సిర్పూర్(టి): పులుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైల్డ్‌లైఫ్ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ సూచించారు. ఆదివారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్(టి) రేంజ్‌పరిధిలోని ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో పులుల సంచారం అధికంగా ఉందని, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రాకపోకలు సాగించే కారిడార్‌లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఇటిక్యాల పహాడ్ అ టవీప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు ఏర్పా టు చేసిన నీటి కుంటలు, సోలార్ నీటి కుంటలు, చెక్‌డ్యాంల ద్వారా వన్యప్రాణుల దాహా ర్తి తీరుతుందని తెలిపారు. అనంతరం పులికారిడార్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, నీటికుంటలు, నీటి వసతుల వద్ద వన్యప్రాణులు వచ్చి వెళ్లే చిత్రాలు, వీడియోలు పరిశీలించారు. టైగర్ ట్రాకింగ్ విధానం గురించి సెక్షన్ అధికారి మోహన్‌రావ్‌ను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై అధికారులు, సిబ్బందికి పలు సలహాలు, సూచనలు చేశారు. ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతాల్లో వన్యప్రాణులు, పులుల సంరక్షణకు చేపడుతున్న చర్యలను ప్రశంసించి సెక్షన్ అధికారి మోహన్‌రావ్, బీట్ అధికారి నరేశ్, సిబ్బందిని అభినందించారు. కవ్వాల్ ఎఫ్‌డీపీటీ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్, నిర్మల్ డీఎఫ్‌వో సుశాంత్ సింగ్ బొబాడే, ప్రొబెషనరీ ఐఎఫ్‌ఎస్ భార్గవ్‌కుమార్, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో అప్పయ్య, ఎఫ్‌ఆర్‌వోలు అనిల్‌కుమార్, రమాదేవి, ఎఫ్‌ఎస్‌వోలు, బీట్‌అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


