రెబ్బెన: అసంపూర్తిగా నిలిచిన రాంపూర్ బీటీ రోడ్డు పనులు పూర్తయ్యేలా చూడాలని రాంపూర్ సర్పంచ్ చల్లూరి మాయ, ఉప సర్పంచ్ చాపిడి పురుషోత్తం ఆదివారం గ్రామానికి వ చ్చిన కలెక్టర్ హరితను కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాంపూర్ గ్రామంలో మూడేళ్ల క్రితం రూ.1.5 కోట్లతో చేపట్టిన 1.8కిలో మీటర్ల బీ టీ రోడ్డు పనులను కాంట్రాక్టర్ మధ్యలోనే వ దిలేశాడని తెలిపారు. రోడ్డుపై కంకర వేసి వ దిలేయడంతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వా హనాలు అదుపుతప్పి బోల్తాపడుతుండటంతో పలువురు గాయాలపాలవుతున్నారని తె లిపారు. బిల్లులు రావడం లేదనే సాకుతో కాంట్రాక్టర్ పనులను నిలిపివేయడంతో బీటీ రోడ్డు కలగానే మిగిలిపోయిందని పేర్కొన్నా రు. వెంటనే పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. స్పందించిన కలెక్టర్ హరిత వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.


