరోజూ సాయంత్రం 4.15 గంటల నుంచి 5.15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం డీటీడీవో రమాదేవితో కలిసి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాజరుశాతం తక్కువగా ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు మాట్లాడాలని సూచించారు. ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో కొన్నేళ్లుగా జిల్లా రాష్ట్రంలో చివరి నుంచి 2, 3 స్థానాల్లో ఉంటుందని, ఈ ఏడాది మొదటి నుంచి 2, 3 స్థానాల్లో ఉండాలన్నారు. అభ్యస దీపికలు ఉపయోగిస్తూ బోధన చేయాలని ఆదేశించారు. జనవరి 9లోగా వందశాతం సిలబస్ పూర్తి చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలన్నారు. అనంతరం వందశాతం ఎఫ్ఆర్ఎస్, గతేడాది పదో తరగతి ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల హెచ్ఎంలను శాలువాలతో సన్మానించారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి ఉదయ్ బాబు, ఎస్వోలు శ్రీనివాస్, అబిద్ అలీ, ఎంఈవోలు సుభాష్, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల చెక్‌పోస్టులు ఎత్తివేత
వాంకిడి(ఆసిఫాబాద్): స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టులను అధికారులు ఎత్తివేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంక్షలు తొలగిపోయాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ప్రత్యేక బృందాలతో 24 గంటలపాటు నిఘా పెట్టారు. నగదు, మద్యం, ఓటర్లను మభ్యపెట్టే వస్తువుల తరలింపుపై ఆంక్షలు విధించారు. ఆయుధాల తరలింపు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపైనా దృష్టి సారించారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై గురువారం హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషన్ కోడ్‌ను నిలిపివేయగా, జిల్లా సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను తొలగించారు. మూడు చెక్‌పోస్టులు..స్థానిక ఎన్నికల కోడ్‌లో భాగంగా మహారాష్ట్ర సరిహద్దున అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పొరుగు రాష్ట్రం నుంచి అక్రమ రవాణాకు ఆస్కారం ఉండటంతో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఉత్తర్వులను జారీ చేశారు. నగదు, మద్యం సరఫరాను అడ్డుకునేందుకు తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. వాంకిడి మండల కేంద్రంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద, సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్‌పేట్ అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్, సిర్పూర్(టి) నుంచి విరూర్ వెళ్లే రోడ్‌లోని దుబ్బగూడ వద్ద ఈ ఎన్నికల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు ప్రారంభించారు. ప్రతీ చెక్‌పోస్ట్ వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్(ఎస్ఎస్టీ)ను నియమించారు. వాంకిడి చెక్‌పోస్ట్ వద్ద ఆర్ఐ(గిర్దావార్)తోపాటు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఏఎస్సైలకు విధులు కేటాయించగా, వెంకట్రావ్ చెక్‌పోస్ట్ వద్ద ఆర్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీడియో గ్రాఫర్, దుబ్బగూడ చెక్‌పోస్ట్ వద్ద ఇద్దరు జీపీవోలు, పోలీస్ కానిస్టేబుల్, ఒక వీడియోగ్రాఫర్‌కు విధులు కేటాయించారు. కోడ్ ఆంక్షలకు బ్రేక్..ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు తొలగించారు. ఎన్నికల కోడ్ ఆంక్షలు అమలులో ఉండవు. ఎప్పటిలాగే సాధారణ తనిఖీలు మాత్రమే నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే నగదు, వస్తువుల రవాణాను కట్టడి చేయాల్సి ఉంటుంది. ఒక వాహనంలో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు పట్టుబడినా.. రూ.10 వేలకు పైగా విలువైన మద్యం, బహుమతులు, ఇతర వస్తువులు తరలించినా సీజ్ చేస్తారు. వ్యాపార అవసరాల నిమిత్తం బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్న నగదుకు సంబంధించి సరైన ఆధారాలు చూపాలి. బ్యాంకు నుంచి తీసుకున్న నగదుకు విత్‌డ్రా స్లిప్‌లు, పాన్‌కార్డు, అకౌంట్ బుక్, వ్యాపార రిజిస్ట్రేషన్ పత్రాలు వంటివి ఉండాలి. అలాగే వైద్యం, పెళ్లి కోసం తీసుకెళ్తున్న నగదు, నగలు అయితే ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఆస్పత్రికి సంబంధించిన రసీదు, వివాహ వేడుకలకై తే వివాహ ఆహ్వాన పత్రం లేదా కల్యాణ మండపం బుకింగ్ వంటి ఆధారాలు ఉంచుకోవాలి. చెక్‌పోస్టుల ఎత్తివేత విషయమై టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్‌ను వివరణ కోరగా.. హైకోర్టు స్టేతో ఎన్నికల కోడ్ తొలగించినందున ఎన్నికల నిబంధనలు, ఆంక్షలకు తాత్కాలికంగా విరామం ఇచ్చినట్లు తెలిపారు. మళ్లీ నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఆదేశాల మేరకు కోడ్ అమల్లోకి వస్తుందని, అప్పటివరకు సాధారణ తనిఖీలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు వేళాయె
రెబ్బెన(ఆసిఫాబాద్): గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం తెలంగాణ రాష్ట్రస్థాయి సెపక్తక్రా క్రీడా పోటీలకు వేదికగా మారింది. శనివారం నుంచి రెండు రోజులపాటు కొనసాగే ఈ క్రీడాపోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు తరలిరానున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల నుంచి వందలాది మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొననున్నా రు. అండర్– 14, 19 విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. అండర్– 14 విభాగంలో బాలుర జట్లు 10, బాలికలు జట్లు 7, అండర్– 19లో బా లుర జట్లు 10, బాలికల జట్లు 8 పాల్గొననున్నాయి. క్రీడాకారులతోపాటు కోచ్‌లు, మేనేజర్లు, అసోసియేషన్ అఫీషియల్స్‌తో కలిసి సుమారు 250 మంది హాజరుకానున్నారు. క్రీడాకారులకు సౌకర్యాలురెండు రోజులపాటు సింగరేణి ఉన్నత పాఠశాల మైదానం క్రీడాకారులతో కళకళలాడనుంది. వివి ధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు సెపక్తక్రా అసోసియేషన్ ఉచిత వసతి, భోజన సౌకర్యాలను కల్పిస్తోంది. గోలేటి టౌన్‌షిప్‌లోని సీ టైప్, డీ టైప్ క్వార్టర్లతోపాటు సింగరేణి పాఠశాలను క్రీడాకారుల వసతి కోసం కేటాయించగా, సీఈఆర్ క్లబ్లో భోజన వసతికి ఏర్పాట్లు చేశారు. శనివా రం ఉదయం 10 గంటలకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి చేతుల మీదుగా పోటీలు ప్రారంభిస్తారు. సింగరేణి మై దానంలో ఏర్పాట్లను శుక్రవారం సెపక్తక్రా అసో సియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణరెడ్డి తదితరులు పరిశీలించారు. -
అలరించిన సైన్స్ డ్రామా పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్డ్రామా పోటీలు అలరించాయి. ‘మానవ జాతి ప్రయోజనం కోసం శాస్త్ర సాంకేతికత’ అనే అంశంపై వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తమ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రథమ బహుమతి సాధించగా, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ బహుమతి పొందారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు శాస్త్ర సాంకేతిక రంగాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సామాజిక స్పృహ కలిగించేలా డ్రామా ప్రదర్శించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహేశ్వర్, న్యాయ నిర్ణేతలు వెంకటేశ్వర్లు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. -
రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాటం
ఆసిఫాబాద్‌అర్బన్: బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రూప్నార్ రమేశ్ అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. రెడ్డి జాగృతి నాయకుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయన మాట్లాడుతూ బీసీల్లో విభేదాలు తీసుకురావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కుటిల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటిషన్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీసీల పాత్ర కీలకమైందని, తమ హక్కులు కాలరాసే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుంటే రాజకీయ పార్టీలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీసీలు సంఘటితమై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పిటిషన్‌ను వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాధిక, సుప్రజ, ఇరుకుల మంగ, మామిడి కిరణ్, లహుకుమార్, వెంకటేశ్, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
ప్రత్యేక బృందాల ఏర్పాటుతో ఇప్పుడు స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటున్నాం. జట్టు సహకారంతో పనిచేయడం ఆసక్తికరంగా ఉంది. బాధ్యతగా ఉండటం అలవాటు చేసుకుంటున్నాం. చిన్న చిన్న పనులు విజయవంతంగా పూర్తిచేయడం ద్వారా మాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. – రాజేశ్, 9వ తరగతి, కెరమెరి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి విద్యార్థుల బంగారు భవిత కు చదువు ఒక్కటే ప్రామాణికం కాదు. అన్ని అంశాల్లో విషయ పరిజ్ఞానం అవసరం. విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి. క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించుకోవడం అవసరం. ఇందుకోసమే జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. – ఉప్పులేటి శ్రీనివాస్, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ -
‘దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి’
ఆసిఫాబాద్: సుప్రీంకోర్టు జడ్జిపై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పిట్టల సత్యనారాయణ మాదిగ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. నిందితుడి వెనుక ఏ శక్తులు ఉన్నా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల 13న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. అలాగే అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలని సూచించారు. ఈ నెల 22న నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు నిట్టూరి శ్రీశైలం, మహేశ్, రాజయ్య, శంకర్, నక్క విజయ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
తెగుళ్ల కలవరం!
ఈ ఫొటోలో వరి పైరు చూపుతున్న రైతు పేరు పాలే ఊషన్న. దహెగాం మండల కేంద్రంలో సుమారు ఎనిమిదెకరాల్లో వరి సాగు చేశాడు. అధిక వర్షాలతో పంటకు తెగుళ్లు సోకుతున్నాయి. ముఖ్యంగా ఎండాకు తెగులుతో వరిపైరు కొనలు పూర్తిగా ఎండిపోయినట్లుగా మారాయి. ఐదు రోజుల క్రితం ఫర్టిలైజర్ షాపులో రూ.10 వేల విలువైన మందులు కొనుగోలు చేసి పిచికారీ చేశాడు. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన నిట్టూరి నగేశ్ మూడెకరాల్లో వరిసాగు చేశాడు. గత వారం వరకు పంట బాగానే ఉన్నా.. ఎడతెరిపి లేని వర్షాలకు వరిపైరుకు ఇప్పుడిప్పుడే ఎండాకు తెగులు సోకుతోంది. నివారణకు ఎలాంటి మందులు పిచికారీ చేయాలో అతడికి పాలుపోవడం లేదు. ఫర్టిలైజర్ దుకాణ యజమాని చెప్పిందే తెచ్చి పిచికారీ చేయాల్సిన పరిస్థితి. జిల్లావ్యాప్తంగా సాగుచేస్తున్న వరి పంటలో 75 శాతం వరకు ఎండాకు తెగులు బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రారంభదశలో ఉన్న పైరుకు సకాలంలో నివారణ మందులు స్ప్రే చేస్తే కోలుకునే అవకాశం ఉంది. దహెగాం(సిర్పూర్): ఎడతెరిపి లేని వర్షాలు చీడపీడల ఉధృతికి కారణమవుతున్నాయి. వరి పంటను అగ్గి తెగులు, సుడిదోమ, ఇతర తెగుళ్లు ఆశిస్తున్నాయి. ప్రస్తుతం ఎండాకు తెగులు వరి పైరును నాశనం చేస్తోంది. నివారణకు రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కనీసం నివారణ మందులు పిచికారీ చేసే సమయం కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొట్టదశలో తెగుళ్లు విస్తరిస్తుండటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. 56 వేల ఎకరాల్లో వరి..జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో 56 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. సిర్పూర్ నియోజకవర్గంతోపాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రెబ్బెన, తిర్యాణి, వాంకిడి మండలాల్లో మాత్రమే సాగు ఉంది. పంట ప్రస్తుతం పొట్ట దశకు చేరుకుంటుంది. ఈ దశలో వాతావరణ మార్పులతో చీడపీడలు సోకుతున్నాయి. కోత దశలో దోమపోటు వంటి తెగుళ్లు సైతం వచ్చే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అధిక వర్షాలతోపాటు తెల్లవారుజామున పొగమంచు కారణంగా దిగుబడి తగ్గే వీలుంది. తెగుళ్ల నివారణకు సకాలంలో నివారణ మందులు పిచికారీ చేయాలని సూచిస్తున్నారు. సలహాలు పాటించాలి రైతులు వ్యవసాయాధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలి. వర్షాకాలంలో సాగయ్యే వరికి ఎండాకు తెగులు సోకుతోంది. కోనికా, ఓసీన్ మందులు పిచికారీ చేయడం ద్వారా నివారించవచ్చు. మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలి. – వెంకటి, జిల్లా వ్యవసాయాధికారి -
నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అన్నారు. జైనూర్లోని బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హెచ్ఎం పార్వతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. విద్యార్థినులకు ఐరన్, విటమిన్ సీ మాత్రలు అందించాలన్నారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యసేవల వివరాలపై ఆరా తీశారు. వైద్యులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
దిగుబడిపై వానదెబ్బ
రెబ్బెన(ఆసిఫాబాద్): గతేడాది వర్షాలు లేక పంటలు దెబ్బతినగా ఈ ఏడాది అధిక వర్షాలు పత్తి పంటను నాశనం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భూముల్లో తేమశాతం అధికమై మొక్కల్లో ఎదుగుదల లోపించింది. ఆశించిన స్థాయిలో పూత రాక కాయల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. సాధారణంగా జిల్లాలో దసరా తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఈసారి మాత్రం పండుగ దాటినా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తెగుళ్లు పెరిగి దిగుబడిపై ప్రభావం పడుతోంది. మెరుగైన దిగుబడి సాధించవచ్చని భావించిన రైతుల ఆశలు అడియాశలుగా మారుతున్నాయి. పత్తిదే అగ్రస్థానం.. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తిదే అగ్రస్థానం. అన్ని మండలాల్లో రైతులు పత్తి సాగుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా సుమారు 3.5లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి రైతులు 20 రోజులు ముందుగానే విత్తనాలు విత్తుకున్నారు. ప్ర స్తుతం ఏరే దశకు చేరుకున్నా వర్షాలు వీడడం లేదు. నెలన్నర రోజులుగా రోజు విడిచి రోజు అన్నట్లుగా కురుస్తున్నాయి. ఇది పంటలౖపై ప్రతికూల ప్రభా వం చూపుతోంది. అధిక వర్షపాతంతో ఆకుమచ్చ తెగుళ్లు, పండు ఆకు తెగుళ్లతోపాటు వేరుకుళ్లు తెగులు విపరీతంగా విస్తరిస్తోంది. ఇప్పటికే ఆశించిన స్థాయిలో కాయలు లేక దిగాలు చెందుతున్న రైతులకు తెగుళ్లు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నివారణకు క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నా వర్షాలతో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. వేరుకుళ్లు తెగుళ్ల కారణంగా పత్తి మొక్కలు వడలిపోతున్నాయి. ఆకుమచ్చ తెగుళ్లతో చెట్లు పూర్తి దెబ్బతిని మోడుగా మారుతున్నాయి. చినుకులకు తడిసి ముద్ద.. జిల్లాలో ముందస్తుగా సాగు చేసిన చేలలో పత్తి ఏరే దశకు చేరుకుంది. కానీ చినుకులకు చెట్లపైనే తడిసి ముద్దవుతోంది. చేతికందిన పంట కళ్ల ముందే చినుకులకు దెబ్బతింటుండడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడిప్పుడే పగులుతున్న కాయలు వర్షాల కారణంగా నీరుచేరి పుచ్చిపోతున్నాయి. వర్షాలతో ఒక్కో ఎకరంలో సుమారు 2 నుంచి 3 క్వింటాళ్ల వరకు పత్తి దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోవడంతో అన్నదాతలు మరింత కలవరపడుతున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్టుబడి కోసం చేసిన అప్పులు కూడా తీరే అవకాశం లేదని వాపోతున్నారు. -
టెండర్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో మద్యం టెండర్ల ప్రక్రి య సజావుగా చేపట్టాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎకై ్సజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్ రఘురామ్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని గురువారం సందర్శించారు. ఆయన మా ట్లాడుతూ దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ నెల 18న దరఖా స్తుల స్వీకరణకు చివరి తేదీ కాగా, ఈ నెల 11న రెండో శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించనున్న ట్లు తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి జ్యోతి కిరణ్, సీఐలు రమేశ్, రవికుమార్ పాల్గొన్నారు. మద్యం దుకాణాలకు 34 దరఖాస్తులుఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య కొనసాగుతోంది. గురువారం వరకు జిల్లాలో 34 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎకై ్సజ్ అధికారి జ్యోతికిరణ్ తెలిపారు. జిల్లాలో 32 మద్యం దుకా ణాలు ఏర్పాటు చేయనుండగా, దరఖాస్తులకు ఈ నెల 18 వరకు ప్రభుత్వం గడువు విధించిందని పేర్కొన్నారు. డిసెంబర్ 1న నూతన మద్యం షాపులు ప్రారంభమవుతాయని తెలిపారు. -
● హైకోర్టు ఉత్తర్వులతో నిలిచిన ప్రక్రియ ● నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటన ● జెడ్పీటీసీకి ఒకటి, ఎంపీటీసీ స్థానాలకు తొమ్మిది నామినేషన్లు దాఖలు
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే విధించింది. హైకోర్టు తీర్పును అనుసరించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. గురువారం ఉదయం జెడ్పీటీసీ, ఎంపీటీసీ తొలివిడత ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో జిల్లావ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. ఆయా మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. ఉన్నతాధికారులు నామినేషన్ కేంద్రాలను పరిశీలించి ఎన్నికల అధికారులు, సి బ్బందికి సూచనలు చేశారు. అయితే హైకోర్టు పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్, జీవో 9పై స్టే విధించడంతో అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. జిల్లాలో పది నామినేషన్లుజిల్లాలో 15 మండలాల పరిధిలో 335 పంచాయతీలు ఉన్నాయి. 335 పంచాయతీలు, 2,874 వార్డులు, 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు విడతల వారీగా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం షెడ్యూల్ రూపొందించింది. ఇందులో భాగంగా మొదటి దశలో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్, రెబ్బెన, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణకు ఆయా మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తొలిరోజు జెడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్, ఎంపీటీసీలకు తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి. చింతలమానెపల్లి జెడ్పీటీసీ స్థానానికి ఒక నామినేషన్ దాఖాలు కాగా, కాగజ్‌నగర్‌లో ఎంపీటీసీ స్థానానికి ఒకటి, కౌటాలలో ఒకటి, సిర్పూర్(టి)లో రెండు, రెబ్బెనలో మూడు, చింతలమానెపల్లిలో మూడు నామినేషన్లు వచ్చాయి. బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాల్లో నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. నిరీక్షణ తప్పదా..?హైకోర్టు ఉత్తర్వులతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రి య నిలిచిపోయింది. ప్రస్తుతం హైకోర్టు నాలుగు వారాలపాటు స్టే విధించడంతో అభ్యర్థులకు నిరీక్షణ తప్పేలా లేదు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సందిగ్ధంలో పడ్డారు. స్థానిక సంస్థల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నరకు పైగా గడిచింది. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంతో పోలిస్తే రిజర్వేషన్లు తారుమారయ్యాయి. ఆశావహులు అనుకూలమైన స్థానా లు వెతుక్కున్నారు. ముఖ్యంగా జెడ్పీ పీఠంపై దృష్టి సారించిన వారు పక్క మండలాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రచారం చేయాలా.. వేచిచూడాలా అనేది తేల్చుకోలేకపోతున్నారు. రిజర్వేషన్లు మారితే మళ్లీ కొత్త ప్రాంతంలో మొదటి నుంచి ప్రచారం నిర్వహించాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. -
‘బీసీలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’
కాగజ్‌నగర్‌రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. కాగజ్‌నగర్ మండలం కోసినిలోని ప్రాణహి త నిలయంలో గురువారం విలేకరులతో మాట్లాడా రు. జీవో 9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రంలోని బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఆధిపత్య వర్గాల నాయకులు కోర్టులో కేసు వేసి బీసీలకు రిజర్వేషన్లు అందకుండా లాక్కున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురె శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, సలీం, మిన్హాజ్, వెంకటేశం, పోశం తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌రూరల్: పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని బీసీ పోస్ట్‌మెట్రిక్ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది గురువారం జిల్లా కేంద్రంలో బీసీ డీడీ శివకుమార్‌కు వినతిపత్రం అందించారు. పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్లకు ఏడు నెలలుగా వేతనాలు రావడం లేదన్నారు. వారికి కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. కార్యక్రమంలో సిబ్బంది లక్ష్మి, శారద, పార్వతి, జ్యోతి, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ ఆసిఫాబాద్‌రూరల్: వసతిగృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల ఆశ్రమ పాఠశాలలను బుధవారం సందర్శించారు. వంటలు పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. బోధన సమయంలో ఉపాధ్యాయులు స్టాఫ్ రూంలో కాలక్షేపం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలనలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పీవో మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలతో కూడిన ఆహారం అందించాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. -
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
వాంకిడి(ఆసిఫాబాద్): నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి సాధించవచ్చని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ యు.స్రవంతి అన్నారు. ‘నాణ్యమైన విత్తనం– రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన విత్తనాలతో సాగు చేసిన పంటలను బుధవారం సందర్శించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం ఆధ్వర్యంలో నాణ్యమైన కంది, పెసర విత్తనాలను రైతులకు అందించినట్లు తెలిపారు. వాంకిడికి చెందిన బండె నాందేవు సాగు చేసిన కంది పంటను పరిశీలించి సూచనలు చేశారు. విత్తనోత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాతావరణ మార్పులు, పంటల స్వభావం, చీడపీడల నివారణపై అవగాహన కల్పించారు. రానున్న రెండు, మూడు సంవత్సరాల్లో ప్రతీ గ్రామం విత్తన స్వ యం సంవృద్ధి సాధించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఎం.ప్రసూన, ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృష్ణ, ఏఈవోలు రాజేశ్వర్, శంకర్ పాల్గొన్నారు. -
ఆర్టీసీకి పండుగ
మంచిర్యాలఅర్బన్: బతుకమ్మ, దసరా పండుగలతో ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూరి పండుగ చేసుకుంది. దసరా ముందు, తర్వాత ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు ప్రత్యేక బస్సులు నడిపించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఉమ్మడి జిల్లా నుంచి రాజధానికి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఉద్యోగం, చదువు రీత్యా హైదరాబాద్‌కు వెళ్లిన వారు సొంతూళ్లకు వచ్చి వెళ్లడానికి బస్సుల రాకపోకలకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది దసరా సందర్భంగా రోజువారీ బస్సులతోపాటు అదనపు బస్సులు తిప్పడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బందులు తొలగడంతోపాటు సంస్థకు ఖజానా సమకూరింది. ఉమ్మడి జిల్లా నుంచి ఆయా డిపోల ద్వారా హైదరాబాద్‌కు దసరా ముందు, తర్వాత సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 6వరకు 998 అదనపు బస్సులు ఏర్పాటు చేసింది. 5,10,072 కిలోమీటర్లు నడపడం ద్వారా 1,39,388 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది. దీంతో రూ.3,01,08,462 ఆదాయం సమకూరింది. దసరా ముందు.. తర్వాత దసరా పండుగకు ముందు ఉమ్మడి జిల్లా(రీజియన్) నుంచి ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల డిపోల నుంచి 399 ప్రత్యేక బస్సులు నడిపించారు. ఏడు సూపర్ లగ్జరీ(మంచిర్యాల డిపో)లు, 43 సూపర్‌లగ్జరీలు, 23 డీలక్స్, 241 ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక బస్సులు నడిపారు. 2,05,348 కిలోమీటర్ల మేర బస్సులు నడపడం ద్వారా 56,467 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,16,02,891 ఆదాయం చేకూరింది. పండుగ తర్వాత ఈ నెల 3నుంచి 6వరకు రీజియన్ వారీగా 599 బస్సులు నడిపారు. ఇందులో 15రాజధాని, 192 సూపర్‌లగ్జరీ, 38 డీలక్స్, 354 ఎక్స్‌ప్రెస్ బస్సులు తిప్పారు. అదనపు బస్సులతో 3,04,724 కిలోమీటర్లు నడిపి 82,921 మంది గమ్యస్థానాలకు చేర్చారు. రూ.1,85,05,571 ఆదాయం వచ్చింది.అధికంగా మంచిర్యాల డిపో నుంచే.. పండుగ నేపథ్యంలో ఆయా డిపోల నుంచి మొత్తంగా 998 బస్సులు నడిపించగా.. ఇందులో అధికంగా మంచిర్యాల డిపో నుంచే 198 బస్సులు ఉన్నాయి. 11,701 మంది మహాలక్ష్మి పథకం ప్రయాణికులు కాగా, 11954మంది టికెట్లు కొనుగోలు చేశారు. 98,867 కిలోమీటర్లు మేర బస్సులు తిప్పి 23,655 మంది ప్రయాణికులను చేరవేయడం ద్వారా రూ.62,70,066 ఆదాయం వచ్చింది. దసరా ముందు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ ఒకటి వరకు 120 బస్సులు 59536 కిలోమీటర్లు నడపడం ద్వారా 14,575 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు. ఇందులో మహాలక్ష్మి పథకం 8192 మంది, 6,950 మంది టికెట్ల కొనుగోలు చేసి ప్రయాణం చేశారు. రూ.35,92,471 సమకూరింది. దసరా తర్వాత ఈ నెల 3 నుంచి 6వరకు 8,513 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసి రూ.26,77,595 ఆర్జించింది. దసరా ముందు, తర్వాత వచ్చిన ఆదాయంలో ఆదిలాబాద్ రీజియన్ వారీగా పరిశీలిస్తే మంచిర్యాల డిపో ముందుంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాలను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. కౌంటింగ్ చేపట్టే గదులు, స్ట్రాంగ్ రూం, పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల కౌంటింగ్ ప్రక్రియ ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ మధుకర్, డీఎస్పీ వహీదుద్దీన్, అధికారులు ఉన్నారు. ‘భూభారతి’ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలి కాగజ్‌నగర్‌టౌన్: భూభారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి బుధవారం డివిజన్లోని తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సభల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తును రికార్డులతో సరిచూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పట్టా పాసుపుస్తకాల్లోని పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, విస్తీర్ణం, విరాసత్ పట్టా మార్పిడి, డిజిటల్ సంతకం కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు. -
● పరిషత్ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ ● ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు ● రెండు విడతల్లో పోలింగ్ ● హైకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ
ఆసిఫాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే మండల కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై వచ్చిన పిటిషన్లను హైకోర్టు బుధవారం విచారించడంతో ఎన్నికల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విచారణను గురువారానికి వాయిదా వేసినా.. నోటిఫికేషన్ విడుదలకు హైకోర్టు ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. దీంతో నామినేషన్ల ప్రక్రియ యథాతథంగా ముందుకు సాగనుంది. జిల్లాలోని 345 పోలింగ్ కేంద్రాల పరిధిలో 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 335 గ్రామ పంచాయతీల పరిధిలో 3,53,895 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు ఉన్నారు. రెండు విడతల్లో ఎన్నికలు ఈ నెల 23న తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కాగజ్‌నగర్, రెబ్బెన, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని ఎనిమిది జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాణి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి మండలాల్లోని ఏడు జెడ్పీటీసీ స్థానాలు, 56 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు వేర్వేరుగా నామినేషన్లు స్వీకరించనున్నారు. తొలివిడత జెడ్పీటీసీ నామినేషన్లకు 8 మంది రిటర్నింగ్ అధికారులు, ఎంపీటీసీ నామినేషన్లకు 40 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. ఆశావహుల్లో ఉత్కంఠ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు గురువారం తీర్పునిచ్చే అవకాశం ఉండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యాయి. క్షేత్రస్థాయిలో మంతనాలు జరపగా, త్వరలో జాబితాను ఫైనల్ చేయనున్నాయి. కాగా, 2016లో కుమురంభీం ఆసిఫాబాద్ కొత్త జిల్లాగా ఏర్పడగా తొలిసారి జెడ్పీ చైర్పర్సన్ పీఠం ఎస్టీలకు కేటాయించారు. తాజా రిజర్వేషన్లతో బీసీ జనరల్‌కు కేటాయించడంతో వెనుకబడిన వర్గాలకు దక్కే అవకాశం ఉంది. కొత్త రిజర్వేషన్లు అమలవుతాయా.. లేక పాతవే కొనసాగుతాయనే సందిగ్ధత కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు తీర్పు కీలకం కానుంది. నేటి నుంచి ప్రక్రియ ప్రారంభంఆసిఫాబాద్: సాధారణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 9న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, పోలీ సు అధికారులు, ఎన్నికల అధికారులు, జిల్లా ప రిషత్, పంచాయతీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా నామినేషన్ల స్వీకరణకు బందోబస్తు, అధికారులు, సిబ్బంది నియామకం, ఇతర అంశాలకు సంబంధించి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు పాటించాలన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండి ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత 8 జెడ్పీటీసీలు, 71 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని వివరించారు. ఇప్పటికే సహాయ ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ముఖ్య ఘట్టాలు తొలి విడత రెండో విడత నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 09 అక్టోబర్ 13 చివరి తేదీలు అక్టోబర్ 11 అక్టోబర్ 15 పరిశీలన అక్టోబర్ 12 అక్టోబర్ 16 ఉపసంహరణ అక్టోబర్ 15 అక్టోబర్ 19 ఎన్నికల తేదీలు అక్టోబర్ 23 అక్టోబర్ 27 ఓట్ల లెక్కింపు నవంబర్ 11 నవంబర్ 11 -
ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రా థమిక విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని చిర్రకుంట, రింగన్‌గూడ ప్రభుత్వ పాఠశాలలను బుధవారం సందర్శించారు. వంట, తరగతి గదులు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పాటిస్తూ నాణ్యమైన బోధన చేయాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. ఫౌండేషన్, లిటరసీ అండ్ న్యూమరసీ లో విద్యార్థులకు ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానంపై అందిస్తున్న శిక్షణ వివరాలు అడి గి తెలుసుకున్నారు. ఏఐ బోధనను పరిశీలించి ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకాడమిక్ మా నిటరింగ్ అధికారి శ్రీనివాస్, ఎంఈవో సుభాష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మెనూపై పట్టింపేది..?
చింతలమానెపల్లి: ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేలా రూపొందించిన మెనూ అమలు కావడం లేదు. చింతలమానెపల్లి మండలం బాబాపూర్ ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఉదయం అల్పాహారంలో పులిహోరకు బదులుగా కిచిడీ అందించారు. మధ్యాహ్నం వెజ్ బిర్యాణి, ఆలు కుర్మ, పెరుగు, కోడి గుడ్డుకూర, స్నాక్స్‌లో అరటిపండు లేదా బొప్పాయి పండు అందించాలి. కానీ మధ్యాహ్నం భోజనంలో వంకాయ ఆలుగడ్డ కూర, పప్పుతో సరిపెట్టారు. దసరా సెలవుల తర్వాత మెనూ పాటించడం లేదని, కోడిగుడ్లు, చికెన్‌తో ఇప్పటి వరకు భోజనం అందించలేదని విద్యార్థినులు తెలిపారు. పాలు, పెరుగుతోపాటు వస్తువులు పూర్తిస్థాయిలో సరఫరా కావడం లేదని, అందుకే మెనూ అమలు చేయడం లేదని ప్రధానోపాధ్యాయుడు గోపి తెలిపారు. శుక్రవారం నుంచి మెనూ అమలు చేస్తామని పేర్కొన్నారు. -
పులకించిన పోరుగడ్డ
కెరమెరి(ఆసిఫాబాద్): జల్.. జంగల్.. జమీన్ కో సం పోరుసలిపి అసువులు బాసిన ఆదివాసీ పోరా ట యోధుడు కుమురంభీం స్మరణతో పోరుగడ్డ పు లకించింది. రణభూమి జోడేఘాట్‌లో వీరుడి 85వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన సమాధిపై పూలు చల్లి నివాళులర్పించా రు. ‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు వేదికపైకి ఎవరూ వెళ్లలేదు. దర్బార్ కార్యక్రమాన్నీ రద్దు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరికి వారుగా వచ్చి నివాళులర్పించి వెళ్లిపోయారు. భీంకు సంప్రదాయపూజలుకుమురంభీంకు ఆయన వారసులు, ప్ర జాప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పూజలు నిర్వహించారు. భీం సమాధిపై పూలు చల్లి పూజలు చేశారు. మందుగా ఆచార, వ్యవహా రాలతో పాత జెండాలు తీసేసి కొత్త జెండాలు ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా అంతా వరుసక్రమంలో నిల్చుని జెండాలకు మొక్కారు. ధూప, దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. కోడి, మేకలతో జాతకం చూశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుపాటగూడ, జోడేఘాట్, ఆసిఫాబాద్, ఆదిలాబా ద్ ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుస్సాడీ నృత్యాలు కనువిందు చేశాయి. ఐసీడీఎస్, రెవెన్యూ, ఐటీడీఏ, సఖీ, వైద్యారోగ్యశాఖ, కొలాం అభివృద్ధి, ఇప్పుపూలు, విస్తరాకుల తయారీ తదిత ర స్టాళ్లు ఎంతోగానో ఆకట్టుకున్నాయి. నివాళులర్పించినవారిలో..‘స్థానిక’ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దర్బార్ రద్దు చేయగా భీం ఆరాధికులు అనుకున్న స్థాయిలో హాజరు కాలేదు. మంత్రులు, కలెక్టర్‌తోపాటు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్‌పాటిల్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఏఎస్పీ చిత్తరంజన్, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్, ఆర్డీవో లోకేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీడీ రమాదేవి, ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, భీం మనుమడు కుమురం సోనేరావు, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మా జీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు సుగుణ, నాయకులు విశ్వప్రసాద్, శ్యాంనాయక్ తదితరులు భీం విగ్రహానికి పూ లమాలలు వేసి నివాళులర్పించినవారిలో ఉన్నారు.భీం విగ్రహానికి పూలమాల వేస్తున్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ పాటిల్మేకతో పూజలు చేస్తున్న భీం వారసులు వేదికపై నృత్యం చేస్తున్న విద్యార్థులు భీం ఆశయాలు నెరవేర్చుతాం: మంత్రులుకుమురం భీం ఆశయాలు నెరవేర్చుతామని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివాసీలను సంఘటితం చేసి వారి హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమురంభీం అని కొని యాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయ న స్ఫూర్తి ఎంతో ఉందని పేర్కొన్నారు. 1935 నుంచి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి వారి బలగాలను ఎదురించారని తెలిపారు. ఆదివాసీల అభివృద్ధికి రూ.740 కోట్లతో రో డ్లు, గిరిజన భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్ర భుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. విద్య, ఆశ్రమ పాఠశాలలను మరింత తీర్చి దిద్దుతామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వేదిక పై మాట్లాడలేకపోతున్నామని చెప్పారు. భీం స్ఫూర్తితో ముందుకు సాగుదాం: కలెక్టర్ -
పోక్సో కేసుల్లో తప్పనిసరిగా గోప్యత పాటించాలి
ఆసిఫాబాద్: పోక్సో కేసుల్లో తప్పనిసరిగా గోప్యత పాటించాలని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ఎంవీ రమేశ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని కోర్టు హాల్లో మంగళవారం పోక్సో ఆక్ట్–2012 పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు తీ రు, బాధితులకు సౌకర్యాలు, వారి గోప్యత, గౌరవ భంగం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. చైల్డ్ ప్రొటెక్షన్‌పై జిల్లా సంక్షేమశాఖ, సఖీ కేంద్రం నిర్వాహకులతో సమీక్షించారు. సీనియర్ సివిల్ జడ్జి యువరాజ, ప్రిన్సిపల్ జ్యుడీషియల్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి, పీపీ జగన్మోహన్రావు, డీసీపీవో మహేశ్, పోక్సో కోర్టు స్పెషల్ పీపీ శ్రీనివాస్, సీఐ బాలాజీ వరప్రసాద్, శైలజ పాల్గొన్నారు. -
‘మహా’ దగాకు చెక్!
కౌటాల: మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో పండించిన సన్నవడ్లను దళారులు జిల్లాలోకి అక్రమంగా తరలిస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఇక్కడి రైతుల పేరిట కొనుగోలు కేంద్రాల్లో విక్రయించడాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. రూ.500 బోనస్ కొల్లగొట్టే వారి చర్యలకు ఫుల్స్టాప్ పెట్టడానికి సిద్ధమైంది. కొద్దిరోజుల్లో జిల్లాలో వరి పంట చేతికి రానుండగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. వరి సాగవుతున్న మండలాల్లో ఏటా 34 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. సన్నాలు పండించిన రైతులకు అదనంగా రూ.500 చొప్పున బోనస్ ప్రకటించి క్వింటాల్‌కు రూ.2,389 చెల్లిస్తోంది. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో 56వేల ఎకరాల్లో సాగుజిల్లాలోని 15మండలాల్లో రైతులు అధికంగా పత్తి సాగు చేస్తుండగా.. ఆ తర్వాత స్థానంలో వరి సాగు ఉంది. ప్రధానంగా దహెగాం, పెంచికల్పేట్, కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, తిర్యాణి ప్రాంతాల్లో వరి సాగు అధికంగా ఉంది. వరి ప్రస్తుతం పొట్ట దశలో ఉండగా నెలరో జుల్లో పంట చేతికి వచ్చే అవకాశముంది. జిల్లా అధి కార యంత్రాంగం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. యూరియా కొరత కారణంగా పంట దిగుబడిపై ప్రభావం పడి ఈసారి ధాన్యం ఉత్పత్తి కొంత తగ్గనుంది. సుమారు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పంట సాగులో కచ్చితత్వం కోసం ప్రభుత్వం డిజిటల్ సర్వే వి ధానాన్ని తీసుకువచ్చింది. సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి వివరాలు నమోదు చేస్తున్నారు. రైతు పేరు, సాగు విస్తీర్ణం, రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, పంటకు సంబంధించిన ఫొటో తదితర వివరాలు ప్రభుత్వ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. దీని ద్వారా పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో ఇబ్బందులు తప్పనున్నాయి. ఆదేశాలు అమలు చేస్తాం కొద్దిరోజుల్లో వరి పంట చేతికి రానుంది. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహిస్తున్నాం. సన్న ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు చేపడతాం. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆదేశాలు అమలు చే స్తాం. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. ప్రభుత్వం సన్నాలకు అందిస్తున్న బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలి. – వెంకట్, జిల్లా వ్యవసాయాధికారిసరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులుఈసారి ‘మహా’ దళారుల మోసాన్ని అరికట్టేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చే యాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా అధికారులు క సరత్తు చేస్తున్నారు. చెక్‌పోస్టులు సరిహద్దు ప్రాంతాలతోపాటు జిల్లాలోనూ ఏర్పాటు చేయనున్నారు. ప్రతీ చెక్‌పోస్టులో సీసీ కెమెరాలతో ని ఘా పెట్టాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వీటితో వాహనాల కదలికల ను రియల్ టైంలో పర్యవేక్షించి, అక్రమాలను అడ్డుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది. జిల్లాలోని సిర్పూర్(టీ) మండలంలోని వెంకటపూర్, హుడుల్కి, చింతలమానెపల్లి మండలంలోని గూడెం, వాంకిడి ప్రాంతాలు మహా రాష్ట్రకు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. ఆ యా మార్గాల నుంచి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నా రు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలకు ధా న్యం తీసుకువచ్చే రైతుల సాగు వివరాలు పరిశీ లించాలని ఆదేశాలు వెళ్లాయి. తెచ్చిన ధాన్యం ఎంత.. వచ్చింది రైతులేనా? సాగు చేసింది ఎన్ని ఎకరాల్లో? అన్న వివరాలను వ్యవసాయశాఖ సమాచారంతో ఓపీఎంఎస్ యాప్‌తో పోల్చుకుని చూడాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
అప్పులిస్తాం.. దందా చేస్తాం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: లిక్కర్ దందా అడ్డదారులు తొక్కుతోంది. లక్కీ లాటరీలో అమాయకులను ముందు పెట్టి సిండికేట్‌గా మారిన వ్యాపారులు దందాను తమ గుప్పిట పెట్టుకునేలా ఎత్తువేస్తున్నారు. జిల్లాలో కాగజ్‌నగర్ కేంద్రంగా పలువురు మద్యం వ్యాపారులు గ్రూపులుగా ఏర్పడి కండిషన్లతో టెండర్ వేయిస్తూ రూ.లక్షల్లో దండుకునే ప్లాన్ వేశారు. ప్రభుత్వం వచ్చే రెండేళ్ల (2025–27)కు జిల్లాలోని 32షాపుల లైసెన్స్‌దారుల కోసం టెండర్లు పిలిచింది తెలిసిందే. ఒక్కో షెడ్యూల్ ధర రూ.3లక్షలు కాగా, ఎవరికి లక్కీ డ్రాలో వస్తే వారికే ఆ షాపు కేటాయిస్తారు. అయితే, సింగిల్‌గా వేస్తే ఆర్థికంగా నష్టపోతామని భావిస్తున్న చాలామంది వ్యాపారులు జట్టుగా వేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కాగజ్‌నగర్‌కు చెందిన కొందరు వ్యాపారులు రూ.లక్షల కొద్దీ అప్పులు ఇస్తూ మరీ దందాలోకి దించుతున్నారు. ఎటు తిరిగి తమకే రూ.లక్షల్లో లా భం వచ్చేలా కండిషన్లు పెడుతూ మద్యం వ్యాపారాన్ని తమ గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాత వారితో పాటు కొత్తవారిని ఆకట్టుకునేందుకు సింగపూర్, మలేషియా తదితర దేశాలకు విహారయాత్రలను ఎరగా వేస్తున్నారు. వ్యాపారుల నిబంధనలివే..!ముందుగా టెండర్ వేసేందుకు రూ.3లక్షలు ఇస్తా రు. లాటరీలో షాపు వస్తే ఖర్చుల కింద రూ.3లక్షలతోపాటు 70శాతం వాటా తీసుకుంటున్నారు. మిగతా వాటా నిర్వాహకులకు ఇస్తారు. ఒకవేళ షాపు రాకపోతే రూ.3లక్షలు అప్పు కింద రెండు నెలల్లోనే వారు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు ప్రామిసరీ నోటు, బ్యాంక్ చెక్‌తో సంతకం చేసి ఇవ్వాలనే నిబంధన విధించారు. ఎవరి పేరు మీద షాపు వచ్చినా నిర్వహణ మాత్రం వారిదే. షాపు అమ్ముకోవాలన్నా, తాము చెప్పిన రేటుతో వారికే విక్రయించాలి. ఇలా పది కండిషన్లు పెట్టా రు. ఒక గ్రూపునకు 33మందికి అవకాశం కల్పించారు. అంటే, రూ.99లక్షలు అప్పుగా ఇచ్చి తర్వాత తిరిగి వసూలు చేసుకునే ప్లాన్ వేశారు. ఈ తీరుగా కాగజ్‌నగర్‌లో గ్రూపులుగా ఏర్పడి మద్యం షాపుల టెండర్లలోనే సిండికేట్‌గా ఏర్పడుతున్నారు. అధికారులు కట్టడి చేస్తేనే..పెట్టుబడి ఇస్తామని ఆశ చూపి తర్వాత రెండు నెలల్లోనే తిరిగి తమ డబ్బులు తీసుకోవడం, లేదా లాటరీలో షాపు వస్తే వాటా తీసుకోవడం రెండూ నిర్వాహకులకు లాభం తెచ్చేదే. ముందుగా డబ్బులు పెట్టి మద్యం దుకాణాల పేరుతో పెద్ద మొత్తంలో వసూలు చేసే ప్లాన్ వేశారు. ఈ కండిషన్లతో కూడిన బాండ్ పేపర్ వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. కొందరు గతంలో రూ.2లక్షలు టెండరు ధర ఉన్నప్పటికీ ఇలాంటి వసూళ్లు చేయడంతో లాటరీ రాకపోవడంతో తిరిగి బాకీలు కట్టేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. తాజాగా ఇదే దందా చేసేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో జిల్లా పోలీస్, ఎకై ్సజ్శాఖల అధికారులు ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆదిలోనే కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలి
వాంకిడి: ఈ నెల 12నుంచి 17వరకు మహా రాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించనున్న స మతా సైనిక్ దళ్ రాష్ట్ర స్థాయి శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని బీఎస్ఐ, అంబేడ్క ర్ సంఘం నాయకులు కోరారు. మంగళవా రం మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహా రలో శిక్షణ శిబిరం కరపత్రం ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ.. సమతా సైనిక్ దళ్ అనేది వ్యవస్థీకృత సమాజంలో సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం స్థాపించేందుకు సజీవ ఉద్యమాన్ని సృష్టిస్తుందని తెలిపారు. అంబేడ్కర్ స్థాపించిన ఈ సంస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావా లని పిలుపునిచ్చారు. మహారాష్ట్ర రాష్ట్ర ఎస్ ఎస్డీ ప్రధాన కార్యదర్శి మార్షల్ దిలీప్ పాటి ల్, కార్యదర్శి మార్షల్ చంద్రబోస్, బీఎస్ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, ఎస్ఎస్ డీ జిల్లా అధ్యక్షుడు సందీప్దుర్గే పాల్గొన్నారు. -
అష్టాంగ మార్గాలను అనుసరించాలి
వాంకిడి: భగవాన్ గౌతమ బుద్ధుడు చూపిన అష్టాంగ మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని బౌద్ధ బిక్షువు భంతే భరద్వాజ్ సూచించారు. మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార, ఖమాన గ్రామంలోని నాగ్‌సేన్ బుద్ధ విహారాల్లో మంగళవారం బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో వర్షావాస్ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాలను ఆవిష్కరించారు. ప్రత్యేక పూ జలు నిర్వహించారు. భంతే భరద్వాజ్ మాట్లాడు తూ.. ప్రపంచ శాంతికి బౌద్ధమే శరణ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని బౌద్ధ మార్గం వైపు నడవాలని సూచించారు. బుద్ధుడు చూపిన పంచశీలాలు, అ ష్టాంగ మార్గాలతో మానవుడు నిజమైన అభివృద్ధిని సాధించగలుగుతాడని తెలిపారు. అనంతరం గ్రంథ పాఠకుడు కిషన్ ఖోబ్రగడే దంపతులను శాలువా లతో సన్మానించారు. అన్నదానం, సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించారు. భారతీయ బౌద్ధ మహా సభ, అంబేడ్కర్ యువజన సంఘం, రమాబాయి మహిళా మండలి సంఘాల నాయకులున్నారు. -
గురుకులాలను పట్టించుకోని ప్రభుత్వం
సిర్పూర్ (టీ): ఎంతో మంది విద్యార్థులను డాక్టర్లు, కలెక్టర్లు, ఇంజినీర్లుగా తయారు చేసిన సిర్పూర్ గురుకుల పాఠశాల మూతపడే ప్రమాదంలో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమా ర్ ఆరోపించారు. మంగళవారం సిర్పూర్లోని గురుకుల పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో చిన్నచిన్న మరమ్మతులు కూడా చేయలేక పాఠశాలనే ఇతర ప్రాంతానికి తరలించాలని చూడడం దారుణ మని పేర్కొన్నారు. కాంగ్రెస్ మంత్రులకు ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడంతోనే సరి పోతోందని, విద్యార్థుల సమస్యలు పట్టించుకో వడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో ఇప్పటివరకు 106మంది విద్యార్థులు మరణించారని ఆరోపించారు. హుస్నాబాద్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థి ఆ త్మహత్య చేసుకున్నాడని తెలిపారు. స్థానిక ఎ మ్మెల్యేకు గురుకులాలపై పట్టింపు లేదని విమర్శించారు. విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళ న చేస్తున్నా, వారి తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా కలెక్టర్, అధికారులు పట్టించుకోవడం లే దని ఆరోపించారు. సిర్పూర్ గురుకుల పాఠశాలను తామే కాపాడుకుంటామని, అవసరమైతే తల్లిదండ్రులతో కలిసి శ్రమదానం చేసి మరమ్మతులు చేసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా పట్టించుకోకుంటే భవిష్యత్ పరిణామాలకు కలెక్టర్, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వ స్తుందని పేర్కొన్నారు. ఆయన వెంట విద్యార్థుల తల్లిదండ్రులు, మండల కన్వీనర్ అస్లమ్, వర్మ, స్వామి, నాయకులు పాల్గొన్నారు. -
పదివేల మందికి పైగా హాజరు..
ప్రభుత్వం భీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంతో అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవలే భీం విగ్రహానికి మెరుగులు దిద్దారు. ట్రాక్టర్లతో పరిసరాలు, పార్కింగ్ స్థలాలు చదును చేయించి.. ప్రజలు కూర్చునేందుకు వీలుగా టెంట్లు, కుర్చీలు వేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేస్తున్నారు. భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. 10వేల మందికి పైగా హాజరవుతారని అంచనా వేస్తుండగా, 12 వేల మందికి భోజనాలు సిద్ధం చేస్తున్నారు. హెలిప్యాడ్ సైతం సిద్ధం చేశారు. మారుమూల ప్రాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఏఎస్పీ, డీఎస్పీతోపాటు సీఐ, ఆర్ఐలు 8 మంది, ఎస్సైలు 25, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు 51 మంది, ఇతర సిబ్బంది 136, డబ్ల్యూపీసీలు 56, హోంగార్డులు 79 మంది, ఇతర సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. బాంబు, డాగ్‌స్క్వాడ్‌తో జోడేఘాట్‌కు చేరుకునే రహదారుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఏటీడబ్ల్యూవోలు ముగ్గురు, సీఆర్టీలు, రెగ్యులర్ ఉపాధ్యాయులు 100 మంది, వంట మనుషులు 70 మంది, ఆశ్రమ పాఠశాలల వార్డెన్లు ఐదుగురు, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించారు. ఐకేపీ సిబ్బంది 35 మంది, ఇంజినీరింగ్ శాఖకు చెందిన సిబ్బంది పది మందిని కేటాయించారు. ఆయా శాఖల సిబ్బంది సోమవారం రాత్రే జోడేఘాట్‌కు చేరుకున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను జోడేఘాట్‌కు నడపనున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు సిద్ధం చేశారు. -
భక్తిశ్రద్ధలతో అవ్వల్‌పేన్ పూజ
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో కుమురం భీం వంశస్తులు సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో అవ్వల్‌పేన్ పూజ నిర్వహించారు. మొదట భీం సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించి మౌనం పాటించారు. సమాధి, నాలుగు జెండాలకు పూజలు చేశారు. అనంతరం పోచమ్మ తల్లికి గొర్రె పోతును బలిచ్చి మొక్కు తీర్చుకున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ కార్యక్రమం నిర్వహించినట్లు భీం మనుమడు సోనేరావు తెలిపారు. నిజాం సైనికులతో చేసిన పోరాటంలో సాయంగా నిలిచిన అవ్వల్‌పేన్(పోచమ్మ)కు ఏటా భీం వర్ధంతికి ముందు రోజు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, వివిధ గోత్రాలకు చెందిన ఆదివాసీలు హాజరయ్యారు. -
జోనల్‌స్థాయి పోటీలకు బాక్సర్ల ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని సర్‌సిల్క్ కాలనీలో సోమవారం సబ్ జూనియర్ బాలబాలికల బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపినవారిని జోనల్‌స్థాయి సబ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేశారు. అండర్– 17 బా లుర విభాగంలో సీహెచ్ బాబ్జి, ఫరాన్ఖాన్, సాయిగౌడ్, షేక్ అబ్దుల్ ఇలియాన్, అండర్– 17 బాలికల విభాగంలో టి.సంజన ఎంపికయ్యారు. ఈ నెల 8న నిర్మల్‌లో నిర్వహించే జోనల్‌స్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మధు, కార్యదర్శి శేఖర్, చైర్మన్ శివనాయర్, కోశాధికారి రమాకాంత్, యాదవ్ పాల్గొన్నారు. -
దివ్యాంగుల భవితకు భరోసా
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అధికా రులు చర్యలు చేపడుతున్నారు. సామాజిక న్యా యం, సాధికారతే లక్ష్యంగా 18 ఏళ్లలోపు దివ్యాంగులకు అండగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని భవిత కేంద్రాల ద్వారా ఉచిత విద్య, వైద్యం అందిస్తున్నారు. అలాగే కృత్రిమ అవయవాల తయారీ సంస్థ అలిమ్కో ద్వారా జిల్లాలోని దివ్యాంగ చిన్నారులకు అవసరమైన సహాయ ఉపకరణాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆత్మవిశ్వాసం నింపుతున్న ‘భవిత’ఒకరి సహాయం లేకుండా అడుగు ముందుకు వేయలేని, రోజువారీ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్న శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న చిన్నారులకు భవిత కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. వైకల్యంతో పుట్టిన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్ది, వారిలో ఆత్మవిశ్వాసం నింపడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతీ మండల కేంద్రంలో ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం జిల్లాలోని 15 మండలాల్లో ఈ కేంద్రాలు సేవలందిస్తున్నాయి. ప్రతీ కేంద్రంలో ఇద్దరు ప్రత్యేక ఉపాధ్యాయులు, ఒక స్పీచ్/ఫిజియో థెరపిస్ట్, ఒక ఆయాను నియమించారు. జిల్లాలో 1805 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. వీరిలో 1616 మంది సాధారణ పాఠశాలల్లో విలీన విద్యనభ్యసిస్తుండగా, 136 మంది ఐఈఆర్సీ కేంద్రాల్లో, మరో 53 మంది గృహ ఆధారిత విద్య ద్వారా చదువుకుంటున్నారు. అయితే మొత్తం 56 మంది ఉపాధ్యాయులు అవసరం కాగా, ప్రస్తుతం 33 మందే పనిచేస్తున్నారు. మరో 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటి వద్దే ఉండి చదువుకుంటున్న పిల్లలకు ప్రతీ శనివారం సిబ్బంది వారి ఇళ్లకే వెళ్లి ఫిజియోథెరపి అందిస్తున్నారు. 184 మందికి సహాయ ఉపకరణాలుజిల్లాలో 18 ఏళ్లలోపు 1805 మంది ప్రత్యేక అవస రాల పిల్లల్లో సహాయ ఉపకరణాలు అత్యవసరమై న 184 మందిని అధికారులు గుర్తించారు. ఆగస్టు 28, 29 తేదీల్లో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులను ఎంపిక చేశారు. 184 మంది చిన్నారుల కోసం అలిమ్కో సంస్థ రూ.20,99,113 విలువైన ఫోల్డబుల్ వాకర్స్, ఫోల్డింగ్ వీల్చైర్లు, కమోడ్‌తో కూడిన వీల్చైర్లు, రోలాటర్లు, టీఎల్ఎం కిట్లు, ట్రైసైకిళ్లు వంటి ఉపకరణాలను అందించనుంది. వీటి పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలు లేనివారికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి కార్డులు జారీ చేస్తామని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే అందిస్తాం ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో గుర్తించిన ప్రత్యేక అవసరాలు గల పిల్లలు 184 మందికి త్వరలోనే సహాయ ఉపకరణాలను అందిస్తాం. ప్రత్యేక అవసరాల పిల్లలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. భవిత కేంద్రాల ద్వారా అవసరమైన శిక్షణ, ఫిజియోథెరపి అందిస్తున్నాం. పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించడానికి కట్టుబడి ఉన్నాం. – కటుకం మధుకర్, జిల్లా విలీన విద్య కోఆర్డినేటర్ -
భీం త్యాగానికి గౌరవం
కెరమెరి(ఆసిఫాబాద్): నిజాం సర్కారుకు వ్యతిరేకంగా, ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలర్పించిన భీం త్యాగాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. జల్.. జంగల్.. జమీన్.. నినాదంతో పోరాడి అమరుడైన కుమురంభీం వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో కెరమెరి మండలం జోడేఘాట్‌లో మంగళవారం భీం వర్ధంతి అధికారికంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివాసీల సంప్రదాయం ప్రకారం నివాళులర్పించనున్నారు. ఉదయం 8 గంటలకు జెండాలు ఆవిష్కరించనున్నారు. 9 గంటలకు సమాధి వద్ద పూజలు చేసి, 10 గంటలకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు. ఇప్పటికే కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఏర్పాట్లు పరిశీలించారు. భీం వర్ధంతి నేపథ్యంలో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హాజరు కానున్న మంత్రులు, ప్రజాప్రతినిధులురాష్ట్ర ప్రభుత్వం భీం వర్ధంతిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరు కానున్నారు. అలాగే ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు నివాళులర్పించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కేవలం భీం విగ్రహం వద్ద శ్రద్ధాంజలి ఘటించి, పూజలకే పరిమితం కానున్నారు. ఆదివాసీలు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యలు తీసుకెళ్లేందుకు ఏటా నిర్వహించే దర్బారు కోడ్ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జోడేఘాట్లోని కుమురంభీం విగ్రహంభారీ బందోబస్తు -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
కై లాస్‌నగర్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానా ల్లో పార్టీ పరంగా బలమైన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడంతో పాటు జెడ్పీలను సైతం కైవసం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఆత్రం సుగుణ, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల అధ్యక్షులు శ్రీహరిరావు, విశ్వప్రసాద్‌రావు, భైంసా మార్కెట్ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రాథోడ్ బాపూరావ్, సోయం బాపూరావ్, ఆత్రం సక్కు, ఆదిలాబాద్, బోథ్, ఆసిఫాబాద్ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, అజ్మీరా శ్యామ్‌నాయక్, నాయకులు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రతకు చట్టాలు తీసుకురావాలి
కాగజ్‌నగర్‌టౌన్: మహిళల భద్రతకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సీఐటీయూ జాతీ య కోశాధికారి ఎం.సాయిబాబు డిమాండ్ చేశారు. పట్టణంలోని వినయ్‌గార్డెన్‌లో తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ సదస్సు రెండోరోజు సోమవారం కొనసాగింది. ఆయన మాట్లాడుతూ దేశంలోని 50 కోట్ల మంది కార్మికుల పని, సామాజిక భద్రత, సంక్షేమ చర్యలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ఆశ వర్కర్‌పై దాడి ఘటన విషయంలో స్పందన లేదని మండిపడ్డారు. లైంగిక వేధింపుల చట్టం– 2013ను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు. నవంబర్ 1, 2 తేదీ ల్లో హైదరాబాద్‌లో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు త్రివేణి, రాష్ట్ర కార్యదర్శులు పాలడుగు భాస్కర్, పద్మశ్రీ, భోపాల్, కోశాధికారి వంగూరి రాములు, నాయకులు రమ, రాజేందర్, శ్రీనివాస్, కూశన రాజన్న, దినకర్, ఆనంద్‌కుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు వైద్యులుగా ఎదిగి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన సయ్యద్ అంజద్ అలీ, సయ్యద్ అబుజార్, సయ్యద్ ఇక్రాముద్దీన్ను సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే ప్రయోజకులు కావచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ నదీమ్, సమన్వయకర్త రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాన్ని కొనసాగించాలని ఆందోళన
సిర్పూర్(టి): సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల/కళాశాలను సిర్పూర్(టి)లోనే కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సోమవారం సిర్పూర్(టి)– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై ఆందోళన నిర్వహించారు. సిర్పూర్(టి)లో కొనసాగుతున్న గురుకుల పాఠశాల, కళాశాల భవనం శిథిలావస్థకు చేరిందని, విద్యార్థులను ఇతర గురుకులాలకు తరలించడంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం సుమారు 4 గంటల పాటు రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయాయి. కౌటాల, కాగజ్‌నగర్ మార్గాల్లో వెళ్లేవారు ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఎస్సై సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోళనకారులు, విద్యార్థులకు నచ్చజెప్పారు. ధర్నా విరమింపజేసి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. పడుకుని నిరసన తెలుపుతున్న విద్యార్థులురహదారిపై ధర్నా చేస్తున్న తల్లిదండ్రులు -
ఆసిఫాబాద్ బంద్ ప్రశాంతం
ఆసిఫాబాద్: హిందూ ఉత్సవాలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన బంద్ జిల్లా కేంద్రంలో విజయవంతమైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసిఫాబాద్ పట్టణంలోని దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో ప్రధాన మార్కెట్, ఇతర కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. అఖిలపక్ష నాయకులు, హిందూ సంఘాల నాయకులు, దుర్గామాత, గణేశ్ మండళ్ల నిర్వాహకులు స్థానిక షిర్డీసాయి మందిర్ వద్ద సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైని సస్పెండ్ చేయడంతోపాటు నిమజ్జనం సందర్భంగా పలువురిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌కు వినతిపత్రం అందించారు. వ్యాపారులు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులతో ఎదురవుతున్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది అధికారులు పండుగలపై ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవా లని కోరారు. అఖిలపక్ష పార్టీల నాయకులు మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదెవేణి మల్లేశ్, గుండ శ్యామ్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. గాంధీచౌక్‌లో మూసిఉన్న దుకాణాలు వినతిపత్రం ఇస్తున్న అఖిలపక్ష నాయకులు -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే హరీశ్‌బాబు అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం ఆధ్వర్యంలో రెబ్బెన మండలానికి చెంది న బీఆర్ఎస్ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చే యాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా బొడ్డు మౌనిక, నానవేణి మల్లేశ్, బొడ్డు రాజ్‌కుమార్, గంగాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇగురపురమేశ్ బీజేపీలో చేరా రు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అన్నపూర్ణ, నాయకులు సుదర్శన్‌గౌడ్, ఎలమంచిలి సునీల్ చౌదరి, కుందారపు బాలకృష్ణ, సొల్లు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కాటేస్తున్న కరెంటు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గొమాసి పోశయ్య. దహెగాం మండలం పీకలగుండం గ్రామానికి చెందిన ఇతను గత నెల 18న పంట చేనులో మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలా జిల్లాలో విద్యుత్ ప్రమాదాల్లో ఏటా జంతువులు, మనుషులు మృత్యువాత పడుతున్నారు. పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలో విద్యుత్ ప్రమాదాల కలవరపెడుతున్నాయి. కరెంట్ తీగలు యమపాశాలుగా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. నివాస గృహాలతోపాటు పంట పొలాల వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారు. ప్రమాదాల నివారణకు విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నా క్షేత్రస్థాయిలో ఫలితం ఉండటం లేదు. దీంతో జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతేడాది ఎనిమిది మంది మృత్యువాతజిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల పరిధిలో గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు అనేక విద్యుత్ ప్రమాదాలు జరగాయి. ఎనిమిది మంది మృత్యువాత పడగా, 18 జంతువులు మృతి చెందాయి. అలాగే ఈ ఏడాదిలో ఇప్పటివరకు విద్యుత్ ప్రమాదాల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 19 జంతువులు చనిపోయాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నిర్లక్ష్యంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు సొంతంగా ఎలాంటి పనులు చేయొద్దని, సమస్యలు ఉంటే వెంటనే విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరుతున్నారు. జాగ్రత్తలు అవసరంవర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్ పరికరాలను తడిచేతులతో తాకొద్దు. తెగిపోయిన వైర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. గ్రామ్లాలోని విద్యుత్ లైన్ల కింద ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు. ఇంట్లోని పాత విద్యుత్ తీగలు, లైట్లు, స్విచ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలించి అవసమైతే కొత్తవి బిగించాలి. ఇనుప చువ్వల దగ్గర విద్యుత్ తీగలు లేకుండా జాగ్రత్త పడాలి. కూలర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వాడే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. రైతులు పంట రక్షణకు విద్యుత్ తీగలు వినియోగించవద్దు. మోటార్లు ఆన్ చేసే సమయంలో చేతులు తడిగా ఉండకుండా చూసుకోవాలి. సమాచారం అందించాలి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో వేలాడే విద్యుత్ తీగలు ఉంటే సరిచేసుకోవాలి. కాలం చెల్లిన తీగలు, బోర్డుల స్థానంలో కొత్తవి బిగించుకోవాలి. విద్యుత్ తీగలు వేలాడుతున్నా, స్తంభాలు ఒరిగిపోయి ఉన్నా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. సొంతంగా ట్రాన్స్ఫార్మర్ల వద్ద మరమ్మతులు చేయొద్దు. – అంజల్‌కుమార్, విద్యుత్‌శాఖ ఏఈ, పెంచికల్పేట్ -
ఇప్పటికీ చుక్క రాలే..
ఆసిఫాబాద్‌అర్బన్/ఆసిఫాబాద్‌రూరల్: రూ.కోట్లు వెచ్చించి ఆసిఫాబాద్ పట్టణంలో ఇంటింటికీ నల్లా కనెక్షన్లు ఇచ్చినా పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్నాయి. ఐదు రోజులుగా పలు కాలనీలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పట్టణంలోని రాజంపేట కాలనీలోని ఇళ్లకు ఇప్పటివరకు చుక్క నీరు సరఫరా కాలేదు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడలో 570 కుటుంబాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇప్పటికీ నల్లాలు బిగించలేదు. ప్రజలు బావి నీళ్లే తాగుతున్నారు. వర్షాకాలంలో నీరు కలుషితమైతే డబ్బులు పెట్టి మినరల్ వాటల్ కొనుక్కుంటున్నారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
కాగజ్‌నగర్‌టౌన్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షం గౌడ్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని పటేల్ గార్డెన్లో ఆదివారం పీఆర్టీయూ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతి థిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 317 జీవో రద్దుకు పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సునార్కర్ అనిల్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నరసింహచారి, నాయకులు రాకేష్, శ్రవణ్, గంగాభవానీ, ప్రకాశ్, హన్మంతు, అనురాధాబాయి, వేణుగోపాల్, ఇందారపు ప్రకాశ్, భిక్షపతి, దేవాజీ పాల్గొన్నారు. -
రెండు నెలలుగా దాహం కేకలు
లింగాపూర్: మండలంలోని పలు గ్రామాల్లో తాగునీరు సరఫరా కావడం లేదు. మండల కేంద్రంతోపాటు కీమానాయక్ తండా, పిక్లాతండా, మోతీగూడ గ్రామాలకు రెండు నెలలుగా భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని పంచాయతీ బోరుకు నాలుగు నెలలుగా మరమ్మతు కూడా చేయించడం లేదు. ఇక మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో 50 కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో సమీపంలో ఉన్న ఒకేబోరుపై ఆధారపడుతున్నారు. పిల్లలకు కనీసం స్నానాలు చేయించేందుకు నీళ్లు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుదాం
కాగజ్‌నగర్‌టౌన్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్య తిరేక విధానాలను ఎండగడుదామని సీఐటీ యూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు పిలుపునిచ్చారు. పట్టణంలో ఆదివారం తెలంగాణ శ్రామిక మహిళా సమన్వయ కమి టీ రాష్ట్ర ఐదో సదస్సు నిర్వహించారు. బాలభారతి స్కూల్ నుంచి వినయ్గార్డెన్ వరకు గుస్సాడీ, ఒగ్గు డోలు, ఆదివాసీ కళాకారులతో ర్యాలీ చేపట్టారు. అనంతరం వినయ్ గార్డెన్లో సీఐటీయూ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు ఆర్.త్రివేణి అధ్యక్షత బహిరంగ సభ నిర్వహించారు. సాయిబాబు మాట్లాడుతూ బీడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, ఐకేపీ, మధ్యాహ్న భోజన, మెడికల్ అండ్ హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలకు కనీస వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ప్రసూతి సెలవులు, ఈఎస్ఐ, పీఎఫ్, పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు భాస్కర్, రమ, భూపాల్, వెంకటేశ్, జయలక్ష్మి, పద్మ శ్రీ, శ్రీనివాస్, రాజేందర్, కూశన రాజన్న, దుర్గం దినకర్, కార్తీక్, టీకానంద్, ఆనంద్, ఆర్.మహేశ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ముంచిన ‘పెన్‌గంగ’
సిర్పూర్(టి): జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర కురుస్తున్న వర్షాలకు ఈ ఏడాది పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేని వర్షాలతో పెన్‌గంగ వరద పరీవాహక ప్రాంతాల్లోని పంటలను ముంచెత్తింది. సిర్పూర్–టి మండలంలోని మాకిడి, హుడ్కిలి, జక్కాపూర్, వెంకట్రావ్‌పేట్, టోంకిని, పారిగాం, లోనవెల్లి గ్రామాల రైతుల పంటలు వరదనీటిలో మునిగిపోయాయి. పత్తితోపాటు మిరప మొక్కలు రోజుల తరబడి వరదలో ఉండటంతో కుళ్లిపోయాయి. తీవ్రస్థాయిలో నష్టంసిర్పూర్–టి మండలంలో అనేక గ్రామాలు పెన్‌గంగ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. అలాగే సిర్పూర్(టి) వాగు, లక్ష్మీపూర్ వాగు, భూపాలపట్నం జీడివాగు, చీలపెల్లి వాగు, ఇటిక్యాల పహాడ్ వాగులు కూడా ఉప్పొంగాయి. ఫలితంగా మండలంలో వందల ఎకరాలు పంటలు వరదనీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారు. వ్యవసాయ శాఖ అధికారులు 400 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నట్లు అంచనా వేయగా, రైతులు మాత్రం ప్రతీ గ్రామంలో పంటలు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగానే నష్టపోయినట్లు వాపోతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పంట సర్వేలు నిర్వహించి రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు. రైతులను ఆదుకోవాలి కొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వం స్పందించి సకాలంలో రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. – కిర్మరే శ్యాంరావ్, హుడ్కిలి, మం.సిర్పూర్(టి) -
అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని సస్పెండ్ చేయాలి
ఆసిఫాబాద్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎస్సైని వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో దుర్గా, శారదామాత నిమజ్జనం సందర్భంగా శాంతి యుతంగా ఊరేగింపు చేపట్టిన బ్రాహ్మణవాడ శారదా మండలి మహిళలపై ఎస్సై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిర్వాహకులపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం కేశవనాథ మినీ ఫంక్షన్ హాల్లో హిందూ సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ఉత్సవాలపై పోలీసుల పెత్తనమెంటని ప్రశ్నించారు. డీజేలను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, యువకులపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన సీఐ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. శుక్రవారం రాత్రి ఏఎస్పీ చిత్తరంజన్ ఎస్సైపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, తెల్లవారుజామున నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైని సస్పెండ్ చేయాలని, నిర్వాహకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలన్నారు. దీనిపై లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ హిందూ ఉత్సవ సమితికి అఖిలపక్షం అండగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల సంతోష్, మాజీ ఏఎంసీ చైర్మన్లు చిలువేరు వెంకన్న, గాదెవేణి మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాండ్రే విశాల్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ బంద్..!
మిషన్ భగీరథ నీటిని సక్రమంగా సరఫరా చేయాలని ఖాళీ బిందెలతో గత నెల 29న కౌటాల మండలం మొగడ్దగడ్లో మహిళలు నిరసన వ్యక్తం చేశారు. రెండు వారాలుగా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో మిషన్ భగీరథ కార్మికుల సమ్మెతో నీటి సరఫరా నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్నారు. కౌటాల(సిర్పూర్): జిల్లాలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మిషన్ భగీరథ పథకంకింద వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగడంతో సరఫరాకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. దాదాపు 15 రోజులుగా కొన్నిప్రాంతాల్లో పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎప్పుడు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు శుద్ధజలం అందడం లేదు. చేతిపంపులు, బోర్లు, బావులపై ఆధారపడి దాహం తీర్చుకుంటున్నారు. వర్షాలకు బావుల్లో నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ చర్యలేవి..?జిల్లాలో మిషన్ భగీరథ పథకం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అసంపూర్తి పైప్లైన్లు, లీకేజీలతో పాటు సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. నిధుల లేమిలో పంచాయతీ సిబ్బంది గ్రామాల్లో క్లోరినేషన్ పనులు నిలిపివేశారు. వర్షాకాలం కావడంతో బావుల్లోని నీటిని తాగితే సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. తాగునీటి కోసం జిల్లాలోని రెండు వందలకు పైగా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసినా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. -
అవ్వల్‌పేన్ పూజలకు వేళాయె
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం జోడేఘాట్‌లో సోమవారం సాయంత్రం కుమురంభీం వారసులు అవ్వల్‌పేన్(పోచమ్మ)కు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. గిరిజనుల హక్కుల కోసం నిజాం ప్రభుత్వంతో సాగిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన కుమురంభీం వర్ధంతికి ముందురోజు ఈ పూజ లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నిజాం సైనికులను ఎదుర్కొవడంలో భీంకు పోచమ్మ అండగా నిలిచిందని ఆదివాసీలు నమ్ముతారు. అనేకసార్లు భీంపై పోలీసులు కా ల్పులు జరిపినా అమ్మ ఆశీస్సులతోనే ఆయన తప్పించుకునేవారని చెబుతుంటారు. మంత్ర దండం శక్తి ద్వారా తేనెటీగలను అస్త్రాలుగా ఉపయోగించేవారని, ఆముదం విత్తనాలతో తనను తాను రక్షించుకునే వారని విశ్వసిస్తారు. ఈ కారణాలతో ఏటా కుమురంభీం వారసులు, ఆదివాసీలు పోచమ్మ తల్లికి ఘనంగా పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం జోడేఘాట్లోని భీం సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఆక్కడ జెండాలు ఆవిష్కరిస్తారు. పోచమ్మకు గొర్రెను బలి ఇచ్చి మొక్కులు చెల్లిస్తారు. ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆదివాసీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. -
సమావేశం సక్సెస్ చేయాలి
రెబ్బెన: కాగజ్‌నగర్‌లోని వినయ్ గార్డెన్స్‌లో ఈనెల 5, 6వ తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ శ్రామిక మహిళా ఐదో రాష్ట్ర కన్వెన్షన్‌ను విజయవంతం చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి శ్రామిక మహిళా ఉద్యమ నాయకులు, ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మ హిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, ఉద్యోగ తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూ పొందిస్తారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5న ఉదయం 11గంటలకు ఎస్పీఎం గ్రౌండ్ నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వర కు భారీ ప్రదర్శన ఉంటుందని తెలిపారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించనున్న ట్లు పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మండలా ల నుంచి అధికసంఖ్యలో శ్రామిక మహిళలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యుడు చాపిడి శివ, గ్రామకార్యదర్శి డోంగ్రి గజానంద్ పాల్గొన్నారు. -
ఎండిపోయిన మొక్కలు
గతంలో హరితవనంలో భాగంగా మ్యూజియం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో టూరిజం, అటవీశాఖ అధికారులు సుమారు 29వేల మొక్కలు నాటారు. మనిషి ఆకృతిని నిర్మించి అవయవాల వద్ద 100రకాల ఔషధ మొక్కలు నాటి వది లేశారు. ఏ అవయవానికి అవసరమయ్యే మొక్కలను వాటి వద్దే నాటగా అవి నీరు లేక ఎండిపోయాయి. ప్రస్తుతం లోటస్‌పాండ్‌లోని మనిషి ఆకృతిలో ఔషధ మొక్కల స్థానంలో పిచ్చి మొ క్కలు దర్శనమిస్తున్నాయి. గతేడాది ఉపాధిహా మీ పథకంలో నాటిన కొన్ని మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. హరితవనంలో భాగంగా నాటి న సుమారు 29వేల మొక్కల్లో ప్రస్తుతం రెండువేల మొక్కలు కూడా కనిపించడం లేదు. -
నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు
రెబ్బెన: ఫర్టిలైజర్ షాపుల్లో నాసిరకం మందులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాఽధికారి వెంకట్ హెచ్చరించారు. శని వారం మండల కేంద్రంతోపాటు నారాయణపూర్‌లోని ఫర్టిలైజర్ షాపులు, నారాయణపూర్ రైతువేదికలో యూరియా పంపిణీని తనిఖీ చేశారు. షాపుల్లోని రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో ప్రభుత్వ ధరలకే ఎరువులు విక్రయించాలని సూచించారు. రై తులకు నకిలీ, నాసిరకం మందులు అంటగట్టినా, అధికధరలకు విక్రయించినా లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. విత్తనా లు, ఎరువుల కొనుగోలు సమయంలో రైతులు తప్పనిసరిగా రశీదులు పొందాలని సూ చించారు. రైతులకు సరిపడా యూరియా సరఫరా అవుతోందని, మోతాదుకు మించి వాడి తే భూసారం దెబ్బతింటుందని తెలిపారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సా రించి అధిక దిగుబడులు పొందాలని సూచించారు. ఆయన వెంట ఏవో దిలీప్, ఏఈవోలు రాకేశ్, సంజీవ్, శివ తదితరులున్నారు. -
మరిచారా?
రణభూమిని కెరమెరి: చరిత్ర పుటల్లోకెక్కిన ఆదివాసీ వీరుడు కు మురంభీం జల్.. జంగల్.. జమీన్.. కోసం ప్రాణ త్యాగం చేసిన ప్రాంతమైన జోడేఘాట్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. భీం వర్ధంతి సమీపిస్తుండడంతో సందర్శకుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్రలోని చంద్రపూర్, రాజూరా, గడ్చందూర్ తదితర ప్రాంతాలకు చెందిన ఇక్కడికి వస్తున్నారు. అయితే.. సందర్శకులకు ఇక్కడా తాగునీరు కూడా లభించని దుస్థితి ఉంది. ఒక్కగానొక్క బోరు ఉండగా అది గ్రామస్తుల తాగునీటి అవసరాలకు సరిపోతోంది. దీంతో కనీస సౌకర్యాలు లేక ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. నెరవేరని కేసీఆర్ హామీ2014లో నిర్వహించిన భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ జోడేఘాట్‌లో రూ.25కోట్లతో కుము రం భీం విగ్రహంతో పాటు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామని, పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యకు తగినట్లు కాటేజీలు, హోటళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పదకొండేళ్లయినా నేటికీ కార్యరూపం దాల్చ లేదు. ఉమ్మడి జిల్లాలోని వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి జోడేఘాట్ అభివృద్ధిని విస్మరించారనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ సర్కారుదీ అదే తీరు అప్పటి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ప్ర స్తుత ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు జోడేఘాట్‌లో రూ.4.96 కోట్లతో టూరిజం అభివృద్ధి పనులకు ఈ ఏడాది జనవరి 13న శంకుస్థాపన చేశారు. మ్యూజియం వెనుక భాగంలోని స్థలంలో కాటేజీ లు, హోటళ్లు నిర్మించనున్నట్లు ప్రకటించారు. తొ మ్మిది నెలలైనా నేటికీ పనులు ప్రారంభించలేదు. 12 పోరు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా నేటికీ కార్యరూపం దాల్చలేదు. పాలకుల హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. పనులు ప్రారంభించాలి పాలకులు జోడేఘాట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. పర్యాటకుల కోసం కాటేజీలు నిర్మించాలి. ఐటీడీఏ ఆధ్వర్యంలో హోటళ్లు ఏర్పాటు చేయాలి. ఎండిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు నాటించాలి. మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించి ఓ కూలీని నియమించాలి. పాలకులు, అధికారులు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలి. – పెందోర్ రాజేశ్వర్, పోరు గ్రామాల అధ్యక్షుడు ‘కుమురం భీం మ్యూజియం నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు చేశాం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి విశ్రాంతి కోసం కాటేజీలు, మంచి హోటల్ నిర్మిస్తాం. భవిష్యత్‌లో జోడేఘాట్ చారిత్రక ప్రదేశంగా మారుతుంది. పర్యాటకుల తాకిడి కూడా బాగా పెరుగుతుంది’ – 7.10.2014న భీం వర్ధంతి సభలో అప్పటి సీఎం కేసీఆర్ అన్న మాటలివి. -
భీం వర్ధంతికి ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: కెరమెరి మండలం జోడేఘాట్‌లో ఈ నెల 7న నిర్వహించనున్న కుమురంభీం వర్ధంతికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో భీం వర్ధంతి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాగునీరు, విద్యుత్, రవాణా, భోజన వసతి, వైద్య సౌకర్యాలు కల్పించాలని, పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రజల కు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాల ని తెలిపారు. ఆర్టీసీ అధికారులు జోడేఘాట్‌కు ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రహదారులు మరమ్మతు చేయాలని, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి వర్ధంతిని విజయవంతం చేయాలని సూ చించారు. డీపీవో భిక్షపతి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రమాదేవి, డీఎంహెచ్‌వో సీతారాం, డీఎల్పీవో ఒమర్ హుస్సేన్, ఇంజినీరింగ్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించాలిపంచాయతీ ఎన్నికలు నిబంధనలకు లోబడి సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల కళాశాలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 9నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జిల్లాలో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్‌రూమ్, కౌంటింగ్ గదుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్, జెడ్పీ కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 7న విద్యాసంస్థలకు సెలవుఆసిఫాబాద్రూరల్: కుమురం భీం వర్ధంతిని పురస్కరించుకుని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఈ నెల 7న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జోడేఘాట్‌లో కుమురం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 7కు బదులు నవంబర్ 8న రెండో శనవారాన్ని పనిదినంగా పరిగణించనున్నట్లు తెలిపారు. -
‘పాలఘోరీ’పై ప్రత్యేక నిఘా
జన్నారం: అటవీశాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పాలఘోరీ ఘటన మళ్లీ పు నరావృత్తం కాకుండా ఉండేందుకు ఆశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రెండేళ్ల క్రితం కూడా ఇలాంటి స మస్య ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యా రు. ఏ క్షణంలోనైనా ఆదివాసీ గిరిజనులు గుడిసెలు వేసుకునే అవకాశం ఉండడంతో అటవీశాఖ అధికా రులు అదే ప్రాంతంలో తిష్ట వేశారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. గుడిసెలు తొలగింపుజన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్ కవ్వాల్ అటవీ సెక్షన్, సోనాపూర్ తండా బీట్ పాలఘోరీ ప్రాంతంలో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్, జైనూర్, లింగాపూర్ మండలాలకు చెందిన సుమారు వందమంది ఆదివాసీ గిరిజనులు ఆగస్టు 4న ఈ ప్రాంతంలో తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. అట వీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు వారికి ప లుసార్లు కౌన్సిలింగ్ ఇచ్చి ఆప్రాంతాన్ని ఖాళీ చేయాలని సూచించారు. కానీ, వారు వెళ్లకపోగా సెప్టెంబ ర్ 18న రాత్రి సుమారు 350 టేకుచెట్లను నరికారు. అడ్డుగా వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడ్డారు. దీంతో 26 మందిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సహాయంతో అడవిలో వేసుకున్న గుడిసెలను తొలగించారు. ప్రత్యేక నిఘాగుడిసెలు తొలగించిన తర్వాత మళ్లీ ఎప్పుడైనా ఆదివాసీ గిరిజనులు తిరిగి ఆ ప్రాంతానికి వచ్చే అ వకాశం ఉందని జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశి ష్ సింగ్ పది రోజులపాటు అక్కడే ఉండాలని టా స్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. జన్నారం అటవీ డివిజనల్ అధికారి రామ్మోహన్ ఇందన్పల్లి, జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్లలోని సిబ్బందికి రోజువారీగా డ్యూటీలు వేశారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక టీం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరో టీం, సాయంత్రం 7గంటల నుంచి తెల్లవారుజాము వరకు మరో టీంను ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. వీరితో పాటుగా ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీకాంతచారి, టాస్క్ ఫోర్స్ రేంజ్ అధికారి శ్రీనివాస్ పర్యవేక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా పాలఘోరీ ప్రాంతంలోని అటవీ సిబ్బందిలో మార్పులు చేశారు. డీఆర్వో, సెక్షన్ అధికారి, బీట్ అధికారులను నూతనంగా నియమించారు. ఇక్కడి బేస్‌క్యాంపు సిబ్బందిని మరోచోటకు పంపించి కొత్తవారిని నియమించారు. విధుల్లో చిన్న నిర్లక్ష్యం ప్రదర్శించినా వేటు తప్పదని సంకేతాలు ఇవ్వడంతో కిందిస్థాయి సిబ్బంది భయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలుస్తోంది. కందకాల తవ్వకంపాలఘోరీ ప్రాంతంలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురి కావడాన్ని సీరియస్‌గా తీసుకున్న అట వీ అధికారులు ఆ ప్రాంత పరిసరాల్లో చుట్టూ కందకాలను తవ్వించారు. అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ బాధ్యతలను సిబ్బందికి అప్పగించారు. అయితే టైగర్‌జోన్ సర్కిల్, జిల్లా అటవీశాఖ, జన్నారం డివిజన్ శాఖ నుంచి పాలఘోరీపై నిఘా ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా ఉంచాం పాలఘోరీ ప్రాంతంలో కొందరు ఆదివాసీ గిరిజనులు అక్రమంగా వేసుకున్న గుడిసెలు తొలగించాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేక నిఘా ఉంచాం. సిబ్బందికి ప్రత్యేక డ్యూటీలు వేశాం. అటవీ భూమిలో అక్రమంగా గుడిసెలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. – రామ్మోహన్, ఎఫ్‌డీవో, జన్నారం -
దసరా జోష్
ఆసిఫాబాద్: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలో వ్యాపారాలు జోరుగా సాగాయి. వివిధ దుకాణాలు కొనుగోలు దారులతో కళకళలాడాయి. పెద్ద ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. కిరా ణా, పండ్లు, పూలు, మాంసం దుకాణాలు కొనుగో లుదారులతో రద్దీగా కనిపించాయి. బంగారు ఆభరణాల దుకాణాలు సందడిగా మారాయి. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు నడపడంతో ఆర్టీసీకి రోజూవారీ ఆదాయం పెరిగింది. జోరుగా మద్యం అమ్మకాలుదసరా సందర్భంగా జిల్లాలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. గత నెల 28నుంచి ఈ నెల ఒకటి వరకు జిల్లాలోని 32మద్యం దుకాణాల్లో రూ.5.47 కోట్ల విలువైన 7.098 ఐఎంఎల్ కేసులు, 3,203 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. డిమాండ్‌ను ఊహించిన వైన్స్ యజమానులు ముందుగానే సరిపడా స్టాక్ అందుబాటులో ఉంచారు. వ్యాపారులకు లాభాలు ప్రధానంగా మద్యం, మాంసం విక్రయాలతో పా టు షాపింగ్ మాల్స్, ఎలక్ట్రానిక్ దుకాణాలు ఇతర వ్యాపార సముదాయాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. బతుకమ్మ సందర్భంగా పండ్లు, పూల వ్యాపారాలు జోరుగా సాగాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 100కు పైగా మాంసం దుకాణాల్లో సుమారు రూ.కోటికి పైగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంగా బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా బిజినెస్ బాగా జరిగి వ్యాపారులకు లాభాలు వచ్చాయి. ఆర్టీసీకి సమకూరిన ఆదాయందసరా సెలవులు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. జిల్లాకు చెందిన వందలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు సొంతూళ్లకు తరలివచ్చారు. వ్యాపారులు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో ఉంటున్నవారంతా సొంతూళ్లకు చేరుకున్నారు. ఈ క్రమంలో గత నెల 25నుంచి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులు వేశారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, ఆదిలాబాద్‌తో పాటు మహారాష్ట్రకు ప్రయాణికుల తాకిడి పెరి గింది. సాధారణంగా ఆసిఫాబాద్ డిపోకు నిత్యం సగటున రూ.16 లక్షల ఆదాయం సమకూరుతుండగా, దసరా సందర్భంగా అదనపు ఆదాయం వచ్చింది. గత నెల 26నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకు రూ.1.78 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. -
కాలువల ఆనవాళ్లేవి?
బర్రెలు సేద తీరుతున్న ఈ ప్రాంతం నీటిగుంట అనుకుంటే పొరపాటే. ఇది అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువకు ఉప కాలు వ. కొన్నేళ్ల క్రితం సిమెంట్ లైనింగ్ కొట్టుకుపో యి ఇలా తయారైంది. సామేలా, కోమటిగూడ, దుబ్బగూడ, కనర్గాం గ్రామాల మీ దుగా ఆసిఫాబాద్ మండలంలోని గుండా వరకు విస్తరించిన దీనికి పలు పిల్ల కాలువలు న్నాయి. పలుచోట్ల కాలువకు గండ్లు పడి అటు వైపు ఆయకట్టుకు నీరు అందడం లేదు. ఇది 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన అడ ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలువ. ఇటీవల కురిసిన వర్షాలకు చిన్నవాంకిడి సమీపంలో భారీ గండి పడి నీరు వాగులో కలుస్తోంది. దీంతో దిగువ ప్రాంతంలో నీటిబొట్టూ లేకుండా ఎండిపోయింది. ఏళ్లుగా కాలువకు మరమ్మతులు చేపట్టకపోవడంతో సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, పూడికతో నిండి అధ్వానంగా, కళావిహీనంగా మారింది. వాంకిడి: సిమెంట్ లైనింగ్ కొట్టుకుపోయి పిచ్చి మొక్కలు, తుంగ, చెత్తాచెదారం, పూడికతో నిండిన అడ (కుమురంభీం) ప్రాజెక్ట్ ప్రధాన ఎడమ కాలు వ అధ్వానంగా మారింది. అధికారుల నిర్వహణ లోపంతో సాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. అడపాదడప చేపడుతున్న నాణ్యతలేని మరమ్మతు పనులతో తరచూ కాలువ తెగిపోతోంది. దీంతో చివరి ఆయకట్టుకు సాగునీరు అందక రైతు లు ఇబ్బంది పడుతున్నారు. కాలువకు సమీపంలోని పొలాలకూ చుక్క నీరు అందించలేని పరిస్థితి ఏర్పడింది. మండలంలో సాగునీటికి ప్రధాన వనరుగా ఉన్నా ఈ ఎడమ కాలువ నిర్వహణ లోపంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. 39,500 ఎకరాల ఆయకట్టు అడ ప్రాజెక్ట్‌ను 2011లో ప్రారంభించగా ప్రధాన ఎడమ కాలువను వాంకిడి మండలం గుండా నిర్మించారు. 65కిలోమీటర్ల ఈ కాలువ 39,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇది వాంకిడి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) మండలాల మీదుగా విస్తరించి ఉంది. అనేక ఉప, పిల్ల కాలువతో సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కొన్ని పిల్ల కాలువలకు నీటి సరఫ రా కూడా ప్రారంభించ లేదు. కట్టలు తెగిపోవడం, గండ్లు పడటం లాంటి అవాంతరాలు ఏర్పడిన ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రస్తుతం సాగునీరు ఒర్రెలు, వాగుల్లో కలిసిపోతున్న పరిస్థితి నెలకొంది. నామమాత్రంగా ఆరుతడి పంటలుఎడమ కాలువ నిర్వహణ సరిగా లేక వరి, కూరగాయలు లాంటి పంటల సాగు నామమాత్రంగానే ఉంది. వర్షాధారంపై సాగుచేసే పత్తి పంటకు చలి కాలం చివరలో సాగునీటి అవసరముంటుంది. రై తులు ఏటా ఈ కాలువకు ఆయిల్ ఇంజన్లు పెట్టి తడులు అందించేవారు. కానీ, కాలువ బండ్ తెగిపోగా ఈసారి ఆ పరిస్థితి లేదు. బండ్‌కు మరమ్మతు చేపట్టిన తర్వాత కూడా అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా అధిక మొత్తంలో నీరు విడుదల చేస్తే కాలువ మళ్లీ కోతకు గురయ్యే ప్రమాదముంది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనప్పటికీ వర్షాలు తగ్గు ముఖం పడితే గాని ప నులు ప్రారంభించలేమని అధికారులు చెబుతున్నా రు. దీంతో పత్తికి నీటి తడులు అందించడం కష్టమే. ఈ ఏడాది కురిసిన అధిక వర్షాలకు పత్తి రైతు చిత్తవుతుండగా, చివరలో నీటి తడులు అందించలేని పరిస్థితుల్లో మరింత నష్టపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టాలి ఇటీవల కురిసిన వర్షాలకు మా గ్రామ శివారులోని ప్రధాన కాలువ తెగగా నీటి సరఫరా నిలిపేశారు. త్వరగా మరమ్మతు చేపట్టి సాగునీరు సరఫరా అయ్యేలా చూడాలి. నా పొలం పక్క నుంచే పిల్ల కాలువ ఉన్నా ఇప్పటివరకు నీరు రాలేదు. నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటే చాలావరకు ఖర్చు తగ్గుతుంది. – వడ్గురె భూషణ్, రైతు, చిన్నవాంకిడి త్వరగా పనులు చేపట్టాలి చలికాలం చివరలో పత్తి పంటకు నీటి తడులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు కాలువనీరే ఆధారం. ప్రస్తుతం కాలువ తెగిపోయి ఉండగా సాగునీరు అందుతుందో లేదోనని ఆందోళనగా ఉంది. అధికారులు కాలువను పరిశీలించి వర్షాలు తగ్గుముఖం పట్టాక మరమ్మతులు చేపడతామన్నారు. త్వరగా పనులు చేపట్టాలి. – వడ్గురె పాపాలాల్, రైతు, చిన్నవాంకిడి చిన్నవాంకిడి వద్ద తెగిన బండ్ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన వరదతో చిన్నవాంకిడి శివారులో ఎడమ కాలువ బండ్ తెగింది. దీంతో కాలువకు నీటి సరఫరా నిలి పివేశారు. మూడేళ్ల క్రితం వరద ధాటికి అదే ప్రాంతంలో బండ్ తెగిపోగా మరమ్మతు చే యించారు. కానీ, నాణ్యత లేమితో పనులు మూడేళ్లూ నిలవలేక పోయాయి. చిక్లీ వాగు పైనుంచి కాలువ నిర్మించగా తరచూ బండ్ తెగిపోతోంది. దీనిపై ప్రాజెక్ట్ డీఈ దామోదర్‌ను వివరణ కోరగా.. బండ్ మరమ్మతుకు రూ.40 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వ ర్షాలు తగ్గుముఖం పట్టాక పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అయితే మరమ్మతులు చేపడితేనే గాని ఈ కాలువ గుండా నీరు సరఫరా చేయలేని పరిస్థితి ఉంది. -
చోరీలతో భయం.. భయం!
కాగజ్‌నగర్‌టౌన్: చోరీలతో కాగజ్‌నగర్ పట్టణ ప్రజలు భయం గుప్పిట్లో గడుపుతున్నారు. ఆరు నెలలుగా వరుస ఘటనలు చోటు చేసుకుంటుండగా, వారం రోజుల వ్యవధిలో నాలుగు దొంగతనాలు జరిగాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని ఫారెస్ట్ లైన్‌లోని ఎస్పీఎం టీఆర్టీ– 111 క్వార్టర్లో శుక్రవారం చోరీ జరిగింది. రాత్రి 10 గంటలకు దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లారు. అంతకు ముందు సెప్టెంబర్ 29న సద్దుల బతుకమ్మ రోజు కూడా రాత్రి ఓల్డ్ కాలనీలోని డి– 111 క్వార్టర్ ఇంటి పైకప్పు పగలగొట్టి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. రెండు తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా రాత్రిపూట అగంతకులు ఇంటి తలుపులు కూడా తడుతున్నారని మహిళలు భయాందోళనలు చెందుతున్నారు. పోలీసుల నిఘా తగ్గడంతోనే దొంగలు చేతికి పని చెబుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కొందరు బాధితులు ఫిర్యాదు చేస్తుండగా, కొందరు మాత్రం ఫిర్యాదుకు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు సైతం చోరీల వివరాలు బయటకు పొక్కకుండా ఇంటి యజమానులతో మాట్లాడి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పూర్తిస్థాయి నిఘా ఏది..? కాగజ్‌నగర్ పట్టణంలో 30 వార్డులు ఉండగా, 70 వేల వరకు జనాభా ఉంది. పట్టణంలో పోలీసు నిఘా కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రిళ్లు కాసేపు పోలీసులు వాహనం తిప్పి ఫొటోలు తీసుకోవడం తప్ప పూర్తిస్థాయిలో నిఘా పెట్టడం లేదని పట్టణవాసులు మండిపడుతున్నారు. గతంలో చోరీలు చేసిన నేరస్తులను పట్టుకోకపోవడం, కేసుల్లో పురోగతి లేకపోవడంతో వారే మళ్లీ ఇక్కడే చోరీలు చేస్తున్నారా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. ప్రధానంగా పట్టణంలోని ఎస్పీఎం క్వార్టర్స్ ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి. ఇళ్ల చుట్టూ చెట్లు ఏపుగా పెరిగి పెరిగాయి. సిర్పూర్ పేపర్ మిల్లులో ఇతర ప్రాంతాలైన బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు ఒక్కో క్వార్టర్లో 10 నుంచి 15మంది గ్రూప్‌లుగా ఉంటున్నారు. ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడం లేదో తెలియని పరి స్థితి నెలకొంది. రాత్రి సమయంలో ఓల్డ్ కాలనీ, న్యూకాలనీ క్వార్టర్లలో అపరిచితులు తిరుగుతున్నారని కాలనీల ప్రజలే చెబుతున్నారు. పోలీసులు నిఘా పెంచి చోరీలు అరికట్టాలని కోరుతున్నారు. నాలుగు టీంలు ఏర్పాటు చేశాం కాగజ్‌నగర్ పట్టణంలో వరుసగా దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో రాత్రిపూట గస్తీ పెంచుతాం. దొంగలను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకుంటాం. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్ -
ప్రజలకు విజయాలు చేకూర్చాలి
● ఎస్పీ కాంతిలాల్ పాటిల్ఆసిఫాబాద్: విజయ దశమి ప్రజలకు విజయాలు చేకూర్చాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో గురువారం ఆయుధ పూజ, వాహన పూజ, శమీపూజ నిర్వహించారు. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ విజయదశమి పర్వదినం ప్రజలకు సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను దైవ స్వరూపంగా భావించి పూజలు చేయడం సంప్రదాయంగా వస్తుందని తెలిపారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది స్నేహపూర్వకంగా అలయ్ బలయ్ నిర్వహించి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఎస్పీ, ఏఎస్పీని ఎత్తుకుని సంబురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐలు అంజన్న, పెద్దన్న, సీఐ బాలాజీ వరప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణాప్రతాప్, ఆర్ఎస్సైలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం’
ఆసిఫాబాద్‌అర్బన్: ఆత్మగౌరవం, సమానత్వమే లక్ష్యంగా కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. కేవీపీఎస్ 28వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో శుక్రవారం జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ 1998 అక్టోబర్ 2న కేవీపీఎస్ ఆవిర్భవించిందని తెలిపారు. అనేక ఉద్యమాలు, పోరాటాలతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సాధించడంలో ప్రధాన భూమిక పోషించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పవన్, మల్లేశ్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు టీకానంద్, కార్యదర్శి కార్తీక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి తదతరులు పాల్గొన్నారు. -
ప్రయాణ భారం!
ఆసిఫాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్దసంఖ్యలో వినియోగించుకుంటున్నారు. దీంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు తగినన్ని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు అందుబాటులో లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నా లగ్జరీ, లహరి వంటి బస్సులు, రైళ్లలో డబ్బులు చెల్లించి వెళ్లాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ జిల్లా కేంద్రంలోని డిపో నుంచి 58 ప్రత్యేక బస్సులు నడిపింది. ప్రయాణికుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేశారు. డిపోలో 81 సర్వీసులు జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో 81 బస్సు సర్వీసులు ఉండగా, 75 బస్సులు వివిధ రూట్లలో నడుస్తున్నాయి. వీటిలో రెండు లహరి, 14 లగ్జరీ, రెండు డీలక్స్, 10 ఎక్స్‌ప్రెస్, మిగిలినవి ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. డిపోలో 320 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 125 మంది కండక్టర్లు, 118 మంది డ్రైవర్లు, 77 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ప్రతిరోజూ డిపో ఆదాయం రూ.18 లక్షలు కాగా, ప్రస్తుతం రూ.15 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు సమకూరుతోంది. నిత్యం 36,516 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండగా, వీరిలో 25,366 మంది సీ్త్రలు, 11,150 మంది పురుషులు ఉంటున్నారు. మహాలక్ష్మి పథకాన్ని రాష్ట్రంలో 200 కోట్ల మహిళలు వినియోగించుకున్న నేపథ్యంలో జూలైలో ఆర్టీసీ ప్రత్యేక సంబురాలు నిర్వహించింది. ఇక డిపో పరిధిలో సుమారు 2 లక్షల మహిళలు ప్రయాణించగా, రూ.50 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. వయా కాగజ్‌నగర్‌తో సమయం వృథా.. జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ 14 సూపర్ లగ్జరీ సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం ఏడు సర్వీసులు, రాత్రి ఏడు సర్వీసులు ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు నిత్యం రాత్రి సర్వీసుల్లోనే రాకపోకలు సాగిస్తుంటారు. అయితే రాత్రి సర్వీసుల్లో కేవలం రెండు బస్సులు మాత్రమే నేరుగా హైదరాబాద్ వెళ్తుండగా, మిగిలిన సర్వీసులు వయా కౌటాల, కాగజ్‌నగర్, గోలేటి నుంచి వెళ్తున్నాయి. దీంతో నేరుగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. బస్సు చార్జీ అధికం కావడంతోపాటు వారి సమయం కూడా వృథా అవుతోంది. లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్య పెంచడంతోపాటు జిల్లా కేంద్రం నుంచి నేరుగా నడిచే సర్వీసులు మరిన్ని అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతిపాదనలు పంపించాం ఆర్టీసీ నిబంధనల ప్రకారం ఎక్స్‌ప్రెస్ సర్వీసులు 150 కిలోమీటర్లకు మించి నడపరాదు. ఆసిఫాబాద్ డిపో నుంచి కొత్త సర్వీసుల కోసం ప్రతిపాదనలు పంపించాం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా జిల్లా కేంద్రం నుంచి త్వరలో కొత్త సర్వీసులు ప్రారంభిస్తాం. – రాజశేఖర్, ఆర్టీసీ డీఎం, ఆసిఫాబాద్ 68 శాతం మహిళలే.. తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. బస్సుల్లో 68 శాతం మహిళలే ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం వారికి కేవలం ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీలో మాత్రమే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా, కొన్ని రూట్లలో ఆ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే మహిళలు ఎక్స్‌ప్రెస్‌లు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఉచిత పథకం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో లగ్జరీలో చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్య పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అంబరాన్నంటిన దసరా సంబురం
ఆసిఫాబాద్/కాగజ్‌నగర్‌టౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం దసరా వేడుకలు సంబురంగా జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయి మందిర్, కేస్లాపూర్ హనుమాన్ మందిర్ ఆవరణలో పెద్దఎత్తున వాహన పూజలు చేశారు. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద అర్చకులు ఇందారపు మధుకర శర్మ, నిమ్మకంటి మహేశ్‌శర్మ, వారణాసి శ్రీనివాస్‌శర్మ ఆధ్వర్యంలో శమీ పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రావణాసుర వధకు లక్కీడిప్ ద్వారా శ్రీరామ చంద్రుడిని ఎంపిక చేశారు. శ్రీరామచంద్రుడిగా ఎంపికైన పట్టణానికి చెందిన చిలుకూరి రాధాకృష్ణాచారిని బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్రావు, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, బుల్లితెర దర్శక, నిర్మాత దండనాయకుల సురేశ్‌కుమార్, ఆలయ కమిటీ అధ్వక్షుడు ధర్మపురి వెంకటేశ్వర్లు శాలువా, పూలదండలతో సన్మానించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన రావణాసురుడి ప్రతిమను రాధాకృష్ణాచారి చేతుల మీదుగా దహనం చేశారు. పెద్దఎత్తున టపాసులు పేల్చి సంబురాలు జరుపుకొన్నారు. బుల్లితెర దర్శక, నిర్మాత సురేశ్‌కుమార్ మాట్లాడుతూ చెడును జయిస్తూ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. సాంస్కృతిక కళాకారులు అన్వేశ్, గౌరీశ్, భవానీ ఆలపించిన భక్తిగీతాలు అకట్టుకున్నాయి. సాయి మందిరంలో అర్చకులు ఇందారపు మధుకర శర్మ, సాయిశర్మ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. సాయి బాబా ఉత్సవ విగ్రహాలతో పట్టణంలో ఊరేగింపు నిర్వహించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్‌పై ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు దంపతులు శమీ వృక్షానికి పూజలు చేశారు. అనంతరం ఏఎస్పీ చిత్తరంజన్ రావణసుర దహనం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. త్రిశూల్ పహాడ్‌పై ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణస్వామి, దుర్గామాతలను దర్శించుకున్నారు. భక్తులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, మాజీ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో సీఐ ప్రేంకుమార్, ఆలయ కమిటీ సభ్యులు మహవీర్ ప్రసాద్లోయ, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాస్, ప్రేమకుమార్, అగర్వాల్, పవన్ బల్దేవ్, అరుణ్‌లోయ పాల్గొన్నారు. -
పరిశుభ్రతకు సమయం కేటాయించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రతిఒక్కరూ రోజులో కొంత సమయం పరిసరాల పరిశుభ్రతకు కేటాయించాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో గురువారం స్పెషల్ క్యాంపెయిన్ 5.0ను ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ స్పెషల్ క్యాంపెయిన్ కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదని, సమాజంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలు సమయం కేటాయిస్తే పరిసరాలు నిత్యం పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరిగూర పీవో మచ్చగిరి నరేందర్, ఏజీఎం కృష్ణమూర్తి, డీజీఎంలు ఉజ్వల్‌కుమార్, మదీనాబాషా, సీహెచ్‌పీ ఎస్ఈ కోటయ్య, ఏఎస్వో శ్రీధర్, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
అర్హులకు ఇన్సెంటివ్ చెల్లించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): అర్హులైన ప్రతీ కాంట్రాక్టు కార్మికుడికి ఇన్సెంటివ్ చెల్లించాలని ఏఐటీయూసీ బెల్లంపల్లి రీజియన్ అధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కోల్ ట్రాన్స్‌పోర్టు లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఇన్సెంటివ్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం గోలేటి సీహెచ్‌పీ దారిలో రాస్తారోకో చే పట్టారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమన్యం ఇటీవల ప్రకటించిన స్పెషల్ ఇన్సెంటివ్ రూ.5500 ఇప్పటికీ చాలా మంది డ్రైవర్లు, క్లీనర్లకు అందలేదని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏరియా అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై వెంకట్‌కృష్ణ, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్ ఘటనాస్థలికి చేరుకుని ఏఐటీయూసీ నాయకులతో మాట్లాడారు. అర్హులకు ఇన్సెంటివ్ అందిస్తామని సింగరేణి అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏఐటీయూసీ నాయకుల రాస్తారోకోతో బొగ్గు సరఫరా లారీలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, కార్మికులు అశోక్, సతీశ్, రాజశేఖర్, రాజలింగు, శ్రీకాంత్, శ్రీనివాస్, రవీందర్, రాజన్న, వెంకటేశ్, హనుమంతు, శ్యాంరావు, విష్ణువర్థన్, గోపాల్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు అవగాహన
ఆసిఫాబాద్‌రూరల్: వృత్తివిద్య కోర్సులో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి, డిజిటల్ ఫొటో స్టూడియోను సందర్శించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించినట్లు ప్రిన్సిపాల్ మహేశ్వర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సెలవులో వృత్తివిద్య కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్ షిప్లో భాగంగా ప్రత్యక్షంగా ప్రయోగ పూర్వక జ్ఞానాన్ని పొందారని పేర్కొన్నారు. ఈ శిక్షణ జీవితంలో సొంతంగా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఒకేషనల్ ట్రైనర్ రాజు, సులోచన పాల్గొన్నారు. -
గాంధీ చూపిన మార్గంలో నడుద్దాం
ఆసిఫాబాద్: మహాత్మా గాంధీ చూపిన శాంతిమార్గంలో నడుద్దామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గాంధీజీ అహింస మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. గాంధీ ఆశయాలను ప్రతిఒక్కరూ కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి శివకుమార్, తహసీల్దార్ రియాజ్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ స్పెషల్ సబ్‌జైలులో గాంధీ జయంతి పురస్కరించుకుని గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన పొరపాట్లతో కుటుంబాలకు దూరంగా ఉండి శిక్ష అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో గాంధీ బాటలో నడవాలని సూచించారు. జైలులో ఖైదీలకు మెరుగైన సేవలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఖైదీలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, డిప్యూటీ జైలర్ వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధిక వర్షాలతో తగ్గిన బొగ్గు ఉత్పత్తి
రెబ్బెన: గత నెలలో కురిసిన అధిక వర్షాలతో బెల్లంపల్లి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి సాధించలేకపోయామని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌లో ఏరియాకు 2లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేషించగా అధిక వర్షాల కారణంగా ఓసీపీలో ఉత్పత్తి ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడి కేవలం 74 వేల టన్నులు మాత్రమే సాధించామన్నారు. దీంతో కేవలం 37 శాతం ఉత్పత్తిని మాత్రమే సాధించామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఏరియాలో మోతాదుకు మించి వర్షాలు కురిసాయన్నారు. గతేడాది ఈ సమయానికి 1,207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఈసారి 1,829 నమోదైందన్నారు. గడిచిన మూడు నెలల్లో 93 రోజుల్లో 64 రోజులు వర్షాలే పడ్డాయని మిగిలిన 29 రోజుల్లో మాత్రమే బొగ్గు ఉత్పత్తి చేయగలిగామన్నారు. అయినప్పటికీ ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏరియా 83 శాతంలో ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఉన్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో డీజీఎం ఐఈడీ ఉజ్వల్‌కుమార్ బెహారా, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. -
మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారు
రెబ్బెన: దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బుధవారం మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో ప్రధాన అర్చకులు దేవార వినోద్‌స్వామి, ఆలయ ఆస్థాన అర్చకులు పూసాల మహేష్ శాస్త్రి ఆధ్వర్యంలో మహాచండీయాగం నిర్వహించారు. మహిషాసురమర్థిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దుర్గామాత సన్నిధిలో విశ్వప్రసాద్‌రావు గోలేటిలో ఏర్పాటు చేసిన దుర్గామాతను డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నంబాల మాజీ సర్పంచ్ సోమశేఖర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం రవీందర్, కిషన్‌గౌడ్, పూదరి సాయికిరణ్, పర్వతి సాయికుమార్, పస్తం పోషం, తదితరులు పాల్గొన్నారు. -
‘గిరిజనులకు అనుకూల రిజర్వేషన్లు ఇవ్వాలి’
తిర్యాణి: ఐదో షెడ్యూల్ కిందికి వచ్చే ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నికల రిజర్వేషన్లు గిరిజనులకు అనుకులంగా ఇవ్వాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని కుమురం భీం చౌరస్తాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్లు తాము వ్యతిరేకించడం లేదని, ఐదో షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాల్లో మాత్రం గిరిజనులకే అవకాశం కల్పించాలని కోరారు. లక్కీ లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లను నిర్ణయించడం సరైనా పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం ఐదో షెడ్యూల్లోని ప్రాంతాల్లో రిజర్వేషన్లను మార్చకుంటే ఈనెల 8న హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా సర్మేడి కుర్సింగ మోతీరాం, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు వెడ్మ భగవంత్‌రావు, నాయకులు నర్సింగరావు, ధర్ము, తదితరులు పాల్గొన్నారు.‘అమృత్ భారత్’కు హాల్టింగ్కాగజ్నగర్టౌన్: అమృత్ భారత్ రైలుకు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్‌బాబు గురువారం జెండా ఊపి హాల్టింగ్ కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్ నుంచి చర్లపల్లి స్టేషన్ వరకు ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారని తెలిపారు. ఈ రైలులో 11 జనరల్, 8 స్లీపర్ కోచ్‌లు ఉంటాయన్నారు. ఈ రైలును సామాన్య, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి ప్రయాణికులకోసం ప్రవేశపెట్టినట్లు ఆయ న పేర్కొన్నారు. కాగజ్‌నగర్, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట్ మీదుగా చర్లపల్లి వరకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రయాణికులకు రైలు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
కౌటాల: రైతులకు యూరియా బస్తాలను అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని జిల్లా వ్యవసాయాధికారి బి.వెంకట్ అన్నారు. బుధవారం కౌటాల, ముత్తంపేట్, శీర్షా గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి రికార్డులు, ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. అన్ని సహకార సంఘాలు, ప్రైవేట్ దుకాణాలకు యూరియా పంపిణీ చేస్తామన్నారు. వ్యవసాయాధికారుల సమక్షంలోనే యూరియా పంపిణీ చేయాలన్నారు. యూరియాతో పాటు రైతులకు ఇతర లింక్ ఎరువుల బస్తాలు కలిపి ఇవ్వకూడదన్నారు. రోజు వారీగా స్టాక్ వివరాలు నోటీస్ బోర్డులో రాయాలన్నారు. ఆయన వెంట ఏవో ప్రేమలత, డీలర్లు ఉన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలి
ఆసిఫాబాద్‌అర్బన్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల పోలీస్స్టేషన్ల పరిధిలో ముమ్మర తనిఖీలు నిర్వహించాలని, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పరిసరాల శుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, సీజ్ చేసిన క్రైమ్ వెహికిల్స్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్‌ని తనిఖీ చేస్తూ, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల వివరాలను ఎస్హెచ్ఓను అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతీ కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేస్తూ బాధితులకు అండగా నిలవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల నిషేధిత పదార్థాలు, అక్రమ మద్యం, రవాణా, అక్రమ డబ్బుల చలామణిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాల్లో చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఉండాలన్నారు. సైబర్ నేరాల అదుపునకు విద్యాసంస్థల్లో, పనిస్థలాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం స్టేషన్ పరిధిలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ బాలాజీ వరస్రసాద్, ఎస్సైలు ఉన్నారు. -
చెడుపై మంచి సాధించిన విజయం
త్రిశూల్ పహాడ్‌పై రావణాసురుని ప్రతిమఆసిఫాబాద్అర్బన్: చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమిని జరుపుకుంటామని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి బుధవారం విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మంచిమార్గాన్ని ఎంచుకుని జీవితంలో పైకిరావాలని, సమాజబాగు కోసం పాటుపడాలని సూచించారు. సన్మార్గంలో నడిచిన వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుందన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ, సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో, నేరాల నియంత్రణలో ముందుండాలన్నారు.ఆసిఫాబాద్: విజయానికి ప్రతీకగా నిలిచే దసరా ఉత్సవాలను గురువారం వైభవంగా జరుపుకునేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ అభయాంజనేయ స్వామి భారీ విగ్రహం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 5:30 గంటలకు మార్కండేయ స్వామి ఆలయ సమీపంలో, అనంతరం కేస్లాపూర్ హన్మాన్ ఆలయంలో షమీపూజ నిర్వహించనున్నారు. అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భూమి చదును చేశారు. లైటింగ్, సౌండ్ సిస్టం, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జవర్దస్త్ కళాకారులు అన్వేశ్, గౌరీష్, సింగర్ భవానిచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఉదయం సాయి ఉత్సవ విగ్రహంతో నగర సంకీర్తన, జోలి భిక్ష నిర్వహించనున్నారు. ఆలయంలో ఉదయం కాకడ హారతి, మంగళస్నానం, పంచామృత అభిషేకం, సామూహిక అఖండ సాయి సచ్చరిత పారా యణం, పుస్తక పూజ, మంత్ర పుష్పం, తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. త్రిశూల్ పహాడ్‌పై రావణ దహనానికి ఏర్పాట్లు కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్పహాడ్పై రావణాసుర ప్రతిమను దహనం చేయనున్నారు. వేడుకల్లో ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌తో పాటు పలువురు హాజరు కానున్నారు. భక్తుల సౌకర్యార్థం త్రిశూల్పాహడ్పై విద్యుత్దీపాలను అలంకరించారు. రోడ్డు వెంట విద్యుత్‌లైట్లు, వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని చదును చేశారు. అలాగే సౌంట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. -
దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
ఆసిఫాబాద్‌అర్బన్: సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని, చెడుపై మంచి సాధించిన విజ యానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం విజయదశమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా దసరా నిలుస్తుందని, షమీపూజ చేసిన ఆకును బంగారంగా తీసుకోవడం.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం శుభసూచికంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం పండుగ ప్రత్యేకమన్నారు. దసరాను ప్రతిఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. -
బీఆర్ఎస్లో చేరిక
ఆసిఫాబాద్: నార్నూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివా సంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు చేయాలన్నా నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలన్నా బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. పార్టీలో చేరిన వారికి సరైన గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో చౌహాన్ యశ్వంత్‌రావు, తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మర్సుకోల సరస్వతి, తదితరులు పాల్గొన్నారు. -
సీఎంను కలిసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
కెరమెరి: కుమురంభీం వర్ధంతి కార్యక్రమానికి రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, కుమురంభీం మనవడు కుంరం సోనేరావు, కమిటీ చైర్మన్ లాల్శావు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఐటీడీఏ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. జోడేఘాట్ వెళ్లే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని, మీటింగ్ స్థలం వద్ద షెడ్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, జైనూర్ ఏఎంసీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. కేశవనాథుడి శోభాయాత్రఆసిఫాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ శ్రీ కేశవనాథస్వామి ఆలయంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం చివరిరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని గజవాహనంపై ఉంచి పట్టణ వీధుల గుండా భాజాభజంత్రీల మధ్య, భక్తి పాటలతో శోభాయాత్ర నిర్వహించారు. స్వామి వారికి భక్తులు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంగళహారతి, మహా మంత్రపుష్పం, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో వేణుగోపాల్ గుప్తా, ఆలయ కమిటీ అధ్యక్షుడు వైరాగడే మనోజ్‌కుమార్, సభ్యులు నిమ్మకంటి సుగుణాకర్, వైరాగడే ప్రతాప్, పరండె సాయి, ప్రవీణ్, వెంకట్, రవీందర్, అభయ్ ఆచార్య, శేషగిరి, గోపాల్, శ్రీనివాస్, బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు. -
సొంత ఊళ్లో జరుపుకోవడం ఇష్టం
ఆసిఫాబాద్‌అర్బన్: దసరా పండుగను సొంత ఊళ్లో చిన్ననాటి స్నేహితులతో కలిసి జరుపుకోవ డం చెప్పలేని సంతోషంగా ఉంటుంది. కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వద్ద సాయంత్రం జమ్మిచెట్టుకు పూజ చేసి జగన్మాతను ఆహ్వానించిన తర్వాత మంగళహారతి ఇస్తారు. ఆ తర్వాత జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటాం. 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో ఉంటున్నా దసరా మాత్రం ఇక్కడే జరుపుకుంటాం. ప్రతిఒక్కరి జీవితం విజయాలతో ముందుకు సాగాలి. – నాగబాల సురేశ్‌కుమార్, తెలుగు టెలివిజన్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
సింగరేణి క్రీడాకారులు పతకాలు సాధించాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): సింగరేణి ఉద్యోగ క్రీడాకారులు కోలిండియా పోటీల్లో పతకాలు సాధించాలని డీజీఎం ఉజ్వల్‌కుమార్ బెహా రా అన్నారు. డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ వార్షిక క్రీడల్లో భాగంగా మంగళవారం గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్లో నియర్‌బై ఏరియా క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభించారు. డీజీఎం మాట్లాడుతూ కోలిండియా పోటీల్లో రాణించి సింగరేణికి గుర్తింపు తీసుకురావాలన్నారు. క్రీడానైపుణ్యాలు మెరుగుపర్చుకోవా లని సూచించారు. ఈ సందర్భంగా గతంలో కోలిండియాలో పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. ఏఐటీయూసీ నాయకులు మారం శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, స్పోర్ట్స్ సూపర్వైజర్ అశోక్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అన్వేశ్, జనరల్ కెప్టెన్ కిరణ్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లకు సన్నద్ధం
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో పత్తి దిగుబడులు మరి కొద్దిరోజుల్లో రైతుల చేతికి అందనున్నాయి. దీంతో సీసీఐ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. దిగుబడి అధికంగా వచ్చే ప్రాంతాలను గుర్తించి, రైతులకు అందుబాటులో సౌకర్యవంతంగా ఉండేలా ఏడు కేంద్రాలను గుర్తించి సీసీఐకి నివేదికలు పంపించారు. ఆయా కేంద్రాల్లో వేబ్రిడ్జిలు, కంప్యూటర్లు, ఇతర వసతుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. అయితే కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోళ్లు చేపట్టనుండగా, రైతులు ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా, రైతులు కూడా రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశించిన సమయంలో అమ్మకానికి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 3,33,779 ఎకరాల్లో సాగుజిల్లాలో 4.50 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ పంట లు సాగవుతుండగా 3,33,779 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. జిల్లాలోని నేలలు పత్తికి అనుకూలంగా ఉండటంతో రైతులు ఎక్కువగా వాణిజ్య పంటపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది సుమారు 16లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పూర్తిస్థాయిలో పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ఆసిఫాబాద్, వాంకిడి, కొండపల్లి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, జైనూర్‌లో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొనుగోళ్లతోపాటు బిల్లుల చెల్లింపు కోసం ఆధార్‌కా ర్డు, వేలిముద్రలను పరిశీలించనున్నారు. కౌలు రైతులైతే పట్టాదారుల పాస్ పుస్తకంతోపాటు ఆధార్‌కార్డు వివరాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నాణ్యమైన పత్తికి రూ.8,110గా ప్రకటించింది. 8శాతం తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర దక్కుతుంది. అంతకంటే ఎక్కువ శాతం తేమ ఉంటే ఒక్కోశాతానికి రూ.81.10 చొప్పున తగ్గించి కొంటారు. పత్తిని సక్రమంగా ఆరబెట్టి తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. యాప్‌లో స్లాట్ బుకింగ్పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కపాస్ కిసాన్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని రైతులు సొంతంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేకుంటే వ్యవసాయ అధికారుల సాయంతోనూ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వా త పంట అమ్మకం కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. రద్దీకి అనుగుణంగా రైతులకు తేదీ కేటాయిస్తారు. నూతన విధానం కొనుగోళ్లపై ఈ నెలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. -
అమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
దుర్గాదేవి అవతారంలో అమ్మవారురెబ్బెన(ఆసిఫాబాద్): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెబ్బెన మండలం ఇందిరానగర్‌లోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పొటెత్తారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలతో పాటు సమీపంలోని మంచిర్యాల, బెల్లంపల్లి ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఆలయంలోని కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళితోపాటు ఆలయం వెనుక గుహలో ఉన్న మహంకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా మంగళవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్ డీఎల్పీవో హరిప్రసాద్, నంబాల మాజీ సర్పంచ్ చెన్న సోమశేఖర్, నాయకులు మోడెం సుదర్శన్‌గౌడ్, గోగర్ల రాజేశ్, మాజీ ఎంపీటీసీ సంఘం శ్రీనివాస్ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. -
ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఆసిఫాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌తో కలిసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల నిర్వహణపై అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 15 జెడ్పీటీసీలు, 127 ఎంపీటీసీలు, 335 సర్పంచులు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణ విడుదల చేసిందన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలిస్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అంశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ఎన్నికల నిర్వహణపై నోడల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డీటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగదు, మద్యం, చీరల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల పంపిణీ జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో భిక్షపతి, డీఆర్డీవో దత్తారావు, డీపీఆర్వో సంపత్‌కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నదీమ్, ముఖ్యప్రణాళిక అధికారి వాసుదేవరెడ్డి పాల్గొన్నారు. సర్వేలెన్స్ బృందాల ఏర్పాటుఎన్నికల నిర్వహణలో భాగంగా సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు నోడల్ అధికారులను నియమించినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, మ్యాన్ పవర్, హెల్ప్‌లైన్ ఫిర్యాదుల పరిష్కారాలు, రవాణా, శిక్షణ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సామగ్రి నిర్వహణ, ఖర్చుల పర్యవేక్షణ నిర్వహణ, పరిశీలకులు, బ్యాలెట్ పేపర్, బాక్సుల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. -
కళ్లకు గంతలు కట్టుకుని నిరసన
ఆసిఫాబాద్‌రూరల్: సమస్యలు పరిష్కరించా లని, వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ వసతి గృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు చేపట్టిన సమ్మె మంగళవారం 19వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. కార్మికులు మాట్లాడుతూ చేసిన పనికి వేతనా లు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. పెండింగ్ వేతనా లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నాయకులపై కేసులు నమోదు చేస్తున్నారని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమాచారి ఆరో పించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, వర్కర్లు ప్రభాకర్, వసంత్‌రావు, కోటయ్య, భరత్, శశికళ, దివ్య, లక్ష్మి, గంగుబాయి, ప్రమీల, తిరుపతి, దివ్య, మాన్కుబాయి తదితరులు పాల్గొన్నారు. -
పత్తిలో మత్తు పంట
కెరమెరి మండలం ఇందాపూర్ గ్రామానికి చెందిన వాడాయి పోశెట్టి పత్తి చేనులో అంతర పంటగా గంజాయి సాగు చేశాడు. పక్కా సమాచారంతో పోలీసులు సెప్టెంబర్ 23న పొశెట్టి పత్తి చేనును తనిఖీ చేశారు. రూ.13 లక్షల విలువైన 130 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కెరమెరి ఎస్సై మధుకర్ గంజాయి సాగు చేసిన పొశెట్టిపై కేసు నమోదు చేశారు.జైనూర్ మండలం జాడుగూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్ తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ముందస్తు సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ ఆధ్వర్యంలో దాడులు చేపట్టారు. పది మొక్కలను స్వాధీనం చేసుకుని లక్ష్మణ్‌పై కేసు నమోదు చేశారు.కౌటాల(ఆసిఫాబాద్): తక్కువ సమయంలో ఎక్కు వ డబ్బు సంపాదించాలనే అత్యాశతో కొందరు గంజాయి సాగు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పత్తి చేలలో అంతర పంటగా పండిస్తున్నారు. అడపాదడపా పోలీసుల ఆకస్మిక తనిఖీ లు చేపడుతుండగా భారీగా గంజాయి పట్టుబడుతోంది. మొక్కలను ధ్వంసం చేసి నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు. సాగు చేస్తున్న వారిలో చాలా మంది దళారులకు విక్రయిస్తున్నారు. కొంతమంది మాత్రం మహారాష్ట్ర, హైదరాబాద్, ఇతర ప్రాంతా లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో విచ్చలవిడిగా అందుబాటులో ఉండడంతో యువత మత్తుకు బానిసలవుతున్నారు. విచ్చలవిడిగా వినియోగం..గంజాయి సాగు చేసి సొమ్ము చేసుకునే అవకాశం ఉండటంతో అక్రమార్కులు దందాను కొనసాగిస్తున్నారు. దీనికి తోడు గంజాయి విక్రయదారులపై పోలీసుల పర్యవేక్షణ కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది. అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్ పట్టణం, మండల కేంద్రాల్లో రాత్రివేళల్లో కొంతమంది యువత మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా జైలు శిక్ష, జరిమానాతోపాటు నార్కోటిక్ చట్టం ప్రకారం 30 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధిస్తారు. తక్కువ మోతాదులో రవాణా చేస్తే ఏడాది జైలుతో పాటు 20 కిలోలు లభిస్తే దాదాపు ఐదేళ్ల నుంచి 20 ఏళ్ల శిక్ష పడుతుంది. రూ.25 వేలకు పైగా జరిమానా కూడా విధిస్తారు. పంట భూముల్లో సాగుచేస్తే వారికి సంక్షేమ పథకాలు రద్దు చేస్తారు. కేసులు నమోదు చేస్తాం గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా చర్యలు తప్పవు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిపై కేసులు నమోదు చేస్తాం. యువత మత్తుకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దు. పిల్ల ల ప్రవర్తనను తల్లిదండ్రులు గమనించాలి. పోలీసులకు ప్రజలు సహకరించాలి. రైతులు, యువతకు అవగాహన కల్పిస్తున్నాం. – ఎండీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ డీఎస్పీ అంతర పంటగా సాగుఅడువుల జిల్లా ఆసిఫాబాద్‌లో మారుమాల ప్రాంతాలు అధికం. దీంతో కొందరు అత్యాశతో.. మరి కొందరు ఎవరికి తెలియదనే ధీమాతో గంజాయి సాగు చేస్తున్నారు. అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడంలేదు. కొందరు ఏళ్లుగా అక్రమ దందాను వృత్తిగా చేసుకుంటున్నారు. పత్తి, కంది, సోయా ఇతర పంట చేలలో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నారు. సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, వాంకిడి, కాగజ్‌నగర్, రెబ్బెన మండలాల్లో అత్యధికంగా గంజాయి సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో పండించిన పంట హైదరాబాద్ వంటి ప్రాంతాలకు సరఫరా అవుతోంది. పోలీసు శాఖ అప్పుడప్పుడు తనిఖీలు చేపట్టడం మినహా ఆబ్కారీ శాఖ అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పోలీసులు ఈ ఏడాది ఇప్పటివరకు రూ.41.21 లక్షల విలువైన గంజాయిని పట్టకున్నారు. గంజాయి సాగు చేస్తే సంబంధిత రైతుకు వచ్చే ప్రభుత్వ పథకాలను నిలిపేస్తామని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు. -
రిజర్వేషన్ల పంచాయితీ
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ మొదలైంది. పలు గ్రా మాల్లో పోటీలో నిలబడేందుకు అభ్యర్థులే లేని పరి స్థితి నెలకొంది. దీంతో తమ గ్రామాల్లో రిజర్వేషన్ల ఖరారుపై పునః పరిశీలన చేయాలని విన్నవిస్తున్నా రు. కొన్ని చోట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమయ్యా రు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను కలుస్తూ రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మార్చే అవకాశం లేకపోవడంతో ఆ గ్రామాల్లో ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే సందిగ్ధత నెలకొంది. ఎందుకీ పరిస్థితి?2011 నాటి జనాభా లెక్కలతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు, రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక ఆర్థిక కుల గణన సర్వేను పరిగణనలోకి తీసుకుని బీసీలకు రిజర్వేషన్ల ర్యాంకింగ్ ఇచ్చారు. బీసీ వర్గాల రిజర్వేషన్లకు డెడికేషన్ కమిషన్ సిఫారసులు పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 2019 తర్వాత ఇప్పుడు జరుగుతున్న రెండో స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ మండలం యూనిట్‌గా, జెడ్పీటీసీ జిల్లా యూనిట్‌గా ర్యాంకింగ్‌లు ఇచ్చే క్రమంలో ఆయా వర్గాల్లో జనాభా లేనప్పటికీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక మహిళలకు 50శాతం, వంద శాతం ఎస్టీలు ఉన్నచోట్ల వారికే నోటిఫై చే యడం వంటి నిబంధనలు పాటించాల్సి ఉంది. ఎస్టీ, ఎస్సీ, బీసీల ర్యాంకింగ్ ఇచ్చే క్రమంలో ఒక్క ఓటరు లేని వర్గాలకు కూడా ఆయాచోట్ల రిజర్వేషన్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇక గత ఎన్నికల్లో ఏదైనా కారణంతో ఎన్నిక జరగకపోతే ఆయా వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు అనుభవించని కారణంగా మరోసారి వారికే అవకాశం కల్పించేలా జీ వో జారీ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజ నులే పోటీకి అర్హులు. దీంతో ఏ గ్రామంలోనైనా గిరిజనులు ఉన్నా లేకున్నా వారికే అవకాశాలు వస్తున్నాయి. గతంలో జనాభా లెక్కల సమయంలోనూ కొన్ని చోట్ల ఆయా వర్గాల వివరాల నమోదులో తప్పిదా లు జరగడంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మళ్లీ జనాభా లెక్కలు జరిగి, ఆయా వర్గాల వివరాలు స్పష్టత వచ్చే వరకు పరిస్థితి మారే అవకాశం లేదు. ఉప సర్పంచ్‌లకే పగ్గాలుసర్పంచ్ పదవులు ఆయా వర్గాలకు రిజర్వు కావడంతో వార్డు స్థానాలకు ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. దీంతో వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నారు. దీంతో సర్పంచ్ ఎన్నిక జరగని చోట్ల రిజర్వేషన్ వర్తించని ఉప సర్పంచ్‌లే సర్పంచ్ హోదాలో పాలన కొనసాగించే అవకాశం ఉంది.జనాభా లేకున్నా అవకాశాలు -
కుమురం భీం
9మార్గ సూచి.. ప్రయోజనకారి ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ క్యాలెండర్ పంపిణీకి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. బోధన, పరీక్షలు, సెలవులు, తదితర కార్యక్రమాల షెడ్యూల్‌ను క్యాలెండర్లో పొందుపర్చింది. ఆశలు గల్లంతు! ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులపై నేతలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కెరమెరి మండలంలో రిజర్వేషన్లు మారిపోవడంతో గిరిజనుల్లో నిరుత్సాహం నెలకొంది. ఆకాశం చాలావరకు మేఘావృతమై ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయి. మధ్యాహ్నం తర్వాత అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉంది. బుధవారం శ్రీ 1 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
పల్లెల్లో స్థానిక పండుగ!
ఆసిఫాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే అధికార యంత్రాంగం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలతోపాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితా విడుదల చేయడంతో గ్రామాల్లో సందడి మొదలైంది. ఏళ్లుగా పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. చట్టప్రకారం రిజర్వేషన్లు కేటాయించడంతో అనేక గ్రామాల్లో మహిళా అభ్యర్థులు బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉండగా, 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,76,606 మంది పురుషులు, 1,77,269 మంది మహిళలు. జిల్లావ్యాప్తంగా 345 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. విడతల వారీగా ఎన్నికలుజిల్లాలో 127 ఎంపీటీసీ, 15 జెడ్పీటీసీ, 335 పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అక్టోబర్ 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికలు అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అనంతరం అదేరోజు గ్రామ పంచాయతీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న నిర్వహిస్తారు. జిల్లాలోని ఎనిమిది మండలాల్లోని 8 జెడ్పీటీసీ స్థానాలు, 71 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడతలో ఎన్నికలు జరగనుండగా, రెండో విడతలో ఏడు మండలాల్లోని 7 జెడ్పీటీసీలు, 56 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇక పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో కొనసాగుతాయి. జిల్లాలోని ఐదు మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డుల్లో మొదటి విడతలో పోలింగ్ జరుగుతుంది. రెండో విడతలో ఆరు మండలాల్లోని 113 గ్రామ పంచాయతీలు, 992 వార్డులు, మూడో విడతలో నాలుగు మండలాల్లోని 108 గ్రామ పంచాయతీలు, 938 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రిజర్వేషన్లతో అయోమయంస్థానిక సంస్థల రిజర్వేషన్లతో జిల్లాలో ప్రముఖ నాయకులు అయోమయంలో పడ్డారు. అనుకూలమైన స్థానాల్లో పోటీ చేయాలని ఎదురుచూస్తున్న చాలామంది అంచనాలు తారుమారయ్యాయి. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్పర్సన్ స్థానా న్ని గతంలో ఎస్టీ మహిళకు కేటాయించగా, తాజాగా బీసీ జనరల్‌కు కేటాయించారు. జిల్లాలోని బీసీ నాయకులకు రిజర్వేషన్లు కలిసి వచ్చినా జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. ఆసిఫాబాద్ ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ చేయడం జిల్లా కేంద్రంలోని స్థానిక నాయకులకు సమస్యగా మారింది. దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఆసిఫాబాద్ జెడ్పీటీసీ, ఎంపీపీగా ఎక్కువసార్లు గెలిచిన అరిగెల నాగేశ్వర్రావు, ఆయన సోదరుడు మల్లికార్జున్‌రావుకు స్థానికంగా పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. వీరు పొరుగు మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చేరిన కోనేరు కోనప్ప, ఆయన సోదురుడు కృష్ణారావుకు కూడా రిజర్వేషన్లు అనుకూలించడం లేదు. సి ర్పూర్(యూ), లింగాపూర్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్‌కు రిజర్వ్ కాగా, జైనూర్, తిర్యాణి, రెబ్బె న, కాగజ్‌నగర్, కౌటాల బీసీలకు కేటాయించా రు. పెంచికల్పేట్, సిర్పూర్(టి) ఎస్సీ, ఆసిఫాబాద్, వాంకిడి, బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం ఎస్టీలకు కేటాయించడంతో స్థానిక నేతల అంచనాలు తప్పాయి. -
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆసిఫాబాద్: ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు– 2025, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ అందించారు. జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఎన్నికల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. షెడ్యూల్ విడుదలైనందున అధికారులు ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి విధులు నిర్వహించాలన్నారు. హ్యాండ్ బుక్‌ను క్షుణ్ణంగా చదివి ప్రతీ అంశంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూసుకోవాలన్నారు. సందేహాలు, అపోహలు నివృత్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీపీవో భిక్షపతి గౌడ్, డీఎల్పీవో ఉమర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.