కంబి(పల్లకి)లు మోసుకుంటూ.. వాటి ముందు తప్పెట దరువులకు కుంకుమ చల్లుకుంటూ, చిందులు వేస్తూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు.
వందలాది కిలోమీటర్లు నడుచుకుంటూ నల్లమల అడవుల్లో వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు సైతం పాదయాత్ర చేసుకుంటూ తరలివస్తున్నారు.
కొందరు కాళ్లకు కర్రలు కట్టుకుని నడుచుకుంటూ వస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ పూజావేళల్లో మార్పులు చేసి వేకువజాము నుంచే భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతిస్తున్నారు.


