వానాకాలంలో దొరికే పండ్లలో సీతాఫలం ప్రత్యేకమైనది. సీతాఫలం పోషకాల సిరులఫలం. సీతాఫలాల ఉత్పాదనలో మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, కరీబియన్ దీవులకు స్థానిక ఫలమైన సీతాఫలం కూడా పోర్చుగీసు వర్తకుల ద్వారా పదహారో శతాబ్దిలో భారత్‌కు చేరింది. సీతాఫలాన్ని అమితంగా ఇష్టపడే భారతీయులు ఈ పంటను విరివిగా పండిస్తూ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకున్నారు. సీతాఫలం విశేషాలు గణాంకాల్లో...
సీతాఫలాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి వంద గ్రాముల సీతాఫలం 94 కిలోకేలరీల శక్తినిస్తుంది. ఇందులో 71 శాతం నీరు ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. సీతాఫలంలో పోషకాల వివరాలు...

(చదవండి: మధుమేహం వల్ల వినికిడి శక్తి తగ్గుతుందా?)


