పంజాబ్‌ ఎన్నికలు: ఒంటరి పోరుకు కమలనాథులు సిద్ధం | Punjab Assembly Election 2027, BJP To Contest Alone On All 117 Seats In Punjab As Sukhbir Badal Meets PM Modi | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ ఎన్నికలు: ఒంటరి పోరుకు కమలనాథులు సిద్ధం

Aug 9 2026 8:20 AM | Updated on Aug 9 2026 12:27 PM

Punjab Assembly Election 2027 BJP to contest alone on all 117 seats in Punjab

చండీగఢ్: పంజాబ్ శాసనసభ ఎన్నికలు వచ్చే ఏడాది(2027) జరగనున్నాయి. శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ) అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగింది. దీనితో పంజాబ్ రాజకీయాల్లో మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. కాగా పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నదని పార్టీ ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు.

పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారని బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్ తెలిపారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్, ప్రధాని మోదీల భేటీ గురించి మాట్లాడుతూ.. పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులపై అకాలీదళ్ అధినేతతో ప్రధానితో చర్చించారని తెలిపారు. ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల నేతలను క్రమం తప్పకుండా కలుస్తుంటారని అన్నారు. ఈ సమావేశంలో పంజాబ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, డ్రగ్స్ సమస్య, పేపర్ లీక్ తదితర కీలక అంశాలపై చర్చించారన్నారు. కాగా పంజాబ్ రైతులు ‘ఈ20’కి అనుకూలంగా ఉన్నారని బీజేపీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ విషయంపై రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడాలని సూచించారు.

ఇది కూడా చదవండి: క్షేమంగానే మొజ్తాబా ఖమేనీ?.. వీడియో హల్‌చల్‌!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement