ఉద్యోగుల కృషికి నిదర్శనం
రెబ్బెన: రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చే యడం సీహెచ్‌పీ ఉద్యోగుల కృషికి నిదర్శమని జీఎం విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. గోలేటి సీహెచ్‌పీని సందర్శించి అధికారులు, ఉద్యోగులను శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఒక్కరోజే 24,104 టన్నుల (ఆరు రేకులు) బొగ్గు రవాణా చేయడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాలు అధిగమించేందుకు కృషి చేయాలని అన్నారు. అనంతరం ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఏరియా ఇంజినీర్ కృష్ణమూర్తి, సీహెచ్‌పీ హెచ్‌వోడీ కోటయ్య, ఇంజినీర్ శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.


