వాంకిడి: మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహారలో సోమవారం సత్యాగ్రహ దివస్ ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. నాయకులు మాట్లాడుతూ అంబేడ్కర్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షతో మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో గల రామ మందిరంలోకి దళితులకు ప్రవేశం కల్పించారని తెలిపారు. బీఎస్‌ఐ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమత సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షుడు దుర్గం సందీప్, నాయకులు రోషన్ ఉప్రె, దుర్గాజీ, విజయ్ ఉప్రె, ప్రతాప్ రాంటెంకి, ప్రకాశ్, ప్రసాద్, నూతన్, స్వాగత్ పాల్గొన్నారు.


