breaking news
Kumuram Bheem District Latest News
-
ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
సిర్పూర్(టి): మండల కేంద్రంలోని ఈడెన్ గార్డెన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రెండో విడత ఎన్నికల అధికారులకు నిర్దేశిత సమయానికి సామగ్రి పంపిణీ పూర్తవుతుందన్నారు. ఇబ్బందులు లేకుండా అధికారులు పోలింగ్, కౌంటింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రహీమొద్దీన్, ఎంపీడీవో సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు వరిధాన్యం కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) డేవిడ్ అన్నారు. మండలంలోని కొమురవెళ్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. దళారులకు ధాన్యాన్ని విక్రయించి ఆర్థికంగా నష్టపోవద్దని, ప్రభుత్వ కేంద్రాల ద్వారా మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాశ్, నిర్వాహకులు భీమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కుమురం భీం
7‘మహాలక్ష్మి’కి దూరంగా.. ఆదిలాబాద్ నుంచి అనార్పల్లి మీదుగా ఆసిఫాబాద్‌కు బస్సు సౌకర్యం లేదు. మహిళా ప్రయాణికులు మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నారు. 9లోuవాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా తగ్గుతాయి. రాత్రి మంచు అధికంగా కురుస్తుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ మంచిర్యాలఅగ్రికల్చర్: పోర్టబుల్ ఎక్స్‌రే మిషన్ అందుబాటులోకి తెచ్చినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో డీఎంహెచ్‌వో అనితతో ఎక్స్‌రే మిషన్‌ను ప్రారంభించారు. ఈ నెల 21 నుంచి సేవలు అందిస్తామని తెలిపారు.శనివారం శ్రీ 13 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
కెరమెరిలో హైడ్రామా
కెరమెరి: కెరమెరి ఉప సర్పంచ్ ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది. గురువారం బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పెందోర్ ఆనంద్‌రావు సర్పంచ్‌గా రాథోడ్ ఉత్తం నాయక్‌పై 151 ఓట్ల తేడాతో గెలుపొందారు. 14 వార్డుల్లో బీఆర్ఎస్ బలపర్చినవారు ముగ్గురు విజయం సాధించగా, పది మంది కాంగ్రెస్‌కు చెందిన చెందిన వారు గెలిచారు. ఒక్కరు ఏకగ్రీవం కాగా ఆయన బీఆర్ఎస్లో చేరారు. దీంతో బీఆర్ఎస్ బలం నాలుగుకు చేరింది. మరో ముగ్గురు కాంగ్రెస్ మద్దతుదారులు కూడా వీరితో జత కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు పోలీసులు వారిని కెరమెరి పంచాయతీకి తీసుకువచ్చారు. కార్యాలయంలో ఎన్నిక నిర్వహించగా ఏడుగురు వార్డు సభ్యులు వాగ్మారే శ్రీకాంత్‌కు మద్దతుగా చేతులెత్తారు. శ్రీకాంత్ ఉపసర్పంచ్‌గా ఎన్నికైనట్లు ఆర్వో చంద్రయ్య, జోనల్ అధికారి ముక్తేశ్వర్ తెలిపారు. పోలీసులతో వాగ్వాదంఎంపీడీవో కార్యాలయం ఎదుట శుక్రవారం కాంగ్రెస్ నేతలు తమ అభ్యర్థులను బీఆర్ఎస్ నాయకులు కిడ్నాప్ చేశారని ఆందోళన చేశారు. వార్డు సభ్యుడిని అప్పగించాలని కాంగ్రెస్ నాయకుడు రాథోడ్ ఉత్తం నాయక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎస్సై మధుకర్ వారిని శాంతింపజేశారు. -
● సత్తా చాటిన కాంగ్రెస్ మద్దతుదారులు ● కెరమెరిలో బీఆర్ఎస్ హవా
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గిరిజన పల్లెల్లో చాలావరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సత్తాచాటారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను హస్తగతం చేసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలావరకు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు హవా కొనసాగగా, బీఆర్ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపింది. అయితే కెరమెరి, జైనూర్ మినహ ఇతర మండలాల్లో మాత్రం గులాబీ పార్టీ తక్కువ స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ వైపే ఓటర్ల మొగ్గుగతంలో బీఆర్ఎస్కు పట్టున్న స్థానాల్లో కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లో 114 పంచాయతీల్లో 55 స్థానాలను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ప్రజలు ఆ పార్టీకి చెందిన అభ్యర్థుల వైపే మొగ్గు చూపారు. 114 పంచాయతీ స్థానాలకు ఏడు ఏకగ్రీవం కాగా.. ఇందులో కెరమెరిలోని బాబేఝరి, దనోరా స్థానాలు బీఆర్ఎస్, వాంకిడిలోని దాబా, నవేగూడ, లేండిగూడ బీఆర్ఎస్, లింగాపూర్‌లోని కంచన్‌పల్లి కాంగ్రెస్, మామడిపల్లిలో స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సత్ఫలితాలిచ్చిన ప్రచారం..ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు పథకంతోపాటు ఆయా మండలాల్లో నూతన డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేసిన ప్రచారం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. గిరిజన మహిళగా ఆమెకు ఉన్న వ్యక్తిగత పరిచయాలు ప్రభావం చూపాయని చర్చించుకుంటున్నారు. కెరమెరి మండలంలో మాత్రం బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఆ పార్టీ నాయకులు బలంగా ఉండటంతో మెజార్టీ స్థానాలను కై వసం చేసుకున్నారు. స్వతంత్రులు కూడా 19 మంది గెలిచి వ్యక్తిగత బలాన్ని చూపారు. బీజేపీ మాత్రం అనుకున్నంత మేర రాణించలేకపోయింది. ఉప సర్పంచ్ ఎన్నికపై వివాదంవాంకిడి(ఆసిఫాబాద్): వాంకిడి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక సమయంలో వివాదం చోటుచేసుకుంది. వాంకిడిలోని జెడ్పీ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయగా, రాత్రి 11 గంటలకు కౌంటింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. 14 వార్డులు ఉండగా మండోకార్ తుర్సాబాయి, దీపక్ ముండే పేర్లను ఉప సర్పంచ్‌గా ప్రతిపాదించారు. ఎన్నికల అధికారి మిగితా సభ్యులను చేతులు ఎత్తాలని కోరగా.. తుర్సాబాయికి ఆరుగురు, దీపక్ ముండేకు ఆరుగురు మద్దతుగా నిలిచారు. ఇద్దరికి ఏడేసి చొప్పున సమాన ఓట్లు లభించాయి. దీంతో టాస్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి తెలిపారు. అయితే సర్పంచ్‌గా గెలుపొందిన చునార్కార్ సతీశ్ మాట్లాడుతూ ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఇద్దరికి సమాన ఓట్లు వస్తే సర్పంచ్‌ను పరిగణనలోకి తీసుకోవాలని, టాస్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు మాత్రమే సర్పంచ్ ఓటు వినియోగించే అవకాశం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి దీపక్ ముండే అంగీకరించలేదు. మొదట టాస్ వేస్తామని చెప్పి.. మళ్లీ సర్పంచ్ ఓటుకు ఎలా అవకాశం కల్పిస్తారని ఆయన అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నికను బహిష్కరిస్తామని బయటికి వెళ్లిపోయారు. రాత్రి రెండు గంటల వరకు ఉప సర్పంచ్ ఎన్నికలు నిలిచిపోయాయి. ఏఎస్పీ చిత్తరంజన్ ఘటనాస్థలికి వచ్చి అధికారులు, వార్డు సభ్యులతో చర్చలు జరిపారు. తెల్లవారుజామున తిరిగి ఎన్నికలు నిర్వహించారు. దీపక్ ముండేకు 12 మంది మద్దతు తెలపడంతో ఆయనను ఉప సర్పంచ్‌గా ప్రకటించారు. తేజాపూర్‌లో ప్రత్యేకాధికారి పాలనవాంకిడి: మండలంలోని తేజాపూర్ పంచాయతీలో ప్రత్యేకాధికారి పాలన కొనసాగనుంది. సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వేషన్ చేయగా, అక్కడ అభ్యర్థులు లేకపోవడంతో నామినేషన్లు దాఖలు కాలేదు. 8 వార్డు స్థానాల్లో నాలుగు జనరల్, మరో నాలుగు ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి. నాలుగు వార్డు స్థానాలకు మాత్రమే సభ్యులను ఎన్నుకున్నారు. ఉప సర్పంచ్ ఎన్నికకు కనీస కోరం ఐదుగురు అవసరం. నలుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉండటంతో తేజాపూర్ పంచాయతీకి ఉప సర్పంచ్ ఎన్నిక సాధ్యం కాలేదు. ఇకపై అక్కడ ప్రత్యేకాధికారి పాలన మాత్రమే కొనసాగనుంది. -
రక్షణ చర్యలతోనే ప్రమాదాల నివారణ
రెబ్బెన(ఆసిఫాబాద్): గనులు, డిపార్టుమెంట్లలో రక్షణ చర్యలు పాటిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలోని ఎంవీటీసీలో శుక్రవారం 56వ వార్షిక రక్షణ పక్షోత్సవా లను ఘనంగా నిర్వహించారు. రక్షణ తనిఖీ బృందం కన్వీనర్ ఎస్వోటూజీఎం కోటిరెడ్డి ఆధ్వర్యంలో సభ్యులు ఎంవీటీసీని పరిశీలించారు. ఉద్యోగులు అందిస్తున్న శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. త రగతులకు హాజరైన ఒప్పంద, సింగరేణి ఉద్యోగుల ను ప్రశ్నలు అడిగారు. జీఎం మాట్లాడుతూ సింగరే ణి ఉద్యోగులకు ఎంవీటీసీనే మొదటి గురువని అ న్నారు. శిక్షణ కాలంలో నేర్చుకునే ప్రతీ అంశాన్ని పాటించాలని సూచించారు. ఏరియా రక్షణాధికారి రాజమల్లు, ఎంవీటీసీ మేనేజర్ మధుసూదన్, ఎస్ఈ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు నవోదయ ప్రవేశ పరీక్ష
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 27 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.20 గంటల వరకు ప్రవేశ పరీక్ష కొనసాగనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 పరీక్ష కేంద్రాల్లో 24 మంది ఇన్విజిలేటర్లు, ఒక్కో సెంటర్‌కు ఒక అబ్జర్వర్, ఆసిఫాబాద్‌కు ఇద్దరు, మంచిర్యాలకు ముగ్గురు, నిర్మల్‌కు ఇద్దరు, ఆదిలాబాద్‌కు ముగ్గురు రూట్ ఆఫీసర్లను నియమించారు. ప్రతీ కేంద్రంలో ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఇద్దరు ఎల్డీసీ క్లర్క్‌లు, ఒక అటెండర్ విధులు నిర్వహించనున్నారు. పోలీ సు బందోబస్తుతోపాటు ముందు జాగ్రత్తగా వైద్యాధికారులను అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ రేపాల కృష్ణ సూచించారు. జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1,632 మంది హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీ మేరీ హైస్కూల్(జన్కాపూర్) టీఎస్ మోడల్ స్కూల్(ఆసిఫాబాద్), జవహర్ నవోదయ విద్యాలయం(కాగజ్‌నగర్) ఎస్టీ క్లారెట్ హైస్కూల్(కాగజ్‌నగర్), జెడ్పీఎస్ఎస్(సిర్పూర్– టి), టీఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ– బాలికలు(సిర్పూరు– టి)లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలిసిర్పూర్(టి): ప్రశాంత వాతావరణంలో నవో దయ ప్రవేశ పరీక్ష నిర్వహించాలని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఫర్నీచర్, గదులలో వెలుతురు, ఇతర సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు. -
విద్యార్థులపై ఫీజు భారం
ఆసిఫాబాద్‌రూరల్: ఫీజుల భారంతో పదో తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా మినహాయింపు ఇచ్చినా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం కుటుంబ ఆదాయ పరిమితి పెంచింది. దీంతో విద్యార్థులు నిబంధనలకు అనుగుణంగా ఆదాయ ధ్రువపత్రాలు సమర్పించడం సాధ్యం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా 169 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఇందులో డీఈవో పరిధిలో 58 పాఠశాలలు, 35 ప్రైవేట్ స్కూళ్లు, గిరిజన ఆశ్రమాలు 38, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీ గురుకులాలు 17 ఉన్నాయి. 6,941 మంది పదో తరగతి చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వం వార్షిక ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చింది. దీని కోసం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.24వేల వార్షిక ఆదాయం ధ్రువపత్రం అందించాలి. దారిద్య రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తింపజేస్తుండగా, ఇందుకు గరిష్ట వార్షిక ఆదాయం రూ.లక్షకు పైనే ఉంటోంది. కానీ పదో తరగతి విద్యార్థులకు 30 ఏళ్లుగా అతి తక్కువ ఆదాయం కొనసాగించడంపై విమర్శలు వస్తున్నాయి. ఎస్ఎస్సీ బోర్డు ఈ పరిమితి పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాసినా పరిస్థితిలో మార్పు రాలేదు. కేవలం గురుకులాలు, కేజీబీవీల్లోని విద్యార్థులు మాత్రమే నేరుగా రాయితీ పొందగలుగుతున్నారు. ప్రైవేట్‌లో అధికంగా వసూళ్లుప్రస్తుతం రూ.500 ఫైన్‌తో డిసెంబర్ 29 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. సప్లిమెంటరీ విద్యార్థులు మూడు సబ్జెక్టులోపు అయితే రూ.110, అంతకు మించి ఉంటే రూ.125 చెల్లించాలి, ఒకేషనల్ విద్యార్థులు రూ.185 చెల్లించాలి. ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది. ఫీజుల వివరాలు నోటీసు బోర్డులో పొందుపర్చాల్సి ఉండగా, ఎక్కడా అమలు కావడం లేదు. -
సరిహద్దులో ప్రశాంతంగా పోలింగ్
కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలంలోని తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో గల 15 వివాదాస్పద గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అంతాపూర్, పరంధోళి, భోలాపటార్, ముకదంగూడ పంచాయతీల ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మొత్తం ఇక్కడ 3,456 మంది ఓటర్లు ఉండగా 2,746(79.4శాతం) మంది ఓటు వేశారు. మహరాష్ట్రలోని చిక్లి, పాటగూడ, కుంభేఝరి గ్రామాలకు చెందిన సుమారు 56 ఓటర్లు బోలాపటార్ పంచాయతీలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరంతా గతంలో ఓటు వేయలేదు. సదరు పంచాయతీకి చెందిన గ్రామాల్లో పొలాలు ఉన్నాయని, ఇక్కడే ఆధార్ కార్డు ఉందని చెబుతున్నారు. దూర భారంలేండిగూడ నుంచి సుమారు నాలుగు కిలోమీటర్లు, ఎసాపూర్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం నడిచి ఓటర్లు బోలాపటార్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనేక మంది చిన్నారులను భుజాన ఎత్తుకుని కాలినడకన వచ్చారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. సరైన సమయానికి పోల్ చీటీలు అందలేదు. బీఎల్వోలు కేంద్రాల వద్ద పోల్ చీటీలు అందించారు. కేంద్రాల వద్ద, ప్రధాన మార్గాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బోలాపటార్‌లో బారులుతీరిన ఓటర్లులేండిగూడ నుంచి కాలినడకన వస్తున్న ఓటర్లుపోలింగ్ వివరాలుపంచాయతీ ఓటర్లు పోలైనవి శాతం అంతాపూర్ 815 656 85.5 బోలాపటార్ 1007 801 79.54 పరంధోళి 873 692 79.2 ముకదంగూడ 761 597 78.4 మొత్తం 3,456 2,746 79.4 -
ప్రశాంతంగా తొలి విడత పోలింగ్
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కెరమెరి/వాంకిడి: జిల్లాలోని కెరమెరి, జైనూ ర్, సిర్పూర్(యూ), లింగాపూర్, వాంకిడి మండలాల్లో తొలి విడత పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగిందని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. కెరమెరి మండలం కొ ఠారిలోని పోలింగ్ కేంద్రంతోపాటు వాంకిడి మండలం బెండారలోని పోలింగ్ కేంద్రాన్ని గురువారం ఎస్పీ నితిక పంత్, ఎన్నికల పరి శీలకుడు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టామని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటలోపు కేంద్రాలకు వారందరికీ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామన్నారు. -
కుమురం భీం
9రేపు నవోదయ ప్రవేశపరీక్ష కాగజ్‌నగర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 10లోu పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయి. చలి తీవ్రత పెరగడంతోపాటు పొగమంచు ప్రభావం ఉంటుంది. చలి గాలులు వీస్తాయి. ప్రసవం.. ప్రాణాంతకం కళ్లు తెరిచి లోకాన్ని చూడకముందే నవజాత శిశువులకు నూరేళ్లు నిండుతున్నాయి. తాజాగా గురువారం రిమ్స్‌లో ఓ బాలింత మృతిచెందగా, పుట్టిన బిడ్డ చనిపోయింది. శుక్రవారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2025 -
● ప్రశాంతంగా ముగిసిన తొలి విడత ఎన్నికలు ● ఐదు మండలాల్లో 79.81 శాతం పోలింగ్ నమోదు ● పోలీసుల పటిష్ట బందోబస్తు ● రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్
కెరమెరి(ఆసిఫాబాద్): గిరిజన పల్లెలు ఓటేసేందుకు పోటెత్తాయి. చలితీవ్రత అధికంగా ఉన్నా తరలి వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. జిల్లాలోని ఐదు మండలాల్లో గురువారం తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 96,068 మంది ఓటర్లకు 76,668 మంది ఓటు వేయగా, 79.81శాతం పోలింగ్ నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. చాలాచోట్ల రాత్రి వరకు ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు అధికంగా విజయం సాధించినట్లుగా తెలుస్తోంది. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లో మొత్తం 114 పంచాయతీలు, 944 వార్డులు ఉండగా.. ఏడు సర్పంచ్, 576 వార్డు స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. వాంకిడి మండలం తేజాపూర్ పంచాయతీ ఎస్టీలకు రిజర్వ్ కాగా, అక్కడ అభ్యర్థులు లేకపోవడంతో ఎన్నికలు నిర్వహించలేదు. అలాగే 36 వార్డు స్థానాలకు నామి నేషన్లు రాకపోవడం, ఐదు వార్డుల్లో వివిధ కారణాలతో నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. 107 సర్పంచ్, 327 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. చలి ప్రభావంజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గురువారం ఈ ఏడాది రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉదయం ఏడు గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు తక్కువ పోలింగ్ నమోదైంది. 11 గంటల తర్వాత పోలింగ్ పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలిలోనూ ఓటర్లు ఉదయం 7 గంట నుంచి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మధ్యాహ్నం 12 గంటల వరకే పోలింగ్ పూర్తయ్యింది. ఆ తర్వాత ఒక్కొక్కరు మాత్రమే వచ్చి ఓటు వేశారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పోల్చుకుంటే 6.41 శాతం పోలింగ్ తగ్గింది. గతంలో 86.30 శాతం పోలింగ్ నమోదు కాగా.. ప్రస్తుతం 79.81 శాతం నమోదైంది. అధికారులు మధ్యాహ్నం 3 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత తొలి ఫలితం వెలువడడం ప్రారంభమైంది. పోలింగ్ సాగిందిలా..అధికారులు ఏర్పాట్లు పూర్తిచేసుకుని ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభించారు. ఐదు మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 18,532(19.29శాతం) మంది ఓటు వేయగా, 11 గంటల వరకు 56,785(59.11శాతం) మంది, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 74,791(77.85శాతం) మంది ఓటు వేశారు. మొత్తంగా 76,668(79.81) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తప్పని తిప్పలువృద్ధులు, దివ్యాంగులకు ఇంటి నుంచి ఓటువేసే అవకాశం కల్పించకపోవడంతో ఇబ్బంది పడ్డారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నవారు సహాయకులతో వచ్చి ఓటువేశారు. వృద్ధులను వీల్చైర్లపై కేంద్రాలకు తీసుకువచ్చారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, ఉన్నతాధికారులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.వృద్ధుడిని తీసుకువస్తున్న సహాయకులుకెరమెరిలో చంటిపిల్లలతో వస్తున్న మహిళలువీల్ చైర్‌పై వస్తున్న వృద్ధురాలుగంటల వారీగా పోలైన ఓట్లు, శాతం మండలం 9గంటలు 11గంటలు ఒంటిగంట వరకు మొత్తం జైనూర్ 4,820(19.78) 13359(54.83) 18,720(76.84) 18,714(76.81) కెరమెరి 2,558(11.13) 16,143(70.21) 17,941(78.03) 19,171(83.38) లింగాపూర్ 2,041(23.02) 4,750(53.57) 7,057(79.59) 7,059(79.61) సిర్పూర్(యూ) 3,200(26.06) 7,666(62.44) 9,798(79.81) 9,966(81.18) వాంకిడి 5,913(21.45) 14,867(53.93) 21,275(77.17) 21,760(78.93) మొత్తం 18,532(19.29) 56,785(59.11) 74,791(77.85) 76,668(79.81) -
బరిలో రిటైర్డ్ ఎంఈవో
ఆసిఫాబాద్ మండలంలో నూతనంగా ఏర్పడిన రాజంపేట్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా రిటైర్డ్ ఎంఈవో నాంపెల్లి శంకర్ బరిలో ఉన్నారు. శంకర్ 1981లో ఎస్జీటీగా బూర్గుడ పాఠశాలలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ పూర్తిచేసి 1989లో స్కూల్ అసిస్టెంట్‌గా నియామకయ్యారు. ఎంఏ పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఎంఈడీ సైతం పూర్తి చేశారు. 2005లో తిర్యాణి ఎంఈవోగా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత సర్పంచ్ పోటీలో నిలిచారు. కొత్త పంచాయతీని ఉత్తమంగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొంటున్నారు. -
సరిహద్దులో సమరం
కెరమెరి(ఆసిఫాబాద్): తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులోని 15 వివాదాస్పద గ్రామాల్లో గురువారం పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు పంచాయతీలు, 31 వార్డుల్లోని ప్రజలు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ మేరకు అక్కడ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకంగూడ పంచాయతీలు ఏళ్లుగా తెలంగాణ, మహారాష్ట్ర పాలనలో కొనసాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లో పరంధోళి, కోటా, పరంధోళి తాండ, శంకర్‌లొద్ది, లేండిజాల, మహరాజ్‌గూడ, ముకదంగూడ, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయాణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరీ గ్రామాలు ఉన్నాయి. సుమారు 1520 కుటుంబాలు ఉండగా.. 5875 జనాభా ఉంది. 3,456 మంది ఓటర్లు ఉన్నారు. ఏళ్లుగా వివాదాలు పరిష్కారం కాకపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అక్కడ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నాయి. ప్రజలు రెండు రాష్ట్రాలకు చెందిన ఓటుహక్కు కలిగి ఉన్నారు. అన్నీ డబుల్ రెండు ప్రభుత్వాల పాలన ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇద్దరేసి ప్రజాప్రతినిధులు ఉండటంతోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు అందించారు. తెలుగు, మరాఠీ మీడియాలకు చెందిన పాఠశాలలు కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే అనేక గ్రామాల్లో పక్కా గృహాలు మంజూరు కాలేదు. గతేడాది ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నాలుగు పంచాయతీలకు ఒక్కో ఇల్లు చొప్పున మంజూరు చేశారు. దీంతో అక్కడి ప్రజలు పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో జీవనం సాగిస్తున్నారు. అంతేకాక సాంకేతిక యుగంలోనూ వారికి మొబైల్ నెట్వర్క్ సేవలు అందడం లేదు. ఆయా గ్రామాల్లో 70 శాతం మంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. రెవెన్యూ, అటవీశాఖ మధ్య వివాదాలతో వారి భూములకు పట్టాలు లేవు. 2016 నుంచి పహనీలు కూడా నిలిచిపోవడంతో బ్యాంకు రుణాలు అందడం లేదు. ఫలితంగా వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్రి వాగుపై రెండేళ్ల క్రితం వంతెన నిర్మించినా రోడ్డు పనులు వదిలేశారు. ఉమ్రి నుంచి పరంధోళికి సుమారు నాలుగు కిలోమీటర్ల మేర కంకర తేలి అధ్వానంగా మారింది.ఓటర్ల వివరాలుపంచాయతీ ఓటర్లుఅంతాపూర్ 815 బోలాపటార్ 1,007 పరంధోళి 873 ముకదంగూడ 761 -
ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని ఏఎస్పీ చిత్తరంజన్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యకళా శాలలో బుధవారం విద్యార్థులకు ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నో ర్యాగింగ్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ వైద్యులు ఎదగాలని ఆకాంక్షించారు. కలిసిమెలిసి ఉంటూ ర్యాగింగ్‌కు పా ల్పడొద్దన్నారు. వైద్యులను సమాజంలో దైవంతో సమానంగా చూస్తారని, భవిష్యత్తులో పేదలకు వైద్యసేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ బాలాజీ వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు. -
రక్షణతో కూడిన పనికి ప్రాధాన్యత
రెబ్బెన(ఆసిఫాబాద్): బొగ్గు ఉత్పత్తిలో కాస్త ఆలస్యమైనా రక్షణతో కూడిన పనికి ప్రాధాన్యత ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి సీహెచ్‌పీలో తనిఖీ బృందం పర్యటించింది. కన్వీనర్ కృష్ణమూర్తి సారథ్యంలో రక్షణ తనిఖీ బృందం జీఎంతో కలిసి సీహెచ్‌పీని పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ సింగరేణిలోనే గోలేటి సీహెచ్‌పీ ఉత్తమమైందని, బొగ్గు రవాణా, సరఫరాలో మెరుగైన ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. ప్రతీ ఉద్యోగి రక్షణ విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దన్నారు. అనంతరం కళాకారులు పాటలు, నాటిక ద్వారా రక్షణ ప్రాముఖ్యతను వివరించారు. గాయపడిన వారికి సీపీఆర్, ప్రథమ చికిత్స చేసే విధానంపై అవగాహన కల్పించారు. తనిఖీ బృందం సభ్యులు ట్రేడ్ టెస్ట్ విజేతలకు బహుమతులు ప్రదానంగా చేశారు. అలాగే డీవైసీఎంవో రమేశ్‌బాబు ఆధ్వర్యంలో మరో తనిఖీ బృందం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రితోపాటు గోలేటి డిస్పెన్సరీని సందర్శించి రక్షణ చర్యలు పరిశీలించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా రక్షణాధికారి కె.రాజమల్లు, సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య, రక్షణ తనిఖీ బృందం సభ్యులు గాబ్రియల్ రాజు, స్టాలిన్ బాబు, ఏజీ శివప్రసాద్, హనుమాన్‌గౌడ్, సంతోష్‌కుమార్, ఫిట్ కార్యదర్శి రామయ్య పాల్గొన్నారు. -
పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కౌటాల/చింతలమానెపల్లి: రెండో విడత పంచాయతీ పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. కౌటాల మండలం గుండాయిపేట, గుడ్లబోరి, చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ, రణవెల్లి, బూరెపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను బుధవారం పరిశీలించారు. ఈ నెల 14న జరిగే రెండో విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సిబ్బంది ముందురోజు సాయంత్రం 4 గంటల కు కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. సామగ్రి, కవర్లు, పేపర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్లు ప్రమోద్‌కుమార్, వెంకటేశ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు చంద్రశేఖర్, నరేశ్, ఆర్ఐ దిలీప్, కార్యదర్శులు తిరుపతి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే కెరమెరి(ఆసిఫాబాద్): పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహణ సక్రమంగా పర్యవేక్షించాలన్నారు. సరిపడా కుర్చీలు, టేబుళ్లు ఏర్పాటు చేయాలని, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏజెంట్లు మినహా మిగిలిన వారిని కేంద్రాల్లోకి అనుమతించొద్దన్నారు. సిబ్బందికి అల్పాహారం, భోజనం ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, ఎంపీడీవో సురేశ్, తహసీల్దార్ సంతోష్, ఎంఈవో ఆడే ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. చట్టాలను అతిక్రమిస్తే చర్యలుకెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ నితిక పంత్ హెచ్చరించారు. కెరమెరి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండల కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, ప్రలోభాలు, బెదిరింపులు.. వంటి చర్యలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమల్లో ఉన్నందున గుంపులుగా ఉండొద్దని సూచించారు. ప్రజలు స్వేచ్ఛాయుతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీఐలు రమేశ్, విద్యాసాగర్, బుద్దె రవీందర్, ఎస్సైలు గంగన్న, రవికుమార్, మధుకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
గిన్నెధరి @ 6.0 డిగ్రీలు
కౌటాల(సిర్పూర్): జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతోపాటు చల్ల గాలులు వీస్తున్నాయి. బుధవారం తిర్యాణి మండలం గిన్నెధరి, సిర్పూర్(యూ)లో 6.0 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే తిర్యాణిలో 7.3 డిగ్రీలు, కెరమెరి 7.9, ఎల్కపల్లి 9.1, ధనోరా 9.4, బెజ్జూర్ 10.0, రెబ్బెనలో 10.0 డిగ్రీలుగా నమోదయ్యాయి. పగలు సైతం చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లేవారు కూడా సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నారు. స్వెటర్లు, మఫ్లర్స్, మాస్క్‌లు ధరించి తిరుగుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో హోమం
కౌటాల(సిర్పూర్): మండల కేంద్రంలోని సదాశివపేట శివాలయ 52వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో బుధవారం ఆలయ ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య ఆధ్వర్యంలో అఖండ దీపారాధన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు. భక్తిశ్రద్ధలతో రుద్రహోమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తుల సందడి నెలకొంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా, గురువారం ఉదయం ఉదయం 5.30 గంటలకు ఆలయంలో అగ్నిగుండ ప్రవేశం, పూర్ణహుతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకులు అంబేద శంకరయ్య తెలిపారు. -
తొలి ప్రచారానికి తెర..!
కెరమెరి(ఆసిఫాబాద్): తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు, నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత జోరు పెంచారు. మంగళవారం చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలతో మద్దతుదారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. సాయంత్రం 5 గంటలకు ఎక్కడికక్కడ నిశబ్దం నెలకొంది. దీంతో సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, వాంకిడి మండలాల్లో ఈ నెల 11న తొలి విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డులు ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 106 పంచాయతీల్లో 396 మంది అభ్యర్థులు, 327 వార్డుల్లో 855 మంది బరిలో నిలిచారు. పల్లెల్లో దావత్లుపంచాయతీ ఎన్నికలతో ఎక్కడ చూసినా దావత్లే దర్శనమిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఎక్కడిక్కడ రహస్య మంతనాలు జరుగుతున్నాయి. మందుబాబులు కోలాహలం చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు దావత్‌లకు విముఖత వ్యక్తం చేస్తుండగా.. వారి సహచరులకు తలనొప్పి తప్పడం లేదు. మందు, విందుకు వారే నగదు సమకూరుస్తున్నారు. ఇక సోషల్ మీడియా జోరుప్రత్యక్ష ప్రచారం ముగియడంతో అభ్యర్థులు మిగిలి న రోజును సద్వినియోగం చేసుకోవడంపై దృష్టి సారించారు. దాదాపు అన్ని పంచాయతీల్లో అభ్యర్థుల పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్న పంచాయతీ, మండల గ్రూపులతోపాటు కుల, యూత్ గ్రూపుల్లోనూ తమ గుర్తులు, హామీలు, గెలిచిన తర్వాత చేపట్టనున్న పనులతో పోస్టులు పెడుతున్నారు. విభిన్నంగా ఎడిట్లు చేసి వాట్సాప్ స్టేటస్లు పెడుతున్నారు. మద్దతుదారులతో కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన గెలుపుఏజెన్సీ ప్రాంతంలో చాలా సర్పంచ్ స్థానాలకు ఎస్టీలకే రిజర్వ్ అయ్యాయి. ఇక్కడ ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలని వార్డు సభ్యులుగా అనేక మంది పోటీలో ఉన్నారు. పలువురు అభ్యర్థులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో నిలవడం తలనొప్పిగా మారింది. మహిళలు బరిలో ఉన్న స్థానాల్లో పతులు, కుటుంబ సభ్యులే ఎక్కువగా ప్రచారం నిర్వహించారు. మద్యం అమ్మకాలు బంద్ఆసిఫాబాద్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికల జరిగే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 11న ఎన్నికలు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు షాపులు మూతపడనున్నాయి. అలాగే రెండో విడతలో సిర్పూర్(టి), కౌటాల, పెంచికల్పేట్, దహెగాం, బెజ్జూర్, చింతలమానెపల్లి మండలాల్లో ఈ నెల 12 సాయంత్రం 5 గంటల నుంచి 14 వరకు, మూడో విడతలో భాగంగా ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో ఈ నెల 15 సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 17న పోలింగ్, ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు.ప్రలోభాల ఎరవారం రోజులుగా గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న అభ్యర్థులకు బుధవారం రాత్రి అత్యంత కీలకం కానుంది. ముఖ్యంగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభా లను ఎర వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఒక్కో వార్డుకు ఒక్కో నాయకుడిని నియమించుకుంటున్నారు. మద్యం అమ్మకాలకు అనుమతి లేని నేపథ్యంలో రెండు రోజుల క్రితమే మద్యం డంప్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు సోమవారం రాత్రి నుంచే పంపిణీ ప్రారంభించారు. రహస్యంగా వెళ్లి ఓటర్లను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు అన్ని బాధ్యతలు చూసుకుంటున్నారు. -
ఘనంగా దీక్షా విజయ్ దివస్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీక్షా విజయ్ దివస్ ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద నివా ళులర్పించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల కు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, బీఆ ర్ఎస్ రాష్ట్ర నాయకురాలు సరస్వతి, మాజీ ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న, నాయకులు నిసార్, పోచయ్య, అశోక్, జావెద్, సాజి ద్, అన్సార్, సాలాం, చందు, నారాయణ తదతరులు పాల్గొన్నారు. -
‘చెలిమి’తో ఆత్మవిశ్వాసం
వాంకిడి(ఆసిఫాబాద్): భరోసా లేని కుటుంబ నేపథ్యం, మానసిక ఒత్తిడి, భయం, కుంగుబాటుతో భావోద్వేగాలను పంచుకోలేక ఆత్మ విశ్వాసం కోల్పోతున్న విద్యార్థులను గుర్తించి వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సున్నిత మనస్తత్వం కలిగిన బాలికల్లో స్నేహభావం పెంచుతూ ఒత్తిడిని తగ్గించేందుకు పీఎంశ్రీ పథకంలో భాగంగా ‘చెలిమి’ (సోషియో ఎమోషనల్ వెల్ బీయింగ్ ప్రోగ్రాం) కార్యక్రమాన్ని చేపట్టనుంది. కంప్యూటర్లతో పోటీ పడుతున్న ఆధునిక యుగంలో అనేకమంది పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇంటర్నెట్, సోషల్ మీడియా, విద్యాపరమైన ఒత్తిడిని తట్టుకోలేక అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర విద్యాశాఖ పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రతీ పీఎంశ్రీ పాఠశాల నుంచి ఒక నోడల్ ఉపాధ్యాయుడిని ఎంపిక చేసి చెలిమి కార్యక్రమంపై శిక్షణ అందించింది. నోడల్ ఉపాధ్యాయులకు శిక్షణ జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో చెలిమి కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల నుంచి ఒకరు చొప్పున 16 మంది నోడల్ అధికారులను ఎంపిక చేసి శిక్షణ అందించారు. నవంబర్ 27 నుంచి 29 వరకు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్డీ)లో మూడు రోజులపాటు శిక్షణ కల్పించారు. విద్యార్థుల్లో భయం పోగొట్టడం, ఆత్మవిశ్వాసం పెంచుకునేలా భరోసా కల్పించడం, కమ్యూనికేషన్ నైపుణ్యాల పెంచడంపై అవగాహన కల్పించారు. వారంలో రెండు పీరియడ్లు..జిల్లాలోని 16 పీఎంశ్రీ పాఠశాలల్లో మొదట ఆరో తరగతి విద్యార్థులతో చెలిమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రతీవారం రెండు పీరియడ్లు దీని కోసం కేటాయిస్తారు. విద్యార్థుల కుటుంబ నేపథ్యం, ఇళ్లలో ఎలా ఉంటారు. బయట ఎలా ఉంటారు, పాఠశాలలో ఎలా మెలుగుతారు.. అనే కోణంలో విద్యార్థి మానసిక స్థితిపై ఒక అంచనాకు వస్తారు. ఆ తర్వాత వారి మానసిక స్థితి ఆధారంగా నైపుణ్యాలు పెంచేలా కార్యాచరణ రూపొందిస్తారు. ఉపాధ్యాయుడు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ మనోభావాలను గుర్తిస్తారు. విద్యార్థి ప్రతీ విషయాన్ని యాక్టివిటీస్ రూపంలో వ్యక్తపరిచేలా స్పష్టమైన సూచనలు ఇస్తారు. పిల్లలపై కోప్పడటం, భయపెట్టి మాట్లాడించడం, బలవంతం చేయడం వంటి చర్యలు ఉండవు. వారికి ఎలాంటి బాధ కలగకుండా ఉత్సాహంగా, స్నేహపూర్వకంగా భావ ప్రకటన ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటారు. ఇబ్బంది పడకుండా సమస్యలు పరిష్కరించి ఆత్మ విశ్వాసం పెంచుకునేలా తీర్చిదిద్దుతారు. సమస్యలను ఉపాధ్యాయులకు చెప్పుకుని సమాజం, చదువులో ఎదురయ్యే అవరోధాలు అధిగమించేలా వారికి ధైర్యం కల్పిస్తారు. ఉపయోగకరమైన కార్యక్రమం చెలిమి కార్యక్రమం ద్వారా విద్యార్థుల మానసిక స్థితి మెరుగుపడుతుంది. భయం, ఒత్తిడి, కోపం, బాధ నుంచి బయటపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం. వారంలో రెండు పీరి యడ్లు కేటాయించి వారి మనసుకు బాధ కలగకుండా తరగతులు నిర్వహిస్తాం. ఆత్మవిశ్వాసంతో స మస్యలు ఉపాధ్యాయులతో చెప్పుకునేలా సిద్ధం చేస్తాం. ఇది పిల్లలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం. – అమ్జద్ పాషా, శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు, వాంకిడి 16 పీఎంశ్రీ పాఠశాలలుప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం పీఎం స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకం అమలు చేస్తున్నారు. పీఎంశ్రీ పథకంలోని 16 పాఠశాలల్లో చెలిమి తోపాటు బాలికల ఆత్మరక్షణకు కరాటే, మానసిక ఆరోగ్యానికి యోగా, క్రీడాపోటీలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అ లాగే ఆయా స్కూళ్లలో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించడంతోపాటు ఆధునాతన బోధనకు చర్యలు తీసుకుంటున్నారు. కార్పొరేట్ స్థాయిలో తరగతి గదులు, లైబ్రరీలు, ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెలిమి కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం ప్రతీ పాఠశాలకు రూ.3100 చొప్పున మంజూరు చేసింది. వీటితో విద్యార్థులకు చార్టులు, కలర్ స్కెచ్‌లు తదితర పరికరాలు కొనుగోలు చేస్తారు. -
వణుకుతున్న ‘ఏజెన్సీ’
కౌటాల(సిర్పూర్): జిల్లాపై మళ్లీ చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు వణుకుతున్నాయి. మంగళవారం పలు మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. తిర్యాణి మండలం గిన్నెధరిలో 6.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుగా, తిర్యాణిలో 7.4, కెరమెరి 7.7, ఎల్కపల్లి 9.3, ధనోరా 9.4, సిర్పూర్(యూ), బెజ్జూర్ 9.6, రెబ్బెన, కాగజ్‌నగర్ 9.8, వాంకిడిలో 9.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. వారం క్రితం 15 డిగ్రీలు ఉండగా మంగళవారం నాటికి సింగిల్ డిజి ట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం పది గంటలైనా బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలు స్వెట్టర్లు ధరించడంతోపాటు చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు. జిల్లాకు హెచ్చరిక..జిల్లావ్యాప్తంగా గత నెలలో చలితీవ్రత అధికంగా ఉండగా, మోంథా తుపానుతో తీవ్రత తగ్గింది. కొద్దిరోజులపాటు సాధారణ పరిస్థితులే ఉన్నాయి. మళ్లీ రెండు రోజులుగా చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో మార్పులతో మంగళవారం రోజంతా చలిగాలులు వీచాయి. ప్రస్తుతం జిల్లాలోని పది మండలాలు అలర్ట్ జోన్లోగా ఉండగా, మిగతా మండలాలు వాచ్ జోన్లో ఉన్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు చలి హెచ్చకలు జారీ చేసింది. బుధవారం నుంచి వారం పాటు తీవ్రమైన చలి వాతావరణం ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పనులకు ఆటంకంఎన్నికల ప్రచారంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులపై చలి ప్రభావం పడుతోంది. వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. తెల్ల వారుజామున విపరీతంగా మంచు కురుస్తుండడంతో వ్యవసాయ పనులు, ఉద్యోగాలకు వెళ్లే వారు గజ గజ వణుకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణులతోపాటు ఆస్తమా ఉన్న వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
పెంచికల్పేట్(సిర్పూర్): గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా అన్నారు. పెంచికల్పేట్ మండలం లోడుపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలతో పాటు ఎన్నికల సామగ్రి తరలింపులో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో అల్బర్ట్, తహసీల్దార్ తిరుపతి, ఎస్సై అనిల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘కౌటాల’లో పోటీ తీవ్రం
కౌటాల(సిర్పూర్): రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాల్లో అత్యధికంగా కౌటాల మండలంలో పోటీ తీవ్రంగా ఉంది. జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ మండలంలోని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రధాన పార్టీల మద్దతుదారులపాటు రాజకీయంగా ఎదిగేందుకు స్వతంత్రులు బరిలో నిలిచారు. బెజ్జూర్, దహెగాం మండలాలతో పోల్చితే కౌటాలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు తక్కువగా ఉన్నాయి. కౌటాల మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉండగా 85 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 182 వార్డు సభ్యుల స్థానాలకు 461 మంది అదృష్టం పరీక్షించుకోనున్నారు. అన్ని మండలాల కంటే వార్డు సభ్యులు సైతం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో తలోడి, శీర్షా, కనికి పంచాయతీలు ఏకగీవ్రమయ్యాయి. కానీ ఈసారి ఒక్క పంచాయతీ కూడా ఏకగీవ్రం కాలేదంటే పోటీ ఏ స్థాయిలో అర్థం చేసుకోవచ్చు. చిన్న పంచాయతీల్లో సైతం ముగ్గురు, నలుగురు బరిలో నిలిచి ప్రచారంలో దూసుకుపోతున్నారు. పంచాయతీల వారీగా అభ్యర్థుల వివరాలుమండలం జీపీలు అభ్యర్థులు దహెగాం 24 76 బెజ్జూర్ 22 83 కౌటాల 20 85 చింతలమానెపల్లి 19 67 సిర్పూర్(టి) 16 65 పెంచికల్పేట్ 12 49 మొత్తం 112 425 -
సరిహద్దులో సర్పంచ్‌లకే ప్రాధాన్యత
చింతలమానెపల్లి(సిర్పూర్): మిగితా ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్ర సరిహద్దు పంచాయతీల్లో సర్పంచ్‌లకు అధిక ప్రాధాన్యత ఉంది. వివిధ స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఉన్నా పోలీసులు, ఇతర శాఖల అధికారులు వివిధ అంశాలు, సమాచారం కోసం ఎక్కువగా సర్పంచులపైనే ఆధారపడతారు. స్థానికంగా సమస్యలు తలెత్తినప్పుడు, ఇతర నిర్ణయాలు తీసుకోవడంలోనూ వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు రాజుల పాలనకు ప్రస్తుతం అనేక మార్పులు వచ్చాయి. గ్రామ పెద్దలుగా పోలీసు పటేళ్ల హవా కొనసాగేది. తహసీల్దార్, పోలీసులకు గ్రామాల ప్రజలకు అనుసంధానంగా పటేళ్లు వ్యవహరించేవారు. పంచాయతీరాజ్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత వారి స్థానాలను సర్పంచులు భర్తీ చేస్తున్నారు. భిన్న సంస్కృతులకు నిలయంకుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో భిన్న సంస్కృతులకు నిలయంగా ఉంది. ప్రాణహిత, పెన్‌గంగ నదులకు ఇరువైపులా ప్రజలకు బంధుత్వాలు ఉన్నాయి. గిరిజనులు రాజులుగా పరిపాలించిన మహారాష్ట్రలోని అహేరి ప్రాంతం చింతలమానెపల్లికి సరిహద్దుగా ఉండగా.. మానిక్‌ఘడ్ రాజులు పాలించిన ప్రాంతం సి ర్పూర్(టి) మండలానికి సరిహద్దుగా ఉంది. అన్ని కులాలు, మతాలతో ఈ ప్రాంతంలో రాజకీయంగానూ చైతన్యం అధికం. ప్రత్యేకతను చాటుకుంటూ..జిల్లాలోని గ్రామీణ మండలాల్లో సర్పంచులదే కీలక పాత్ర. పాలన, సమస్యల పరిష్కారంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నాయి. అక్కడి ప్రజలతో సాంస్కృతిక, బంధుత్వ, రాజకీ య, ఆర్థిక సంబంధాలు కొనసాగుతున్నాయి. మ హారాష్ట్రలో జిల్లాకు చెందిన పౌరులు, అక్కడి ప్రజ లు మన ప్రాంతంలో సమస్యల్లో చిక్కుకుంటే స ర్పంచులే ముందుండి పరిష్కరిస్తారు. స్థానికులతో కలివిడిగా ఉండడం, ఆయా ప్రాంతాలై అవగాహన ఉండటం వీరికి అదనపు అర్హతగా మారింది. మండ ల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులు ఉన్నా అక్కడి పోలీసు, ఆయా శాఖల అధికారులు మీ సర్పంచును తీసుకునిరమ్మని చెప్పడం ఇక్కడ సర్వసాధారణం. వివాహాలు, భూవివాదాలలో సైతం పంచాయితీలు నిర్వహించి సామరస్యంగా పరిష్కరిస్తుంటారు. -
ఎన్నికల సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు
వాంకిడి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్లు దీపక్ తి వారి, డేవిడ్‌తో కలిసి పరిశీలించారు. పోస్టల్ బ్యాలె ట్ వినియోగ కేంద్రం, స్ట్రాంగ్ రూం, బ్యాలెట్ పేప ర్లు, బాక్సులు, తదితర సామగ్రిని పరిశీలించి అధి కారులకు సూచనలు చేశారు. సిబ్బంది కోసం హె ల్ప్డెస్క్లు ఏర్పాటు చేయాలని, జోనల్ అధికారులు, స్టేజ్– 2 ఆర్వో సిబ్బందిని బుధవారం సాయంత్రం 4 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు తరలించా లని ఆదేశించారు. అనంతరం వాంకిడిలోని కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, తహసీల్దార్ కవిత, ఎంపీడీవో జ్యోత్స్న పాల్గొన్నా రు. తొలివిడత ప్రశాంతంగా నిర్వహించాలిఆసిఫాబాద్: పంచాయతీ తొలివిడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, సాధారణ వ్యయ పరిశీలకులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్ రోజు తీసుకోవాల్సిన చర్యలు, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచుల ఎన్నిక, ఓటర్ల ప్రభావిత అంశాలను అరికట్టడంపై సమీక్షించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ నితిక పంత్, వ్యయ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతిగౌడ్, నోడల్ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. స్టేజ్– 2 ఆర్వోలకు శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్, ఇతర అధికారులకు శిక్షణ పూర్తయ్యిందన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. -
స్టేజ్–2 ఆర్వోల పాత్ర కీలకం
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల్లో స్టేజ్– 2 ఆర్వోల పాత్ర కీలకమని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అ న్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతితో కలిసి పంచాయతీ ఎన్నికల స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించాలని, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదట వార్డు సభ్యులు, అనంతరం సర్పంచ్ స్థానాల ఓట్ల లెక్కింపు జరపాలన్నారు. అనంతరం ఉప సర్పంచ్‌ను ఎన్నుకోవాలన్నారు. సామగ్రి, కవర్లు, పోలింగ్ కేంద్రాల్లో కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. కౌంటింగ్‌కు ముందు సీవో డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ పేపర్ సీల్, అకౌంట్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ కవర్లు పరిశీలించాలని సూచించారు. ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్లు ఊషన్న, ఆసిఫ్, స్టేజ్– 2 రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహా న్ని మంగళవారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, కలెక్టరేట్ ఏవో కిరణ్, ఇతర అధికారులతో కలిసి సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రంగులు, పూలతో అలంకరించాలని, కార్యక్రమానికి వచ్చేవారికి అల్పాహారం, తాగునీరు అందించాలన్నారు. సుమారు 300 మంది విద్యార్థులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
కేంద్ర సభ్యులను సావర్‌ఖేడాకు తీసుకువస్తా
కెరమెరి(ఆసిఫాబాద్): త్వరలో పీఎంశ్రీ పాఠశాలల పరిశీలనకు జిల్లాకు రానున్న కేంద్ర పాఠశాల విద్యాశాఖ సభ్యులను సావర్‌ఖేడా పాఠశాలకు తీసుకువస్తానని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి అన్నారు. మండలంలోని సావర్‌ఖేడా పీఎంశ్రీ ప్రా థమిక పాఠశాలను సోమవారం సందర్శించారు. కిచెన్ గార్డెన్, ప్రీప్రైమరీ తరగతుల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. నాలుగో తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తంచేశారు. అనంతరం వంట గదిని పరిశీలించారు. హెచ్ఎం, గ్రామస్తులు నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని త్వరలో సందర్శించి, సూపర్– 100 విద్యార్థులతో మాట్లాడతానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఉప్పులేటి శ్రీనివాస్, ఎంఈవో ఆడే ప్రకాశ్, హెచ్ఎం కడేర్ల రంగయ్య, ఏఈఈ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలిపంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేశారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎంపీడీవో బి.సురేశ్, ఎంఈవో ప్రకాశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఉప సర్పంచ్ ‘పవర్’ ఫుల్!
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ పోరులో సర్పంచ్ రిజర్వేషన్లు దక్కనివారు ఉప సర్పంచ్ పదవిపై కన్నెశారు. ముఖ్యంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్ స్థానాలు ఎక్కువగా ఎస్టీలకే రిజర్వేషన్ కావడంతో అక్కడ ఉప సర్పంచ్ పదవికి తీవ్రమైన పోటీ నెలకొంది. నూతన పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన 2019 పంచాయతీ ఎన్నికల నుంచి ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారింది. గతంలో నామమాత్రపు అధికారాలు ఉండగా, 2019 నుంచి నిధుల ఖర్చుకు సర్పంచ్‌తోపాటు ఉప సర్పంచులకు ఉమ్మడి చెక్ పవర్ కల్పించారు. దీంతో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులు కీలకమైన రెండోస్థానం కోసం సైతం పోటాపోటీగా ప్రచారం చేసుకుంటూ మొదట వార్డు సభ్యులుగా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ముమ్మర ప్రయత్నాలుజిల్లాలో మొత్తం 335 పంచాయతీలు, 2,874 వార్డులు ఉన్నాయి. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కెరమెరి, జైనూర్, లింగాపూర్, వాంకి డి, సిర్పూర్(యూ) మండలాల్లో 114 పంచా యతీల్లో ఏడు ఏకగ్రీవం కాగా 107 సర్పంచ్ స్థానాలకు 396, 368 వార్డులకు 855 మంది బరిలో నిలిచారు. ఇక రెండో విడతలో సిర్పూర్ (టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలు, మూడో విడతలో ఆసిఫాబాద్, తిర్యాణి, రెబ్బెన, కాగజ్‌నగర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్‌ను నేరుగా ఓటర్లే ఎన్నుకోనుండగా, ఉప సర్పంచ్‌ను మాత్రం వార్డు సభ్యుల్లో ఒకరి ని ఎన్నుకుంటారు. గతంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌కి ఒకే తరహా అధికారాలు ఉండే వి. దీంతో ఆ పదవి అలంకారప్రాయంగా మిగి లింది. నూతన చట్టం అమలు తర్వాత ప్రాధాన్యత పెరగడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జనరల్ రిజర్వేషన్ వస్తే సర్పంచ్ బరిలో నిలుస్తామని ఆశించిన వారు కనీసం ఉపసర్పంచ్ పదవినైనా దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నా రు. ఉపసర్పంచ్‌కి రిజర్వేషన్ లేకపోవడంతో మొదట వార్డు సభ్యులుగా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వార్డులో ఓటర్ల మద్దతు కూడగడుతూనే.. ఉపసర్పంచ్‌గా తన వైపు నిలవాలని ఇతర వార్డు పోటీదారులను ప్రాధేయపడుతున్నారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉమ్మడిగా చెక్ పవర్ ఉండగా, విధుల నిర్వహణ మాత్రం సర్పంచ్‌లకే అప్పగించారు. నిధులు వినియోగంలో విఫలమైతే సర్పంచ్‌లపై చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 11న ఎన్నికలు జరిగే అత్యధిక మండలాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. యువత, విద్యావంతులు సైతం పోటీలో నిలిచారు. -
రాష్ట్రస్థాయి నేతగా..
మాజీ మంత్రి కొట్నాక భీంరావు మరో కుమార్తె మర్సోకోల సరస్వతి 2002, 2015లో రెండుసార్లు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలుపొందారు. పదేళ్లపాటు సర్పంచ్‌గా సేవలందించారు. 2003 నుంచి 2009 వరకు ఏఐసీసీ సభ్యురాలిగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టికెట్ దక్కుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అయితే కాంగ్రెస్ టికెట్ లభించకపోవడంతో అనంతరం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలోనూ రాష్ట్రస్థాయి నాయకురాలిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తన సోదరి ఎమ్మెల్యే కోవ లక్ష్మికి మద్దతుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ఒక్కరోజే గడువు!
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల తర్వాత మైకులు మూగబోనున్నాయి. ప్రచారపర్వం ముగియనుంది. ఈ నెల 3తో నామినేషన్ల ఉపసంహరణ ముగియగా, అభ్యర్థులకు అదేరోజు గుర్తులు కేటాయించారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థులు మద్దతుదారులతో కలిసి రాత్రి, పగలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. చివరిరోజు ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. రెండు రాత్రులు కీలకం..మంగళవారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా, ఆ రోజు, మరుసటి రోజు రాత్రి అభ్యర్థులకు కీలకం కానుంది. కొందరు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సైలెంట్‌గా ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 107 పంచాయతీల్లో 396 మంది, 368 వార్డులకు 855 అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులతోపాటు స్వతంత్రులు కూడా గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఆయా పంచాయతీల్లోని పటేళ్లు, దేవారీలు, మహిళా సంఘాల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే మాటాముచ్చట అంతా అయిపోయిందని, ఇచ్చింది పుచ్చుకోవడమే మిగిలిందని గ్రామాల్లో చర్చ జోరుగా సాగుతోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళ, బుధవారాలు కీలకం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రాత్రులపాటు గట్టి నిఘా పెట్టనున్నారు. మద్యం, డబ్బు పంపిణీపై దృష్టి సారించారు. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలుమండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు వాంకిడి 25 88 124 383 కెరమెరి 29 111 118 222 జైనూర్ 26 104 55 109 సిర్పూర్(యూ) 15 51 26 56 లింగాపూర్ 12 42 45 85 మొత్తం 107 396 368 855 -
జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు
కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని పెట్రోల్ పంప్ జెడ్పీ పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జోనల్‌స్థాయి బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రూరల్ సీఐ కుమారస్వామి హాజరై పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. యువకులు వ్యస నాలకు బానిసలు కావొద్దని సూచించారు. అండర్– 14 విభాగంలో విక్రమ్ తేజ, అండర్– 19 విభాగంలో సుమిత్ తివారి, అంకిత్, ప్రభాత్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికయ్యారని ఎస్జీఎఫ్ జిల్లా సెక్రెటరీ వెంకటేశ్ తెలిపారు. వీరు వరంగల్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముర్ల మధు, సెక్రెటరీ మధురై శేఖర్, జెడ్పీఎస్హెచ్ పీడీ ఇంద్ర, సీనియర్ పీడీ సాంబశివరావు, బాక్సర్లు సాయి, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్యాన్ని వెలికితీసేందుకే ప్రదర్శనలు
కాగజ్‌నగర్‌టౌన్: విద్యార్థుల్లో దాగిఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సైన్స్ ప్రదర్శనలు ఉపయోగపడుతాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని సైన్స్ కేంద్రంలో జాతీయ హరితదళం ఆధ్వర్యంలో సోమవారం ‘వ్యర్థం నుంచి అర్థం’ అనే అంశంపై విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రదర్శనలు విద్యార్థులకు పర్యావరణ, సృజనాత్మకతను కలుగజేస్తాయన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్, అకౌంట్స్ అధికారి దేవాజీ, సుశీల, లక్ష్మీనరసింహం, దేవేందర్, జనార్ధన్ పాల్గొన్నారు. -
ట్రైనీ బీట్ అధికారుల క్షేత్ర పర్యటన
సిర్పూర్(టి): తెలంగాణ ఫారెస్టు అకాడమీ 39వ బ్యాచ్‌కు చెందిన ట్రైనీ బీట్ అధికారులు సోమవారం సిర్పూర్(టి) రేంజ్ పరిధిలోని మాకిడి సెక్షన్ ఇటిక్యాల పహాడ్ అటవీప్రాంతంలో పర్యటించారు. అడవిలో వన్యప్రాణు ల సంరక్షణ, ప్లాంటేషన్ పరిరక్షణ, టైగర్ ట్రా కింగ్ తదితర అంశాలను సిర్పూర్(టి) ఎఫ్ఆర్వో ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. అనంతరం వారు ఇటిక్యాల పహాడ్ అటవీ ప్రాంతంలో తిరుగుతూ వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, సెక్షన్ అధికారి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
రెబ్బెన: గ్రామాల అభివృద్ధి జరగాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆదివారం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడ ప్రజలను కలిశారు. ఈసందర్భంగా గ్రామంలో నెలకొ న్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్పంచ్, వార్డుసభ్యులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ ఇంటికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వనజ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్, గ్రా మపటేల్ జంగుపటేల్, లచ్చు పటేల్, నాయకులు సురేశ్, నగేష్, శ్రీనివాస్, సత్యనారాయణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. -
నేలపైనే బాక్సింగ్
చిన్నప్పటి నుంచే బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నాను. చిన్నప్పుడు పాఠశాల ఆవరణలోని నేలపైనే బాక్సింగ్ ప్రాక్టీస్ చేసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే బాక్సింగ్ పోటీల్లో పాల్గొని సర్టిఫికెట్లు, ప్రశంసాపత్రాలు అందుకున్నాను. బాక్సింగ్ సర్టిఫికెట్ ఉండడంతో 1990లో స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఇన్స్‌స్పెక్టర్‌గా హైదరాబాద్‌లో పని చేస్తున్నాను. కాగజ్‌నగర్‌కు వెళ్లినప్పడుల్లా మాస్టర్‌ను కలుస్తాను. – మోహన్ ప్రసాద్, ఎస్సై, హైదరాబాద్ -
ఖేలో ఇండియా సెంటర్ ఏర్పాటు చేయాలి
పట్టణంలో గత 26 ఏళ్లుగా క్రీడాకారులకు ఉచిత శిక్షణ ఇస్తున్నా ను. ఉన్న వనరులు, దాతల సహకారంతో క్రీడాకారులను సిద్ధం చేస్తున్నా. ఖేలో ఇండియా సెంటర్‌ను కాగజ్‌నగర్‌లో ఏర్పాటు చేసేలా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఉన్నతాధికారులు కృషి చేయాలి. నా దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఆర్మీ, పోలీస్, సీఆర్పీ, పీఈటీలుగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారు మాకు అండగా ఉన్నారు. వారి సహాయసహకారాలతో ఉచిత శిక్షణ కొనసాగిస్తున్నాం. – మధురై శేఖర్ మాస్టర్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ -
దాహం తీరేలా.. నిధుల వరద!
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో తా గునీటి సమస్య పరిష్కరిచేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అమృత్ 2.0 కింద కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ.31.50 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల్లో 70వేల జనాభా ఉంది. జనాభాకు సరిపడా తాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పట్టణంలో ప్రస్తుతం 5 ఓవర్ హెడ్ మంచినీటి ట్యాంక్‌ల ద్వారా 11 ఎంఎల్డీ, మిషన్ భగీరథ ద్వారా 7 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. అండర్లైన్ పైపులైన్ తరుచూ లీకేజీలతో పట్టణంలో మూడు, నాలుగు రోజుల పాటు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీ ప్రజలకు శుద్ధజలం అందించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడంతో పట్టణంలో మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మించి వీటి ద్వారా 1800 కిలో లీటర్ల నీటిని అందించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు..మున్సిపాలిటీ పరిధిలో ప్రస్తుతం తాగునీటి సరఫ రాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పట్టణంలో ఐదు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయి. పెద్దవాగు పంప్‌హౌజ్ నుంచి ఓవర్‌హెడ్ ట్యాంకుల్లోకి నీటిని సరఫరా చేసి రెండు రోజులకు ఒక సారి విడతల వారీగా ఆయా వార్డుల్లో మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్పంప్లోని గాంధీనగర్, తీరందాజ్టాకీస్, ఈఎస్ఐ గేటు, ఎల్లగౌడ్తోట వా టర్ ట్యాంక్ సమీపంలో పైప్లైన్లు లీకేజీలతో నీరు వృథాగా పోతోంది. ప్రధానంగా మెయిన్ వాల్వ్‌ల వద్ద నీరు లీకేజీలు అవుతున్నాయి. 30 వార్డులు..పట్టణంలో 30 వార్డులు ఉన్నాయి. 6456 మంచి నీటి కనెక్షన్లు ఉన్నాయి. పట్టణంలోని ఆయా కాలనీ ల్లో ఉదయం 5 గంటల నుంచి విడతల వారీగా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. పట్టణంలోని ద్వారకానగర్, సంజీవయ్య కాలనీ, మార్కెట్ ఏరి యా, గాంధీనగర్, సీతాపతీరోడ్, బాలాజీనగర్, శ్రీ రాంనగర్, నౌగాం బస్తీ, సంఘం బస్తీ, సర్ధార్బస్తీ, పెట్రోల్‌పంప్, కౌసర్‌నగర్, ఇర్ఫాన్‌నగర్ కాలనీ, ఈఎస్ఐ కాలనీ, సర్‌సిల్క్ ఏరియాల్లో రోజువిడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు.పాత తహసీల్దార్ ఆఫీస్ సమీపంలో ప్రధాన వాల్వ్ వద్ద లీకేజీ అవుతున్న మంచినీరుఈఎస్ఐ ట్యాంక్ వద్ద లీకేజీ అవుతున్న మంచినీరుమున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కాగజ్‌నగర్ మున్సిపల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు అందజేశాం. తెలంగాణ రైజింగ్ విజన్ 2047లో భాగంగా యూఐడీఎఫ్ నిధులు రూ.18.70 కోట్లు, ఆసిఫాబాద్‌కు రూ.15కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మున్సిపాలిటీ అభివృద్ధి కానుంది. – పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్యే, సిర్పూర్(టి) ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం మున్సిపాలిటీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యాయి. పట్టణంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. మంజూరైన నిధులతో పట్టణంలో మరో మూడు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ప్రత్యేక అధికారుల ఆమోదం తరువాత పనుల ప్రక్రియ చేపడుతాం. – ఏల్పుల రాజేందర్, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్ -
నాడు భార్య.. నేడు భర్త ఏకగ్రీవమే
వాంకిడి: మండలంలోని దాబా గ్రామ పంచా యతీ సర్పంచ్‌గా గతంలో కోట్నాక సుమిత్ర ఏకగ్రీవమై సేవలు అందించగా ప్రస్తుతం ఆమె భర్త కోట్నాక జంగు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి సవాతి గ్రామ పంచాయతీ నుంచి కొత్త జీపీగా ఏర్పడ్డ దాబా గ్రామం 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో గ్రామస్తులంతా కోట్నాక సుమిత్రను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఎస్టీ జనరల్‌కు అవకాశం దక్కడంతో ఆమె భర్త కో ట్నాక జంగును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దాబాలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స భ్యులను సైతం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోట్నాక సుమిత్రకోట్నాక జంగు -
రాత్రి పూట ప్రచార హోరు
ఆసిఫాబాద్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రైతులు, కూలీలు రోజూవారీ పనుల్లో ఉండడంతో రాత్రి వేళల్లోనే పల్లెల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేపడుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయా పార్టీల నేతలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తున్నారు. రైతు కూలీలు రోజంతా పంట పొలాల్లో ఉండటంతో రాత్రి ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు, కూలీలు పొలాల్లో ఉండడంతో అభ్యర్థులకు అందుబాటులో ఉండడం లేదు. ఈ క్రమంలో రాత్రి సమయంలో గ్రామస్తులను సమీకరించి తెల్లవారే వరకు పంచాయతీలు నిర్వహించి ప్రచారం నిర్వహిస్తున్నారు. రాత్రి దాకా విందులు జరుగుతున్నాయి. మండలాల వారీగా పోటాపోటీగా ప్రచారం ఊపందుకుంది. అన్ని పార్టీలు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ప్రచార సమయానికి పరిమిత సమయం ఉండటంతో గ్రామాల్లో అన్ని వార్డులను కలుపుకొని ఒకేసారి ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి చిత్ర, విచిత్ర సంఘటనలు పల్లెల్లో ఎన్నికల సందడిని పెంచాయి. మూడు దశల్లో..జిల్లాలోని 335 గ్రామ పంచాయతీల్లోని 2874 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి దశలో 114 గ్రామ పంచాయతీలు, 2340 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి దశ, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, మూడో దశలోని 108 సర్పంచ్ స్థానాలకు 2 స్థానాలకు నామినేషన్లు రాకపోవడంతో 106 సర్పంచ్ స్థానాలకు 477 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 910 వార్డుల్లో 2201 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడత నామినేషన్లు ఈ నెల 2తో ముగియడంతో ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. రెండో, మూడో విడత ఎన్నికలు ఈ నెల 14, 17వ తేదీల్లో జరగనున్నాయి. -
మొదటి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు చేయాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఈనెల 11న జరిగే మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం నుంచి మొదటి విడత పోలింగ్ నిర్వహించే లింగాపూర్, సిర్పూర్(యూ), జైనూర్, కెరమెరి, వాంకిడి మండలాల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, జోనల్ అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడతలో భాగంగా ఈనెల 11న నిర్వహించే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సరిపడే కుర్చీలు, టేబుళ్లు, వెలుతురు సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్ సిబ్బంది ముందురోజు సాయంత్రం 4 గంటలకు అన్ని పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా అధికారులు పర్యవేక్షించాలని, ఎన్నికల్లో ఉపయోగించే సామగ్రి, కవర్లు, పేపర్లు అన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ పత్రాలను సరి చేసుకోవాలని, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీ లేకుండా చూసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తి కోసం పంపిణీ కేంద్రంలో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని, పోలింగ్ సిబ్బంది తాగునీరు, అల్పాహారం, భోజనం సమయానికి అందించాలన్నారు. జోనల్ అధికారులు తమ రూట్ పరిధిలోని ప్రతీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. స్టేజ్ –2 ఆర్వో, పీవోలకు ఈ నెల 9న ఎన్నికలు జరిగే మండల కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణపై శిక్షణ అందించాలని తెలిపారు. ఈ నెల 10న ఉదయం 9 గంటలకు పోలింగ్ సిబ్బంది సామగ్రి పంపిణీ కేంద్రానికి చేరుకొని రిపోర్టు చేసేలా చూడాలన్నారు. రూట్ల వారీగా అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. పూర్తి బందోబస్తు మధ్య ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా చేపట్టేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీపీవో బిక్షపతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి
తిర్యాణి: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని ఏఎస్పీ చిత్తరంజాన్ అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని మార్కగూడ, మంగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించాలన్నారు. అనంతరం అర్జున్లోద్ది గ్రామంలోని భీమన్న, పాండవుల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సీఐ సంజయ్, ఎస్సై వెంకటేశ్, ఏఆర్ ఎస్సై శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. -
‘నిద్దుర’లో నిఘా..!
కౌటాల మండల కేంద్రంలో గతంలో పోలీసులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో పార్కింగ్ చేసిన బైక్‌లను తరుచూ గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలిస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తే అవి నిరుపయోగంగా ఉండడంతో ఏం చేయాలో తోచడం లేదు. ఇటీవల కౌటాలలో మూడు బైక్‌లను పార్కింగ్ ప్రదేశం నుంచి దుండగులు అపహరించారు. కౌటాల: జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరమ్మతులకు గురికావడంతో నిరుపయోగంగా మా రాయి. జిల్లాలో నిత్యం ఏదో ఒకచోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర ప్రాంతాలు జిల్లాకు సరిహద్దుగా ఉండటం, రైలు, రోడ్డు మార్గాల ద్వారా సులువుగా తప్పించుకునే అవకాశాలు ఉండటంతో దొంగలు తమ పని సులువుగా కానిచ్చేస్తున్నారు. వ్యాపార సముదాయాలు, ముఖ్య ప్రాంతా లు, రద్దీ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఉన్నా నిర్వహణ సక్రమంగా లేదు. దీంతో నిఘా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. మరమ్మతులకు నిధులు లేకపోవడం వల్ల కెమెరాలు నిరుపయోగంగా ఉంటున్నాయి. చోరీకి పాల్పడిన దొంగలను పోలీసులు పట్టుకోలేకపోవడంతో వీరి ఆగడాలకు అంతం లేకుండా పోతుంది. ఏటా దొంగతనాలు..మండల కేంద్రాలు, పట్టణాల్లోని ఆయా కూడళ్లలో బిగించిన సీసీ కెమెరాలు ఆయా పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ కార్యాలయానికి అనుసంధానించి ఉంటాయి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాల్లో ఏర్పాటు చేసినవి నాణ్యతగా చిత్రీకరిస్తాయి. చలాన్లు విధించే ప్రదేశంలో అధికారులు వెంటనే మరమ్మతులు చేస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాలో దాదాపు 5 వేల వరకు వాణిజ్య సముదాయాలు, ౖప్రైవేట్ వ్యక్తుల సాయంతో కొన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాణ్యతతో కూడిన వాటిని బిగించకపోవడంతో తక్కువ కాలంలోనే మరమ్మతులకు గురవుతున్నాయి. అభివృద్ధి పనులు, భారీ వర్షాలు, కోతుల బెడదతో నిఘా నేత్రాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. భారీ వాహనాల రాకపోకలతో వైర్లు తెగిపోయి సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో మరమ్మతులతో పాటు నిర్వహణ భారంగా మారింది. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి వేళ పెట్రోలింగ్ చాలా వరకు తగ్గింది. దీంతో దొంగలు దండయాత్ర చేస్తున్నారు. జిల్లాలో ఏటా వందకు పైగా చోరీ కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల్లో కీలకం..పోలీసు కేసుల పరిశోధనలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. గతంలో నేరం జరిగినప్పుటి నుంచి కేసును పరిష్కరించడానికి పోలీసులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారు. అనేక కోణాల్లో విచారణ చేపట్టేవారు. అయితే సీసీ కెమెరాలు వచ్చాక వారి పని చాలా సులువైంది. క్లిష్టమైన కేసులను సులువుగా ఛేదిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు లేక పోలీస్ శాఖకు తలనొప్పిగా మారింది. జాడలేని పర్యవేక్షణ..కమ్యూనిటీ పోలీసింగ్ కింద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నా.. వాటి పర్యవేక్షణపై శ్రద్ధ కనబర్చడం లేదు. నేరం జరిగినప్పుడు మాత్రమే తనిఖీ చేస్తుంటే ఆ నిఘా నేత్రం పని చేయడం లేదని తెలుస్తోంది. ఫలితంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడిన పోలీసులకు కొన్ని సందర్భాల్లో నిందితులను పట్టుకోవడం కష్టమవుతోంది. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల దృష్ట్యా అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రలోభాలకు తెరతీసే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి వినియోగంలోకి తేవడంతో పాటు ఠాణాకు అనుసంధానిస్తే బాగుంటుంది. పట్టణాలు, మండల కేంద్రాలు జరుగుతున్న ఘటనలను పోలీసులు ఠాణా నుంచే పర్యవేక్షించడంతో పాటు నియంత్రించే అవకాశం ఉంది. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు’
ఆసిఫాబాద్‌అర్బన్: అక్రమ అరెస్టులతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండడంతో తీవ్ర మనస్తాపం చెందిన బీసీ నాయకుడు ఈశ్వరాచారి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. అతని ఆత్మహత్యకు నిరసనగా శనివారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈశ్వరాచారి ఆత్మహత్య ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామన్నారు. అరెస్టయిన వారిలో నాయకులు మారుతి, శంకర్, నారాయణ, బాలేష్, పురుషోత్తం, ప్రశాంత్, లహుకుమార్ రవికాంత్, నాందేవ్, తదితరులు ఉన్నారు. -
అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
ఆసిఫాబాద్‌అర్బన్: అంబేడ్కర్ ఆశయసాధనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. అంబేడ్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు మర్సుకోల సరస్వతి, చిలువేరు వెంకన్న, నిసార్, నారాయణ, సాంగ్డె జీవన్, వామన్, తదితరులు పాల్గొన్నారు. పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో.. రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జి ల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ మాట్లాడుతూ రా జ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకా లం పదిలంగా ఉంటుందన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యాం, తదితరులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళు లర్పించారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు కర్ణాగౌడ్ మాట్లాడుతూ సామాజిక న్యాయంకోసం అంబేడ్కర్ చేసిన పోరాటం ప్రతీ తరానికి స్ఫూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సిరాజ్, కృష్ణ, తుకారాం, పెంటయ్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు. సందీప్‌నగర్‌లో..మహా పరినిర్వాన్ దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలో పంచాశీల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సుధాక ర్, పురుషోత్తం, లింగయ్య, ప్రవీణ్, అజిత్, మహేష్, విష్ణు, జగదీష్, సుజిత్ , తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలికాగజ్నగర్రూరల్: యువత డాక్టర్ అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకెళ్లాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపు నిచ్చారు. కాగజ్‌నగర్ పట్టణం, చింతగూడలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఇచ్చిన ఓటు హక్కును అమ్ముకోకుండా, ఎలాంటి ప్రలోభా లకు లోనుకాకుండా నిజాయతీగల నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. నియోజకవర్గ కన్వీన ర్ లెండుగురె శ్యాంరావు, కొంగ సత్యనారాయణ, మిన్హాజ్, వరలక్ష్మి, కమల పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి -
నూతన విత్తన చట్టంపై అవగాహన
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో శనివారం విత్తన డీలర్లకు నూతన విత్తన చట్టం–2025పై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వెంకట్ మాట్లాడుతూ ప్రస్తుత విత్తన చట్టం–1966తో పోల్చి కొత్త చట్టంలో అమలుకాబోయే మా ర్పులు, నియమ నిబంధనలు, డీలర్లు పాటించాల్సిన విధానాలను వివరించారు. కొత్త చట్టంపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఈనెల 11లోగా జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయానికి ఈమెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సహాయ వ్యవసాయ అధికారులు మిలింద్ కుమార్, మనోహర్, మండల వ్యవసాయ అధికారులు, జిల్లాలోని విత్తన డీలర్లు పాల్గొన్నారు. -
క్రాస్ ఓటింగ్ భయం
ఆసిఫాబాద్‌అర్బన్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఉదాహరణకు ఓ రాజకీయ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసిన ఓటరు అదేపార్టీ నుంచి బరిలో ఉన్న వార్డు సభ్యుడికి ఓటు వేయకుండా తమకు ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో నాయకుల అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. మొదటి విడత జరుగనున్న ఎ న్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యే పోటాపోటీ వాతావరణం నెలకొంది. 2, 3 సార్లు బుజ్జగింపుల పర్వం, మంతనాలు జరిగినా విఫలం కావడంతో ఒక్కో పార్టీ నుంచి ప్రధాన గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. ఇందులో ఒకరిని పార్టీ మద్దతుదారులుగా ప్రకటించగా, మిగిలిన వారు రెబల్స్‌గా కొనసాగుతున్నారు. కొన్నిచోట్ల పార్టీలు తమ మద్దతు ఎవరికీ అధికారికంగా ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితి ఉన్న గ్రామాల్లో తీవ్ర అయోమయం నెలకొంది. కొందరికి పార్టీల మద్దతు ఉన్నా ప్రజల నుంచి ఆశించిన సహకారం లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారో?.. ఎవరు ఓడిపోతారో?.. తెలియని పరిస్థితి నెలకొంది. పోటీలో కొత్త ముఖాలు..గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం వరకు గ్రామం ముఖం చూడకుండా నగరాలు, పట్టణాల్లో స్థిరపడిన కొందరు నేడు పంచాయతీ పోరులో పోటీకి సిద్ధమయ్యారు. ఇక్కడే క్యాంపు వేసి గ్రామాల్లో గల్లీగల్లీ చుట్టేస్తున్నారు. ఓటుకు ప్రమాణం..అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని మీద, కుటుంబ సభ్యుల మీద ఒట్లు వేయించు ని ఓట్లు అడుక్కుంటున్నారు. ముందుగానే కొ ంతడబ్బు అప్పజెప్పి మాట తీసుకుంటున్నారు. ‘గుర్తు’ చెరిగిపోకుండా..అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులకు సంబంధించిన వస్తువులను ఓటర్లకు పంపిణీ చేస్తూ వారి మనసులో ‘గుర్తు’ చెరిగిపోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. బ్యాట్, స్టూలు, గ్యాస్‌స్టౌవ్, ఉంగరం, గౌను, కత్తెర, ఫుట్‌బాల్, తదితర వస్తువులు అందజేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఎలాగైనా తమను ఆదరించాలని ఓటర్లను వేడుకుంటున్నారు. -
పంచాయతీల్లో ద్విముఖ పోరు
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలిచి తీరాలనే లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 114 గ్రామ పంచాయతీల్లో ఈ నెల 11న మొదటి విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఉదయం, సాయంత్రం అనే తేడాలేకుండా గ్రామాల బాట పడుతున్నారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని కెరమెరిలో 31, లింగాపూర్‌లో 14, సిర్పూర్(యు) లో 15, జైనూర్‌లో 26, వాంకిడిలో 28 గ్రామ పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. రెండు పార్టీల మధ్యే ప్రధాన పోటీ!ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని ఐదు గ్రామ పంచాయతీల్లో ఈనెల 11న జరుగనున్న మొదటి విడ త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపర్చిన అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ జరుగనుంది. ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రచారపర్వం ప్రారంభమైంది. ఆ శావహులు ఎవరికి వారు ప్రచారం నిర్వహిస్తున్నా రు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల గుర్తులు లేకపోయినా ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థును గెలిపించేందుకు తీవ్ర ప్రయత్నాలు మొదలయ్యాయి. అభ్యర్థులకు కేటాయించిన గుర్తులతో గ్రామాల్లోకి పరుగులు పెడుతున్నారు. కనిపించిన ప్రతీఒక్కరికి గుర్తులు చూపిస్తూ తమకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థులు, నాయకులు, అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచార పోరు ముమ్మరం చేశారు. రాత్రిపూట మంతనాలు..మొదటి విడత ఎన్నికల ప్రచార పోరు ప్రారంభం కావడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి పగలు ప్రచారం చేస్తున్నారు. రాత్రి ఆయా గ్రామాల పెద్దలు, పటేళ్లు, కులపెద్దలు, నా యకులతో మంతనాలు జరుపుతున్నారు. విజయ మే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రముఖులను రంగంలోకి దించి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓట్లను సామాజిక వర్గాల వారీగా ఓటర్ల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గె లుపోటములపై ప్రభావం చూపే వార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గ్రామ పెద్దలతో మంతనాలు జరుపుతూ సమయం చిక్కినప్పుడల్లా ఫోన్లు చేస్తున్నారు. ఆప్యాయంగా పలకరిస్తూ మద్దతు కోరుతున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం, భవిష్యత్‌లో చేయనున్న అభివృద్ధిపై ప్రస్తావిస్తున్నారు. అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇస్తున్నారు. పోరు రసవత్తరం..పంచాయతీ పోరు రసవత్తరంగా సాగుతోంది. అత్యధిక గ్రామ పంచాయతీలు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ)లకు రిజర్వు కావడంతో గిరిజనేతరులు ఎస్టీలతో జతకట్టి గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు అవకాశం లేకున్నా ఫర్వాలేదు.. కానీ నా అనే నాయకుడు గెలవాలనే ధీమాలో ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో యువత ఓట్లు కూడా చాలా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్నడూలేనంతగా యువత ముందుకు వచ్చింది. పోటీలో ఎక్కువశాతం యువకులే ఉన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీలు, వార్డులుమండలం జీపీలు అభ్యర్థులు వార్డులు అభ్యర్థులు కెరమెరి 31 111 118 222 వాంకిడి 28 88 124 383 జైనూర్ 26 104 55 109 లింగాపూర్ 14 42 45 85 సిర్పూర్(యు) 15 51 26 56 మొత్తం 114 396 368 855 -
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
కాగజ్‌నగర్‌టౌన్: ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నితికా పంత్ అన్నారు. శనివారం పోలీసుల ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి రాజీవ్‌గాంధీ చౌరస్తా వరకు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతియుత ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పంపిణీ, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి, తదితర అక్రమ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించరాదన్నారు. జిల్లాలో 3 ప్రధాన చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు చేపడుతున్నామన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగేతే తక్షణం స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, పట్టణ సీఐ ప్రేం కుమార్, రూరల్ సీఐ కుమారస్వామి, ఎస్సైలు సుధాకర్, సందీప్, కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థలో హోంగార్డుల పాత్ర కీలకంఆసిఫాబాద్అర్బన్: పోలీసు వ్యవస్థలో హోంగార్డుల పాత్ర కీలకమని, శాంతి భద్రతల పరిరక్షణలో వా రు పోషిస్తున్న పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ నితికా పంత్ కొనియాడారు. హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కేంద్రంలోని పో లీసు హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. హోంగార్డుల సంక్షేమంకో సం పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నా రు. ఈ సందర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అ నంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఏఎ స్పీ చిత్తరంజన్, ఆర్ఐ హోంగార్డ్ విద్యాసాగర్, ఆర్ ఐ అడ్మిన్ వామనమూర్తి, ఆర్ఐ (ఎంటీవో) అంజ న్న, తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ భాషల దినోత్సవం
కాగజ్‌నగర్‌టౌన్: తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జయంతిని పురస్కరించుకుని శని వారం పట్టణంలోని జవహర్ నవోదయ వి ద్యాలయంలో భారతీయ భాషల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భాషలు ఎన్నయినా భావం ఒక్కటేనని, ప్రతీ విద్యార్థికి తన మాతృభాష తల్లితో సమానమన్నారు. మా తృభాషతో పాటు మరో ఐదు భాషలు నేర్చుకునే సామర్థ్యం మనలో పెరగాలన్నారు. అంతకుముందు విద్యార్థులు సృజనాత్మకంగా భాషావృక్షం అనే చిత్రపటాన్ని రూపొందించారు. అందులో ప్రధాన వృఽక్షాన్ని భారతదేశాన్ని సూచించేలా తీర్చిదిద్దారు. విద్యార్థులు పలు భాషల్లో కవితలు, పాటలు పాడి అలరించారు. ఈ కార్యక్రమంలో భాషా అధ్యాపకులు డాక్టర్ రామయ్య, హరిబాబు, ఉమేష్ కుమార్, రాజేందర్ నాయక్, మక్సూద్, నిరంజన మంజుల, విద్యార్థులు పాల్గొన్నారు. -
అధికారుల ర్యాండమైజేషన్ పూర్తి
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ పూర్తయ్యిందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు శ్రీనివాస్ సమక్షంలో పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికల కోసం పోలింగ్, అదనపు పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టామని, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అధికారులను కేటాయించామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, ఎన్ఐసీ ఇన్చార్జి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దుఆసిఫాబాద్రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఆలస్యం వద్దని, త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వంతెనలు, కల్వర్డులు, రహదారులు, అదనపు గదులు, నూతన భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన మంత్రి జన్మన్ జుగా పథకం కింద చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్వో అబిద్ అలీ, అన్ని విభాగాల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
సరిహద్దులో పెద్దపులి
కౌటాల(సిర్పూర్): కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నది సరిహద్దు అవతలివైపు శుక్రవారం ఉదయం పెద్దపులి కదలికలను చేలల్లో పత్తి తీస్తున్న కూలీలు గమనించారు. భయంతో పరుగులు తీశారు. మహారాష్ట్రలోని దరూర్లో ప్రాంతంలో పెద్దపులి పాదముద్రలను ఆ రాష్ట్ర అటవీశాఖ అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో కౌటాల ఎఫ్ఎస్వో తులసీదాస్ తాటిపల్లిలోని వార్దా నది ప్రాంతాన్ని సందర్శించారు. మండలంలోకి పులి రాలేదని స్పష్టం చేశారు. చేలల్లో రాత్రివరకు ఉండవద్దని, గుంపులుగా తిరగాలని సూచించారు. సరిహద్దులో పెద్ద పులి సంచరిస్తుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
వన్యప్రాణుల సంరక్షణలో అప్రమత్తత అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): వన్యప్రాణులు, అటవీ సంప ద సంరక్షణలో అధికారులు, సిబ్బందికి అప్రమత్తత అవసరమని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ అన్నారు. రెబ్బెన రేంజ్ పరిధిలోని తక్కళ్లపల్లి, ధర్మారం ప్లాంటేషన్లను శుక్రవారం పరి శీలించారు. ఆయన మాట్లాడుతూ వన్యప్రాణులతో పాటు అటవీ ప్రాంత సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అటవీ జంతువులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలన్నారు. ప్రధానంగా పు లుల సంరక్షణ విషయంలో రాజీ పడొద్దని సూచించారు. జిల్లాలో పెద్దపులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాంటేషన్లకు సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రెబ్బెన రేంజ్ అధికారి భానేష్, బీట్ అధికారులు అయాజ్, స్వాతి పాల్గొన్నారు. -
ఈవీఎంల గోదాం వద్ద పటిష్ట బందోబస్తు
ఆసిఫాబాద్: జిల్లాలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపర్చిన గోదాం వద్ద పటిష్ట బందోబస్తు చేపట్టినట్లు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను శుక్రవారం అదనపు కలెక్టర్ డేవిడ్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాం వద్ద పోలీసు సిబ్బంది సమన్వయంతో బందోబస్తు చేపట్టామన్నారు. 24 గంటలపాటు నిరంతరం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. -
అన్నా.. ఊరికి రావాలె!
కాగజ్‌నగర్‌టౌన్/ఆసిఫాబాద్‌అర్బన్: పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను ప్రత్యక్షంగా కలుస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో పోటీ ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో అభ్యర్థులు దూర ప్రాంతాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు. మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్‌తోపాటు సమీపంలోని మహారాష్ట్రలోని చంద్రాపూర్, ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్న వారికి సమాచారం అందిస్తున్నారు. పోలింగ్ రోజు స్వగ్రామాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైతే ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేసేందుకు వెనుకాడటం లేదు. ప్రతీ ఓటు కీలకం..సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ప్రతీ ఓటు కీలకంగా మారనుంది. ఒకటి, రెండు ఓట్లతోనూ ఫలితం తారుమారయ్యే ప్రమాదం ఉంటుంది. గత అనుభవాల దృష్ట్యా అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టి సారించారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటంతో చాలామంది హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. అలాగే యువత చదువుల కోసం పట్టణాల బాటపట్టారు. అభ్యర్థులు పంచాయతీకి చెందిన ఓటర్లు ఎక్కడెక్కడ ఉంటున్నారనే జాబితా తయారు చేస్తున్నారు. ఓటర్లకు స్వయంగా అభ్యర్థులు ఫోన్లు చేస్తున్నారు. అలాగే ప్రచారానికి సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అభ్యర్థుల ఇళ్లలో నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు, బంధువులు... ఇలా ఎవరికి వారే వివిధ పనుల్లో బిజీగా మారారు. తమ ఓటర్లు ఎక్కడెక్కడున్నారనే సమాచార జాబితా ఆధారంగా ప్రణాళిక సిద్ధం చేశారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఏ ఊరిలో ఎవరు ఉన్నారో తెలుసుకునేందుకు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగిస్తున్నారు. ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులుసిర్పూర్ నియోజకవర్గంలోని బెజ్జూర్, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాలకు చెందిన ఓటర్లు చాలామంది కాగజ్‌నగర్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ఓటర్లను కలుసుకునేందుకు ముందస్తుగా అభ్యర్థులు ఫోన్లలో సంప్రదిస్తున్నారు. ‘అన్నా ఎట్ల ఉన్నవే.. సర్పంచుగా పోటీ చేస్తున్నా, ఈసారి మనకే సపోర్టు చేయాలి’ అంటూ ఫోన్లోనే ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రతిరోజూ టచ్‌లో ఉంటున్నారు. ప్రచారానికి ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లతో వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు. అందులో ఓటర్ల ఫోన్ నంబర్లతో యాడ్ చేసి సందేశాలు పంపిస్తున్నారు. అన్నా.. కాకా.. పోలింగ్ రోజు ఊరికి వచ్చి ఓటు వేయాలని సందేశాలతో బుజ్జగిస్తున్నారు.రాత్రి పోతేనే కలుస్తరుదహెగాం(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అయితే అభ్యర్థులు మధ్యాహ్న సమయంలో వెళ్తే ఓటర్లు కలవడం లేదు. జిల్లాలో చాలామంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దహెగాం, కౌటాల, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతలమానెపల్లి, పెంచికల్పేట్ మండలాల్లో పత్తితీత, వరి కోతల పనులు జోరుగా సాగుతున్నాయి. ఆసిఫాబాద్, రెబ్బెన వంటి మండలాల్లో రైతులు యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్నారు. రైతులు, కూలీలు ఉదయమే వ్యవసాయ పనులకు వెళ్తున్నారు. దీంతో అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు రాత్రిపూట మాత్రమే వెళ్తున్నారు. నామినేషన్లు వేయడమే ఆలస్యం.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ‘నేను సర్పంచ్‌గా పోటీ చేస్తున్న.. మీరందరూ దయ చూపి ఈసారి గెలిపించాలే’ అంటూ ఒక్కొక్కరిని ప్రత్యేకంగా కలుస్తున్నారు. మళ్లీ తెల్ల వారుజామున కూలీలు పనులకు వెళ్లిపోకముందే వారి వాకిట్లో వాలిపోతున్నారు. అన్నా, అమ్మా, కాక, మామ అంటూ పలుకరిస్తున్నారు. అయితే రెండో, మూడో విడతలో పోటీచేస్తున్న వారికి ఇంకా గుర్తులు కేటాయించలేదు. దీంతో వారు ఇప్పటివరకు గుర్తులు లేకుండానే ప్రచారం చేసుకుంటున్నారు. -
ఆరుతడికే పరిమితం
ఆసిఫాబాద్‌రూరల్: వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈసారి రైతులు ఆరుతడి పంటలకే పరిమితం కానున్నారు. డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వారబందీ ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నారు. ఏప్రిల్, మే నెలల్లో కాలువల్లో పూడిక తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఆయకట్టు రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వట్టివాగు ప్రాజెక్టు నిర్మించి 20 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు కాలువలకు సరైన మరమ్మతులు చేపట్టలేదు. ఫలితంగా కాలువలు సిమెంట్ లైనింగ్ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండాయి. పిచ్చిమొక్కలు, తుంగ పెరిగి శిథిలావస్థకు చేరాయి. దీంతో సాగునీటిని విడుదల చేసినా పొలాలకు చేరడం లేదు. కాలువలకు గండ్లు పడటం కూడా సమస్యగా మారింది. పూడికతీతకు రూ.60 లక్షలువట్టివాగు ప్రాజెక్టుకు రెండు ప్రధాన కాలువలతో పాటు 18 చిన్న కాలువలు ఉన్నాయి. కుడి కాలువ 21 కిలోమీటర్లు, ఎడమ కాలువ ఏడు కిలో మీటర్లతోపాటు పిల్ల కాలువల్లో పూడికతీత కోసం రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రి య పూర్తయి కాంట్రాక్టర్‌తో ఒప్పందం సైతం కుదిరినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించనున్నారు. ఆయకట్టుకు 115 రోజులపాటు వారబందీ ద్వారా నాలు గు రోజులకు ఒకసారి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో రైతులు కూడా వరి పంటకు దూరంగా ఉంటున్నారు. అరుతడి పంటలైన మొక్కజొన్న, గోధు మ, పెసర, వేరుశనగ, జొన్న, నువ్వులు, మినుముల సాగుకు మొగ్గు చూపుతున్నారు. నాలుగైదు రోజులకు ఒకసారి నీటి తడులు అందినా పంటను కాపాడుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తగ్గుతున్న సాగు విస్తీర్ణంవట్టివాగు ప్రాజెక్టు పనులను 1998లో ప్రాంరంభించి 2001 పూర్తి చేశారు. 2.98 టీఎంసీల సామర్థ్యంతో 27 వేల ఎకరాలు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 2.30 టీఎంసీల నీటి నిల్వ ఉంది. అయినా యాసంగి సాగుకు వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో కాలువలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రాజెక్టు ఆయకట్టు విస్తీర్ణం 1500 ఎకరాలు పడిపోయింది. డీ2 నుంచి డీ8 వరకు కాలువలు సిమెంట్ లైనింగ్ కోల్పోయి పూర్తిగా పూడికతో నిండాయి. అలాగే తూములు దెబ్బతినగా, తలుపులు, రాడ్లు శిథిలావస్థకు చేరాయి. వాటికి కూడా ఏళ్లుగా మరమ్మతులు చేపట్టడం లేదు. ఆధునికీకరణ కోసం అధికారులు గతంలో రూ.75 కోట్లు, రూ.80 కోట్లతో రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ నిధులు మాత్రం మంజూరు కాలేదు. ప్రస్తుతం కాలువల్లో పూడిక తీత కోసం రూ.60లక్షలు మంజూరుకావడంతో రైతులకు కొంతమేర మేలు జరిగే అవకాశం ఉంది.నిధులు మంజూరయ్యాయి వట్టివాగు ప్రాజెక్టు కాలువల్లో పూడికతీత కోసం రూ.60 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈసారి యాసంగి సీజన్లో రైతులు వరి కాకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించాం. 115 రోజులపాటు వారబందీ ద్వారా నీటిని విడుదల చేస్తాం. ఏప్రిల్, మే నెలల్లో కాలువల్లో పూడిక పనులు చేపడతాం. – పవణ్‌కళ్యాణ్, ఏఈఈ -
అగ్నివీర్‌కు డిగ్రీ విద్యార్థి ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఏ ఫస్టియర్ పూర్తి చేసిన మండల చిరంజీవి ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ ఉద్యోగానికి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. మధ్యప్రదేశ్‌లో అగ్నివీర్ శిక్షణను పూర్తి చేసుకున్నాడని, త్వరలో విధుల్లోకి చేరనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవిని శుక్రవారం కళాశాలలో ప్రిన్సిపాల్ శ్రీదేవి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనరసింహం, అధ్యాపకులు అభినందించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ నిత్యం క్రమశిక్షణతో ఉండి చిన్న వయస్సులోనే ఉద్యోగం సాధించి చిరంజీవిని ఇతర విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేశం, మేరి రోజ, సత్యనారాయణ పాల్గొన్నారు. -
ముగిసిన మూడో విడత
నామినేషన్లుఆసిఫాబాద్/రెబ్బెన: జిల్లాలో మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. చివరిరోజు అభ్యర్థులు భారీగా తరలిరావడంతో రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి, కాగజ్‌నగర్ మండలాల్లోని గురువారం వరకు 108 సర్పంచ్ స్థానాలకు 226, 938 వార్డు సభ్యుల స్థానాలకు 711 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి, రెండు రోజులతో పోల్చితే చివరిరోజు శుక్రవా రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశా రు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమయం కేటాయించగా, చివరిరోజు సమయం సరిపోలేదు. ఎన్నికల సిబ్బంది సాయంత్రం 5 గంటలలోపు కేంద్రాలకు వచ్చిన వారికి టోకెన్లు జారీ చేశారు. శని వారం నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన స్వీకరణచివరిరోజు టోకెన్లు జారీ చేసి సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేయాల్సి వచ్చింది. రెబ్బెన మండలం నారాయణపూర్ క్లస్టర్ మినహా రెబ్బెన, గోలేటి, నంబాల క్లస్టర్ నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. చలికి వణుకుతూ రాత్రిపూట అభ్యర్థులు కేంద్రాల వద్ద నిరీక్షించారు. టోకెన్ల ప్రకారంగా ఒక్కో అభ్యర్థి నామినేషన్ స్వీకరించారు. ఆపై అన్లైన్ ప్రక్రియ పూర్తి చేశారు. మండలంలోని పలు కేంద్రాలను జిల్లా ఎన్నికల పరిశీలకులు వి.శ్రీనివాస్ పరిశీలించారు. ఎంపీడీవో శంకరమ్మ, ఎంపీవో శ్రీధర్‌తో కలిసి గోలేటి నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సిబ్బంది నడుచుకోవాలని సూచించారు. రెబ్బెనలో నామినేషన్ వేసేందుకు రాత్రిపూట నిరీక్షిస్తున్న అభ్యర్థులుగోలేటిలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎన్నికల పరిశీలకుడు శ్రీనివాస్ రేగులగూడ సర్పంచ్ ఏకగ్రీవం!కాగజ్‌నగర్‌రూరల్: మండలంలోని రేగులగూడ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కానుంది. ఇక్కడ బీసీ మహిళకు రిజర్వేషన్ చేయగా, ఒక్కరే నామినేషన్‌ను దాఖలు చేశారు. గ్రామ పంచాయతీలో 431 మంది ఓటర్లలో 211 మంది పురుషులు, 220 మంది మహిళలు ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆరుగురు పురుషులు, ఎనిమిది మంది మహిళలు ఉన్నా వడాయి సుశీల ఒక్కరే నామినేషన్ వేశారు. శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి ఎవరూ ముందుకు రాలేదు. పరిశీలనలో తిరస్కరణకు గురికాకుంటే ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. నేడు ఆరు మండలాల్లో ఉపసంహరణరెండో విడతలో భాగంగా దహెగాం, బె జ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లో 113 సర్పంచ్ స్థానాలకు 737 నామినేషన్లు, 992 వార్డు సభ్యుల స్థానాలకు 2,428 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే పరిశీలన ప్రక్రియ పూర్తయ్యింది. శనివా రం ఉపసంహరణకు అవకాశం ఇచ్చా రు. అనంతరం తుది అభ్యర్థుల జాబితా ప్రకటించి, గుర్తులు కేటాయించనున్నారు. ఇక మొదటి విడతలో భాగంగా కెరమెరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల్లోని నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. అక్కడ మిగిలిన 107 పంచాయతీల్లో 396 మంది అభ్యర్థులు, 368 వార్డుల్లో 855 మంది ఎన్నికల్లో భవితవ్యం తేల్చుకోనున్నారు. -
పరిశీలించి.. సూచనలు చేసి
తిర్యాణి(ఆసిఫాబాద్): మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేసి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం ప్రధా న మంత్రి జన్మన్ యోజన కింద మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. రాళ్ల కన్నెపల్లి గ్రామంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు మ ధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పాటించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో వేముల మల్లేశ్, పీఆర్ ఏఈ సుహాస్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలపై సమీక్ష నిర్వహించాలి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో సాగునీటి చెరువులు, కెనాల్స్, రోడ్లు, పాఠశాలల పరిస్థితులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం సీఎం అధ్యక్షతన నిర్వహించాలి. ఉట్నూర్ ఐటీడీఏకు ఆరేళ్లుగా పాలకవర్గం నియమించకపోవడంతో పీఎంకేఎస్‌వై, పోడు భూములు వంటి ఆదివాసీల సమస్యలపై చర్చించే అవకాశం లేదు. ఐటీడీఏ పాలకవర్గాన్ని నియమించాలి. ఎయిర్‌పోర్టు భూ సేకరణకు జీవో జారీ, ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు. – గోడం నగేశ్, ఎంపీ, ఆదిలాబాద్ -
అన్నివర్గాల ప్రజలకు న్యాయం
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తూ ప్రజాపాలన అందిస్తుంది. జిల్లాలోని రైతులకు మేలు చేకూర్చేలా రూ.2,500 కోట్ల రుణమాఫీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించాం. అర్హులైన పేదలందరికీ రేషన్‌కార్డులిచ్చాం. పేదలు దొడ్డుబియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని గుర్తించి వారి కడుపునింపేలా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. ప్రజాపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలి. – పి.సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుపర్యాటకంగా అభివృద్ధి చేస్తాం ప్రభుత్వం రూ. లక్ష ల కోట్ల అప్పులు న్నా.. ప్రతీ నెలా రూ. కోట్ల రూపేనా వడ్డీలు చెల్లిస్తున్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు ఖర్చులేకుండా కార్పొరేట్‌స్థాయిలో విద్యనభ్యసించేలా రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశాం. రెండేళ్లలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించేలా ప్రతిపాదనలు స్వీకరించాం. త్వరలోనే ఆ మొత్తాన్ని అందజేస్తాం. జిల్లాను పర్యాటకపరంగా ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. – జూపల్లి కృష్ణారావు, జిల్లా ఇన్చార్జి మంత్రి ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిసభకు హాజరైన జనంఆదిలాబాద్టౌన్/కై లాస్‌నగర్: ప్రజాపాలన ప్రజా విజయోత్సవ సభ సక్సెస్ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో గురువారం నిర్వహించిన సభకు జనం భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక గంటన్నర ఆలస్యమైనా ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. జిల్లాలో రూ.260 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి సభ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణతో సభను ప్రారంభించారు. ఇందులో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, జి.వినోద్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అంటే అభిమానం..: సీఎం ఆదిలాబాద్ జిల్లా అంటే తనకు ఎంతో అభిమానమని, పీసీసీ అధ్యక్షుడినయ్యాక ఇక్కడి నుంచే కార్యక్రమాలను ప్రారంభించానని సీఎం గుర్తు చేశారు. జిల్లాను దత్తత తీసుకున్నానని త్వరలోనే అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తానని పేర్కొన్నారు. ఎర్రబస్సు రావడమే కష్టమనుకున్న జిల్లాకు ఏడాదిలోనే ఎయిర్‌బస్సు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అలాగే ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీ మంజూరు చేయనున్నట్లుగా హామీ ఇచ్చారు. ఇంద్రవెల్లి కేంద్రంగా నాగోబా సన్నిధిలో కుమురంభీం పేరిట ఉంటే బాగుంటుందని, ఇది తన సూచనగా పేర్కొన్నారు. అలాగే మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ సెక్టార్లో పునః ప్రారంభించేలా చర్యలు తీసుకుని ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. కొరటా–చనాఖ ప్రాజెక్ట్‌ను త్వరలోనే ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని పేర్కొన్నారు. అలాగే కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహితపై ప్రాజెక్ట్ నిర్మించి ఉమ్మడి జిల్లా సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేలా జిల్లాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేసినట్లుగా వివరించారు. ఇలా సీఎం జిల్లాకు అనేక వరాలు కురిపించడంతో ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. భారీ బందోబస్తు సీఎం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీల నాయకులను పోలీసులు వేకువజామునే ముందస్తు అరెస్ట్‌లు చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకను సభ ప్రాంగణంలో ఉన్న ప్రజలకు తెలియజేసేలా డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక స్క్రీన్లను ఏర్పాటు చేశారు. శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ స్క్రీన్ ద్వారా ప్రదర్శించారు. అంతకు ముందు ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కాంగ్రెస్ నాయకులు, ట్రెయినీ కలెక్టర్ సలోనిచాబ్రా హెలీప్యాడ్ వద్దకు చేరుకుని సీఎంకు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. యువత నైపుణ్యాభివృద్ధికి చర్యలు అహంకార, అవినీతి కారణంగానే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు ద్వారా గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా రూ.500లకు గ్యాస్ సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నాం. బీఆర్ఎస్ పాలనలో అమలు కాని అనేక పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. ముఖ్యంగా యువతలో నైపుణ్యాలు మెరుగుపర్చేలా ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేశాం. – గడ్డం వివేక్, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి -
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో సాధారణ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల ఎన్నికలపై మండల ప్రత్యేకాధికారులు, నోడల్ అధికారులు, జోనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 335 పంచాయతీలు, 2,874 వార్డు స్థానాలను 87 జోన్లుగా ఏర్పాటు చేశామన్నారు. జోనల్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి రూట్ మ్యాప్, కేంద్రాల్లో వసతులు, నెట్‌వర్క్‌పై ఈ నెల 5లోగా నివేదికలు సమర్పించాలన్నారు. మొదటి విడతలో భాగంగా ఈ నెల 10న ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల సామగ్రి అందించాలన్నారు. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలిఆసిఫాబాద్: పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల కమిషన్ సభ్యులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీపీవోలతో ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల చివరి విడత నామినేషన్ల ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం.డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, డీపీవో భిక్షపతి, జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. చివరి విడత ఎన్నికల కొరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. -
ఏకగ్రీవాల జోరు!
కెరమెరి(ఆసిఫాబాద్): మొదటి విడత ఎన్నికల్లో భా గంగా నామినేషన్ల ఉపసంహరణ, గుర్తుల కేటా యింపు పూర్తికాగా అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపారు. మొదటి విడతలో భాగంగా కెరమెరి, వాంకిడి, జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ) మండలాల్లోని 114 గ్రామ పంచాయతీలు, 944 వార్డులకు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏడు పంచాయతీలు, 576 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగితా 107 పంచాయతీల్లో 396 మంది సర్పంచ్ అభ్యర్థులు, 368 వార్డుల్లో 855 మంది పోటీల్లో ఉన్నారు. ఏకతాటిపై ఉండి..ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల కూడా ప్రజలు ఏకతాటిపై ఉండి పోటీ లేకుండా నాయకులను ఎన్నుకున్నారు. కెరమెరి మండలంలో ధనోరా, బాబేఝరి, వాంకిడి మండలంలో ధాబా, నవేగాం, వాడిగూడ, లింగాపూర్ మండలంలో మామడ్పల్లి, కంచన్‌పల్లి గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నవంబర్ 27 నుంచి ఈ నెల 2 వరకు కొనసాగిన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల తర్వాత ఆయా పంచాయతీల్లో ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో వారు పోటీ లేకుండానే విజేతలుగా మిగిలారు. ఎన్నికల అధికారులు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మిగితాచోట పోటాపోటీఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులకు చెందిన బ్యాలెట్ పేప ర్లు, కరపత్రాలతో అవగాహన కల్పిస్తున్నారు. తమ ను గెలిపిస్తే చేపట్టే పనులను ప్రజలకు వివరిస్తూ వాగ్దానాలు చేస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై దృష్టి సారిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. మొదటి విడత పంచాయతీల వివరాలుమండలం జీపీలు ఏకగ్రీవం బరిలో వార్డులు ఏకగ్రీవం బరిలో ఉన్నవారు ఉన్నవారు కెరమెరి 31 2 111 250 132 222 వాంకిడి 28 3 88 236 112 383 జైనూర్ 26 0 104 222 167 109 లింగాపూర్ 14 2 42 112 67 85 సిర్పూర్(యూ) 15 0 51 124 98 56 మొత్తం 114 7 396 944 576 855 -
బాల్య వివాహాల నిర్మూలనకు చర్యలు
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లావ్యాప్తంగా బాల్యవివాహాలను అరికట్టేందుకు బాల్య వివాహ ముక్త్– 100 రోజుల కార్యక్రమాన్ని చేపట్టి నట్లు జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ తెలి పారు. జిల్లా కేంద్రంలోని మహిళాశిశు సంక్షేమశాఖ కార్యాలయంలో గురువారం అవగా హన పోస్టర్లు ఆవిష్కరించారు. నవంబర్ 27 నుంచి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మార్చి 8 వరకు కొనసాగుతాయని తెలిపారు. దేవాలయాలు, మసీదులు, చర్చీలు వంటి ప్రార్థనాస్థలాల వద్ద అవగాహన బోర్డులు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేశ్ మాట్లాడుతూ షూర్ స్వచ్ఛంద సంస్థ, బాలల సంరక్షణ విభాగం సమన్వయంతో బాల్య వివాహాల నిర్మూలనకు పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బాలరక్ష భవన్ సిబ్బంది శ్రావణ్, నవీన్‌కుమార్, బాల ప్రవీణ్, వెంకటేశ్వర్లు, షూర్ సంస్థ కోఆర్డినేటర్ సంతోష్‌కుమార్, దేవాణి, ప్రభు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో దత్త జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని సాయి మంది రంలో గురువారం దత్త జయంతి భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. అర్చకులు మధుకర శ ర్మ, సాయి శర్మ ఆధ్వర్యంలో ఉదయం సాయినాథుడు, దత్తాత్రేయ, గణపతి విగ్రహాలకు పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న సా మూహిక గురుచరిత్ర పారాయణం ముగింపు సందర్భంగా గురుచరిత్ర పుస్తక పూజ నిర్వహించారు. అనంతరం సామూహిక సత్యనారాయణ వ్రతాలు జరుపుకొన్నారు. మధ్యా హ్న హారతికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తాటిపెల్లి రమేశ్, రావుల దిలీప్, గంధం వినోద్, నాందేవ్, చెన్నూరి ప్రకాశ్, నాగోరావు తదితరులు పాల్గొన్నారు. -
టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ధర్నా
కౌటాల(సిర్పూర్): డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించిన టీచర్‌పై చర్యలు తీసుకోవాలని గురువారం మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె.రాజేందర్ మాట్లాడుతూ కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను తొలగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా రూ.10వేలు ఇవ్వాలని ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని ఆరోపించారు. డబ్బులు ఇవ్వమని చెప్పడంతో విద్యార్థులను రెచ్చగొట్టి ఇటీవల రోడ్డుపై ధర్నా చేయించడని పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఎంఈవో, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందించారు. నాయకులు వెలిశాల కృష్ణమాచారి, కె.శారద, పి.మాయ పాల్గొన్నారు. -
‘మేజర్’పై ఫోకస్..!
చింతలమానెపల్లి(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. జిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 పంచాయతీలకు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను బలపరుస్తూ బరిలో దించుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని మేజర్ పంచాయతీలపై దృష్టి సారించాయి. జనాభా, రెవెన్యూ అధికంగా ఉండే చోట తమ ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. 2019లో అప్పటి ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో చిన్న జీపీలతో పోలిస్తే పెద్ద పంచాయతీల్లోనే పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వార సంతలు, ఆదాయ మార్గాలు, సమాజంలో పలుకుబడి తదితర అంశాలను లెక్కలు వేసుకుంటున్నారు. పలు అంశాలు కీలకం..ప్రధాన పంచాయతీల్లో తాము బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పార్టీల ప్రధాన నాయకులు ఎత్తుగడలు వేస్తున్నారు. మేజర్ పంచాయతీల్లో సత్తా చాటితే రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ విజయావకాశాలు మెరుగుపర్చుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే శాసనసభ ఎన్నికలకు వీటిని ప్రణాళికలో భాగం చేసుకుంటున్నారు. పలు మండలాల్లో పరిస్థితి ఈ విధంగా ఉంది. -
భూ సేకరణకు నిధులివ్వండి
కొరటా– చనాఖా ప్రాజెక్ట్ నిర్మాణం 97శాతం పూర్తయింది. పెండింగ్‌లో ఉన్న ఆయకట్టు భూసేకరణ నిధులు త్వరగా విడుదల చేసి సాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలి. ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్టు భూ సేకరణ జీవో జారీ చేశారు. అలాగే పంటచేలకు రోడ్లు వేసేలా పొలంబాటకు రూ.40 కోట్లు విడుదల చేశారు. జిల్లాను దత్తత తీసుకుని ప్రత్యేక ప్రేమ చూపుతూ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రికి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు. – పాయల్ శంకర్, ఎమ్మెల్యే, ఆదిలాబాద్ -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న వంతెనలు, కల్వర్టులు, రహదారులు, అదనపు గదులు, నూతన భవనాలు, పంచాయతీ కార్యాలయాలు, ప్రధాన మంత్రి జన్మన్ జుగా పథకం కింద చేపట్టిన పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన పనులు వేగవంతం చేయాలని, 15వ ఆర్థిక ప్రణాళిక కింద మంజూరైన నిధులను ఎంపిక చేసిన పనులకు మాత్రమే వినియోగించాలని సూచించారు. సమావేశంలో డీఆర్డీవో దత్తారావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి లక్ష్మీనారాయణ, డీటీడీవో రమాదేవి, అన్ని విభాగాల ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. -
దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి
రెబ్బెన(ఆసిఫాబాద్): దివ్యాంగులు వైకల్యంతో కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో అన్నిరంగాల్లో ముందుకు సాగాలని బెల్లంపల్లి ఏరియా ఇన్చార్జి జనరల్ మేనేజర్ మచ్చగిరి నరేందర్ అన్నారు. గోలేటి టౌన్‌షిప్‌లోని సీఈఆర్ క్లబ్లో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగ చిన్నారులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఇన్చార్జి జీఎం మాట్లాడుతూ దివ్యాంగులు శారీరకంగా కొంత బలహీనంగా కనిపించినా మానసికంగా దృఢ సంకల్పంతో ఉంటారని తెలిపారు. ఆత్మస్థైర్యంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలని సూచించారు. అనంతరం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమాల్లో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, అధికారుల సంఘం ప్రతినిధి ఉజ్వల్‌కుమార్ బెహరా, ఎస్వోటూజీఎం రాజమల్లు, పర్సనల్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ ఎం.శ్రీనివాస్, సీనియర్ పర్సనల్ అధికారి ప్రశాంత్, ఉపాధ్యాయులు సుజాత, ఆర్.వెంకటేశ్వర్లు, సుచిత, రేష్మా, సతీశ్, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘సికిల్ సెల్’ నివారణే లక్ష్యం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో సికిల్‌సెల్ వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని మాతాశిశు సంరక్షణ కేంద్రం కోఆర్డినేటర్ వాసుదేవ్ అన్నారు. జిల్లాలో పలువురికి సికిల్ సెల్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, బుధవారం జిల్లా కేంద్రంలో జెనెటిక్స్ కార్డులు అందించారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి అవసరమైన మందులు అందిస్తామని తెలిపారు. సికిల్‌సెల్ నివారణ కోసం క్షేత్రస్థాయిలో పరీక్షలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పీలు శిరీష, కవిత, ప్రేమలత, సౌమ్య, ఉమ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దవాగు పరిసర ప్రాంతంలో పెద్దపులి
దహెగాం(సిర్పూర్): రెండు నెలల క్రితం బీబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలో సంచరించి పెద్దపులి చేడ్వాయి అటవీ ప్రాంతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. మరోసారి బుధవారం ఒడ్డుగూడ, లగ్గాం శివారులోని పెద్దవాగు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి తిరిగినట్లు అధికారులు గుర్తించారు. పులి ఎటు వైపు వెళ్లిందనే కోణంలో పెంచికల్పేట్, దహెగాంల వైపు అటవీ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి గాలించారు. పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తుందని వారు పేర్కొన్నారు. లగ్గాం గ్రామంలోని ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. పెద్దవాగు పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ పొలాలకు గుంపులుగా, శబ్దం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. -
కేజీబీవీలకు బంకర్బెడ్లు
మంచిర్యాలఅర్బన్: కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో మెరుగైన సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం విద్యార్థినులు గదుల్లోని చాపలపై నిద్రించాల్సి వస్తోంది. విద్యార్థినుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం బంకర్ బెడ్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ తరహా బెడ్ల వల్ల స్థలం వృథా కాకుండా ఉంటుందని యోచిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా ఎన్ని అవసరమో విద్యాలయాల వారీగా లెక్కలు తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థ కాంట్రాక్టు ఆర్డర్లు పొందగా నెలాఖరు వరకు ఆయా కేజీబీవీలకు సరఫరా చేసేందుకు చర్యలు వేగవంతం చేశారు. మొదటి దఫాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 45కేజీబీవీలకు 6860 బంకర్బెడ్లు సరఫరా చేయనున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ బెడ్లు ఎన్ని అవసరమో ప్రతిపాదనలు పంపించింది. ఇందులో భాగంగా ఆయా కేజీబీవీలకు దశలవారీగా బంకర్ బెడ్లు సరఫరా చేయనున్నారు. మరోవైపు నాబార్డు నిధులతో మౌలిక వసతులు కల్పించనున్నారు. విద్యార్థినుల అవసరాల మేరకు అదనపు తరగతి గదులు, శుద్ధ జల ట్యాంకులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీటిసంపులు, బోర్వెల్లు, ప్రహరీల నిర్మాణం, సోలార్ ఫెన్సింగ్, డార్మెటరీ, భోజనశాలలు, దోమలు రాకుండా మెష్‌ల ఏర్పాటు, భవన మరమ్మతులు, విద్యుత్ ఉపకరణాల మరమ్మతులు చేపట్టనున్నారు.మొదటి దశలో జిల్లాల వారీగా వివరాలుజిల్లా విద్యాలయాలు పడకలుఆదిలాబాద్ 13 2103 ఆసిఫాబాద్ 12 1749 నిర్మల్ 10 1553 మంచిర్యాల 10 1455 45 6860 -
పకడ్బందీగా సామగ్రి పంపిణీ చేయాలి
● కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆసిఫాబాద్‌రూరల్: ఎన్నికల సామగ్రి పకడ్బందీగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పా ట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జైనూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి బుధవారం పర్యవేక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 11న జైనూర్‌లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అవసరమైన షామియానాలు, కుర్చీలు, టేబుళ్లు, తాగునీరు, ఇతర ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
బుజ్జగింపులు.. నామినేషన్లు
ఆసిఫాబాద్: పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. కొన్ని మండలాల్లో అభ్యర్థులు గెలుపు కోసం పోటీదారులను బుజ్జగిస్తుంటే.. మరికొన్ని మండలాల్లో నామినేషన్లు ప్రక్రియ జోరుగా సాగుతోంది. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలివిడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. వారికి ప్రచారమే మిగిలింది. ఇక రెండో విడత నామినేషన్ల పరిశీలన కొనసాగుతుండగా, మూడో విడత నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. తొలి విడతలో జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీల్లో సర్పంచ్ స్థా నాలకు 522, 944 వార్డు సభ్యుల స్థానాలకు 1,424 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూరికాగా, రాత్రి వరకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. రెండో విడతలో బెజ్జూర్, చింతలమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్– టి మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం పూర్తయ్యింది. 113 సర్పంచ్ స్థానాలకు 737 నామినేషన్లు, 992 వార్డు సభ్యులకు 2,428 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన చేపట్టారు. ఇక మూడో విడత కింద ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో 108 సర్పంచ్ స్థానాలు, 938 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. సమర్థులకే పట్టం పంచాయతీ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సమర్థవంతమైన అభ్యర్థులే కావాలని ప్రజలు ఆశిస్తున్నారు. అందుబాటులో ఉంటూ, సేవ చేసే గుణం, పంచాయతీ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలోనూ జోరుగా చర్చ సాగుతోంది. మండల కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రంలోని రాజంపేట పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పార్టీ గుర్తులు లేనప్పటికీ రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. తొలివిడత గుర్తుల కేటాయింపు పూర్తికాగా, రెండో విడత పోటీలో ఉన్న అభ్యర్థుల బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. బలమైన పోటీదారులను ఉపసంహరించుకోవాలని ఒప్పిస్తున్నారు. ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశాలు నిర్వహిస్తూ సమన్వయం చేస్తున్నారు. ప్రధాన పార్టీలకు సవాల్ గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సవాల్‌గా మారాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో తమ విశ్వాసాన్ని మరోసారి నిరూపించుకోవడానికి కసరత్తు చేస్తోంది. ఆరు గ్యారంటీలను గ్రామస్థాయిలో ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత పల్లెల్లో జోరందుకునేందుకు యత్నిస్తుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సైతం పంచాయతీ స్థాయిలో బలం పెంచుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. యువతను ఆకర్శించేందుకు యత్నిస్తోంది. అయితే అభ్యర్థుల తుది జాబితా అనంతరం పోలింగ్‌కు కేవలం వారం రోజులే సమయం ఉండటంతో ప్రచారానికి ఇబ్బందిగా మారింది. దీంతో అభ్యర్థులు నామినేషన్ల నుంచే ప్రచారం చేస్తున్నారు.లింగాపూర్: లింగాపూర్ మండలంలోని 14 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తం ఎస్టీ రిజర్వేషన్ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బుధవారం మండలంలోని మామిడిపల్లి, కంచన్‌పల్లి పంచాయతీల్లో మహిళా అభ్యర్థులు మడావి మారుబాయి, కనక పార్వతీబాయి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎంపీడీవో రాంచందర్ ప్రకటించారు. కంచన్‌పల్లిలో సర్పంచ్ స్థానానికి కనక పార్వతీబాయి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. మామిడిపల్లిలో ఆరుగురు నామినేషన్లు వేయగా, ఉపసంహరణ అనంతరం మారుబాయి ఒక్కరే మిగిలారు. భూపాలపట్నం ఏకగ్రీవం సిర్పూర్(టి): మండలంలోని భూపాలపట్నం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కోర్వెత రాజారాం ఏకగ్రీవమయ్యారు. పంచాయతీ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఏకమై ఏకగ్రీవంగా ఎన్నుకుని కోర్వెత రాజారాం ఒక్కరితోనే నామినేషన్ దాఖలు వేయించారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. -
మూడో విడతకు సర్వం సిద్ధం
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లాలో బుధవారం నుంచి మూడో విడత నామినేషన్ల పర్వం మొదలుకానుంది. ఇప్పటికే మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. మూడో విడతలో ఆసిఫాబాద్ మండలంలో 27 పంచాయతీలు, 236 వార్డులు, కాగజ్‌నగర్‌లో 28 జీపీలు, 266 వార్డులు, రెబ్బెనలో 24 పంచాయతీలు, 214 వార్డులు, తిర్యాణిలో 29 జీపీలు, 222 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలాల్లో నామపత్రాల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్ మండలంలో ఏడు క్లస్టర్లలో నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తుంపెల్లి కేంద్రంలో చిర్రకుంట, పాడిబండ, తుంపెల్లి, కోసార, మాలన్‌గొంది, రాజంపేట్లో రాజంపేట్, సాలెగూడ, గోవింద్పూర్, గుండి, బూర్గుడలో బూర్గుడ, ఈదులవాడ, చిలాటిగూడ, చోర్పల్లి, మోతుగూడలో అప్పపల్లి, రౌటసంకెపల్లి, మోతుగూడ, రహపల్లి, బాబాపూర్‌లో బాబాపూర్, అంకుసాపూర్, కౌటగూడ, అడలో అడ, మానిక్‌గూడ, ఎల్లారం, మోవాడ్ క్లస్టర్లో మోవాడ్, వెంకట్పూర్, అడ దస్నాపూర్, వావుదాం పంచాయతీల అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. రహపల్లి, చిలాటిగూడ రిజర్వేషర్ల ప్రకారం సర్పంచ్ అభ్యర్థులు లేరు. కేవలం 25 పంచాయతీల్లోనే సర్పంచులకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. కొత్త పంచాయతీ ‘రాజంపేట్’కొత్త పంచాయతీ రాజంపేటలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో భాగంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతం రాజంపేట్ను విభజించి గత ఫిబ్రవరిలో కొత్త పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 1,950 వరకు కుటుంబాలు, 2,800 మంది నివసిస్తున్నారు. సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ జనరల్, 10 వార్డుల్లో ఐదు ఎస్టీ, ఐదు ఇతరులకు రిజర్వ్ చేశారు. పంచాయతీ తొలి సర్పంచ్‌గా ఎవరు నిలుస్తారో ఈ నెల 17న తేలనుంది. ముగిసిన రెండోవిడత గడువురెండో విడత నామినేషన్ల స్వీకరణ గడువు మంగళవారం ముగిసింది. కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, దహెగాం, బెజ్జూర్, సిర్పూర్(టి)లో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. -
బరిలో నిలిచేదెవరో..?
కెరమెరి(ఆసిఫాబాద్): తొలి విడత నామినేషన్ల ప్రక్రి య తుది దశకు చేరుకుంది. బుధవారం నామినేష న్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. సాయంత్రం తుది జాబితాను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. దీంతో బరిలో నిలిచేదెవరో తేలనుంది. జైనూర్ మండలంలోని 26 సర్పంచ్ స్థానాలకు 126 నామినేషన్లు రాగా, కెరమెరి మండలంలో 31 పంచాయతీలకు 154, లింగాపూర్‌లో 14 పంచాయతీలకు 79, సిర్పూర్–యూలో 15 పంచాయతీలకు 56, వాంకిడిలో 28 పంచాయతీలకు 106 నామినేష న్లు వచ్చాయి. ఆయా మండలాల్లో వార్డు సభ్యుల స్థానాలకు 1,424 నామినేషన్లు దాఖలయ్యాయి. జి ల్లాలో అత్యధిక పంచాయతీలు ఉన్న కెరమెరి మండలంలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. ఈ మండలంలోని 250 వార్డులు ఉండగా 11 వార్డులకు నామినేషన్ దాఖలు కాలేదు. జోడేఘాట్‌లో రెండు, రింగన్ఘాట్లో 2, పార్డలో ఒకటి, కొఠారిలో రెండు, అగర్వాడలో రెండు, ఝరి, సావర్ఖేడాలో ఒక్కో వార్డులో ఎవరూ పోటీకి ముందుకు రాలేదు. మంగళవారం అధికారులు అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసహరించుకోవాలనుకుంటే సకాలంలో రావాలని కెరమెరి ఎంపీడీవో సురేశ్ సూచించారు. -
ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దు
ఆసిఫాబాద్: సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, యూపీఐ వివరాలు ఎవరికీ చెప్పొద్దని ఎస్పీ నితిక పంత్ అన్నారు. సైబర్ మోసాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు పోలీస్ శాఖ చేపట్టిన ‘ఫ్రాడ్ కా పుల్ స్టాప్’ ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం డీజీపీ బి.శివధర్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించగా, ఎస్పీ నితిక పంత్, ఏఎస్పీ చిత్తరంజన్ పాల్గొన్నారు. ఆన్లైన్ వర్క్‌షాప్‌కు జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల, బీఎడ్ కళాశాలల విద్యార్థులు 130 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబర్ క్రైం అవగాహనకు సంబంధించిన పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఓటీపీ, యూపీఐ మోసాలు, గేమింగ్ అండ్ బెట్టింగ్ యాప్స్, ఉద్యోగ అవకాశాలు, ఆన్లైన్ ట్రేడింగ్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియాలో జరిగే మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు రవీందర్, తేజస్విని, సీఐ బాలాజీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలి
ఆసిఫాబాద్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి, హౌజింగ్ అధికారి ప్రకాశ్‌రావుతో కలిసి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 498 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, ఇప్పటివరకు 391 ఇళ్ల పనులు ప్రారంభించారని, మిగితా 107 నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలన్నారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 458 ఇళ్లు మంజూరు కాగా, 150 నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. జాప్యానికి కారణాలు తెలుసుకుని, మెప్మా కింద మహిళా సంఘాలకు రుణ సదుపాయం అందించాలని సూచించారు. ఈ నెల 20లోగా పూర్తయిన ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో గృహనిర్మాణ శాఖ డీఈ వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రేపు రోశయ్య వర్ధంతిమాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన కొణిజేటి రోశయ్య వర్ధంతి గురువారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
సీఐటీయూ జిల్లా కమిటీ ఎన్నిక
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సీఐటీయూ ద్వితీయ మహాసభల్లో రెండోరోజు మంగళవారం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కార్యదర్శి మధు ఆధ్వర్యంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నా రు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలుగా ఆర్.త్రివేణి, జిల్లా కార్యదర్శిగా రాజేందర్, కోశాధికారిగా శంకర్, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, బాలకిషన్, సహాయ కార్యదర్శులుగా కృష్ణమాచారి, పద్మ, కమిటీ సభ్యులుగా స్వరూప, శారద, మాయ, అరుణ, ఛాయ, మోరేశ్వర్, చంద్రన్న, ప్రభాకర్, ఆనంద్, గంగామణి, శంకర్ ఎన్నికయ్యారు. -
గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ప్రభుత్వమే గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్ఎఫ్ఎంఎస్ ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ల కాలపరిమితి ముగిసిందని తెలిపారు. నూతన టెండర్లను పిలిచి రూ.26వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్, ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, సిబ్బంది మాధవి, గంగన్న, నీల, కమల, కృష్ణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ఆసిఫాబాద్: పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. దహెగాం మండలం కొత్మీర్, దహెగాం పంచాయతీలతోపాటు పెంచికల్పేట్ మండలంలోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల తుది జాబితా ప్రకటన, పోస్టల్ బ్యాలెట్, ఫొటో ఓటర్ స్లిప్పుల పంపిణీ.. వంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. దహెగాం మండలంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. బీబ్రా జెడ్పీ ఉన్నత పాఠశాల, పెంచికల్పేట్ మండలం దరోగవల్లిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యాబోధన తీరు, వంటశాల, మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్య నిర్వహణ అంశాలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. -
ఖోఖో జట్టుకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో బంగారు పతకం సాధించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టును మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, డీటీడీవో రమాదేవి అభినందించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థినులు క్రమశిక్షణ, సా మర్థ్యం, కఠోర శ్రమతో సాధించిన ఈ విజ యం ఎంతో గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీ డీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, అరవింద్, తిరుమల్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. -
జాప్యం.. అన్నదాతకు శాపం
దహెగాం(సిర్పూర్): ఓ వైపు కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా, మరోవైపు వాతావరణ మార్పులు రైతులను భయపెడుతున్నాయి. దిత్వా తుపాను ప్రభావంతో రెండు, మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన ఉండటంతో పంటల రక్షణకు కోసం అపసోపాలు పడుతున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో ధాన్యం కుప్పల వద్ద నిత్యం కాపలా ఉంటున్నారు. చినుకులకు తడవకుండా టార్పాలిన్లు సిద్ధం చేసుకుంటున్నారు. ముమ్మరంగా వరికోతలు, పత్తితీత పనులుఈ వానాకాలం సీజన్లో జిల్లాలో 3.45 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పత్తి పూతకాత రాలింది. చెట్లపై ఉన్న కాయలు నల్లబడ్డాయి. ఎకరానికి 10 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేచోట కూడా ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్లు మించడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం పత్తితీత పనులు ముమ్మరం చేశారు. అకాల వర్షాలతో వరికోతలు ఆలస్యం కాగా, ఇప్పుడిప్పుడే జోరందుకున్నాయి. కొనుగోళ్ల తీరుతో నష్టంజిల్లాలో 41 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. పలుచోట్ల రైతులు ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయలేదని రైతులు చెబుతున్నారు. మంగళవారం కాగజ్‌నగర్, పెంచికల్పేట్ మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మరోవైపు ఇప్పటివరకు జిల్లాలో సీసీఐ కేంద్రాల ద్వారా 1,57,710 క్వింటాళ్లను పత్తి కొనుగోలు చేయగా.. ప్రైవేటులో 11,909 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. మొదటి విడత పత్తి తీత పనులు పూర్తవుతున్నాయి. రెండో విడతలో చాలా తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో తీసిన పత్తిని ఆరుబయట పెట్టొద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. చినుకులకు తడవకుండా ఇళ్లలో నిల్వ చేసుకోవాలని, ఆరుబట ఉంటే టార్పాలిన్లు కప్పుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ చేసిన ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలంటున్నారు. పత్తి ఒకసారి తీసినం ఈ ఏడాది 30 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. గత నెలలో భారీ వర్షాలకు పూతకాత రాలింది. మరోసారి పూత రావాలని మందులు పిచికారీ చేసిన. ఇటీవల మొదటి విడత పత్తితీత పూర్తయింది. ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. మబ్బులు ఉండటంతో ఇంట్లోనే నిల్వ ఉంచిన. – దేశు, రైతు, దేవులగూడకోతలు పూర్తి కాలేదు మూడెకరాల్లో వరి సాగు చేసిన. గత నెలలో కురిసిన వర్షాలకు పొలం ఆరలేదు. రెండు రోజులుగా మబ్బులు వస్తున్నాయి. పొలంలోకి హార్వెస్టర్ రావడం లేదు. కోత అయిన తర్వాత ప్రైవేటు వాళ్లకే అమ్ముతా. – చప్పిడి రమేశ్, దహెగాం -
పల్లెల్లో గన్ కల్చర్!
కౌటాల/చింతలమానెపల్లి: కౌటాల మండలంలో తుపాకులు పట్టబడడం కలకలం సృష్టించింది. మాఫియా, ముఠాలు, కిడ్నాపర్ల కార్యకాలాపాల తరహాలో ఓ వ్యక్తి గన్ కొనుగోలు చేసి స్థానిక వ్యాపారిని బెదిరించడం జిల్లావ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబయి, హైదరాబాద్, బెంగళూర్, ఢిల్లీ వంటి నగరాలకే పరిమితమైన గన్ కల్చర్.. పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. ఇతర రాష్ట్రాల నుంచి నాటు తుపాకులు, పిస్టళ్లు తెప్పించుకుని దాడులకు తెగబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సినిమాలు, యూట్యూబ్ వీడియోల ప్రభావం..ఇటీవల వచ్చిన సినిమాలు, యూట్యూబ్ వీడియోల్లోని మాఫియా ప్రభావం యువతపై పడుతోంది. స్మగ్లర్లు, దొంగలను హీరోలుగా చిత్రీకరించడంతో ఆకర్షితులై అదే మార్గాలను ఎంచుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించడానికి నేరాలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. యూట్యూబ్‌తోపాటు ఆన్లైన్లో తుపాకులు లభించే ప్రాంతాల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు చెందిన ఓ యువకుడు బిహార్ రాష్ట్రానికి చెందినవారిని సంప్రదించి గన్ కొనుగోలు చేసి తీసుకువచ్చాడు. కొత్తగా విష సంస్కృతి..జిల్లాలో తుపాకుల సంస్కృతికి సంబంధించి ఎ లాంటి తీవ్రమైన ఘటనలు నమోదు కాలేదు. ఆయుధాల చట్టం 1959 సెక్షన్ 21 ప్రకారం ప్రముఖులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు వద్ద లైసెన్సు తుపాకులు మాత్రమే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మావోయి స్టు సానుభూతిపరుల వద్ద మాత్రమే నాటు తుపాకులు, తపంచాలు లభ్యమయ్యాయి. కొందరు గుట్టుచప్పుడుగా వన్యప్రాణులను వేటాడేందుకు నాటు తుపాకులు వినియోగించిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే గడిచిన దశాబ్ద కాలంగా ఎలాంటి ఘటనలు వెలుగులోకి మాత్రం రాలేదు. పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న కౌటాల మండలం సాండ్గాంలో రెండు తుపాకులు లభ్యం కావడాన్ని పోలీ సులు తీవ్రంగా భావిస్తున్నారు. కాల్పులకు తెగబడితే పలువురు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండేది. పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని పట్టుకోవడంతో తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఉపేక్షించం యువత ఈజీ మనీ కోసం పెడదారి పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు. కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి. అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలని ఆగడాలు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. యూట్యూబ్‌లో నేరపూరిత వీడియోలు చూసే వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ప్రభుత్వ నిషేధిత చిత్రాలు, సమాచారం కోసం వెతికి నేరాలకు పాల్పడితే జైలు జీవితం గడపాల్సి వస్తుంది. యువత ప్రవర్తనపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. జిల్లాలో గన్ కల్చర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. – నితిక పంత్, ఎస్పీ బిహార్ టు సాండ్‌గాం..కౌటాల మండలం సాండ్‌గాం గ్రామానికి చెందిన కర్బంకర్ అజయ్ అనే యువకుడు బిహార్‌కు వెళ్లి తుపాకీ కొనుగోలు చేసి సాండ్గాంకు తీసుకువచ్చాడు. అజయ్ ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారంతో బిహార్‌కు వెళ్లి అక్కడే గన్ వినియోగించే విధానం తెలుసుకున్నాడు. అక్కడే మూడు బుల్లెట్లతో సాధన కూడా చేశాడు. రైలు మార్గం ద్వారా ఎలాంటి తనిఖీలు దొరకకుండా సాండ్గాంకు తుపాకీని తీసుకురావడం గమనార్హం. ప్రాణహిత నది తీరంలో ఒకసారి గాలిలో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే అజయ్‌కు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదు. -
కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిపుణులతో కెరీర్ గైడెన్స్‌పై అవగాహన తరగతులు నిర్వహించాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పీఎం శ్రీ పథకానికి ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 8లోగా అన్ని పీఎం శ్రీ పాఠశాలల్లో నిపుణులతో కౌన్సెలింగ్ తరగతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రూప్– 1 అధికారులు, ఇతర అధికారులతో తాము ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించిన తీరు, పోటీ పరీక్షలకు సన్నద్ధమైన విధానాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివా స్, ఎస్వో దేవాజీ, ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
ఏరియాలో 101 శాతం బొగ్గు ఉత్పత్తి
● ఇన్చార్జి జీఎం నరేందర్ రెబ్బెన(ఆసిఫాబాద్): నవంబర్‌లో బెల్లంపల్లి ఏరియా 101 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిందని ఏరియా ఇన్చార్జి జీఎం మచ్చగిరి నరేందర్ తెలిపారు. గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. నవంబర్‌లో ఏరియాకు 3.50 లక్షల ట న్నుల లక్ష్యాన్ని నిర్దేశించగా 3.53 లక్షల ట న్నులతో 101 శాతం ఉత్పత్తిని సాధించగలిగామన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వందశాతం వార్షిక ఉత్పత్తిని సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. గత నెలలో సింగరేణిలో కేవలం రెండు ఏరియాలు మాత్రమే వందశాతం ఉ త్పత్తి సాధించగా.. అందులో బెల్లంపల్లి ఒక్కటని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఉజ్వల్‌కుమార్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలి
వాంకిడి(ఆసిఫాబాద్): అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద విధి నిర్వహణలో ఉన్న అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తనిఖీలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వాంకిడి మండలంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్‌పోస్టును సోమవారం సందర్శించారు. వాహనాల తనిఖీలు నిర్వహించారు. సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో భద్రత ఏర్పాట్లు పటిష్టం చేశామన్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎస్ఎస్టీ బృందాలు క్రమం తప్పకుండా రోస్టర్ విధానంలో పని చేయాలని ఆదేశించారు. నగదు, మద్యం, ఇతర నిషేధిత వస్తువులు అక్రమంగా తరలించే అవకాశం ఉందని, క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కనీస వేతనాలు చెల్లించాలని వినతి
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తు న్న కాంట్రాక్టు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాల ని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణకు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్ మాట్లాడుతూ ఐహెచ్ఎఫ్ఎంఎస్ టెండర్ల కాలపరిమితి ముగిసిందని, వెంటనే నూతన టెండర్లు పిలవాలన్నారు. కార్మికులకు అపాయింట్మెంట్ లేటర్స్, ఐడీ కార్డు ఇవ్వడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధనకు మంగళవారం నుంచి ఈ నెల 4 వరకు ఆస్పత్రి ఆవరణ లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 5న హైదరాబాద్‌లోని కోటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, నాయకులు, కార్మికులు నగేశ్, కృష్ణ, నీల, రాజ య్య, గంగన్న, కమల పాల్గొన్నారు. -
జత కలిసేనని..!
జన్నారం: జన్నారం అటవీ డివిజన్లో పులి తోడు కోసం సంచరిస్తోందా..? ఆడ పులి కోసం అన్వేషణ సాగిస్తోందా..? జత కలిసేందుకు అనువైన సమయమిదేనా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. గత కొన్ని రోజులుగా జన్నారం అడవుల్లో పులి మకాం వేసింది. అప్రమత్తమైన అటవీ అధికారులు ఎప్పటికప్పుడు కదలికలను గుర్తిస్తున్నారు. జన్నారం డివిజన్లో పర్యటిస్తున్నది మగ పులిగా గుర్తించారు. ఆడపులి జత కోసం అన్వేషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడే మకాం వేస్తుందా..? 2012 ఏప్రిల్‌లో కవ్వాల్ అభయారణ్యాన్ని కవ్వాల్ టైగర్ జోన్‌గా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి పులుల రాకపోకలే తప్ప ఇక్కడ ఆవాసం ఉన్న దాఖలాలు లేవు. ఒకట్రెండు రోజులు మాత్రమే ఈ ప్రాంతంలో సంచరించి తిరిగి వెళ్లేవి. కానీ గత నెల 26న జన్నారం అటవీ డివిజన్లోని ఇందన్పల్లి రేంజ్ పరిధిలో ఆవుపై దాడి చేసి చంపింది. పరిశీలించిన అటవీశాఖ అధికారులు పులి దాడిగా గుర్తించి ట్రాక్ చేశారు. సీసీ కెమెరాలు అమర్చగా వాటిలో పులి చిక్కినట్లు తెలిసింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో పులి పాదముద్రలు గుర్తించి ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నట్లు అంచనాకు వచ్చారు. టైగర్‌జోన్‌లో టైగర్ తిరగడం అంత ప్రత్యేకత కాకున్నా .. సంవత్సర కాలంగా పులి రాక కోసం ఎదురు చూస్తున్న అటవీ అధికారులకు మాత్రం ఈ పులి ఆరు రోజులుగా ఇక్కడే మకాం వేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఆవాసం ఏర్పాటు చేసుకుంటే..జన్నారం అటవీ డివిజన్ పులి ఆవాసాలకు అనువుగా ఉంది. గడ్డి మైదానాలతో వన్యప్రాణుల సంఖ్య పెరగడం, నీటిసౌకర్యం, దట్టమైన అడవులు పులికి ఆవాస యోగ్యంగా ఉంటాయి. ఆరు రోజులుగా మకాం వేసిన పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. ఆడపులి తోడయితే కొన్ని రోజుల్లో పులి పిల్లలను కనే అవకాశం ఉంది. అనువైన ప్రదేశం ఉన్నందున ఇక్కడే మకాం వేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అడవుల్లోకి పశువులు, మనుషులు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. అలజడి తగ్గిస్తే పులి ఆవాసం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకుంటుందని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. టైగర్ ట్రాకింగ్‌పై శిక్షణజన్నారం అటవీ సిబ్బందికి టైగర్ ట్రాకింగ్‌పై శిక్షణ ఇప్పిస్తున్నారు. కాగజ్‌నగర్‌కు చెందిన టైగర్ ట్రాకర్లతో నాలుగు రోజులు శిక్షణ ఇప్పించారు. పులి అడుగులు గుర్తించడం, ప్రత్యక్షంగా చూసే విధానం, కెమెరాలు ఏర్పాటు చేయడం, పులి మానిటరింగ్‌లో మెలకువలు నేర్పించారు. పులి జాడ ఎలా కనుగొనడం, జాగ్రత్తలు వివరించారు. పది రోజుల తర్వాత మరో నాలుగు రోజులు సైతం శిక్షణ ఇప్పించనున్నారు.తోడు కోసమేనా..?జన్నారం అడవుల్లో తిరుగుతున్న పులిని మగ పులిగా అధికారులు గుర్తించారు. ఆడ పులికి తోక చిన్నదిగా, పాదముద్ర 4 సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది. ప్రస్తుతం జన్నారంలో తిరుగుతున్న పులి పాదముద్ర 5 సెంటీమీటర్ల వెడల్పు, తోక పొడవుగా ఉండడంతో మగ పులిగా నిర్ధారణకు వచ్చారు. ఆడపులి తోడు కోసమే వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చంద్రపూర్ అటవీ ప్రాంతం నుంచి బేల మీదుగా జన్నారం అడవుల్లోకి వచ్చినట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు నెలల క్రితం లక్సెట్టిపేట అడవుల్లో కనిపించింది ఆడపులి కావడంతో దాని తోడు కోసమే ఈ ప్రాంతానికి మగపులి వచ్చినట్లు భావిస్తున్నారు. ప్రతీ శీతాకాలంలో పులులు సంతతి పెంచుకోవడం జరుగుతుందని, జనవరి వరకు మేటింగ్‌లో ఉంటాయని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఈ మగపులి తోడు కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి చేరిందని పేర్కొంటున్నారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఆరు రోజులు పులి మకాం వేయడం ఇదే మొదటిసారి. తోడు కోసమా.. మరెందుకనే విషయంపై స్పష్టంగా చెప్పలేం. ఇక్కడ ఉన్నది మాత్రం మగ పులి అని ఆనవాళ్ల ఆధారంగా చెప్పవచ్చు. పులి ఉన్న చోటు శబ్దం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పులి సంచరిస్తోంది. పశువుల కాపరులు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దు. – రామ్మోహన్, ఎఫ్‌డీవో -
రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి రోల్ ప్లే పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో జిల్లా కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థులు ప్రతిభ చూపి ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ద్వితీయ, తృతీయస్థానంలో నిలిచారు. మహిళలు, పురుషుల్లో సమానత్వం అనే అంశంపై ప్రతిభ చూపిన కేజీబీవీ విద్యార్థులు శరణ్య, హరిణి, వెన్నెల, అలేఖ్య, గంగలను మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి రోల్ ప్లే పోటీలకు ఎంపిక చేశామని విద్యాశాఖ అకడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. ప్రిన్సిపాల్ మహేశ్వర్, న్యాయ నిర్ణేతలు వెంకటేశ్వర్లు, రంగయ్య, గైడ్ టీచర్లు అరుణ, నవీన, సులోచన పాల్గొన్నారు. -
భవితకు బాసట
ఉచిత శిక్షణ.. ఆసిఫాబాద్‌రూరల్: కస్తూరిబా గాంధీ విద్యాలయాల్లోని బాలికలు ఉన్నత చదువులకు మార్గం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఎంపిక చేసిన కేజీబీవీల్లో నీట్, ఐఐటీ, క్లాట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ప్రముఖ విద్యా సంస్థల్లో సీటు సాధించడమే లక్ష్యంగా బాలికలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని మూడు కేజీబీవీలను యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారికి ప్రస్తుతం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయి శిక్షణసాధారణంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్స రం విద్యార్థులు బీటెక్, మెడిసిన్, ఇతర ఉన్నత విద్యను అభ్యసించేందుకు సంబంధిత కోర్సుల్లో ప్రవేశం కోసం కార్పొరేట్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటారు. అయితే పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించలేక కోచింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో అనుకున్న విద్యాసంస్థల్లో సీటు పొందలేకపోతున్నారు. ఈ తరుణంగా కేజీబీవీల్లో చదివే విద్యార్థినులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత శిక్షణ అందించాలని నిర్ణయించింది. నీట్, ఐఐటీ, క్లాట్ శిక్షణ కోసం ని ధులు మంజూరు చేసింది. అవసరమైన మెటీరి యల్, పుస్తకాలు అందించడంతోపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్‌లో చేరేలా నీట్, ఇంజినీరింగ్ విద్యను అభ్యసించేలా ఐఐటీ, జేఈఈ, న్యాయవాద వృత్తి చేపట్టేలా క్లాట్‌కు సన్నద్ధం చేస్తున్నారు. ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సైకాలజిస్టులను కూడా నియమించన్నుట్లు అధికారులు తెలిపారు. సంతోషంగా ఉంది నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు నీట్, ఐఐటీ, క్లాట్‌పై శిక్షణ అందించడం సంతోషంగా ఉంది. శిక్షణతో చాలామంది బాలికలు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కలుగుతుంది. నాకు డాక్టర్ కావాలని ఉంది. – అక్షర, బైపీసీ సెకండియర్ విద్యార్థినులకు వరం కేజీబీవీల్లో చదువుతున్న బాలికలకు ఉచిత శిక్షణ వరంలాంటిది. మంచి కార్పొరేట్ సంస్థల్లో మాదిరి రాష్ట్రం ప్రభుత్వం అవకాశం కల్పించింది. విద్యార్థినులు దీనిని సద్వినియోగం చేసుకుని ర్యాంకులు సాధించాలి. – భాగ్యలక్ష్మి, కేజీబీవీ ఎస్వో మూడు కేజీబీవీలు ఎంపికజిల్లాలోని 15 కస్తూరిబా విద్యాలయాల్లో మొ త్తం 4,177 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. ఏటా వార్షిక పరీక్షల్లో కేజీబీవీ వి ద్యార్థినులు సత్తా చాటుతున్నారు. కొన్ని వి ద్యాలయాలు వందశాతం ఫలితాలు సాధి స్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి) కేజీబీవీలను ప్రభుత్వం యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలుగా గుర్తించింది. ఆసిఫాబాద్‌లో నీట్, కాగజ్‌నగర్‌లో ఐఐటీ, సిర్పూర్(టి)లో క్లాట్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. -
సాంకేతిక సమస్యతో సతమతం
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో పంచాయతీ నామినేష న్ల పర్వం ఊపందుకుంది. ఈ తరుణంలో పోటీ చేసే అభ్యర్థులను ధ్రువపత్రాల కష్టాలు వెంటా డుతున్నాయి. సాంకేతిక సమస్యలతో మీసేవ కేంద్రాల సేవల్లో అంతరాయం ఏర్పడటంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు సైతం ధ్రువపత్రాలు పొందడం ఆలస్యమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సమస్యధ్రువపత్రాల జారీకి పారదర్శకత పాటిస్తూ తక్షణ సేవలను అందించేందుకు జిల్లావ్యాప్తంగా 59 మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. సర్వర్ సమస్యలు తలెత్తడంతో ధ్రువపత్రాల జారీలో అంతరాయం ఏర్పడుతోంది. నివాస, ఆదాయ, కులం, జనన, మరణ ధ్రువపత్రాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. డిక్లరేషన్ తప్పనిసరిఅభ్యర్థుల కులం సర్టిఫికెట్‌ను గెజిటేడ్ స్థాయి అధికారి లేదా డిప్యూటీ తహసీల్దార్ స్థాయికి తక్కువ కాని రెవెన్యూ శాఖకు చెందిన అధికారి సంతకంతో డిక్లరేషన్ చేయాల్సి ఉంది. అధికారి పూర్తి హోదా, ముద్రతో ఉన్న డిక్లరేషన్‌ను అభ్యర్థి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ధ్రువపత్రాల కోసం దరఖాస్తు పెట్టుకునే మీసేవ పోర్టల్‌లోనే సమస్య తలెత్తి, పత్రాల జారీ పక్రియలో జాప్యం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో సమస్య పరి ష్కారం అవుతుందని పేర్కొంటున్నారు. సర్వర్ సమస్య ఉంది జిల్లాలో 59 మీ సేవ కేంద్రాలు ఉన్నాయి. మూడు రోజులుగా మీసేవలో సాంకేతిక లోపంతో కొంత ఇబ్బంది ఎదురవుతోంది. సర్వర్ ఇష్యూతో ఓపెన్ అవడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తాం. – గౌతం రాజ్, జిల్లా ఈసేవ మేనేజర్నామినేషన్ల వేళ.. వెలవెలజిల్లాలోని 335 పంచాయతీలు, 2,874 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఐదు మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం దహెగాం, సిర్పూర్(టి), చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్పేట్, బెజ్జూర్ మండలాల్లో నామినేషన్లు స్వీకరిస్తున్నారు. ఈ నెల 3 నుంచి కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, తిర్యాణి మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీచేసే అభ్యర్థులకు కులం, ఆదాయ, నివాస పత్రాలు సమర్పించాల్సి ఉంది. మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ధ్రువపత్రాలు జత చేయాలి. కీలకమైన ఈ సమయంలో సాంకేతిక లోపంతో ధ్రువపత్రాల జారీలో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జిల్లాలోని పలు మీసేవ కేంద్రాలు వినియోగదారులు లేక వెలవెలబోయాయి. -
ఇన్‌సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలి
ఆసిఫాబాద్‌రూరల్: ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ల భవనంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ ప్రకటించి, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. టెట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. అందరిని భాగస్వాముల ను చేస్తేనే బలమైన ఐక్య కార్యాచరణను అమలు చేయవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊషన్న, ఉపాధ్యక్షుడు ఇందురావు, నాయకులు రాజ్ కమలాకర్‌రెడ్డి, హేమంత్, రమేశ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కొత్త మద్యం పాలసీ
ఆసిఫాబాద్: తెలంగాణ నూతన మద్యం పాలసీ(2025– 27) సోమవారం నుంచి అమల్లోకి రానుంది. కొత్త దుకాణాల్లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. గత నెలలో నిర్వహించిన మద్యం టెండర్లలో జిల్లాలోని 32 మద్యం దుకా ణాలకు 727 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి రూ.21.81 కోట్ల ఆదాయం సమకూరింది. ఒక్కో దుకాణానికి సగటున 20, గూడెం దుకా ణానికి అత్యధికంగా 67 దరఖాస్తులు వచ్చా యి. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వారా షాపులు కేటాయించారు. 10 కంటే తక్కువ దరఖాస్తులు వచ్చిన దుకాణాలకు గడువు పెంచి రీ టెండర్లు నిర్వహించారు. లక్కీడ్రాలో దుకాణాలు దక్కించుకున్నవారు సోమవారం కొత్త షాపులు ప్రారంభించనున్నారు. అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన దుకాణాలను కొందరు గుడ్‌విల్ కింద కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెండేళ్ల వరకు నిర్వహణ2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల వరకు కొత్త మద్యం దుకాణాల కు జిల్లా ఎకై ్సజ్ అధికారులు లైసెన్సులు జారీ చేశారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లతో దు కాణాలు కేటాయించారు. నిబంధనల ప్రకారం ఆయా ప్రాంతాల్లో వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సోమవారం నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. సా మాజిక భద్రత నిబంధనలతో ప్రభుత్వం నియమిత ప్రదేశాల్లో మాత్రమే షాపుల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎన్నికల జోష్..కొత్తగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు ఈసారి పంచాయతీ ఎన్నికలు కలిసి రానున్నా యి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా, త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతినెలా సగటు న సుమారు రూ.23.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ పడుతున్న అభ్యర్థులు గ్రామాల్లో మద్యం పంచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఏడాది అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. మద్యం వ్యాపారులకు ఎన్నికల వేళ లాభాలు కలిసొచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మార్పీకే అమ్మాలి జిల్లాలో సోమవారం నుంచి 2025– 27 సంవత్సరానికి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ నిబంధనల మేరకు దుకాణాల లొకేషన్లు గుర్తించి 15 మండలాల్లోని 32 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేశాం. దుకాణాలు దక్కించుకున్న వారు నిబంధనలు పాటిస్తూ ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలి. – జ్యోతికిరణ్, జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారి -
ఈదురుగాలులతో గజ గజ
● మళ్లీ పెరిగిన చలి ● గణనీయంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ● రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ)లో 9.7 డిగ్రీలుగా నమోదుతిర్యాణి(ఆసిఫాబాద్): దిత్వా తుపాను ప్రభా వంతో జిల్లావ్యాప్తంగా మళ్లీ చలి తీవ్రత పెరిగింది. రెండు రోజులుగా ప్రజలు గజ గజ వణుకుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈదురుగాలులు వీయడంతో ఇ బ్బంది పడుతున్నారు. పగలు కూడా చాలా మంది స్వెటర్లు వేసుకుని తిరుగుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండటంతో గిరిజనులు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఆదివా రం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యూ) మండలంలో 9.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే తిర్యాణి మండలంలోని గిన్నెదరిలో 10.8, తిర్యాణిలో 11.2, కెరమెరిలో 11.4, వాంకిడిలో 12.9, లింగాపూర్ 13.5, పెంచికల్పేట్ 13.6, సిర్పూర్(టి), రెబ్బెనలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
కట్టుబాట్ల పేరు.. మారని తీరు
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని ఓ తండ్రి కక్ష పెంచుకుని కోడలిని కిరాతకంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన దహెగాం మండలం గెర్రె గ్రామంలో చోటు చేసుకుంది. తలాండి శ్రావణి(22) శివార్ల శేఖర్‌ను ప్రేమించి కులాంతర పెళ్లి చేసుకుంది. శేఖర్ తండ్రి శివార్ల సత్తయ్య కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిండు గర్భిణి అని చూడకుండా గొడ్డలితో దాడి చేసి శ్రావణిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని మాజీ ప్రజాప్రతినిధి కుమారుడు రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. గ్రామస్తులు ఆ కుటుంబాన్ని కులం నుంచి వెలివేశారు. శుభకార్యాలు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. కులంలోని ఇతరులు వారిని కార్యక్రమాలకు పిలిస్తే జరిమానా విధిస్తామని కులపెద్దలు తీర్మానం చేశారు. సమాజంపై అవగాహన ఉన్న ప్రజాప్రతినిధి కుటుంబానికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన కొందరు తమ కుల దేవతను కాకుండా ఇతర మందిరానికి వెళ్తున్నారని కులపెద్దలు ఆ కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. వారితో ఎవరూ మాట్లాడవద్దని, ఇళ్లలోకి వెళ్లవద్దని, పెళ్లిలకు పిలువొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు చాలా గ్రామాల్లో జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు. కౌటాల(సిర్పూర్): టెక్నాలజీతో పరుగులు పెడుతున్నా సమాజంలో ఇంకా కులం, మతం, ఆర్థిక అంతరాలు తొలగడం లేదు. కారణమేదైనా పరువు, ప్రతిష్టల పేరిట హత్యలు జరుగుతున్నాయి. తమ వారిని కోల్పోయి ఓ వైపు.. హంతకులుగా మారి జైళ్లల్లో మగ్గుతూ మరో వైపు.. రెండు వైపులా కుటుంబాలు క్షోభను అనుభవిస్తున్నాయి. అలాగే ఏటా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పట్టింపులతో నష్టంకాలంతోపాటు ఎన్నో విషయాల్లో మార్పు వచ్చినా కులమతాల విషయంలో మాత్రం పట్టింపులను వదలిపెట్టడం లేదు. పిల్లలకు ఇష్ట్రపకారం చదువులు, నచ్చిన ఉద్యోగం చేసే స్వేచ్ఛ ఇస్తున్నా జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం కట్టుబాట్లు పెడుతున్నారు. కులాంతర వి వాహాలు చేసుకున్న వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఈ కోవలోనే దహెగాం మండలంలో గర్భిణిని పరువు హత్య చేయడం కలకలం రేపింది. ఏటా జిల్లాలో కులం పేరిట దూషణాలు, కుల బహిష్కరణలు, దాడులు, ప్రతిదాడులు కూడా పె రుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 2023లో 24 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కాగా, 2024 లో 34 కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతా ల్లో ప్రజలకు పరువు హత్యలు, కుల బహిష్కరణ వంటి ఘటనల్లో ఎలాంటి శిక్షలు విధిస్తారనే దానిపై అవగాహన ఉండడం లేదు. ఘటనలు జరిగిన సమయంలో మాత్రమే అధికారులు గ్రామాల్లో అవగా హన కార్యక్రమాల పేరిట హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రేమ వివాహాలు, కుల బహిష్కరణ, శిక్షలు, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. దాడులు పెరిగాయి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగాయి. దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయింది. చాలా ప్రాంతాల్లో కుల బహిష్కరణ, పరువు హత్యలు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలి. శ్రావణి కుటుంబానికి పరిహారంతో ఐదెకరాల భూమి, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. – ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కఠిన శిక్షలు తప్పవు పరువు హత్యలకు పాల్ప డితే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అవగాహన లేకనే ఇలాంటి చర్యలకు పాల్ప డుతున్నారు. కుల బహిష్కరణ చేస్తే కఠిన చర్యలు తప్పవు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ కల్పిస్తాం. గ్రామీణ ప్రజలకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తాం. – ఎండీ వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్ -
నామినేషన్ కేంద్రాల పరిశీలన
పెంచికల్పేట్/బెజ్జూర్: పెంచికల్పేట్ మండలం ఎ ల్కపల్లి, బెజ్జూర్ మండలంలోని పలు నామినేషన్ కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీ లించారు. నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా ని ర్వహించాలన్నారు. దాఖలైన నామినేషన్లను పరిశీ లించి నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, సిబ్బంది అవసరాలు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, శానిటేషన్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. వారి వెంట తహసీల్దార్ తిరుపతి, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలిచింతలమానెపల్లి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స జావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అదనపు క లెక్టర్ దీపక్ తివారి అన్నారు. మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామి నేషన్ కేంద్రాన్ని ఆదివారం సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లాతో కలిసి పరిశీలించారు. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో డీఎల్పీవో హరిప్రసాద్, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పరిశీలించి.. సూచనలు చేసిదహెగాం: మండల కేంద్రంలో రైతువేదిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా ఆదివారం పరి శీలించారు. ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల్లో ఏ కాలమ్ కూడా ఖాళీగా వదిలిపెట్టకుండా నింపేలా చూడాలన్నారు. సర్పంచ్ అభ్యర్థికి జనరల్ రూ.2,000, ఎ స్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,000, వార్డు అభ్యర్థులు జనరల్ రూ.500, ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 డిపాజిట్ అమౌంట్ చెల్లించాలన్నారు. కేంద్రంలోకి అభ్యర్థితోపాటు బలపరిచే ఇద్దరు, ముగ్గురిని మా త్రమే అనుమతించాలని సూచించారు. తహసీల్దార్ మునవార్ షరీఫ్, ఎంపీడీవో నస్రుల్లాఖాన్, సీఐ కుమారస్వామి, ఎస్సై విక్రమ్ పాల్గొన్నారు. -
సరిహద్దులు కట్టుదిట్టం!
చింతలమానెపల్లి(సిర్పూర్): పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఓటర్లను ప్రలోభపెట్టే దేశీదారు మద్యం, డబ్బు, ఇతర సామగ్రి జిల్లాలోని రవాణా కాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలో మూడు దశల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అక్రమాలు జరగకుండా బందోబస్తు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో చెక్పోస్ట్లుజిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ డివిజన్ల నుంచి మహారాష్ట్రకు రవాణా మార్గాలు ఉన్నాయి. వాంకిడి, సిర్పూర్(టి) మండలం పోడ్సా, మాకిడి, చింతలమానెపల్లి మండలంలోని గూడెం నుంచి మహారాష్ట్రలోని గ్రామాలకు వెళ్లొచ్చు. పోడ్సా, గూడెం వద్ద పెన్‌గంగ, ప్రాణహిత నదులు హద్దులుగా ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాంకిడి మండలంలోని జాతీయ రహదారితోపాటు సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట, ఇదే మండలంలోని దుబ్బగూడ వద్ద ఎన్నికల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్ట్‌లో రెవెన్యూ ఇన్స్పెక్టర్, జూనియర్ అసిస్టెంట్ లేదా జీపీవోలు ఇద్దరు, మరో ఇద్దరు ఏఎస్సైలు, లేదా పోలీసు సిబ్బంది, వీడియోగ్రాఫర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల చెక్‌పోస్టులతోపాటు చింతలమానెపల్లి మండలం గూడెం వద్ద అక్రమ రవాణా నియంత్రణకు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. అలాగే మండలాల పరిధిలో ఎస్సైలు, పోలీసులు సైతం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్‌తోపాటు అక్రమాలపైనా దృష్టి సారిస్తున్నారు. భిన్న పరిస్థితులుకుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు పొరుగున మహారాష్ట్రలోని చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలు ఉన్నాయి. త్వరలో మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో నిబంధనల అమలు విషయంలో తేడాలు ఉన్నాయి. గడ్చిరోలి జిల్లాలో మద్య నిషేధం అమలులో ఉంది. మహారాష్ట్రలో వినియోగించే కొన్నిరకాల వస్తువులపై తెలంగాణలో నిషేధం ఉంది. జిల్లాలో పత్తి, వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వమే కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉండటంతో సరిహద్దుల వద్ద తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రూ.50వేల కంటే ఎక్కువ నగదు కలిగి ఉన్నా, అనుమతి లేకుండా వస్తువులను తరలించినా స్వాధీనం చేసుకుంటున్నారు. వాహనాల్లో వచ్చే వారు వాహనాల ధ్రువపత్రాలు కలిగి ఉండాలని స్పష్టం చేస్తున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసి తెలంగాణకు తరలిస్తే బిల్లులు, పన్ను చెల్లించిన పత్రాలు ఉండాలని సూచిస్తున్నారు. ప్రజలు సహకరించాలి కౌటాల: పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతా వరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని ఎస్పీ నితిక పంత్ పే ర్కొన్నారు. అక్రమ రవాణా, నగదు పంపిణీ, మద్యం సరఫరా వంటి చట్టవిరుద్ధ చర్యలను అరికట్టేందుకు వాంకిడి, వెంకట్రావ్పేట, దుబ్బగూడ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. వాహనాల తనిఖీలు, నాకబంది చేపడతామని వివరించారు. -
‘బీఆర్ఎస్లోనే తగిన గుర్తింపు’
కాగజ్‌నగర్‌టౌన్: బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేస్తే అవమానాలకు గురై నామమాత్రపు నాయకులుగా మిగిలిపోతారని, బీఆర్ఎస్లో తగిన గుర్తింపు లభిస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని బాలాజీనగర్‌లో నివాసముంటున్న సిర్పూర్(టి) మాజీ ఎంపీపీ మాలతి మనోహర్ ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఆయన మాట్లాడుతూ దోపిడీ నాయకుల నుంచి విముక్తి కోసం బీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. కార్యకుమంలో నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు కొంగ సత్యనారాయణ, తన్నీరు పోచం, మనోహర్, వాసు, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల జోరు
ఆసిఫాబాద్: జిల్లాలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తొలి విడత పూర్తికా గా, రెండో విడత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా శనివా రం వరకు జైనూర్, లింగాపూర్, సిర్పూర్ (యూ), కెరమెరి, వాంకిడి మండలాల్లోని 114 పంచాయతీల్లోని సర్పంచ్ స్థానాలకు 521 నా మినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 1,426 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివా రం తొలివిడత నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. మరోవైపు రెండో విడత ఎన్నికల్లో భాగంగా బెజ్జూర్, దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లోని 113 పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు ఆదివారం సర్పంచ్ స్థానాలకు 29 నామినేషన్లు రాగా, 992 వార్డు సభ్యుల స్థానాలకు 34 నామినేషన్లు వచ్చాయి. ప్రచారానికి ఏర్పాట్లుతొలి విడత నామినేషన్ల పర్వం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారానికి సన్నద్ధమవుతున్నారు. పోస్టర్లు, బ్యానర్లు సిద్ధ చేసుకోవడంతోపాటు గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ప్ర ధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పటికే అభ్యర్థులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నెలకొన్న రవాణా, విద్య, వైద్యం తదితర సమస్యలపై ప్రచారం చేస్తున్నారు. -
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపిక
కాగజ్‌నగర్‌టౌన్: కాగజ్‌నగర్ మండలం నజ్రుల్‌నగర్ విలేజ్ నం.3లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న ఇంద్రజిత్ సన జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అమరేందర్, పీడీ రమేశ్ ఆదివారం తెలిపా రు. నవంబర్ 3 నుంచి 5 వరకు వికారాబాద్‌లో జరిగిన 69వ ఎస్జీఎఫ్ అండర్– 14 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు పేర్కొన్నారు. డిసెంబర్1 నుంచి 6 వరకు మధ్యప్రదేశ్‌లోని ఉదయ్రాయ్లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఇంద్రజిత్‌ను ఉపాధ్యాయులు కాళిదాస్ మండల్, వెంకటేశ్ తదితరులు అభినందించారు. -
పల్లెల్లో చెరగని ముద్ర
గ్రామాలు ప్రగతిపథంలో తీసుకెళ్లాలనే లక్ష్యం.. ప్రజల మద్దతు, సహకారంతో ఒకప్పుడు పంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేవి. సర్పంచులు తమ పదవీకాలంలో సీసీరోడ్లు, డ్రెయినేజీలు నిర్మించడం, పేదలకు ఇళ్లు కట్టించడం, ప్రజలకు సేవలందించారు. పల్లెల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమదైన చెరగని ముద్రవేశారు. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్న సర్పంచులపై సాక్షి ప్రత్యేక కథనం. ఐదు పర్యాయాలు ఏకగ్రీవంతాంసి: ఈయన పేరు జింక జైహింద్. తాంసి సర్పంచ్‌గా 25 ఏళ్ల పాటు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువు అంతంతే అయినే యువకుడి ఉన్నప్పుడు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. 1975 నుంచి 2001 వరకు ఐదు పర్యాయాలు 25 ఏళ్ల పాటు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేశారు. 40 కుటుంబాలకు ఇళ్లు నిర్మించడం, గ్రామస్తుల సహకారంతో పాఠశాల, కళాశాలకు స్థలం కేటాయించారు. మరో ఐదేళ్ల పాటు సర్పంచ్‌గా ఉండాలని ప్రజలు కోరిన స్వచ్ఛందంగా వద్దనుకుని వేరేవారికి అవకాశమిచ్చారు. గ్రామం చివరలో చాయ్ హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అనారోగ్యంతో 2022 ఆగస్టులో మృతిచెందాడు. ఆయన మంచితనం, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తాంసితోపాటు చుట్టూపక్కల గ్రామాల ప్రజలు ఇప్పటికి చెబుతుంటారు. -
షార్ట్ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం
లోకేశ్వరం: మండలంలోని కన్కపూర్లో దూదిగాం చిన్న సాయన్నకు చెందిన పెంకుటిల్లు షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయన్న కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం వెళ్లారు. అదేగ్రామానికి చెందిన గండ్ల తులసిబాయి పక్కన అద్దెకు ఉంటుంది. ఈమె నూతనంగా ఇంటి నిర్మించుకుంటుంది. ఇంటి పని నిమిత్తం బయటకు వెళ్లింది. మధ్యాహ్నం ఒక్కసారిగా చిన్న సాయన్న పెంకుటిల్లు నుంచి మంటలు వచ్చాయి. ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని సింగిల్ ఫేజ్ మోటారుతో మంటలార్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న భైంసా ఆగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పేశారు. సాయన్నకు చెందిన రెండు తులాల బంగారు ఆభరణాలు, తులసిబాయి ఉన్న అద్దెంట్లో రూ.5 లక్షల నగదు, రెండు తులాల బంగారు ఆభరణాలు, సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఆర్ఐ లలిత ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దాదాపు రూ.10 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. కాగా, దేవుడి వద్ద వెలిగించే దీపం వల్ల షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉండవచ్చనని గ్రామస్తులు భావిస్తున్నారు. పురుగుల మందు తాగి వృద్ధురాలి ఆత్మహత్య రెబ్బెన: అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకా రం.. మండలంలోని తక్కళ్లపల్లికి చెందిన సంగెం మల్లక్క (80) వృద్ధాప్యంతో తన పనులు చేసుకోలేక బాధపడుతోంది. ఎనిమిది నెలల క్రితం అనారోగ్యానికి గురై తుంటి ఎముక విరిగింది. కుటుంబ సభ్యులు శస్త్రచికిత్స చేయించిన నయం కాలేదు. నొప్పి భరించలేక చనిపోతానంటూ కుటుంబ సభ్యులకు చెబుతూ బాధపడుతుండేది. రెండునెలల క్రితం గోదావరిఖనిలో ఉన్న కుమారుడు మధుకర్.. తల్లిని తీసుకెళ్లాడు. శుక్రవారం పింఛన్ డబ్బులు తీసుకునేందుకు మల్లక్క.. స్వగ్రామానికి వచ్చింది. మధ్యాహ్నం గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఇంట్లో మంచంపై పడి ఉంది. మధుకర్ తమ్ముడి భార్య పద్మ గమనించి పీహెచ్‌సీకి తరలించారు. ప్రథమచికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందింది. కుమారుడు మధుకర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అభివృద్ధిలో మార్క్
లక్ష్మణచాంద: ఈయన పేరు అట్ల రాంరెడ్డి. లక్ష్మణచాంద సర్పంచ్‌గా 31 ఏళ్లుగా పనిచేశారు. 1970 నుంచి 2001 వరకు సర్పంచ్‌గా ఎన్నికై ప్రజలకు సేవలందించారు. అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. 1970లో ఎన్నికై 1981 వరకు సర్పంచ్‌గా కొనసాగాడు. 1988 వర కు, అదే ఏడాదిలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1995 జ రిగిన ఎన్నికల్లో గెలుపొందారు. గ్రా మ అభివృద్ధిలో తన మార్క్ చూపించారు. ప్రాథమికను ఉన్నత పాఠశాలను అప్‌గ్రేడ్, బీసీ బాలుర హాస్టల్ ఏర్పాటు, లక్ష్మణచాంద నుంచి న్యూ కంజర్, మండల కేంద్రం నుంచి ధర్మారం, తిర్పెల్లి నుంచి అనంతపేట్ వరకు రోడ్డు నిర్మించారు. గ్రామస్తుల సహకారంతో 1988లో సహకార జూనియర్ కళాశాలఏర్పాటు చేయించారు. 1998లో ఎస్వీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. -
20 ఏళ్లుగా సేవలు..
ఇచ్చోడ: ఈయన పేరు పాముల మోతీరాం. ఇచ్చోడ మండలం కోకస్మన్నూర్ సర్పంచ్‌గా 20 ఏళ్లుగా ప్రజలకు సేవలందించారు. 1974 నుంచి 1994 వరకు పైసా ఖర్చుచేయకుండా నాలుగు పర్యాయాలుగా సర్పంచ్‌గా ఎంపికయ్యారు. మొదట, రెండుసార్లు వార్డు సభ్యుడిగా, ఆపై సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. అప్పట్లో వార్డు సభ్యుడిగా ఎంపికై న వారే మెజార్టీ సభ్యుల మద్దతుతో సర్పంచ్ పదవిని పొందేవారు. అలా రెండుసార్లు చొప్పున జనరల్, ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో కోకస్‌మన్నూర్‌లో వేసవిలో నీటి ఎద్దడి ఉండేది. 1983లో బోథ్ నియోజకవర్గంలోనే మొదటిసారిగా వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించారు. ఇంటింటికి నల్లాల ద్వారా నీరందించారు. -
ఓసీ ఏర్పాటుతో ఇబ్బందులు ఉండవు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్లో ఓపెన్‌కాస్ట్ ఫేజ్–2 రాకతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని మందమర్రి జీఎం రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఆర్కే4 గడ్డ ప్రాంత ప్రజలు శనివారం సాయంత్రం జీఎంను తన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓసీ మ్యాప్ చూపెడుతూ గని ఎక్కడి నుంచి ఎక్కడికి ఏర్పాటు కానుందో వివరించారు. దీనిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. పాత గనులు కలుపుతూ ఏర్పాటు అవుతుందని ఏ ఒక్కరికి నష్టం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల్లోనూ స్థానికులకే ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. ఎస్ఓటు జీఎం ప్రసాద్, డీజీఎం పర్సనల్ అశోక్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి అక్బర్అలీ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థినిని వేధించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు
ఆదిలాబాద్‌టౌన్: పట్టణంలోని విద్యానగర్‌లోని పారామెడికల్ కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ పేరిట వేధింపులకు గురిచేసిన యువకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఫైజాన్.. నెల క్రితం కళాశాలలో పరీక్ష ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థిని ప్రేమిస్తున్నానని ఇబ్బందులకు గురిచేశాడు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని పగులగొట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసి ఫైజాన్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రీలాన్స్ జర్నలిస్టుపై.. ఆదిలాబాద్‌రూరల్: పట్టణానికి చెందిన ప్రీలాన్స్ జర్నలిస్టు ఫిరోజ్‌ఖాన్‌పై అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఈనెల 26న సాయంత్రం ఫిరోజ్‌ఖాన్‌తోపాటు మరో వ్యక్తి ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. సరిగా డ్యూటీ చేయడం లేదని రెస్టారెంట్లు తనిఖీ చేయడం లేదని బెదిరించారు. రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పుడ్ ఇన్స్పెక్టర్ ప్రత్యూష మావల పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం కారు నిలిపిన చోట ఫొటో తీసి, అధికారిగా ఉండి బ్లాక్‌ఫిల్మ్ పెట్టావని వార్త రాసి అధికారికే పోస్టు చేశారు. ‘రైతుల ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం’నేరడిగొండ: రైతుల ఆత్మహత్యల గోసను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతు ఆత్మహత్యల నివారణ కమిటీ, రైతు స్వరాజ్యవేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న అన్నారు. మండలంలోని కిష్టాపూర్‌కు చెందిన కౌలు రైతు సోలాంకి శ్రీకాంత్ ఇటీవల ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకోగా, శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రెండు మూడేళ్లుగా పంట దిగుబడి రాలేదని మనోవేదనకు గురై ఉరేసుకున్నాడు. పంటకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకున్నారు. బాధిత కుటుంబానికి జీవో నం.194 ప్రకారం రూ.6లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. కుటుంబ యజమానురాలికి నెలకు రూ.5వేల పెన్షన్ ఇవ్వాలని పేర్కొన్నారు. నాయకులు బుపేందర్, సంతోష్, ప్రమోద్ ఉన్నారు. బీజేపీ జిల్లా ఇన్చార్జీల నియామకంఆదిలాబాద్: బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇన్చార్జీలను శనివారం నియమించింది. ఈమేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.గౌతమ్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌కు మాజీ ఎమ్మెల్యే అరుణతార, మంచిర్యాలకు కె.ఓదెలు, నిర్మల్‌కు గోపిడి స్రవంతిరెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు కోమల ఆంజనేయులను నియమించారు. -
సత్యనారాయణస్వామే తిరిగి రప్పించాడు..!
లక్సెట్టిపేట: ‘నన్ను ఆ గూడెం సత్యనారాయణ స్వామే తిరిగి రప్పించాడు. నా ఆరోగ్యం గురించి సహకరించిన వారికి, దేవుళ్లకు ప్రార్థించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు..’ అంటూ మంచిర్యాల ఎమ్మెల్యే కే.ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మండల కేంద్రంలోని ఐబీ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరులు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక దశలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. తన ఆరోగ్యం బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి, వైద్యులు వెళ్లవద్దని చెప్పినా సర్పంచ్ ఎన్నికలు ఉండడంతో ప్రజల కోసమే వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఒకసారి సర్జరీ అయిందని, మరోసారి చిన్నపాటి సర్జరీ కోసం మళ్లీ కోయంబత్తూరు వెళ్తున్నట్లు తెలి పారు. తనకు వచ్చిన అనారోగ్య సమస్యలు ఎవరికీ రావొద్దని, వచ్చినా చికిత్స అందుబాటులో ఉండేందుకు మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు. అన్ని విధాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉంటాయని, సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు. తన ఆరోగ్యం బాగాలేక చికిత్స పొందుతున్నానని, అందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని, పార్టీ అభ్యర్థులకు ప్రజలు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాలుగు నెలల తర్వాత పట్టణానికి వచ్చిన పీఎస్సార్‌కు కార్యకర్తలు స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుంచి ఐబీ వరకు బైక్ ర్యాలీ, డీజే చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల సర్పంచ్ అభ్యర్థుల పేర్ల జాబితాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఎండీ ఆరీఫ్, పింగిళి రమేష్, చెల్ల నాగభూషణం, చింత అశోక్‌కుమార్, పూర్ణచందర్, శ్రీనివాస్, దాసరి ప్రేంకుమార్, రాజు పాల్గొన్నారు. -
ఉదయం అలా.. సాయంత్రం ఇలా
నేరడిగొండ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని నాగమల్యాల్ గ్రామంలో శనివారం ఉదయం కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ పర్యటించారు. గ్రామస్తులతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పడంతోపాటు మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా సాయంత్రం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసంలో మాజీ సర్పంచ్ భీముడుతోపాటు పలువురు గ్రామస్తులు ఆయన్ను కలిసి మేము పార్టీలో చేరలేదని, వారే మాకు కండువా కప్పారని తెలిపారు. కాగా ఒకేరోజు రెండు పార్టీల కండువాలు కప్పుకోవడం పట్ల పలువురు చర్చించుకుంటున్నారు. -
భర్త రెండు పర్యాయాలు..భార్య ఏకగ్రీవానికి నిర్ణయం
ఇంద్రవెల్లి: ఈయన పేరు కినక జుగాదిరావ్. ఇంద్రవెల్లి మండలం వాల్గోండ సర్పంచ్‌గా రెండు పర్యాయాలు పనిచేసి ప్రజలకు సేవలందించారు. 2014లో వాల్గోండహిరపూర్ ఉమ్మడి పంచాయతీ సర్పంచ్‌గా ఈయన విజయం సాధించారు. సీసీరోడ్డు, డ్రెయినేజీ నిర్మాణాలు నిర్మించారు. తాగునీటి సమస్య పరిష్కరించారు. హీరపూర్ నుంచి వేరు అయిన వాల్గోండ పంచాయతీకి 2019 ఎన్నికల్లో తొలి సర్పంచ్‌గా గెలిచారు. నిత్యం ప్రజల్లో ఉంటూ.. అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం వాల్గోండ పంచాయతీ (ఎస్టీ మహిళ) రిజర్వేషన్ వచ్చినప్పటికి ఆయన భార్య సునీతకు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి ఇటీవల పంచాయతీ పరిధి గ్రామాల ప్రజలు నిర్ణయించారు. -
ఆస్తులు లేకున్నా మంచి పేరుంది
మందమర్రిరూరల్: ఈయన పేరు లింగాల మల్లయ్య. మందమర్రి మండలం అందుగులపేట పంచాయతీకి వరుసగా రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2006లో (జనరల్), 2012లో (ఎస్సీ జనరల్) జరిగిన పోటీల్లో ఇండిపెండెంట్‌గా గెలిచి ప్రజలకు సేవలందించారు. 2017లో (జనరల్ సీటు) కావడంతో ఓడిపోయాడు. 2001లో ఎస్సీ మహిళ రిజర్వేషన్‌తో ఆయన భార్య లక్ష్మి పోటీ చేసి గెలిచింది. ప్రస్తుతం అందుగులపేటకు రిజర్వేషన్ మారడంతో పోటీ చేయడం లేదు. ప్రస్తుతం ఇంటి వద్ద టైలర్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దంపతులకు ఎలాంటి ఆస్తులు లేవని, గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నారు. -
సివిల్స్ ప్రిపరేషన్.. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఓ విద్యావంతురాలు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామానికి చెందిన బానోత్ కావేరి బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కోసం మహారాష్ట్రలో శిక్షణ పొందుతూ సన్నద్ధమవుతోంది. ఈమె తండ్రి బానోత్ గజానంద్ నాయక్ 15ఏళ్లు నార్నూర్ సర్పంచ్‌గా పని చేశారు. ఈసారి రిజర్వేషన్ మారడంతో తన వారసురాలిగా కావేరిని బరిలోకి దింపారు. మండల కేంద్రం నార్నూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి నామినేషన్ వేశారు. పుట్టినగడ్డకుసేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నట్లు కావేరి తెలిపారు. -
‘శ్యాంనాయక్ వ్యాఖ్యలు అర్థరహితం’
ఆసిఫాబాద్: డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌పై కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కాంగ్రెస్ సీనియర్ నా యకుడు వసంత్‌రావు పేర్కొన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు మసాదే చరణ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్తో కలిసి శనివారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. శ్యాంనాయక్ కెరమెరిలో డీసీసీ అధ్యక్షురాలు సుగుణ సమక్షంలో విశ్వప్రసాద్‌పై చే సిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల వేళ సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలి పారు. శ్యాంనాయక్ జిల్లాలో ఎంవీఐగా ఉన్నపుడు వసూళ్లకు పాల్పడడం తెలిసే ప్రజలు గత ఎన్నికల్లో ఓటు వేయలేదని, ఇందుకు డీసీసీ అధ్యక్షుడిని బా ధ్యుడిని చేయడం సరికాదని పేర్కొన్నారు. తిర్యాణికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అనిల్‌గౌడ్, ఆయన సతీమణి, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌పై శ్యాంనాయక్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు విశ్వప్రసాద్తోనే ఉంటారని, ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని డిమాండ్ చే శారు. నాయకులు సలీం, రవీందర్, సాయి, కలీం, జావిద్, మహేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
కౌటాల: విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్, డీఈవో దీపక్ తివారి హెచ్చరించారు. కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం విషయంలో నిరసన తెలిపిన ఘటనపై శనివారం ఆయన కాగజ్‌నగర్ సబ్ కలెక్ట ర్ శ్రద్ధా శుక్లాతో కలిసి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన, పారిశుధ్య సిబ్బందిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చే యాలని ఆదేశించారు. పాఠశాల హెచ్ఎం నారా యణ్సింగ్ను సస్పెండ్ చేస్తూ ఎంఈవో హన్మంతు ఆరోపణలపై వివరణ కోరారు. విద్యార్థుల నిరసన ఘటన రోజు విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల నుంచి విధి నిర్వహణలో అలసత్వం, ఘటనకు కారణాల పై వివరణ తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ను కచ్చితంగా పాటించాలని సూచించారు. పాఠశాలలోని చేతిపంపునకు వెంటనే మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ఆవరణలో నీరు నిల్వ కుండా తగినచర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశా ల చుట్టూ ప్రహరీ నిర్మించాలని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రతీరోజు మధ్యాహ్న భోజన నాణ్యత ను పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంపీడీవో కోట ప్రసాద్, కార్యదర్శి సాయికృష్ణ తదితరులున్నారు. -
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
ఆసిఫాబాద్‌రూరల్: ప్రభుత్వ విద్యను మరింత బ లోపేతం చేయాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్న త పాఠశాలలో ప్రీప్రైమరీ పాఠశాలలకు ఎంపికై న 41మంది ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రీప్రైమరీ పాఠశాలలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని సూచించారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాల కంటే మె రుగ్గా విద్య అందుతుందనే నమ్మకం తీసుకురావా లని తెలిపారు. 3నుంచి 6ఏళ్ల పిల్లలకు బ్రెయిన్ డెవలమ్మెంట్ అధికంగా ఉంటుందని, చిన్న పిల్లలకు చక్కని ప్రేమ అప్యాయతలతో బోధించాలని సూ చించారు. వారి అభిరుచిని తెలుసుకోవాలని, పిల్ల లు ఇష్టపడేలా సిలబస్‌లోని అంశాలతో పాటు మంచి విలువలు నేర్పించాలన్నారు. విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేశ్ దోత్రే -
ఆయుధాల రికార్డును అప్డేట్ చేయాలి
ఆసిఫాబాద్: బెల్ ఆఫ్ ఆర్మ్‌లోని ఆయుధాల రికార్డులను నిరంతరం అప్డేట్ చేయాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. జిల్లా కేంద్రంలోని సాయుధ పోలీస్ దళాన్ని సందర్శించి పలు విభాగాలను తని ఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించారు. ఆ యుధాల భద్రతా ప్రమాణాలు, అమ్యునిషన్ నిల్వ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, బాధ్యతలు, పరికరాల సంరక్షణ, వాహనాల నిర్వహణ తదితర అంశాలపై ఆర్ఐ ఎంటీవో అంజన్న ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పాత రికార్డులను భద్రపరచాలని, అమ్యునిషన్ డంప్‌లో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అర్మూరర్ వ ర్క్‌షాప్‌లో మరమ్మతుల వేగం పెంచాలని, డ్యామే జ్ పరికరాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచకుండా వెంటనే రిపేర్ చేయాలని ఆదేశించారు. స్టోర్స్‌లోని సామగ్రిపై నెలకు ఒకసారి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించాలని సూచించారు. జిల్లాలో సమర్ధవంతమైన పోలీసింగ్, ఆయుధాలు–విభాగాల భద్రత కోసం సాయుధ దళ పోలీసుల విధి నిర్వహణ ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆమె వెంట ఆర్ఎస్సై లవన్, సిబ్బంది పాల్గొన్నారు. -
డోంట్ వర్రీ.. రికవరీ..!
కౌటాల: ప్రస్తుతం సెల్‌ఫోన్ లేకుండా ఒక్కరోజు ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇంతటి విలువైన మొ బైల్ ఫోన్లు ఒక్కోసారి అపహరణకు గురవుతుంటా యి. కొన్నిసార్లు మనమే ఎక్కడో మిస్ చేసుకుంటాం. ఆ తర్వాత బాధ పడుతుంటాం. అయితే ఇ దంతా గతం.. ప్రస్తుతం సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే తిరిగి దొ రుకుతోంది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజి స్టర్ (సీఈఐఆర్) వెబ్సైట్ అందుబాటులోకి వచ్చా క.. పోయిన ఫోన్లను ట్రేస్ చేయడం, వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం సులభమైంది. సెల్‌ఫోన్ పోతే ఫిర్యాదు ఇలా.. జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ సీఈఐఆర్ సౌ లభ్యం అందుబాటులో ఉంది. ముందుగా ఫోన్ పో యిన వెంటనే బాధితుడు సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. మొబైల్ ఫోన్ ఈఎంఈఐ నంబర్ విధిగా పొందుపర్చాలి. ఎక్కడ పోయింది అనే వివరాలు అందజేయాలి. బాధితులు ఎఫ్ఐఆర్ ప్ర తి అందిన తర్వాత www.ceir.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. పోర్టల్ ఓపెన్ చేసి అందులో ‘బ్లాక్ ఫోన్’ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఫోన్ వివరాలు, పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, చిరునామా, పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు నంబర్, ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు సూచించిన బాక్స్‌ల్లో నింపాక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫాంను సబ్మిట్ చేయగానే పోగొట్టుకున్న ఫోన్ బ్లాక్ అవుతుంది. ఇక దానిని ఎవరూ ఆపరేట్ చేయలేరు. దానిలో డాటా సురక్షితంగా ఉంటుంది. సీఈ ఐఆర్ వెబ్‌సెట్‌లోకి వెళ్లి ఫోన్ ఐఎంఈఐ నంబర్‌తో బ్లాక్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ పని చేయదు. అందులో వేరే సిమ్‌కార్డు వేసినా వెంటనే బాధితుడికి ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ మెసేజ్‌తో యూజర్ పో గొట్టుకున్న సెల్‌ఫోన్ ఏ ప్రాంతంలో ఉన్నదో సులభంగా తెలుసుకునే అవకాశముంది. పాత ఫోన్‌తో పరేషన్.. ఎవరైనా తక్కువ ధరకు సెల్‌ఫోన్ అమ్ముతున్నారని కొనుక్కుంటే లేనిపోని చిక్కులు కోరి తెచ్చుకున్నట్లే. అది కొట్టేసిన ఫోన్ అయితే కొనుగోలుదారు మొ బైల్ ఆన్ చేయగానే పోలీసులకు సమాచారం వెళ్తుంది. ఆ స్థలానికి వెళ్లి విచారించగా వేరేవాళ్ల వద్ద కొ న్నామని వారు సమాధానం చెప్పడంతో మందలించి వదిలేస్తున్నారు. కొన్నవారు ఆర్థికంగా నష్టపోతున్నారు. సెల్‌ఫోన్ ఎక్కడ కొన్నాడు? కొన్న బిల్లు? బాక్స్ అడిగాకే ఆ ఫోన్ కొనాలి. లేదంటే తిప్పలు పడాల్సి వస్తుంది. పాత ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు అది దొంగిలించిందా..? బ్లాక్ లిస్ట్‌లో ఉందా? అన్న విషయం కేవైఎం (నో యువర్ మొ బైల్) విధానంలో ముందే తెలుసుకోవచ్చు. మొబైల్లో కేవైఎం అని పెద్ద అక్షరాల్లో టైప్ చేసి 15 అక్షరాల ఐఎంఈఐ నంబర్‌ను నమోదు చేసి 14,422కు ఎస్ఎంఎస్ చేయాలి. సెల్ఫోన్లలో విలువైన సమాచారం ఉండడంతో వాటి వినియోగం, కొనుగోలు విషయంలో వినియోగదారులు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. స్పీడ్‌గా రికవరీ సెల్ఫోన్లో కీలక సమాచారం ఉంటుంది. అది అపహరణకు గురైతే బాధితులు తీవ్ర ఆందోళన చెందుతారు. జిల్లాలో 6.50 లక్షల వరకు జనాభా ఉంటే అందులో దాదాపుగా 5లక్షలకుపైగా ఫోన్లు విని యోగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల నుంచి వృద్ధుల దాకా అన్ని వయస్సులవారిలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగింది. గతంలో సెల్‌ఫోన్ అపహరణకు గురైనా.. పోగొట్టుకున్నా దొరకడం కష్టంగా ఉండేది. కానీ, గతేడాది మార్చి 15నుంచి రాష్ట్రంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) వైబ్సెట్ అందుబాటులోకి తేవడంతో పోగొట్టుకున్న సెల్‌ఫోన్ ఇట్టే దొరికిపోతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో బాధితులు పో గొట్టుకున్న, చోరీ అయిన సెల్ఫోన్లు గుర్తించడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం ముందంజంలో ఉంది. జిల్లాలో రెండేళ్లుగా 2వేల వరకు సెల్ఫోన్లు పోవడంతో పోలీసులు 1300కు పైగా మొబైల్ఫోన్లను గుర్తించారు. సుమారు రూ.14లక్షల విలువైన సెల్ఫోన్లను బాధితులకు అప్పగించారు. -
ఖాతాల కోసం అభ్యర్థుల పాట్లు
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు చూపేందుకు గతంలో ఉన్న సేవింగ్ బ్యాంక్ ఖాతాలు కాకుండా మళ్లీ కొత్తగా ఖాతా తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో చాలా మంది అభ్యర్థులు బ్యాంక్‌లు, పోస్టాఫీసులకు వెళ్లి కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్‌కు రూ.2వేలు కావడంతో చాలామంది పోస్టాఫీస్‌లో రూ.200తో ఖాతాలు ఓపెన్ చేస్తున్నారు. దండేపల్లి పోస్టాఫీస్ శుక్రవారం ఖాతాలు తెరిచేందుకు వచ్చినవారితో సందడిగా మారింది. సర్పంచ్ పదవికి వేలం?సారంగపూర్: మండలంలోని మహవీర్‌తండా గ్రా మపంచాయతీ సర్పంచ్ పదవికి శుక్రవారం వేలం నిర్వహించడం అందరినీ విస్మయానికి గురిచేసింది. వేలం పాటలో మహవీర్‌తండాకు చెందిన ఓమహిళ తరఫున వారి కుటుంబీకులు పాల్గొని రూ.5.60లక్షలకు పదవి దక్కించుకున్నట్లు సమాచారం. మహవీర్‌తండా, దుర్గానగర్ ఈరెండు తండాలు ఒకే పంచాయతీ కాగా, వీటి పరిధిలో 500 మంది ఓటర్లున్నారు. ఈ తండా సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేయగా దుర్గానగర్, మహవీర్తండాల ప్ర జలు సర్పంచ్ పదవి తమకంటే తమకేనంటూ పో టీకి దిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జామ్ గ్రామ సమీపంలో ఇరుగ్రామాల ప్రజలు పంచాయితీకి కూర్చున్నారు. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా మహవీర్‌తండాకు చెందిన ఓ మహిళ సర్పంచ్ పదవిని రూ.5.60లక్షలకు దక్కించుకున్న ట్లు తెలిసింది. అయితే.. ఈ విధానం ప్రజాస్వామ్య వ్యవస్థకు పూర్తి విరుద్ధమని, వీటిని ఎన్నికల సంఘం నిరోధించాల్సిన అవసరముందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
హిల్ట్ పాలసీపై బహిరంగ చర్చకు సిద్ధమా?
నిర్మల్‌చైన్‌గేట్: హిల్ట్ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని, ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లే దంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బహిరంగ చ ర్చకు సిద్ధమా.. అని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మాట్లాడారు. ఓపెన్ డిబేట్‌కు మంత్రి సిద్ధపడితే శనివారం ఉదయం 11గంటలకు అసెంబ్లీ మీ డియా పాయింట్ వద్దకు జర్నలిస్టుల సమక్షంలో చ ర్చకు రావాలన్నారు. లేదంటే డేట్, టై మ్, వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే, దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేద ని, పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినవి రూ.6.30 లక్షల కోట్లయితే రూ.5వేల కోట్లకే కట్టబెట్టడం కుంభకోణం కాదా? అని ప్రశ్నించారు. ఈ భూ కుంభకోణంలో మంత్రితోపాటు మొత్తం కేబినె ట్, కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు వాటా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ల్యాండ్ కన్వర్షన్ పేరు చెప్పి ల్యాండ్ లూటీకి పాల్పడుతోందన్నారు. -
ఇంటి స్థలం కోసం టవరెక్కి నిరసన
జైపూర్: మండల కేంద్రానికి చెందిన అహ్మద్ అనే యువకుడు ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం స్థ లం కేటాయించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సె ల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ సరిపడా స్థలం లేక ఇంటి నిర్మాణం నిలిచిపోయిందని వాపోయాడు. స్థలం కే టాయించాలని టవర్ ఎక్కి నిరసన తెలుపగా స్థాని కంగా కలకలం రేపింది. దీంతో ఘటనా స్థలానికి ఎస్సై శ్రీధర్ చేరుకుని యువకుడితో మాట్లాడారు. అతనికి నచ్చజెప్పడంతో అహ్మద్ సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. ఎస్సై మాట్లాడుతూ.. అహ్మద్‌ది నిరుపేద కుటుంబమని, ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినా ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు నిర్మించకపోవడంతో హోల్డ్‌లో పెట్టారని తెలి పారు. ఇంటి ని ర్మాణానికి స్థ లం కేటాయించి ఆదుకోవాల ని కోరారు. -
ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్?
దండేపల్లి: పంచాయతీ ఎన్నికల వేళ మండలంలోని అన్ని గ్రామాలు సందడిగా మారగా.. గూడెం, నెల్కివెంకటాపూర్, వందుర్‌గూడ గ్రామాల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. గూడెం గ్రామానికి సర్పంచ్ లేక 38 ఏళ్లవుతోంది. నెల్కివెంకటాపూర్ గ్రామంతోపాటు కొత్తగా ఏర్పాటైన వందుర్‌గూడ పంచాయతీకి గత 2019 పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్ వేయలేదు. దీంతో ఈ రెండు గ్రామాల్లో ఎన్నికలు జరగలేదు. శుక్రవారం వరకు ఈ మూడు గ్రామాల నుంచి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గూడెం ఏజెన్సీ గ్రామం కానప్పటికీ.. గూడెం గ్రామంలో 2,140 మంది ఓటర్లున్నారు. ఇందులో గిరిజనులెవ్వరూ లేరు. అయినప్పటికీ ఈ గ్రామాన్ని ఏజెన్సీ గ్రామంగా గుర్తించారు. దీంతో గ్రామంలోని సర్పంచ్ పదవితో పాటు సగం వార్డు స్థానాలు ఎస్టీలకే రిజర్వ్ చేశారు. దీంతో గ్రామంలో సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డు స్థానాలకు పోటీ చేసేందుకు గ్రామంలో గిరిజనులెవరూ లేరు. 1987 నుంచి గూడెం పంచాయతీకి సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. దీంతో ఆ గ్రామానికి సర్పంచ్ లేక 38ఏళ్లు గడిచింది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. నెల్కివెంకటాపూర్, వందుర్గూడలోనూ.. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ముందు వందుర్‌గూడ గ్రామం నెల్కివెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. వందుర్గూడను నెల్కివెంకటాపూర్ నుంచి విడదీసి ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. అయితే వందుర్‌గూడ పంచాయతీ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. తమ గ్రామాన్ని నెల్కివెంకటాపూర్లోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. వందుర్గూడను విడదీయడంతో నెల్కివెంకటాపూర్‌లో గ్రామంలో గిరిజనులెవరూ లేని పరిస్థితి ఏర్పడింది. నెల్కివెంకటాపూర్ గ్రామం కూడా ఏజెన్నీ గ్రామం కావడంతో ఇక్కడ గిరిజనులు లేని కారణంగా గత 2019 పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎస్టీ అభ్యర్థులు లేక నామినేషన్లు వేయలేదు. దీంతో అప్పటి పంచాయతీ ఎన్నిక నిలిచిపోయింది. ఈ రెండు గ్రామాల పంచాయితీ ఎటూ తేలక పోవడంతో, ఈసారి కూడా ఎన్నికలు జరగడం అనుమానమే. -
ఎస్పీఎం విభాగంలో చోరీ
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా విద్యుత్‌శాఖ కార్యాల య ఆవరణలోని ఎస్పీఎం ట్రాన్స్ఫార్మర్ రూర ల్ వర్క్‌షాప్‌లో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి ఆరుగురు దుండగులు వర్క్‌షాప్‌లోకి చొరబడి ఏడు ట్రాన్సఫార్మర్ జాబ్లలోని కాప ర్ తీగలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన కాపర్ వై రు విలువ సుమారు రూ.3.5లక్షలు ఉంటుంద ని విద్యుత్ సిబ్బంది తెలిపారు. ఘటనాస్థలాన్ని ట్రాన్స్ కో ఎస్ఈ జాదవ్శేష్రావు పరిశీలించారు. చోరీకి గురైన ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అశోక్ అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్, క్లూస్ టీమ్ ద్వారా పరిశీలించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: తాగిన మైకంలో ఒకరు ఆత్మహ త్య చేసుకున్న ఘటన మండలంలోని పాత ఉట్నూర్‌లో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. పాత ఉట్నూర్‌లో నివాసముండే రా థోడ్ నూర్సింగ్ (63) మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి తరచూ కుటుంబ సభ్యులతో గొ డవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవకు దిగాడు. కుటుంబ సభ్యులు సర్ధి చెబుతుండగా అకస్మాత్తుగా కింద పడ్డాడు. ఈ సమయంలో అతడి తలకు దెబ్బ తగలగా ఆస్పత్రికి వెళ్తామని చె ప్పినా వినలేదు. ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటిలోని గది లోకి వెళ్లి ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని హుటాహుటిన స్థానిక ప్ర భుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలి పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మిస్టరీగా బాలిక మరణం
దండేపల్లి: మండలంలోని నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహన్విత (7) మృతి మిస్టరీగా మారింది. ఆడుకోవడానికి వెళ్లిన బాలిక సోమవారం అదృశ్యం కావడం.. మూడు రోజు ల తర్వాత గురువారం బావిలో శవమై తేలడం తెలిసిందే. బాలిక మృతదేహం లభించిన బావి ఇంటి నుంచి దూరంగా ఉంది. బాలిక ఒక్కరే అంతదూరం ఒంటరిగా వెళ్లలేని విధంగా పరిస ర ప్రాంతాలున్నాయి. దీంతో ఎవరైనా హత్య చేసి బావిలో పడేసి ఉండొచ్చని, మరోవైపు చి న్నారిని లైంగిక వేధింపులకు గురి చేసి చంపి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమవుతున్నా యి. బాలిక అదృశ్యమైన రోజు పోలీస్ డాగ్‌స్క్వాడ్ ఇంటివద్దే కొద్దిసేపు సంచరించాయి. మృతదేహం లభించిన రోజు మాత్రం డాగ్‌స్క్వాడ్ బా వి నుంచి ఇంటి వద్దకు వచ్చాయి. బాలిక మృతి పై గ్రామంలో పలు విధాలుగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం నివేదిక వస్తే గానీ మరణానికి కారణాలేమిటనేది చెప్పలేమని పోలీసులు పేర్కొంటున్నారు. మృతదేహం నీళ్లలో ఎ క్కువ రోజులు ఉండడంతో కారణాలు కనుగొ నడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. బంధువుల ఆందోళన బాలిక మృతిపై న్యాయం చేయాలని తల్లిదండ్రులు, బంధువులు గ్రామస్తులు వంద మందికిపైగా శుక్రవారం దండేపల్లి పోలీస్‌స్టేషన్ వద్దకు వచ్చారు. స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు ప్రయత్నం చేశారు. మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే శారు. ఇదే సమయంలో కేసు విచారణలో భా గంగా దండేపల్లి స్టేషన్‌కు వచ్చిన ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి వెంటనే బయట కు వచ్చి బాలిక తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. బాలిక కుటుంబానికి న్యాయం చే స్తామని, పోస్టుమార్టం నివేదిక రాగానే దాని ఆ ధారంగా నిందితులపై కేసు నమోదు చేస్తామన్నారు. జైలుకు పంపించి శిక్షపడేలా చూస్తామని భరోసానివ్వడంతో వారు వెళ్లిపోయారు. పోలీసు విచారణ ముమ్మరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు న మోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఏసీపీ ప్రకాశ్ స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్సై తహసీనొద్దీన్, లక్సెట్టిపేట ఎ స్సై సురేష్ పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. విచారణ వేగవంతం చేశారు. -
మేమున్నామనీ..
మంచిర్యాలక్రైం: మహిళలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ సఫలమవుతున్నాయి. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో వీటి పనితీరు ఈ ఏడాది బాగుంది. షీ టీమ్స్ ని రంతరం గస్తీ నిర్వహిస్తూ అతివలకు భరోసా క ల్పిస్తున్నాయి. విద్యాసంస్థలు, రైల్వేస్టేషన్లు, బ స్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో పోలీసులు మఫ్టీలో ఉంటూ ఆకతాయిల భర తం పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, ప్రేమ పేరుతో వేధింపులకు గురవుతున్న విద్యార్థినులు, మహిళలకు షీ టీమ్స్ అండగా ఉంటూ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తున్నాయి. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బృందాల్లోని పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ భరోసా కల్పిస్తున్నారు. జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లి ఈవ్ టీజర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. స్పై కెమెరాలు వినియోగిస్తున్నారు. అవసరమనుకుంటే పరిసర ప్రాంతాలను వీడియో రికార్డు చేస్తున్నారు. సరైన ఆధారాలతో పోకిరీలను అదుపులోకి తీసుకుని ఈవ్‌టీజింగ్, మహిిళలను వేధించిన కేసులో పట్టుబడిన వారికి పోలీస్ పద్ధతిలో వారి చేష్టలను కుటుంబ సభ్యులకు చూపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తు్ాన్నరు. మహిళలను బహిరంగంగా వే ధించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా వే ధించేవారి తాట తీస్తున్నారు. వీరు చేసిన ఆపరేష న్స్, నిర్వహించిన అవగాహన సదస్సులు మహిళల భద్రతకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. మహిళలు, బాలికలను వేధించినా.. మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేసినట్లు రుజువైతే చట్టపరమైన శిక్షలతో పాటు విద్యాపరంగా శిక్షలుంటాయి. విద్యాలయాలనుంచి తాత్కాలి కంగా లేదా శాశ్వతంగా తొలగించడానికి, ఏ ఇతర విద్యాలయాల్లో ప్రవేశాలు లేకుండా చేసేందుకు అ వకాశముంది. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేకుండా చేయడం, పాస్‌పోర్టు జారీ చేయకుండా చర్యలు తీసుకోవచ్చు. యూజీసీ విధానాల ప్రకారం ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన వారి ఉపకారవేతనా లు నిలిపివేయడం, పోటీ పరీక్షలకు హాజరుకాకుండా చేయడం, ఫలితాల నిలిపివేత, రూ.2.50 లక్షల వరకు జరిమానా విధించే ఛాన్స్ ఉంది. పోక్సో కేసులో పిల్లలకు రక్షణ కల్పించేందు ప్రభుత్వం 2012 లో పోక్సో చట్టాన్ని రూపొందించింది. చట్టంలో పే ర్కొన్న మేరకు బాలిక ఆమోదం తెలిపినా, తెలుపకపోయినా బీఎన్ఎస్ 63 ప్రకారం 18ఏళ్లలోపు వారి పై లైంగిక కలయిక జరిగితే అది అత్యాచారంగానే పరిగణించబడుతుంది. పిల్లలపై లైంగికదాడికి పా ల్పడితే ఏడేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష, జరిమానా, లేదా జీవిత ఖైదు కూడా విధించవచ్చు.జిల్లా ఫిర్యాదులు ఎఫ్ఐఆర్ కౌన్సిలింగ్ అవగాహన రెడ్‌హ్యాండెడ్‌గా సదస్సులు పట్టుకున్నవి మంచిర్యాల 210 22 188 285 148 ఆదిలాబాద్ 217 25 192 190 43 ఆసిఫాబాద్ 142 37 105 206 63 నిర్మల్ 30 14 88 115 276సమాచారం ఇవ్వడం ఇలా..వేధింపులకు గురైనవారిలో చాలామంది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని పోలీస్‌శాఖ వాట్సాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లను అందుబాటులో ఉంచింది. ఫోన్లో సమాచారం ఇచ్చేందుకు ‘డయల్ 100’కు ఫోన్ చేసి సమాచారం అందించాలి.6303923700 నంబర్‌కు వాట్సాప్ మెస్సేజ్ చేయవచ్చు. క్యూ ఆర్‌కోడ్, ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు కాబట్టి నిర్భయంగా సమాచారం అందించవచ్చు. షీటీమ్ బృందాలు ఘటనా స్థలానికి రహస్యంగా చేరుకుని సమస్య పరిష్కరిస్తారు.ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు షీ టీమ్ కేసుల వివరాలు -
మహిళలే టార్గెట్..!
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలో వరుస చోరీలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మాటలతో బురిడీ కొట్టించి నగలతో మాయమవుతున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన దొంగతనాలను చూస్తే అమాయకులు, వృద్ధ మహిళలు, ఇంట్లో ఒంటరిగా ఉన్నవారినే లక్ష్యంగా చేసుకున్నారు. కొత్తరకం దొంగతనాలకు పాల్పడ్డారు. జిల్లాలో పోలీసులు ఓ వైపు ఎన్నికల బందోబస్తులో బిజీగా మారగా, దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. మభ్యపెట్టి.. మాయచేసి ఇటీవల రెబ్బెన మండలం గోలేటి, కాగజ్‌నగర్ పట్టణంలో జరిగిన రెండు చోరీ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ఒంటరిగా ఉన్న మహిళలను మభ్యపెట్టి నగలతో ఉడాయించారు. గతంలో జిల్లాలోని పలు ఆలయాలను టార్గెట్‌గా చేసుకుని హుండీలు, విగ్రహాలను ఎత్తుకెళ్లేవారు. సీసీ కెమెరాల నిఘాతోపాటు పోలీసుల చర్యలతో ప్రస్తుతం అవి ఆగిపోయాయి. ఇటీవల కాగజ్‌నగర్ పట్టణంలో తాళం వేసి ఉన్న ఇళ్లలోనూ వరుస చోరీలు జరిగాయి. ప్రస్తుతం మహిళలనే టార్గెట్‌గా చేసుకుని దుండగులు బంగారు నగలు దోచుకుంటున్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలిపోలీసుల గస్తీ నిరంతరం పటిష్టం చేశాం. కాగజ్‌నగర్ పట్టణంలో దొంగతనాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దొంగలను గుర్తించి త్వరలో పట్టుకుంటాం. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక టీం ఏర్పాటు చే శాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులకు సమాచారం అందించాలి. – వహీదుద్దీన్, డీఎస్పీ, కాగజ్‌నగర్‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు’కాగజ్‌నగర్ పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో చిలుక వీరమ్మ అనే వృద్ధురాలి వద్ద నుంచి శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించిన ఇద్దరు దుండగులు హెల్మెట్ పెట్టుకుని వచ్చారు. ‘అమ్మా.. సార్ పుస్తకాలు పంపించాడు. తీసుకోండి’ అంటూ గేటు బయటి నుంచి పిలిచారు. గేటు తీసుకుని ఇంట్లో నుంచి వృద్ధురాలు వచ్చేలోగా ఒక వ్యక్తి లోపలికి తోసుకుని వచ్చి నోరుమూసి వీపుపై పిడిగుద్దులు గుద్దాడు. మెడలోని రెండు తులాల బంగారు చైన్ అపహరించి బైక్‌పై పారిపోయినట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న కాగజ్‌నగర్ టౌన్ ఎస్సై సుధాకర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. -
ఊపందుకున్న నామినేషన్లు
● రెండోరోజు 222 దాఖలుఆసిఫాబాద్: జిల్లాలో గ్రామ పంచాయతీ నామినేషన్లు ఊపందుకున్నాయి. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో రెండోరోజు కదలిక వచ్చింది. తొలి రోజు జైనూర్, కెరమెరి, లింగాపూర్, సిర్పూర్(యూ), వాంకిడి మండలాల్లోని 115 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 15 నామినేషన్లు, 944 వార్డు సభ్యుల స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. రెండో రోజు శుక్రవారం సర్పంచులకు 111 నామినేషన్లు, వార్డు సభ్యులకు 111 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్ల సంఖ్య 242కి చేరింది. కాగా శనివారంతో తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. రెండో విడత ఎన్నికలకు సంబంధించి ఈ నెల 30 నుంచి బెజ్జూర్, చింతలమానెపల్లి, కౌటాల, దహెగాం, పెంచికల్పేట్, సిర్పూర్(టి) మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం దాఖలైన నామినేషన్లు మండలం సర్పంచ్ వార్డు స్థానం స్థానంజైనూర్ 20 32 కెరమెరి 29 25 లింగాపూర్ 20 06 సిర్పూర్(యూ) 14 12 వాంకిడి 28 36 -
జీసీసీ అభివృద్ధికి కృషి చేయాలి
కాగజ్‌నగర్‌టౌన్: గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ అభివృద్ధికి సిబ్బంది కృషి చేయాలని జీసీసీ ఉట్నూర్ డివిజనల్ మేనేజర్, చైర్మన్ గుడిమళ్ల సందీప్ కుమార్ అన్నారు. కాగజ్‌నగర్‌లోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పా టు చేసిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కాగజ్‌నగర్ జీసీసీ మేనేజర్ మనోహర్ గత ఆరు నెలల్లో సాధించిన ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సభ్యులు మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతాల ప్రజలకు తక్కువ ధరలకే డీఆర్ డిపో ద్వారా బియ్యం, నిత్యావసర వస్తువులు అందించేందుకు కృషి చేయాలని కోరారు. కందులు, మొక్కజొన్న, సోయా వంటి పంటలు కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అనంతరం జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌ను పరిశీలించి రిజిస్టర్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ మేనేజర్ మనోహర్, అటవీశాఖ డిప్యూటీ రేంజర్ హేమలత, సిబ్బంది చందు, ప్రదీప్, కృష్ణ, సత్యం, ప్రవీణ్ పాల్గొన్నారు. ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలి ఆసిఫాబాద్: జీసీసీ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డివిజనల్ మేనేజర్, సొసైటీ చైర్మన్ సందీప్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జీసీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. సొసైటీ అకౌంటెంట్ సదాశివ్, అటవీశాఖ రేంజ్ అధికారి గోవింద్‌చంద్ సర్దార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్యాముల్ మాథ్యూస్, దయాకర్ పాల్గొన్నారు. -
‘నూతన విద్యావిధానంపై ఉద్యమిద్దాం’
ఆసిఫాబాద్‌రూరల్: నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా ఉద్యమిద్దామని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మాలీ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన 20వ జిల్లా మహాసభకు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లుగా దేశంలో విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయంగా వారి అభివృద్ధి కోసం పీడీఎస్‌యూ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. అందరికీ సమానమైన విద్య అవకాశాలు దక్కాలని జార్జిరెడ్డి, చంద్రశేఖర్, శ్రీపాద శ్రీహరి వంటి వారు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. నూతన జాతీయ విద్యావిధానం 2020 రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, నాయకులు తరుణ్, సమీర్, వసంత్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు
ఆసిఫాబాద్‌రూరల్: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో శుక్రవారం అస్మిత ఖేలో ఇండియా అథ్లెటిక్స్ లీగ్ పోటీలు అట్ట హాసంగా సాగాయి. ఈ పోటీలను డీటీడీవో రమాదేవి ప్రారంభించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లు అందించారు. అనంతరం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో జిల్లా నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన శిక్షకులు నాగరాజు, మణికంఠ ఉత్తమ ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ విద్యాసాగర్, ఏటీడీవో శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల అన్నం.. నీళ్ల చారు
కౌటాల(ఆసిఫాబాద్): ప్రతిరోజూ మధ్యాహ్న భోజ నంలో పురుగుల అన్నం.. నీళ్ల పప్పు వండి పెడుతున్నారని కౌటాల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం నిరసన తెలిపారు. పాఠశాల నుంచి భోజనం ప్లేట్లతోనే బయటకు వచ్చి కౌటాల– కాగజ్‌నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. వారు మాట్లాడుతూ బియ్యాన్ని శుభ్రం చేయకుండా అన్నం వండుతున్నారని, మెనూ ప్రకా రం భోజనం పెట్టడం లేదని ఆరోపించారు. ప్రతిరో జూ పప్పు కూర పెడుతున్నారని, కూరగాయలు వండడం లేదన్నారు. నాసిరకం భోజనం తినలేక వాంతులు చేసుకుంటున్నామని వాపోయారు. వెంటనే మధ్యాహ్న భోజన కార్మికురాలిని తొలగించా లని డిమాండ్ చేశారు. రెండు గంటలపాటు రో డ్డుపై విద్యార్థులు నిరసన తెలపడంతో వాహనాలు నిలిచిపోయాయి. కౌటాల తహసీల్దార్ ప్రమోద్‌కుమార్, ఎంఈవో హన్మంతు, ఎస్సై చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. కార్మికురాలిపై చర్యలు తీసుకుంటామని, మెనూ ప్రకారం భోజనం అందిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు నిరసన విరమించారు. -
సామాజిక విప్లవకారుడు పూలే
ఆసిఫాబాద్‌అర్బన్: అణగారిన వర్గాల్లో అక్షర జ్యోతిని వెలిగించిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే అని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూప్నార్ రమేశ్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూప్నార్ రమేశ్ మాట్లాడుతూ అనేక పాఠశాలలను ప్రారంభించి ఎంతో మందిని విద్యావంతులుగా చేశారని కొనియాడారు. స్వయంగా భార్యకు చదువు నేర్పించి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దా రని తెలిపారు. మహనీయుడి ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు కేశవ్‌రావు, మారుతిపటేల్, మెంగాజీ, నికోడె రవీందర్, నాగోశే శంకర్, బాబురావ్, శ్యాం, అసద్, జలపతి, తిరుపతి, నాందేవ్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
కెరమెరి(ఆసిఫాబాద్): పంచాయతీ ఎన్నికల నామి నేషన్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. కెరమెరి, జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణను శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ పత్రాలు, ధ్రువీకరణ, అభ్యర్థుల వివరాలు, రికార్డుల నిర్వహణ పకడ్బందీగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అమలు చేయాలని, ప్రచారాలు, పోస్టర్లు, బ్యానర్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీవో సురేశ్ తదితరులు ఉన్నారు. కంచన్‌పల్లిలో పర్యటన లింగాపూర్(ఆసిఫాబాద్): మండలంలోని కంచన్‌పల్లి గ్రామంలో శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారి పర్యటించారు. నామినేషన్ కేంద్రంతోపాటు గ్రామంలో పీఎం జన్మన్ పథకం కింద చేపట్టిన ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంచందర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
కనుల పండువగా కాలభైరవ జయంతి
రెబ్బెన(ఆసిఫాబాద్): మండలంలోని ఇందిరానగర్‌లో గల కనకదుర్గాదేవి, స్వయంభూ మహంకాళి ఆలయంలో కాలభైరవ స్వామి జయంతి(మహా కాలాష్టమి) శుక్రవారం కనుల పండువగా నిర్వహించారు. మహాకాలాష్టమి రోజున కాలభైరవుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తే అన్ని శుభాలే కలుగుతాయని భక్తుల విశ్వాసం. దీంతో చుట్టుపక్కల గ్రామాలతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, గోదావరిఖని ప్రాంతాల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా కిటకిటలాడింది. గారెల మాలలు, మద్యం, స్వీట్లు నైవేద్యంగా సమర్పించారు. ఉదయం స్వామి అభిషేకం పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో సామూహిక కాలభైరవ హోమం నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి, ఆలయ కమిటీ అధ్యక్షుడు మోడెం తిరుపతిగౌడ్ పాల్గొన్నారు. -
మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
ఉట్నూర్‌రూరల్: మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగాపూర్‌కు చెందిన సయ్యద్ యూసుఫ్ (58)కు సంతానం కాకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. బుధవారం సాయంత్రం మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన అతని భార్య భాను స్థానికుల సాయంతో ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య భాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నిప్పు.. భూసారానికి ముప్పు
చెన్నూర్‌రూరల్: ఏటా వరికోతలు పూర్తికాగానే పొలంలో ఉండే వరికొయ్యలు, ఇతర మూ లా లకు రైతులు నిప్పుపెడుతుంటారు. దీంతో పంటచేనులో భూసారం బుగ్గిపాలవుతుందని వ్య వసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పొలాలను హార్వెస్టర్లతో కోయించడంతో వరిగడ్డి(పశుగ్రాసం)కొయ్యలు ఎక్కువ మొత్తంలో మిగిలి ఉంటున్నాయి. పొ లం పనులు మొదలు పెట్టే రైతులు వ్యర్థాలు ఉండకూడదని పంట మూలాలకు నిప్పంటించి మళ్లీ సాగుకు సిద్ధం అవుతున్నారు. గతంలో వ్యవసాయ కూలీలతో వరి కోతల ప్రక్రియ చేపడుతుండటంతో ఎలాంటి కుదుళ్లు లేకుండా నేల మట్టంగా కోసేవారు. ప్రస్తుత తరుణంలో కూ లీల కొరత ఉండటంతో చిన్నపాటి రైతులు కూ డా యంత్రాలతో పంటను కోయిస్తున్నారు. దీంతొ సుమారు అడుగు నుంచి అడుగున్నర మేర వరికొయ్యలు మిగిలి పోతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు వాటిని కాల్చివేస్తున్నారు. ఇ లాంటి చర్యలతో భూమిలో సారం తగ్గి పోవడమే కాకుండా, పంటకు మేలు చేసే క్రిములు కూడా పూర్తిగా నశించే పోయే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పుతో భూసారానికి ఎంత ముప్పు కలుగుతుందనే విషయాలపై అధికారులు అవగాహన కల్పించాల్సి ఉంది.వరికొయ్యలు కాల్చొద్దు కోతలు ముగిసిన తర్వాత వరి కుదుళ్లను దుక్కిలో కలిపి దున్నితే భూసార విలువలు పెరుగుతాయి. నిప్పు పెడితే భూసారం దెబ్బతింటుంది. దున్నే ముందు నీటితడులు అందించి భూమి నానిన తర్వాత అందులోనే కలియ దున్నితే భూమిలో ఉండే మెగ్నీషియం, కాల్షియం, సూక్ష్మజీవులు పంటకు మేలు చేస్తాయి. అలాగే పొలంలో జీలుగ పంట వేసి కలియ దున్నితే మంచి ఎరువుగా ఉపయోగ పడుతుంది. – బానోతు ప్రసాద్, ఏడీఏ, చెన్నూర్ -
విద్యుత్ షాక్‌తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి
నార్నూర్: విద్యుత్ షాక్‌తో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. నార్నూర్ మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కాంబ్లె హన్మంతు (37) గురువారం ఉదయం ఇంట్లో బట్టలు సర్దుతుండగా విద్యుత్ తీగలకు చేయి తగలడంతో షాక్‌కు గురై అపస్మారకస్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఉట్నూర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. జాగృతి యాత్రకు ఎంపికబాసర: జాగృతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మహోన్నత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా యువత కోసం ఉద్దేశించబడిన యాత్రలో ఆర్జీయూకేటీ బాసర ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న జశ్వంత్‌కు చోటు దక్కింది. కేవలం 15 రోజులలో దేశం మొత్తం చుట్టివచ్చే ఈ రైలుయాత్రలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలు, మేధావులు, శాస్త్రవేత్తలు వారికి మార్గ నిర్దేశం చేస్తారు. సాధారణంగా 21 ఏళ్ల పైబడిన వారే ఈ యాత్రకు అర్హులైనప్పటికీ 18 ఏళ్ల జశ్వంత్ తన ప్రతిభతో ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డీ ప్రొఫెసర్ ఇ.మురళీ దర్శన్ విద్యార్థిని అభినందించారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
కౌటాల(ఆసిఫాబాద్): ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు వైద్య శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయులతో కలిసి మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు సమీక్ష కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. డీఎస్సీ పరీక్ష రాసి ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని మళ్లీ ఇప్పుడు అర్హత పరీక్ష రాయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంపత్, విజయ్, దేవరావు, సీమ, భీంరావు, ఇందిరా, మనీషా, మా ధురి, అర్చన, తిరుమల తదితరులు పాల్గొన్నారు. -
● పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రత్యేకం ● బ్యాలెట్లో చేర్చిన ఎన్నికల అధికారులు
ఎన్నికల గుర్తులు సిద్ధంమంచిర్యాలరూరల్(హాజీపూర్): మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల గుర్తులు సిద్ధంగా ఉన్నాయి. సర్పంచ్‌గా అభ్యర్థుల బ్యాలెట్ పేపర్ గులాబీరంగులో, వార్డు సభ్యుల బ్యాలెట్ పేపర్ తెలుపురంగులో ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, కప్పు సాసర్, విమానం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, బ్లాక్ బోర్డు, కొబ్బరికాయ, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులు కేటాయించారు. వీటికింద నోటా గుర్తు విధిగా ఉంటుంది. వార్డు సభ్యుల గుర్తులు జగ్గు, గౌను, గ్యాస్ పొయ్యి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, బీరువా, ఈల, కుండ, డిష్ యాంటెనా, గరాటా, మూకుడు, కేటిల్, విల్లు–బాణము, కవరు, హాకీ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పోస్టుడబ్బా, విద్యుత్ స్తంభం గుర్తులు ఉన్నాయి. వీటి కింద కూడా నోటా గుర్తు ఉంటుంది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు‘నోటా’కు చోటు..నిర్మల్‌ఖిల్లా/నిర్మల్‌చైన్‌గేట్: పల్లె పోరు హడావుడి ప్రారంభమైంది. గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ అభ్యర్థుల గుర్తులతోపాటు ‘నోటా’ (నన్ ఆఫ్ ది ఎబోవ్)ను అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. బ్యాలెట్ పత్రంలో ప్రత్యేకంగా పొందుపరచనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ సరైన వారు లేరని ఓటరు భావించినప్పుడు ఓటును నోటాకు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఎంతో పవిత్రమైంది. ఓటరు తన ఇష్టానుసారం నాయకుడిని ఎన్నుకోవడమే కాదు.. సరైన అభ్యర్థులు లేరని భావించినప్పుడు తిరస్కరించే హక్కు కూడా కలిగి ఉండాలనే అభిప్రాయం ఏళ్లుగా చర్చకు వచ్చిన అంశమే. ఈ నేపథ్యంలోనే ‘నోటా’ భారత ఎన్నికల వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. 2013 సెప్టెంబర్ 27న సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుతో ఈ భావనకు చట్టబద్ధత లభించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో, బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ తప్పనిసరిగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. అదే ఏడాది డిసెంబర్ నుంచి దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలన్నింటిలోనూ నోటాకు స్థానం కల్పించింది. లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటింగ్ యంత్రాల చివరి బటన్‌గా నోటా ప్రత్యక్షమైంది. నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికల ఫలితంలో మార్పేమీ ఉండదు.ఒక్క క్లిక్‌తో ఓటరు జాబితా ప్రత్యక్షంనిర్మల్చైన్గేట్: పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఓటర్ల తుది జాబితాను ఆన్లైన్లో ఉంచింది. సదరు వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. వార్డుల వారీగా జాబితా చూడవచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.tsec.gov.in వెబ్సైట్ ద్వారా తుది జాబితాను చూసుకోవచ్చు. final rolls GP/ward wise voter list an on 02-09–2025 ఆప్షన్ క్లిక్ చేసి మండలం, జీపీ ఎంచుకుంటే ఓటరు జాబితా ప్రత్యక్షమవుతుంది. క్యాప్చాకోడ్‌ను ఎంటర్ చేసి వార్డువైజ్ డేటాపై క్లిక్ చేస్తే మీ గ్రామ పంచాయతీలోని వార్డుల వైజ్‌గా ఓటరు లిస్ట్ వస్తుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఇలా ఓటరు జాబితాను సులభంగా చూసుకోవచ్చు. -
రక్షణపై అవగాహన అవసరం
రెబ్బెన(ఆసిఫాబాద్): ఉద్యోగులు, అధికారులకు రక్షణపై అవగాహన అవసరమని బెల్లంపల్లి ఏరియా జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటిలోని జీఎం కార్యాలయంలో గురువారం అన్ని విభాగాల అధిపతులతో వార్షిక రక్షణ పక్షోత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జీఎం మాట్లాడుతూ డిసెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాల నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఆదేశించారు. రక్షణ సూత్రాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించేందుకు కళాకారుల పాటలు, నాటికల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. రక్షణ సూత్రాల అమలు, రక్షణ పద్ధతులు పాటించడంలో ఏరియాకు మొదటి స్థానం వచ్చేలా ప్రతీ ఉద్యోగి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఖైరిగూర పీవో నరేందర్, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, ఎస్వోటూజీఎం రాజమల్లు, డీజీఎం ఎస్కే మదీనా బాషా, సీహెచ్‌పీ ఇన్చార్జి కోటయ్య, వర్క్‌షాప్ హెచ్ఓడీ జ్ఞానేశ్వర్, ఖైరిగూర మేనేజర్ శంకర్, ఎంవీటీసీ మేనేజర్ మధుసూదన్, పర్సనల్ హెచ్‌వోడీ శ్రీనివాస్, సేఫ్టీ అధికారి గౌతమ్ రాజేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త రైలు కూతేది.?
రెబ్బెన(ఆసిఫాబాద్): దశాబ్దాలు గడుస్తున్నా కీలకమైన ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ పరిస్థితి మారడం లేదు. నిజాం కాలంలో ఏర్పాటు స్టేషన్లో కొత్త ట్రైన్లకు హాల్టింగ్ ఇవ్వడం లేదు. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఒక్కగానొక్క స్టేషన్‌కు ఘనమైన చరిత్ర ఉన్నా నిరాద రణకు గురవుతోంది. దశాబ్దాల క్రితం నుంచి కొనసాగుతున్నవే తప్పా కొత్తవాటికి హాల్టింగ్ సౌకర్యం కల్పించడం లేదు. ఇంటర్ సిటీ మినహా రైళ్లన్నీ ప్యాసింజర్ స్థాయివి కావడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్యాసింజర్ రైళ్లే దిక్కు.. జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా కుమురంభీం ఆసిఫాబాద్ ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైనా ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్లో అభివృద్ధి కానరావడం లేదు. ఈ స్టేషన్ గుండా నిత్యం వందలాది మంది ప్రయాణికులు దూరప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. రెబ్బెన, తిర్యాణి, ఆసిఫాబాద్ మండలాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు విస్తరించి ఉండటం, జిల్లాల పునర్వవస్థీకరణలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పాటు కావడంతో జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. ప్యాసింజర్ రైళ్లు మినహా ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్స్‌ప్రెస్ పేర్లతో పిలుస్తున్నా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ మినహా మిగిలినవన్నీ ప్యాసింజర్ స్థాయి రైళ్లే.. అవి కూడా సికింద్రాబాద్, కాజీపేట, కొత్తగూడెం, కరీంనగర్, సిర్పూర్ టౌన్ మధ్య మాత్రమే నడుస్తున్నాయి. గతంలో ఈ స్టేషన్లో ఆగిన ఆజ్నీ, సింగరేణి, నాగ్‌పూర్ ప్యాసింజర్లకు కరోనా తర్వాత హాల్టింగ్ సైతం ఎత్తివేశారు. దీంతో విజయవాడ, తిరుపతి, చైన్నె, నాగ్‌పూర్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాగజ్‌నగర్, బెల్లంపల్లి రైల్వే స్టేషన్లపై ఆధారపడుతున్నారు. సమయంలోపాటు డబ్బులు వృథా అవుతున్నాయి. దశాబ్దాల క్రితం మంజూరైనవే.. ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్లలన్నీ కొన్ని దశాబ్దాల క్రితం మంజూరు చేసినవే ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతం గోలేటి, జిల్లా కేంద్రం ఆసిఫాబాద్, మండల కేంద్రాల నుంచి వ్యక్తిగత పనులు, విహారయాత్రలు, తీర్థయాత్రలు, ఇతర అవసరాల కోసం సూదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ ప్రాంతంలో గుజరాత్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వలస వచ్చి వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వారు వేలల్లో ఉంటారు. ఇటీవల కాగజ్‌నగర్‌తోపాటు మంచిర్యాల రైల్వే స్టేషన్లలో వందేభారత్‌తోపాటు పలు రైళ్లకు కొత్తగా హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్‌ను మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. బెల్లంపల్లి ఏరియాలో ఉత్పత్తి అయ్యే బొగ్గును గోలేటి సీహెచ్‌పీ ద్వారా సింగరేణి యాజమాన్యం రైలుమార్గంలో సరఫరా చేస్తోంది. దీంతో ఆసిఫాబాద్ స్టేషన్‌కు రూ.కోట్లలో ఆదాయం సమకూరుతోంది. ప్రయాణికుల టికెట్ల ద్వారా కొంతమేర ఆదాయం సమకూరుతున్నా కొత్త రైళ్ల హాల్టింగ్‌కు మోక్షం కలగడం లేదు.ప్రస్తుతం ఆసిఫాబాద్ రోడ్ స్టేషన్లో ఆగుతున్న రైళ్లు కాజీపేట వైపు.. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కరీంనగర్ మెమో సింగరేణి ఎక్స్‌ప్రెస్ భద్రాచలం రామగిరి ఎక్స్‌ప్రెస్ బల్లార్షా వైపు.. రామగిరి ఎక్స్‌ప్రెస్ (సిర్పూర్ టౌన్ వరకు) ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (కాగజ్‌నగర్ వరకు) కరీంనగర్ మెమూ (సిర్పూర్ టౌన్ వరకు) భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (కాగజ్‌నగర్ వరకు) -
అధికారి నిర్లక్ష్యం.. తప్పిన పెనుప్రమాదం
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకేఓసీ గనిలో గురువారం అధికారి నిర్లక్ష్యంతో బొలెరోను డోజర్ ఢీకొట్టిన ఘటనలో పెను ప్రమాదం తప్పింది. గనిలో మొదటి షిప్టులో పనులు జరుగుతుండగా తన కన్వినెన్స్ బొలెరోలో వచ్చిన మేనేజర్ వాహనం దిగి పనిప్రదేశానికి వెళ్లాడు. ఉద్యోగులతో మాట్లాడుతుండగా డ్రైవర్ వాహనాన్ని తిరిగి వెళ్లడానికి అనుకూలంగా తిప్పిపెట్టాడు. అక్కడే డోజర్ ఆపరేటర్ కోల్ లెవల్ పనులు చేపట్టే క్రమంలో వెనకకు వచ్చి బొలెరోను బలంగా ఢీకొట్టాడు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనంలోంచి కిందకు దూకడంతో స్వల్పగాయాలుకాగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనలో అధికారి నిర్లక్ష్యం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. పనిస్థలం వరకు కన్వినెన్స్ వెహికిల్స్ రాకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ సదరు అధికారి ఎందుకు వచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
విద్యార్థులకు అభినందన
ఆసిఫాబాద్‌రూరల్: ఇటీవల జరిగిన ఎస్జీఎఫ్తోపాటు వివిధ క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాల విద్యార్థులతోపాటు కోచ్‌లు, పీడీలను గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని పతకాలు సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీఎంవో ఉద్దవ్, డీఎస్వో షేకు, పీడీ మీనారెడ్డి, కోచ్‌లు విద్యాసాగర్, తిరుమల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
ముధోల్: మండల కేంద్రంలోని మజీద్ చౌక్ సమీపంలో గడ్డమొళ్ల రమేశ్‌కు చెందిన ఇల్లు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు రమేశ్ ఇంటిముందు కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. గురువారం ఇంటికి తాళంవేసి కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఆసమయంలో షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్ మీటర్లోంచి మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న బట్టలు, బీరువా, ఫ్రిడ్జి, కూలర్‌తో పాటు కిరాణా షాపుకోసం తీసుకువచ్చిన బియ్యం, పప్పులు, నిత్యవసర సరుకులు కాలిబూడిదయ్యాయి. గమనించిన స్థానికులు సిలిండర్ బయటకు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సమాచారం అందించినప్పటికీ రావడంలో ఆలస్యం జరగడంతో అప్పటికే ఇల్లు కాలి బూడిదైంది. ఘటనలో సుమారు రూ.8 లక్షల ఆస్తినష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు. ఎస్సై బిట్ల పెర్సీస్ సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు నష్టపరిహారం అందించే విధంగా చూడాలని బాధిత కుటుంబం కోరుతోంది. -
సరిహద్దు పల్లెల్లో సందడి
కెరమెరి(ఆసిఫాబాద్): రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని వివాదాస్పద గ్రామాలు చర్చలోకి వస్తాయి. లోక్‌సభ, అసెంబ్లీ నుంచి.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆ గ్రామాలపై ఇరురాష్ట్రాల ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కెరమెరి మండలంలోని సరిహద్దు పల్లెల్లో సందడి నెలకొంది. తొలి విడతలో భాగంగా డిసెంబర్ 11న అక్కడ పోలింగ్ జరగనుంది. 14 గ్రామాలు.. 3,456 మంది ఓటర్లు కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్, భోలాపటార్, ముకదంగూడ పంచాయతీలు ఏళ్లుగా రెండు రాష్ట్రాల పాలనలో కొనసాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లోని పరంధోళి, కోటా, పరందోళి తండా, ముకదంగూడ, మహరాజ్‌గూడ, లేండిజాల, అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి, ఏసాపూర్, నారాయణగూడ, భోలాపటార్, లేండిగూడ, గౌరి గ్రామాలు ఎవరి ఆధీనంలో ఉండానే విషయంలో వివాదం ఉంది. ప్రతీ పంచాయతీలో ఎనిమిది వార్డులు ఉన్నాయి. 3,456 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వీరు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ల స్వీకరణ కోసం కెరమెరి మండలంలోని ఎనిమిది క్లస్టర్లు ఏర్పాటు చేశారు. పరంధోలి, ముకదంగూడ, అంతాపూర్ పంచాయతీలు పరంధోళి క్లస్టర్లో ఉండగా, బోలాపటార్ జీపీ కెలి– బి క్లస్టర్లో ఉంది. రిజర్వేషన్లలో భాగంగా అంతాపూర్ జీపీ జనరల్ మహిళ, భోలాపటార్ ఎస్టీ మహిళ, ముకదంగూడ ఎస్టీ మహిళ, పరంధోలి జనరల్‌కు కేటాయించారు. తొలిరోజు నామినేషన్లు నిల్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వివాదాస్పద గ్రామాల్లో గతంలో పోటీ చేసినవారితో పాటు యువతరం నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతోంది. గురువారం నాలుగు జీపీల పరిధిలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఆశావహులు నామినేషన్ పత్రాలను ఇళ్లకు తీసుకెళ్లారు. పరంధోలి, అంతాపూర్, భోలాపటార్ పంచాయతీల్లో సర్పంచ్ స్థానం కోసం ఐదు లేదా ఆరుగురు, ముకదంగూడలో ముగ్గురు పోటీలో ఉండే అవకాశం ఉంది. జనవరిలో మళ్లీ ఎన్నికలు..! 2024 నవంబర్ 20 మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజూరా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. 2,985 మంది ఓటర్లకు 1,852 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా డిసెంబర్ 11న తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా, మహారాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనుంది. దీంతో స్వల్ప వ్యవధిలోనే ప్రజలు రెండుసార్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. -
‘ఎస్పీఎం యాజమాన్యం మొండి వైఖరితో నష్టం’
కాగజ్‌నగర్‌టౌన్: సిర్పూర్ పేపర్ మిల్లు యాజమాన్యం మొండి వైఖరితో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని సిర్పూర్ పేపర్ మిల్స్ ఎంప్లాయీస్ ప్రొటెక్షన్ యూనియన్(రి.నం.2381) ఉపాధ్యక్షుడు గోలెం వెంకటేశ్ అన్నారు. కాగజ్‌నగర్ మండలంలోని కోసినిలో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మిల్లులో పనిచేస్తున్న శాశ్వత కార్మికులకు యాజమాన్యం జీతం స్లిప్‌లలో ఓటీ అని చూపించకుండా గుడ్‌విల్ అని నమోదు చేయిస్తుందన్నారు. అనారోగ్య సమస్యలతో లోకల్ ఆఫీస్ సెలవులు పెడితే లీవ్ డబ్బులు ఇవ్వడం కుదరదని చెబుతున్నారని మండిపడ్డారు. పాత మాదిరిగానే కార్మికులకు ఓటీ స్లిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూనియన్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, నాయకులు శ్యాంరావు, రాజమౌళి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు. -
నిబంధనలు అమలయ్యేనా?
నస్పూర్/మంచిర్యాలక్రైం: ప్రస్తుత మద్యం పాలసీ ఈ నెల 30తో ముగియనుంది. 2025–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కొత్త మద్యం పాలసీ డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వానికి ఆదాయ నిధిగా ఉన్న ఎకై ్సజ్‌శాఖ అమ్మకాలపై చూపిస్తున్న శ్రద్ధ కొత్త మద్యం పాలసీ నిర్వహణలో మద్యం షాపుల ఏర్పాటుపై ఎకై ్సజ్ శాఖ నిబంధనలు అమలు చేస్తుందా..? అనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణ కేంద్రాల్లో గ తంలో జనావాసాలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనలు చేసిన ఘటనలు ఉన్నాయి. అయినా ఎకై ్సజ్ శాఖ అధికారులు అవేం పట్టవన్నట్లుగా మద్యం వ్యాపారులకు వత్తాసు పలుకుతూ వారికి అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇస్తూ ‘మామూలు’గా తీసుకున్నార నే ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ని ర్వహణలోనైనా నిబంధనలు అమలు చేస్తారా? మా మూలుగానే వదిలేస్తారా? అనే చర్చ జరుగుతోంది. పాత మద్యం పాలసీలో నిబంధనలు తూచ్... ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్కూల్ జోన్స్, దేవాలయాలు, మసీదులు, చర్చిలకు 100 మీటర్ల దూరంలో, గ్రామాల్లో జాతీయ రహదారికి 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలి. 50 స్క్వేర్ మీటర్లు కలిగిన రూంలో సిట్టింగ్ ఏర్పాటు చేసుకోవాలి. వాటర్ బాటిళ్లు, కూల్‌డ్రింక్స్, తినుబండారాలు విక్రయించకూడదు. కానీ జిల్లాలో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కాకపోవడం గమనార్హం. జిల్లా కేంద్రంలో ప్రశాంతి హాస్పటల్ పక్కనే ఓ వైన్స్ కొనసాగుతోంది. కాలేజ్ రోడ్, హమాలివాడ, ఐబీ సమీపంలో లక్సెట్టిపేటరోడ్లో ఉన్న వైన్స్‌లు హాస్పటల్స్‌కు దగ్గరలోనే, రోడ్డుపక్కనే ఉన్నాయి. నస్పూర్ పరిధిలో ప్రస్తుతం 9 మద్యం దుకాణాలు ఉండగా ఆరు జాతీయ రహదా రికి ఆనుకుని ఉన్నాయి. సీసీసీలోని రాయల్ గార్డెన్ సమీపంలో స్కూల్స్ జోన్ పరిధిలో రెండు మద్యం దుకాణాలు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్త మద్యం పాలసీలో జనవాసాలకు దూరంగా మద్యం దుకాణాలు ఏర్పాటు చే యాలని, ప్రభుత్వ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. క్లస్టర్ తొలగింపుతో వ్యాపారులకు ఊరట...ఈసారి పట్టణాల్లో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఎకై ్సజ్ శాఖ క్లస్టర్ విధానాన్ని తొలగించింది. మద్యం దుకాణం లక్కీ డ్రాలో వస్తే పట్టణం, నగరాల్లో ఎక్కడైనా దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. బడి, గుడి, హాస్పిటల్స్‌కు వంద మీటర్ల దూరం అనేది అమలులో ఉంది. ఇది కచ్చితంగా పాటించాల్సిందే. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో నేషనల్ హైవే, స్టేట్‌హైవే పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. దీంతో మంచి అడ్డాలపై దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కన్నేస్తున్నారు.నిబంధనల మేరకే.. మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల మేరకు ఏర్పాటు చేసుకోవాలి. సమాచారం ఎకై ్సజ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. గుడి, బడి, ప్రభుత్వ అనుమతితో నడపబడుతున్న ప్రైవేటు హాస్పటల్స్‌కు వంద మీటర్ల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి. పరిశీలించిన తర్వాతనే లైసెన్స్ జారీ చేస్తాం. – కేజీ నందగోపాల్, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి, మంచిర్యాల


