సంచలనం ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ పేరు మరోసారి మారు మోగుతోంది.దీనికి సంబంధించి అమెరికా న్యాయ శాఖ కొత్త ఫైళ్లను వెలికి తీసింది. ఎలోన్ మస్క్ జెఫ్రీ ఎఎప్‌స్టీన్ మధ్య ఈమెయిల్ మార్పిడి జరిగినట్టు చెబుతోంది. 2012- 2013లో ఎప్స్టీన్ తన ప్రైవేట్ వర్జిన్ దీవులకు మస్క్‌ను ఆహ్వానించినట్లు ఈ మెయిళ్ల సారాంశం. దాదాపు 30 లక్షలకు పైగా కొత్త పేజీల ఎప్స్టీన్ ఫైల్స్‌ను విడుదల చేసింది. అయితే ఎప్‌స్టీన్ ద్వీపానికి తనను రమ్మని ఆహ్వానించి నప్పటికీ, తానెప్పుడూ వెళ్లలేదని గతంలోనే మస్క్ ఖండించాడు.
తాజాగా విడుదలైన US న్యాయ శాఖ పత్రం, మస్క్ జెఫ్రీ మధ్య ఈమెయిల్స్ ద్వారా చాలా పెద్ద చర్చే జరిగినట్టు గుర్తించింది. ఎప్‌స్టీన్ ఐలాండ్‌కు మస్క్ణు ఆహ్వానించినట్టు, మస్క్ అక్కడి వెళ్లినట్టుగా వాదిస్తోంది. వీటిలో షెడ్యూల్ తేదీలు, లాజిస్టిక్స్, ఇతర ప్లాన్స్ ఉన్నాయిన వాదిస్తోంది. 2012 క్రిస్మస్ నాటి ఇమెయిల్‌లో, తన ద్వీపాన్ని సందర్శించమని మస్క్‌ను ఆహ్వానించాడు ఎప్‌స్టీన్. అయితే, మస్క్ వెళ్లినట్టు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ మరోసారి ఈ వార్తలు నెట్టింట చర్చకు దారి తీశాయి.
అయితే ఎప్‌స్టీన్ ఆఫర్‌ను మస్క్ తిరస్కరించాడు. దీనికి ప్రతిస్పందనగా, ఎప్స్టీన్ మస్క్ సంకోచాన్ని అర్థం చేసుకున్నానని, గర్ల్‌ఫ్రెండ్‌తో స్వేచ్ఛగా ఉండవచ్చనే నిగూఢార్థంతో మరో సందేశాన్ని పంపాడు. కొన్ని వారాల తర్వాత, ప్రయాణ ఏర్పాట్ల కోసం మస్క్‌ను అడుగుతూ ఒక ప్రత్యేక ఇమెయిల్‌లో పంపాడు. “మీరు హెలికాప్టర్ ద్వీపానికి ఎంత మంది ఉంటారు?”
మరుసటి రోజు ప్రతిస్పందనగా, మస్క్ ఇలా వ్రాశాడు, “బహుశా తాలూలా,తాను మాత్రమేనని, మీ ద్వీపంలో పగలు/రాత్రి హార్డెస్ట్ పార్టీ ఉంటుందా అని మస్క్ అడిగాడు. ఆ తరువాత 1-8వ తేదీ వరకు ఏ రోజునా, ఎపుడూ మీకోసం సిద్ధంగా ఉంటుందని మరో ఈయిల్ పంపాడు.
కరేబియన్ పర్యటనలోమస్క్ ఇక్కడికి వెళ్లి ఉంటాడని భావించే2013 ఇమెయిల్ మార్పిడి కూడా ఫైల్‌లో ఉంది. “సెలవులలో BVI/సెయింట్ బార్ట్స్ ప్రాంతంలో ఉంటాను. సందర్శించడానికి మంచి సమయం ఉందా?” మస్క్ 2013, డిసెంబర్ 13 నాటి ఇమెయిల్‌లో రాశారు. ఇలా పలు దఫాలుగా మారి మధ్య ఈమెయిల్స్ ద్వారా సంభాషణ జరిగిందని చెబుతోంది. కానీ మస్క్ ఎపుడు అక్కడికి వెళ్లాడు అనేదానిపై రికార్డులు స్పష్టమైన ధృవీకరణ లేదు.
ఎప్‌స్టీన్‌తో మస్క్ ఈమెయిళ్ళ వార్త వెలువడిన వెంటనే, సోషల్ మీడియాలో స్పందనలు వెల్లువెత్తాయి. సందర్భాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. బిలియనీర్లు బ్రిటిష్ వర్జిన్ దీవులలో సెలవుల్లో ఉండటం సర్వసాధారణం. ఉన్నత స్థాయి ఆర్థికవేత్తను కలవమని అడగడం నేరం కాదు. మస్క్ గతంలోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించానని, అక్కడికి ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. ఈ ఫైల్స్‌లో లక్షలాది ఈమెయిళ్ళు ఉన్నాయి, ఒకరి ఇన్‌బాక్స్‌లో పేరు ఉన్నంత మాత్రాన వారి నేరంలో భాగస్వాములైనట్లు కాదు. ఇది కేవలం మస్క్‌ను వేధించడానికి చేస్తున్న మరో ప్రయత్నం మాత్రమే అని ఒకరువ్యాఖ్యానించారు. అప్పట్లో ఎప్‌స్టీన్‌కు ఈమెయిల్ చేయడం పెద్ద విషయమేమీ కాదు. కానీ సందర్భం ముఖ్యం. ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు పూర్తి సంభాషణలను పరగణనలోకి తీసుకోవాలని మరొకరు రాశారు.
తాను ఎప్‌స్టీన్‌తో సంభాషించలేదని మస్క్ ఎప్పుడూ చెప్పలేదు. నిజానికి ఎప్‌స్టీన్ నిర్వహించిన అనేక 'లంచ్‌లకు' వెళ్లాడు. తలులా రిలే ఒకసారి ఎప్‌స్టీన్ న్యూయార్క్ సిటీ పెంట్‌హౌస్‌ను సందర్శించాడు. ఈ విషయం తలులా ఎక్స్‌లో ఇప్పటికీ ఉన్న ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. కూడా అని మరొకరు అభిప్రాయ పడ్డారు.


