కాగజ్‌నగర్‌టౌన్: ఉచిత హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పట్టణంలోని సామాజిక ప్రభుత్వాస్పత్రిలో మున్సిపల్ చైర్‌పర్సన్ సాహీన్ సుల్తానా ఆదివారం జిల్లా వైద్యాధికారి సీతారాంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. జిల్లాలోని 14–15 ఏళ్ల బాలికలకు గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా ముందస్తుగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. జిల్లాలోని కాగజ్‌నగర్, బెజ్జూరు, సిర్పూర్(టీ), తిర్యాణి, జైనూర్, వాంకిడి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. పీహెచ్‌సీల పరిధిలోని బాలికలు ఆయా ఆస్పత్రులకు ఆధార్‌కార్డుతో వెళ్లి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో మూడు నెలల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం బాలికలకు వ్యాక్సినేషన్ చేశారు. సీహెచ్‌సీ సూపరింటెండెంట్ అవినాష్, సీహెచ్‌వో సంపత్, డిప్యూ టీ ఎస్వో రమేశ్‌చంద్ర, డీపీవో వెంకటేశ్, వైద్యురాలు అరుణ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంపై వ్యాక్సిన్ వేసుకున్న బాలికల అభిప్రాయాలు వారి మాటల్లోనే..


